శ్రీ లలితా సహస్ర నామములు - 112 / Sri Lalita Sahasranamavali - Meaning - 112

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 112 / Sri Lalita Sahasranamavali - Meaning - 112 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః |
సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ‖ 112 ‖ 🍀

🍀 548. విమర్శరూపిణీ -
జ్ఞాన విశ్లేషణకు సంబంధించిన బిందుస్వరూపము కలది.

🍀 549. విద్యా -
జ్ఞాన రూపిణి.

🍀 550. వియదాది జగత్ప్రసూ -
ఆకాశము మొదలైన పంచభూతాలతో కూడిన జగత్తును సృజించునది.

🍀 551. సర్వవ్యాధి ప్రశమనీ -
అన్ని విధములైన వ్యాధులకు ఉపశమనము కలుగజేయునది.

🍀 552. సర్వమృత్యు నివారిణీ -
సకల మృత్యుభయాలను పోగొట్టునది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 112 🌹

📚. Prasad Bharadwaj

🌻 112. vimarśarūpiṇī vidyā viyadādi-jagatprasūḥ |
sarvavyādhi-praśamanī sarvamṛtyu-nivāriṇī || 112 || 🌻

🌻 548 ) Vimarsa roopini -
She who is hidden from view

🌻 549 ) Vidhya -
She who is “learning”

🌻 550 ) Viyadhadhi jagat prasu -
She who created the earth and the sky

🌻 551 ) Sarva vyadhi prasamani -
She who cures all diseases

🌻 552 ) Sarva mrutyu nivarini -
She who avoids all types of death

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

07 Aug 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 63

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 63 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. ఐతరేయము 🌻

దేహము నందు జీవుడుగా బద్ధుడైనపుడు తన కన్న ఇతరమైన సృష్టి యుండుట కనిపించును.

ఇదియే వేదములందు కీర్తింపబడిన 'ఐతరేయము' అనబడు వెలుగు ( objectivity) . ఇది సృష్టి కనిపించుటకు అద్దము. దీనిలో దేవుడు కనిపించడు.

తనకు తానుగా జీవుడు తనను గుర్తించినచో తాను దేవుడుగా కనిపించును. దీనినభ్యసించిన వెనుక మిగిలిన సృష్టిలో కూడ తననే దర్శించును.

✍🏼 మాస్టర్ ఇ.కె.

భాగవతము 2-84

🌹 🌹 🌹 🌹 🌹

07 Aug 2021

వివేక చూడామణి - 112 / Viveka Chudamani - 112

🌹. వివేక చూడామణి - 112 / Viveka Chudamani - 112🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు

సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

🍀. 25. వైరాగ్య స్థితి - 2 🍀

375. పూర్తిగా వైరాగ్యమును పొందిన వ్యక్తి మాత్రమే సమాధి స్థితిని చేరగలడు మరియు స్థిరమైన జ్ఞానాన్ని పొందగలడు. అట్టి జ్ఞాని మాత్రమే సత్యాన్ని గ్రహించి బంధనాల నుండి విముక్తి పొందగలడు. అతడే స్వేచ్ఛను పొందిన ఆత్మానుభవముతో ఆనంద స్థితిని చేరగలడు. 

376. స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తి ఏమంటాడంటే ‘’నాకు ఏవిధమైన ఇతర పరికరము, ఆనందమును పొందుటకు లభించలేదు, ఒక్క వైరాగ్యము తప్ప’’. ఆ వైరాగ్యముతో ఆత్మ జ్ఞానము పొందిన, అది తిరుగులేని స్వేచ్ఛను కలుగజేస్తుంది. దాని ప్రభావముతో అంతములేని విముక్తిని పొందగలడు. అందువలన వ్యక్తి క్షేమము కొరకు బాహ్యాభ్యంతర్గత వ్యవహారములలో తన మనస్సును శాశ్వతమైన ఆత్మ పై ఉంచుము. 

