శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 308-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 308-1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 308-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 308-1🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।
రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀

🌻 308-1. 'రాజీవలోచనా' 🌻

పద్మముల వంటి విచ్చుకున్న నేత్రములు కలది శ్రీమాత అని అర్థము. రాజీవ మనగ పద్మము. పద్మము వంటి కన్నులు కలిగి యుండుట అనగా విచ్చుకొన్న పెద్ద కన్నులు అని అర్థము. కన్ను దేహమున అత్యంత ప్రధానమగు ఇంద్రియము. కన్నుల కాంతి కున్న సౌందర్యము దేహధారి యొక్క చైతన్య స్థితిని సూచించును. వికసించిన చైతన్యము కలవారికి కన్నులు కాంతివంతముగను, అత్యంత ఆకర్షణీయ ముగను, రమణీయముగను వుండును.

దివ్య పురుషులు కన్నుల నుండియే ప్రపంచములోనికి చైతన్య కాంతులను ప్రసరింప చేయుదురు. చూపులతోనే జీవులకు స్ఫూర్తి నిత్తురు. వారి కన్నులు వాత్సల్యపూరితములై జీవుల నలరించును. కన్నుల కాంతితో సమస్తమును నిర్వహించ గల శక్తి దివ్యపురుషు లందరికిని యుండును. శ్రీరాముని కన్నులు చూచిన ఋషీంద్రులు అతని యందలి దివ్య చైతన్యమున కాకర్షితులై మోహము చెందిరి.

మహా తపస్సంపన్ను లైనను రాముని చూపులతో చూపులు కలిపినపుడు ప్రియురాండ్రవలె తన్మయము చెందుదురు. శ్రీకృష్ణుని కన్నుల విషయము చెప్పనక్కరలేదు. అతడు శత్రువులను సహితము తన కన్నులతో ఆకర్షించి వివశులను గావించెను. కేవలము మానవులేకాక జంతువులు, పశుపక్ష్యాదులు కూడ అతని కన్నులలోనికి చూచి తన్మయత్వము చెందుచూ చేష్టలుడిగిన వారైరి.

అమ్మ కన్నులు సర్వశక్తి సంపన్నము. కన్నులతోనే ఆమె సమస్త సృష్టిని గావించి పోషించుచున్నది. ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులు ఆమె కనుసన్నలలో మెలగు భృత్యులు. ఆమె కన్నుల నుండి ప్రేమ, వాత్సల్యము, జ్ఞానము ప్రసరించు చుండును. అట్లే దుష్టుల నరికట్టుటకు రౌద్రము, అంత్య కాలమున కాలాగ్ని కూడ ప్రసరించును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 308-1 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |
rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀

🌻 308. Rājivalocanā राजिवलोचना (308) 🌻

The choice of words by Vāc Devi-s is amazing. Rājiva means deer, fish or lotus, depending upon the context and locanā means eyes. Eyes of Mā look like the eyes of deer or appear like a fish or look like a lotus flower. They could have addressed Her as Mīnākṣī (refer nāma 18) (eyes look like fish) or could have used kamala-nayanā (eyes look like lotus) (refer nāma 62). They have used only Mṛgākṣī (nāma 561) meaning eyes look like the eyes of deer and this nāma to describe Her eyes.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

08 Sep 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 69

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 69 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. పరమానందం నీకు అనుభవానికి వచ్చే ముందు నీ మనసులోని ముక్కలన్నీ ఏకం కావాలి. ఒకటిగా కరిగిపోవాలి, కలిసిపోవాలి. 🍀

పరమానందం నీకు అనుభవానికి వచ్చే ముందు నువ్వొక బలమైన రాయిలా మారాలి. జనం యిసుకలా వుంటారు. వేల కొద్దీ ముక్కలుగా విడిపోయి వుంటారు. గుండుగా, లేక్కలేని విషయంలో ఉక్కిరిబిక్కిరిగా వుంటారు. ఒకరుగా వుండరు. నువ్వు ఒకడుగా వున్నపుడే పరమానందానికి అవకాశముంటుంది. లేకుంటే నీ లోపలి గుంపు ఘర్షిస్తూ, ఆందోళనపడుతూ ఆవేశపడుతూ వుంటుంది.

