మైత్రేయ మహర్షి బోధనలు - 72


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 72 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 58. అపౌరుషేయము 🌻


అజ్ఞానమును, అంధ విశ్వాసములను, భీతిని పారద్రోలుట, జ్ఞానమును, సంకల్ప బలమును, ధీరతను పెంపొందించుట మా ప్రణాళికలోని అంశములు. ప్రజ్ఞా వికాసములకు తోడ్పడు ప్రతి ప్రయత్నమునకు మేము తోడ్పడుదుము. తత్సంబంధమైన సంకల్పములను అదృశ్యముగ ప్రోత్సహింతుము. ఊహలను అపోహలను నిర్మూలించి, జీవులకు కర్తవ్యోన్ముఖులను చేయుట కూడ మా ప్రణాళికలో భాగము. శ్రమకోర్చి పనిచేయువారికి సహకారమునందించి సంఘ జీవనమున వారికొక చక్కని ప్రణాళిక నేర్పరచి తీర్చిదిద్దుట తెర వెనుక నుండి నిర్వర్తించు చుందుము.

మాచే ఎన్నుకొనబడిన వారికి స్ఫూర్తిని కలిగించి వారి నుండి సనాతనమగు ధర్మమార్గమును జనజీవనమునకు అందించుట గూడ మా కర్తవ్యములలో ఒకటి. అసామాన్యునివలె శక్తి సామర్థ్యములను గఱపి సామాన్య జీవనమున మా శిక్షితులు లోకహిత కార్యములను నిర్వర్తించు చుందురు. ఉత్తమోత్తమమైన సత్యము, ధర్మము అతి నిర్మలముగను, సామాన్యముగను, రహస్యముగను నిర్వర్తింపబడుట సృష్టి యందలి ధర్మము. ఈ ధర్మమును పాటించుచు వేలాది సంవత్సరములు ప్రత్యేక గుర్తింపు కొఱకు కాక, లోకహితము కొఱకు నిర్వర్తించుట మా విధానము. మే మొనర్చునదంతయు అపౌరుషేయమే.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


12 Feb 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 135


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 135 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మేలుకోవడానికి నీ సమస్త శక్తుల్ని కేంద్రీకరించు. నువ్వు ఎప్పుడయితే పూర్తిగా మేలుకుంటావో, ఇరవై నాలుగు గంటలూ మెలకువతో వుంటావో, అంటే నిద్రపోతున్న సమయంలోనూ స్పృహతో వుంటావో, చైతన్యంతో వుంటావో శరీరం నిద్రపోతున్నా ఆత్మ మేల్కొని వుంటుందో అది నిజమైన మెలకువ. అప్పుడు వ్యక్తి సంతృప్తి చెందుతాడు. 🍀


మన కోరికలు మన కలలు. మన ఆలోచనలన్నీ మన కలలు. మనం నిద్రపోతూ వుంటాం కాబట్టి మనం కలలో జీవిస్తూ వుంటాం. కలలన్నవి మన నిద్రలో మాత్రమే వునికిలో వుంటాయి. మనం మేలుకున్న వెంటనే కలలు మాయమవుతాయి. కలల్ని దాటి వెళ్ళడమంటే మేలుకోవడమే. ఇదే సరయిన సమయం. నువ్వు కావలసినంత నిద్రపోయావు. ఎన్నెన్నో జీవితాల పాటు నిద్రపోయావు. మేలుకోవడానికి కలిగిన ఈ అవకాశాన్ని చేజార్చుకోకు. యిది అరుదయిన అవకాశం. దీన్ని సులభంగా చేజార్చుకోవచ్చు. కాబట్టి మేలుకోవడానికి నీ సమస్త శక్తుల్ని కేంద్రీకరించు.

ఆరంభంలో దాదాపు అది అసాధ్యమనిపిస్తుంది. ఎట్లా చెయ్యాలి? వ్యక్తి ప్రయత్నించే కొద్దీ వీలవుతుంది. ఒక క్షణం ఒక మెరుపు చాలు. నీ అస్తిత్వాన్ని మేలుకొలుపుతుంది. అట్లా క్రమక్రమంగా క్షణాలు కొనసాగుతాయి. నువ్వు ఎప్పుడయితే పూర్తిగా మేలుకుంటావో, ఇరవై నాలుగు గంటలూ మెలకువతో వుంటావో, అంటే నిద్రపోతున్న సమయంలోనూ స్పృహతో వుంటావో, చైతన్యంతో వుంటావో శరీరం నిద్రపోతున్నా ఆత్మ మేల్కొని వుంటుందో అది నిజమైన మెలకువ. అప్పుడు వ్యక్తి సంతృప్తి చెందుతాడు. తన చోటికి చేరతాడు. దానికి పూర్వం నీకు చేతనయినంతగా ప్రయత్నించు. మెలకువకు ప్రయత్నించు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


