గీతోపనిషత్తు -176

🌹. గీతోపనిషత్తు -176 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 18 - 2

🍀 18. నూతన చిత్తము - 2 - సాధకుడు తనయందేర్పడుచున్న నూతన చిత్తమును కళ్ళెముగ వినియోగించి, స్వాభావిక చిత్తమును అదుపులోనికి తెచ్చుకొనవలెను. అందులకే యమ నియమములను పాటించుట సాధకునికి కీలకము. నూతన చిత్తము బలపడనిదే ఆత్మ సంయమమునకు దారి లేదు. బలపడనపుడు స్వాభావిక చిత్తమే నూతన చిత్తమును దమించును. నూతన చిత్తము బలపడినచో స్వభావమందలి మలినములు నశించి, దైవీ స్వభావము లేర్పడును. గురువను అయస్కాంతము సన్నిధిని శిష్యుడను సాధకుడు తనయందు దైవానుగ్రహముగ కలిగిన నూతన స్ఫూర్తిని బలపరచుకొనగలడు. 🍀

పరుగిడుతున్న గుఱ్ఱములకు కళ్ళెము వేసి, రౌతు అదుపులోనికి తెచ్చునట్లు సాధకుడు తనయందేర్పడుచున్న నూతన చిత్తమును కళ్ళెముగ వినియోగించి, స్వాభావిక చిత్తమును అదుపులోనికి తెచ్చుకొనవలెను. అందులకే యమ నియమములను పాటించుట కూడ. ఈ అభ్యాసము సాధకునికి కీలకము. నూతన చిత్తము బలపడనిదే ఆత్మసంయమమునకు దారి లేదు. బలపడనపుడు స్వాభావిక చిత్తమే నూతన చిత్తమును దమించును.

ఈ సందర్భమును గూర్చియే వేమన యోగి 'ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికిన..... ', 'కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టిన...' అను పద్యములను రచించెను. సాధకుడు యోగి అగుట గాని కాకుండుట గాని దీనిపై ఆధారపడి యున్నది. నూతన చిత్తము బలపడినచో స్వభావమందలి మలినములు నశించి, దైవీ స్వభావము లేర్పడును. గొంగళిపురుగు సీతాకోక చిలుక అయినట్లు మలిన స్వభావము దైవీ స్వభావమై వెలు గొందును. కానిచో, గొంగళి పురుగుగనే జీవించి నశించును.

ఇనుము అయస్కాంతమగుట వంటిదే ఆత్మ సంయమ యోగమునకు జరుగు ప్రక్రియ. అయస్కాంత సన్నిధిని ఇనుము తన స్వభావమును కోల్పోయి అయస్కాంత మగును. అట్లు చాల కాలము అయస్కాంత సన్నిధి నున్నపుడు స్వయముగ అయస్కాంతమై నిలచును. ప్రకృతి యందలి ఈ ధర్మము ననుసరించియే గురు-శిష్య సంప్రదాయ మేర్పడినది.

గురువను అయస్కాంతము సన్నిధిని శిష్యుడను సాధకుడు తనయందు దైవానుగ్రహముగ కలిగిన నూతన స్ఫూర్తిని బలపరచుకొనగలడు. అందులకే భారతీయ సంప్రదాయమున గురుశిష్య సంప్రదాయము అతి ఉత్కృష్టముగ తెలుపబడినది. స్ఫూర్తి గల యోగ సాధకుడు గురు సాన్నిధ్యమును కోరుటలోని ఆంతర్యము తనయందు స్వాభావికమగు మార్పు. ఇది కేవలము సద్గురువు నుండియే లభించును.

సద్గురువు నుండి ఇతర విషయముల నాసించుట అవివేకము. కాని పరిపాటిగ ఇతర విషయములనే ఆశించు చుందురు. నూతన స్ఫూర్తివంతమగు చిత్త మేర్పడుటచే, స్వాభావిక చిత్తము నియమింపబడి, నూతన చిత్తమై నిలచును. అట్టి నూతన చిత్తమునకు మూలము దివ్యస్ఫూర్తి గనుక, ఆ చిత్తము ఆత్మ యందు నిలచుటకే ఉత్సహించును.

అట్టి సమయమునందే ఆత్మ యందు చిత్తము తిష్ఠ వేయుట జరుగును. ఆత్మ యందే చిత్తము తిష్ఠవేసినపుడు ఇతర కోరికలు నిస్పృహ చెందును. వాటిని పోషించు చిత్తము లేకుండుట వలన కోరికలు సాధకుని వీడును.

ఆత్మ యందు రుచి గొన్న చిత్తమునకు లౌకిక అంశములపై రుచి తగ్గును. వాని జోలికి పోరు. వాని యందు ఆసక్తి లేక పోవుట వలన తటస్థముగ నిలచి పోవును. ఇతర విషయములను చేరుట కన్న ఆత్మ విషయము లేక దైవ విషయమునందు చేరుటకు ఉత్సహించును.

“నంబుజోదర దివ్యపాదారవింద చింతనామృత పానవిశేష మత్త చిత్త యేరీతి నితరంబు జేరనేర్చు?”

శ్రీమహా విష్ణువు పాదపద్మములను స్మరించు చిత్తము ఆ పాదముల దర్శన స్పర్శన ఆనంద అమృతము గ్రోలుచు, చిత్తము మత్తెక్కి యుండునుగదా. అట్టి చిత్తమునకు ఇతర విషయములందాసక్తి ఎట్లుండును? పై ప్రశ్న ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని అడుగును. సాధకునకు అట్టి చిత్తమే గమ్యము. సాధనయే మార్గము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

27 Mar 2021

శ్రీ లలితా సహస్ర నామములు - 53 / Sri Lalita Sahasranamavali - Meaning - 53

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 53 / Sri Lalita Sahasranamavali - Meaning - 53 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 53. సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ ।
మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్మృడప్రియా ॥ 53 ॥ 🍀

🍀 205. సర్వయంత్రాత్మికా -
అన్ని యంత్రములకు స్వరూపముగా గలది.

🍀 206. సర్వతంత్రరూపా -
అన్ని తంత్రములను తన రూపముగా గలది.

🍀 207. మనోన్మనీ -
మననస్థితిలో మేల్కాంచిన మననము చేయబడునట్టిది.

🍀 208. మాహేశ్వరీ -
మహేశ్వర సంబంధమైనది.

🍀 209. మహాదేవీ -
మహిమాన్వితమైన ఆధిపత్యము కలది.

🍀 210. మహాలక్ష్మీ -
గొప్పవైన లక్ష్మలు గలది.

🍀 211. మృడప్రియా -
శివుని ప్రియురాలు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 53 🌹

📚. Prasad Bharadwaj

🌻 53. sarva-yantrātmikā sarva-tantrarūpā manonmanī |
māheśvarī mahādevī mahālakṣmīr mṛḍapriyā || 53 || 🌻

🌻 205 ) Sarva yanthrathmika -
She who is represented by all yantras(Talisman)

🌻 206 ) Sarva thanthra roopa -
She who is also goddess of all Thanthras which is a method of worship

🌻 207 ) Manonmani -
She who is the result of mental thoughts of thoughts and actions

🌻 208 ) Maaheswari -
She who is the consort of Maheswara (Lord of everything)

🌻 209 ) Mahaa devi -
She who is the consort of Mahe Deva(God of all gods)

🌻 210 ) Maha lakshmi -
She who takes the form of Mahalaksmi, the goddess of wealth

🌻 211 ) Mrida priya -
She who is dear to Mrida (a name of Lord Shiva)

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

27 Mar 2021

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 198

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 198 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. త్రిభువనములు - ఆధ్యాత్మిక జీవితము యొక్క నాల్గు దశలు 🌻

736.

1. భౌతిక గోళము + సంయుక్త గోళమందలి భాగము { అన్న భువనము. }
2. సూక్ష్మ గోళము + సమగ్ర గోళమందలి భాగము { ప్రాణ భువనము. }
3. మానసిక గోళము + సమగ్ర గోళమందలి భాగము { మనో భువనము }

737. ఆధ్యాత్మిక జీవితము యొక్క నాల్గు దశలు :--

1. ధర్మశాస్త్ర మార్గము (కర్మకాండ మార్గము)
2. ఆధ్యాత్మిక మార్గము
3. ఐక్యమార్గము.
4. అనుభవ మార్గము.

పై నాల్గు దశలను అక్రోటు పండుతో పోల్చవచ్చును.

738. 
1. అక్రోటు పండు యొక్క పై చర్మము లేక తొక్క, కర్మకాండ వంటిది.
2. దానిలోపలి పొర ఆధ్మాత్మిక మార్గము వంటిది.
3. దానిలోపలనున్న గుజ్జు ఐక్యము వంటిది.
4. గుజ్జులోపలి సారము అనుభవము వంటిది.

