1) 🌹 05, JULY 2023 WEDNESDAY బుధవారం, సౌమ్య వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 201 / Kapila Gita - 201🌹
🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 11 / 5. Form of Bhakti - Glory of Time - 11 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 793 / Vishnu Sahasranama Contemplation - 793 🌹
🌻793. రత్ననాభః, रत्ननाभः, Ratnanābhaḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 754 / Sri Siva Maha Purana - 754 🌹
🌻. దేవజలంధర సంగ్రామము - 3 / The fight between the gods and Jalandhara - 3 🌻
5) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 008 / Osho Daily Meditations - 008 🌹
🍀 08. తీర్పు చెప్పకండి / 08. NON JUDGMENT 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 462 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 462 - 4 🌹
🌻 462. ‘సురనాయికా’ - 4 / 462. 'Suranaeika' - 4 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 05, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺*
*🍀. శ్రీ గజానన స్తోత్రం - 01 🍀*
*01. దేవర్షయ ఊచుః |*
*విదేహరూపం భవబంధహారం సదా స్వనిష్ఠం స్వసుఖప్రదం తమ్ |*
*అమేయసాంఖ్యేన చ లభ్యమీశం గజాననం భక్తియుతా భజామః ||*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : ముఖ్యంగా కావలసినది - విశుద్ధమైన ఆకాంక్ష, ఆత్మసమర్పణ ఇదే ముఖ్యంగా కావలసినది. వాస్తవానికి, ప్రత్యక్షం కావలసిందంటూ భగవంతుని బలవంత పెట్టే అధికారం ఎవ్వరికీ లేదు. సాధకుని ఆత్మ చైతన్య వికాస పరిపక్వతను బట్టిగాని, సక్రమంగా కొనసాగిన సుదీర్ఘ సాధన ఫలితంగా గాని ఆ సాక్షాత్కారం కలుగ వలసినదే.🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
ఆషాడ మాసం
తిథి: కృష్ణ విదియ 10:03:13 వరకు
తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: శ్రవణ 26:57:40 వరకు
తదుపరి ధనిష్ట
యోగం: వైధృతి 07:48:29 వరకు
తదుపరి వషకుంభ
కరణం: గార 10:03:13 వరకు
వర్జ్యం: 09:12:50 - 10:37:58
మరియు 30:31:50 - 31:57:46
దుర్ముహూర్తం: 11:54:16 - 12:46:50
రాహు కాలం: 12:20:33 - 13:59:05
గుళిక కాలం: 10:42:01 - 12:20:33
యమ గండం: 07:24:57 - 09:03:29
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:46
అమృత కాలం: 17:43:38 - 19:08:46
సూర్యోదయం: 05:46:25
సూర్యాస్తమయం: 18:54:41
చంద్రోదయం: 21:02:41
చంద్రాస్తమయం: 07:28:20
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు: ముద్గర యోగం -కలహం
07:03:59 వరకు తదుపరి ఛత్ర
యోగం - స్త్రీ లాభం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 201 / Kapila Gita - 201 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 11 🌴*
*11. మద్గుణశ్రుతిమాత్రేణ మయి సర్వగుహాశయే|*
*మనోగతిరవిచ్ఛిన్నా యథా గంగాంభసోఽమ్బుధౌ॥*
*తాత్పర్యము : గంగానది అఖండముగా సముద్రము వైపు ప్రవహించునట్లు, నా గుణములను గూర్చి వినినంత మాత్రముననే భక్తుని మనస్సు తైలధారవలె అవిచ్ఛిన్నముగా సర్వాంతర్యామినైన నా యందే లగ్నమగును.*
*వ్యాఖ్య : ఈ చివరిదైన తొమ్మిదవ రకమైన భక్తి ఉన్నవారు, పరమాత్మ యందే ఎలాంటి విచ్చేధమైన లేని మానసిక స్థితో మనసు ఉంచాలి. నిరంతరం నా (పరమాత్మ) గుణాలు వింటే అదే కలుగుతుంది. స్తోత్రము చేయడానికి కావలసిన అనంత కళ్యాణ గుణములు కలవాడు పరమాత్మ. అటువంటి నా గుణాలకు సంబంధించిన కథలను వింటే నా యందు అవిచ్చిన్నమైన భావం కలుగుతుంది. సముద్రములో కలవడానికి బయలుదేరిన గంగా ప్రవాహం ఎలా విచ్చిన్నం కాదో నా యందు ఉంచిన భక్తి కూడా విచ్చిన్నం కాదు. దానికి ఆశ్రయించ వలసిన ప్రధాన సాధనం నా గుణాలని వినడం.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 201 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 5. Form of Bhakti - Glory of Time - 11 🌴*
*11. mad-guṇa-śruti-mātreṇa mayi sarva-guhāśaye*
*mano-gatir avicchinnā yathā gaṅgāmbhaso 'mbudhau*
*MEANING : Just as the water of the Ganges flows naturally down towards the ocean, such devotional ecstasy, uninterrupted by any material condition, flows towards the Supreme Lord.*
*PURPORT : The basic principle of this unadulterated, pure devotional service is love of Godhead. Mad-guṇa-śruti-mātreṇa means "just after hearing about the transcendental qualities of the Supreme Personality of Godhead." These qualities are called nirguṇa. The Supreme Lord is uncontaminated by the modes of material nature; therefore He is attractive to the pure devotee. There is no need to practice meditation to attain such attraction; the pure devotee is already in the transcendental stage, and the affinity between him and the Supreme Personality of Godhead is natural and is compared to the Ganges water flowing towards the sea. The flow of the Ganges water cannot be stopped by any condition; similarly, a pure devotee's attraction for the transcendental name, form and pastimes of the Supreme Godhead cannot be stopped by any material condition. The word avicchinnā, "without interruptions," is very important in this connection. No material condition can stop the flow of the devotional service of a pure devotee. The word ahaitukī means "without reason." A pure devotee does not render loving service to the Personality of Godhead for any cause or for any benefit, material or spiritual. This is the first symptom of unalloyed devotion.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 793 / Vishnu Sahasranama Contemplation - 793🌹*
*🌻793. రత్ననాభః, रत्ननाभः, Ratnanābhaḥ🌻*
*ఓం రత్ననాభాయ నమః | ॐ रत्ननाभाय नमः | OM Ratnanābhāya namaḥ*
*రత్ననాభపదే శోభరత్న శబ్దేన లక్ష్యతే ।*
*రత్న వత్సున్దరో నాభిరస్య దేవస్య విద్యతే ।*
*స రత్ననాభ ఇత్యుక్తో జ్ఞానరత్నప్రభైర్బుధైః ॥*
*'రత్న' శబ్దము లక్షణావృత్తిచే 'శోభ'ను, 'శోభన'మగుదానిని తెలుపును. అట్టి రత్నమువలె శోభనము, సుందరము అగు నాభి ఈతనికి కలదు కనుక రత్ననాభః.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 793🌹*
*🌻793. Ratnanābhaḥ🌻*
*OM Ratnanābhāya namaḥ*
रत्ननाभपदे शोभरत्न शब्देन लक्ष्यते ।
रत्न वत्सुन्दरो नाभिरस्य देवस्य विद्यते ।
स रत्ननाभ इत्युक्तो ज्ञानरत्नप्रभैर्बुधैः ॥
*Ratnanābhapade śobharatna śabdena lakṣyate,*
*Ratna vatsundaro nābhirasya devasya vidyate,*
*Sa ratnanābha ityukto jñānaratnaprabhairbudhaiḥ.*
*By the word ratna splendor is indicated. His navel is beautiful as ratna; so Ratnanābhaḥ.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
*उद्भवस्सुन्दरस्सुन्दो रत्ननाभस्सुलोचनः ।अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविज्जयी ॥ ८५ ॥*
*ఉద్భవస్సున్దరస్సున్దో రత్ననాభస్సులోచనః ।అర్కో వాజసనః శృఙ్గీ జయన్తః సర్వవిజ్జయీ ॥ 85 ॥*
*Udbhavassundarassundo ratnanābhassulocanaḥ,Arko vājasanaḥ śrṅgī jayantaḥ sarvavijjayī ॥ 85 ॥*
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 754 / Sri Siva Maha Purana - 754 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 15 🌴*
*🌻. దేవజలంధర సంగ్రామము - 3 🌻*
*సనత్కుమారుడిట్లు పలికెను -*
*శుక్రాచార్యుడు రాహువు యొక్క శిరశ్ఛేదమును గురించి, అమృతము కొరకు దేవతులు సముద్రమును మథించుట గురించి వివరించి చెప్పెను (17). శ్రేష్ఠ వస్తువు లను దేవతలు గొని పోవుట, రాక్షసులు పరాభవమును పొందుట, దేవతలు అమృతపానమును చేయుట అను వృత్తాంతమునంతనూ విస్తరముగా చెప్పెను (18). మహావీరుడు, ప్రతాపవంతుడు అగు జలంధరుడు తన తండ్రి మథింపబడిన వృత్తాంతమును విని కోపించెను. కోపముచు ఆతని కన్నులు ఎరుపెక్కెను (19). స్వాభిమానము గల జలంధరుడు అపుడు ఘస్మరుడనే ఉత్తముడగు దూతను పిలిపించి శుక్రుడు వివరించిన వృత్తాంతమునంతనూ చెప్పెను (20). అప్పుడాతడు బుద్ధశాలియగు ఆ దూతను ప్రీతతో బలుతెరంగుల సన్మానించి అభయమునిచ్చి ఇంద్రుని సన్నిధికి పంపెను (21). జలంధరుని దూత, బుద్ధమంతుడు అగు ఘస్మరుడు దేవతలందరితో విరాజిల్లే స్వర్గమునకు వెళ్లెను (22). ఆ దూత అచటకు వెళ్లి వెంటనే సుధర్మయను దేవసభకు వెళ్లి గర్మముతో తలను పైకెత్తి దేవేంద్రునితో నిట్లు పలికెను (23).*
*ఘస్మరుడిట్లు పలికెను - జలంధరుడు రాక్షస జనులందరికీ ప్రభువు. సముద్రుని పుత్రుడు. గొప్ప ప్రతాపశాలి. మహావీరుడు. శుక్రుని ఆలంబనము గలవాడు (24). నేను ఆ వీరుని దూతను. నాపేరు ఘస్మరుడు. కాని నేను కార్యనాశకుడను గాదు. ఆ వీరుడు పంపగా నేను మీవద్దకు వచ్చి యుంటిని (25). జలంధరుని ఆజ్ఞకు ఎక్కడైననూ తిరుగు లేదు. కుశాగ్రబుద్ధి యగు ఆతడు రాక్షస శత్రువుల నందరినీ జయించినాడు. ఆతడు చెప్పిన పందేశమును వినుము (26).*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 754🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 15 🌴*
*🌻 The fight between the gods and Jalandhara - 3 🌻*
Sanatkumāra said:—
17-18. Thus Bhargava narrated in detail the story of the headless Rahu, of the churning of the ocean pursued by the gods for the gain of nectar, of the removal of the jewels, of the drinking of the Amṛta by the gods and of the harassment to the Asuras.
19. Then on hearing about the churning of his father, the heroic son of the ocean, the valorous Jalandhara became furious and his eyes turned red with anger.
20. Then he called his excellent emissary Ghasmara and told him everything what the wise preceptor had said to him.
21. He then lovingly honoured the clever emissary in various ways, assured him of protection and sent him to Indra as his messenger.
22. Ghasmara, the intelligent emissary of Jalandhara, hastened to heaven[2] where all the gods were present.
23. After going there, the emissary entered the assembly of the gods.[3] With his head kept straight as a token of haughtiness he spoke to lord Indra.
Ghasmara said:—
24. Jalandhara, the son of the ocean, is the lord and emperor of all the Asuras. He is excessively heroic and valorous. He has the support and assistance of Bhargava.
25. I am his emissary. I have been sent by him. I have come to you here. My name is Ghasmara but I am not a devourer.
26. He is of exalted intellect. His behest has never been defied. He has defeated all the enemies of Asuras. Please listen to what he says.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 08 / Osho Daily Meditations - 08 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 08. తీర్పు చెప్పకండి 🍀*
*🕉. మీరు తీర్పు చెప్పినప్పుడు, విభజన ప్రారంభమవుతుంది 🕉*
*మీరు స్నేహితుడితో లోతైన సంభాషణలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మీకు నిశ్శబ్దంగా ఉండాలి అనిపించవచ్చు. వాక్యం మధ్యలో మాట్లాడటం ఆపివేయాలనిపిస్తుంది. అప్పుడు అక్కడే ఆగి, మిగిలిన వాక్యాన్ని కూడా పూర్తి చేయకండి, ఎందుకంటే అది ప్రకృతికి విరుద్ధం అవుతుంది. కానీ అప్పుడు తీర్పు వస్తుంది. మీరు అకస్మాత్తుగా మధ్యలో మాట్లాడటం మానేస్తే ఇతరులు ఏమనుకుంటారో అని మీరు ఇబ్బంది పడతారు. మీరు అకస్మాత్తుగా మౌనంగా ఉంటే, వారు అర్థం చేసుకోలేరు, కాబట్టి మీరు వాక్యాన్ని ఎలాగైనా పూర్తి చేస్తారు. మీరు ఆసక్తి చూపినట్లు నటిస్తారు, ఆపై మీరు చివరకు తప్పించు కుంటారు. ఇది చాలా ఇబ్బందితో కూడుకున్నది, చేయవలసిన అవసరం లేదు.*
*ఆ సంభాషణ ఇప్పుడు మీకు రావడం లేదని చెప్పండి. మీరు క్షమించమని అడగవచ్చు మరియు మౌనంగా ఉండవచ్చు. కొన్ని రోజులకు ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ ప్రజలు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మీరు ఎందుకు మౌనంగా ఉన్నారనే దాని గురించి మీరే తీర్పు చెప్పకండి; ఇది మంచిది కాదని మీరే చెప్పకండి. అంతా బాగుంది! లోతైన అంగీకారంలో, ప్రతిదీ ఒక ఆశీర్వాదం అవుతుంది. ఇది ఇలా జరిగింది - మీ మొత్తం జీవి మౌనంగా ఉండాలని కోరుకుంటుంది. కాబట్టి దానిని అనుసరించండి. మీ సంపూర్ణతకు నీడగా మారండి మరియు అది ఎక్కడికి వెళ్లినా మీరు అనుసరించాలి ఎందుకంటే వేరే లక్ష్యం లేదు. మీరు మీ చుట్టూ విపరీతమైన విశ్రాంతిని అనుభవించడం ప్రారంభిస్తారు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 8 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 08. NON JUDGMENT 🍀*
*🕉 When you judge, division starts 🕉*
*You may be talking in deep conversation with a friend when suddenly you feel like being silent. You want to stop talking, right in the middle of the sentence. So stop right there, and don't even complete the rest of the sentence, because that will be going against nature. But then judgment comes in. You feel embarrassed about what others will think if you suddenly stop talking in the middle of asentence. If you suddenly become silent they will not understand, so you somehow manage to complete the sentence. You pretend to show interest, and then you finally escape. That is very costly, and there is no need to do it.*
*Just say that conversation is not coming to you now. You can ask to be excused, and be silent. For a few days perhaps it will be a little troublesome, but by and by people will begin to understand. Don't judge yourself about why you became silent; don't tell yourself that it is not good. Everything is good! In deep acceptance, everything becomes a blessing. This is how it happened--your whole being wanted to be silent. So follow it. Just become a shadow to your totality, and wherever it goes you have to follow because there is no other goal. You will begin to feel a tremendous relaxation surrounding you.*
*Continues..*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 462 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 462 - 4 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।*
*కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀*
*🌻 462. ‘సురనాయికా’ - 4 🌻*
*అసుర ప్రజ్ఞలు హద్దు మీరక యుండుటకు కూడ ఆరాధనము ప్రాథమికముగ ఉపకరించును. ఆరాధనము లోతుగ అనునిత్యము సాగునపుడు దేవతా సహకారము లభించును. అపుడు జీవుడు దేహమున దివ్య వైభవముతో జీవించ గలడు. అట్లుకాక దేహబద్ధుడైనపుడు అనేకానేక దుఃఖములకు గురి యగును. కావున సురనాయిక అగు శ్రీమాత నారాధించుట వలన అసుర ప్రజ్ఞలు హద్దులలో నుండును. సుర ప్రజ్ఞలు స్ఫూర్తి నిచ్చి జీవునికి సహకరించుచూ దివ్య లోకానుభవము కలిగించును. అసురులు, సురలు కూడ శ్రీమాత సంతానమే. ఆమెకు ఇరువురునూ సమానమే. కాని అసురులు హద్దులు మీరకుండుట కొఱకై సురలకు నాయికగ నిలచును. అందులకే ఆమె సురనాయిక.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 462 - 4 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika*
*Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻*
*🌻 462. 'Suranaeika' - 4 🌻*
*Worship is also a fundamental tool for asura's powers to be unbounded. When the worship goes on in unison, God's cooperation is obtained. Then the living being can live with divine splendor in the body. Otherwise, when he is in the flesh, he is subject to many sorrows. Therefore, due to the worship of Suranaika Srimata, the powers of the Asuras are out of bounds. Sura Prajna inspires and helps the living being to experience the divine world. Asuras and Suras are also offspring of Sri Mata. Both are equal to her. But the Asuras want you to have boundaries and stand as the leader of the Suras. That is why she is Suranaika.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama