30-June-2020 Messages

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
1) శ్రీమద్భగవద్గీత - 413 / Bhagavad-Gita - 413
2) శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 201 / Sripada Srivallabha Charithamrutham - 201
3) మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 82
4) The Masters of Wisdom - The Journey Inside - 105 
5) శ్రీ ఆర్యా ద్విశతి - 65 
6) దాశరధి శతకము - పద్య స్వరూపం - 44 / Dasarathi Satakam - 44
7) నారద భక్తి సూత్రాలు - 21 
8) సాధనా చతుష్టయ సంపత్తి - ఉపరతి 
9) శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 55 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 55
10) సౌందర్య లహరి - 28 / Soundarya Lahari - 28
11)  శ్రీ శివ మహా పురాణము - 160
12)  VEDA UPANISHAD SUKTHAM - 47
13)  శ్రీ మదగ్ని మహాపురాణము - 32
14) భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 46
15)  AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 37
16)  శ్రీ లలితా సహస్ర నామములు - 22 / Sri Lalita Sahasranamavali - Meaning - 22
17)  Seeds Of Consciousness - 112
18)  మనోశక్తి - Mind Power - 50
19) 


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: 1 person, standing

🌹. శ్రీమద్భగవద్గీత - 413 / Bhagavad-Gita - 413 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 21 🌴

21. అమీ హి త్వాం సురసఙ్ఘా విశన్తి\
కేచిద్భీతా: ప్రాంజలయో గృణన్తి |
    స్వస్తీత్యుక్తా మహర్షిసిద్ధసఙ్ఘా:
స్తువన్తి త్వాం స్తుతిభి: పుష్కలాభి: ||

🌷. తాత్పర్యం : 
దేవతా సమూహములన్నియును నిన్ను శరణువేడి నీ యందు ప్రవేశించుచున్నవి. వారిలో కొందరు ముగుల భయవిహ్వలులై దోసలియొగ్గి ప్రార్థనలను గావించుచున్నారు. మహర్షులు, సిద్ధసమూహములు “శాంతి, శాంతి” యని పలుకుచు వేదమంత్రములచే నిన్ను స్తుతించుచున్నారు.

🌷. భాష్యము : 
సర్వలోకముల యందలి దేవతలు అద్భుతమైన విశ్వరుపముచే మరియ దాని దేదీప్యమాన తేజముచే భయమునొంది తమ రక్షణ నిమిత్తమై ప్రార్థనలను కావించిరి.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 413 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 21 🌴

21. amī hi tvāṁ sura-saṅghā viśanti
kecid bhītāḥ prāñjalayo gṛṇanti
svastīty uktvā maharṣi-siddha-saṅghāḥ
stuvanti tvāṁ stutibhiḥ puṣkalābhiḥ

🌷 Translation : 
All the hosts of demigods are surrendering before You and entering into You. Some of them, very much afraid, are offering prayers with folded hands. Hosts of great sages and perfected beings, crying “All peace!” are praying to You by singing the Vedic hymns.

🌹 Purport :
The demigods in all the planetary systems feared the terrific manifestation of the universal form and its glaring effulgence and so prayed for protection.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: చిదానంద రూప శివోహం శివోహం, Yanamandra Srinivasa Bhaskara Rao and Thudum Srinvas

🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 201 / Sripada Srivallabha Charithamrutham - 201 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 32
🌴. నవనారాయణులే నవనాథులు 🌴

🌻. నవనాథుల జననం 🌻

శ్రీపాదుల దివ్య పాదాలకు నమస్కరించిన తరువాత నేను వారిని నవనాథుల గురించి ప్రశ్నించాను. నవనాథుల పేరు వినగానే ప్రభువు కన్నులలో చాలా ఆనందం కనిపించింది.

 "నాయనలారా! నవనాథులని స్మరిస్తేనే చాలు, అన్ని రకాలైన శుభాలు జరుగుతాయి. వీళ్ళని స్మరించిన భక్తుల పై దత్తుల అనుగ్రహం తప్పక ఉంటుంది," అంటూ వారి వృత్తాంతాన్ని చెప్పడం ఆరంభించారు:

 ఋషభ చక్రవర్తికి నూర్గురు పుత్రులు ఉన్నారు. అందులో తొమ్మిది మంది నారాయణ అంశతో జన్మించారు. వీరిని నవ (9) నారాయణులు అని అంటారు. వీరు వరుసగా 1.కవి, 2.హరి, 3.అంతరిక్షుడు, 4.ప్రబుద్ధుడు, 5.పిప్పలాయనుడు,
6.అవిర్హోత్రుడు, 7.దృమీళుడు, 8.చమనుడు, 9.కరభాజ నుడు. 

వీరంతా అవధూత స్థితిలో ఉండే సిద్ధ పురుషులు. నా ఆఙ్ఞమేరకు, కృష్ణావతారంలో వారు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి, ధర్మ సంస్థాపన కార్యాలు చేబట్టడానికి వీరు నవనాథులుగా జన్మించారు. 

1. కవి. మత్స్యేంద్రనాథుడు
2. హరి గోరక్షానాథుడు
3. అంతరిక్షుడు జాలంధరనాథుడు
4. ప్రబుద్ధుడు కానీఫా
5. పిప్పలాయనుడు చర్పటనాథుడు
6. అవిర్హోత్రుడు వటసిద్ధ నాగనాథుడు 
7. దృమీళుడు భర్తరీనాథుడు
8. చమనుడు రేవణనాథుడు
9. కరభాజనుడు గహనీనాథుడు

 ఇందులో 

(1).కవి అనేవారు మత్స్యేంద్రుడిగా జన్మించారు. ఉపరిచరుడనే వసువు ఊర్వశిని చూచి మోహించాడు. అతని వీర్యం యమునా నదిలో పడగా ఒక మీనం త్రాగింది. ఆ మత్స్యం నుండి మత్స్యేంద్రనాథుడు జన్మించారు.

(2). హరి అనేవారు మత్స్యేంద్రనాథుల శిష్యునిగా గోరక్షా నాథునిగా జన్మించారు. మత్స్యేంద్రనాథుడు దేశసంచారం చేసేటపుడు సంతానంలేని ఒక స్త్రీకి భస్మాన్ని మంత్రించి ఇవ్వగా, ఏమాత్రం నమ్మకం లేని ఆ స్త్రీ దాన్ని పెంట దిబ్బపై విసిరి వేసింది. ఆ భస్మం చాలా శక్తివంతమైనది కాబట్టి అందులోనుండి గోరక్షానాథుడు ఉద్భవించారు. 

(3). బృహద్రధుడనే రాజు యఙ్ఞం చేసినపుడు ఆ యఙ్ఞ కుండం నుండి అంతరిక్షుడు జాలంధరనాధునిగా ఉద్భ వించారు.

(4). ఒకసారి బ్రహ్మదేవుడు సరస్వతిని చూచి మోహించగా వీర్యస్ఖలనమై హిమాలయాల్లోని అరణ్యంలో నిద్రిన్న ఒక ఏనుగు చెవిలో పడింది. దానిలోనుండి ప్రబుద్ధుడు కానీఫాలా జన్మించారు. వీరు కర్ణకానీఫాగా ప్రసిద్ధి చెందారు. 

(5). పార్వతీ వివాహ సమయంలో పురోహితునిగా ఉన్న బ్రహ్మ పార్వతీ రూపాన్ని చూచి మోహితుడు అవడంతో వీర్యస్ఖలనమై భాగీరథి నదీతీరం దగ్గర రెల్లుదుబ్బులో పడి దానిలో పిప్పలాయనుడి ఆత్మ ప్రవేశించి చర్పటనాథునిలా జన్మించారు.