ఈ నాల్గును పరస్పరాశ్రితములై యున్నవి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

27 Mar 2021

మాస్టర్ ఇ.కె సందేశాలు - 4

🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు - 4 🌹

🌻. భాగవతము 3-203.🌻
✍️. మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యలు

📚. ప్రసాద్ భరద్వాజ

ఈ సమస్త సృష్టిని కల్పించి, పాలించి , లయమొంద జేయుటలో భగవంతుడు ప్రదర్శించు ఆకారములే వాని దివ్యావతారములు. వానిని దర్శించుట దేవుని పాదపద్మములను స్మరించు భక్తులకే లభ్యము.

అటుగాక పుత్రులని, భార్యయని, మిత్రులని సంబంధములు మనస్సున ఏర్పరచుకొని, వానిచే బంధింపబడి, ఈ సంబంధముల కోసమై చెడ్డపనులు చేయుచు దేహములు అను ఇండ్లలో పడియుందురు.

వారిలో గూడ నీవంతర్యామియై యున్నావు. అయినను నీ అస్తిత్వమును వారికి ప్రసాదింపవు. ఇంద్రియముల మూలమున బాహ్య ప్రపంచమును చూచి అందు వర్తించువారు మూఢులు. ( బాహ్య ప్రపంచమున గూడ నున్నది భగవంతుడే అని తెలియని వారు.).

వారు ఆత్మజ్ఞానము నొందలేరు. ఆత్మజ్ఞానము నొందినవారిని గూడ గ్రహింపలేరు. అయినను ఆత్మజ్ఞానులు తమ చుట్టునున్న దుష్టులను చూడక వారియందున్న భగవంతునే చూతురు.

🌹 🌹 🌹 🌹 🌹

27 Mar 2021

శ్రీ శివ మహా పురాణము - 376

🌹 . శ్రీ శివ మహా పురాణము - 376 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 12

🌻. శివహిమాచల సంవాదము - 1 🌻

బ్రహ్మఇట్లు పలికెను-

అపుడు పర్వత రాజు సంతసించి అనేక పుష్కములను, ఫలములను అధిక పరిమాణములో తీసుకొని, తన కుమార్తెతో గూడి శివుని వద్దకు వెళ్లెను (1). ఆయన అచటకు వెళ్లి ధ్యానమగ్నుడై యున్న, ముల్లోకములకు నాథుడగు శివునకు నమస్కరించి, అద్భుతమగు తన కుమార్తె కాళిని ఆయనకు హృదయపూర్వకముగా అప్పజెప్పెను (2). ఆ పర్వత రాజు ఫలములను, పుష్పములను, ఇతరములను శంభుని ఎదుట నుంచి, తన కుమార్తెను ఆయన యెదుట నిలబట్టి, ఆయనతో నిట్లనెను (3).

హిమంతుడిట్లు పలికెను-

హే భగవాన్‌! నా కుమార్తె చంద్రశేఖరుడవగు నిన్ను సేవించుటకు ఉత్సాహపడుచున్నది. నిన్ను ఆరాధించే కోరిక గల ఆమెను నీవద్దకు తీసుకొని వచ్చితిని (4). హే నాథా ! నీకు నా యందు అనుగ్రహమున్నచో, మంగళకరుడవగు నిన్ను ఆమె సఖురాండ్రతో గూడి నిత్యము సేవించుటకు అనుమతినిమ్ము (5).

బ్రహ్మ ఇట్లు పలికెను-

అపుడు శంకరుడామెను చూచెను. ఆమె యందు అప్పుడప్పుడే ¸°వన మంకురించుచుండెను. పూర్ణ చంద్రుని వంటి ముఖము గల ఆమె కన్నులు వికసించిన పద్మపు రేకుల వలె ప్రకాశించెను (6). లీలలన్నింటికి నిధానమగు శుభ##వేషములో ఆమె సౌందర్యము ఇనుమడించెను. శంఖము వంటి కంఠముతో, నిడివి కన్నులతో, సుందరమగు చెవులతో ఆమె ప్రకాశించెను (7). తామరతూడు వలె మృదువైన, పొడవైన బాహు యుగళముతో ఆమె మనస్సును హరించుచుండెను. ఆమె స్తనములు పద్మపు మొగ్గలవలె బలిసి దృఢముగ నుండెను (8). సన్నని నడుముతో, ఉదరముపై మూడు ముడుతలతో ఆమె ప్రకాశించెను. ఆమె పాదయుగళములు నేలపై మొలచిన పద్మమువలవలె విరాజిల్లును (9).

