Happy Kalki Jayanti

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 392 / Sri Lalitha Chaitanya Vijnanam - 392

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 392 / Sri Lalitha Chaitanya Vijnanam - 392🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 85. నిత్యక్లిన్నా, నిరుపమా, నిర్వాణ సుఖదాయినీ ।
నిత్యా, షోడశికారూపా, శ్రీకంఠార్ధ శరీరిణీ ॥ 85 ॥ 🍀

🌻 392. 'శ్రీకంఠార్ధశరీరిణీ' 🌻

శివుడు అర్ధ శరీరముగా గలది శ్రీమాత అని అర్థము. 'శ్రీ' అనగా విషము. శ్రీకంఠుడు అనగా కంఠము నందు విషము ధరించినవాడు శివుడు. శివుని అర్ధాంగి శ్రీమాత. ప్రకృతి పురుషులు సృష్టియందు అవినాభావ సంబంధము కలిగి యుందురు. "మొదట ఆత్మయే యున్నది. పిదప ఆ ఆత్మయే రెండైనది. ఆ రెండే ప్రకృతి పురుషులు.” వారినే భార్యా భర్తలు అని కూడా అందురు. శంకరుని అర్ధశరీరము పొందిన శ్రీదేవి శివునియొక్క వామభాగముగ యుండును.

శివుడు తెలుపు, ఆమె నలుపు. అట్లే శివుడు నలుపై నప్పుడు ఆమె తెలుపు. ఇట్లు అష్టమి తిథిగ కృష్ణపక్షము నందు, శుక్ల పక్షము నందు కూడ దర్శనమగు చుండును. ఆమె కనపడినపుడు అతడు మరు గగును. అతడు కనపడినపుడు ఆమె మరు గగును. దుర్గాష్టమి నాడు ఆమె కనపడును. కృష్ణాష్టమినాడు అత డగుపడును. ఇట్లు ప్రకృతి పురుషుడుగా నున్నది శ్రీదేవియే. అపుడామె 'పరా'.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 392 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 85. Nityaklinna nirupama nirvana sukhadaeini
Nitya shodashika rupa shree kantardha sharirini ॥ 85 ॥ 🌻

🌻 392. Śrīkaṇṭhārdha-śarīriṇī श्रिकण्ठार्ध-शरीरिणी 🌻

She has half the body of Śiva. Śrīkaṇṭha is another name of Śiva. Śrī also means poison and kaṇṭha means throat. Since Śiva holds poison in His throat, He is known as Śrīkaṇṭha. Śrīkaṇṭha also means beautiful neck. She has half the body of Śiva. Bṛhadāraṇyaka Upaniṣad (I.iv.3) describes this condition thus: “He (puruṣa or soul) desired a mate (prakṛti).

He became as big as, man and wife embracing each other. He parted this very body into two. From that came husband and wife. This is one- half of oneself, like one of the two halves of split pea. Therefore this pea is indeed filled by the wife. He was united with her. From that men were born.”

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

03 Aug 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 223. ప్రేమ అనే దేవుడు / Osho Daily Meditations - 223. THE GOD OF LOVE

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 223 / Osho Daily Meditations - 223 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 223. ప్రేమ అనే దేవుడు 🍀

🕉. మీరు మీ కంటే ఉన్నతమైన దానికి లొంగిపోండి - ప్రేమ అనే దేవుడికి. 🕉

ప్రేమగా చెప్పబడే దేవుడు ఉన్నాడని ఉన్న పురాణం చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే ఇది నిజంగా చాలా అద్భుతమైన అవగాహన కనుక. అప్పుడు ప్రేమికులుగా ఉన్న ఏవరైనా దేవునికి సమర్పణ చెంద గలుగుతారు. అయినప్పటికీ వారు స్వతంత్రంగా ఉంటారు. మీరు స్వతంత్రంగా ఉన్నప్పుడు అందం ఉంటుంది - లేకపోతే మీరు కేవలం నీడగా ఉంటారు లేదా మీ భాగస్వామికి నీడగా మారతారు. మీ భాగస్వామి మీ నీడగా మారితే, ఆ క్షణంలోనే మీరు వారి పట్ల ఆసక్తిని కోల్పోతారు - నీడను ఎవరు ఇష్టపడతారు? మీరు నీడగా మారితే, మీ భాగస్వామి మీ పట్ల ఆసక్తిని కోల్పోతారు. మేము నిజమైన మనుషులను ప్రేమించాలను కుంటున్నాము, నీడలను కాదు అంటారు. ఎవరూ, ఎవరి నీడగానూ మారాల్సిన అవసరం లేదు. మీరు మీరుగా ఉండండి, మరియు మీ భాగస్వామి కూడా తనలాగే ఉంటారు.