(6). అవిర్హోత్రుడు వటసిద్ధ నాగనాథుడు

 (7). కౌళికుడనే మహర్షి తన భిక్షాపాత్రను పర్ణశాల బయట ఉంచారు. అదే సమయంలో సూర్యుడి రేతస్సు దానిలో పడింది. మహర్షి అది గ్రహించి ఆ పాత్రను భద్రంగా ఉంచారు. 

దానినుండి దృమీళుడు భర్తరీనాథుడనే పేరుతో ఉద్భవించారు. భర్తరి అంటే భిక్షాపాత్ర. దానినుండి జన్మించిన కారణాన భర్తరీ నాథుడు అయ్యారు. 

(8). రేవా నది అంటే నర్మదా నదిలో పడిన బ్రహ్మ వీర్యంలో చమనుడి ఆత్మ ప్రవేశించి రేవణనాథుడు జన్మించారు. 

(9).గోరక్షకుడు సంజీవనీ మంత్రం జపిస్తూ మట్టితో ఒక మనిషి బొమ్మను చేయడం జరిగింది. ఆ బొమ్మలో కరభా జనుని ఆత్మ ప్రవేశించి జీవాన్ని పొంది గహనీనాథుడనే పేర అవతరించారు. 

ఈ విధంగా ఒక్కొక్క నారాయణుడు ఒక్కొక్క నాథునిగ జన్మించారు."

🌻. అంశావతారాల పరిధి 🌻

“నవనాథులు నవ నారాయణుల అంశాలు అయితే నవ నారాయణులకి నవనాథులకి ఏమైనా బేధం ఉందా?” అంటూ నేను నా సందేహాన్ని వ్యక్తపరిచాను. “సమస్త సృష్టియొక్క మహా సంకల్ప స్వరూపాన్ని నేనే. 

మిగిలిన దేవీ, దేవతా సంకల్పాలు నా మహాసంకల్పంలోని అంశ మాత్రాలే. వారికి పరిమితమైన స్వేచ్ఛ మాత్రమే ఉంటుం దని చెప్పి దానికి ఉదాహరణని ఈ విధంగా చెప్పారు: 

“ఒక పంటకాపు ఆవుని తాటితో బంధించినపుడు ఆ త్రాడు పోగలిగిన దూరం వరకు మాత్రమే అంటే ఒక నిర్ణీతమైన పరిధిలోనే దానికి స్వేచ్ఛ ఉంటుంది. ఆ పరిధిని దాటాలంటే కాపు అనుమతి కావాలి. 

అలాగే అంశావతారాలకి కొన్ని ధర్మకర్మ సూత్రాలకు లోబడి ఉండేలా స్వేచ్ఛ ఇవ్వబడు తుంది. సంకల్పం మూలతత్వం నుండి వస్తుంటే వీరు వాటిని అమలులో పెడతుంటారు. 

జీవుల సమస్యలను మూలతత్వానికి నివేదించి మూల తత్వం యొక్క అను గ్రహం తెచ్చి జీవులకు శ్రేయస్సు కలిగిస్తారు. మానవుల కున్నట్లు అంశావతారాలకు రాగద్వేషాలు, అహంకారం వంటి దుర్గుణాలు లేక పోవడంవల్ల మూలతత్వం ఏయే పనులను చేయగలదో అంశావతారాలు కూడా ఆ పనులను చేయగల్గుతారు. అందువల్ల జీవులకు సంబం ధించినంతవరకు అంశావ తారాలకు పూర్ణావతారాలకు ఏమీ బేధం లేదు,” అని చెప్పి నా సందేహం తీర్చారు. 

తరువాత వారు భవిష్యత్తులో సాయిబాబా అనే పేరుతో తమ సమర్థ సద్గురు రూపం రానున్నదని, ఇంద్రియవృత్తు లను శాంతింప చేసేదే సాయి తత్త్వమని, ఆ తత్వము వారిలో సాయుజ్యస్థితిలో ఉందని తెలిపారు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sripada Srivallabha Charithamrutham - 201 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj 

CHAPTER 20
🌴. The Story of Vissavadhanulu Description of Sripada’s divine auspicious form - 8 🌴

🌻 Vissavadhanulu born as thorny bush due to sinful Karmas - 2 🌻

Sripada said, ‘Gurucharana! I will show you a wonder. Come in.’ He took me inside.  

Bapanarya also was behind Sripada. He took us to the thorny bush and said, ‘Vissanna thatha! Because of the shraaddha karmas done to you by your sons without devotion and because of the result of scolding great people like Bapanarya, you have got this low ‘janma’.  

This Gurucharana was your son in one previous janma. I will make him do shraadha karma to you. Do you agree?’ We were looking stunned.  

Vissavadhanulu who was in the form of ‘preta atma’ surrounding the thorny bush said clearly ‘Is there anything more fortunate than that?’ Sripada told me to pull out that bush completely from ground.  

He gave me small raavi and medi sticks and told me to create fire. When both were rubbed, fire was created. I burnt that thorny bush. Sripada told me to take bath.  

After bath Sripada gave me vibhudhi and told me to apply it on my body. He said, ‘people think that Siva will smear Himself with the ashes from the burial ground. 

When Maha Purushas’, Siddha Purushas, Maha yogis’ and Maha devotees’, leave their body, Siva will smear the ashes from their burnt bodies on Him.  

They remain in a merged state in the aura of light in His vicinity. If animals like monkey, snake, and cow happen to be killed by us by mistake, the last rites should be performed to them. 

 It is enough to burn the bodies with devotion and give food to poor people. Nothing is required to be done with chanting of mantras.  

Those jeevas which have a small debt relation in some previous janma will die in our hands due to some mistake. By doing the devoted burning of the body any karma remaining will be destroyed.  

They will get higher states. In previous Yugam once people were put to hardship due to draught. Unless the live stock of cows is improved, the cow ghee and other sacred materials will not be produced.  

When yajnas and yagas are not done, the mutual cooperation between human beings and Gods cannot be maintained and dharma will be affected.  

Human beings cannot live without good stock of food grains. So Gautama Maharshi was growing crops with the power of his tapas.  

Gautama Maharsi got the sin of killing cow due to some reasons and to remove that sin, Godavari was brought to the earth. So, the world owes a lot for Gautama Maharshi. His wife Ahalya was a great ‘pathivratha’.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: 1 person, standing and text

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 82 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 *సాధన- సమిష్టి జీవనము - 3* 🌻

ఎవరితో అభిప్రాయభేదం వచ్చిందో, అతనితో సూటిగా కూడ్చుండి మాట్లాడుకొని పరస్పరావగాహనతో కలిసిపోవాలి. 

ఒక సంస్థలో ఒక కార్యక్రమమును అనుష్ఠిస్తున్న వారంతా మార్గదర్శకుని క్రింద‌ పనిచేయడానికి మనసును సిద్ధం గావించుకోవాలి. శరీరభాగాలన్నీ ఒకే అత్మయొక్క ఆదేశంతో పనిచేస్తాయి కదా. 

కొందరు సాధకులు సామాజిక విషయంలో మార్గదృష్టను అనిసరిస్తారు కాని, తమతమ వ్యక్తిగత విషయాలలో గాదు, తమ కుటుంబ వ్యవహారాలలో, తమ‌ పిల్లల వివాహ విద్యావిషయాదుల్లో తమదారి తమది. 

అయితే, అందరి యొక్క సమగ్ర శ్రేయస్సు సరియైన గురువుకు తెలుస్తుంది. నిజమైన గురువు దృష్టి ఎల్లరి మేలు మీద ఉంటుంది. 

మామూలు మనుష్యులకు తమకు మంచి జరగాలని ఉంటుంది గాని, ఆ మంచి ఏమిటో ఏం చేస్తే వస్తుందో తెలియదు. ప్రస్తుత కాలంలో, సగటు మనిషి యొక్క ఆదర్శం గొప్పతనంగాని, మంచితనంగాదు. 

సాధకులకు గూడ పూజాదుల్లో, సేవాకార్యక్రమాల్లో పాల్గొనే అభిరుచి ఉండవచ్చు గాని, ధనము, అధికారము, సంఘంలో గౌరవం మున్నగు గొప్పతనమునకు చెందిన అంశాలపై మోహం తొందరగా వీడదు. తమతమ అభిప్రాయాలను పరిపూర్ణంగా పరమగురువుకు సమర్పించుకొన్నవాడే వికాసపథంలో సాగుతాడు. 

తనకు తాను సమాజ స్వరూపుడగు దేవునికి సమర్పణ పొందినవానికే 'అహంకారం' అనే పెంకు పగిలి ఆనంద సామ్రాజ్యంలో చోటు దొరుకుతుంది. 

నిజమయిన గురువు తమ మాట అనుచరులనబడే వారు పాటించకపోయినా సరే అలకపూనడు, తాను గురువు ‌అని‌ అనుకొనడు. ఇతరులపై తమ భావాలు రుద్దడు. 

తల్లికున్న ప్రేమ వారికి ఉంటుంది. ఎవరితోనయినా ప్రేమగా మెలగ గలరు గురువులు. ప్రేమయే వారి ప్రాణం. వారి యందు గౌరవము అంటే వారిని అనుసరించడమే కాని, వట్టి నమస్కారాలు కాకూడదు. అయితే గురువుల దృష్టి మానవ సంబంధాల వికాసం మీదనే ఉంటుంది. మాట పట్టుదలకన్నా మానవుల నడుమ హృదయపూర్వకములయిన సత్సంబంధాలు సాధకులకు ఆవశ్యకము.
....✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No photo description available.

🌹 The Masters of Wisdom - The Journey Inside - 105 🌹
🌴 The Aquarian AGE - 1 🌴
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

🌻 Vernal Equinox in Aquarius 🌻

The earth rotates on its own axis, bringing forth the four cardinal points of the day - sunrise, noon, sunset, midnight. 

The apparent path of the sun within a solar year also marks these four points: winter solstice, spring equinox, summer solstice and autumn equinox.

Similarly, there are the four points in the cycle of the apparent movement of the signs of the zodiac. 

Due to the slow spinning movement of the earth, the tropical zodiac used in astrology shifts in relation to the visible starry sky of the sidereal zodiac. 

The vernal equinox, defining the beginning of the tropical zodiac with 0 degrees Aries, moves backwards by one degree in 72 years in relation to the sidereal zodiac. 

The equinox therefore needs 2160 years (30 x 72) for the 30 degrees of a sign of the zodiac, and it takes about 25,920 years to pass through the 12 signs of the zodiac (2160 x 12). This is also called the Great Year.

The movement of the vernal equinox through the signs of the zodiac expresses the character of the respective period in world affairs. 

During the journey through Aries there was the Arian Age, followed by the Piscean Age. 

According to the vision of leading spiritual astrologers, the equinox entered the 30th degree of Aquarius from Pisces at the time of the coronation of Queen Victoria in 1837. It was the dawn of the Age of Aquarius. 

Victoria was the first queen to recognize the futility of conquering countries and wanted to stop it.

🌻 🌻 🌻 🌻 🌻 🌻 🌻 
Sources used: K.P. Kumar: The Aquarian Master. Div. seminar notes/ E. Krishnamacharya: Spiritual Astrology.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: 3 people

🌹. శ్రీ ఆర్యా ద్విశతి - 65 🌹
🌻. శ్రీ లలితా స్తవరత్న వైజ్ఞానిక ధ్యాన యోగము 🌻
✍️. విరచితం : భగవాన్ శ్రీ క్రోధభట్టారక (దుర్వాస మహర్షి)
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 II ఆర్యా ద్విశతి - 129వ శ్లోకము II 🌻

ఫలకత్రయస్వరూపే పృథులే త్రైలోక్యమోహనేచక్రే I
దీప్యంతి ప్రకటాఖ్యాస్తాం కర్త్రీ చ భగవతీ త్రిపురా II ౧౨౯

🌻. తాత్పర్యము :
ఫలకత్రయస్వరూపే - పైన చెప్పిన మూడు పీటల స్వరూపమగు, పృథులే గొప్పదియగు, త్రైలోక్యమోహనేచక్రే - త్రైలోక్యమోహనము అను చక్రము నందు, ప్రకటాఖ్యాః - ప్రకటశక్తులను పేరుగల సిద్ధిదేవతలు, అష్టమాతలును, దశముద్రలును (అణిమాది సిద్ధిదేవతలు, బ్రాహ్మీ దేవతలు మరియు సంక్షోభిణీముద్రాదేవతలు), దీప్యంతి - ప్రకాశించుచున్నవారు, తాసాం - వారియొక్క, కర్త్రీ చ - అధిష్టానదేవత, భగవతీ - పరమేశ్వరి యగు, త్రిపురా - త్రిపురాదేవి.

చింతామణి గృహము నందు, మొదటి ఆవరణ - త్రైలోక్యమోహన చక్రము నందు ప్రకటశక్తులని పేరుగల అణిమాది సిద్ధిదేవతలు, బ్రాహ్మీ మొదలగు అష్టదేవతలు మరియు సంక్షోభిణీ మొదలగు దశముద్రాదేవతలు కొలువై ఉన్నారు, ఈ ప్రకట శక్తులకు అధిదేవతయగు త్రిపురాదేవి అమ్మవారిని ధ్యానించుచున్నాను (నమస్కరించుచున్నాను) !

🌻. వివరణ :
త్రైలోక్యమోహనేచక్రేయాః ప్రోక్తా అణిమాదయః I
బ్రహ్మ్యాదయశ్చ ముద్రాశ్చ తాలుమూలేన సాసృజత్ I
తదధిష్టాన దేవీంచ త్రిపురాంస్సాంశతో౨సృజత్ II
తాదేవ్యః ప్రకటాభిఖ్యావహ్న్యుత్పన్నే మహాద్యుతౌ I
దేవీ చక్రరథే పర్వనవమం సముపాశ్రితాః II (లలితోపాఖ్యానము)

🌻 II ఆర్యా ద్విశతి - 130వ శ్లోకము II 🌻

ఫలకత్రయస్వరూపే
పృథురే త్రైలోక్యమోహనే చక్రే I
దీవ్యన్తు ప్రకటాద్యా
స్తాసామ్ కర్త్రీ చ భగవతీ త్రిపురా II 130 II

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: Thudum Srinvas, standing

🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 44 / Dasarathi Satakam - 44 🌹
పద్యము - భావము 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 87వ పద్యము : 
నీమహనీయతత్త్వ రస నిర్ణ యబోధ కథామృతాబ్ధిలో
దామునుగ్రుంకులాడకవృ థాతనుకష్టముజెంది మానవుం
డీ మహిలోకతీర్థముల నెల్ల మునింగిన దుర్వికార హృ
తామసపంకముల్ విదునె దాశరథీ కరుణాపయోనిధీ

🌻. భావము : 
నీ నామ నిశ్చల జపమునకు కోటి నదుల స్నానము, తీర్ధయాత్రలు సరికావు. నీ నామమే సర్వోత్కుృష్టమయినది. నీ మహనీయ మనెడి అమృత సాగరమునందు పూర్తిగా మునిగినచో జ్ఞానము చేకురును. మనస్సులోని మాలిన్యము నశించును.

