🌹 24, OCTOBER 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹

🍀🌹 24, OCTOBER 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 24, OCTOBER 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
🍀. విజయ దశమి - దసరా శుభాకాంక్షలు అందరికి, Vijaya Dasami - Dasara Good Wishes to All 🍀
🌷. విజయదశమి పండుగ విశిష్టత / The specialty of Vijayadashami festival 🌷
🌹. శమీ వృక్ష పూజ అంతరార్థం - పరమార్థం / Inner Meaning of Shami Vriksha Puja - Paramarth 🌹
2) 🌹 కపిల గీత - 254 / Kapila Gita - 254 🌹 
🌴 6. దేహ గేహముల యందు ఆసక్తుడైన వానికి ప్రాప్తించు అధోగతి - 19 / 6. Description by Lord Kapila of Adverse Fruitive Activities - 19 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 846 / Vishnu Sahasranama Contemplation - 846 🌹 
🌻846. వంశవర్ధనః, वंशवर्धनः, Vaṃśavardhanaḥ🌻
4) 🌹. శివ సూత్రములు - 161 / Siva Sutras - 161 🌹 
🌻 3-8. జాగ్రద్ ద్వితీయకారః   - 2 / 3-8. jāgrad dvitīyakarah   - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 24, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*🍀. విజయ దశమి - దసరా శుభాకాంక్షలు అందరికి, Vijaya Dasami - Dasara Good Wishes to All 🍀*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : విజయ దశమి, దసరా, దుర్గా విసర్జనము, Vijaya Dasami, Durga Visarjan, Dussehra, 🌻*

*🌷. శ్రీ విజయ దుర్గా స్తోత్రము*
*దుర్గాదుర్గార్తిశమనీ దుర్గాపద్వినివారిణీ | దుర్గమచ్చేదినీ దుర్గసాధినీ దుర్గానాశినీ*
*దుర్గాతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా | దుర్గమజ్ఞానదా దుర్గదైత్య లోకదవానలా*

*🍀. శ్రీ అపరాజితా దేవి స్తోత్రం 🍀*
*నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః |*
*నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్*
*రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః |*
*జ్యోత్స్నాయై చేన్దురూపిణ్యై సుఖాయై సతతం నమః*

*🍀. శమీ వృక్ష ప్రార్థన*
*శమీ శమయతే పాపం శమీ నాశయతే రిపూన్‌*
*శమీ విత్తంచ పుత్రంచ శమీ దిత్సతి సంపదమ్*‌

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ధీరస్థిరతా సాధన - అంతరమున నున్న పురుషుని నుండి బాహ్య ప్రకృతిని విడదీయడం ధీరస్థిరతా సాధనకు అత్యంతావశ్యకం ఆలోచనల సుడులలో చిక్కు కొనడం, విషయ వాంఛలకు లోను గావడం ధీరస్థిరతా సిద్ధికి ప్రతిబంధకాలు, వాటి నుండి తాను వేరు కాగలిగి అవి తన కంటె వేరనే అనుభవాన్ని సాధకుడు తప్పనిసరిగా సంపాదించుకోవాలి. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
ఆశ్వీజ మాసం
తిథి: శుక్ల-దశమి 15:15:00 వరకు
తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: ధనిష్ట 15:28:16 వరకు
తదుపరి శతభిషం
యోగం: దండ 15:40:51 వరకు
తదుపరి వృధ్ధి
కరణం: గార 15:13:00 వరకు
వర్జ్యం: 22:04:54 - 23:33:06
దుర్ముహూర్తం: 08:30:56 - 09:17:26
రాహు కాలం: 14:54:33 - 16:21:44
గుళిక కాలం: 12:00:11 - 13:27:22
యమ గండం: 09:05:49 - 10:33:00
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23
అమృత కాలం: 05:50:22 - 07:19:14
మరియు 30:54:06 - 32:22:18
సూర్యోదయం: 06:11:27
సూర్యాస్తమయం: 17:48:55
చంద్రోదయం: 14:42:30
చంద్రాస్తమయం: 01:29:08
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: కుంభం
యోగాలు: ఉత్పాద యోగం - కష్టములు,
ద్రవ్య నాశనం 15:28:16 వరకు తదుపరి
మృత్యు యోగం - మృత్యు భయం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విజయదశమి – దశపాప హర దశమి శుభాకాంక్షలు అందరికి , Happy Vijayadashami – DasaPapa Hara Dasami to All. 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌷. విజయదశమి పండుగ విశిష్టత / The specialty of Vijayadashami festival 🌷* 

*దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని తెలియచేయ బడింది . 'శ్రవణా' నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి "విజయ"అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయ దశమి' అను పేరు వచ్చినది. ఏ పనైనా తిధి ,వారము తారా బలము , గ్రహాబలము ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము .'చతుర్వర్గ చింతామణి 'అనే ఉద్గ్రందము ఆశ్వయుజ శుక్లదశమి నాటి నక్షత్రోదయ వేళనే 'విజయం ' అని తెలిపి యున్నది . ఈ పవిత్ర సమయము సకలవాంచితార్ద సాధకమైనదని గురు వాక్యము.*

*విజయదశమి పండుగ అపరాజిత పేరు మీద వస్తుంది. పరాజయం లేకుండా విజయాన్ని సాధించేది కాబట్టి, విజయదశమి అయింది. పాండవులు శమీ వృక్ష రూపమున ఉన్న అపరాజిత దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు . "శ్రీ రాముడు" విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి రావణుని సంహరించి, విజయము పొందినాడు. విజయదశమి రోజు పరాజయం లేని అపరాజితాదేవిని .. శ్రీచక్ర అధిష్టాన దేవత... షోడశ మహావిద్యా స్వరూపిణి అయిన శ్రీ విజయదుర్గను ... శ్రీ రాజరాజేశ్వరీదేవిని ఎవరైతే పూజిస్తారో! వారందరికీ ఖచ్చితంగా విజయం లభిస్తుంది. అమ్మవారు పరమశాంత స్వరూపంతో, సమస్త నిత్యామ్నయ పరివార సమేతంగా, మహా కామేశ్వరుడుని అంకంగా చేసుకొని, ఆది పరాశక్తి... రాజరాజేశ్వరి దేవిగా శాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ, చెరకుగడను (ఇక్షుఖండం) ధరించి, ఒక చేతితో అభయ ముద్రతో దర్శనమిస్తుంది. మణిద్వీప వర్ణనలో "శ్రీపురంలో చింతామణి "అనే గృహంలో నివసిస్తూ ఉంటుంది. చెడుపై సాధించే విజయమే విజయదశమి. ముఖ్యంగా మన మనసులో ఉన్న చెడు ప్రవర్తన మార్చుకుని (చెడుపై సాధించిన విజయంగా..) విజయదేవిని, విజయదశమి రోజు పూజిస్తే సర్వ శుభాలూ కలుగుతాయి. ఈమె ఆది ప్రకృతి స్వరూపిణి. దుర్గాదేవి వివిధ కల్పాలలో, వివిధ రూపాలు ధరించి నానా దుష్టజనులని సహకరించి, లోకాలకి ఆనందం కలిగించింది. మహిమాన్విత అయిన శ్రీచక్ర అధిష్టాన దేవతయే... లలితా దేవతయే... శ్రీరాజరాజేశ్వరీ దేవి. ఈ తల్లి నివాసం "శ్రీమణిద్వీప -- శ్రీనగర స్థిత -- చింతామణి గృహం". ఈ తల్లి ఎక్కడ నివసిస్తుందో! అక్కడ అన్నీ శుభాలే!!!*

