శ్రీ లలితా సహస్ర నామములు - 139 / Sri Lalita Sahasranamavali - Meaning - 139
🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 139 / Sri Lalita Sahasranamavali - Meaning - 139 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 139. కులోత్తీర్ణా, భగారాధ్యా, మాయా, మధుమతీ, మహీ ।
గణాంబా, గుహ్యకారాధ్యా, కోమలాంగీ, గురుప్రియా ॥ 139 ॥ 🍀
🍀 715. కులోత్తీర్ణా :
సుషుమ్నా మార్గమున పైకిపోవునది
🍀 716. భగారాధ్యా :
త్రికోణ యంత్రమును ఆరాధింపబడునది
🍀 717. మాయా :
మాయాస్వరూపిణీ
🍀 718. మధుమతీ :
మధురమైన మనస్సు కలది (ఆనందస్వరూపిణీ)
🍀 719. గణాంబా :
గణములకు తల్లి
🍀 720. కుహ్యకారాధ్యా :
గుహ్యాదులచే ఆరాధింపబడునది
🍀 721. కోమలాంగీ :
మృదువైన శరీరము కలిగినది
🍀 722. గురుప్రియా :
గురువునకు ప్రియమైనది
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 139 🌹
📚. Prasad Bharadwaj
🌻 139. Kulottirna bhagaradhya maya madhumatimahi
Gananba guhyakaradhya komalangi gurupriya ॥ 139 ॥ 🌻
🌻 715 ) Kulotheerna -
She who is beyond the group of senses
🌻 716 ) Bhagaradhya -
She who is to be worshipped in the universe round the sun
🌻 717 ) Maya -
She who is illusion
🌻 718 ) Madhumathi -
She who is the trance stage (seventh ) in yoga
🌻 718 ) Mahee -
She who is personification of earth
🌻 719 ) Ganamba -
She who is mother to Ganesha and bhootha ganas
🌻 720 ) Guhyakaradhya -
She who should be worshipped in secret places
🌻 721 ) Komalangi -
She who has beautiful limbs
🌻 722 ) Guru Priya -
She who likes teachers
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
19 Oct 2021
మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 91
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 91 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. చేయవలసినది- చేయదలచినది - 7 🌻
కన్నులు మూసికొన్న, ముక్కు మూసికొన్న,ఇంద్రియాల్ని మనస్సులోనికి నిగ్రహించుకొనుటకు, మనస్సును ఆత్మలోకి నిగ్రహించుకొనుటకు సాధన కొరకు మాత్రమే గాని మూసికొనటం కోసం కాదు. ఎలా అయితే శరీరం వదిలి నిద్రలో మనం కాలు, చేయి కూడదీసికొనుట కోసం మనలోనికి మనం వెళ్ళిపోతామో, అలాంటిదే కన్నులు మూసికొన్నా, ముక్కులు మూసికొన్నా.
ధ్యానం చేస్తూ తపస్సు చేస్తూ లీనమైపోవటం ఎక్కడా చెప్పలేదు. ఋషులు చతుర్విధపురుషార్థములు, వాటి సమన్వయము, ధర్మాచరణం, ధర్మాచరణం వలన వచ్చే కామము, దాని వలన వచ్చే అర్థము, త్యాగం చేత పరమేశ్వరుని యందు అర్పణ బుద్ధితో చేయటం వలన వచ్చే మోక్షము గురించి చెప్పారు గానీ ఏదో ఒక స్థితిలో కన్నులు మూసికొని ఉండిపోవటం చెప్పలేదు.
ప్రార్థన గానీ, అనుష్ఠానం గానీ, నిరంతరం చేస్తూండటం వలన వికాసం చెందుతూ ఉంటూ ఉంటాం. చేస్తూ ఉన్నన్నాళ్ళు వికాసం చెందుతాం, చేయటం మానేసిన తరువాత రోజున వికాసం ఆగిపోతుంది. ఎన్ని పదుల సంవత్సరాలు వందల సంవత్సరాలు (జన్మలు) సాధన చేసినా మానేస్తే భ్రష్టుపట్టిపోతాం. చేస్తే ఏం వస్తుందనేదేం లేదు. చేస్తూ ఉండటం పరమాత్మ యందు ఉండటం కోసమే. పరమాత్మ యందు ఉండటం మొదలు పెట్టిన తరువాత సాధన చేయకపోవటం ఉండదు. నిరంతరం నిత్యం ఉండేదే సాధన.
