శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 459 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 459 - 1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 459 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 459 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀
🌻 459. ‘నళినీ’ - 1 🌻
శ్రీమాత పద్మ రూపము కలదని అర్థము. శ్రీమాత పాదములను పాదపద్మము లందురు. హస్తములను హస్త పద్మము లందురు (పద్మహస్త). శ్రీమాత ముఖమును పద్మముతో పోల్చుచూ పద్మముఖి అందురు. కన్నులను పద్మములతో పోల్చుచూ పద్మాక్షీ అందురు. చేతుల యందు పద్మమును ధరించి యుండుట చేతను, అరచేతులు పద్మము వలె కోమలముగ నుండుట వలననూ పద్మ హస్త అందురు. ఆమె పద్మము నుండియే ఉద్భవించినది గనుక పద్మజ అందురు. పద్మమునందే కూర్చుని యుండును గనుక పద్మాసనా అందురు. ఆమెకు పద్మములయందు ప్రియత్వ మెక్కువ కనుక పద్మప్రియ అందురు. ఆమె యుండు ప్రదేశము కూడ పద్మముల నిలయము. అందువలన పద్మాలయా అందురు. ఇన్ని రకములుగ పద్మముతో శ్రీమాతను పోల్చి చెప్పుదురు. అందువలన ఏకముగ పద్మినీ అందురు. నళినీ అనిననూ అదే అర్థము. నాళముతో కూడిన పుష్పమైనది గనుక 'నళినీ' అందురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 459 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻
🌻 459. 'Nalini' - 1 🌻
It means that Srimata Padma is in form of a Lotus. The feet of Srimata are called The lotus feet. The palms are called the Lotus palms. Padmamukhi means comparing Srimata's face to Lotus. Padmakshi means comparison of eyes to lotuses. She is called Padma hasta is due to the fact that the hands are holding lotus and the palms are tender like lotus. She is called Padmaja as she sprang from Lotus itself. She is called Padmasana because she is sitting in a Lotus. She is called Padma Priya because she is fond of Lotuses. Her place is also the abode of lotuses. And so she is called Padmalaya. Thus Sri Mata is compared to lotuses in many ways. Thus, she is called Padmini. Nalini also means the same. It is called 'Nalini' because it is a tubular flower.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Osho Daily Meditations - 360. UNDERSTANDING / ఓషో రోజువారీ ధ్యానాలు - 360. అవగాహన
🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 360 / Osho Daily Meditations - 360 🌹
✍️. ప్రసాద్ భరద్వాజ
🍀 360. అవగాహన 🍀
🕉. ప్రేమికులు విడిపోవచ్చు, కానీ ఒకరి సాన్నిహిత్యంలో పొందిన అవగాహన ఎప్పటికీ ఒక బహుమతిగా మిగిలిపోతుంది- మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తే, అతనికి లేదా ఆమెకు మీరు ఇవ్వగల విలువైన బహుమతి కొంత అవగాహన మాత్రమే. 🕉
ఒకరితో ఒకరు మాట్లాడుకోండి కానీ కొన్నిసార్లు మీ భాగస్వామికి ఏకాంతత అవసరమని అర్థం చేసుకోండి. ఇదే సమస్య: ఈ అవసరం మీ ఇద్దరికీ ఒకేసారి రాకపోవచ్చు. కొన్నిసార్లు మీరు ఆమెతో ఉండాలని కోరుకుంటారు, ఆమేమో ఒంటరిగా ఉండాలని కోరుకుంటుంది-దాని గురించి ఏమీ చేయలేము. అప్పుడు మీరు అర్థం చేసుకుని ఆమెను ఒంటరిగా వదిలేయాలి. కొన్నిసార్లు మీరు ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు, కానీ అతను మీ వద్దకు రావాలని కోరుకుంటాడు-అప్పుడు మీరు నిస్సహాయంగా ఉన్నారని అతనికి చెప్పండి! కేవలం మరింతగా అవగాహనను సృష్టించండి. ప్రేమికులలో లోపించేది ఇదే: వారికి తగినంత ప్రేమ ఉంది, కానీ అవగాహన, అస్సలు లేదు. అందుకే వారి ప్రేమ అపార్థం అనే రాళ్లపై పడి చనిపోతుంది. అవగాహన లేకుండా ప్రేమ జీవించదు.
ఒంటరిగా, ప్రేమ చాలా మూర్ఖమైనది; అవగాహనతో, ప్రేమ సుదీర్ఘ జీవితాన్ని గడపగలదు, అనేక ఆనందాలను పంచుకునే గొప్ప జీవితం, అనేక అందమైన క్షణాలు పంచుకోవడం, గొప్ప కవితా అనుభవాలు. కానీ అది అవగాహన ద్వారా మాత్రమే జరుగుతుంది. ప్రేమ మీకు చిన్న హనీమూన్ ఇవ్వగలదు, కానీ అంతే. అవగాహన మాత్రమే మీకు లోతైన సాన్నిహిత్యాన్ని ఇస్తుంది. మరియు ప్రతి హనీమూన్ తర్వాత డిప్రెషన్, కోపం, నిరాశ. మీరు అవగాహన పెంచుకుంటే తప్ప, ఏ హనీమూన్ సహాయం చేయదు; అది ఒక మందు లాగా ఉంటుంది. కాబట్టి మరింత అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నించండి. మరియు ఏదో ఒక రోజు మీరు విడిపోయినా, అవగాహన మీతో ఉంటుంది, అది ఒకరికొకరికి మీ ప్రేమ యొక్క బహుమతిగా ఉంటుంది.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 360 🌹
📚. Prasad Bharadwaj
🍀 360. UNDERSTANDING 🍀
🕉. Lovers can separate, but the understanding that has been gained in the company if the other will always remain as a gift- if you love a person, the only valuable gift that you can give to him or her is some quantity of understanding. 🕉
Talk to each other, and understand that sometimes your partner will need to be alone. And this is the problem: This need may not happen at the same time to both of you. Sometimes you want to be with her, and she wants to be alone-nothing can be done about it. Then you have to understand and leave her alone. Sometimes you want to be alone, but he wants to come to you-then tell him that you are helpless! Just create more and more understanding. That's what lovers miss: They have enough love, but understanding, none, none at all. That's why on the rocks of misunderstanding their love dies. Love cannot live without understanding.
Alone, love is very foolish; with understanding, love can live a long life, a great life-of many joys shared, of many beautiful moments shared, of great poetic experiences. But that happens only through understanding. Love can give you a small honeymoon, but that's all. Only understanding can give you deep intimacy. And each honeymoon is followed by depression, anger, frustration. Unless you grow in understanding, no honeymoon is going to be of any help; it will be just like a drug. So try to create more understanding. And even some day if you separate, the understanding will be with you, that will be a gift of your love to each other.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
శ్రీ శివ మహా పురాణము - 741 / Sri Siva Maha Purana - 741
🌹 . శ్రీ శివ మహా పురాణము - 741 / Sri Siva Maha Purana - 741 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 12 🌴
🌻. మయస్తుతి - 4 🌻
ఈనాటి నుండియూ కలియుగములో ఈ మతములో ప్రవేశించిన మానవులకు దుర్గతి కలుగును. మేము సత్యమును పలుకుచున్నాము. దీనిలో సందేహము లేదు (30). ధీరులగు ఓ సన్న్యాసులారా! మీరు నా ఆజ్ఞచే కలి వచ్చువరకు ఎడారి ప్రదేశమును ఆశ్రయించి రహస్యముగా ఉండుడు (31). కలి ప్రవేశించగానే మీరు మీ మతమును స్థాపించుడు. మూర్ఖులు అజ్ఞానమునకు వశులై కలియుగములో మీ మతమును స్వీకరించగలరు (32). ఓ మహర్షి! దేవోత్తములు ఇట్లు ఆజ్ఞాపించగా, ఆ సన్న్యాసులు నమస్కరించి, తమకు నిర్దేశంపబడిన నివాస స్థానమునకు వెళ్లిరి (33).