వాస్తవానికి, ప్రేమ అనే దేవునికి లొంగిపోవడం ద్వారా, మీరు నిజమైనవారు అవుతారు. ఇప్పటి వరకు మీరు ప్రేమకు ప్రామాణికమైన వారు కాదు కానీ ఈ ప్రేమ అనే దైవానికి సమర్పణ చెందడం ద్వారా మీరు మొదటిసారిగా ప్రేమకు ప్రామాణికంగా మారినప్పుడు, రెండు ప్రామాణికమైన జీవులు నిజంగా, చాలా లోతుగా ప్రేమించు కోగలవు అని తెలుసుకుంటారు. ఆపై ఆ అవగాహనను వెనుకకు తీసుకోవలసిన అవసరం ఎప్పటికీ రాదు. నేను ఈ ఆలోచనను గట్టిగా చేప్తాను: మీరు ప్రేమ అనే దేవునికి సమర్పణ చెందినప్పుడు, మీ భాగస్వామి మీతో ఉంటారా లేదా మిమ్మల్ని విడిచిపెట్టారా లేదా మీరు విడిచిపెట్టారా అనేది అంత ముఖ్యమైనది కాదు. కానీ ఒక విషయం మాత్రం ముఖ్యం: మీ లొంగుబాటు ప్రేమ వైపు ఉండాలి, మీ భాగస్వామి పట్ల కాదు. ప్రేమకు ద్రోహం చేయకూడదు. ప్రేమను అలాగే నిలిపి ఉంచుకోవాలి. ప్రేమికులు మారవచ్చు; అయినప్పటికి ప్రేమ ఉండగలదు. ఒక్కసారి ఈ విషయం అర్థం చేసుకుంటే ఇక భయం ఉండదు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 223 🌹

📚. Prasad Bharadwaj

🍀 223. THE GOD OF LOVE 🍀

🕉. Surrender to something higher than both if you - that is the God of love. 🕉

The very myth that there is a God of love is beautiful, it is a tremendous understanding. Then two lovers can surrender to the God and they remain independent. And when you are independent there is beauty--otherwise you become just a shadow, or your partner becomes a shadow. If your partner becomes a shadow, in that very moment you will start losing interest-who loves a shadow? If you become a shadow your partner will start losing interest in you. We want to love real human beings, not shadows. There is no need to become anybody's shadow. You remain yourself, and your partner remains herself or himself.

In fact, by surrendering to the God of love, you become authentic. And you are never as authentic as when you become authentic for the first time. Two authentic beings can love, and can love deeply, and then there is no need to hold back. Let me underline this idea: When you are surrendered to the God of love, then it is not very important whether your partner remains with you or leaves you or whether you leave. One thing is important: that love remains. Your surrender is toward love, not toward your partner. So the only thing is not to betray love. Lovers can change; love can remain. Once you have understood that, there is no fear.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

03 Aug 2022

శ్రీ శివ మహా పురాణము - 604 / Sri Siva Maha Purana - 604

🌹 . శ్రీ శివ మహా పురాణము - 604 / Sri Siva Maha Purana - 604 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 05 🌴

🌻. కుమారాభిషేకము - 6 🌻

లక్ష్మి దివ్యసంపదను, రమణీయమగు గొప్పహారమును, సావిత్రి సంపూర్ణసిద్ధ విద్యను ఆనందముతో నిచ్చిరి(51). ఓ మునీ! అచటకు వచ్చిన ఇతరదేవీ మూర్తులు, అతడు శిశువుగా నుండగా పాలించిన కృత్తికలు తమకు ప్రియమగు వస్తువులను అతనికి ఇచ్చిరి (52). ఓ మహర్షీ! అచట గొప్ప ఉత్సవము జరిగెను. అందరు ప్రసన్నులైరి. పార్వతీ పరమేశ్వరులు విశేషముగా సంతోషంచిరి (53). ఆ సమయములో ప్రతాపశాలి, తేజశ్శాలి అగు రుద్రుడు ఆనందముతో నవ్వి బ్రహ్మ మొదలగు దేవతలతో నిట్లనెను (54).

శివుడిట్లు పలికెను-

ఓ హరీ! బ్రహ్మా! దేవతలారా! మీరందరు నా మాటను వినుడు. నేను అన్ని విధములుగా ప్రసన్నుడనైతిని. మీకు నచ్చిన వరములను కోరుకొనుడు(55).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మునీ! విష్ణువు మొదలగు దేవతలందరు ఆ శంభుని వచనమును విని ప్రసన్నమగు ముఖము గలవారై ప్రభువగు పశుపతి దేవునితో నిట్లనిరి (56). ఓ ప్రభూ! ఈ కుమారుని చేతిలో తారకుడు సంహరింబడ గలడు. ఈ ఉత్తమ చరిత్రము అందుకొరకు మాత్రమే ఘటిల్లినది (57). కావున తారకుని సంహరించుటకు సన్నద్ధులమై ఈనాడే బయలుదేరెదము. కుమారునకు అనుమతినిమ్ము. ఆతడు వానిని వధించి మాకు సుఖమును కలుగజేయుగాక! (58)

అటులనే అని అంగీకరించి ఆ విభుడు అపుడు దయతో నిండిన హృదయము గలవాడై, తారకాసుర సంహారము కొరకు కుమారుని దేవతలకు అప్పగించెను (59).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 604🌹

✍️ J.L. SHASTRI     📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 05 🌴

🌻 Kārttikeya is crowned - 6 🌻

51. Lakṣmī gave him divine wealth and a great and beautiful necklace. Sāvitrī gave him the entire Siddhavidyā[3] with joy.