377. నీ యొక్క ప్రాపంచిక వస్తు సముదాయమును ఎంతగా కోరినప్పటికి, అవి విషమువంటివని వాని వలన చావు అంటిపెట్టుకొని ఉంటుందని గ్రహించి, నీ యొక్క కులముపై ఆపేక్ష, కుటుంబ జీవితములకు దూరముగా ఉంటూ, నీ గుర్తింపు అలాంటి అసత్య విషయములు, శరీరముపై గాక ఆత్మ వైపు మనస్సును మళ్ళించుము. అపుడు మాత్రమే నీవు నిజముగా బ్రహ్మమును దర్శించగలవు. మనస్సును ఒక క్షణము కూడా చలింపనీయకుండా కేవలం ఆత్మ పైన ఉంచి ధ్యానింపుము. 

 సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 112 🌹

✍️ Sri Adi Shankaracharya

Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 25. Vairagya (Dispassion) - 2 🌻

375. The extremely dispassionate man alone has Samadhi, and the man of Samadhi alone gets steady realisation; the man who has realised the Truth is alone free from bondage, and the free soul only experiences eternal Bliss.

376. For the man of self-control I do not find any better instrument of happiness than dispassion, and if that is coupled with a highly pure realisation of the Self, it conduces to the suzerainty of absolute Independence; and since this is the gateway to the damsel of everlasting liberation, therefore for thy welfare, be dispassionate both internally and externally, and always fix thy mind on the eternal Self.

377. Sever thy craving for the sense-objects, which are like poison, for it is the very image of death, and giving up thy pride of caste, family and order of life, fling actions to a distance. Give up thy identification with such unreal things as the body, and fix thy mind on the Atman. For thou art really the Witness, Brahman, unshackled by the mind, the One without a second, and Supreme.

Continues.... 

🌹 🌹 🌹 🌹 🌹

07 Aug 2021

శ్రీ శివ మహా పురాణము - 436

🌹 . శ్రీ శివ మహా పురాణము - 436🌹 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴 

అధ్యాయము - 27

🌻. బ్రహ్మచారి శివుని నిందించుట - 2 🌻

బ్రాహ్మణుడిట్లు పలికెను-

మహాదేవుడు వృషభము ధ్వజమునందు గలవాడు, భస్మచే లిప్తమైన దేహము గలవాడు జటలను ధరించువాడు, పెద్దపులి, చర్మమును వస్త్రముగా ధరించువాడు, ఏనుగు చర్మము ఉత్తరీయముగా గలవాడు (12). ఆయన కపాలమును ధరించును. ఆయన శరీరమంతయూ పాములచే చుట్టబడి యుండును ఆయన విషమును ధరించి యుండును. ఆయన తినకూడని పదార్ధములను తినును. వికృతమగు కన్నులుగల ఆయనను చూచినచో భయము కలుగును(13).

ఆయన పుట్టుక గురించి ఎవ్వరికి తెలియదు. ఆయన ఏనాడూ గృహ సుఖములనెరుంగడు. ఆయన దిగంబరుడు పది చేతులు గలవాడు. భూతప్రేతములు సర్వదా ఆయనను చుట్టువారి యుండును. (14). ఆయనను నీవు భర్తగా కోరుటకు కారణమేమి? ఓ దేవీ! నీ జ్ఞానము ఎచ్చటకు పోయినది? నాకీ విషయమును ఆలోచించి చెప్పుము (15). 

నేనాతని భయంకరమగు వ్రతమును గూర్చి పూర్వమే వినియుంటిని. నీకు కూడా వినుట యందు అభిరుచియున్నచో, ఇప్పుడు చెప్పెదను. వినుము(16) దక్షపుత్రి, ప్రతివ్రత యగు సతి వృషభము వాహనముగా గల శివుని పూర్వము దైవవశముచే భర్తగా పొందెను. ఆమె పొందిన భోగము అందరికీ తెలిసినదే(17).

సతీదేవి కపాలమును ధరించువాని భార్యయను కారణముచే దక్షుడామెను తిరస్కరించినాడు. మరియు యజ్ఞములో భాగము ఈయబడే దేవతలలో శంభుని జేర్చలేదు.(18) ఆ అవమానముచే మిక్కిలి కోపమును, దుఃఖమును పొందిన సతీదేవి శంకరుని విడిచిపెట్టి, ప్రియమగు ప్రాణములను కూడ త్యజించెను(19). 