మహాయోగియగు ఆ రుద్రబగవానుడు త్రిపురవాసులను భస్మము చేసి కృతకృత్యుడై బ్రహ్మాదులచే పూజింపబడెను (34). సర్వగణములతో, పార్వతీ దేవితో మరియు పుత్రులతో కూడియున్న ఆ ప్రభుడు దేవతలకొరకై ఆ మహాకార్యమును నిర్వర్తించి అంతర్థానమును చెందెను (35). శివదేవుడు పరివారముతో గూడి అంతర్థానము కాగానే, థనస్సు, బాణము, రథము మొదలగు సామగ్రి కూడ అంతర్ధానమయ్యెను (36). అపుడు బ్రహ్మ, విష్ణువు, దేవతలు, మునులు, గంధర్వులు, కిన్నరులు, నాగులు, సర్పములు, అప్సరసలు మరియు మానవులు మిక్కిలి సంతసించినవారై (37). శివుని యశస్సును ఆనందముతో గానము చేయుచూ, తమ తమ నెలవులకు బయలుదేరిరి. వారు తమ తమ నెలవులకు చేరి పరమానందమును పొందిరి (38). త్రిపురాసుర సంహారము అనే గొప్ప లీలతో గూడియున్న, చంద్రశేఖరుని మహాచరిత్రమునంతనూ నీకీ తీరున వివరించితిని (39).
ఈ ధన్యమగు వృత్తాంతము కీర్తిని, ఆయుర్దాయమును ఇచ్చి ధనధాన్యములను వృద్ధి పొందించుటయే గాక, స్వర్గమును మోక్షమును కూడ ఇచ్చును. నీవు ఇంకనూ ఏమి వినగోరుచున్నావు? (40) ఈ గొప్ప వృత్తాంతమును నిత్యము పఠించువాడు, మరియు వినువాడు ఇహలోకములో సమస్త భోగముల ననుభవించి, దేహత్యాగానంతరము మోక్షమును పొందును (41).
శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందలి యుద్ధఖండములో మయస్తుతివర్ణనమనే పన్నెండవ అధ్యాయము ముగిసినది (12).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 741🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 12 🌴
🌻 The Gods go back to their abodes (Maya’s prayer) - 4 🌻
30. From now onwards in the Kali age those who follow this cult will be faced with disastrous results. We tell you the truth. There is no doubt about it.
31. O brave tonsured heads, till the advent of the Kali age, you shall stay incognito in the desert region.[2] That is my behest.
32. When the Kali age begins, you can propagate your cult. In the Kali age deluded fools will follow your cult.
33. Thus bidden by the great gods, O great sage, the tonsured heads bowed to them and went to their allotted abode.
34-35. Then lord Śiva, the great Yogin after burning the residents of the three cities felt contented. He was duly worshipped by Brahmā and others. Then the lord, after completing the task of the gods, vanished from the scene accompanied by his Gaṇas, goddess Pārvatī and the sons.
36. When lord Śiva had vanished with his followers, the fortress too vanished along with the bow, arrows, chariot and other things.
37-38. Then Brahmā, Viṣṇu, the gods, sages, Gandharvas, Kinnaras, Nāgas, serpents, celestial damsels and the delighted men went to their abodes praising the glory of Śiva. After reaching their abodes they were highly delighted.
39. Thus the exalted narrative of the moon-crested lord indicative of the annihilation of Tripuras coupled with the great divine sports has been narrated to you.
40. It is conducive to wealth, fame, and longevity. It increases prosperity and possession of food-grains. It yields heavenly pleasure and salvation. What else do you wish to hear?
41. He who reads and hears the exalted narrative will enjoy all pleasures here and attain salvation hereafter.
Continues....