సమస్తమయిన గుంపు, నీలోని గుంపు ఏకం కావాలి. ఒకటిగా కరిగిపోవాలి. కలిసిపోవాలి. దృడమైన శిలాసదృశం కావాలి. పరమానందం దానంతట అదే జరిగే ప్రక్రియ. మనసులో ఏకత్వం నించీ అది పుడుతుంది. మనసు ఒకటిగా వున్నపుడు పుడుతుంది. లోపలి సమన్వయానికి రాయి అన్నది ప్రతినిధి.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

08 Sep 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 2

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 2 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 1. గురుపరంపర-2 🌻

గురుపరంపర జీవునకు దైవమునకు మధ్య సంధానకర్తలుగా మాత్రమే పనిచేయుదురు కాని అడ్డుగోడలవలె నిలబడరు. అవసరమై నప్పుడెల్ల జీవునకు మార్గమున తగు సలహాల నిచ్చి సహాయ సహకారముల నందింతురు. మా గురుపరంపర ఏమతమునకు చెందినది కాదు. కేవలము సత్యమునకు చెందినది. సృష్టి ధర్మములకు కట్టుబడి వుండునది.

మాకై మేము ఎవరిని శాసింపము. కోరినవారికి మాత్రమే సత్యమునకు దారి చూపెదము. లోక శ్రేయస్సే మా లక్ష్యము. మృణమయమైన శరీరము నుండి దివ్యశరీరమును జీవుడు పొంది, దివ్యానుభూతి యందు శాశ్వతముగ నిలుచుట కొరకు దైవసంకల్పముగ మా కర్తవ్యమును నిర్వర్తించుచున్నాము. జీవనమున యీ జీవులను హంసలవలె తీర్చిదిద్ది పరమహంస తత్వమును దారిచూపుట మా నిరంతర కృషి.

మానవుని పరిణామము కొరకై నిర్వాణమును నిరాకరించిన త్యాగశీలురైన సిద్ధులు మా పరంపరయందలి సభ్యులు. మా మార్గమున ఎంత దివ్యానుభూతి కలదో అంత త్యాగము కలదు, కర్మక్షాళనమునకు తగిన శ్రమము కలదు. ప్రపంచము నలుమూలల యందు సత్యము నన్వేషించుచున్న జీవులయందు శ్రద్ధ కలిగి యుండి వారి యందలి సత్యమును మేలుకొల్పు చుందుము. ఉపనిషత్తులు, భగవద్గీత, యోగసూత్రములు మా ప్రమాణ గ్రంధములు.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

08 Sep 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 485 / Vishnu Sahasranama Contemplation - 485

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 485 / Vishnu Sahasranama Contemplation - 485🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 485. కృతలక్షణః, कृतलक्षणः, Krtalakṣaṇaḥ 🌻

ఓం కృతలక్షణాయ నమః | ॐ कृतलक्षणाय नमः | OM Krtalakṣaṇāya namaḥ

నిత్యనిష్పన్న చైతన్యరూపత్వాచ్ఛాస్త్రనామ వా ।
కృతం లక్షణమేతేనేత్యచ్యుతః కృతలక్షణః ॥

జన్మరహితముగా సిద్ధించిన శాశ్వతమైన చైతన్యము తన రూపముగా కలవాడూ కావున అతనిని గుర్తించడానికి ఉపయోగపడు లక్షణములు ఏవీ లేవు. ఐననూ అతని విషయములో ఉపాసనకై ఆయా లక్షణములు ఆపాదించబడతాయి. కానీ అవి అన్నీ కల్పితములే కావున ఆ విష్ణువు కృతలక్షణుడు. కల్పితములైన లక్షణములు ఎవనికికలవో అట్టివాడు కృతలక్షణః.

వేదాశ్శాస్త్రాణి విజ్ఞానమేతత్ సర్వం జనార్దనాత్ ।
ఇతి కృష్ణ ద్వైపాయనమునిరత్రైవ వక్ష్యతి ॥

లేదా శ్రీ విష్ణు సహస్రనామమునందు గల వచనము ప్రకారము వేదములు, శాస్త్రములు, విజ్ఞానము మొదలగు లక్షణములు లేదా వాఙ్మయమంతా జనార్దనునినుండే జనించినది అని చెప్పవచ్చును.

