శ్రీ లలితా సహస్ర నామములు - 82 / Sri Lalita Sahasranamavali - Meaning - 82

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 82 / Sri Lalita Sahasranamavali - Meaning - 82 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।
శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀

🍀 373. కామేశ్వరప్రాణనాడీ -
శివుని ప్రాణనాడీ స్వరూపిణి.

🍀 374. కృతజ్ఞా -
చేయబడే పనులన్నీ తెలిసింది.

🍀 375. కామపూజితా -
కామునిచే పూజింపబడునది.

🍀376. శృంగారరససంపూర్ణా -
శీర్షములతోను, కోణములచేతను, నవరసాదినావముల చేతను కూడి నిండుగా ఉంది.

🍀 377. జయా -
జయస్వరూపిణి.

🍀 378. జాలంధరస్థితా -
జాలంధరసూచిత స్థానము నందున్నది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 82 🌹

📚. Prasad Bharadwaj

🌻 82. kāmeśvara-prāṇanāḍī kṛtajñā kāmapūjitā |
śṛṅgāra-rasa-sampūrṇā jayā jālandhara-sthitā || 82 || 🌻

🌻 373 ) Kameshwara prana nadi -
She who is the life source of Kameswara

🌻 374 ) Kruthagna -
She who watches all actions of every one or She who knows all

🌻 375 ) Kama poojitha -
She who is being worshipped by the god of love in the kama giri peeta of Mooladhara chakra-Kama

🌻 376 ) Srungara rasa sampoorna -
She who is lovely

🌻 377 ) Jayaa -
She who is personification of victory

🌻 378 ) Jalandhara sthitha -
She who is on Jalandhara peetha or She who is purest of the pure

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

30 May 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 33

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 33 🌹

✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనం : వేణుమాధవ్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. ప్రకృతి-జీవనము 🌻

ప్రకృతిని గమనించుకొనుచు జీవితమును నడిపించినచో మార్పులను ఏ విధముగా అర్థము చేసికొనవలెనో తెలియును.

ఆకలి పుట్టినపుడు అన్నము తినవలెనని తెలియును. వెంటనే అన్నము తిన్నచో కర్తవ్య నిర్వహణము అనబడును. లేక వేదాంతమో వాణిజ్యమో అంతకన్నా ముఖ్యమని ఆలస్యము చేసినచో, మనము ఏర్పరచుకొనిన‌ కార్యక్రమము కర్తవ్యము‌ కాకపోవును.

మన ఇష్టము, అభిమానము వేరు. మనతో పనిచేయుచున్న‌ ప్రకృతి వేరు. ప్రకృతిలో పొరపాటుండదు. ఇష్టాఇష్టములలో పొరపాట్లుండును.

వేదాంతము‌ ఎంత గొప్పదియైనను, ఆహారమునకు‌గల వేళలు అంతకన్నా గొప్పవి కాకపోవచ్చును గాని అంతకన్నా సత్యములు..

🌹 🌹 🌹 🌹 🌹

30 May 2021

గీతోపనిషత్తు -205

🌹. గీతోపనిషత్తు -205 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 46, 47, Part 1

🍀 45-1. యోగీభవ - తపస్సు చేయువారి కంటెను, జ్ఞానుల కంటెను, ఉత్తమోత్తమ కర్మలు చేయువారి కంటెను యోగి అధికుడు. కావున ఓ అర్జునా! నీవు యోగివి కమ్ము. తపస్సులు చేయువారు, జ్ఞానులు, శ్రేష్ఠమగు కర్మల నాచరించు వారు లోకమునందు అధికులుగ భావింపబడుదురు. కాని వారి యందు సమభావము, సమదర్శనము, సమతుల్యము నుండుట అరుదుగ నుండును. తపఃశక్తి వలన అపుడపుడు సహనము కోల్పోవుట జరుగు చుండును. సమదర్శనము లేనిచో సహన ముండదు. సహనము కోల్పోయినపుడు సంయమ ముండదు. సమభావము కలుగదు. 🍀

తపస్విభ్యో 2 ధికో యోగీ జ్ఞానిభ్యో పిమతో 2 ధికః |
కర్మిభ్య శ్చాధికో యోగీ తస్మా ద్యోగీ భవార్జున || 46

యోగినా మపి సర్వేషాం మద్దతే నాంతరాత్మనా |
శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్తతమో మతః|| 47

తపస్సు చేయువారి కంటెను, జ్ఞానుల కంటెను, ఉత్తమోత్తమ కర్మలు చేయువారి కంటెను యోగి అధికుడు. కావున ఓ అర్జునా! నీవు యోగివి కమ్ము, శ్రీ కృష్ణుడు యోగి యొక్క ఉత్తమ స్థితిని తెలుపుచున్నాడు.

తపస్సులు చేయువారు, జ్ఞానులు, శ్రేష్ఠమగు కర్మల నాచరించు వారు లోకమునందు అధికులుగ భావింపబడుదురు. కాని వారి యందు సమభావము, సమదర్శనము, సమతుల్యము నుండుట అరుదుగ నుండును. తీవ్ర తపస్సులు చేసి దైవానుగ్రహము పొందినవారు కూడ సమదర్శనులు కాక ప్రవర్తించు సన్నివేశములున్నవి. కోపాద్రిక్తతతో శపించిన తపస్విజనులు కలరు. తపస్విజనులు శక్తివంతు లగుదురు.మహిమలు కలిగి యుందురు.

కాని మట్టిని, బంగారమును, పాపిని, పుణ్యుని, ఏనుగును, దోమను, రాజును, బంటును చూచినపుడు సమదృష్టి లేక వైవిధ్యమును చూపుదురు. ప్రత్యేకించి పాపులను చూచునపుడు ఉదాసీనులై యుండలేరు. హీనులను చూచునపుడు నిరసించుట కూడ జరుగును. యోగులు అట్టివారందరి యెడల ఉదాసీనులై యుందురు.

శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు. అతడు తన జీవితమున దుర్వాసుడు, విశ్వామిత్రుడు, కణ్వుడు ఇత్యాది తపస్వి జనులను చూచెను. వారి ప్రవర్తనమున సమదర్శనము లేక వారు శపించినవారిని తాను కాచుట జరిగినది. తపఃశక్తి వలన అపుడపుడు సహనము కోల్పోవుట జరుగుచుండును. సమదర్శనము లేనిచో సహన ముండదు. సహనము కోల్పోయినపుడు సంయమ ముండదు. సమభావము కలుగదు.

యాదవుల ప్రవర్తనకు కలత చెందిన కణ్వ విశ్వామిత్ర మహర్షులు సహనమును కోల్పోయిరి. అట్టి యాదవులతో తన జీవిత మంతయు గడిపినవాడు శ్రీకృష్ణుడు. అతడు యోగేశ్వరుడు. అట్టివారి వృద్ధికై శ్రమించినవాడు వాసుదేవుడు. అతడు యోగీశ్వరుడు.

ఇట్లు యోగులు సమతుల్యమైన ప్రవర్తన కలిగియుందురు. కావున తపస్విజనుల కన్న అధికులు. జ్ఞానులు జ్ఞానుల సాంగత్యమే కోరుదురు. అజ్ఞానుల నడుమ నుండలేరు. అవిద్యను సహించలేరు. అవిద్యావర్తనులను చూచి నపుడు వారికి (జ్ఞానులకు) చులకన భావన కలుగును.

అట్టి వారియందు కూడ ఈశ్వరుడున్నాడని మరతురు. వారు అవిద్య, అశుచిలను సహింపలేరు. శ్రీకృష్ణుడు గోపకులతో కూడి ఎంగిలి ముద్దలను తినెను. పూలమ్ముకొను వానిని శీఘ్రముగ అను గ్రహించెను. పచ్చికబయళ్ళ పై పరుండెను. కాలమును దేశమును బట్టి తానున్న పరిసరములయందు, జీవుల యందు అంతర్యామిని దర్శించు సమబుద్ధి యోగుల కున్నట్లు జ్ఞానుల కుండదు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

30 May 2021

శ్రీ శివ మహా పురాణము - 405

🌹 . శ్రీ శివ మహా పురాణము - 405🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 22

🌻. పార్వతీ తపోవర్ణనము - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ దేవర్షీ! నీవు వెళ్లగానే, పార్వతి సంతసించిన మనస్సు గలదై శివుడు తపస్సుచే ప్రసన్నుడగునని తలంచి, తపస్సును చేయుటకు మనస్సులో నిశ్చయము చేసుకొనెను (1). అపుడామె జయ, విజయ, అను చెలికత్తెలనిద్దరినీ తోడ్కొని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారిచే తల్లిదండ్రులను అడిగించెను (2). ఆమె ముందుగా పర్వత రాజు, తన తండ్రి అగు హిమవంతుని వద్దకు వెళ్లి, వినయముతో గూడినదై ప్రణమిల్లి ఇట్లు అడిగించెను (3).

సఖురాండ్రిద్దరు ఇట్లు పలికిరి-

ఓ హిమవంతుడా! నీ కుమారై మనసులోని మాటను ఇపుడు మేము చెప్పెదము. ఆమె తన దేహమునకు సౌందర్యమునకు (4), మరియు నీ ఈ కులమునకు సార్ధక్యమును కలిగింప గోరుచున్నది. ఈ శివుడు తపస్సునకు మాత్రమే లొంగును. తపస్సు చేయనిచో, ఆయన దర్శనము నీయడు (5). ఓ పర్వత రాజా! కావున నీవిపుడు అనుమతిని ఇమ్ము. పార్వతి నీ ప్రేమ పూర్వకమగు ఆజ్ఞను బడసి అడవికి వెళ్లి తపస్సు చేయును గాక! (6).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మహర్షీ! పార్వతి యొక్క సఖురాండ్రిద్దరు ఈ తీరున కోరగా, అపుడా పర్వతరాజు చక్కగా ఆలోచించి ఇట్లు పలికను (7).

హిమవంతుడిట్లు పలికెను-

ఈ ప్రస్తావము నాకు సమ్మతమే. కాని మేనకకు సమ్మతము కావలయును గదా! భవిష్యత్తులో ఇటులనే జరిగినచో, ఇంతకంటె ఇత్తమమగు విషయమేమి గలదు? (8) ఈమె తపస్సు చేసినచో, నా కులము సార్థకమగుననుటలో సందేహము లేదు. కావున ఈమె తల్లికి సమ్మతమైనచో, అంతకంటె గొప్ప శుభము మరి యేది గలదు? (9)

బ్రహ్మ ఇట్లు పలికెను-

హిమవంతుని ఈ మాటలను విని ఆ సఖురాండ్రిద్దరు ఆమెతో గూడి తల్లి అనుమతిని పొందుటకై ఆమె వద్దకు వెళ్లిరి (10). ఓ నారదా! వారిద్దరు పార్వతియొక్క తల్లి వద్దకు వెళ్లి ఆమెకు చేతులు జోడించి నమస్కరించి ఆదరముతో నిట్లనిరి (11).

సఖురాండ్రిద్దరు ఇట్లు పలికిరి-

ఓ తల్లీ! నీవు నీ కుమారై యొక్క మనస్సులోని మాటను వినుము. ఓ దేవీ! నీకు నమస్కారము. ఆమె మాటను ప్రసన్నమగు మసస్సుతో విని నీవు ఆచరించ తగుదువు (12). నీ కుమారై శివుని కొరకై తపస్సును చేయగోరుచున్నది. ఆమె పరమ తపస్సును చేయుటకు తండ్రిగారి అనుమతి లభించినది. ఇపుడామె నీ అనుమతిని గోరుచున్నది. (13). ఓ పతివ్రతా! ఈమె తన సౌందర్యమును సఫలము చేయగోరుచున్నది. నీవు అనుమతినిచ్చినచో, ఆమె ఈ ఆకాంక్షను సత్యము చేయుటకై తపస్సును చేయగలదు (14).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

30 May 2021

30-MAY-2021

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 204🌹  
2) 🌹. శివ మహా పురాణము - 405🌹 
3) 🌹 Light On The Path - 152🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -33 🌹  
5) 🌹 Osho Daily Meditations - 22🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 82 / Lalitha Sahasra Namavali - 82🌹 
7) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 82 / Sri Vishnu Sahasranama - 82🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -205 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 46, 47, Part 1

*🍀 45-1. యోగీభవ - తపస్సు చేయువారి కంటెను, జ్ఞానుల కంటెను, ఉత్తమోత్తమ కర్మలు చేయువారి కంటెను యోగి అధికుడు. కావున ఓ అర్జునా! నీవు యోగివి కమ్ము. తపస్సులు చేయువారు, జ్ఞానులు, శ్రేష్ఠమగు కర్మల నాచరించు వారు లోకమునందు అధికులుగ భావింపబడుదురు. కాని వారి యందు సమభావము, సమదర్శనము, సమతుల్యము నుండుట అరుదుగ నుండును. తపఃశక్తి వలన అపుడపుడు సహనము కోల్పోవుట జరుగు చుండును. సమదర్శనము లేనిచో సహన ముండదు. సహనము కోల్పోయినపుడు సంయమ ముండదు. సమభావము కలుగదు. 🍀*

తపస్విభ్యో 2 ధికో యోగీ జ్ఞానిభ్యో పిమతో 2 ధికః |
కర్మిభ్య శ్చాధికో యోగీ తస్మా ద్యోగీ భవార్జున || 46

యోగినా మపి సర్వేషాం మద్దతే నాంతరాత్మనా |
శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్తతమో మతః|| 47

తపస్సు చేయువారి కంటెను, జ్ఞానుల కంటెను, ఉత్తమోత్తమ కర్మలు చేయువారి కంటెను యోగి అధికుడు. కావున ఓ అర్జునా! నీవు యోగివి కమ్ము, శ్రీ కృష్ణుడు యోగి యొక్క ఉత్తమ స్థితిని తెలుపుచున్నాడు.

తపస్సులు చేయువారు, జ్ఞానులు, శ్రేష్ఠమగు కర్మల నాచరించు వారు లోకమునందు అధికులుగ భావింపబడుదురు. కాని వారి యందు సమభావము, సమదర్శనము, సమతుల్యము నుండుట అరుదుగ నుండును. తీవ్ర తపస్సులు చేసి దైవానుగ్రహము పొందినవారు కూడ సమదర్శనులు కాక ప్రవర్తించు సన్నివేశములున్నవి. కోపాద్రిక్తతతో శపించిన తపస్విజనులు కలరు. తపస్విజనులు శక్తివంతు లగుదురు.మహిమలు కలిగి యుందురు. 

కాని మట్టిని, బంగారమును, పాపిని, పుణ్యుని, ఏనుగును, దోమను, రాజును, బంటును చూచినపుడు సమదృష్టి లేక వైవిధ్యమును చూపుదురు. ప్రత్యేకించి పాపులను చూచునపుడు ఉదాసీనులై యుండలేరు. హీనులను చూచునపుడు నిరసించుట కూడ జరుగును. యోగులు అట్టివారందరి యెడల
ఉదాసీనులై యుందురు. 

శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు. అతడు తన జీవితమున దుర్వాసుడు, విశ్వామిత్రుడు, కణ్వుడు ఇత్యాది తపస్వి జనులను చూచెను. వారి ప్రవర్తనమున సమదర్శనము లేక వారు శపించినవారిని తాను కాచుట జరిగినది. తపఃశక్తి వలన అపుడపుడు సహనము కోల్పోవుట జరుగుచుండును. సమదర్శనము లేనిచో సహన ముండదు. సహనము కోల్పోయినపుడు సంయమ ముండదు. సమభావము కలుగదు. 

యాదవుల ప్రవర్తనకు కలత చెందిన కణ్వ విశ్వామిత్ర మహర్షులు సహనమును కోల్పోయిరి. అట్టి యాదవులతో తన జీవిత మంతయు గడిపినవాడు శ్రీకృష్ణుడు. అతడు యోగేశ్వరుడు. అట్టివారి వృద్ధికై శ్రమించినవాడు వాసుదేవుడు. అతడు యోగీశ్వరుడు. 

ఇట్లు యోగులు సమతుల్యమైన ప్రవర్తన కలిగియుందురు. కావున తపస్విజనుల కన్న అధికులు. జ్ఞానులు జ్ఞానుల సాంగత్యమే కోరుదురు. అజ్ఞానుల నడుమ నుండలేరు. అవిద్యను సహించలేరు. అవిద్యావర్తనులను చూచి నపుడు వారికి (జ్ఞానులకు) చులకన భావన కలుగును. 

