🌹 09, FEBRUARY 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹

🍀🌹 09, FEBRUARY 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 09, FEBRUARY 2023 THURSDAY, గురువారం, బృహస్పతి వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 131 / Kapila Gita - 131 🌹 🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 15 / 3. Salvation due to wisdom of Nature and Jeeva - 15 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 723 / Vishnu Sahasranama Contemplation - 723 🌹 
🌻723. శతమూర్తిః, शतमूर्तिः, Śatamūrtiḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 684 / Sri Siva Maha Purana - 684 🌹 🍀 305. అంకితం / DEDICATION🍀
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 304 / Osho Daily Meditations - 304 🌹 🍀 304. పాతుకు పోవడం / ROOTED 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 431 / Sri Lalitha Chaitanya Vijnanam - 431 🌹 🌻 431. 'మదపాటల గండభూ / 'Madapatala Gandabhu 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹09, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : సంకష్టి చతుర్థి, Sankashti Chaturthi 🌺*

*🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రం - 26 🍀*

26. తమాం సిభిత్త్వావిశదైర్మయూఖైః
సంప్రీణయంతం విదుషశ్చకోరాన్
నిశామయే త్వాం నవపుండరీకే
శరద్ఘనేచంద్రమివ స్ఫురంతమ్ ॥

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మానవ చైతన్యం సర్వసాధారణంగా మానసికాది వ్యాపారాలతో తాదాత్మ్యం చెందే ఉంటున్నా, వాటి నుండి విడివడి వుండే శక్తిని కూడా పెంపొందించుకొని ఉన్నది. పశుపక్ష్యాదులలో ఈ శక్తి పెంపొందినట్లు కనుపించదు. చైతన్యం వికసించిన కొద్దీ ఈ విడివడే శక్తి కూడా వికాసం చెందుతుంది.🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: కృష్ణ చవితి 31:59:20 వరకు
తదుపరి కృష్ణ పంచమి
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 22:28:03
వరకు తదుపరి హస్త
యోగం: సుకర్మ 16:45:56 వరకు
తదుపరి ధృతి
కరణం: బవ 19:11:31 వరకు
వర్జ్యం: 04:07:36 - 05:52:24
దుర్ముహూర్తం: 10:35:21 - 11:21:19
మరియు 15:11:10 - 15:57:09
రాహు కాలం: 13:56:28 - 15:22:40
గుళిక కాలం: 09:37:53 - 11:04:05
యమ గండం: 06:45:30 - 08:11:41
అభిజిత్ ముహూర్తం: 12:08 - 12:52
అమృత కాలం: 14:36:24 - 16:21:12
సూర్యోదయం: 06:45:30
సూర్యాస్తమయం: 18:15:04
చంద్రోదయం: 21:14:35
చంద్రాస్తమయం: 09:00:04
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: మతంగ యోగం - అశ్వ లాభం
22:28:03 వరకు తదుపరి రాక్షస యోగం
- మిత్ర కలహం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కపిల గీత - 131 / Kapila Gita - 131 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 15 🌴*

*15. మన్యమానస్తదాత్మానమనష్టో నష్టవన్మృషా|*
*నష్ఠేఽహంకరణే ద్రష్టా నష్టవిత్త ఇవాతురః॥*

*తాత్పర్యము : జాగ్రదావస్థ యందు ఆత్మ సర్వమునకు ద్రష్టగా అనుభవము కలుచున్నది. కాని సుషుప్తి అవస్థ యందు ఆత్మకు ఉపాధిభూతమైన అహంకారము నశించుటవలన భ్రమపడి తానే నశించినట్లుగా భావించును. తన ధనము పోయిన వ్యక్తి, తానే పోయినట్లుగా తలపోసి మిగుల దుఃఖించును. అట్లే అజ్ఞాని తాను నిద్రలో నశించి పోయినట్లుగా భావించును.*

*వ్యాఖ్య : శరీరాదులు నిద్రపోతే ఆత్మ నిద్రపోతున్నట్లు ఎలా కనపడుతుంది. నశించని వాడు కూడా నశించిన వాడిలా కనిపిస్తాడు. శరీరం నిద్రపోతే ఆత్మ కూడా నిద్రపోయినట్లు అనిపిస్తుంది. ఎలా అంటే డబ్బు మొత్తం పోయిన వాడు "డబ్బు లేకపోతే నేను లేనట్లే" అని ఎలా అనుకుంటాడో (వాడే పోయినట్లు ఎలా అనుకుంటాడో), అహంకారం పోయిన వాడు, తానే పోయాను అనుకుంటాడు. అహంకారం నశించినప్పుడు కూడా వాడే ద్రష్ట. ఇది శరీరం కాదు, ఆత్మ, అని చెప్పేవాడు కూడా వాడే.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 131 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 15 🌴*

