సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 3


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 3 🌹
🌹 గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) 🌹
3 వ భాగము
✍️ సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 3. రెండవ స్థితి 🍃

123. రెండవ స్థితిలో, జాగ్రత్తగా గమనించక పోయిన, మొదటి స్థితిలో చెప్పిన విషయాలే రెండవ స్థితిలో చెప్పినట్లు అనిపిస్తుంది. కాని ఈ రెంటికి తేడా తెలుసుకోవడానికి చాలా సాధన అవసరమవుతుంది. అందువలన ఈ తేడాను గమనించే బాధ్యత చదివేవారి యొక్క బుద్ధి, ఇంద్రియములకు మాత్రమే వదలివేయబడినది. ఇచట భౌతిక స్థితిని గాక ఆధ్యాత్మిక స్థితిని ఉపయోగించాలి.

124. మొదటి స్థితిలో సుషుప్తి (లయ) స్థితిని తెలుపుతుంది. రెండవ స్థితిలో ఆత్మ పరిధి చేరుకున్న తరువాత జరిగే మార్పులను వివరిస్తుంది.

125. సుషుప్తి యొక్క లయ స్థితిలో సృష్టి నిర్మాణ కర్తలు, అరూప స్థితిలోనూ ఆనందములో విశ్రాంతి తీసుకుంటున్నారు.

126. ఈ సృష్టి నిర్మాణ కర్తలు వ్యక్తిగత ఒక రోజు ప్రళయము (సుషుప్తి) నుండి కల్పాంతములో మహాప్రళయము వరకు ఒకే అర్థములో తీసుకొనవచ్చు. వీరు ఏడు గ్రహాలకు నిర్మాణకర్తలుగా గ్రహించవచ్చు.

127. ఎఱుక లేని లయ స్థితి ఆనందాన్ని ఇవ్వదు. కేవలము లయ స్థితినే తెలుపుతుంది. ఆధ్యాత్మిక లయ స్థితిలో వ్యక్తిగత విషయములను వదలి అనేక జన్మల, సామూహిక జన్మల సంస్కారముల యొక్క అనుభూతుల యొక్క పారమార్థిక అనుభూతికి చేరుతుంది.

128. ఆధ్యాత్మిక అనుభూతి స్థితిలో చెవులు లేవు శబ్దము లేదు, నిశ్శబ్దము లేదు. అచట నిరంతర శాశ్వత శ్వాస తప్ప ఏమియూ లేదు. అది తనను తాను తెలుసుకోలేదు.

129. లయ స్థితిలో భౌతిక ఉనికిని కోల్పోయినప్పటికీ వస్తువులు తమ అస్తిత్వమును కోల్పోవు అనేది భారతీయ మనో శాస్త్రానికి పునాది. లయ స్థితిలో ఉనికిని కోల్పోయినను, జాగృతిలోనూ మహా ప్రళయానంతర సృష్టిలోనూ అవి ప్రకటితమవుతాయి.

130. శ్వాస, సంస్కారాలను నిర్మించటానికి చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. గాఢ నిద్రలో కూడా శ్వాస నిరంతరము శ్రమిస్తూ తనపని తాను చేసుకుంటూ పోతుంది. వ్యక్తిగత సాధనలో ఈ స్థితిలో జరిగే మనోమయ కోశ మార్పులు, శ్వాసలోని మార్పులుగా గుర్తించాలి.

131. లయము చెందిన విత్తనములన్ని కూడా ఒకప్పుడు నిద్రాణమయి ఉన్న గ్రహ గోళములు. కాలము ఆసన్నమైనపుడు అవి తమతమ లక్షణాలన్నింటిని వ్యక్తపరచుకొనుటకు విత్తన రూపములోనే నిగూఢముగా ఉన్నవి.

132. వ్యక్తిగత జీవనములో, ఆ ముందు రోజు జరిగిన సంఘటనల స్వరూప స్వభావములను, నిద్రా స్థితిలో దైవ శక్తులకు అందజేసిన తరువాత, అదే దైవ శక్తులు రెండవ రోజు రూపుదాల్చబోయే సంఘటనలకు ఈ ముడి సరుకు ఉపయోగించి కావలసిన తగిన స్వరూపాన్ని ఇస్తున్నప్పటికి, ఆ పరిణామము అందరు గుర్తించ లేక పోతున్నారు. అందువలననే సమస్యలకు పరిష్కారములు లభించనపుడు కొంచం సేపు విశ్రాంతి (నిద్రా స్థితి) తీసుకోవాలని అనుకుంటారు.