🌹🌹🌹🌹🌹
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 780 / Vishnu Sahasranama Contemplation - 780
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 780 / Vishnu Sahasranama Contemplation - 780🌹
🌻780. దురావాసః, दुरावासः, Durāvāsaḥ🌻
ఓం దురావాసాయ నమః | ॐ दुरावासाय नमः | OM Durāvāsāya namaḥ
దుఃఖేనా వాస్యతే చిత్తే సమధౌ యోగిభిర్హరిః ।
ఇతి విష్ణుర్దురావాస ఇతి సఙ్కీర్త్యతే బుధైః ॥
యోగులచే తమ చిత్తములయందు సమాధి స్థితియందు ఎంతయో శ్రమచే నిలుపుకొనబడువాడు కనుక దురావాసః.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 780🌹
🌻780. Durāvāsaḥ🌻
OM Durāvāsāya namaḥ
दुःखेना वास्यते चित्ते समधौ योगिभिर्हरिः ।
इति विष्णुर्दुरावास इति सङ्कीर्त्यते बुधैः ॥
Duḥkhenā vāsyate citte samadhau yogibhirhariḥ,
Iti viṣṇurdurāvāsa iti saṅkīrtyate budhaiḥ.
In samādhi He is retained in the mind by yogis with difficulty.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
समावर्तोऽनिवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः ।
दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिहा ॥ ८३ ॥
సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ।
సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ।
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ 83 ॥
Samāvarto’nivrttātmā durjayo duratikramaḥ,
Samāvarto’nivrttātmā durjayo duratikramaḥ,
Durlabho durgamo durgo durāvāso durārihā ॥ 83 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
Continues....
🌹 🌹 🌹 🌹🌹
కపిల గీత - 188 / Kapila Gita - 188
🌹. కపిల గీత - 188 / Kapila Gita - 188 🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
📚. ప్రసాద్ భరధ్వాజ
🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 42 🌴
42. సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని|
ఈక్షేతానన్యభావేన భూతేష్వివ తదాత్మతామ్॥
తాత్పర్యము : జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు అను నాలుగు విధములగు ప్రాణులను వేర్వేరుగా తోచుచున్నను వాటి దేహములన్నియు పంచభూత నిర్మితములే. ఐనను, వాటిలో చైతన్యరూపమున విలసిల్లుచున్న ఆత్మ ఒక్కటే అనియు, ఆత్మయందు సకలజీవులను అనన్యభావముతో అనుగతమై యున్నవని ఆత్మజ్ఞాని తెలిసికొనును.
వ్యాఖ్య : సర్వభూతేషు చాత్మానం - దేవ మనుష్య తిర్యక్కులూ స్థావరాలు ఈ నాలుగు రకముల ప్రాణులూ ఒకటా వేరా? వీటన్నింటిలో ఉన్న ఆత్మలు ఒకటే. అనేకమంది జీవులలో ఉన్న ఆత్మలన్నీ జ్ఞ్యానస్వరూపాలే. అన్ని ప్రాణులలో ఆత్మ ఒకటే. ఆన్ని ఆత్మలలో ఉన్న ప్రాణులు (శరీరాలు) కూడా ఒకటే. ఎలాగంటే దేవ తిర్యక్ మనుష్య స్థావరాలు కూడా వారి వారి పాప పుణ్యాలతో జన్మించినా, అన్ని శరీరాలు పాంచభౌతికములే. ప్రతీ ఆత్మ ధరించే శరీరాలన్నీ పాంచభౌతికములే. ఆ శరీరాలు ధరించే ఆత్మలు జ్ఞ్యానాధికరణములే. వీటన్నింటిలో ఉన్న పరమాత్మ ఒక్కడే (ఏకమేవ అద్వితీయం బ్రహ్మ) . ఆత్మలకు ధారకమైన అన్ని శరీరాలు పంచభౌతికములే, అన్ని ఆత్మలు జ్ఞ్యానాకారములే, అన్ని ఆత్మలకు ఆత్మ అయిన పరమాత్మ ఒకడే. మనకు వేరు వేరు అనిపించేవి ఏవీ వేరు కాదు. అన్నీ పాంచ భౌతికములే. ఇలా చూడగలిన వాడే యోగి. అన్ని ప్రాణులలో పరమాత్మ ఆత్మగా ఉన్నాడని చూడాలి
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 188 🌹
🍀 Conversation of Kapila and Devahuti 🍀
📚 Prasad Bharadwaj
🌴 4. Features of Bhakti Yoga and Practices - 42 🌴
42. sarva-bhūteṣu cātmānaṁ sarva-bhūtāni cātmani
īkṣetānanya-bhāvena bhūteṣv iva tad-ātmatām
MEANING : A yogi should see the same soul in all manifestations, for all that exists is a manifestation of different energies of the Supreme. In this way the devotee should see all living entities without distinction. That is realization of the Supreme Soul.
PURPORT : As stated in the Brahma-saṁhitā, not only does the Supreme Soul enter each and every universe, but He enters even the atoms. The Supreme Soul is present everywhere in the dormant stage, and when one can see the presence of the Supreme Soul everywhere, one is liberated from material designations.
The word sarva-bhūteṣu is to be understood as follows. There are four different divisions of species-living entities which sprout from the earth, living entities born of fermentation or germination, living entities which come from eggs and living entities which come from the embryo. These four divisions of living entities are expanded in 8,400,000 species of life. A person who is freed from material designations can see the same quality of spirit present everywhere or in every manifested living entity. Less intelligent men think that plants and grass grow out of the earth automatically, but one who is actually intelligent and has realized the self can see that this growth is not automatic; the cause is the soul, and the forms come out in material bodies under different conditions. By fermentation in the laboratory many germs are born, but this is due to the presence of the soul. The material scientist thinks that eggs are lifeless, but that is not a fact. From Vedic scripture we can understand that living entities in different forms are generated under different conditions. Birds evolve from eggs, and beasts and human beings are born from the embryo. The perfect vision of the yogī or devotee is that he sees the presence of the living entity everywhere.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
05 Jun 2023 Daily Panchang నిత్య పంచాంగము
🌹 05, జూన్, JUNE 2023 పంచాగము - Panchagam 🌹
శుభ సోమవారం, Monday, ఇందు వాసరే
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 34 🍀
69. పరశ్వధాయుధో దేవః హ్యనుకారీ సుబాంధవః | తుంబ వీణో మహాక్రోధ ఊర్ధ్వరేతా జలేశయః
70. ఉగ్రో వంశకరో వంశో వంశనాదో హ్యనిందితః | సర్వాంగ రూపో మాయావీ సుహృదో హ్యనిలోఽనలః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ప్రాణప్రతిష్ఠ - ప్రాణప్రతిష్ట మూలమున శక్తిమంతమైన దివ్యసన్నిధి కల్పించ బడినప్పుడు, ఆ దివ్యసన్నిధి కల్పించిన వాని శరీర త్యాగానంతరం కూడా చాలాకాలం వరకూ ఉండవచ్చును. సామాన్యంగా అది, అర్చకుల భక్తి విశేషం చేత, దేవాలయానికి వచ్చే ఆస్తిక జనుల విశ్వాసబలం చేత పోషించ బడుతూ, అవి లోపించినప్పుడు తిరోహితం కావడం కద్దు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
జ్యేష్ఠ మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 06:40:07 వరకు
తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: మూల 25:24:04 వరకు
తదుపరి పూర్వాషాఢ
యోగం: సద్య 08:49:29 వరకు
తదుపరి శుభ
కరణం: కౌలవ 06:39:07 వరకు
వర్జ్యం: 10:44:00 - 12:12:00
దుర్ముహూర్తం: 12:40:46 - 13:33:16
మరియు 15:18:16 - 16:10:45
రాహు కాలం: 07:19:14 - 08:57:40
గుళిక కాలం: 13:52:57 - 15:31:23
యమ గండం: 10:36:06 - 12:14:32
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:40
అమృత కాలం: 19:32:00 - 21:00:00
సూర్యోదయం: 05:40:49
సూర్యాస్తమయం: 18:48:15
చంద్రోదయం: 20:19:48
చంద్రాస్తమయం: 06:27:11
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: లంబ యోగం -చికాకులు,
అపశకునం 25:24:04 వరకు తదుపరి
ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Posts (Atom)