స్త్రీలలో అగ్రగణ్యురాలగు ఆ సుందరి దర్శన మాత్రము చేతనే ధ్యానమనే పంజరమునందు దృఢముగా బంధింపబడిన మునుల మనస్సును గూడ దోచి వేయగల్గును (10). వత్సా! మునుల మనస్సును కూడ అపహరించగల ఆమో సౌందర్యమును శివుడు చూచెను. ఆ దేవి యొక్క దేహమునందు మంత్ర తంత్రములు వర్ధిల్లును. ఆమె తనకు నచ్చిన రూపమును స్వీకరించగల్గును (11). ఆయన వెంటనే కన్నులను మూసుకొని త్రిగుణాతీతము, నాశరహితము, సర్వోపరితత్త్వమునగు ఆత్మ స్వరూపమును ధ్యానించమొదలిడెను (12).

అపుడు సర్వేశ్వరుడు, సర్వవ్యాపి, తపస్సునందు నిష్ఠగల్గి కళ్లను మూసుకుని ధ్యానము చేయువాడు, జటాజూటధారి, చంద్రకళ అలంకారముగా గలవాడు, ఉపనిషత్ప్రతిపాద్యుడు, పరమాసనమునందు కూర్చుని యున్నవాడు (13) అగు శివుని హిమవంతుడు మరల శిరసా నమస్కరించెను. దైన్యము నెరుంగని మనస్సు గల హిమవంతునకు ఒక సంశయము కలిగెను. వాక్య ప్రయోగములో నిపుణుడగు ఆ పర్వత రాజు జగత్తునకు ఏకైక బంధువు అగు శివునితో నిట్లనెను (14).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

27 Mar 2021

27-MARCH-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 176🌹  
2) 🌹. శివ మహా పురాణము - 376🌹 
3) 🌹 Light On The Path - 125🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -4 🌹
5) 🌹 Seeds Of Consciousness - 323🌹   
6) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 198🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 53 / Lalitha Sahasra Namavali - 53🌹 
8) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 53 / Sri Vishnu Sahasranama - 53🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -176 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 18 - 2

*🍀 18. నూతన చిత్తము - 2 - సాధకుడు తనయందేర్పడుచున్న నూతన చిత్తమును కళ్ళెముగ వినియోగించి, స్వాభావిక చిత్తమును అదుపులోనికి తెచ్చుకొనవలెను. అందులకే యమ నియమములను పాటించుట సాధకునికి కీలకము. నూతన చిత్తము బలపడనిదే ఆత్మ సంయమమునకు దారి లేదు. బలపడనపుడు స్వాభావిక చిత్తమే నూతన చిత్తమును దమించును. నూతన చిత్తము బలపడినచో స్వభావమందలి మలినములు నశించి, దైవీ స్వభావము లేర్పడును. గురువను అయస్కాంతము సన్నిధిని శిష్యుడను సాధకుడు తనయందు దైవానుగ్రహముగ కలిగిన నూతన స్ఫూర్తిని బలపరచుకొనగలడు. 🍀*

పరుగిడుతున్న గుఱ్ఱములకు కళ్ళెము వేసి, రౌతు అదుపులోనికి తెచ్చునట్లు సాధకుడు తనయందేర్పడుచున్న నూతన చిత్తమును కళ్ళెముగ వినియోగించి, స్వాభావిక చిత్తమును అదుపులోనికి తెచ్చుకొనవలెను. అందులకే యమ నియమములను పాటించుట కూడ. ఈ అభ్యాసము సాధకునికి కీలకము. నూతన చిత్తము బలపడనిదే ఆత్మసంయమమునకు దారి లేదు. బలపడనపుడు స్వాభావిక చిత్తమే నూతన చిత్తమును దమించును.

ఈ సందర్భమును గూర్చియే వేమన యోగి 'ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికిన..... ', 'కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టిన...' అను పద్యములను రచించెను. సాధకుడు యోగి అగుట గాని కాకుండుట గాని దీనిపై ఆధారపడి యున్నది. నూతన చిత్తము బలపడినచో స్వభావమందలి మలినములు నశించి, దైవీ స్వభావము లేర్పడును. గొంగళిపురుగు సీతాకోక చిలుక అయినట్లు మలిన స్వభావము దైవీ స్వభావమై వెలు గొందును. కానిచో, గొంగళి పురుగుగనే జీవించి నశించును. 

