శ్రీ విష్ణు సహస్ర నామములు - 55 / Sri Vishnu Sahasra Namavali - 55

🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 55 / Sri Vishnu Sahasra Namavali - 55 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷

🌻. 55. జీవో వినయితా సాక్షీ ముకుందోఽమిత విక్రమః |
అంభోనిధిరనంతాత్మా మహోదధి శయోంతకః ‖ 55 🌻

చిత్త నక్షత్ర తృతీయ పాద శ్లోకం

🍀 513) జీవ: -
జీవుడు.

🍀 514) వినయితా సాక్షీ -
భక్తుల యందలి వినయమును గాంచువాడు.

🍀 515) ముకుంద: -
ముక్తి నొసగువాడు.

🍀 516) అమిత విక్రమ: -
అమితమైన పరాక్రామము గలవాడు.

🍀 517) అంభోనిధి: -
దేవతలు, మనుష్యులు, పితరులు, అసురులు ఈ నాలుగు వర్గములు అంభశబ్ధార్థములు, అంభస్సులు తనయందే ఇమిడి యున్నవాడు.

🍀 518) అనంతాత్మా - 
అనంతమైన ఆత్మస్వరూపుడు.

🍀 519) మహోదధిశయ: -
వైకుంఠమునందు క్షీరసాగరమున శేషతల్పముపై శయనించువాడు.

🍀 520) అంతక: -
ప్రళయకాలమున సర్వమును అంతము చేయువాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Vishnu Sahasra Namavali - 55 🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj

🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷

Sloka for Chitta 3rd Padam

🌻 55. jīvō vinayitāsākṣī mukundōmitavikramaḥ |
ambhōnidhiranantātmā mahōdadhiśayōntakaḥ || 55 ||

🌻 513. Jīvaḥ:
One who as the Kshetragya or knower of the field or the body, is associated with the Pranas.

🌻 514. Vinayitā-sākṣī:
One who witnesses the Vinayita or worshipful attitude of all devotees.

🌻 515. Mukundaḥ:
One who bestows Mukti or Liberation.

🌻 516. Amitavikramaḥ:
One whose three strides were limitless.

🌻 517. Ambhōnidhiḥ:
One in whom the Ambas or all beings from Devas down dwell.

🌻 518. Anantātmā:
One who cannot be determined by space, time and causation.

🌻 519. Mahōdadhi-śayaḥ:
One who lies in the water of Cosmic Dissolution into which all entities in the universe have been dissolved.

🌻 520. Antakaḥ:
One who brings about the end of all beings.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/10/30/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

Blogs, Websites:
https://incarnation14.wordpress.com/2020/11/04/spiritual-blogs-websites/

05 Nov 2020

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 92

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 92 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని 7వ పాత్ర - సాధు పురుషులు, మహాపురుషులు, సత్పురుషులు, ముముక్షువులు - 14 🌻

388. దిగువ భూమికలలో నున్న ఆధ్యాత్మిక బాటసారులు మిక్కిలి అరుదుగా శక్తులను పరియాచించి, వాటితో మహిమలను ప్రదర్శింతురు.

389. ఇతడు విపరీతమగు వాంఛలకు పరాధీనుడై సంకల్ప మాత్రంచే తన అనంత ప్రాణశక్తిని ఉపయొగించవలె నని ఉబలాటపడుచుండును

390. వాస్తవమునకు, ఒకసారి చైతన్యమును పొందిన యెడల అదెన్నటికిని తరిగిపోదు.

391. కాని నాల్గవ భూమికలో శక్తులు దుర్వినియోగ మైనప్పుడు మాత్రము చైతన్యము అది యెచ్చట ప్రారంభమైనదో ఆ స్థితికి క్రిందికి పడిపోవును.

392. నాల్గవ భూమిక యందున్న సూక్ష్మ చైతన్యము గల ఆత్మ, తన అధీనమందున్న అద్భుత గుప్తశక్తులను దుర్వినియోగము చేయకుండా కాపాడుట, సద్గురువు చేయు కార్యములలో నొక కార్యము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/10/30/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

Blogs, Websites:
https://incarnation14.wordpress.com/2020/11/04/spiritual-blogs-websites/

05 Nov 2020

శివగీత - 107 / The Siva-Gita - 107

🌹. శివగీత - 107 / The Siva-Gita - 107 🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 14

🌻. పంచ కోశో పాసన - 3
🌻

క్షుత్పి పాసా పరా భూతో - నాయ మాత్మా యతో జడః,

చిద్రూప ఆత్మా యేనైవ - స్వదేహ మభి పశ్యతి 11

ఆత్మైవ హి పరం బ్రహ్మ - నిర్లేప స్సుఖ నీరధి:,

నత దశ్నాతికం చైత - న్నత దశ్నాతి కించన 12

తతః ప్రాణ మయే కోశే - కోశేస్త్యే వ మనో మయః,

స సంకల్ప వికల్పాత్మా - బుద్దీంద్రియ సమాహితః 13

కామః క్రోధ స్తదా లోభో - మోహో మాత్సర్య మేవచ,

మదశ్చేత్యరి షడ్వర్గో - మామ తేచ్చా దయోపివా 14

మనో మయ్యస్య కోశస్య - ధర్మా ఏత స్య తత్రతు

యా కర్మ విషయా బుద్ది - ర్వేద శాస్త్రార్ద నిశ్చితా 15

జ్ఞానానంద ములకు పరిమితి లేని యే యాత్మ తనను తానే తెలిసి కొనునో అతడే దుఃఖ రహితుడగును. పరబ్రహ్మ యనబడును. ఇట్టి పరబ్రహ్మ యొక్క దానికి భోగ్యము కాదు.

ఒకటియు నీ బ్రహ్మమునకు భోగ్యము కానేరదు. అట్టి ప్రాణమయ కోశమున మనో మయ కోశమున్నది. బుద్దీంద్రియముతో కూడిన ఆ మనోమయ కోశము సంకల్ప వికల్పాత్మక మని తెలియ వలెను.

మమత ఇచ్చాదులను కామాద్యరి షడ్వర్గం బును మనోమయ కోశంబు యొక్క ధర్మంబులు కర్మ విషయక మగు బుద్ది జ్ఞానేంద్రియములతో బాటు విజ్ఞాన మయ కోశము వలన జన్యము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 107 🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj

Chapter 14

🌻 Panchakoshopasana - 3
🌻

The Jiva who realizes his true self which is pure consciousness and bliss, such a Jiva is the most blessed one. He gets called as Parabrahman.

Such a Parabrahman doesn't eat the fruits of any karmas. And nor does anything else becomes the enjoyer of this Brahman as fruit. inside the Pranamayakosam there exists Manomayakosam which comprises of senses and intellect (buddhi indriyam).

This manomayakosam is responsible for SankalpaVikalpa (takes decisions and gives ideas). maternal/paternal affection, lust, anger etc. qualities are the qualities generated by this Manomayakosam.

Buddhi (intellect) gets generated by the combination of senses and Vijnanamayakosam.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/10/30/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

Blogs, Websites:
https://incarnation14.wordpress.com/2020/11/04/spiritual-blogs-websites/

05 Nov 2020

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 153

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 153 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. నారద మహర్షి - 27 🌻

192. ఎప్పుడూ కూడా నిర్దుష్టమైనటువంటి పుణ్యమనేది - కేవల పుణ్యం గాని, కేవల శుద్ధమయిన జ్ఞానంగాని- మనుష్యుల్లో ఉండదు. ఈ పాపపుణ్యముల మధ్యనే, వాటి మిశ్రమంలోనే మనుష్యుడు తిరుగుతూ ఉంటాడు. అందుకే, ‘తస్మాత్ జాగ్రత జాద్రత’ – ‘ఎప్పుడూ మెలుకువగా ఉండు’ – అని మన పెద్దలు బోధచేసారు.

193. “ఈ పాపపుణ్యములు నిన్ను వేధిస్తూనే ఉంటాయి. జాగ్రత్తగా ఉండు సుమా! తెలివిగా ఉండు, నిద్రపోకు” అని వారి తాత్పర్యం. ఎందుకంటే, పొరపాటు జరిగిపోయిన తరువాత మనం విచారించి లాభంలేదు. స్వర్గమయినా, నరకమయినా ఈ కర్మలవలన ప్రాప్తించాక, శిక్ష ప్రారంభమైన తరువాత, తప్పుచేయకుండా ఉండవలసింది అని అనుకుంటే లాభం ఏమిటి? ఏ తప్పూచేయకుండాఉండే అవకాశం జీవితంలో ఇప్పుడే ఉంది మనకు. ఈ అవకాశం జీవితంలో, ఈ శరీరంలో ఉన్న కాలమేకదా!

194. భవిష్యత్తు అంటే అర్థం – తన జీవుడికి ఉన్న యథార్థమైన, సుధీర్ఘమైన భవిష్యత్తు అని. ఈ శరీరమో అల్పం, మూడునాళ్ళ ముచ్చట. దీనితోపోలిస్తే కొన్నివేల సంవత్సరముల స్థితి జీవుడికి ఉంటుంది. అప్పుడు(శరీరంలేనపుడు) పుణ్యంచేసుకోవటానికి అవకాశం లేదు. కాళ్ళూలేవు, చేతులులేవు, ‘తను’ ఒక్కడే తనతో ఉంటాడు.

195. అలా ఏకాకిగా ఉండేటటువంటి జీవాత్మ, ఏ పుణ్యంచేసుకుని తన దుఃఖాన్ని పోగొట్టుకుంటుంది? ఏం తపస్సు చేస్తుంది? అప్పుడు పుణ్యం చేసుకోవటానికిగాని, జ్ఞానబోధ చేసేవాడు కాని, మనమధ్యకు వచ్చి చెప్పేవాడు కాని ఎవరున్నారు?.

196. ఆ స్థితిలో జీవుడు క్రియాశూన్యుడు, క్రియారహితుడు కనుక, వ్యర్థుడే అవుతాడు. మానవశరీరంలో ఉన్నటువంటిస్థితిలో, తనకు రాబోయే స్థితిని గురించి చింతించి, ఇప్పుడే దానికికావలసిన పుణ్యం ఎవడు సంపాదించుకుంటాడో, ఏదయితే పాపహేతువో దానిని పరిహరిస్తాడో, అట్టివాడు వివేకిగాని; రాబోయే పదేళ్ళలోనూ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అడిగేవాడు వివేకి ఎట్లా అవుతాడు? రాబోయే ఓ పదేళ్ళో, ముప్ఫయిఏళ్ళో జాతకం ఎట్లాఉందని అడుగుతారు. అంటే, ఆశ, ఏ జ్యొతిష్కుడైనా ఇంకా ముప్ఫైఏళ్ళు బాగా ఉంటుందని చెప్తాడని ఆశ.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/10/30/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

Blogs, Websites:
https://incarnation14.wordpress.com/2020/11/04/spiritual-blogs-websites/

05 Nov 2020

శ్రీ శివ మహా పురాణము - 265

🌹 . శ్రీ శివ మహా పురాణము - 265 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

62. అధ్యాయము - 17

🌻.సతీ వరప్రాప్తి - 4 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను -

నా కుమారుడగు దక్ష ప్రజాపతి ఇట్లు ప్రశ్నించెను. ఓ మహర్షీ! నేను చిరునవ్వు నవ్వి ఆతనికి ఆనందమును కలిగించుచూ ఇట్లు పలికితిని (58). హే దక్షా! నేను నీ వద్దకు వచ్చిన కారణమును వినుము. నేను నీ కుమార్తె హితమును గోరుచున్నాను. నీ కోరిక కూడ అదియే (59).

నీ కుమార్తె శివుని ఆరాధించి ఒక వరమును కోరియున్నది. దానికి ఇపుడు సమయము ఆసన్నమైనది (60). శివుడు నన్ను నీ వద్దకు పంపినాడు. ఆయన నీ కుమార్తె కొరకు నన్ను పంపినాడు. నీకర్తవ్యమును, నీకు శ్రేయస్సు కలుగు విధముగా శ్రద్ధగా వినుము (61).

శివుడు వరము నిచ్చి వెళ్లిన నాటినుండియూ నీ కుమార్తె యొక్క వియోగముచే సుఖమును పొందలేకున్నాడు (62). మన్మథుడు పుష్పబాణములన్నింటితో పెద్ద ప్రయత్నమును చేసియూ, ఛిద్రము (దౌర్బల్యము) లభించకపోవుటచే ఏ శివుని జయింపలేకపోయినాడో(63),ఆ శివుడు ఇపుడు కామబాణములచే కొట్టబడకపోయిననూ, ఆత్మ ధ్యానమును వీడి, దుఃఖితుడై ప్రాకృతజనునివలె సతిని ధ్యానించుచున్నాడు (64).

ఆయన వియోగ దుఃఖితుడై గణముల ఎదుట ఆరంభించిన ప్రసంగమును మరిచి 'సతి ఎక్కడ?' అని పలికి నలువైపులా పరికించు చున్నాడు. మరియు నిట్టూర్పులను విడుచుచున్నాడు(65).

కుమారా! పూర్వము నేను, నీవు, మన్మథుడు, మరియు మరీచి మొదలగు మహర్షులు దేనిని కోరిరో, అది ఇప్పుడు సిద్ధించినది (66). నీ కుమార్తె శంభుని ఆరాధించినది. ఆయన ఆమెను ధ్యానించుచూ ఆమెను పొందగోరి ఆమెకు అనుకూలుడై హిమవత్పర్వతమునందున్నాడు (67).

ఆమె నానా విధ భావములతో, సత్త్వగుణశీలియై దృఢవ్రతముతో శంభుని ఏ తీరున ఆరాధించినదో,ఆయన ఆ సతిని అటులనే ఆరాధించుచున్నాడు (68). కావున, శంభుని కొరకు తనువును దాల్చిన దాక్షాయణిని ఆయనకు సమర్పించుము. విలంబమును చేయకుము. అట్లు చేసి నీవు కృతార్థుడవు కమ్ము (69).

నేను నారదుని ద్వారా ఆయనను నీ ఇంటికి రప్పించెదను. నీవు ఆయన కొరకు తనువును దాల్చిన ఈమెను ఆయనకు సమర్పించుము (70). నా కుమారుడగు దక్షుడు నా ఈ మాటను విని, మిక్కిలి సంతసిల్లి, 'అటులనే అగుగాక!'అని నాతో పలికెను (71).

ఓ మహర్షీ! అపుడు లోకకార్యము నందు నిమగ్నుడనైన నేను ఉత్సాహముతో మిక్కిలి ఆనందముతో శివుడు ఉన్న స్థానమునకు వచ్చితిని (72).ఓ నారదా! నేను వెళ్లగానే దక్షుడు భార్యతో , కుమార్తెతో గూడి అమృత పానమును తృప్తిగా చేసిన వాడు వలె పూర్ణమనోరథుడాయెను (73).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండములో సతీవరప్రాప్తి అనే పదునేడవ అధ్యాయము ముగిసినది (17).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

గీతోపనిషత్తు - 68

🌹. గీతోపనిషత్తు - 68 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 6. వాగ్దానము - దైవము దిగి వచ్చినప్పుడు, అధర్మమును పరిపూర్ణముగ నిర్మూలించుట ఎప్పుడును జరుగదు. ధర్మాధర్మములు సృష్టి తక్కెడల వంటివి. తూకమునకు రెండు తక్కెడలును అవసరమే. దైవము హెచ్చుతగ్గులనే సరిచేయును తప్ప అధర్మమును పరిపూర్ణముగ సృష్టినుండి తొలగజేయునని తలచరాదు. 🍀

📚. 4. జ్ఞానయోగము - 7 📚

యదా యదా హి ధర్మస్య గ్లాని ర్భవతి భారత |

అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజా మ్యహమ్ || 7

ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి యగు చుండునో, అపుడు నన్ను నేనే సృష్టించుకొందునని భగవంతుడు తెలిపినాడు. ఇది భగవంతుని వాగ్దానము.

సృష్టితో పాటు సృష్టి ధర్మమును కూడ దైవ మేర్పరచినాడు. ధర్మమునకు గ్లాని కలిగినపుడెల్ల తానవతరించి ధర్మమును చక్కబెట్టుదునని తెలిపినాడు. ధర్మమే సృష్టికి ఆధారము.

ద్వంద్వములు కూడ సృష్టిధర్మమే. ద్వంద్వములు లేనిదే సృష్టిలేదు. వెలుగు లోకములు కలవు. చీకటి లోకములు కూడ కలవు. సురలు గలరు. అసురులు కూడ గలరు. జ్ఞానము కలదు. అజ్ఞానము కూడ కలదు. ఇట్లెన్నియో ద్వంద్వములు సృష్టిని సమతూకముగ నుంచును. ఇవి అన్నియు సృష్టి ధర్మములే.

ఇందొకటి నిర్మూలించినచో రెండవది కూడ నిర్మూలింపబడును. కావున దైవము దిగి వచ్చినప్పుడు, అధర్మమును పరిపూర్ణముగ నిర్మూలించుట ఎప్పుడును జరుగదు. ధర్మాధర్మములు సృష్టి తక్కెడల వంటివి. తూకమునకు రెండు తక్కెడలును అవసరమే. దైవము హెచ్చుతగ్గులనే సరిచేయును తప్ప అధర్మమును పరిపూర్ణముగ సృష్టినుండి తొలగజేయునని తలచరాదు.

శ్రీరాముడు, శ్రీ కృష్ణుడు వంటి రూపములలో దైవము దిగి వచ్చినప్పుడు ధర్మగ్గానిని సరిదిద్దిరే గాని అధర్మమును సంపూర్ణముగ తొలగింపలేదు. అసురులు, అజ్ఞానము ఎప్పుడూ యుండనే యున్నవి. వాటి స్థానము వాటికున్నది. ఇది సృష్టి ధర్మము.

ఎవరి ధర్మమును వారు పాటించుట దైవమునకు ముఖ్యము. అతిక్రమించినపుడు వానిని సరిజేయును. కాలమునకు ధర్మమున్నది. కృతయుగమున కేవలము ధర్మమే యుండును. అపుడు సృష్టి అంతయు వెలుగు లోకములతోనే నిండియున్నది. త్రేత, ద్వాపర, కలియుగములలో ఒక్కొక్క పాదము (25%) ధర్మము నశించుట జరుగును.

కలియందు ఒక పాదమే ధర్మముండును. మూడు పాదములు అధర్మమే యుండును. అంతకు మించి అధర్మము పెరిగినచో దైవము అవతరించగలడు. దైవము అవతరించనిచో, కాలరీతిని బట్టి అధర్మము మితిమీర లేదని తెలియవలెను.

దైవము యొక్క అవతారములు దిగివచ్చినను, మహా పురుషులు దేహధారులై యున్నను, అధర్మ మెందులకున్నది అని ప్రశ్నించువారు, సందేహ పడువారు పై సత్యమును తెలియవలెను. కాలమును బట్టి ధర్మ ముండును. జనస్రవంతి కాలము ననుసరించి యుండును.

అందువలన ధర్మము ననుసరించు వారు అధర్మమును దూషింపక, ఒద్దికగ జీవించినచో అధర్మము స్పృశించదు. ధర్మ మనుసరించు వారికొరకై మరియొక శోకము చెప్పబడినది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

05 Nov 2020

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 98 / Sri Gajanan Maharaj Life History - 98

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 98 / Sri Gajanan Maharaj Life History - 98 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 19వ అధ్యాయము - 6
🌻

చాందూరు తాలూకాలో వార్ఖడేకు చెందిన యోగి అడకుజి, మురహకు చెందిన యోగి జింగాజి మరియు నాగపూరు తాజుద్దీన్ బాబా భక్తిమార్గం అనుసరించారు. ఈయోగులందరూ వేరువేరు ప్రవర్తనలు కలిగి ఉన్నా, దేవునిలో ఒకటవడానికి అధికారం సంపాదించారు.

ఏమార్గం అనేది విషయంకాదు, చిట్టచివరి లక్ష్యంచేరడం ప్రాముఖ్యం. పవిత్రులయిన మనుషులకు మోక్షమార్గానికి దారి చూపడానికి మేము ఈయోగి సోదరులం ఈప్రపంచంలోకి వచ్చాం.ఎవరి ఇష్టంవచ్చిన మార్గం వాళ్ళు ఎన్నుకుని చివరికి మోక్షంపొందాలి. ఇక ఎక్కువ ఏమీ అడగకు, అంతేకాక ఈవిషయాలగురించి కూడా ఎవరికీ చెప్పకు. నన్ను ఇలా పిచ్చివాడి వేషంలో శాంతిగా కూర్చోనివ్వు.

ఎవరికయితే నామీద నమ్మకం ఉందో, నేను ఎవరిని ప్రేమిస్తున్నానో వాళ్ళ కోరికలు మాత్రమే తీరుతాయి. నాకు మిగిలిన వాళ్ళ అవసరంలేదు. బ్రహ్మజ్ఞానం పశ్చాత్తాప పడేవాళ్ళకు చెప్పాలేతప్ప, నమ్మకంలేని వాళ్ళకికాదు. భగవంతుని కలవడానికి మనమార్గం మీద దృఢంగా ఉండాలి, అని శ్రీమహారాజు విశదీకరించారు.

ఈ విధంగా ఉపదేశంవిన్న బాలాభన్ ప్రేమతో ఉప్పొంగిపోయి, ఆనందభాష్పాలతో కళ్ళు కళకళలాడాయి. వర్ననాతీతమయిన రీతిలో అతని మొత్తం శరీరంఅంతా అమిత ఆనందంతో కంపించింది. మానవోద్ధారణ కోసం అవతారం ఎత్తిన షేగాం యొక్క ఈమహాయోగికి బాలాభవ్ అభివందనలు చేసాడు.

సాలూబాయి శ్రీమహారాజు యొక్క నిజమయిన భక్తురాలు. ఒకసారి శ్రీమహారాజు ఆమెతో సాలూ పిండి, పప్పు దినుసులు తీసుకుని రాత్రిపగలు వంటచేస్తూ ఉండు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ తినిపిస్తూ ఉండు. ఇలా చెయ్యడంవల్ల నీవు నారాయణుడిచేత ప్రేమించబడతావు అని అన్నారు. ఆ వైజాపూరుకు చెందిన సాలూబాయి ఇప్పటికీ షేగాంలో జీవించిఉంది.

ప్రహ్లాదబువా జోషికి ఒకసారి శ్రీమహారాజు ఆశీర్వాదాలు పొందేందుకు అవకాశం వచ్చింది కానీ దురదృష్ట వశాత్తూ దానిని పోగొట్టుకున్నాడు. థాంగాం దగ్గర జాలంబ్లో తులసీరాం అనే అతను ఉండేవాడు. అతని కుమారుడు ఆత్మారాం చాలా తెలివైనవాడు. ఇతనికి వేదాలంటే ప్రత్యేకమయిన ఇష్టత కలిగి, వాటి అధ్యయనం కోసం కాశీ వెళ్ళాడు. రోజూ భగీరధి నదిలో స్నానంచెయ్యడం, భిక్షాటనచేసి వచ్చిన ఆహారం తీసుకోవడం మరియు వేదాభ్యాసానికి గురువు దగ్గరకు వెళ్ళడం ఇతని దినచర్య. దీనికి విరుద్ధంగా, చదువుకి బదులు ఇతరత్రములైన ఆనందోల్లాసాలలో సమయం వృధా చెయ్యడం అనేది ఇప్పటి విద్యార్ధుల ప్రవర్తన. ఇటువంటి ప్రవర్తనవలన వాళ్ళు ఏమయినా జ్ఞానం పొందగలరా ?

ఆత్మారాం ఆవిధమైన వాడుకాదు. తన బాధ్యత బాగా తెలిసినవాడు. తన అభ్యాసం పూర్తిచేసిన తరువాత ఇంటికి వచ్చి, మొదట తిన్నగా శ్రీమహారాజుకు అభివాదనలు తెలియ పరిచేందుకు షేగాం వెళ్ళాడు. ఆత్మారాంకు ఇప్పుడు వేదాలు తెలుసు, కానీ శ్రీమహారాజు జ్ఞానంతో వెలిగే సూర్యుడు. ఆత్మారాంతోపాటు వేద పఠనం చేసి, అవసరం అయినచోట సరిదిద్దారు. శ్రీమహారాజు ఈవిధంగా వేదాలు పఠించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 98 🌹

✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj

🌻 Chapter 19 - part 6
🌻

Adkuji, the saint of Varkhed in Chandur Tahsil, saint Zingaji of Murha and Tajuddin Baba of Nagpur followed the ‘Bhakti Marga’. All these saints had different behaviours, but attained the authority to become one with the God. It is not the path that matters, but the ultimate reaching of the goal is important. We, all brother saints, have come to this world to guide the pious men to the path leading to Moksha.

They may follow the path of their liking and attain Moksha. Now don't ask me anything more, nor tell anything of this to others. Let me sit peacefully under the guise of madness. Only those, who have faith in me, and whom I love will get their desires fulfilled. I don't need the others. ‘Brahma gyan’ (the knowledge of Supreme Reality) should be told to the repentants, and not to non-believers.

To meet the God, we must be firm on our path. Hearing this advice, Balabhau was overwhelmed by love; his eyes brimmed with tears of joy. All his body shivered with extreme bliss, beyond the power of words to describe. Balabhau quietly paid respect to the great saint of Shegaon whose incarnation was for the sole purpose of salvation of humanity. Salubai was a sincere devotee of Shri Gajanan Maharaj .

Once Shri Gajanan Maharaj said to her, Salu, take flour and pulses and keep on cooking day and night. Go on feeding all those who come here; by doing so you will be loved by Narayan. That Salubai of Vaizapur is still alive at Shegaon. Pralhad Bua Joshi once had an opportunity of receiving the Blessings of Shri Gajanan Maharaj , but unfortunately lost it. There was one Tulsiram at Jalamb near Khamgaon.

His son, Atmaram, was very intelligent. He had a special liking for the Vedas, and so had gone to Kashi for their study. Daily bath in the Bhagirathi River, food of Madhukari (Alms) and going to a Guru for the studies of the Vedas was his daily routine. Contrary to this is the behaviour of the present day students, who waste their time in all types of entertainments instead of their studies. Can they gain any knowledge by such behaviour?

Atmaram was not like that. He knew his responsibility well. After completing the studies, he returned home and first went to Shegaon to pay his respects to Shri Gajanan Maharaj . Atmaram now knew Vedas but Shri Gajanan Maharaj was the sun of knowledge. He recited Vedas along with Atmaram, and corrected him whenever necessary. It was a surprise for all to see Shri Gajanan Maharaj reciting Vedas.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/10/30/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

Blogs, Websites:
https://incarnation14.wordpress.com/2020/11/04/spiritual-blogs-websites/

05 Nov 2020

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 94

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 94 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము -24
🌻

ఈ రకంగా ఒకదానికంటే మరొకటి సూక్ష్మమైనటువంటిది. ఈ విధానాన్ని మనకి ఇప్పుడు చక్కగా బోధిస్తున్నారు. ఈ నేత్ర గోళకమునకు అంతరంగముగా నేత్రేంద్రియమున్నది.

అది సూక్ష్మ్ం అన్నమాట! అటులనే ఆ నరాల వ్యవస్థ కంటే, ఇంద్రియముల కంటే, వానికి కారణమైనటువంటి, శబ్దాది తన్మాత్రలు సూక్ష్మంగా ఉంటాయి. అంటే, అర్థం ఏమిటట? ఈ నెర్వ్‌ సెంటర్‌ని పని చేయించడానికి, కావాల్సినటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మకమైనటువంటి జ్ఞానం ఇది చాలా ముఖ్యం.

మాట్లాడలేనివాళ్ళకి నాలుక లేదనా? నాలుక ఉంది, మాట్లాడగలిగే శక్తి లేదు. మాట్లాడగలిగే శక్తి ఎందుకు లేదు అంటే, మాట్లాడించేటటువంటి నెర్వ్ సెంటర్‌, ఉత్ప్రేరకముగా పనిచేయడం లేదు. ప్రేరణకు గురవ్వడం లేదు. దాంట్లోనుంచి వ్యక్తం కావల్సినటువంటివి, వ్యక్తం కావడం లేదు. అది వెనక్కి తీసుకోబడిందన్నమాట. అది ఎక్కడికి తీసుకోబడింది అంటే, అవ్యక్తంలోకి తీసుకోబడింది.

కాబట్టి, మనకున్నటువంటి జ్ఞానేంద్రియం అని చెప్పడానికి కారణము ఏమిటంటే, ఆ వెనుకనున్నటువంటి ఇంద్రియాన్ని శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మకమైన జ్ఞానం పనిచేస్తుంది. అవి స్వయంగా పనిచేయడంలేదు. మెదడులో న్యూరాన్ సెంటర్లని పనిచేయించడానికి కావాల్సిన జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం పనిచేయకపోతే అవి ఉన్నా ప్రయోజనం శూన్యమే. కాబట్టి, జ్ఞానము ఉండాలి. ఆయా వ్యవస్థా ఉండాలి. వ్యవస్థ పనితీరును వ్యక్తం చేయడానికి, కావల్సిన గోళకాలు ఉండాలి. ఇంకేం ఉండాలి?

శబ్దాది తన్మాత్మలకన్న మనస్సు సూక్ష్మమైనటువంటిది. అయ్యా! ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలకు సంబంధించిన నాలెడ్జ్‌ అయితే ఉంది. కానీ, దానిని పనిచేయించేటటువంటి మనస్సు అనే ఇంద్రియం సూక్ష్మమైన ఇంద్రియం పనిచేయడం లేదు అన్నాం అనుకోండి? అప్పుడేమయ్యింది? మానసిక వికలాంగులను చూశాం అనుకోండి, వాళ్ళకు అన్నీ ఉన్నాయి.

ఏం లేవు? అన్ని గోళకాలు ఉన్నాయి. అన్ని ఇంద్రియాలు ఉన్నాయి. అన్ని వ్యవస్థలు ఉన్నాయి. అన్నీ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మకమైన జ్ఞానము ఉన్నది. కానీ, సమన్వయ కర్త అయినటువంటి మనస్సు పనిచేయడం లేదు.

ఈ నాలుగు వ్యవస్థలని పనిచేయించేటటువంటి సమన్వయ కర్త, అనుసంధాన కర్త అయినటువంటి మనస్సు అంటే వ్యానవాయువు యొక్క ప్రభావం సరిగ్గా లేదన్నమాట. ఆ ఒక్కటి లోపించింది. ఎప్పుడైతే మనోవ్యాపారం స్తంభించి పోయిందో అప్పుడు ఏమైంది? అది అవ్యక్తంలోకి వెళ్ళిపోయింది. కిందికి దిగి రాదన్నమాట. అప్పుడు ఇంద్రియ వికాసం కలగడం లేదు. అప్పుడు ఇంద్రియ గోళకాల వికాసం కలగడం లేదు. బుద్ధి వికాసం కలగడం లేదు.

ఏ రకమైనటువంటి వ్యాపారము, వారు చేయగలిగేటటువంటి సమర్థత లేకుండా పోయింది. కాబట్టి, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలకు సంబంధించిన నాలెడ్జ్‌ ‘జ్ఞానం’ ఉండడం అవసరమే! కానీ, ఈ నాల్గింటిని, ఈ జ్ఞానాన్ని, ఆ లోపలున్న వ్యవస్థని, ఆ లోపలున్నటువంటి ఇంద్రియాలని, ఆ లోపలున్నటువంటి గోళకాలని, ఒక దానిని ఒక దానితో అనుసంధాన పరిచేటటువంటి మనస్సు అత్యంత సూక్ష్మమైనటువంటిది వీటన్నింటి కంటే!

కానీ, ఈ మనస్సు అనేటటువంటి సూక్ష్మము కన్నా, బుద్ధి సూక్ష్మమైనటువంటిది. ఇది ఏమిటండీ? అంటే, “నిశ్చయాత్మకో బుద్ధిః, వివేచనాత్మనో మనః” ఇది సూత్రం. అంటే అర్థం ఏమిటి? అటు వెళ్దామా? ఇటు వెళ్దామా? నువ్వు అటూ వెళ్ళచ్చు, ఇటూ వెళ్ళచ్చు.

రకరకాల ఆప్షన్లు ఇస్తుంది. మనకు ఏదైనా ఒక ఆలోచన పుట్టగానే, ఆ ఆలోచనని నెరవేర్చుకోవడానికి కావల్సినటువంటి అవకాశములు ఎన్ని వున్నాయి అనేటటువంటిది నీ మనస్సు ఒకదాని తర్వాత ఒక్కటి, ఒకదాని తర్వాత ఒకటి తరంగముల వలె నీ ముందు ఉంచుతూ ఉంటుంది.

మనం ఏ పనినైనా చేయాలి అనంటే, ఎన్ని రకాలుగా ఆ పనిని నెరవేర్చుకోవచ్చో, రకరకాల [abcdef] ఆప్షన్‌లన్నీ లెక్క వేస్తూ ఉంటుంది. కానీ, ‘వివేచనాత్మకో మనః’ - అయితే వివేచన చేశాం. చేస్తే ఏమైంది? ఏదో ఒక నిశ్చయం చేయాలిగా పని చేయాలి అంటే, ‘ఒకటి తినాలి’ - ఏం తినాలి?-

బీరకాయి తినచ్చు, వంకాయి తినచ్చు, కాకరకాయి తినచ్చు, ఉల్లిపాయి తినచ్చు, కానీ టమాటో తినచ్చు. ఎదురుగుండా ఆప్షన్స్‌ చాలా ఉన్నాయి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/10/30/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

Blogs, Websites:
https://incarnation14.wordpress.com/2020/11/04/spiritual-blogs-websites/

05 Nov 2020

శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 25 / Sri Devi Mahatyam - Durga Saptasati - 25

🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 25 / Sri Devi Mahatyam - Durga Saptasati - 25 🌹

✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 7

🌻. చండముండ వధ - 1
🌻

1-2. ఋషి పలికెను :

అంతట అతనిచేత ఆజ్ఞాపింపబడినవారై అసురులు చతురంగబల సమేతులై, ఆయుధాలు పైకెత్తి, చండముండులు ముందు నడుస్తూ బయలుదేరారు.

3. ఆ పర్వతరాజంపై ఒక గొప్ప బంగరు శిఖరంపై సింహంపై కూర్చుని చిరునగవుతో ఉన్న దేవిని వారు చూసారు.

4. ఆమెను చూసినప్పుడు కొందరు ఉత్సాహపూరితులై ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇతరులు వంపబడిన ధనుస్సులతో, ధరింపబడిన ఖడ్గాలతో ఆమెను సమీపించారు.

5. అంతట అంబిక ఆ శత్రువులపై ప్రచండ రోషపూరితయయ్యెను. ఆమె ముఖం సిరా వలె నల్లనయ్యింది.

6. బొమముడిపాటుతో భయంకరంగా ఉన్న ఆమె నొసటి నుండి హఠాత్తుగా ఘోర ముఖంతో, ఖడ్గపాశాయుధాలను ధరించి కాళికాశక్తి వెలువడింది.

7-9. విచిత్రమైన పుట్టెతలతో ఉన్న దండం దాల్చి, పుప్లైలపేరు ఆభరణంగా ధరించి, పెద్దపులిచర్మాన్ని కట్టుకొని, కండలు శుష్కించడంతో మిక్కిలి భీషణమై కనబడుతూ, తెరుచుకొని ఉన్న నోటితో, భయానకంగా వ్రేలాడు నాలుకతో, లోతుకుపోయిన ఎఱ్ఱని కన్నులతో, దిక్కులు పిక్కటిల్లే గర్జిరావాలతో ఆమె ఆ సైన్యంలోని మహాసురులపై రభసంగా పడి చంపి, ఆ సురవైరి బలాలను భక్షించివేసింది.

10. ఏనుగులను, వాటి వెంబడి వారితో, మానటీండ్రతో, స్వారి చేసే యోధులతో, ఘంటలతో సహా ఒక్క చేతితో లాగి పట్టుకొని నోట్లోకి విసరి వేసుకుంటూ ఉంది.

11. అలాగే తురగబలాన్ని, గుర్రలతో, రథంతో, సారథితో సహా నోటిలో వేసుకొని అత్యంత భయంకరంగా పళ్ళతో నమలివేసూ ఉంది.

12. ఒకణ్ణి జుట్టుపట్టి, మరొకణ్ణి మెడపట్టి లాగుకొంది. ఒకణ్ణి కాలితో తొక్కి, మరొకణ్ణి బొమ్ముతో నెట్టి సుగుజేసింది.

13. ఆ అసురులు ప్రయోగించిన శస్త్రాలను, మహాస్త్రాలను నోటితో పట్టుకొని రోషంతో పళ్ళతో నమలివేసింది.

14. దుష్టులు బలిష్ఠులు అయిన ఆ రక్కసుల సైన్యాన్నంతా, కొందరిని భక్షించి, మరికొందరిని కొట్టి, నాశమొనర్చింది.

15. కొందరు ఖడ్గంతో నరకబడ్డారు; కొందరు ఆమె ఖట్వాంగం (పుట్టెతల బెత్తం)తో కొట్టబడ్డారు. కొందరు ఆమె పంటిమొనలతో నమిలి వేయబడి నశించారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 25 🌹

✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj

CHAPTER 7:

🌻 The slaying of Chanda and Munda - 1
🌻

The Rishi said:

1-2. Then at his command the asuras, fully armed, and with Chanda and Munda at their head, marched in fourfold array.

3. They saw the Devi, smiling gently, seated upon the lion on a huge golden peak of the great mountain.

4. On seeing her, some of them excited themselves and made an effort to capture her, and others approached her, with their bows bent and swords drawn.

5. Thereupon Ambika became terribly angry with those foes, and in her anger her countenance then became dark as ink.

6. Out from the surface of her forehead, fierce with frown, issued suddenly Kali of terrible countenance, armed with a sword and noose.

7-9. Bearing the strange skull-topped staff, decorated with a garland of skull, clad in a tiger's skin, very appalling owing to her emaciated flesh, with gaping mouth, fearful with her tongue lolling out, having deep-sunk reddish eyes and filling the regions of the sky with her roars, and falling upon impetuously and slaughtering the great asuras in that army, she devoured those hosts of the foes of the devas.

10. Snatching the elephants with one hand she flung them into her mouth together with their rear men and drivers and their warrior-riders and bells.

11. Taking likewise into her mouth the cavalry with the horses, and chariot with its driver, she ground them most frightfully with her teeth.

12. She seized one by the hair and another by the neck; one she crushed by the weight of the foot, and another of her body.

13. And she caught with her mouth the weapons and the great arms shot by those asuras and crunched them up with her teeth in her fury.

14. She destroyed all that host of mighty and evil-natured asuras, devoured some and battered others.

15. Some were killed with her word, some were beaten with her skull-topped staff, and other asuras met their death being ground with the edge of her teeth.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

05 Nov 2020

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 72, 73 / Sri Lalitha Chaitanya Vijnanam - 72, 73

🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 40 / Sri Lalita Sahasra Stotram - 40 🌹

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 72, 73 / Sri Lalitha Chaitanya Vijnanam - 72, 73 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |

నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా ‖ 28 ‖

72. 'భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా'

భండ సైన్యమును వధించుట కుద్యుక్తమైన శక్తుల విక్రమమును చూచి హర్షించుదానా అని అర్థము.

భండు డనగ జీవుడు. జీవునియందు ద్వైత వృత్తులుండును. అవియే ద్వంద్వములు. ఈ ద్వైత వృత్తులను ఆధారముగ జీవుడు సృష్టి యందు జీవనము సాగించుచుండును. రాత్రి పగలు, మంచి - చెడు, సుగుణము-దుర్గుణము, కుడి ఎడమ, ఉత్తమము-నీచము, సరి-బేసి, ఆడ-మగ, సుఖము-దుఃఖము, లాభము-నష్టము, జయము - అపజయము. ఇట్లు ద్వంద్వములు మహా సైన్యమువలె యుండి జీవుని బంధించి వేయును. జీవితము అటునిటు లాగబడుచు సాగుచుండును.

ద్వంద్వములు నశించిననేగాని, జీవునికి శాంతి లేదు. అతని యందు కూడ జీవాత్మ భావము-దేహాత్మ భావము, బుద్ధి-మనస్సు, అంతఃకరణములు - బహిఃకరణములు, పశుప్రవృత్తి-పతిప్రవృత్తిగా ద్వందములు భాసించు చుండును.

వీనిని నశింపచేయవలె నన్నచో భక్తి, జ్ఞానము, వైరాగ్యము, యోగము అను విద్యలను ఆశ్రయించవలెను. అట్లాశ్రయించినచో క్రమశః జీవుడు ద్వంద్వములను దాటగలడు. ఈ విద్యలు జీవుని ద్వంద్వములను దాటించుచుండగ అమ్మ చూచి ఆనందించునట.

అందుచేత ద్వంద్వములను నశింపచేయు శక్తులున్నచో అమ్మకానందము. ద్వైత శక్తులకు మనస్సు కారణము. అద్వైత శక్తులకు జ్ఞానము కారణము. జ్ఞాన శక్తులే అమ్మకు ఆనంద దాయకములు. జ్ఞానము పొందుతున్న జీవులను చూచి వృద్ధిచెందుచున్న పిల్లలవలె భావించుచు అమ్మ హర్షించును. ఈ అద్వైత శక్తులను 'నకులి' శక్తులందురు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 72 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 72. Bhaṇḍasainya- vadhodhyukta- śakthivikrama-harṣitā भण्डसैन्य-वधोध्युक्त-शक्थिविक्रम-हर्षिता (72) 🌻

When Her śaktī-s (army) destroyed the army of the demon Bhaṇḍasurā, She was delighted.

Bhaṇḍa also means ignorant soul afflicted with duality, sainya (army) also refers to duality (identifying the self as different from the Brahman), and vadha means destruction. Lalitai is delighted when one destroys duality.

When duality is removed, it is an indication of the removal of the veil of māyā. The duality can be removed only by internal exploration with the help of mind.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 73 / Sri Lalitha Chaitanya Vijnanam - 73 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |

నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా ‖ 28 ‖

🌻 73. 'నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సకా' 🌻

నిత్యాదేవి యొక్క పరాక్రమ ఆటోపమును చూచుటకు అత్యంత ఉత్సాహముతో కూడినదానా ! నిత్యాదేవి చతుర్దశి తిథి దేవతగ తెలిపితిమి. అటుపైనది పౌర్ణమియే. పౌర్ణమి తిథియనగా పూర్ణత్వమే లేక శ్రీ దేవియే. అమావాస్య నుండి చతుర్దశి వరకు చంద్రకాంతి పెరుగుచు నుండగ, పూర్ణిమ యగు అమ్మవారు, ఆ పెరుగుదలను ఉత్సాహముతో గమనించుచు నిరీక్షించి యుండును.

పదునైదు తిథులకు గల కాంతులు, పదిహేను సేనలుగ తంత్రరాజము నందు పేర్కొనిరి. ఈ సేనలు విస్తారమగు పరాక్రమము కలవిగ అందు తెలుపబడినవి. ఈ సేనలకన్నిటికిని నిత్యాదేవి నాయిక. ఈ సేనల శక్తులన్నియు ఆత్మశక్తులు. ఆత్మశక్తులు వృద్ధి పొందుచుండగ జీవుడు దైవమునకు చేరువగు చున్నాడు. అట్టి ఆత్మశక్తుల కోలాహలమును అమ్మ ప్రోత్సహించు చుండును. ఉత్సుకతతో వాని వృద్ధిని గమనించుచుండును.

నిత్య యను దేవత, సృష్టియందలి నిత్యత్వమునకు సంకేతము. అనిత్యమగు విషయముల యందు అనురక్తిని నిత్యవిషయైక జ్ఞానము ద్వారా నశింపచేసుకొన వచ్చును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 73 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 73. Nityā- pārākramāṭopa- nirīkṣaṇa- samutsukā नित्या-पाराक्रमाटोप-निरीक्षण-समुत्सुका (73) 🌻

Nitya means tithi nitya devi-s (refer nāma 71). Lalitai was happy on observing the valour of these fifteen tithi nityā devi-s during the war.

When duality is destroyed and the veil of māyā is removed, the knowledge of Brahman continues to increase over a period of time.

Spiritual progress achieved cannot be reversed that easily (though it can be reversed in exceptional circumstances). This is the secretive meaning of this nāma.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/10/30/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

Blogs, Websites:
https://incarnation14.wordpress.com/2020/11/04/spiritual-blogs-websites/

05 Nov 2020

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 90, 91 / Vishnu Sahasranama Contemplation - 90, 91

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 90, 91 / Vishnu Sahasranama Contemplation - 90, 91 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 90. అహః, अहः, Ahaḥ 🌻

ఓం అహ్నే నమః | ॐ अह्ने नमः | OM Ahne namaḥ

అహః ప్రకాశ రూపత్వాద్ బ్రహ్మైవేతి సునిశ్చితః ప్రకాశవంతమగు (పగటి) కాలమునకు 'అహః' అని వ్యవహారము. పరమాత్ముడు స్వయముగా ప్రకాశస్వరూపుడును సర్వ ప్రకాశుడును కావున విష్ణుడు 'అహః' అని వ్యవహరించబడును.

:: భగవద్గీత - క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము ::

యథాప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః ।
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత ॥ 34 ॥

ఓ అర్జునా! సూర్యుడొక్కడే ఈ సమస్తలోకమును ఎట్లు ప్రకాశింపజేయుచున్నాడో, అట్లే క్షేత్రజ్ఞుడగు పరమాత్మ ఈ సమస్త క్షేత్రమును ప్రకాశింపజేయుచున్నాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 90🌹

📚. Prasad Bharadwaj

🌻 90. Ahaḥ 🌻

OM Ahne namaḥ

Ahaḥ prakāśa rūpatvād brahmaiveti suniścitaḥ / अहः प्रकाश रूपत्वाद् ब्रह्मैवेति सुनिश्चितः So called as He is luminous like the day.

Bhagavad Gītā - Chapter 13

Yathāprakāśayatyekaḥ kr̥tsnaṃ lokamimaṃ raviḥ,

Kṣetraṃ kṣetrī tathā kr̥tsnaṃ prakāśayati bhārata. (34)

:: श्रीमद्भगवद्‍ गीता - क्षेत्रक्षेत्रज्ञ विभाग योग ::

यथाप्रकाशयत्येकः कृत्स्नं लोकमिमं रविः ।

क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत ॥ ३४ ॥

O Bharatā (Arjunā)! As the Sun illuminates the entire world, so does the Lord of the Field (God and His reflection as the soul) illumine the whole field (Nature and the bodily "little nature").

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

सुरेशश्शरणं शर्म विश्वरेताः प्रजाभवः ।अहस्संवत्सरो व्यालः प्रत्ययस्सर्वदर्शनः ॥ १० ॥

సురేశశ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః ।అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయస్సర్వదర్శనః ॥ ౧౦ ॥

Sureśaśśaraṇaṃ śarma viśvaretāḥ prajābhavaḥ ।Ahassaṃvatsaro vyālaḥ pratyayassarvadarśanaḥ ॥ 10 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 91 / Vishnu Sahasranama Contemplation - 91🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 91. సంవత్సరః, संवत्सरः, Saṃvatsaraḥ 🌻

ఓం సంవత్సరాయ నమః | ॐ संवत्सराय नमः | OM Saṃvatsarāya namaḥ

కాలాఽఽత్మనా స్థితో విష్ణుః సంవత్సర ఇతీరితః కాలరూపమున నుండు విష్ణువు ఇచ్చట 'సంవత్సరః' అని చెప్పబడినాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 91🌹

📚. Prasad Bharadwaj

🌻 91. Saṃvatsaraḥ 🌻

OM Saṃvatsarāya namaḥ

Kālā’’tmanā sthito viṣṇuḥ saṃvatsara itīritaḥ / कालाऽऽत्मना स्थितो विष्णुः संवत्सर इतीरितः Viṣṇu who stands (is) in the form of Time. Saṃvatsara or Year being a part of time.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

सुरेशश्शरणं शर्म विश्वरेताः प्रजाभवः ।अहस्संवत्सरो व्यालः प्रत्ययस्सर्वदर्शनः ॥ १० ॥

సురేశశ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః ।అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయస్సర్వదర్శనః ॥ ౧౦ ॥

Sureśaśśaraṇaṃ śarma viśvaretāḥ prajābhavaḥ ।Ahassaṃvatsaro vyālaḥ pratyayassarvadarśanaḥ ॥ 10 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Facebook, WhatsApp & Telegram groups, WordPress:
https://incarnation14.wordpress.com/2020/10/30/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

Blogs, Websites:
https://incarnation14.wordpress.com/2020/11/04/spiritual-blogs-websites/

05 Nov 2020

5-November-2020 Messages

 1) 🌹 శ్రీమద్భగవద్గీత - 537 / Bhagavad-Gita - 537🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 90, 91 / Vishnu Sahasranama Contemplation - 90 91🌹
3) 🌹 Sripada Srivallabha Charithamrutham - 325🌹
5) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 94🌹
6) 🌹 Guru Geeta - Datta Vaakya - 113 🌹
7) 🌹. గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 100 / Gajanan Maharaj Life History - 100🌹
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 72, 73 / Sri Lalita Chaitanya Vijnanam - 72, 73🌹
9) *🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 40🌹*
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 452 / Bhagavad-Gita - 452 🌹

11) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 68 📚
12) 🌹. శివ మహా పురాణము - 266 🌹
13) 🌹 Light On The Path - 22🌹
14) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 153🌹
15) 🌹. శివగీత - 107 / The Siva-Gita - 107🌹* 
17) 🌹 Seeds Of Consciousness - 216🌹   
16) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 92🌹
18) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 55 / Sri Vishnu Sahasranama - 55🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 537 / Bhagavad-Gita - 537 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 4 🌴*

04. దమ్భో దర్పో(భిమానశ్చ క్రోధ: పారుష్యమేవ చ |
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సమ్పదమాసురీమ్ ||

🌷. తాత్పర్యం : 
ఓ పార్థా! గర్వము, పొగరు, దురహంకారము, కోపము, పరుషత్వము, అజ్ఞానములనెడి లక్షణములు ఆసురస్వభావము కలిగినవారికి చెందినవి.

🌷. భాష్యము :
నరకమునకు రాజమార్గము ఈ శ్లోకమున వివరింపబడినది. దానవప్రవృత్తి గలవారు తాము నియమములను పాటింపకున్నను ధర్మప్రవర్తనమును, ఆధ్యాత్మికజ్ఞాన పురోగతియును ప్రదర్శనమును మాత్రము గావింతురు. 

ఏదియో ఒక విద్యను లేదా అధికధనమును కలిగియున్న కారణమున వారు పొగరును, గర్వమును కలిగియుందురు. ఇతరులచే పూజింపబడవలెననియు భావింతురు. గౌరవింపబడుటకు అర్హులు కాకున్నను ఇతరులచే గౌరవము నొందగోరుదురు. అల్ప విషయముల గూర్చియు వారు క్రోధముచెంది పరుషముగా మాట్లాడుదురు. మృదువుగా వారెన్నడును పలుకరు. 

ఏది చేయదగినదో ఏది చేయరానిదో వారెరుగలేరు. ఎవ్వరి ప్రామాణికత్వమును స్వీకరింపక వారు ప్రతిదియు తమ కోరిక ననుసరించి చపలముగా నొనర్తురు. ఈ ఆసురీలక్షణములను వారు తల్లిగర్భమున ఉన్న సమయము నుండియే గ్రహించియుందురు. పెరిగి పెద్దయైన కొలది వారు ఆ అశుభగుణములను ప్రదర్శించుట నారంభింతురు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 537 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 04 🌴*

04. dambho darpo ’bhimānaś ca
krodhaḥ pāruṣyam eva ca
ajñānaṁ cābhijātasya
pārtha sampadam āsurīm

🌷 Translation : 
Pride, arrogance, conceit, anger, harshness and ignorance – these qualities belong to those of demoniac nature, O son of Pṛthā.

🌹 Purport :
In this verse, the royal road to hell is described. The demoniac want to make a show of religion and advancement in spiritual science, although they do not follow the principles. 

They are always arrogant or proud in possessing some type of education or so much wealth. They desire to be worshiped by others, and demand respectability, although they do not command respect. Over trifles they become very angry and speak harshly, not gently.

 They do not know what should be done and what should not be done. They do everything whimsically, according to their own desire, and they do not recognize any authority. These demoniac qualities are taken on by them from the beginning of their bodies in the wombs of their mothers, and as they grow they manifest all these inauspicious qualities.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 90, 91 / Vishnu Sahasranama Contemplation - 90, 91 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻 90. అహః, अहः, Ahaḥ 🌻*

*ఓం అహ్నే నమః | ॐ अह्ने नमः | OM Ahne namaḥ*

అహః ప్రకాశ రూపత్వాద్ బ్రహ్మైవేతి సునిశ్చితః ప్రకాశవంతమగు (పగటి) కాలమునకు 'అహః' అని వ్యవహారము. పరమాత్ముడు స్వయముగా ప్రకాశస్వరూపుడును సర్వ ప్రకాశుడును కావున విష్ణుడు 'అహః' అని వ్యవహరించబడును.

:: భగవద్గీత - క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము ::
యథాప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః ।
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత ॥ 34 ॥

ఓ అర్జునా! సూర్యుడొక్కడే ఈ సమస్తలోకమును ఎట్లు ప్రకాశింపజేయుచున్నాడో, అట్లే క్షేత్రజ్ఞుడగు పరమాత్మ ఈ సమస్త క్షేత్రమును ప్రకాశింపజేయుచున్నాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 90🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 90. Ahaḥ 🌻*

*OM Ahne namaḥ*

Ahaḥ prakāśa rūpatvād brahmaiveti suniścitaḥ / अहः प्रकाश रूपत्वाद् ब्रह्मैवेति सुनिश्चितः So called as He is luminous like the day.

Bhagavad Gītā - Chapter 13
Yathāprakāśayatyekaḥ kr̥tsnaṃ lokamimaṃ raviḥ,
Kṣetraṃ kṣetrī tathā kr̥tsnaṃ prakāśayati bhārata. (34)

:: श्रीमद्भगवद्‍ गीता - क्षेत्रक्षेत्रज्ञ विभाग योग ::
यथाप्रकाशयत्येकः कृत्स्नं लोकमिमं रविः ।
क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत ॥ ३४ ॥

O Bharatā (Arjunā)! As the Sun illuminates the entire world, so does the Lord of the Field (God and His reflection as the soul) illumine the whole field (Nature and the bodily "little nature").

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुरेशश्शरणं शर्म विश्वरेताः प्रजाभवः ।अहस्संवत्सरो व्यालः प्रत्ययस्सर्वदर्शनः ॥ १० ॥

సురేశశ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః ।అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయస్సర్వదర్శనః ॥ ౧౦ ॥

Sureśaśśaraṇaṃ śarma viśvaretāḥ prajābhavaḥ ।Ahassaṃvatsaro vyālaḥ pratyayassarvadarśanaḥ ॥ 10 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 91 / Vishnu Sahasranama Contemplation - 91🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻 91. సంవత్సరః, संवत्सरः, Saṃvatsaraḥ 🌻*

*ఓం సంవత్సరాయ నమః | ॐ संवत्सराय नमः | OM Saṃvatsarāya namaḥ*

కాలాఽఽత్మనా స్థితో విష్ణుః సంవత్సర ఇతీరితః కాలరూపమున నుండు విష్ణువు ఇచ్చట 'సంవత్సరః' అని చెప్పబడినాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 91🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 91. Saṃvatsaraḥ 🌻*

*OM Saṃvatsarāya namaḥ*

Kālā’’tmanā sthito viṣṇuḥ saṃvatsara itīritaḥ / कालाऽऽत्मना स्थितो विष्णुः संवत्सर इतीरितः Viṣṇu who stands (is) in the form of Time. Saṃvatsara or Year being a part of time.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुरेशश्शरणं शर्म विश्वरेताः प्रजाभवः ।अहस्संवत्सरो व्यालः प्रत्ययस्सर्वदर्शनः ॥ १० ॥

సురేశశ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః ।అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయస్సర్వదర్శనః ॥ ౧౦ ॥

Sureśaśśaraṇaṃ śarma viśvaretāḥ prajābhavaḥ ।Ahassaṃvatsaro vyālaḥ pratyayassarvadarśanaḥ ॥ 10 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Sripada Srivallabha Charithamrutham - 325 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 48
*🌻 Description of Darbar in Panchadeva Pahad How Sripada addressed men and women 🌻*

Sripada used to do darbar in Panchadev pahad on Thursdays. He used to walk on the waters of Krishna. Wherever He put His foot on water, one Lotus would appear there.  

It is beyond the imagination of human brain how a lotus would withstand the wooden padukas of Sripada. Moreover it was a wonder to walk on water. For sometime it was a wonder to the onlookers. Later it was being considered as an ordinary ‘leela’.  

While Sripada was coming to this side of Krishna River, His devotees would go to the shore and welcome. Darbar would continue till evening. After that while going back to Kurungadda, he would walk back on the lotuses that appeared while stepping on the water.  

Then all the devotees would give farewell to Him. He used to be alone in Kurungadda in the nights. On every Friday, He used to give ‘pasupu kommulu’ to girls to be married and to women for their husband’s welfare.  

He used to address women older than Him as ‘Amma Sumathi’ or ‘Amma Anasuyamma Thalli’ Girls younger to Him would be addressed as ‘Amma Vasavee’, ‘Amma Sri Vidyadhari’, ‘Amma Radha’, ‘Amma Surekha’ He would address men in the age of His father as ‘Ayya’ or ‘Nayana’.  

Boys younger to Him would be addressed as ‘Ore’, ‘Abbee’ or ‘Bangaru’. Older people were addressed as ‘Thatha’. If they were women, he would call them affectionately ‘Ammamma’.

*🌻 Sripada’s daily routine and darbar - 1 🌻*

He would conduct Friday darbar sometimes in Kurungadda and sometimes in Panchadev Pahad. Similarly, Thursday darbar also would be conducted either in Kurungadda or Panchadev Pahad.  

That would depend on His wish. When He did darbar on Sundays, He would talk about the depths of yoga vidya. Later, He would inquire into the welfare of the people. He would listen to their problems patiently and reassure them.  

In the darbars on Mondays, He would tell stories from Puranas and later would inquire into welfare of devotees. He would teach Upanishads in darbar in Tuesdays. Later he would listen to the personal problems of devotees and suggest solutions to them.  

Also He would reassure them. He would explain the Vedas and their meaning in Wednesday darbars. Later He would patiently listen to the sufferings of devotees and reassure them.  

On Thursdays, He would explain about ‘Guru tatwam’. Then also devotees’ illnesses would be removed and assurances given. But on that day, he would get food made specially and feed everybody.  

When his love towards His devotees overflowed, He would serve food with His own hands. He Himself used to feed to some fortunate people. 

 He would force food into the mouths of some people who would hesitate to ask. He would say that His ‘khajana’ (treasury) would always be full and there would never be dearth of money or food.  

In the darbar on Friday, he would teach about Srividya. He would compulsorily distribute ‘pasupu kommulu’ on that day. On Saturdays, he would teach about the greatness of Siva worship.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 25 / Sri Devi Mahatyam - Durga Saptasati - 25 🌹*
✍️. మల్లికార్జున శర్మ 
📚. ప్రసాద్ భరద్వాజ 

*అధ్యాయము 7*
*🌻. చండముండ వధ - 1 🌻*

1-2. ఋషి పలికెను : 
అంతట అతనిచేత ఆజ్ఞాపింపబడినవారై అసురులు చతురంగబల సమేతులై, ఆయుధాలు పైకెత్తి, చండముండులు ముందు నడుస్తూ బయలుదేరారు.

3. ఆ పర్వతరాజంపై ఒక గొప్ప బంగరు శిఖరంపై సింహంపై కూర్చుని చిరునగవుతో ఉన్న దేవిని వారు చూసారు.

4. ఆమెను చూసినప్పుడు కొందరు ఉత్సాహపూరితులై ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇతరులు వంపబడిన ధనుస్సులతో, ధరింపబడిన ఖడ్గాలతో ఆమెను సమీపించారు.

5. అంతట అంబిక ఆ శత్రువులపై ప్రచండ రోషపూరితయయ్యెను. ఆమె ముఖం సిరా వలె నల్లనయ్యింది.

6. బొమముడిపాటుతో భయంకరంగా ఉన్న ఆమె నొసటి నుండి హఠాత్తుగా ఘోర ముఖంతో, ఖడ్గపాశాయుధాలను ధరించి కాళికాశక్తి వెలువడింది.

7-9. విచిత్రమైన పుట్టెతలతో ఉన్న దండం దాల్చి, పుప్లైలపేరు ఆభరణంగా ధరించి, పెద్దపులిచర్మాన్ని కట్టుకొని, కండలు శుష్కించడంతో మిక్కిలి భీషణమై కనబడుతూ, తెరుచుకొని ఉన్న నోటితో, భయానకంగా వ్రేలాడు నాలుకతో, లోతుకుపోయిన ఎఱ్ఱని కన్నులతో, దిక్కులు పిక్కటిల్లే గర్జిరావాలతో ఆమె ఆ సైన్యంలోని మహాసురులపై రభసంగా పడి చంపి, ఆ సురవైరి బలాలను భక్షించివేసింది.

10. ఏనుగులను, వాటి వెంబడి వారితో, మానటీండ్రతో, స్వారి చేసే యోధులతో, ఘంటలతో సహా ఒక్క చేతితో లాగి పట్టుకొని నోట్లోకి విసరి వేసుకుంటూ ఉంది.

11. అలాగే తురగబలాన్ని, గుర్రలతో, రథంతో, సారథితో సహా నోటిలో వేసుకొని అత్యంత భయంకరంగా పళ్ళతో నమలివేసూ ఉంది.

12. ఒకణ్ణి జుట్టుపట్టి, మరొకణ్ణి మెడపట్టి లాగుకొంది. ఒకణ్ణి కాలితో తొక్కి, మరొకణ్ణి బొమ్ముతో నెట్టి సుగుజేసింది.

13. ఆ అసురులు ప్రయోగించిన శస్త్రాలను, మహాస్త్రాలను నోటితో పట్టుకొని రోషంతో పళ్ళతో నమలివేసింది.

14. దుష్టులు బలిష్ఠులు అయిన ఆ రక్కసుల సైన్యాన్నంతా, కొందరిని భక్షించి, మరికొందరిని కొట్టి, నాశమొనర్చింది.

15. కొందరు ఖడ్గంతో నరకబడ్డారు; కొందరు ఆమె ఖట్వాంగం (పుట్టెతల బెత్తం)తో కొట్టబడ్డారు. కొందరు ఆమె పంటిమొనలతో నమిలి వేయబడి నశించారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 25 🌹*
✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj

*CHAPTER 7:* 
*🌻 The slaying of Chanda and Munda - 1 🌻*

 The Rishi said:

1-2. Then at his command the asuras, fully armed, and with Chanda and Munda at their head, marched in fourfold array.

3. They saw the Devi, smiling gently, seated upon the lion on a huge golden peak of the great mountain.

4. On seeing her, some of them excited themselves and made an effort to capture her, and others approached her, with their bows bent and swords drawn.

5. Thereupon Ambika became terribly angry with those foes, and in her anger her countenance then became dark as ink.

6. Out from the surface of her forehead, fierce with frown, issued suddenly Kali of terrible countenance, armed with a sword and noose.

7-9. Bearing the strange skull-topped staff, decorated with a garland of skull, clad in a tiger's skin, very appalling owing to her emaciated flesh, with gaping mouth, fearful with her tongue lolling out, having deep-sunk reddish eyes and filling the regions of the sky with her roars, and falling upon impetuously and slaughtering the great asuras in that army, she devoured those hosts of the foes of the devas.

10. Snatching the elephants with one hand she flung them into her mouth together with their rear men and drivers and their warrior-riders and bells.

11. Taking likewise into her mouth the cavalry with the horses, and chariot with its driver, she ground them most frightfully with her teeth.

12. She seized one by the hair and another by the neck; one she crushed by the weight of the foot, and another of her body. 

 13. And she caught with her mouth the weapons and the great arms shot by those asuras and crunched them up with her teeth in her fury.

14. She destroyed all that host of mighty and evil-natured asuras, devoured some and battered others.

15. Some were killed with her word, some were beaten with her skull-topped staff, and other asuras met their death being ground with the edge of her teeth. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 94 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము -24 🌻*

ఈ రకంగా ఒకదానికంటే మరొకటి సూక్ష్మమైనటువంటిది. ఈ విధానాన్ని మనకి ఇప్పుడు చక్కగా బోధిస్తున్నారు. ఈ నేత్ర గోళకమునకు అంతరంగముగా నేత్రేంద్రియమున్నది.

 అది సూక్ష్మ్ం అన్నమాట! అటులనే ఆ నరాల వ్యవస్థ కంటే, ఇంద్రియముల కంటే, వానికి కారణమైనటువంటి, శబ్దాది తన్మాత్రలు సూక్ష్మంగా ఉంటాయి. అంటే, అర్థం ఏమిటట? ఈ నెర్వ్‌ సెంటర్‌ని పని చేయించడానికి, కావాల్సినటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మకమైనటువంటి జ్ఞానం ఇది చాలా ముఖ్యం.

 మాట్లాడలేనివాళ్ళకి నాలుక లేదనా? నాలుక ఉంది, మాట్లాడగలిగే శక్తి లేదు. మాట్లాడగలిగే శక్తి ఎందుకు లేదు అంటే, మాట్లాడించేటటువంటి నెర్వ్ సెంటర్‌, ఉత్ప్రేరకముగా పనిచేయడం లేదు. ప్రేరణకు గురవ్వడం లేదు. దాంట్లోనుంచి వ్యక్తం కావల్సినటువంటివి, వ్యక్తం కావడం లేదు. అది వెనక్కి తీసుకోబడిందన్నమాట. అది ఎక్కడికి తీసుకోబడింది అంటే, అవ్యక్తంలోకి తీసుకోబడింది.

         కాబట్టి, మనకున్నటువంటి జ్ఞానేంద్రియం అని చెప్పడానికి కారణము ఏమిటంటే, ఆ వెనుకనున్నటువంటి ఇంద్రియాన్ని శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మకమైన జ్ఞానం పనిచేస్తుంది. అవి స్వయంగా పనిచేయడంలేదు. మెదడులో న్యూరాన్ సెంటర్లని పనిచేయించడానికి కావాల్సిన జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం పనిచేయకపోతే అవి ఉన్నా ప్రయోజనం శూన్యమే. కాబట్టి, జ్ఞానము ఉండాలి. ఆయా వ్యవస్థా ఉండాలి. వ్యవస్థ పనితీరును వ్యక్తం చేయడానికి, కావల్సిన గోళకాలు ఉండాలి. ఇంకేం ఉండాలి?
 
        శబ్దాది తన్మాత్మలకన్న మనస్సు సూక్ష్మమైనటువంటిది. అయ్యా! ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలకు సంబంధించిన నాలెడ్జ్‌ అయితే ఉంది. కానీ, దానిని పనిచేయించేటటువంటి మనస్సు అనే ఇంద్రియం సూక్ష్మమైన ఇంద్రియం పనిచేయడం లేదు అన్నాం అనుకోండి? అప్పుడేమయ్యింది? మానసిక వికలాంగులను చూశాం అనుకోండి, వాళ్ళకు అన్నీ ఉన్నాయి. 

ఏం లేవు? అన్ని గోళకాలు ఉన్నాయి. అన్ని ఇంద్రియాలు ఉన్నాయి. అన్ని వ్యవస్థలు ఉన్నాయి. అన్నీ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మకమైన జ్ఞానము ఉన్నది. కానీ, సమన్వయ కర్త అయినటువంటి మనస్సు పనిచేయడం లేదు. 

ఈ నాలుగు వ్యవస్థలని పనిచేయించేటటువంటి సమన్వయ కర్త, అనుసంధాన కర్త అయినటువంటి మనస్సు అంటే వ్యానవాయువు యొక్క ప్రభావం సరిగ్గా లేదన్నమాట. ఆ ఒక్కటి లోపించింది. ఎప్పుడైతే మనోవ్యాపారం స్తంభించి పోయిందో అప్పుడు ఏమైంది? అది అవ్యక్తంలోకి వెళ్ళిపోయింది. కిందికి దిగి రాదన్నమాట. అప్పుడు ఇంద్రియ వికాసం కలగడం లేదు. అప్పుడు ఇంద్రియ గోళకాల వికాసం కలగడం లేదు. బుద్ధి వికాసం కలగడం లేదు. 

ఏ రకమైనటువంటి వ్యాపారము, వారు చేయగలిగేటటువంటి సమర్థత లేకుండా పోయింది. కాబట్టి, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలకు సంబంధించిన నాలెడ్జ్‌ ‘జ్ఞానం’ ఉండడం అవసరమే! కానీ, ఈ నాల్గింటిని, ఈ జ్ఞానాన్ని, ఆ లోపలున్న వ్యవస్థని, ఆ లోపలున్నటువంటి ఇంద్రియాలని, ఆ లోపలున్నటువంటి గోళకాలని, ఒక దానిని ఒక దానితో అనుసంధాన పరిచేటటువంటి మనస్సు అత్యంత సూక్ష్మమైనటువంటిది వీటన్నింటి కంటే!

        కానీ, ఈ మనస్సు అనేటటువంటి సూక్ష్మము కన్నా, బుద్ధి సూక్ష్మమైనటువంటిది. ఇది ఏమిటండీ? అంటే, “నిశ్చయాత్మకో బుద్ధిః, వివేచనాత్మనో మనః” ఇది సూత్రం. అంటే అర్థం ఏమిటి? అటు వెళ్దామా? ఇటు వెళ్దామా? నువ్వు అటూ వెళ్ళచ్చు, ఇటూ వెళ్ళచ్చు.

రకరకాల ఆప్షన్లు ఇస్తుంది. మనకు ఏదైనా ఒక ఆలోచన పుట్టగానే, ఆ ఆలోచనని నెరవేర్చుకోవడానికి కావల్సినటువంటి అవకాశములు ఎన్ని వున్నాయి అనేటటువంటిది నీ మనస్సు ఒకదాని తర్వాత ఒక్కటి, ఒకదాని తర్వాత ఒకటి తరంగముల వలె నీ ముందు ఉంచుతూ ఉంటుంది. 

మనం ఏ పనినైనా చేయాలి అనంటే, ఎన్ని రకాలుగా ఆ పనిని నెరవేర్చుకోవచ్చో, రకరకాల [abcdef] ఆప్షన్‌లన్నీ లెక్క వేస్తూ ఉంటుంది. కానీ, ‘వివేచనాత్మకో మనః’ - అయితే వివేచన చేశాం. చేస్తే ఏమైంది? ఏదో ఒక నిశ్చయం చేయాలిగా పని చేయాలి అంటే, ‘ఒకటి తినాలి’ - ఏం తినాలి?-

బీరకాయి తినచ్చు, వంకాయి తినచ్చు, కాకరకాయి తినచ్చు, ఉల్లిపాయి తినచ్చు, కానీ టమాటో తినచ్చు. ఎదురుగుండా ఆప్షన్స్‌ చాలా ఉన్నాయి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 113 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
106

Datta Guru blessed a disciple called Pingala Naga. Let’s learn the story. Pingala Naga was a great scholar and an ardent devotee of Siva. He heard about the greatness of Lord Datta and wanted to learn more from him about Lord Siva. He wanted to see Lord Datta. 

When he went to Lord Datta, the situation there was very strange. Of course, the Lord knows ahead of time about the disciples coming to him. The tests for those disciples are automatically set. The tests were very strange, there were things that should not be seen, things that should not be heard and could not be understood.

Lord Datta was performing a yagna (ancient ritual of offering herbal preparations in the fire). He had the appearance of a mendicant. He looked nothing like an officiator of a yagna. He was performing the yagna as he wished. Sometimes, he would put the offerings in the fire pit, sometimes, he would them outside the fire pit. He did as he liked. 

Sometimes, he would throw the ghee (one of the offerings in a yagna) up in the air, sometimes he would put too much into the fire and sometimes he would dump it into the herbal preparations for the yagna. His behavior was very strange. Sometimes, he would eat up the preparations himself. He was doing the yagna as he liked.

The sages sitting around the fire pit were overjoyed seeing the yagna. Pingala Naga was puzzled, “What is this? These sages are so great. They are very learned in spiritual truths. And they are ripe in age. Such great scholars! Why are they so happy seeing the Lord’s yagna? They have tears of joy. They are saying that the mission of their life is fulfilled seeing this yagna. What is this? 

Nobody is finding any fault with the yagna. Moreover, everyone is praising him as Yagneshwara (Lord of the Yagna), Yateeshwara! Is he a Yateeshwara? He does not look like one. His long beard is unkempt, his clothes are shabby, he looks like a lunatic. He sometimes glances around like a mad man. 

Sometimes, he’ll pull his hair, sometimes, he’ll pull his beard. Sometimes, he’ll throw away the clothes on him, and again wear them back on and again go back to doing the yagna. It is hard to keep track of all the things that seem wrong. What kind of illusion is this? Am I dreaming or is 
this real?”

He pinched himself hard to see if what he was witnessing was a dream. “Am I falling asleep while standing? Such a thing is expected to happen in Kaliyuga, but it already seems to be happening to me now. The sages are continuing to praise him as Yagneshwara, Yateeshvara, as the Knowledgeable One, as the Beautiful One and so on. 

Is he beautiful? It was weird enough that they called him Yagneshwara and Yateeshwara, but they are calling this old man beautiful? Can they even see him clearly? Or are they dreaming themselves?” Pingala Naga was lost in these thoughts. See how many questions and doubts Pingala Naga had in the one second he witnessed all this in.

“But, he does not have the qualities of Yateeshwara. Yateeshwaras are supposed to have a few distinct qualities. One can instantly identify a Yateeshwara. 

But, he did not have a staff or kamandalam (water pot with a handle and spout) like Yateeshwaras do. He was not chanting the Omkara. And even before the yagna was complete, the Lord was getting up, petting a few dogs, milking the dogs and drinking up the milk. He kept doing this intermittently – get up from the yagna, pet the dogs, drink their milk and come back and chant the mantras for the yagna. 

The mantras could not be heard clearly. It seemed like was pronouncing them incorrectly. It was as if he was murmuring to himself. The Lord kept doing this. Occasionally, someone else would bring him something in a pot and he would immediately gulp it down”.

Now Pingala Naga wondered if going there was a mistake. 

 Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 98 / Sri Gajanan Maharaj Life History - 98 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 19వ అధ్యాయము - 6 🌻*

చాందూరు తాలూకాలో వార్ఖడేకు చెందిన యోగి అడకుజి, మురహకు చెందిన యోగి జింగాజి మరియు నాగపూరు తాజుద్దీన్ బాబా భక్తిమార్గం అనుసరించారు. ఈయోగులందరూ వేరువేరు ప్రవర్తనలు కలిగి ఉన్నా, దేవునిలో ఒకటవడానికి అధికారం సంపాదించారు. 

ఏమార్గం అనేది విషయంకాదు, చిట్టచివరి లక్ష్యంచేరడం ప్రాముఖ్యం. పవిత్రులయిన మనుషులకు మోక్షమార్గానికి దారి చూపడానికి మేము ఈయోగి సోదరులం ఈప్రపంచంలోకి వచ్చాం.ఎవరి ఇష్టంవచ్చిన మార్గం వాళ్ళు ఎన్నుకుని చివరికి మోక్షంపొందాలి. ఇక ఎక్కువ ఏమీ అడగకు, అంతేకాక ఈవిషయాలగురించి కూడా ఎవరికీ చెప్పకు. నన్ను ఇలా పిచ్చివాడి వేషంలో శాంతిగా కూర్చోనివ్వు. 

ఎవరికయితే నామీద నమ్మకం ఉందో, నేను ఎవరిని ప్రేమిస్తున్నానో వాళ్ళ కోరికలు మాత్రమే తీరుతాయి. నాకు మిగిలిన వాళ్ళ అవసరంలేదు. బ్రహ్మజ్ఞానం పశ్చాత్తాప పడేవాళ్ళకు చెప్పాలేతప్ప, నమ్మకంలేని వాళ్ళకికాదు. భగవంతుని కలవడానికి మనమార్గం మీద దృఢంగా ఉండాలి, అని శ్రీమహారాజు విశదీకరించారు. 

ఈ విధంగా ఉపదేశంవిన్న బాలాభన్ ప్రేమతో ఉప్పొంగిపోయి, ఆనందభాష్పాలతో కళ్ళు కళకళలాడాయి. వర్ననాతీతమయిన రీతిలో అతని మొత్తం శరీరంఅంతా అమిత ఆనందంతో కంపించింది. మానవోద్ధారణ కోసం అవతారం ఎత్తిన షేగాం యొక్క ఈమహాయోగికి బాలాభవ్ అభివందనలు చేసాడు. 

సాలూబాయి శ్రీమహారాజు యొక్క నిజమయిన భక్తురాలు. ఒకసారి శ్రీమహారాజు ఆమెతో సాలూ పిండి, పప్పు దినుసులు తీసుకుని రాత్రిపగలు వంటచేస్తూ ఉండు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ తినిపిస్తూ ఉండు. ఇలా చెయ్యడంవల్ల నీవు నారాయణుడిచేత ప్రేమించబడతావు అని అన్నారు. ఆ వైజాపూరుకు చెందిన సాలూబాయి ఇప్పటికీ షేగాంలో జీవించిఉంది. 

ప్రహ్లాదబువా జోషికి ఒకసారి శ్రీమహారాజు ఆశీర్వాదాలు పొందేందుకు అవకాశం వచ్చింది కానీ దురదృష్ట వశాత్తూ దానిని పోగొట్టుకున్నాడు. థాంగాం దగ్గర జాలంబ్లో తులసీరాం అనే అతను ఉండేవాడు. అతని కుమారుడు ఆత్మారాం చాలా తెలివైనవాడు. ఇతనికి వేదాలంటే ప్రత్యేకమయిన ఇష్టత కలిగి, వాటి అధ్యయనం కోసం కాశీ వెళ్ళాడు. రోజూ భగీరధి నదిలో స్నానంచెయ్యడం, భిక్షాటనచేసి వచ్చిన ఆహారం తీసుకోవడం మరియు వేదాభ్యాసానికి గురువు దగ్గరకు వెళ్ళడం ఇతని దినచర్య. దీనికి విరుద్ధంగా, చదువుకి బదులు ఇతరత్రములైన ఆనందోల్లాసాలలో సమయం వృధా చెయ్యడం అనేది ఇప్పటి విద్యార్ధుల ప్రవర్తన. ఇటువంటి ప్రవర్తనవలన వాళ్ళు ఏమయినా జ్ఞానం పొందగలరా ? 

ఆత్మారాం ఆవిధమైన వాడుకాదు. తన బాధ్యత బాగా తెలిసినవాడు. తన అభ్యాసం పూర్తిచేసిన తరువాత ఇంటికి వచ్చి, మొదట తిన్నగా శ్రీమహారాజుకు అభివాదనలు తెలియ పరిచేందుకు షేగాం వెళ్ళాడు. ఆత్మారాంకు ఇప్పుడు వేదాలు తెలుసు, కానీ శ్రీమహారాజు జ్ఞానంతో వెలిగే సూర్యుడు. ఆత్మారాంతోపాటు వేద పఠనం చేసి, అవసరం అయినచోట సరిదిద్దారు. శ్రీమహారాజు ఈవిధంగా వేదాలు పఠించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 98 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 19 - part 6 🌻

Adkuji, the saint of Varkhed in Chandur Tahsil, saint Zingaji of Murha and Tajuddin Baba of Nagpur followed the ‘Bhakti Marga’. All these saints had different behaviours, but attained the authority to become one with the God. It is not the path that matters, but the ultimate reaching of the goal is important. We, all brother saints, have come to this world to guide the pious men to the path leading to Moksha. 

They may follow the path of their liking and attain Moksha. Now don't ask me anything more, nor tell anything of this to others. Let me sit peacefully under the guise of madness. Only those, who have faith in me, and whom I love will get their desires fulfilled. I don't need the others. ‘Brahma gyan’ (the knowledge of Supreme Reality) should be told to the repentants, and not to non-believers. 

To meet the God, we must be firm on our path. Hearing this advice, Balabhau was overwhelmed by love; his eyes brimmed with tears of joy. All his body shivered with extreme bliss, beyond the power of words to describe. Balabhau quietly paid respect to the great saint of Shegaon whose incarnation was for the sole purpose of salvation of humanity. Salubai was a sincere devotee of Shri Gajanan Maharaj . 

Once Shri Gajanan Maharaj said to her, Salu, take flour and pulses and keep on cooking day and night. Go on feeding all those who come here; by doing so you will be loved by Narayan. That Salubai of Vaizapur is still alive at Shegaon. Pralhad Bua Joshi once had an opportunity of receiving the Blessings of Shri Gajanan Maharaj , but unfortunately lost it. There was one Tulsiram at Jalamb near Khamgaon. 

His son, Atmaram, was very intelligent. He had a special liking for the Vedas, and so had gone to Kashi for their study. Daily bath in the Bhagirathi River, food of Madhukari (Alms) and going to a Guru for the studies of the Vedas was his daily routine. Contrary to this is the behaviour of the present day students, who waste their time in all types of entertainments instead of their studies. Can they gain any జిknowledge by such behaviour? 

Atmaram was not like that. He knew his responsibility well. After completing the studies, he returned home and first went to Shegaon to pay his respects to Shri Gajanan Maharaj . Atmaram now knew Vedas but Shri Gajanan Maharaj was the sun of knowledge. He recited Vedas along with Atmaram, and corrected him whenever necessary. It was a surprise for all to see Shri Gajanan Maharaj reciting Vedas. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 72, 73 / Sri Lalitha Chaitanya Vijnanam - 72, 73 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |*
*నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా ‖ 28 ‖*

72. 'భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా'

భండ సైన్యమును వధించుట కుద్యుక్తమైన శక్తుల విక్రమమును చూచి హర్షించుదానా అని అర్థము.

భండు డనగ జీవుడు. జీవునియందు ద్వైత వృత్తులుండును. అవియే ద్వంద్వములు. ఈ ద్వైత వృత్తులను ఆధారముగ జీవుడు సృష్టి యందు జీవనము సాగించుచుండును. రాత్రి పగలు, మంచి - చెడు, సుగుణము-దుర్గుణము, కుడి ఎడమ, ఉత్తమము-నీచము, సరి-బేసి, ఆడ-మగ, సుఖము-దుఃఖము, లాభము-నష్టము, జయము - అపజయము. ఇట్లు ద్వంద్వములు మహా సైన్యమువలె యుండి జీవుని బంధించి వేయును. జీవితము అటునిటు లాగబడుచు సాగుచుండును.

ద్వంద్వములు నశించిననేగాని, జీవునికి శాంతి లేదు. అతని యందు కూడ జీవాత్మ భావము-దేహాత్మ భావము, బుద్ధి-మనస్సు, అంతఃకరణములు - బహిఃకరణములు, పశుప్రవృత్తి-పతిప్రవృత్తిగా ద్వందములు భాసించు చుండును. 

వీనిని నశింపచేయవలె నన్నచో భక్తి, జ్ఞానము, వైరాగ్యము, యోగము అను విద్యలను ఆశ్రయించవలెను. అట్లాశ్రయించినచో క్రమశః జీవుడు ద్వంద్వములను దాటగలడు. ఈ విద్యలు జీవుని ద్వంద్వములను
దాటించుచుండగ అమ్మ చూచి ఆనందించునట. 

అందుచేత ద్వంద్వములను నశింపచేయు శక్తులున్నచో అమ్మకానందము. ద్వైత శక్తులకు మనస్సు కారణము. అద్వైత శక్తులకు జ్ఞానము కారణము. జ్ఞాన శక్తులే అమ్మకు ఆనంద దాయకములు. జ్ఞానము పొందుతున్న జీవులను చూచి వృద్ధిచెందుచున్న పిల్లలవలె భావించుచు అమ్మ హర్షించును. ఈ అద్వైత శక్తులను 'నకులి' శక్తులందురు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 72 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 72. Bhaṇḍasainya- vadhodhyukta- śakthivikrama-harṣitā* *भण्डसैन्य-वधोध्युक्त-शक्थिविक्रम-हर्षिता (72) 🌻*

When Her śaktī-s (army) destroyed the army of the demon Bhaṇḍasurā, She was delighted.

Bhaṇḍa also means ignorant soul afflicted with duality, sainya (army) also refers to duality (identifying the self as different from the Brahman), and vadha means destruction. Lalitai is delighted when one destroys duality.  

When duality is removed, it is an indication of the removal of the veil of māyā. The duality can be removed only by internal exploration with the help of mind.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 73 / Sri Lalitha Chaitanya Vijnanam - 73 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |*
*నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా ‖ 28 ‖*

*🌻 73. 'నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సకా' 🌻*

నిత్యాదేవి యొక్క పరాక్రమ ఆటోపమును చూచుటకు అత్యంత ఉత్సాహముతో కూడినదానా ! నిత్యాదేవి చతుర్దశి తిథి దేవతగ తెలిపితిమి. అటుపైనది పౌర్ణమియే. పౌర్ణమి తిథియనగా పూర్ణత్వమే లేక శ్రీ దేవియే. అమావాస్య నుండి చతుర్దశి వరకు చంద్రకాంతి పెరుగుచు నుండగ, పూర్ణిమ యగు అమ్మవారు, ఆ పెరుగుదలను ఉత్సాహముతో గమనించుచు నిరీక్షించి యుండును. 

పదునైదు తిథులకు గల కాంతులు, పదిహేను సేనలుగ తంత్రరాజము నందు పేర్కొనిరి. ఈ సేనలు విస్తారమగు పరాక్రమము కలవిగ అందు తెలుపబడినవి. ఈ సేనలకన్నిటికిని నిత్యాదేవి నాయిక. ఈ సేనల శక్తులన్నియు ఆత్మశక్తులు. ఆత్మశక్తులు వృద్ధి పొందుచుండగ జీవుడు దైవమునకు చేరువగు చున్నాడు. అట్టి ఆత్మశక్తుల కోలాహలమును అమ్మ ప్రోత్సహించు చుండును. ఉత్సుకతతో వాని వృద్ధిని గమనించుచుండును.

నిత్య యను దేవత, సృష్టియందలి నిత్యత్వమునకు సంకేతము. అనిత్యమగు విషయముల యందు అనురక్తిని నిత్యవిషయైక జ్ఞానము ద్వారా నశింపచేసుకొన వచ్చును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 73 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 73. Nityā- pārākramāṭopa- nirīkṣaṇa- samutsukā* *नित्या-पाराक्रमाटोप-निरीक्षण-समुत्सुका (73) 🌻*

Nitya means tithi nitya devi-s (refer nāma 71). Lalitai was happy on observing the valour of these fifteen tithi nityā devi-s during the war.

When duality is destroyed and the veil of māyā is removed, the knowledge of Brahman continues to increase over a period of time.  

Spiritual progress achieved cannot be reversed that easily (though it can be reversed in exceptional circumstances). This is the secretive meaning of this nāma.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 452 / Bhagavad-Gita - 452 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -09 🌴*

09. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్ |
అభ్యాసయోగేన తతో మమిచ్ఛాప్తుం ధనంజయ ||

🌷. తాత్పర్యం : 
ఓ అర్జునా! ధనంజయా! స్థిరముగా నా యందు మనస్సును లగ్నము చేయ నీవు సమర్థుడవు కానిచో, భక్తియోగమునందలి విధివిధానములను అనుసరింపుము. ఆ రీతిని నన్ను పొందు కోరికను వృద్ధిచేసికొనుము.

🌷. భాష్యము : 
ఈ శ్లోకమున రెండు విధములైన భక్తియోగావిదానములు తెలుపబడినవి. అందు మొదటిది దివ్యప్రేమ ద్వారా దేవదేవుడైన శ్రీకృష్ణుని యెడ అనురాగమును వాస్తవముగా వృద్దిచేసికొనినవారికి సంబంధించినది. 

దివ్యప్రేమ ద్వారా పరమపురుషుని యెడ అనురాగమును పెంపొందించుకొనినవారికి రెండవ పధ్ధతి పేర్కొనబడినది. ఈ రెండవ తరగతికి పలు విధివిధానములు నిర్దేశింపబదియున్నవి. శ్రీకృష్ణుని యెడ అనురాగాము కలిగిన స్థితికి మనుజుడు అంత్యమున ఉద్ధరింపబడుటకు వాటిని అనుసరింపవచ్చును.

భక్తియోగమనగా ఇంద్రియముల పవిత్రీకరణమని భావము. ప్రస్తుతము భౌతికస్థితిలో ఇంద్రియములు భోగతరములై యున్నందున అపవిత్రములై యుండును. కాని భక్తియోగాభ్యాసముచే ఇంద్రియములు పవిత్రములు కాగలవు. 

పవిత్రస్థితిలో అవి శ్రీకృష్ణభగవానునితో ప్రత్యక్ష సంబంధమునకు రాగలవు. ఈ జగమున నేను ఒక యజమాని సేవలో నిలిచినప్పుడు, నిజముగా ప్రేమతో అతనిని సేవింపను. కేవలము కొంత ధనమును పొందుటకే సేవను గూర్తును. 

అదేవిధముగా యజమాని సైతము ప్రేమను కలిగియుండడు. నా నుండి సేవను గ్రహించి, నాకు ధనమొసగుచుండును. కనుక ఇచ్చట ప్రేమ అనెడి ప్రశ్నయే ఉదయింపదు. కాని ఆధ్యాత్మికజీవితమున శుద్ధమగు ప్రేమస్థాయికి ప్రతియొక్కరు ఎదుగవలసినదే. 

ప్రస్తుత ఇంద్రియములచే నిర్వహింపబడెడి భక్తియోగాభ్యాసము చేతనే అట్టి ప్రేమస్థాయి ప్రాప్తించగలదు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 452 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 12 - Devotional Service - 09 🌴*

09. atha cittaṁ samādhātuṁ
na śaknoṣi mayi sthiram
abhyāsa-yogena tato
mām icchāptuṁ dhanañ-jaya

🌷 Translation : 
My dear Arjuna, O winner of wealth, if you cannot fix your mind upon Me without deviation, then follow the regulative principles of bhakti-yoga. In this way develop a desire to attain Me.

🌹 Purport :
In this verse, two different processes of bhakti-yoga are indicated. 

The first applies to one who has actually developed an attachment for Kṛṣṇa, the Supreme Personality of Godhead, by transcendental love. And the other is for one who has not developed an attachment for the Supreme Person by transcendental love. 

For this second class there are different prescribed rules and regulations one can follow to be ultimately elevated to the stage of attachment to Kṛṣṇa.

Bhakti-yoga is the purification of the senses. At the present moment in material existence the senses are always impure, being engaged in sense gratification. 

But by the practice of bhakti-yoga these senses can become purified, and in the purified state they come directly in contact with the Supreme Lord. 

In this material existence, I may be engaged in some service to some master, but I don’t really lovingly serve my master. I simply serve to get some money. And the master also is not in love; he takes service from me and pays me. 

So there is no question of love. But for spiritual life, one must be elevated to the pure stage of love. That stage of love can be achieved by practice of devotional service, performed with the present senses.

This love of God is now in a dormant state in everyone’s heart. And, there, love of God is manifested in different ways, but it is contaminated by material association. 

Now the heart has to be purified of the material association, and that dormant, natural love for Kṛṣṇa has to be revived. That is the whole process.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు - 68 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🍀 6. వాగ్దానము - దైవము దిగి వచ్చినప్పుడు, అధర్మమును పరిపూర్ణముగ నిర్మూలించుట ఎప్పుడును జరుగదు. ధర్మాధర్మములు సృష్టి తక్కెడల వంటివి. తూకమునకు రెండు తక్కెడలును అవసరమే. దైవము హెచ్చుతగ్గులనే సరిచేయును తప్ప అధర్మమును పరిపూర్ణముగ సృష్టినుండి తొలగజేయునని తలచరాదు. 🍀*

*📚. 4. జ్ఞానయోగము - 7 📚*

యదా యదా హి ధర్మస్య గ్లాని ర్భవతి భారత |
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజా మ్యహమ్ || 7

ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి యగు చుండునో, అపుడు నన్ను నేనే సృష్టించుకొందునని భగవంతుడు తెలిపినాడు. ఇది భగవంతుని వాగ్దానము. 

సృష్టితో పాటు సృష్టి ధర్మమును కూడ దైవ మేర్పరచినాడు. ధర్మమునకు గ్లాని కలిగినపుడెల్ల తానవతరించి ధర్మమును చక్కబెట్టుదునని తెలిపినాడు. ధర్మమే సృష్టికి ఆధారము. 

ద్వంద్వములు కూడ సృష్టిధర్మమే. ద్వంద్వములు లేనిదే సృష్టిలేదు. వెలుగు లోకములు కలవు. చీకటి లోకములు కూడ కలవు. సురలు గలరు. అసురులు కూడ గలరు. జ్ఞానము కలదు. అజ్ఞానము కూడ కలదు. ఇట్లెన్నియో ద్వంద్వములు సృష్టిని సమతూకముగ నుంచును. ఇవి అన్నియు సృష్టి ధర్మములే.

ఇందొకటి నిర్మూలించినచో రెండవది కూడ నిర్మూలింపబడును. కావున దైవము దిగి వచ్చినప్పుడు, అధర్మమును పరిపూర్ణముగ నిర్మూలించుట ఎప్పుడును జరుగదు. ధర్మాధర్మములు సృష్టి తక్కెడల వంటివి. తూకమునకు రెండు తక్కెడలును అవసరమే. దైవము హెచ్చుతగ్గులనే సరిచేయును తప్ప అధర్మమును పరిపూర్ణముగ సృష్టినుండి తొలగజేయునని తలచరాదు. 

శ్రీరాముడు, శ్రీ కృష్ణుడు వంటి రూపములలో దైవము దిగి వచ్చినప్పుడు ధర్మగ్గానిని సరిదిద్దిరే గాని అధర్మమును సంపూర్ణముగ తొలగింపలేదు. అసురులు, అజ్ఞానము ఎప్పుడూ యుండనే యున్నవి. వాటి స్థానము వాటికున్నది. ఇది సృష్టి ధర్మము. 

ఎవరి ధర్మమును వారు పాటించుట దైవమునకు ముఖ్యము. అతిక్రమించినపుడు వానిని సరిజేయును. కాలమునకు ధర్మమున్నది. కృతయుగమున కేవలము ధర్మమే యుండును. అపుడు సృష్టి అంతయు వెలుగు లోకములతోనే నిండియున్నది. త్రేత, ద్వాపర, కలియుగములలో ఒక్కొక్క పాదము (25%) ధర్మము నశించుట జరుగును. 

కలియందు ఒక పాదమే ధర్మముండును. మూడు పాదములు అధర్మమే యుండును. అంతకు మించి అధర్మము పెరిగినచో దైవము అవతరించగలడు. దైవము అవతరించనిచో, కాలరీతిని బట్టి అధర్మము మితిమీర లేదని తెలియవలెను.

దైవము యొక్క అవతారములు దిగివచ్చినను, మహా పురుషులు దేహధారులై యున్నను, అధర్మ మెందులకున్నది అని ప్రశ్నించువారు, సందేహ పడువారు పై సత్యమును తెలియవలెను. కాలమును బట్టి ధర్మ ముండును. జనస్రవంతి కాలము ననుసరించి యుండును. 

అందువలన ధర్మము ననుసరించు వారు అధర్మమును దూషింపక, ఒద్దికగ జీవించినచో అధర్మము స్పృశించదు. ధర్మ మనుసరించు వారికొరకై మరియొక శోకము చెప్పబడినది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 265 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
62. అధ్యాయము - 17

*🌻.సతీ వరప్రాప్తి - 4 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను -

నా కుమారుడగు దక్ష ప్రజాపతి ఇట్లు ప్రశ్నించెను. ఓ మహర్షీ! నేను చిరునవ్వు నవ్వి ఆతనికి ఆనందమును కలిగించుచూ ఇట్లు పలికితిని (58). హే దక్షా! నేను నీ వద్దకు వచ్చిన కారణమును వినుము. నేను నీ కుమార్తె హితమును గోరుచున్నాను. నీ కోరిక కూడ అదియే (59). 

నీ కుమార్తె శివుని ఆరాధించి ఒక వరమును కోరియున్నది. దానికి ఇపుడు సమయము ఆసన్నమైనది (60). శివుడు నన్ను నీ వద్దకు పంపినాడు. ఆయన నీ కుమార్తె కొరకు నన్ను పంపినాడు. నీకర్తవ్యమును, నీకు శ్రేయస్సు కలుగు విధముగా శ్రద్ధగా వినుము (61).

శివుడు వరము నిచ్చి వెళ్లిన నాటినుండియూ నీ కుమార్తె యొక్క వియోగముచే సుఖమును పొందలేకున్నాడు (62). మన్మథుడు పుష్పబాణములన్నింటితో పెద్ద ప్రయత్నమును చేసియూ, ఛిద్రము (దౌర్బల్యము) లభించకపోవుటచే ఏ శివుని జయింపలేకపోయినాడో(63),ఆ శివుడు ఇపుడు కామబాణములచే కొట్టబడకపోయిననూ, ఆత్మ ధ్యానమును వీడి, దుఃఖితుడై ప్రాకృతజనునివలె సతిని ధ్యానించుచున్నాడు (64). 

ఆయన వియోగ దుఃఖితుడై గణముల ఎదుట ఆరంభించిన ప్రసంగమును మరిచి 'సతి ఎక్కడ?' అని పలికి నలువైపులా పరికించు చున్నాడు. మరియు నిట్టూర్పులను విడుచుచున్నాడు(65).

కుమారా! పూర్వము నేను, నీవు, మన్మథుడు, మరియు మరీచి మొదలగు మహర్షులు దేనిని కోరిరో, అది ఇప్పుడు సిద్ధించినది (66). నీ కుమార్తె శంభుని ఆరాధించినది. ఆయన ఆమెను ధ్యానించుచూ ఆమెను పొందగోరి ఆమెకు అనుకూలుడై హిమవత్పర్వతమునందున్నాడు (67). 

ఆమె నానా విధ భావములతో, సత్త్వగుణశీలియై దృఢవ్రతముతో శంభుని ఏ తీరున ఆరాధించినదో,ఆయన ఆ సతిని అటులనే ఆరాధించుచున్నాడు (68). కావున, శంభుని కొరకు తనువును దాల్చిన దాక్షాయణిని ఆయనకు సమర్పించుము. విలంబమును చేయకుము. అట్లు చేసి నీవు కృతార్థుడవు కమ్ము (69).

  నేను నారదుని ద్వారా ఆయనను నీ ఇంటికి రప్పించెదను. నీవు ఆయన కొరకు తనువును దాల్చిన ఈమెను ఆయనకు సమర్పించుము (70). నా కుమారుడగు దక్షుడు నా ఈ మాటను విని, మిక్కిలి సంతసిల్లి, 'అటులనే అగుగాక!'అని నాతో పలికెను (71). 

ఓ మహర్షీ! అపుడు లోకకార్యము నందు నిమగ్నుడనైన నేను ఉత్సాహముతో మిక్కిలి ఆనందముతో శివుడు ఉన్న స్థానమునకు వచ్చితిని (72).ఓ నారదా! నేను వెళ్లగానే దక్షుడు భార్యతో , కుమార్తెతో గూడి అమృత పానమును తృప్తిగా చేసిన వాడు వలె పూర్ణమనోరథుడాయెను (73).

శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండములో సతీవరప్రాప్తి అనే పదునేడవ అధ్యాయము ముగిసినది (17).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 22 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 3 - THE FIRST RULE
*🌻 KILL OUT AMBITION - 1 🌻*

89. A.B. – We now turn to the first rule, dealing with ambition in particular. The undeveloped man is strongly held by the attractions of the senses; he desires physical luxury and bodily enjoyment. 

He does not feel ambition, which is the desire for power, until the mind is highly developed and the intellectual power has grown strong. The note of the intellect is “I”. It causes the man to feel himself separate, and that invariably leads him to wish to exercise power, because that desire is the self-assertion of the individual soul. He feels himself superior to all around him, and that shows as a desire for physical authority. 

From that comes the temptation to seek and grasp social and political power. In the political and social sphere ambition is the great moving force; for the man who by his intellect has gained influence over his fellow-men, stands out as their leader and this is a position which is incense in the nostrils of the proud and superior man.

90. Then the man begins to despise outer power over the bodies of men, and there comes into his mind the realization of a subtler form of power, which he now seeks to obtain. He no longer wants to lay down laws with physical authority; he has the subtler longing to dominate and rule the minds of men. That is intellectual ambition – the ambition to be a leader of thought. It is not an ambition which would move anyone who had not a largely developed intellect.

91. Still later, when that desire has been outgrown, ambition reappears in a yet subtler form, when the man passes on into the spiritual life. He thinks of the spiritual progress as made by himself for his own sake, because he wants to grow and understand and progress; the old ambition is really still holding him, and it is more dangerous because it is higher and subtler. 

That is why in the note to this aphorism the Master makes the remarkable statement that the pure artist, who works for the love of his work, is sometimes more firmly planted on the right road than the occultist who fancies he has removed his interest from self, but who has in reality only enlarged the limits of experience and desire, and transferred his interest to things which concern his larger span of life. 

The occultist is no longer confined to the ambitions of his present incarnation, yet his ambition may not be dead. He no longer cares to be a law-giver or ruler of mankind, nor even an arbitrator in the thoughts of men; but he desires to be high in the spiritual world. 

He realizes that he is going to live life after life, and his ambition extends to the whole span of that greater life. He is still longing to be first, to be separate, to be what others are not. Yet that too must be overcome.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 153 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. నారద మహర్షి - 27 🌻*

192. ఎప్పుడూ కూడా నిర్దుష్టమైనటువంటి పుణ్యమనేది - కేవల పుణ్యం గాని, కేవల శుద్ధమయిన జ్ఞానంగాని- మనుష్యుల్లో ఉండదు. ఈ పాపపుణ్యముల మధ్యనే, వాటి మిశ్రమంలోనే మనుష్యుడు తిరుగుతూ ఉంటాడు. అందుకే, ‘తస్మాత్ జాగ్రత జాద్రత’ – ‘ఎప్పుడూ మెలుకువగా ఉండు’ – అని మన పెద్దలు బోధచేసారు. 

193. “ఈ పాపపుణ్యములు నిన్ను వేధిస్తూనే ఉంటాయి. జాగ్రత్తగా ఉండు సుమా! తెలివిగా ఉండు, నిద్రపోకు” అని వారి తాత్పర్యం. ఎందుకంటే, పొరపాటు జరిగిపోయిన తరువాత మనం విచారించి లాభంలేదు. స్వర్గమయినా, నరకమయినా ఈ కర్మలవలన ప్రాప్తించాక, శిక్ష ప్రారంభమైన తరువాత, తప్పుచేయకుండా ఉండవలసింది అని అనుకుంటే లాభం ఏమిటి? ఏ తప్పూచేయకుండాఉండే అవకాశం జీవితంలో ఇప్పుడే ఉంది మనకు. ఈ అవకాశం జీవితంలో, ఈ శరీరంలో ఉన్న కాలమేకదా!

194. భవిష్యత్తు అంటే అర్థం – తన జీవుడికి ఉన్న యథార్థమైన, సుధీర్ఘమైన భవిష్యత్తు అని. ఈ శరీరమో అల్పం, మూడునాళ్ళ ముచ్చట. దీనితోపోలిస్తే కొన్నివేల సంవత్సరముల స్థితి జీవుడికి ఉంటుంది. అప్పుడు(శరీరంలేనపుడు) పుణ్యంచేసుకోవటానికి అవకాశం లేదు. కాళ్ళూలేవు, చేతులులేవు, ‘తను’ ఒక్కడే తనతో ఉంటాడు. 

195. అలా ఏకాకిగా ఉండేటటువంటి జీవాత్మ, ఏ పుణ్యంచేసుకుని తన దుఃఖాన్ని పోగొట్టుకుంటుంది? ఏం తపస్సు చేస్తుంది? అప్పుడు పుణ్యం చేసుకోవటానికిగాని, జ్ఞానబోధ చేసేవాడు కాని, మనమధ్యకు వచ్చి చెప్పేవాడు కాని ఎవరున్నారు?. 

196. ఆ స్థితిలో జీవుడు క్రియాశూన్యుడు, క్రియారహితుడు కనుక, వ్యర్థుడే అవుతాడు. మానవశరీరంలో ఉన్నటువంటిస్థితిలో, తనకు రాబోయే స్థితిని గురించి చింతించి, ఇప్పుడే దానికికావలసిన పుణ్యం ఎవడు సంపాదించుకుంటాడో, ఏదయితే పాపహేతువో దానిని పరిహరిస్తాడో, అట్టివాడు వివేకిగాని; రాబోయే పదేళ్ళలోనూ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అడిగేవాడు వివేకి ఎట్లా అవుతాడు? రాబోయే ఓ పదేళ్ళో, ముప్ఫయిఏళ్ళో జాతకం ఎట్లాఉందని అడుగుతారు. అంటే, ఆశ, ఏ జ్యొతిష్కుడైనా ఇంకా ముప్ఫైఏళ్ళు బాగా ఉంటుందని చెప్తాడని ఆశ.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 107 / The Siva-Gita - 107 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ 

అధ్యాయము 14
*🌻. పంచ కోశో పాసన - 3 🌻*

క్షుత్పి పాసా పరా భూతో - నాయ మాత్మా యతో జడః,
చిద్రూప ఆత్మా యేనైవ - స్వదేహ మభి పశ్యతి 11
ఆత్మైవ హి పరం బ్రహ్మ - నిర్లేప స్సుఖ నీరధి:,
నత దశ్నాతికం చైత - న్నత దశ్నాతి కించన 12
తతః ప్రాణ మయే కోశే - కోశేస్త్యే వ మనో మయః,
స సంకల్ప వికల్పాత్మా - బుద్దీంద్రియ సమాహితః 13
కామః క్రోధ స్తదా లోభో - మోహో మాత్సర్య మేవచ,
మదశ్చేత్యరి షడ్వర్గో - మామ తేచ్చా దయోపివా 14
మనో మయ్యస్య కోశస్య - ధర్మా ఏత స్య తత్రతు
యా కర్మ విషయా బుద్ది - ర్వేద శాస్త్రార్ద నిశ్చితా 15

జ్ఞానానంద ములకు పరిమితి లేని యే యాత్మ తనను తానే తెలిసి కొనునో అతడే దుఃఖ రహితుడగును. పరబ్రహ్మ యనబడును. ఇట్టి పరబ్రహ్మ యొక్క దానికి భోగ్యము కాదు.
 ఒకటియు నీ బ్రహ్మమునకు భోగ్యము కానేరదు. అట్టి ప్రాణమయ కోశమున మనో మయ కోశమున్నది. బుద్దీంద్రియముతో కూడిన ఆ మనోమయ కోశము సంకల్ప వికల్పాత్మక మని తెలియ వలెను.
 
మమత ఇచ్చాదులను కామాద్యరి షడ్వర్గం బును మనోమయ కోశంబు యొక్క ధర్మంబులు కర్మ విషయక మగు బుద్ది జ్ఞానేంద్రియములతో బాటు విజ్ఞాన మయ కోశము వలన జన్యము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹  

*🌹 The Siva-Gita - 107 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayala somayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 14
*🌻 Panchakoshopasana - 3 🌻*

The Jiva who realizes his true self which is pure consciousness and bliss, such a Jiva is the most blessed one. He gets called as Parabrahman. 

Such a Parabrahman doesn't eat the fruits of any karmas. And nor does anything else becomes the enjoyer of this Brahman as fruit. inside the Pranamayakosam there exists Manomayakosam which comprises of senses and intellect (buddhi indriyam).

This manomayakosam is responsible for SankalpaVikalpa (takes decisions and gives ideas). maternal/paternal affection, lust, anger etc. qualities are the qualities generated by this Manomayakosam.

 Buddhi (intellect) gets generated by the
combination of senses and Vijnanamayakosam. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 216 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 65. This is no joke, you can become Parabrahman right now! You are Parabrahman right now! Just focus your attention on the 'I am'. 🌻*

The concept of being born as an individual with a body and mind has been so strongly hammered into you that you simply refuse to accept anything that challenges it.

 In such a state of being, the truth that you are the Absolute 'Parabrahman' in this very moment may sound too far-fetched, or like a joke. 

You can even become it right now by simply focusing your attention on the 'I am'. The moment you do so you stand apart from the 'I am' as a witness to it. Now, who is this witness?
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 92 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని 7వ పాత్ర - సాధు పురుషులు, మహాపురుషులు, సత్పురుషులు, ముముక్షువులు - 14 🌻*

388. దిగువ భూమికలలో నున్న ఆధ్యాత్మిక బాటసారులు మిక్కిలి అరుదుగా శక్తులను పరియాచించి, వాటితో మహిమలను ప్రదర్శింతురు.

389. ఇతడు విపరీతమగు వాంఛలకు పరాధీనుడై సంకల్ప మాత్రంచే తన అనంత ప్రాణశక్తిని ఉపయొగించవలె నని ఉబలాటపడుచుండును

390. వాస్తవమునకు, ఒకసారి చైతన్యమును పొందిన యెడల అదెన్నటికిని తరిగిపోదు.

391. కాని నాల్గవ భూమికలో శక్తులు దుర్వినియోగ మైనప్పుడు మాత్రము చైతన్యము అది యెచ్చట ప్రారంభమైనదో ఆ స్థితికి క్రిందికి పడిపోవును.

392. నాల్గవ భూమిక యందున్న సూక్ష్మ చైతన్యము గల ఆత్మ, తన అధీనమందున్న అద్భుత గుప్తశక్తులను దుర్వినియోగము చేయకుండా కాపాడుట, సద్గురువు చేయు కార్యములలో నొక కార్యము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 55 / Sri Vishnu Sahasra Namavali - 55 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*🌻. 55. జీవో వినయితా సాక్షీ ముకుందోఽమిత విక్రమః |*
*అంభోనిధిరనంతాత్మా మహోదధి శయోంతకః ‖ 55 🌻*

*చిత్త నక్షత్ర తృతీయ పాద శ్లోకం*

🍀 513) జీవ: - 
జీవుడు.

🍀 514) వినయితా సాక్షీ - 
భక్తుల యందలి వినయమును గాంచువాడు.

🍀 515) ముకుంద: - 
ముక్తి నొసగువాడు.

🍀 516) అమిత విక్రమ: - 
అమితమైన పరాక్రామము గలవాడు.

🍀 517) అంభోనిధి: - 
దేవతలు, మనుష్యులు, పితరులు, అసురులు ఈ నాలుగు వర్గములు అంభశబ్ధార్థములు, అంభస్సులు తనయందే ఇమిడి యున్నవాడు.

🍀 518) అనంతాత్మా - అనంతమైన ఆత్మస్వరూపుడు.

🍀 519) మహోదధిశయ: - 
వైకుంఠమునందు క్షీరసాగరమున శేషతల్పముపై శయనించువాడు.

🍀 520) అంతక: - 
ప్రళయకాలమున సర్వమును అంతము చేయువాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 55 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*🌻 55. jīvō vinayitāsākṣī mukundōmitavikramaḥ |*
*ambhōnidhiranantātmā mahōdadhiśayōntakaḥ || 55 ||*

🌻 513. Jīvaḥ: 
One who as the Kshetragya or knower of the field or the body, is associated with the 
Pranas.