🌹 19, MARCH 2024 THUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు🌹
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 510 / Bhagavad-Gita - 510 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 21 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 21 🌴
2) 🌹. శ్రీ శివ మహా పురాణము - 865 / Sri Siva Maha Purana - 865 🌹
🌻. శంఖచూడుని దూత శివునితో సంభాషించుట - 2 / The conversation between Śiva and the emissary of Śaṅkhacūḍa - 2 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 123 / Osho Daily Meditations - 123 🌹
🍀 123. శాంతి / 123. PEACE 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 538-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 538-2 🌹
🌻 538. 'మేధా’ - 2 / 538. 'Medha' - 2 🌻
5) 🌹 సిద్దేశ్వరయానం - 18 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 510 / Bhagavad-Gita - 510 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 21 🌴*
*21. కార్యకారణకర్తృత్వే హేతు: ప్రకృతిరుచ్యతే |*
*పురుష: సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే ||*
*🌷. తాత్పర్యం : భౌతిక కార్య, కారణములన్నింటికిని ప్రక్తుతియే హేతువనియు, జగమునందలి పలు సుఖదుఃఖానుభవములకు జీవుడే కారణమనియు చెప్పబడుచున్నది.*
*🌷. భాష్యము : జీవుల వివిదేంద్రియముల వ్యక్తీకరణకు భౌతికప్రకృతియే హేతువు. ఎనుబదినాలుగులక్షల జీవారాసులన్నియును ప్రకృతి నుండియే ఉద్భవించినవి. అవియన్నియును వాస్తవమునకు భిన్నదేహములందు జీవింపగోరు జీవుని యొక్క వివిధములైన ఇంద్రియకోరికల వలన కలుగుచున్నవి. అట్టి వివిధ దేహములందు అతడు ప్రవేశింపజేయబడినంత వివిధములైన సుఖదుఃఖముల ననుభవించు చుండును.*
*అతడు అనుభవించు ఆ సుఖదుఃఖములు అతని దేహము వలననే సంప్రాప్తించి యుండును గాని తన వలనకాదు. అనగా నిజస్థితిలో జీవుడు ఆనందమయుడని పలుకుటలో ఎట్టి సందేహమును లేదు. కనుక అట్టి నిజస్థితియే అతని యథార్థస్థితి. కాని ప్రకృతిపై అధికారము చెలాయించ వలెనను కోరికను కలిగియుండుటచే అతడు ఈ భౌతిక జగమునకు చేరియున్నాడు. అట్టి భావనలు ఆధ్యాత్మిక జగత్తు నందుండవు. అది సదా అట్టి వానినుండి దూరమై, పవిత్రమై యుండును.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 510 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 21 🌴*
*21. kārya-kāraṇa-kartṛtve hetuḥ prakṛtir ucyate*
*puruṣaḥ sukha-duḥkhānāṁ bhoktṛtve hetur ucyate*
*🌷 Translation : Nature is said to be the cause of all material causes and effects, whereas the living entity is the cause of the various sufferings and enjoyments in this world.*
*🌹 Purport : The different manifestations of body and senses among the living entities are due to material nature. There are 8,400,000 different species of life, and these varieties are creations of the material nature. They arise from the different sensual pleasures of the living entity, who thus desires to live in this body or that.*