*🍀. దసరా సాధనాపర విశిష్టత 🍀*

*దసరా అంటే ఏమిటి ? మనలో ఉన్న పంచ జ్ఞాన, పంచ కర్మేన్ద్రియాలైన దశ ఇంద్రియాలు- దోపిడీ, హింస, స్త్రీ వ్యామోహం, లోభం, వంచన, పరుష వాక్కు, అసత్యం, పరనింద, చాడీ చెప్పటం, అధికార దుర్వినియోగం అనే దశ అంటే పది పాపపు పనులు చేస్తాయి. ఈ పది రకాల పాపాలు హరి౦చటానికి జగన్మాతను కొలిచే పండగనే "దశ హర" అంటారు. అదే దసరా గా మారింది. బాల్య, యవ్వన, కౌమార వార్ధక్య౦ 4 దశలు దాటి పోవాలంటే జన్మ రాహిత్య స్థితి పొందాలి. ఈ జన్మ రాహిత్య స్థితిని పొందటానికి , మానవ జన్మల దశలను హరి౦చ మని శ్రీ దేవిని నవరాత్రులు ఆరాధించటమే దశహరా – దసరా. పరుషంగా మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం, అసంబద్ధమైన మాటలు మాట్లాడటం, సమాజం వినలేని మాటలు మాట్లాడటం – ఈ నాలుగు రకాల పాపాలు మాటల ద్వారా చేసేవి. తనది కాని ధనము, వస్తువులపై వ్యామోహం కలిగి ఉండటం, ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులను చేయటం, ఇతరులకు చెడు చేయాలనుకోవడం ఈ మూడు మానసికంగా చేసే పాపాలు. అర్హత లేని వానికి దానాన్ని ఇవ్వడం, శాస్త్రము ఒప్పని హింసను చేయడం, పర స్త్రీని లేదా పురుషున్ని స్వీకరించడం ఈ మూడు శరీరంతో చేసే పాపాలు. మొత్తం ఇవి పది పాపాలు. ఈ పది పాపాల నుండి విముక్తిని ప్రసాదించి, మనందరి జీవితాలు సుఖసంతోషాలతో, సకల ఐశ్వర్యాలతో ఉండేలా చేయమని దుర్గామాతను వేడుకోవాలి.*

*🙏. చదువుకోవలసిన స్తోత్రాలు 🙏*

*రాజరాజేశ్వరి దేవి అష్టోత్తరం, కవచం, సహస్రనామ స్తోత్రం, శ్రీ విజయదుర్గా స్తోత్రం ఇత్యాదివి చదువుకోవాలి. లలితా సహస్రనామాల్లో "రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభా" అనే శ్లోకం అత్యంత ఫలదాయకం. "ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవతాయై నమః" అనే మంత్రం జపించుకోవచ్చు. రాజరాజేశ్వరి దేవి గాయత్రి మంత్రం "ఓం రాజరాజేశ్వరి రూపాయ విద్మహే! అంబికాయై ధీమ హి తన్నోమాతః ప్రచోదయాత్ "అనే మంత్రాన్ని జపించుకోవాలి.*

*🍀. శ్రీ అపరాజితా దేవి స్తోత్రం 🍀*
*నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః |*
*నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్*
*రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః |*
*జ్యోత్స్నాయై చేన్దురూపిణ్యై సుఖాయై సతతం నమః*

*🍀. శ్రీ విజయ దుర్గా స్తోత్రము 🍀*
*దుర్గాదుర్గార్తిశమనీ దుర్గాపద్వినివారిణీ | దుర్గమచ్చేదినీ దుర్గసాధినీ దుర్గానాశినీ*
*దుర్గాతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా | దుర్గమ జ్ఞానదా దుర్గదైత్య లోకదవానలా*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Happy Vijayadashami – DasaPapa Hara Dasami to All.*
*✍️. Prasad Bhardwaj*

*🌷. The specialty of Vijayadashami festival 🌷*

*It is said that this Vijaya Dasami is the auspicious day when Amrita was born when the gods churned the ocean of milk. Ashvayuja Dashami associated with 'Shravana' Nakshatra has the sign of 'Vijaya'. That is why it got the name 'Vijaya Dashami'. If any work is undertaken on Vijayadashami without asking Tidhi, Vara, Tara Balam, Grahabalam Muhurta, then success is assured. The saying 'Chaturvarga Chintamani' says 'Victory' at the time of star rise on Ashvayuja Shukladashami. Guru Vakya says that this holy time is beneficial for all*

*Vijayadasami festival comes in the name of Aparajita. It is Vijayadasami because it means victory without defeat. The Pandavas won the victory over the Kauravas with the blessings of the invincible Goddess Aparajita Devi in the form of Shami vruksha. 'Sri Rama' worshiped this 'Aparajita' Devi on Vijayadashami and killed Ravana and got victory. Whoever worships the invincible Aparajitadevi on the day of Vijayadashami .. Srichakra Adhisthana deity ... Shree Vijaydurga who is the embodiment of Shodasa Mahavidya ... Shree Rajarajeshwaridevi! All of them will definitely get success. Ammavaru appears in Paramashanta form, accompanied by all Nityamnaya Parivara, with Maha Kameshwar as her figure, Adi Parashakti... Rajarajeshwari as Goddess Rajarajeswari smiling in a Shanta form, wearing a sugar cane (Ikshukhandam) and holding abhaya mudra in one hand. In Manidvipa description she is described as living in a house called 'Chintamani in Sripuram'. Victory over evil is Vijaya dasami. Especially if we change the bad behavior in our mind (as a victory over evil..) and worship Goddess Vijaya on Vijayadashami day, all good things will come. She is the embodiment of primordial nature. Goddess Durga in different kalpas, dressed in different forms, helped many evil people and brought joy to the worlds. The glorious presiding deity of Srichakra…the deity Lalita herself is…the deity Srirajarajeshwari. The abode of this mother is 'Shrimanidweepa -- Srinagara Stitha -- Chintamani Griha'. Where this mother resides, All good there!!!*

*🍀. Dussehra Sadhanapara Speciality 🍀*

*What is Dussehra? The Dasa Indriyas which are the Pancha Gnana and Pancha Karmendriyas- Extortion, Violence, Woman Infatuation, Greed, Hypocrisy, Harsh Speech, Lying, Backbiting, Slander, Abuse of Power, Dasa i.e. Ten Sinful Actions. The festival where Jaganmata is worshiped to remove these ten types of sins is called 'Dasa Hara'. The same became Dussehra. To pass through the 4 stages of childhood, youth, adolescence and old age, one must attain the state of birthlessness. Dashahara – Dussehra is the worship of Shri Devi for 10 nights to destroy the stages of human births, to attain this birthless state. Speaking harshly, telling lies, speaking nonsense, speaking words that society cannot tolerate – these four kinds of sins are committed through words. To be infatuated with money that is not one's own, to be infatuated with things, to do things that cause trouble to others, and to want to do evil to others - these three are mental sins. Giving alms to an unworthy person, committing violence against the law, and accepting another woman or man are the three bodily sins. These are ten sins in total. We should pray to Goddess Durga to grant us freedom from these ten sins and make our lives full of happiness and all the riches.*

*🙏. Hymns to study 🙏*

*Rajarajeshwari Devi Ashtottaram, Kavacham, Sahasranama Stotram, Sri Vijayadurga Stotram etc. should be studied. The hymn 'Rajarajeshwari Rajyadaiini Rajyavallabha' is the most fruitful in Lalita's Sahasranamas. One can chant the mantra 'Om Sri Rajarajeshwari Devatayai Namah'. Rajarajeshwari Devi Gayatri Mantra 'Om Rajarajeshwari Rupaya Vidmahe! ambikayai dhima hi tannomatah prachodayat' One should chant the mantra '*

*🍀. Shri Aparajita Devi Stotram 🍀*
*Namo Devyai Mahadevyai Shivayai Satatam Namah |*
*namah prakrtyai bhadrayai niyatah pranatah smatham*
*Raudrayai Namo Nityayai Gaurayai Dhatryai Namo Namah |*
*Jyotsnayai Chendurupinyai Sukhayai Satatam Namah*