.....✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
19 Oct 2021
వివేక చూడామణి - 139 / Viveka Chudamani - 139
🌹. వివేక చూడామణి - 139 / Viveka Chudamani - 139🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 28. ప్రారబ్దము - 2 🍀
456. అతడు తాను కలలో కన్న వస్తువులను గూర్చి పట్టించుకోడు. అవి అసత్యాలని అతనికి తెలుసు. అలానే ఆ కలల ప్రపంచములో మెలుకువ స్థితిలో ఉండడు. ఒకవేళ అతడు ఇంకా ఆ కలలలోని అసత్య వస్తువులను గూర్చి ఆలోచించుచున్న నిద్ర నుండి స్వేచ్ఛను పొందిన వాడు కాదు.
457. అలానే ఎవరైన బ్రహ్మములో జీవిస్తున్నట్లు తాను ఆ ఆత్మలో మాత్రమే ఉంటాడు. ఇతరములను పట్టించుకోడు. ఒక వ్యక్తికి తన కలలలోని వస్తువులు జ్ఞాపకములో ఉన్నట్లు, బ్రహ్మములో ఉన్న వ్యక్తి తాను చేస్తున్న పనుల జ్ఞాపకములలోనే ఉంటాడు. కాని వాటిని గూర్చి పట్టించుకోడు.
458. ఈ శరీరము కర్మలు చేయుటకు మాత్రమే లభించింది. ఎవరైన ప్రారబ్దమును గూర్చి ఊహించిన అవి శరీరమునకు మాత్రమే చెందినవని గ్రహించును. కాని ఆత్మకు చెందినవని మాత్రము భావించరాదు. ఆత్మ ఎప్పటికి కర్మల వలన వ్యక్తము కాదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 139 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 28. Fate - 2 🌻
456. He has no desire to substantiate the unreal objects, nor is he seen to maintain that dream-world. If he still clings to those unreal objects, he is emphatically declared to be not yet free from sleep.
457. Similarly, he who is absorbed in Brahman lives identified with that eternal Reality and beholds nothing else. As one has a memory of the objects seen in a dream, so the man of realisation has a memory of the everyday actions such as eating.
458. The body has been fashioned by Karma, so one may imagine Prarabdha work with reference to it. But it is not reasonable to attribute the same to the Atman, for the Atman is never the outcome of work.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
19 Oct 2021
శ్రీ శివ మహా పురాణము - 462
🌹 . శ్రీ శివ మహా పురాణము - 462🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 32
🌻. సప్తర్షుల రాక - 6 🌻
హిమవంతుడిట్లు పలికెను -
సూర్యుని వలె వెలుగొందు ఈ ఏడ్గురు నా వద్దకు వచ్చుచున్నారు. నేనీ మహర్షులకు ఇప్పుడ శ్రద్ధగా పూజను చేయవలెను (56). ఇట్టి మహాత్ములు ఎవరి ఇంటికి విచ్చేయుదురో, అట్టి గృహస్థులగు మనము ధన్యులము. వీరు అందరికీ సుఖమునిచ్చెదరు (57).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఇంతలోనే ఆకాశమునుండి భూమిపైకి దిగి ఎదురుగా నిలబడిన ఆ ఋషులను చూచి హిమవంతుడు సన్మాన పూర్వకముగా ఎదురేగెను (58). చేతులు జోడించి తలను వంచి ఆయన సప్తర్షులకు నమస్కరించి వారికి బహుమాన పూర్వకముగా పూజను చేసెను (59). హితమును చేయు ఆ సప్తర్షులు పర్వతరాజగు హిమవంతుని పట్టుకొని ప్రసన్నమగు ముఖముగలవారై మంగళములకు నిలయములగు వచనములను పలికిరి (60).
వారిని ముందిడుకొని హిమవంతుడు 'నా గృహస్థాశ్రమము ధన్యమైనది' అని పలికి వారికి భక్తి పురస్సరముగా ఆసనమును సమర్పించెను (61). తేజో మూర్తులగు ఆ మునులు ఆసనములందు కూర్చున్న వారై ఆజ్ఞాపించగా, హిమవంతుడు తాను నిలబడియున్నవాడై ఇట్లు పలికెను (62).
