శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 357-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 357-1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 357-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 357-1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।
తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥ 🍀

🌻 357-1. 'తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా' 🌻


తాపత్రయము లనెడు అగ్నిచే తపించు జనులకు వారి తాపము లను పోగొట్టి ఆహ్లాదము కలిగించు వెన్నెల వంటిది శ్రీమాత అని అర్థము. శ్రీమాత యందు సమర్పితమైన కర్మాచరణము తాప త్రయములను పోగొట్టుటకు మందుగా పనిచేసి తాపత్రయము లుడుగుటచే వెన్నెల వలె మనసునకు ఆహ్లాదమును కలిగించును. ఆధిభౌతిక తాపము, ఆధిదైవిక తాపము, ఆధ్యాత్మిక తాపము అను మూడును తాపత్రయములు.

తన దేహమునకు, తన బంధు మిత్రాదులకు తన వస్తువులకు సంబంధించిన తాపము ఆధి భౌతిక తాపము. సంచిత ప్రారబ్ధ కర్మల వలన కలుగు భయము కోపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, లోభ మోహాదులు ఆధి దైవిక తాపము. తనను గూర్చిన తాపము ఆధ్యాత్మిక తాపము. ఈ మూడును కలిసి తాపత్రయములు అనబడును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 357-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 79. Tapatrayagni santapta samahladana chandrika
Tatuni tapasaradhya tanumadhya tamo-paha ॥ 79 ॥ 🌻

🌻 357-1. Tāpatrayāgni-santapta-samāhlādana-candrikā तापत्रयाग्नि-सन्तप्त-समाह्लादन-चन्द्रिका 🌻


Ancient scriptures talk about three types of afflictions, pertaining to body, elements and deities. These three are compared to three types of fires. These three types of fires cause serious damage to the one who undergoes the sufferings of bondage called saṁsāra.

She is like the moon light (grace) that gives happiness to those affected by the said three afflictions. The meaning of the nāma is that by Her sheer grace She destroys the miseries caused by these three afflictions and showers happiness to Her devotees.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


19 Mar 2022

No comments:

Post a Comment