సజాతీయ విజాతీయ వ్యవచ్ఛేదకలక్షణమ్ ।
అనేన సర్వభావానాం కృతమిత్యథవోరసి ॥

అన్ని పదార్థములను వానితో సజాతీయములగు పదార్థములతో వాని విజాతీయములగు పదార్థములనుండి వేరు పరచు లక్షణములు ఎవనిచే సృష్టియందే ఏర్పరచబడినవో అట్టివాడు.

శ్రీవత్సలక్షణం కృతమిత్యతో వా కృతలక్షణః

ఎవనిచే తన వక్షము నందు శ్రీవత్సమను లక్షణము చేసికొనబడినదో అట్టివాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 485 🌹

📚. Prasad Bharadwaj

🌻 485. Krtalakṣaṇaḥ 🌻

OM Krtalakṣaṇāya namaḥ

नित्यनिष्पन्न चैतन्यरूपत्वाच्छास्त्रनाम वा ।
कृतं लक्षणमेतेनेत्यच्युतः कृतलक्षणः ॥

Nityaniṣpanna caitanyarūpatvācchāstranāma vā,
Krtaṃ lakṣaṇametenetyacyutaḥ krtalakṣaṇaḥ.

He is of nature that is eternal plenal consciousness or caitanya. Thus, there are no characteristics attributable to Him. For the sake of easing meditation upon Him and worshiping, characteristics are attributed. However, none of these confining attributes are essentially true. Since He is with characteristics that are not true, He is called Krtalakṣaṇaḥ or the One with fictitious characteristics.

वेदाश्शास्त्राणि विज्ञानमेतत् सर्वं जनार्दनात् ।
इति कृष्ण द्वैपायनमुनिरत्रैव वक्ष्यति ॥

Vedāśśāstrāṇi vijñānametat sarvaṃ janārdanāt,
Iti krṣṇa dvaipāyanamuniratraiva vakṣyati.

By Him have been created the lakṣaṇas or literature viz., the vedas, śāśtras, vijñāna or knowledge etc. Hence Lord Janārdana having created these lakṣaṇas, is called Krtalakṣaṇaḥ.

सजातीय विजातीय व्यवच्छेदकलक्षणम् ।
अनेन सर्वभावानां कृतमित्यथवोरसि ॥

Sajātīya vijātīya vyavacchedakalakṣaṇam,
Anena sarvabhāvānāṃ krtamityathavorasi.

Or since the Lord has made the lakṣaṇas or indications necessary for the internal and external distinctions of the like kind and of different kinds of all beings, He is Krtalakṣaṇaḥ.

श्रीवत्सलक्षणं कृतमित्यतो वा कृतलक्षणः / Śrīvatsalakṣaṇaṃ krtamityato vā krtalakṣaṇaḥ He bears on His chest the Śrīvatsa mark which constitutes His distinctive feature and indicating mark and hence He is Krtalakṣaṇaḥ.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

धर्मगुब् धर्मकृद् धर्मी सदसत्क्षरमक्षरम् ।अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः ॥ ५१ ॥

ధర్మగుబ్ ధర్మకృద్ ధర్మీ సదసత్క్షరమక్షరమ్ ।అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః ॥ 51 ॥

Dharmagub dharmakrd dharmī sadasatkṣaramakṣaram,Avijñātā sahasrāṃśurvidhātā krtalakṣaṇaḥ ॥ 51 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

08 Sep 2021

8-SEPTEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 8 సెప్టెంబర్ 2021🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 88 / Bhagavad-Gita - 88 - 2-41🌹*
3) 🌹. శ్రీమద్భగవద్గీత - 657 / Bhagavad-Gita - 657 -18-68🌹
4) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 485 / Vishnu Sahasranama Contemplation - 485🌹
5) 🌹 DAILY WISDOM - 163🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 2 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 69 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 308-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 308-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ గణాధీశ స్తోత్రం (శివశక్తి కృతం) -1 🍀*

శ్రీశక్తిశివావూచతుః |
నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః |
భక్తిప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక || 1