*When he is put into different bodies, he enjoys different kinds of happiness and distress. His material happiness and distress are due to his body, and not to himself as he is. In his original state there is no doubt of enjoyment; therefore that is his real state. Because of the desire to lord it over material nature, he is in the material world. In the spiritual world there is no such thing. The spiritual world is pure, but in the material world everyone is struggling hard to acquire different kinds of pleasures for the body.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 865 / Sri Siva Maha Purana - 865 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 35 🌴*
*🌻. శంఖచూడుని దూత శివునితో సంభాషించుట - 2 🌻*
*దూత ఇట్లు పలికెను - ఓ మహేశ్వరా! నేను శంఖచూడుని దూతను. నీవద్దకు ఇచటకు వచ్చి యున్నాను.. ఇపుడు నీ కోరిక ఏమి? నాకు సత్యమును చెప్పుము (11).*
*సనత్కుమారుడిట్లు పలికెను - మంగళకరుడు, ప్రసన్నమగు మనస్సు గలవాడు అగు మహాదేవుడు శంఖచూడుని ఆ సందేశమును వినెను. భగవానుడాతనితో నిట్లనెను (12).*
*మహాదేవుడిట్లు పలికెను - ఓ దూతా! నీవు గొప్ప బుద్ధిశాలివి. సుఖకరమగు నా మాటను వినుము. నీవు ఆలోచించి వివాదమును తొలగించే ఈ మాటలను వానికి చెప్పుము (13). ధర్ముని తండ్రి, ధర్మజ్ఞుడు అగు బ్రహ్మ జగత్తులను సృష్టించెను. ఆయన కుమారుడు మరీచి. ఆయన కొడుకు కశ్యపుడు (14). దక్షుడు ఆ కశ్యపునకు తన పదముగ్గురు కుమార్తెలనిచ్చి ప్రీతి పూర్వకముగా వివాహమును చేసెను. వారిలో దనువు ఒకతె. ఆమె పతివ్రత. ఆమె వలన కశ్యపుని సౌభాగ్యము వర్ధిల్లెను (15). దనువునకు తేజశ్శాలురు, వీరులు అగు నల్గురు పుత్రులు గలరు. వారికి దానవులని పేరు. వారిలో మహాబల పరాక్రమశాలియగు విప్రచిత్తి ఒకడు (16). దానవశ్రేష్ఠుడు, మహాప్రాజ్ఞుడు ధార్మికుడు అగు దంభుడు ఆయన కుమారుడు. శ్రేష్ఠుడవు, ధర్మాత్ముడవు, దానవాధీశ్వరుడువు అగు నీవు దంభుని పుత్రుడవు (17). పూర్వజన్మలో నీవు ధర్మాత్ముడు, గోపబాలకులలో ప్రముఖుడు అగు శ్రీ కృష్ణానుచరుడవు. రాధాదేవి యొక్క శాపముచే ఈ జన్మలో దానవచక్రకర్తివై జన్మించినవావు (18). నీవు దానవజన్మను పొందియున్ననూ, నీది దానవస్వభావము కాదు. నీవు నీ పూర్వజన్మ వృత్తాంతము నెరింగి ఇప్పుడు దేవతలతో నీకు గల వైరమును పరిత్యజింపుము (19). వారి యెడల ద్రోహము నాచరించకుము. నీ పదవిని ఆనందముగా అనుభవించుము. నీవు రాజ్యమును విస్తరింపజేయుటకు గతాని, లేక కల్లోలమును సృష్టించుటకు గాని యత్నించకుము. ఆలోచించుము (20).*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 865 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 35 🌴*
*🌻 The conversation between Śiva and the emissary of Śaṅkhacūḍa - 2 🌻*
The Emissary said:—
11. “O lord, I am the emissary of Śaṅkhacūḍa and have come to you. What is it that you desire? Please tell me.”
12. On hearing these words of Śaṅkhacūḍa, lord Śiva became delighted and spoke.
Lord Śiva said:—
13. O messenger of great intellect, listen to my words conducive to happiness. After pondering over this, without disputation, this shall be mentioned to him.
14. Brahmā is the creator of the worlds and father of Dharma. He knows virtue. Marīci is his son. Kaśyapa is Marīci’s son.
15. Dakṣa gave him his thirteen daughters, with pleasure. Among them the chaste lady Danu increased his fortune to a great extent.
16. Danu gave birth to four sons called Dānavas. They were vigorous and powerful. Vipracitti of great strength and valour was one of them.
17. His son, the virtuous Dambha of great intellect was the ruler of Dānavas. You are his excellent son, a pious soul, and the lord of Dānavas.
