విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 469, 470 / Vishnu Sahasranama Contemplation - 469, 470

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 469 / Vishnu Sahasranama Contemplation - 469🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 469. నైకకర్మకృత్‌, नैककर्मकृत्‌, Naikakarmakrt 🌻

ఓం నైకకర్మకృతే నమః | ॐ नैककर्मकृते नमः | OM Naikakarmakrte namaḥ

జగదుద్పత్తి సంపత్తి విపత్తి ప్రభృతి క్రియాః ।
కరోతీతి మహావిష్ణుర్నైకకర్మకృదుచ్యతే ॥

జగత్తుల ఉత్పత్తి, సంపత్తి అనగా ఉనికి, స్థితి, పుష్టినందియుండుట మరియూ విపత్తి అనగా ఆపద లేదా నాశము మొదలగు అనేక కర్మములను ఆచరించు శ్రీమహావిష్ణువు నైకకర్మకృత్‌ అని ఎరుగబడును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 469🌹

📚. Prasad Bharadwaj

🌻 469. Naikakarmakrt 🌻

OM Naikakarmakrte namaḥ

Jagadudpatti saṃpatti vipatti prabhrti kriyāḥ,
Karotīti mahāviṣṇurnaikakarmakrducyate.

जगदुद्पत्ति संपत्ति विपत्ति प्रभृति क्रियाः ।
करोतीति महाविष्णुर्नैककर्मकृदुच्यते ॥

Lord Mahā Viṣṇu does many actions like utpatti or creation, sampatti i.e. sustenance and vipatti which means annihilation of the worlds. Hence He is called Naikakarmakrt.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

स्वापनस्स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् ।वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः ॥ ५० ॥

స్వాపనస్స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ ।వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ॥ ౫౦ ॥

Svāpanassvavaśo vyāpī naikātmā naikakarmakrt ।Vatsaro vatsalo vatsī ratnagarbho dhaneśvaraḥ ॥ 50 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 470 / Vishnu Sahasranama Contemplation - 470🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻470. వత్సరః, वत्सरः, Vatsaraḥ🌻

ఓం వత్సరాయ నమః | ॐ वत्सराय नमः | OM Vatsarāya namaḥ

వసత్యత్రాఖిలమితి విష్ణుర్వత్సర ఉచ్యతే ఈతని యందు అఖిలమును వసించును కావున విష్ణుదేవుడు వత్సరః అని పిలువబడును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 470🌹

📚. Prasad Bharadwaj

🌻470. Vatsaraḥ🌻

OM Vatsarāya namaḥ

Vasatyatrākhilamiti Viṣṇurvatsara ucyate / वसत्यत्राखिलमिति विष्णुर्वत्सर उच्यते Since in Him everything dwells, Lord Viṣṇu is known as Vatsaraḥ.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

स्वापनस्स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् ।वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः ॥ ५० ॥

స్వాపనస్స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ ।వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ॥ ౫౦ ॥

Svāpanassvavaśo vyāpī naikātmā naikakarmakrt ।Vatsaro vatsalo vatsī ratnagarbho dhaneśvaraḥ ॥ 50 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

06 Aug 2021

దేవాపి మహర్షి బోధనలు - 122

🌹. దేవాపి మహర్షి బోధనలు - 122 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 99. శిష్య దురాచారము 🌻

బుద్ధునికి దేవదత్తుడు, ఏసుక్రీస్తునకు జూడాసే తీరని ద్రోహము చేసినట్లు చరిత్ర పుటల కెక్కినది. చరిత్ర పుటల కెక్కక సద్గురువులకు ద్రోహము గావించిన వారు కోకొల్లలు. సద్గురు వందించిన బోధలనను యథాతథముగ గ్రహించుటయే మొదలు కష్టము. ఎవరి స్వభావమును బట్టి వారు బోధనలను అవగాహన చేసుకొందురు. సద్గురువు బోధనకన్న శిష్యుని అవగాహన భిన్నముగ నుండవచ్చును. ఇది సర్వసామాన్యము.

ఈ కారణముగ బోధనలను మరల మరల శ్రద్ధగ వినవలెను. తాను వింటినని, తెలుసుకొంటినని అనుకొనువాడు అహంకారి. ఒకటికి పదిమార్లువిని తన అవగాహనను అవకాశమున్నప్పుడు సద్గురువు వద్ద పరిశీలించు కొనవలెను. ఇది మొదటి మెట్టు. తాను పొందిన అవగాహనను ఆచరణలోనికి కొనివచ్చుటకు దీనితో ప్రయత్నింపవలెను. అట్టి దీక్షకు శ్రద్ధ, భక్తి, సంకల్పబలము, ప్రధానమై నిలచును. ఆచరణ మార్గముననే బోధన ఆకళింపు కాగలదు. ఇది రెండవ మెట్టు.

ఆచరణమున ఆకళింపైన బోధనమును సహాధ్యాయులతో, బంధుమిత్రులతో వారి ఆసక్తిని బట్టి పంచుకొనుట మూడవ మెట్టు. ఇది బాధ్యతాయుతమైన శిష్యత్వము. ప్రస్తుత కాలమున బోధనలందుకొని అవగాహన చేసుకొనక, తామాచరించక ఇతరుల కందించువారు కోకొల్లలుగ నున్నారు. ఈ స్వభావము శిష్యులలో ఈనాడు కొత్తగ ఏర్పడినది కాదు. ద్వాపర యుగ ఆరంభము నుండి యిట్టి ప్రవర్తనము మొలకెత్తినది. ఇది దురాచారము.

