1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 30, డిసెంబర్ 2021 గురువారం, బృహస్పతి వాసరే 🌹2) 🌹. శ్రీమద్భగవద్గీత - 136 / Bhagavad-Gita - 136 - 3-17🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 533 / Vishnu Sahasranama Contemplation - 533 🌹
4) 🌹 DAILY WISDOM - 211🌹
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 50🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 116-2🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 334 / Sri Lalitha Chaitanya Vijnanam - 334 🌹
🌹. సఫల ఏకాదశి విశిష్టత 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*బృహస్పతి వాసరే, 30, డిసెంబర్ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. శ్రీ రాధాకృష్ణాష్టకం-3 🍀*
*యేన ప్రోద్యత్ప్రతాపా నృపతి కులభవాః పాండవాః కౌరవాబ్ధిం*
*తీర్త్వా పారం తదీయం జగదఖిల నృణాం దుస్తరంచేతి జగ్ముః |*
*తత్పత్నీచీరవృద్ధిప్రవిదిత మహిమా భూతలే భూపతీశః*
*కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ || 3 ||*
🌻 🌻 🌻 🌻 🌻
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: కృష్ణ ఏకాదశి 13:41:08 వరకు
తదుపరి కృష్ణ ద్వాదశి
నక్షత్రం: విశాఖ 24:34:52 వరకు
తదుపరి అనూరాధ
యోగం: ధృతి 21:49:17 వరకు
తదుపరి శూల
కరణం: బాలవ 13:37:08 వరకు
వర్జ్యం: 07:45:50 - 09:13:30 మరియు
28:09:10 - 29:35:14
సూర్యోదయం: 06:45:18
సూర్యాస్తమయం: 17:51:46
వైదిక సూర్యోదయం: 06:49:12
వైదిక సూర్యాస్తమయం: 17:47:53
చంద్రోదయం: 02:50:28
చంద్రాస్తమయం: 14:33:42
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: తుల
దుర్ముహూర్తం: 10:27:28 - 11:11:53
మరియు 14:54:02 - 15:38:28
రాహు కాలం: 13:41:50 - 15:05:09
గుళిక కాలం: 09:31:55 - 10:55:14
యమ గండం: 06:45:18 - 08:08:37
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:40
అమృత కాలం: 16:31:50 - 17:59:30
వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం
24:34:52 వరకు తదుపరి ఆనంద
యోగం - కార్య సిధ్ధి
పండుగలు : సఫల ఏకాదశి,
Saphala Ekadashi
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత -136 / Bhagavad-Gita - 136 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 17 🌴*
*17. యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మాతృప్తశ్చ మానవ: |*
*ఆత్మన్యేవ చ సన్తుష్టస్తస్య కార్యం న విద్యతే ||*
🌷. తాత్పర్యం :
*కాని ఆత్మానుభవపూర్ణమైన జీవితముతో ఆత్మ యందే ఆనందమును గొనుచు, ఆత్మ యందే తృప్తుడై పరిపూర్ణ సంతుష్టిని పొందినవానికి చేయవలసిన కర్మమేమియును లేదు.*
🌷. భాష్యము :
పూర్ణముగా కృష్ణభక్తిభావనాయుతుడై కృష్ణపరకర్మలచే పూర్ణతృప్తి నొందినవానికి చేయవలసిన కర్మమేమియును ఉండదు. కృష్ణభక్తిభావితుడై కారణమున వేలాది యజ్ఞనిర్వహణ ప్రభావమైన కల్మషమార్జనము అతని యందు శీఘ్రమే కలుగుచున్నది. చైతన్యము ఆ విధముగా శుద్ధిపడినపుడు మనుజుడు తనకు శ్రీకృష్ణభగవానునితో గల సంబంధమును స్థిరముగా ఎరుగవలయును.
అట్టివానికి విధ్యుక్తధర్మము స్వయముగా భగవానుని కరుణచే హృదయమునందు ప్రకాశితమగును. కనుక వేదంనిర్దేశములను అనుసరింపవలసిన నిర్భంధము అతనికి ఏమాత్రము ఉండదు. అటువంటి కృష్ణభక్తిరసభావితుడు ఎటువంటి లౌకికకర్మల యందును మగ్నుడు కాడు. అంతియేగాక అతడు మదిర, మగువ వంటి మోహపూర్వక విషయములందు ఏమాత్రము ఆనందమును గొనడు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 136 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 3 - Karma Yoga - 17 🌴*
*17. yas tv ātma-ratir eva syād ātma-tṛptaś ca mānavaḥ*
*ātmany eva ca santuṣṭas tasya kāryaṁ na vidyate*
🌷Translation :
*But for one who takes pleasure in the Self, whose human life is one of self-realization, and who is satisfied in the Self only, fully satiated – for him there is no duty.*
🌷 Purport :
A person who is fully Kṛṣṇa conscious, and is fully satisfied by his acts in Kṛṣṇa consciousness, no longer has any duty to perform. Due to his being Kṛṣṇa conscious, all impiety within is instantly cleansed, an effect of many, many thousands of yajña performances.
By such clearing of consciousness, one becomes fully confident of his eternal position in relationship with the Supreme. His duty thus becomes self-illuminated by the grace of the Lord, and therefore he no longer has any obligations to the Vedic injunctions. Such a Kṛṣṇa conscious person is no longer interested in material activities and no longer takes pleasure in material arrangements like wine, women and similar infatuations.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 533 / Vishnu Sahasranama Contemplation - 533🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 533. మేదినీ పతిః, मेदिनी पतिः, Medinī Patiḥ 🌻*
*ఓం మేదినీపతయే నమః | ॐ मेदिनीपतये नमः | OM Medinīpataye namaḥ*
మేదినీ పతిః, मेदिनी पतिः, Medinī Patiḥ
*మేదిన్యాస్సపతిర్భూమ్యా మేదినీపతిరుచ్యతే*
*మేదిని అనగా భూమి. మేదినీపతిః అనగా భూమి యొక్క పతి. మధు-కైటభులతో సంహార ఘట్టమునందు, మధు మెద అనగా క్రొవ్వు యొక్క పిండరూపమే ఈ భూమి గనుక మేదినీ అని పేరు.*
:: ప్రాతః స్మరణ మన్త్రము ::
సముద్రవసనే దేవిః పర్వతస్థనమణ్డలే ।
విష్ణుపత్నిః నమస్థుభ్యం పాదస్పర్శ క్షమస్వ మే ॥
*సముద్రములను వస్త్రముగా ధరించి, పర్వతములను స్థన మండలముగాగలిగిన ఓ విష్ణుపత్నీ నీకు నమస్కారము; నా పాదస్పర్శను క్షమించ ప్రార్థన.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 533🌹*
📚. Prasad Bharadwaj
*🌻533. Medinī Patiḥ🌻*
*OM Medinīpataye namaḥ*
*मेदिन्यास्सपतिर्भूम्या मेदिनीपतिरुच्यते / Medinyāssapatirbhūmyā medinīpatirucyate*
*Medinī means earth and Patiḥ is Lord. The Lord of the earth is Medinī Patiḥ. The earth is considered to be the Meda or tallow lump of the asura Madhu who was killed by Lord Viṣṇu and hence she is known as Medinī.*
:: प्रातः स्मरण मन्त्र ::
समुद्रवसने देविः पर्वतस्थनमण्डले ।
विष्णुपत्निः नमस्थुभ्यं पादस्पर्श क्षमस्व मे ॥
Morning prayer
Samudravasane deviḥ parvatasthanamaṇḍale,
Viṣṇupatniḥ namasthubhyaṃ pādasparśa kṣamasva me.
*The devi who has ocean as her garment and the mountain ranges as her bosom, the one who is the consort of Lord Viṣṇu, I bow to you; please forgive us for touching you with our feet.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः ।त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृंगः कृतान्तकृत् ॥ ५७ ॥
మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః ।త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాన్తకృత్ ॥ 57 ॥
Maharṣiḥ kapilācāryaḥ krtajño medinīpatiḥ,Tripadastridaśādhyakṣo mahāśrṃgaḥ krtāntakrt ॥ 57 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 211 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 29. The Wholeness of Reality is Beyond the Mind 🌻*
*The scientific adventures and rational philosophies of humanity are incompetent to fathom the depths and the mysteries of the cosmos, because the wholeness of reality is not capable of being contained in the finitude of human understanding, or in anything finite, for the matter of that. There is nothing in this world that is capable of being an instrument in the knowledge of God. Hence, the world is called a relative world.*
*There is nothing absolute here, because the Absolute is only One, while the relative parts can be many. While the entire relative world is contained in God and the relative is in the Absolute, the Absolute is not in the relative, because there is a distracted differentiation of particulars in the world of relativity; and in this distractedness of finitude, the Infinite cannot be wholly present.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#PrasadBhardwaj
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 50 🌹*
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻 38. సేవా సూక్ష్మము 🌻*
*సామాన్యులను అశ్రద్ధ చేయకుము. మితిమీరిన సౌకర్యములను కోరువారిని ఎక్కువగ పట్టించుకొనకుము. మొదటి తెగవారు తెగపడి సంఘమున ఆర్జనము చేయక, చేయలేక యుందురు. రెండవవారు వారి స్థితిగతుల నుపయోగించుకొని రకరకములైన యుక్తులతో జీవింపజూతురు. మొదటివారికి సహాయమవసరము. రెండవ తెగవారు వారికి వారే సహాయము చేసుకొందురు కనుక మీ అవసరముండదు. ఇది తెలిసి మసలుట నీయందు సాధు జీవనమును పెంచును. అహంకారులకు చేయు సహాయము నిరర్థకము, నిష్ఫలము, దుఃఖహేతువు కూడ.*
*ఒకానొక పుణ్య క్షేత్రమున మేమెరిగిన సాధువు ఒకడున్నాడు. అతడు వందల సంవత్సరములనుండి క్షేత్రమునకు వచ్చు సామాన్యులను గుర్తించి స్వచ్ఛందముగ వారికి వలసిన సహాయము చేయు చుండును. మరికొందరికి సహాయమవసరమైనను చేయడు. అది గమనించిన తోటి సాధువొకడు "కోరినవారికి చేయక కోరనివారికి చేతువేమి?” అని అడిగెను. దానికి సాధువిట్లు సమాధాన మిచ్చెను. "కోరినవారు సౌకర్యములను కోరుచున్నారు.*
*యాత్రికులకు దైవము ముఖ్యము కాని తిండి, పడక కాదు కదా! వారు సౌకర్యకాములు. తిండి, పడక కోరువారికి నేను సాయము చేయను. దైవమును కోరి వచ్చినవారు తిండికి, పడకకు లెక్కచేయరు. కావున వారికి సౌకర్యము లేర్పరచుదును. మరియొక విశేషమున్నది. కేవలము దైవమును కోరి వచ్చు సామాన్యులలో అప్పుడప్పుడు మహాత్ములు కూడ చనుదెంతురు. కాబట్టి సామాన్యుల సేవనమే తృప్తి, ఆత్మానందము కలిగించును. నీవును అట్లే చేయుము” అని తెలిపెను.*
*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 116-2 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. మరణం కూడా నాశనం చెయ్యలేనిదే నిజమైన విజయం. నువ్వు శాశ్వతత్వానికి సంబంధించిన దేన్నయినా కొంత అందుకున్నప్పుడే నిన్ను నువ్వు విజేతగా చెప్పుకోవచ్చు. ప్రేమ నీకు శాశ్వతత్వానికి సంబంధించిన మెరుపుల్ని చూపిస్తుంది. 🍀*
*నిజమైన విజయానికి ప్రేమే సరయిన మార్గం. కానీ అపరిచితమార్గం. వైరుధ్యాలో నిండింది. కారణం ప్రేమ లొంగిపోవడంతో ఆరంభమై విజయంతో ముగుస్తుంది. ప్రేమ లొంగిపోవడాన్ని కోరుతుంది. లొంగిపోవడం విజయాన్ని తెస్తుంది. విజయంతోనే విర్రవీగేవాళ్ళు ఎప్పుడూ ఓడిపోయినవాళ్ళే. ప్రపంచం దృష్టిలో వాళ్ళు విజేతలు కావచ్చు. కానీ అది నిజమైన విజయం కాదు. దాన్ని మరణం తీసుకుపోతుంది.
మరణం కూడా నాశనం చెయ్యలేనిదే నిజమైన విజయం. నువ్వు శాశ్వతత్వానికి సంబంధించిన దేన్నయినా కొంత అందుకున్నప్పుడే నిన్ను నువ్వు విజేతగా చెప్పుకోవచ్చు. ప్రేమ నీకు శాశ్వతత్వానికి సంబంధించిన మెరుపుల్ని చూపిస్తుంది. మరణాన్ని దాటిన కిటికీలను తెరుస్తుంది. ప్రేమ ఒక్కటే అస్తిత్వపు అవగాహన కలిగిస్తుందని గ్రహిస్తే వ్యక్తి ప్రేమ లోతుల్లోకి వెళ్ళాలి. ప్రేమతో వుంటే విజయం మనదవుతుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 334 / Sri Lalitha Chaitanya Vijnanam - 334🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 75. విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ ।*
*విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ ॥ 75 ॥ 🍀*
*🌻 334. 'విశ్వాధికా' 🌻*
*విశ్వము కంటే అధికురాలు శ్రీమాత అని అర్థము. విశ్వము శ్రీమాత సంకల్పము నుండే ఆవిర్భవించినది. శివ-శక్తి విశ్వమునకు అధ్యక్షులు. అధికులు కూడ. శివు డాధారముగ శక్తి సమస్త విశ్వమును సృష్టించి వృద్ధి గావించి మరల తిరోధానము గావించు చున్నది. అంతటికిని ఆమె అధికురాలు గనుక సృష్టియందామెను ఆరాధించుట ఉత్తమము. ఆమె నారాధించునపుడు శివుని కూడ ఆరాధించినట్లే.*
*ఎందువల ననగా శివు డవ్యక్తుడు, నిరాకారుడు. శివుని ఆకారమే శ్రీమాత. శివుని వ్యక్తరూపమే శ్రీమాత. అందువలన ఆమె ఆరాధన శివరూపము నారాధించినట్లే. ఆ రూపము మహాచైతన్య రూపము. అపరిమితమగు వెలుగు రూపము. చీకటికి ఆవల వెలుగు రూపము. అత్యధికమగు రూపము. అన్ని వెలుగులకు అన్ని రూపములకు ఆధారమగు రూపము.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 334 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 75. Vishvadhika vidavidya vindhyachala nivasini*
*Vidhatri vidajanani vishnu maya vilasini ॥ 75 ॥ 🌻*
*🌻 334. Viśvādhikā विश्वाधिका (334) 🌻*
*She is beyond all tattva-s. There are thirty six important tattvas commencing from Śiva tattva downwards till pṛthivi (earth) tattva. She transcends all these tattva-s. All the living beings exist because of these tattva-s only. Thirty six tattva-s comprise of basic five elements, four components of antaḥkaraṇa, seven components of māyā tattva and five components of Śiva tattva.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. సఫల ఏకాదశి విశిష్టత 🌹*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*ధనుర్మాసంలో వచ్చే చివరి పండుగ అయిన సఫల ఏకాదశి గురించి తెలుసుకుందాం.. ఈ సఫల ఏకాదశి మహాత్మ్యాన్ని పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజుకు శ్రీ కృష్ణుడు చెప్పినట్లు శాస్త్రాలు చెప్తున్నాయి. మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశినే సఫల ఏకాదశి అంటారు.*
*ఈ రోజున నిష్ఠతో ఉవవసించి.. జాగరణ చేసి.. శ్రీ విష్ణుమూర్తిని పూజించడం ద్వారా పాపాలు నశించిపోతాయి. ముక్తి లభిస్తుంది. ఈ రోజున శ్రీ మహా విష్ణువును ఉసిరితోనూ , దానిమ్మ పండ్లతోనూ పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఈ రోజున రకరకాల పండ్లను స్వామికి సమర్పించి ధూపదీప నైవేద్యాలు అర్పిస్తే శుభప్రదం. ఈ సఫల ఏకాదశి రోజున దీపదానం చేస్తే జీవితంలో విశేషమైన ఫలితాలు కలుగుతాయి.*
*ఇంకా సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి.. ఆలయాల్లో దీపాలను వెలిగిస్తే.. ఐదువేల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం దక్కుతుంది. దీనికి సమానమైన యజ్ఞం కానీ , తీర్థం కానీ లేదు.*
*సఫల ఏకాదశి పవిత్రను చాటిచెప్పే కథను కూడా శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి. పూర్వము చంపావతి రాజ్యమును మహిష్మంతుడు అనే రాజు పాలిచేవాడు. అతనికి లుంభకుడు అనే కుమారుడుండేవాడు.*
*లుంభకుడు అధర్మ వర్తనుడై జీవిస్తుడడంతో కుమారుడని చూడకనే రాజు వానిని రాజ్య బహిష్కరణ శిక్ష విధించెను. లుంభకుడు అడవుల పాలై ఆహారము దొరకక , తన పరిస్థితికి పశ్చాత్తాప పడుతూ మర్రిచెట్టు వద్ద రాత్రంతా గడిపి.. ఏమీ తినకుండా చింతిస్తూ సృహ తప్పి పడిపోయాడు.*
*ఆనాడు ఏకాదశి ఆహారం లభించక ఉపవాసమును అప్రయత్నముగా పాటించడంతో శ్రీహరి ప్రత్యక్షమై రాజ్యాన్ని ప్రసాదిన్చినట్లు పురాణాలు చెప్తున్నాయి. లుంభకుడు సక్రమమైన పరిపాలన చేసి మరణాంతరము వైకుంఠానికి చేరుకున్నాడని పురాణ కథనం.*
*ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని పరమ శివుడు స్వయముగా పార్వతికి చెప్పినట్లు పద్మ పురాణం చెబుతోంది. అందుకే ఈ రోజున తెలిసి కానీ తెలియక కానీ ఉపవాస దీక్షను చేస్తే.. పుణ్య లోకాలను పొందుతారు. వైకుంఠ ప్రాప్తి , ఐశ్వర్యాలు కలుగుతాయని శ్రీకృష్ణుడు పాండవులతో చెప్పినట్లు కథలున్నాయి.*
*శుభ సమయం:*
*ఏకాదశి తేదీ ప్రారంభం : డిసెంబర్ 29, 2021 బుధవారం సాయంత్రం 04:12 నుండి*
*ఏకాదశి తేదీ ముగుస్తుంది : 30 డిసెంబర్ 2021 గురువారం మధ్యాహ్నం 01:40 నిమిషాలకు*
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