జననం- మరణం | జీవాత్మ | ధర్మ విరుద్ధం - దండన Birth- Death | Soul | Violation of Dharma - Punishment
https://www.youtube.com/shorts/Ows28qU759k
🌹 జననం- మరణం | జీవాత్మ | ధర్మ విరుద్ధం - దండన 🌹
ప్రసాద్ భరధ్వాజ
🌹🌹🌹🌹🌹
🌹 Birth- Death | Soul | Violation of Dharma - Punishment 🌹
Prasad Bharadhwaja
🌹🌹🌹🌹🌹🌹
శ్రీ హనుమాన్ జయంతి విశిష్టత Significance of Sri Hanuman Jayanti
🌹🚩 శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు 🚩🌹.
ప్రసాద్ భరద్వాజ
🌻 శ్రీ హనుమాన్ జయంతి విశిష్టత 🌻
హనుమంతుడు వైశాఖ మాసంలో , కృష్ణ పక్షంలో , దశమితిథి పూర్వభాద్రా నక్షత్రం , శనివారం , కర్కాటక లగ్నంలో , వైదృతి యోగంలో జన్మిచాడు. ఇవి ఖగోళాది సకల ప్రమాణాలతో ఏ , కల్పంతర గాధలను బట్టి ఎవరో చేప్పారని భిన్న భిన్న తిథులలో హనుమజ్జయంతి కొందరు జరుపుతున్నారు. సాధారణంగా మే నెలలో వచ్చే వైశాఖ బహుళ దశమినాడు తప్పక జయంతి జరపాలి. వీటిని పంచాహ్మికంగా ఐదు రోజులు ఇలా శక్తి కొలది జరుపవచ్చు.
విశేషార్చనలు సామూహిక కార్యక్రమాలు నిర్వహించాలి.
ఆచరణ : సంవత్సరంలో ఈ ఒక్క జయంతినాడయినా భక్తులు మారేడుదళం , సింధూరం మల్లెపూలు లేదా తములపాకులు , తులసిదళం , ప్రోత్సహించి లక్షార్చన వంటి వాటితో జరిపించాలి.
ఆంజనేయస్వామి అవతారాలు తొమ్మిది:
హనుమంతుడు కూడా దుష్టశిక్షణ , శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి తొమ్మిది. హనుమన్నవావతారాలంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది.
1. ప్రసన్నాంజనేయస్వామి.
2. వీరాంజనేయస్వామి.
3. వింశతిభుజాంజనేయ స్వామి.
4. పంచముఖాంజనేయ స్వామి.
5. అష్టాదశ భుజాంజనేయస్వామి.
6. సువర్చలాంజనేయ స్వామి.
7. చతుర్భుజాంజనేయ స్వామి.
8. ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి.
9. వానరాకార ఆంజనేయస్వామి
తంత్రశాస్త్రంలో హనుమంతుణ్ణి ఆరాధిస్తే సమస్త క్షుద్రపీడలు పటాపంచలై పోతాయి.....!!!
దశమహావిద్యలతో సమానమైన శక్తి కలవాడు ఆంజనేయుడు. హనుమంతుడు తంత్రదేవతలందరిలోకి అధికుడు. ఆంజనేయునికి అష్టసిద్ధులు ఉన్న కారణంగా ఆయనను ఉపాసించిన వారికి మానవాతీత శక్తులు లభిస్తాయి.
ఆయన అష్టసిద్ధులు
1. అణిమాసిద్ధి : శరీర పరిమాణం ఆవగింజంత చిన్నదిగా చేసుకోగల శక్తి.
2. మహిమాసిద్ధి : శరీర పరిమాణం పర్వతమంత పెంచుకోగల శక్తి.
3. లఘిమాసిద్ధి : శరీరం బరువును నువ్వుగింజ కన్నా తక్కువ బరువుగా చేసే శక్తి.
4. గరిమ : శరీరం బరువును పర్వతమంత బరువు పెరిగేలా చేసే శక్తి.
5. ప్రాప్తిసిద్ధి : ఎక్కడికైనా ప్రయాణించగల శక్తి.. దేనినైనా పొందగలిగే శక్తి.
6. పరకామ్యసిద్ధి : ఎవరూ తగ్గించలేని ఆత్మబలాన్ని కలిగిఉండే శక్తి.
7. వశిత్వసిద్ధి : అన్ని జీవులపైనా ఆధిపత్యాన్ని కలిగిఉండే శక్తి.
8. ఈశిత్వసిద్ధి : దేనినైనా సృష్టించగల మరియు దేనినైనా నాశనం చేయగల శక్తి.
శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు ఎలా చేయాలి ?
హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. 'ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ , భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు , అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు , పసుపుకొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం.
'శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్'
శ్లో|| ఆంజనేయం మహావీరం - బ్రహ్మవిష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం
శ్లో|| మర్కటే శ మహొ త్సాహ - సర్వశోక వినాశన
శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో||
అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం , అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి
''యాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు''
అని జలాన్ని అక్షతలతో వదలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం , శిర స్స్నానం , నేలపడక , సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.
ఆచరణ: భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పివారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామిద్వారా తోలగునట్లు చేయాలి. హనుమత్ప్ర దక్షిణ ధ్యానం శీలాఫలకంపై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయమని భక్తులకు తెలపాలి.
అభిషేకం
పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం. అందులోనూ మన్యు సూక్త అభిషేకిస్తే పరమానంద భరితుడు అవుతాడు , కోరికల్ని తీరుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి. వారం వారం , నిత్యమూ చేయగలగటం మరీ మంచిది.
ఆచరణ : మన్యుసూక్తం నేర్చుకొని భక్తులకు దాని విలువ తెలిపి ప్రతి పర్వదినానా దాతల ద్వారా అభిషేకం జరిపింపజేయాలి
మంగళ వార సేవ
మంగళవారంనాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయటం చాల ఇష్టం. అంతా కుదురనివారు మూతికయినా తప్పక పూయాలి. సింధూరార్చన చేయటం , అరటి పండ్లు నివెదించటం చేయాలి. అందుకు కారణమైన విశేషగాధ ఉంది.
శనివార సేవ
హనుమంతుడు శనివారం జన్మించాడు. కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. నాడు యథాశక్తి విశేషార్చన , సహస్రనామాదికం చేయాలి. భక్తులచే అప్పాలు , వడ మాల వంటి విప్రోత్సహించి చే యించి స్వామికి సంతృప్తి కలిగించాలి.
పంచ సంఖ్య
హనుమంతుడు పంచ (ఐదు) సంఖ్య ఇష్టం కాబట్టి చెసే ప్రదక్షిణాలు , నమస్కారాలు ఐదు చేయాలి. అరటి పండ్లు వంటి ఏవయినా ఐదు సంఖ్యలలో సమర్పించుట స్వామికి ప్రీతికరం.
హనుమంతుని జీవిత కధ
హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు , ఉపనిషత్తులు , సంప్రదాయ గాథలలో మరికొన్ని విషయాలు , కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ , వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాథలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాథ క్లుప్తంగా ఇవ్వబడింది.
జననం
పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. అంజన అనే ఆడ వానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో , కాళ్ళు ముడుచుకుని ధ్యానంచేసుకుంటున్న వానరాన్నిని చూసి , ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా , చిన్నపిల్ల అయిన అంజన వానరం పైన పండ్లు విసిరింది.
హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానరం రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది , కోపంతో అంజనను , ఆమె ఎవరితోనైన ప్రేమలో పడిన్నప్పుడు వానరంగా మారమని శాపం ఇచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది మరియు ఆ ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్నా , ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరమిచ్చాడు.
అందువలన శాపవిమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒక రోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి , వెంటనే ఆమె వానర రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం 'కేసరి' అని , వానారములకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన వానర ముఖం కలిగి ఉన్నా అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారం వానరం మరియు మానవరూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి అబ్బురపడింది.
అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు. అంజన , ముని శాపవిమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. శివ ఆమె అభ్యర్థనను ఆమోదించాడు.
ఇంకో వైపు దశరధుడు , అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వర్తిస్తున్నాడు. తృప్తిచెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశసంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు , అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళింది.
ఆ గాలిపటం ఆ పాయసభాగాన్ని(తీపి ఆహారము) అంజన తపస్య స్థలంలో పడవేసింది. మహాదేవుడు , అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు , గాలి దేవుడిని ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవేనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది.
ఆమె వానర ముఖంగల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించటం వలన ఆంజనేయుడని , కేసరినందనుడని , వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. తన బాల్యదశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనవాడు. అతను , తన తండ్రిఅయిన కేసరి , తల్లి , అప్సర అంజన యొక్క శక్తి , వాయువేగం గలవాడు. హనుమాన్ జననం వలన అంజన శాపవిమోచనం పొందింది మరియు స్వర్గం తిరిగివెళ్ళింది.
భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాహలుడు , బుద్ధిశాలి , కపిశ్రేష్టుడు , సర్వశాస్త్ర పారంగతుడు , స్వామిభక్తి పరాయణుడు , రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం , రామాయణం , పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడిపడి ఉంది.
హనుమాన్ , ఏడుగురు చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. అతను లంక రాజు , రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీ రాముడికి అప్పగించాడు. హనుమాన్ కథ , మన జన్మ యొక్క రహస్యం , శక్తి గురించి తెలుసుకోవటంలో మనకు సహాయపడుతుంది.
జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి , వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు.
🌹🌹🌹🌹🌹
Greetings on Hanuman Jayanti! Blessings of Lord Hanuman! హనుమాన్ జయంతి శుభాకాంక్షలు! హనుమంతుని ఆశీస్సులు!
🌹 హనుమంతుని ధైర్యం, త్యాగం మరియు అపారమైన భక్తి మీ జీవితాన్ని వెలిగించాలని కోరుకుంటూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికి 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 🌹 🌹 🌹 🌹
🌹 బుధ్దిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం.., అరోగతా, అజాడ్యం, వాక్పటుత్వంచ, హనుమాన్ స్మరణాత్ భవేత్ - హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికి 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Wishing that the courage, sacrifice, and immense devotion of Hanuman illuminate your life. Happy Hanuman Jayanti to everyone. 🌹
Prasad Bharadwaj
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Intelligence, strength, courage, fearlessness, health, agility, eloquence, may all arise from the remembrance of Hanuman - Happy Hanuman Jayanti to everyone. 🌹
Prasad Bharadwaj
🌹 🌹 🌹 🌹 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 🌹 🌹 🌹 🌹
🌹 బుధ్దిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం.., అరోగతా, అజాడ్యం, వాక్పటుత్వంచ, హనుమాన్ స్మరణాత్ భవేత్ - హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికి 🌹
ప్రసాద్ భరద్వాజ
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Wishing that the courage, sacrifice, and immense devotion of Hanuman illuminate your life. Happy Hanuman Jayanti to everyone. 🌹
Prasad Bharadwaj
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Intelligence, strength, courage, fearlessness, health, agility, eloquence, may all arise from the remembrance of Hanuman - Happy Hanuman Jayanti to everyone. 🌹
Prasad Bharadwaj
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Comments (Atom)