ఈ దురాచారము వలన శిష్యునికి హాని కలుగును. జీవితము ముందునకు సాగుతున్న కొలది మానసికముగ పలుమార్లు గాయపడు చుండును. క్రమముగ గురుశిష్య సంబంధ సూత్రము తెగును. ముందు జన్మలలో మరల గురువునకై అన్వేషణము జరుగును. ఈ దురాచారము సద్గురువును కూడ బాధించును. పై కారణముగ సద్గురు శిష్యుల నంగీకరించుటకు వ్యామోహపడరాదు. కలియుగమున శిష్యవ్యామోహము గురువునకు, దురాచారము శిష్యునకు హెచ్చగుచున్నది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

06 Aug 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 54

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 54 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ఏ క్షణం నువ్వు సంపూర్ణంగా నిశ్శబ్దంగా, నిశ్చలంగా వుంటావో నువ్వు నీ అస్తిత్వంలో వుంటావు. అది ప్రతి మనిషి జన్మించిన క్షణం. అంతవరకు ప్రతి మనిషీ భౌతికంగా పుట్టినట్లు, ఆధ్యాత్మికంగా కాదు. 🍀

పరమానందం అందర్నీ ప్రేమిస్తుంది. మనమేం చేసినా పరమానంధాన్ని అన్వేషిస్తాం. ప్రతి పనిలో మంచయినా, చెడ్డయినా నీతయినా, అనినీతయినా, భౌతికమైనా ఆధ్యాత్మికమైనా దేని కోసమో అన్వేషణ. అనంత ప్రేమకై అన్వేషణ, అదే పరమానందం.

ఏ క్షణం నువ్వు సంపూర్ణంగా నిశ్శబ్దంగా, నిశ్చలంగా వుంటావో నువ్వు నీ అస్తిత్వంలో వుంటావు. అది ప్రతి మనిషి జన్మించిన క్షణం. అంతవరకు ప్రతి మనిషీ భౌతికంగా పుట్టినట్లు, ఆధ్యాత్మికంగా కాదు. అప్పుడే అతను ఆత్మగా మారతాడు. శాశ్వతంగా మారతాడు. దైవంగా పరివర్తన చెందుతాడు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

06 Aug 2021

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 297 / Sri Lalitha Chaitanya Vijnanam - 297

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 297 / Sri Lalitha Chaitanya Vijnanam - 297 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 69. పురుషార్థప్రదా, పూర్ణా, భోగినీ, భువనేశ్వరీ ।

అంబికా,ఽనాది నిధనా, హరిబ్రహ్మేంద్ర సేవితా ॥ 69 ॥ 🍀

🌻 297. 'హరిబ్రహ్మేంద్రసేవితా' 🌻

విష్ణువు, బ్రహ్మ, ఇంద్రులచే సేవింపబడునది శ్రీదేవి అని అర్థము. చతుర్ముఖ బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు కూడ శ్రీమాత నుండి దిగివచ్చిన వారే. కనక వారునూ వారి వారి కర్తవ్యములను- శ్రీమాతను సేవించుచునే నిర్వర్తింతురు. వారా స్థితులయందుండుటకు కూడ వారి ఆరాధనమే కారణము.

మహాచైతన్యము నుండి త్రిమూర్తులు (3), ద్వాదశాదిత్యులు (12), ఏకాదశ రుద్రులు (11), అష్ట వసువులు (8), అశ్వినీదేవతలు (2) వెలువడిరి. అట్లే కుమారులు (4), ప్రజా పతులు (10), ఋషులు (7), మనువులు (14) ఏర్పడిరి. కాలము కూడ ఏర్పడినది. ఇట్లు 72 అంశములు శ్రీమాత చైతన్యము నుండి ఉద్భవించినవి. ఈ అంశా రూపములన్నియూ శ్రీదేవివే. కావున ఆమెకే ఉన్ముఖమై యుండును.

శ్రీదేవి నారాధించినచో సకల దేవతామూర్తులను కూడ ఆరాధించినట్లే. ఇక ప్రత్యేకముగ ఇతర దేవతల నారాధింప పనిలేదు. శ్రీదేవి రూపమునుగాని, శ్రీమహా విష్ణువు రూపమును గాని ఆరాధింప వచ్చును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 297 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 69. puruṣārthapradā pūrṇā bhoginī bhuvaneśvarī |
ambikā'nādi-nidhanā haribrahmendra-sevitā || 69 || 🍀

🌻 297. Haribrahamendra-sevitā हरिब्रहमेन्द्र-सेविता (297) 🌻

Hari (Viṣṇu), Brahma and Indra worship Her. In Śrī cakra pūja, Hari, Brahma and Indra are all worshipped. The importance of Śaktī worship is underlined in this nāma. The Gods mentioned here are no demigods, but the creator and upholder and the lord of all gods and goddesses.

They too, on their own merits are powerful. Śiva is not mentioned here possibly due to two reasons. He being Her consort, is not worshipped by Her or there is no difference between Śiva and Śaktī. The second interpretation seems to be appropriate. It has been discussed earlier that Brahman is the combination of static and kinetic energy. Though kinetic energy originates from the static energy, the latter cannot function without the aid of the former.

This concept is explained here. Hari (Viṣṇu), Brahma and Indra should not be taken in literal sense. In fact, Veda-s talk about them more frequently than Śaktī. It is also to be understood that mastery of Veda-s alone do not help to realize the Brahman. One has to go beyond Veda-s to understand the Creation and the Creator. Both Creation and the Creator refer to the Supreme Mother or “Ma” as She is fondly called.

The same interpretation is conveyed in Śivānanda Laharī (verse 4) for Śiva. “Thousands of Gods abound, offering trifling gifts to them who pray and never even in my dreams would I pray or request gifts from them. Śiva who is close to Viṣṇu, Brahma and other Gods, but is difficult for them to near Him, I would beseech and beg always for His lotus feet.”

