1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 211🌹
2) 🌹. శివ మహా పురాణము - 411🌹
3) 🌹 Light On The Path - 158🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -39🌹
5) 🌹 Osho Daily Meditations - 28🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 88 / Lalitha Sahasra Namavali - 88🌹
7) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 88 / Sri Vishnu Sahasranama - 88🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -211 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 3
*🍀 2. స్వభావము - అక్షరము, పరము అయినది బ్రహ్మము. అది ఆత్మగ నేర్పడుట స్వభావము. ఆత్మ నుండి సమస్త ప్రాణులు, వస్తువులు లోకాలోకములుగ ఏర్పడుట కర్మము. తానున్నాడని తెలియుటయే ఆత్మ తత్త్యము. తానుండియు, తన యందు తాను ఇమిడిపోవుట సమాధి. అది పరము, బ్రహ్మము అని తెలుపబడినది. ఉన్నవాడు మేల్కాంచినపుడు తానున్నాడని తెలియుచున్నది. ఇట్లు మేల్కాంచుట తన స్వభావము. ఇట్టి మేల్కాంచిన స్థితిని ఆధ్యాత్మ మందురు. అనగా ఆత్మగ మేల్కాంచి, తనను తాను అధిష్ఠించి యుండును. జీవునకు తన కర్మ మెట్లు అనివార్యమో, విశ్వాత్మకు సృష్టికర్మ అట్లే అనివార్యము. 🍀*
అక్షరం బ్రహ్మ పరమం స్వభావో? ధ్యాత్మ ముచ్యతే |
భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞాతః I 3
తాత్పర్యము :
అక్షరము, పరము అయినది బ్రహ్మము. అది ఆత్మగ నేర్పడుట స్వభావము. ఆత్మ నుండి సమస్త ప్రాణులు, వస్తువులు లోకాలోకములుగ ఏర్పడుట కర్మము.
బ్రహ్మము విశ్వాత్మగ ఏర్పడుట దాని స్వభావమై యున్నది. అట్లేర్పడుటనే బ్రహ్మము ఆత్మ అగుట అని అందురు. నిద్ర నుండి మేల్కాంచినవాడు తానున్నానని తెలియుచున్నది కదా! తానున్నాడని తెలియుటయే ఆత్మ తత్త్యము. అట్లు తెలియుటకు ముందెట్లున్నాడు? సమాధియందున్నాడు లేక నిద్ర యందున్నాడు. తానుండియు, తనయందు తాను ఇమిడిపోవుట సమాధి. అది పరము, బ్రహ్మము అని తెలుపబడినది.
ఉన్నవాడు మేల్కాంచినపుడు తానున్నాడని తెలియుచున్నది. ఇట్లు మేల్కాంచుట తన స్వభావము. ఇట్టి మేల్కాంచిన స్థితిని ఆధ్యాత్మ మందురు. అనగా ఆత్మగ మేల్కాంచి, తనను తాను అధిష్ఠించి యుండును. దీనినే బ్రహ్మము ఆత్మగ మారుట యందురు. ఇది బ్రహ్మము యొక్క స్వభావము.
మన యందు కూడ ఈ స్వభావము కారణముగనే మేల్కొనుట యుండును. మేల్కొనిన వెంటనే ఆత్మ నుండి ఇచ్ఛా జ్ఞాన క్రియలు ఉత్పన్న మగుచుండును. అట్లే బ్రహ్మము విశ్వాత్మగ మేల్కాంచి నపుడు అతని నుండి ఇచ్ఛా జ్ఞాన క్రియలుత్పన్నమై, సృష్టి కర్మ ప్రారంభమగును. ఇట్లు ఆత్మకు కర్మము అనివార్యమై యుండును.
మేల్కాంచిన జీవుడు కూడ కర్మ సంగమున యుండుట సహజము. కనుకనే పరమాత్మ అక్షరము, పరము అగు బ్రహ్మము అయి ఉన్నను స్వభావతః ఆత్మయగుట, ఆత్మకర్మముతో కూడి యుండుట సహజమని తెలియజెప్పు చున్నాడు. జీవునకు తనకర్మ మెట్లు అనివార్యమో, విశ్వాత్మకు సృష్టికర్మ అట్లే అనివార్యము. బ్రహ్మము, ఆత్మ, కర్మము అను మూడు అంశములను ఈ శ్లోకమున వివరించుట జరిగినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 411🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 23
*🌻. దేవతలు శివుని దర్శించుట - 1 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఓ మహర్షీ! శివుని పొందుట కొరకై పార్వతి ఈ విధముగా తపస్సు చేయుచుండగా చాలా కాలము గడిచిపోయెను. కాని శివుడు సాక్షాత్కరించలేదు (1). అపుడు హిమవంతుడు భార్యతో, కుమారులతో, మంత్రులతో గూడి అచటకు వచ్చి, దృఢనిశ్చయముగల, పరమేశ్వరియగు పార్వతితో నిట్లనెను (2).