*🍀. Sri Vijaya Durga Stotra 🍀*
*Durgadurgartishamani Durgapadvinivarini |*
*Durgatoddharini Durganihantri Durgamapaha | Durgama Jnanada Durgadaitya Lokadavanala*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శమీ వృక్ష పూజ అంతరార్థం - పరమార్థం / Inner Meaning of Shami Vriksha Puja - Paramarth 🌹*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసంతో విరాట నగరానికి వచ్చి నగర పొలిమేరలలో ఉన్న శమీవృక్షం మీద తమ ఆయుధాల నుంచి ఆరాధించి, నమస్కరించి మా ఈ ఆయుధాలు శత్రువులకు పాములు, భూతాల వలె మిత్రులకు పుష్పమాలలు వలె తమకు మాత్రం ఆయుధాలుగా కనబడాలని అపరాజితా దేవిని (దుర్గాదేవిని) ప్రార్థించారు. అజ్ఞాతవాసం అనంతరం ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు ఆయుధాలను తీసుకుని బయలుదేరిన రోజు ‘విజయదశమి’. సాధారణంగా శమీ వృక్షం గ్రామానికి దూరంగా ఉంటుంది. ఆ ఆచారాన్ని అనుసరించే ఈనాటికి కూడా విజయదశమి నాడు శమీవృక్షాన్ని దర్శించి, పూజిస్తారు.*

*శమీ వృక్షమంటే 'జమ్మి చెట్టు'. పాండవులు శమీవృక్ష రూపమున ఉన్న 'అపరాజిత'దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు . "శ్రీ రాముడు" ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి రావణుని సంహరించి, విజయము పొందినాడు. శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయము ఆశ్వయుజ శుక్లపాడ్యమి. నాటినుంచి పదోరోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పకమెక్కి అయోధ్యకు బయలుదేరాడు. అలా బయల్దేరేముందు శమీ వృక్షాన్ని పూజించాడు. అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి, విజయదశమినాడు అందరూ శమీపూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది.*

*విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మి చెట్టు) వద్ద గల అపరాజితా దేవిని పూజించి , పై శ్లోకం పఠిస్తూచెట్టుకు ప్రదక్షణలు చేయాలి . పై శ్లోకము వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలించాలి . ఇలా చేయుట వల్ల అమ్మవారి కృపతోపాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.*

*ఇంటికి వచ్చేటప్పుడు తమ వెంట జమ్మి ఆకును తెస్తారు. చిన్న వాళ్లు పెద్దల చేతులలో జమ్మి ఆకును ‘బంగారం' అని చెప్పి పెట్టి, వారి దీవెనలందు కోవడం ఆచారంగా పాటిస్తారు. బంగారం లక్ష్మిదేవికి ప్రతీక. మీరు కూడా ఈరోజు సాయంత్రం శమీపూజ చేసి అపరాజితా దేవి అనుగ్రహాన్ని పొందండి.*

*శమీ శమయతే పాపం శమీ నాశయతే రిపూన్‌*
*శమీ విత్తంచ పుత్రంచ శమీ దిత్సతి సంపదమ్*‌

*అనే ఈ పద్మపురాణ శ్లోకాన్ని లేదా శమీ వృక్ష పార్ధనా స్తోత్రం శమీ వృక్షం వద్ద పఠించాలి.*

*🌴. శమీ వృక్ష ప్రార్థనా స్తోత్రం 🌴 *

*శమీ శమయ తే పాపం శమీ శత్రు వినాశినీ*
*అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శిని ॥*

*శమీం కమలపత్రాక్షీం శమీం కంటకధారిణీం*
*ఆరోహతు శమీం లక్ష్మీం నృణామాయుష్యవర్ధనీం ॥*

*నమో విశ్వాసవృక్షాయ పార్థశస్త్రాస్త్రధారిణే*
*త్వత్తః పత్రం ప్రతీక్ష్యామి సదా మే విజయీ భవ ॥*

*ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది*
*పౌరుషే చాఽప్రతిద్వంద్వశ్చరైనం జహిరావణిమ్ ॥*

*అమంగళానాం ప్రశమీం దుష్కృతస్య చ నాశినీం*
*దుస్స్వప్నహారిణీం ధన్యాం ప్రపద్యేఽహం శమీం శుభాం ॥*

*🪷. మంత్రార్థం 🪷*
*శమీ వృక్షము అనేది పాపాన్ని శమింపచేసేది. శత్రువులను నాశనం చేస్తుందిది. ఇది నాడు అర్జునుని ధనువును కల్గి ఉండింది. శ్రీరాముడికి ప్రియాన్ని కల్గించింది. యాత్రార్థులకు సౌఖ్యాన్నిస్తుంది. పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది.*

*🍀. శమీ వృక్ష పార్థనకు సాధనాపర విశిష్టత 🍀*

*పంచ పాండవులు అనగా శరీరంలో ఉండే ఐదు జ్ఞానేంద్రియాలు, తమ ఆయుధాలను అనగా ప్రవృత్తులను లేదా ఇంద్రియాలు చేసే పనులను శమీవృక్షం మీద పెట్టాలి. ‘శమీ’ అనగా శాంతింప చేసేది లేదా నిగ్రహింప చేసేదని అర్థం. మన శరీరంలోని ఏ చిన్న భాగం కదలికయినా బుద్ధి ప్రేరణతోనే జరగాలి. కావున ‘శమీ’ అనగా బుద్ధి, అన్ని ఆయుధాలు బుద్ధిలోనే కలవు. ‘బుద్ధి’కి నిజమైన ఆయుధాలు ‘ఆలోచనలు’. ఈ ఆయుధాలు శత్రువులకు పాములు, భూతాలులాగా కనబడతాయి. అనగా మన ఆలోచనలే శత్రువుల విషయంలో పాములై కాటేసి, భూతాలు వలె భయపెడతాయి కానీ ఆత్మీయులకు పూలమాలలు అవుతాయి. మన బుద్ధే జ్ఞానలక్ష్మి. కావున అమ్మవారిని జ్ఞానప్రసూనాంబిక, విద్యాలక్ష్మి, జ్ఞానలక్ష్మి, మోక్షలక్ష్మి అని చెపుకుంటాము. మరొక వ్యాఖ్యానంలో ‘శమీ’ అనగా లక్ష్మీదేవి. బుద్ధి అమ్మయే కావున అమ్మబుద్ధిని అనుసరిస్తే సకల విజయాలు చేకూరుతాయి.*

*విజయదశమిని దశహరా అని అన్నాము అనగా పది పాపాలు తొలగించేది . పది ఇంద్రియాలతో చేసే పది పాపాలను తొలగించేది, ఇంద్రియాలతో పాపాలను చేయించేది బుద్ధే కావున మంచి బుద్ధిని ప్రసాదించమని ఆ తల్లిని కోరుతూ అలాగే విజయదశమి నాడు దేవతా వృక్షాలలో ప్రసిద్ధమైన ‘శమీ వృక్షా’న్ని దుష్ట ఆలోచనలను, దురాశలను, దుర్బుద్ధిని పారద్రోలడానికి పూజించాలి.*

*శమీ వృక్షము అనగా లక్ష్మీనారాయణులకు సంకేతం. అందరికి మంచి బుద్ధి కలిగి తద్వారా లోకకళ్యాణం జరగాలని శమీపూజ అంతరార్థం.*
🌹 🌹 🌹🌹 🌹

*🌹. Inner Meaning of Shami Vriksha Puja - Paramarth 🌹*
*📚. Prasad Bharadwaja*

*In the Mahabharata, the Pandavas came to outskirts of the city of Virata in anonymity, put their weapons on the sami tree and prayed to Aparajita Devi (Durga Devi) that their weapons on the Sami tree may appear as snakes and demons to enemies, as flower garlands to friends, as weapons to themselves. 'Vijayadasami' was the day when Arjuna took his weapons and set out during the northern eclipse after their agnyatavasa ends. Usually the Sami tree is far away from the village. Even today, following that custom, the Sami Vriksha is visited and worshiped on Vijayadashami.*

*Sami tree means 'jammi tree'. Pandavas got the blessings of 'Aparajita' Goddess in the form of Shami Vriksha and achieved victory over the Kauravas. 'Sri Rama' worshiped this 'Aparajita' Devi on this Vijayadashami day and killed Ravana and got victory. Aswayuja Shuklapadyam was the time when Lord Rama awakened his power. On the tenth day from that day, Lord Rama got complete victory and left on Pushpakam to Ayodhya. Before leaving, he worshiped the Sami tree. That is why it has become customary to celebrate Navratri and do Shami Puja on Vijayadashami.*

*On the evening of Vijayadashami, at the time of Nakshatra Darshan Vijaya,one should worship Aparajita Devi at the Samivriksha (Jammi tree) and perform pradakshans to the tree while reciting the above verse. The slips with the above verse written on them should be stuck to the branches of that tree. By doing this, it is believed that apart from Mother's Grace, Shanidosha will also be cured.*