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

06 Aug 2021

తిరుమల ఏడుకొండలు..ఈ ఏడు శక్తి స్థానాలకి.. ప్రతీక

🌹. తిరుమల ఏడుకొండలు..ఈ ఏడు శక్తి స్థానాలకి.. ప్రతీక 🌹

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

🌺. శేషాద్రి 🌺

🌹 1. నిద్రిస్తూ ఉన్న కుండలినీ శక్తిని మేలుకోలపటమే ధ్యానం, ఇది క్రియాయోగం వల్ల సాధ్యపడుతుంది. ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడైతే ఈ శక్తి మూలాధార చక్రాన్ని తాకుతుందో అప్పుడు ఈ నిద్రిస్తూ ఉన్న శక్తిని మనం శేషువు తో పోల్చాము, అంటే నిద్రిస్తున్న పాము, అది మేలుకొంటుంది.

#.అందుకే మొదటి కొండకి..🌺 శషాద్రి 🌺అని పేరు.

🌺. వేదాద్రి 🌺

🌹 2. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని శక్తి స్వాధిస్టాన చక్రాన్ని తాకుతుంది, ఇప్పటికి సాధకుడికి నూటికి 40% సాధించినట్లు. సాధన పట్ల కోరిక, పరమాత్మను కనుక్కోవాలనే ఆరాటం మొదలవుతాయి. ఇక్కడ అంటే స్వాధిస్టాన చక్రం వద్ద వినిపించే శబ్దం వేణుగానం. వేదా అంటే వినటం అని అర్ధం,

#.అందుకే రెండవ కొండకి ..🌺. వేదాద్రి 🌺అని పేరు.

🌺. "గ"రుడాద్రి " 🌺

🌹 3. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి మణిపుర చక్రాన్ని తాకుతుంది, ఇప్పటికి సాధకుడికి నూటికి 60% సాధించినట్లు, ఇప్పటికి సెల్ఫ్ కంట్రోల్ వచ్చేస్తుంది, జ్ఞాన శక్తి పెరుగుతుంది, గ్రహణశక్తి పెరుగుతుంది. "గ ' కార శబ్దం జ్ఞానానికి ప్రతీక, ఇక్కడికి వచ్చేటప్పటికి సాధకుడు జ్ఞానారూడుడు అవుతున్నాడు.

#.అందుకే మూడవ కొండకి.. 🌺. "గ"రుడాద్రి " 🌺 అనే పేరు. 🌷🌻🌷

🌺. అంజనాద్రి 🌺

🌹 4. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి అనాహత చక్రాన్ని తాకుతుంది, ఇప్పటికి సాధకుడికి నూటికి 80% సాధించినట్లు. ఇప్పటికి సాధకుడికి స్థూల శరీర స్పృహ తగ్గుతుంది. శరీరం చాల తేలిగ్గా, గాల్లో తేలిపోతున్నట్లు ఉంటుంది, సాధకుడు వాయుపుత్రుడైన ఆంజనేయుడే అవుతాడు.

#.అందుకే నాలుగవ కొండకి.. 🌺.అంజనాద్రి 🌺 అని పేరు. 🌼🌼

🌺. వృషభాద్రి 🌺

🌹 5. #.ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి విశుద్ధ చక్రాన్ని తాకుతుంది, ఇప్పటికి సాధకుడికి నూటికి 100% సాధించినట్లు, భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. సంసార చక్రాలన్నీ దాటేస్తాడు, అన్ని బంధాలు విడిపోతాయి. ప్రాణ నియంత్రణ శక్తి వస్తుంది . ఇంక పరమాత్మ వైపు పరిగెడుతూ ఉంటాడు. ఎద్దుకి అచ్చు వేసి వదిలేస్తే ఎలా దాని ఇష్టం వచ్చినట్లు పరిగెడుతుందో అలాగ.

#.అందుకే ఐదవ కొండకి.. 🌺. వృషభాద్రి 🌺 అని పేరు.

🌺. వేంకటాద్రి 🌺

🌹 6.#. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి ఆజ్ఞా చక్రాన్ని తాకుతుంది. ఇప్పుడు దాటి వచ్చిన ఆరు చక్రాలు ఆరు పడగలు విప్పినట్లు అనుకుంటే, ఆ పడగలు కామ, క్రోధ , లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఆరు అరిషడ్వర్గాలని శ్రీకృష్ణుడు #.కాళీయ మర్ధనుడై దర్శనమిస్తూ సాధకుడి నుంచి పోగొట్టినట్లు అనుభూతి పొందుతాడు. మహా వెలుగు, తనే వెలుగైనట్లు అనుభూతి చెందుతాడు. ఇప్పటికి సాధకుడికి, భగవంతుడు ఎదురుగానే ఉంటాడు. తనకి పరమాత్మకి మద్య ఇంకేమి లేదు. పరమశాంతి కలుగుతుంది.

#.అది ఆరవ కొండ.. 🌺. వేంకటాద్రి 🌺 అని పేరు.

🌺. నారాయణాద్రి 🌺

🌹 7. #.తరువాత సాధకుని కుండలిని శక్తి సహస్రార చక్రాన్ని తాకుతుంది, ఇది పరమాత్మ చక్రం. ఇంక అక్కడ సాధకుడు లేడు, నారాయణుడే ఉన్నాడు, సాధకుడు తనే పరమాత్మ అవుతాడు, నారాయణ అంటే వ్యాపించటం అని అర్ధం. అంతటా #తానేయై వ్యాపించేవాడు కాబట్టి నారాయణుడు.