ఓ పార్వతీ! నీ భాగ్యము గొప్పది. నీవు ఇట్లు తపస్సును చేస్తూ ఖేదమును పొంందకుము. అమ్మాయీ! రుద్రుడు కానవచ్చుట లేదు. ఆయన విరాగియనుటలో సందియము లేదు (3). నీవు సుకుమారమగు అవయవములు గలదానవు. కృశించి యున్నావు. నీవు స్పృహను కోల్పోయెదవు. దీనిలో సందేహము లేదు. నేను నీకు ముమ్మాటికీ సత్యమును చెప్పుచున్నాను (4).
ఓ అందమైనదానా! కావున నీవు లేచి, నీ ఇంటికి రమ్ము. పూర్వము మన్మథుని బూడిదగా చేసిన ఆరుద్రునితో నీకు పనియేమి? (5) ఓ దేవదేవీ! ఆయన వికారము నెరుంగనివాడు. కావున ఆ శివుడు నిన్ను వివాహ మాడుటకు రాబోడు. ఆయనను నీవు ఎట్లు ప్రార్థించెదవు? (6) ఆకాశమునందున్న చంద్రుని పట్టుకొనుట సంభవము కాదు. ఓ పుణ్యాత్మురాలా! శివుడు కూడ అటులనే పొంద శక్యము కానివాడని తెలుసుకొనుము (7).
బ్రహ్మ ఇట్లు పలికెను-
మేనాదేవి, సహ్య పర్వతుడు, మేరువు, మందరుడు, మైనాకుడు (8), మరియు క్రౌంచుడు మొదలగు ఇతర పర్వతములన్నియు అనేక యుక్తులను పలికి ఆమెను అదే తీరున కోరిరి. అయిననూ పార్వతి కంగారుపడలేదు (9). వారందరు తపస్సును చేయుచున్న ఆ సుందరితో నిట్లు పలుకగా, స్వసచ్ఛమగు చిరునవ్వు గల ఆ పార్వతి నవ్వుచున్నదై హిమవంతునితో నిట్లనెను (10).
పార్వతి ఇట్లు పలికెను-
తండ్రీ! పూర్వము మీకు చెప్పియుంటిని. తల్లీ! నీవు మరచితివా యేమి! బంధులారా! ఇప్పుడైననూ నా ప్రతిజ్ఞను వినుడు (11). ఈ మహాదేవుడు విరాగి. ఆయన కోపించి మన్మథుని భస్మము చేసినాడు. భక్త వత్సలుడగు అట్టి శంకరుని తపస్సు చేసి సంతోషపెట్టెదను (12). మీరందరూ ఆనందముగా మీ మీ గృహములకు వెళ్లుడు. శివుడు తప్పక ప్రసన్నుడు కాగలడు. ఈ విషయములో చర్చను చేయ తగదు (13). ఏ శివుడు మన్మథుని, హిమవంతుని వనమును తగులబెట్టినాడో, అట్టి శివుని కేవలము తపః ప్రభావముచే ఇదే స్థానమునకు తీసుకొని వచ్చెదను (14).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 158 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 11 - Master Hilarion’s note on Rule 21.
*🌻 When the disciple is ready to learn, then he is accepted, acknowledged, recognized. It must be so, for he has lit his lamp, and it cannot be hidden. - 9 🌻*
570. That is a very striking example, and it does seem to show that there may be many altruistic people doing work under the direction of our Masters, although they know nothing of such direction. There may be reasons which in this life make it undesirable that they should know. We may be very sure that the Master knows best, and, if he does not choose to declare Himself, we need not therefore suppose that He is not watching.
571. In these relations the Master always does exactly what is best for the man as well as what is best for the work, because He has the enormous advantage of dealing with these things at higher levels, where one has not to balance good against evil, as in the lower planes, where very often one can do good in one direction only when one does some harm in another way.
This recondite matter was alluded to by the Manu, when He said that there was no fire without smoke. But there is fire without smoke, pure good without any adverse consequences or associations, on the higher levels, because all is working together for the good of the whole, and the advancement of the whole includes the advancement of the unit also.
Even though it may seem in some cases that harm is done, that a person is checked, it is because it is best for his progress that such a check should then come – like the pruning of a tree, which might easily be thought by the tree to be a cruel act, and yet is emphatically intended for its benefit.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#LightonPath #Theosophy
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 39 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనం : పద్మావతి దేవి
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. అంతర్యామిత్వము 🌻*
ఈశ్వరుడు శరీరాదుల యందు అంతర్యామియై యుండి కూడ దాని ప్రకృతి లక్షణములతో అంటుపడడు.
నగలలో నున్న బంగారము ఆభరణము యొక్క ఆకారము , పేరు మొదలగు వానిని అంటించు కొనదు. అందుండియు బంగారముగనే యుండును.
అట్లే భగవంతుడు జీవులలో జీవుడై విహరించు చుండియు జీవిత్వమంటించు కొనక , దేవుడుగనే యుండును.
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 28 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 New Moon Love 🍀*
*🕉 Let a new-moon love happen. Hold each other, be loving to each other, care, and don't: hanker for the heat-because that heat was a madness, it was a frenzy; it is good that it is gone. You should think yourselves fortunate. 🕉*
If love goes deeper, husbands and wives become brothers and sisters. If love goes deeper, the sun energy becomes moon energy: The heat is gone, it is very cool. And when love goes deeper, a misunderstanding can happen, because we have become accustomed to the fever, the passion, the excitement, and now it all looks foolish. It is foolish!
Now when you make love, it looks silly; if you don't make love, you feel as if something is missing because of the old habit. When a husband and wife start feeling like this, a fear arises--have you started taking the other for granted? Has he become a brother or a sister, no longer your choice, no longer your ego trip? All these fears arise.
Sometimes one starts feeling that one is missing something- a sort of emptiness. But don't look at it through the past. Look at it from the future. Much is going to happen in this emptiness, much is going to happen in this intimacy-you will both disappear. Your love will become absolutely nonsexual, all the heat will be gone, and then you will know a totally different quality of love.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 88 / Sri Lalita Sahasranamavali - Meaning - 88 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 88. భక్తహార్ద తమోభేద భానుమద్-భానుసంతతిః ।*
*శివదూతీ, శివారాధ్యా, శివమూర్తి, శ్శివంకరీ ॥ 88 ॥ 🍀*
🍀 404. భక్తహార్దతమోభేద భానుమద్భాను సంతతిః -
భక్తుల హృదయగతమైన అంధకార అజ్ఞానమును భేదించునట్టి కాంతితో కూడిన సూర్యకిరణ పుంజము.
🍀 405. శివదూతీ -
శివుని వద్దకు పంపిన దూతిక.
🍀 406. శివారాధ్యా -
శివునిచే ఆరాధింపబడునది.
🍀 407. శివమూర్తిః -
శివుని యొక్క స్వరూపము.
🍀 408. శివంకరీ -
శుభములు చేకూర్చునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 88 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 88. bhakta-hārda-tamobheda-bhānumadbhānu-santatiḥ |*
*śivadūtī śivārādhyā śivamūrtiḥ śivaṅkarī || 88 || 🌻*
🌻 404 ) Bhaktha hardha thamo bedha bhanu mat bhanu santhathi -
She who is like the sun’s rays which remove the darkness from the heart of devotees
🌻 405 ) Shivadhoothi -
She who sent Shiva as her representative
🌻 406 ) Shivaradhya -
She who is worshipped by Lord Shiva
🌻 407 ) Shiva moorthi -
She who is of the form of Lord Shiva
🌻 408 ) Shivangari -
She who makes good to happen
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 88 / Sri Vishnu Sahasra Namavali - 88 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*
*శ్రవణం నక్షత్ర చతుర్ధ పాద శ్లోకం*
*🍀 88. సులభః సువ్రతః సిద్ధః శత్రు జిచ్ఛత్రుతాపనః !*
*న్యగ్రోధోదుంబరోశ్వత్థ శ్చాణూరాంధ్ర నిషూదనః !! 88 !! 🍀*
🍀 817. సులభః -
సులభముగా లభ్యమగువాడు.
🍀 818. సువ్రతః -
మంచి వ్రతము గలవాడు.
🍀 819. సిద్ధః -
సత్వస్వరూపుడై, పూర్ణరూపుడై విరాజిల్లువాడు.
🍀 820. శత్రుజిత్ -
శత్రువులను జయించువాడు.
🍀 821. శత్రుతాపనః -
సజ్జనులకు విరోధులైన వారిని హరించువాడు.
🍀 822. న్యగ్రోధః -
సర్వభూతములను మాయచే ఆవరించినవాడు.
🍀 823. ఉదుంబరః -
అన్నముచేత విశ్వమును పోషించువాడు.
🍀 824. అశ్వత్ధః -
అశాశ్వతమైన సంసార వృక్ష స్వరూపుడు.
🍀 825. చాణూరాంధ్ర నిషూదనః -
చాణూరుడను మల్లయోధుని వధించినవాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 88 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*
*Sloka for Sravana 4th Padam*
*🌻 88. sulabhaḥ suvrataḥ siddhaḥ śatrujicchatrutāpanaḥ |*
*nyagrōdhōdumbarōśvatthaścāṇūrāndhraniṣūdanaḥ || 88 || 🌻*
🌻 817. Sulabhaḥ:
One who is attained easily by offering trifles like leaf, flower, and fruits etc., with devotion.
🌻 818. Suvrataḥ:
'Vratati' means enjoys. So, one who enjoys pure offerings. It can also mean one who is a non-enjoyer, that is, a mere witness.
🌻 819. Siddhaḥ:
One whose objects are always attained, that is, omnipotent and unobstructed by any other will.
🌻 820. Śatrujit:
Conqueror of all forces of evil.
🌻 821. Śatrutāpanaḥ:
One who destroys the enemies of the Devas.
🌻 822. Nyagrodhaḥ:
That which remains above all and grows downward. That is, He is the source of everything that is manifest.
🌻 823. Udumbaraḥ:
One who as the Supreme cause is 'above the sky', that is, superior to all.
🌻 824. Aśvatthaḥ:
That which does not last even for the next day.
🌻 825. Cāṇūrāndhra-niṣūdanaḥ:
One who destroyed a valiant fighter Chanura belonging to the race of Andhra.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