🌻. 88వ పద్యము : 
కాంచన వస్తుసంకలిత కల్మష మగ్ని పుటంబు బెట్టెవా
రించినరీతి నాత్మనిగిడించిన దుష్కర దుర్మలత్రయం
బంచిత భ క్తియోగ దహ నార్చిఁదగుల్పక పాయునే కన
త్కాంచనకుండలాభరణ దాశరథీ కరుణాపయోనిధీ

🌻. భావము : 
ప్రకాశించు కర్ణాభరణములు దాల్చిన రామా! బంగారమునకు అంటుకొన్న మాలిన్యము తొలగించవలెనన్న ఆ బంగారమును పుటము వేయవలెను. మనో మాలిన్యములను తొలగించవలెనన్న ఆ మనసును నీయందు లీనము చేయవలెను. భక్తియొగమనెడి అగ్నిజ్వాలలో పుటము వేయకున్నచో, అందలి మాలిన్యములు నశించవు కదా?

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Dasarathi Satakam - 44 🌹
Sloka and Meaning 
📚. Prasad Bharadwaj
 
🌻 87th Poem : 
nImahanIyatattva rasa nirNa yabOdha kathAmRutAbdhilO 
dAmunugruMkulADakavRuthAtanukaShTamujeMdi mAnavuM 
DI mahilOkatIrthamula nella muniMgina durvikAra hRu 
ttAmasapaMkamul vidune dASarathI karuNApayOnidhI.

🌻 Meaning : 
In stead of bathing in the sea of your great stories elucidating the supreme truth, men are frittering away their time and energy by dipping into all the thirthas little knowing that this cannot clean up the mud enveloping their minds.

🌻 88th Poem : 
kAMcana vastusaMkalita kalmaSha magnipuTaMbu veTTivA 
riMcinarIti nAtmanigiDiMcina duShkara durmalatrayaM 
baMcita BaktiyOga daha nArcidagulpaka pAyunE kana 
tkAMcanakuMDalABaraNa dASarathI karuNApayOnidhI.

🌻 Meaning : 
O Rama adorned by golden ornaments! Just as the impurity in gold is removed by fire, the mud enveloping the Atma formed by the trio of Satwa, Rajas and Thamas can be washed away by the fire of Bhakthi Yoga alone.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


Image may contain: 2 people, including Batchu Subbarao

🌹. నారద భక్తి సూత్రాలు - 21 🌹 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, అచల గురు పీఠము. 
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 12

🌻 12. భవతు నిశ్చయ దార్డ్యా దూర్థ్వ శాస్త్ర రక్షణమ్‌ - 2 🌻

అతడి అనుష్ఠానంలో ఉండే మార్పులు సహజం, అప్రయత్నం. అవి దైవీ ప్రేరణతో జరిగేవి. తాను ఈ మార్పులు జరగడానికి ‘అధికారి’ అని అతడికి తెలియదు. ‘‘నేను అధికారిని’’ అని ఎవరైనా శాస్త్రాలను మార్పు చేస్తే, అతడు పరాభక్తుడు కాడు. అందువల్ల అది సర్వజనామోదం కాదు.

            శాస్త్రానికి ఆధారం ఎవరో ఒకరి అనుభవం మొదటగా ఉండాలి. అనుభవం శాస్త్రాన్నిస్తుంది గాని శాస్త్రం అనుభవాన్నివ్వదు. కాని శాస్త్రమనేది లక్ష్యం చేరడానికి మార్గదర్శకంగా ఉంటుంది. కనుక సిద్ధులు, పరాభక్తులు వారి అనుభవాలలోనుండి చెప్పేవీ, చేసేవీ శాస్త్రాలవుతాయి. శాస్త్రాలు సాధకులకు కరదీపికగా పనికివస్తాయి.

            జిల్లేళ్ళమూడి అమ్మ అంటారు.’’నాకు శాస్త్ర పరిచయం లేదు నాన్నా. నేను ఏది చెప్పినా అనుభవంలోదే చెబుతాను. అనుభవం శాస్త్రాన్నిస్తుంది. కాని శాస్త్రం అనుభవాన్నివ్వదు’’. ఈ విధంగా అవతారులు, కారణ జన్ములు, భాగవతోత్తములు, జీవన్ముక్తులు ఆయా కాలాలలో శాస్త్ర ప్రమాణాలను నవీనీకరిస్తూ శాస్త్ర రక్షణ చేస్తూ ఉంటారు.

            సిద్ధులైన వారికి త్రికాల జ్ఞానం ఉంటుంది. ఎప్పటికి ఏది మేలో నిశ్చయించి చేస్తారు. ఈ కారణం వల్లనే పెద్దలు నడచిన త్రోవను నడవ మన్నారు. మిథ్యాచార్యుల నాశ్రయించరాదు. గమ్యం చేరిన మహనీయులను మాత్రమే ఆశ్రయించాలి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: 2 people, people standing

🌹. సాధనా చతుష్టయ సంపత్తి - ఉపరతి 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
చలాచల బోధ... 
📚. ప్రసాద్ భరద్వాజ

చంచలమగు మనస్సును నిశ్చలము చేసి బాహ్య విషయములనుంచి మరల్చి నిరంతరం బ్రహ్మద్యానము నందే ఉంచుట ఉపరతి.

మనోవృత్తులతో తాదాత్మ్యత చెందకుండా ఉండుట ఉపరతి.
అహంవృత్తి ఆధారం కోసం విషయాలను ఆసరాగా తీసుకోకపోవటము ఉపరతి.

అష్టాంగ యోగము వలన ఉపరతి యందు ప్రవేశిస్తే , కలుగు అనుభవము ప్రాపంచిక విషయ వ్యాపారము నుండి విరమించుకొనుట.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: 1 person

🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 55 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 55 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻 
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

🌴. మాణిక్ నగర్ లో శృంగేరి జగద్గురువులు 🌴

    మాణిక్ నగర్ లో ప్రభు సంస్థానమునకు ఒక రూపము వచ్చిన తరువాత ప్రభు ఔదార్యము, అనేక లోకోత్తర గుణాల కీర్తి పరిమళం ఏ విధంగా విస్తరించిందో దాని వృత్తాంతం ఇప్పటివరకు తెలుపబడింది. 

    ఒకసారి శృంగేరి మరియు హంపి ఆచార్య పీఠాల మధ్య సంచార క్షేత్ర విషయంలో వాదన మొదలయింది. ఈ వాదన లేకుండా చేసే సామర్ధ్యం ఎవరికి ఉందో అని రెండు పీఠాల వారికి దిగులు మొదలయింది.

    శృంగేరి మరియు హంపి ఈ రెండు పీఠాల అధికారులు లేదా పండితులు మాణిక్ నగర్ వస్తూ ఉండేవారు. సమస్యని ప్రభువుకి చెప్పి తీర్పు చెప్పమని అడగాలని వారికి ఉండేది. హంపి పీఠం జగద్గురువులు ప్రభు వద్దకు వచ్చారు. 