అట్టి వారియందు కూడ ఈశ్వరుడున్నాడని మరతురు. వారు అవిద్య, అశుచిలను సహింపలేరు. శ్రీకృష్ణుడు గోపకులతో కూడి ఎంగిలి ముద్దలను తినెను. పూలమ్ముకొను వానిని శీఘ్రముగ అను గ్రహించెను. పచ్చికబయళ్ళ పై పరుండెను. కాలమును దేశమును బట్టి తానున్న పరిసరములయందు, జీవుల యందు అంతర్యామిని దర్శించు సమబుద్ధి యోగుల కున్నట్లు జ్ఞానుల కుండదు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 405🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 22

*🌻. పార్వతీ తపోవర్ణనము - 1 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ దేవర్షీ! నీవు వెళ్లగానే, పార్వతి సంతసించిన మనస్సు గలదై శివుడు తపస్సుచే ప్రసన్నుడగునని తలంచి, తపస్సును చేయుటకు మనస్సులో నిశ్చయము చేసుకొనెను (1). అపుడామె జయ, విజయ, అను చెలికత్తెలనిద్దరినీ తోడ్కొని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారిచే తల్లిదండ్రులను అడిగించెను (2). ఆమె ముందుగా పర్వత రాజు, తన తండ్రి అగు హిమవంతుని వద్దకు వెళ్లి, వినయముతో గూడినదై ప్రణమిల్లి ఇట్లు అడిగించెను (3).

సఖురాండ్రిద్దరు ఇట్లు పలికిరి-

ఓ హిమవంతుడా! నీ కుమారై మనసులోని మాటను ఇపుడు మేము చెప్పెదము. ఆమె తన దేహమునకు సౌందర్యమునకు (4), మరియు నీ ఈ కులమునకు సార్ధక్యమును కలిగింప గోరుచున్నది. ఈ శివుడు తపస్సునకు మాత్రమే లొంగును. తపస్సు చేయనిచో, ఆయన దర్శనము నీయడు (5). ఓ పర్వత రాజా! కావున నీవిపుడు అనుమతిని ఇమ్ము. పార్వతి నీ ప్రేమ పూర్వకమగు ఆజ్ఞను బడసి అడవికి వెళ్లి తపస్సు చేయును గాక! (6).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మహర్షీ! పార్వతి యొక్క సఖురాండ్రిద్దరు ఈ తీరున కోరగా, అపుడా పర్వతరాజు

చక్కగా ఆలోచించి ఇట్లు పలికను (7).

హిమవంతుడిట్లు పలికెను-

ఈ ప్రస్తావము నాకు సమ్మతమే. కాని మేనకకు సమ్మతము కావలయును గదా! భవిష్యత్తులో ఇటులనే జరిగినచో, ఇంతకంటె ఇత్తమమగు విషయమేమి గలదు? (8) ఈమె తపస్సు చేసినచో, నా కులము సార్థకమగుననుటలో సందేహము లేదు. కావున ఈమె తల్లికి సమ్మతమైనచో, అంతకంటె గొప్ప శుభము మరి యేది గలదు? (9)

బ్రహ్మ ఇట్లు పలికెను-

హిమవంతుని ఈ మాటలను విని ఆ సఖురాండ్రిద్దరు ఆమెతో గూడి తల్లి అనుమతిని పొందుటకై ఆమె వద్దకు వెళ్లిరి (10). ఓ నారదా! వారిద్దరు పార్వతియొక్క తల్లి వద్దకు వెళ్లి ఆమెకు చేతులు జోడించి నమస్కరించి ఆదరముతో నిట్లనిరి (11).

సఖురాండ్రిద్దరు ఇట్లు పలికిరి-

ఓ తల్లీ! నీవు నీ కుమారై యొక్క మనస్సులోని మాటను వినుము. ఓ దేవీ! నీకు నమస్కారము. ఆమె మాటను ప్రసన్నమగు మసస్సుతో విని నీవు ఆచరించ తగుదువు (12). నీ కుమారై శివుని కొరకై తపస్సును చేయగోరుచున్నది. ఆమె పరమ తపస్సును చేయుటకు తండ్రిగారి అనుమతి లభించినది. ఇపుడామె నీ అనుమతిని గోరుచున్నది. (13). ఓ పతివ్రతా! ఈమె తన సౌందర్యమును సఫలము చేయగోరుచున్నది. నీవు అనుమతినిచ్చినచో, ఆమె ఈ ఆకాంక్షను సత్యము చేయుటకై తపస్సును చేయగలదు (14).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 152 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 11 - Master Hilarion’s note on Rule 21.
*🌻 When the disciple is ready to learn, then he is accepted, acknowledged, recognized. It must be so, for he has lit his lamp, and it cannot be hidden. - 3 🌻*

563. In exactly the same way, if people think themselves better in various ways than others who are selected by the Masters as pupils, they should remember that the Master makes His selections with unerring judgment. 

There are no doubt many things on higher planes which even a Master does not yet know, but quite certainly with regard to all these lower planes with which we have anything to do, His knowledge may be accepted as infallible. There are higher Adepts who stand above the Masters, such as the Manu and the Bodhisattva, the Buddha and the great Lord of the World, who must know certain things which even our Masters do not know: that is clear.

 The Logos of the solar system must know still more, and beyond that there must be higher Logoi who have yet wider knowledge. But we may be quite sure of the Master’s judgment and accuracy with regard to these planes which He has fully and finally mastered. Therefore, if He chooses a man He is not making a mistake.

564. Even in the rare case when a man afterwards falls away and acts unworthily it does not follow that the Master made a mistake in selecting such a man. The man must have had the right to that splendid opportunity, and because he had earned that right the opportunity had to be given him. 

A vast amount of trouble may have been taken in the training of such a pupil, and it looks as though it were wasted; but that is not so. It will all count somewhere, somehow, in the course of his evolution; that is certain. 

The Master sometimes offers an opportunity to a man because he has earned it, although there may be in that man along with certain good qualities others less desirable, which would make him unsuitable if they happened to get the upper hand. Nevertheless the offer is made because it is just that it should be made.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#LightonPath #Theosophy
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 33 🌹*
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనం : వేణుమాధవ్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. ప్రకృతి-జీవనము 🌻*

ప్రకృతిని గమనించుకొనుచు జీవితమును నడిపించినచో మార్పులను ఏ విధముగా అర్థము చేసికొనవలెనో తెలియును. 

ఆకలి పుట్టినపుడు అన్నము తినవలెనని తెలియును. వెంటనే అన్నము తిన్నచో కర్తవ్య నిర్వహణము అనబడును. లేక వేదాంతమో వాణిజ్యమో అంతకన్నా ముఖ్యమని ఆలస్యము చేసినచో, మనము ఏర్పరచుకొనిన‌ కార్యక్రమము కర్తవ్యము‌ కాకపోవును. 

మన ఇష్టము, అభిమానము వేరు. మనతో పనిచేయుచున్న‌ ప్రకృతి వేరు. ప్రకృతిలో పొరపాటుండదు. ఇష్టాఇష్టములలో పొరపాట్లుండును. 

వేదాంతము‌ ఎంత గొప్పదియైనను, ఆహారమునకు‌గల వేళలు అంతకన్నా గొప్పవి కాకపోవచ్చును గాని అంతకన్నా సత్యములు..
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 22 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 LOVE'S FRAGILITY 🍀*

*🕉 Don't think that love is eternal. It is very fragile, as fragile as a rose. In the morning it is there-by the evening it is gone. Any small thing can destroy it. 🕉*

The higher a thing is, the more fragile it is. It has to be protected. A rock will remain, but the flower will be gone. If you, throw a rock at the flower, the rock is not going to be hurt, but the flower will be destroyed.

Love is very fragile, very delicate. One has to be very careful and cautious about it. You can do such harm that the other becomes closed, becomes defensive. If you are fighting too much, your partner will start escaping; he will become more and more cold, more and more closed, so that he is no longer vulnerable to your attack. 

Then you will attack him some more, because you will resist that coldness. This can become a vicious circle. And that's how lovers fall apart, by and by. They drift away from each other, and they think that the other was responsible, that the other betrayed them.

In fact, as I see it, no lover has ever betrayed anybody. It is only ignorance that kills love. Both wanted to be together, but somehow both were ignorant. Their ignorance played tricks on them and became multiplied.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 82 / Sri Lalita Sahasranamavali - Meaning - 82 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।*
*శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀*

🍀 373. కామేశ్వరప్రాణనాడీ - 
శివుని ప్రాణనాడీ స్వరూపిణి.

🍀 374. కృతజ్ఞా - 
చేయబడే పనులన్నీ తెలిసింది.

🍀 375. కామపూజితా - 
కామునిచే పూజింపబడునది.

🍀376. శృంగారరససంపూర్ణా -
 శీర్షములతోను, కోణములచేతను, నవరసాదినావముల చేతను కూడి నిండుగా ఉంది.

🍀 377. జయా - 
జయస్వరూపిణి.

🍀 378. జాలంధరస్థితా -
 జాలంధరసూచిత స్థానము నందున్నది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 82 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 82. kāmeśvara-prāṇanāḍī kṛtajñā kāmapūjitā |*
*śṛṅgāra-rasa-sampūrṇā jayā jālandhara-sthitā || 82 || 🌻*

🌻 373 ) Kameshwara prana nadi -   
She who is the life source of Kameswara

🌻 374 ) Kruthagna -   
She who watches all actions of every one or She who knows all

🌻 375 ) Kama poojitha -   
She who is being worshipped by the god of love in the kama giri peeta of Mooladhara chakra-Kama

🌻 376 ) Srungara rasa sampoorna -   
She who is lovely

🌻 377 ) Jayaa -  
 She who is personification of victory

🌻 378 ) Jalandhara sthitha -  
 She who is on Jalandhara peetha or She who is purest of the pure

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 82 / Sri Vishnu Sahasra Namavali - 82 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*ఉత్తరాషాడ నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం*

*🍀 82. చతుర్మూర్తి శ్చతుర్బాహుః చతుర్వ్యూహశ్చతుర్గతిః|*
*చతురాత్మా చతుర్భావః చతుర్వేదవి దేకపాత్|| 🍀*

🍀 765) చతుర్మూర్తి: - 
నాలుగు రూపములు గలవాడు.

🍀 766) చతుర్బాహు: - 
నాలుగు బాహువులు గలవాడు.

🍀 767) చతుర్వ్యూహ: - 
శరీర, వేద, ఛందో మహద్రూపుడైన పురుషుడు. ఈ నలుగురు పురుషులు వ్యూహములుగా కలవాడు.

🍀 768) చతుర్గతి: - 
నాలుగు విధములైన వారికి ఆశ్రయ స్థానము.

🍀 769) చతురాత్మా - చతురమనగా సామర్ధ్యము.

🍀 770) చతుర్భావ: - 
చతుర్విద పురుషార్థములకు మూలమైనవాడు.

🍀 771) చతుర్వేదవిత్ - 
నాలుగు వేదములను తెలిసినవాడు.

🍀 772) ఏకపాత్ - 
జగత్తంతయు ఒక పాదముగా గలవాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 82 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Utarashada 2nd Padam*

*🌻 caturmūrti ścaturbāhu ścaturvyūha ścaturgatiḥ |*
*caturātmā caturbhāva ścaturveda videkapāt || 82 || 🌻*

🌻 765. Caturmūrtiḥ: 
One with four aspects as Virat, Sutratma, Avyakruta, and Turiya. Or one with four horns with colours white, red, yellow and black.

🌻 766. Caturbāhuḥ: 
One with four arms, as Vasudeva is always described.

🌻 767. Caturvyūhaḥ: 
One having four manifestations.

🌻 768. Caturgatiḥ: 
One who is sought as the end by the four Orders of life and four Varnas ordained by the scriptures.

🌻 769. Caturātmā: 
One whose self is specially endowed with puissance, because it is without any attachment, antagonism, etc.

🌻 770. Caturbhāvaḥ: 
One from whom has originated the four human values - Dharma, Artha, Kama, and Moksha.

🌻 771. Catur-vedavid: 
One who understands the true meaning of the four Vedas.

🌻 772. Ekapāt: 
One with a single Pada, part or leg. Or one with a single foot or manifestation.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