ఇనుము అయస్కాంతమగుట వంటిదే ఆత్మ సంయమ యోగమునకు జరుగు ప్రక్రియ. అయస్కాంత సన్నిధిని ఇనుము తన స్వభావమును కోల్పోయి అయస్కాంత మగును. అట్లు చాల కాలము అయస్కాంత సన్నిధి నున్నపుడు స్వయముగ అయస్కాంతమై నిలచును. ప్రకృతి యందలి ఈ ధర్మము ననుసరించియే గురు-శిష్య సంప్రదాయ మేర్పడినది. 

గురువను అయస్కాంతము సన్నిధిని శిష్యుడను సాధకుడు తనయందు దైవానుగ్రహముగ కలిగిన నూతన స్ఫూర్తిని బలపరచుకొనగలడు. అందులకే భారతీయ సంప్రదాయమున గురుశిష్య సంప్రదాయము అతి ఉత్కృష్టముగ తెలుపబడినది. స్ఫూర్తి గల యోగ సాధకుడు గురు సాన్నిధ్యమును కోరుటలోని ఆంతర్యము తనయందు స్వాభావికమగు మార్పు. ఇది కేవలము సద్గురువు నుండియే లభించును. 

సద్గురువు నుండి ఇతర విషయముల నాసించుట అవివేకము. కాని పరిపాటిగ ఇతర విషయములనే ఆశించు చుందురు. నూతన స్ఫూర్తివంతమగు చిత్త మేర్పడుటచే, స్వాభావిక చిత్తము నియమింపబడి, నూతన చిత్తమై నిలచును. అట్టి నూతన చిత్తమునకు మూలము దివ్యస్ఫూర్తి గనుక, ఆ చిత్తము ఆత్మ యందు నిలచుటకే ఉత్సహించును. 

అట్టి సమయమునందే ఆత్మ యందు చిత్తము తిష్ఠ వేయుట జరుగును. ఆత్మ యందే చిత్తము తిష్ఠవేసినపుడు ఇతర కోరికలు నిస్పృహ చెందును. వాటిని పోషించు చిత్తము లేకుండుట వలన కోరికలు సాధకుని వీడును. 

ఆత్మ యందు రుచి గొన్న చిత్తమునకు లౌకిక అంశములపై రుచి తగ్గును. వాని జోలికి పోరు. వాని యందు ఆసక్తి లేక పోవుట వలన తటస్థముగ నిలచి పోవును. ఇతర విషయములను చేరుట కన్న ఆత్మ విషయము లేక దైవ విషయమునందు చేరుటకు ఉత్సహించును.

 “నంబుజోదర దివ్యపాదారవింద చింతనామృత పానవిశేష మత్త చిత్త యేరీతి నితరంబు జేరనేర్చు?”  

శ్రీమహా విష్ణువు పాదపద్మములను స్మరించు చిత్తము ఆ పాదముల దర్శన స్పర్శన ఆనంద అమృతము గ్రోలుచు, చిత్తము మత్తెక్కి యుండునుగదా. అట్టి చిత్తమునకు ఇతర విషయములందాసక్తి ఎట్లుండును? పై ప్రశ్న ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని అడుగును. సాధకునకు అట్టి చిత్తమే గమ్యము. సాధనయే మార్గము. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 376🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 12

*🌻. శివహిమాచల సంవాదము - 1 🌻*

బ్రహ్మఇట్లు పలికెను-

అపుడు పర్వత రాజు సంతసించి అనేక పుష్కములను, ఫలములను అధిక పరిమాణములో తీసుకొని, తన కుమార్తెతో గూడి శివుని వద్దకు వెళ్లెను (1). ఆయన అచటకు వెళ్లి ధ్యానమగ్నుడై యున్న, ముల్లోకములకు నాథుడగు శివునకు నమస్కరించి, అద్భుతమగు తన కుమార్తె కాళిని ఆయనకు హృదయపూర్వకముగా అప్పజెప్పెను (2). ఆ పర్వత రాజు ఫలములను, పుష్పములను, ఇతరములను శంభుని ఎదుట నుంచి, తన కుమార్తెను ఆయన యెదుట నిలబట్టి, ఆయనతో నిట్లనెను (3).