#.అందుకే ఏడవ కొండకి.. 🌺. నారాయణాద్రి 🌺 అనీ పేరు.

#.ఇది యోగ పరంగా తిరుమల ఏడు కొండల అంతరార్ధం. 🍀🍂🍀

#.ఇంతే కాకుండా మనం ఎక్కేటప్పుడు మెట్లని కూడా పరిశీలిన చేస్తే అర్ధం అవుతుంది, అవన్నీ ఇలా 8,16,24,32.... (multiples of eight) లో ఉంటాయి. దీన్ని మనం అష్టాంగయోగం చెయ్యమని చెపుతున్నట్లు అన్వయించుకోవచ్చు.

ఎందుకంటే అష్టాంగయోగం అంటే..

యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధి. 🌼

🙏. భగవంతుణ్ణి చేరుకొనే ఏడు క్రియలని (కొండల రూపంలో) ఎనిమిది యోగాలని (అష్టాంగయోగం) మెట్ల రూపంలో బాలాజి మనందరికి కళ్ళ ముందు ఉంచారు. కళ్ళు తెరిచి చూస్తే నారాయణులం,

🙏🙏. తెరవకపోతే నరులం. 🌼🌹🌼

🌹 🌹 🌹 🌹 🌹

06 Aug 2021

6-AUGUST-2021 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 73 / Bhagavad-Gita - 73 - 2 - 26🌹
2) 🌹 శ్రీమద్భగవద్గీత - 641 / Bhagavad-Gita - 641 - 18-52🌹 
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 469 470 / Vishnu Sahasranama Contemplation - 469, 470🌹
4) 🌹 Daily Wisdom - 148🌹
5) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 122🌹
6) 🌹. నిర్మల ధ్యానములు - 54🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 297 / Sri Lalita Chaitanya Vijnanam - 297🌹 
8) 🌹. తిరుమల ఏడుకొండలు..ఈ ఏడు శక్తి స్థానాలకి.. ప్రతీక 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. తిరుమల ఏడుకొండలు..ఈ ఏడు శక్తి స్థానాలకి.. ప్రతీక 🌹*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

*🌺. శేషాద్రి 🌺*

*🌹 1. నిద్రిస్తూ ఉన్న కుండలినీ శక్తిని మేలుకోలపటమే ధ్యానం, ఇది క్రియాయోగం వల్ల సాధ్యపడుతుంది. ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడైతే ఈ శక్తి మూలాధార చక్రాన్ని తాకుతుందో అప్పుడు ఈ నిద్రిస్తూ ఉన్న శక్తిని మనం శేషువు తో పోల్చాము, అంటే నిద్రిస్తున్న పాము, అది మేలుకొంటుంది.* 
*#.అందుకే మొదటి కొండకి..🌺 శషాద్రి 🌺అని పేరు.* 

*🌺. వేదాద్రి 🌺*

*🌹 2. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని శక్తి స్వాధిస్టాన చక్రాన్ని తాకుతుంది, ఇప్పటికి సాధకుడికి నూటికి 40% సాధించినట్లు. సాధన పట్ల కోరిక, పరమాత్మను కనుక్కోవాలనే ఆరాటం మొదలవుతాయి. ఇక్కడ అంటే స్వాధిస్టాన చక్రం వద్ద వినిపించే శబ్దం వేణుగానం. వేదా అంటే వినటం అని అర్ధం,* 
*#.అందుకే రెండవ కొండకి ..🌺. వేదాద్రి 🌺అని పేరు.*

*🌺. "గ"రుడాద్రి " 🌺* 

*🌹 3. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి మణిపుర చక్రాన్ని తాకుతుంది, ఇప్పటికి సాధకుడికి నూటికి 60% సాధించినట్లు, ఇప్పటికి సెల్ఫ్ కంట్రోల్ వచ్చేస్తుంది, జ్ఞాన శక్తి పెరుగుతుంది, గ్రహణశక్తి పెరుగుతుంది. "గ ' కార శబ్దం జ్ఞానానికి ప్రతీక, ఇక్కడికి వచ్చేటప్పటికి సాధకుడు జ్ఞానారూడుడు అవుతున్నాడు.* 
*#.అందుకే మూడవ కొండకి.. 🌺. "గ"రుడాద్రి " 🌺 అనే పేరు.* 🌷🌻🌷

*🌺. అంజనాద్రి 🌺*

*🌹 4. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి అనాహత చక్రాన్ని తాకుతుంది, ఇప్పటికి సాధకుడికి నూటికి 80% సాధించినట్లు. ఇప్పటికి సాధకుడికి స్థూల శరీర స్పృహ తగ్గుతుంది. శరీరం చాల తేలిగ్గా, గాల్లో తేలిపోతున్నట్లు ఉంటుంది, సాధకుడు వాయుపుత్రుడైన ఆంజనేయుడే అవుతాడు.*  
*#.అందుకే నాలుగవ కొండకి.. 🌺.అంజనాద్రి 🌺 అని పేరు.* 🌼🌼

*🌺. వృషభాద్రి 🌺* 

*🌹 5. #.ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి విశుద్ధ చక్రాన్ని తాకుతుంది, ఇప్పటికి సాధకుడికి నూటికి 100% సాధించినట్లు, భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. సంసార చక్రాలన్నీ దాటేస్తాడు, అన్ని బంధాలు విడిపోతాయి. ప్రాణ నియంత్రణ శక్తి వస్తుంది . ఇంక పరమాత్మ వైపు పరిగెడుతూ ఉంటాడు. ఎద్దుకి అచ్చు వేసి వదిలేస్తే ఎలా దాని ఇష్టం వచ్చినట్లు పరిగెడుతుందో అలాగ.* 
*#.అందుకే ఐదవ కొండకి.. 🌺. వృషభాద్రి 🌺 అని పేరు.* 