నీవు స్త్రీలలో గొప్పదానవు నీ తండ్రి పర్వతములన్నింటికీ రాజు. నీవు ఉగ్రమగు తపస్సును అట్టి భర్తను పొందవలెననే కోరికతో ఏల చేయుచున్నావు?(20) బంగరు నాణమునిచ్చి నీవు గాజు ముక్కనుపొందగోరుచున్నావు. నీవు స్వచ్ఛమగు చందనమును త్రోసిపుచ్చి బురదను శరీరముపై లేపనము చేయగోరుచున్నావు.(21)

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

07 Aug 2021 

గీతోపనిషత్తు -236

🌹. గీతోపనిషత్తు -236 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚

శ్లోకము 18 - 1

🍀 17 - 1. వ్యక్తా వ్యక్తములు - ఉషః కాలమునుండి క్రమముగ వెలుగేర్పడు చుండగ సమస్త జీవులు ఎట్లు మేల్కాంచునో అట్లే సృష్టి ఉషస్సు నందు క్రమముగ సృష్టి, సృష్టిజీవులు ఏర్పడుచు, సృష్టి నిర్మాణ మగుననియు, మరల సాయంకాలము నుండి సృష్టి తిరోధానము చెందుచు అవ్యక్తము లోనికి చనుననియు తెలుపబడినది. 🍀

అవ్యక్తా ద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే
రాత్ర్యాగమే ప్రలీయంతే తతైవావ్యక్త సంజ్ఞకే || 18

తాత్పర్యము : అహస్సు ఆగమము నందు అవ్యక్తము నుండి సమస్తము క్రమముగ వ్యక్తమగునని, అట్లే సాయం సంధ్యా గమనము నుండి ప్రారంభమగు రాత్రికాలమున అంతయు అవ్యక్తము లోనికి పోవుననియు ఈ శ్లోకము తెలియపరుచు చున్నది.

వివరణము : ఉషః కాలమునుండి క్రమముగ వెలుగేర్పడు చుండగ సమస్త జీవులు ఎట్లు మేల్కాంచునో అట్లే సృష్టి ఉషస్సు నందు క్రమముగ సృష్టి, సృష్టిజీవులు ఏర్పడుచు, సృష్టి నిర్మాణ మగుననియు, మరల సాయంకాలమునుండి సృష్టి తిరోధానము చెందుచు అవ్యక్తము లోనికి చనుననియు తెలుపబడినది. మనము కూడ నిద్ర నుండి మేల్కాంచినపుడు క్రమముగ ప్రపంచమున ప్రవేశించుచు, రాత్రియగుసరికి నిద్రలోనికి తిరోగమనము చెందుచు నుందుము. పగటియందు వ్యక్తమై యున్నను, రాత్రియందు అవ్యక్తములోనికి జారిపోవుచుందుము.

మెలకువ వచ్చినది మొదలు క్రమముగ మనయందలి ఎరుక వ్యాప్తి చెందుచు మిట్టమధ్యాహ్నమునకు తారాస్థాయిని చేరును. సాయంత్రము వరకు వ్యక్తముననే వర్తించుచు రాత్రి సమయమున తిరోగమించి నిద్రలోనికి కొనిపోబడును. మన పగలు, మన రాత్రి ఎట్లో బ్రహ్మదేవుని పగలు, రాత్రి అట్లే. కాని పరిమాణము విషయమున దోమకు, ఏనుగుకు గల తేడా యున్నది. పరిమాణమున భేదమున్నను సూత్ర మొక్కటియే.

రాత్రియందు నిద్రాస్థితిలో మనమందరము అవ్యక్తముగనే యున్నాము. మనమెట్లుంటిమో మనకు తెలియదు. మెలకువ వచ్చినది మొదలు మనమున్నామని తెలియుట, మనకు అనేకానేక ఊహలు జనించుట, ఉక్కిరి బిక్కిరిగ కార్యక్రమములు నిర్వర్తించు కొనుట చేయుదుము. మరల రాత్రియందు నిదుర ఆవేశించి, అవ్యక్తములోనికి గొని పోబడినపుడు మనమున్నామని గూడ తెలియదు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

07 Aug 2021

7-AUGUST-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 236 🌹  
2) 🌹. శివ మహా పురాణము - 437🌹 
3) 🌹 వివేక చూడామణి - 111 / Viveka Chudamani - 111🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -64🌹  
5) 🌹 Osho Daily Meditations - 53🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 112 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -236 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 18 - 1
 