స్వానందవాసినే తుభ్యం సిద్ధిబుద్ధివరాయ చ |
నాభిశేషాయ దేవాయ ఢుంఢిరాజాయ తే నమః || 2

వరదాభయహస్తాయ నమః పరశుధారిణే |
నమస్తే సృణిహస్తాయ నాభిశేషాయ తే నమః || 3
🌻 🌻 🌻 🌻 🌻

08, బుధవారం, సెప్టెంబర్‌ 2021
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ
దక్షిణాయణం, వర్ష ఋతువు
చాంద్రమానం : బాధ్రపద మాసం
తిథి: శుక్ల విదియ 26:35:02 వరకు తదుపరి శుక్ల తదియ
పక్షం: శుక్ల-పక్ష
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 15:56:33 వరకు తదుపరి హస్త
యోగం: శుభ 23:37:42 వరకు తదుపరి శుక్ల
 కరణం: బాలవ 15:35:36 వరకు
వర్జ్యం: 23:50:15 - 25:20:35
దుర్ముహూర్తం: 11:48:53 - 12:38:17
రాహు కాలం: 12:13:35 - 13:46:12
గుళిక కాలం: 10:40:58 - 12:13:35
యమ గండం : 07:35:44 - 09:08:21
అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:37
అమృత కాలం: 09:05:00 - 10:36:20
సూర్యోదయం: 06:03:08, సూర్యాస్తమయం: 18:24:02
వైదిక సూర్యోదయం: 06:06:39, సూర్యాస్తమయం: 18:20:29
చంద్రోదయం: 07:04:59, చంద్రాస్తమయం: 19:35:49
సూర్య రాశి: సింహం, చంద్ర రాశి: కన్య
ఆనందాదియోగం: వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం 15:56:33 వరకు తదుపరి ఆనంద యోగం - కార్య సిధ్ధి 
పండుగలు : చంద్ర దర్శనం

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 88 / Bhagavad-Gita - 88 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 41 🌴*

41. వ్యవసాయాత్మికా
 బుద్ధిరేకేహ కురునన్ద |
బహుశాఖా హ్యనన్తాశ్చ 
బుద్దయో వ్యవసాయినామ్ ||

🌷. తాత్పర్యం :
ఈ మార్గమున ఉన్నవారు స్థిరప్రయోజనముతో ఒకే లక్ష్యమును కలిగియుందురు. ఓ కురునందనా! స్థిర ప్రయోజనము లేనివారి బుద్ధి అనేక విధములుగా నుండును.

🌻. భాష్యము :
*కృష్ణభక్తి రసభావన ద్వారా మనుజుడు జీవితపు అత్యున్నత పూర్ణత్వ స్థాయికి చేరగలడనెడి దృఢనిశ్చయమే “వ్యవసాయాత్మికా బుద్ధి” యని పిలువబడును. ఈ విషయమునే చైతన్య చరితామృతము (మధ్య లీల 22.62) ఈ విధముగా పలుకుచున్నది.*

శ్రద్ధా శబ్దే – విశ్వాస కహే సుదృడ నిశ్చయ |
కృష్ణే భక్తి కయిలే సర్వకర్మ కృత హోయ ||

ఉదాత్తమైన దాని యందు మ్రొక్కవోని నమ్మకమే విశ్వాసమని అందురు. కృష్ణభక్తిరసభావిత కర్మల యందు మనుజడు నిమగ్నమైనపుడు వంశాచారములకు గాని, సంఘాచారములకు గాని లేక దేశాచారములకు గాని లోబడి కర్మనొనరింప నవసరము లేదు. గతజన్మ శుభాశుభకర్మల ఫలితములే లౌకికకర్మలు. కృష్ణభక్తి హృదయములో జాగృతమైనవాడు తన కార్యములందు శుభఫలములకై విడిగా యత్నింప నవసరము లేదు. ఏలయనగా మనుజుడు కృష్ణభక్తిభావనలో స్థితుడైనంతనే కర్మలన్నియును నిర్గుణస్థితికి చెందినవి కాగలవు. శుభాశుభ ద్వంద్వములచే అవి ప్రభావితములు కాకపోవుటయే అందులకు కారణము. జీవితపు భౌతికభావనను సంపూర్ణముగా త్యాగము చేయుట యనునది కృష్ణభక్తిభావన యందు పరిపూర్ణత్వ స్థితి. కృష్ణభక్తి యందు పురోగతి ద్వారా అట్టి స్థితి అప్రయత్నముగా సిద్ధింపగలదు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 88 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada 
📚 Prasad Bharadwaj 

*🌴 Chapter 2 - Sankhya Yoga - 41 🌴*

41. vyavasāyātmikā buddhir ekeha kuru-nandana 
bahu- śākhā hy anantāś ca buddhayo ’vyavasāyinām

🌻 Translation :
*Those who are on this path are resolute in purpose, and their aim is one. O beloved child of the Kurus, the intelligence of those who are irresolute is many-branched.*

🌻 Purport :
A strong faith that by Kṛṣṇa consciousness one will be elevated to the highest perfection of life is called vyavasāyātmikā intelligence. The Caitanya-caritāmṛta (Madhya 22.62) states:

‘śraddhā’-śabde – viśvāsa kahe sudṛḍha niścaya kṛṣṇe bhakti kaile sarva-karma kṛta haya

Faith means unflinching trust in something sublime. When one is engaged in the duties of Kṛṣṇa consciousness, he need not act in relationship to the material world with obligations to family traditions, humanity or nationality. Fruitive activities are the engagements of one’s reactions from past good or bad deeds.

When one is awake in Kṛṣṇa consciousness, he need no longer endeavor for good results in his activities. When one is situated in Kṛṣṇa consciousness, all activities are on the absolute plane, for they are no longer subject to dualities like good and bad. The highest perfection of Kṛṣṇa consciousness is renunciation of the material conception of life. This state is automatically achieved by progressive Kṛṣṇa consciousness.

The resolute purpose of a person in Kṛṣṇa consciousness is based on knowledge. Vāsudevaḥ sarvam iti sa mahātmā su-durlabhaḥ: a person in Kṛṣṇa consciousness is the rare good soul who knows perfectly that Vāsudeva, or Kṛṣṇa, is the root of all manifested causes. As by watering the root of a tree one automatically distributes water to the leaves and branches, so by acting in Kṛṣṇa consciousness one can render the highest service to everyone – namely self, family, society, country, humanity, etc. If Kṛṣṇa is satisfied by one’s actions, then everyone will be satisfied.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 657 / Bhagavad-Gita - 657 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 68 🌴*

68. య ఇదం పరమం గుహ్యం 
మద్భక్తేష్వభిధాస్యతి |
భక్తిం మయి పరాం కృత్వా 
మామేవైష్యత్యసంశయ: ||

🌷. తాత్పర్యం : 
ఈ పరమ రహస్యమును భక్తులకు వివరించువానికి శుద్ధభక్తి యోగము నిశ్చయముగా కలుగును. అంత్యమున అతడు నన్ను చేరగలడు.

🌷. భాష్యము :
అభక్తులైనవారు శ్రీకృష్ణునిగాని, భగవద్గీతను గాని అవగతము చేసికొనలేనందున గీతను భక్తుల సమక్షమునందే చర్చించుమని సాధారణముగా ఉపదేశింపబడును. శ్రీకృష్ణభగవానుని మరియు అతని గీతాజ్ఞానమును యథాతథముగా ఆంగీకరింపలేనివారు తోచినరీతి గీతావ్యాఖ్యానమును చేయుటకు యత్నించి అపరాధులు కారాదు. శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించుటకు సిద్ధపడినవారికే భగవద్గీత బోధించవలెను. అనగా ఈ చర్చనీయ విషయము భక్తులకు సంబంధించినదే గాని తాత్త్వికకల్పనాపరులది కాదు. 

అయినను ఈ భగవద్గీతను శ్రద్ధతో ప్రకటింప యత్నించువారు భక్తియోగమున పురోగమించి శుద్ధమగు భక్తిమయ జీవనస్థితికి చేరగలరు. అట్టి శుద్ధ భక్తిఫలితముగా మనుజుడు భగవద్ధామమును తప్పక చేరగలడు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 657 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 68 🌴*

68. ya idaṁ paramaṁ guhyaṁ
mad-bhakteṣv abhidhāsyati
bhaktiṁ mayi parāṁ kṛtvā
mām evaiṣyaty asaṁśayaḥ

🌷 Translation : 
For one who explains this supreme secret to the devotees, pure devotional service is guaranteed, and at the end he will come back to Me.

🌹 Purport :
Generally it is advised that Bhagavad-gītā be discussed amongst the devotees only, for those who are not devotees will understand neither Kṛṣṇa nor Bhagavad-gītā. 

Those who do not accept Kṛṣṇa as He is and Bhagavad-gītā as it is should not try to explain Bhagavad-gītā whimsically and become offenders. Bhagavad-gītā should be explained to persons who are ready to accept Kṛṣṇa as the Supreme Personality of Godhead. It is a subject matter for the devotees only and not for philosophical speculators. 

Anyone, however, who tries sincerely to present Bhagavad-gītā as it is will advance in devotional activities and reach the pure devotional state of life. As a result of such pure devotion, he is sure to go back home, back to Godhead.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 485 / Vishnu Sahasranama Contemplation - 485🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 485. కృతలక్షణః, कृतलक्षणः, Krtalakṣaṇaḥ 🌻*

*ఓం కృతలక్షణాయ నమః | ॐ कृतलक्षणाय नमः | OM Krtalakṣaṇāya namaḥ*

నిత్యనిష్పన్న చైతన్యరూపత్వాచ్ఛాస్త్రనామ వా ।
కృతం లక్షణమేతేనేత్యచ్యుతః కృతలక్షణః ॥

జన్మరహితముగా సిద్ధించిన శాశ్వతమైన చైతన్యము తన రూపముగా కలవాడూ కావున అతనిని గుర్తించడానికి ఉపయోగపడు లక్షణములు ఏవీ లేవు. ఐననూ అతని విషయములో ఉపాసనకై ఆయా లక్షణములు ఆపాదించబడతాయి. కానీ అవి అన్నీ కల్పితములే కావున ఆ విష్ణువు కృతలక్షణుడు. కల్పితములైన లక్షణములు ఎవనికికలవో అట్టివాడు కృతలక్షణః.

వేదాశ్శాస్త్రాణి విజ్ఞానమేతత్ సర్వం జనార్దనాత్ ।
ఇతి కృష్ణ ద్వైపాయనమునిరత్రైవ వక్ష్యతి ॥

లేదా శ్రీ విష్ణు సహస్రనామమునందు గల వచనము ప్రకారము వేదములు, శాస్త్రములు, విజ్ఞానము మొదలగు లక్షణములు లేదా వాఙ్మయమంతా జనార్దనునినుండే జనించినది అని చెప్పవచ్చును.

సజాతీయ విజాతీయ వ్యవచ్ఛేదకలక్షణమ్ ।
అనేన సర్వభావానాం కృతమిత్యథవోరసి ॥

అన్ని పదార్థములను వానితో సజాతీయములగు పదార్థములతో వాని విజాతీయములగు పదార్థములనుండి వేరు పరచు లక్షణములు ఎవనిచే సృష్టియందే ఏర్పరచబడినవో అట్టివాడు.

శ్రీవత్సలక్షణం కృతమిత్యతో వా కృతలక్షణః 

ఎవనిచే తన వక్షము నందు శ్రీవత్సమను లక్షణము చేసికొనబడినదో అట్టివాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 485 🌹*
📚. Prasad Bharadwaj

*🌻 485. Krtalakṣaṇaḥ 🌻*

*OM Krtalakṣaṇāya namaḥ*

नित्यनिष्पन्न चैतन्यरूपत्वाच्छास्त्रनाम वा ।
कृतं लक्षणमेतेनेत्यच्युतः कृतलक्षणः ॥

Nityaniṣpanna caitanyarūpatvācchāstranāma vā,
Krtaṃ lakṣaṇametenetyacyutaḥ krtalakṣaṇaḥ.

He is of nature that is eternal plenal consciousness or caitanya. Thus, there are no characteristics attributable to Him. For the sake of easing meditation upon Him and worshiping, characteristics are attributed. However, none of these confining attributes are essentially true. Since He is with characteristics that are not true, He is called Krtalakṣaṇaḥ or the One with fictitious characteristics.

वेदाश्शास्त्राणि विज्ञानमेतत् सर्वं जनार्दनात् ।
इति कृष्ण द्वैपायनमुनिरत्रैव वक्ष्यति ॥

Vedāśśāstrāṇi vijñānametat sarvaṃ janārdanāt,
Iti krṣṇa dvaipāyanamuniratraiva vakṣyati.

By Him have been created the lakṣaṇas or literature viz., the vedas, śāśtras, vijñāna or knowledge etc. Hence Lord Janārdana having created these lakṣaṇas, is called Krtalakṣaṇaḥ.

सजातीय विजातीय व्यवच्छेदकलक्षणम् ।
अनेन सर्वभावानां कृतमित्यथवोरसि ॥

Sajātīya vijātīya vyavacchedakalakṣaṇam,
Anena sarvabhāvānāṃ krtamityathavorasi.

