శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 357-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 357-1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 357-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 357-1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।
తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥ 🍀

🌻 357-1. 'తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా' 🌻


తాపత్రయము లనెడు అగ్నిచే తపించు జనులకు వారి తాపము లను పోగొట్టి ఆహ్లాదము కలిగించు వెన్నెల వంటిది శ్రీమాత అని అర్థము. శ్రీమాత యందు సమర్పితమైన కర్మాచరణము తాప త్రయములను పోగొట్టుటకు మందుగా పనిచేసి తాపత్రయము లుడుగుటచే వెన్నెల వలె మనసునకు ఆహ్లాదమును కలిగించును. ఆధిభౌతిక తాపము, ఆధిదైవిక తాపము, ఆధ్యాత్మిక తాపము అను మూడును తాపత్రయములు.

తన దేహమునకు, తన బంధు మిత్రాదులకు తన వస్తువులకు సంబంధించిన తాపము ఆధి భౌతిక తాపము. సంచిత ప్రారబ్ధ కర్మల వలన కలుగు భయము కోపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, లోభ మోహాదులు ఆధి దైవిక తాపము. తనను గూర్చిన తాపము ఆధ్యాత్మిక తాపము. ఈ మూడును కలిసి తాపత్రయములు అనబడును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 357-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 79. Tapatrayagni santapta samahladana chandrika
Tatuni tapasaradhya tanumadhya tamo-paha ॥ 79 ॥ 🌻

🌻 357-1. Tāpatrayāgni-santapta-samāhlādana-candrikā तापत्रयाग्नि-सन्तप्त-समाह्लादन-चन्द्रिका 🌻


Ancient scriptures talk about three types of afflictions, pertaining to body, elements and deities. These three are compared to three types of fires. These three types of fires cause serious damage to the one who undergoes the sufferings of bondage called saṁsāra.

She is like the moon light (grace) that gives happiness to those affected by the said three afflictions. The meaning of the nāma is that by Her sheer grace She destroys the miseries caused by these three afflictions and showers happiness to Her devotees.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


19 Mar 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 155. మీ కలలతో స్నేహం చేయండి / Osho Daily Meditations - 155. BEFRIEND YOUR DREAMS


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 155 / Osho Daily Meditations - 155 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 155. మీ కలలతో స్నేహం చేయండి 🍀

🕉. మీ కలలతో స్నేహం చేయడం నేర్చుకోండి. కలలు అనేవి అచేతన స్థితి నుండి వచ్చే సందేశాలు. అపస్మారక స్థితి మీ కోసం ఒక సందేశాన్ని కలిగి ఉంది. ఇది మీ చేతన మనసుకు వంతెనను సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. 🕉

కలలను అర్థం చేసుకోవడానికి విశ్లేషణ అవసరం లేదు, ఎందుకంటే మీరు కలను విశ్లేషిస్తే, అప్పుడు మళ్ళీ బాహ్య చేతనది పైచేయి అవుతుంది. ఇది అపస్మారక స్థితి యొక్క కలలను విడదీయడానికి మరియు విశ్లేషించడానికి ప్రయత్నిస్తుంది. నిజం కాని అర్ధాలను మీ మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తుంది. అపస్మారక స్థితి కవితా భాషను ఉపయోగిస్తుంది. అర్థం చాలా సూక్ష్మమైనదిగా ఉంటుంది. ఇది విశ్లేషణ ద్వారా కనుగొనబడదు. మీరు కల యొక్క భాషను నేర్చుకోవడం ప్రారంభిస్తేనే ఇది కనుగొన బడుతుంది. కాబట్టి మొదటి దశ కలలో స్నేహం చేయడం అవసరం.

మీకు వచ్చిన కల హింసాత్మకంగా, పీడకలగా అనిపించినప్పుడు, దానిలో కొంత ముఖ్యమైనది ఉందని మీరు భావిస్తారు. ఉదయం, లేదా అర్ధరాత్రి మీరు మీకు వచ్చిన కలను మరచిపోయే ముందు, ఇలా చేయండి. కళ్ళు మూసుకొని మంచం మీద కూర్చోండి. ఆ కలతో స్నేహం చేయండి; "నేను నీతో ఉన్నాను, నేను మీ వద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు నన్ను నడిపించాలనుకున్న చోటకు నన్ను నడిపించండి; నేను అందుబాటులో ఉన్నాను అంటూ ఆ "కలకి లొంగిపోండి. కళ్ళు మూసుకుని దానితో కదలండి, ఆనందించండి; ఆ కల యొక్క మూటని విప్పండి. అది విప్పుకుంటున్నప్పుడు చూడండి. నిజంగా ఒక కల ఏ నిధులను దాచి పెట్టిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Osho Daily Meditations - 155 🌹