ప్రభువు హంపి పీఠం జగద్గురువును అత్యంత ఆదరణ పూర్వకముగా ఎదురు వెళ్లి మాణిక్ నగర్ కు తీసుకొని వచ్చారు. మరియు యథాయోగ్యంగా తాత్యా మహారాజు గారు గుడిలో పూజ జరిపించి లెక్కలేనంత ద్రవ్యాన్ని దక్షిణగా సమర్పించుకున్నారు.

    అంతకుముందు నాలుగు నెలలు ముందు శృంగేరి శంకరాచార్య మఠం నుండి ప్రభు మహారాజ్ వద్దకు వారి సంస్థానమునకు చెందిన రామశాస్త్రి నుండి లేఖ రావడం జరిగింది. 

మాఘమాసంలో జగద్గురువు తన పరివారంతో స్వయంగా మిమ్ములను కలవడానికి వస్తున్నారు అని ఆ లేఖ సారాంశం. ఈ విషయం చదివి చాలా ఆనందించి రెండు నెలల ముందు నుండి స్వాగత సమారంభము ప్రారంభించారు. 

అరవై వేల రూపాయల రత్నఖచిత హారాన్ని స్వర్ణకారులతో చేయించి, ఒక లక్ష రూపాయల విలువగల రత్నఖచిత మకుటం మరియు అమూల్యమైన వస్త్రాలను, వారి మండలిలోని ప్రతీ ఒక్కరికి యోగ్యవస్త్రాలను తయారు చేయించారు. 

స్వామి నివసించే ప్రదేశం తయారు చేయించి నాలుగు నెలలు ఉంటారని తెలిసి అన్ని రోజులకు సరిపడా భోజన, నివాస సదుపాయాలు చేయించి ఒక ఏనుగు, పది మంచి గుర్రాలు, ఒక పల్లకి, మేనా, ఇరవై ఐదు స్వచ్ఛమైన ఆవులను సిద్ధం చేయించారు. 

జగద్గురువుతో పాటు సుమారు ఐదువందల మంది జనం, ఐదు ఏనుగులు, ఇరవై ఐదు గుర్రాలు, రెండు పల్లకిలు, నాలుగు మేనాలు, పదిమంది పాదచారులు, శాస్త్రపండితులు, ఆవులు, ఒంటె ఇలా అనేకమైన వాటితో శృంగేరి జగద్గురువులు ఉత్సవంగా వస్తున్నారని తెలిసి ఆరోజు రాత్రంతా ఎవరూ నిద్రపోలేదు. గ్రామములో ప్రతీ వీధిలో పూర్తిగా కళాపి చల్లి రంగవల్లులు వేయబడ్డాయి.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 55 🌹
✍️. Nagesh D. Sonde
📚. Prasad Bharadwaj

🌻 15. Shri Siddharaj Manik Prabhu (1939 – 2009) - 1 🌻

Shri Siddharaj Manik Prabhu (born on 1st February 1939), the fifth incumbent of the Gadi, was but a child when he ascended the Gadi.  

Many had misgivings about the choice. As said earlier, people forget that the succession to the Gadi is not an elective post.  

It is the Divine Will which determines the selection, where a person becomes but a medium through whom Shri Manik Prabhu Maharaj decides to make His presence manifest. In spiritual matters, it is rarely the person who matters as much as the Shakti that is posited in him.  

None should forget that Shri Manik Prabhu’s Gadi is the Shakti Peetha, in respect of which Shri Manik Prabhu has assured his presence for all time to come. 

This fact was demonstrated by the young Shri Manohar Manik Prabhu through his extraordinary achievements even during his short span of empirical life.  

This was further demonstrated by Shri Martand Manik Prabhu through his vast and all comprehensive capacity in expanding the range and sphere of influence of Shri Manik Prabhu Sampradaya and by Shri Shankar Manik Prabhu, who, through his humility and open candour expressed the true role of each occupier of the Seat. 

Shri Manik Prabhu Maharaj had seen that for every generation he provided a person to grace the Gadi, suitable for the time and conditions prevailing. The ascending of the Gadi by Shri Siddharaj Manik Prabhu, therefore, should be seen in this context.  

Through the medium of Shri Shankar Manik Prabhu, it was shown how important education was to be in the life of people. Shri Siddharaj Manik Prabhu was to carry on the mission, for which the previous incumbent had laid the foundation stone.  

To make him capable of shouldering this enormous task, it was decided that he should be educated in the well-known Scindia School at Gwalior. Here, Shreeji was to stay with people who were being educated in all the modern disciplines.  

This broad spectrum of education gave him a comprehensive vision to shape the future of Maniknagar.  

In the midst of scepticism, superstition and seeming lack of confidence in the efficacy of religion in modern society, influenced by the blinding glare of modern science and technology, Shreeji had to reconsider his role and the means of imparting the ancient wisdom to the modern mind.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



🌹. సౌందర్య లహరి - 28 / Soundarya Lahari - 28 🌹
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. విష భయం, అకాల మరణం భయం నుండి బయట పడుటకు, గౌరవ మర్యాదలకు 🌴

శ్లో: 28 సుధామ ప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యు హరిణీం 
విపద్యన్తే విశ్వే విధిశతమఖాద్యా దివిషదః l 
కరాళం యత్ క్ష్వేళం కబలితవతః కాలకలనా 
నశమ్భో స్తన్మూలం తవజననితాటంక మహిమా ll 
 
🌻. తాత్పర్యము : 
 అమ్మా ! మిక్కిలి భయంకరము అయిన ముదుసలి తనమును పోగొట్టుటకు అమృతమును త్రాగిన బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలు కూడా ప్రళయ కాలమున అంతము చెందుచున్నారు. భయంకరమయిన కాల కూట విషమును సేవించిన నీ భర్త అగు పరమ శివుడు మాత్రము క్షేమముగా ఉండుటకు నీ చెవులకు ఉన్న తటాకములు కారణము కదా ! 

🌻. జప విధానం - నైవేద్యం :

ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, త్రిమధురం, పాలతో చేసిన పాయసము, తాంబూలము నివేదించినచో గౌరవ మర్యాదలు పెరగడం, మరియు విష భయం, ఆకాల మృత్యు భయం తొలగిపోతాయి అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Soundarya Lahari - 28 🌹 
📚. Prasad Bharadwaj 

🌴 Fear of Poison and Untimely Death, Increase in Respect 🌴

Sudham apy asvadya pratibhaya-jaraa-mrtyu-harinim Vipadyante visve Vidhi-Satamakhadya divishadah; Karalam yat ksvelam kabalitavatah kaala-kalana Na Sambhos tan-mulam tava janani tadanka-mahima.

🌻. Translation : 
Oh, mother mine, Gods like Indra and brahma,Who have drunk deep the nectar divine, Which removes the cruel aging and death, Do die and disappear. But Shambu thy consort, who swallowed poison that is potent, Does never die, Because of the greatness, Of thine ear studs.

🌻. Chanting procedure and Nivedyam (offerings to the Lord) :

If one chants this verse 1000 times each day for 45 days, offering trimadhuram, milk payasam and thambula as prasadam, it is said that one would be able to overcome fear of poison and achieve success in all respects.

🌻. BENEFICIAL RESULTS:
Immunity from accidents, unnatural and untimely death and attainment of all desires. 
 
🌻. Literal Results:
Youthful look,averts accidents and untimely death. 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: 2 people

🌹 . శ్రీ శివ మహా పురాణము - 160 🌹 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴 
37. అధ్యాయము - 12

🌻. సార, అసార వస్తు విచారము - 7 

సంగత్యా గురురాప్యేత గురోర్మంత్రాది పూజనమ్‌ | పూజనాజ్ఞాయతే భక్తి ర్భక్త్యా జ్ఞానం ప్రజాయతే || 75

విజ్ఞానం జాయతే జ్ఞానా త్పర బ్రహ్మ ప్రకాశకమ్‌ | విజ్ఞానం చ యదా జాతం తదా భేదో నివర్తతే || 76

భేదే నివృత్తే సకలే ద్వంద్వ దుఃఖ విహీనతా | ద్వంద్వ దుఃఖ విహీనస్తు శివరూపో భవత్యసౌ || 77

ద్వంద్వా ప్రాప్తౌ న జాయేతాం సుఖదుఃఖే విజానతః | విహితావిహితే తస్య న స్యాతాం చ సురర్షయః || 78

సత్సంగతిచే గురువు లభించును. గురువు నుండి మంత్రము, పూజా విధి లభించును. పూజవలన భక్తి పుట్టును. భక్తి వలన జ్ఞానము పుట్టును (75). 

జ్ఞానము నుండి విజ్ఞానము పుట్టును. పరబ్రహ్మను ప్రకాశింప జేయును. విజ్ఞానము పుట్టగానే, భేదము తొలగి పోవును (76). 

సకల భేదములు తొలగినప్పుడు ద్వంద్వము (రాగద్వేషాదులు) ల వలన కలిగే దుఃఖము దూరమగును. ద్వంద్వ దుఃఖములు తొలగిన భక్తుడు శివస్వరూపుడగును (77). 

జ్ఞానికి ద్వంద్వములు ఉండవు. కాన, సుఖదుఃఖములు ఉండవు. ఓ దేవతలారా! ఋషులారా! జ్ఞానికి విధినిషేధములు కూడ లేవు (78)

ఈ దృశో విరో లోకే గృహాశ్రమ వివర్జితః | యది లోకే భవత్యస్మిన్ద ర్శనాత్పాపహారకః || 79

తీర్థాని శ్లాఘయంతీహ తాదృశం జ్ఞానవిత్తమమ్‌ | దేవాశ్చ మునయస్సర్వే పరబ్రహ్మాత్మకం శివ మ్‌ || 80

తాదృశాని న తీర్థాని న దేవా మృచ్ఛి లామయాః | తే పునంత్యురు కాలేన విజ్ఞానీ దర్శనాదపి || 81

యావద్గృహాశ్రమే తిష్ఠేత్తావదాకార పూజనమ్‌ | కుర్యాచ్ఛ్రేష్ఠస్య సంప్రీత్యా సురేషు ఖలు పంచసు || 82

గృహము గాని, ఆశ్రమముగాని లేని ఇట్టి జ్ఞాని లోకములో అరుదు. ఒకచో ఉన్నచో, ఆయనను దర్శించినంత పాపములు పోవును (79). 

అట్టి జ్ఞానిశ్రేష్ఠులు పరబ్రహ్మస్వరూపలనియు, శివమూర్తులనియు తీర్థములు (అధిష్ఠాన దేవతలు,) సురులు మరియు అందరు మునులు స్తుతించు చున్నారు (80). 

తీర్థములు గాని, మట్టితో రాతితో చేసిన దేవతా మూర్తులు గాని అట్టి జ్ఞానికి సరిగారు. ఏలయన, అవి చిరకాలమునకు మానవులను పవిత్రులను చేయును. కాని, జ్ఞాని దర్శనముచేతనే పవిత్రులను చేయును (81). 

సాధకుడు గృహస్థా శ్రమములో నున్నంతవరకు అయిదుగురు దేవతల (బ్రహ్మ, విష్ణు, రుద్ర , ఈశాన, సదాశివులు) లో శ్రేష్ఠుడగు శివుని, ప్రీతితో పూజించవలెను. మరియు మిగిలిన వారిని పూజించవలెను (82).

అథవా చ శివః పూజ్యో మూలమేకం విశిష్యతే | మూలే సిక్తే తథా శాఖాస్తృప్తాస్సంత్యఖిలాస్సురాః || 83

శాఖాసు చ సుతృపాస్తు మూలం తృప్తం న కర్హి చి త్‌ | ఏవం సర్వంషు తృప్తేషు సురేషు మునిసత్తమాః || 84

సర్వథా శివతృప్తిర్నో విజ్ఞేయా సూక్ష్మబుద్ధిభిః | శివే చ పూజితే దేవాః పూజితాస్సర్వ ఏవ హి || 85

తస్మా చ్చ పూజయే ద్దేవం శంకరం లోకశంకరమ్‌ | సర్వకామ ఫలావాపై#్య సర్వ భూతాహితే రతమ్‌ || 86

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమ ఖండే సృష్ట్యుపాఖ్యానే పూజా విధివర్ణనే సారాసార విచార వర్ణనం నామ ద్వాదశోsధ్యాయః (12).

లేదా, శివుని పూజించిన చాలును మూలము ప్రధానము గాదా! ఓ దేవతలారా! మూలమున నీరు పోసినచో అన్ని శాఖలు కూడ తృప్తిని చెందును (83). 

కాని, శాఖలకు నీరు పోసినచో, మూలము తృప్తి చెందుట అసంభవము. ఇదే తీరున , ఓ ముని శ్రేష్ఠులారా! దేవతలందరు తృప్తులైన నూ (84) 

శివుడు తృప్తుడు కాడని సూ క్ష్మ బుద్ధి గలవారు తెలియదుగును. కాని, శివుని పూజించినచో, దేవతలనందరినీ పూజించినట్లే యగును. (85). 

అందువలన సర్వప్రాణుల హితమును గోరునట్టియు, లోకములకు మంగళముల నిచ్చు శంకరదేవుని కోర్కెలన్నియూ ఈడేరుట కొరకై పూజించవలెను (86)

శ్రీ శివ మహాపురాణములోని రెండవది యగు రుద్ర సంహితయందు సృష్ట్యు పాఖ్యానమే మొదటి ఖండయందు సారాసార విచారవర్ణన మనే పన్నెండవ అధ్యాయము ముగిసినది (12).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: 1 person

🌹. VEDA UPANISHAD SUKTHAM - 47 🌹
🌻 1. Annapurna Upanishad - 9 🌻
--- From Atharva Veda
✍️ Dr. A. G. Krishna Warrier
📚. Prasad Bharadwaj 

II-41. With mental distinctions of duality and non-duality and delusions of old age and death, the Self alone shines in its phases (atmabhih) just as the sea, in its (phases of) waves.

II-42. What enjoyment of the desired (fruits) can disturb him, who dwells steadfast, ever wedded, in thought, to the pure Self that fells the tree of dangers, to the status of bliss supreme? 

II-43. Mental enjoyments are the foes of one who has thought extensively; they move him not in the least just as gentle breezes move not a hill at all. 

II-44. 'Plurality exists in diverse imaginings, not really, within; just as there is nothing but water in a lake' - a man filled with this one certitude is said to be liberated; he who has perceived the Real. 

III-1. (Nidagha): What is the nature of liberation without the body? Who is the great sage in possession of it? Resorting to which Yoga has he achieved that supreme status? 

