శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 356-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 356-1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 356-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 356-1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 78. భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।
సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥ 🍀
🌻 356-1. 'సదాచార ప్రవర్తికా' 🌻
వేదశాస్త్రము నందు తెలుపబడిన సదాచారమును వర్తింప చేయునది శ్రీమాత అని అర్థము. యజ్ఞము, దానము, తపస్సు సదాచారముగ తెలుపబడినవి. యజ్ఞార్థ జీవనము ఒక్కటియే జీవులకు బంధ విమోచనము కలిగించును. జీవిత సన్నివేశముల యందు స్వార్థ చింతనము బంధ కారణమై నిలచును. పరార్థ చింతన పరమునకు దారి చూపును. లోకహిత జీవనమే యజ్ఞార్థ జీవనము. జీవితము యజ్ఞార్థము కాకున్నప్పుడు చిక్కుపడి జీవుని బద్ధుని జేయును.
బద్ధుడైన జీవుడు బంధ మోచనమునకై ప్రయత్నించును. క్రమముగ యజ్ఞార్థ జీవనమే బంధ మోచనమునకు పరిష్కారమని తెలిసికొనును. స్వహితము కొఱకు గాక పరహితము కొఱకు జీవించుట ఆరంభించును. ఇట్టి క్రియా జ్ఞానము స్థిరపడు చుండగా తన యందలి ఇచ్ఛ పరహితేచ్చగా మారును. ఇచ్ఛ, క్రియలు పరహితమునకే సమర్పింప బడగ జీవుడు సాత్త్విక అహంకారమున స్థిరపడినపుడు జ్ఞానమను గ్రహింపబడును. అట్టివాడు తన వద్ద జేరిన సమస్త విద్యలను, శక్తిని, ద్రవ్యమును పరహితమునకే సమర్పించుట దానమగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 356-1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 78. Bhaktimatkalpalatika pashupasha vimochani
Sanhruta sheshapashanda sadachara pravartika ॥ 78 ॥ 🌻
🌻 356-1. Sadācāra-pravartikā सदाचार-प्रवर्तिका 🌻
She removes the innate ignorance of the soul to realize the Brahman. In this nāma, She is said to induce the ignorant men to perform noble acts. Sat refers those who perform noble deeds and ācāra means the righteous acts performed by them. She makes the ignorant people (ignorant means lack of knowledge of the Brahman.
It could also mean the concept of duality) to pursue the righteous path to realize the Brahman. The principles of righteousness are expounded in epics. These principles form the basis of dharma śāstra (refer previous nāma).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
15 Mar 2022
ఓషో రోజువారీ ధ్యానాలు - 153. పీడకలలు / Osho Daily Meditations - 153. NIGHTMARES
🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 153 / Osho Daily Meditations - 153 🌹
📚. ప్రసాద్ భరద్వాజ్
🍀 153. పీడకలలు 🍀
🕉. మీ మనస్సు మీ స్వభావానికి విరుద్ధంగా ఏదైనా చేస్తున్నప్పుడు, అంతఃచేతన మీకు సందేశాన్ని- మొదట మర్యాదగా ఇస్తుంది, కానీ మీరు చేయకపోతే: వినండి అని పీడకలగా ఇస్తుంది. 🕉
ఒక పీడకల అనేది మీ అంతఃచేతన యొక్క అరవడం తప్ప మరొకటి కాదు. మీరు మీ నుండి చాలా దూరం వెళుతున్నారని మరియు మీ మొత్తం జీవిని మీరు కోల్పోతారు, ఇంటికి తిరిగి రండి అని చెప్పడమే అది! ఒక పిల్లవాడు అడవుల్లో తప్పిపోయినప్పుడు, తల్లి అరుస్తూ పిల్లల పేరును పిలుస్తుంది. ఒక పీడకల అంటే అదే. కాబట్టి మీ కలలతో స్నేహం చేయడం ప్రారంభించండి. మీరు, మీ అంతఃచేతనత్వ స్థితికి దగ్గరగా మరింత దగ్గరగా వస్తున్నట్లు మీరు తెలుసుకుంటారు. మీరు దానికి ఎంత దగ్గరగా వస్తారో, మీకు అంత తక్కువ కలలు ఉంటాయి, ఎందుకంటే అప్పుడు కల అవసరం లేదు.
మీరు మేల్కొని ఉన్నప్పుడు కూడా అంతఃచేతనత్వం దాని సందేశాన్ని ఇవ్వగలదు. మీరు నిద్రపోయే వరకు వేచి ఉండవలసిన అవసరం లేదు; ఇది మీకు ఎప్పుడైనా దాని సందేశాన్ని ఇవ్వగలదు. మీరు దగ్గరగా మరింత దగ్గరగా ఎప్పుడైతే వస్తారో, మీ చేతన మరియు అంతఃచేతన ఒకదానిలోకి మరొక దానిలో వ్యాప్తి చెందుతుంది. అది గొప్ప అనుభవం. మీరు మొదటిసారి, ఏకత్వాన్ని అనుభూతి చెందుతారు. మీ ఉనికిలో ఏ భాగాన్ని తిరస్కరించలేదు. మీరు మీ సంపూర్ణతను అంగీకరించారు. మీరు మొత్తం ఒకటిగా కావడం ప్రారంభించారు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 153 🌹
📚. Prasad Bharadwaj
🍀 153. NIGHTMARES 🍀
🕉 Whenever your mind is doing something that goes against your nature, the unconscious gives you the message--first politely, but if you don't: listen, nightmarishly. 🕉
A nightmare is nothing but the shouting of the unconscious, a cry of desperation that you are going too far away from yourself and you will miss your whole being. Come back home! It is as if a child is lost in the woods and the mother screams and shouts the name of the child. That is exactly what a nightmare is. So start befriending your dreams. By and by you will see that you and your unconscious are coming closer and closer together.
The closer you come, the fewer dreams you will have, because then there is no need for the dream. The unconscious can deliver its message even when you are awake. There is no need for it to wait for when you are asleep; it can give you its message any time. The closer and closer you come, the more the conscious and unconscious start overlapping. That's a great experience. You feel, for the first time, one. No part of your being is denied. You have accepted your wholeness. You start becoming whole.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
15 Mar 2022
మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 164
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 164 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. సర్వాంతర్యామి 🌻
లోకమున దుఃఖమునకు కారణము ఎవ్వరని మానవులు అనేక సిద్ధాంతములను కనిపెట్టిరి. తమకు సుఖదుఃఖములను ఇచ్చు ప్రభువుగా దేవునిపై కొందరు నిందారోపణము చేసిరి. తప్పు చేయుట అనగా హాని కల్గించుటయే తన చెడునడవడిని సరిచేసికొనుట తన చేతిలోని పనియే. దానిని అంగీకరించుటకు భయపడి తనకన్న శక్తిమంతమైనదేదో తన చేత చేయించుచున్నదని నమ్ముట దౌర్భల్యము గాని సత్యముకాదు. జీవుడు మంచిగా గాని, చెడుగా గాని ప్రవర్తించుటకు గ్రహస్థితులు కారణమని సిద్ధాంతము చేసికొందురు. ఆత్మ వంచనము చేసికొనుచున్నారు.
చేసిన కర్మయొక్క ఫలమే మనచేత నిత్యము మంచి చెడ్డ పనులు చేయించుచున్నదని కొందరు నిర్ణయింప జూచుచున్నారు. కొందరి ప్రకారము సృష్టి అంతయు స్వాభావికముగా జరుగుచున్నది. దీనిని గ్రహించుట సాధ్యము కాదు నిరోధించుటకు అధికారము లేదు. మానవుని ప్రవర్తనలో గల మంచి చెడ్డలు కూడ స్వాభావికముగా జరుగుచున్నవని వారి మతము. దీని వలన ఒకరితో ఒకరు కలహించుకొని జాతి నశించును. ఇతరుల వలన మనకు దుఃఖము కలిగినపుడు వారు చేసిరని దుఃఖింప పనిలేదు. తర్కమునకు, నిర్ణయమునకు లొంగని వాడు సర్వాంతర్యామి. వాని లీలయే సర్వము. ఇంతకన్నా సత్యము లేదు.