*🌺. వేంకటాద్రి 🌺* 

*🌹 6.#. ఇంకొంచెం ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి ఆజ్ఞా చక్రాన్ని తాకుతుంది. ఇప్పుడు దాటి వచ్చిన ఆరు చక్రాలు ఆరు పడగలు విప్పినట్లు అనుకుంటే, ఆ పడగలు కామ, క్రోధ , లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఆరు అరిషడ్వర్గాలని శ్రీకృష్ణుడు #.కాళీయ మర్ధనుడై దర్శనమిస్తూ సాధకుడి నుంచి పోగొట్టినట్లు అనుభూతి పొందుతాడు. మహా వెలుగు, తనే వెలుగైనట్లు అనుభూతి చెందుతాడు. ఇప్పటికి సాధకుడికి, భగవంతుడు ఎదురుగానే ఉంటాడు. తనకి పరమాత్మకి మద్య ఇంకేమి లేదు. పరమశాంతి కలుగుతుంది.* 
*#.అది ఆరవ కొండ.. 🌺. వేంకటాద్రి 🌺 అని పేరు.*
  
*🌺. నారాయణాద్రి 🌺* 

*🌹 7. #.తరువాత సాధకుని కుండలిని శక్తి సహస్రార చక్రాన్ని తాకుతుంది, ఇది పరమాత్మ చక్రం. ఇంక అక్కడ సాధకుడు లేడు, నారాయణుడే ఉన్నాడు, సాధకుడు తనే పరమాత్మ అవుతాడు, నారాయణ అంటే వ్యాపించటం అని అర్ధం. అంతటా #తానేయై వ్యాపించేవాడు కాబట్టి నారాయణుడు.* 
*#.అందుకే ఏడవ కొండకి.. 🌺. నారాయణాద్రి 🌺 అనీ పేరు.* 

*#.ఇది యోగ పరంగా తిరుమల ఏడు కొండల అంతరార్ధం.* 🍀🍂🍀

*#.ఇంతే కాకుండా మనం ఎక్కేటప్పుడు మెట్లని కూడా పరిశీలిన చేస్తే అర్ధం అవుతుంది, అవన్నీ ఇలా 8,16,24,32.... (multiples of eight) లో ఉంటాయి. దీన్ని మనం అష్టాంగయోగం చెయ్యమని చెపుతున్నట్లు అన్వయించుకోవచ్చు.*   

*ఎందుకంటే అష్టాంగయోగం అంటే..*
*యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధి. 🌼*

*🙏. భగవంతుణ్ణి చేరుకొనే ఏడు క్రియలని (కొండల రూపంలో) ఎనిమిది యోగాలని (అష్టాంగయోగం) మెట్ల రూపంలో బాలాజి మనందరికి కళ్ళ ముందు ఉంచారు. కళ్ళు తెరిచి చూస్తే నారాయణులం,*
*🙏🙏. తెరవకపోతే నరులం. 🌼🌹🌼*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 73 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 26 *🌴*

26. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ | 
తథాపి త్వం మాహాబాహో నైనం శోచితుమర్హసి ||

తాత్పర్యం :
*ఓ మహాబాహో! ఒకవేళ నీవీ ఆత్మ ( లేదా జీవలక్షణములు) ఎల్లప్పుడును పుట్టుచు, మరణించునని తలచినను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు.*

భాష్యము :
దేహమునకు పరముగా ఆత్మ కోక ప్రత్యేక ఉనికి కలదని అంగీకరింపని తత్త్వవేత్తల తెగ ఒకటి ఎల్లప్పుడు ఉండును. వారు దాదాపు బౌద్ధులను పోలినట్టివారు. శ్రీకృష్ణభగవానుడు గీతను తెలియజేసిన కాలమునందు అట్టివారు ఉన్నట్లుగా గోచరించుచున్నది. “లోకాయతికులు” మరియు “వైభాషికులు” అని తెలియబడు అట్టి తత్త్వవేత్తలు మూలకముల సరియైన సమ్మేళనము వలన జీవనము కలుగునని పలుకుదురు. 

నేటి ఆధునిక శాస్త్రవేత్తలు మరియు భౌతిక తత్త్వవేత్తలు సైతము అదేవిధముగా తలతురు. వారి సిద్ధాంతము ప్రకారము మూలకముల కలయికలో కొన్ని భౌతిక, రసాయయనచర్యల వలన జీవము కలుగుచున్నది. నవీన మానవశాస్త్రములు ఇట్టి సిద్ధాంతము పైననే ఆధారపడియున్నది. పలు కుహునా ధర్మములు ఈ సిద్ధాంతమును మరియు భక్తిరహితమైన బౌద్ధవాదమును అనుసరించుచు అమెరికాదేశమునందు ప్రాచుర్యము నొందుచున్నది.