III-2. Ribhu: In the region of Sumeru the celebrated sage Mandavya resorting to Truth (imparted by) Kaundinya became liberated in life. 

III-3. Having attained the status of Jivanmukti, that foremost knower of Brahman, that great sage, made up his mind, once upon a time, to withdraw all his sense-organs (from their respective objects). 

III-4. He sat in the lotus-posture, with eyes half-closed, slowly avoiding contacts (with objects), external and internal. 

III-5. Then he, with his sinless mind, (reflected on) the (degree of) steadiness of his mind: 'clearly, though withdrawn, this mind of mine is extremely restless'.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: one or more people

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 32 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 13
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భారతము వాఖ్యానం - 3 🌻

జితో యుదిష్ఠిరో భ్రాతృయుతశ్చారణ్యకం య¸°. 20

వనే ద్వాదశ వర్షాణి ప్రతిజ్ఞాతాని సో7నయత్‌ | అష్టాశీతి సహస్రాణి భోజయన్‌ పూర్వవద్ధ్విజాన్‌ . 21

సధౌమ్యో ద్రౌపదీషష్ఠ స్తతః ప్రాయాద్విరాటకమ్‌ | కజ్కో ద్విజో హ్యవిజ్ఞాతో రాజా భీమో7థ సూపకృత్‌.

బృహన్నడార్జునో భార్యా సైరన్ధ్రీ యమజౌ తథా | అన్యనామ్నా భీమసేనః కీచకం చావధీన్నిశి. 23

ద్రౌవదీం హర్తుకామం తమర్జునశ్చాజయత్కురూన్‌ | కుర్వతో గోగ్రహాదీంశ్చ తైర్‌జ్ఞాతాః పాణ్డవా అథ. 24

ద్యూతమునందు ఓడిపోయిన యుధిష్ఠిరుడు సోదరులతోడను, ద్రౌపదితోడను, ధౌమ్యునితోడను అరణ్యమునకు వెళ్లి ప్రతిజ్ఞచేసిన విధముగ అచట పండ్రెండు సంవత్సరములు గడపెను. అచట పూర్వము నందు వలె, ప్రతిదివసము నందును, ఎనుబది ఎనిమిదివేలమంది బ్రాహ్మణులకు భోజనము పెట్టుచుండెను. పిమ్మట వారందరును విరాటుని చేరిరి. యుధిష్ఠిరుడు కంకుడనెడు. బ్రాహ్మణుడుగను, భీముడు వంటవాడుగను, అర్జునుడు బృహన్నలగను అయి ఇతరులకు తెలియ కుండునట్లు అచట నివసించిరి. నకులసహదేవులు వేరు పేర్లుతో ఉండిరి. ద్రౌపదిని హరింప నభిలషించిన కీచకుని భీమ సేనుడు రాత్రివేళ సంహరించెను. గోగ్రహణాదికమును చేయ వచ్చిన కౌరవులను అర్జునుడు జయించెను. అప్పుడు ఆ కౌరవులు వారు పాండవు లని గుర్తించిరి.

సుభద్రా కృష్ణభగినీ అర్జునాత్సమజీజనత్‌ | అభిమన్యుం దదౌ తసై#్మ విరాటశ్చోత్తరాం సుతామ్‌. 25

కృష్ణుని సోదరియైన సుభద్రకు అర్జునునివలన అభిమన్యడను కుమారుడు కలిగెను. విరాటుడు అతనికి తన కుమార్తెయైన ఉత్తర నిచ్చెను.

ఆసిత్సప్తాక్షౌహిణీశో ధర్మరాజో రణాయ సః | కృష్ణో దూతో7బ్రవీద్గత్వా దుర్యోధన మమర్షణమ్‌. 26

ఏకాదశాక్షౌహిణీశం నృపం దుర్యోధనం తదా | యుధిష్ఠిరాయార్ధరాజ్యం దేహి గ్రామాంశ్చ పఞ్ఛ వా. 27

యుధ్యస్వ వా వచః శ్రుత్వా కృష్ణమాహ సుయోధనః |

ధర్మరాజు యుద్ధమునకై ఏడు అక్షౌహిణుల సైన్యమును నన్నద్దము చేసికొనెను. కృష్ణుడు అమర్ష పూర్ణుడును, పదకొండు అక్షోహిణులకు అధిపతియు అగు దుర్యోధనుని వద్దకు దూతగా వెళ్లి - "యుధిష్ఠిరునకు సగము రాజ్యము నిమ్ము. లేదా ఐదు గ్రామాల నైన ఇమ్ము. అట్లు కానిచో యుద్ధము చేయము" అని చెప్పెను. ఆ మాటలు విని సుయోధనుడు శ్రీ కృష్ణునితో ఇట్లు పలికెను.

సుయోధన ఉవాచ:

భూసూచ్యగ్రం న దాస్యామి యోత్స్యే సఙ్గ్రహణోద్యతః 28

అగ్నిరువాచ:

విశ్వరూపం దర్శయిత్వా అధృష్యం విదురార్చితః | ప్రాగద్యుధిష్ఠిరం ప్రాహ యోధయైనం సుయోధనమ్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే మహాభారతాఖ్యానం నామ త్రయోదశో7ధ్యాయః

సుయోధను డిట్లనెను - ''సూది మోపినంత నేల నైనను ఇవ్వను. యుద్దము చేసెదను. యుద్ధమునకై సిద్ధముగా ఉన్నాను." అగ్ని పలికెను. అంత శ్రీ కృష్ణుడు ఎదిరింప శక్యముకాని విశ్వరూపము చూపి, విదురుని చేత పూజింపబడినవాడై, యుధిష్ఠిరుని దగ్గరకు వెళ్లి, "ఆ సుయోధననితో యుద్ధము చేయుము" అని చెప్పెను.

అగ్ని మహాపురాణములో భారతాఖ్యన మన పదమూడవ అధ్యయము సమాప్తము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: 2 people

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 46 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. అత్రి – అనసూయ - 13 🌻

59. ఈశ్వరుడు బ్రహ్మతో, “నీవు సృష్టించిన వాడివికావు. నేనెలా సంకల్పించానో నువ్వు అలా చేస్తున్నావు. 

60. నీవు ఒకవేళ, ‘నేను రెపటినుంచీ సృష్టించను’ అన్నప్పటికీ కూడా, అప్పుడుకూడా సృష్టి ఇలా నడుస్తూనే ఉంటుంది. సృష్టించింది వెనక్కు తీసుకుంటావానంటావా, అప్పుడూ నడుస్తూనే ఉంటుంది. నీవు నిమిత్తమాత్రుడివే” అన్నాడన్నమాట. అది బ్రహ్మకు బ్రహ్మోపదేశం.

61. ఈశ్వరుడియొక్క లక్షణం ఎలా ఉందంటే, నిర్గుణమైన పరబ్రహ్మ వస్తువులో అవిద్యయొక్క ప్రతిబింబం ఈశ్వరుడని – ఈశ్వరుడిరూపమే అవిద్య అని అనవచ్చు. ఆయనలో ఉండే తత్త్వంమాత్రమే సత్యం.

62. శాశ్వతమయిన తత్త్వం ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఏ రూపంలో వచ్చాడో, ఆ రూపాన్ని ఇప్పుడు ధ్యానించినా ఆ తత్త్వమే మనకు ఉపకరిస్తుంది.

63. శాశ్వతమయిన తత్త్వం ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఏ రూపంలో వచ్చాడో, ఆ రూపాన్ని ఇప్పుడు ధ్యానించినా ఆ తత్త్వమే మనకు ఉపకరిస్తుంది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No photo description available.

🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 37 🌹
Chapter 11
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj 

🌻 Links of Love - 6 🌻

A Perfect Master remains bound up to the time of his Realization and therefore, when he returns he finds his binding association of the past. 

 But when is the Avatar ever bound? Never! He was and is never bound! He was and is eternally free!  

The Avatar does not pass through evolution and involution to reenter creation. He is forever conscious God free from all bindings, and takes human form only to help does so by his own free choice. 

Creation, and he In the interplay of love there is a connecting link with the Avatar, and this link cannot be broken.  

Love is the association with the Avatar, and love is associated with sacrifice, selflessness and courage. 

It is this love that frees one from the bindings of lust, greed, anger, pride and jealousy.  

So out of his eternal freedom the Avatar selects such circle members who love freedom, and who are prepared to sacrifice anything to achieve this goal.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: 2 people

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 22 / Sri Lalita Sahasranamavali - Meaning - 22 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

శ్లోకము 52

199. సర్వశక్తిమయీ - సర్వశక్తి స్వరూపిణి.

200. సర్వమంగళా - సర్వమంగళ స్వరూపిణి.

201. సద్గతి ప్రదా - మంచి మార్గమును ఇచ్చునది.

202. సర్వేశ్వరీ - జగత్తు లేదా విశ్వమునంతకు ప్రధానాధికారిణి.

203. సర్వమయీ - సర్వములో అనగా విశ్వమంతటా నిండి ఉంది.

204. సర్వమంత్ర స్వరూపిణీ - అన్ని మంత్రములును తన స్వరూపముగా గలది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 22 🌹
📚. Prasad Bharadwaj 

🌻 Sahasra Namavali - 22 🌻

199 ) Sarva shakthi mayi - She who has personification of all strengths

200 ) Sarva mangala - She who is personification of all that is good

201 ) Sad gathi prada - She who gives us good path

202 ) Sarveshwari - She who is goddess of all

203 ) Sarva mayi - She who is everywhere

204 ) Sarva manthra swaroopini - She who is personification of all manthras

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No photo description available.

🌹 Seeds Of Consciousness - 112 🌹
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

Just see the person you imagine yourself to be as a part of the world you perceive within your mind, and look at the mind from the outside, for you are not the mind. 

After all, your only problem is the eager self-identification with whatever you perceive. 

Give up this habit, remember that you are not what you perceive, use your power of alert aloofness.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

No photo description available.

🌹. మనోశక్తి - Mind Power - 50 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

Q 50:-- God దైవం అంటే? 

Ans :--
1) ఈ విశ్వం అనంతమైంది,
కోటానుకోట్ల galaxies ఈ విశ్వంలో ఉన్నాయి,. 

ఒక్కొక్క galaxy లో కోటానుకోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క సూర్యుడిగా పరిగణింప బడుతుంది. సూర్యుడు సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు, ఉపగ్రహాలు కలిపి ఒక సౌరకుటుంబం అంటారు. అలా కోటానుకోట్ల సౌరకుటుంబాలు ఉన్నాయి. ఇది మానవ మేధస్సుకు ఏ మాత్రం అందదు

2) ఇనుముని పరిశీలిస్తే ఇనుము ఘనరూపంలో, ద్రవరూపంలో వాయురూపంలో ఉంటుంది. అంటే frequency పెరిగే కొద్దీ సాంద్రత
పెరుగుతుంది. అలాగే higher frequency లోకాలు అందుకే కనపడవు. ఎలా అయితే వాయువును మనం చూడలేమో అలానే ఉన్నత లోకాలను మనము చూడలేము. 

భూమి మీద కూడా ఎన్నో కనపడని higher frequency లోకాలు ఉన్నాయి ఉదాహరణకు శంబాల. అలా మన సౌర వ్యవస్థలో కనపడని ఎన్నో higher frequency లోకాలు ఉన్నాయి.

3) దైవము మానవ రూపంలో ఉంటాడని మహిమాన్విత శక్తి ఉంటుందని లోకసంరక్షకుడు అంటారు. అలా మనం 3d తలమైన భూమికి మాత్రమే అన్వయించు కుంటున్నాము. మన మనస్సులో వుండే భావాలకు అనుగుణంగా దేవుడిని ఊహించుకుంటున్నాము.

4) ఆయన దీనజన బాంధవుడని, పాహిమాం అని ఆర్తనాదాలు చేస్తే కాపాడుతాడని భ్రమ పడుతుంటాము. పాపాత్ములని శిక్షిస్తాడు, భక్త వత్సలుడు భక్తుల కోర్కెల్ని తీరుస్తాడని అనుకుంటాము . 

ఆయన నిర్గుణుడు. ప్రార్థనలు ద్వారా భజనలు ద్వారా పూజల ద్వారా ప్రసన్నుడవుతాడు, ఇలా మనం మానవుడి గుణాలన్నింటిని దేవునికి ఆపాదిస్తుంటాము.

5) మన ఆత్మను పరిశీలిస్తే ఆత్మ ఎన్నో లోకాలలో ఎన్నో దేహాలను ధరించి చైతన్య పరిణామం చెందుతుంది. మరి 3d తలంలో మానవుని నిర్వచనాలకు దేవుడికి వర్తిస్తాయా ఒక్కసారి ఆలోచించండి.

6) ఈ విశ్వంలో కోటానుకోట్ల లోకాలున్నాయి అనంత బ్రహ్మా0డ విశ్వాన్ని మహాసముద్రంతో పోలిస్తే నీటి బొట్టంత పరిమాణం కూడా లేని భూమి మీద ఉండే మానవ జాతి నిర్వచనాలకు దైవము అందుతాడా.

7) ఈ విశ్వాన్ని భూగోళంతో పోలిస్తే గుండు సూది మోనంత కూడా లేని భూమిలో నివసించే మానవుని యొక్క భక్తి పారవశ్యానికి దాసోహమవుతాడా దేవుడు ఆలోచించండి.

8) మన ప్రార్ధనలకు పూజలకు సంతోషిస్తాడా, కోటానుకోట్ల లోకాలలో కోటానుకోట్ల రకాల జీవరాసులున్నాయి. మరి వాటి సంగతేంటి.

9) పాపాత్ములని శిక్షిస్తాడు అంటున్నాము మరి దేవుడికి మానవుని గుణాలు ఉండాలి కదా.

10) అనంత బ్రహ్మా0డ విశ్వంలో కూసంత కూడా లేని భూమి మీద ఉండే మానవుని రూపంలో దేవుడుంటాడు అనేది ఆధ్యాత్మిక లోపం వల్లనే మసనవుడు ఈ విధంగా ఆలోచిస్తున్నాడు.

11) దేవుడు అంటే విశ్వమంతా వ్యాపించివున్నమూలచైతన్యం.

12) దేవుడంటే పురుషుడు కాదు,స్త్రీ కాదు,దేవుడంటే శక్తిస్వరూపం, కోటానుకోట్ల లోకాలు, ఆ లోకాలలో ఉన్న జీవాత్మలు అన్నీ దైవమే.

13) దైవము కోటానుకోట్ల గుణాలతో చైతన్య పరిణామం చెందుతూ తనను తాను విస్తరించుకుంటూ ఉంది.

14) అనంత బ్రహ్మాండ మైన మూలచైతన్యం అనంతమైన గుణాలను అనంతమైన ధర్మాలను ఏకకాలంలో కలిగి ఉంది.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