✍️. మాస్టర్ ఇ.కె. 🌻
🌹 🌹 🌹 🌹 🌹
15 Mar 2022
శ్రీ శివ మహా పురాణము - 534 / Sri Siva Maha Purana - 534
🌹 . శ్రీ శివ మహా పురాణము - 534 / Sri Siva Maha Purana - 534 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 47
🌻.శివుని అంతఃపుర ప్రవేశము - 4 🌻
తరువాత శంఖములు, భేరీలు, పటహములు, ఆనకములు, గోముఖములు ఆ మహోత్సవములో అనేక పర్యాయములు మ్రోగించబడినవి (33). మరియు గాయకులందరు పరమ మంగళకరమగు పాటలను పాడిరి. నాట్యకత్తెలందరు అనేక తాళములతో గూడి నాట్యమును చేసిరి (34).
జగదేక బంధువగు శివుడు వీరతో గూడి అప్పుడు పరమేశ్వర తేజస్సుతో ముందుకు సాగెను. లోకపాలకులందరు ఆయనను సేవిస్తూ ఆనందముతో పుష్పములను చల్లు చుండిరి (35). ఈ విదముగా పూజింప బడిన శంభు పరమేశ్వరుడు అనేక స్తుతులచే కొనియాడబడుచున్న వాడై యజ్ఞ మండపములోనికి ప్రవేశించెను (36). పర్వతశ్రేష్ఠులు మహోత్సవ పురస్సరముగా మహేశ్వరుని వృషభము నుండి దింపి ప్రీతితో గృహము లోపలికి దోడ్కొని వెళ్లిరి(37). హిమవంతుడు కూడ దేవతలతో గణములతో కూడి విచ్చేసిన ఈశ్వరునకు భక్తితో ప్రణమిల్లి యథావిధిగా నీరాజన మొసంగెను (38).
హిమవంతుడు తన భాగ్యమును కొనియాడుచూ దేవతలను, మునులను, ఇతరులను అందరినీ నమస్కరించి మహోత్సాహముతో సన్మానించెను (39). ఆ హిమవంతుడు అచ్యుతునితో, ముఖ్యులగు దేవతలతో గూడి యున్న ఈశ్వరునికి అర్ఘ్యపాద్యముల నిచ్చి తన గృహము లోపలికి తీసుకొని వెళ్లెను (40). నన్ను, విష్ణువును, ఈశ్వరుని ఇతర పెద్దలను వాకిటి యందు రత్న సింహాసనములపై ప్రత్యేకముగా కూర్చుండబెట్టెను(41). చెలికత్తెలు, మేన, మరియు బ్రాహ్మణ స్త్రీలు, ఇతర ముత్తయిదవలు ఆనందముతో నీరాజనమిచ్చిరి (42).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 534 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 47 🌴
🌻 The ceremonious entry of Śiva - 4 🌻
33. In that great festivity conches were blown, drums were beaten and the musical instruments, paṭaha, Ānaka and Gomukha were played on, repeatedly.
34. Musicians sang auspicious songs. Dancing girls danced to the tune.
35. Accompanied by these, attended upon by all important gods and with flowers showered on Him delightedly, the sole kinsman of the universe walked ahead shedding lordly splendour.
36. Lord Śiva, eulogised with many hymns of praise, entered the sacrificial altar. He was duly worshipped.
37. The excellent mountains jubilantly made Śiva dismount the bull and lovingly took Him within.
38. After duly bowing to Śiva who arrived there with the gods and Gaṇas, Himavat performed the Nīrājana with great devotion.
39. Praising his own good luck and bowing to all the gods, sages and others jubilantly he honoured them suitably.
40. The mountain, after offering Pādya and Arghya to them, took Śiva along with Viṣṇu and the important gods, within.
41. In the quadrangle inside he made us, Viṣṇu, Śiva and other important persons sit on gemset thrones.
42. The Nīrājana rites was then performed by Mena, her maids and the brahmin women as well as other ladies of the city with joy.
Continues....