ఒకవేళ అర్జునుడు వైభాషిక సిద్ధాంతము వలె ఆత్మ ఉనికిని గుర్తింపకున్నను దుఃఖించుటకు కారణము లేదు. కొన్ని రసాయనములు నష్టము వలన ఎవ్వరును చింతాక్రంతులై విధ్యుక్త ధర్మమును విడనాడరు. పైగా నేటి ఆధునిక యుద్ధపద్ధతిన శత్రువుపై విజయమును పొందుటకు మనుజుడు టన్నుల పరిమాణములో రసాయనములను వృథా చేయుచున్నాడు. వైభాషిక సిద్ధాంతముప్రకారము దేహముతో పాటు ఆత్మ నశించును. కావున అర్జునుడు ఆత్మ ఉనికిని గూర్చి వేదంనిర్ణయమును అంగీకరించినను లేదా ఆత్మ ఉనికిని నిరాకరించినను చింతించుటకు ఎట్టి కారణము లేదు. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 73 🌹*
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 
📚. Prasad Bharadwaj 

*🌴 Chapter 2 - Sankhya Yoga - 26 🌴*

26. atha cainaṁ nitya-jātaṁ nityaṁ vā manyase mṛtam tathāpi tvaṁ mahā-bāho nainaṁ śocitum arhasi

🌻 Translation :
*If, however, you think that the soul [or the symptoms of life] will always be born and die forever, you still have no reason to lament, O mighty-armed.*

🌻 Purport :
There is always a class of philosophers, almost akin to the Buddhists, who do not believe in the separate existence of the soul beyond the body. When Lord Kṛṣṇa spoke the Bhagavad-gītā, it appears that such philosophers existed, and they were known as the Lokāyatikas and Vaibhāṣikas. Such philosophers maintain that life symptoms take place at a certain mature condition of material combination. The modern material scientist and materialist philosophers also think similarly. 

According to them, the body is a combination of physical elements, and at a certain stage the life symptoms develop by interaction of the physical and chemical elements. The science of anthropology is based on this philosophy. Currently, many pseudo religions – now becoming fashionable in America – are also adhering to this philosophy, as are the nihilistic nondevotional Buddhist sects.

Even if Arjuna did not believe in the existence of the soul – as in the Vaibhāṣika philosophy – there would still have been no cause for lamentation. No one laments the loss of a certain bulk of chemicals and stops discharging his prescribed duty. On the other hand, in modern science and scientific warfare, so many tons of chemicals are wasted for achieving victory over the enemy. 

According to the Vaibhāṣika philosophy, the so-called soul or ātmā vanishes along with the deterioration of the body. So, in any case, whether Arjuna accepted the Vedic conclusion that there is an atomic soul or he did not believe in the existence of the soul, he had no reason to lament.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 642 / Bhagavad-Gita - 642 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 53 🌴*

53. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్ |
విముచ్య నిర్మమ: శాన్తో బ్రహ్మభూయాయకల్పతే ||

🌷. తాత్పర్యం : 
మిథ్యాహంకారము, మిథ్యాబలము, మిథ్యాగర్వము, కామము, క్రోధము, విషయవస్తుస్వీకారము అనువాని నుండి విడివడినవాడును, మమత్వదూరుడును, శాంతిమయుడును అగు మనుజుడు నిశ్చయముగా ఆత్మానుభవస్థాయికి ఉద్ధరింపగలడు.

🌷. భాష్యము :
మనుజుడు భౌతికభావన నుండి మక్తుడైనపుడు శాంతిమయుడై కలతకు గురికాకుండును. ఈ విషయము భగద్గీత (2.70 ) యందే వివరింపబడినది.

ఆపూర్వమాణం అచలప్రతిష్టమ్ సముద్ర మాప: ప్రవిశన్తి యద్వత్ |
తద్వత్ కామాయం ప్రవిశన్తి సర్వే స శాన్తి మాప్నోతి న కామకామీ ||

“సదా పూరింపబడుచున్నను నిశ్చలముగా నుండి సముద్రమునందు నదులు ప్రవేశించు రీతి తన యందు కోరికలు నిరంతరము ప్రవేశించుచున్నను ఆ ప్రవాహముచే కలతనొందనివాడే శాంతిని పొందగలడు. కోరికలను తీర్చుకొన యత్నించువాడు అట్టి శాంతిని పొంద సమర్థుడు కాజాలడు.”
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 642 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 53 🌴*

53. ahaṅkāraṁ balaṁ darpaṁ
kāmaṁ krodhaṁ parigraham
vimucya nirmamaḥ śānto
brahma-bhūyāya kalpate

🌷 Translation : 
Who is detached, free from false ego, false strength, false pride, lust, anger, and acceptance of material things, free from false proprietorship, and peaceful – such a person is certainly elevated to the position of self-realization.

🌹 Purport :
When one is free from the material conception of life, he becomes peaceful and cannot be agitated. This is described in Bhagavad-gītā (2.70):

āpūryamāṇam acala-pratiṣṭhaṁ
samudram āpaḥ praviśanti yadvat
tadvat kāmā yaṁ praviśanti sarve
sa śāntim āpnoti na kāma-kāmī

“A person who is not disturbed by the incessant flow of desires – that enter like rivers into the ocean, which is ever being filled but is always still – can alone achieve peace, and not the man who strives to satisfy such desires.”
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 469, 470 / Vishnu Sahasranama Contemplation - 469, 470 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 469. నైకకర్మకృత్‌, नैककर्मकृत्‌, Naikakarmakrt 🌻*

*ఓం నైకకర్మకృతే నమః | ॐ नैककर्मकृते नमः | OM Naikakarmakrte namaḥ*

జగదుద్పత్తి సంపత్తి విపత్తి ప్రభృతి క్రియాః ।
కరోతీతి మహావిష్ణుర్నైకకర్మకృదుచ్యతే ॥

జగత్తుల ఉత్పత్తి, సంపత్తి అనగా ఉనికి, స్థితి, పుష్టినందియుండుట మరియూ విపత్తి అనగా ఆపద లేదా నాశము మొదలగు అనేక కర్మములను ఆచరించు శ్రీమహావిష్ణువు నైకకర్మకృత్‌ అని ఎరుగబడును.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 469🌹*
📚. Prasad Bharadwaj

*🌻 469. Naikakarmakrt 🌻*

*OM Naikakarmakrte namaḥ*

Jagadudpatti saṃpatti vipatti prabhrti kriyāḥ,
Karotīti mahāviṣṇurnaikakarmakrducyate.

