🌹 30, MARCH 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹

🍀🌹 30, MARCH 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 30, MARCH 2023 THURSDAY గురువారం, బృహస్పతి వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
🍀. శ్రీ రామ నవమి, శ్రీరాముని జన్మదిన మరియు శ్రీ సీతారాముల కళ్యాణ పర్వదిన శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Sri Rama Navami, Sri Ram's Birthday and Sri SitaRama Marriage Day to All 🍀
🍀. శ్రీరామ నవమి విశిష్టత 🍀
2) 🌹 కపిల గీత - 155 / Kapila Gita - 155 🌹 🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 09 / 4. Features of Bhakti Yoga and Practices - 09 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 747 / Vishnu Sahasranama Contemplation - 747 🌹 
🌻747. అమానీ, अमानी, Amānī🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 708 / Sri Siva Maha Purana - 708 🌹🌻. త్రిపుర మోహనము - 6 / The Tripuras are fascinated - 6 🌻
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 444-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 444-1 🌹 🌻 444. ‘ధృతిః’ - 1 / 444. 'Dhrutih' - 1🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 30, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*🍀. శ్రీ రామ నవమి, శ్రీరాముని జన్మదిన మరియు శ్రీ సీతారాముల కళ్యాణ పర్వదిన శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Sri Rama Navami, Sri Ram's Birthday and Sri SitaRama Marriage Day to All 🍀*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : శ్రీ రామ నవమి (శ్రీరాముని జన్మదిన మరియు శ్రీ సీతారాముల కళ్యాణ పర్వదినము), Sri Rama Navami, (Sri Ram's Birthday and Sri SitaRama Marriage Day ) 🌺*

*🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రం - 33 🍀*

*33. వాగర్థసిద్ధిహేతోఃపఠత హయగ్రీవసంస్తుతిం భక్త్యా*
*కవితార్కికకేసరిణా వేంకట నాథేన విరచితామేతామ్ ॥*

*ఇక్ష్వాకు వంశార్ణవ జాతరత్నం సీతాంగనా యౌవన భాగ్యరత్నం!*
*వైకుంఠ రత్నం మమ భాగ్యరత్నం శ్రీరామ రత్నం శిరసానమామి.!!*

*అన్యోన్య సదృశాకారౌ త్రిలోక్య గ్రహ దంపతి !*
*ఇమౌ యువాం ప్రణమ్యాహం భజామ్యద్య కృతార్థతాం !!*
*అనేన స్తోతి యః స్తుత్యం రామం సీతాంచ భక్తితః ! *
*తస్య తౌ తనుతాం పుణ్యాస్సంపదః సకలార్థదాః !!*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : కనులు తెరుచుకొని కూడా ఏకాగ్రతా సాథన - ఏకాగ్రతకు సూర్యుని లక్ష్యంగా ఉంచుకోడం లేకపోలేదు. కాని, ధాని కంటె బ్రహ్మమును లక్ష్యంగా ఉంచుకోడమే ఉత్తమం. కనులు మూసికొని, తెరచుకొనికూడా ఏకాగ్రతా సాధన చెయ్యవచ్చు. ఏది తనకు ఎక్కువ అనుకూలంగా ఉంటుందనేది చూచుకోవాలి. 🍀*

🌷🌷🌷🌷🌷

*🌏🏹. రామ నామము జపించడమే కాదు, రాముని పని కూడా చేయాలి. భగవంతుని పనిలో తమ బుద్ధిని, శక్తిని, శ్రమను, సమయాన్ని, ధనాన్ని ఎవరు వెచ్చిస్తారో వారు గొప్పవారౌతారు. హనుమంతుడు రాముని పనికి తనను తాను సమర్పించుకుని రామకార్యం నెరవేర్చడం వలన భగవంతుడు అయ్యాడు. భగవంతుని పని కొరకు ముందుకురండి. అప్పుడు మీరు, నేను, భగవంతుడు ముగ్గురము ధన్యులమౌతాము. 🏹🌏*
*- పండిత శ్రీరామశర్మ ఆచార్య*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,  
వసంత ఋతువు, ఉత్తరాయణం, 
చైత్ర మాసం
తిథి: శుక్ల-నవమి 23:31:24 వరకు
తదుపరి శుక్ల-దశమి
నక్షత్రం: పునర్వసు 23:00:55 వరకు
తదుపరి పుష్యమి
యోగం: అతిగంధ్ 25:03:26 వరకు
తదుపరి సుకర్మ
కరణం: బాలవ 10:18:25 వరకు
వర్జ్యం: 09:33:30 - 11:21:02
దుర్ముహూర్తం: 10:18:04 - 11:07:08
మరియు 15:12:32 - 16:01:37
రాహు కాలం: 13:52:47 - 15:24:48
గుళిక కాలం: 09:16:43 - 10:48:44
యమ గండం: 06:12:41 - 07:44:42
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:44
అమృత కాలం: 20:18:42 - 22:06:14
సూర్యోదయం: 06:12:41
సూర్యాస్తమయం: 18:28:50
చంద్రోదయం: 12:51:33
చంద్రాస్తమయం: 01:41:20
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: సిద్ది యోగం - కార్య
 సిధ్ధి , ధన ప్రాప్తి 23:00:55 వరకు
తదుపరి శుభ యోగం - కార్య జయం 
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీరాముని జన్మదిన మరియు శ్రీ సీతారాముల కళ్యాణ పర్వదిన శుభాకాంక్షలు మిత్రులందరికి 🌹*
*🍀. మనందరి జీవితాలలో ఈ శ్రీరాముని జన్మదినము మరియు శ్రీ సీతారాముల కళ్యాణ పర్వదినం ఆనందం, సామరస్యత మరియు సమృద్ధిని తేవాలని కోరుకుంటూ.. 🍀*
*ప్రసాద్‌ భరధ్వాజ.*