🌹🌹🌹🌹🌹
15 Mar 2022
గీతోపనిషత్తు -336
🌹. గీతోపనిషత్తు -336 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 28-3 📚
🍀 28-3. సన్యాస యోగము - శుభకర్మలు శుభ ఫలముల నిచ్చు చుండును. అశుభ కర్మలు అశుభ ఫలముల నిచ్చుచుండును. పుణ్యకార్యములు చేయువారు పుణ్యఫలములచే బంధింప బడుదురు. పాపకార్యములు చేయువారు పాపఫలములచే బంధింపబడు చుందురు. ఫలాసక్తి లేకుండ కర్మలాచరించుటయే నిజమగు మార్గము. తమదగు సంకల్పములు కూడ చేయని వారు మహాత్ములు. ఆరంభ పరిత్యాగము వారి సహజ స్వభావము. 🍀
శుభాశుభఫలై రేవం మోక్ష్యసే కర్మబంధనైః |
సన్న్యాసయోగయుక్తాత్మా విముక్తో మా ముపైష్యసి || 28
🌻. తాత్పర్యము : పై విధముగ సర్వమును నాకు సమర్పణ చేసుకొనిన వానికి పాపపుణ్య ఫలముల బంధము విడువబడును. నాతో సమ్య జ్ఞాన యోగమున సమస్తము నుండి విముక్తి చెంది నన్ను పొందిన వాడగును.
🌻. వివరణము : విముక్తి అనగా విశిష్టమగు ముక్తి. అట్టివాడే తనను చేరగలడని దైవము స్పష్టము చేసినాడు. ధీమంతు లెవరైనను ఇట్టిమార్గమున పయనింపవలెను. ఇతర మార్గములలో బంధవిమోచన ముండదు. ఇది సత్యము. మరియొక విషయము. శుభకర్మలు శుభ ఫలముల నిచ్చు చుండును. అశుభ కర్మలు అశుభ ఫలముల నిచ్చుచుండును. పుణ్యకార్యములు చేయువారు పుణ్యఫలములచే బంధింప బడుదురు. పాపకార్యములు చేయువారు పాపఫలములచే బంధింపబడు చుందురు. ఫలాసక్తి లేకుండ కర్మలాచరించుటయే నిజమగు మార్గము. దుష్కర్మ లెట్లు బంధించునో, సత్కర్మలు కూడ అట్లే బంధించును. కారణము ఫలాసక్తియే.
తండ్రి ఆజ్ఞగా పరశురాముడు తల్లి శిరస్సును ఖండించెను. తల్లి శిరస్సు ఖండించుట దుష్కర్మ. తండ్రి ఆజ్ఞను పరిపాలించుట కర్తవ్యము. పరశురాముడు కర్తవ్యమునే నమ్మెను. తల్లిగదా యని ఉపేక్షించ లేదు. తండ్రియగు జమదగ్ని మహర్షితో వాదింపలేదు. కర్తవ్యమున మాత్రమే నిలబడెను. అట్లే దశరథ రాముడు కూడ కర్తవ్యమునే పాలించెను. ఫలము లాసింపలేదు. తమదగు సంకల్పములు కూడ చేయనివారు మహాత్ములు. ఆరంభ పరిత్యాగము వారి సహజ స్వభావము. ఇట్టి కర్మ స్వరూపము స్పష్టముగ తెలిసిన మానవునకు ఈ క్షేత్రము కురుక్షేత్రము గాను, ధర్మ క్షేత్రముగాను గోచరించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
15 Mar 2022
15 - MARCH - 2022 మంగళవారం MESSAGES
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 15, మంగళవారం, మార్చి 2022 భౌమ వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 28-3 - 336 - సన్యాస యోగము 🌹
3) 🌹. శివ మహా పురాణము - 534 / Siva Maha Purana - 534 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -164 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 153 / Osho Daily Meditations - 153🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 356-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 356-1 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*భౌమ వాసరే, 15, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, Pradosh Vrat 🌻*
*🍀. అంజని పుత్ర స్తోత్రం - 1 🍀*
*అంజని నందన హనుమంత*
*అద్భుత వేగ హనుమంత*
*జయ బజరంగబలి *
*జయజయ జయ బజరంగబలి*
*ఇహపర దాత హనుమంత*
*ఈప్సితదాత హనుమంత*
*జయ బజరంగబలి *
*జయజయ జయ బజరంగబలి*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : ప్రారబ్దకర్మ నిత్య జీవితములో కొనసాగుతూనే ఉంటుంది. దానిని సరిగ్గా అనుష్ఠించాలి. అప్పుడు మాత్రమే ఆ కర్మ నుండి విముక్తి పొందగలము. - మాస్టర్ ఆర్.కె. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: శుక్ల ద్వాదశి 13:13:46 వరకు