Or since the Lord has made the lakṣaṇas or indications necessary for the internal and external distinctions of the like kind and of different kinds of all beings, He is Krtalakṣaṇaḥ.

श्रीवत्सलक्षणं कृतमित्यतो वा कृतलक्षणः / Śrīvatsalakṣaṇaṃ krtamityato vā krtalakṣaṇaḥ He bears on His chest the Śrīvatsa mark which constitutes His distinctive feature and indicating mark and hence He is Krtalakṣaṇaḥ.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
धर्मगुब् धर्मकृद् धर्मी सदसत्क्षरमक्षरम् ।अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः ॥ ५१ ॥

ధర్మగుబ్ ధర్మకృద్ ధర్మీ సదసత్క్షరమక్షరమ్ ।అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః ॥ 51 ॥

Dharmagub dharmakrd dharmī sadasatkṣaramakṣaram,Avijñātā sahasrāṃśurvidhātā krtalakṣaṇaḥ ॥ 51 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 DAILY WISDOM - 163 🌹*
*🍀 📖 In the Light of Wisdom 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 11. We Want to Manufacture some Peace Artificially 🌻*

We might have seen people carrying their radios with them wherever they go. Whether they are in the bathroom, or at the lunch table, or in the meditation room—it makes no difference, as the radio must also be there. They go to the store to purchase something, and the radio is still hanging there on their shoulders. They try to drown themselves in the sound of this instrument, because they have no peace within. 

We want to manufacture some peace artificially through some instruments that we have created, because the peace is not there inside. “If I have not got something, I will try to import it from outside. I will drown myself in a loud sound so that I may not hear any other sounds. I do not want to hear the sound of even my own mind, because it is very inconvenient.” 

This sort of person not only wants to hear the constant sound of the radio but may also seek to constantly be moving about from place to place. The tendency seems to be to never sit in any one place and to be a permanent tourist throughout life. In this case, one has no time to think problems, because to think of them is another problem. “Better not to think about them—let them die out”, the person imagines to himself.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 2 🌹* 
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 1. గురుపరంపర-2 🌻*

గురుపరంపర జీవునకు దైవమునకు మధ్య సంధానకర్తలుగా మాత్రమే పనిచేయుదురు కాని అడ్డుగోడలవలె నిలబడరు. అవసరమై నప్పుడెల్ల జీవునకు మార్గమున తగు సలహాల నిచ్చి సహాయ సహకారముల నందింతురు. మా గురుపరంపర ఏమతమునకు చెందినది కాదు. కేవలము సత్యమునకు చెందినది. సృష్టి ధర్మములకు కట్టుబడి వుండునది. 

మాకై మేము ఎవరిని శాసింపము. కోరినవారికి మాత్రమే సత్యమునకు దారి చూపెదము. లోక శ్రేయస్సే మా లక్ష్యము. మృణమయమైన శరీరము నుండి దివ్యశరీరమును జీవుడు పొంది, దివ్యానుభూతి యందు శాశ్వతముగ నిలుచుట కొరకు దైవసంకల్పముగ మా కర్తవ్యమును నిర్వర్తించుచున్నాము. జీవనమున యీ జీవులను హంసలవలె తీర్చిదిద్ది పరమహంస తత్వమును దారిచూపుట మా నిరంతర కృషి.

మానవుని పరిణామము కొరకై నిర్వాణమును నిరాకరించిన త్యాగశీలురైన సిద్ధులు మా పరంపరయందలి సభ్యులు. మా మార్గమున ఎంత దివ్యానుభూతి కలదో అంత త్యాగము కలదు, కర్మక్షాళనమునకు తగిన శ్రమము కలదు. ప్రపంచము నలుమూలల యందు సత్యము నన్వేషించుచున్న జీవులయందు శ్రద్ధ కలిగి యుండి వారి యందలి సత్యమును మేలుకొల్పు చుందుము. ఉపనిషత్తులు, భగవద్గీత, యోగసూత్రములు మా ప్రమాణ గ్రంధములు.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 69 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. పరమానందం నీకు అనుభవానికి వచ్చే ముందు నీ మనసులోని ముక్కలన్నీ ఏకం కావాలి. ఒకటిగా కరిగిపోవాలి, కలిసిపోవాలి. 🍀*

పరమానందం నీకు అనుభవానికి వచ్చే ముందు నువ్వొక బలమైన రాయిలా మారాలి. జనం యిసుకలా వుంటారు. వేల కొద్దీ ముక్కలుగా విడిపోయి వుంటారు. గుండుగా, లేక్కలేని విషయంలో ఉక్కిరిబిక్కిరిగా వుంటారు. ఒకరుగా వుండరు. నువ్వు ఒకడుగా వున్నపుడే పరమానందానికి అవకాశముంటుంది. లేకుంటే నీ లోపలి గుంపు ఘర్షిస్తూ, ఆందోళనపడుతూ ఆవేశపడుతూ వుంటుంది. 

సమస్తమయిన గుంపు, నీలోని గుంపు ఏకం కావాలి. ఒకటిగా కరిగిపోవాలి. కలిసిపోవాలి. దృడమైన శిలాసదృశం కావాలి. పరమానందం దానంతట అదే జరిగే ప్రక్రియ. మనసులో ఏకత్వం నించీ అది పుడుతుంది. మనసు ఒకటిగా వున్నపుడు పుడుతుంది. లోపలి సమన్వయానికి రాయి అన్నది ప్రతినిధి.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 308-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 308-1🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।*
*రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀*

*🌻 308-1. 'రాజీవలోచనా' 🌻* 

పద్మముల వంటి విచ్చుకున్న నేత్రములు కలది శ్రీమాత అని అర్థము. రాజీవ మనగ పద్మము. పద్మము వంటి కన్నులు కలిగి యుండుట అనగా విచ్చుకొన్న పెద్ద కన్నులు అని అర్థము. కన్ను దేహమున అత్యంత ప్రధానమగు ఇంద్రియము. కన్నుల కాంతి కున్న సౌందర్యము దేహధారి యొక్క చైతన్య స్థితిని సూచించును. వికసించిన చైతన్యము కలవారికి కన్నులు కాంతివంతముగను, అత్యంత ఆకర్షణీయ ముగను, రమణీయముగను వుండును. 

దివ్య పురుషులు కన్నుల నుండియే ప్రపంచములోనికి చైతన్య కాంతులను ప్రసరింప చేయుదురు. చూపులతోనే జీవులకు స్ఫూర్తి నిత్తురు. వారి కన్నులు వాత్సల్యపూరితములై జీవుల నలరించును. కన్నుల కాంతితో సమస్తమును నిర్వహించ గల శక్తి దివ్యపురుషు లందరికిని యుండును. శ్రీరాముని కన్నులు చూచిన ఋషీంద్రులు అతని యందలి దివ్య చైతన్యమున కాకర్షితులై మోహము చెందిరి. 

మహా తపస్సంపన్ను లైనను రాముని చూపులతో చూపులు కలిపినపుడు ప్రియురాండ్రవలె తన్మయము చెందుదురు. శ్రీకృష్ణుని కన్నుల విషయము చెప్పనక్కరలేదు. అతడు శత్రువులను సహితము తన కన్నులతో ఆకర్షించి వివశులను గావించెను. కేవలము మానవులేకాక జంతువులు, పశుపక్ష్యాదులు కూడ అతని కన్నులలోనికి చూచి తన్మయత్వము చెందుచూ చేష్టలుడిగిన వారైరి. 

అమ్మ కన్నులు సర్వశక్తి సంపన్నము. కన్నులతోనే ఆమె సమస్త సృష్టిని గావించి పోషించుచున్నది. ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులు ఆమె కనుసన్నలలో మెలగు భృత్యులు. ఆమె కన్నుల నుండి ప్రేమ, వాత్సల్యము, జ్ఞానము ప్రసరించు చుండును. అట్లే దుష్టుల నరికట్టుటకు రౌద్రము, అంత్య కాలమున కాలాగ్ని కూడ ప్రసరించును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 308-1 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |*
*rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀*

*🌻 308. Rājivalocanā राजिवलोचना (308) 🌻*

The choice of words by Vāc Devi-s is amazing. Rājiva means deer, fish or lotus, depending upon the context and locanā means eyes. Eyes of Mā look like the eyes of deer or appear like a fish or look like a lotus flower. They could have addressed Her as Mīnākṣī (refer nāma 18) (eyes look like fish) or could have used kamala-nayanā (eyes look like lotus) (refer nāma 62). They have used only Mṛgākṣī (nāma 561) meaning eyes look like the eyes of deer and this nāma to describe Her eyes.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