*🌏🏹. రామ నామము జపించడమే కాదు, రాముని పని కూడా చేయాలి. భగవంతుని పనిలో తమ బుద్ధిని, శక్తిని, శ్రమను, సమయాన్ని, ధనాన్ని ఎవరు వెచ్చిస్తారో వారు గొప్పవారౌతారు. హనుమంతుడు రాముని పనికి తనను తాను సమర్పించుకుని రామకార్యం నెరవేర్చడం వలన భగవంతుడు అయ్యాడు. భగవంతుని పని కొరకు ముందుకురండి. అప్పుడు మీరు, నేను, భగవంతుడు ముగ్గురము ధన్యులమౌతాము. 🏹🌏*
- పండిత శ్రీరామశర్మ ఆచార్య

*🌻. ఇక్ష్వాకు వంశార్ణవ జాతరత్నం సీతాంగనా యౌవన భాగ్యరత్నం!*
*వైకుంఠ రత్నం మమ భాగ్యరత్నం శ్రీరామ రత్నం శిరసానమామి.!! 🌻*

*అన్యోన్య సదృశాకారౌ త్రిలోక్య గ్రహ దంపతి !*
*ఇమౌ యువాం ప్రణమ్యాహం భజామ్యద్య కృతార్థతాం !!*
*అనేన స్తోతి యః స్తుత్యం రామం సీతాంచ భక్తితః ! *
*తస్య తౌ తనుతాం పుణ్యాస్సంపదః సకలార్థదాః !!*

*🍀. శ్రీరామ నవమి విశిష్టత 🍀*

*దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం.*

*శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు "శ్రీ రామ నవమి"గా పూజలు జరుపుకుంటుంటాం. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీ రాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం. కొలిచేటపుడు అరటిపండ్లతో నివేదన తప్పనిసరి.*

*ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో పేద, ధనిక బేధాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించటం పరిపాటి. శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే.. సకల శుభాలు చేకూరుతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.*

*అయోధ్య రాజైన దశరథుడు, రాణి కౌసల్యలు జరిపిన "పుత్ర కామేష్టి యాగ" ఫలితంగా కలిగిన సంతానం శ్రీరాముడు. దశావతారాల్లో శ్రీరామావతారం ఒకటి. శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవరాధకులను, మునులను, దేవతలను ముప్పతిప్పలు పెడుతూ లోకాలని అల్లకల్లోలం చేస్తున్నాడు.*

*రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించాడు. మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు. మనం శ్రీరామ నవమి పండగను భద్రాచలంలో ఏ రోజైతే చేస్తారో అదే రోజు అందరు అన్ని ప్రాంతాల వారు జరుపుకోవాలి. శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామరక్షా స్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయమును పారాయణము చేయడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి.*

*నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలి. పూజకు కంచు దీపము, రెండు దీపారాధనలు, ఐదు వత్తులు ఉపయోగించాలి. పూజ చేసేటప్పుడు తులసి మాలను ధరించడం చేయాలి. పూజ పూర్తయిన తర్వాత అన్నదానం, శ్రీ రామరక్షా స్తోత్రము, శ్రీరామ నిత్యపూజ వంటి పుస్తకాలను తాంబూలముతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి.*

*శ్రీ రామనవమి రోజున పానకం-వడపప్పు ప్రాముఖ్యత ఉంటుంది. నవమి రోజున పానకం-వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు. ఇది వేసవికాలం. కాబట్టి, వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం. పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైంది. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును 'వడ'పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో 'వడ' కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతి పాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కపిల గీత - 155 / Kapila Gita - 155 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 09 🌴*

*09. ప్రాణస్య శోధయేన్మార్గం పూరకుంభకరేచకైః|*
*ప్రతికూలేన వా చిత్తం యథా స్థిరమచంచలమ్॥*

*తాత్పర్యము : ప్రారంభమున పూరక, కుంభక, రేచక చక్రమలో గాని, అనులోమవిలోమ విధానమునగాని , ప్రాణములను పరిశుభ్రమొనర్పవలెను. దానివలన చిత్తము స్థిరమై నిశ్చలమగును.*

*వ్యాఖ్య : ఆసన శుద్ధి, ఆసన స్థైర్యం తరువాత, ప్రాణము చేరే మార్గాన్ని శుద్ధి చేయాలి. మన కోరికలే ప్రాణ వాయువు యొక్క నాడీ మండలాన్ని మురికి చేస్తాయి. దాని వలనే అన్ని రోగాలూ వస్తాయి. అది శుద్ధిగా ఉండాలి.*
 
*1. మొదలు వాయువును తీసుకొనుట - పూరకం 2. నిలపాలి - కుంభకం 3. వదులుట - రేచకం.*

*ముందు పూరకం చేసి తరువాత రేచకం చేయచ్చు. లేదా ముందు రేచకం చేసి తరువాత కుంభక పూరకాలు చేయవచ్చు. ఇడా రేచకం - పిగళాతో పూరకం. చిత్తాన్ని స్థిరముగా, అచంచలముగా ఉంచాలి. ప్రాణాయామము సక్రమముగా ఆచరించిన వాడి మనసు స్థిరముగా ఉంటుంది. ప్రాణ వాయువును నిలపగలిగితే మనసు కూడా నిలిచి ఉంటుంది.*

*ఒకరి మనస్సు అతనికి శత్రువు, మరియు అతని స్నేహితుడు కూడా; జీవి యొక్క వివిధ వ్యవహారాలను బట్టి దాని స్థానం మారుతూ ఉంటుంది. మనం మన మనస్సును భౌతిక ఆనందానికి సంబంధించిన ఆలోచనలకు మళ్లిస్తే, మన మనస్సు శత్రువు అవుతుంది, మరియు మన మనస్సును దేవుని పాద పద్మాలపై కేంద్రీకరిస్తే, మన మనస్సు ఒక మిత్రుడు. పూరక, కుంభక మరియు రేచక యొక్క యోగ విధానం ద్వారా లేదా దైవ నామం యొక్క ధ్వని కంపనంపై లేదా ఇష్ట దైవం రూపంలో నేరుగా మనస్సును స్థిరపరచడం ద్వారా, అదే ప్రయోజనం సాధించబడుతుంది. భగవద్గీతలో ( BG 8-8) శ్వాస వ్యాయామాన్ని (అభ్యాస-యోగ-యుక్తేన) తప్పనిసరిగా అభ్యసించాలని చెప్పబడింది. ఈ నియంత్రణ ప్రక్రియల కారణంగా, మనస్సు బాహ్య ఆలోచనలతో సంచరించదు. ఈ విధంగా ఒక వ్యక్తి తన మనస్సును భగవంతునిపై నిరంతరం ఉంచవచ్చు మరియు ఆయనను (యాతి) పొందవచ్చు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 155 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 4. Features of Bhakti Yoga and Practices - 09 🌴*

*09. prāṇasya śodhayen mārgaṁ pūra-kumbhaka-recakaiḥ*
*pratikūlena vā cittaṁ yathā sthiram acañcalam*

*MEANING : The yogī should clear the passage of vital air by breathing in the following manner: first he should inhale very deeply, then hold the breath in, and finally exhale. Or, reversing the process, the yogi can first exhale, then hold the breath outside, and finally inhale. This is done so that the mind may become steady and free from external disturbances.*

*PURPORT : These breathing exercises are performed to control the mind and fix it on the Supreme Personality of Godhead. Three different activities are recommended for clearing the passage of breath: pūraka, kumbhaka and recaka. Inhaling the breath is called pūraka, sustaining it within is called kumbhaka, and finally exhaling it is called recaka. These recommended processes can also be performed in the reverse order. After exhaling, one can keep the air outside for some time and then inhale. The nerves through which inhalation and exhalation are conducted are technically called iḍā and piṅgalā. The ultimate purpose of clearing the iḍā and piṅgalā passages is to divert the mind from material enjoyment.*

*One's mind is his enemy, and one's mind is also his friend; its position varies according to the different dealings of the living entity. If we divert our mind to thoughts of material enjoyment, then our mind becomes an enemy, and if we concentrate our mind on the lotus feet of Kṛṣṇa, then our mind is a friend. By the yoga system of pūraka, kumbhaka and recaka or by directly fixing the mind on the sound vibration of Kṛṣṇa or on the form of Kṛṣṇa, the same purpose is achieved. It is said that one must practice the breathing exercise (abhyāsa-yoga-yuktena). By virtue of these processes of control, the mind cannot wander to external thoughts (cetasā nānya-gāminā). Thus one can fix his mind constantly on the Supreme Personality of Godhead and can attain (yāti) Him.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 747 / Vishnu Sahasranama Contemplation - 747🌹*

*🌻747. అమానీ, अमानी, Amānī🌻*

*ఓం అమానినే నమః | ॐ अमानिने नमः | OM Amānine namaḥ*

*అమానీతి హరిః ప్రోక్తః స్వచ్ఛసంవేదనాకృతేః ।*
*అనాత్మవస్తుష్వాత్మాభిమానో నాస్తస్య యద్ధరేః ॥*

*మానము అనగా అనాత్మ వస్తువులను ఆత్మనుగా తలచు భ్రాంతి లేని వాడు అనాత్మ. నిర్విషయకమగు సంవేదనము తన స్వస్వరూపముగా కల ఈ పరమాత్మునకు 'ఇది ఆత్మ' అను అభిమానము ఉండదు కనుక అనాత్మ.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 747🌹*

*🌻747. Amānī🌻*

*OM Amānine namaḥ*

अमानीति हरिः प्रोक्तः स्वच्छसंवेदनाकृतेः ।
अनात्मवस्तुष्वात्माभिमानो नास्तस्य यद्धरेः ॥

*Amānīti hariḥ proktaḥ svacchasaṃvedanākr‌teḥ,*
*Anātmavastuṣvātmābhimāno nāstasya yaddhareḥ.*

*The One who has no pride is Amānī. As He is of the form of pure consciousness, He has no leaning towards things which are not the ātma.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अमानी मानदो मान्यो लोकस्वामी त्रिलोकधृक् ।सुमेधा मेधजो धन्यस्सत्यमेधा धराधरः ॥ ८० ॥
అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ ।సుమేధా మేధజో ధన్యస్సత్యమేధా ధరాధరః ॥ 80 ॥
Amānī mānado mānyo lokasvāmī trilokadhr‌k,Sumedhā medhajo dhanyassatyamedhā dharādharaḥ ॥ 80 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 708 / Sri Siva Maha Purana - 708 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 05 🌴*
*🌻. త్రిపుర మోహనము - 6 🌻*

*మరీచుని కుమారుడగు కశ్యపుడు దక్షుని కుమార్తెలగు పదముగ్గురు సుందరీ మణులను ధర్మమార్గములో వివాహమాడినాడు (44). కాని అల్పముగు బుద్ధి, అల్పమగు పరాక్రమము గల ఈనాటి మనుష్యులు 'వీనితో సంభోగించరాదు; వీనితో సంభోగించవచ్చునను' అంటూ వ్యర్ధమగు చర్చలను చేయుచున్నారు (45). బ్రహ్మగారి ముఖము, బాహువులు, ఊరువులు, పాదములనుండి క్రమముగా నాల్గు వర్ణములు జన్మించినవి అను కల్పనను పూర్వీకులు చేసి యుండిరి. ఈ కల్పన విచారము చేసినచో నిలబడదు (46). ఒకే భార్యా భర్తలకు నల్గరు కుమారులు పుట్టినచో, ఒకే దేహమునుండి పుట్టిన ఆ నల్గురు వేర్వేరు వర్ణముల వారు అగుదురా యేమి? (47).*

*ఈ వర్ణ విభాగము యుక్తి యుక్తముగా ఉన్నట్లు కన్పట్టుట లేదు. కావున ఎక్కడైననూ మానవులందరూ సమానమే. వారిలో భేదమును భావన చేయరాదు (48).*

*సనత్కుమారుడిట్లు పలికెను -*

*ఓ మహర్షీ! ఆ యతి రాక్షసరాజునకు, పౌరులకు ఇట్లు ప్రవచించి, శిష్యులచే వేదధర్మములను పట్టుదలతో నశింపజేసెను (49). స్త్రీలకు పరమ ధర్మమగు పాతివ్రత్యమును, పురుషులందరు పాటింపదగిన ఇంద్రియ జయమును ఆతడు ఖండించెను (50). ఆతడు దేవ (యజ్ఞాది) ధర్మములను, శ్రాద్ధ ధర్మములను, వ్రతములు మొదలగు వాటిని, ప్రత్యేకించి తీర్థములలో చేయు శ్రాద్ధములను ఖండించెను (51). లింగారాధన పూర్వకముగా చేయు శివపూజను ఆతడు ప్రత్యేకముగా ఖండించెను. యథావిధిగా చేయబడే విష్ణు సూర్య గణేశాది పూజలను ఆతడు ఖండించెను (52).*

*సశేషం....*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 708🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 05 🌴*

*🌻 The Tripuras are fascinated - 6 🌻*

44. Kaśyapa, the son of Marīci married thirteen of the sweet-eyed daughters of Dakṣa, they say, in accordance with righteous path.

45. But people of modern times whose intelligence and valour are but a modicum unnecessarily wrangle over the fact whether this is proper or improper.

46. Some of the ancestors thought that the four castes are born of mouth, arms, thighs etc. of Brahmā.[1] But when we consider, this does not fit in properly.

47. How can sons born of the same body or from the same body be of four different castes?

48. Hence the divisions of castes and outcastes do not appear to be sound. Hence no difference between man and man should be entertained.
Sanatkumāra said:—

49. O sage, addressing the lord of the Asuras and the citizens thus, the sage with his disciples spoiled the Vedic rites in a determined manner.

50. He then criticised the womanly virtues of chastity and manly virtues of continence etc.

51. Similarly he attacked and repudiated the divine rites, Śrāddhika rites, sacrificial rites and holy observances and festivals, pilgrimages and anniversaries.

52. Worship of Śiva, propitiation of his phallic form, adoration of Viṣṇu, Sun, Gaṇeśa and other deities in accordance with the sacred texts were repudiated by him.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 444 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 444 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 94. కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।*
*శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥ 🍀*

*🌻 444. ‘ధృతిః’ - 1 🌻* 

*స్థిరమగు ప్రజ్ఞ కలది శ్రీమాత అని అర్థము. శ్రీమాత ప్రజ్ఞ అచంచలము, అనిర్వచనీయమైన స్థిరము కలది. స్థిర ప్రజ్ఞ కలవారికే విజయము, ఆనందము, కీర్తి, తుష్టి, పుష్టి, శాంతి కలుగును. చంచల స్వభావులకు సృష్టి యందెట్టి అనుభూతి యుండదు. పడుచూ, లేచుచూ, ఏడ్చుచూ, నవ్వుచూ, దిగులు చెందుచూ జీవింతురు. ప్రజ్ఞ చంచలమైనపుడు కామము, క్రోధము వంటి షడ్వర్గములు దరిచేరును. భయ మావేశించును. మరపు కలుగును. దుర్బలత్వము లేర్పడును. జీవితము క్షుద్ర మగును. స్థిరబుద్ధిని పొందుటకే ప్రాచీన ఋషులు విద్యాభ్యాసమును ప్రవేశ పెట్టిరి. చంచలమగు ప్రజ్ఞకు స్థిర మేర్పరచుటకే ప్రాథమిక విద్య. స్థిరబుద్ధి యైనవాడు విద్యలను సులభముగ ఉపాసించగలడు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 444 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 94. Kumara gananadhamba tushtih pushtirmatih dhrutih*
*Shanti svastimati kantirnandini vignanashini ॥ 94 ॥ 🌻*