*When they come home they bring jammi leaf with them. It is customary for the younger ones to put the jammi leaf in the hands of the elders, calling it 'gold' and getting their blessings. Gold symbolizes Goddess Lakshmi. May you also perform Shami Puja today evening and get the grace of Goddess Aparajita.*

*Sami Shamayate Papam Sami Nasayate Ripoon*
*Sami Vittancha Putrancha Sami Ditsati Sampadam*

*This Padma Purana Shloka or Shami Vriksha Pardhana Stotra should be recited at the Shami Vriksha.*

*🌴. Shami Vriksha Prayer Hymn 🌴*

*Sami Shamaya Te Papam Sami Shatru Vanashini*
*Arjunasya Dhanurdhari Ramasya Priyadarshini ॥*

*Shamim Kamalapatrakshim Shamim Kantakadharineem*
*Arohatu Shamim Lakshmim Nrinamayushyavardhanim ॥*

*Namo Vishwasvrakshaya Parthasastradharine*
*Tvattah Patra Pratikshyami Sada Me Vijayi Bhava ॥*

*Dharmatma satyasandhascha Ramo Dasarathiryadi*
*Paurushe chaఽpratidvandvascharainam jahiravanim ॥*

*Amangalanam Prasamim Dushkritasya Cha Nashinim*
*Dussavapnaharineem Dhanyam Prapadyeham Samim Shubham ॥*

*🪷. Mantra 🪷*
*The Sami tree is a savior from sin. Destroys enemies. At a time, it had held Arjuna's bow. Pleased Sri Rama. Convenience to pilgrims. Keeps all the work running smoothly.*

*🍀. Specialty of Sami Vriksha Parthana in sadhana🍀*

*Pancha Pandavas i.e. the five sense organs of the body, should place their weapons i.e. the instincts or the actions of the senses on the Sami Vriksha. 'Shami' means one who calms or restrains. Any movement of any small part of our body should be done by mind. So 'Shami' means Buddhi, all weapons are found in Buddhi. The real weapons of 'buddhi' are 'thoughts'. These weapons appear to the enemy as snakes and demons. In other words, our thoughts become snakes and frighten like demons in the case of enemies but become garlands for loved ones. Our Buddhi is Gnanalakshmi. Therefore we call Amma Gnanaprasunambika, Vidyalakshmi, Gnanalakshmi, Mokshalakshmi. In another interpretation, 'Shami' means Goddess Lakshmi. Buddhi is mother, so if you follow mother's mind, you will achieve all success.*

*Vijayadasami is called Dashahara which means removing ten sins. Since it is the Buddhi who removes the ten sins of the ten senses and commits the sins of the senses, one should pray to that mother to bestow a good mind and on Vijayadashami, one should worship the famous 'Sami Vriksha' among the deity trees to drive away all evil thoughts, greed and evil mind.*

*Shami tree is a symbol of Lakshminarayan. The implication of Shami Puja is that everyone should have a good mind so that the welfare of the world can take place.*
🌹 🌹 🌹🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 254 / Kapila Gita - 254 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 6. దేహ గేహముల యందు ఆసక్తుడైన వానికి ప్రాప్తించు అధోగతి - 19 🌴*

*19. యమదూతౌ తదా ప్రాప్తౌ భీమౌ సరభసేక్షణౌ|*
*స దృష్ట్యా త్రస్తహృదయః శకృన్మూత్రం విముంచతి॥*

*తాత్పర్యము : ఇంతలో భయంకర ఆకారములు గలిగి, రోషయుక్తమైన చూపులు గల ఇద్దరు యమదూతలు అతని ప్రాణములను గొనిపోవుటకై అచటికి వత్తురు. వారు కనబడినంతనే భయముతో వణుకుచు అతడు మలమూత్రములను విసర్జించును.*

*వ్యాఖ్య : ప్రస్తుత శరీరం నుండి పోయిన తర్వాత జీవికి రెండు రకాల పరివర్తనలు ఉంటాయి. యమరాజు అని పిలువబడే పాప కార్యాల నియంత్రిక వద్దకు వెళ్లడం ఒక రకమైన పరివర్తన, మరియు మరొకటి వైకుంఠం వరకు ఉన్న ఉన్నత గ్రహాలకు వెళ్లడం. ఇక్కడ కపిల భగవానుడు కుటుంబాన్ని నిర్వహించడం కోసం ఇంద్రియ తృప్తిని కలిగించే కార్యక్రమాలలో నిమగ్నమైన వ్యక్తులను యమరాజు దూతలు ఎలా పరిగణిస్తారో వివరిస్తాడు. మరణ సమయంలో యమదూతలు తమ ఇంద్రియాలను బలంగా తృప్తిపరిచిన వ్యక్తులకు సంరక్షకులు అవుతారు. వారు మరణిస్తున్న వ్యక్తి యొక్క బాధ్యతను తీసుకుంటారు మరియు యమరాజు నివసించే గ్రహం వద్దకు తీసుకువెళతారు. అక్కడి పరిస్థితులు క్రింది శ్లోకాలలో వివరించబడ్డాయి.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 254 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 6. Description by Lord Kapila of Adverse Fruitive Activities - 19 🌴*

*19. yama-dūtau tadā prāptau bhīmau sarabhasekṣaṇau*
*sa dṛṣṭvā trasta-hṛdayaḥ śakṛn-mūtraṁ vimuñcati*

*MEANING : At death, he sees the messengers of the lord of death come before him, their eyes full of wrath, and in great fear he passes stool and urine.*

*PURPORT : There are two kinds of transmigration of a living entity after passing away from the present body. One kind of transmigration is to go to the controller of sinful activities, who is known as Yamarāja, and the other is to go to the higher planets, up to Vaikuṇṭha. Here Lord Kapila describes how persons engaged in activities of sense gratification to maintain a family are treated by the messengers of Yamarāja, called Yamadūtas. At the time of death the Yamadūtas become the custodians of those persons who have strongly gratified their senses. They take charge of the dying man and take him to the planet where Yamarāja resides. The conditions there are described in the following verses.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 846 / Vishnu Sahasranama Contemplation - 846🌹*

*🌻846. వంశవర్ధనః, वंशवर्धनः, Vaṃśavardhanaḥ🌻*

*ఓం వంశవర్ధనాయ నమః | ॐ वंशवर्धनाय नमः | OM Vaṃśavardhanāya namaḥ*

*ప్రపఞ్చం వర్ధయన్ వంశం ఛేదయన్ వా జనార్దనః ।*
*వంశవర్ధన ఇత్యుక్తో వేదవిద్యా విశారదైః ॥*

*ప్రపంచరూపమగు వంశమును వృద్ధినందించును, ఛేదించును అనగా లయమందించును.*

*వృధ్‍ - వృద్ధినందించుట. వర్ధ - ఛేదించుటయు పూరించుటయే అను ధాతువులనుండి 'వర్ధన' నిష్పన్నము.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 846🌹*

*🌻846. Vaṃśavardhanaḥ🌻*

*OM Vaṃśavardhanāya namaḥ*

प्रपञ्चं वर्धयन् वंशं छेदयन् वा जनार्दनः ।
वंशवर्धन इत्युक्तो वेदविद्या विशारदैः ॥

*Prapañcaṃ vardhayan vaṃśaṃ chedayan vā janārdanaḥ,*
*Vaṃśavardhana ityukto vedavidyā viśāradaiḥ.*

*As expanding or cutting the Universe (Vaṃśaṃ), He is Vaṃśavardhanaḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अणुर्बृहत्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान् ।
अधृतः स्वधृतस्स्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः ॥ ९० ॥
అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।
అధృతః స్వధృతస్స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥
Aṇurbr‌hatkr‌śaḥ sthūlo guṇabhr‌nnirguṇo mahān,
Adhr‌taḥ svadhr‌tassvāsthyaḥ prāgvaṃśo vaṃśavardhanaḥ ॥ 90 ॥

Continues....
🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 161 / Siva Sutras - 161 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*3వ భాగం - ఆణవోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 3-8. జాగ్రద్ ద్వితీయకారః   - 2 🌻*