जगदुद्पत्ति संपत्ति विपत्ति प्रभृति क्रियाः ।
करोतीति महाविष्णुर्नैककर्मकृदुच्यते ॥

Lord Mahā Viṣṇu does many actions like utpatti or creation, sampatti i.e. sustenance and vipatti which means annihilation of the worlds. Hence He is called Naikakarmakrt.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
स्वापनस्स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् ।वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः ॥ ५० ॥

స్వాపనస్స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ ।వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ॥ ౫౦ ॥

Svāpanassvavaśo vyāpī naikātmā naikakarmakrt ।Vatsaro vatsalo vatsī ratnagarbho dhaneśvaraḥ ॥ 50 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 470 / Vishnu Sahasranama Contemplation - 470🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻470. వత్సరః, वत्सरः, Vatsaraḥ🌻*

*ఓం వత్సరాయ నమః | ॐ वत्सराय नमः | OM Vatsarāya namaḥ*

వసత్యత్రాఖిలమితి విష్ణుర్వత్సర ఉచ్యతే ఈతని యందు అఖిలమును వసించును కావున విష్ణుదేవుడు వత్సరః అని పిలువబడును.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 470🌹*
📚. Prasad Bharadwaj

*🌻470. Vatsaraḥ🌻*

*OM Vatsarāya namaḥ*

Vasatyatrākhilamiti Viṣṇurvatsara ucyate / वसत्यत्राखिलमिति विष्णुर्वत्सर उच्यते Since in Him everything dwells, Lord Viṣṇu is known as Vatsaraḥ.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
स्वापनस्स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् ।वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः ॥ ५० ॥

స్వాపనస్స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ ।వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ॥ ౫౦ ॥

Svāpanassvavaśo vyāpī naikātmā naikakarmakrt ।Vatsaro vatsalo vatsī ratnagarbho dhaneśvaraḥ ॥ 50 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 DAILY WISDOM - 148 🌹*
*🍀 📖 The Philosophy of Life 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 27. The Longing Appears to have No End 🌻*

Man’s life on Earth is a continuous flow of events, and no event seems to be lasting. There is always a desire to grasp and hold something else, something different from and better than what is possessed at the present. This longing appears to have no end, and it does not seem to lead one to any definite goal. There are only anxiety, vexation, craving and dissatisfaction visible everywhere. Unrest and pain are seen riding over all things in the world. 

The drama of life is but a show of shifting scenes, and no amount of worldly satisfaction appears to save one from this ceaseless anguish which follows every failure in the achievement of one’s desired end. Youth fades like the evening flower, strength vanishes like the rent cloud, and the beauty of the body quickly gives way to the ugliness of death. 

All things are certain to pass away either today or tomorrow. Nothing will live. The man of now is not seen in the next moment. The pleasure-centres of the human being mock at him for his folly, and he realises that all that he enjoys is not worth the striving.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 122 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 99. శిష్య దురాచారము 🌻*

బుద్ధునికి దేవదత్తుడు, ఏసుక్రీస్తునకు జూడాసే తీరని ద్రోహము చేసినట్లు చరిత్ర పుటల కెక్కినది. చరిత్ర పుటల కెక్కక సద్గురువులకు ద్రోహము గావించిన వారు కోకొల్లలు. సద్గురు వందించిన బోధలనను యథాతథముగ గ్రహించుటయే మొదలు కష్టము. ఎవరి స్వభావమును బట్టి వారు బోధనలను అవగాహన చేసుకొందురు. సద్గురువు బోధనకన్న శిష్యుని అవగాహన భిన్నముగ నుండవచ్చును. ఇది సర్వసామాన్యము. 

ఈ కారణముగ బోధనలను మరల మరల శ్రద్ధగ వినవలెను. తాను వింటినని, తెలుసుకొంటినని అనుకొనువాడు అహంకారి. ఒకటికి పదిమార్లువిని తన అవగాహనను అవకాశమున్నప్పుడు సద్గురువు వద్ద పరిశీలించు కొనవలెను. ఇది మొదటి మెట్టు. తాను పొందిన అవగాహనను ఆచరణలోనికి కొనివచ్చుటకు దీనితో ప్రయత్నింపవలెను. అట్టి దీక్షకు శ్రద్ధ, భక్తి, సంకల్పబలము, ప్రధానమై నిలచును. ఆచరణ మార్గముననే బోధన ఆకళింపు కాగలదు. ఇది రెండవ మెట్టు. 

ఆచరణమున ఆకళింపైన బోధనమును సహాధ్యాయులతో, బంధుమిత్రులతో వారి ఆసక్తిని బట్టి పంచుకొనుట మూడవ మెట్టు. ఇది బాధ్యతాయుతమైన శిష్యత్వము. ప్రస్తుత కాలమున బోధనలందుకొని అవగాహన చేసుకొనక, తామాచరించక ఇతరుల కందించువారు కోకొల్లలుగ నున్నారు. ఈ స్వభావము శిష్యులలో ఈనాడు కొత్తగ ఏర్పడినది కాదు. ద్వాపర యుగ ఆరంభము నుండి యిట్టి ప్రవర్తనము మొలకెత్తినది. ఇది దురాచారము. 