*15. manyamānas tadātmānam anaṣṭo naṣṭavan mṛṣā
naṣṭe 'haṅkaraṇe draṣṭā naṣṭa-vitta ivāturaḥ

*MEANING : The living entity can vividly feel his existence as the seer, but because of the disappearance of the ego during the state of deep sleep, he falsely takes himself to be lost, like a man who has lost his fortune and feels distressed, thinking himself to be lost.*

*PURPORT : Only in ignorance does a living entity think that he is lost. If by attainment of knowledge he comes to the real position of his eternal existence, he knows that he is not lost. An appropriate example is mentioned herein: naṣṭa-vitta ivāturaḥ. A person who has lost a great sum of money may think that he is lost, but actually he is not lost-only his money is lost. But due to his absorption in the money or identification with the money, he thinks that he is lost. Similarly, when we falsely identify with matter as our field of activities, we think that we are lost, although actually we are not. As soon as a person is awakened to the pure knowledge of understanding that he is an eternal servitor of the Lord, his own real position is revived. A living entity can never be lost. When one forgets his identity in deep sleep, he becomes absorbed in dreams, and he may think himself a different person or may think himself lost. But actually his identity is intact. This concept of being lost is due to false ego, and it continues as long as one is not awakened to the sense of his existence as an eternal servitor of the Lord. The Māyāvādī philosophers' concept of becoming one with the Supreme Lord is another symptom of being lost in false ego. One may falsely claim that he is the Supreme Lord, but actually he is not. This is the last snare of māyā's influence upon the living entity. To think oneself equal with the Supreme Lord or to think oneself to be the Supreme Lord Himself is also due to false ego.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 723 / Vishnu Sahasranama Contemplation - 723🌹*

*🌻723. శతమూర్తిః, शतमूर्तिः, Śatamūrtiḥ🌻*

*ఓం శతమూర్తయే నమః | ॐ शतमूर्तये नमः | OM Śatamūrtaye namaḥ*

*నానా వికల్పజా విష్ణోర్మూర్తయస్సంవిదాకృతేః ।*
*సన్తీతిత్యయం శతమూర్తిరితి సఙ్కీర్త్యతే హరిః ॥*

*నానా వికల్పములచే కలిగిన, కలుగబోవు అనేక మూర్తులు శుద్ధానుభవరూపుడగు ఈతనికి కలవు కనుక ఆ విష్ణువు శతమూర్తిః.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 723🌹*

*🌻723. Śatamūrtiḥ🌻*

*OM Śatamūrtaye namaḥ*

नाना विकल्पजा विष्णोर्मूर्तयस्संविदाकृतेः ।
सन्तीतित्ययं शतमूर्तिरिति सङ्कीर्त्यते हरिः ॥

*Nānā vikalpajā viṣṇormūrtayassaṃvidākr‌teḥ,*
*Santītityayaṃ śatamūrtiriti saṅkīrtyate hariḥ.*

*He whose form is pure consciousness has many forms created by His own thought.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् ।अनेकमूर्तिरव्यक्तश्शतमूर्तिश्शताननः ॥ ७७ ॥
విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।అనేకమూర్తిరవ్యక్తశ్శతమూర్తిశ్శతాననః ॥ 77 ॥
Viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān,Anekamūrtiravyaktaśśatamūrtiśśatānanaḥ ॥ 77 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 684 / Sri Siva Maha Purana - 684 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 02 🌴*
*🌻. త్రిపుర వర్ణనము - 4 🌻*

ఓ బ్రహ్మా! అయిదు దినములలో నిశ్చితముగా మృత్యువుచే కబళింపబడువానికి ఈ సర్వము వ్యర్ధమే గదా! మా నిశ్చయ మిట్లున్నది (34).