హిమంతుడిట్లు పలికెను-

హే భగవాన్‌! నా కుమార్తె చంద్రశేఖరుడవగు నిన్ను సేవించుటకు ఉత్సాహపడుచున్నది. నిన్ను ఆరాధించే కోరిక గల ఆమెను నీవద్దకు తీసుకొని వచ్చితిని (4). హే నాథా ! నీకు నా యందు అనుగ్రహమున్నచో, మంగళకరుడవగు నిన్ను ఆమె సఖురాండ్రతో గూడి నిత్యము సేవించుటకు అనుమతినిమ్ము (5).

బ్రహ్మ ఇట్లు పలికెను-

అపుడు శంకరుడామెను చూచెను. ఆమె యందు అప్పుడప్పుడే ¸°వన మంకురించుచుండెను. పూర్ణ చంద్రుని వంటి ముఖము గల ఆమె కన్నులు వికసించిన పద్మపు రేకుల వలె ప్రకాశించెను (6). లీలలన్నింటికి నిధానమగు శుభ##వేషములో ఆమె సౌందర్యము ఇనుమడించెను. శంఖము వంటి కంఠముతో, నిడివి కన్నులతో, సుందరమగు చెవులతో ఆమె ప్రకాశించెను (7). తామరతూడు వలె మృదువైన, పొడవైన బాహు యుగళముతో ఆమె మనస్సును హరించుచుండెను. ఆమె స్తనములు పద్మపు మొగ్గలవలె బలిసి దృఢముగ నుండెను (8). సన్నని నడుముతో, ఉదరముపై మూడు ముడుతలతో ఆమె ప్రకాశించెను. ఆమె పాదయుగళములు నేలపై మొలచిన పద్మమువలవలె విరాజిల్లును (9).

స్త్రీలలో అగ్రగణ్యురాలగు ఆ సుందరి దర్శన మాత్రము చేతనే ధ్యానమనే పంజరమునందు దృఢముగా బంధింపబడిన మునుల మనస్సును గూడ దోచి వేయగల్గును (10). వత్సా! మునుల మనస్సును కూడ అపహరించగల ఆమో సౌందర్యమును శివుడు చూచెను. ఆ దేవి యొక్క దేహమునందు మంత్ర తంత్రములు వర్ధిల్లును. ఆమె తనకు నచ్చిన రూపమును స్వీకరించగల్గును (11). ఆయన వెంటనే కన్నులను మూసుకొని త్రిగుణాతీతము, నాశరహితము, సర్వోపరితత్త్వమునగు ఆత్మ స్వరూపమును ధ్యానించమొదలిడెను (12).

అపుడు సర్వేశ్వరుడు, సర్వవ్యాపి, తపస్సునందు నిష్ఠగల్గి కళ్లను మూసుకుని ధ్యానము చేయువాడు, జటాజూటధారి, చంద్రకళ అలంకారముగా గలవాడు, ఉపనిషత్ప్రతిపాద్యుడు, పరమాసనమునందు కూర్చుని యున్నవాడు (13) అగు శివుని హిమవంతుడు మరల శిరసా నమస్కరించెను. దైన్యము నెరుంగని మనస్సు గల హిమవంతునకు ఒక సంశయము కలిగెను. వాక్య ప్రయోగములో నిపుణుడగు ఆ పర్వత రాజు జగత్తునకు ఏకైక బంధువు అగు శివునితో నిట్లనెను (14).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 125 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 10 - THE Note on 20th RULE
*🌻 20. Seek it by testing all experiences - 1 🌻*

473. A.B. – The Master Hilarion adds the following note to Rule 20.

474. Seek it by testing all experiences; and remember that when I say this I do not say: “Yield to the seductions of sense in order to know it.” Before you have become on Occultist you may do this; but not afterwards. 

When you have chosen and entered the Path you cannot yield to these seductions without shame. Yet you can experience them without horror: can weigh, observe, and test them, and wait with the patience of confidence for the hour when they shall affect you no longer.

475. In the earlier stages of human evolution the ego is not sufficiently developed to know right from wrong. But the moment he has learned to distinguish between them, to know them as different, morality begins. When, for example, he begins to understand the difference between destroying life and guarding it, there is for him the birth of morality on that line. 

The kind of experience which taught him that knowledge is then not wanted any longer. But though the man no longer needs to test that experience, there is still sometimes a rush of the senses, compelling him to some wrong action, and that afterwards causes him to suffer, because he recognizes that it was wrong to yield to it. 

The saying of the pseudo-occultist, that a man may do wrong in order to gain experience, is never justified. When an act is done while a man is unconscious of its being wrong he is gaining necessary experience; but when there is knowledge that it is wrong, then each yielding means a fall, and keen suffering must follow.

476. The condition of yielding under stress of circumstances lasts for many lives; even after a man has entered on the Path the conflict with the desires of the senses often continues. Before one can make rapid progress there are long stages of conflict between the wish that works through the astral and mental bodies, and the knowledge that its gratification is a hindrance to the higher life. 

The conflict on the lower stages is long, and when it passes on into a higher stage, and arises when mental images are mixed up with the desires of the senses, temptations become more subtle, for the mind idealizes the sense-objects, refines the grosser impulses, and presents desires in their most alluring aspect. 

Another stage comes when the aspirant is on the Path proper, for even there the keen force of old temptations is sufficiently strong to assail him. It is in this connection that we have the statement in the Master’s note, which shows the disciple how he may utilize them; he can weigh, observe, and test these seductions, waiting patiently for the time when they shall affect him no longer.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు - 4 🌹
🌻. భాగవతము 3-203.🌻
✍️. మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యలు
📚. ప్రసాద్ భరద్వాజ

ఈ సమస్త సృష్టిని కల్పించి, పాలించి , లయమొంద జేయుటలో భగవంతుడు ప్రదర్శించు ఆకారములే వాని దివ్యావతారములు. వానిని దర్శించుట దేవుని పాదపద్మములను స్మరించు భక్తులకే లభ్యము.

అటుగాక పుత్రులని, భార్యయని, మిత్రులని సంబంధములు మనస్సున ఏర్పరచుకొని, వానిచే బంధింపబడి, ఈ సంబంధముల కోసమై చెడ్డపనులు చేయుచు దేహములు అను ఇండ్లలో పడియుందురు.

వారిలో గూడ నీవంతర్యామియై యున్నావు. అయినను నీ అస్తిత్వమును వారికి ప్రసాదింపవు. ఇంద్రియముల మూలమున బాహ్య ప్రపంచమును చూచి అందు వర్తించువారు మూఢులు. ( బాహ్య ప్రపంచమున గూడ నున్నది భగవంతుడే అని తెలియని వారు.).

వారు ఆత్మజ్ఞానము నొందలేరు. ఆత్మజ్ఞానము నొందినవారిని గూడ గ్రహింపలేరు. అయినను ఆత్మజ్ఞానులు తమ చుట్టునున్న దుష్టులను చూడక వారియందున్న భగవంతునే చూతురు.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్‌ఇకె #MasterEK
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Seeds Of Consciousness - 323 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 172. When you go deep inside, nothing is all there is. There is no 'I am'. The 'I am' merges in the Absolute. 🌻*

After understanding the 'I am', deep, intense, continuous meditation is required on it. It should be in such way that the knowledge 'I am' meditates on itself devoid of all bodily identification. 

When this is done, a moment comes when the 'I am' disappears or there is no 'I am' anymore. At this moment the 'I am' merges in the Absolute, quite similar to the ending or disappearance of the dream and you being as you are in the waking state.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 198 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. త్రిభువనములు - ఆధ్యాత్మిక జీవితము యొక్క నాల్గు దశలు 🌻*

736. 
1. భౌతిక గోళము + సంయుక్త గోళమందలి భాగము { అన్న భువనము. }
2. సూక్ష్మ గోళము + సమగ్ర గోళమందలి భాగము { ప్రాణ భువనము. }
3. మానసిక గోళము + సమగ్ర గోళమందలి భాగము { మనో భువనము }

737. ఆధ్యాత్మిక జీవితము యొక్క నాల్గు దశలు :--
1. ధర్మశాస్త్ర మార్గము (కర్మకాండ మార్గము)
2. ఆధ్యాత్మిక మార్గము
3. ఐక్యమార్గము.
4. అనుభవ మార్గము.
పై నాల్గు దశలను అక్రోటు పండుతో పోల్చవచ్చును. 

738. 1. అక్రోటు పండు యొక్క పై చర్మము లేక తొక్క, కర్మకాండ వంటిది.
2. దానిలోపలి పొర ఆధ్మాత్మిక మార్గము వంటిది.
3. దానిలోపలనున్న గుజ్జు ఐక్యము వంటిది.
4. గుజ్జులోపలి సారము అనుభవము వంటిది.