12 Feb 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 4 Sri Madagni Mahapuranm - 4


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 4 / Agni Maha Purana  - 4 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 1
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః  ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. ప్రశ్నము - 1 🌻

శ్రీ మహాలక్ష్మికిని, సరస్వతికిని, పార్వతికిని, గణపతికిని, కుమారస్వామికిని, మహేశ్వరునకును, అగ్ని దేవునకును, ఇంద్రాదులకును, శ్రీమహావిష్ణువు నకును  నమస్కరించుచున్నాను.

నైమిషారణ్యమునందు హరిని ఉద్దేశించి యజ్ఞము చేయుచున్న శౌనకాది మహర్షులు తీర్థయాత్రాసందర్భమున అచ్చటికి వచ్చిన సూతునితో ఇట్లనిరి.

ఋషులు పలికిరి : ఓ సూతుడా! నీవు (మాచేత పూజింపబడినావు) మాకు పూజ్యుడవు. దేనిని తెలసికొనినంత మాత్రముచే (మానవునకు) సర్వజ్ఞత్వము కలుగునో అట్టి సారములలో కెల్ల సార మైనదానిని మాకు చెప్పుము.

సూతుడు పలికెను - సృష్ట్యాదులను చేసిన ప్రభువును, భగవంతుడును అయిన శ్రీమహావిష్ణువే సారములలో కెల్ల సారమైన వాడు. " నేనే ఆ పరబ్రహ్మస్వరూపుడను" అని ఆ విష్ణువును గూర్చి తెలిసికొన్నచో సర్వజ్ఞత్వము కలుగును.

శబ్దములకు గోచర మగు సగుణబ్రహ్మయు, పర మగునిర్గుణబ్రహ్మయు తెలియదగినవి. అథర్వవేదమునకు సంబంధించిన ముండకోపనిషత్తు గూడ -" రెండు విద్యలు తెలిసికొనవలెను" అని చెప్పుచున్నది.

నేనును, శుకుడను, పైలుడు మొదలగువారును బదరికాశ్రమమునకు వెళ్ళి వ్యాసుని నమస్కరించి ప్రశ్నింపగా అపుడాతడు మాకు సారము నుపదేశించెను.

వ్యాసుడు పలికెను: నేను మునులతో కలిసివెళ్ళి, పరముకంటె పరమును, సారభూతముము అగు బ్రహ్మను గూర్చి ప్రశ్నింపగా వసిష్ఠుడు ఏమని చెప్పెనో, ఓ! సూతా! నీవును శుకాదులును వినుడు.

వసిష్ఠుడు పలికెను : ఓ వ్యాసా! పూర్వము అగ్ని దేవుడు మునులకును, దేవతలకును, నాకును ఏ విధముగా చెప్పెనో ఆ విధముగ సర్వవ్యాప్త మగు, ద్వివిధ మైన బ్రహ్మను గూర్చి చెప్పదను; వినుము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 4🌹
✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

🌻. Chapter 1- Questioning - 1 🌻 

I. I bow to (goddesses) Śrī (Lakṣmī), Sarasvatī, Gaurī (Pārvatī) and gods Gaṇeśa, Skanda, Īśvara (Śiva), Brahmā, Vahni, Indra and other celestials and Vāsudeva (Kṛṣṇa).

2. Śaunaka and other sages (staying at the sacred forest) of Naimiṣa, conducting a sacrifice devoted to Hari (Viṣṇu), welcomed Sūta (the reciter of ancient lores) on his arrival there after a pilgrimage.

The sages said:

3. O Sūta! You are adored by us. Tell us the quintessence of all things, by knowing which alone one gets omniscience.

Sūta said:

4. The illustrious Viṣṇu (who is) the Supreme Being (and) the Creator, is the quintessence. By know ng that ‘I am Brahman’, one gets omniscience.

5. Two Brahmans are to be known, the Śabdabrahman (the Vedas) and Parabrahman (the Supreme Spirit). The Ātharvaṇī Śruti (Muṇḍakopaniṣad) refers to this as the two (kinds of) knowledge to be learnt.

6. Myself, (sage) Śuka (son of sage Vyāsa), (sage) Paila. (disciple of sage Vyāsa) and others bowed Vyāsa having resorted to the hermitage at (holy) Badarikāśrama. He imparted to us the quintessence (of all things).

Vyāsa said:

7. O Sūta, listen in the company of Śuka and others what Vasiṣṭha has said to me about the excellent quintessence of the Brahman, when he was requested by the sages.