*🌴. ఒక యోగి స్వయం యొక్క స్వచ్ఛమైన జ్ఞానంలో దృఢంగా స్థిరపడినప్పుడు, అతనికి ఈ బాహ్య ప్రపంచం తనలో ఒక కిరణం లేదా పొడిగింపు లేదా ఊహాదృశ్యంలా ద్వితీయంగా అవుతుంది. 🌴*

*అహం మరియు ఇదం రెండూ కలిసిపోయే చోటే సాక్షాత్కార స్థానం. స్వయంలో నేను మరియు నాది అనే భావనను కరిగించడం ద్వారా మాత్రమే ఈ సాక్షాత్కార బిందువు సాధించబడుతుంది. ఇది పూర్తి అయినప్పుడు, దానిని ఉన్మనా అంటారు. ఉన్మనా దశను సాధించినప్పుడు, విశ్వంలోని ప్రతి ఇతర వస్తువును భగవంతుని ప్రతిబింబంగా భావిస్తాడు. అందువల్ల, అహం మరియు ఇదం అనే ప్రశ్న లేదు. అతను ద్వంద్వత్వాన్ని పూర్తిగా కరిగించేస్తాడు. సాధకుడు ఈ దశకు చేరుకున్నప్పుడు, అతను మెలకువగా ఉన్నాడా లేదా తన్మయత్వంలో ఉన్నాడా అనే పట్టింపు ఉండదు. ఎందుకంటే అతను ప్రతిచోటా భగవంతుడిని మాత్రమే చూస్తాడు. భగవంతుని సర్వవ్యాపక స్వభావం యొక్క సూత్రాన్ని అతను నిజంగా అర్థం చేసుకుంటాడు.*

*వాస్తవం ఏమిటంటే విశ్వమంతా పరమాత్మ చైతన్యంతో నిండి ఉంది. కానీ మాయ వల్ల కలిగే విభిన్నమైన అవగాహన కారణంగా, వస్తువులు స్వయం కంటే భిన్నంగా కనిపిస్తాయి. ఉన్మనా దశను సాధించినప్పుడు, మాయ క్షీణించి, పరమాత్మ యొక్క ప్రత్యక్షతకు మార్గం సుగమం అవుతుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 161 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
*Part 3 - āṇavopāya*
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 3-8. jāgrad dvitīyakarah   - 2 🌻*

*🌴. When a yogi is firmly established in the pure knowledge of the self, the wakeful world becomes secondary to him, like a ray or an extension or projection within himself. 🌴*

*I or aham means the individual self and this or idam means objects that prevail in the universe. In other words, aham is the seer and idam is seen. The point of realization is where both aham and idam merge. The point of realization is achieved only by dissolving I, me and mine. When this dissolution is complete, it is called unmanā. When unmanā stage is achieved, the aspirant considers every other object of the universe as reflection of God. Hence, there is no question of aham and idam. He has completely dissolved duality. When the aspirant reaches this stage, whether he is awake or in trance does not matter, as he sees only God everywhere. He truly understands the principle of omnipresence nature of God.*

*The fact is that the whole universe is filled with the consciousness of Divine. It is due to differentiated perception caused by māyā, objects appear as different from the Self. When unmanā stage is achieved, māyā wanes away, paving way for the revelation of the Supreme.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 495 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 495 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 495 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 495 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 102. మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా ।
వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా ॥ 102 ॥ 🍀

🌻 495. 'మణిపూరాబ్జ నిలయా' - 2 🌻

పశ్యకులనగా బైటికి చూచువారు. లోపలకు బైటకు కూడ చూడగలిగిన వారిని కశ్యపులు అందురు. యోగులు, ఋషులు, తపస్విజనులు కశ్యపులు. ఇతరులు పశ్యకులు. పశ్యకులు పశుప్రాయుల వలె కేవలము ఇంద్రియముల ద్వారా ఇంద్రియార్థములను కోరుచు బాహ్యమున జీవమును నశింపజేసి కొనుచు మరణింతురు. వీరికే మరణము, జననము కలవు. అంత రంగమున చూచుట, వర్తించుట నేర్చినవారు మరణము దాటిన వారగుదురు. ఈ కారణముగ మణిపూరకము అత్యంత ప్రాముఖ్యముతో కూడిన పద్మముగ పెద్దలు వర్ణించిరి.



సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 495 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻102. Manipurabja nilaya vadanatraya sanyuta
vajradikayudhopeta dayaryadibhiravruta ॥ 102 ॥ 🌻

🌻 495. Manipurabja - 2 🌻


Pashyakas means those who look outside. Those who can see inside and outside are called Kashyapas. Yogis, sages and ascetics are Kashyaps. Others are Pashyakas. Pashyakas, like animals, seek sense objects only through the senses, destroy the life outside and die. Death and birth happen to them. Those who learn to perceive and live inside, become those who have surpassed death. For this reason Manipuraka is described by elders as the most important lotus.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


Osho Daily Meditations - 59. FEAR IS SIN / ఓషో రోజువారీ ధ్యానాలు - 59. భయమే పాపం



🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 59 / Osho Daily Meditations - 59 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 59. భయమే పాపం 🍀

🕉. దేనినైనా అణచివేయడం నేరం: ఇది ఆత్మను కుంగదీస్తుంది. ఇది ప్రేమ కంటే భయానికి ఎక్కువ శ్రద్ధ ఇస్తుంది మరియు అదే పాపం. 🕉

భయాన్ని ఎక్కువగా గమనించడం పాపం, ప్రేమను ఎక్కువగా గమనించడం పుణ్యం. మరియు ఎల్లప్పుడూ ప్రేమను ఎక్కువగా గమనించాలని గుర్తుంచుకోండి, ఎందుకంటే ప్రేమ ద్వారానే ఒకరు జీవితంలోని ఉన్నత శిఖరాలను, దేవునికి చేరుకుంటారు. భయం వల్ల ఎదగలేడు. భయం అంగవైకల్యం, పక్షవాతం: ఇది నరకాన్ని సృష్టిస్తుంది. పక్షవాతానికి గురైన వారందరూ-మానసిక పక్షవాతానికి, ఆధ్యాత్మికంగా పక్షవాతానికి -నరకంలో జీవిస్తారు. వారు దానిని ఎలా సృష్టిస్తారు? రహస్యం ఏమిటంటే వారు భయంతో జీవిస్తారు; వారు భయం లేనప్పుడు మాత్రమే ఒక నిర్దిష్ట పనిని చేస్తారు, కానీ అప్పుడు చేయడానికి విలువైనదేమీ ఉండదు.

చేయవలసిన ప్రతి పనికి కొన్ని భయాలు ఉంటాయి. మీరు ప్రేమలో పడితే, మీరు తిరస్కరించబడవచ్చు అని భయం ఉంటుంది. భయం చెబుతుంది, 'ప్రేమలో పడకండి, అప్పుడు మిమ్మల్ని ఎవరూ తిరస్కరించరు.' అది నిజం-మీరు ప్రేమలో పడకపోతే, ఎవరూ మిమ్మల్ని తిరస్కరించరు-కాని మీరు ప్రేమలేని ఉనికిని జీవిస్తారు, ఇది చాలా దారుణం తిరస్కరించడం కంటే. మరియు ఒకరు మిమ్మల్ని తిరస్కరిస్తే, మరొకరు మిమ్మల్ని అంగీకరిస్తారు. భయపడి జీవించే వారు తప్పులు చేయకూడదని ఎక్కువగా ఆలోచిస్తారు. వారు ఏ తప్పులు చేయరు, కానీ వారు ఏమీ చేయరు కూడా; వారి జీవితం శూన్యం. వారు ఉనికికి ఏమీ తోడ్పడరు. వారు వస్తారు, నిస్తేజంగా జీవిస్తారు, చనిపోతారు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 59 🌹

📚. Prasad Bharadwaj

🍀 59. FEAR IS SIN 🍀

🕉 To repress anything is a crime: It cripples the soul. It gives more attention to fear than to love, and that is what sin is. 🕉


To take more note of fear is sin, to take more note of love is virtue. And always remember to take more note of love, because it is through love that one reaches the higher peaks of life, to God. Out of fear one cannot grow. Fear cripples, paralyzes: It creates hell. All paralyzed people-psychologically paralyzed, spiritually paralyzed-live life in hell. And how do they create it? The secret is that they live in fear; they only do a certain thing when there is no fear, but then there is nothing left worth doing.