సనత్కుమారుడిట్లు పలికెను -

తపశ్శాలురగు ఆ రాక్షసుల ఈ మాటలను విని బ్రహ్మ తన ప్రభువు మరియు కైలాసవాసి యగు శివుని స్మరించి ఇట్లు పలికెను (35).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ రాక్షసులారా! సర్వథా మరణము లేకపోవుట సంభవము కాదు. కావున ఈ కోరికనుండి విరమించుకొనుడు. మీకు నచ్చిన మరియొక వరమును కోరుకొనుడు(36). ఓ రాక్షసులారా! భూలోకములో ఎక్కడనైననూ ఇంతకు ముందు పుట్టిన ప్రాణులు గాని, పుట్టబోవు ప్రాణులు గాని ఎవ్వరైననూ జరామరణములు లేనివారు లేరు, ఉండబోరు. ఇది నిశ్చయము (37). కాలునకు కాలుడగు శివుడు, మరియు విష్ణువు తక్క ఇతరులకు మరణము తప్పదు. వారు ధర్మాధర్మములకు అతీతులు, నిర్గుణులు, సగుణరూపమును స్వీకరించినవారు (38). జగత్తును పీడించుట కొరకు తపస్సును చేసినచో, దాని ఫలము చేయి జారి పోవునని ఎరింగి, తపస్సును యోగ్యమగు ఫలము కొరకు చేయదగును (39).

ఓ పుణ్యాత్ములారా! మీరు మీ బుద్ధితో స్వయముగా విచారించుడు. దేవతలకు గాని, రాక్షసులకు గాని పొంద శక్యము గాని దుర్లభమగు వరమును గోరి మృత్యువును ప్రక్కన బెట్టుడు (40). కావున బుద్దిని ఉపయోగించి ఏయే కారణముల వలన మరణము సంభవమో, వాటన్నింటి నుండి వేర్వేరుగా రక్షణ కల్గునట్లు వరమును కోరి ఆ మృత్యుహేతువుల నుండి రక్షణను పొందుడు(41).

సనత్కుమారుడిట్లు పలికెను -

వారు బ్రహ్మ గారి ఈ మాటలను విని, ముహూర్తకాలము ధ్యానమునందు నిమగ్నులై, తరువాత మరల ఆలోచించి, సర్వలోకములకు పితామహుడగు బ్రహ్మతో నిట్లనిరి(42).

రాక్షసులిట్లునిరి-

హే భతవాన్‌! మేము పరాక్రమ వంతులమే అయిననే, మాకు సుఖముగా నివసించదగిన, శత్రువులు ముట్టడించ శక్యము కాని గృహము లేదు (43). మిక్కిలి అద్భుతమైనవి, సర్వసంపదలతో సంపన్నమైనవి, దేవతలకు జయింపశక్యము కానివి అగు మూడు నగరములను నిర్మించి మాకు ఇమ్ము (44). ఓ లోకనాథా! జగద్గురూ! మేము ఆ నగరములను అధిష్ఠించి నీ అనుగ్రహముచే ఈ భూమినంతనూ పరిభ్రమించెదము (45). అపుడు తారకాక్షుడిట్లనెను: విశ్వకర్మ దేవతలకైననూ భేదింపశక్యము కాని బంగారు వికారమైన నగరమును నాకు నిర్మించి ఇచ్చుగాక! (46)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 684🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 01 🌴*

*🌻 Description of Tripura (the three cities) - 4 🌻*

34. If one is to be swallowed by death in five days, O Brahmā, everything else belonging to him is futile. This is our decisive thought.

Sanatkumāra said:—
35. On hearing the words of those ascetic Asuras, Brahmā replied to them after remembering Śiva, his lord.

Brahmā said:—
36. O Asuras, there cannot be invariable indestructibility. Please desist from asking for it. Seek some other boon whatever you wish.

37. O Asuras, a creature is born, dies and will be born surely. But no one will be free from old age or death in this world.

38. Except Śiva the destroyer of Death, and Viṣṇu all else are mortals. These two are the supervisers of virtue and evil and have manifest and unmanifest forms.

39. If penance is performed for the harassment of the world, it shall be understood as gone. It is only a well-performed penance that can be fruitful.

40. Ponder over this keenly, O faultless ones, desist from seeking immortality. Immortality is impossible for the gods and the Asuras. It is inaccessible. It cannot be warded off.

41. Hence choose a boon whereby you shall do something equal to your own strength.[2]

Sanatkumāra said:—
42. On hearing the words of Brahmā, they thought for a while and then replied to the grandfather of all the worlds.

The Asuras said:—
43. O lord, we have no mansion where we can stay happily although we are valorous and invincible to our enemies.

44. Build and give us three wonderful cities richly endowed with wealth and unassailable even to the gods.

45. O Preceptor of the universe, Lord of the worlds, by your grace we shall move about on the earth occupying these cities.