📚. Prasad Bharadwaj

🍀 155. BEFRIEND YOUR DREAMS 🍀

🕉 Learn to befriend your dreams. Dreams are a communication from the unconscious. The unconscious has a message for you. It is trying to create a bridge to your conscious mind. 🕉

Analysis is not needed to understand dreams, because if you analyze the dream, then the conscious again becomes the master. It tries to dissect and analyze, to force meanings that are not the meanings of the unconscious. The unconscious uses poetic language. The meaning is very subtle; it cannot be found by analysis. It can only be found if you start learning the language of the dream. So the first step is to befriend the dream.

When you have a dream that seems to be significant-maybe violent, nightmarish, but you feel that there is some import in it--in the morning, or even in the middle of the night, before you forget the dream, sit in your bed and close your eyes. Befriend the dream; just tell it, "I am with you, and I am ready to come to you. Lead me wherever you want to lead me; I am available." Just surrender to the dream. Close your eyes and move with it, enjoy it; let the dream unfold. You will be surprised at what treasures a dream is hiding, and you will see that it keeps on unfolding.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


19 Mar 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 166




🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 166 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భావ బలము - 1 🌻


సామరస్యమునకు అనుకూలమగు ఆలోచనను ఉద్భవింపజేసినచో, అది అవతలి వారిలోను ఇట్టి అనుకూల దృక్పథమునే జనింపజేయును. అంతట వారు కూడ అనుకూలమగు ఆలోచనలనే మనకు అందించుట జరుగును. తిరిగి మనలోను సామర్యసానుకూల దృక్పథమే ప్రేరేపితమగును. విధానమంతయు ఒక స్వయం పరితృప్త వలయము వలె పనిచేయును. దాని‌ వలన మనస్సు నిర్మాణాత్మకముగను, సృజనాత్మకముగను అగును. ఈ విషయము తెలియుటకు ముందు, బాధ్యతను ఎరుగని ప్రవృత్తితో తలంపులను ఉద్భవింపజేయుట మూలమున మనము మనకును, ఇతరులకును హాని కలిగించిన వారమైతిమి.

మానవజాతి ఒక్కుమ్మడిగా మానవ ప్రపంచమును సంఘర్షణ దిశగా తోయుచున్నది. ఎల్లరును సంఘర్షణలో దిగబడినవారే. ఆలోచనలను బాధ్యతా రహితముగా ఉద్భవింప జేసిన దాని ఫలితముగాదా ఇది. ఇతరులలోను, మనలోను దృక్పథములను జనింప జేయుటలో అజ్ఞానముతో వ్యవహరించుట‌ వలన ఫలితము గాదా ఇది. ప్రతికూలపు ఆలోచన ప్రతికూల దృక్పథమునే‌ కల్పింపక తప్పదు.


✍️. మాస్టర్ ఇ.కె. 🌻

🌹 🌹 🌹 🌹 🌹


19 Mar 2022

శ్రీ శివ మహా పురాణము - 536 / Sri Siva Maha Purana - 536


🌹 . శ్రీ శివ మహా పురాణము - 536 / Sri Siva Maha Purana - 536 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 48 🌴

🌻. కన్యాదానము - 1 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను-

ఒతలో అచట గర్గాచార్యునిచే ప్రేరేపింపబడిన హిమవంతుడు మేనతో గూడి కన్యాదానమునకు ఉపక్రమించెను (1). పుణ్యాత్మురాలగు మేన నూతన వస్త్రములను ధరించి సొమ్ములను పెట్టుకొని బంగరు కలశమును చేతబట్టి హిమవంతుని ప్రక్కన కూర్చుండెను (2). అపుడు హిమవంతుడు పురోహితునితో గూడి పాద్యము, వస్త్రము, చందనము, అలంకారము మొదలగు వాటితో ఆ వరుని ఆనందముగా పూజించెను (3). అపుడు హిమవంతుడు బ్రాహ్ముణులను సముయము కాగానే తిధి మొదలగు వాటిని కీర్తించి వివాహ ప్రయోగమును పఠించుడని కోరెను (4).