*🌻 444. 'Dhrutih' - 1 🌻*

*It means that Srimata has steady wisdom. Srimata's wisdom is immovable, indefinable. Victory, happiness, glory, contentment, prosperity and peace will come to those who have steady wisdom. Fickle natures have no sense of experience in this universe. They fall, get up, cry, laugh, get sad and live. When wisdom is inconsistent, the six aspects like lust and anger arise. Fear overtakes. There will be oblivion. Vulnerability arises. Life is fleeting. The ancient sages introduced education to attain a fixed mind. The basic education is to fix the fickle mind. One who has a fixed mind can easily learn the teachings.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

Siva Sutras - 061 - 19. Śaktisandhāne śarīrotpattiḥ - 3 / శివ సూత్రములు - 061 - శక్తిసంధానే శరీరోత్పత్తిః - 3


🌹. శివ సూత్రములు - 061 / Siva Sutras - 061 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

1- శాంభవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻. శక్తిసంధానే శరీరోత్పత్తిః - 3 🌻

🌴. అతని సంకల్ప శక్తిని నింపడం ద్వారా సంకల్పం యొక్క స్వరూపం తక్షణం సంభవిస్తుంది.🌴


సృష్టికర్త అయిన శివుడు, పూర్తిగా నిర్మూలించబడని కోరికలను బయటకు తీసి, అప్పటికే యోగి మనస్సులో వాసన లేదా ముద్రలుగా మిగిలి ఉన్న వాటి ముద్రలను వ్యక్తపరుస్తాడు. ఇది ఉచ్ఛ్వాసనిశ్వాసాలను సమం చేయడం ద్వారా జరుగుతుంది, తద్వారా ప్రాణం సుషుమ్న నాడిలోకి ప్రవేశించి ఆధ్యాత్మిక శక్తిని కలిగిస్తుంది. స్పంద కారికాలో (పద్యము 3-2) వెన్నెముకలో అటువంటి శక్తి ఏర్పడినప్పుడు, శివుడు తన కలలో కనిపించి, ప్రార్థించిన వస్తువులను నెరవేరుస్తాడని చెప్పారు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 061 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 1 - Sāmbhavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 19. Śaktisandhāne śarīrotpattiḥ - 3 🌻

🌴. By infusing his energy of will the embodiment of that which is willed occurs at once. 🌴


Śiva, as the Creator brings out those not- totally eradicated desires, the impressions of which still remain as vāsana or impressions in the mind of yogi and make them to manifest. This is brought about by equalizing inhalation and exhalation so thatprāna enters suṣumna nādi causing spiritual energisation. Spanda Kārikā (verse III-2) says that when such energisation happens in the spinal cord, Śiva appears in his dream and reveals those objects that are prayed for.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


నిర్మల ధ్యానాలు - ఓషో - 324


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 324 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. నువ్వు పరిధి నించీ కేంద్రానికి వెళ్ళలేవు. ఎప్పుడు కేంద్రం నించే పరిధికి విస్తరిస్తావు. పరిధి అన్నది కేవలం ఛాయా మాత్రమైంది. 🍀


మన పునాదులు మన కేంద్రంలో వున్నాయి. మనం కేంద్రంలో ఒక వేళ కలుపు మొక్కల్ని నాటితే మనకు గులాబీ పూలు కావాలంటే కుదరదు. గులాబీపూలు కావాలంటే గులాబీ మొక్కల్ని పునాదుల్లో నాటాలి. అప్పుడే మృదువైన పూలు, మధురమయిన పరిమళం పరిసరాల్లో ప్రసరిస్తాయి. నువ్వు పరిధి నించీ కేంద్రానికి వెళ్ళలేవు. ఎప్పుడు కేంద్రం నించే పరిధికి విస్తరిస్తావు. పరిధి అన్నది కేవలం ఛాయా మాత్రమైంది. తరతరాలుగా మత పెద్దలు, నీతివాదులు పై నించీ సమన్వయాన్ని, సమశృతిని సాధిస్తామని చెబుతూ వచ్చారు.