46. Tārakākṣa then said—“Let Viśvakarmā make a city which cannot be broken even by the gods. Let that golden city be mine”.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 305 / Osho Daily Meditations - 305 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 305. అంకితం 🍀*

*🕉. జీవితం అంకితం కావాలి; అప్పుడు మాత్రమే అర్థం ఉంటుంది, అంకితం ద్వారా అర్థం వస్తుంది. అంకిత వస్తువు ఎంత గొప్పగా ఉంటుందో దాని అర్ధం కూడా అంత గొప్పగా ఉంటుంది. 🕉*

*దేశాలకు అంకితమైన వ్యక్తులు ఉన్నారు --మాతృభూమికి. ఒక దేశం లొంగిపోవడానికి చాలా చిన్న విషయం, మరియు మూర్ఖత్వం. కొంతమంది అడాల్ఫ్ హిట్లర్ లాంటి వాళ్లు ఈ లొంగిపోవడాన్ని ఉపయోగించు కుంటారు. ప్రపంచంలో అనేక రకాల ధర్మాలకు అంకితమైన వ్యక్తులు ఉన్నారు. ఇవి దేశాల కంటే మెరుగైనవి,*

*కానీ అవి ఇప్పటికీ ఒక సిద్ధాంతం, మతం, మానవ నిర్మిత వస్తువులే. అవి ప్రాథమికంగా మానవాళిని విభజించేవి. ఒకరు క్రిస్టియన్ అవుతాడు, మరొకడు హిందువు అవుతాడు, విభజన ఉంది, సంఘర్షణ ఉంది, హింస ఉంది - మరియు దానిలోని విడ్డూరం ఏమిటంటే ప్రేమ పేరుతో హింస! కాబట్టి విభజించే దేనికీ మిమ్మల్ని మీరు అంకితం చేసుకోకండి.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 305 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 305. DEDICATION 🍀*

*🕉. Life has to become a dedication; only then is there meaning, Meaning comes through dedication, and the greater the object of dedication, the greater will be the meaning. 🕉*

*There are people who are dedicated to countries--the fatherland, the motherland. A country is a very tiny thing to surrender to, and foolish, and some Adolf Hitler will exploit this surrendering. Then there are people who are dedicated to different righteousness of the world.*

*These are better than countries, but they are still a dogma, a creed, a manmade thing, and something that basically divides humanity. One becomes a Christian, another becomes a Hindu, and there is division, there is conflict, there is violence--and the irony of it is that the violence is in the name of love! So never dedicate yourself to anything that divides.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 431 / Sri Lalitha Chaitanya Vijnanam - 431 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 92. మదఘూర్ణిత రక్తాక్షీ, మదపాటల గండభూః ।*
*చందన ద్రవదిగ్ధాంగీ, చాంపేయ కుసుమ ప్రియా ॥ 92 ॥ 🍀*

*🌻 431. 'మదపాటల గండభూ🌻* 

*మదముచే ఎఱుపు, తెలుపు రంగు గల చెక్కిళ్ళు గలది శ్రీమాత అని అర్థము. శ్రీమాత చెక్కిళ్ళు పద్మరాగ శిలల వలె మెఱయు చుండునని 23వ నామమున* తెలుపబడినది. పద్మరాగ శిలలు ఎఱుపు నుండి లేత గులాబి రంగులో సున్నితము, సుకుమారము, సౌందర్యము కూడగట్టుకొని యుండును. అట్లే పాటలీ పుష్పములు గూడ అదే వర్ణము, సౌందర్యము, కాంతి కలిగి యుండును.*

*అమ్మ కాంతివంతమైన చెక్కిళ్ళకు అంతరంగము నుండి శివుని స్పర్శ తగులగా చెక్కిళ్ళు తెలుపు ఎఱుపు కాంతులతో అతిశయించిన అందము కలిగి యుండును. కామేశ్వరుని గ్రహించుట చేత అమ్మ యందు ఈ ఎఱ్ఱని కాంతి కన్నుల యందు, చెక్కిళ్ళ యందు, పెదవుల యందు ప్రకాశించు చుండును. శ్రీమాత సహజముగ దర్పణము వంటిది. ఆమె యందు శివుని ప్రతిబింబమే ప్రకాశించుట వలన ఈ విధమగు సౌందర్యము ఆమె ప్రత్యేకత.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 431 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 92. Madagharnita raktakshi madapatala gandabhuh*
*Chandana drava digdhangi chanpeya kusumapriya ॥ 92 ॥ 🌻*

*🌻 431. 'Madapatala Gandabhu🌻*

*Srimata's bliss makes Her cheeks glow in shades of pink and white. It is stated in the 23rd name* that Srimata's cheeks shine like Padmaraga stones. Padmaraga rocks range from red to pale pink in color and are delicate and beautiful. In the same way, Patali flowers also have the same color, beauty and light.*

*Amma's shining cheeks are touched by Lord Shiva from within, and the they have an exaggerated beauty with white and red shades. This red light shines in Amma's eyes, cheekbones and lips due to the realization of Kameshwara. Srimata is like a mirror. This kind of beauty is her specialty because the reflection of Lord Shiva shines in her.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

Siva Sutras - 037 - 12. Vismayo yogabhūmikāḥ - 2 / శివ సూత్రములు - 037 - 12. విస్మయో యోగభూమికాః - 2


🌹. శివ సూత్రములు - 037 / Siva Sutras - 037 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

1- శాంభవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 12. విస్మయో యోగభూమికాః - 2🌻

🌴. యోగా యొక్క దశలు ఒక అద్భుతం 🌴


ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నప్పుడు, అతను తెలిసిన మూడు స్థాయి చైతన్యాలను అధిగమించి తదుపరి ఉన్నత స్థాయి చైతన్యం అయిన తుర్యా దశకు చేరుకోవాలి. అతను అత్యున్నత స్థాయి చైతన్యంలో మాత్రమే శివుడిని గ్రహించగలడు, అంటే అతని ఏకాగ్రత పూర్తిగా శివునిపై మరియు శివునిపై మాత్రమే కేంద్రీకరించబడాలి. మరేదైనా ఆలోచనలు అతని మనస్సులో ప్రవహిస్తే, అతను సంపూర్ణతను గ్రహించలేడు.

అతను గణనీయమైన పురోగతి సాధించినప్పుడు, అతను ఆనందించే ఆనంద స్థాయి కూడా బలంగా మారుతుంది. అతనిని శివుని వైపుకు లాగుతుంది. అతను ఆ ఆనందాన్ని రుచి చూడటం ప్రారంభించినప్పుడు, అతను అత్యున్నత ఆనందం లేదా ఆశ్చర్యాలతో నిండిన ఆనందం యొక్క దశలో మునిగిపోతాడు. అతను ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే అతను ఇంతకు ముందు అలాంటి ఆనందాన్ని అనుభవించలేదు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 037 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 1 - Sāmbhavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 12. Vismayo yogabhūmikāḥ - 2 🌻

🌴. The stages of yoga are a wonder 🌴


When a person progresses spiritually, he has to make a beginning to transcend the three known level of consciousness to the next higher level of consciousness, the turya stage. He can realize Shiva only in the highest level of consciousness, which means that his concentration should be totally focused on Shiva and Shiva alone. If any other thoughts impregnate his mind, he will not be able to realize the Absolute.

When he makes significant progress, the level of bliss that he enjoys also becomes strong and pulls him further towards Shiva. When he begins to taste the bliss, he gets engrossed in the stage of supreme happiness or ānandā that is full of surprises. He is surprised because, he has not experienced that kind of ānandā earlier.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹




నిర్మల ధ్యానాలు - ఓషో - 300


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 300 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. హృదయపూర్వకమైన నవ్వు అసాధారణమైంది. అదే నిన్ను పవిత్రీకరిస్తుంది. ప్రార్థన కన్నా నువ్వు ద్వారా నువ్వు అస్తిత్వానికి సన్నిహితం కావడం చూసి ఆశ్చర్యపోతావు. 🍀


ఉత్సాహంగా వుండు. మత భావనతో వుండడానికి నా నిర్వచనమది. విషాదంగా వుండడమంటే తప్పు చేసిన వాడుగా వుండడం. ఉత్సాహంగా వుండడమంటే సన్యాసిగా వుండడమే. నువ్వు హృదయపూర్వకంగా నవ్వితే నీ జీవితం పవిత్రం కావడం మొదలవుతుంది.

హృదయపూర్వకమైన నవ్వు అసాధారణమైంది. అదే నిన్ను పవిత్రీకరిస్తుంది. తల నించీ పాదం దాకా నవ్వు ప్రసరిస్తుంది. అది మరింత గాఢంగా నీ లోలోతుల్లో నీ అస్తిత్వ కేంద్రాన్ని తాకనీ. అప్పుడు నువ్వు ఆశ్చర్యపడతావు. ప్రార్థన కన్నా నువ్వు ద్వారా నువ్వు అస్తిత్వానికి సన్నిహితం కావడం చూసి ఆశ్చర్యపోతావు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

DAILY WISDOM - 35 - 4. Life in Itself is . . . / నిత్య ప్రజ్ఞా సందేశములు - 35 - 4. మనలోని జీవితం . . .


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 35 / DAILY WISDOM - 35 🌹

🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 4. మనలోని జీవితం అంతరమూ, బాహ్యమూ రెండూ కాదు🌻


మన జీవితం, అది అంతరంలో అయినా లేదా బాహ్యమైనా, ఒక శ్రేణిని కలిగి ఉంటుంది. ఇది ఘన పదార్థం కాదు. మన ఉనికి కదలని గట్టి రాయి లాంటిది కాదు. ఇది ఒక ప్రవాహం. ధోరణుల, కదలికల, సంస్థల యొక్క శ్రేణి. ఇది ఆచరణాత్మకంగా లోపలి మరియు బాహ్య దశలుగా విభజించబడింది. స్వతహాగా జీవితం అంతరమైనది లేదా బాహ్యమైనది కాదు. ఇది ప్రతిచోటా ఉంది. కానీ సౌలభ్యం కొరకు మనం గది లోపల ఉన్నామని చెప్పుకున్నట్లే, లోపల మరియు బయట అనే తేడాను చూపుతాము.

కానీ ఈ 'లోపల' అనే ఆలోచన చుట్టూ గోడ కారణంగా పుడుతుంది; గోడ ఉండకపోతే లోపల ఉన్నామని చెప్పుకోము. మనం భూమి యొక్క ఉపరితలంపై మాత్రమే ఉన్నాము, కానీ నాలుగు వైపులా గోడలు ఉన్నాయనే స్పృహ ఉన్నందున, లోపల అనే ఒక స్పృహ మరియు వెలుపలి అనే ఒక స్పృహ కూడా ఉన్నాయి. బయటి నుండి లోపలిని వేరుచేసే గోడ ఉంటే తప్ప, లోపల లేదా వెలుపల నిజంగా లేనట్లే, అంతర్గత జీవితం మరియు బాహ్య జీవితం వంటివి నిజంగా లేవు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 35 🌹

🍀 📖 Philosophy of Yoga 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 4. Life in Itself is Neither Inward nor Outward 🌻


Our life, whether it is inner or outer, consists of a series. It is not a solid substance. Our existence is not like a hard stone which is immovable and motionless. It is a flux, a series of tendencies, movements, enterprises, etc., which get practically bifurcated into the inward and the outward phases. Life in itself is neither inward nor outward. It is everywhere. But for convenience’s sake we make this distinction of being inside and outside, just as we say we are inside the room.

But this ‘inside’ idea arises on account of the wall around; if the wall were not to be there, we would not say that we are inside. We are just on the surface of the Earth, but because there is a consciousness of walls on the four sides, there is also a consciousness of an inside and conversely a consciousness of an outside. There is really no such thing as inner life and outer life, just as there is really no inside or outside, unless there is a wall which separates the inside from the outside.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ మదగ్ని మహాపురాణము - 170 / Agni Maha Purana - 170


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 170 / Agni Maha Purana - 170 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 52

🌻. చతుఃషష్టి యోగిన్యాది లక్షణములు - 2 🌻


తూర్పుదిక్కు నుండి అగ్నేయము వరకు, విలోమ క్రమమున, అన్ని దిక్కులందును భైరవుని స్థాపించి క్రమముగ పూజింపవలెను. బీజమంత్రమును ఎనిమిది దీర్ఘస్వరములలో ఒక్కొక్క దానిచేత విడగొట్టి, అనుస్వార యుక్తము చేసి, ఆయా దిక్కునందున్న భైరవునితో కలిపి అన్నింటికి చివర 'సమః' చేర్చవలెను.

