శ్రీ లలితా సహస్ర నామములు - 150 / Sri Lalita Sahasranamavali - Meaning - 150

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 150 / Sri Lalita Sahasranamavali - Meaning - 150 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 150. మార్తాండ భైరవారాధ్యా, మంత్రిణీ న్యస్తరాజ్యధూః ।
త్రిపురేశీ, జయత్సేనా, నిస్త్రైగుణ్యా, పరాపరా ॥ 150 ॥ 🍀

🍀 784. మార్తాండభైరవారాధ్యా :
మార్తాండభైరవునిచే ఆరాధింపబడునది (శివుని యొక్క ఒకరూపం మార్తాండభైరవుడు)

🍀 785. మంత్రిణీ :
శ్యామలాదేవి

🍀 786. న్య స్తరాజ్యధూ: 
రాజ్యాధికారము ఇచ్చునది

🍀 787. త్రిపురేశీ ;
త్రిపురములకు అధికారిణి

🍀 788. జయత్సేనా : 
అందరినీ జయించగల సైన్యము కలది

🍀 789. నిస్త్రైగుణ్యా :
త్రిగుణాతీతురాలు

🍀 790. పరాపరా :
ఇహము, పరము రెండునూ తానై యున్నది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 150 🌹

📚. Prasad Bharadwaj

🌻 150. Martanda bairavaradhya mantrini nyastarajyadhuh
Tripureshi jayatsena nistraigunya parapara ॥ 150 ॥ 🌻

🌻 784 ) Marthanda Bhairavaradhya -
She who is being worshipped by Marthanda Bhairava

🌻 785 ) Manthrini nyashtha rajyadhoo -
She who gave the power to rule to her form of Manthrini

🌻 787 ) Tripuresi -
She who is the head of three cities

🌻 788 ) Jayatsena -
She who has an army which wins

🌻 789 ) Nistrai gunya -
She who is above the three qualities

🌻 790 ) Parapara -
She who is outside and inside.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

11 Nov 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 102

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 102 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. మహాశివరాత్రి పర్వదిన సందేశము - 2 🌻

రెండవ మంత్రం ఏమనగా "జీవో దేవః సనాతనః" ఈ జీవుడూ సనాతనుడైన దేవుడే గాని జీవుడు కాడు. జీవుడు సనాతనుడైన దేవుడు కనుక "త్యజేదజ్ఞాన నిర్మాల్యం" అజ్ఞాన నిర్మాల్యము తొలగించుకొనుట. అజ్ఞానము అనే మాసిన వస్ర్తమును అట్టే పెట్టుకోవాలి.

అజ్ఞానము అంటే ఏమిటి? ఈ విషయం ప్రతి వెధవకి తెలుసు‌ జేబుకొట్టేస్తున్న వాడికి కొట్టేయకూడదని తెలియదా అందుకని ఎవరు చూడకుండా చేయిపెడతాడు. కొట్టేయకూడదని తెలియకపోతే అందరూ చూస్తుండగానే పెట్టేస్తాడు కదా.

కనుక తెలియక ఏమాయ రోగం లేదు. ఎవరిని గురించి అయినా చెడ్డ విషయాలు చెప్పుకునేటప్పుడు చాటుగా వెళ్ళి ఎవరూ వినకుండా ఎందుకు చెప్పుకుంటాం.

మనం చేస్తున్నది వెధవపని అని మనకు తెలుసు. లేకపోతే చాటుకు వెళ్ళి చెప్పుకోం కదా. దీని నుండి తొలగించటానికి చదువులు లాభం లేదు. మనం చేసే తప్పులన్నీ చదువుకునే చేస్తున్నాం కదా.

ఇలా ఎందుకు చేస్తున్నాం అంటే చేస్తున్నది తప్పు అని తెలియక కాదు. దీనికి పరిష్కారం ఏమనగా మనం మారడమనే శాస్ర్తీయ పద్ధతి ఉన్నది.

