5వ పాశురము Part 1 తిరుప్పావై భావార్థ గీత మాలిక 3 / 5th Pasura Part1 Tiruppavai Bhavartha Gita Series 3



https://youtube.com/shorts/J9QZvhNSPH4


🌹 5వ పాశురము Part 1 తిరుప్పావై భావార్థ గీత మాలిక 3 - 5th Pasura Part1 Tiruppavai Bhavartha Gita Series 3 🌹

🍀 5వ పాశురం – కృష్ణలీలా గానము 🍀

తప్పకుండా వీక్షించండి

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 5వ పాశురం కృష్ణుడి అద్భుతమైన శక్తులను, ఉత్తర మధురలో జన్మించిన తీరును, యమునా నది తీరంలో ఆడిన ఆటలను గుర్తుచేస్తూ, అతనిని మేల్కొలపమని, తమ పాపాలను తొలగించి రక్షించమని తోడి బాలికలతో గోదాదేవి అభ్యర్థన. 🍀

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


నేటి నుంచే పుష్యమాసం.. శనీశ్వరుడికి ప్రీతికర మాసం పుష్యమాసం Pushya Masam, loved by Lord Shani, begins today...



🌹 నేటి నుంచే పుష్యమాసం.. శనీశ్వరుడికి ప్రీతికర మాసం పుష్యమాసం 🌹

ప్రసాద్ భరద్వాజ



పుష్య మాసం పుణ్య మాసం. ఈ మాసంలో చంద్రుడు పుష్యమి నక్షత్రంతో కలిసి ఉంటాడు, అందుకే దీనికి పుష్య మాసం అని పేరు వచ్చింది. అటు శనిదేవుడి జన్మనక్షత్రం కూడా పుష్యమే.. అందుకే ఈ మాసం శని దేవునికి ప్రీతికరమైనది. ఆయనను పూజిస్తే కష్ఠాలు తొలగి శుభాలు కలుగుతాయని నమ్మకం. విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజిస్తే సౌందర్యం, శివుడిని మారేడు దళాలతో అర్చిస్తే ఐశ్వర్యం లభిస్తాయని శాస్త్ర వచనం. ఈ నెలలో చేసే గింజంత దానమైనా అనంత పుణ్య ఫలాన్ని ఇస్తుందని అంటారు. నదీ స్నానాలు సూర్యారాధనతో ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పండితుల వాక్కు.

శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి వెలిగించడం వల్ల వెలువడే సుగంధభరితమైన పొగ మానసిక ప్రశాంతతను ఇచ్చి, మనలోని సోమరితనాన్ని, ప్రతికూల ఆలోచనలను పారద్రోలుతుందని పండితులు చెబుతున్నారు. 'ఆధ్యాత్మికంగా చూస్తే.. ఈ ధూపం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి ఈతిబాధలు తొలగిపోతాయి. అలాగే సకల దేవతల అనుగ్రహం లభించి, కుటుంబంలో సుఖశాంతులు చేకూరుతాయి. మనసు ఉల్లాసంగా మారి పనుల పట్ల ఉత్సాహం పెరుగుతుంది' అంటున్నారు.

శీతాకాలంలో వచ్చే పుష్య మాసం జపతపాదులు, ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది, ఈ మాసంలో పితృదేవతలను పూజిస్తే దోషాలు తొలగిపోతాయి. "పుష్య" అనే మాటకు పోషణ, శక్తి కలిగినది అని అర్థం. దీనిని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ లలోకూడా అనుసరిస్తారు.

పుష్య మాసం ఆధ్యాత్మిక పరంగా విశిష్టమైనదే కానీ వివాహాలు, గృహప్రవేశం, నిశ్చితార్థాలు మొదలైన కొన్ని రకాల కార్యాలకు ఆశుభకరమైన మాసంగా జ్యోతిష శాస్త్రం పరిగణిస్తోంది. పుష్య పౌర్ణమి వేదాధ్యయనానికి చాలా విశిష్టమైనది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయమని పండితులు చెబుతున్నారు.

ఈ నెల రోజుల పాటు శనైశ్చరుణ్ని పూజించిన వారికి ఆయన మేలు కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. జాతకంలో ఏలినాటి శని ఉన్న వారు ఈ మాసంలో రోజూ ఉదయానే కాలకృత్యాలు తీర్చుకొని శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్ధించాలి. పౌర్ణమి రోజున తెల్లవారు జామునే లేచి శనికి తైలాభిషేకం చేయించి నవ్వులు దానమివ్వాలి. ఆ రోజు నువ్వులు, బెల్లం ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

పుష్యమాసం మొదటి పక్షం రోజులు శ్రీ మహా విష్ణువుని తులసీ దళాలతో పూజిస్తే మానసిక ప్రశాంత లభిస్తుంది. పుష్య సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతో, ఆదివారం రోజున సూర్యుణ్ణి జిల్లేడు పూలతో పూజించడం శ్రేష్టం.

🌹 🌹 🌹 🌹 🌹

తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 3 - పాశురాలు 5&6 / Tiruppavai Pasuras Bhavartha Gita Series 3 - Pasuras 5&6



https://youtu.be/IB-Akw9x5H4


🌹 తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 3 - పాశురాలు 5&6 Tiruppavai Pasuras Bhavartha Gita Series 3 - Pasuras 5&6 🌹

🍀 5వ పాశురం – కృష్ణలీలా గానము, 6వ పాశురం – ఆత్మజాగరణ గీతం 🍀

తప్పకుండా వీక్షించండి

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 పాశురాలు అంటే చందో బద్ధంగా ఉన్న పాటలు అని అర్థం. 5వ పాశురం కృష్ణుడి అద్భుతమైన శక్తులను, ఉత్తర మధురలో జన్మించిన తీరును, యమునా నది తీరంలో ఆడిన ఆటలను గుర్తుచేస్తూ, అతనిని మేల్కొలపమని, తమ పాపాలను తొలగించి రక్షించమని తోడి బాలికలతో గోదాదేవి అభ్యర్థన. 6వ పాశురంలో, ప్రకృతిలోని శబ్దాలు, యోగుల స్మరణల ద్వారా కృష్ణుని లీలలను గుర్తుచేస్తూ, తోటి గోపికను మేల్కొలపడం, భగవత్ సేవకు ప్రేరేపించడం ముఖ్య ఉద్దేశ్యంగా సాగుతుంది. 🍀

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹

ధనుర్మాసంలో ఇంటి ముందు వేసే ముగ్గులు, గొబ్బెమ్మల అంతరార్థం, ప్రయోజనాలు The Meaning & Benefits of Rangoli Designs & Gobbi Emblems during Dhanurmasam



🌹 ధనుర్మాసంలో ఇంటి ముందు వేసే ముగ్గులు, గొబ్బెమ్మల అంతరార్థం, ప్రయోజనాలు 🌹

ప్రసాద్ భరద్వాజ



ఉదయాన్నే చలిలో లేచి ముగ్గులు ఎందుకు వేయాలి? గొబ్బెమ్మలు ఎందుకు పెట్టాలి? ఇది కేవలం సాంప్రదాయమా, లేక దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? ధనుర్మాసంలో ముగ్గులు వేయడం వలన లభించే ‘ధనుర్వాయువు’ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఏకాగ్రత పెరుగుదల వంటి అనేక శాస్త్రీయ అంశాలు దీని వెనుక ఉన్నాయి. ధనుర్మాసం నెల రోజులు ముగ్గులు వేయడం ఆచారం. ఈ సంప్రదాయం వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఇవే.

గోదాదేవి ఆరాధన: ధనుర్మాసంలో గోదాదేవి శ్రీమహావిష్ణువును పతిగా పొందాలని ‘తిరుప్పావై’ వ్రతాన్ని ఆచరించింది. ఆ సమయంలో స్వామి వారికి స్వాగతం పలకడానికి, మార్గాలను పవిత్రం చేయడానికి అందమైన ముగ్గులు వేసే వారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆరాధనా భావనతోనే భక్తులు ముగ్గులు వేస్తారు.

గొబ్బెమ్మల విశిష్టత : ముగ్గుల మధ్యలో పెట్టే గొబ్బెమ్మలను గోదాదేవి అంశగా, శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతిపాత్రమైనవిగా భావిస్తారు. ఈ గొబ్బెమ్మలను పసుపు, కుంకుమలతో అలంకరించడం వల్ల సాక్షాత్తూ మహాలక్ష్మి ఇంట్లోకి ప్రవేశించి, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం.

భూత దయ (జీవ కారుణ్యం): ముగ్గులను బియ్యపు పిండితో వేయడం వెనుక ఒక గొప్ప ఉద్దేశ్యం ఉంది. చీమలు, పక్షులు వంటి చిన్న జీవులకు ఆహారం అందించడం (భూత యజ్ఞం) ద్వారా పుణ్యం లభిస్తుందని మన పెద్దలు చెబుతారు. ఇది పర్యావరణ స్పృహను మరియు జీవ కారుణ్యాన్ని తెలియజేస్తుంది.

ధనుర్మాస ముగ్గులు కేవలం సంప్రదాయమే కాదు, దీని వెనుక కొన్ని ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ధనుర్వాయువు పీల్చడం: ధనుర్మాసంలో తెల్లవారుజామున వచ్చే గాలిని ‘ధనుర్వాయువు’ లేదా బ్రహ్మ ముహూర్తపు స్వచ్ఛమైన గాలి అంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముగ్గులు వేయడానికి ఉదయాన్నే లేవడం వల్ల ఈ స్వచ్ఛమైన గాలి శరీరానికి తగిలి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఏకాగ్రత మరియు మెదడు పనితీరు: చుక్కల ముగ్గులు, గీతలతో కూడిన సంక్లిష్టమైన ముగ్గులు వేయడం వల్ల మెదడుకు పని లభిస్తుంది. ఇది ఏకాగ్రతను పెంచి, మానసిక ప్రశాంతతను మరియు ఉల్లాసాన్ని ఇస్తుంది.

ఈ ముగ్గులు కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, కుటుంబ క్షేమానికి, అభివృద్ధికి చిహ్నం. ఇంటి ముందర ముగ్గు ఉంటే ఆ ఇల్లు కళకళలాడుతూ, లక్ష్మీప్రదంగా ఉంటుందని నమ్మకం. నెగటివ్ ఎనర్జీ (ప్రతికూల శక్తి) లోపలికి రాకుండా ఈ ముగ్గులు అడ్డుకుంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముగ్గు శుభప్రదమైన ప్రారంభానికి సంకేతం.

🌹🌹🌹🌹🌹