పునాదుల్లో కలుపు మొక్కల్ని నాటి గులాబీల కోసం ఆశిస్తున్నాం. అవి రావు. లేదా మనం మోసంతో ప్లాస్టిక్ గులాబీ పూలని తెచ్చి కలుపు మొక్కలపై పెట్టి అలంకరిస్తాం. మనం యితర్లని మోసగించి చివరకు మనల్ని మనం మోసగించుకుంటాం. కానీ ప్లాస్టిక్పులు నిజమైన పూలు కావు. నీతి నిండిన పాత్రలు అలాంటివే. నిజమైన వ్యక్తిత్వాలు తయారు చేస్తే వచ్చేవి కావు. ధ్యానం గుండా సహజంగా ఏర్పడేవి.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


DAILY WISDOM - 59 - 28. Science Cannot Give Us Knowledge / నిత్య ప్రజ్ఞా సందేశములు - 59 - 28. శాస్త్రం మనకు జ్ఞానాన్ని ఇవ్వదు


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 59 / DAILY WISDOM - 59 🌹

🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 28. శాస్త్రం మనకు జ్ఞానాన్ని ఇవ్వదు 🌻


జ్ఞానం అంటే ఏమిటి? ఇది చైతన్యంలోకి వస్తువు యొక్క సమీకరణ. నువ్వు నా చైతన్యంలో భాగం అయిపోతే, నేను నిన్ను తెలుసుకున్నట్లు. కానీ మీరు నాకు అపరిచితుడిగా, నా నుండి పూర్తిగా స్వతంత్రమైన వస్తువుగా నా చైతన్యం బయట నిలబడితే, నేను నిన్ను తెలుసుకోలేను. జ్ఞానం అంటే విషయంలో భాగస్వాములు అవడం. భాగస్వామ్యం అనేది వస్తువు యొక్క స్వభావంలోకి ప్రవేశించే మన సామర్థ్యాన్ని మరియు వస్తువు యొక్క మన జీవంలోకి, మన జ్ఞానంలోకి ప్రవేశించే సామర్థ్యాన్ని సూచిస్తుంది; అంటే వస్తువుల స్వభావం యొక్క పరస్పర సమీకరణ.

నేను పూర్తిగా నీ వెలుపల నిలబడితే, నువ్వు పూర్తిగా నా బయట నిలబడితే, ఇద్దరి మధ్య సఖ్యత ఉండదు. నేను నిన్ను తెలుసుకోలేను మరియు మీరు నన్ను తెలుసుకోలేరు. ఆధునిక కాలపు శాస్త్రీయ పరిశీలనలకు ఇదే జరిగింది. శాస్త్రం అనేది వస్తువుల పరిశీలన అయితే, వాటిని గమనించే విషయాలతో సంబంధం లేని వస్తువులుగా పరిగణించి నట్లయితే, శాస్త్రం మనకు జ్ఞానాన్ని ఇవ్వదు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 59 🌹

🍀 📖 Philosophy of Yoga 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 28. Science Cannot Give Us Knowledge 🌻


What is knowledge? It is an assimilation of the object into the consciousness. If I assimilate you in my consciousness, I know you, but if you stand outside as a stranger to me, as an object which is totally independent of me, I cannot know you. All knowledge is participation in the content thereof. Participation implies our capacity to enter into the nature of the object, and the capacity in the object to enter into the nature of our being, our knowledge; that is mutual assimilation of the nature of things.

If I stand outside you totally and you stand outside me wholly, there would be no concourse between the two. I cannot know you and you cannot know me. This is what has happened to the scientific observations of modern times. If science is an observation of objects, regarding them as objects having nothing to do with the subjects which observe them, then science cannot give us knowledge.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ మదగ్ని మహాపురాణము - 194 / Agni Maha Purana - 194


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 194 / Agni Maha Purana - 194 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 59

🌻. అధివాసనము - 1 🌻


హయగ్రీవుడు చెప్పెను: శ్రీహరి సాన్నిధ్యము సంపాదించుటకు అధివాసనమని పేరు. "నేను సర్వజ్ఞుడు సర్వవ్యాపియు అయిన పురుషోత్తముడను" అని భావన చేయుచు సాధకుడు ఓంకారవాచ్యుడగు పరమాత్మతో ఏకత్వమును చేయవలెను. పిమ్మట చైతన్యాభిమానియైన జీవుని వేరుచేసి ఆత్మకును, ఆ జీవునకును ఏకత్వమును చేయవలెను. ఈ విధముగా చేసి స్వత్మరూపుడును, సర్మవ్యాపియు అగు పరమేశ్వరునితో దానిని కలిపివేయవలెను. పిమ్మట ప్రాణ వాయువు ద్వారా (లం బీజరూపయగు) పృథివిని అగ్ని బీజ (రం) చింతనముచే ఆవిర్భవించిన అగ్నియందు కాల్చివేయవలెను. అనగా పృథివి అగ్నిలో లీనమైనదని భావన చేయవలెను. పిమ్మట అగ్నిని వాయువునందు, వాయువును ఆకాశమునందు లీనము చేయవలెను అధిభూత-అథ్యాత్మ-అధిదైవ విభవములతో కూడిన సమస్త భూతములను తన్మాత్రలలో విలీనము చేసి వీటినన్నింటిని క్రమముగా ఆకాశమునందు విలీనము చేయవలెను. ఆకశమును మనస్సునందు మనస్సును అహంకారమునందు అహంకారము మహత్తత్త్వమునందు, మహత్తత్త్వమును అవ్యాకృతప్రకృతియందును లీనము చేయవలెను.

అవ్యాకృతమును (ప్రకృతిని లేదామాయను) జ్ఞాన స్వరూపుడగు పరమాత్మయందు వినీనము చేయవలెను. ఈ పరమాత్మమే వాసుదేవుడు. శబ్ద స్వరూపుడైన ఆవాసుదేవుడు నృష్టిచేయవలెనని సంకల్పించి, అవ్యాకృత మాయా శ్రయము చే స్పర్శమను పేరు గల సంకర్షణుని ఆవిర్భవింపచేసెను. సంకర్షణుడు మాయను క్షుబ్ధముచేసి తేజోరూప ప్రద్యుమ్నుని సృజించెను. ప్రద్యుమ్నుడు రసరూపుడగు అనిరుద్ధుని, అనిరుద్ధుడు గంధస్వరూపుడగు బ్రహ్మను సృజించెను. బ్రహ్మ మొట్టమదట జలమును సృజించి, దానిలో పంచభూతములతో కూడిన బంగారు గ్రుడ్డును సృజించెను. ఆ అండమునందు జీవశక్తి సంచారమేర్పడెను. ఆత్మయందు లీనము చేయబడినట్లు మొదట చెప్పబడినది ఈ జీవశక్తియే. జీవశక్తితో ప్రాణమునకు సంయోగమేర్పడినప్పుడు అది 'వృత్తిమతి' అని చెప్పబడును. వ్యాహృతిసమేతుడగు జీవుడు ప్రాణములలో నుండి అధ్యాత్మిక పురుషుడని చెప్పబడుచున్నాడు. వానినుండి ప్రాణయుక్తమగు బుద్ధి పుట్టినది. దీనికి ఎనిమిది వృత్తులుండును.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 194 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 59

🌻Preliminary consecration of an image (adhivāsana) - 1 🌻

The Lord said:


1-4. The act of causing the presence of God Hari is said tobe the adhivāsana (preliminary consecration). Having contemplated on the self as the omniscient, all-pervasive and supreme spirit and having united one’s self-conceited conscious energy with (the syllable) oṃ and after having drawn it out and identifying one’s own self with the all-pervasive lord, (the priest) should unite the earth with the wind, illuminate it with the fire particle (mentally), draw the fire with the wind (particle) and lead the wind into the ethereal space. The wiseman should draw in the same order (the other gross elements) after having made them the receptacles of subtle principles along with the gross principles, the supreme being and the secondary forms such as the sādhyas[1].

5. The ethereal space should be drawn into the mind (principle), the mind (in its turn) should be (drawn) into (the principle of) ego, (the principle) of ego in the (principle of) mahat (first principle). The mahat should be led into the avyākṛta (unmanifest).

6-7. The unmanifest (is led) into the absolute knowledge known as Vāsudeva. Being desirous to create he, the Lord of sound by means of the unmanifest brought into being Saṅkarṣaṇa (the principle) known as touch. He created Pradyumna the form of splendour by agitating the illusion.

8. He created Aniruddha, (consisting of) taste only and Brahmā of the form of smell. That Aniruddha, the Brahmā created water at first.

9. He also laid the golden egg (of the five principles) in that (water). Impregnated with consciousness (this generated) a peculiar force within.

10. The breath united with life force is spoken as existence. The inner being also known as the vyāhṛti[2] is a spiritual entity amidst the five winds (prāṇāḥ [=prāṇa]).


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీమద్భగవద్గీత - 347: 09వ అధ్., శ్లో 09 / Bhagavad-Gita - 347: Chap. 09, Ver. 09

 

🌹. శ్రీమద్భగవద్గీత - 347 / Bhagavad-Gita - 347 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 09 🌴

09. న చ మాం తాని కర్మాణి నిబధ్నన్తి ధనంజయ |
ఉదాసీనవదాసీనమసక్తం తేషు కర్మసు ||

🌷. తాత్పర్యం :

ఓ ధనంజయా! ఈ కర్మయంతయు నన్ను బంధింపదు. నేను తతస్థునివలె ఉండి ఈ భౌతికకర్మలన్నింటి యెడ సదా ఆసక్తిలేనివాడనై యుందును.

🌷. భాష్యము :

భగవానునకు ఎట్టి కర్మము లేదని ఈ విషయమున ఎవ్వరును భావింపరాదు. ఆధ్యాత్మికజగత్తులో అతడు సదా దివ్యకర్మల యందు నిమగ్నుడై యుండును. కనుకనే శ్రీకృష్ణభగవానుడు సదా సచ్చిదానందపూర్ణములైన కర్మలలో నిమగ్నుడైయుండుననియు, భౌతికకర్మలతో అతనికెట్టి సంబంధము లేదనియు బ్రహ్మసంహిత యందు తెలుపబడినది (ఆత్మారామస్య తస్యా స్తి ప్రకృత్యా న సమాగమ: ). భౌతికకర్మలన్నియు అతని వివధశక్తులచే నిర్వహింపబడును. అతడు మాత్రము సృష్టించబడిన జగత్తు యొక్క భౌతికకర్మల యెడ సదా తటస్థుడై యుండును. ఆ తటస్థత్వమే “ఉదాసీనవత్” యను పదము ద్వారా ఇచ్చట తెలుపబడినది. అనగా భౌతికకర్మల యందలి ప్రతి సుక్ష్మంశము పైనను అదుపు కలిగియున్నప్పటికిని అతడు తతస్థుని వలె వర్తించుచుండును. న్యాయస్థానమున కూర్చుండు న్యాయాధికారి ఉదాహరణను ఇచ్చట ఒసగవచ్చును.