18. In previous birth you were a cowherd and an attendant of Kṛṣṇa. Among the cowherds you were virtuous. As a result of Rādhā’s curse, you are born as Dānava and have become the king of Dānavas.
19. You are casually born as a Dānava. You are really no Dānava. Realising your previous birth you leave off your inimical attitude to the gods.
20. Don’t be malicious towards them. You can enjoy your kingdom zealously. Do not try to expand your kingdom nor spoil it.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 123 / Osho Daily Meditations - 123 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 123. శాంతి 🍀*
*🕉 మీకు గుర్తు వచ్చినప్పుడల్లా, రోజులో వీలైనన్ని సార్లు గాఢంగా విశ్రాంతిగా ఉండండి మరియు ప్రశాంతంగా ఉండండి. కొన్ని రోజుల తర్వాత, మీనుండి ఏ ప్రయత్నం లేకుండానే, శాంతి స్థాపించబడిందని మీరు గమనిస్తారు. అది నీడలా నిన్ను అనుసరిస్తుంది. 🕉*
*శాంతి యొక్క అనేక స్థాయిలు ఉన్నాయి. మీరు శాంతియుతంగా ఉన్నారని లోతైన సూచనను అందించడం ద్వారా కేవలం అనుభూతి చెందడం ద్వారా మీరు ఉత్పత్తి చేయగలిగినది ఒకటి ఉంది; అది మొదటి పొర. రెండవ పొర మీకు అకస్మాత్తుగా తెలిసిపోతుంది. మీరు దీన్ని సృష్టించరు. కానీ రెండవది మొదటిది ఉంటేనే జరుగుతుంది. రెండవది అసలు విషయం, కానీ మొదటిది అది రావడానికి మార్గాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది. శాంతి వస్తుంది-కానీ అది రావడానికి ముందు, ఒక అవసరంగా, మీరు మీ చుట్టూ మానసిక శాంతిని సృష్టించుకోవాలి. మొదటి శాంతి కేవలం మానసికంగా ఉంటుంది; ఇది స్వీయవసీకరణ (ఆటోహిప్నాసిస్) లాగా ఉంటుంది; ఇది మీరు సృష్టించినది.*
*తరువాత ఒకరోజు అకస్మాత్తుగా రెండవ శాంతి ఉద్భవించిందని మీరు చూస్తారు. మీరు చేసే పనికి, మీతో సంబంధం లేదు. నిజానికి, ఇది మీ కంటే లోతైనది. ఇది మీ ఉనికి యొక్క మూలం నుండి వస్తుంది, గుర్తించబడని జీవి, అవిభక్త జీవి, తెలియని జీవి. మనం ఉపరితలంపై మాత్రమే తెలుసు. ఒక చిన్న ప్రదేశం మీరుగా గుర్తించబడింది. ఒక చిన్న తరంగానికి మీరు అని పేరు పెట్టారు, లేబుల్ చేయబడింది. ఆ కెరటంలోనే, లోతుగా, మహా సముద్రం ఉంది. కాబట్టి మీరు ఏమి చేస్తున్నా, దాని చుట్టూ శాంతిని సృష్టించాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఇది లక్ష్యం కాదు; అది కేవలం సాధనం. మీరు శాంతిని సృష్టించిన తర్వాత, అతీతమైనది ఏదో దానిని నింపుతుంది. ఇది మీ ప్రయత్నం నుండి రాదు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 123 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 123. PEACE 🍀*
*🕉 Whenever you remember, be deeply relaxed and feel peaceful, as many times in the day as possible. After a few days you will feel, without any doing on your part, that peace has been established. It will follow you like a shadow. 🕉*
*There are many levels of peacefulness. There is one that you can produce just by feeling it, just by giving yourself the deep suggestion that you are peaceful; that is the first layer. The second layer is that of which you suddenly become aware. You don't create it. But the second happens only if the first is present. The second is the real thing, but the first helps to create the way for it to come. Peace comes-but before it comes, as a prerequisite, you have to create a mental peace around you. The first peace will just be mental; it will be like an autohypnosis; it is created by you.*
*Then one day you will suddenly see that the second peace has surfaced. It has nothing to do with your doing, or with you. In fact, it is deeper than you. It comes from the very source of your being, the unidentified being, the undivided being, the unknown being. We know ourselves only on the surface. A small place is identified as you. A small wave is named, labeled, as you. Just within that wave, deep down, is the great ocean. So whatever you are doing, always remember to create peace around it. This is not the goal; it is just the means. Once you have created peace, something of the beyond will fill it. It will not come out of your effort.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 538 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 538 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।*
*స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀*
*🌻 538. 'మేధా’ - 2 🌻*
*శ్రీమాత ఎవరి యందు పరిపూర్ణముగ వసించునో వారు మేధావంతులు కాగలరు. వేదవ్యాస మహర్షి, కాళిదాస కవి, తెనాలి రామలింగడు యిత్యాది మేధావంతుల యందలి మేధస్సు ఆమెయే. మన యందలి మేధస్సు వృద్ధిగావలె నన్నచో శ్రీమాతను ఆరాధించుట ప్రధానమని తెలియవలెను. అమ్మ అనుగ్రహమున్నచో పామరుడు పండితుడగును. అమ్మ అనుగ్రహము లేని పాండిత్యము అడవిగాచిన వెన్నెల వంటిది. ఎడారిలోని పుష్పముల వంటివి. శ్రీమాత అనుగ్రహముకొద్దీ మేధస్సు సుఫలమై జగత్కల్యాణమునకు వినియోగ పడును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 538 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini*
*svahasvadha amati rmedha shrutih smrutiranuttama ॥110 ॥ 🌻*
*🌻 538. 'Medha' - 2 🌻*
*Those beings in whom Shrimata dwells absolutely, will become intellectuals. She is the intellect within the intellectuals like Sage Vedavyasa, Poet Kalidasa, Tenali Ramalinga. We should know that it is important to worship Shrimata for the intellect to grow in us. If there is Amma's grace, a layman will become a scholar. Knowledge without Mother's grace is like a wild moon. Like flowers in the desert. With the grace of Sri Mata, the intellect becomes fruitful and is used for the welfare of the world.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 సిద్దేశ్వరయానం - 18 🌹*
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 భైరవనాథుడు 🏵
యువకుడు: గురుదేవా! ఈ కధ నేను వినలేదు. తెలుసుకోవాలని అతృతగా ఉంది చెప్పండి!
వామదేవ : నాగశాపం వల్ల అతనికి దారుణమైన చర్మవ్యాధి వచ్చింది.
పుండు, మంటలు, దురదలు చూడలేని అసహ్యస్థితి, వ్యాసశిష్యుడైన వైశంపాయనుడు హోమములు చేయించి ఆ రోగమును పోగొట్టాడు. కానీ కర్మప్రేరణవల్ల బుద్ధి సరిగా పనిచేయని పరిస్థితి వచ్చింది. ఒకరోజు వ్యాసమహర్షి అతని దగ్గరకు వచ్చాడు. కౌరవ పాండవయుద్ధం గురించి జనమేజయుడు కొన్ని సందేహాలడిగాడు.
జనమేజయుడు : తాతగారూ! మీరు మహనీయులు, శ్రీకృష్ణులవారు సాక్షాత్తు నారాయణుడు. మీరు తలచుకొంటే యుద్ధాన్ని ఆపగలిగేవారు. లక్షలమంది వధ తప్పిపోయేది.
వ్యాసుడు : లేదునాయనా! మేము చెప్పగలిగినంత చెప్పాము. చేయగలిగినంత చేశాము. కానీ దుర్యోధనుడు వినలేదు. అతనిది రాక్షస ప్రవృత్తి. యుద్ధం తప్పలేదు, అది విధి నిర్ణయం.
జన : మహాత్మా ! నేనిది నమ్మలేకుండా ఉన్నాను. మీరు గట్టిగా చెపితే ఎవరు కాదనగలరు?
వ్యాస : కర్మప్రేరణను అర్థం చేసుకోలేకుండా ఉన్నావు. దుర్యోధనుడు వినలేదు. దానిని అటుంచు.అతడు అహంకారి. నీవు వినయశీలుడవు. కర్మ ప్రభావం ఎంతటిదంటే నీవు కూడా నేను చెప్పిన దానిని వినని పరిస్థితి వస్తుంది.
జన : నేనా ! అసంభవం. అనూహ్యం. సాక్షాత్ నారాయణ స్వరూపులైన మీరు ఒక మాట చెపితే అది నాకు అనుల్లంఘనీయమైన ఆజ్ఞ. నేను మీ మాట వినకపోవటమేమిటి? అది ఎప్పుడూ జరగదు.
వ్యాస : మంచిదే! విను. నేను వెళ్ళిన కొద్దిరొజులకు ఒక అశ్వ వర్తకుడు వస్తాడు. ఉత్తమజాతి అశ్వాన్ని తెచ్చి కొనమని బలవంతం చేస్తాడు. దానిని కొనవద్దు.
జన - అలానే మీ ఆజ్ఞ.
వ్యాస :ఒక వేళ కొనవలసి వస్తే.
జన : ఎందుకు వస్తుంది? మీరు చెప్పిన తర్వాత ఎట్టి పరిస్థితులలోను దానిని కొనను.
వ్యాస : ఒకవేళ వస్తే ఆ గుర్రంతో యజ్ఞం చేయవద్దు. ఒకవేళ యజ్ఞం చేయవలసివస్తే దానిలో తరుణులను ఋత్విక్కులుగా నియమించవద్దు.
జన భగవన్! అంతదాకా రానీయను. మొదటిలోనే ఆపగలను. సరి! మంచిది! - చూద్దామని వ్యాసులవారు వెళ్ళిపోయినారు. మహర్షి చెప్పినట్లే కొన్నాళ్ళకు అశ్వ వర్తకుడు వచ్చి "మహారాజా! ఇది ఉత్తమలక్షణాలుగల అశ్వం. భూమి మీద ఇటువంటిది లేదు. దీని విలువ ఇచ్చి కొనగలవారెవరూ దొరకలేదు. చక్రవర్తులు మీరే దీనిని కొనాలి!” అని ప్రార్థించాడు. మహారాజు "నాకు అక్కరలేదు. నేను కొనను నీవు వెళ్ళు" అన్నాడు. ఆ వర్తకుడు “మీరుకొనకపోతే ఇంకెవరికీ నేను అమ్మను. దీనిని ఇక్కడే నరికి చంపుతాను" అన్నాడు. అశ్వ హత్య పాతకం తనకంటుతుందేమో అన్న భయంతో జనమేజయుడు దానిని కొని ఆశ్వశాలకు పంపించాడు. కొన్నాళ్ళ తర్వాత విహారానికి వెళ్తూ రథానికి ఆ గుర్రాన్ని కట్టి తెమ్మని అశ్వశాలాధికారికి ఆజ్ఞ పంపాడు. అతడు వచ్చి "మహాప్రభూ! అది ఉత్తమ లక్షణాలుగల యజ్ఞాశ్వము. దానిని రథమునకు కట్టడంగాని, దాని పై స్వారి చేయటంగాని శాస్త్ర విరుద్ధము అని విన్నవించాడు. దాని సత్యాసత్యములు పరిశీలించమని మహారాజు పురోహితులను పంపాడు. వారు వెళ్ళి చూచి వచ్చి మహారాజుతో "ప్రభూ! ఇది సులక్షణ సంపన్నమైన యజ్ఞాశ్వము. ఇది లభించినప్పుడు అశ్వమేధయాగం చేసితీరాలి. చేయకపోతే వంశ నాశనమవుతుంది" అని తెలిపారు. ధర్మ సంకట స్థితిలో తప్పక అశ్వమేధయాగం ప్రారంభించాడు జనమేజయుడు. వ్యాసులవారు చెప్పినది గుర్తున్నది. అందుకని వృద్ధులైన యాజ్ఞికులనే నియమించాడు. యజ్ఞం జరుగుతున్నది.
