శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 543 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 543 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 543 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 543 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।
పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀

🌻 543. 'పుణ్యలభ్య’' - 1 🌻


పుణ్యముల వలన లభ్యమగునది శ్రీమాత అని అర్ధము. పుణ్య కార్యములను శ్రద్ధా భక్తులతో దీర్ఘకాలము నిర్వర్తించు వారిని శ్రీమాత క్రమముగ అనుగ్రహించు చుండును. సాన్నిధ్యము క్రమముగ నిచ్చును. సాలోక్యము కలిగించును. అనగా అడపా దడపా దర్శనము లిచ్చుచుండును. ప్రోత్సహించు చుండును. దాని వలన ఆరాధనల యందు, పుణ్యకార్యముల యందు, ఇనుమడించిన స్ఫూర్తితో భక్తులు నిమగ్ను లగుదురు. అందువలన మరింత సాన్నిధ్య, సాలోక్యములు పెరిగి సామీప్యమును చేరుదురు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 543 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana
pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻

🌻 543. 'Punyalabhya' - 1 🌻


It means Srimata is the one who is attained due to virtues. Sri Mata blesses those who perform pious activities with dedication and devotion for a long time. Proximity gradually builds up. Elevates to spiritual realms. That is to say, comes in visions once in a while. Gives encouragement. Due to this, the devotees are engaged in worship and pious activities with a fervent spirit. Thus one resides in the same realm as Devi, resides very close to Devi and gradually the closeness increases


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


సిద్దేశ్వరయానం - 50 Siddeshwarayanam - 50

🌹 సిద్దేశ్వరయానం - 50 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 16వ శతాబ్దం 🏵


తరువాత జన్మలో మళ్ళీ కాళీ సాధకుడయ్యారు.స్వప్నంలో కాళీదేవి స్వయంగా తన మంత్రాన్ని ఉపదేశించింది. ఈ జన్మలో సంసారం లేదు. చిన్న వయస్సులోనే దేవతా సాక్షాత్కారం పొందాలన్న తపన బయలుదేరింది. ఇంట్లో తల్లితండ్రుల బాధ్యత వహించవలసినది తనకంతగా లేదు. తన అన్నలున్నారు. విద్య యందు కాని లౌకిక విషయాల యందు కాని తనకు ఆసక్తి లేదు. ఎప్పుడూ గుళ్ళూ గోపురాలు పట్టుకొని తిరిగేవాడు. పెద్దలు ఎంత చెప్పి చూచినా అతను మారలేదు. కొంతకాలం తరువాత వీడు నలుగురి వంటివాడు కాదని నిశ్చయించుకొని ఇంట్లోవాళ్లు పట్టించుకోవటం మానివేశారు. అతడికి కావలసినదీ అదే.

ఎప్పుడూ అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ కళ్ళు మూసుకొని కూర్చుండేవాడు. అప్పుడప్పుడు వారి ఇంటికి హరిద్వారంలో ఒక ఆశ్రమాధిపతిగా ఉంటున్న ఒక వృద్ధయోగి వచ్చేవాడు. ఒక పర్యాయం వచ్చినప్పుడు ఇతడు ఆయనను హరిద్వారానికి తీసుకొని వెళ్ళమని ప్రార్థించాడు. ఆయన ఆశ్రమంలో వేదపాఠశాల ఉన్నది. అక్కడికి వెడితే అక్కడి పిల్లల సహవాసంతోటైనా చదువులో పడవచ్చునేమో అని ఆయనతో వెళ్ళటానికి తల్లిదండ్రులు అనుమతించారు. అది అతనికి పెద్దవరమయింది.

ఆ వృద్ధయోగితో హరిద్వారం చేరుకొన్న తరువాత కొన్నాళ్ళు ఆశ్రమంలో ఉండి ఆయనతో తనకు తపస్సునందు ఉన్న ఆసక్తిని విన్నవించి తాను ఏకాంతంగా తపస్సు చేసుకోవటానికి అనుమతివ్వమని అర్థించాడు. ఇతని లక్షణాన్ని నిశ్చలమయిన పట్టుదలను సాధనలోని ఏకాగ్రతను గమనించి ఆ వృద్ధుడు దానికి సంతోషంగా అనుమతించి సాధనలో తీసుకోవలసిన జాగ్రత్తలు తనకు తోచినవి చెప్పాడు. అక్కడ నుండి హిమాలయ పర్వతాలలో కొంతదూరం వెళ్ళి ఆ కొండలలో ఒక చిన్నగుహను ఎన్నుకొని అక్కడ తపస్సు ప్రారంభించాడు.

క్రూరమృగాలు లేని చోటు జనావాసాలకు మరీ దూరంకాని చోటది. గంగాజలం సమృద్ధిగా ప్రవహించే స్థలం. పండ్లు, పండ్లచెట్లు చాలా ఉన్నవి శరీరాన్ని నిలపటానికివి చాలు. ఆహార విహారాది కఠోర నియమాలతో ఒక వైపు శరీరాన్ని జాగ్రత్తగా రక్షించుకుంటూ కాళీమంత్ర జపసాధన చేయటం మొదలు పెట్టాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నవి. ఋతుగమనంలో మార్పులు వచ్చినట్లే అతని శరీరంలోనూ మార్పులు వస్తున్నాయి. ఆ ప్రాంతంలోని పొదలలోని కొన్ని చెట్ల పండ్లు చిన్నవి తింటే బాగా బలంగా ఉన్నట్లు అనిపించటాన్ని గమనించాడు. కొన్నిఫలాలు ఆకులు. తింటే రోజుల తరబడి ఆహారం యొక్క అవసరం లేకపోవటం గుర్తించాడు. ఈ విధంగా ఆయా వస్తువులనుపయోగించుకొంటూ ప్రాణరక్షణ చేసుకొంటూ మంత్రసాధన చేస్తున్నాడు.

కూర్చుండిన స్థలములోనె కూలిన కూలుదునుగాక! ఎముకలగూడు వలె మారి ఎండిన ఎండుదునుగాక!

నా మాంసము నా చర్మము నా దేహము శిధిలమైన నిను వీడను నిను వీడను నిను చూడక నే వదలను

ఈ కూర్చొన్న ఆసనంలో నాశరీరము శుష్కించిన శుష్కించును గాక! నా శరీరములోని మాంసము, చర్మము, ఎముకలు నశించిపోయిన పోవును గాక! నేను కోరిన దివ్యానుగ్రహాన్ని పొందకుండా ఇక్కడ నుండి కదలను.

తల్లీ! నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నవి. కాలాన్ని గణించే శక్తి కూడా నశించింది. ఎప్పటికైనా నిన్ను చూచి తీరాలి అన్న సంకల్పం ఒక్కటే మిగిలి ఉన్నది. ఎన్నో జన్మల నుండి నిన్నుకొలుస్తున్నాని క్షణక్షణము అనిపిస్తుంది. నీ దర్శనం కోసం తపించి తపించి ఎండిన మోడువలె అయిపోతున్నాను. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు కూడా ఇంకిపోయినాయి. ఆర్తుడను దీనుడను అయిన నన్ను కాపాడు.

( సశేషం )

🌹🌹🌹🌹🌹


Osho Daily Meditations - 139. ANXIETY / ఓషో రోజువారీ ధ్యానాలు - 139. ఆందోళన



🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 139 / Osho Daily Meditations - 139 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 139. ఆందోళన 🍀

🕉 మీకు మరియు మీ వ్యక్తిత్వానికి మధ్య దూరాన్ని ఏర్పరచుకోండి. మీ సమస్యలన్నీ మీ వ్యక్తిత్వానికి సంబంధించినవి, మీతో కాదు. మీకు ఎలాంటి సమస్యలు లేవు; ఎవరికీ నిజంగా సమస్యలు లేవు. సమస్యలన్నీ వ్యక్తిత్వానికి సంబంధించినవి. 🕉


ఈ పని చెయ్యండి--మీకు ఆందోళనగా అనిపించినప్పుడల్లా, అది వ్యక్తిత్వానికి చెందినదని గుర్తుంచుకోండి. మీరు ఒత్తిడిని అనుభవిస్తారు, అది వ్యక్తిత్వానికి చెందినదని గుర్తుంచుకోండి. మీరు ప్రేక్షకులు, సాక్షి. దూరాన్ని సృష్టించండి. ఇంకేమీ చేయనక్కరలేదు. దూరం ఉన్నప్పుడు, మీరు అకస్మాత్తుగా ఆందోళన అదృశ్యం అవడం చూస్తారు. దూరం పోయినప్పుడు, మీరు మళ్లీ మూసుకుపోయినప్పుడు, మళ్లీ ఆందోళన పుడుతుంది. ఆందోళన వ్యక్తిత్వ సమస్యలతో గుర్తించబడుతోంది. ప్రశాంతత అనేది రావడం లేదు, వ్యక్తిత్వ సమస్యలతో గుర్తించబడకుండా ఉంటోంది.

కాబట్టి, ఒక నెల, చూడండి. ఏది జరిగినా దూరంగా ఉండండి. ఉదాహరణకు, మీకు తలనొప్పి ఉంది. దూరంగా ఉండటానికి ప్రయత్నించండి మరియు తలనొప్పిని చూడండి. ఇది శరీర యంత్రాంగంలో ఎక్కడో జరుగుతోంది. మీరు దూరంగా నిలబడి ఉన్నారు, కొండల మీద కాపలాదారుగా, దూరంగా, మైళ్ళ దూరంలో ఇది జరుగుతోంది. కేవలం దూరాన్ని సృష్టించండి. మీకు మరియు తలనొప్పికి మధ్య ఖాళీని సృష్టించండి మరియు ఖాళీని పెద్దదిగా మరియు పెద్దదిగా చేయడం కొనసాగించండి. తలనొప్పి దూరం అవడం మీరు అకస్మాత్తుగా చూసే ఒక పాయింట్ వస్తుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 139 🌹

📚. Prasad Bharadwaj

🍀 139. ANXIETY 🍀

🕉 Create a distance between you and your personality. All your problems are concerned with your personality, not with you. You don't have any problems; nobody really has any problems. All problems belong to the personality. 🕉


This is going to be the work--that whenever you feel anxiety, just remember that it belongs to the personality. You feel a strain, just remember that it belongs to the personality. You are the watcher, the witness. Create distance. Nothing else is to be done. Once the distance is there, you will suddenly see anxiety disappearing. When the distance is lost, when you have become closed again, again anxiety will arise. Anxiety is getting identified with the problems of the personality. Relaxation is not getting involved, but remaining unidentified with the problems of the personality.

So, for one month, watch. Whatever happens, remain far away. For example, you have a headache. Just try to be far away and watch the headache. It is happening somewhere in the body mechanism. You are standing aloof, a watcher on the hills, far away, and it is happening miles away. Just create a distance. Create space between you and the headache and go on making the space bigger and bigger. A point will come when you will suddenly see that the headache is disappearing into the distance.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ శివ మహా పురాణము - 880 / Sri Siva Maha Purana - 880


🌹 . శ్రీ శివ మహా పురాణము - 880 / Sri Siva Maha Purana - 880 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 38 🌴

🌻. భద్రకాళీ శంఖచూడుల యుద్ధము - 4 🌻


ప్రతాపశాలియగు ఆ శంఖచూడుడు మరుక్షణములో తెలివిని పొంది లేచి నిలబడెను. ఆమె యందు తల్లి యను భావన కలవాడగుటచే ఆమెతో బాహుయుద్ధమును ఆతడు చేయలేదు (29). ఆ దేవి మహాకోపముతో ఆ దానవుని పట్టుకొని పలుమార్లు గిరగిర త్రిప్పి పైకి వేగముతో విసిరివేసెను (30).

ప్రతాపవంతుడగు శంఖచూడుడు వేగముగా పైకి ఎగిరి మరల క్రిందకు దిగి నిలబడి భద్రకాళికకు ప్రణమిల్లెను (31). ఆతడు ఆనందముతో నిండిన మనస్సు గలవాడై శ్రేష్ఠమగు రత్నములతో గొప్ప కౌశలముతో నిర్మించబడిన మిక్కిలి అందమగు విమానము నధిరోహించెను. ఆ మహాయుద్ధములో ఆతడు కంగారు పడలేదు (32). ఆ కాళి ఆకలితో దానవుల రక్తమును త్రాగెను. ఇంతలో అచట ఆకాశవాణి ఇట్లు పలికెను (33). ఇంకనూ గర్వించి యున్న లక్ష మంది దానవవీరులు గర్జిస్తూ యుద్ధరంగములో మిగిలి యున్నారు. ఓ ఈశ్వరీ! నీవు వారిని భక్షించుము (34). యుద్ధములో శంఖచూడుని సంహరించవలెనని కోరకుము. ఓదేవీ! ఆ దానవవీరుడు నీ చేతిలో మరణించడు. ఇది నిశ్చయము (35). ఆకాశమునుండి వెలుబడిన ఆ పలుకులను విని ఆ భద్రకాళీదేవి అపుడు అనేకమంది దానవుల రక్తమును త్రాగి మాంసమును తిని శంకరుని సన్నిధికి వచ్చి యుద్ధములో జరిగిన ఘటనలను ముందు వెనుకల క్రమమును తప్పకుండ చెప్పెను (36, 37).

శ్రీ శివ మహా పురాణములో రుద్ర సంహిత యందలి యుద్ధ ఖండలో కాళీయుద్ధ వర్ణనమనే ముప్పది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (38).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 880 🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bhadwaj

🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 38 🌴

🌻 Kālī fights - 4 🌻


29. Immediately the Dānava regained consciousness and got up valorously. He did not fight her with his arms by the thought that she was a woman like his mother.

30. The goddess seized the Dānava, whirled him again and again and tossed him up with great anger and velocity.

31. The valorous Śaṅkhacūḍa fell down after being tossed up very high. He got up and bowed down to Bhadrakālī.

32. Highly delighted thereafter, he got into a beautiful aerial chariot of exquisite workmanship set with gems and did not lose the balance of his mind in the battlefield.

33. Hungrily Kālī drank the blood of the Dānavas. In the meantime an unembodied celestial voice said:

34. O goddess, a hundred thousand haughty leading Dānavas have been left out in the battle still roaring. Devour them quickly.

35. Do not think of slaying the king of Dānavas. O goddess, Śaṅkhacūḍa cannot be killed by you. It is certain.

36-37. On hearing these words from the firmament, Bhadrakālī drank the blood and devoured the flesh of many Dānavas and went near Śiva. She then narrated to him the events of the war in the proper order.


Continues....

🌹🌹🌹🌹🌹


శ్రీమద్భగవద్గీత - 526: 14వ అధ్., శ్లో 02 / Bhagavad-Gita - 526: Chap. 14, Ver. 02

 

🌹. శ్రీమద్భగవద్గీత - 526 / Bhagavad-Gita - 526 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 2 🌴

02. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతా: |
సర్గేఅపి నోపజాయన్తే ప్రళయే న వ్యథన్తి చ ||


🌷. తాత్పర్యం : ఈ జ్ఞానమునందు స్థిరముగా నిలుచుట ద్వారా మనుజుడు నా దివ్యత్వము వంటి దివ్యత్వమును పొందగలడు. ఆ విధముగా ప్రతిష్టితుడై అతడు సృష్టి సమయమున జన్మింపడు లేదా ప్రళయ సమయమున వ్యథ నొందడు.

🌷. భాష్యము : సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానమును పొందిన పిమ్మట మనుజుడు శ్రీకృష్ణభగవానునితో గుణరీతి ఏకత్వమును పొంది జన్మమృత్యుపరంపర నుండి ముక్తిని బడయును. అంతియే గాని ఆత్మగా అతడెన్నడును తన వ్యక్తిత్వమును కోల్పోవడు. కనుకనే ఆధ్యాత్మిక జగత్తు నందలి దివ్యలోకములను చేరిన ముక్తాత్ములు శ్రీకృష్ణభగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవలో నిలిచి, ఆ పరమపురుషుని పాదపద్మములనే సదా దర్శింపగోరుదురని వేదవాజ్మయమున తెలుపబడినది. అనగా ముక్తినొందిన పిదపయు భక్తులు తమ నిజస్వరూపమును మరియు వ్యక్తిత్వమును కోల్పోవరు. ఈ భౌతికజగమునందు మనము సంపాదించిన జ్ఞానమంతయు త్రిగుణములచే మలినమై యుండును. త్రిగుణములచే మలినపడని జ్ఞానమే ఆధ్యాత్మికజ్ఞానము. అట్టి దివ్యమైన ఆధ్యాత్మికజ్ఞానమునందు స్థితుడైనంతనే మనుజుడు దేవదేవునితో సమానస్థాయిలో నిలుచును. ఆధ్యాత్మికజగమును గూర్చిన జ్ఞానము లేనటువంటి నిరాకారవాదులు భౌతికజగత్తు కర్మల నుండి ముక్తినొందినంతనే వైవిధ్యమన్నది లేకుండ ఆత్మ రూపరహితమగునని పలుకుదురు.

కాని వాస్తవమునకు భౌతికజగమునందు భౌతికత్వమున వైవిధ్యమున్నట్లే ఆధ్యాత్మికజగత్తు నందు కూడా వైవిధ్యమున్నది. ఈ విషయమున అజ్ఞానులైనవారే ఆధ్యాత్మికస్థితి వైవిద్యమునకు విరుద్ధమని తలతురు. కాని నిజమునకు ముక్తి పిమ్మట మనుజుడు ఆధ్యాత్మికజగమున ఆధ్యాత్మికరూపమును పొందును. అట్టి ఆధ్యాత్మికజగమున పలు ఆధ్యాత్మిక కర్మలు గలవు. అచ్చటి ఆధ్యాత్మికస్థితియే భక్తిమయ జీవనమనబడును. అట్టి ఆధ్యాత్మికస్థితి గుణరహితమనియు, ప్రతియొక్కరు అచ్చట భగవానునితో గుణరీతిని సమానమై యుందురనియు చెప్పబడినది. అటువంటి జ్ఞానసముపార్జనమునకు మనుజుడు ఆధ్యాత్మికగుణములను వృద్ధి చేసికొన వలయును. ఆ రీతి ఆధ్యాత్మికగుణములను వృద్ధిచేసికొనిన వాడు భౌతికజగత్తు సృష్టిచే గాని, ప్రలయముచే గాని వ్యథ నొందడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 526 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 02 🌴

02. idaṁ jñānam upāśritya mama sādharmyam āgatāḥ
sarge ’pi nopajāyante pralaye na vyathanti ca


🌷 Translation : By becoming fixed in this knowledge, one can attain to the transcendental nature like My own. Thus established, one is not born at the time of creation or disturbed at the time of dissolution.

🌹 Purport : After acquiring perfect transcendental knowledge, one acquires qualitative equality with the Supreme Personality of Godhead, becoming free from the repetition of birth and death. One does not, however, lose his identity as an individual soul. It is understood from Vedic literature that the liberated souls who have reached the transcendental planets of the spiritual sky always look to the lotus feet of the Supreme Lord, being engaged in His transcendental loving service. So, even after liberation, the devotees do not lose their individual identities. Generally, in the material world, whatever knowledge we get is contaminated by the three modes of material nature. Knowledge which is not contaminated by the three modes of nature is called transcendental knowledge. As soon as one is situated in that transcendental knowledge, he is on the same platform as the Supreme Person.

However, just as there is material variegatedness in this world, in the spiritual world there is also variegatedness. Those in ignorance of this think that spiritual existence is opposed to material variety. But actually, in the spiritual sky, one attains a spiritual form. There are spiritual activities, and the spiritual situation is called devotional life. That atmosphere is said to be uncontaminated, and there one is equal in quality with the Supreme Lord. To obtain such knowledge, one must develop all the spiritual qualities. One who thus develops the spiritual qualities is not affected either by the creation or by the destruction of the material world.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 30, APRIL 2024 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు🌹

🍀🌹 30, APRIL 2024 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 526 / Bhagavad-Gita - 526 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 37 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 37 🌴
2) 🌹. శ్రీ శివ మహా పురాణము - 880 / Sri Siva Maha Purana - 880 🌹
🌻. భద్రకాళీ శంఖచూడుల యుద్ధము - 4 / Kālī fights - 4 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 139 / Osho Daily Meditations  - 139 🌹
🍀 139. ఆందోళన / 139. ANXIETY 🍀
4) 🌹 సిద్దేశ్వరయానం - 50🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 543 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 543 - 1 🌹 
🌻 543. 'పుణ్యలభ్య’' - 1 / 543. 'Punyalabhya' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 526 / Bhagavad-Gita - 526 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 2 🌴*

*02. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతా: |*
*సర్గేఅపి నోపజాయన్తే ప్రళయే న వ్యథన్తి చ ||*

*🌷. తాత్పర్యం : ఈ జ్ఞానమునందు స్థిరముగా నిలుచుట ద్వారా మనుజుడు నా దివ్యత్వము వంటి దివ్యత్వమును పొందగలడు. ఆ విధముగా ప్రతిష్టితుడై అతడు సృష్టి సమయమున జన్మింపడు లేదా ప్రళయ సమయమున వ్యథ నొందడు.*

*🌷. భాష్యము : సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానమును పొందిన పిమ్మట మనుజుడు శ్రీకృష్ణభగవానునితో గుణరీతి ఏకత్వమును పొంది జన్మమృత్యుపరంపర నుండి ముక్తిని బడయును. అంతియే గాని ఆత్మగా అతడెన్నడును తన వ్యక్తిత్వమును కోల్పోవడు. కనుకనే ఆధ్యాత్మిక జగత్తు నందలి దివ్యలోకములను చేరిన ముక్తాత్ములు శ్రీకృష్ణభగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవలో నిలిచి, ఆ పరమపురుషుని పాదపద్మములనే సదా దర్శింపగోరుదురని వేదవాజ్మయమున తెలుపబడినది. అనగా ముక్తినొందిన పిదపయు భక్తులు తమ నిజస్వరూపమును మరియు వ్యక్తిత్వమును కోల్పోవరు. ఈ భౌతికజగమునందు మనము సంపాదించిన జ్ఞానమంతయు త్రిగుణములచే మలినమై యుండును. త్రిగుణములచే మలినపడని జ్ఞానమే ఆధ్యాత్మికజ్ఞానము. అట్టి దివ్యమైన ఆధ్యాత్మికజ్ఞానమునందు స్థితుడైనంతనే మనుజుడు దేవదేవునితో సమానస్థాయిలో నిలుచును. ఆధ్యాత్మికజగమును గూర్చిన జ్ఞానము లేనటువంటి నిరాకారవాదులు భౌతికజగత్తు కర్మల నుండి ముక్తినొందినంతనే వైవిధ్యమన్నది లేకుండ ఆత్మ రూపరహితమగునని పలుకుదురు.*

*కాని వాస్తవమునకు భౌతికజగమునందు భౌతికత్వమున వైవిధ్యమున్నట్లే ఆధ్యాత్మికజగత్తు నందు కూడా వైవిధ్యమున్నది. ఈ విషయమున అజ్ఞానులైనవారే ఆధ్యాత్మికస్థితి వైవిద్యమునకు విరుద్ధమని తలతురు. కాని నిజమునకు ముక్తి పిమ్మట మనుజుడు ఆధ్యాత్మికజగమున ఆధ్యాత్మికరూపమును పొందును. అట్టి ఆధ్యాత్మికజగమున పలు ఆధ్యాత్మిక కర్మలు గలవు. అచ్చటి ఆధ్యాత్మికస్థితియే భక్తిమయ జీవనమనబడును. అట్టి ఆధ్యాత్మికస్థితి గుణరహితమనియు, ప్రతియొక్కరు అచ్చట భగవానునితో గుణరీతిని సమానమై యుందురనియు చెప్పబడినది. అటువంటి జ్ఞానసముపార్జనమునకు మనుజుడు ఆధ్యాత్మికగుణములను వృద్ధి చేసికొన వలయును. ఆ రీతి ఆధ్యాత్మికగుణములను వృద్ధిచేసికొనిన వాడు భౌతికజగత్తు సృష్టిచే గాని, ప్రలయముచే గాని వ్యథ నొందడు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 526 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 02 🌴*

*02. idaṁ jñānam upāśritya mama sādharmyam āgatāḥ*
*sarge ’pi nopajāyante pralaye na vyathanti ca*

*🌷 Translation : By becoming fixed in this knowledge, one can attain to the transcendental nature like My own. Thus established, one is not born at the time of creation or disturbed at the time of dissolution.*

*🌹 Purport : After acquiring perfect transcendental knowledge, one acquires qualitative equality with the Supreme Personality of Godhead, becoming free from the repetition of birth and death. One does not, however, lose his identity as an individual soul. It is understood from Vedic literature that the liberated souls who have reached the transcendental planets of the spiritual sky always look to the lotus feet of the Supreme Lord, being engaged in His transcendental loving service. So, even after liberation, the devotees do not lose their individual identities. Generally, in the material world, whatever knowledge we get is contaminated by the three modes of material nature. Knowledge which is not contaminated by the three modes of nature is called transcendental knowledge. As soon as one is situated in that transcendental knowledge, he is on the same platform as the Supreme Person.*

*However, just as there is material variegatedness in this world, in the spiritual world there is also variegatedness. Those in ignorance of this think that spiritual existence is opposed to material variety. But actually, in the spiritual sky, one attains a spiritual form. There are spiritual activities, and the spiritual situation is called devotional life. That atmosphere is said to be uncontaminated, and there one is equal in quality with the Supreme Lord. To obtain such knowledge, one must develop all the spiritual qualities. One who thus develops the spiritual qualities is not affected either by the creation or by the destruction of the material world.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 880 / Sri Siva Maha Purana - 880 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 38 🌴*

*🌻. భద్రకాళీ శంఖచూడుల యుద్ధము - 4 🌻*

* ప్రతాపశాలియగు ఆ శంఖచూడుడు మరుక్షణములో తెలివిని పొంది లేచి నిలబడెను. ఆమె యందు తల్లి యను భావన కలవాడగుటచే ఆమెతో బాహుయుద్ధమును ఆతడు చేయలేదు (29). ఆ దేవి మహాకోపముతో ఆ దానవుని పట్టుకొని పలుమార్లు గిరగిర త్రిప్పి పైకి వేగముతో విసిరివేసెను (30).*

*ప్రతాపవంతుడగు శంఖచూడుడు వేగముగా పైకి ఎగిరి మరల క్రిందకు దిగి నిలబడి భద్రకాళికకు ప్రణమిల్లెను (31). ఆతడు ఆనందముతో నిండిన మనస్సు గలవాడై శ్రేష్ఠమగు రత్నములతో గొప్ప కౌశలముతో నిర్మించబడిన మిక్కిలి అందమగు విమానము నధిరోహించెను. ఆ మహాయుద్ధములో ఆతడు కంగారు పడలేదు (32). ఆ కాళి ఆకలితో దానవుల రక్తమును త్రాగెను. ఇంతలో అచట ఆకాశవాణి ఇట్లు పలికెను (33). ఇంకనూ గర్వించి యున్న లక్ష మంది దానవవీరులు గర్జిస్తూ యుద్ధరంగములో మిగిలి యున్నారు. ఓ ఈశ్వరీ! నీవు వారిని భక్షించుము (34). యుద్ధములో శంఖచూడుని సంహరించవలెనని కోరకుము. ఓదేవీ! ఆ దానవవీరుడు నీ చేతిలో మరణించడు. ఇది నిశ్చయము (35). ఆకాశమునుండి వెలుబడిన ఆ పలుకులను విని ఆ భద్రకాళీదేవి అపుడు అనేకమంది దానవుల రక్తమును త్రాగి మాంసమును తిని శంకరుని సన్నిధికి వచ్చి యుద్ధములో జరిగిన ఘటనలను ముందు వెనుకల క్రమమును తప్పకుండ చెప్పెను (36, 37).*

*శ్రీ శివ మహా పురాణములో రుద్ర సంహిత యందలి యుద్ధ ఖండలో కాళీయుద్ధ వర్ణనమనే ముప్పది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (38).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 880 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bhadwaj *

*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 38 🌴*

*🌻 Kālī fights - 4 🌻*

29. Immediately the Dānava regained consciousness and got up valorously. He did not fight her with his arms by the thought that she was a woman like his mother.

30. The goddess seized the Dānava, whirled him again and again and tossed him up with great anger and velocity.

31. The valorous Śaṅkhacūḍa fell down after being tossed up very high. He got up and bowed down to Bhadrakālī.

32. Highly delighted thereafter, he got into a beautiful aerial chariot of exquisite workmanship set with gems and did not lose the balance of his mind in the battlefield.

33. Hungrily Kālī drank the blood of the Dānavas. In the meantime an unembodied celestial voice said:

34. O goddess, a hundred thousand haughty leading Dānavas have been left out in the battle still roaring. Devour them quickly.

35. Do not think of slaying the king of Dānavas. O goddess, Śaṅkhacūḍa cannot be killed by you. It is certain.

36-37. On hearing these words from the firmament, Bhadrakālī drank the blood and devoured the flesh of many Dānavas and went near Śiva. She then narrated to him the events of the war in the proper order.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 139 / Osho Daily Meditations  - 139 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 139. ఆందోళన 🍀*

*🕉  మీకు మరియు మీ వ్యక్తిత్వానికి మధ్య దూరాన్ని ఏర్పరచుకోండి. మీ సమస్యలన్నీ మీ వ్యక్తిత్వానికి సంబంధించినవి, మీతో కాదు. మీకు ఎలాంటి సమస్యలు లేవు; ఎవరికీ నిజంగా సమస్యలు లేవు. సమస్యలన్నీ వ్యక్తిత్వానికి సంబంధించినవి. 🕉*

*ఈ పని చెయ్యండి--మీకు ఆందోళనగా అనిపించినప్పుడల్లా, అది వ్యక్తిత్వానికి చెందినదని గుర్తుంచుకోండి. మీరు ఒత్తిడిని అనుభవిస్తారు, అది వ్యక్తిత్వానికి చెందినదని గుర్తుంచుకోండి. మీరు ప్రేక్షకులు, సాక్షి. దూరాన్ని సృష్టించండి. ఇంకేమీ చేయనక్కరలేదు. దూరం ఉన్నప్పుడు, మీరు అకస్మాత్తుగా ఆందోళన అదృశ్యం అవడం చూస్తారు. దూరం పోయినప్పుడు, మీరు మళ్లీ మూసుకుపోయినప్పుడు, మళ్లీ ఆందోళన పుడుతుంది. ఆందోళన వ్యక్తిత్వ సమస్యలతో గుర్తించబడుతోంది. ప్రశాంతత అనేది రావడం లేదు, వ్యక్తిత్వ సమస్యలతో గుర్తించబడకుండా ఉంటోంది.*

*కాబట్టి, ఒక నెల, చూడండి. ఏది జరిగినా దూరంగా ఉండండి. ఉదాహరణకు, మీకు తలనొప్పి ఉంది. దూరంగా ఉండటానికి ప్రయత్నించండి మరియు తలనొప్పిని చూడండి. ఇది శరీర యంత్రాంగంలో ఎక్కడో జరుగుతోంది. మీరు దూరంగా నిలబడి ఉన్నారు, కొండల మీద కాపలాదారుగా, దూరంగా, మైళ్ళ దూరంలో ఇది జరుగుతోంది. కేవలం దూరాన్ని సృష్టించండి. మీకు మరియు తలనొప్పికి మధ్య ఖాళీని సృష్టించండి మరియు ఖాళీని పెద్దదిగా మరియు పెద్దదిగా చేయడం కొనసాగించండి. తలనొప్పి దూరం అవడం మీరు అకస్మాత్తుగా చూసే ఒక పాయింట్ వస్తుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 139 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 139. ANXIETY 🍀*

*🕉  Create a distance between you and your personality. All your problems are concerned with your personality, not with you. You don't have any problems; nobody really has any problems. All problems belong to the personality.  🕉*

*This is going to be the work--that whenever you feel anxiety, just remember that it belongs to the personality. You feel a strain, just remember that it belongs to the personality. You are the watcher, the witness. Create distance. Nothing else is to be done. Once the distance is there, you will suddenly see anxiety disappearing. When the distance is lost, when you have become closed again, again anxiety will arise. Anxiety is getting identified with the problems of the personality. Relaxation is not getting involved, but remaining unidentified with the problems of the personality.*

*So, for one month, watch. Whatever happens, remain far away.  For example, you have a headache. Just try to be far away and watch the headache. It is happening somewhere in the body mechanism. You are standing aloof, a watcher on the hills, far away, and it is happening miles away. Just create a distance. Create space between you and the headache and go on making the space bigger and bigger. A point will come when you will suddenly see that the headache is disappearing into the distance.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సిద్దేశ్వరయానం - 50 🌹*

*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
      
*🏵 16వ శతాబ్దం 🏵*

*తరువాత జన్మలో మళ్ళీ కాళీ సాధకుడయ్యారు.స్వప్నంలో కాళీదేవి స్వయంగా తన మంత్రాన్ని ఉపదేశించింది. ఈ జన్మలో సంసారం లేదు. చిన్న వయస్సులోనే దేవతా సాక్షాత్కారం పొందాలన్న తపన బయలుదేరింది. ఇంట్లో తల్లితండ్రుల బాధ్యత వహించవలసినది తనకంతగా లేదు. తన అన్నలున్నారు. విద్య యందు కాని లౌకిక విషయాల యందు కాని తనకు ఆసక్తి లేదు. ఎప్పుడూ గుళ్ళూ గోపురాలు పట్టుకొని తిరిగేవాడు. పెద్దలు ఎంత చెప్పి చూచినా అతను మారలేదు. కొంతకాలం తరువాత వీడు నలుగురి వంటివాడు కాదని నిశ్చయించుకొని ఇంట్లోవాళ్లు పట్టించుకోవటం మానివేశారు. అతడికి కావలసినదీ అదే.*

*ఎప్పుడూ అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ కళ్ళు మూసుకొని కూర్చుండేవాడు. అప్పుడప్పుడు వారి ఇంటికి హరిద్వారంలో ఒక ఆశ్రమాధిపతిగా ఉంటున్న ఒక వృద్ధయోగి వచ్చేవాడు. ఒక పర్యాయం వచ్చినప్పుడు ఇతడు ఆయనను హరిద్వారానికి తీసుకొని వెళ్ళమని ప్రార్థించాడు. ఆయన ఆశ్రమంలో వేదపాఠశాల ఉన్నది. అక్కడికి వెడితే అక్కడి పిల్లల సహవాసంతోటైనా చదువులో పడవచ్చునేమో అని ఆయనతో వెళ్ళటానికి తల్లిదండ్రులు అనుమతించారు. అది అతనికి పెద్దవరమయింది.*

*ఆ వృద్ధయోగితో హరిద్వారం చేరుకొన్న తరువాత కొన్నాళ్ళు ఆశ్రమంలో ఉండి ఆయనతో తనకు తపస్సునందు ఉన్న ఆసక్తిని విన్నవించి తాను ఏకాంతంగా తపస్సు చేసుకోవటానికి అనుమతివ్వమని అర్థించాడు. ఇతని లక్షణాన్ని నిశ్చలమయిన పట్టుదలను సాధనలోని ఏకాగ్రతను గమనించి ఆ వృద్ధుడు దానికి సంతోషంగా అనుమతించి సాధనలో తీసుకోవలసిన జాగ్రత్తలు తనకు తోచినవి చెప్పాడు. అక్కడ నుండి హిమాలయ పర్వతాలలో కొంతదూరం వెళ్ళి ఆ కొండలలో ఒక చిన్నగుహను ఎన్నుకొని అక్కడ తపస్సు ప్రారంభించాడు.*

*క్రూరమృగాలు లేని చోటు జనావాసాలకు మరీ దూరంకాని చోటది. గంగాజలం సమృద్ధిగా ప్రవహించే స్థలం. పండ్లు, పండ్లచెట్లు చాలా ఉన్నవి శరీరాన్ని నిలపటానికివి చాలు. ఆహార విహారాది కఠోర నియమాలతో ఒక వైపు శరీరాన్ని జాగ్రత్తగా రక్షించుకుంటూ కాళీమంత్ర జపసాధన చేయటం మొదలు పెట్టాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నవి. ఋతుగమనంలో మార్పులు వచ్చినట్లే అతని శరీరంలోనూ మార్పులు వస్తున్నాయి. ఆ ప్రాంతంలోని పొదలలోని కొన్ని చెట్ల పండ్లు చిన్నవి తింటే బాగా బలంగా ఉన్నట్లు అనిపించటాన్ని గమనించాడు. కొన్నిఫలాలు ఆకులు. తింటే రోజుల తరబడి ఆహారం యొక్క అవసరం లేకపోవటం గుర్తించాడు. ఈ విధంగా ఆయా వస్తువులనుపయోగించుకొంటూ ప్రాణరక్షణ చేసుకొంటూ మంత్రసాధన చేస్తున్నాడు.*

*కూర్చుండిన స్థలములోనె కూలిన కూలుదునుగాక! ఎముకలగూడు వలె మారి ఎండిన ఎండుదునుగాక!*
*నా మాంసము నా చర్మము నా దేహము శిధిలమైన నిను వీడను నిను వీడను నిను చూడక నే వదలను*
*ఈ కూర్చొన్న ఆసనంలో నాశరీరము శుష్కించిన శుష్కించును గాక! నా శరీరములోని మాంసము, చర్మము, ఎముకలు నశించిపోయిన పోవును గాక! నేను కోరిన దివ్యానుగ్రహాన్ని పొందకుండా ఇక్కడ నుండి కదలను.*

*తల్లీ! నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నవి. కాలాన్ని గణించే శక్తి కూడా నశించింది. ఎప్పటికైనా నిన్ను చూచి తీరాలి అన్న సంకల్పం ఒక్కటే మిగిలి ఉన్నది. ఎన్నో జన్మల నుండి నిన్నుకొలుస్తున్నాని క్షణక్షణము అనిపిస్తుంది. నీ దర్శనం కోసం తపించి తపించి ఎండిన మోడువలె అయిపోతున్నాను. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు కూడా ఇంకిపోయినాయి. ఆర్తుడను దీనుడను అయిన నన్ను కాపాడు.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 543 - 1  / Sri Lalitha Chaitanya Vijnanam  - 543 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।*
*పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀*

*🌻 543. 'పుణ్యలభ్య’' - 1 🌻*

*పుణ్యముల వలన లభ్యమగునది శ్రీమాత అని అర్ధము. పుణ్య కార్యములను శ్రద్ధా భక్తులతో దీర్ఘకాలము నిర్వర్తించు వారిని శ్రీమాత క్రమముగ అనుగ్రహించు చుండును. సాన్నిధ్యము క్రమముగ నిచ్చును. సాలోక్యము కలిగించును. అనగా అడపా దడపా దర్శనము లిచ్చుచుండును. ప్రోత్సహించు చుండును. దాని వలన ఆరాధనల యందు, పుణ్యకార్యముల యందు, ఇనుమడించిన స్ఫూర్తితో భక్తులు నిమగ్ను లగుదురు. అందువలన మరింత సాన్నిధ్య, సాలోక్యములు పెరిగి సామీప్యమును చేరుదురు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 543 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana*
*pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻*

*🌻 543. 'Punyalabhya' - 1 🌻*

*It means Srimata is the one who is attained due to virtues. Sri Mata blesses those who perform pious activities with dedication and devotion for a long time. Proximity gradually builds up. Elevates to spiritual realms. That is to say, comes in visions once in a while. Gives encouragement. Due to this, the devotees are engaged in worship and pious activities with a fervent spirit. Thus one resides in the same realm as Devi, resides very close to Devi and gradually the closeness increases*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj