🌹 05, MAY 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹

🍀🌹 05, MAY 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 05, MAY 2023 FRIDAY శుక్రవారం, బృగు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
*🍀. బుద్ధ పౌర్ణిమ, వైశాఖ పౌర్ణమి, కూర్మ జయంతి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Buddha Purnima, Vaishakha Purnima, Kurma Jayanti to All. 🍀*
*Prasad Bharadwaj*
2) 🌹 కపిల గీత - 173 / Kapila Gita - 173🌹 
🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 27 / 4. Features of Bhakti Yoga and Practices - 27 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 765 / Vishnu Sahasranama Contemplation - 765 🌹 
🌻765. చతుర్మూర్తిః, चतुर्मूर्तिः, Caturmūrtiḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 725 / Sri Siva Maha Purana - 725 🌹
🌻. శివుని యాత్ర - 3 / Śiva’s campaign - 3🌻
5) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 345 / Osho Daily Meditations - 345 🌹 
🍀 345. నిరాశ్రయులు / 345. HOMELESS 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 453-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 453-1 🌹 
🌻 453. 'కామరూపిణీ' - 1 / 453. 'Kamarupini' - 1🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 05, మే, May 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*🍀. బుద్ధ పౌర్ణిమ, వైశాఖ పౌర్ణమి, కూర్మ జయంతి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Buddha Purnima, Vaishakha Purnima, Kurma Jayanti to All. 🍀*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : బుద్ధ పౌర్ణిమ, వైశాఖ పౌర్ణమి, కూర్మ జయంతి, చంద్ర గ్రహణము, Buddha Purnima, Vaishakha Purnima, Kurma Jayanti, Chandra Grahan, 🌻*

*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 43 🍀*

*43. సర్వాపరాధశమని సకలార్థదాత్రి*
*పర్వేన్దుసోదరి సుపర్వగణాభిరక్షిన్ ।*
*దుర్వారశోకమయభక్తగణావనేష్టే*
*లక్ష్మి త్వదీయచరణౌ శరణం ప్రపద్యే ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : జగన్మాత ప్రేమ- జగన్మాత సాన్నిధ్యం నీ అన్నమయ, ప్రాణమయ, మనోమయ చేతనలలో నీకు స్ఫురిస్తుంది. నీ సర్వప్రకృతినీ ఆమె దివ్యప్రకృతిగా రూపాంతరం చెందిస్తుంది. ఆమె దివ్య ప్రేమ నిన్ను ఆవరించి, తన చేతులతో లాలిస్తూ పరమ గమ్యానికి చేరుస్తుంది. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
వైశాఖ మాసం
తిథి: పూర్ణిమ 23:04:32 వరకు
తదుపరి కృష్ణ పాడ్యమి
నక్షత్రం: స్వాతి 21:40:54 వరకు
తదుపరి విశాఖ
యోగం: సిధ్ధి 09:17:18 వరకు
తదుపరి వ్యతీపాత
కరణం: విష్టి 11:25:14 వరకు
వర్జ్యం: 03:12:56 - 04:49:12
మరియు 27:09:56 - 28:44:12
దుర్ముహూర్తం: 08:22:10 - 09:13:26
మరియు 12:38:31 - 13:29:47
రాహు కాలం: 10:36:45 - 12:12:53
గుళిక కాలం: 07:24:29 - 09:00:37
యమ గండం: 15:25:09 - 17:01:17
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 12:50:32 - 14:26:48
సూర్యోదయం: 05:48:21
సూర్యాస్తమయం: 18:37:24
చంద్రోదయం: 18:23:40
చంద్రాస్తమయం: 05:19:15
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: గద యోగం - కార్య హాని,
చెడు 21:40:54 వరకు తదుపరి మతంగ
యోగం - అశ్వ లాభం
దిశ శూల: పశ్చిమం 
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🍀. బుద్ధ పౌర్ణిమ, వైశాఖ పౌర్ణమి, కూర్మ జయంతి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Buddha Purnima, Vaishakha Purnima, Kurma Jayanti to All. 🍀*
*Prasad Bharadwaj*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 173 / Kapila Gita - 173 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 27 🌴*

*27. బాహూంశ్చ మందరగిరేః పరివర్తనేన నిర్ణిక్తబాహువలయానధిలోకపాలాన్ |*
*సంచింతయేద్దశశతారమసహ్యతేజః శంఖం చ తత్కరసరోరుహరాజహంసమ్॥*

*తాత్పర్యము : ఆ శ్రీమన్నారాయణుడు తన బాహువుల యందు ధరించిన సువర్ణ కంకణాది భూషణముల శోభలు కూర్మావతారమున మందరగిరి రాపిడిచే శ్వేతవర్ణములను సంతరించు కొనినది. ఆ బాహువులు లోకపాలురైన దేవతలకు ఆశ్రయములు. ఆ ప్రభువు ధరించునట్టి చక్రము అసంఖ్యాకములైన అంచులు గలదై నిరుపమాన తేజస్సులతో మిరుమిట్లు గొలుపుచుండును. ఆ స్వామి తన కరకమలము నందు ధరించు శంఖము శ్వేతవర్ణ శోభితమై రాజహంసవలె తేజరిల్లుచుండును. కనుక, ఆ శ్రీమహావిష్ణువుయొక్క మహాబాహువులను, సుదర్శన చక్రమును, పాంచజన్య శంఖమును త్రికరణశుద్ధిగా ధ్యానింపవలెను.*

*వ్యాఖ్య : చట్టం మరియు క్రమం యొక్క అన్ని విభాగాలు భగవంతుని యొక్క ఆయుధాల నుండి ఉద్భవించాయి. విశ్వం యొక్క చట్టం మరియు క్రమం వేర్వేరు దేవతలచే నిర్దేశించబడింది మరియు ఇది భగవంతుని బాహువుల నుండి ఉద్భవించిందని ఇక్కడ చెప్పబడింది. మందర కొండ గురించి ఇక్కడ ప్రస్తావించబడింది, ఎందుకంటే ఒక వైపు రాక్షసులు మరియు మరో వైపు దేవతలు సముద్రాన్ని మథనం చేసినప్పుడు, మందర కొండను మథన దండంగా తీసుకున్నారు. తన తాబేలు అవతారంలో ఉన్న భగవంతుడు మంథన కడ్డీకి ఇరుసుగా మారాడు, అందువలన మంధర కొండ తిరగడం ద్వారా అతని ఆభరణాలు మెరుగుపడ్డాయి. మరో మాటలో చెప్పాలంటే, భగవంతుని బాహువులపై ఉన్న ఆభరణాలు ఇటీవల చేసినంత మెరిసేవి. సుదర్శన చక్రం అని పిలువబడే భగవంతుని చేతిలో ఉన్న చక్రం వెయ్యి చువ్వలు కలిగి ఉంటుంది. యోగికి ప్రతి చువ్వపై ధ్యానం చేయమని సలహా ఇస్తారు. అతడు భగవంతుని అతీంద్రియ స్వరూపంలోని ప్రతి భాగమును ధ్యానించాలి.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 173 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 4. Features of Bhakti Yoga and Practices - 27 🌴*

*27. bāhūṁś ca mandara-gireḥ parivartanena nirṇikta-bāhu-valayān adhiloka-pālān
sañcintayed daśa-śatāram asahya-tejaḥ śaṅkhaṁ ca tat-kara-saroruha-rāja-haṁsam*

*MEANING : The yogī should further meditate upon the Lord's four arms, which are the source of all the powers of the demigods who control the various functions of material nature. Then the yogi should concentrate on the polished ornaments, which were burnished by Mount Mandara as it revolved. He should also duly contemplate the Lord's discus, the Sudarśana cakra, which contains one thousand spokes and a dazzling luster, as well as the conch, which looks like a swan in His lotuslike palm.*

*PURPORT : All departments of law and order emanate from the arms of the Supreme Personality of Godhead. The law and order of the universe is directed by different demigods, and it is here said to emanate from the Lord's arms. Mandara Hill is mentioned here because when the ocean was churned by the demons on one side and the demigods on the other, Mandara Hill was taken as the churning rod. The Lord in His tortoise incarnation became the pivot for the churning rod, and thus His ornaments were polished by the turning of Mandara Hill. In other words, the ornaments on the arms of the Lord are as brilliant and lustrous as if they had been polished very recently. The wheel in the hand of the Lord, called the Sudarśana cakra, has one thousand spokes. The yogī is advised to meditate upon each of the spokes. He should meditate upon each and every one of the component parts of the transcendental form of the Lord.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 765 / Vishnu Sahasranama Contemplation - 765 🌹*

*🌻765. చతుర్మూర్తిః, चतुर्मूर्तिः, Caturmūrtiḥ🌻*

*ఓం చతుర్మూర్తయే నమః | ॐ चतुर्मूर्तये नमः | OM Caturmūrtaye namaḥ*

యే విరాట్సూత్రావ్యాకృతతురీయాఖ్యా మహాత్మనః ।
విష్ణోశ్చతస్ర ఆత్మానో మూర్తయోఽస్య హరేరితి ॥
కృష్ణాపీతాసితారక్తేత్యచ్యుతః శ్రుతిపారగైః ।
చతస్రో మూర్తయోఽస్యేతి వా చతుర్మ్రూర్తిరుచ్యతే ॥

*విరాట్‍, సూత్రము, అవ్యాకృతము మరియు తురీయము అను నాలుగు మూర్తులు కలవాడు. కృతయుగమున తెల్లనిది, త్రేతాయుగమున ఎఱ్ఱనిది, ద్వాపరయుగమున పచ్చనిది, కలియుగమున నల్లనిది అని ఇట్లు నాలుగు మూర్తులు కలవాడు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 765🌹*

*🌻765. Caturmūrtiḥ🌻*

*OM Caturmūrtaye namaḥ*

ये विराट्सूत्राव्याकृततुरीयाख्या महात्मनः ।
विष्णोश्चतस्र आत्मानो मूर्तयोऽस्य हरेरिति ॥
कृष्णापीतासितारक्तेत्यच्युतः श्रुतिपारगैः ।
चतस्रो मूर्तयोऽस्येति वा चतुर्म्रूर्तिरुच्यते ॥

Ye virāṭsūtrāvyākr‌taturīyākhyā mahātmanaḥ,
Viṣṇoścatasra ātmāno mūrtayo’sya hareriti.
Kr‌ṣṇāpītāsitāraktetyacyutaḥ śrutipāragaiḥ,
Catasro mūrtayo’syeti vā caturmrūrtirucyate.

*Virāṭ, Sūtra, Avyākr‌tam and Turīya are the names of His four bodies. Fair complexion during Kr‌tayuga. ruddish during tretāyuga, yellow in dvāparayuga and dark complexion during kaliyuga are His forms.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः ।चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् ॥ ८२ ॥
చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః ।చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ ॥ 82 ॥
Caturmūrtiścaturbāhuścaturvyūhaścaturgatiḥ,Caturātmā caturbhāvaścaturvedavidekapāt ॥ 82 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 726 / Sri Siva Maha Purana - 726 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 09 🌴*
*🌻. శివుని యాత్ర - 3 🌻*

*సనత్కుమారుడిట్లు పలికెను-*

*పరమాత్మయగు ఆ మహేశ్వరుని ఈ మాటను విని, విష్ణు బ్రహ్మాది దేవతలు 'సరే' అని తమ అంగాకారమును తెలిపిరి (22). అందువలననే, దేవతలు, దేవశ్రేష్ఠులు, రాక్షసవీరులు అందరు ఆ ప్రభునకు పశువులు అయిరి. పశువుల పాశములను విడిపించు రుద్రుడు పశుపతి ఆయెను (23). అప్పటి నుండియు మహేశ్యరునకు పశుపతి యను మంగళకరమగు నామము లోకములన్నింటి యందు ప్రసిద్ధిని గాంచెను (24). అపుడు బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, దేవతలు, ఋషులు మరియు ఇతరలు అందరు ఆనందముతో జయధ్వానములను చేయుచూ మిక్కిలి ఆనందించిరి (25). ఆ సమయములో మహాత్ముడగు శివునకు గల రూపమును వందల సంవత్సరములు కాలములోనైననూ వర్ణించుటకు శక్యము గాదు (26). మహేశ్వరుడు, సర్వలోకములకు ప్రభువు, సర్వులకు సుఖము నిచ్చువాడు అగు పార్వతీపతి ఈ విధముగా త్రిపుర సంహారమునకై బయల్వెడలెను (27). ఇంద్రుడు మొదలైన, సూర్యునితో సమమగు తేజస్సు గల దేవవీరులు త్రిపురవధ కొరకై ఏనుగులపై, గుర్రములపై, గొప్ప సింహములపై, రథములపై, మరియు వృషభములపై అధిష్ఠించి ఆ దేవదేవుని అనుసరించి వెళ్లిరి (28).*

*ఆ దేవశ్రేష్ఠులు నాగళ్లతో, వృక్షములతో, రోకళ్లతో, భుశుండమనే ఆయుధములతో కూడిన బాహువులు గలవరై శివుని అనుసరించి పయనమైరి. పర్వతాకారులగు వారి చేతులలో పర్వతముల వంటి ఆయుధములు ఉండెను (29). అపుడు ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలు అనేకములగు ఆయుధములచే ఒప్పుచున్నవారై, గొప్ప ప్రకాశము గల వారై, మహోత్సవముతో శంభునకు జయధ్వానములు పలుకుతూ ఆ మహేశ్వరుని యెదుట నడిచిరి (30). చేతులలో దండములను ధరించిన జటాధారులగు మునులందరు ఆనందించిరి. ఆకాశమునందు సంచరించే సిద్ధులు, చారణులు పూలవానను కురిపించిరి (31). ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా! గణాధ్యక్షులందరు త్రిపురములకు పయనమైరి. వారి సంఖ్యను గణించగల సమర్థుడు ఎవడు గలడు? అయిననూ కొన్ని వివరములను చెప్పెదను (32). ఓ యోగి! గణాధ్యక్షులతో, మరియు దేవగలణములతో చుట్టువారబడి యున్నవాడు, గణాధ్యక్షులందరిలో ప్రముఖుడు అగు భృంగి విమానము నధిష్ఠించి మహేంద్రుని వలె త్రిపురాసుర సమహారము కొరకు బయలు దేరి వెళ్లెను (33).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 726🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 09 🌴*

*🌻 Śiva’s campaign - 3 🌻*

Sanatkumāra said:—

22. On hearing these words of lord Śiva, the great soul, Viṣṇu, Brahmā and other gods said. “So be it.”

23. Hence all the gods and Asuras became the animals of the lord. Śiva became the lord of animals. He is the person who unties the nooses of the animals.

24. Then the name Paśupati, that bestows welfare, spread in all the worlds and became renowned.

25. Then the celestial sage, Indra, Brahmā, Viṣṇu and others rejoiced shouting “Victory.”

26. Even in hundreds of years it is impossible to describe adequately the form of the great soul which he assumed then.

27. Śiva the lord of Pārvatī and everyone, the bestower of happiness to all, went ahead to destroy the three cities.

28. Then all the gods, resplendent like the sun, under the lord of the gods and others went on elephants, horses, lions, bulls and chariots to kill Tripuras, leaders of the Asuras.

29. The leading gods as huge as mountains went ahead delighted and well-armed with all sorts of missiles, plough-shares, mortars, iron clubs and uprooted trees as huge as mountains.

30. Then Indra, Brahmā, Viṣṇu and others went ahead of lord Śiva jubilantly shouting cries of victory to Śiva, well-armed with various weapons and shining brilliantly.

31. Sages with matted hair and staffs in the hands rejoiced. Siddhas and Cāraṇas moving about in the sky showered flowers.

32. O great brahmins, all the Gaṇeśvaras went to the three cities. Who can enumerate them fully? I shall mention a few.

33. Bhṛṅgin, the chief of all Gaṇeśas, surrounded by lord of Gaṇas and gods went speedily to destroy the three cities like Mahendra seated in an aerial chariot.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 345 / Osho Daily Meditations - 345 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 345. నిరాశ్రయులు 🍀*

*🕉. ఆనందం ఎల్లప్పుడూ నిరాశ్రయమైనది, అది ఒక సంచారి, సంతోషానికి ఒక ఇల్లు ఉంది, దుఃఖానికి కూడా ఒక ఇల్లు ఉంది, కానీ ఆనందానికి ఏదీ లేదు. ఇది తెల్లటి మేఘంలా ఉంటుంది, మూలాలు ఎక్కడా లేవు. 🕉*

*మీరు మూలాలను పొందిన క్షణం, ఆనందం అదృశ్యమవుతుంది మరియు మీరు భూమికి అతుక్కోవడం ప్రారంభిస్తారు. ఇల్లు అంటే భద్రత, సౌకర్యం, సౌలభ్యం. చివరగా, ఇవన్నీ ఒక్కటిగా కుదిస్తే, ఇల్లు అంటే మరణం. మీరు ఎంత సజీవంగా ఉన్నారో, మీరు అంతగా నిరాశ్రయులవుతారు. అన్వేషకుడిగా ఉండటం యొక్క ప్రాథమిక అర్థం ఇది: జీవితాన్ని ప్రమాదంలో గడపడం, అభద్రతతో జీవించడం, తరువాత ఏమి జరుగుతుందో తెలియకుండా జీవించడం. ఇది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మరియు ఎల్లప్పుడూ ఆశ్చర్యంగా ఉండగలదని అర్థం. మీరు ఆశ్చర్యపోతే, మీరు జీవించి ఉన్నారు. అద్భుతం మరియు సంచారం ఒకే మూలం నుండి వచ్చాయి.*

*స్థిరమైన మనస్సు ఆశ్చర్యానికి లోనవదు, ఎందుకంటే అది సంచరించ లేనిదిగా మారింది. కాబట్టి మేఘంలా సంచరించే వారిగా ఉండండి మరియు ప్రతి క్షణం అనంతమైన ఆశ్చర్యాలను తెస్తుంది. నిరాశ్రయుడిగా ఉండండి, నిరాశ్రయత అంటే ఇంట్లో నివసించ కూడదని కాదు. దేనితోనూ ఎప్పుడూ అనుబంధం కావద్దు అని దీని అర్థం. మీరు రాజభవనంలో నివసిస్తున్నప్పటికీ, ఎప్పుడూ అనుబంధంగా ఉండకండి. ఎప్పుడైనా కదలాలంటే వెనక్కి తిరిగి చూడకుండా కదులుతావు. ఏదీ మిమ్మల్ని పట్టుకోదు. మీరు ప్రతిదీ ఉపయోగిస్తుంటే, మీరు ప్రతిదీ ఆనందిస్తారు, కానీ మీరు అధిపతిగా ఉంటారు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 345 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 345. HOMELESS 🍀*

*🕉. Bliss is always homeless, it is a vagabond, Happiness has a home, unhappiness also has a home, but bliss has none. It is like a white cloud, with no roots anywhere. 🕉*

*The moment you get roots, bliss disappears and you start clinging to the earth. Home means security, safety, comfort, convenience. And finally, if all these things are reduced to one thing, home means death. The more alive you are, the more you are homeless. That is the basic meaning of being a seeker: It means to live life in danger, to live life in insecurity, to live life not knowing what is coming next. It means always remaining available and always being able to be surprised. If you can be surprised, you are alive. Wonder and wander come from the same root.*

*A fixed mind becomes incapable of wondering, because it has become incapable of wandering. So be a wanderer, like a cloud, and each moment brings infinite surprises. Remain homeless, Homelessness doesn't mean not to live in a home. It Simply means never become attached to anything. Even if you live in a palace, never become attached. If a moment comes to move, you move without looking back. Nothing holds you. You use everything, you enjoy everything, but you remain the master.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 453 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 453 -1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 95. తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ ।*
*మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ ॥ 95 ॥ 🍀*

*🌻 453. 'కామరూపిణీ' - 1 🌻* 

*మన్మథుని రూపమున వున్నది శ్రీమాత అని అర్థము. మన్మథునికి కాముడని పేరు కూడ కలదు. మన్మథ తత్త్వమే లేనిచో సృష్టియందు భోగము యోగము లేదు. అనుభూతి లేదు. అనుభూతి లేనపుడు ఆనందమునూ లేదు. అనుభూతి, ఆనందము, వైభవము, వైభోగము, యోగము, దివ్యానందము ఇత్యాది అంశము లన్నియూ మన్మథత్వము వలన కలుగుచున్నవి. కోరిక వలన కలుగు చున్నవి. ఇట్టి కోరిక రూపమున శ్రీమాతయే అవతరించి యుండును. కోరిక లుండరాదనుట అజ్ఞానము. కోరికే లేనిచో దివ్య కార్యములు జరుగవు. సృష్టికార్యము జరుగదు. రక్షణ పోషణ జరుగదు. కోరిక లేనిచో జ్ఞాన మెట్లు కలుగును? జ్ఞానము నందు కోరిక వున్నప్పుడే జ్ఞానము నార్జించుట జరుగును. ఇచ్ఛ కారణముగనే జ్ఞానము, క్రియ జరుగుచున్నవి. ఇచ్ఛ కారణముగనే జీవుడు ఇహమును పరమును అనుభూతి చెందుచున్నాడు. కేవలము అచేతనమే ఇచ్ఛ లేనిదియై యుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 453 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 95. Tejovati trinayana lolakshi kamarupini*
*Malini hansini mata malayachala vasini ॥ 95 ॥ 🌻*

*🌻 453. 'Kamarupini' - 1 🌻*

*It means that Manmadha, the God of desire is Srimata. Manmadha is also known as the God of desire. Without the aspect of desire, there is no experience and salvation. No feeling. When there is no feeling there is no joy. Sensation, joy, splendor, bliss, yoga, divyanandam etc. are caused by the desire aspect. Those feelings are caused by desire. Shrimata herself manifests as desire. Desirelessness is ignorance. If there is no desire, divine works will not happen. Creation does not happen. No protection or nurture. If there is no desire, how can there be knowledge? Only when there is a desire for knowledge, knowledge is acquired. Desire is the cause of knowledge and action. Because of desire, the living being is able to experience ego and the supreme. Only unconsciousness is without will.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

Siva Sutras - 079 - 2-02. Prayatnaḥ sādhakaḥ - 1 / శివ సూత్రములు - 079 - 2-02. ప్రయత్నః సాధకః - 1


🌹. శివ సూత్రములు - 079 / Siva Sutras - 079 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

2వ భాగం - శక్తోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 2-02. ప్రయత్నః సాధకః - 1 🌻

🌴. నిరంతర ధ్యాన పూర్వక ప్రయత్నంతో, యోగి తన చైతన్యంలో మరియు మంత్రాలలో దాగి ఉన్న శక్తులకు ప్రభువుగా మారి, భగవంతుని చైతన్యాన్ని పొందుతాడు. 🌴

ప్రయత్నః – నిరంతర ప్రయత్నం; సాధకః - సాక్షాత్కార ప్రయోజనం కోసం స్వీకరించ బడిన సాధన.


మంత్రం మరియు దాని దేవతతో అతని ఆలోచనా విధానాన్ని సమలేఖనం చేయడానికి నిరంతర ప్రయత్నం మరియు అంకితమైన అభ్యాసం అవసరం. ఒకరు ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనుకున్నప్పుడు, అతను తన ఆలోచన విధానాన్ని దేవత యొక్క మంత్రంతో సమలేఖనం చేయాలి. ఈ సంబంధం స్థాపించబడక పోతే, అభ్యాసకుడికి సమర్థవంతమైన ఆధ్యాత్మిక పురోగతి ఉండదు. పరమ సత్యమైన శివుడిని గ్రహించడానికి ఒకరి చైతన్యం లేదా అవగాహన యొక్క ప్రాముఖ్యతను శివ సూత్రాలు పదేపదే నొక్కిచెప్పాయి. మునుపటి సూత్రం ఇక్కడ మరింత విస్తరించబడింది. మునుపటి సూత్రంలో ప్రవాస మంత్రం తర్వాత, ఈ సూత్రం ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 079 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 2 - Śāktopāya.

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 2-02. Prayatnaḥ sādhakaḥ - 1 🌻

🌴. By Persistent meditative effort, Yogi becomes the master of the forces latent in his consciousness and mantras and attains God consciousness. 🌴

Prayatna – continued effort; sādhaka – adapted for the purpose of realization.


Persistent effort and dedicated practice is necessary to align his thought process with mantra and its deity. When one desires to advance spiritually, he has to align his thought process with the mantra of the deity. If this union is not established, there cannot be an effective spiritual progression of the practitioner. Śiva Sūtra-s have repeatedly emphasized the importance of one’s consciousness or awareness to realize Śiva, the Ultimate Reality. The previous sūtra is further expanded here. After having expatiated mantra in the previous sūtra, this sūtra provides practical guidance.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

నిత్య ప్రజ్ఞా సందేశములు - 77 - 17. విశ్వం అనే 'నేను' / DAILY WISDOM - 77 - 17. The Cosmic “I-am”


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 77 / DAILY WISDOM - 77 🌹

🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 17. విశ్వం అనే 'నేను' 🌻

మనం వేదాంతంలో పిలిచే, విశ్వమనస్సు లేదా హిరణ్యగర్భం అనేది విశ్వ స్వీయ అస్తిత్వం. ఇది విశ్వం యొక్క స్వీయచైతన్యం. విశ్వం యొక్క పరిపూర్ణ, స్వచ్ఛమైన అస్తిత్వం. అన్ని విధాలైన వైవిధ్యాలు ఇక్కడ నుంచే పుడతాయి. ఒక రకంగా చెప్పాలంటే, మనం ఈ విశ్వ మనస్సులో భాగాలు అని చెప్పవచ్చు, కానీ అది పూర్తిగా నిజం కాదు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మనల్ని మనం పరమాత్మలో భాగాలుగా పరిగణించలేము. మనం మన కళ్లతో చూసే ఏదీ పరమాత్మకు నిజమైన ప్రాతినిధ్యంగా పరిగణించబడదు. కాబట్టి, మనం హిరణ్యగర్భంలో కూడా భాగాలు కాదని అర్థం చేసుకోవాలి. మనం దానికంటే చాలా తక్కువ.

మనం హిరణ్యగర్భం మరియు విరాట్ స్థితుల కంటే చాలా దిగువన ఉన్నాము. దాని కారణాలు వల్ల మనం త్వరలో చూద్దాం. ప్రస్తుతానికి ఈ శ్లోకం అసలు అర్థాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు. సాంఖ్యం ప్రకృతి అని, వేదాంతులు మాయ లేదా మూల ప్రకృతి అని పిలిచే ఈ వాస్తవికత యొక్క ఒక పూర్తి విధ్వంసం మరియు మృత్యువు జరిగింది. అది మహత్ మరియు విశ్వ అహంకారం అని పిలువబడే విశ్వ మనస్సు యొక్క అభివ్యక్తికి బీజం అవుతుంది. వేదాంతము దానిని హిరణ్యగర్భం మరియు విరాట్ అని పిలుస్తుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 77 🌹

🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 17. The Cosmic “I-am” 🌻


The Cosmic Mind, Hiranyagarbha, as we call it in the Vedanta, is the Cosmic “I-Am”. It is Self-Consciousness, Pure Universality. And, here is the seed of all diversity. In a sense, we may say that we are parts of this Cosmic Mind, but not, indeed, correctly. As I pointed out, we cannot regard ourselves as parts of the Absolute. Nothing that we see with our eyes can be regarded as a real representation of the Absolute. Thus, we have to understand that we are not parts, even of the Hiranyagarbha. We are much less than that.

We are far down below the condition of Hiranyagarbha and Virat, for reasons we shall see shortly. For the time being, it is enough if we understand the actual meaning of this passage. There was a destruction, a Mrityu, a complete abolition of Reality, which is what the Samkhya calls Prakriti, and the Vedantins call Maya, Mula-Prakriti, etc., the Potential Being, the Matrix of the universe. That becomes the seed for the manifestation of the Cosmic Mind, known as Mahat and Cosmic Ahamkara. The Vedanta calls them Hiranyagarbha and Virat.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీమద్భగవద్గీత - 365: 09వ అధ్., శ్లో 27 / Bhagavad-Gita - 365: Chap. 09, Ver. 27

 

🌹. శ్రీమద్భగవద్గీత - 365 / Bhagavad-Gita - 365 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 27 🌴

27. యత్కరోషి యదశ్నాషి యజ్జుహోషి దదాసి యత్ |
యత్తపస్యసి కొన్తేయ తత్కురుష్వ మదర్పణమ్ ||

🌷. తాత్పర్యం :

ఓ కౌన్తేయ! నీవు ఏది ఒనరించినను, ఏది భుజించినను, ఏది హోమము చేసినను, ఏది దానమొసగినను,ఏ తపస్సు నాచరించినను వాటన్నింటిని నాకు అర్పణముగా ఒనరింపుము.

🌷. భాష్యము :

ఎట్టి పరిస్థితి యందును శ్రీకృష్ణభగవానుని మరవకుండునట్లుగా జీవితమును మలచుకొనుట ప్రతియొక్కరి ధర్మము. దేహపోషణ కొరకు ప్రతియొక్కరు కర్మ చేయవలసియే ఉన్నందున తనకొరకు కర్మ చేయుమని శ్రీకృష్ణుడు ఇచ్చట ఉపదేశించుచున్నాడు. జీవనముకై ఆహారమును భుజించుట అవసరము గనుక కృష్ణునకు అర్పింపబడిన ఆహారమునే ప్రసాదరూపమున మనుజుడు గ్రహింపవలెను. అదే విధముగా నాగరికుడైన మనుజుడు ధర్మకార్యములను ఒనరింపవలసియున్నందున వానిని తన కొరకే చేయుమని శ్రీకృష్ణుడు పలుకుచున్నాడు. అదియే అర్చనము.

ప్రతియొక్కరు ఏదియో ఒకదానిని దానమిచ్చు స్వభావమును కలిగియుందురు కావున దానిని తనకే ఒసగుమని శ్రీకృష్ణుడు ఉపదేశించుచున్నాడు. అనగా అధికముగా ప్రోగుపడిన ధనమును మనుజుడు కృష్ణచైతన్యోద్యమపు ప్రచారము కొరకై వినియోగించవలెను. ధ్యానము ఈ యోగమునకు ఆచరణయోగ్యము కానిదైనను మనుజులు దానియందే నేడు ఎక్కువ మక్కువను కలిగియున్నారు. కనుక ఎవరైనను మనుజులు దానియందే నేడు ఎక్కువ మక్కువను కలిగియున్నారు. కనుక ఎవరైనను హరేకృష్ణ మాహా మంత్రమును జపమాలపై జపించుచు శ్రీకృష్ణుని ఇరువదినాలుగుగంటలు ధ్యానింపగలిగినచో భగవద్గీత యందలి షష్టాధ్యాయమున వివరింపబడినట్లు గొప్ప ధ్యానతత్పరుడు మరియు గొప్పయోగి కాగలడు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 365 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 27 🌴

27. yat karoṣi yad aśnāsi yaj juhoṣi dadāsi yat
yat tapasyasi kaunteya tat kuruṣva mad-arpaṇam


🌷 Translation :

Whatever you do, whatever you eat, whatever you offer or give away, and whatever austerities you perform – do that, O son of Kuntī, as an offering to Me.

🌹 Purport :

Thus, it is the duty of everyone to mold his life in such a way that he will not forget Kṛṣṇa in any circumstance. Everyone has to work for maintenance of his body and soul together, and Kṛṣṇa recommends herein that one should work for Him. Everyone has to eat something to live; therefore he should accept the remnants of foodstuffs offered to Kṛṣṇa.

Any civilized man has to perform some religious ritualistic ceremonies; therefore Kṛṣṇa recommends, “Do it for Me,” and this is called arcana. Everyone has a tendency to give something in charity; Kṛṣṇa says, “Give it to Me,” and this means that all surplus money accumulated should be utilized in furthering the Kṛṣṇa consciousness movement.

🌹 🌹 🌹 🌹 🌹