విధి బలీయమైనది. ఒకరోజు వృద్ధ యాజ్ఞికులందరికి జ్వరములు, విరేచనములు పట్టుకొన్నవి. వారు రాలేక - క్రతుకలాపము ఆగకూడదు గనుక యువకులైన తమపుత్రులను పంపారు. ఆ రోజు యజ్ఞంలో భాగంగా మహారాణి అశ్వము దగ్గర శయనించాలి. అందులో జరిగే ఘట్టాన్ని చూచి యువ యాజ్ఞికులు వికృతహాసములు చేశారు. వారిని చూచిన జనమేజయునకు కోపం వచ్చి కత్తిదూసి ఆ తరుణబ్రాహ్మణులను నరికి వేశాడు. యజ్ఞశాలలో హాహాకారములు పుట్టినవి. బ్రాహ్మణ్యమంతా యజ్ఞశాల విడిచి పెట్టి వెళ్ళి పోయినారు. యాగం ఆగిపోయింది. అంతటితో ఆగలేదు. బ్రాహ్మణ సంఘం మహారాజు చర్యను ఖండించింది. రాజు భవనానికి ఆ రోజునుండి బ్రాహ్మణులెవరూ రాలేదు. నిత్యపూజలు, దేవతార్చనలు ఆగిపోయినవి. ఎన్నాళ్ళు గడిచినా బ్రాహ్మణులు సమ్మె ఆపలేదు. పట్టు విడిచిపెట్టలేదు. గత్యంతరం లేక జనమేజయుడు రాజ్యాధికారం విడిచిపెట్టి తన కుమారుడు శతానీకునకు పట్టం కట్టి వానప్రస్థాశ్రమం స్వీకరించి అడవులకు వెళ్ళిపోయినాడు. అయినా బ్రాహ్మణులు సమ్మెవీడలేదు. నిస్సహాయుడైన శతానీకుడు హస్తినాపురం విడిచిపెట్టి రాజధానిని కౌశాంబికి మార్చుకొన్నాడు. ఆ వంశీయులిప్పుడంత బలవంతులుగారు. వారికి దుష్టశిక్షణ శక్తి లేదు.
యువ: గురుదేవా! ఈ పరిణామం చిత్రంగా ఉంది. విధి బలీయం. తప్పదు. కాని నా కనిపిస్తున్నది. జనమేజయుడు మహారాజు. ఒక వర్తకుడు వచ్చి గుర్రాన్ని కొనకపోతే దానిని చంపుతాననగానే ఎందుకు కొనాలి. హత్య చేయబోతున్న నేరంపై వానిని కారాగాంలో పెట్టి ఆ గుర్రాన్ని స్వాధీనం చేసుకొని వర్తకుని వారసులను పిలిపించి అప్పగించవచ్చు. అంతదాకా గుర్రాన్ని కాపాడవచ్చు. కొనలేదు గనుక ఆ అశ్వంరాజుది కాదు. కాదుగనుక యజ్ఞం చేయవలసిన అవసరంలేదు. ఇలా ఏ దశలోనైనా నివారించే ఉపాయాలుంటవని అనుకొంటున్నాను.
వామ: కుశాగ్ర బుద్ధివి. కానీ కర్మ సిద్ధాంతం ఉన్నది. ఏదిఎలా జరగాలో అలానే జరుగుతుంది. జరిగింది.
యువ: చిత్తము. మిగతా రాజవంశీయుల పరిస్థితి ఏమిటో తెలియ జేయాలని అభ్యర్థిస్తున్నాను.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj