Showing posts with label Evil Eye. Show all posts
Showing posts with label Evil Eye. Show all posts

సకల దిష్టి నివారణ మంత్రాలు (మంత్ర, యంత్ర. తంత్ర, నర, పిశాచ దిష్టి ఇత్యాదివి) Mantras to Remove All Forms of the Evil Eye


🌹 సకల దిష్టి నివారణ మంత్రాలు (మంత్ర, యంత్ర. తంత్ర, నర, పిశాచ దిష్టి ఇత్యాదివి ) 🌹
🌹 Mantras to Remove All Forms of the Evil Eye (Including those caused by Mantra, Yantra, Tantra, Humans, or Spirits) 🌹


🌻 1. సాధారణ దృష్టి దోష నివారణ మంత్రము. 🌻
🌻 1. Mantra to Remove General Evil Eye Afflictions 🌻

మంత్రం సిద్ధించడానికి నీటి కలశమును పెట్టుకుని. ఈ మంత్రమును 108 సార్లు జపించి, ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే స్వాహా అని అర్పణ చేసి ఆ నీటిని తాగిన యెడల మంత్రము అటు పిమ్మట ఉపయోగించవచ్చు.

"ఓం క్రైం హ్రాం హ్రీం క్ష్రాం క్ష్రీం క్ష్రూం హుం ఫట్ |"

పై మంత్రముచే 3 పర్యాయములు అభిమంత్రించి. కల్లు ఉప్పుతో దృష్టి జెందిన వారికి ముమ్మారు దిగదుడిచి, నీటిలో వేసిన... ఆ ఉప్పు కరగు సరికి దృష్టి బాధ లంతరించ గలవు.



🔥 2. తీవ్రమైన దిష్టి నివారణ కొరకు 🔥
🔥 2. For Removing Severe Evil Eye Afflictions 🔥

మంత్రం సిద్ధించడానికి నీటి కలశమును పెట్టుకుని. ఈ మంత్రమును 108 సార్లు జపించి, ఓం శ్రీ జ్వాలా నృసింహాయ స్వాహా అని అర్పణ చేసి ఆ నీటిని తాగిన యెడల మంత్రము ఉపయోగించవచ్చు.

సర్వతోముఖ ప్రళయకాల జ్వాలా నృసింహాయ ఓం క్ష్రామ్ ఓం

1 నిమ్మకాయ అయితే విభూతిని కలిపి పై మంత్రముచే 8 సార్లు, - 3 నిమ్మ కాయలయితే, 27 పర్యాయములు అభిమంత్రించి దృషి దోషమున్న వారికి, నిమ్మకాయలతో దిగదుడిచి, కోసి పాఱ వేసి (నీటిలో కానీ, నిర్జన ప్రదేశములో కానీ), నుదిటిన, బాధ ప్రదేశములో, శరీరమంతట గానీ, విభూదిని రాచిన... సకల దృష్టి దోషములు నివారించ బడగలవు.

ఏ రకమైన దిష్టి ఉన్నా ఈ మంత్రాలు మీరందరూ ఇక నుండి ఉపయోగించ వచ్చు.

🙌🙌🙌


ప్రసాద్, జ్యోతిర్మయి

🙌 Good Wishes and Blessings. 🙌