All that is worth doing has certain fears around it. If you fall in love, there is fear because you may be rejected. Fear says, "Don't fall in love, then nobody will reject you."That is true-if you don't fall in love, nobody will ever reject you-but then you will live a loveless existence, which is far worse than being rejected. And if one rejects you, somebody else will accept you. Those who live out of fear think mostly of not committing mistakes. They don't commit any mistakes, but they don't do anything else, either; their life is blank. They don't Contribute anything to existence. They come, they exist-they vegetate, rather-and then they die.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



శ్రీమద్భగవద్గీత - 446: 11వ అధ్., శ్లో 32 / Bhagavad-Gita - 446: Chap. 11, Ver. 32

 

🌹. శ్రీమద్భగవద్గీత - 446 / Bhagavad-Gita - 446 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 32 🌴



32. శ్రీ భగవానువాచ

కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్దో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త: |
ఋతేపి త్వాం న భవిష్యన్తి సర్వే యేవస్థితా: ప్రత్యనీకేషు యోధా:


🌷. తాత్పర్యం : దేవదేవుడైన శ్రీకృష్ణభగవానుడు పలికెను : నేను ఘనమైన లోకవినాశకర కాలమును. జనులందరినీ నశింపజేయుటకే నేను ఇచ్చటకు అరుదెంచితిని. నీవు (పాండవులు) తప్ప ఇచ్చటనున్న ఇరుపక్ష యోధులందరును చంపబడనున్నారు.


🌷. భాష్యము : శ్రీకృష్ణుడు దేవదేవుడని, తనకు స్నేహితుడని తెలిసినను అతని వివిధరూప ప్రదర్శనచే అర్జునుడు విభ్రాంతుడయ్యెను. కనుకనే అతడు ఆ వినాశకర శక్తి యొక్క వాస్తవ ప్రయోజనమును గూర్చి మరల అడిగెను. పరమసత్యము సమస్తమును (చివరికి బ్రాహ్మణులను కూడా) నశింపజేయునని వేదములందు తెలుపబడినది.

కఠోపనిషత్తు (1.2.25) నందు ఈ క్రింది విధముగా తెలుపబడినది.

యస్య బ్రహ్మ చ క్షత్రం చ ఉభే భవత ఓదన: |
మృత్యుర్యస్యోపసేచనం కే ఇత్థా వేద యత్ర స:

అనగా అంత్యమున బ్రాహ్మణులు, క్షత్రియులు మరియు ప్రతియొక్కరు దేవదేవునిచే ఆహారము వలె మ్రింగివేయబడుదురు. దేవదేవుని ఈ ప్రస్తుత రూపము సర్వమును హరించునటువంటిది. ఈ విధముగా శ్రీకృష్ణుడు తనను సర్వమును హరించు కాలముగా ప్రదర్శించుచున్నాడు. పాండవులు తప్ప అచ్చట యుద్ధరంగము నందు నిలిచిన సర్వులును అతనిచే మ్రింగివేయ బడుచున్నారు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 446 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 32 🌴


32. śrī-bhagavān uvāca

kālo ’smi loka-kṣaya-kṛt pravṛddho lokān samāhartum iha pravṛttaḥ
ṛte ’pi tvāṁ na bhaviṣyanti sarve ye ’vasthitāḥ praty-anīkeṣu yodhāḥ


🌷 Translation : The Supreme Personality of Godhead said: Time I am, the great destroyer of the worlds, and I have come here to destroy all people. With the exception of you [the Pāṇḍavas], all the soldiers here on both sides will be slain.

🌹 Purport : Although Arjuna knew that Kṛṣṇa was his friend and the Supreme Personality of Godhead, he was puzzled by the various forms exhibited by Kṛṣṇa. Therefore he asked further about the actual mission of this devastating force. It is written in the Vedas that the Supreme Truth destroys everything, even the brāhmaṇas. As stated in the Kaṭha Upaniṣad (1.2.25),


yasya brahma ca kṣatraṁ ca ubhe bhavata odanaḥ
mṛtyur yasyopasecanaṁ ka itthā veda yatra saḥ


Eventually all the brāhmaṇas, kṣatriyas and everyone else are devoured like a meal by the Supreme.


This form of the Supreme Lord is the all-devouring giant, and here Kṛṣṇa presents Himself in that form of all-devouring time. Except for a few Pāṇḍavas, everyone who was present on that battlefield would be devoured by Him. Arjuna was not in favor of the fight, and he thought it was better not to fight; then there would be no frustration. In reply, the Lord is saying that even if he did not fight, every one of them would be destroyed, for that was His plan. If Arjuna stopped fighting, they would die in another way. Death could not be checked, even if he did not fight. In fact, they were already dead. Time is destruction, and all manifestations are to be vanquished by the desire of the Supreme Lord. That is the law of nature.

🌹 🌹 🌹 🌹 🌹


మహర్నవమి శుభాకాంక్షలు, Good Wishes on Maha Navami


🍀. మహర్నవమి శుభాకాంక్షలు అందరికి, Maha Navami, Good Wishes to All 🍀

🌻. ప్రసాద్ భరద్వాజ

🍀. మహర్నవమి - మహిషాసుర మర్దిని విశిష్టత 🍀


దుర్గా నవరాత్రులలో 9వ రోజు నవమి, మహర్నవమి అంటారు. మహర్నవమి చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే? దేవి ఉపాసకులు ఉపవాసాలుండి, శ్రద్ధతో అమ్మవారిని అర్చించి, ధ్యానించి, ఈ 9వ రోజున అమ్మవారి కృపా కటాక్షాలు కోసం ఎదురుచూసే రోజు. 9 రోజులలో ఏ రోజు చేయకపోయినా, ఈ 3 రోజులు (మూలా నక్షత్రం -- దుర్గాష్టమి -- మహర్నవమి) పూజ చేస్తే అమ్మవారు కరుణిస్తుంది. విజయవాడలో ఈ రోజు "మహిషాసుర మర్దిని" అవతారం. శ్రీశైలంలో "సిద్ధిధాత్రిగా" పూజిస్తారు. ఈమెని పూజించడం వల్ల వాంఛితార్థ సిద్ధి కలుగుతుంది. కుమారి పూజలో 10 సం:ల వయస్సు గల బాలికని పూజిస్తారు. ఈ తల్లి దర్శనం వల్లే కాదు, మనసులో ఒక్కసారి స్మరించుకున్నా శత్రు వినాశనం జరుగుతుంది. వృక్షాలలో దేవగన్నేరు వృక్షాన్ని పూజిస్తారు. నైవేద్యంగా పాయసం నివేదించాలి.


🌷. చదువుకోవలసిన స్తోత్రాలు 🌷

మహిషాసుర మర్దిని అష్టోత్తరం, సహస్ర నామావళి, కాళీ కవచం, కాళీ అష్టకం, (మహాకవి కాళిదాసు రచించిన..) కాళీ శతనామస్తోత్రం, కాళీ స్తోత్రం (ఋషులు, దేవతలు రచించిన..) కాళీ సహస్రనామ స్తోత్రం, ( 'క' కార కాళీ కాదు..) మహిషాసుర మర్దిని స్తోత్రం (అయిగిరి నందిని..) పారాయణ చేసుకోవాలి. ఈ రోజు లలితా సహస్రనామాల్లోని "అపర్ణా చండికా చండముండాసుర నిషూదిని" శ్లోకాన్ని పారాయణ చేసుకోవాలి. " ఓం శ్రీ మహిషాసురమర్ధిని దేవతాయై నమః" అనే నామాన్ని జపించుకోవచ్చు. మహిషాసుర మర్దిని గాయత్రి మంత్రం "ఓం మహిషాసురమర్ధిని రూపాయ విద్మహే! పరమాత్మికాయై ధీమహి తన్నో పూర్ణః ప్రచోదయాత్" అనే మంత్రాన్ని జపించుకోవాలి.


