25-July-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 438 / Bhagavad-Gita - 438🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 226 / Sripada Srivallabha Charithamrutham - 226 🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 106🌹 
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 129🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 42 / Sri Lalita Sahasranamavali - Meaning - 42 🌹
6) 🌹 VEDA UPANISHAD SUKTHAM - 69🌹
7) 🌹. నారద భక్తి సూత్రాలు - 45 🌹 
8) 🌹 Guru Geeta - Datta Vaakya - 13 🌹
9) 🌹. శివగీత - 11 / The Shiva-Gita - 11🌹 
10) 🌹. సౌందర్య లహరి - 53 / Soundarya Lahari - 53🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 352 / Bhagavad-Gita - 352 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 438 / Bhagavad-Gita - 438 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 48 🌴*

48. న వేదయజ్ఞాధ్యయనైర్న దానైర్
న చ క్రియాభిర్న తపోభిరుగ్రై: |
ఏవంరూప: శక్య అహం నృలోకే
ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర ||

🌷. తాత్పర్యం : 
ఓ కురుప్రవీరా! వేదాధ్యయనముచేత గాని, యజ్ఞములచేత గాని, దానములచేత గని, పుణ్యకర్మలచేత గాని, ఉగ్రమగు తపస్సులచేత గాని భౌతికజగమున ఈ రూపములలో నేను దర్శింపబడనందున నా ఈ విశ్వరూపమును నీకు పూర్వము ఎవ్వరును గాంచి యుండలేదు.

🌷. భాష్యము : 
ఈ సందర్భమున దివ్యదృష్టి యననేమో చక్కగా అవగతము చేసికొనవలసియున్నది. దివ్యదృష్టిని ఎవ్వరు కలిగియుందురు? దివ్యము అనగా దేవత్వమని భావము. దేవతల వలె దివ్యత్వమును సాధించనిదే ఎవ్వరును దివ్యదృష్టిని పొందలేరు. 

ఇక దేవతలన యెవరు? విష్ణుభక్తులే దేవతలని వేదవాజ్మయమునందు తెలుపబడినది (విష్ణుభక్తా: స్మృతాదేవా:). అనగా విష్ణువు నందు విశ్వాశము లేని నాస్తికులు మరియు శ్రీకృష్ణుని నిరాకారరూపమునే శ్రేష్టమని భావించువారు దివ్యదృష్టిని పొందలేరు. 

ఒక వంక శ్రీకృష్ణుని నిరసించుచునే దివ్యదృష్టిని పొందుటకు ఎవ్వరుకినీ సాధ్యము కాదు. దివ్యులు కానిదే ఎవ్వరును దివ్యదృష్టిని పొందలేరు. అనగా దివ్యదృష్టిని కలిగినవారు అర్జునుని వలెనే విశ్వరూపమును గాంచగలరు.  

🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 438 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 48 🌴*

48. na veda-yajñādhyayanair na dānair
na ca kriyābhir na tapobhir ugraiḥ
evaṁ-rūpaḥ śakya ahaṁ nṛ-loke
draṣṭuṁ tvad anyena kuru-pravīra

🌷 Translation : 
O best of the Kuru warriors, no one before you has ever seen this universal form of Mine, for neither by studying the Vedas, nor by performing sacrifices, nor by charity, nor by pious activities, nor by severe penances can I be seen in this form in the material world.

🌹 Purport :
The divine vision in this connection should be clearly understood. Who can have divine vision? Divine means godly. 

Unless one attains the status of divinity as a demigod, he cannot have divine vision. And what is a demigod? It is stated in the Vedic scriptures that those who are devotees of Lord Viṣṇu are demigods (viṣṇu-bhaktaḥ smṛto daivaḥ). 

Those who are atheistic, i.e., who do not believe in Viṣṇu, or who recognize only the impersonal part of Kṛṣṇa as the Supreme, cannot have the divine vision. It is not possible to decry Kṛṣṇa and at the same time have the divine vision. 

One cannot have the divine vision without becoming divine. In other words, those who have divine vision can also see like Arjuna.

The Bhagavad-gītā gives the description of the universal form. 

Although this description was unknown to everyone before Arjuna, now one can have some idea of the viśva-rūpa after this incident. Those who are actually divine can see the universal form of the Lord. 

But one cannot be divine without being a pure devotee of Kṛṣṇa. The devotees, however, who are actually in the divine nature and who have divine vision, are not very much interested in seeing the universal form of the Lord. 

As described in the previous verse, Arjuna desired to see the four-handed form of Lord Kṛṣṇa as Viṣṇu, and he was actually afraid of the universal form.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 226 / Sripada Srivallabha Charithamrutham - 226 🌹*
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 43
*🌻. అనఘాలక్ష్మీ వర్ణన. 🌻*

భాస్కర పండితులు శ్రీపాదులవారి దివ్యతత్వాన్ని ఇంకా ఇలా వివరించసాగారు:

శ్రీపాదులవారు సృష్టిలోని సకల జీవరాసులలోని చైతన్యంతోనూ తాదాత్మ్యస్థితిలో ఉన్నారు.
కానీ వారి స్పర్శ ఏ స్థాయి జీవరాసులలోనూ ఉండదు. వారు ఏఏ రూపాలుగా వ్యక్తపరచ బడుతున్నారో ఆ చైతన్యమే తామై, ఆయా రూపాలతో తాదాత్మ్యస్థితిలో ఉంటారు.

 శ్రీపాద శ్రీవల్లభ రూపం యతీశ్వర రూపం. వారు తమ తపః ఫలితాన్ని సృష్టికి ధారపోస్తారు. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం మహా పవిత్ర అక్షర సత్యగ్రంధం. 

ప్రతి అక్షరంలోనూ యోగశక్తి, బీజాక్షర శక్తి నిండి, పారాయణ వలన భౌతిక స్థాయిలోని వాళ్ళకు శుభాలు, ఇహపర సుఖాలనూ, మహాయోగులూ, మహా పురుషులకు యోగ విభూతులను ఇస్తుంది అని వివరించారు.

అతీత స్థాయి, విశ్వ స్థాయి, వ్యక్తి స్థాయి అని మూడు స్థాయిలలో పరాశక్తి ఉంటుంది. సృష్టికి ముందు ఆమె అతీత స్థాయిలో ఉంటుంది. జీవులను సృష్టించి, స్థిరపరచి, విశ్వ స్థాయిలో ఉంటుంది. మానవ వ్యక్తిత్వానికీ, దివ్యప్రకృతికీ మధ్యవర్తిగా ఆమె వ్యక్తి స్థాయిలో
పనిచేస్తుంది.

కాళి అనేది అజ్ఞానంలో, అంధ సంఘర్షణలో, ప్రతిదానినీ ఛిన్నాభిన్నం చేస్తూ పోయే విధ్వంసక శక్తి... మహాకాళి అనేది ఉన్నత భూమికకు చెందిన బలానికీ, శక్తికీ ప్రతినిధి, లక్ష్మి అనేది భౌతిక వస్తు సంచయానికి ప్రతీక... మహాలక్ష్మి అనేది భౌతిక జీవనాన్ని సౌందర్యభరితమైన దివ్యానంద దివ్య జీవనంగా మార్చగలిగే ఘనీభూతమైన మహా శక్తి. వాక్కులలో,పనులలో నేర్పులకు సరస్వతి ప్రతీక... దివ్యజ్ఞానం, ఆత్మచైతన్య కర్మలను నిర్వహించే దివ్య నైపుణ్యానికి, స్పందనశీలమైన నాదస్వరూపానికి, మహాసరస్వతి ప్రతీక.

ఏ చైతన్యమైతే మహాలక్ష్మీ, మహాసరస్వతి, మహాకాళీ రూపాలుగా వ్యక్తం అయ్యిందో... ఆ చైతన్యమే శ్రీపాద శ్రీవల్లభుల అనఘాలక్ష్మీ స్వరూపం. త్రిమూర్తులను కలిగినది అనఘుని రూపం. అనఘాలక్ష్మీ సమేత అనఘుడే శ్రీపాద శ్రీవల్లభులు. దత్తుడు సర్వదేవతా స్వరూపుడూ... అవతార సమాప్తి లేని చతుర్యుగ అవతారుడూ
అయినందువల్ల... దశమహావిద్యల ఆరాధనా పలితం... శ్రీపాద శ్రీవల్లభ రూపంలోని దత్తారాధనవల్ల సిద్ధిస్తుందని శ్రీ భాస్కరశాస్త్రి చెప్పారు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sripada Srivallabha Charithamrutham - 226 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

*🌻 The greatness of Siva - The Siva forms in the eleven Siva Kshetras in Andhra Pradesh - 2 🌻*

The Midhuna Rasi is the form of Siva and Parvathi as the Adi Dampathulu (the first wife and husband). Siva gives darshan when ‘Arudra’ star glows in the sky.  

To go near Midhuna Rasi, one has to cross the ‘Vrishabha Rasi’. That Vrishabha is ‘Nandeeswar’. That is the form of Dharma. The ‘Jyothi’ that glows in between the eye brows is the ‘chandra’ kala.  

The ‘Artha Nareeswara’ form is the one that forms as a result of victory over kaama (lust) in ‘Yoga Sthithi’ and the loss of difference between woman and man attaining the state of ‘oneness’.

In ‘Sahasraara’, Karpooram (campher) glows as Bhagawathi Jyothi during Lingodhbhava time. Lingam is the one which lies hidden in the gross body. Vedam says that this remains glowing in the form of jyothi. 

It is possible to know the secrets of Siva worship through Guru’s grace only. Similar to the physical Peethikapuram, there is one Swarna Peethikapuram which is in the form of jyothi. That is built of my ‘Chaitanyam’.  

My devotees and jnanis who remember me relentlessly will be able to know it by experience. However far they may be, they become residents of Swarna Peethikapuram.  

I am easily accessible to them. The priests whom you saw in the Kukkuteswara temple in the physical Peethikapuram are born with the amsas of ‘pramada ganas’.  

There are many Bhuta, Preta, Pisacha and other maha ganas. As one does ‘yogaabhyasa’ and worship of Sripada Srivallabha, those Bhuta Pretas will be creating hurdles.  

People who cross these hurdles and reach me are blessed. I have said many times before that a maha samsthanam will be formed in my name in my maternal grandfather’s house.  

My will is very strong. Yogi ganas and bhakta ganas will have darshan of My samsthan in lakhs and lakhs like lines of ants. I will decide who, when and how many people and in what way they come. 

 It is not correct to say that one can come to Sripada Srivallabha samsthan and have darshan simply because one is a resident of Peethikapuram. My grace will rain ‘amrit’ on eligible people. It will be like a mirage for ineligible people.” 

End of Chapter 23

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 106 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. బాధలలో నున్నవారికి చుట్టము దేవుడే. 🌻*

నిద్రపోయిన వాడు మేల్కాంచినపుడు తానున్న పరిస్థితులను తెలిసికొనగలడు. అట్లే దేవునియందు మెలకువ కలిగిన వాడు ఆతని చరణమును పొంది యదార్థ జ్ఞానమును పొందును. అతడొకడే బ్రహ్మసృష్టిని గూర్చి తెలుసుకొనును.

బ్రహ్మయు, అతని సృష్టియు నారాయణుని యందే భాసించుచున్నవని మేల్కొనును. అంతకు ముందు మాత్రము తాను బ్రహ్మ సృష్టిలో నొక భాగమై జగత్తునందు మాత్రము మేల్కొనును.

అట్టివారు ఒకరియందొకరు మేల్కొని , తమ పనులను చక్కపెట్టుకొను యత్నమున తీరుబడి లేనివారై యుందురు.  

నారాయణుని యందు మేల్కొనిన వారికి సర్వము నారాయణుడే కనుక అంతయు తీరుబడియే. కర్తవ్యములు మాత్రము నిర్వహింపబడుచుండును.  
....... ✍🏼 *మాస్టర్ ఇ.కె.* 🌻
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 128 🌹*
*🌴 The Crises - 2 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

*🌻 Fiery Transformations - 2 🌻*

Crises are nothing but the karma we have to fulfil; they help to clear up. The limitations we suffer from stand in our way to fulfilment. Therefore, in the life of a disciple crises come faster. 

The Master does not accept any limitations with the disciples. He works from inside, and then we experience crises. When we are out of a crisis and have regained a foothold, he creates a news crisis so that we grow through it.

When we invoke the energy of CVV, many transformations happen. He sees that all body cells get transformed through the fire he kindles through crises. 

Crises help to keep us aflame and that we are being cooked by them. The word ‘flight’ does not exist in the dictionary of a disciple. 

We have to face the crises and resolve them. When we accept them we start shining forth in crises. Gold shines much more beautiful when it is in fire. 

The gold in us is our golden body, the subtle, etheric body. It can only start shining if we are enough in fire. We should be grateful to the groups and our fellow beings because they give us so many crises. 

We see in the outside what is inside ourselves. When we can see so much hatred, dispute and fight, we see it because in ourselves we have precisely this. 

For an initiate all this does not exist because for him all is God’s presence. He knows what he has to do in a given situation.

🌻 🌻 🌻 🌻 🌻 🌻 
Sources: Master K.P. Kumar: Uranus. The Alchemist of the Age / The Teachings of Sanat Kumara / notes from seminars. 

Continues
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 42 / Sri Lalita Sahasranamavali - Meaning - 42 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 77

345. విజయా - 
విశేషమైన జయమును కలిగినది.

346. విమలా - 
మలినములు స్పృశింపనిది.

347. వంద్యా - 
నమస్కరింపతగినది.

348. వందారుజనవత్సలా - 
నమస్కరించు శీలము గల జనుల యందు వాత్సల్యము గలది.

349. వాగ్వాదినీ - 
వాక్కులను చక్కగా వ్యక్తపరచగలుగుటకు ప్రేరణ నిచ్చు పరావాగ్దేవత.

350. వామకేశీ - 
వామకేశ్వరుని భార్య.

351. వహ్నిమండవాసినీ - 
అగ్ని ప్రాకారమునందు వసించునది.

🌻. శ్లోకం 78

352. భక్తిమత్కల్పలతికా - 
భక్తికలవారిపట్ల కల్పవృక్షపు తీగవంటిది.

353. పశుపాశ విమోచనీ - 
వివిధ పాశములచే బంధింపబడువారిని బంధ విముక్తులను చేయునది.

354. సంహృతాశేషపాషండా -
 సంహరింపబడిన సకలమైన పాషడులు కలది.

355. సదాచారప్రవర్తికా -
 సంప్రదాయబద్దమైన, శ్రోత్రీయ మార్గము ననుసరించి యుండునట్లు ప్రవర్తింప చేయునది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 42 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 42 🌻*

345 ) Kshetra pala samarchitha -  
 She who is worshipped by those who look after bodies

346 ) Vijaya -   
She who is always victorious

347 ) Vimala -   
She who is clean of ignorance and illusion

348 ) Vandhya -   
She who is being worshipped by every body

349 ) Vandharu jana vatsala -   
She who has affection towards all those who worship her

350 ) Vaag vadhini -   
She who uses words with great effect in arguments

351 ) Vama kesi -   
She who has beautiful hair

352 ) Vahni mandala vaasini -   
She who lives in the universe of fire which is Mooladhara

353 ) Bhakthi mat kalpa lathika -   
She who is the wish giving creeper Kalpaga

354 ) Pasu pasa vimochani -   
She who removes shackles from the living

355 ) Samhrutha sesha pashanda -   
She who destroys those people who have left their faith

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 45 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 27

🌻 27. ఈశ్వర రస్యాప్యభిమాన ద్వేషిత్వాత్‌ దైన్య ప్రియత్వాత్‌ - 2 🌻

అహంకారాదులను నశింపజేయడానికి ఉపాయం జ్ఞాన బోధలో దొరుకుతుంది. నేను నాది అనేవి పోవాలంటే శమం, దమం, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానాలు కావాలి. 

భగవంతుని ఆలంబనగా చేసుకొని బాహ్య ఇంద్రియాలను విషయాలపైకి పోనివ్వకుండా నిగ్రహించడం దమమనబడుతుంది. 

ఈ నిగ్రహం సహజమై, మనోబుద్ధులు నిశ్చలమవడం శమమనబడుతుంది. శత్రు మిత్ర భేదం లేకుండా అందరిమీద నిస్వార్థ, నిష్పక్షపాత బుద్ధిని కలిగియుండడం తితిక్ష అనబడుతుంది. 

దీనిని సమదృష్టి అనిగాని, అంతా ఈశ్వర మయంగా చూడడమనిగాని వర్ణించవచ్చును. ఇట్టి సమదృష్టిని సాధించడానికి ఉపాయంగా నిత్యం తన మనసును ఈశ్వర చింతనలో ఉంచి, లగ్నం చేసి, ఆనంద పడడం ఉపరతి అనబడుతుంది. 

భగవంతుడు తప్పక అనుగ్రహిస్తాడనే విశ్వాసం, శ్రద్ధ అవుతుంది. ఆ భగవంతునిచే పొందదగిన అనుభవాన్ని పొందడానికి భక్తుడు చేసే సాధన నిజాయితీతో కూడుకొని కాపట్యం లేకుండడాన్ని సమాధానమంటారు. పరాభక్తి లక్ష్యం ఎంత తీవ్రంగా ఉంటుందో అట్టి తీవ్రతయే మోక్షేచ్ఛ.

            అంతేగాని, ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి తగిన సాధన చేయ కుండా ఈశ్వరునికే పక్షపాత బుద్ధిని అంటగట్టడం అవివేక మవుతుంది. ఈశ్వర కృప అపారం. 

అది ఎల్లప్పుడు వర్షిస్తూనే ఉంటుంది. భక్తుడి పాత్ర తెరచి ఉంటే అది కృపావర్షంతో నిండుతుంది. బోర్లించిన కుండ నిండదు కదా ?

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya 13 🌹*
✍️ Sri GS Swami ji 
📚. Prasad Bharadwaj

*🌻 Until you make your decision, Guru will not accept you as a disciple. Once this mutual agreement is made, Guru will never leave you. 🌻*

We have said that you can take your time to decide about Guru after much deliberation. But once you have made your decision, you have no right to reverse the decision and reject your Guru. 

Until you make your decision, Guru will not accept you as a disciple. You have to explicitly state that you have accepted this Guru. Your own mind is your witness. 

Once this mutual agreement is made, Guru will never leave you. There is mutual trust between the two. Neither of them can break the bond. 

Even if you reject his help, Guru, whose compassion is immeasurable, will still follow you lifetime after lifetime to rescue you and protect you because of the worship that you had offered him earlier, and the trust that you had placed in him to begin with. 

He has to fulfill the boon that he had granted you earlier. The story of Bhadraseela in Sri Datta Darsanam stands as a proof for this. One can listen to this story any number of times.
 
Once you accept a Guru, if you reject him and accept another Guru, you will be the loser at both ends. You cannot escape it. You must remember this. 

The story of Devendra proves this point. Indra’s position is earned by the performance of 100 Asvamedha yagas, and great penance. 

As long as that merit is preserved, the position lasts. But despite reaching such an exalted state, many have fallen from the position by committing mistakes. 

Indra once accepted Brihaspati, the Guru of the gods as his Sadguru. Under his guidance he was able to suppress the demons and he ruled his kingdom in comfort. 

After some time had elapsed like this with no disturbances in his reign of the three worlds, Indra’s mind got diverted towards sensual enjoyments and luxuries. 

There was no anxiety about any attacks from the demons. There was no fear of war. There was no demand for any effort and there was no fear.

 Many people maintain their health only when they remain in a state of fear. Indra had everything going very smoothly. He had plenty of prosperity. 

But now his mind was drawn towards pleasures. When one has too much wealth, there will be no inclination to engage in charity, or to help the needy. 

The coffers will be full and overflowing and that will naturally lead to extravagance, and lavish and wasteful spending for bad habits and addictions. Let us see what the future holds for such persons. 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 11 / The Siva-Gita - 11 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

ద్వితీయాధ్యాయము
*🌻. వైరాగ్య యోగము - 2 🌻*

సూర్యోసౌ సర్వ లోకస్య - చక్షుష్వేన వ్యవస్థితః ,
తధాపి చాక్షుషై ర్దో షై - చక్షుష్వేన వ్యవస్థితః 7
తధాపి చాక్షు శైర్దో షై - ర్నక దాచి ద్విలిప్యతే,
సర్వ భూతాన్త రాత్మా సిత ద్వద్దు: ఖైర్న లిప్యతే 8
దేహో పిమల పిణ్నోయం - ముక్త జీవో జడాత్మకః,
దహ్యతే వహ్నినా కాష్టై - శ్శివా ద్యైర్భ క్ష్యతే పివా 9
తధాపి నైవ జానాతి - విర హేత స్య కావ్యధా,
సువర్ణ గౌరీ దూర్వాయా దళ వచ్చ్యా మలాపివా 10
పీనోత్తుంగ స్తనా భోగ -భుగ్న సూక్ష్మా వ లగ్నకా,
బృహన్నితం బజఘనా - రక్తపాద సరో రుహా 11
రాక చన్ద్ర ముఖీ బింబ - ప్రతి బింబ రదచ్చదా,
నీలేందీ వరనీ కాశ- నయన ద్వయ శోభితా 12
మత్త కోకిల సల్లాపా - మత్త ద్విరద గామినీ,
కటాక్ష్యైరను గ్రుహ్లాతి మాం - పంచే సుశోరొత్త మై:13
ఇతియో మన్యతే మూర్జ - స్సచ పంచే సుశాసితః,

బంగారు వర్ణము గలది లేత గరిక మావి శ్యామ లయ, బిగువు చనుదోయి (కలశ స్తనములు) గలది . దొండ పండు వంటి క్రింది పెదవి గలది. ఇందు ముఖియు మున్నగు విశేష నామములతో కూడిన యువతులు క్రీగంటి చూపుల వలన నూ పూవిలు కాని నుండి దప్పించి కాపాడు నని ఎవ్వడైతే తలచునో అట్టి అవివేకి మన్మధుని చేత శిక్షింప బడి న వాడే యగును.

తస్యా వివేకం వక్ష్యామి - శృణుష్వా వహితో నృప
నచ స్త్రీ పుమానేష - న చైవాయం నపుంసకః 14
అమూర్తః పురుషః పూర్ణో - ద్రష్ట్రా సాక్షీ సజీవనః
యాతన్వంగీ మృదుర్బాలా - మల పిండాత్మికా జడా 15

అటువంటి వాడి వివేకము ఎట్టిదో దానిని గురించి వివరించు చున్నాను.
 శ్రద్ధతో వినుము. పరమాత్ముడు స్త్రీ, పురుష ,నపుంసకముల కతీత మైన వాడు. మూర్తిత్వర హితుడు, సర్వాంతర్యామి, సమస్తమునకు సాక్షి భూతుడు, సర్వాపేక్షకుడు, సమస్త జీవితము కూడా అగును.

సాన పశ్యతి యత్కిం చిన్న - శ్రణో తిన జిఘ్రతి,
చర్మ మాత్రా తను స్త సయా- బుద్ధ్యా వీక్ష స్వరాఘవ! 16
యా ప్రాణ దదికా సైవ- హస్తతే స్యా ద్ఘ్రుణా స్పదమ్,
జాయన్తే యది భూతేభ్యో - దేహినః పాంచ భైతికాః 17

సున్నితము, కోమలమైన యుపాంగములు (అవయములు ) కలిగి, మల మూత్ర పిండాత్మకము, జడదేహము గలది యునైన ఎవనిత యనబడినదై, ఇతరులను జూడదు, వినదు, వాసన కూడా చూడదు. 

 ఓ రామా! వివేక జ్ఞానముతో నొక పరి దర్శింపుము.
 
నీవు దేనినైతే నీ ప్రాణము కంటెను మిన్నగాను, ప్రేమకు పాత్రమైనది గాను దల పోయు చుంటివో అట్టి శరీరము తోలు తిత్తి మాత్రమే. హేయాస్పద మైనది. దానిని నీవు ప్రేమింప దగదు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 The Siva-Gita - 11 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 02 : 
*🌻 Vairagya Yoga - 2 🌻*

Having a golden hue, having pitcher like breasts, having bimba fruit kind of lower lip, a face resembling a full moon etc.; with such adjectives when a man gets trapped, such ignorant person gets punished by the Manmadhathe God of love!

14. 15. I am describing about that kind of person's ignorance. Listen with attention. Paramatma is beyond gender attribute. He is neither male, nor female, nor eunuch. He is formless, omnipresent, a witnesser of everything, and is everything.

16. That which has soft slender body parts, that is a malamootra pinda (a body containing faeces and urine). It doesn't see , smell or listen to others. O Rama! With your divine knowledge look at it once. 

17. That body whom you are considering worthy of love and infatuation, is nothing but a bag of skin and flesh. That's full of disgusting materials and hence not worthy of loving or getting attached with.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. VEDA UPANISHAD SUKTHAM - 68 🌹*
*🌻 1. Annapurna Upanishad - 29 🌻*
--- From Atharva Veda
✍️ Dr. A. G. Krishna Warrier
📚. Prasad Bharadwaj

V-91. 'I die not; neither do I live; being preponderantly non-existent, I am existent neither. 'I am nothing (but) Spirit', so thinking the intelligent Jivanmukta sorrows not. 

V-92. 'Stainless am I; un-ageing and unattached, with latent impressions all tranquillised. I am impartite, (the veritable) Spirit-sky', so thinking he sorrows not. 

V-93. 'Rid of the I-sense, pure, awake, un-ageing, immortal peaceful (am I), all appearances have been quietened for me', so thinking he sorrows not. 

V-94. 'I am one with Him who dwells at the tips of grass, in the sky, in the Sun, in man, the mountain, and the gods', so thinking he sorrows not. 

V-95. Discarding all mental constructions about objects, rising well above them, dwell on the thought 'I, the free, am the supreme Brahman that remains'. 

V-96. Beyond the purview of words, rid of the predicament of hankering after objects, un-agitated even by the flavour of climatic bliss, he delights in the Self by himself. 

V-97. Renouncing all actions, ever content, independent, neither by virtue, sin nor aught else is he stained. 

V-98. Just as a mirror is not stained by reflections, so is the b-Knower inwardly unstained by actions' fruits. 

V-99. Freely moving amidst the masses, he knows neither pains nor pleasures when his body is tortured or honoured, as if these are directed to (one's) reflections. 

V-100. Beyond praise and change, recognising neither worship nor its object, at once conforming and indifferent to all codes of etiquette,

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 3 / Sri Gajanan Maharaj Life History - 3 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

1. అధ్యాయము 
*🌻. పరిచయం - 2 🌻*

పండరపూర్ లో రామచంద్రపాటిల్ నన్ను కలసి, శ్రీగజానన్ మహారాజ్ జీవితచరిత్ర వ్రాయమని కోరినరోజు కార్తీక ఏకాదశి. చాలారోజులుగా నాకు శ్రీగజానన్ స్తుతి చెయ్యాలని కోరిక ఉన్నప్పటికీ అవకాశం దొరకలేదు. 

నాకోరిక శ్రీమహారాజ్ కు అర్ధం అయింది అందువల్ల శ్రీరామచంద్రపాటిల్ ను నాకోరిక పూర్తి అయ్యేందుకు కారణభూతుడ్ని చేసారు. యోగులలో మాణిక్యంలాంటి శ్రీగజానన్ మహారాజ్ వంటి యొగుల కదలికలు ఎవరు తెలుసుకోలేరు.

 బ్రహ్మ ఎట్లా ఉద్భవించింది ఎలా అయితే ఎవరికి తెలియదో, అదేవిధంగా చారిత్రకంగా ఈయన జాతి పుట్టుపూర్వోత్తరాలు తెలియవు. ఏఘనినుండి వచ్చింది అని ఆలోచించకుండా వజ్రాన్ని మెచ్చుకుంటామో, అదేవధంగా ఈయన తేజస్సును స్థుతించాలి. 

18వ శతాబ్దంలో మాఘ బహుళ సప్తమి రోజున శ్రీగజానన్ మహారాజ్ షేగాం లో ప్రకటించారు.

 శ్రీరామదాసస్వామి స్థలమయిన సజ్జన్ఘడ్ నుండి వచ్చారని కొందరు అంటారు. ఈ విషయం నమ్మడానికి సరిఅయిన దాఖలా లేకపోయినా కొంతవరకు అర్ధంఉంది. భ్రష్టాచారం, దరిద్రం బాగా వ్యాపించి ఉండడంవల్ల శ్రీరామదాస్ స్వామి, శ్రీగజానన్ మహారాజ్ రూపంలో పునర్జన్మ తీసుకుని ఉండవచ్చు. 

యోగులు ఎవరి లోనయినా ప్రవేశించగలరు. ఇంతకు ముందుకూడా అనేకమంది యోగులు ఈవిధంగా చేస్తారు. సాధారణ మనుష్య జన్మలా కాకుండా, గోరఖ్ చెత్తకుండీనుండి, కనీఫా ఏనుగు చెవినుండి మరియు చాంగ్డియొ నారాయణదోహ నుండి ఉద్భవించారు. 

యోగులలో రాజయిన శ్రీగజానన్ మహారాజ్ విషయంకూడా అలానే అయి ఉండవచ్చు. ఇకముందు ఈయన చేష్టలనుబట్టి శ్రీమహారాజుకు యోగ గూర్చిన క్షుణ్ణ అవగాహన ఉన్నట్టు తెలుస్తుంది. యోగకు మరి దేనితోను పోల్చలేని అనూహ్యమయిన ప్రత్యేకత ఉంది.

 పాపులను ఉద్ధరించడానికి శ్రీగజానన్ మాఘ బహుళ సప్తమినాడు ప్రగటించారు. షేగాంలో దేవీదాస్ పాటుర్కర్ అనే బ్రాహ్మణుడు తన కుమారుని ఋతుశాంతి విధి కారణంగా తన స్నేహితులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసాడు. ఎంగిలిఅకులు మిగిలి పోయిన తినుబండారాలతో సహాఇంటి బయట పారవేసారు. ఆచోట శ్రీగజానన్ మహారాజ్ కూర్చుని ఉండగా చూడడం తటస్థించింది. అతని శరీరంపై జీర్నావస్థలో ఉన్నచొక్కా, 

నీరు త్రాగడానికి ఒక కమండలం మరియు పొగత్రాగడానికి ఒక మట్టితో తయారుచేసిన గొట్టం తప్ప మరిఇంక ఏమీలేవు. ఉదయించే సూర్యుని తేజస్సు కల శరీరం, నాశికాగ్రంపై కేంద్రీకృతమయిన కళ్ళు అతని యోగికశక్తిని తెలియ పరుస్తున్నాయి. ఆవిధంగా పారవేసిన ఎంగిలి ఆకులనుండి మిగిలిన మెతుకులను రోడ్డు ప్రక్కన కూర్చుని అతను తీసుకుంటున్నాడు. సాధారణమానవునికి, ఈఅన్నమే బ్రహ్మ అని సూచించటమే అతని ఈచర్యకి కారణం. సూక్తులు, ఉపనిషత్తులు కూడా ఈవిషయమే చెపుతాయి.

 బనకటలాల్ అగర్ వాల్ మరియు దామోదర్ పంత్ అతని ఈవిధమయిన ప్రవర్తనకి ఆశ్చర్యపోతారు. 

నిజంగా ఆకలి వేసిఉంటే ఇతను పాటుర్కర్ లాంటిమంచి బ్రాహ్మణున్ని అర్జించి ఉంటే వెంటనే భోజనం పెట్టి ఉండేవాడుకదా అని వీరిద్దరు అనుకున్నారు. బనకట్ తన స్నేహితునితో అతని ఇకముందు కదలికలు చూద్దాము అని అన్నాడు. 

నిజమయిన యోగులు ఒక్కోసారి పిచ్చివారిగా ప్రవర్తిస్తారని వ్యాసుడు భాగవతంలో అన్నాడు. ఇతని విషయం కుడా అలాంటిదే కావచ్చు. అనేకమంది ఆదారినుండి వెళ్ళారు కానీ వీరద్దరే ఈవ్యక్తిని పరిశీలించేందుకు ఆకర్షితులయ్యారు. 

తెలివయిన మరియు ప్రజ్ఞావంతులు మాత్రమే గుళకరాళ్ళలోని వజ్రాన్ని వెతకగలరు. ఆ రోడ్డు మీద పడిన అన్నం ఎందుకు తింటున్నావు అని అడుగుతూ నేను మంచి భోజనం పెడతాను అని అతనితో బనకటలాల్ అంటాడు. దానికి సమాధానంగా శ్రీగజానన్ కేవలం వారివైపుచూస్తాడు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 3 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj 

Chapter 1 
*🌻. Introduction - 2 🌻*

It was Kartik Ekadashi day when Ramchandra Patil met me at Pandharpur and requested me to write the biography of Shri Gajanan Maharaj. It was in fact my long cherished desire to sing in praise of Shri Gajanan, but was not getting the opportunity. 

Shri Gajanan Maharaj seemed to have understood my wish and so made Ramchandra Patil a tool for the fulfilment of that desire. Nobody can know the designs of great saints like Shri Gajanan Maharaj who was a gem amongst the saints. 

Historically, nothing is known about His caste, creed or place of origin, like Brahma whose origin nobody knows. Like a brilliant diamond we should only appreciate its brilliance and not bother about the mine of its origin. 

Shri Gajanan Maharaj appeared at Shegaon on 7th Vadya Magh of 1800 Saka. Some say that he came from Sajjangad the place of Shri Ramdas Swami. Though there is no sufficient proof to accept this fact, it may have some sense in it. 

There was wide spread corruption and misery and it is possible that Shri Ramdas Swami, for the good of the people, took rebirth as Gajanan Maharaj. 

Yogis can enter anybody and many saints have done so in the past. Gorakh was born in dustbin, Kanifa in the ear of elephant and Changdeo in the Narayan Doha: all unlike the traditional human birth. 

Same may be the case of Shri Gajanan Maharaj - the king of Yogis. It will be seen from His actions that Shri Gajanan Maharaj had detailed knowledge of all yogic feats. Yoga has got a unique importance incomparable with anything else. 

Shri Gajanan appeared in Shegaon on 7th Vadya Magh for the spiritual liberation of the sinners. It so happened that there was one pious Brahmin named Devidas Paturkar at Shegaon and, to celebrate the puberty function of his son, he had arranged a lunch for his friends. 

The leftover food from the plates was thrown outside the house and Shri Gajanan Maharaj was seen sitting near that food. He had a worn out old shirt on His body, a dry gourd for drinking water, a pipe of clay for smoking and nothing else. 

His body was lustrous like the rising sun and eyes with concentrated at the tip of nose indicative of His yogic strength. Sitting by the roadside He was picking up particles of food thrown there. 

His action of picking up the food particles from the leaf plates lying on road was to convey to the common man that food is Brahma. Shruti and Upanishad say the same thing. 

Bankatlal Agrawal and Damodar Pant, who were passing by, were surprised to see His behaviour. They thought that had this man been really hungry, He would have begged for food and Shri Paturkar, being a pious man, would have given the food to Him.

Thinking thus, Bankatlal said to his friend, Let us watch His actions. Vyas has said in Bhagawat that real saints, many a times, behave like mad men, and this can be a case like that.” 

Thousands of people must have passed that way but only these two persons were attracted to observe Maharaj. Only wise men and experts can detect a diamond lying in the heap of pebbles. 

Bankatlal asked Him as to why He was eating the food lying on the road and volunteered to serve good food. In reply Shri Gajanan simply looked at them.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సౌందర్య లహరి - 53 / Soundarya Lahari - 53 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌴. తలచిన పనులు జయమగునా? ఆకర్షణ, ఇతరులలో దేవత దర్శనం 🌴*

శ్లో:53. విభక్త త్రైవర్ణ్యం వ్యతికరిత లీలాంజనతయా 
విభాతి త్వన్నేత్ర త్రితయమిద మీశానదయితేl 
పునః స్రష్టుందేవాన్ ద్రుహిణ హరిరుద్రా నుపరతాన్ 
రజఃసత్త్వం భిభ్రత్తమ ఇతిగుణానాంత్రయమివll 
 
🌻. తాత్పర్యం : 
అమ్మా ! ఓ ఈశ్వరుని ప్రియురాలా ! నీ మూడు నేత్రములు అర్ధ వలయాకారముగా సౌందర్యము కొఱకై తీర్చి దిద్దిన కాటుక తెలుపు,ఎరుపు, నలుపు అను మూడు విభిన్న రంగులు గలదై నీ యందు లీనమైన బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులను మరల ఈ బ్రహ్మాండమును తాకుటకు సత్వ రజస్తమో గుణములుగా ప్రకాశించు చున్నది కదా ! 
  
🌻. జప విధానం - నైవేద్యం :--

ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, పాయసం నివేదించినచో తలచిన పనులు అవుతాయా? కావా? తెలుస్తుందని, మరియూ ఇతరులలో దేవతని చూడగల సమత్వాన్ని, ఎదుగుటకు అవకాశాలను ఇస్తుంది, అని చెప్పబడింది. దీపం పెట్టి, అది ప్రకాశవంతంగా వుందా లేక మందకొండిగా ఉందా చూడాలి.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 SOUNDARYA LAHARI - 53 🌹*
📚Prasad Bharadwaj 

SLOKA - 53 

*🌴 To know Expected works are successful ?, Attracting all the World and Seeing Goddess in Person 🌴*

53. Vibhaktha-traivarnyam vyatikaritha-lila'njanathaya Vibhati tvan-netra-trithayam idam Isana-dayite; Punah strashtum devan Druhina-Hari-Rudran uparatan Rajah sattvam vibhrat thama ithi gunanam trayam iva 
 
🌻 Translation :
Oh, darling of god Shiva, those three eyes of thine, colored in three shades, by the eye shades you wear, to enhance thine beauty, wear the three qualities, of satvam, rajas and thamas,as if to recreate the holy trinity, of Vishnu, Brahma and rudra, after they become one with you, during the final deluge.

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) : 

If one chants this verse 1000 times a day for 45 days, offering milk payasam as prasadam, it is believed that they will be blessed by the lord with all wishes. Gives the ability to see wishes fulfilled or not and Seeing Goddess in Person. This is usually chanted by performing puja to holy lamp (deepam).

🌻 BENEFICIAL RESULTS: 
Vision of Devi and power to foresee future (lamp burning bright is considered as good omen). 
 
🌻 Literal Results: 
Very good for renewing or restarting career ventures/personal relationships.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 352 / Bhagavad-Gita - 352 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 33 🌴

33. కిం పునర్బ్రాహ్మణా: పుణ్యా భక్తా రాజర్షయస్తథా |
అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వమామ్ ||

🌷. తాత్పర్యం :
ఇక ధర్మాత్ములైన బ్రాహ్మణుల గూర్చియు, భక్తుల గూర్చియు, రాజర్షుల గూర్చియు వేరుగా చెప్పవలెనా! అందుచే అనిత్యమును, అసుఖమును అగు ఈ లోకమునకు వచ్చియున్నందున నా ప్రేమయుక్తసేవలో నియుక్తుడవగుము.

🌷. భాష్యము : 
భౌతికజగమున జనులలో పలువర్గములున్నను వాస్తవమునకు వారెవ్వరికినీ ఈ జగము సుఖకరమైన ప్రదేశము కాదు. కనుకనే “అనిత్యమ్ అసుఖం లోకమ్” అని స్పష్టముగా తెలుపబడినది. అనగా ఈ భౌతికజగత్తు అశాశ్వతము, దుఃఖపూర్ణమునై సజ్జనుడైనవాడు నివసించుటకు యోగ్యము కాకున్నది. ఈ జగము శ్రీకృష్ణభగవానునిచే అశాశ్వతమైనదిగను మరియు దుఃఖపూర్ణముగను ప్రకటింపబడగా, కొందరు తత్త్వవేత్తలు (ముఖ్యముగా మయావాదులు) దీనిని మిథ్యగా వర్ణింతురు. కాని గీత ప్రకారము జగత్తు ఆశాశ్వతమే గాని మిథ్య కాదు. మిథ్యత్వము మరియు అనిత్యత్వముల నడుమ భేదము కలదు. భౌతికజగము అశాశ్వతము. కాని దీనికి పరమైన వేరొకజగము నిత్యమైనది. అలాగుననే ఈ జగము దుఃఖపూర్ణము. కాని దీనికి పరమైన జగము నిత్యమైనది మరియు ఆనందపూర్ణమైనది.

అర్జునుడు రాజర్షుల వంశములో జన్మించినట్టివాడు. అతనికి సైతము “నా భక్తియోగమును చేపట్టి శీఘ్రమే నా ధామమును చేరుము” అని శ్రీకృష్ణుడు ఉపదేశమొసగియుండెను. అనగా దుఃఖపూర్ణము మరియు ఆశాశ్వతమైన ఈ లోకముననే ఎవ్వరును నిలిచిపోరాదు. ప్రతియొక్కరు శ్రీకృష్ణభగవానుని ఆశ్రయించి నిత్యానందమును పొందవలెను. అన్ని తరగతుల జనుల సమస్యలు పరిష్కరింపబడుటకు ఆ దేవదేవుని భక్తియోగమే ఏకైక విధానము. కనుక ప్రతియొక్కరు కృష్ణభక్తిరసభావనము అలవరచుకొని తమ జీవితమును పూర్ణము కావించుకొనవలెను.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 352 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 33 🌴

33. kiṁ punar brāhmaṇāḥ puṇyā
bhaktā rājarṣayas tathā
anityam asukhaṁ lokam
imaṁ prāpya bhajasva mām

🌷 Translation : 
How much more this is so of the righteous brāhmaṇas, the devotees and the saintly kings. Therefore, having come to this temporary, miserable world, engage in loving service unto Me.

🌹 Purport :
In this material world there are classifications of people, but, after all, this world is not a happy place for anyone. It is clearly stated here, anityam asukhaṁ lokam: this world is temporary and full of miseries, not habitable for any sane gentleman. This world is declared by the Supreme Personality of Godhead to be temporary and full of miseries. Some philosophers, especially Māyāvādī philosophers, say that this world is false, but we can understand from Bhagavad-gītā that the world is not false; it is temporary. There is a difference between temporary and false. This world is temporary, but there is another world, which is eternal. This world is miserable, but the other world is eternal and blissful.

Arjuna was born in a saintly royal family. To him also the Lord says, “Take to My devotional service and come quickly back to Godhead, back home.” No one should remain in this temporary world, full as it is with miseries. Everyone should attach himself to the bosom of the Supreme Personality of Godhead so that he can be eternally happy. The devotional service of the Supreme Lord is the only process by which all problems of all classes of men can be solved. Everyone should therefore take to Kṛṣṇa consciousness and make his life perfect.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శివగీత - 11 / The Siva-Gita - 11 🌹


*🌹. శివగీత - 11 / The Siva-Gita - 11 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

ద్వితీయాధ్యాయము
*🌻. వైరాగ్య యోగము - 2 🌻*

సూర్యోసౌ సర్వ లోకస్య - చక్షుష్వేన వ్యవస్థితః ,
తధాపి చాక్షుషై ర్దో షై - చక్షుష్వేన వ్యవస్థితః 7
తధాపి చాక్షు శైర్దో షై - ర్నక దాచి ద్విలిప్యతే,
సర్వ భూతాన్త రాత్మా సిత ద్వద్దు: ఖైర్న లిప్యతే 8
దేహో పిమల పిణ్నోయం - ముక్త జీవో జడాత్మకః,
దహ్యతే వహ్నినా కాష్టై - శ్శివా ద్యైర్భ క్ష్యతే పివా 9
తధాపి నైవ జానాతి - విర హేత స్య కావ్యధా,
సువర్ణ గౌరీ దూర్వాయా దళ వచ్చ్యా మలాపివా 10
పీనోత్తుంగ స్తనా భోగ -భుగ్న సూక్ష్మా వ లగ్నకా,
బృహన్నితం బజఘనా - రక్తపాద సరో రుహా 11
రాక చన్ద్ర ముఖీ బింబ - ప్రతి బింబ రదచ్చదా,
నీలేందీ వరనీ కాశ- నయన ద్వయ శోభితా 12
మత్త కోకిల సల్లాపా - మత్త ద్విరద గామినీ,
కటాక్ష్యైరను గ్రుహ్లాతి మాం - పంచే సుశోరొత్త మై:13
ఇతియో మన్యతే మూర్జ - స్సచ పంచే సుశాసితః,

బంగారు వర్ణము గలది లేత గరిక మావి శ్యామ లయ, బిగువు చనుదోయి (కలశ స్తనములు) గలది . దొండ పండు వంటి క్రింది పెదవి గలది. ఇందు ముఖియు మున్నగు విశేష నామములతో కూడిన యువతులు క్రీగంటి చూపుల వలన నూ పూవిలు కాని నుండి దప్పించి కాపాడు నని ఎవ్వడైతే తలచునో అట్టి అవివేకి మన్మధుని చేత శిక్షింప బడి న వాడే యగును.

తస్యా వివేకం వక్ష్యామి - శృణుష్వా వహితో నృప
నచ స్త్రీ పుమానేష - న చైవాయం నపుంసకః 14
అమూర్తః పురుషః పూర్ణో - ద్రష్ట్రా సాక్షీ సజీవనః
యాతన్వంగీ మృదుర్బాలా - మల పిండాత్మికా జడా 15

అటువంటి వాడి వివేకము ఎట్టిదో దానిని గురించి వివరించు చున్నాను.
 శ్రద్ధతో వినుము. పరమాత్ముడు స్త్రీ, పురుష ,నపుంసకముల కతీత మైన వాడు. మూర్తిత్వర హితుడు, సర్వాంతర్యామి, సమస్తమునకు సాక్షి భూతుడు, సర్వాపేక్షకుడు, సమస్త జీవితము కూడా అగును.

సాన పశ్యతి యత్కిం చిన్న - శ్రణో తిన జిఘ్రతి,
చర్మ మాత్రా తను స్త సయా- బుద్ధ్యా వీక్ష స్వరాఘవ! 16
యా ప్రాణ దదికా సైవ- హస్తతే స్యా ద్ఘ్రుణా స్పదమ్,
జాయన్తే యది భూతేభ్యో - దేహినః పాంచ భైతికాః 17

సున్నితము, కోమలమైన యుపాంగములు (అవయములు ) కలిగి, మల మూత్ర పిండాత్మకము, జడదేహము గలది యునైన ఎవనిత యనబడినదై, ఇతరులను జూడదు, వినదు, వాసన కూడా చూడదు. 

 ఓ రామా! వివేక జ్ఞానముతో నొక పరి దర్శింపుము.
 
నీవు దేనినైతే నీ ప్రాణము కంటెను మిన్నగాను, ప్రేమకు పాత్రమైనది గాను దల పోయు చుంటివో అట్టి శరీరము తోలు తిత్తి మాత్రమే. హేయాస్పద మైనది. దానిని నీవు ప్రేమింప దగదు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 The Siva-Gita - 11 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 02 : 
*🌻 Vairagya Yoga - 2 🌻*

Having a golden hue, having pitcher like breasts, having bimba fruit kind of lower lip, a face resembling a full moon etc.; with such adjectives when a man gets trapped, such ignorant person gets punished by the Manmadhathe God of love!

14. 15. I am describing about that kind of person's ignorance. Listen with attention. Paramatma is beyond gender attribute. He is neither male, nor female, nor eunuch. He is formless, omnipresent, a witnesser of everything, and is everything.

16. That which has soft slender body parts, that is a malamootra pinda (a body containing faeces and urine). It doesn't see , smell or listen to others. O Rama! With your divine knowledge look at it once. 

17. That body whom you are considering worthy of love and infatuation, is nothing but a bag of skin and flesh. That's full of disgusting materials and hence not worthy of loving or getting attached with.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