హిమవంతుడిట్లు పలికెను-
నేను ధన్యుడను. కృతకృత్యుడను. నా జీవితము సఫలమైనది. ప్రజలు నన్ను అనేక తీర్థములతో సమానముగా భావించి దర్శించెదరు (63). ఏలయనగా, విష్ణుస్వరూపులగు మీరు నా గృహమునకు విచ్చేసితిరి. పూర్ణులగు మీకు దీనులగు గృహస్థుల గృహములలో కార్యము ఏమి ఉండును? (64) అయిననూ, దయచేసి సేవకుడునగు నాకు తగిన ఏదో ఒక పనిని చెప్పుడు. నా జన్మ సఫలము కాగలదు (65).
శ్రీ శివ మహాపురాణములోని రుద్రసంహితయందు సప్తర్షుల రాకను వర్ణించే ముప్పది రెండవ అధ్యాయము ముగిసినది (32).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
19 Oct 2021
గీతోపనిషత్తు -263
🌹. గీతోపనిషత్తు -263 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 6-2
🍀 6. రాజవిద్య -2 - వాయువు నుండి ఇతర భూతము లేర్పడి నట్లు, నీ నుండి నీ బుద్ధి, చిత్తము, ఇంద్రియములు, శరీరము ఏర్పడినవి. వాటన్నిటికిని నీవు మూలము. నేను నీకు మూలము. నీ యందలి నన్ను ఎరుగుటకు ప్రయత్నింపుము. నన్ను చేరిన నీకు నీ గుణదోషము లంటవు. సర్వము స్థిరమై పరమగు శాంతి లభించును. నీ యందున్న నేను, నీ యందు మాత్రమే లేను. అందరి యందును యున్నాను. అంతట నిండి యున్నాను. నా యందు నీ వుండుట వలన, నీయందు నేను లభ్యమగు చున్నాను. నన్ను నీవు చేరి, కూడి యున్నప్పుడు నీవు నరుడగు చున్నావు. అనగా నశింపని వాని వగుచున్నావు. అట్లు కూడి యుండనపుడు మానవుడ వగుచున్నావు. నీ యందున్న నన్ను నీవు గ్రహించుటయే రాజగుహ్యము నెరుగుట. నీయందున్న 'నా'తో యోగము చెందుటయే రాజవిద్య. 🍀
యథా కాశస్థితో నిత్యం వాయు స్సర్వత్రలో మహాన్ |
తథా సర్వాణి భూతాని మఠానీ త్యుపధారయ II 6
తాత్పర్యము : ఏ ప్రకారముగ అంతటను చరించు వాయువు ఆకాశము నందు స్థితిగొని యున్నదో, అట్లే సమస్త ప్రాణులును నా యందు స్థితిగొని యున్నవి అని తెలుసుకొనుము.
వివరణము : వాయువు నుండి ఇతర భూతము లేర్పడి నట్లు, నీ నుండి నీ బుద్ధి, చిత్తము, ఇంద్రియములు, శరీరము ఏర్పడినవి. వాటన్నిటికిని నీవు మూలము. నేను నీకు మూలము. నీ యందలి నన్ను ఎరుగుటకు ప్రయత్నింపుము. నన్ను చేరిన నీకు నీ గుణదోషము లంటవు. ఆకాశము చేరిన వాయువునకు “కదలిక" అను గుణదోషము ఉండదు. నన్ను చేరి, నాతో కూడిన నిన్ను గుణదోషము లంటవు. సర్వము స్థిరమై పరమగు శాంతి లభించును.
నీ యందున్న నేను, నీ యందు మాత్రమే లేను. అందరి యందును యున్నాను. అంతట నిండి యున్నాను. నిజమునకు నా యందు నీ వుండుట వలన, నీయందు నేను లభ్యమగు
చున్నాను. నన్ను నీవు చేరి, కూడి యున్నప్పుడు నీవు నరుడగు చున్నావు. అనగా నశింపని వాని వగుచున్నావు. అట్లు కూడి యుండనపుడు మానవుడ వగుచున్నావు.
అనగా మనస్సు ప్రధానముగ జీవించువాడవు అగుచున్నావు. అనగా చంచలత్వము పొందుచున్నావు. వాయువు, అగ్ని, జలము, పదార్థము ఎల్లప్పుడును మార్పునకు గురియగు చుండును. అట్లే నీవు, నీ బుద్ధి, చిత్తము, ఇంద్రియములు, శరీరము ఎప్పుడును మార్పునకు వశమై యుండును. మార్పు మరణము.
మరణమునకు జననము, జననమునకు మరణము బొమ్మ - బొరుసుల వలె, వెలుగు - నీడలవలె తారుమారగు చుండును. అట్టి స్థితి నుండి బయల్పడుటకు నీ యందు అందుబాటులో నున్న నన్ను తెలుసుకొని నాతో సంయోగము చెందుము. నీ యందున్న నన్ను నీవు గ్రహించుటయే రాజగుహ్యము నెరుగుట. నీయందున్న 'నా'తో యోగము చెందుటయే రాజవిద్య.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
19 Oct 2021
19-OCTOBER-2021 MESSAGES
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 19, మంగళవారం, ఆక్టోబర్ 2021 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 263 🌹
3) 🌹. శివ మహా పురాణము - 462🌹
4) 🌹 వివేక చూడామణి - 139 / Viveka Chudamani - 139🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -91🌹
6) 🌹 Osho Daily Meditations - 80 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 139 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 139🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*19, అక్టోబర్ 2021*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. ఆంజనేయుని శ్లోకాలు -4 🍀*
అంజనానందం వీరం
జానకీ శోక నాశనం|
కపీషమక్ష హంతారం
వందే లంకాభయంకరం||
భావము:- అంజనాదేవి కుమార,జానకీ మాతా శోకాన్ని పోగొట్టినవాడా,వానరమూక రాజా, లంక రాజుకు భయం పుట్టించిన వాడా, రావణుని రెండవ కుమారుడైన అక్షను సం హరించిన ఆంజనేయ నీకు వందనాలు.
🌻 🌻 🌻 🌻 🌻
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, శరద్ ఋతువు, అశ్వీజ మాసం
తిథి: శుక్ల చతుర్దశి 19:04:32 వరకు తదుపరి పూర్ణిమ
పక్షం: శుక్ల-పక్ష
నక్షత్రం: ఉత్తరాభద్రపద 12:14:26 వరకు తదుపరి రేవతి
యోగం: వ్యాఘత 20:37:16 వరకు తదుపరి హర్షణ
కరణం: గార 06:32:19 వరకు
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 08:30:25 - 09:17:11
రాహు కాలం: 14:56:17 - 16:23:59
గుళిక కాలం: 12:00:53 - 13:28:35
యమ గండం: 09:05:29 - 10:33:11
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23
అమృత కాలం: 07:08:24 - 08:49:56
సూర్యోదయం: 06:10:06, సూర్యాస్తమయం: 17:51:41
వైదిక సూర్యోదయం: 06:13:42
వైదిక సూర్యాస్తమయం: 17:48:05
చంద్రోదయం: 17:17:13 , చంద్రాస్తమయం: 04:56:07
సూర్య రాశి: తుల, చంద్ర రాశి: మీనం
ఆనందాదియోగం: సిద్ది యోగం - కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
12:14:26 వరకు తదుపరి శుభ యోగం - కార్య జయం
పండుగలు : కోజగర పూజ, శరద్ పౌర్ణమి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -263 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 6-2
*🍀 6. రాజవిద్య -2 - వాయువు నుండి ఇతర భూతము లేర్పడి నట్లు, నీ నుండి నీ బుద్ధి, చిత్తము, ఇంద్రియములు, శరీరము ఏర్పడినవి. వాటన్నిటికిని నీవు మూలము. నేను నీకు మూలము. నీ యందలి నన్ను ఎరుగుటకు ప్రయత్నింపుము. నన్ను చేరిన నీకు నీ గుణదోషము లంటవు. సర్వము స్థిరమై పరమగు శాంతి లభించును. నీ యందున్న నేను, నీ యందు మాత్రమే లేను. అందరి యందును యున్నాను. అంతట నిండి యున్నాను. నా యందు నీ వుండుట వలన, నీయందు నేను లభ్యమగు చున్నాను. నన్ను నీవు చేరి, కూడి యున్నప్పుడు నీవు నరుడగు చున్నావు. అనగా నశింపని వాని వగుచున్నావు. అట్లు కూడి యుండనపుడు మానవుడ వగుచున్నావు. నీ యందున్న నన్ను నీవు గ్రహించుటయే రాజగుహ్యము నెరుగుట. నీయందున్న 'నా'తో యోగము చెందుటయే రాజవిద్య. 🍀*
యథా కాశస్థితో నిత్యం వాయు స్సర్వత్రలో మహాన్ |
తథా సర్వాణి భూతాని మఠానీ త్యుపధారయ II 6
తాత్పర్యము : ఏ ప్రకారముగ అంతటను చరించు వాయువు ఆకాశము నందు స్థితిగొని యున్నదో, అట్లే సమస్త ప్రాణులును నా యందు స్థితిగొని యున్నవి అని తెలుసుకొనుము.
వివరణము : వాయువు నుండి ఇతర భూతము లేర్పడి నట్లు, నీ నుండి నీ బుద్ధి, చిత్తము, ఇంద్రియములు, శరీరము ఏర్పడినవి. వాటన్నిటికిని నీవు మూలము. నేను నీకు మూలము. నీ యందలి నన్ను ఎరుగుటకు ప్రయత్నింపుము. నన్ను చేరిన నీకు నీ గుణదోషము లంటవు. ఆకాశము చేరిన వాయువునకు “కదలిక" అను గుణదోషము ఉండదు. నన్ను చేరి, నాతో కూడిన నిన్ను గుణదోషము లంటవు. సర్వము స్థిరమై పరమగు శాంతి లభించును.
నీ యందున్న నేను, నీ యందు మాత్రమే లేను. అందరి యందును యున్నాను. అంతట నిండి యున్నాను. నిజమునకు నా యందు నీ వుండుట వలన, నీయందు నేను లభ్యమగు
చున్నాను. నన్ను నీవు చేరి, కూడి యున్నప్పుడు నీవు నరుడగు చున్నావు. అనగా నశింపని వాని వగుచున్నావు. అట్లు కూడి యుండనపుడు మానవుడ వగుచున్నావు.
అనగా మనస్సు ప్రధానముగ జీవించువాడవు అగుచున్నావు. అనగా చంచలత్వము పొందుచున్నావు. వాయువు, అగ్ని, జలము, పదార్థము ఎల్లప్పుడును మార్పునకు గురియగు చుండును. అట్లే నీవు, నీ బుద్ధి, చిత్తము, ఇంద్రియములు, శరీరము ఎప్పుడును మార్పునకు వశమై యుండును. మార్పు మరణము.
మరణమునకు జననము, జననమునకు మరణము బొమ్మ - బొరుసుల వలె, వెలుగు - నీడలవలె తారుమారగు చుండును. అట్టి స్థితి నుండి బయల్పడుటకు నీ యందు అందుబాటులో నున్న నన్ను తెలుసుకొని నాతో సంయోగము చెందుము. నీ యందున్న నన్ను నీవు గ్రహించుటయే రాజగుహ్యము నెరుగుట. నీయందున్న 'నా'తో యోగము చెందుటయే రాజవిద్య.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 462🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 32
*🌻. సప్తర్షుల రాక - 6 🌻*
హిమవంతుడిట్లు పలికెను -
సూర్యుని వలె వెలుగొందు ఈ ఏడ్గురు నా వద్దకు వచ్చుచున్నారు. నేనీ మహర్షులకు ఇప్పుడ శ్రద్ధగా పూజను చేయవలెను (56). ఇట్టి మహాత్ములు ఎవరి ఇంటికి విచ్చేయుదురో, అట్టి గృహస్థులగు మనము ధన్యులము. వీరు అందరికీ సుఖమునిచ్చెదరు (57).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఇంతలోనే ఆకాశమునుండి భూమిపైకి దిగి ఎదురుగా నిలబడిన ఆ ఋషులను చూచి హిమవంతుడు సన్మాన పూర్వకముగా ఎదురేగెను (58). చేతులు జోడించి తలను వంచి ఆయన సప్తర్షులకు నమస్కరించి వారికి బహుమాన పూర్వకముగా పూజను చేసెను (59). హితమును చేయు ఆ సప్తర్షులు పర్వతరాజగు హిమవంతుని పట్టుకొని ప్రసన్నమగు ముఖముగలవారై మంగళములకు నిలయములగు వచనములను పలికిరి (60).
వారిని ముందిడుకొని హిమవంతుడు 'నా గృహస్థాశ్రమము ధన్యమైనది' అని పలికి వారికి భక్తి పురస్సరముగా ఆసనమును సమర్పించెను (61). తేజో మూర్తులగు ఆ మునులు ఆసనములందు కూర్చున్న వారై ఆజ్ఞాపించగా, హిమవంతుడు తాను నిలబడియున్నవాడై ఇట్లు పలికెను (62).
హిమవంతుడిట్లు పలికెను-
నేను ధన్యుడను. కృతకృత్యుడను. నా జీవితము సఫలమైనది. ప్రజలు నన్ను అనేక తీర్థములతో సమానముగా భావించి దర్శించెదరు (63). ఏలయనగా, విష్ణుస్వరూపులగు మీరు నా గృహమునకు విచ్చేసితిరి. పూర్ణులగు మీకు దీనులగు గృహస్థుల గృహములలో కార్యము ఏమి ఉండును? (64) అయిననూ, దయచేసి సేవకుడునగు నాకు తగిన ఏదో ఒక పనిని చెప్పుడు. నా జన్మ సఫలము కాగలదు (65).
శ్రీ శివ మహాపురాణములోని రుద్రసంహితయందు సప్తర్షుల రాకను వర్ణించే ముప్పది రెండవ అధ్యాయము ముగిసినది (32).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 139 / Viveka Chudamani - 139🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀. 28. ప్రారబ్దము - 2 🍀*
456. అతడు తాను కలలో కన్న వస్తువులను గూర్చి పట్టించుకోడు. అవి అసత్యాలని అతనికి తెలుసు. అలానే ఆ కలల ప్రపంచములో మెలుకువ స్థితిలో ఉండడు. ఒకవేళ అతడు ఇంకా ఆ కలలలోని అసత్య వస్తువులను గూర్చి ఆలోచించుచున్న నిద్ర నుండి స్వేచ్ఛను పొందిన వాడు కాదు.
457. అలానే ఎవరైన బ్రహ్మములో జీవిస్తున్నట్లు తాను ఆ ఆత్మలో మాత్రమే ఉంటాడు. ఇతరములను పట్టించుకోడు. ఒక వ్యక్తికి తన కలలలోని వస్తువులు జ్ఞాపకములో ఉన్నట్లు, బ్రహ్మములో ఉన్న వ్యక్తి తాను చేస్తున్న పనుల జ్ఞాపకములలోనే ఉంటాడు. కాని వాటిని గూర్చి పట్టించుకోడు.
458. ఈ శరీరము కర్మలు చేయుటకు మాత్రమే లభించింది. ఎవరైన ప్రారబ్దమును గూర్చి ఊహించిన అవి శరీరమునకు మాత్రమే చెందినవని గ్రహించును. కాని ఆత్మకు చెందినవని మాత్రము భావించరాదు. ఆత్మ ఎప్పటికి కర్మల వలన వ్యక్తము కాదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 VIVEKA CHUDAMANI - 139 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻 28. Fate - 2 🌻*
456. He has no desire to substantiate the unreal objects, nor is he seen to maintain that dream-world. If he still clings to those unreal objects, he is emphatically declared to be not yet free from sleep.
457. Similarly, he who is absorbed in Brahman lives identified with that eternal Reality and beholds nothing else. As one has a memory of the objects seen in a dream, so the man of realisation has a memory of the everyday actions such as eating.
458. The body has been fashioned by Karma, so one may imagine Prarabdha work with reference to it. But it is not reasonable to attribute the same to the Atman, for the Atman is never the outcome of work.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 91 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. *చేయవలసినది- చేయదలచినది - 7* 🌻
* కన్నులు మూసికొన్న, ముక్కు మూసికొన్న,ఇంద్రియాల్ని మనస్సులోనికి నిగ్రహించుకొనుటకు, మనస్సును ఆత్మలోకి నిగ్రహించుకొనుటకు సాధన కొరకు మాత్రమే గాని మూసికొనటం కోసం కాదు. ఎలా అయితే శరీరం వదిలి నిద్రలో మనం కాలు, చేయి కూడదీసికొనుట కోసం మనలోనికి మనం వెళ్ళిపోతామో, అలాంటిదే కన్నులు మూసికొన్నా, ముక్కులు మూసికొన్నా.*
*ధ్యానం చేస్తూ తపస్సు చేస్తూ లీనమైపోవటం ఎక్కడా చెప్పలేదు. ఋషులు చతుర్విధపురుషార్థములు, వాటి సమన్వయము, ధర్మాచరణం, ధర్మాచరణం వలన వచ్చే కామము, దాని వలన వచ్చే అర్థము, త్యాగం చేత పరమేశ్వరుని యందు అర్పణ బుద్ధితో చేయటం వలన వచ్చే మోక్షము గురించి చెప్పారు గానీ ఏదో ఒక స్థితిలో కన్నులు మూసికొని ఉండిపోవటం చెప్పలేదు.*
*ప్రార్థన గానీ, అనుష్ఠానం గానీ, నిరంతరం చేస్తూండటం వలన వికాసం చెందుతూ ఉంటూ ఉంటాం. చేస్తూ ఉన్నన్నాళ్ళు వికాసం చెందుతాం, చేయటం మానేసిన తరువాత రోజున వికాసం ఆగిపోతుంది. ఎన్ని పదుల సంవత్సరాలు వందల సంవత్సరాలు (జన్మలు) సాధన చేసినా మానేస్తే భ్రష్టుపట్టిపోతాం. చేస్తే ఏం వస్తుందనేదేం లేదు. చేస్తూ ఉండటం పరమాత్మ యందు ఉండటం కోసమే. పరమాత్మ యందు ఉండటం మొదలు పెట్టిన తరువాత సాధన చేయకపోవటం ఉండదు. నిరంతరం నిత్యం ఉండేదే సాధన.*
.....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 80 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 80. TOMORROW 🍀*
*🕉 When you seek, the future is important, the goal is important.. And when you don't seek, the present moment is all there is. There is no future. so you cannot postpone-you cannot say, «Tomorrow I will be happy."" 🕉*
Through tomorrow we destroy today; through the fictitious "-ve destroy the real. So you can say, "Okay, if I am sad today, there is nothing to be worried about-tomorrow I will be happy." So today can be tolerated, you can bear it. But if there is no tomorrow and no future and nothing to seek for and find, there is no way to postponethe very postponement disappears. Then it is up to you to be happy or not to be happy. This moment, you have to decide. And I don't think anybody is going to decide to be unhappy. Why? For what?
The past is no more, and the future is never going to be, so this is the moment. You can celebrate it: You can love, you can pray, you can sing, you can dance, you can meditate, you can use it as you want. And the moment is so small that if you are not very alert it will slip out of your hands, it will be gone. So, to be, one has to be very alert. Doing needs no alertness; it is very mechanical. And don't use the word wait-because that means the future has entered again from the back door. If you think that you should just wait, then again you are waiting for the future. There is nothing to wait for. Existence is as perfect this moment as it will ever be. It is never going to be more perfect.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 139 / Sri Lalita Sahasranamavali - Meaning - 139 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 139. కులోత్తీర్ణా, భగారాధ్యా, మాయా, మధుమతీ, మహీ ।
గణాంబా, గుహ్యకారాధ్యా, కోమలాంగీ, గురుప్రియా ॥ 139 ॥ 🍀*
🍀 715. కులోత్తీర్ణా :
సుషుమ్నా మార్గమున పైకిపోవునది
🍀 716. భగారాధ్యా :
త్రికోణ యంత్రమును ఆరాధింపబడునది
🍀 717. మాయా :
మాయాస్వరూపిణీ
🍀 718. మధుమతీ :
మధురమైన మనస్సు కలది (ఆనందస్వరూపిణీ)
🍀 719. గణాంబా :
గణములకు తల్లి
🍀 720. కుహ్యకారాధ్యా :
గుహ్యాదులచే ఆరాధింపబడునది
🍀 721. కోమలాంగీ :
మృదువైన శరీరము కలిగినది
🍀 722. గురుప్రియా :
గురువునకు ప్రియమైనది
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 139 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 139. Kulottirna bhagaradhya maya madhumatimahi
Gananba guhyakaradhya komalangi gurupriya ॥ 139 ॥ 🌻*
🌻 715 ) Kulotheerna -
She who is beyond the group of senses
🌻 716 ) Bhagaradhya -
She who is to be worshipped in the universe round the sun
🌻 717 ) Maya -
She who is illusion
🌻 718 ) Madhumathi -
She who is the trance stage (seventh ) in yoga
🌻 718 ) Mahee -
She who is personification of earth
🌻 719 ) Ganamba -
She who is mother to Ganesha and bhootha ganas
🌻 720 ) Guhyakaradhya -
She who should be worshipped in secret places
🌻 721 ) Komalangi -
She who has beautiful limbs
🌻 722 ) Guru Priya -
She who likes teachers
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Subscribe to:
Posts (Atom)