🌻. మహిషాసురమర్దిని చరిత్ర - మహిమ 🌻

దుర్గాదేవి అష్ట భుజాలతో మహిషాసురుణ్ణి సంహరించి, సింహవాహిని శక్తిగా వికటాట్టహాసం చేసింది. మహిషాసురుడి సేనాధిపతులైన చిక్షిలుడు, చామరుడు, ఉదదృడు, బాష్కలుడు, విడాలుడు అనే సైన్యాధ్యక్షులందరిని సంహరించి, చివరగా మహిషాసురుణ్ణి సంహరించి, మహిషాసురమర్దిని అయింది. సింహవాహనం మీద "ఆలీడా పాదపద్ధతిలో", ఒక చేతిలో త్రిశూలాన్ని ధరించి, మహిషాసురుని సంహరించింది. ఈమె అష్టోత్తర శతనామ స్తోత్రం భక్తులు పారాయణం చేస్తే, శత్రు బాధలు, దత్త గ్రహబాధలనుండి విముక్తి కలగటమే కాక, మనసులో ఉన్న భయాన్ని పోగొట్టి, ధైర్యాన్ని ప్రసాదిస్తుంది.

ఇంద్రాది దేవతలు మహిషాసురుడి వల్ల అనేక కష్టాలు అనుభవించారు. అప్పుడే ఇంద్రాది దేవతలు తమ తమ శరీరాల్లోని దివ్యతేజస్సు లన్నింటిని బయటికి తీసుకొచ్చి, ఆ తేజస్సుకి ఒక రూపాన్నిచ్చారు. ఆ మూర్తి యొక్క రూపమే మహిషాసురమర్దిని. ఆ తేజోమూర్తికి తమ ఆయుధాలను సమర్పించారు. తండ్రిగారైన హిమవంతుడు ఒక సింహాన్ని సమర్పించాడు. దుర్గాదేవి శార్దూల వాహినిగా (పులి) దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించింది... మహిషాసురమర్దిని సింహవాహినిగా మహిషాసురుని సంహరించింది.

ఈ శరన్నవరాత్రులలో మహిషాసుర మర్దిని అవతారం, సింహవాహనం మీద ఆలీడా పాదపద్ధతిలో, ఒక చేతిలో త్రిశూలాన్ని ధరించి, మహిషాసురుడిని సంహరిస్తున్న రూపంలో దర్శనమిస్తుంది. శ్రీశైలంలో అమ్మవారు సిద్ధిధాత్రిగా దర్శనమిస్తుంది. ఈ తల్లి సర్వ సిద్ధులను ప్రసాదిస్తుంది. పరమేశ్వరుడు సర్వసిద్ధులను దేవికృప వల్లనే పొందాడని దేవీపురాణంలో ఉంటుంది. ఈ తల్లి శివుని పతిగా పొందడమే కాక! తన శరీరంలోని అర్ధభాగాన్ని ఆ పరమేశ్వరుడుకిచ్చి "అర్ధనారీశ్వరిగా" అవతరించింది. ఈ తల్లి చతుర్భుజి, సింహవాహిని. కుడివైపు చేతిలో చక్రం, గద ధరిస్తుంది. ఎడమచేతిలో శంఖాన్ని, కమలాన్ని ధరిస్తుంది. ఈ తల్లి కమలం మీద కూర్చొని ఉంటుంది.

ఈమెని ఆరాధించేవారికి సర్వ సిద్ధులు కరతలామలకం. ఈమె కృపచేతనే భక్తుల--, సాధకుల--, లౌకిక, పారమార్థిక, మనోరథాలు తీరతాయి. ఈ తల్లి కృపకు పాత్రుడైన భక్తుడికిగానీ, ఉపాసకుడుకి గాని కోరికలు ఏవి మిగలవు? (కుంతీదేవి కోరికలు లేని స్థితిని, కష్టాలనే ప్రసాదించమని శ్రీకృష్ణుని అర్థించింది.. ఎందుకంటే!! కష్టాల్లోనే భగవంతుడు చెంతనే ఉంటాడు కనుక...) అలాంటివారికి అమ్మవారి సన్నిధే సర్వసోపానం. ఈ అమ్మవారి స్మరణ, ధ్యాన, పూజ వల్ల సంసారం నిస్సారమన బోధపడుతుంది. పరమానంద పరమైన అమృత పదాన్ని (మోక్షాన్ని) పొందుతారు. ఈ తల్లి అణిమాది అష్టసిద్ధులనే కాక మోక్షాన్ని ప్రసాదించేది. లౌకిక, అలౌకిక, సర్వార్థ సిద్ధులకు అధిష్టాన ధాత్రి... "సిద్ధిధాత్రి"..

🌹🌹🌹🌹🌹



Worship Maa Siddhidatri on the 9th day of Navaratri


🌹 Worship Maa Siddhidatri on the 9th day of Navaratri 🌹

The last among the nine Avtar of Maa Durga, Maa Siddhidatri, is worshipped on the 9th day of Navaratri. Maa Siddhidatri grants Her devotees all sorts of achievements and is capable of giving all sorts of occult powers. She is the possessor of 26 different wishes (Siddhis) which She grants Her worshipers. The legend has it that the Lord Shiva got all those Siddhis by worshipping Maa Shakti. With Her gratitude the half body of Lord Shiva became that of Maa Shakti, and therefore he was called as Ardhnarishvar.

This Avtar of Maa Durga removes ignorance and provides knowledge to Her devotees. She is also worshipped by Deva, Gandharva, Asura, Yaksha and Siddha. Maa sits on Kamal (Lotus) and rides on the lion. She has four hands and holds a Gadain the lower right hand, a Chakra in the upper right hand, a lotus flower in the lower left hand and a Shankha in the upper left hand.

Her glory and power are infinite and worshipping Maa Siddhidatri on the final day (the ninth day) of Navaratri bestows all Siddhis to Her devotees and also marks the successful completion of the Navaratri festival.



🌻 Mantra and other Facts 🌻

Recite the below-mentioned Mantras to get the blessing from the almighty Maa Siddhidatri.


“Om Devi Siddhidatryai Namah”



या देवी सर्वभूतेषु माँ सिद्धिदात्री रूपेण संस्थिता ।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥

Ya Devi Sarvabhuteshu Maa Siddhidatri Rupena Samsthita।
Namastasyai Namastasyai Namastasyai Namo Namah


Maa Siddhidatri rules over the planet Ketu. She is the governess of the minds of people and motivates them towards a disciplined and spiritual life. Mata Siddhidatri eliminates all the ignorance, fear & sufferings from the life of the devotees, provides knowledge and fulfils all their desires.

🌹🌹🌹🌹🌹




దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 9. సిద్ధిధాత్రి మాత - శ్రీ రాజరాజేశ్వరీ దేవి / Worship Maa Siddhidatri on the 9th day of Navaratri


🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 9. సిద్ధిధాత్రి మాత - శ్రీ రాజరాజేశ్వరీ దేవి / Worship Maa Siddhidatri on the 9th day of Navaratri 🌹

🌻 . ప్రసాద్ భరద్వాజ



🌷. శ్రీ సిద్ధిధాత్రి దేవి ప్రార్ధనా శ్లోకము 🌷

'సిద్ధ గంధర్వ యక్షాద్యైః అసురైర మరైరపి

సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ'




🌷. శ్రీ రాజరాజేశ్వరి దేవి స్తోత్రము 🌷

అంబా శాంభవి చంద్రమౌళిరబలాఽపర్ణా ఉమా పార్వతీ

కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ |

సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ||



🌷. అలంకారము - నైవేద్యం : శ్రీ రాజరాజేశ్వరీ దేవి- ఆకుపచ్చ రంగు - పరమాన్నం, పిండివంటలు



🌷. మహిమ - చరిత్ర 🌷

తొమ్మిదవ శక్తి స్వరూపమైన సిద్ధిధాత్రి సర్వసిద్ధులనూ ప్రసాదిస్తుంది. ఈమె కరుణవల్లే పరమేశ్వరుని అర్ధశరీర భాగాన్ని పార్వతీ దేవి సాధించినట్టు పురాణకథనం. ఈమెకి ప్రార్ధన చేస్తే పరమానంద దాయకమైన అమృతపథం సంప్రాప్తిస్తుంది.