52. O sage, the other goddesses too who had come there gave him their respective presents. The Kṛttikās too did the same.

53. O excellent sage, there was great jubilation there. Everyone was delighted, especially Pārvatī and Śiva.

54. In the meantime, O sage, the powerful Śiva, spoke to Brahmā and to other gods laughingly and joyously.

Śiva said:—

55. “O Viṣṇu, O Brahmā, O gods, you listen to my words. I am delighted in all respects. Please choose the boons you wish.”

Brahmā said:—

56. O sage, on hearing those words of Śiva, Viṣṇu and other gods spoke to Śiva with faces beaming with pleasure.

The gods said:—

57. “O lord, Tāraka will certainly be killed by Kumāra. It is for that purpose that he is born.

58. Hence in our effort to kill him we shall start this very day. Please give your directions to Kumāra. Let him slay Tāraka for our happiness.

59. Thinking that it shall be so, lord Śiva entrusted his son to the gods in order to kill Tāraka, urged by his mercy that he was.

Continues....

🌹🌹🌹🌹🌹

03 Aug 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 88 / Agni Maha Purana - 88

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 88 / Agni Maha Purana - 88 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 29

🌻. సర్వతోభద్ర మండల విధి - 5 🌻

దాని తరువాత నున్న ఒక పంక్తి చెరిపి వేసి మరల వెనుకటి వలె పదునారు భద్రమండలములు వ్రాయవలెను. పిమ్మట అన్ని ప్రక్కలను ఉన్న ఒక్కొక్క పంక్తి చెరిపివేసి ఒక్కొక్క దిక్కున మూడేసి చొప్పున పండ్రెండు ద్వారములు నిర్మింపవలెను. వెలుపల నున్న ఆరు కోష్ఠములు తుడిచివేసి మధ్యభాగముయొక్క పార్శ్వభాగములందలి నాలిగింటిని తుడిచివేయవలెను. మరల, శోభానిర్మాణమునకై లోపల నున్న నాలుగు కోష్ఠములను, వెలుపల నున్న రెండు కోష్ఠములను తుడిచివేయలవలెను.

పిమ్మట ఉపద్వారము లేర్పడుటకై లోపల నున్న మూడు కోష్ఠములను, వెలుపలనున్న ఐదు కోష్ఠములను తుడిచివేయవలెను. పిమ్మట, వెనుక చెప్పిన విధమున శోభ నిర్మింపవలెను. కోణములలో వెలుపల నున్న ఏడు కోష్ఠములను, లోపలనున్న మూడు కోష్ఠములను తుడిచి వేయవలెను. ఈ విధముగ ఏర్పడిన పంచవింశతి వ్యూహమండలము లోపల నున్న కమలకర్ణికపై పరమాత్మను పూజింపవలెను.

మరల తూర్పు మొదలైన దిక్కులలో నున్న కమలములపై క్రమముగా వాసుదేవాదుల పూజ చేయవలెను. పిమ్మట తూర్పున నున్న కమలముపై భగవంతుడగు వారహమూర్తిని పూజించి క్రమముగా ఇరువదిఐదువ్యూహముల పూజచేయవలెను. ఇరువదియారవ తత్త్వమైన పరమాత్మునిపూజ సంపన్నమగువరకును ఈ క్రమముజరుగవలెను.

ఒకే మండలముపై అన్ని వ్యూహముల పూజనుక్రమముగా చేయవలెనని ప్రచేతసుని మతము. కాని సత్యాచార్యుని మతము ప్రకారము మూర్తిభేధమును బట్టి పరమాత్ముని వ్యక్తిత్వము నందు భేదమేర్పడును గాన విభిన్న మూర్తుల పూజ వేరువేరుగా చేయవలెను.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 88 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 29

🌻 Mode of worshipping Hari in the figure called Sarvatobhadra - 5 🌻

35. Then having sprinkled the rows (of compartments) and writing sixteen bhadrakas the rows all around are sprinkled. and allotment is made.

36-38. Twelve doors (are drawn) in the usual order in each quarter. Having omitted the six (compartments) inside and having sprinkled for beautification the four at the centre, the four on the sides and two inside and outside, and having cleansed three inside and five outside for accomplishing additional doors, as before beautification is made. Seven of the corners outside and three apartments inside are cleansed.

39. The supreme brahman is to be worshipped in the auspicious twenty-five (compartment) formation. Then in the lotus (drawn) in the middle commencing with east, Vāsudeva and other deities are worshipped in order.