*🍀 17 - 1. వ్యక్తా వ్యక్తములు - ఉషః కాలమునుండి క్రమముగ వెలుగేర్పడు చుండగ సమస్త జీవులు ఎట్లు మేల్కాంచునో అట్లే సృష్టి ఉషస్సు నందు క్రమముగ సృష్టి, సృష్టిజీవులు ఏర్పడుచు, సృష్టి నిర్మాణ మగుననియు, మరల సాయంకాలము నుండి సృష్టి తిరోధానము చెందుచు అవ్యక్తము లోనికి చనుననియు తెలుపబడినది. 🍀*

అవ్యక్తా ద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే
రాత్ర్యాగమే ప్రలీయంతే తతైవావ్యక్త సంజ్ఞకే || 18

తాత్పర్యము : అహస్సు ఆగమము నందు అవ్యక్తము నుండి సమస్తము క్రమముగ వ్యక్తమగునని, అట్లే సాయం సంధ్యా గమనము నుండి ప్రారంభమగు రాత్రికాలమున అంతయు అవ్యక్తము లోనికి పోవుననియు ఈ శ్లోకము తెలియపరుచు చున్నది. 

వివరణము : ఉషః కాలమునుండి క్రమముగ వెలుగేర్పడు చుండగ సమస్త జీవులు ఎట్లు మేల్కాంచునో అట్లే సృష్టి ఉషస్సు నందు క్రమముగ సృష్టి, సృష్టిజీవులు ఏర్పడుచు, సృష్టి నిర్మాణ మగుననియు, మరల సాయంకాలమునుండి సృష్టి తిరోధానము చెందుచు అవ్యక్తము లోనికి చనుననియు తెలుపబడినది. మనము కూడ నిద్ర నుండి మేల్కాంచినపుడు క్రమముగ ప్రపంచమున ప్రవేశించుచు, రాత్రియగుసరికి నిద్రలోనికి తిరోగమనము చెందుచు నుందుము. పగటియందు వ్యక్తమై యున్నను, రాత్రియందు అవ్యక్తములోనికి జారిపోవుచుందుము.

మెలకువ వచ్చినది మొదలు క్రమముగ మనయందలి ఎరుక వ్యాప్తి చెందుచు మిట్టమధ్యాహ్నమునకు తారాస్థాయిని చేరును. సాయంత్రము వరకు వ్యక్తముననే వర్తించుచు రాత్రి సమయమున తిరోగమించి నిద్రలోనికి కొనిపోబడును. మన పగలు, మన రాత్రి ఎట్లో బ్రహ్మదేవుని పగలు, రాత్రి అట్లే. కాని పరిమాణము విషయమున దోమకు, ఏనుగుకు గల తేడా యున్నది. పరిమాణమున భేదమున్నను సూత్ర మొక్కటియే. 

రాత్రియందు నిద్రాస్థితిలో మనమందరము అవ్యక్తముగనే యున్నాము. మనమెట్లుంటిమో మనకు తెలియదు. మెలకువ వచ్చినది మొదలు మనమున్నామని తెలియుట, మనకు అనేకానేక ఊహలు జనించుట, ఉక్కిరి బిక్కిరిగ కార్యక్రమములు నిర్వర్తించు కొనుట చేయుదుము. మరల రాత్రియందు నిదుర ఆవేశించి, అవ్యక్తములోనికి గొని పోబడినపుడు మనమున్నామని గూడ తెలియదు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 436🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 27

*🌻. బ్రహ్మచారి శివుని నిందించుట - 2 🌻*

బ్రాహ్మణుడిట్లు పలికెను-

మహాదేవుడు వృషభము ధ్వజమునందు గలవాడు, భస్మచే లిప్తమైన దేహము గలవాడు జటలను ధరించువాడు, పెద్దపులి, చర్మమును వస్త్రముగా ధరించువాడు, ఏనుగు చర్మము ఉత్తరీయముగా గలవాడు (12). ఆయన కపాలమును ధరించును. ఆయన శరీరమంతయూ పాములచే చుట్టబడి యుండును ఆయన విషమును ధరించి యుండును. ఆయన తినకూడని పదార్ధములను తినును. వికృతమగు కన్నులుగల ఆయనను చూచినచో భయము కలుగును(13).

ఆయన పుట్టుక గురించి ఎవ్వరికి తెలియదు. ఆయన ఏనాడూ గృహ సుఖములనెరుంగడు. ఆయన దిగంబరుడు పది చేతులు గలవాడు. భూతప్రేతములు సర్వదా ఆయనను చుట్టువారి యుండును. (14). ఆయనను నీవు భర్తగా కోరుటకు కారణమేమి? ఓ దేవీ! నీ జ్ఞానము ఎచ్చటకు పోయినది? నాకీ విషయమును ఆలోచించి చెప్పుము (15). 

నేనాతని భయంకరమగు వ్రతమును గూర్చి పూర్వమే వినియుంటిని. నీకు కూడా వినుట యందు అభిరుచియున్నచో, ఇప్పుడు చెప్పెదను. వినుము(16) దక్షపుత్రి, ప్రతివ్రత యగు సతి వృషభము వాహనముగా గల శివుని పూర్వము దైవవశముచే భర్తగా పొందెను. ఆమె పొందిన భోగము అందరికీ తెలిసినదే(17).

సతీదేవి కపాలమును ధరించువాని భార్యయను కారణముచే దక్షుడామెను తిరస్కరించినాడు. మరియు యజ్ఞములో భాగము ఈయబడే దేవతలలో శంభుని జేర్చలేదు.(18) ఆ అవమానముచే మిక్కిలి కోపమును, దుఃఖమును పొందిన సతీదేవి శంకరుని విడిచిపెట్టి, ప్రియమగు ప్రాణములను కూడ త్యజించెను(19). 

నీవు స్త్రీలలో గొప్పదానవు నీ తండ్రి పర్వతములన్నింటికీ రాజు. నీవు ఉగ్రమగు తపస్సును అట్టి భర్తను పొందవలెననే కోరికతో ఏల చేయుచున్నావు?(20) బంగరు నాణమునిచ్చి నీవు గాజు ముక్కనుపొందగోరుచున్నావు. నీవు స్వచ్ఛమగు చందనమును త్రోసిపుచ్చి బురదను శరీరముపై లేపనము చేయగోరుచున్నావు.(21)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 112 / Viveka Chudamani - 112🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 25. వైరాగ్య స్థితి - 2 🍀*

375. పూర్తిగా వైరాగ్యమును పొందిన వ్యక్తి మాత్రమే సమాధి స్థితిని చేరగలడు మరియు స్థిరమైన జ్ఞానాన్ని పొందగలడు. అట్టి జ్ఞాని మాత్రమే సత్యాన్ని గ్రహించి బంధనాల నుండి విముక్తి పొందగలడు. అతడే స్వేచ్ఛను పొందిన ఆత్మానుభవముతో ఆనంద స్థితిని చేరగలడు. 

376. స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తి ఏమంటాడంటే ‘’నాకు ఏవిధమైన ఇతర పరికరము, ఆనందమును పొందుటకు లభించలేదు, ఒక్క వైరాగ్యము తప్ప’’. ఆ వైరాగ్యముతో ఆత్మ జ్ఞానము పొందిన, అది తిరుగులేని స్వేచ్ఛను కలుగజేస్తుంది. దాని ప్రభావముతో అంతములేని విముక్తిని పొందగలడు. అందువలన వ్యక్తి క్షేమము కొరకు బాహ్యాభ్యంతర్గత వ్యవహారములలో తన మనస్సును శాశ్వతమైన ఆత్మ పై ఉంచుము. 

377. నీ యొక్క ప్రాపంచిక వస్తు సముదాయమును ఎంతగా కోరినప్పటికి, అవి విషమువంటివని వాని వలన చావు అంటిపెట్టుకొని ఉంటుందని గ్రహించి, నీ యొక్క కులముపై ఆపేక్ష, కుటుంబ జీవితములకు దూరముగా ఉంటూ, నీ గుర్తింపు అలాంటి అసత్య విషయములు, శరీరముపై గాక ఆత్మ వైపు మనస్సును మళ్ళించుము. అపుడు మాత్రమే నీవు నిజముగా బ్రహ్మమును దర్శించగలవు. మనస్సును ఒక క్షణము కూడా చలింపనీయకుండా కేవలం ఆత్మ పైన ఉంచి ధ్యానింపుము. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 112 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 25. Vairagya (Dispassion) - 2 🌻*

375. The extremely dispassionate man alone has Samadhi, and the man of Samadhi alone gets steady realisation; the man who has realised the Truth is alone free from bondage, and the free soul only experiences eternal Bliss.

376. For the man of self-control I do not find any better instrument of happiness than dispassion, and if that is coupled with a highly pure realisation of the Self, it conduces to the suzerainty of absolute Independence; and since this is the gateway to the damsel of everlasting liberation, therefore for thy welfare, be dispassionate both internally and externally, and always fix thy mind on the eternal Self.

377. Sever thy craving for the sense-objects, which are like poison, for it is the very image of death, and giving up thy pride of caste, family and order of life, fling actions to a distance. Give up thy identification with such unreal things as the body, and fix thy mind on the Atman. For thou art really the Witness, Brahman, unshackled by the mind, the One without a second, and Supreme.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 63 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఐతరేయము 🌻*

దేహము నందు జీవుడుగా బద్ధుడైనపుడు తన కన్న ఇతరమైన సృష్టి యుండుట కనిపించును. 

ఇదియే వేదములందు కీర్తింపబడిన 'ఐతరేయము' అనబడు వెలుగు ( objectivity) . ఇది సృష్టి కనిపించుటకు అద్దము. దీనిలో దేవుడు కనిపించడు.  

తనకు తానుగా జీవుడు తనను గుర్తించినచో తాను దేవుడుగా కనిపించును. దీనినభ్యసించిన వెనుక మిగిలిన సృష్టిలో కూడ తననే దర్శించును.

✍🏼 *మాస్టర్ ఇ.కె.*
భాగవతము 2-84
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 53 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 STORMS 🍀*

*🕉 It is good to be available to the wind, to the rain, to the sun, because this is what life is. So rather than becoming worried about it, dance! 🕉*

Growth means that you are absorbing something new every day, and that absorption is possible only if you are open. Now your windows and doors are open. Sometimes the rain comes in and the wind comes in, the sun comes, and life moves within you. So you will feel a few disturbances: Your newspaper will start moving in the wind, the papers on the table will be disturbed, and if the rain starts coming in your clothes may become wet. If you have always lived in a closed room, you will ask, "What is happening?" 

Something beautiful is happening. It is good to be available to the wind, to the rain, to the sun, because this is what life is. So rather than becoming worried about it, dance! Dance when the storm comes, because silence will follow. Dance when challenges come and disturb your life, because in responding to those challenges you will be growing to new heights. Remember, even suffering is a grace. 

If one can take it rightly it becomes a stepping stone. People who have never suffered and have lived a convenient and comfortable, life are almost dead. Their lives will not be like a sharp sword. It will not even cut vegetables. Intelligence becomes sharp when you face challenges. Pray every day to God, "Send me more challenges tomorrow, send more storms," and then you will know life at the optimum.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 112 / Sri Lalita Sahasranamavali - Meaning - 112 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః |*
*సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ‖ 112 ‖ 🍀*

🍀 548. విమర్శరూపిణీ - 
జ్ఞాన విశ్లేషణకు సంబంధించిన బిందుస్వరూపము కలది.

🍀 549. విద్యా - 
జ్ఞాన రూపిణి.

🍀 550. వియదాది జగత్ప్రసూ - 
ఆకాశము మొదలైన పంచభూతాలతో కూడిన జగత్తును సృజించునది.

🍀 551. సర్వవ్యాధి ప్రశమనీ - 
అన్ని విధములైన వ్యాధులకు ఉపశమనము కలుగజేయునది.

🍀 552. సర్వమృత్యు నివారిణీ - 
సకల మృత్యుభయాలను పోగొట్టునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 112 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 112. vimarśarūpiṇī vidyā viyadādi-jagatprasūḥ |*
*sarvavyādhi-praśamanī sarvamṛtyu-nivāriṇī || 112 || 🌻*

🌻 548 ) Vimarsa roopini -  
 She who is hidden from view

🌻 549 ) Vidhya -   
She who is “learning”

🌻 550 ) Viyadhadhi jagat prasu -   
She who created the earth and the sky

🌻 551 ) Sarva vyadhi prasamani -   
She who cures all diseases

🌻 552 ) Sarva mrutyu nivarini -   
She who avoids all types of death

Continues...
🌹 🌹 🌹 🌹 🌹 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