సర్వయోగ సమన్వయము -గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 45


🌹 సర్వయోగ సమన్వయము -గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 45 🌹
45 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 ఆత్మదర్శనము - 2 🍃

335. సమస్త ప్రాణులందును ఆత్మ వున్నది. శరీరము, ఇంద్రియములు, మనస్సు అను వాటితో ఆత్మ కలిసి పోయి ఉన్నది. అయినప్పటికి వాటన్నింటికి సాక్షిగా అతీతముగా ఆత్మ ఉన్నది. మనవరుకు చూస్తే దేహమే దేవాలయము. అందులో ఆత్మయె పరమాత్మ.

336. హృదయకమలమే ఆత్మ స్థానము. సూత్రమునందు మణులు ఉన్నట్లు, అన్ని శరీరము లందు ఆత్మ స్వయం ప్రకాశమై ఉన్నది. హృదయము నందు దాని మధ్యలో ఒక సూక్ష్మ రంధ్రము కలదు. అందులో సర్వ రూపుడగు పరమాత్మ జీవాత్మల రూపములో నిక్షిప్తమై వున్నది. అది ఒక ప్రకాశవంతమైన జ్వాల. సాధకుడు ఆత్మానుభవముతో, ఆత్మగా అందరిలోనూ తానే ఉన్నట్లు తెలిసినచో, అది సూత్రాత్మ అనుభవము.

337. జీవునికి గల ఆయుః ప్రమాణము పూర్తి అయిన తరువాత ఆత్మ శరీరమును వదులుచున్నది. పాము కుబుసము విడిచిన పిదప ఆ కుబుసముతో సంబంధము లేనట్లు శరీరమును వదలును. జలమునందు గల ఆత్మ ఆ సమయములో తన చుట్టూ గల జలము కొద్ది కొద్దిగా తగ్గుచూ పూర్తిగా ఇంకిపోయిన తరువాత ఆత్మ శరీరమును వదలుచున్నది. నాలుక ఎండిపోవును. మరణించు సమయమున తులసి తీర్ధము పోయుటకు కారణము అదే. మెరుపు తీగవలె అది అతి సూక్ష్మముగా ఉండును. ఆత్మకు నారాయణుడని పేరు. నారములనగా జలము అని అర్ధము. ఈ విధముగా జలమునందుండువాడు కనుక నారాయణుడని అంటారు.

338. అంగుష్టము వలె ఆత్మ ఉన్నది. హృదయ గుహ యందు కలదు. మనస్సునకు అనేక తలంపులు కలుగుచుండును. తలంపునకు తలంపునకు మధ్య రేప్పవాల్చునంత క్షణము మాత్రము బయలుగా ఉండును. ఆ స్థలమేదో అదే ఆత్మ క్షేత్రము. దానినే చిదాకాశము అంటారు.

339. ఆత్మ శరీరమందలి అన్ని ప్రదేశములందును సంచరించుచుండును. కాని అందు ముఖ్యమైనవి 1) హృదయ కమలము 2) భ్రూమధ్యము 3) బ్రహ్మ కపాలము. ఇవి యోగసాధనా కేంద్రములు. అందుకే భక్తులు ఈ ప్రదేశములందు విభూతి, తిలకాలను ఉంచుతుంటారు.

340. శిశు రూపమును తయారుచేయునది ఆత్మసత్తాయే. శిశువు హృదయ కమలమందు ఏడవ నెలలో జీవి ప్రవేశించును. సృష్టిలోకి ప్రవేశించిన ఇట్టి జీవాత్మ పరమాత్మలో ఐక్యమై నప్పుడు తిరిగి ఆ జీవుడికి జన్మలుండవు.

341. జీవాత్మ శరీరమును, ఇంద్రియములు తానే అని తలచును. కాని పరమాత్మకు వీటితో సంబంధములేక సాక్షిగా ఉండి గమనించును. ప్రతి జీవి యొక్క బీజము పరమాత్మయే. దేహభావన తొలగిన జీవుడు పరమాత్మను పొందును.

342. జీవుడను పక్షి కర్మఫలములను అనుభవించుటకు బందీయైఉన్నాడు. రెండవ పక్షి అయిన ఈశ్వరుడు వాటిని అనుభవించక కేవలము సాక్షిభూతుడై ఉన్నాడు. నాడులందు తిరుగాడుచున్న ప్రాణమే జీవుడు. జీవుడు త్రిగుణములు, సకలేంద్రియములు, వికారములు, స్థూల సూక్ష్మ కారణ శరీరములు, అరిష్వర్గములతో కూడి ఉండును. వీటి నుండి విడుదలయైన జీవుడే పరమాత్మ.

343. సృష్టి యందలి సర్వము బ్రహ్మ స్వరూపములే. జీవుడు ఆ సమస్తములోని వాడగుటచే అట్టి వాడు కూడా బ్రహ్మమే అగును. జీవుడు ఆత్మ స్వరూపుడు. దేహ రక్షణకై నిరంతరము కర్మలు చేయుచుండును. అజ్ఞాని తెలియక, తానువేరు, బ్రహ్మమువేరు అని తలచును.

344. పరబ్రహ్మ యొక్క సూక్ష్మ రేణువులైన కలాపములే జీవుడుగా రూపొందును. జీవునిలోని ఆత్మ స్వయం ప్రకాశమై శరీరమును నడిపించుచున్నది. తాను సాక్షిగా ఉంటుంది. ఆత్మ దర్శనము పొందిన జీవునికి త్రిమూర్తులు వశమగుదురు.

🌹 🌹 🌹 🌹 🌹


22.Apr.2019

🌹 పరమాత్మలో ఐక్యత సాధ్యమా? 🌹

🌹  పరమాత్మలో ఐక్యత సాధ్యమా? 🌹

🌹 పరమాత్మ ఎవరు? ఎక్కడ ఉంటాడు? పరమాత్మను ఆత్మ పొందుతుందా? జీవాత్మ పొందుతుందా.......?  🌹

🌹 పరమాత్మ  🌹
సృష్టికి పూర్వం ఒకే ఒక పదార్ధం వుంది అదియే శక్తి, అదియే పరమాత్మ. సృష్టి జరిగినపుడు ఆ శక్తే ప్రకృతిగా మారింది. అంటే బంగారం నుండి మనం వేరే వేరే నగలను ఎలా తాయారు చేస్తామో వాటిని అన్నిటిని కరిగిస్తే తిరిగి బంగారం అవుతుంది. అదేలాగు ఈ సృష్టి కూడ పరమాత్మలోనే వుంది. అంతే కాని పరమాత్మ వేరే ఎక్కడో లేడు. అంటే ఇప్పుడు ఒక నీటి కొలను వుంది అనుకోండి. ఆ నీటి కొలనులో నీటి బుడగలు వస్తాయి మరల అవి నీల్లగా మారి అందులోనే కలిసిపోతాయి. అదేలగు పరమాత్మలోనే సృష్టి అంతా వుంది. దీనినే శ్రీ కృష్ణ భగవానుడు అర్జునడికి... అర్జునా సమస్తం నాలోనే వుంది అని చెప్తాడు.పరమాత్మా అంటే అనంత సాగరం. అందులోనే మనం వున్నాము.

🌹 ఆత్మ 🌹
ఆత్మ అంటే పరమాత్మనే. అదేలాగు అంటే సృష్టి జరిగిన తరువాత పంచ భూతాలతో నిర్మితమైన ఈ నిర్జీవ పదార్థానికి (శరీరానికి) శక్తి ఆత్మే అది ఇందులో వుంది. అయితే ఆత్మే పరమాత్మ ఎలాగు అంటే ఒక సముద్రము నుండి ఒక నీటి బొట్టును పక్కకు తీస్తే అది సముద్రపు నీటికి ఎలా సమానమో అదేలాగో ఆత్మ కూడా పరమాత్మనే. అయితే ఆత్మ ఏమి చేయుట లేదు. ఎలాగంటే మనం ఒక ఇంట్లో ఉంటాము మనం ఒక క్రొవ్వత్తి వెలుగు ద్వార మనం పని చేసుకుంటాము అంటే ఇక్కడ క్రొవ్వత్తి ఏమి పని చేయుటలేదు అదేలాగ ఆత్మ యొక్క శక్తి చేత శరీరము, మనస్సు మరియు బుద్ది పని చేసుకోనుచున్నవి. ఆత్మ యొక్క తత్వాన్ని శ్రీ కృష్ణుడు భగవద్గీతలో చాల విపులంగా వర్ణించాడు.

🌹 జీవాత్మ: 🌹
జీవాత్మ అంటే మనం అహంకారంతో, అజ్ఞానంతో మరియు అవిద్యతో సత్యాన్ని తెలియక నేను అనే అహంకారంతో ప్రోగు చేసుకున్న కర్మలు మరియు ఆత్మను కలిపి జీవాత్మ అని అంటాము.ఇందులో ప్రోగు చేసుకున్న కర్మలకు ఆత్మకు ఎటువంటి సంబందము ఉండదు. అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మలు తొలిగిపోవడానికి మనం కర్మలు చేస్తూ వుంటాము. వీటి వేటితో కూడా ఆత్మకు సంబందము ఉండదు. నీవు నిజానికి ఆత్మవే. కానీ అజ్ఞానంలో మనం సత్యాన్ని మరచిపోయాము. అందుకే గురువులు అంటారు, మీరు అంతా మరుపులో ఉన్న దేవతలు అని.

🌹  పరమాత్మలో ఐక్యం: 🌹
ఎప్పుడైతే నువ్వు అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మలను తొలగించుకుంటావో అప్పుడు నువ్వు అయిన ఆత్మవు ఈ అనంత సాగరమైన పరమాత్మలో విలీనం అవుతావు.

అయితే నువ్వు నీ శరీరపు కండ్లతో చూసేది కాదు. దానిని (ఆత్మను) చూడాలంటే సాధన (ధ్యానం) చేసి నీ హృదయంలో సాక్షాత్కరించుకోవాలి.అంటే ఆ అనుభూతి నీ మనస్సుకి మాత్రమే తెలుస్తుంది అది వర్ణింపనలవి కానిది. అప్పుడు శరీరం ఉన్నపుడే నువ్వు ముక్తుడవు అవుతావు.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్