తదుపరి శుక్ల త్రయోదశి
నక్షత్రం: ఆశ్లేష 23:33:20 వరకు
తదుపరి మఘ
యోగం: సుకర్మ 27:41:47 వరకు
తదుపరి ధృతి
కరణం: బాలవ 13:08:46 వరకు
వర్జ్యం: 11:41:48 - 13:23:24
దుర్ముహూర్తం: 08:48:39 - 09:36:45
రాహు కాలం: 15:25:32 - 16:55:44
గుళిక కాలం: 12:25:08 - 13:55:20
యమ గండం: 09:24:44 - 10:54:56
అభిజిత్ ముహూర్తం: 12:01 - 12:49
అమృత కాలం: 21:51:24 - 23:33:00
సూర్యోదయం: 06:24:20
సూర్యాస్తమయం: 18:25:57
చంద్రోదయం: 15:55:49
చంద్రాస్తమయం: 04:26:05
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
ఆనంద యోగం - కార్య సిధ్ధి 23:33:20
వరకు తదుపరి కాలదండ యోగం
- మృత్యు భయం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -336 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 28-3 📚*
*🍀 28-3. సన్యాస యోగము - శుభకర్మలు శుభ ఫలముల నిచ్చు చుండును. అశుభ కర్మలు అశుభ ఫలముల నిచ్చుచుండును. పుణ్యకార్యములు చేయువారు పుణ్యఫలములచే బంధింప బడుదురు. పాపకార్యములు చేయువారు పాపఫలములచే బంధింపబడు చుందురు. ఫలాసక్తి లేకుండ కర్మలాచరించుటయే నిజమగు మార్గము. తమదగు సంకల్పములు కూడ చేయని వారు మహాత్ములు. ఆరంభ పరిత్యాగము వారి సహజ స్వభావము. 🍀*
శుభాశుభఫలై రేవం మోక్ష్యసే కర్మబంధనైః |
సన్న్యాసయోగయుక్తాత్మా విముక్తో మా ముపైష్యసి || 28
*🌻. తాత్పర్యము : పై విధముగ సర్వమును నాకు సమర్పణ చేసుకొనిన వానికి పాపపుణ్య ఫలముల బంధము విడువబడును. నాతో సమ్య జ్ఞాన యోగమున సమస్తము నుండి విముక్తి చెంది నన్ను పొందిన వాడగును.*
*🌻. వివరణము : విముక్తి అనగా విశిష్టమగు ముక్తి. అట్టివాడే తనను చేరగలడని దైవము స్పష్టము చేసినాడు. ధీమంతు లెవరైనను ఇట్టిమార్గమున పయనింపవలెను. ఇతర మార్గములలో బంధవిమోచన ముండదు. ఇది సత్యము. మరియొక విషయము. శుభకర్మలు శుభ ఫలముల నిచ్చు చుండును. అశుభ కర్మలు అశుభ ఫలముల నిచ్చుచుండును. పుణ్యకార్యములు చేయువారు పుణ్యఫలములచే బంధింప బడుదురు. పాపకార్యములు చేయువారు పాపఫలములచే బంధింపబడు చుందురు. ఫలాసక్తి లేకుండ కర్మలాచరించుటయే నిజమగు మార్గము. దుష్కర్మ లెట్లు బంధించునో, సత్కర్మలు కూడ అట్లే బంధించును. కారణము ఫలాసక్తియే.*
*తండ్రి ఆజ్ఞగా పరశురాముడు తల్లి శిరస్సును ఖండించెను. తల్లి శిరస్సు ఖండించుట దుష్కర్మ. తండ్రి ఆజ్ఞను పరిపాలించుట కర్తవ్యము. పరశురాముడు కర్తవ్యమునే నమ్మెను. తల్లిగదా యని ఉపేక్షించ లేదు. తండ్రియగు జమదగ్ని మహర్షితో వాదింపలేదు. కర్తవ్యమున మాత్రమే నిలబడెను. అట్లే దశరథ రాముడు కూడ కర్తవ్యమునే పాలించెను. ఫలము లాసింపలేదు. తమదగు సంకల్పములు కూడ చేయనివారు మహాత్ములు. ఆరంభ పరిత్యాగము వారి సహజ స్వభావము. ఇట్టి కర్మ స్వరూపము స్పష్టముగ తెలిసిన మానవునకు ఈ క్షేత్రము కురుక్షేత్రము గాను, ధర్మ క్షేత్రముగాను గోచరించును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 534 / Sri Siva Maha Purana - 534 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 47
*🌻.శివుని అంతఃపుర ప్రవేశము - 4 🌻*
తరువాత శంఖములు, భేరీలు, పటహములు, ఆనకములు, గోముఖములు ఆ మహోత్సవములో అనేక పర్యాయములు మ్రోగించబడినవి (33). మరియు గాయకులందరు పరమ మంగళకరమగు పాటలను పాడిరి. నాట్యకత్తెలందరు అనేక తాళములతో గూడి నాట్యమును చేసిరి (34).
జగదేక బంధువగు శివుడు వీరతో గూడి అప్పుడు పరమేశ్వర తేజస్సుతో ముందుకు సాగెను. లోకపాలకులందరు ఆయనను సేవిస్తూ ఆనందముతో పుష్పములను చల్లు చుండిరి (35). ఈ విదముగా పూజింప బడిన శంభు పరమేశ్వరుడు అనేక స్తుతులచే కొనియాడబడుచున్న వాడై యజ్ఞ మండపములోనికి ప్రవేశించెను (36). పర్వతశ్రేష్ఠులు మహోత్సవ పురస్సరముగా మహేశ్వరుని వృషభము నుండి దింపి ప్రీతితో గృహము లోపలికి దోడ్కొని వెళ్లిరి(37). హిమవంతుడు కూడ దేవతలతో గణములతో కూడి విచ్చేసిన ఈశ్వరునకు భక్తితో ప్రణమిల్లి యథావిధిగా నీరాజన మొసంగెను (38).
హిమవంతుడు తన భాగ్యమును కొనియాడుచూ దేవతలను, మునులను, ఇతరులను అందరినీ నమస్కరించి మహోత్సాహముతో సన్మానించెను (39). ఆ హిమవంతుడు అచ్యుతునితో, ముఖ్యులగు దేవతలతో గూడి యున్న ఈశ్వరునికి అర్ఘ్యపాద్యముల నిచ్చి తన గృహము లోపలికి తీసుకొని వెళ్లెను (40). నన్ను, విష్ణువును, ఈశ్వరుని ఇతర పెద్దలను వాకిటి యందు రత్న సింహాసనములపై ప్రత్యేకముగా కూర్చుండబెట్టెను(41). చెలికత్తెలు, మేన, మరియు బ్రాహ్మణ స్త్రీలు, ఇతర ముత్తయిదవలు ఆనందముతో నీరాజనమిచ్చిరి (42).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 534 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 47 🌴*
*🌻 The ceremonious entry of Śiva - 4 🌻*
33. In that great festivity conches were blown, drums were beaten and the musical instruments, paṭaha, Ānaka and Gomukha were played on, repeatedly.
34. Musicians sang auspicious songs. Dancing girls danced to the tune.
35. Accompanied by these, attended upon by all important gods and with flowers showered on Him delightedly, the sole kinsman of the universe walked ahead shedding lordly splendour.
36. Lord Śiva, eulogised with many hymns of praise, entered the sacrificial altar. He was duly worshipped.
37. The excellent mountains jubilantly made Śiva dismount the bull and lovingly took Him within.
38. After duly bowing to Śiva who arrived there with the gods and Gaṇas, Himavat performed the Nīrājana with great devotion.
39. Praising his own good luck and bowing to all the gods, sages and others jubilantly he honoured them suitably.
40. The mountain, after offering Pādya and Arghya to them, took Śiva along with Viṣṇu and the important gods, within.
41. In the quadrangle inside he made us, Viṣṇu, Śiva and other important persons sit on gemset thrones.
42. The Nīrājana rites was then performed by Mena, her maids and the brahmin women as well as other ladies of the city with joy.
Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 164 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻. సర్వాంతర్యామి 🌻*
*లోకమున దుఃఖమునకు కారణము ఎవ్వరని మానవులు అనేక సిద్ధాంతములను కనిపెట్టిరి. తమకు సుఖదుఃఖములను ఇచ్చు ప్రభువుగా దేవునిపై కొందరు నిందారోపణము చేసిరి. తప్పు చేయుట అనగా హాని కల్గించుటయే తన చెడునడవడిని సరిచేసికొనుట తన చేతిలోని పనియే. దానిని అంగీకరించుటకు భయపడి తనకన్న శక్తిమంతమైనదేదో తన చేత చేయించుచున్నదని నమ్ముట దౌర్భల్యము గాని సత్యముకాదు. జీవుడు మంచిగా గాని, చెడుగా గాని ప్రవర్తించుటకు గ్రహస్థితులు కారణమని సిద్ధాంతము చేసికొందురు. ఆత్మ వంచనము చేసికొనుచున్నారు.*
*చేసిన కర్మయొక్క ఫలమే మనచేత నిత్యము మంచి చెడ్డ పనులు చేయించుచున్నదని కొందరు నిర్ణయింప జూచుచున్నారు. కొందరి ప్రకారము సృష్టి అంతయు స్వాభావికముగా జరుగుచున్నది. దీనిని గ్రహించుట సాధ్యము కాదు నిరోధించుటకు అధికారము లేదు. మానవుని ప్రవర్తనలో గల మంచి చెడ్డలు కూడ స్వాభావికముగా జరుగుచున్నవని వారి మతము. దీని వలన ఒకరితో ఒకరు కలహించుకొని జాతి నశించును. ఇతరుల వలన మనకు దుఃఖము కలిగినపుడు వారు చేసిరని దుఃఖింప పనిలేదు. తర్కమునకు, నిర్ణయమునకు లొంగని వాడు సర్వాంతర్యామి. వాని లీలయే సర్వము. ఇంతకన్నా సత్యము లేదు.*
*✍️. మాస్టర్ ఇ.కె. 🌻*
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 153 / Osho Daily Meditations - 153 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*
*🍀 153. పీడకలలు 🍀*
*🕉. మీ మనస్సు మీ స్వభావానికి విరుద్ధంగా ఏదైనా చేస్తున్నప్పుడు, అంతఃచేతన మీకు సందేశాన్ని- మొదట మర్యాదగా ఇస్తుంది, కానీ మీరు చేయకపోతే: వినండి అని పీడకలగా ఇస్తుంది. 🕉*
*ఒక పీడకల అనేది మీ అంతఃచేతన యొక్క అరవడం తప్ప మరొకటి కాదు. మీరు మీ నుండి చాలా దూరం వెళుతున్నారని మరియు మీ మొత్తం జీవిని మీరు కోల్పోతారు, ఇంటికి తిరిగి రండి అని చెప్పడమే అది! ఒక పిల్లవాడు అడవుల్లో తప్పిపోయినప్పుడు, తల్లి అరుస్తూ పిల్లల పేరును పిలుస్తుంది. ఒక పీడకల అంటే అదే. కాబట్టి మీ కలలతో స్నేహం చేయడం ప్రారంభించండి. మీరు, మీ అంతఃచేతనత్వ స్థితికి దగ్గరగా మరింత దగ్గరగా వస్తున్నట్లు మీరు తెలుసుకుంటారు. మీరు దానికి ఎంత దగ్గరగా వస్తారో, మీకు అంత తక్కువ కలలు ఉంటాయి, ఎందుకంటే అప్పుడు కల అవసరం లేదు.*
*మీరు మేల్కొని ఉన్నప్పుడు కూడా అంతఃచేతనత్వం దాని సందేశాన్ని ఇవ్వగలదు. మీరు నిద్రపోయే వరకు వేచి ఉండవలసిన అవసరం లేదు; ఇది మీకు ఎప్పుడైనా దాని సందేశాన్ని ఇవ్వగలదు. మీరు దగ్గరగా మరింత దగ్గరగా ఎప్పుడైతే వస్తారో, మీ చేతన మరియు అంతఃచేతన ఒకదానిలోకి మరొక దానిలో వ్యాప్తి చెందుతుంది. అది గొప్ప అనుభవం. మీరు మొదటిసారి, ఏకత్వాన్ని అనుభూతి చెందుతారు. మీ ఉనికిలో ఏ భాగాన్ని తిరస్కరించలేదు. మీరు మీ సంపూర్ణతను అంగీకరించారు. మీరు మొత్తం ఒకటిగా కావడం ప్రారంభించారు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 153 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 153. NIGHTMARES 🍀*
*🕉 Whenever your mind is doing something that goes against your nature, the unconscious gives you the message--first politely, but if you don't: listen, nightmarishly. 🕉*
*A nightmare is nothing but the shouting of the unconscious, a cry of desperation that you are going too far away from yourself and you will miss your whole being. Come back home! It is as if a child is lost in the woods and the mother screams and shouts the name of the child. That is exactly what a nightmare is. So start befriending your dreams. By and by you will see that you and your unconscious are coming closer and closer together.*
*The closer you come, the fewer dreams you will have, because then there is no need for the dream. The unconscious can deliver its message even when you are awake. There is no need for it to wait for when you are asleep; it can give you its message any time. The closer and closer you come, the more the conscious and unconscious start overlapping. That's a great experience. You feel, for the first time, one. No part of your being is denied. You have accepted your wholeness. You start becoming whole.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 356-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 356-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 78. భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।*
*సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥ 🍀*
*🌻 356-1. 'సదాచార ప్రవర్తికా' 🌻*
*వేదశాస్త్రము నందు తెలుపబడిన సదాచారమును వర్తింప చేయునది శ్రీమాత అని అర్థము. యజ్ఞము, దానము, తపస్సు సదాచారముగ తెలుపబడినవి. యజ్ఞార్థ జీవనము ఒక్కటియే జీవులకు బంధ విమోచనము కలిగించును. జీవిత సన్నివేశముల యందు స్వార్థ చింతనము బంధ కారణమై నిలచును. పరార్థ చింతన పరమునకు దారి చూపును. లోకహిత జీవనమే యజ్ఞార్థ జీవనము. జీవితము యజ్ఞార్థము కాకున్నప్పుడు చిక్కుపడి జీవుని బద్ధుని జేయును.*
*బద్ధుడైన జీవుడు బంధ మోచనమునకై ప్రయత్నించును. క్రమముగ యజ్ఞార్థ జీవనమే బంధ మోచనమునకు పరిష్కారమని తెలిసికొనును. స్వహితము కొఱకు గాక పరహితము కొఱకు జీవించుట ఆరంభించును. ఇట్టి క్రియా జ్ఞానము స్థిరపడు చుండగా తన యందలి ఇచ్ఛ పరహితేచ్చగా మారును. ఇచ్ఛ, క్రియలు పరహితమునకే సమర్పింప బడగ జీవుడు సాత్త్విక అహంకారమున స్థిరపడినపుడు జ్ఞానమను గ్రహింపబడును. అట్టివాడు తన వద్ద జేరిన సమస్త విద్యలను, శక్తిని, ద్రవ్యమును పరహితమునకే సమర్పించుట దానమగును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 356-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 78. Bhaktimatkalpalatika pashupasha vimochani*
*Sanhruta sheshapashanda sadachara pravartika ॥ 78 ॥ 🌻*
*🌻 356-1. Sadācāra-pravartikā सदाचार-प्रवर्तिका 🌻*
*She removes the innate ignorance of the soul to realize the Brahman. In this nāma, She is said to induce the ignorant men to perform noble acts. Sat refers those who perform noble deeds and ācāra means the righteous acts performed by them. She makes the ignorant people (ignorant means lack of knowledge of the Brahman.*
*It could also mean the concept of duality) to pursue the righteous path to realize the Brahman. The principles of righteousness are expounded in epics. These principles form the basis of dharma śāstra (refer previous nāma).*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Subscribe to:
Posts (Atom)