ఉదా. ''ఓం హ్రాం భైరవాయనమః - ప్రాచ్యామ్‌, ఓం హ్రీం భైరవాయనమః- ఐశాన్యామ్‌; ఓం హ్రూం భైరవాయనమః- ఉదీచ్యామ్‌; ఓం హ్రేం భైరవాయ నమః - వాయవ్యే; ఓం హ్రైం భైరవాయ నమః-ప్రతిచ్యామ్‌ ఓం హ్రోం భైరవాయనమః -నైరృత్యామ్‌; ఓం హ్రౌం బైరవాయ నమః అవాచ్యామ్‌; ఓం హః అగ్నేయ్యామ్‌''

ఈ విధముగ మంత్రోచ్చారణ చేయుచు ఆయా దిక్కులలో భైరవ పూజ చేయవలెను. వీటిలో ఆరు బీజమంత్రములతో షడంగన్యాసము చేసి ఆ అంగముల పూజ చేయవలెను. ధ్యానము ఈ విధముగ చేయవలెను. ''భైరవుడు అగ్నేయ దళమునందు విరాజిల్లుచు, బంగారు నాలుకతోడను, నాద-బిందు, చంద్రులతోడను, మాతృకాధి పత్యంగము తోడను ప్రకాశించుచున్నాడు. (అట్టి బైరవునకు నమస్కారము). వీరభద్రుడు వృషభారూఢుడు. మాతృకామండల మధ్యమున నుండును. నాలుగు హస్తములు. గౌరికి రెండు హస్తములు మూడు నేత్రములు. ఒక హస్తము నందు శూలము, రెండవ దానిలో దర్పణము ఉండును. లలితా దేవి కమలముపై కూర్చుండను. నాలుగు భుజములలో త్రిశూలము, కమండలువు, కుండి, వరదాన ముద్ర ధరించి యుండును.

స్కందుని అనుసరించి యుండు మాతృకా గణము చేతులలో దర్పణము. శలాక ఉండును. చండికకు పది భుజములుండును. కుడి చేతులలో బాణ - ఖడ్గ - శూల - చక్ర, శక్తులను ధరించి యుండును. వానుహస్తములలో నాగపాశ - చర్మ - అంశుశ - కుఠార - ధనస్సులను ధరించును. సింహాధిరూఢయైన ఆ దేవి ఎదుట శూలముచే చంపబడిన మహిషాసురుని శవము పడి యుండును.

అగ్ని మహా పురాణమునందు చతుఃషష్టి యోగిన్యాది లక్షణమును ఏబది రెండవ అధ్యాయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 170 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 52

🌻Characteristics of images of different forms of goddesses - 2 🌻


12. One has to worship him being endowed with the letters of the alphabet upto the letter ‘ra’ and with (his mantra) having six constituents and the eight long vowel mantras.

13. (He is also to be contemplated upon) as established in the wicks of the flame in the house as endowed with golden ornaments and the nāda, bindu and indu[2] and making the body of the divine mother and the lord radiant.

14. Vīrabhadra (attendant of Śiva) (is represented) as having four faces, seated on a bull in front of the mother (goddesses). (Goddess) Gauri (consort of Śiva) (is represented) as having two arms and three eyes as endowed with a spear and mirror.

15. (Goddess) Lalitā (a form of Durgā) (should be represented) as having tour arms (holding) a spear, a small pitcher, (and another) pitcher (in the hands) and showing boonconferring hands. (She should) be seated on the lotus. (She should also) be endowed with a mirror, a small stick for applying collyrium and Skanda and Gaṇa (Gaṇeśa).

16. (Goddess) Caṇḍikā may (be represented) as having ten hands having a sword, spear, disc (and) dart in the right (hand) and the magical noose, shield, pike, axe, and bow in the left (hand). (She must) be riding a lion with the buffalo (demon) having been slain with (her) spear in front of her.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీమద్భగవద్గీత - 323: 08వ అధ్., శ్లో 13 / Bhagavad-Gita - 323: Chap. 08, Ver. 13

 


🌹. శ్రీమద్భగవద్గీత - 323 / Bhagavad-Gita - 323 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 13 🌴


13. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్ |
య: ప్రయాతి త్యజన్దేహం స యాతి పరమాం గతిమ్ ||

🌷. తాత్పర్యం :

ఈ యోగవిధానము నందు నెలకొని దివ్యాక్షరముల సమాహారమైన ఓంకారమును జపించిన పిదప మనుజుడు దేవదేవుడైన నన్ను తలచుచు శరీరమును త్యజించినచో నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకములను పొందగలడు.

🌷. భాష్యము :

ఓంకారము, బ్రహ్మము, శ్రీకృష్ణభగవానుడు అభిన్నులని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. శ్రీకృష్ణుని నిరాకారశభ్ధ రూపమే ఓంకారము. కనుకనే శ్రీకృష్ణుని నామమే అయిన హరేకృష్ణ మాహామంత్రమునందును ఓంకారము కలదని చెప్పవచ్చును. ఆ మహామంత్ర జపమే కలియుగమునకు ప్రత్యేకముగా ఉపదేశింపబడినది.

కనుక మనుజడు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యని కీర్తనము, జపము చేయచు దేహత్యాగము చేసినచో తన భక్తిలక్షణముల ననుసరించి ఏదియో ఒక ఆధ్యాత్మికలోకమును నిశ్చయముగా చేరగలడు. అనగా కృష్ణభక్తులు కృష్ణలోకమైన గోలోకబృందావనమును చేరుదురు. సాకారవాదులైన భక్తులకు ఆధ్యాత్మికజగమున ఇంకను వైకుంఠలోకనామమున తెలియబడు అసంఖ్యాక లోకములు లభ్యమై యున్నవి. కాని నిరాకారవాదులు మాత్రము అంత్యమున బ్రహ్మజ్యోతి యందు లీనమగును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 323 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 13 🌴


13 . oṁ ity ekākṣaraṁ brahma vyāharan mām anusmaran
yaḥ prayāti tyajan dehaṁ sa yāti paramāṁ gatim

🌷 Translation :

After being situated in this yoga practice and vibrating the sacred syllable oṁ, the supreme combination of letters, if one thinks of the Supreme Personality of Godhead and quits his body, he will certainly reach the spiritual planets.

🌹 Purport :

It is clearly stated here that oṁ, Brahman and Lord Kṛṣṇa are not different.

The impersonal sound of Kṛṣṇa is oṁ, but the sound Hare Kṛṣṇa contains oṁ. The chanting of the Hare Kṛṣṇa mantra is clearly recommended for this age.

So if one quits his body at the end of life chanting Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare, he certainly reaches one of the spiritual planets, according to the mode of his practice.

The devotees of Kṛṣṇa enter the Kṛṣṇa planet, Goloka Vṛndāvana. For the personalists there are also innumerable other planets, known as Vaikuṇṭha planets, in the spiritual sky, whereas the impersonalists remain in the brahma-jyotir.

🌹 🌹 🌹 🌹 🌹

08 Feb 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 08, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹

శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺

🍀. శ్రీ గణేశ హృదయం - 9 🍀


9. వేదాః పురాణాని మహేశ్వరాదికాః
శాస్త్రాణి యోగీశ్వరదేవమానవాః |

నాగాసురా బ్రహ్మగణాశ్చ జంతవో
ఢుంఢంతి వందే త్వథ ఢుంఢిరాజకమ్

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : మనశ్చైతన్యం - చైతన్యరూపమైన పరతత్త్వం తన శక్తి నుండి తాను వేరై దాని కార్యమును తిలకిస్తూ ప్రకృతి సాక్షియగు పురుషుడుగా నుండగలదు. అట్లే మనశ్చైతన్యం కూడా తన శక్తి నుండి తాను వేరై దాని కార్యములను... అనగా యోచనలు, భావనలు మున్నగు వాటిని సాక్షిగా తిలకిస్తూ ఉండగలదు. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌, శిశిర ఋతువు,

ఉత్తరాయణం, మాఘ మాసం

తిథి: కృష్ణ తదియ 30:24:25 వరకు

తదుపరి కృష్ణ చవితి

నక్షత్రం: పూర్వ ఫల్గుణి 20:15:44

వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి

యోగం: అతిగంధ్ 16:30:17 వరకు

తదుపరి సుకర్మ

కరణం: వణిజ 17:26:24 వరకు

వర్జ్యం: 02:36:20 - 04:22:12

మరియు 28:06:54 - 29:51:46

దుర్ముహూర్తం: 12:07:17 - 12:53:11

రాహు కాలం: 12:30:14 - 13:56:19

గుళిక కాలం: 11:04:09 - 12:30:14

యమ గండం: 08:11:58 - 09:38:03

అభిజిత్ ముహూర్తం: 12:08 - 12:52

అమృత కాలం: 13:11:32 - 14:57:24

సూర్యోదయం: 06:45:52

సూర్యాస్తమయం: 18:14:36

చంద్రోదయం: 20:26:20

చంద్రాస్తమయం: 08:26:31

సూర్య సంచార రాశి: మకరం

చంద్ర సంచార రాశి: సింహం

యోగాలు: స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ

ఫలం 20:15:44 వరకు తదుపరి వర్ధమాన

యోగం - ఉత్తమ ఫలం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