అతని ఆజ్ఞచే కొందరికి మరణశిక్ష, ఇంకొందరికి కారాగారవాసము, మరికొందరికి ధనలాభములు వంటివి జరుగుచున్నను అతడు మాత్రము అచ్చట జరుగు లాభనష్టములతో సంబంధములేక తటస్థుడై యుండును. అదే విధముగా జగము యొక్క ప్రతికార్యమందును తన ప్రమేయమున్నప్పటికి భగవానుడు సదా తటస్థుడై యుండును. కనుకనే వేదాంతసూత్రము (2.1.34) “వైషమ్యనైర్ఘృణ్యేన” అని ప్రవచించినది. అనగా శ్రీకృష్ణభగవానుడు భౌతికజగత్తు ద్వంద్వములతో సంబంధములేక వాటికి పరుడై యుండును. అలాగుననే జగత్తు యొక్క సృష్టి, లయములతో కూడా అతనికి సంబంధము లేదు. అనగా జీవులు తమ పూర్వకర్మల ననుసరించి పలువిధములైన జన్మలను పొందుచుండగా, శ్రీకృష్ణభగవానుడు వారితో ఎట్టి జ్యోక్యమును కల్పించుకొనడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 347 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 09 🌴

09 . na ca māṁ tāni karmāṇi nibadhnanti dhanañ-jaya
udāsīna-vad āsīnam asaktaṁ teṣu karmasu


🌷 Translation :

O Dhanañjaya, all this work cannot bind Me. I am ever detached from all these material activities, seated as though neutral.

🌹 Purport :

One should not think, in this connection, that the Supreme Personality of Godhead has no engagement. In His spiritual world He is always engaged. In the Brahma-saṁhitā (5.6) it is stated, ātmārāmasya tasyāsti prakṛtyā na samāgamaḥ: “He is always involved in His eternal, blissful, spiritual activities, but He has nothing to do with these material activities.” Material activities are being carried on by His different potencies. The Lord is always neutral in the material activities of the created world. This neutrality is mentioned here with the word udāsīna-vat. Although He has control over every minute detail of material activities, He is sitting as if neutral.

The example can be given of a high-court judge sitting on his bench. By his order so many things are happening – someone is being hanged, someone is being put into jail, someone is awarded a huge amount of wealth – but still he is neutral. He has nothing to do with all that gain and loss. Similarly, the Lord is always neutral, although He has His hand in every sphere of activity. In the Vedānta-sūtra (2.1.34) it is stated, vaiṣamya-nairghṛṇye na: He is not situated in the dualities of this material world. He is transcendental to these dualities. Nor is He attached to the creation and annihilation of this material world. The living entities take their different forms in the various species of life according to their past deeds, and the Lord doesn’t interfere with them.

🌹 🌹 🌹 🌹 🌹


29 Mar 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 29, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹

శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌺. పండుగలు మరియు పర్వదినాలు : మాసిక దుర్గాష్టమి, Masik Durgashtami 🌺

🍀. శ్రీ గణేశ హృదయం - 15 🍀

16. నానా చతుఃస్థం వివిధాత్మకేన సంయోగరూపేణ నిజస్వరూపమ్ |
పూర్యస్య సా పూర్ణసమాధిరూపా స్వానందనాథం ప్రణమామి చాతః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : స్థానాల మార్పుతో ఏకాగ్రతాసాధన - కొన్ని సమయాల్లో హృదయ స్థానమున, కొన్ని సమయాల్లో శిరస్సున కూర్ధ్వమున, ఏకాగ్రతా సాధన చెయ్యడం వలన చెరుపు లేదు. కాని, ఏస్థానంలో చేసినా దృష్టిని ఆ స్థానమందు లగ్నం చెయ్యాలని కాదు దాని అర్ధం. నీ చైతన్య స్థానమును ఏదో ఒక చోట ఏర్పాటు చేసుకొని అచట ఆ స్థలము పైగాక బ్రహ్మముపై దృష్టి నేకాగ్రం చెయ్యడం అవసరం. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వసంత ఋతువు, ఉత్తరాయణం,

చైత్ర మాసం

తిథి: శుక్ల-అష్టమి 21:09:42 వరకు

తదుపరి శుక్ల-నవమి

నక్షత్రం: ఆర్ద్ర 20:08:40 వరకు

తదుపరి పునర్వసు

యోగం: శోభన 24:12:14 వరకు

తదుపరి అతిగంధ్

కరణం: విష్టి 08:02:58 వరకు

వర్జ్యం: 02:50:54 - 04:37:10

దుర్ముహూర్తం: 11:56:33 - 12:45:34

రాహు కాలం: 12:21:04 - 13:52:58

గుళిక కాలం: 10:49:10 - 12:21:04

యమ గండం: 07:45:22 - 09:17:16

అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:45

అమృత కాలం: 09:02:50 - 10:49:06

సూర్యోదయం: 06:13:28

సూర్యాస్తమయం: 18:28:40

చంద్రోదయం: 11:58:27

చంద్రాస్తమయం: 00:50:27

సూర్య సంచార రాశి: మీనం

చంద్ర సంచార రాశి: జెమిని

యోగాలు: ముసల యోగం - దుఃఖం

20:08:40 వరకు తదుపరి గద యోగం

- కార్య హాని , చెడు

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