మంచి మంచి పుస్తకాలన్ని పెట్టెలో పెట్టుకుని, అది నెత్తిన పెట్టుకుని అది మోసే Licence కూలీ కంటే మనం బాగా చదువుకున్న వాళ్ళము గొప్పవాళ్ళము ఏమీ కాదు. తలకాయ, మెడ ఆ పుస్తకాల వల్ల కుంగిపోతుంది తప్ప మరేమి ఉపయోగం లేదు.

అందుకే వీరిని గురించి ప్రాచీనులైన పెద్దలు చక్కెర బస్తాలు, కలకండ బస్తాలు మోసే గాడిద లాంటి వారు అన్నారు. అంటే గాడిదకి బరువు తప్ప దాని తీపి తెలియదు కదా...

....✍️ మాస్టర్ ఇ.కె. 🌻

🌹 🌹 🌹 🌹 🌹

11 Nov 2021

వివేక చూడామణి - 150 / Viveka Chudamani - 150

🌹. వివేక చూడామణి - 150 / Viveka Chudamani - 150🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 31. ఆత్మ దర్శనం -5 🍀

493. నేను బ్రహ్మములో చెరించే బ్రాహ్మణుడను. రెండవది ఏదీ కాని వాడను. నాకు ఏదీ పోటీకాదు. నేను సత్యాన్ని, నాకు మొదలు లేదు, ఎలాంటి ఊహలకు అందని, ‘నీవు’ ‘నేను’; ‘ఇది’ ‘అది’ అనే భేదములేని శాశ్వతానంద సారమైన సత్యాన్ని నేను.

494. నేను నరకాసురుని వధించిన నారాయణుడను. త్రిపురాలను నాశనం చేసిన ఉన్నతమైన ఆత్మను, శివుడను నేను. నేను పాలకుడను, అత్యున్నత విజ్ఞాన సారమును. అన్నింటిని దర్శించేవాడిని. నేను అత్యున్నత విజ్ఞానమును పొంది, అన్నింటిని దర్శించేవాడను. నాకు వేరే పాలకుడు లేడు, నాకు నేనే పాలకుడను. ‘నేను’ ‘నాది’ అనే భావాలను వదలివేసిన వాడిని.

495. నేనే అన్ని జీవులలోని విజ్ఞానాన్ని. జీవులన్నింటికి ఆంతరంగికమైన మరియు బహిర్గతమైన ఆధారాన్ని. నేను అన్నింటిని అనుభవించేవాడిని మరియు అనుభవించ బడేవాడిని. నేను విముక్తుడను. నేను విముక్తుడను కాక ముందు అన్నింటిని అనాత్మగా దర్శించిన వాడను.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 150 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 31. Soul Realisation - 5 🌻

493. I am indeed Brahman, the One without a second, matchless, the Reality that has no beginning, beyond such imagination as thou or I, or this or that, the Essence of Eternal Bliss, the Truth.

494. I am Narayana, the slayer of Naraka; I am the destroyer of Tripura, the Supreme Being, the Ruler; I am knowledge Absolute, the Witness of everything; I have no other Ruler but myself, I am devoid of the ideas of "I’ and "mine".

495. I alone reside as knowledge in all beings, being their internal and external support. I myself am the experiencer and all that is experienced – whatever I looked upon as "this" or the not-Self previously.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

11 Nov 2021

శ్రీ శివ మహా పురాణము - 473

🌹 . శ్రీ శివ మహా పురాణము - 473 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 35

🌻. పద్మా పిప్పలాదుల చరిత్ర - 1 🌻

నారదుడిట్లు పలికెను-

కుమార్తెను మహర్షికి ఇచ్చిన అనరణ్యుని చరిత్రను విని హిమవంతుడేమి చేసెనో చెప్పుము (1).

బ్రహ్మ ఇట్లు పలికెను-

కుమార్తెను మహర్షికి ఇచ్చి వివాహము చేసిన అనరణ్యుని వృత్తాంతమును విని పర్వతరాజగు హిమవంతుడు చేతులు జోడించి మరల వసిష్ఠునితో నిట్లు పలికెను (2).