ఈ నాల్గును పరస్పరాశ్రితములై యున్నవి. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
Join and share
🌹 Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా 🌹
www.facebook.com/groups/avataarmeherbaba/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 53 / Sri Lalita Sahasranamavali - Meaning - 53 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 53. సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ ।*
*మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్మృడప్రియా ॥ 53 ॥ 🍀*

🍀 205. సర్వయంత్రాత్మికా - 
అన్ని యంత్రములకు స్వరూపముగా గలది.

🍀 206. సర్వతంత్రరూపా - 
అన్ని తంత్రములను తన రూపముగా గలది.

🍀 207. మనోన్మనీ - 
మననస్థితిలో మేల్కాంచిన మననము చేయబడునట్టిది.

🍀 208. మాహేశ్వరీ - 
మహేశ్వర సంబంధమైనది.

🍀 209. మహాదేవీ - 
మహిమాన్వితమైన ఆధిపత్యము కలది.

🍀 210. మహాలక్ష్మీ - 
గొప్పవైన లక్ష్మలు గలది.

🍀 211. మృడప్రియా - 
శివుని ప్రియురాలు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 53 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 53. sarva-yantrātmikā sarva-tantrarūpā manonmanī |*
*māheśvarī mahādevī mahālakṣmīr mṛḍapriyā || 53 || 🌻*

🌻 205 ) Sarva yanthrathmika -   
She who is represented by all yantras(Talisman)

🌻 206 ) Sarva thanthra roopa -   
She who is also goddess of all Thanthras which is a method of worship

🌻 207 ) Manonmani -   
She who is the result of mental thoughts of thoughts and actions

🌻 208 ) Maaheswari -   
She who is the consort of Maheswara (Lord of everything)

🌻 209 ) Mahaa devi -   
She who is the consort of Mahe Deva(God of all gods)

🌻 210 ) Maha lakshmi -   
She who takes the form of Mahalaksmi, the goddess of wealth

🌻 211 ) Mrida priya -  
 She who is dear to Mrida (a name of Lord Shiva)

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
Join and Share 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 53 / Sri Vishnu Sahasra Namavali - 53 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*🌻 53. ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః |*
*శరీర భూతభృద్ భోక్తా కపీంద్రో భూరిదక్షిణః ‖ 53 ‖*

*చిత్త నక్షత్రం 1వ పాద శ్లోకం*

🍀. 494) ఉత్తర: - 
అందరికంటెను అధికుడై, ఉత్తముడైనవాడు.

🍀. 495) గోపతి: - 
గోవులను పాలించువాడు.

🍀. 496) గోప్తా - 
సర్వులను సంరక్షించువాడు.

🍀. 497) జ్ఞానగమ్య: - 
జ్ఞానము చేతనే తెలియబడినవాడు.

🍀. 498) పురాతన: - 
సృష్టికి పూర్వమే వున్నవాడు.

🍀. 499) శరీరభూతభృత్ - 
శరీరముల నుత్పన్నము చేయు పంచభూతములను పోషించువాడు.

🍀. 500) భోక్తా - 
అనుభవించువాడు.

🍀. 501) కపీంద్ర: - 
వానరులకు ప్రభువైనవాడు.

🍀. 502) భూరిదక్షిణ: - 
యజ్ఞ సమయములలో విశేషముగా దక్షిణ లిచ్చువాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 53🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*
*Sloka for Chitta 1st Padam*

*🌻 53. uttarō gōpatirgōptā jñānagamyaḥ purātanaḥ |*
*śarīrabhūtabhṛdbhōktā kapīndrō bhūridakṣiṇaḥ || 53 ||*

🌻 494. Uttaraḥ: 
One who is Uttirna or liberated from Samsara.

🌻 495. Gōpatiḥ: 
Krishna who tends the cattle in the form of a Gopa. One who is the master of the earth.

🌻 496. Gōptā: 
One who is the protector of all beings.

🌻 497. Jñānagamyaḥ: 
The Lord cannot be known through Karma or a combination of Karma and Jyana.

🌻 498. Purātanaḥ: 
One who is not limited by time and who existed before anything else.

🌻 499. Śarīrabhūtabhṛd: 
One who is the master of the five Bhutas (elements) of which the body is made.

🌻 500. Bhōktā: 
One who protects. Or one who is the enjoyer of infinite bliss.

🌻 501. Kapīndraḥ: 
Kapi means Varah (boar). The word means, the Lord who is Indra and also one who manifested as Varaha or the Boar in one of the incarnations. 

🌻 502. Bhūridakṣiṇaḥ: 
One to whom numerous Dakshinas or votive offerings are made in Yajnas.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