Vasiṣṭha said:

8. O Vyāsa, Listen, in entirety, to the two (kinds of) knowledge, which (god) Agni narrated to me in the company of the sages and the celestials.

9. The excellent Purāṇa (known as) the Āgneya (or Agni) and the two (kinds of) knowledge, Parā (the superior) and Aparā (the inferior) signifying respectively the knowledge about the Brahman and the knowledge about thel!.gveda and so on, which satisfies all the celestials (will be narrated to you).

10. The Purāṇa spoken by Agni and designated as the Āgneya by Brahmā and which gives bhukti (enjoyment) and mukti (release from mundane existence) for those who read it or hear it (will be narrated to you).

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


12 Feb 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 555 / Vishnu Sahasranama Contemplation - 555


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 555 / Vishnu Sahasranama Contemplation - 555 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 555. వృక్షః, वृक्षः, Vr̥kṣaḥ 🌻


ఓం వృక్షాయ నమః | ॐ वृक्षाय नमः | OM Vr̥kṣāya namaḥ

వృక్షః, वृक्षः, Vr̥kṣaḥ

వృక్ష ఇవాచలతయా స్థితో వృక్ష ఇతీర్యతే ।
వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్టత్యేక ఇతి శ్రుతేః ॥

వృక్షము వలె కదలనివాడు గనుక వృక్షః. వృక్షము అనుటలో ఎన్ని సంవత్సరములు గడిచినను వృక్షమునుండి ఆకులు రాలుట, క్రొత్తవి పుట్టుట, పూచుట, కాచుట మొదలగునవి ఋతు ధర్మము ననుసరించి జరుగుచున్నను, ఆకులు మొదలగునవి మారుచున్నను వృక్షము మాత్రము మార్పులేక అట్లే యుండును. అటులనే పరమాత్మ దేశకాల వస్తు కృత భేదమునకు పాత్రములగుచు ఎందరు జీవులు వచ్చుచు పోవుచున్నను ఎన్ని సృష్టులు జరిగినను పరమాత్ముడు మాత్రము ఏ మార్పును లేక స్థిరుడై యుండును.


:: శ్వేతాశ్వతరోపనిషత్ తృతీయోఽధ్యాయః ::

యస్మాత్పరం నాపర మస్తి కిఞ్చి ద్యస్మా న్నాణీయో న జ్యాయేఽస్తి కశ్చిత్ । వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్టత్యేకస్తేనేదం పూర్ణం పురుషేణ సర్వమ్ ॥ 9 ॥

ఏ బ్రహ్మముకంటే శ్రేష్ఠమైనది కానీ, వేఱైనదిగానీ, పెద్దది కానీ, చిన్నది కాని ఏదియునులేదో, ఏది ఆకాశమందు వృక్షమువలె నిలబడియున్నదో, అట్టి బ్రహ్మము చేత ఈ సమస్త ప్రపంచము పరిపూర్ణమై వ్యాప్తమైయున్నది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 555 🌹

📚. Prasad Bharadwaj

🌻 555. Vr̥kṣaḥ 🌻


OM Vr̥kṣāya namaḥ

वृक्ष इवाचलतया स्थितो वृक्ष इतीर्यते ।
वृक्ष इव स्तब्धो दिवि तिष्टत्येक इति श्रुतेः ॥

Vr̥kṣa ivācalatayā sthito vr̥kṣa itīryate,
Vr̥kṣa iva stabdho divi tiṣṭatyeka iti śruteḥ.

He stands firm like a tree and hence He is Vr̥kṣaḥ. Here a tree symbolizes that entity which stands firm even though the leaves appear and then fall going through different seasons as like the living beings that are born and then die in time. Even in spite of these cycles, the Paramātma is comparable to that tree that remains firm with its identity in tact.


:: श्वेताश्वतरोपनिषत् तृतीयोऽध्यायः ::

यस्मात्परं नापर मस्ति किञ्चि द्यस्मा न्नाणीयो न ज्यायेऽस्ति कश्चित् । वृक्ष इव स्तब्धो दिवि तिष्टत्येकस्तेनेदं पूर्णं पुरुषेण सर्वम् ॥ ९ ॥


Śvetāśvataropaniṣat - Chapter 3

Yasmātparaṃ nāpara masti kiñci dyasmā nnāṇīyo na jyāye’sti kaścit, vr̥kṣa iva stabdho divi tiṣṭatyekastenedaṃ pūrṇaṃ puruṣeṇa sarvam. 9.