🌻. సాధన -

దుర్గామాత తొమ్మిదవ శక్తి స్వరూప నామం ‘సిద్ధిదాత్రి’. ఈమె సర్వవిధ సిద్ధులనూ ప్రసాదిస్తుంది. మార్కండేయ పురాణంలో 1) అణిమ, 2) మహిమ, 3) గరిమ, 4) లఘిమ, 5) ప్రాప్తి, 6) ప్రాకామ్యము, 7) ఈశిత్వము, 8) వశిత్వము అని సిద్ధులు ఎనిమిది రకాలుగా పేర్కొన బడ్డాయి. బ్రహ్మవైవర్త పురాణంలోని శ్రీకృష్ణ జన్మ ఖండంలో సిద్ధులు అష్టాదశ విధాలుగా తెలుపబడ్డాయి. అవి…

1) అణీమ, 2) లఘీమ, 3) ప్రాప్తి, 4) ప్రాకామ్యము, 5) మహిమ, 6) ఈశిత్వ వశిత్వాలు, 7) సర్వకామావసాయిత, 8) సర్వజ్ఞత్వం, 9) దూరశ్రవణం, 10) పరకాయ ప్రవేశం, 11) వాక్‍సిద్ధి, 12) కల్పవృక్షత్వం, 13) సృష్టి, 14) సంహారకరణ సామర్థ్యం, 15) అమరత్వం, 16) సర్వన్యాయకత్వం, 17) భావన మరియు 18) సిద్ధి.

సిద్ధిదాత్రి మాత భక్తులకూ, సాధకులకూ ఈ సిద్ధులన్నింటిని ప్రసాదించగలదు. పరమేశ్వరుడు ఈ సర్వ సిద్ధులను దేవి కృపవలననే పొందారని దేవీ పురాణం పేర్కొంటుంది. ఈ సిద్ధిదాత్రి మాత పరమశివునిపై దయ తలచి, ఆయన శరీరంలో అర్ధభాగమై నిలిచింది. కనుక ఆయన అర్ధనారీశ్వరుడుగా వాసికెక్కారు. సిద్ధిదాత్రి దేవి చతుర్భుజ. సింహవాహన. ఈ దేవీ స్వరూపం కమలంపై ఆసీనురాలై ఉంటుంది. ఈమె కుడివైపు ఒక చేతిలో చక్రాన్ని దాల్చి ఉంటుంది. మరొక చేతిలో గదను ధరించి ఉంటుంది. ఎడమవైపు ఒక చేతిలో శంఖాన్నీ, మరొక హస్తంలో కమలాన్నీ దాల్చి దర్శనమిస్తుంది.

నవరాత్రి మహోత్సవాల్లో తొమ్మిదవరోజున ఉపాసించబడే దేవీ స్వరూపం ఈమెదే. తొమ్మిదవరోజున శాస్త్రీయ విధి విధానాలతో సంపూర్ణ నిష్ఠతో ఈమెను ఆరాధించేవారికి సకల సిద్ధులూ కరతలామలకం అవుతాయి. సృష్టిలో ఈమెకు అగమ్యమైనది ఏదీ లేదు. ఈ మాత కృపతో ఉపాసకుడికి ఈ బ్రహ్మాండాన్నే జయించే సామర్థ్యం లభిస్తుంది.

ఈ సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రులవ్వడానికి నిరంతరం ప్రతీ వ్యక్తీ ప్రయత్నించాలి. ఈ మాత దయా ప్రభావంవల్ల అతడు అనంతమైన దుఃఖరూప సంసారం నుండి నిర్లిప్తుడవ్వగలడు. అన్ని సుఖాలను పొందడమే కాకుండా మోక్షాన్ని సైతం పొందుతాడు.

నవదుర్గల్లో ‘సిద్ధిదాత్రి’ అవతారం చివరిది. మొదటి ఎనిమిది రోజుల్లో క్రమంగా దుర్గాదేవి ఎనిమిది అవతారాలను విద్యుక్తంగా నిష్ఠతో ఆరాధించి, తొమ్మిదవ రోజు ఉపాసకుడు ఈ సిద్ధిదాత్రి ఆరాధనలో నిమగ్నుడు కావాలి. ఈ దేవిని ఉపాసించడం ముగియగానే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారలౌకిక మనోరథాలన్నీ సఫలమవుతాయి. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తుడికి కోరికలేవీ మిగిలి ఉండవు. ఇలాంటి భక్తుడు అన్ని విధాలైన సాంసారిక వాంఛలకు, అవసరాలకు, ఆసక్తులకు అతీతుడవుతాడు. అతడు మానసికంగా భగవతీ దేవి దివ్య లోకంలో విహరిస్తాడు. ఆ దేవీ కృపారసామృతం నిరంతరంగా ఆస్వాదిస్తూ, విషయ భోగ విరక్తుడవుతాడు. అట్టి వారికి భగవతీ దేవి సాన్నిధ్యమే సర్వస్వంగా ఉంటుంది. ఈ పరమ పదాన్ని పొందిన వెంటనే అతనికి ఇతరాలైన ప్రాపంచిక వస్తువుల అవసరం ఏ మాత్రం ఉండదు.

దుర్గామాత చరణ సన్నిధిని చేరటానికై మనం నిరంతరం నియమ నిష్ఠలతో ఆమెను ఉపాసించడమే కర్తవ్యం. భగవతీ మాత స్మరణ, ధ్యాన పూజాదికాల ప్రభావం వల్ల ఈ సంసారం నిస్సారమని మనకు బోధ పడుతుంది. తన్మహత్త్వాన నిజమైన పరమానందదాయకమైన అమృత పథం మనకు ప్రాప్తిస్తుంది.


🌹 🌹 🌹 🌹 🌹




23 Oct 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 23, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ సోమవారం, Monday, ఇందు వాసరే

🍀. మహర్నవమి శుభాకాంక్షలు అందరికి, Maha Navami, Good Wishes to All 🍀

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : మహర్నవమి, ఆయుధ పూజ, Maha Navami, Ayudha Puja 🌻


🌷. మహిషాసురమర్ధిని స్తోత్రము :

అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే
గిరివరవింధ్య శిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే |

భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : మౌన సంకల్పం - ధ్యానాభ్యాస కాలంలోనైనా సాధకుడు అన్నమయ, ప్రాణమయ చిత్త వృత్తుల నరికట్టి మనస్సును నిశ్చల, నీరవతా స్థితిలో నుంచుకోడానికి దృఢమైన మౌనసంకల్ప బల సంపాదన అత్యంత సహాయకం. ఈ మౌన సంకల్పం మనస్సుకు వెనుక నుండే పురుషునిది. మనస్సు నిశ్చల, నీరవతాస్థితి నందుకొన్నప్పుడు, ప్రకృతి క్రియాకలాపము కంటే వేరైన యీ పురుషుడు తెలియబడుతాడు. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

శరద్‌ ఋతువు, దక్షిణాయణం,

ఆశ్వీయుజ మాసం

తిథి: శుక్ల-నవమి 17:46:43 వరకు

తదుపరి శుక్ల-దశమి

నక్షత్రం: శ్రవణ 17:15:46 వరకు

తదుపరి ధనిష్ట

యోగం: శూల 18:53:12 వరకు

తదుపరి దండ

కరణం: బాలవ 06:54:22 వరకు

వర్జ్యం: 20:57:10 - 22:26:02

దుర్ముహూర్తం: 12:23:36 - 13:10:10

మరియు 14:43:17 - 15:29:50

రాహు కాలం: 07:38:26 - 09:05:44

గుళిక కాలం: 13:27:37 - 14:54:55

యమ గండం: 10:33:02 - 12:00:20

అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23

అమృత కాలం: 07:30:00 - 09:00:00

మరియు 29:50:22 - 31:19:14

సూర్యోదయం: 06:11:09

సూర్యాస్తమయం: 17:49:31

చంద్రోదయం: 13:56:29

చంద్రాస్తమయం: 00:26:03

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: మకరం

యోగాలు: సిద్ది యోగం - కార్య సిధ్ధి,

ధన ప్రాప్తి 17:15:46 వరకు తదుపరి

శుభ యోగం - కార్య జయం

దిశ శూల: తూర్పు

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