గీతోపనిషత్తు - 89

🌹. గీతోపనిషత్తు - 89 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 26 - 2. ప్రాణాయామ యజ్ఞము - ఎంత నెమ్మదిగ శ్వాసను పీల్చిన మనసు అంత నెమ్మదించును. నిదాన మగుచున్న మనసునకు ప్రశాంతత రుచి తెలియును. ఈ ప్రశాంతత రుచిగొనిన మనసు మరింత ప్రశాంతతకై మరింత నెమ్మదిగ పీల్చుట, వదలుట చేయును. ఈ అభ్యాసమున మనోశాంతి అనునది యిట్లు అప్రయత్నముగ లభించును. 🍀

📚. 4. జ్ఞానయోగము - 29, 30 📚

Part 2

ప్రవాహము పైన వస్తువులు తేలుచు వేగముగ కదలుచున్నను అది వస్తువుల కదలిక కాదు కదా! ప్రవాహ వేగమే పైన తేలు వస్తువుల వేగము. అట్లే శరీర ప్రయాణ వేగమునకు, మనో ప్రయాణ వేగమునకు శ్వాసయే ఆధారమని తెలియును.

శ్వాస ప్రవాహమున మనసు లగ్నమగును. శ్వాస నెమ్మదించినచో మనసు నెమ్మదించును. మనసు నెమ్మదించినచో శ్వాస నెమ్మదించును. కావున మనసు నెమ్మదించ వలెనన్నచో శ్వాసను నెమ్మదిగ నిర్వర్తించవలెను. మనసు వేగముగ పనిచేయు వారియందు శ్వాస కూడ వేగముగ పనిచేయుచు నుండును. అట్టివారి శ్వాస బుసలు కొట్టుచున్నట్లుగ యుండును. ఇది రజోగుణ పూరితమైన శ్వాస.

మనసు లగ్నము చేసి శ్వాసను నెమ్మదిగ పీల్చుట అభ్యాసమున రెండవ మెట్టు. ఎంత నెమ్మదిగ శ్వాసను పీల్చిన మనసు అంత నెమ్మదించును. పీల్చినంత నెమ్మదిగనే వదలుట కూడ చేయవలెను. పీల్చుట, వదలుట నెమ్మది యగుకొలది మనసు నిదానమగు చుండును.

నిదాన మగుచున్న మనసునకు ప్రశాంతత రుచి తెలియును. ఈ ప్రశాంతత రుచిగొనిన మనసు మరింత ప్రశాంతతకై మరింత నెమ్మదిగ పీల్చుట, వదలుట చేయును. ఈ అభ్యాసమున మనోశాంతి అనునది యిట్లు అప్రయత్నముగ లభించును.

మనోశాంతియే ధ్యేయముగ ప్రస్తుతకాలమున ధ్యానములు బోధింపబడుచున్నవి. వాస్తవమునకు మనోశాంతి నిజమగు ధ్యానమునకు ఆరంభము. ధ్యేయము కాదు, అంతము కాదు. మనోశాంతి ఆధారముగ ప్రాణాయామ యజ్ఞము ఆరంభమై ప్రత్యాహార, ధారణ స్థితులను దాటి ప్రజ్ఞ ధ్యానమును చేరును.

అందులకే భగవానుని బోధ ధ్యానమును గూర్చి తరువాత అధ్యాయమైన ఆరవ అధ్యాయమున వున్నది. నాలుగవ అధ్యాయమగు జ్ఞాన యోగమున- యోగమున నాలుగవ అంగమైన ప్రాణాయామమును బోధించుట పతంజలి యోగశాస్త్రమునకు, భగవద్గీతకు గల సమన్వయము.

ప్రశాంతతో కూడిన మనస్సు శ్వాసను నెమ్మదిగ పీల్చుటతో పాటు పూర్ణముగ పీల్చుట చేయును. శ్వాసనెంత పూర్ణముగ పీల్చినచో అంత పూర్ణముగ వదలుట జరుగును. పూర్ణముగ పీల్చుట వలన ప్రాణావాయువు దేహమున పూర్ణముగ నిండును. పూర్ణముగ వదలుట వలన అపాన వాయువు పూర్ణముగ బయలు వెడలును.

అపానము పూర్ణముగ బయలు వెడలినచో దేహమందలి మలినములు బైటకు నెట్టబడును. మలినములు నెట్టబడుట, ప్రాణము పీల్చబడుట కారణముగ ఈ అభ్యాసమున దొరకు రెండవ బహుమతి ప్రాణశక్తి. క్రమముగ దేహము ఆరోగ్య వంతమగుటకు క్రొత్తగా కొనివచ్చిన ప్రాణము సహకరించును. ప్రాణశక్తి పెరుగుట, మలినములు తొలగుట అనునది నిరంతరము జరుగు ప్రాణాయామము అభ్యాసమున మరియొక భాగము.

ప్రాణమును అనేక విధములుగ దేహము అందుకొను చుండును. ఆహారము అందులో ఒక భాగము. మనసును లగ్నము చేసి శ్వాసను నెమ్మదిగ పీల్చుట, వదలుట, పూర్ణముగ పీల్చుట, వదలుట కారణముగ శ్వాస క్రమ బద్ధము చెందుట జరుగును.

మనసు ప్రశాంతత చెందు చుండును. ప్రాణశక్తి పెరుగుచు నుండును. ఉచ్ఛ్వాస నుండి పొందు ప్రాణవాయువు వలసిన ప్రాణశక్తిని దేహమున కిచ్చుచుండును. అట్టివారు నియతాహారు లగుదురు. అనగా సహజముగ వారి ఆహారము నియమింపబడును. ఇదియొక సిద్ధి.

వీరు ఆహారమును అల్పముగనే స్వీకరించినను శక్తివంతులై యుందురు, సులభముగ అలసట చెందరు. దేహము తేలిక పడుచు పలుచనై కాంతివంత మగుచుండును. దేహమున శుభమగు మార్పులు ఈ విధముగ శ్వాస నభ్యసించుటవలన వచ్చును. శ్వాస నుండి వలసిన ప్రాణశక్తి లభించుటచే ఆహారము నందు నియమము

సహజముగ ఏర్పడును.

ఆహారము తగ్గుట జరుగునే కాని చేయుటగ నుండదు. తగ్గించుట చేయువారు అకస్మాత్తుగ ఎక్కువ తినుచుందురు. ఎక్కువ తినుట, తక్కువ తినుట వలన దేహమునకు అవ్యవస్థత కలిగించును. ఈ అవస్థకు గురియగు దేహము, అస్వస్థతకు కారణమగును. ఉపవాసములు చేయువారు, ఎక్కువగను, తక్కువగను తినువారు యోగమున కనర్హులు.

యోగజీవనము నిర్మల సెలయేరువలె ప్రవహించవలెనే కాని వరదవలె కాదు. పై కారణముగనే భగవద్గీత యందు నియతాహార విషయము 30వ శ్లోకమున తెలుపబడెను. 29వ శ్లోకమున ప్రాణమును గూర్చిన సాధన తెలుపబడినది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

03 Dec 2020

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 174

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 174 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భరద్వాజ మహర్షి - 5 🌻

31. భరద్వాజుడు ఇంకా చెప్పడు: “రాజా! అరామాల్లో, వేశ్యా వాటికల్లో, సత్రాల్లో, మదిరాల్లో, స్నాన-పానప్రదేశాల్లో దొంగలు చేరుతూ ఉంటారు. జార, చోరులవల్ల ప్రజలకు భయం ఉంటుంది. అందుకని వాళ్ళను పట్టుకుని దండించాలి. అది పరిపాలనలో ప్రథమధర్మం. ప్రజాక్షేమం కోసమని ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నదో నువ్వు గమనించాలి.

32. ఎవరి గురించో మరెవరో ఉత్తమ కులస్థుడనీ, పుణ్యాత్ముడనీ, చాలా మంచివాడనీ చెబుతారు. అది తీసుకుని నివు నమ్మవద్దు. అలాగని వాడిని అక్కడే అనుమానించనూవద్దు” అని చెప్పాడు.

33. నమ్మవద్దు, అనుమానించవద్దు అంటే, మరి ఏం చెయ్యాలి! పరీక్ష చేయాలి. పరీక్షించాలి వాళ్ళను. తన మనిషినే వాడిదగ్గరికి పంపించి పరీక్షించాలి.

34. రాజు తన మనిషిని అనుమానంకలిగినవాడి దగ్గరికి పంపించి ఎట్లా పరీక్షిస్తాడంటే; రాజు యొక్క అంతరంగికుడు, ఉద్యోగంలో కొత్తగాచేరిన వాడిదగ్గరికివెళ్ళి, “మన రాజు చాలా దుర్మార్గుడు. అందరి మనసులలోనూ ఆయన మీద క్రోధం ఉంది. ఎప్పుడో సమయం చూచి మేము తిరుగుబాటు చేద్దామనుకుంటున్నాము నువ్వేమంటావు? ఆయన తమ్ముడొకడు మంచివాడున్నాడు; ఆయనకు రాజ్యమొస్తే సుఖపడతాం మనం. నిన్ను రేపు ఆయన దగ్గరికి తీసుకెళతాను” అంటాడు. అప్పుడు ఆ కొత్తవాడు, “అలాగా! రేపు వెడదాం” అని కనుక అంటే, మర్నాడు వాడిని పంపించెయ్యాలి. అదీ పరీక్ష చేయటమంటే! దానితో వీడి నిజస్వభావం బయటపడిపోతుంది.

35. వాడికి ఆశపెట్టి, ధనాశపెట్టి పరీక్ష చేయాలి. అనుమానించినట్లు కనబడకూడదు. అలాగని గుడ్డిగా నమ్మనేకూడదు. ఈ ప్రకారంగా ప్రతివాడినీకూడా పరీక్షించాలి.

గిల్లికజ్జాలు పెట్టుకొని, చిన్నచిన్న కారణాలకోసం ఎవరూకూడా బలమయినవాడితో శత్రుత్వం పెట్టుకోకూడదు. రాజు చిన్నచిన్న విషయాలను అన్నిటినీకూడా ఉదారస్వభావంతో వదిలి పెట్టాలి. కాని వాటిని మాత్రం వెతుకుతూ ఉండాలి.

36. సాధారణంగా మనం తేలు, పాము ఎక్కడుందోఅని వెలుతురులో పరీక్షించినట్లు, పాలకుడు శత్రువులను వెతుకుతూ ఉండాలి. ఇవాళ ఒకడు మనకు అపచారంచేసాడు అంటే, వాడిని గురించి చాలా జాగ్రత్తవహించి ఎప్పుడూ పరిశీలన చేస్తూండాలి. మనమే వైరం పెట్టుకోకూడదు. చిన్న నేరాలన్నింటినీ క్షమించి వదిలివేయాలి.

37. హృదయంలో ఒకడిమీద ద్వేషం పెట్టుకోవటము, అతడంటే తనకు ఇష్టంలేదని అందరిలోనూ అనటము, వాడిమీద వైరభావము పెట్టుకోవడము, ఇట్లాంటివి ఉండకూడదు. ఎందుకంటే తన ఇస్టాఇస్టాలకు అక్కడ తావులేదు. అది Public administration. ప్రతీవాడికి ఏదో స్వభావం ఉంటుంది. ఏదో మతం ఉంటుంది. వాడిని dislike చేసినప్పటికీకూడా వాడితో రాజు వైరం పెట్టుకోకూడదని స్నేహమే పాటించాలని భరద్వాజుడు రాజనీతి బోధించాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

03 Dec 2020

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 113

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 113 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. మానసిక గోళము - మనోభువనము - ఆరవ భూమిక - 18 🌻

472. సంస్కారములున్నంతవరకు, సృష్టి నిలిచి యుండును, భగవంతుడు మరుగుపడి యుండును.

473. సంస్కారములు నాశనమైనచో సృష్టి అదృశ్యమగును. భగవంతుడు కాన్పించును.

474. సంస్కారముల వలననే, సృష్టిలో నిద్రావస్థయు, జాగ్రదవస్థయు పగటి జీవితమును స్థాపింపబడుచున్నవి.

475. భగవంతుడు రూపముతో తాదాత్మ్యము చెందుటకు సంస్కారములే కారణము.

476. సంస్కారములే అనుభవమును ఇచ్చును.

477. అది ప్రేరణము యొక్క పరిమాణు ప్రమాణమైన తొలి సంస్కారమే, ఆత్మ యొక్క అనంత చైతన్య రాహిత్య స్థితికి, పరమాణు ప్రమాణమైన తొలి చైతన్యము నొసంగినది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

03 Dec 2020

శ్రీ విష్ణు సహస్ర నామములు - 77 / Sri Vishnu Sahasra Namavali - 77

🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 77 / Sri Vishnu Sahasra Namavali - 77 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷

పూర్వాషాడ నక్షత్ర ప్రధమ పాద శ్లోకం

🍀 77. విశ్వమూర్తిర్మహామూర్తిః దీప్తమూర్తి రమూర్తిమాన్|
అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తి శ్శతాననః|| 77 🌻

🍀 717. విశ్వమూర్తిః -
విశ్వమే తన దేహముగా గలవాడు.

🍀 718. మహామూర్తిః -
గొప్ప దేహము గలవాడు.

🍀 719. దీప్తమూర్తిః -
సంపూర్ణ జ్ఞానముతో ప్రకాశించువాడు.

🍀 720. అమూర్తిమాన్ -
కర్మాధీనమైన దేహము లేనివాడు.

🍀 721. అనేకమూర్తిః -
అనేక మూర్తులు తానైనవాడు.

🍀 722. అవ్యక్తః -
అగోచరుడు.

🍀 723. శతమూర్తిః -
అనేక దేహములు ధరించినవాడు.

🍀 724. శతాననః -
అనంత ముఖములు గలవాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Vishnu Sahasra Namavali - 77 🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj

🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷

Sloka for Poorvashada 1st Padam

🌻 77. viśvamūrtir mahāmūrtir dīptamūrtiramūrtimān |
anekamūrtiravyaktaḥ śatamūrtiḥ śatānanaḥ || 77 || 🌻

🌻 717. Viśvamūrtiḥ:
One who, being the soul of all, has the whole universe as His body.

🌻 718. Mahāmūrtiḥ:
One with an enormous form stretched on a bedstead constituted of the serpent Adisesha.

🌻 719. Dīptamūrtiḥ:
One with a luminous form of knowledge.

🌻 720. Amūrtimān:
He who is without a body born of Karma.

🌻 721. Anekamūrtiḥ:
One who assumes several bodies in His incarnations as it pleases Him in or to help the world.

🌻 722. Avyaktaḥ:
One who cannot be clearly described as 'This' even though He has many forms.

🌻 723. Śatamūrtiḥ:
One who, though He is of the nature of Pure Consciousness, assumes different forms for temporary purposes.

🌻 724. Śatānanaḥ:
He is called one with a hundred faces to indicate that He has several forms.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

03 Dec 2020

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 144, 145 / Vishnu Sahasranama Contemplation - 144, 145

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 144, 145 / Vishnu Sahasranama Contemplation - 144, 145 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 144. సహిష్ణుః, सहिष्णुः, Sahiṣṇuḥ🌻

ఓం సహిష్ణవే నమః | ॐ सहिष्णवे नमः |

సహతే సహించును. సహించశక్తి కలవాడై యుండును. శ్రీ విష్ణువు హిరణ్యాక్షాదులను సహించు తన శక్తిచే అణగ ద్రొక్కును; తిరస్కరించును.

:: పోతన భాగవతము - ఆష్టమ స్కంధము, గజేంద్ర మోక్షము ::

వినువీధిం జనుదేరఁ గాంచి రమరుల్ విష్ణున్ సురారాతి జీ

వనసంపత్తి నిరాకరిష్ణుఁ గరుణావర్ధిష్ణు యోగీంద్ర హృ

ద్వనవర్తిష్ణు సహిష్ణు భక్తజనబృంద ప్రాభావాలంకరి

ష్ణు నవోఢోల్లసదిందిరా పరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణునిన్‌.

రాక్షసుల బ్రతుకు తెరువులను తొలగద్రోసేవాడూ, నిండు దయతో యోగీంద్రుల మనస్సులలో నివాసం చేసేవాడూ, ఓర్పుతో భక్తుల గొప్పతనాన్ని పెంపొందించేవాడూ, తొలి ప్రాయంతో చెలువొందే లక్ష్మీదేవిని సేవించేవాడూ, జయశీలుడూ, కాంతిమంతుడూ అయిన విష్ణుదేవుడు ఆకాశమార్గంలో వస్తుండగా దేవతలు చూచినారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 144 🌹

📚. Prasad Bharadwaj

🌻144. hiṣṇave namaḥ🌻

OM Sahiṣṇave namaḥ

Sahate forebears. He is the one with patience and forbearance. Lord Viṣṇu terminated demons like Hiraṇyākṣa with his endurance and patience.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः ।
अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः ॥ १६ ॥

భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః ।
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ॥ ౧౬ ॥

Bhrājiṣṇurbhojanaṃ bhoktā sahiṣṇurjagadādijaḥ ।
Anagho vijayo jetā viśvayoniḥ punarvasuḥ ॥ 16 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 145 / Vishnu Sahasranama Contemplation - 145 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻145. జగదాదిజః, जगदादिजः, Jagadādijaḥ🌻

ఓం జగదాదిజాయ నమః | ॐ जगदादिजाय नमः | OM Jagadādijāya namaḥ

జగదాదిజః, जगदादिजः, Jagadādijaḥ

జగత్తులకు ఆదియందు జనించువాడు శ్రీ మహా విష్ణువు; హిరణ్యగర్భుడు మొదలగు తత్త్వముల రూపమున ఉండువాడు.

:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::

సీ. గురుశక్తితో విరాట్పురుషుండు సంభవం బయ్యే, నయ్యండంబు నర్థిఁబొదివి

యంబు ముఖావరణంబు లొక్కొకటికి దశగుణీతంబులై తవిలి యావ

రణములై యుండును, గ్రమమున లోకంబులకు "మేలుకట్లు" పోలికఁ దనర్చి పంకజోదరుని రూపము విలసించును, లోలత జలములోఁ దేలుచున్న

తే. హేమ మయమైన యండంబులో మహాను, భావుఁ డభవుండు హరి దేవదేవుఁ డఖిల

జేత నారాయణుఁడు ప్రవేశించి యపుడు, విష్ణుపద భేదనంబు గావించి యందు.

ఆ అండంలో మహత్తరమైన శక్తితో విరాట్‍పురుషుడు విరాజిల్లు తుంటాడు. ఆ అండాన్ని పొదువుకొని పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తు అనే ఆవరణాలు ఒకదానికంటే ఒకటి పదింతలు ప్రమాణం కలిగి ఉంటాయి. లోకాలకు మేల్కట్టు చాందినీవలె ఒప్పియున్న ఆ పొరలలోనుంచి విష్ణుదేవుని తేజస్సు ప్రకాశిస్తూ ఉంటుంది. జలంలో తేలుతూ ఉన్న బంగారుమయమైన ఆ అండంలో మహానుభావుడు, అభవుడు, శ్రీహరి, దేవదేవుడు, విశ్వవిజేత అయిన నారాయణుడు ప్రవేశించి గగనమండలాన్ని భేదించి వేస్తాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 145🌹

📚Prasad Bharadwaj

🌻145. Jagadādijaḥ🌻

OM Jagadādijāya namaḥ

He Himself originates the universe in the beginning in the form of Hiraṇyagarbha.

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 26

Etānyasaṃhatya yadā mahadādīni sapta vai,

Kālakarmaguṇopeto jagadādirūpāviśat. (50)

:: श्रीमद्भागवते - तृतीयस्कन्धे, षड्विंशोऽध्यायः ::

एतान्यसंहत्य यदा महदादीनि सप्त वै ।

कालकर्मगुणोपेतो जगदादिरूपाविशत् ॥ ५० ॥

When all these elements were unmixed, He, the origin of creation, along with time, work, and the qualities of the modes of material nature, entered into the universe with the total material energy in seven divisions (the five material elements, the total energy (mahat-tattva) and the ego).

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः ।
अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः ॥ १६ ॥

భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః ।
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ॥ ౧౬ ॥

Bhrājiṣṇurbhojanaṃ bhoktā sahiṣṇurjagadādijaḥ ।
Anagho vijayo jetā viśvayoniḥ punarvasuḥ ॥ 16 ॥

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

03 Dec 2020

Please join and share with your friends. 
You can find All my messages from beginning in these groups.

Facebook group : . చైతన్య విజ్ఞానం – Chaitanya Vijnanam
https://www.facebook.com/groups/465726374213849/

Facebook Hastags: (Search these Hastags on Facebook)
#ChaitanyaVijnanam                 #PrasadBhardwaj

WhatsApp: . AMRUTASYA PUTRAAHA
https://chat.whatsapp.com/HrBxBAaKb0g73IXeMhwXmx

Whatsapp Group: గాయత్రి శక్తి Gāyatri Śakti
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin

Whatsapp Group: Vedas And Puranas
https://chat.whatsapp.com/HPdh0EYd5vdC3l6o0sQwZr

Telegram group : . చైతన్య విజ్ఞానం – Chaitanya Vijnanam
https://t.me/ChaitanyaVijnanam

Telegram group: విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama.
Exclusively for శ్రీ మాహా విష్ణువు సంబంధిత జ్ఞానం కోసం.
https://t.me/vishnusahasra

Telegram group: ్రీ దత్తాత్రేయ చైతన్యం – Sri Datta Chaitanya
https://t.me/joinchat/Aug7pkulz9hgXzvrPfoVaA

Telegram group: శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 
https://t.me/srilalithadevi

Telegram: శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam
https://t.me/SriMataChaitanyam

Telegram channel : . చైతన్య విజ్ఞానం – Chaitanya Vijnanam
https://t.me/Spiritual_Wisdom

Telegram Channel: Seeds Of Consciousness
This channel is dedicated to Seeds of consciousness given by various masters.
https://t.me/Seeds_Of_Consciousness

Indaichat : Join Indaichat 

Blogs/Websites:
www.incarnation14.wordpress.com

www.dailybhakthimessages.blogspot.com

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 120

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 120 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము - 50 🌻

శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ గుణములు గల పృథ్వి స్థూలమైనది. శబ్ద, స్పర్శ, రూప, రస గుణములు గల జలము పృథ్వి కన్న సూక్ష్మము. శబ్ద, స్పర్శ, రూప గుణములు గల అగ్ని జలము కన్న సూక్ష్మము. శబ్ద, స్పర్శ గుణములు గల వాయువు అగ్ని కన్న సూక్ష్మము. శబ్ద గుణమే గల ఆకాశము వాయువు కన్న సూక్ష్మము.

పంచభూతములు ఒక్కొక్క గుణము తగ్గిన కొలదీ సూక్ష్మమగుచున్నది. ‘నిశ్శబ్దోబ్రహ్మముచ్యతే’ అని చెప్పబడినటుల ఏ గుణము లేని పరమాత్మ అతిసూక్ష్మము. ఈ విధముగా స్థూలమైన పృథ్వికంటే ఆకాశము సూక్ష్మమని గ్రహించగలుగుచున్నాము.

అదే విధముగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను ఏ గుణము లేని పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మమని గ్రహింపవచ్చును కదా! అవ్యక్తము విత్తనము వంటిది. ఆ విత్తనము ఉబ్బినట్లు ఉండునది మహతత్త్వము. దాని నుండి బయటకు వచ్చిన మొలకవంటిది అహంకార తత్వము. కాండము, కొమ్మలు, ఆకులు మొదలగునవి ఆకాశాది పంచభూతములుగా యున్నవి.

మరియు ఇవి కార్యకారణరూపముగా నున్నవి. మరియు ఆద్యంతములు కలిగియున్నవి. ఏ కారణము లేని ఆత్మ, ఆద్యంతములు లేనిదిగాను, అవ్యయము నిత్యమునై యున్నది. శాశ్వతమైన ఇట్టి తత్త్వమును తెలుసుకున్నవారు ముక్తులగుదురు.

చాలా స్పష్టంగా రెండు ఉపమానాలను తీసుకున్నారు. ఒక్కటేమిటి అంటే, పంచభూత విచారణ.

రెండవది ఎట్లా సృష్టి క్రమము ఏర్పడుతున్నది? ఈ రెండు అంశాలని ఇక్కడ బోధించే ప్రయత్నము చేస్తున్నారు. మనందరమూ దేని మీద ఆధారపడి ఉన్నాము అంటే, భూమి మీద ఆధారపడి ఉన్నాము అని, ప్రతీ ఒక్కరూ చెబుతారు. కారణము ఈ నేల మీదే ఉన్నాం కాబట్టి. భూమి మీద ఆధారపడి ఉన్నాము అంటున్నామా? పరమాత్మ మీద ఆధారపడి ఉన్నాము అంటున్నామా? అనేది ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే, ఈ నేలే కదండీ మనకు ఆధారము.

ఈ నేల లేకపోతే మనం ఏం చేయగలుగుతాము? ఎక్కడ ఉంటాము? ఏ రకంగా జీవిస్తాము? ఏ రకమైన అవకాశాలున్నాయి మనకు. ఈ భూమిలేకపోతే? ఏమీ లేదండీ అని అన్నామనుకో, అప్పుడు మనము శబ్ద స్పర్శ రూప రస గంధాలనే ఐదు గుణాలతోనూ, ఈ పృథ్వి మీద జీవిస్తున్నటువంటి వాళ్ళము.

అయితే ఈ పంచభూతాలు.. ఏవయ్యా? భూమి ఉంటే సరిపోతుందా? భూమి మీద నీళ్ళు అవసరం లేదా? అని అడిగామనుకోండి? అయ్యో! నీళ్ళు లేకపోతే ఎట్లా జీవిస్తామండీ? నీరే ప్రాణాధారము. నీళ్ళు లేకపోతే అసలు ప్రాణ శక్తే లేదు. నీళ్ళు త్రాగకుండా ఒక గంట కూడా ఉండలేమండీ. నీళ్ళు ప్రతీ గంట గంటకూ అవసరమేనండీ! నీళ్ళు లేకపోతే ఏ జీవ లక్షణమూ కుదరదండీ! అబ్బో నీళ్ళు చాలా ఇంపార్టెంట్‌ అండీ! నీళ్ళు లేకపోతే నడవదండీ.

మరి ఇందాక ఏమన్నావయ్యా? పృథ్వే ఇంపార్టెంట్‌ అన్నావు కదా! పృథ్వే లేకపోతే నీళ్ళే లేవు కదండీ అంటావు! కాబట్టి, మానవులందరూ, ఇప్పుడు ఏమైపోయిందీ అంటే, నీకు ఆకాశం ప్రధానమా? పృథ్వి ప్రధానమా? అంటే, పృథ్వే ప్రధానం. ఎందుకంటే ఆకాశము వలన నేను జీవించడం లేదు అనుకుంటున్నాడు కాబట్టి.

ఏమయ్యా! మరి నీకు నీళ్ళు అవసరం లేదా? నిప్పు అవసరం లేదా గాలి అవసరం లేదా? అంటే, అవి లేకుండా ఎట్లా జీవిస్తామండీ అంటాడు.

కాబట్టి, నీవు జీవన పర్యంతమూ దేని మీద ఆధారపడియున్నావయ్యా అంటే, పంచభూతాల మీద ఆధారపడియున్నావు. అందుకని, ఈ దేహం పేరేమిటి? పాంచభౌతిక దేహము. పంచభూత లక్షణ సముదాయము చేత, నీకు దేహంలో ఉన్నటువంటి ఆర్గాన్స్‌ అన్నీ ఏర్పడ్డాయి. నీ దేహములో వున్న ఇంద్రియాలు అన్నీ ఏర్పడ్డాయి. నీ దేహలో ఉన్న గోళకాలన్నీ ఏర్పడ్డాయి.

నీ వ్యవహారమంతా ఈ పంచభూతాలపై ఆధారపడే జరగుతుంది. ఎట్లా జరుగుతుంది అనే విచారణ మాత్రం చేయావు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే ఐదు తన్మాత్రల యొక్క జ్ఞానాన్ని పూర్తిగా కలిగియున్నటువంటిది, పూర్తి విషయ వ్యావృత్తి కలిగినటువంటిదీ పృథ్వి తత్వము సాత్వికమైనటువంటి బోధను ప్రారంభిస్తున్నారు.

తత్‌ త్వం ఈ పృథ్వి దేని మీద ఆధారపడి ఉంది? దీనకంటే సూక్ష్మమైనటువంటి, స్థూలమంతా సూక్ష్మం మీద ఆధారపడి యున్నది. సూక్ష్మము సూక్ష్మతరంమీద ఆధారపడి యున్నది.

ఆ సూక్ష్మతరం సూక్ష్మతమమైనటువంటి పరమాత్మ మీద ఆధారపడి యున్నది. ఈ ఆధార ఆధేయ విమర్శని చెబుతున్నారన్నమాట! కాబట్టి, ఆకాశంలో నుంచి మొట్టమొదట వాయువు వచ్చింది. వాయువు నుంచి అగ్ని వచ్చింది.

అగ్ని నుంచి జలము వచ్చింది. జలము నుంచి పృథ్వి వచ్చింది. ఎందుకు చెప్పారు అంటే, రేపు విరమణ సమయంలో కూడా ఇదే రీతిగా విరమించబడుతుంది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

03 Dec 2020

శ్రీ శివ మహా పురాణము - 285

🌹 . శ్రీ శివ మహా పురాణము - 285 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

69. అధ్యాయము - 24

🌻. శ్రీరామునకు పరీక్ష - 1 🌻

నారదుడిట్లు పలికెను -

ఓ బ్రహ్మా! విధీ! ప్రజాపతీ! మహాప్రాజ్ఞా! కృపాసింధో! సతీపరమేశ్వరుల మంగళకరమగు యశస్సును వినిపించితివి (1). ఇపుడు పవిత్రము, ఉత్తమము అగు ఆ యశస్సును ప్రీతితో ఇంకనూ చెప్పుము. ఆ దంపతులైన సతీపరమేశ్వరులు అచట ఉన్నవారై ఏమి చరితమును చేసిరి?(2).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! నేను సతీశివుల చరిత్రను చెప్పెదను. ప్రేమతో వినుము. వారు అచట ప్రతిదినము అన్నివేళలా లోకపు పోకడను అనుసరించి క్రీడించిరి (3). ఓ మహర్షీ! అపుడు మహాదేవి యగు సతి శంకరుడు నిద్రించు చుండగా వియోగమును పొందినదని కొందరు ప్రాజ్ఞులు చెప్పుచున్నారు (4). ఓ మహర్షీ! శబ్దార్ధముల వలె కలిసి ఉండే చిత్స్వరూపులగు ఆ శక్తీశులకు ఏ కాలమునందైననూ వాస్తవమగు వియోగము ఎట్లు సంభవమగును?(5). కాని లీలల యందు అభిరుచి గల వారిద్దరికి సర్వము సంభవమే యగును. ఏలయన, సతీశివులు లోకమర్యాదననుసరించి లీలలను ప్రకటించెదరు (6).

ఆ దక్ష పుత్రి తన తండ్రి చేసిన యజ్ఞములో శంభునకు ఆదరము లేకుండుటను గని, శంభునిచే విడువ బడి, ఆ యజ్ఞశాలయందు దేహత్యాగమును చేసెను (7).

ఆ సతీ దేవి మరల హిమవంతునకు కుమారై యై జన్మించి, పార్వతి యను పేరును బడసి, తీవ్రమగు తపస్సును ఆచరించి, శివుని వివాహమాడెను (8).

సూతుడిట్లునెను -

ఆ నారదుడు ఆ బ్రహ్మ యొక్క ఈ మాటను విని, శివాశివుల గొప్ప యశస్సును గురించి బ్రహ్మను ప్రశ్నించెను (9).

నారుదుడిట్లు పలికెను -

ఓ విష్ణు శిష్యా! మహాత్మా! విధీ! లోకాచారమును అనుకరించే శివాశివుల చరిత్రమును నాకు విస్తరముగా చెప్పుము (10). శంకరుడు ప్రాణములకంటె ప్రియతరమగు భార్యను విడనాడుటకు కారణమేమి? తండ్రీ! ఇది నాకు విచిత్రముగ తోచుచున్నది. కాన చెప్పుము (11).

నీ కుమారుడు యజ్ఞమునందు శివుని అనాదరము చేయుటకు కారణమేమి? తండ్రి చేయుచున్న యజ్ఞమునకు వెళ్లిన ఆ సతి దేహమునెట్లు త్యజించెను? (12). తరువాత ఏమాయెను? మహేశ్వరుడేమి చేసెను? ఆ వృత్తాంతమునంతనూ నాకు చక్కగా చెప్పుము. నేను ఆవృత్తాంతమును వినుట యందు శ్రద్ధ గలవాడను (13).

బ్రహ్మ ఇట్లు పలికెను -

కుమారా! నారాదా! నీవు నా కుమారులలో శ్రేష్ఠుడవు. గొప్ప బుద్ధి శాలివి.చంద్ర శేఖరుని చరితమును మునులతో గూడి పరమప్రీతితో వినుము (14). విష్ణువు మొదలగు దేవతలచే సేవింపబడే, పరబ్రహ్మయగు మహేశ్వరునకు నమస్కరించి, అత్యద్భుతమగు ఆయన చరితమును చెప్పెదను (15). ఇదంతా శివలీల. స్వతంత్రుడు, నిర్వికారుడునగు ఆ ప్రభువు అనేక లీలలను ప్రదర్శించును. ఆ సతీదేవియూ ఆయనవలెనే లీలలను ప్రదర్శించును (16).

ఓ మహర్షీ! ఆయన తక్క మరియెవ్వరు ఆయన చేసిన కర్మలను చేయగల్గుదురు? ఆయనయే పరమాత్మ, పరబ్రహ్మ, పరమేశ్వరుడు (17).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

03 Dec 2020

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 125, 126 / Sri Lalitha Chaitanya Vijnanam - 125, 126

🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 67 / Sri Lalitha Sahasra Nama Stotram - 67 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 125, 126 / Sri Lalitha Chaitanya Vijnanam - 125, 126 🌹

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 125 / Sri Lalitha Chaitanya Vijnanam - 125 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

భక్తిప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, భయాపహా |
శాంభవీ, శారదారాధ్యా, శర్వాణీ, శర్మదాయినీ ‖ 42 ‖

🌻 125. 'శర్మదాయినీ'🌻

సుఖము నొసగునది శ్రీలలిత అని అర్థము.

శర్మ అను బిరుదు నిర్దిష్టముగను, నిశితముగను క్రతువులను ఆచరించు వారి కొసగుదురు. క్రతువనగా నియత జీవనము. శ్రీలలితను ఆరాధించువారు క్రమబద్ధములగు జీవితములను నడుపుట జరుగును. ఆరాధన యందలి ఆర్ధత, క్రతుబద్ధత కారణములుగ మనసు అట్టి క్రమమును పొంది జీవితమున అన్ని విషయముల యందు అదే క్రమమును వ్యాపింపచేయును.

అట్టివారి ఆహారము, వ్యవహారము, భాషణము అంతయు సహజముగ క్రమబద్ధమగును. దానివలన అంతఃసుఖము కలుగును. వారిని బాహ్య సన్నివేశములు చలింప చేయవు. ఈ విధముగ శ్రీలలిత శాశ్వతమగు సుఖమును ఒసగునది అగుచున్నది.

'సురేశః శరణం శర్మ' అనుచు విష్ణు సహస్రనామము నందు కూడ శర్మ శబ్దము కలదు. ఏ దేవత నారాధించినను, విధివిధానముగ ఆరాధించినచో సుఖము కలుగును. రజోగుణ ఆరాధనము, తమోగుణ ఆరాధనము అట్టి సుఖము నీయజాలవు. ఆరాధనయందు సాత్విక గుణమే సుఖమునకు ముఖద్వారము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 125 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Śarmadāyinī शर्मदायिनी (125) 🌻

Śarma means happiness. She confers happiness on Her devotees. Conferring happiness is Her habit as She is the Divine Mother.

Please refer nāma-s 192, 953 and 968 which convey the same meaning.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 126 / Sri Lalitha Chaitanya Vijnanam - 126 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా |
శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా ‖ 43 ‖

🌻 126. 'శాంకరీ 🌻

శంకరుని భార్య శ్రీలలిత అని అర్థము.

శంకరుడనగా సుఖకరుడు అని అర్థము. రజస్తమో గుణములను విసర్జించి సత్వము నాశ్రయించి ప్రసన్న వదనుడైన దైవమును ధ్యానించుట వలన సుఖము కలుగును.

శంకరుడు ప్రసన్న వదనుడైన నారాయణుని సతతము ఆరాధించుచు నుండుట వలన శంకరత్వమును, మయస్కరత్వమును పొందినాడు.

అందువలన శంకరుని ముఖమున నిరుపమానమగు ప్రశాంతత యుండునని పురాణములు తెలుపుచున్నవి. అట్టి శంకరుని ఆరాధించి ఆయనను పొందినది పార్వతీదేవి. అందువలన ఆమె శాంకరి అయినది.

శంకరుడు ఏకాదశ రుద్రులలో నొకడు. రుద్రమూర్తి సైతము తపస్సు వలన శాంతమును, సుఖమును పొందెను.

అందువలన శాంతమును, సుఖమును పొందగోరువారు అర్ధనిమీలిత నేత్రుడై చిరుదరహాసముతో ధ్యానము చేయుచున్న శివుని శ్రీగురువుగ ఆశ్రయింతురు. లేదా భగవద్గీతయందు భగవంతునిచే పేర్కొనబడిన సత్వగుణము నుపాసించి కూడ శాంతమును పొందవచ్చును.

శ్రీలలిత అట్టి సత్వగుణ సముదాయమునకు కూడ అధిదేవత. ఆమె సుందర సుమనోహర రూపమును ఆరాధించుచు సత్వగుణము నాశ్రయించి జీవించువారికి ఆమెయే స్వయముగ సుఖ శాంతులను ప్రసాదించ గలదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 126 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Śāṃkarī शांकरी (126) 🌻

Wife of Śaṇkarā, a form of Śiva, is known as Śāṃkarī. Śam means happiness and karā means doer. Therefore Śaṇkarā is known to give happiness and his wife Śāṇakarī has the same quality.

Śiva and Śaktī do not have any difference in qualities between them. That is why Śiva and Pārvatī are said to be father and mother of the universe.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

03 Dec 2020

3-DECEMBER-2020 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 567 / Bhagavad-Gita - 567🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 144, 145  / Vishnu Sahasranama Contemplation - 144, 145🌹
3) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 120🌹
4) 🌹. శివ మహా పురాణము - 285 🌹 
5) 🌹 Guru Geeta - Datta Vaakya - 141 🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 67 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 125, 126 / Sri Lalita Chaitanya Vijnanam - 125, 126🌹
8) 🌹. శ్రీమద్భగవద్గీత - 478 / Bhagavad-Gita - 478 🌹

10) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 88 📚
11) 🌹 Light On The Path - 42🌹
12) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 174🌹 
13) 🌹 Seeds Of Consciousness - 238 🌹   
14) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 113🌹
15) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 77 / Sri Vishnu Sahasranama - 77 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 567 / Bhagavad-Gita - 567 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 11 🌴*

11. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదిష్టో య ఇజ్యతే |
యష్టవ్యమేవేతి మన: సమాధాయ స సాత్త్విక: ||

🌷. తాత్పర్యం : 
శాస్త్రనిర్దేశానుసారము తమ విధి యని తలచబడును ఫలములు కోరనివారిచే చేయబడు యజ్ఞము యజ్ఞములందు సాత్త్విక యజ్ఞమనబడును.

🌷. భాష్యము :
ఏదేని ఒక ప్రయోజనమును మనస్సు నందుంచుకొని యజ్ఞమును నిర్వహించుట సర్వసాధారణ విషయము. కాని యజ్ఞమును ఎటువంటి కోరిక లేకుండా చేయవలెనని ఇచ్చట పేర్కొనబడినది. అది సదా స్వధర్మమనెడి దృష్టితో చేయబడవలెనని. దేవాలయములందు గాని, క్రైస్తవ ప్రార్థనా మందిరములందు గాని నిర్వహింపబడు కార్యములను మనము ఉదాహరణముగా తీసుకొనవచ్చును. 

సాధారణముగా ఆ కార్యములన్నియును ఏదేని ఒక భౌతికప్రయోజనము దృష్ట్యానే ఒనరింపబడుచుండును. కాని అవన్నియును సత్త్వగుణమునకు సంబంధించినవి కావు. కావున మనుజుడు స్వధర్మమనెడి భావనలో మందిరమునకేగి, భగవానునకు వందనముల నొసగి, పుష్పములను, ఆహారపదార్థములను సమర్పింపవలెను. 

కేవలము పూజనిమిత్తమే మందిరమున కేగుట వలన ప్రయోజనము లేదని కొందరు తలతురు. కాని భౌతికప్రయోజనార్థమై పూజలొనరించుటయు శాస్త్రములందు ఆదేశింపబడలేదు. అనగా కేవలము భగవానునకు వందనముల నొసగు నిమిత్తమే మందిరమున కేగవలెను. 

అది మనుజుని సత్త్వగుణప్రదానునిగా చేయగలదు. కనుక శాస్త్రవిధులను ఆమోదించుట మరియు దేవదేవుడైన శ్రీకృష్ణునికి వందనము నొసగుట యనెడి కార్యముల ప్రతినాగరిక మనుజుని ధర్మమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 567 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 17 - The Divisions of Faith - 11 🌴*

11. aphalākāṅkṣibhir yajño
vidhi-diṣṭo ya ijyate
yaṣṭavyam eveti manaḥ
samādhāya sa sāttvikaḥ

🌷 Translation : 
Of sacrifices, the sacrifice performed according to the directions of scripture, as a matter of duty, by those who desire no reward, is of the nature of goodness.

🌹 Purport :
The general tendency is to offer sacrifice with some purpose in mind, but here it is stated that sacrifice should be performed without any such desire. It should be done as a matter of duty. Take, for example, the performance of rituals in temples or in churches. Generally they are performed with the purpose of material benefit, but that is not in the mode of goodness. 

One should go to a temple or church as a matter of duty, offer respect to the Supreme Personality of Godhead and offer flowers and eatables without any purpose of obtaining material benefit. Everyone thinks that there is no use in going to the temple just to worship God. But worship for economic benefit is not recommended in the scriptural injunctions. 

One should go simply to offer respect to the Deity. That will place one in the mode of goodness. It is the duty of every civilized man to obey the injunctions of the scriptures and offer respect to the Supreme Personality of Godhead.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 144, 145 / Vishnu Sahasranama Contemplation - 144, 145 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻 144. సహిష్ణుః, सहिष्णुः, Sahiṣṇuḥ🌻*

*ఓం సహిష్ణవే నమః | ॐ सहिष्णवे नमः | *

సహతే సహించును. సహించశక్తి కలవాడై యుండును. శ్రీ విష్ణువు హిరణ్యాక్షాదులను సహించు తన శక్తిచే అణగ ద్రొక్కును; తిరస్కరించును.

:: పోతన భాగవతము - ఆష్టమ స్కంధము, గజేంద్ర మోక్షము ::
వినువీధిం జనుదేరఁ గాంచి రమరుల్ విష్ణున్ సురారాతి జీ
వనసంపత్తి నిరాకరిష్ణుఁ గరుణావర్ధిష్ణు యోగీంద్ర హృ
ద్వనవర్తిష్ణు సహిష్ణు భక్తజనబృంద ప్రాభావాలంకరి
ష్ణు నవోఢోల్లసదిందిరా పరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణునిన్‌.

రాక్షసుల బ్రతుకు తెరువులను తొలగద్రోసేవాడూ, నిండు దయతో యోగీంద్రుల మనస్సులలో నివాసం చేసేవాడూ, ఓర్పుతో భక్తుల గొప్పతనాన్ని పెంపొందించేవాడూ, తొలి ప్రాయంతో చెలువొందే లక్ష్మీదేవిని సేవించేవాడూ, జయశీలుడూ, కాంతిమంతుడూ అయిన విష్ణుదేవుడు ఆకాశమార్గంలో వస్తుండగా దేవతలు చూచినారు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 144🌹*
📚. Prasad Bharadwaj 

*🌻144. hiṣṇave namaḥ🌻*

*OM Sahiṣṇave namaḥ*

Sahate forebears. He is the one with patience and forbearance. Lord Viṣṇu terminated demons like Hiraṇyākṣa with his endurance and patience.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः ।
अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः ॥ १६ ॥

భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః ।
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ॥ ౧౬ ॥

Bhrājiṣṇurbhojanaṃ bhoktā sahiṣṇurjagadādijaḥ ।
Anagho vijayo jetā viśvayoniḥ punarvasuḥ ॥ 16 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 145 / Vishnu Sahasranama Contemplation - 145 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻145. జగదాదిజః, जगदादिजः, Jagadādijaḥ🌻*

*ఓం జగదాదిజాయ నమః | ॐ जगदादिजाय नमः | OM Jagadādijāya namaḥ*

జగదాదిజః, जगदादिजः, Jagadādijaḥ
జగత్తులకు ఆదియందు జనించువాడు శ్రీ మహా విష్ణువు; హిరణ్యగర్భుడు మొదలగు తత్త్వముల రూపమున ఉండువాడు.

:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
సీ. గురుశక్తితో విరాట్పురుషుండు సంభవం బయ్యే, నయ్యండంబు నర్థిఁబొదివి
యంబు ముఖావరణంబు లొక్కొకటికి దశగుణీతంబులై తవిలి యావ
రణములై యుండును, గ్రమమున లోకంబులకు "మేలుకట్లు" పోలికఁ దనర్చి పంకజోదరుని రూపము విలసించును, లోలత జలములోఁ దేలుచున్న
తే. హేమ మయమైన యండంబులో మహాను, భావుఁ డభవుండు హరి దేవదేవుఁ డఖిల
జేత నారాయణుఁడు ప్రవేశించి యపుడు, విష్ణుపద భేదనంబు గావించి యందు.

ఆ అండంలో మహత్తరమైన శక్తితో విరాట్‍పురుషుడు విరాజిల్లు తుంటాడు. ఆ అండాన్ని పొదువుకొని పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తు అనే ఆవరణాలు ఒకదానికంటే ఒకటి పదింతలు ప్రమాణం కలిగి ఉంటాయి. లోకాలకు మేల్కట్టు చాందినీవలె ఒప్పియున్న ఆ పొరలలోనుంచి విష్ణుదేవుని తేజస్సు ప్రకాశిస్తూ ఉంటుంది. జలంలో తేలుతూ ఉన్న బంగారుమయమైన ఆ అండంలో మహానుభావుడు, అభవుడు, శ్రీహరి, దేవదేవుడు, విశ్వవిజేత అయిన నారాయణుడు ప్రవేశించి గగనమండలాన్ని భేదించి వేస్తాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 145🌹*
📚Prasad Bharadwaj 

*🌻145. Jagadādijaḥ🌻*

*OM Jagadādijāya namaḥ*

He Himself originates the universe in the beginning in the form of Hiraṇyagarbha.

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 26
Etānyasaṃhatya yadā mahadādīni sapta vai,
Kālakarmaguṇopeto jagadādirūpāviśat. (50)

:: श्रीमद्भागवते - तृतीयस्कन्धे, षड्विंशोऽध्यायः ::
एतान्यसंहत्य यदा महदादीनि सप्त वै ।
कालकर्मगुणोपेतो जगदादिरूपाविशत् ॥ ५० ॥

When all these elements were unmixed, He, the origin of creation, along with time, work, and the qualities of the modes of material nature, entered into the universe with the total material energy in seven divisions (the five material elements, the total energy (mahat-tattva) and the ego).

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः ।
अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः ॥ १६ ॥

భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః ।
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ॥ ౧౬ ॥

Bhrājiṣṇurbhojanaṃ bhoktā sahiṣṇurjagadādijaḥ ।
Anagho vijayo jetā viśvayoniḥ punarvasuḥ ॥ 16 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 120 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 50 🌻*

శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ గుణములు గల పృథ్వి స్థూలమైనది. శబ్ద, స్పర్శ, రూప, రస గుణములు గల జలము పృథ్వి కన్న సూక్ష్మము. శబ్ద, స్పర్శ, రూప గుణములు గల అగ్ని జలము కన్న సూక్ష్మము. శబ్ద, స్పర్శ గుణములు గల వాయువు అగ్ని కన్న సూక్ష్మము. శబ్ద గుణమే గల ఆకాశము వాయువు కన్న సూక్ష్మము. 

పంచభూతములు ఒక్కొక్క గుణము తగ్గిన కొలదీ సూక్ష్మమగుచున్నది. ‘నిశ్శబ్దోబ్రహ్మముచ్యతే’ అని చెప్పబడినటుల ఏ గుణము లేని పరమాత్మ అతిసూక్ష్మము. ఈ విధముగా స్థూలమైన పృథ్వికంటే ఆకాశము సూక్ష్మమని గ్రహించగలుగుచున్నాము. 

అదే విధముగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను ఏ గుణము లేని పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మమని గ్రహింపవచ్చును కదా! అవ్యక్తము విత్తనము వంటిది. ఆ విత్తనము ఉబ్బినట్లు ఉండునది మహతత్త్వము. దాని నుండి బయటకు వచ్చిన మొలకవంటిది అహంకార తత్వము. కాండము, కొమ్మలు, ఆకులు మొదలగునవి ఆకాశాది పంచభూతములుగా యున్నవి. 

మరియు ఇవి కార్యకారణరూపముగా నున్నవి. మరియు ఆద్యంతములు కలిగియున్నవి. ఏ కారణము లేని ఆత్మ, ఆద్యంతములు లేనిదిగాను, అవ్యయము నిత్యమునై యున్నది. శాశ్వతమైన ఇట్టి తత్త్వమును తెలుసుకున్నవారు ముక్తులగుదురు.
        చాలా స్పష్టంగా రెండు ఉపమానాలను తీసుకున్నారు. ఒక్కటేమిటి అంటే, పంచభూత విచారణ. 

రెండవది ఎట్లా సృష్టి క్రమము ఏర్పడుతున్నది? ఈ రెండు అంశాలని ఇక్కడ బోధించే ప్రయత్నము చేస్తున్నారు. మనందరమూ దేని మీద ఆధారపడి ఉన్నాము అంటే, భూమి మీద ఆధారపడి ఉన్నాము అని, ప్రతీ ఒక్కరూ చెబుతారు. కారణము ఈ నేల మీదే ఉన్నాం కాబట్టి. భూమి మీద ఆధారపడి ఉన్నాము అంటున్నామా? పరమాత్మ మీద ఆధారపడి ఉన్నాము అంటున్నామా? అనేది ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే, ఈ నేలే కదండీ మనకు ఆధారము. 

ఈ నేల లేకపోతే మనం ఏం చేయగలుగుతాము? ఎక్కడ ఉంటాము? ఏ రకంగా జీవిస్తాము? ఏ రకమైన అవకాశాలున్నాయి మనకు. ఈ భూమిలేకపోతే? ఏమీ లేదండీ అని అన్నామనుకో, అప్పుడు మనము శబ్ద స్పర్శ రూప రస గంధాలనే ఐదు గుణాలతోనూ, ఈ పృథ్వి మీద జీవిస్తున్నటువంటి వాళ్ళము.
   
   అయితే ఈ పంచభూతాలు.. ఏవయ్యా? భూమి ఉంటే సరిపోతుందా? భూమి మీద నీళ్ళు అవసరం లేదా? అని అడిగామనుకోండి? అయ్యో! నీళ్ళు లేకపోతే ఎట్లా జీవిస్తామండీ? నీరే ప్రాణాధారము. నీళ్ళు లేకపోతే అసలు ప్రాణ శక్తే లేదు. నీళ్ళు త్రాగకుండా ఒక గంట కూడా ఉండలేమండీ. నీళ్ళు ప్రతీ గంట గంటకూ అవసరమేనండీ! నీళ్ళు లేకపోతే ఏ జీవ లక్షణమూ కుదరదండీ! అబ్బో నీళ్ళు చాలా ఇంపార్టెంట్‌ అండీ! నీళ్ళు లేకపోతే నడవదండీ. 

మరి ఇందాక ఏమన్నావయ్యా? పృథ్వే ఇంపార్టెంట్‌ అన్నావు కదా! పృథ్వే లేకపోతే నీళ్ళే లేవు కదండీ అంటావు! కాబట్టి, మానవులందరూ, ఇప్పుడు ఏమైపోయిందీ అంటే, నీకు ఆకాశం ప్రధానమా? పృథ్వి ప్రధానమా? అంటే, పృథ్వే ప్రధానం. ఎందుకంటే ఆకాశము వలన నేను జీవించడం లేదు అనుకుంటున్నాడు కాబట్టి.

        ఏమయ్యా! మరి నీకు నీళ్ళు అవసరం లేదా? నిప్పు అవసరం లేదా గాలి అవసరం లేదా? అంటే, అవి లేకుండా ఎట్లా జీవిస్తామండీ అంటాడు. 

కాబట్టి, నీవు జీవన పర్యంతమూ దేని మీద ఆధారపడియున్నావయ్యా అంటే, పంచభూతాల మీద ఆధారపడియున్నావు. అందుకని, ఈ దేహం పేరేమిటి? పాంచభౌతిక దేహము. పంచభూత లక్షణ సముదాయము చేత, నీకు దేహంలో ఉన్నటువంటి ఆర్గాన్స్‌ అన్నీ ఏర్పడ్డాయి. నీ దేహములో వున్న ఇంద్రియాలు అన్నీ ఏర్పడ్డాయి. నీ దేహలో ఉన్న గోళకాలన్నీ ఏర్పడ్డాయి. 

నీ వ్యవహారమంతా ఈ పంచభూతాలపై ఆధారపడే జరగుతుంది. ఎట్లా జరుగుతుంది అనే విచారణ మాత్రం చేయావు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే ఐదు తన్మాత్రల యొక్క జ్ఞానాన్ని పూర్తిగా కలిగియున్నటువంటిది, పూర్తి విషయ వ్యావృత్తి కలిగినటువంటిదీ పృథ్వి తత్వము సాత్వికమైనటువంటి బోధను ప్రారంభిస్తున్నారు.

 తత్‌ త్వం ఈ పృథ్వి దేని మీద ఆధారపడి ఉంది? దీనకంటే సూక్ష్మమైనటువంటి, స్థూలమంతా సూక్ష్మం మీద ఆధారపడి యున్నది. సూక్ష్మము సూక్ష్మతరంమీద ఆధారపడి యున్నది. 

ఆ సూక్ష్మతరం సూక్ష్మతమమైనటువంటి పరమాత్మ మీద ఆధారపడి యున్నది. ఈ ఆధార ఆధేయ విమర్శని చెబుతున్నారన్నమాట! కాబట్టి, ఆకాశంలో నుంచి మొట్టమొదట వాయువు వచ్చింది. వాయువు నుంచి అగ్ని వచ్చింది. 

అగ్ని నుంచి జలము వచ్చింది. జలము నుంచి పృథ్వి వచ్చింది. ఎందుకు చెప్పారు అంటే, రేపు విరమణ సమయంలో కూడా ఇదే రీతిగా విరమించబడుతుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 285 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
69. అధ్యాయము - 24

*🌻. శ్రీరామునకు పరీక్ష - 1 🌻*

నారదుడిట్లు పలికెను -

ఓ బ్రహ్మా! విధీ! ప్రజాపతీ! మహాప్రాజ్ఞా! కృపాసింధో! సతీపరమేశ్వరుల మంగళకరమగు యశస్సును వినిపించితివి (1). ఇపుడు పవిత్రము, ఉత్తమము అగు ఆ యశస్సును ప్రీతితో ఇంకనూ చెప్పుము. ఆ దంపతులైన సతీపరమేశ్వరులు అచట ఉన్నవారై ఏమి చరితమును చేసిరి?(2).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! నేను సతీశివుల చరిత్రను చెప్పెదను. ప్రేమతో వినుము. వారు అచట ప్రతిదినము అన్నివేళలా లోకపు పోకడను అనుసరించి క్రీడించిరి (3). ఓ మహర్షీ! అపుడు మహాదేవి యగు సతి శంకరుడు నిద్రించు చుండగా వియోగమును పొందినదని కొందరు ప్రాజ్ఞులు చెప్పుచున్నారు (4). ఓ మహర్షీ! శబ్దార్ధముల వలె కలిసి ఉండే చిత్స్వరూపులగు ఆ శక్తీశులకు ఏ కాలమునందైననూ వాస్తవమగు వియోగము ఎట్లు సంభవమగును?(5). కాని లీలల యందు అభిరుచి గల వారిద్దరికి సర్వము సంభవమే యగును. ఏలయన, సతీశివులు లోకమర్యాదననుసరించి లీలలను ప్రకటించెదరు (6). 

ఆ దక్ష పుత్రి తన తండ్రి చేసిన యజ్ఞములో శంభునకు ఆదరము లేకుండుటను గని, శంభునిచే విడువ బడి, ఆ యజ్ఞశాలయందు దేహత్యాగమును చేసెను (7).

ఆ సతీ దేవి మరల హిమవంతునకు కుమారై యై జన్మించి, పార్వతి యను పేరును బడసి, తీవ్రమగు తపస్సును ఆచరించి, శివుని వివాహమాడెను (8).

సూతుడిట్లునెను -

ఆ నారదుడు ఆ బ్రహ్మ యొక్క ఈ మాటను విని, శివాశివుల గొప్ప యశస్సును గురించి బ్రహ్మను ప్రశ్నించెను (9).

నారుదుడిట్లు పలికెను -

ఓ విష్ణు శిష్యా! మహాత్మా! విధీ! లోకాచారమును అనుకరించే శివాశివుల చరిత్రమును నాకు విస్తరముగా చెప్పుము (10). శంకరుడు ప్రాణములకంటె ప్రియతరమగు భార్యను విడనాడుటకు కారణమేమి? తండ్రీ! ఇది నాకు విచిత్రముగ తోచుచున్నది. కాన చెప్పుము (11). 

నీ కుమారుడు యజ్ఞమునందు శివుని అనాదరము చేయుటకు కారణమేమి? తండ్రి చేయుచున్న యజ్ఞమునకు వెళ్లిన ఆ సతి దేహమునెట్లు త్యజించెను? (12). తరువాత ఏమాయెను? మహేశ్వరుడేమి చేసెను? ఆ వృత్తాంతమునంతనూ నాకు చక్కగా చెప్పుము. నేను ఆవృత్తాంతమును వినుట యందు శ్రద్ధ గలవాడను (13).

బ్రహ్మ ఇట్లు పలికెను -

కుమారా! నారాదా! నీవు నా కుమారులలో శ్రేష్ఠుడవు. గొప్ప బుద్ధి శాలివి.చంద్ర శేఖరుని చరితమును మునులతో గూడి పరమప్రీతితో వినుము (14). విష్ణువు మొదలగు దేవతలచే సేవింపబడే, పరబ్రహ్మయగు మహేశ్వరునకు నమస్కరించి, అత్యద్భుతమగు ఆయన చరితమును చెప్పెదను (15). ఇదంతా శివలీల. స్వతంత్రుడు, నిర్వికారుడునగు ఆ ప్రభువు అనేక లీలలను ప్రదర్శించును. ఆ సతీదేవియూ ఆయనవలెనే లీలలను ప్రదర్శించును (16). 

ఓ మహర్షీ! ఆయన తక్క మరియెవ్వరు ఆయన చేసిన కర్మలను చేయగల్గుదురు? ఆయనయే పరమాత్మ, పరబ్రహ్మ, పరమేశ్వరుడు (17).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 141 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
133

We discussed so far that people put forth the excuse that their actions were prompted by God. If the bad deeds were prompted by God, then the punishment is also given by God, so you should experience it. Both are given by God. 

If you don’t want the punishment given by God, why do you say that your action was prompted by God? You don’t like being punished. You say that God’s first command to you was enjoyable, that’s why you committed the act. You say that you dislike the second command (of punishment). 

That makes it clear that you committed the act because you enjoyed it, not because it was God’s command. God would not give you the command to make it enjoyable for you, if you don’t like the punishment. So, since you committed the act out of your own desire, you cannot escape the consequences. 

Therefore, the punishment needs to be given to you. Further, when a thought to undertake a certain action enters your mind, you know whether or not the act is enjoyable. At that time, your mind gives you the option to do or not to do the act. 

That means, you’ve received two commands from God (to do or not to do). Of the two, you picked the one you liked. Therefore, you have to experience the outcome. Any which way you look at it, there is no escape from the fruit of one’s actions. 

If you think your initial act was a command from God, then experience the outcome too as the command of God. If you feel the initial act was not his command, he won’t give you the second command either. Therefore, no one can escape the fruit of one’s actions using arguments and wit. That is why, they advise us to not pray about this.

Furthermore, when you receive the two commands from God (on which course of action to pursue), if you undertake the act that’s in accordance with Dharma, God’s burden of punishing you will lessen. On the other hand, if you give in to lust and pick the sinful act, God will push you further into the whirlpool of illusion. 

Why he does that is a different question. But, your duty is to realize that such danger exists and be careful. That is why, according to the teaching of the Guru, you must feel that you are Brahma. You should entertain no other thought. If you do this constantly, self-realization will shine forth from within you.

Next, we are being initiated into realizing the all-pervasive God.

Sloka: 
Sampasyecchri gurum santam paramatma swarupinam | Sthavare jangame caiva sarvatra jagatitale ||

Among all the animate and inanimate things on earth, one should see only Guru who is tranquil and God incarnate.

One should see the Guru in all animate and inanimate things, in all beings. You should not discriminate saying this is a donkey, this a bird, this is an animal, this is a dog, this is a mosquito and so on. God pervades the spirit of all beings. He’s peaceful and emanates tranquility. How should one see the all pervasive God? Only as Guru.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 67 / Sri Lalitha Sahasra Nama Stotram - 67 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 125, 126 / Sri Lalitha Chaitanya Vijnanam - 125, 126 🌹*

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 125 / Sri Lalitha Chaitanya Vijnanam - 125 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*భక్తిప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, భయాపహా |*
*శాంభవీ, శారదారాధ్యా, శర్వాణీ, శర్మదాయినీ ‖ 42 ‖*

*🌻 125. 'శర్మదాయినీ'🌻*

సుఖము నొసగునది శ్రీలలిత అని అర్థము.

శర్మ అను బిరుదు నిర్దిష్టముగను, నిశితముగను క్రతువులను ఆచరించు వారి కొసగుదురు. క్రతువనగా నియత జీవనము. శ్రీలలితను ఆరాధించువారు క్రమబద్ధములగు జీవితములను నడుపుట జరుగును. ఆరాధన యందలి ఆర్ధత, క్రతుబద్ధత కారణములుగ మనసు అట్టి క్రమమును పొంది జీవితమున అన్ని విషయముల యందు అదే క్రమమును వ్యాపింపచేయును. 

అట్టివారి ఆహారము, వ్యవహారము, భాషణము అంతయు సహజముగ క్రమబద్ధమగును. దానివలన అంతఃసుఖము కలుగును. వారిని బాహ్య సన్నివేశములు చలింప చేయవు. ఈ విధముగ శ్రీలలిత శాశ్వతమగు సుఖమును ఒసగునది అగుచున్నది.

 'సురేశః శరణం శర్మ' అనుచు విష్ణు సహస్రనామము నందు కూడ శర్మ శబ్దము కలదు. ఏ దేవత నారాధించినను, విధివిధానముగ ఆరాధించినచో సుఖము కలుగును. రజోగుణ ఆరాధనము, తమోగుణ ఆరాధనము అట్టి సుఖము నీయజాలవు. ఆరాధనయందు సాత్విక గుణమే సుఖమునకు ముఖద్వారము. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 125 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Śarmadāyinī शर्मदायिनी (125) 🌻*

Śarma means happiness. She confers happiness on Her devotees. Conferring happiness is Her habit as She is the Divine Mother. 

Please refer nāma-s 192, 953 and 968 which convey the same meaning. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 126 / Sri Lalitha Chaitanya Vijnanam - 126 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా |*
*శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా ‖ 43 ‖*

*🌻 126. 'శాంకరీ 🌻*

శంకరుని భార్య శ్రీలలిత అని అర్థము.

శంకరుడనగా సుఖకరుడు అని అర్థము. రజస్తమో గుణములను విసర్జించి సత్వము నాశ్రయించి ప్రసన్న వదనుడైన దైవమును ధ్యానించుట వలన సుఖము కలుగును. 

శంకరుడు ప్రసన్న వదనుడైన నారాయణుని సతతము ఆరాధించుచు నుండుట వలన శంకరత్వమును, మయస్కరత్వమును పొందినాడు.

 అందువలన శంకరుని ముఖమున నిరుపమానమగు ప్రశాంతత యుండునని పురాణములు తెలుపుచున్నవి. అట్టి శంకరుని ఆరాధించి ఆయనను పొందినది పార్వతీదేవి. అందువలన ఆమె శాంకరి అయినది.

శంకరుడు ఏకాదశ రుద్రులలో నొకడు. రుద్రమూర్తి సైతము తపస్సు వలన శాంతమును, సుఖమును పొందెను. 

అందువలన శాంతమును, సుఖమును పొందగోరువారు అర్ధనిమీలిత నేత్రుడై చిరుదరహాసముతో ధ్యానము చేయుచున్న శివుని శ్రీగురువుగ ఆశ్రయింతురు. లేదా భగవద్గీతయందు భగవంతునిచే పేర్కొనబడిన సత్వగుణము నుపాసించి కూడ శాంతమును పొందవచ్చును. 

శ్రీలలిత అట్టి సత్వగుణ సముదాయమునకు కూడ అధిదేవత. ఆమె సుందర సుమనోహర రూపమును ఆరాధించుచు సత్వగుణము నాశ్రయించి జీవించువారికి ఆమెయే స్వయముగ సుఖ శాంతులను ప్రసాదించ గలదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 126 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Śāṃkarī शांकरी (126) 🌻*

Wife of Śaṇkarā, a form of Śiva, is known as Śāṃkarī. Śam means happiness and karā means doer. Therefore Śaṇkarā is known to give happiness and his wife Śāṇakarī has the same quality.  

Śiva and Śaktī do not have any difference in qualities between them. That is why Śiva and Pārvatī are said to be father and mother of the universe.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 478 / Bhagavad-Gita - 478 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 23 🌴*

23. ఉపద్రష్టానుమన్తా చ భర్తా భోక్తా మహేశ్వర: |
పరమాత్మేతి చాప్యుక్తో దేహే(స్మేన్ పురుష: పర: ||

🌷. తాత్పర్యం : 
అయినను ఈ దేహమునందు దివ్యప్రభువును, దివ్యయజమానుడును, పర్యవేక్షకుడును, అంగీకరించువాడును, పరమాత్మగా తెలియబడువాడును అగు దివ్యభోక్త మరియొకడు కలడు.

🌷. భాష్యము :
జీవాత్మతో సదా కూడియుండు పరమాత్ముడు దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రాతినిధ్యమని ఇచ్చట పేర్కొనబడినది. అట్టి పరమాత్మ ఎన్నడును సామాన్యజీవుడు కాడు. 

అద్వైతులైన వారు దేహము నెరిగిన క్షేత్రజ్ఞుడు ఒక్కడేయని భావించుట వలన ఆత్మ మరియు పరమాత్మల నడుమ భేదము లేదని తలతురు. కనుక సత్యమును వివరించుట కొరకే శ్రీకృష్ణభగవానుడు తాను పరమాత్మ రూపమున ప్రతిదేహమునందు ప్రాతినిధ్యము వహించుచున్నానని తెలియజేయుచున్నాడు. అతడు సదా జీవాత్మకు భిన్నుడైనవాడు. 

కనుకనే “పర”(దివ్యుడని) యని తెలియబడినాడు. జీవాత్మ కర్మక్షేత్రపు కర్మల ననుభవించుచుండ, పరమాత్ముడు మాత్రము భోక్తగా లేక కర్మల యందు వర్తించువాడుగా గాక సాక్షిగా, ఉపద్రష్టగా, అనుమంతగా, దివ్యభోక్తగా వర్తించును. 

కనుకనే అతడు ఆత్మయని పిలువబడక పరమాత్మగా తెలియబడినాడు. అతడు సదా దివ్యుడు. అనగా ఆత్మ మరియు పరమాత్మ భిన్నమనునది స్పష్టమైన విషయము. పరమాత్మ సర్వత్రా పాణి,పాదములను కలిగియుండును. 

కాని జీవాత్మ అట్లు సర్వత్రా పాణి, పాదములను కలిగియుండదు. అదియును గాక పరమాత్మ దేవదేవుని ప్రాతినిధ్యమైనందున హృదయస్థుడై నిలిచి, జీవాత్మ కోరు భోగానుభవమునకు అనుమతి నొసంగుచుండును. అనగా పరమాత్ముని అనుమతి లేనిదే జీవాత్మ ఏమియును చేయజాలదు. 

కనుకనే జీవాత్మ “భుక్తము” (పోషింపబడువాడు) అని, పరమాత్మ “భోక్త”(పోషించువాడు) యని తెలియబడుచున్నారు. అట్టి పరమాత్మ అసంఖ్యాకములుగా నున్న జీవులందరి యందును మిత్రుని రూపమున నిలిచియుండును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 478 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 23 🌴*

23. upadraṣṭānumantā ca
bhartā bhoktā maheśvaraḥ
paramātmeti cāpy ukto
dehe ’smin puruṣaḥ paraḥ

🌷 Translation : 
Yet in this body there is another, a transcendental enjoyer, who is the Lord, the supreme proprietor, who exists as the overseer and permitter, and who is known as the Supersoul.

🌹 Purport :
It is stated here that the Supersoul, who is always with the individual soul, is the representation of the Supreme Lord. 

He is not an ordinary living entity. Because the monist philosophers take the knower of the body to be one, they think that there is no difference between the Supersoul and the individual soul. 

To clarify this, the Lord says that He is represented as the Paramātmā in every body. He is different from the individual soul; He is para, transcendental. 

The individual soul enjoys the activities of a particular field, but the Supersoul is present not as finite enjoyer nor as one taking part in bodily activities, but as the witness, overseer, permitter and supreme enjoyer. 

His name is Paramātmā, not ātmā, and He is transcendental. It is distinctly clear that the ātmā and Paramātmā are different. The Supersoul, the Paramātmā, has legs and hands everywhere, but the individual soul does not. 

And because the Paramātmā is the Supreme Lord, He is present within to sanction the individual soul’s desiring material enjoyment. Without the sanction of the Supreme Soul, the individual soul cannot do anything. 

The individual is bhukta, or the sustained, and the Lord is bhoktā, or the maintainer. There are innumerable living entities, and He is staying in them as a friend.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు - 89 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🍀 26 - 2. ప్రాణాయామ యజ్ఞము - ఎంత నెమ్మదిగ శ్వాసను పీల్చిన మనసు అంత నెమ్మదించును. నిదాన మగుచున్న మనసునకు ప్రశాంతత రుచి తెలియును. ఈ ప్రశాంతత రుచిగొనిన మనసు మరింత ప్రశాంతతకై మరింత నెమ్మదిగ పీల్చుట, వదలుట చేయును. ఈ అభ్యాసమున మనోశాంతి అనునది యిట్లు అప్రయత్నముగ లభించును. 🍀*

*📚. 4. జ్ఞానయోగము - 29, 30 📚*
Part 2

ప్రవాహము పైన వస్తువులు తేలుచు వేగముగ కదలుచున్నను అది వస్తువుల కదలిక కాదు కదా! ప్రవాహ వేగమే పైన తేలు వస్తువుల వేగము. అట్లే శరీర ప్రయాణ వేగమునకు, మనో ప్రయాణ వేగమునకు శ్వాసయే ఆధారమని తెలియును. 

శ్వాస ప్రవాహమున మనసు లగ్నమగును. శ్వాస నెమ్మదించినచో మనసు నెమ్మదించును. మనసు నెమ్మదించినచో శ్వాస నెమ్మదించును. కావున మనసు నెమ్మదించ వలెనన్నచో శ్వాసను నెమ్మదిగ నిర్వర్తించవలెను. మనసు వేగముగ పనిచేయు వారియందు శ్వాస కూడ వేగముగ పనిచేయుచు నుండును. అట్టివారి శ్వాస బుసలు కొట్టుచున్నట్లుగ యుండును. ఇది రజోగుణ పూరితమైన శ్వాస. 

మనసు లగ్నము చేసి శ్వాసను నెమ్మదిగ పీల్చుట అభ్యాసమున రెండవ మెట్టు. ఎంత నెమ్మదిగ శ్వాసను పీల్చిన మనసు అంత నెమ్మదించును. పీల్చినంత నెమ్మదిగనే వదలుట కూడ చేయవలెను. పీల్చుట, వదలుట నెమ్మది యగుకొలది మనసు నిదానమగు చుండును. 

నిదాన మగుచున్న మనసునకు ప్రశాంతత రుచి తెలియును. ఈ ప్రశాంతత రుచిగొనిన మనసు మరింత ప్రశాంతతకై మరింత నెమ్మదిగ పీల్చుట, వదలుట చేయును. ఈ అభ్యాసమున మనోశాంతి అనునది యిట్లు అప్రయత్నముగ లభించును.

మనోశాంతియే ధ్యేయముగ ప్రస్తుతకాలమున ధ్యానములు బోధింపబడుచున్నవి. వాస్తవమునకు మనోశాంతి నిజమగు ధ్యానమునకు ఆరంభము. ధ్యేయము కాదు, అంతము కాదు. మనోశాంతి ఆధారముగ ప్రాణాయామ యజ్ఞము ఆరంభమై ప్రత్యాహార, ధారణ స్థితులను దాటి ప్రజ్ఞ ధ్యానమును చేరును. 

అందులకే భగవానుని బోధ ధ్యానమును గూర్చి తరువాత అధ్యాయమైన ఆరవ అధ్యాయమున వున్నది. నాలుగవ అధ్యాయమగు జ్ఞాన యోగమున- యోగమున నాలుగవ అంగమైన ప్రాణాయామమును బోధించుట పతంజలి యోగశాస్త్రమునకు, భగవద్గీతకు గల సమన్వయము.

ప్రశాంతతో కూడిన మనస్సు శ్వాసను నెమ్మదిగ పీల్చుటతో పాటు పూర్ణముగ పీల్చుట చేయును. శ్వాసనెంత పూర్ణముగ పీల్చినచో అంత పూర్ణముగ వదలుట జరుగును. పూర్ణముగ పీల్చుట వలన ప్రాణావాయువు దేహమున పూర్ణముగ నిండును. పూర్ణముగ వదలుట వలన అపాన వాయువు పూర్ణముగ బయలు వెడలును. 

అపానము పూర్ణముగ బయలు వెడలినచో దేహమందలి మలినములు బైటకు నెట్టబడును. మలినములు నెట్టబడుట, ప్రాణము పీల్చబడుట కారణముగ ఈ అభ్యాసమున దొరకు రెండవ బహుమతి ప్రాణశక్తి. క్రమముగ దేహము ఆరోగ్య వంతమగుటకు క్రొత్తగా కొనివచ్చిన ప్రాణము సహకరించును. ప్రాణశక్తి పెరుగుట, మలినములు తొలగుట అనునది నిరంతరము జరుగు ప్రాణాయామము అభ్యాసమున మరియొక భాగము. 

ప్రాణమును అనేక విధములుగ దేహము అందుకొను చుండును. ఆహారము అందులో ఒక భాగము. మనసును లగ్నము చేసి శ్వాసను నెమ్మదిగ పీల్చుట, వదలుట, పూర్ణముగ పీల్చుట, వదలుట కారణముగ శ్వాస క్రమ బద్ధము చెందుట జరుగును. 

మనసు ప్రశాంతత చెందు చుండును. ప్రాణశక్తి పెరుగుచు నుండును. ఉచ్ఛ్వాస నుండి పొందు ప్రాణవాయువు వలసిన ప్రాణశక్తిని దేహమున కిచ్చుచుండును. అట్టివారు నియతాహారు లగుదురు. అనగా సహజముగ వారి ఆహారము నియమింపబడును. ఇదియొక సిద్ధి. 

వీరు ఆహారమును అల్పముగనే స్వీకరించినను శక్తివంతులై యుందురు, సులభముగ అలసట చెందరు. దేహము తేలిక పడుచు పలుచనై కాంతివంత మగుచుండును. దేహమున శుభమగు మార్పులు ఈ విధముగ శ్వాస నభ్యసించుటవలన వచ్చును. శ్వాస నుండి వలసిన ప్రాణశక్తి లభించుటచే ఆహారము నందు నియమము
సహజముగ ఏర్పడును. 

ఆహారము తగ్గుట జరుగునే కాని చేయుటగ నుండదు. తగ్గించుట చేయువారు అకస్మాత్తుగ ఎక్కువ తినుచుందురు. ఎక్కువ తినుట, తక్కువ తినుట వలన దేహమునకు అవ్యవస్థత కలిగించును. ఈ అవస్థకు గురియగు దేహము, అస్వస్థతకు కారణమగును. ఉపవాసములు చేయువారు, ఎక్కువగను, తక్కువగను తినువారు యోగమున కనర్హులు. 

యోగజీవనము నిర్మల సెలయేరువలె ప్రవహించవలెనే కాని వరదవలె కాదు. పై కారణముగనే భగవద్గీత యందు నియతాహార విషయము 30వ శ్లోకమున తెలుపబడెను. 29వ శ్లోకమున ప్రాణమును గూర్చిన సాధన తెలుపబడినది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 42 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 4 - THE 2nd RULE
🌻 Kill out desire of life - Respect life as those do who desire it - 4 🌻

190. As soon as a man feels unity he gains the dispassionate view of things. All lines of work are then, in effect, the same to him – not that he can equally easily take up all, but he sees that, they all lead to the same point. The undeveloped man never understands this.

 Always he thinks that the man taking the, higher standpoint is cold and hard and unsympathetic; that is because the lower man is thinking of himself and is wanting all sorts of personal satisfactions, whereas the other man is thinking only of the work to be done and is putting all his energy; into that. 

When once the Plan of work of the Logos dawns upon a man’s horizon he sees that to the exclusion of every thing else, and throws his energies into it, and whatever is best for that work he tries to do, even as regards the smallest detail of every-day life.

191. He hitches his wagon to a star. He puts before himself ideals very high and very remote from the ordinary understanding, and it is quite inevitable that the people who still look on things from the personal point of view will misunderstand him. If he suffers because of that misunderstanding, there is still a little personal touch in that; he still wants to be understood, but even that he must give up. 

He must give up hoping that his efforts will be appreciated, and realize that it does not matter whether they are appreciated or not. All that matters is that the work shall be done. If people will not give us credit for our work, no matter; let it be done as perfectly as possible. 

We shall have the appreciation of the Master – that much is sure – but even that must not be our reason for doing it. Our reason for doing it is that it is God’s work and as we are one with Him what He wills is our will, what He would have done it is our highest pleasure and privilege to try to do.

192. When we realize that all Life is divine Life, of course we shall respect all the manifestations of it. We, who see partially, do not always respect life in all its forms and in all its manifestations.

 We see that many of them would be eminently undesirable for us, and therefore there is a tendency to regard those particular manifestations with contempt. That is always a mistake. We see a great deal around us which from our point of view is going very wrong, and often it really is going wrong. 

All the expressions of selfishness and greed and uncontrolled desire that we see in the world are certainly wrong in the sense that it would be very much better if they were different. It is not at all a mistake for us to think that, because it is a fact; but when we allow ourselves to feel contempt for the people who are at that stage, we are going further than we have any right to go. 

Their state of development accounts for these manifestations, and they are very often the only expressions possible for them at that stage, and it is through them that they will learn.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 174 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భరద్వాజ మహర్షి - 5 🌻*

31. భరద్వాజుడు ఇంకా చెప్పడు: “రాజా! అరామాల్లో, వేశ్యా వాటికల్లో, సత్రాల్లో, మదిరాల్లో, స్నాన-పానప్రదేశాల్లో దొంగలు చేరుతూ ఉంటారు. జార, చోరులవల్ల ప్రజలకు భయం ఉంటుంది. అందుకని వాళ్ళను పట్టుకుని దండించాలి. అది పరిపాలనలో ప్రథమధర్మం. ప్రజాక్షేమం కోసమని ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నదో నువ్వు గమనించాలి. 

32. ఎవరి గురించో మరెవరో ఉత్తమ కులస్థుడనీ, పుణ్యాత్ముడనీ, చాలా మంచివాడనీ చెబుతారు. అది తీసుకుని నివు నమ్మవద్దు. అలాగని వాడిని అక్కడే అనుమానించనూవద్దు” అని చెప్పాడు.

33. నమ్మవద్దు, అనుమానించవద్దు అంటే, మరి ఏం చెయ్యాలి! పరీక్ష చేయాలి. పరీక్షించాలి వాళ్ళను. తన మనిషినే వాడిదగ్గరికి పంపించి పరీక్షించాలి. 

34. రాజు తన మనిషిని అనుమానంకలిగినవాడి దగ్గరికి పంపించి ఎట్లా పరీక్షిస్తాడంటే; రాజు యొక్క అంతరంగికుడు, ఉద్యోగంలో కొత్తగాచేరిన వాడిదగ్గరికివెళ్ళి, “మన రాజు చాలా దుర్మార్గుడు. అందరి మనసులలోనూ ఆయన మీద క్రోధం ఉంది. ఎప్పుడో సమయం చూచి మేము తిరుగుబాటు చేద్దామనుకుంటున్నాము నువ్వేమంటావు? ఆయన తమ్ముడొకడు మంచివాడున్నాడు; ఆయనకు రాజ్యమొస్తే సుఖపడతాం మనం. నిన్ను రేపు ఆయన దగ్గరికి తీసుకెళతాను” అంటాడు. అప్పుడు ఆ కొత్తవాడు, “అలాగా! రేపు వెడదాం” అని కనుక అంటే, మర్నాడు వాడిని పంపించెయ్యాలి. అదీ పరీక్ష చేయటమంటే! దానితో వీడి నిజస్వభావం బయటపడిపోతుంది. 

35. వాడికి ఆశపెట్టి, ధనాశపెట్టి పరీక్ష చేయాలి. అనుమానించినట్లు కనబడకూడదు. అలాగని గుడ్డిగా నమ్మనేకూడదు. ఈ ప్రకారంగా ప్రతివాడినీకూడా పరీక్షించాలి.
గిల్లికజ్జాలు పెట్టుకొని, చిన్నచిన్న కారణాలకోసం ఎవరూకూడా బలమయినవాడితో శత్రుత్వం పెట్టుకోకూడదు. రాజు చిన్నచిన్న విషయాలను అన్నిటినీకూడా ఉదారస్వభావంతో వదిలి పెట్టాలి. కాని వాటిని మాత్రం వెతుకుతూ ఉండాలి. 

36. సాధారణంగా మనం తేలు, పాము ఎక్కడుందోఅని వెలుతురులో పరీక్షించినట్లు, పాలకుడు శత్రువులను వెతుకుతూ ఉండాలి. ఇవాళ ఒకడు మనకు అపచారంచేసాడు అంటే, వాడిని గురించి చాలా జాగ్రత్తవహించి ఎప్పుడూ పరిశీలన చేస్తూండాలి. మనమే వైరం పెట్టుకోకూడదు. చిన్న నేరాలన్నింటినీ క్షమించి వదిలివేయాలి. 

37. హృదయంలో ఒకడిమీద ద్వేషం పెట్టుకోవటము, అతడంటే తనకు ఇష్టంలేదని అందరిలోనూ అనటము, వాడిమీద వైరభావము పెట్టుకోవడము, ఇట్లాంటివి ఉండకూడదు. ఎందుకంటే తన ఇస్టాఇస్టాలకు అక్కడ తావులేదు. అది Public administration. ప్రతీవాడికి ఏదో స్వభావం ఉంటుంది. ఏదో మతం ఉంటుంది. వాడిని dislike చేసినప్పటికీకూడా వాడితో రాజు వైరం పెట్టుకోకూడదని స్నేహమే పాటించాలని భరద్వాజుడు రాజనీతి బోధించాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 238 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 87. Totally accept the knowledge 'I am' as oneself, and with full conviction and faith firmly believe in the dictum 'I am that by which I know I am'. 🌻*

After fully understanding the 'I am', firstly, you have to accept that you are the knowledge 'I am' in its totality. When this acceptance comes through your practice, what will happen? You will no longer be an individual, the personality will be gone. 

Now you will have reached the highest you possibly can. Secondly, remaining in this highest possible state of knowing that 'I am', you will realize that there is someone who knows the 'I am'. Till this realization comes you should at least firmly believe in the dictum 'I am that by which I know I am'.
 🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 113 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. మానసిక గోళము - మనోభువనము - ఆరవ భూమిక - 18 🌻*

472. సంస్కారములున్నంతవరకు, సృష్టి నిలిచి యుండును, భగవంతుడు మరుగుపడి యుండును.

473. సంస్కారములు నాశనమైనచో సృష్టి అదృశ్యమగును. భగవంతుడు కాన్పించును.

474. సంస్కారముల వలననే, సృష్టిలో నిద్రావస్థయు, జాగ్రదవస్థయు పగటి జీవితమును స్థాపింపబడుచున్నవి.

475. భగవంతుడు రూపముతో తాదాత్మ్యము చెందుటకు సంస్కారములే కారణము.

476. సంస్కారములే అనుభవమును ఇచ్చును.

477. అది ప్రేరణము యొక్క పరిమాణు ప్రమాణమైన తొలి సంస్కారమే, ఆత్మ యొక్క అనంత చైతన్య రాహిత్య స్థితికి, పరమాణు ప్రమాణమైన తొలి చైతన్యము నొసంగినది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 77 / Sri Vishnu Sahasra Namavali - 77 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*పూర్వాషాడ నక్షత్ర ప్రధమ పాద శ్లోకం*

*🍀 77. విశ్వమూర్తిర్మహామూర్తిః దీప్తమూర్తి రమూర్తిమాన్|*
*అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తి శ్శతాననః|| 77 🌻*

🍀 717. విశ్వమూర్తిః - 
విశ్వమే తన దేహముగా గలవాడు.

🍀 718. మహామూర్తిః - 
గొప్ప దేహము గలవాడు.

🍀 719. దీప్తమూర్తిః - 
సంపూర్ణ జ్ఞానముతో ప్రకాశించువాడు.

🍀 720. అమూర్తిమాన్ - 
కర్మాధీనమైన దేహము లేనివాడు.

🍀 721. అనేకమూర్తిః - 
అనేక మూర్తులు తానైనవాడు.

🍀 722. అవ్యక్తః - 
అగోచరుడు.

🍀 723. శతమూర్తిః - 
అనేక దేహములు ధరించినవాడు.

🍀 724. శతాననః - 
అనంత ముఖములు గలవాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 77 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Poorvashada 1st Padam*

*🌻 77. viśvamūrtir mahāmūrtir dīptamūrtiramūrtimān |*
*anekamūrtiravyaktaḥ śatamūrtiḥ śatānanaḥ || 77 || 🌻*