The whole universe is filled by the Purusha, to whom there is nothing superior, from whom there is nothing different, than whom there is nothing either smaller or greater; who stands alone, motionless as a tree, established in His own glory.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

वेदास्स्वाङ्गोऽजितःकृष्णो दृढस्सङ्कर्षणोऽच्युतः ।
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥ ५९ ॥

వేదాస్స్వాఙ్గోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥

Vedāssvāṅgo’jitaḥkr‌ṣṇo dr‌ḍassaṅkarṣaṇo’cyutaḥ,
Varuṇo vāruṇo vr‌kṣaḥ puṣkarākṣo mahāmanāḥ ॥ 59 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


12 Feb 2022

ఏకదండి, ద్విదండి, త్రిదండి... స్వాముల చేతిలో కర్రలెందుకు ఉంటాయో తెలుసా... (Significance & Types of Sticks in the Hands of Masters)


🌹. ఏకదండి, ద్విదండి, త్రిదండి... స్వాముల చేతిలో కర్రలెందుకు ఉంటాయో తెలుసా...🌹


🌿ఆది శంకరాచార్యుల నుంచి నేటి అందరు స్వాముల వరకూ చేతిలో కర్ర ఉండటాన్ని అందరూ గమనించే ఉంటారు.

🌿స్వామీజీ అంటే కర్ర పట్టుకోవాలనుకుంటే పొరపాటే..

🌿దాని వెనుక ఎంత ఆంతర్యం ఉందో తెలుసా...

🌿ఆదిశంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజచార్యులు, జీయర్ స్వాములు మరికొందరు..వీళ్లందరి చేతిలో పొడవాటి కర్ర ఉంటుంది గమనించారా.

🌿ఏ సమయంలో చూసినా వాళ్ల చేతిలో ఉంటాయి.

🌿అదేమైనా ఊతకోసమా అంటే కానేకాదు.

🌿మరి ఎప్పుడూ చేత్తో పట్టుకుని ఉంటారెందుకు అంటారా..

🌿అవి వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తు.

🌿ఈ (దండాలు) కర్రలు వివిధ ఆకారాల్లో ఉంటాయి.

🌿అయితే ప్రతి ఆకారానికి ఓ అర్థం ఉంది.

🌿గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం పంచభూతాల సమ్మేళనమే మనిషి,

🌿కాబట్టి సన్యాసులు ఐదడుగుల కర్రను చేతపట్టుకుని తిరుగుతారని చెబుతారు.

🌿ఈ కర్రల్లో మూడు రకాలున్నాయి అవే ఏకదండి, ద్విదండి, త్రిదండి.



🌿ఏకదండి:- 🌿🌿🌿

🌿ఒక కర్రను (ఏకదండి ) ధరించేవారు అద్వైత సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు.

🌿అందుకు ఉదాహరణ ఆదిశంకరాచార్యులు.

🌿అద్వైతం అంటే జీవుడు, దేవుడు ఒక్కటేననే సిద్ధాంతం.

🌿అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని బతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదనే సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు.

🌿వీరి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టు నుంచి సేకరించిన కర్ర ఉంటుంది.



🌿ద్విదండి:- 🌿🌿🌿

🌿రెండు కర్రలు కలిపి ఒక్కటిగా కట్టి (ద్విదండి)ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతాన్ని అవలంబించేవారు.

🌿ఇందుకు ఉదాహరణ మధ్వాచార్యులు.

🌿వీరిని ‘ద్విదండి స్వాములు’అంటారు. దేవుడు వేరు– జీవుడు వేరు అని బోధిస్తారు.

🌿జీవాత్మ, పరమాత్మ వేరువేరన్నది వీరి ఉద్దేశం.

🌿జీయర్ లు అందరూ ఈ సిద్ధాంతం కిందకు వస్తారు.



🌿త్రిదండి:- 🌿🌿🌿

🌿మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి (త్రిదండి) భుజాన పెట్టుకునేవారిని తత్వత్రయం అంటారు.

🌿ఇలా ధరించే వారు విశిష్ఠాద్వైతాన్ని బోధిస్తారు.

🌿వీరిది రామానుజాచార్యుల పరంపర.

🌿శరీరంలో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని విశ్వసిస్తారు.

🌿జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యాలని, ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ,

🌿జీవుడు ఆజ్ఞానంతో సంసార బంధాన చిక్కుకుంటాడని,

🌿నారాయణుని శరణు వేడిన వారు భగవదనుగ్రహం వలన అజ్ఞానం నుంచి విముక్తులై,

🌿మరణానంతరం నారాయణ సాన్నిధ్యం, మోక్షం పొందుతారని,

🌿వారికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్ధాంతాన్ని బోధిస్తారు.

🌿ఇది ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే వాటి గురించిన వివరణ, స్వస్తి.


🌹🌹🌹🌹🌹.