కాల జ్ఞాన పండితులగు ఆ బ్రాహ్మణోత్తములు అందరు 'అటులనే' అని పలికి పరమానందముతో తిధి మొదలగు వాటిని కీర్తించిరి (5). అపుడు హృదయము నందు శంభునిచే సానందముగా ప్రేరేపింపబడిన హిమవంతుడు అనేక లీలలనను ప్రకటించువాడు, పరమేశ్వరుడు అగు శంభునితో నవ్వుచూ ఇట్లు పలికెను (6).

హే శంభో ! నీవు సమయము దాటి పోకుండా నీ గోత్రమును, ప్రవరను, కులమును, పేరును, వేదమును, వేదశాఖను చెప్పుము (7).

బ్రహ్మ ఇట్లు పలికెను -

హిమవంతుని ఈ మాటను విని శంకరుడు ఆ క్షణములో సుముఖుడుగా నున్నవాడు విముఖుడాయెను. శోకింపదగనివాడు వెనువెంటనే శోచనీయమగు స్థితిని పొందెను (8). ఈ విధముగా దేవోత్తములు, మునులు, గందర్వులు, యక్షగణములు, సిద్దులు, శివగణములు చూచుచుండగా భగవాన్‌ మహేశ్వరుని నోటి వెంట సమాధానము రాలేదు. ఓ నారదా! అపుడు నీవు ఒక నవ్వదగిన పనిని అచట చేసి యుంటివి (9). ఓ నారదా! శంబుని మనస్సలో ధ్యానించే నీవు శివునిచే మనస్సలో ప్రేరితుడవై వీణను వాయించ మొదలిడితివి. నీవు బ్రహ్మవేత్తవు గదా! (10).

అపుడు హిమవంతుడు, విష్ణువు, నేను దేవతలు, మునులు అందరు బుద్ధిశాలివగు నిన్ను అపమని గట్టిగా వారించితిమి (11). కాని శంకరుని ఇచ్ఛచే నీవు ఆపలేదు. అపుడు హిమవంతుడు నీతో 'ఇపుడు వీణను వాయించకుము' అని చెప్పెను (12). ఓ దేవర్షీ ! విద్వాంసుడా! ఆయన నిన్ను హఠాత్తుగా వీణను ఆపుమని గట్టిగా చెప్పగనే, నీవు మహేశ్వరుని స్మరించు కొని ఆ పర్వతరాజునకు ఇట్లు సమాధానము నిచ్చితివి (13).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 SRI SIVA MAHA PURANA - 536 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 48 🌴

🌻 The ceremonious entry of Śiva - 1 🌻


Brahmā said:—

1. In the meantime, urged by the priest Garga Himavat started the rite of marriage in the company of Menā.

2. Himavat and Menā held the gold pot on either side. Himavat was bedecked in fine clothes and ornaments.

3. The joyous mountain with the assistance of his priest wooed the bridegroom after offering water, clothes, ornaments, sandal paste etc.

4. Then the brahmins were requested by Himavat

“May the rite be formally started after narrating the Tithi etc. The auspicious hour has come.”

5. After saying “So be it”, the excellent brahmins who knew the proper time proclaimed the Tithi etc. very delightedly.

6. Then Himācala mentally urged with pleasure by lord Śiva, the cause of great enjoyment, smilingly spoke to Śiva.

7. “O Śiva, please do not delay. Please mention your genealogy, saintly lineage,[1] family, name and your Veda along with your branch of the Vedas.”

Brahmā said:—

8. On hearing these words of Himavat, Śiva of sweet face, turned His face away. He without sorrow attained a pitiable plight.

9. When lord Śiva stood thus unable to say anything in reply and was seen so by the gods, sages, Gandharvas, Yakṣas, and Siddhas, O Nārada, you did something laughable.

10. Urged by Śiva mentally O Nārada, you, the knower of Brahman with mind fixed in Śiva, played on your Vīṇā.

11. You were forbidden strictly by the lord of mountains, Viṣṇu, gods, sages and by me.

12. When at the will of Śiva you did not desist from it, you were again spoken to thus by the mountain then—“Do not play on the Vīṇā now.”

13. O celestial sage, O wise one, when you were thus strenuously forbidden, you remembered Śiva and spoke to the lord of the mountains.


Continues....

🌹🌹🌹🌹🌹


19 Mar 2022

గీతోపనిషత్తు -338


🌹. గీతోపనిషత్తు -338 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 29-1 📚


🍀 29-1. అతీత స్థితి - స్థూలముగ జీవలోకమగు భూలోకము నుండి సత్యలోకము వరకు ఏడు లోకములుగా తెలుపవచ్చును. మరల ప్రతి లోకము నందు కూడ ఏడు ఉప లోకములను దర్శింపవచ్చును. అన్ని లోకము లందు పరమాత్మ ఒకే విధముగ నుండును. దుష్టుల యందు ద్వేషముగాని, శిష్టుల యందు ప్రీతిగాని యుండదు. 'ఉనికి'గ పరమాత్మ సర్వమునకు అతీతుడు. చైతన్యపరముగ జీవులయందు హెచ్చుతగ్గు లుండునుగాని, అందరి విషయమున ఉనికి ఒకటియే. అన్నిటి యందు తాను సమముగనే యున్నాడు. కాని వారియందలి చైతన్యము ఉత్తమము అధమముగను, ధర్మము అధర్మముగను, వారి వారి పరిణతి బట్టి ఏర్పడు చుండును. 🍀

సమో హం సర్వభూతేషున మే ద్వేష్యో స్తి న ప్రియః |
యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ II 29

తాత్పర్యము : సమస్త భూతములయందు నేను సమముగ నున్నాను. నాకు ద్వేషింపతగు వారుగాని, ప్రేమింపతగు వారు గాని ప్రత్యేకముగ నెవ్వరును లేరు. వారియందున్న నన్ను సేవించు వారిని నేనునూ సేవింతును.

వివరణము : సమస్త ప్రాణికోటియందు ఉనికిగ నున్నది నేనే. నేనాధారముగనే అన్నిభూతములు ఉండుట జరుగుచున్నది. చైతన్యపరముగ జీవులయందు హెచ్చుతగ్గు లుండునుగాని, అందరి విషయమున ఉనికి ఒకటియే. దేవతలు ఉన్నారు. అసురులు ఉన్నారు. ఆదిత్యు లున్నారు. రుద్రులున్నారు. ప్రజాపతు లున్నారు. వసువులున్నారు. రాయి రప్ప మొదలుకొని అన్ని వర్గములందు జీవు లున్నారు. ఈ ఉండుట అందరికిని సమముగనే యుండును. ఇది భగవంతుని అస్థిత్వము. అన్నిటి యందు తాను సమముగనే యున్నాడు. కాని వారియందలి చైతన్యము ఉత్తమము అధమముగను, ధర్మము అధర్మముగను, వారి వారి పరిణతి బట్టి ఏర్పడుచుండును.

స్థూలముగ జీవలోకమగు భూలోకము నుండి సత్యలోకము వరకు ఏడు లోకములుగా తెలుపవచ్చును. మరల ప్రతి లోకము నందు కూడ ఏడు ఉప లోకములను దర్శింపవచ్చును. అన్ని లోకము లందు పరమాత్మ ఒకే విధముగ నుండును. దుష్టుల యందు ద్వేషముగాని, శిష్టుల యందు ప్రీతిగాని యుండదు. 'ఉనికి'గ పరమాత్మ సర్వమునకు అతీతుడు. అట్టి ఉనికియే లేనిచో ఊర్ధ్వలోకములు లేవు, అధోలోకములు లేవు. ధర్మపరులు లేరు, అధర్మపరులు లేరు. ప్రళయమున తానొక్కడే ఉనికిగ యుండును. అంతయు తన యందు ఇమిడి యున్నది. సృష్టియందు కూడ పరమాత్మ ఒకడిగనే యుండును. అతడాధారముగ సృష్టి ఏర్పడుచు యుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


19 Mar 2022

19 - MARCH - 2022 శనివారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 19, శనివారం, మార్చి 2022 స్ధిర వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 29-1 - 338 - అతీత స్ధితి🌹 
3) 🌹. శివ మహా పురాణము - 536 / Siva Maha Purana - 536 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -166 🌹  
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 155 / Osho Daily Meditations - 155🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 357-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 357-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*స్థిర వాసరే, 19, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు. 🌻*

*🍀. శ్రీ వేంకటేశ అష్టకం-6 🍀*

*11. అపుత్రో లభతే పుత్రాన్ నిర్ధనో ధనవాన్ భవేత్ |*
*రోగార్తో ముచ్యతే రోగాద్బద్ధో ముచ్యేత బంధనాత్*
*12. యద్యదిష్టతమం లోకే తత్తత్ప్రాప్నోత్యసంశయః |*
*ఐశ్వర్యం రాజసమ్మానం భుక్తిముక్తిఫలప్రదమ్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : జీవన వృక్షం, జీవ క్షేత్రం ఆలోచన, ప్రవర్తన పైనే ఆధారపడి ఉంటుంది. అది వికృతమైతే జీవన వృక్షం ఎండిపోతుంది. తగిన జాగృతితో ఉండాలి. - మాస్టర్‌ ఆర్‌.కె. 🍀*
🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శశిర ఋతువు,
ఫాల్గుణ మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 11:38:46 వరకు
తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: హస్త 23:38:40 వరకు
తదుపరి చిత్ర
యోగం: వృధ్ధి 21:01:09 వరకు
తదుపరి ధృవ
కరణం: కౌలవ 11:35:46 వరకు
వర్జ్యం: 08:28:39 - 10:01:55
దుర్ముహూర్తం: 07:57:56 - 08:46:18
రాహు కాలం: 09:22:35 - 10:53:17
గుళిక కాలం: 06:21:11 - 07:51:53
యమ గండం: 13:54:40 - 15:25:22
అభిజిత్ ముహూర్తం: 11:59 - 12:47
అమృత కాలం: 17:48:15 - 19:21:31
సూర్యోదయం: 06:21:11
సూర్యాస్తమయం: 18:26:46
చంద్రోదయం: 19:32:43
చంద్రాస్తమయం: 07:04:36
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: కన్య
మృత్యు యోగం - మృత్యు భయం
23:38:40 వరకు తదుపరి కాల 
యోగం - అవమానం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -338 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 29-1 📚*
 
*🍀 29-1. అతీత స్థితి - స్థూలముగ జీవలోకమగు భూలోకము నుండి సత్యలోకము వరకు ఏడు లోకములుగా తెలుపవచ్చును. మరల ప్రతి లోకము నందు కూడ ఏడు ఉప లోకములను దర్శింపవచ్చును. అన్ని లోకము లందు పరమాత్మ ఒకే విధముగ నుండును. దుష్టుల యందు ద్వేషముగాని, శిష్టుల యందు ప్రీతిగాని యుండదు. 'ఉనికి'గ పరమాత్మ సర్వమునకు అతీతుడు. చైతన్యపరముగ జీవులయందు హెచ్చుతగ్గు లుండునుగాని, అందరి విషయమున ఉనికి ఒకటియే. అన్నిటి యందు తాను సమముగనే యున్నాడు. కాని వారియందలి చైతన్యము ఉత్తమము అధమముగను, ధర్మము అధర్మముగను, వారి వారి పరిణతి బట్టి ఏర్పడు చుండును. 🍀*

*సమో హం సర్వభూతేషున మే ద్వేష్యో స్తి న ప్రియః |*
*యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ II 29*

*తాత్పర్యము : సమస్త భూతములయందు నేను సమముగ నున్నాను. నాకు ద్వేషింపతగు వారుగాని, ప్రేమింపతగు వారు గాని ప్రత్యేకముగ నెవ్వరును లేరు. వారియందున్న నన్ను సేవించు వారిని నేనునూ సేవింతును.*

*వివరణము : సమస్త ప్రాణికోటియందు ఉనికిగ నున్నది నేనే. నేనాధారముగనే అన్నిభూతములు ఉండుట జరుగుచున్నది. చైతన్యపరముగ జీవులయందు హెచ్చుతగ్గు లుండునుగాని, అందరి విషయమున ఉనికి ఒకటియే. దేవతలు ఉన్నారు. అసురులు ఉన్నారు. ఆదిత్యు లున్నారు. రుద్రులున్నారు. ప్రజాపతు లున్నారు. వసువులున్నారు. రాయి రప్ప మొదలుకొని అన్ని వర్గములందు జీవు లున్నారు. ఈ ఉండుట అందరికిని సమముగనే యుండును. ఇది భగవంతుని అస్థిత్వము. అన్నిటి యందు తాను సమముగనే యున్నాడు. కాని వారియందలి చైతన్యము ఉత్తమము అధమముగను, ధర్మము అధర్మముగను, వారి వారి పరిణతి బట్టి ఏర్పడుచుండును.*

*స్థూలముగ జీవలోకమగు భూలోకము నుండి సత్యలోకము వరకు ఏడు లోకములుగా తెలుపవచ్చును. మరల ప్రతి లోకము నందు కూడ ఏడు ఉప లోకములను దర్శింపవచ్చును. అన్ని లోకము లందు పరమాత్మ ఒకే విధముగ నుండును. దుష్టుల యందు ద్వేషముగాని, శిష్టుల యందు ప్రీతిగాని యుండదు. 'ఉనికి'గ పరమాత్మ సర్వమునకు అతీతుడు. అట్టి ఉనికియే లేనిచో ఊర్ధ్వలోకములు లేవు, అధోలోకములు లేవు. ధర్మపరులు లేరు, అధర్మపరులు లేరు. ప్రళయమున తానొక్కడే ఉనికిగ యుండును. అంతయు తన యందు ఇమిడి యున్నది. సృష్టియందు కూడ పరమాత్మ ఒకడిగనే యుండును. అతడాధారముగ సృష్టి ఏర్పడుచు యుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 536 / Sri Siva Maha Purana - 536 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 48 🌴*

*🌻. కన్యాదానము - 1 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఒతలో అచట గర్గాచార్యునిచే ప్రేరేపింపబడిన హిమవంతుడు మేనతో గూడి కన్యాదానమునకు ఉపక్రమించెను (1). పుణ్యాత్మురాలగు మేన నూతన వస్త్రములను ధరించి సొమ్ములను పెట్టుకొని బంగరు కలశమును చేతబట్టి హిమవంతుని ప్రక్కన కూర్చుండెను (2). అపుడు హిమవంతుడు పురోహితునితో గూడి పాద్యము, వస్త్రము, చందనము, అలంకారము మొదలగు వాటితో ఆ వరుని ఆనందముగా పూజించెను (3). అపుడు హిమవంతుడు బ్రాహ్ముణులను సముయము కాగానే తిధి మొదలగు వాటిని కీర్తించి వివాహ ప్రయోగమును పఠించుడని కోరెను (4).

కాల జ్ఞాన పండితులగు ఆ బ్రాహ్మణోత్తములు అందరు 'అటులనే' అని పలికి పరమానందముతో తిధి మొదలగు వాటిని కీర్తించిరి (5). అపుడు హృదయము నందు శంభునిచే సానందముగా ప్రేరేపింపబడిన హిమవంతుడు అనేక లీలలనను ప్రకటించువాడు, పరమేశ్వరుడు అగు శంభునితో నవ్వుచూ ఇట్లు పలికెను (6).

హే శంభో ! నీవు సమయము దాటి పోకుండా నీ గోత్రమును, ప్రవరను, కులమును, పేరును, వేదమును, వేదశాఖను చెప్పుము (7).

బ్రహ్మ ఇట్లు పలికెను -

హిమవంతుని ఈ మాటను విని శంకరుడు ఆ క్షణములో సుముఖుడుగా నున్నవాడు విముఖుడాయెను. శోకింపదగనివాడు వెనువెంటనే శోచనీయమగు స్థితిని పొందెను (8). ఈ విధముగా దేవోత్తములు, మునులు, గందర్వులు, యక్షగణములు, సిద్దులు, శివగణములు చూచుచుండగా భగవాన్‌ మహేశ్వరుని నోటి వెంట సమాధానము రాలేదు. ఓ నారదా! అపుడు నీవు ఒక నవ్వదగిన పనిని అచట చేసి యుంటివి (9). ఓ నారదా! శంబుని మనస్సలో ధ్యానించే నీవు శివునిచే మనస్సలో ప్రేరితుడవై వీణను వాయించ మొదలిడితివి. నీవు బ్రహ్మవేత్తవు గదా! (10).

అపుడు హిమవంతుడు, విష్ణువు, నేను దేవతలు, మునులు అందరు బుద్ధిశాలివగు నిన్ను అపమని గట్టిగా వారించితిమి (11). కాని శంకరుని ఇచ్ఛచే నీవు ఆపలేదు. అపుడు హిమవంతుడు నీతో 'ఇపుడు వీణను వాయించకుము' అని చెప్పెను (12). ఓ దేవర్షీ ! విద్వాంసుడా! ఆయన నిన్ను హఠాత్తుగా వీణను ఆపుమని గట్టిగా చెప్పగనే, నీవు మహేశ్వరుని స్మరించు కొని ఆ పర్వతరాజునకు ఇట్లు సమాధానము నిచ్చితివి (13). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 536 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 48 🌴*

*🌻 The ceremonious entry of Śiva - 1 🌻*

Brahmā said:—

1. In the meantime, urged by the priest Garga Himavat started the rite of marriage in the company of Menā.

2. Himavat and Menā held the gold pot on either side. Himavat was bedecked in fine clothes and ornaments.

3. The joyous mountain with the assistance of his priest wooed the bridegroom after offering water, clothes, ornaments, sandal paste etc.

4. Then the brahmins were requested by Himavat

“May the rite be formally started after narrating the Tithi etc. The auspicious hour has come.”

5. After saying “So be it”, the excellent brahmins who knew the proper time proclaimed the Tithi etc. very delightedly.

6. Then Himācala mentally urged with pleasure by lord Śiva, the cause of great enjoyment, smilingly spoke to Śiva.

7. “O Śiva, please do not delay. Please mention your genealogy, saintly lineage,[1] family, name and your Veda along with your branch of the Vedas.”
Brahmā said:—

8. On hearing these words of Himavat, Śiva of sweet face, turned His face away. He without sorrow attained a pitiable plight.

9. When lord Śiva stood thus unable to say anything in reply and was seen so by the gods, sages, Gandharvas, Yakṣas, and Siddhas, O Nārada, you did something laughable.

10. Urged by Śiva mentally O Nārada, you, the knower of Brahman with mind fixed in Śiva, played on your Vīṇā.

11. You were forbidden strictly by the lord of mountains, Viṣṇu, gods, sages and by me.

12. When at the will of Śiva you did not desist from it, you were again spoken to thus by the mountain then—“Do not play on the Vīṇā now.”

13. O celestial sage, O wise one, when you were thus strenuously forbidden, you remembered Śiva and spoke to the lord of the mountains.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 166 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు  
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

 *🌻. భావ బలము - 1 🌻* 

*సామరస్యమునకు అనుకూలమగు ఆలోచనను ఉద్భవింపజేసినచో, అది అవతలి వారిలోను ఇట్టి అనుకూల దృక్పథమునే జనింపజేయును. అంతట వారు కూడ అనుకూలమగు ఆలోచనలనే మనకు అందించుట జరుగును. తిరిగి మనలోను సామర్యసానుకూల దృక్పథమే ప్రేరేపితమగును. విధానమంతయు ఒక స్వయం పరితృప్త వలయము వలె పనిచేయును. దాని‌ వలన మనస్సు నిర్మాణాత్మకముగను, సృజనాత్మకముగను అగును. ఈ విషయము తెలియుటకు ముందు, బాధ్యతను ఎరుగని ప్రవృత్తితో తలంపులను ఉద్భవింపజేయుట మూలమున మనము మనకును, ఇతరులకును హాని కలిగించిన వారమైతిమి.*

*మానవజాతి ఒక్కుమ్మడిగా మానవ ప్రపంచమును సంఘర్షణ దిశగా తోయుచున్నది. ఎల్లరును సంఘర్షణలో దిగబడినవారే. ఆలోచనలను బాధ్యతా రహితముగా ఉద్భవింప జేసిన దాని ఫలితముగాదా ఇది. ఇతరులలోను, మనలోను దృక్పథములను జనింప జేయుటలో అజ్ఞానముతో వ్యవహరించుట‌ వలన ఫలితము గాదా ఇది. ప్రతికూలపు ఆలోచన ప్రతికూల దృక్పథమునే‌ కల్పింపక తప్పదు.*

*✍️. మాస్టర్ ఇ.కె. 🌻*
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 155 / Osho Daily Meditations - 155 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 155. మీ కలలతో స్నేహం చేయండి 🍀*

*🕉. మీ కలలతో స్నేహం చేయడం నేర్చుకోండి. కలలు అనేవి అచేతన స్థితి నుండి వచ్చే సందేశాలు. అపస్మారక స్థితి మీ కోసం ఒక సందేశాన్ని కలిగి ఉంది. ఇది మీ చేతన మనసుకు వంతెనను సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. 🕉*
 
*కలలను అర్థం చేసుకోవడానికి విశ్లేషణ అవసరం లేదు, ఎందుకంటే మీరు కలను విశ్లేషిస్తే, అప్పుడు మళ్ళీ బాహ్య చేతనది పైచేయి అవుతుంది. ఇది అపస్మారక స్థితి యొక్క కలలను విడదీయడానికి మరియు విశ్లేషించడానికి ప్రయత్నిస్తుంది. నిజం కాని అర్ధాలను మీ మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తుంది. అపస్మారక స్థితి కవితా భాషను ఉపయోగిస్తుంది. అర్థం చాలా సూక్ష్మమైనదిగా ఉంటుంది. ఇది విశ్లేషణ ద్వారా కనుగొనబడదు. మీరు కల యొక్క భాషను నేర్చుకోవడం ప్రారంభిస్తేనే ఇది కనుగొన బడుతుంది. కాబట్టి మొదటి దశ కలలో స్నేహం చేయడం అవసరం.*
 
*మీకు వచ్చిన కల హింసాత్మకంగా, పీడకలగా అనిపించినప్పుడు, దానిలో కొంత ముఖ్యమైనది ఉందని మీరు భావిస్తారు. ఉదయం, లేదా అర్ధరాత్రి మీరు మీకు వచ్చిన కలను మరచిపోయే ముందు, ఇలా చేయండి. కళ్ళు మూసుకొని మంచం మీద కూర్చోండి. ఆ కలతో స్నేహం చేయండి; "నేను నీతో ఉన్నాను, నేను మీ వద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు నన్ను నడిపించాలనుకున్న చోటకు నన్ను నడిపించండి; నేను అందుబాటులో ఉన్నాను అంటూ ఆ "కలకి లొంగిపోండి. కళ్ళు మూసుకుని దానితో కదలండి, ఆనందించండి; ఆ కల యొక్క మూటని విప్పండి. అది విప్పుకుంటున్నప్పుడు చూడండి. నిజంగా ఒక కల ఏ నిధులను దాచి పెట్టిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 155 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 155. BEFRIEND YOUR DREAMS 🍀*

*🕉 Learn to befriend your dreams. Dreams are a communication from the unconscious. The unconscious has a message for you. It is trying to create a bridge to your conscious mind. 🕉*
 
*Analysis is not needed to understand dreams, because if you analyze the dream, then the conscious again becomes the master. It tries to dissect and analyze, to force meanings that are not the meanings of the unconscious. The unconscious uses poetic language. The meaning is very subtle; it cannot be found by analysis. It can only be found if you start learning the language of the dream. So the first step is to befriend the dream.*

*When you have a dream that seems to be significant-maybe violent, nightmarish, but you feel that there is some import in it--in the morning, or even in the middle of the night, before you forget the dream, sit in your bed and close your eyes. Befriend the dream; just tell it, "I am with you, and I am ready to come to you. Lead me wherever you want to lead me; I am available." Just surrender to the dream. Close your eyes and move with it, enjoy it; let the dream unfold. You will be surprised at what treasures a dream is hiding, and you will see that it keeps on unfolding.*
  
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 357-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 357-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।*
*తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥ 🍀*

*🌻 357-1. 'తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా' 🌻* 

*తాపత్రయము లనెడు అగ్నిచే తపించు జనులకు వారి తాపము లను పోగొట్టి ఆహ్లాదము కలిగించు వెన్నెల వంటిది శ్రీమాత అని అర్థము. శ్రీమాత యందు సమర్పితమైన కర్మాచరణము తాప త్రయములను పోగొట్టుటకు మందుగా పనిచేసి తాపత్రయము లుడుగుటచే వెన్నెల వలె మనసునకు ఆహ్లాదమును కలిగించును. ఆధిభౌతిక తాపము, ఆధిదైవిక తాపము, ఆధ్యాత్మిక తాపము అను మూడును తాపత్రయములు.*

*తన దేహమునకు, తన బంధు మిత్రాదులకు తన వస్తువులకు సంబంధించిన తాపము ఆధి భౌతిక తాపము. సంచిత ప్రారబ్ధ కర్మల వలన కలుగు భయము కోపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, లోభ మోహాదులు ఆధి దైవిక తాపము. తనను గూర్చిన తాపము ఆధ్యాత్మిక తాపము. ఈ మూడును కలిసి తాపత్రయములు అనబడును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 357-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 79. Tapatrayagni santapta samahladana chandrika*
*Tatuni tapasaradhya tanumadhya tamo-paha ॥ 79 ॥ 🌻*

*🌻 357-1. Tāpatrayāgni-santapta-samāhlādana-candrikā तापत्रयाग्नि-सन्तप्त-समाह्लादन-चन्द्रिका 🌻*

*Ancient scriptures talk about three types of afflictions, pertaining to body, elements and deities. These three are compared to three types of fires. These three types of fires cause serious damage to the one who undergoes the sufferings of bondage called saṁsāra.*

*She is like the moon light (grace) that gives happiness to those affected by the said three afflictions. The meaning of the nāma is that by Her sheer grace She destroys the miseries caused by these three afflictions and showers happiness to Her devotees.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