133. వ్యక్తిగత సాధనలో లయ స్థితిలో ఉన్న సృష్టి మెల్లగా నూతన సృష్టి కార్యక్రమానికి సంసిద్ధత తెలుపుతుంది. ముందు జరగబోయే సంఘటనలు నిద్రా స్థితిలో ఆభాసగా కనిపిస్తాయి.
 
134. నిద్రా స్థితిలోనే తనకు అవసరమైన కామ, మనోమయ భావనలతో బాహ్య ప్రపంచములోని వాతావరణము మార్చటానికి కావలసిన పరిస్థితులు నిర్మించుకోవటానికి ఉపయోగించాలి.

135. లయ స్థితిలో, బీజ రూపంలో, కారణరూపంలోని దాని ఉనికి ఉంది. ఆ కిరణం బహిర్గతమైనపుడు తల్లి, తండ్రి, కొడుకు లేక జీవితము - మనస్సు, శరీరము, బుద్ధి, కామ, స్థూల శరీరములుగా మారుతుంది. ఆ విధముగా మాయ యొక్క బడిలో తమ పరిణామ క్రమాన్ని కొనసాగిస్తాయి.

136. గాఢ నిద్రలోని అతి ప్రగాఢ స్థితి, వ్యక్తిగతంగా సుషుప్తిలోని ఈ స్థాయిలో భవిష్యత్తు దర్శనం అనగా జీర్ణించుకున్న సంస్కారాన్ని, నూతన ప్రక్రియ క్రమానికి కావలసిన అగ్ని, జలము పొంది క్రొత్త బీజాలుగా రూపొందబోతున్నాయి. మార్పులు, చేర్పులు ఇక్కడే జరగాలి. ఆ స్థితిలో ఆ సంఘటన జరిగితీరవలసిందే దానిని ఎవరూ ఆపలేరు.

137. సృష్టి కర్త అయిన బ్రహ్మము నుండి వెలువడిన మొదటి సంతానం, సంతానోత్పత్తికి నిరాకరించింది. అది ఏవిధమైన కోరికలు లేని స్థితిలో ఉన్నది. అపుడు బ్రహ్మ తన మనస్సు నుండి సప్త ప్రజా పతులను ఉత్పన్నం చేస్తాడు. వారు మరీచి, అత్రి, అంగీరస, పోలస్త్య, పులహ, క్రతు, వసిష్ట అనువారలు. వారి భార్యల పేర్లు. అంబా, మాలా, నిలాన్ని, అభ్రయంతి, మాఘయంతి, వర్షయంతి, చుపునిక.

138. వ్యక్తిగత సాధనలో చీకటి సహాస్రారముగా, తల్లి ఆజ్ఞాచక్రముగా, సప్త ప్రజాపతులు శిరస్సులోని ఏడు శక్తి కేంద్రాలుగా అనగా పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధిగాను; ఇవి మధ్య బిందువును దాటి మెల్లమెల్లగా స్పందించటం మొదలుపెడతాయి. వ్యక్తి సుషుప్తి నుండి స్వప్న జాగ్రత్‌ స్థితులకు రావటం మొదలవుతుంది.
 
139. ఆత్మ అనుత్పాదక స్థితి నుండి అనగా సత్‌, చిత్‌, ఆనంద స్థాయి నుండి, చేతనత్వము అనగా ఉత్పాదక స్థాయికి దిగుచున్నది.

140. నిద్రా స్థితిని మూడు స్థాయిలుగా వివరించినపుడు, అన్నింటి కంటే పై పొర సత్‌, ఇంకాస్త లోపలికి వెళ్ళిన (ఎఱుక) చిత్‌, చివరి స్థితి ఆనందము. చిదానందములు ఇంకా సత్‌ అనగా ఉనికి స్థాయికి తయారుగా లేదు అని తెలుస్తుంది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