కపిల గీత 2వ భాగము - కపిల దేవహూతి సంవాదం. - కపిల భగవానుని అవతరణ మరియు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత - 2 (Kapila Gita 2 - The Conversation of Kapila and Devahuti - The Purpose of Lord Kapila's Descent and The Importance of Transcendental Knowledge - Part 2)


🌹 కపిల గీత 2వ భాగము - కపిల దేవహూతి సంవాదం. - కపిల భగవానుని అవతరణ మరియు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యత - 2 🌹

ప్రసాద్ భరద్వాజ

https://youtu.be/7blrCBVgZ7I


కపిల గీత 2వ భాగంలో కపిల భగవానుని మరియు దేవహూతి మధ్య జరిగిన దివ్య సంభాషణలో, కపిల స్వామి అవతార లక్ష్యాన్ని మరియు ఆధ్యాత్మిక జ్ఞాన ప్రాముఖ్యతను ఈ వీడియోలో వివరించడం జరిగింది. దీనిలో పురుషోత్తముడైన భగవంతుడు సకల జీవులను పోషించి, యోగిక ప్రమాణాలకు ప్రేరణనిచ్చే శ్రేష్ఠతను అర్థం చేసుకొనవచ్చు. ఈ భాగం శౌనకుడు చెప్పిన శ్లోకాల ద్వారా, ఉపనిషత్తుల శాశ్వత సత్యాలు, భగవంతుని పాదారవిందాల చెంత శరణు పొందే జీవిత సారాన్ని వివరిస్తుంది.

🌹🌹🌹🌹🌹


Kapila Gita 2 - The Conversation of Kapila and Devahuti - The Purpose of Lord Kapila's Descent and The Importance of Transcendental Knowledge - Part 2


🌹 Kapila Gita 2 - The Conversation of Kapila and Devahuti - The Purpose of Lord Kapila's Descent and The Importance of Transcendental Knowledge - Part 2 🌹

Prasad Bharadwaj


https://youtu.be/2G2_NesKnkM

Explore the profound teachings of Kapila Gita Part 2, where Kapila and Devahuti's divine conversation highlights the purpose of Lord Kapila's descent and the significance of transcendental knowledge. Discover how the Supreme Lord, as Purushottama, nourishes all beings and inspires yogic excellence. This video delves into the verses of Saunaka, the eternal truths of the Upanishads, and the ultimate goal of surrendering at the Lord's lotus feet for spiritual fulfillment.

🌹🌹🌹🌹🌹

कपिला गीता भाग 2. - कपिला और देवहूति का संवाद - भगवान कपिला के अवतरण का उद्देश्य और आध्यात्मिक ज्ञान का महत्व - 2. (Kapila Gita 2 - The Conversation of Kapila and Devahuti - The Purpose of Lord Kapila's Descent and The Importance of Transcendental Knowledge - Part 2)


🌹 कपिला गीता भाग 2. - कपिला और देवहूति का संवाद - भगवान कपिला के अवतरण का उद्देश्य और आध्यात्मिक ज्ञान का महत्व - 2. 🌹

प्रसाद भारद्वाज

https://youtu.be/hKND-ePxaCo

कपिल गीता के दूसरे भाग में कपिल भगवान और देवहूति के बीच हुए दिव्य संवाद को प्रस्तुत किया गया है। इस वीडियो में कपिल भगवान के अवतार का उद्देश्य और आध्यात्मिक ज्ञान के महत्व को समझाया गया है। इसमें पुरुषोत्तम भगवान द्वारा सभी जीवों का पालन-पोषण और योगिक उत्कृष्टता के लिए प्रेरणा प्रदान करने की महत्ता को समझाया गया है। इस भाग में शौनक द्वारा बताए गए श्लोक, उपनिषदों के शाश्वत सत्य और भगवान के चरणों में शरण लेने के जीवन के उद्देश्य को विस्तार से समझाया गया है।

🌹🌹🌹🌹🌹

కార్తిక పురాణం - 22 - పురంజయుడు కార్తిక పౌర్ణమీ వ్రతము చేయుట (Kartika Puran - 22 - Puranjaya performing the Kartika Purnima Vrata)


🌹. కార్తిక పురాణం - 22 🌹

🌻. 22 వ అధ్యాయము - పురంజయుడు కార్తిక పౌర్ణమీ వ్రతము చేయుట 🌻

ప్రసాద్ భరద్వాజ


మరల అత్రి మహాముని అగస్త్యునకిట్లు చెప్పదొడగెను.


పురంజయుడు వశిష్టుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియై దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి, శ్రీహరిని గానముచేసి, సాష్టాంగ నమస్కారము చేసి, సూర్యోదయముకాగానే నదికిపోయి, స్నానమాచరించి తన గృహమున కరిగెను. అట్టి సమయములో విష్ణుభక్తుడగు ఒక వృద్ద బ్రాహ్మణుడు - మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమిపించి "రాజా! విచారింపకుము నీవు వెంటనే చెల్లాచెదురైయున్న నీ సైన్యమును కూడాదీసుకొని, యుద్ద సన్నద్ధుడై శత్రురాజులతో పోరు సల్పుము, నీ రాజ్యము నీకు దక్కును", అని దీవించి అదృశ్యుడయ్యెను.

"ఈతడెవరో మహాను భావునివలె నున్నాదు, అని, ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధసన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోథముతో నున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి. అదియును గాక, శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా!

ఆ యుద్దములో కాంభోజాది భూపాలురు ఓడిపోయి "పురంజయా రక్షింపుము రక్షింపు"మని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులయిన వారికి శత్రుభయము కలుగుతుందా! విషం త్రాగినాను అమృతమే యగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని యివ్వగా 'శ్రీ హరి' అని ప్రార్ధించి త్రాగగా అమృతమైనది గదా! శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు వున్నంత వరకును ధృవుడు చిరంజీవియే గదా!

హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై కరచును. కార్తీకమాసమంతయు నదీ స్నానమొనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారధన చేసినచో సర్వవిపత్తులును పటాపంచలగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి యే జాతి వారికైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును. వేదాధ్యయన మొనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠానతత్పరుడైన వైష్ణవోత్తముని హృదయపద్మమున భగవంతుడుండును. సంసారసాగర ముత్తరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహాఋషులు - మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తినొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలె కాపాడుచుండును. ఎవరికైనను శక్తి లేని యెడల వారు తమ ద్రవ్యమును వెచ్చించియైనను మరి యొకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు, భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదాసంపదల నొసంగి కాపాడు చుండెను.

శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, వెయ్యి సూర్యభగవానుల తేజస్సు గలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, పద్నాలుగు లోకములను తన కుక్షియందిడుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీమహావిష్ణువునకు అతిప్రియమైన కార్తీక మాసవ్రతమును భక్తి శ్రద్దలతో ఎవరు చేయుదురో వారి యింట శ్రీమహావిష్ణువు లక్ష్మి సమేతుడై వెలయగలడు. ఆ యిల్లు సిరిసంపదలతో కలకలలాడును. కార్తీకమాసములో శుచియై పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీకమహాత్మ్య మందలి ద్వావి౦శోధ్యాయము - ఇరవై రెండవో రోజు పారాయణము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 577 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 577 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।
మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥ 🍀

🌻 577. 'మాతృకా వర్ణరూపిణీ' - 1 🌻


వర్ణాక్షరముల రూపమున నుండనది శ్రీమాత అని అర్థము. మాతృక లనగా అక్షరములు. అనగా క్షరము గానివి. నాశనము లేనివి. అవి శబ్దములు. ఆ శబ్దములకు శ్రీమాత రూప మేర్పరచును. అ, ఇ, ఉ అను శబ్దములకు అక్షర రూపము లున్నవి కదా! అపుడే వానిని వ్రాయగలము. అక్షరములు వేరు, అక్షర రూపములు వేరు. అక్షరములకు శబ్దము, రంగు, రూపము యిచ్చునది శ్రీమాత. అంతియే కాదు, వానికి అర్థమును కూడ నిచ్చును. ఉదాహరణకు 'అ' అను శబ్దమున్నది. దాని అర్థము పరతత్వము. (అక్షరములలో 'అ' నేను అని శ్రీకృష్ణుడు పలికినాడు.) దాని వర్ణము (రంగు) నీలము వలె గోచరించును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 116. Parashaktih paranishta pragynana ghanarupini
madhvipanalasa matta matrukavarna rupini ॥116 ॥ 🌻

🌻 577. 'Mātr̥kā Varṇarūpiṇī' - 1 🌻


The meaning of "Śrī Māta" is that she resides in the form of letters (varṇākṣaras). "Mātr̥kā" refers to the letters, which are imperishable (not subject to destruction). These letters are sounds, and Śrī Māta gives form to these sounds. For instance, the sounds "A", "I", and "U" have corresponding written forms, enabling us to write them. Letters (varṇas) and their forms are distinct. Śrī Māta bestows sound, color, and shape upon the letters. Not only that, but she also assigns meaning to them. For example, the sound "A" carries the meaning of transcendence (paratattva). (In the alphabet, "A" symbolizes "I" as proclaimed by Śrī Krishna.) The color associated with "A" is perceived as blue.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