40. Having worshipped the boar-form in the lotus in the east the formation is worshipped in order until the thirty-six (forms are finished).

41. With the effort that it has to be worshipped, (one has to worship) all formations in the order in the single lotus as described. The progenitor is regarded as the sacrifice.

42. Acyuta divided into many forms is regarded as ‘truth’. Forty cubits of the ground in the north has to be divided in order.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

03 Aug 2022

కపిల గీత - 49 / Kapila Gita - 49

🌹. కపిల గీత - 49 / Kapila Gita - 49🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు,
📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 2వ అధ్యాయము - సృష్టి తత్వం - 5 🌴

05. గుణైర్విచిత్రాః సృజతీం సరూపాః ప్రకృతిం ప్రజాః
విలోక్య ముముహే సద్యః స ఇహ జ్ఞానగూహయా

జీవుడు ప్రకృతిని ఎందుకు ఆమోదిస్తున్నాడు? ఆ ప్రకృతి తన లాంటి వాటినీ, చిత్ర విచిత్రమైన వాటిని ఎన్నింటినో సృష్టిస్తుంది. అవి చూసి జీవుడు చాలా బాగున్నాయి అనుకుంటాడు. వెంటనే జీవుడు మోసపోయాడు. కంటితో చూచి బాగుంది అనుకునే ప్రతీదీ ప్రకృతే. ఆత్మకు ఏ రంగూ రూపం ఉండదు. ప్రకృతి సృష్టించిన రూపాలను చూచి జీవుడు మోహాన్ని పొందుతున్నాడు. ఇలా లేని వాటిని ఉన్నదీ అనుకోవడమే మోహం. ప్రకృతి జ్ఞ్యానముని కప్పిపుచ్చుతుంది. ఆ జ్ఞ్యానం మరుగునపడుతుంది. మోహం పైకి తేవబడుతుంది. జీవుడు అందుకే లేని దానిని ఉన్నట్లు, ఉన్నదాన్ని లేనట్లు, తనవి కాని దాన్ని తనవి అన్నట్లు భ్రమకు లోనవుతాడు.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 49 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

✍️ Swami Prabhupada. 📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 5 🌴

05. guṇair vicitrāḥ sṛjatīṁ sa-rūpāḥ prakṛtiṁ prajāḥ
vilokya mumuhe sadyaḥ sa iha jñāna-gūhayā

Divided into varieties by her threefold modes, material nature creates the forms of the living entities, and the living entities, seeing this, are illusioned by the knowledge—covering feature of the illusory energy.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

03 Aug 2022

03 Aug 2022 Daily Panchang నిత్య పంచాంగము

🌹03 August 2022 పంచాగము - Panchagam 🌹

శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday

🍀. కల్కి జయంతి శుభాకాంక్షలు, Kalki Jayanti Wishes. 🍀

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌺. పండుగలు మరియు పర్వదినాలు : కల్కి జయంతి, స్కందషష్ఠి, Kalki Jayanti, Skanda Sashti 🌺

🍀. నారాయణ కవచము - 14 🍀

22. శ్రీవత్సధామాఽపరరాత్ర ఈశః ప్రత్యుష ఈశోఽసిధరో జనార్దనః |
దామోదరోఽవ్యాదనుసంధ్యం ప్రభాతే విశ్వేశ్వరో భగవాన్కాలమూర్తిః

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : భగవానుని గురునిగా, పితనుగా, మాతనుగా, సఖునిగా, క్రీడా సహచరునిగా, ప్రభునిగా, ప్రియునిగా ఇట్లు ఏడురకాలుగా భావించి ఏడురకాల ఆనందాలను అనుభవించే అవకాశం మానవుని కున్నది. 🍀

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం

దక్షిణాయణం, వర్ష ఋతువు

తిథి: శుక్ల షష్టి 29:42:01 వరకు

తదుపరి శుక్ల-సప్తమి

నక్షత్రం: హస్త 18:24:00 వరకు

తదుపరి చిత్ర

యోగం: సిధ్ధ 17:48:05 వరకు

తదుపరి సద్య

కరణం: కౌలవ 17:41:44 వరకు

వర్జ్యం: 02:12:54 - 03:52:30

మరియు 26:32:00 - 28:09:36

దుర్ముహూర్తం: 11:56:26 - 12:47:57

రాహు కాలం: 12:22:12 - 13:58:46

గుళిక కాలం: 10:45:37 - 12:22:12

యమ గండం: 07:32:27 - 09:09:02

అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47

అమృత కాలం: 12:10:30 - 13:50:06

సూర్యోదయం: 05:55:52

సూర్యాస్తమయం: 18:48:31

చంద్రోదయం: 10:25:47

చంద్రాస్తమయం: 22:36:20

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: కన్య

ఆనంద యోగం - కార్య సిధ్ధి 18:24:00

వరకు తదుపరి కాలదండ యోగం

- మృత్యు భయం

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

🍀 03 - AUGUST - 2022 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🍀

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 03, బుధవారం, ఆగస్టు 2022 సౌమ్య వాసరే  Wednesday 🌹

*🍀. కల్కి జయంతి శుభాకాంక్షలు, Kalki Jayanti Wishes to all. 🍀*

2) 🌹 కపిల గీత - 49 / Kapila Gita - 49 🌹 సృష్టి తత్వము - 5
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 88 / Agni Maha Purana - 88 🌹
4) 🌹. శివ మహా పురాణము - 604 / Siva Maha Purana -604 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 223 / Osho Daily Meditations - 223 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 392 / Sri Lalitha Chaitanya Vijnanam - 392🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹03 August 2022 పంచాగము - Panchagam  🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*🍀. కల్కి జయంతి శుభాకాంక్షలు, Kalki Jayanti Wishes. 🍀*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు :  కల్కి జయంతి, స్కందషష్ఠి, Kalki Jayanti, Skanda Sashti  🌺*

*🍀. నారాయణ కవచము - 14 🍀*

*22. శ్రీవత్సధామాఽపరరాత్ర ఈశః ప్రత్యుష ఈశోఽసిధరో జనార్దనః |*
దామోదరోఽవ్యాదనుసంధ్యం ప్రభాతే విశ్వేశ్వరో భగవాన్కాలమూర్తిః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀.  నేటి సూక్తి :   భగవానుని గురునిగా, పితనుగా, మాతనుగా, సఖునిగా, క్రీడా సహచరునిగా, ప్రభునిగా, ప్రియునిగా ఇట్లు ఏడురకాలుగా భావించి ఏడురకాల ఆనందాలను అనుభవించే అవకాశం మానవుని కున్నది. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి: శుక్ల షష్టి 29:42:01 వరకు
తదుపరి శుక్ల-సప్తమి
నక్షత్రం: హస్త 18:24:00 వరకు
తదుపరి చిత్ర
యోగం: సిధ్ధ 17:48:05 వరకు
తదుపరి సద్య
కరణం: కౌలవ 17:41:44 వరకు
వర్జ్యం: 02:12:54 - 03:52:30
మరియు 26:32:00 - 28:09:36
దుర్ముహూర్తం: 11:56:26 - 12:47:57
రాహు కాలం: 12:22:12 - 13:58:46
గుళిక కాలం: 10:45:37 - 12:22:12
యమ గండం: 07:32:27 - 09:09:02
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47
అమృత కాలం: 12:10:30 - 13:50:06
సూర్యోదయం: 05:55:52
సూర్యాస్తమయం: 18:48:31
చంద్రోదయం: 10:25:47
చంద్రాస్తమయం: 22:36:20
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: కన్య
ఆనంద యోగం - కార్య సిధ్ధి 18:24:00
వరకు తదుపరి కాలదండ యోగం
- మృత్యు భయం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం  దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 49 / Kapila Gita - 49🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు,
📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 2వ అధ్యాయము - సృష్టి తత్వం  - 5 🌴*

*05. గుణైర్విచిత్రాః సృజతీం సరూపాః ప్రకృతిం ప్రజాః*
*విలోక్య ముముహే సద్యః స ఇహ జ్ఞానగూహయా*

*జీవుడు ప్రకృతిని ఎందుకు ఆమోదిస్తున్నాడు? ఆ ప్రకృతి తన లాంటి వాటినీ, చిత్ర విచిత్రమైన వాటిని ఎన్నింటినో సృష్టిస్తుంది. అవి చూసి జీవుడు చాలా బాగున్నాయి అనుకుంటాడు. వెంటనే జీవుడు మోసపోయాడు. కంటితో  చూచి బాగుంది అనుకునే ప్రతీదీ ప్రకృతే. ఆత్మకు ఏ రంగూ రూపం ఉండదు. ప్రకృతి సృష్టించిన రూపాలను చూచి జీవుడు మోహాన్ని పొందుతున్నాడు. ఇలా లేని వాటిని ఉన్నదీ అనుకోవడమే మోహం. ప్రకృతి జ్ఞ్యానముని కప్పిపుచ్చుతుంది. ఆ జ్ఞ్యానం మరుగునపడుతుంది. మోహం పైకి తేవబడుతుంది. జీవుడు అందుకే లేని దానిని ఉన్నట్లు, ఉన్నదాన్ని లేనట్లు, తనవి కాని దాన్ని తనవి అన్నట్లు భ్రమకు లోనవుతాడు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 49 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*✍️  Swami Prabhupada.   📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 5 🌴*

*05.  guṇair vicitrāḥ sṛjatīṁ sa-rūpāḥ prakṛtiṁ prajāḥ
*vilokya mumuhe sadyaḥ sa iha jñāna-gūhayā*

*Divided into varieties by her threefold modes, material nature creates the forms of the living entities, and the living entities, seeing this, are illusioned by the knowledge—covering feature of the illusory energy.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 88 / Agni Maha Purana - 88 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚.  ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః  ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 29*

*🌻.  సర్వతోభద్ర మండల విధి - 5 🌻*

దాని తరువాత నున్న ఒక పంక్తి చెరిపి వేసి మరల వెనుకటి వలె పదునారు భద్రమండలములు వ్రాయవలెను. పిమ్మట అన్ని ప్రక్కలను ఉన్న ఒక్కొక్క పంక్తి చెరిపివేసి ఒక్కొక్క దిక్కున మూడేసి చొప్పున పండ్రెండు ద్వారములు నిర్మింపవలెను. వెలుపల నున్న ఆరు కోష్ఠములు తుడిచివేసి మధ్యభాగముయొక్క పార్శ్వభాగములందలి నాలిగింటిని తుడిచివేయవలెను. మరల, శోభానిర్మాణమునకై లోపల నున్న నాలుగు కోష్ఠములను, వెలుపల నున్న రెండు కోష్ఠములను తుడిచివేయలవలెను.

పిమ్మట ఉపద్వారము లేర్పడుటకై లోపల నున్న మూడు కోష్ఠములను, వెలుపలనున్న ఐదు కోష్ఠములను తుడిచివేయవలెను. పిమ్మట, వెనుక చెప్పిన విధమున శోభ నిర్మింపవలెను. కోణములలో వెలుపల నున్న ఏడు కోష్ఠములను, లోపలనున్న మూడు కోష్ఠములను తుడిచి వేయవలెను. ఈ విధముగ ఏర్పడిన పంచవింశతి వ్యూహమండలము లోపల నున్న కమలకర్ణికపై పరమాత్మను పూజింపవలెను.

మరల తూర్పు మొదలైన దిక్కులలో నున్న కమలములపై క్రమముగా వాసుదేవాదుల పూజ చేయవలెను. పిమ్మట తూర్పున నున్న కమలముపై భగవంతుడగు వారహమూర్తిని పూజించి క్రమముగా ఇరువదిఐదువ్యూహముల పూజచేయవలెను. ఇరువదియారవ తత్త్వమైన పరమాత్మునిపూజ సంపన్నమగువరకును ఈ క్రమముజరుగవలెను.

ఒకే మండలముపై అన్ని వ్యూహముల పూజనుక్రమముగా చేయవలెనని ప్రచేతసుని మతము. కాని సత్యాచార్యుని మతము ప్రకారము మూర్తిభేధమును బట్టి పరమాత్ముని వ్యక్తిత్వము నందు భేదమేర్పడును గాన విభిన్న మూర్తుల పూజ వేరువేరుగా చేయవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 88 🌹*
*✍️ N. Gangadharan  📚. Prasad Bharadwaj *

*Chapter 29*
*🌻 Mode of worshipping Hari in the figure called Sarvatobhadra - 5 🌻*

35. Then having sprinkled the rows (of compartments) and writing sixteen bhadrakas the rows all around are sprinkled. and allotment is made.

36-38. Twelve doors (are drawn) in the usual order in each quarter. Having omitted the six (compartments) inside and having sprinkled for beautification the four at the centre, the four on the sides and two inside and outside, and having cleansed three inside and five outside for accomplishing additional doors, as before beautification is made. Seven of the corners outside and three apartments inside are cleansed.

39. The supreme brahman is to be worshipped in the auspicious twenty-five (compartment) formation. Then in the lotus (drawn) in the middle commencing with east, Vāsudeva and other deities are worshipped in order.

40. Having worshipped the boar-form in the lotus in the east the formation is worshipped in order until the thirty-six (forms are finished).

41. With the effort that it has to be worshipped, (one has to worship) all formations in the order in the single lotus as described. The progenitor is regarded as the sacrifice.

42. Acyuta divided into many forms is regarded as ‘truth’. Forty cubits of the ground in the north has to be divided in order.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 604 / Sri Siva Maha Purana - 604 🌹*
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి  📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః  - అధ్యాయము - 05 🌴*
*🌻. కుమారాభిషేకము  - 6 🌻*

లక్ష్మి దివ్యసంపదను, రమణీయమగు గొప్పహారమును, సావిత్రి సంపూర్ణసిద్ధ విద్యను ఆనందముతో నిచ్చిరి(51). ఓ మునీ! అచటకు వచ్చిన ఇతరదేవీ మూర్తులు, అతడు శిశువుగా నుండగా పాలించిన కృత్తికలు తమకు ప్రియమగు వస్తువులను అతనికి ఇచ్చిరి (52). ఓ మహర్షీ! అచట గొప్ప ఉత్సవము జరిగెను. అందరు ప్రసన్నులైరి. పార్వతీ పరమేశ్వరులు విశేషముగా సంతోషంచిరి (53). ఆ సమయములో ప్రతాపశాలి, తేజశ్శాలి అగు రుద్రుడు ఆనందముతో నవ్వి బ్రహ్మ మొదలగు దేవతలతో నిట్లనెను (54).

శివుడిట్లు పలికెను-

ఓ హరీ! బ్రహ్మా! దేవతలారా! మీరందరు నా మాటను వినుడు. నేను అన్ని విధములుగా ప్రసన్నుడనైతిని. మీకు నచ్చిన వరములను కోరుకొనుడు(55).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మునీ! విష్ణువు మొదలగు దేవతలందరు ఆ శంభుని వచనమును విని ప్రసన్నమగు ముఖము గలవారై ప్రభువగు పశుపతి దేవునితో నిట్లనిరి (56). ఓ ప్రభూ! ఈ కుమారుని చేతిలో తారకుడు సంహరింబడ గలడు. ఈ ఉత్తమ చరిత్రము అందుకొరకు మాత్రమే ఘటిల్లినది (57). కావున తారకుని సంహరించుటకు సన్నద్ధులమై ఈనాడే బయలుదేరెదము. కుమారునకు అనుమతినిమ్ము. ఆతడు వానిని వధించి మాకు సుఖమును కలుగజేయుగాక! (58)

అటులనే అని అంగీకరించి ఆ విభుడు అపుడు దయతో నిండిన హృదయము గలవాడై, తారకాసుర సంహారము కొరకు కుమారుని దేవతలకు అప్పగించెను (59).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 604🌹*
*✍️  J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER  05 🌴*

*🌻 Kārttikeya is crowned - 6 🌻*

51. Lakṣmī gave him divine wealth and a great and beautiful necklace. Sāvitrī gave him the entire Siddhavidyā[3] with joy.

52. O sage, the other goddesses too who had come there gave him their respective presents. The Kṛttikās too did the same.

53. O excellent sage, there was great jubilation there. Everyone was delighted, especially Pārvatī and Śiva.

54. In the meantime, O sage, the powerful Śiva, spoke to Brahmā and to other gods laughingly and joyously.

Śiva said:—
55. “O Viṣṇu, O Brahmā, O gods, you listen to my words. I am delighted in all respects. Please choose the boons you wish.”

Brahmā said:—
56. O sage, on hearing those words of Śiva, Viṣṇu and other gods spoke to Śiva with faces beaming with pleasure.

The gods said:—
57. “O lord, Tāraka will certainly be killed by Kumāra. It is for that purpose that he is born.

58. Hence in our effort to kill him we shall start this very day. Please give your directions to Kumāra. Let him slay Tāraka for our happiness.

59. Thinking that it shall be so, lord Śiva entrusted his son to the gods in order to kill Tāraka, urged by his mercy that he was.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 223 / Osho Daily Meditations  - 223 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 223. ప్రేమ అనే దేవుడు 🍀*

*🕉. మీరు మీ కంటే ఉన్నతమైన దానికి లొంగిపోండి - ప్రేమ అనే దేవుడికి. 🕉*
 
*ప్రేమగా చెప్పబడే దేవుడు ఉన్నాడని ఉన్న పురాణం చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే ఇది నిజంగా చాలా అద్భుతమైన అవగాహన కనుక. అప్పుడు  ప్రేమికులుగా ఉన్న ఏవరైనా దేవునికి సమర్పణ చెంద గలుగుతారు. అయినప్పటికీ వారు స్వతంత్రంగా ఉంటారు. మీరు స్వతంత్రంగా ఉన్నప్పుడు అందం ఉంటుంది - లేకపోతే మీరు కేవలం నీడగా ఉంటారు లేదా మీ భాగస్వామికి నీడగా మారతారు. మీ భాగస్వామి మీ నీడగా మారితే, ఆ క్షణంలోనే మీరు వారి పట్ల ఆసక్తిని కోల్పోతారు - నీడను ఎవరు ఇష్టపడతారు? మీరు నీడగా మారితే, మీ భాగస్వామి మీ పట్ల ఆసక్తిని కోల్పోతారు. మేము నిజమైన మనుషులను ప్రేమించాలను కుంటున్నాము, నీడలను కాదు అంటారు. ఎవరూ, ఎవరి నీడగానూ మారాల్సిన అవసరం లేదు. మీరు మీరుగా ఉండండి, మరియు మీ భాగస్వామి కూడా తనలాగే ఉంటారు.*

*వాస్తవానికి, ప్రేమ అనే దేవునికి లొంగిపోవడం ద్వారా, మీరు నిజమైనవారు అవుతారు. ఇప్పటి వరకు మీరు  ప్రేమకు ప్రామాణికమైన వారు కాదు కానీ ఈ ప్రేమ అనే దైవానికి సమర్పణ చెందడం ద్వారా మీరు మొదటిసారిగా ప్రేమకు ప్రామాణికంగా మారినప్పుడు, రెండు ప్రామాణికమైన జీవులు నిజంగా, చాలా లోతుగా ప్రేమించు కోగలవు అని తెలుసుకుంటారు. ఆపై ఆ అవగాహనను వెనుకకు తీసుకోవలసిన అవసరం ఎప్పటికీ రాదు. నేను ఈ ఆలోచనను గట్టిగా చేప్తాను: మీరు ప్రేమ అనే దేవునికి సమర్పణ చెందినప్పుడు, మీ భాగస్వామి మీతో ఉంటారా లేదా మిమ్మల్ని విడిచిపెట్టారా లేదా మీరు విడిచిపెట్టారా అనేది అంత ముఖ్యమైనది కాదు. కానీ ఒక విషయం మాత్రం ముఖ్యం: మీ లొంగుబాటు ప్రేమ వైపు ఉండాలి, మీ భాగస్వామి పట్ల కాదు. ప్రేమకు ద్రోహం చేయకూడదు.  ప్రేమను అలాగే నిలిపి ఉంచుకోవాలి.  ప్రేమికులు మారవచ్చు; అయినప్పటికి ప్రేమ ఉండగలదు. ఒక్కసారి ఈ విషయం అర్థం చేసుకుంటే ఇక భయం ఉండదు.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 223 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 223. THE GOD OF LOVE 🍀*

*🕉. Surrender to something higher than both if you - that is the God of love. 🕉*
 
*The very myth that there is a God of love is beautiful, it is a tremendous understanding. Then two lovers can surrender to the God and they remain independent. And when you are independent there is beauty--otherwise you become just a shadow, or your partner becomes a shadow. If your partner becomes a shadow, in that very moment you will start losing interest-who loves a shadow? If you become a shadow your partner will start losing interest in you. We want to love real human beings, not shadows. There is no need to become anybody's shadow. You remain yourself, and your partner remains herself or himself.*

*In fact, by surrendering to the God of love, you become authentic. And you are never as authentic as when you become authentic for the first time. Two authentic beings can love, and can love deeply, and then there is no need to hold back. Let me underline this idea: When you are surrendered to the God of love, then it is not very important whether your partner remains with you or leaves you or whether you leave. One thing is important: that love remains. Your surrender is toward love, not toward your partner. So the only thing is not to betray love. Lovers can change; love can remain. Once you have understood that, there is no fear.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 392 / Sri Lalitha Chaitanya Vijnanam  - 392🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  85. నిత్యక్లిన్నా, నిరుపమా, నిర్వాణ సుఖదాయినీ ।*
*నిత్యా, షోడశికారూపా, శ్రీకంఠార్ధ శరీరిణీ ॥ 85 ॥ 🍀*

*🌻 392. 'శ్రీకంఠార్ధశరీరిణీ' 🌻*

*శివుడు అర్ధ శరీరముగా గలది శ్రీమాత అని అర్థము. 'శ్రీ' అనగా విషము. శ్రీకంఠుడు అనగా కంఠము నందు విషము ధరించినవాడు శివుడు. శివుని అర్ధాంగి శ్రీమాత. ప్రకృతి పురుషులు సృష్టియందు అవినాభావ సంబంధము కలిగి యుందురు. "మొదట ఆత్మయే యున్నది. పిదప ఆ ఆత్మయే రెండైనది. ఆ రెండే ప్రకృతి పురుషులు.” వారినే భార్యా భర్తలు అని కూడా అందురు. శంకరుని అర్ధశరీరము పొందిన శ్రీదేవి శివునియొక్క వామభాగముగ యుండును.*

*శివుడు తెలుపు, ఆమె నలుపు. అట్లే శివుడు నలుపై నప్పుడు ఆమె తెలుపు. ఇట్లు అష్టమి తిథిగ కృష్ణపక్షము నందు, శుక్ల పక్షము నందు కూడ దర్శనమగు చుండును. ఆమె కనపడినపుడు అతడు మరు గగును. అతడు కనపడినపుడు ఆమె మరు గగును. దుర్గాష్టమి నాడు ఆమె కనపడును. కృష్ణాష్టమినాడు అత డగుపడును. ఇట్లు ప్రకృతి పురుషుడుగా నున్నది శ్రీదేవియే. అపుడామె 'పరా'.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 392 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma   📚. Prasad Bharadwaj*

*🌻 85. Nityaklinna nirupama nirvana sukhadaeini*
*Nitya shodashika rupa shree kantardha sharirini ॥ 85 ॥ 🌻*

*🌻 392. Śrīkaṇṭhārdha-śarīriṇī श्रिकण्ठार्ध-शरीरिणी 🌻*

*She has half the body of Śiva. Śrīkaṇṭha is another name of Śiva.  Śrī also means poison and kaṇṭha means throat.  Since Śiva holds poison in His throat, He is known as Śrīkaṇṭha. Śrīkaṇṭha also means beautiful neck.  She has half the body of Śiva.  Bṛhadāraṇyaka Upaniṣad (I.iv.3) describes this condition thus:  “He (puruṣa or soul) desired a mate (prakṛti).  

He became as big as, man and wife embracing each other.  He parted this very body into two.  From that came husband and wife.  This is one- half of oneself, like one of the two halves of split pea.  Therefore this pea is indeed filled by the wife.  He was united with her.  From that men were born.”*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