మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 77



🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 77 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. నా పాదాల మీద పడటం‌ కాదు, నీ పాదాల మీద నీవు నిలబడు. 🌻


ఏడు సంవత్సరములు నిండుదనముగా ఉండుటను అభ్యసించినచో తిండికి, గుడ్డకు ఎన్నడూ లోటు రాదు.

నీ ప్రకారము ధర్మము ఉండదు. ధర్మముము అనుసరించి నీవే నడువవలెను.

ఎవ్వరికిని అడ్డురాకుండా నీ పనిని నీవు సక్రమముగా చేసికొనుము.

నీలో సోమరితనమును పోగొట్టుకొనవలెను. ఇతరులు బాగుపడుచున్నారని, పనులు చేసుకొనుచున్నారని ఏడ్చుట అసూయను సూచించును.


.....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


04 Sep 2021

వివేక చూడామణి - 125 / Viveka Chudamani - 125


🌹. వివేక చూడామణి - 125 / Viveka Chudamani - 125🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 26. ఆత్మ మార్పులేనిది - 12 🍀


413. ఎపుడైతే శరీరము నుండి ప్రాణము వెళ్ళి ఎముకల గూడుతో కూడిన శరీరము మిగులుతుందో, యోగి తాను తిరిగి సమాధి స్థితి నుండి బయటకు వచ్చిన తరువాత కూడా ఆ శరీరానికి అంటిపెట్టుకొని ఉండడు. అది కంటికి కనిపించనప్పటికి దాని గూర్చి పట్టించుకోడు. మనిషి యొక్క నీడలా అది పక్కనే ఉన్నప్పటికి దాన్ని పట్టించుకోడు. ఆ నీడలన్ని గత జన్మల కర్మ ఫలితాలే.

414. ఆత్మను తెలుసుకొన్నవాడు శాశ్వతమైన, స్వచ్ఛమైన జ్ఞానాన్ని ఆనందాన్ని అనుభవిస్తూ శరీరము యొక్క పరిమితులకు అతీతముగా జీవిస్తాడు. ఈ శరీరము అపవిత్రమైన మురికితో ఉన్నది. ఎవడైన కక్కిన కూటికి ఆశిస్తాడా! అలానే యోగి దాన్ని గుర్తుతెచ్చుకొనుటకు కూడా ఇష్టపడడు.

415. ఈ ప్రాపంచిక వస్తు విశేషములన్నింటిని దగ్దముచేసి మూలము కూడా లేకుండా, నిజమైన జ్ఞాని తరువాత ఒంటరిగా ఆత్మగా స్వచ్ఛమైన, శాశ్వతమైన విజ్ఞానముతో కూడిన ఆనందములో ఉండును.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹 VIVEKA CHUDAMANI - 125 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 26. Self is Unchangeable - 12 🌻


413. After the body has once been cast off to a distance like a corpse, the sage never more attaches himself to it, though it is visible as an appearance, like the shadow of a man, owing to the experience of the effects of past deeds.

414. Realising the Atman, the eternal, pure Knowledge and Bliss, throw far away this limitation of a body, which is inert and filthy by nature. Then remember it no more, for something that has been vomited excites but disgust when called in memory.

415. Burning all this, with its very root, in the fire of Brahman, the Eternal and Absolute Self, the truly wise man thereafter remains alone, as the Atman, the eternal, pure Knowledge and Bliss.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


04 Sep 2021

శ్రీ శివ మహా పురాణము - 448


🌹 . శ్రీ శివ మహా పురాణము - 448🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 30

🌻. పార్వతి గృహమునకు మరలి వచ్చుట - 2 🌻

తరువాత ఆమెకు బంధువులగు ఇతరస్త్రీలు, సోదరుల భార్యలు గూడ మహానందముతో పరమప్రీతితో ఆమెను గట్టిగా కౌగిలించుకొనిరి (15). నీవు వంశమును తరింపజేయు పుణ్యకార్యమును చక్కగా సాధించితివి. నీ పవిత్రమగు ఆచరణచే మేమందరము కూడా పవిత్రులమైతిమి (16). ఇట్లు వారందరు మహాహర్షముతో ఆమెను బాగుగా కొనియాడి, సుగంధ ద్రవ్యములతో, మరియు మంచి పుష్పములతో ఆ శివాదేవిని ఉల్లాసముగా చక్కగా పూజించిరి (17). ఆ సమయములో ఆకసమునందు విమానములలో నున్న దేవతలు ఆనందముతో మంగళకరమగు పుష్పవృష్టిని గురిపించి ఆమెకు నమస్కరించి స్తోత్రములను చేసిరి (18).

అపుడు బ్రాహ్మణులు మొదలగువారందరు ఆనందముతో ఆమెను ప్రకాశించే గొప్ప రథములో కూర్చుండబెట్టి నగరములో ప్రవేశబెట్టిరి (19). అపుడు బ్రాహ్మణులు, పురోహితుడు, చెలికత్తెలు మరియు ఇతర స్త్రీలు పార్వతిని సన్మాన పూర్వకముగా ఇంటిలో ప్రవేశపెట్టిరి (20). స్త్రీలు ఆమెకు దిష్టి తీసిరి. బ్రాహ్మణులు ఆశీర్వచనములను పలికిరి. ఓ మహర్షీ! తల్లిదండ్రులగు మేనా హిమవంతులు మిక్కలి ఆనందించరి (21). తన గృహస్థాశ్రమము సఫలమైనదనియు, చెడు పుత్రునికంటె పుత్రికయే శ్రేష్ఠమనియు భావించిన హిమవంతుడు నిన్ను (నారదుని)'బాగు, బాగు' అని స్తుతించెను (22).

ఆ పర్వతరాజు బ్రాహ్మణులకు, వందిమాగధులకు ధనము నిచ్చెను. బ్రాహ్మణులచే మంగళ పాఠములను చదివించెను. గొప్ప ఉత్సవమును చేయించెను (23). ఓ మహర్షీ! ఈ తీరున తమ కుమార్తెచే సంతసించిన తల్లిదండ్రులు, సోదరులు మరియు వారి భార్యలు మహానందముతో వాకిట గూర్చిండిరి (24).

ఓ కుమారా! తరువాత మిక్కిలి ఆనందించి, ప్రసన్నమగు మనస్సును కలిగియున్న ఆ హిమవంతుడు అందరిని ప్రీతి పూర్వకముగా ఆదరించి స్నానము చేయుటకు గంగానదికి వెళ్లెను (25). ఇంతలో భక్తవల్సలుడు, లీలలను చూపువాడు నగు శంభుడు నాట్యము చేసే నటుని రూపమును ధరించి మేనాదేవి వద్దకు వెళ్లెను (26).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


04 Sep 2021

గీతోపనిషత్తు -249


🌹. గీతోపనిషత్తు -249 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚

శ్లోకము 27

🍀 26. యోగ యుక్తుడు - జీవుడు దేవునితో కూడి యుండుట దైవయోగము. అట్లు దైవముతో కూడియున్నవాడు ఎందున్నను ఒక్కటియే. అతడెచ్చట యున్నను, అచట దైవముతోనే యుండును గనుక, దైవమును చేరుట అను భ్రమ యుండదు. విడిపోయిన వాడు చేరు ప్రయత్నము చేయవలెను. కూడియున్న వాడు అట్లుండుటయే గాని చేయుట యుండదు. అట్టి వానినుండి దైవీగుణములగు ఇచ్ఛా జ్ఞాన క్రియలు ప్రకాశించుచునే యుండును. అట్టి వానినుండి దివ్య కార్యములు జరుగుచు నుండును. జరుగుచున్నది చూచుచు, దివ్య వైభవమున కానందించుటయే గాని, తాను చేయుచున్నాననే మెర మెర జ్ఞానికి యుండదు. తాను దైవమందుండుట వలన తన నుండి నిర్వర్తింపబడ వలసిన కార్యములు దైవ ప్రకృతే నిర్వర్తించును. 🍀



నైతే సృతి పార్థ జాన న్యోగీ ముహ్యతి కశ్చన |
తస్మాత్సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున || 27

తాత్పర్యము : జ్ఞానయోగి శుక్ల కృష్ణ మార్గముల యందు మోహపడడు. కనుక ఓ అర్జునా! నీవు యోగయుక్తుడవు కమ్ము.

వివరణము : యోగయుక్తు డనగా సర్వకాల సర్వావస్థల యందును దైవముతో కూడియున్న వాడని అర్థము. యోగమనగా కూడిక. పతి, పత్నియోగము, సంతానయోగము, ధనయోగము,

అట్లే వియోగము అను పదములను వినుచుందుము. కూడి యుండుట యోగము లేక భక్తి. విడిపోవుట వియోగము లేక విభక్తి.

జీవుడు దేవునితో కూడి యుండుట దైవయోగము. అట్లు దైవముతో కూడియున్నవాడు ఎందున్నను ఒక్కటియే. అతడెచ్చట యున్నను, అచట దైవముతోనే యుండును గనుక, దైవమును చేరుట అను భ్రమ యుండదు. విడిపోయిన వాడు చేరు ప్రయత్నము చేయవలెను. కూడియున్నవాడు అట్లుండుటయే గాని చేయుట యుండదు. అట్టి వానినుండి దైవీగుణములగు ఇచ్ఛా జ్ఞాన క్రియలు ప్రకాశించుచునే యుండును. అట్టి వానినుండి దివ్య కార్యములు జరుగుచు నుండును. జరుగుచున్నది చూచుచు, దివ్య వైభవమున కానందించుటయే గాని, తాను చేయుచున్నాననే మెర మెర జ్ఞానికి యుండదు.

అట్టి జ్ఞానయోగికి ఇహమైనను, పరమైనను ఒకటే. ఏ జాతి యందు జన్మించినను ఒకటే. ఏ కులమందు జన్మించిననూ ఒకటే. ఏ లోకమందున్నను ఒకటే. అట్టి వానికి ఎక్కువ తక్కువలు గాని, జ్ఞానాజ్ఞానములు గాని భేదముండదు. తాను దైవమందుండుట వలన తన నుండి నిర్వర్తింపబడ వలసిన కార్యములు దైవ ప్రకృతే నిర్వర్తించును. కనుకనే జ్ఞానియగు భక్తునికి, యోగికి మోహ ముండు అవకాశమే లేదు. అతడు సర్వకాలము లందు, సర్వ దేశములందు దైవముతో కూడియుండుట వలన మాయ చేరనేరదు. కనుక మోహము కలుగదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


04 Sep 2021