ఈ దురాచారము వలన శిష్యునికి హాని కలుగును. జీవితము ముందునకు సాగుతున్న కొలది మానసికముగ పలుమార్లు గాయపడు చుండును. క్రమముగ గురుశిష్య సంబంధ సూత్రము తెగును. ముందు జన్మలలో మరల గురువునకై అన్వేషణము జరుగును. ఈ దురాచారము సద్గురువును కూడ బాధించును. పై కారణముగ సద్గురు శిష్యుల నంగీకరించుటకు వ్యామోహపడరాదు. కలియుగమున శిష్యవ్యామోహము గురువునకు, దురాచారము శిష్యునకు హెచ్చగుచున్నది. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 54 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. ఏ క్షణం నువ్వు సంపూర్ణంగా నిశ్శబ్దంగా, నిశ్చలంగా వుంటావో నువ్వు నీ అస్తిత్వంలో వుంటావు. అది ప్రతి మనిషి జన్మించిన క్షణం. అంతవరకు ప్రతి మనిషీ భౌతికంగా పుట్టినట్లు, ఆధ్యాత్మికంగా కాదు. 🍀*

పరమానందం అందర్నీ ప్రేమిస్తుంది. మనమేం చేసినా పరమానంధాన్ని అన్వేషిస్తాం. ప్రతి పనిలో మంచయినా, చెడ్డయినా నీతయినా, అనినీతయినా, భౌతికమైనా ఆధ్యాత్మికమైనా దేని కోసమో అన్వేషణ. అనంత ప్రేమకై అన్వేషణ, అదే పరమానందం. 

ఏ క్షణం నువ్వు సంపూర్ణంగా నిశ్శబ్దంగా, నిశ్చలంగా వుంటావో నువ్వు నీ అస్తిత్వంలో వుంటావు. అది ప్రతి మనిషి జన్మించిన క్షణం. అంతవరకు ప్రతి మనిషీ భౌతికంగా పుట్టినట్లు, ఆధ్యాత్మికంగా కాదు. అప్పుడే అతను ఆత్మగా మారతాడు. శాశ్వతంగా మారతాడు. దైవంగా పరివర్తన చెందుతాడు.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 297 / Sri Lalitha Chaitanya Vijnanam - 297 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 69. పురుషార్థప్రదా, పూర్ణా, భోగినీ, భువనేశ్వరీ ।*
*అంబికా,ఽనాది నిధనా, హరిబ్రహ్మేంద్ర సేవితా ॥ 69 ॥ 🍀*

*🌻 297. 'హరిబ్రహ్మేంద్రసేవితా' 🌻* 

విష్ణువు, బ్రహ్మ, ఇంద్రులచే సేవింపబడునది శ్రీదేవి అని అర్థము. చతుర్ముఖ బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు కూడ శ్రీమాత నుండి దిగివచ్చిన వారే. కనక వారునూ వారి వారి కర్తవ్యములను- శ్రీమాతను సేవించుచునే నిర్వర్తింతురు. వారా స్థితులయందుండుటకు కూడ వారి ఆరాధనమే కారణము. 

మహాచైతన్యము నుండి త్రిమూర్తులు (3), ద్వాదశాదిత్యులు (12), ఏకాదశ రుద్రులు (11), అష్ట వసువులు (8), అశ్వినీదేవతలు (2) వెలువడిరి. అట్లే కుమారులు (4), ప్రజా పతులు (10), ఋషులు (7), మనువులు (14) ఏర్పడిరి. కాలము కూడ ఏర్పడినది. ఇట్లు 72 అంశములు శ్రీమాత చైతన్యము నుండి ఉద్భవించినవి. ఈ అంశా రూపములన్నియూ శ్రీదేవివే. కావున ఆమెకే ఉన్ముఖమై యుండును.

శ్రీదేవి నారాధించినచో సకల దేవతామూర్తులను కూడ ఆరాధించినట్లే. ఇక ప్రత్యేకముగ ఇతర దేవతల నారాధింప పనిలేదు. శ్రీదేవి రూపమునుగాని, శ్రీమహా విష్ణువు రూపమును గాని ఆరాధింప వచ్చును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 297 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🍀 69. puruṣārthapradā pūrṇā bhoginī bhuvaneśvarī |*
*ambikā'nādi-nidhanā haribrahmendra-sevitā || 69 || 🍀*

*🌻 297. Haribrahamendra-sevitā हरिब्रहमेन्द्र-सेविता (297) 🌻*

Hari (Viṣṇu), Brahma and Indra worship Her. In Śrī cakra pūja, Hari, Brahma and Indra are all worshipped. The importance of Śaktī worship is underlined in this nāma. The Gods mentioned here are no demigods, but the creator and upholder and the lord of all gods and goddesses.  

They too, on their own merits are powerful. Śiva is not mentioned here possibly due to two reasons. He being Her consort, is not worshipped by Her or there is no difference between Śiva and Śaktī. The second interpretation seems to be appropriate. It has been discussed earlier that Brahman is the combination of static and kinetic energy. Though kinetic energy originates from the static energy, the latter cannot function without the aid of the former.  

This concept is explained here. Hari (Viṣṇu), Brahma and Indra should not be taken in literal sense. In fact, Veda-s talk about them more frequently than Śaktī. It is also to be understood that mastery of Veda-s alone do not help to realize the Brahman. One has to go beyond Veda-s to understand the Creation and the Creator. Both Creation and the Creator refer to the Supreme Mother or “Ma” as She is fondly called. 

The same interpretation is conveyed in Śivānanda Laharī (verse 4) for Śiva. “Thousands of Gods abound, offering trifling gifts to them who pray and never even in my dreams would I pray or request gifts from them. Śiva who is close to Viṣṇu, Brahma and other Gods, but is difficult for them to near Him, I would beseech and beg always for His lotus feet.”

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