హిమవంతుడిట్లనెను-

వసిష్ఠ మహర్షీ ! నీవు బ్రహ్మపుత్రుడవు. దయానిధివి. పరమాశ్చర్యకరమగు అనరణ్యుని వృత్తాంతమును చెప్పియుంటివి (3). అనరణ్యుని కుమార్తె పిప్పలాద మహర్షిని వివాహమాడి తరువాత ఏమి చేసెను? ఆనందమును కలిగించే ఆమె చరిత్రను చెప్పుడు (4).

వసిష్ఠుడిట్లు పలికెను-

మిక్కిలి ముదుసలి యగు పిప్పలాద మహర్షి అనరణ్యుని కుమార్తె యగు తన భార్యతో గూడి తన ఆశ్రమమునకు వెళ్లి (5), అచట ఆనందముగా నివసించెను. ఆ తపశ్శాలికి సంసారము నందు లంపటము అధికముగా లేకుండెను. ఓ గిరిరాజా! ఆతడు ఆ అరణ్యములో తన నిత్య ధర్మముననుష్ఠించు చుండెను (6). అపుడా అనరణ్యుని కుమార్తె మనో వాక్కాయ కర్మలతో లక్ష్మీదేవి నారాయణుని వలె ఆ మహర్షిని భక్తితో సేవించెను (7). ఒకనాడామె ఆనందముతో గంగానదీ స్నానమునకు పోవుచుండగా రాజవేషధారియగు ధర్ముడు ఆమెను మార్గమధ్యములో చూచెను (8).

సుందరమైన రత్నములు పొదిగిన రథమునందున్నవాడు, అనేకములగు భూషణములచే అలంకరింపబడి శోభిల్లుచున్నవాడు, నూతన ¸°వనములో నున్న వాడు, మన్మథునితో సమమగు కాంతి గలవాడు (9) అగు ఆ ధర్మ ప్రభుడు ఆ సుందరి యగు ముని భార్యను పద్మయను పేరు గల దానిని చూచి ఆమె అంతరంగములోని భావము నెరుంగుటకై ఇట్లు పలికెను (10).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

11 Nov 2021

గీతోపనిషత్తు -274

🌹. గీతోపనిషత్తు -274 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 12

🍀 12-1. కర్తవ్య కర్మ - మానవుని పట్టి బంధించు మూడు రకముల వికారములు - మొదటిది మోహిని. రెండవది కామిని. మూడవది ఆసురి. వీని వలన మోహము చెందుట, ఆశపడుట, అవివేకముతో ప్రవర్తించుట జరుగుచుండును. మోహము వలన కర్తవ్యములు మరచి, కోరిక నాశ్రయించుట జరుగును. తన కోరికలే తన కర్తవ్యములుగ పొరపడి, కోరికలను తీర్చుకొను మార్గమున పతనము ప్రారంభమగును. కర్తవ్యము వదలిన వానిని కోరిక ఆశ్రయించి, మోహము కలిగించి పతనపు దారిన అధోగతికి చేర్చును. ఎట్టివాడైనను ఈ కురుక్షేత్రమందు కర్తవ్యము నాశ్రయించియే చరించవలెను. 🍀

మోఘశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః |
రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః || 12

తాత్పర్యము : మోహముచేతను, ఆశచేతను వికృతి చెందిన చేతస్సు గలవారై, అజ్ఞానమగు కర్మలు జీవకోట్లు నిర్వర్తించు చున్నారు.

వివరణము : మానవుని పట్టి బంధించు మూడు రకముల వికారములను భగవానుడీ శ్లోకమున తెలుపుచున్నాడు. అందు మొదటిది మోహిని. రెండవది కామిని. మూడవది ఆసురి. వీని వలన మోహము చెందుట, ఆశపడుట, అవివేకముతో ప్రవర్తించుట జరుగుచుండును. మోహము వలన కర్తవ్యములు మరచి, కోరిక నాశ్రయించుట జరుగును. తన కోరికలే తన కర్తవ్యములుగ పొరపడి, కోరికలను తీర్చుకొను మార్గమున పతనము ప్రారంభమగును. కోరికకు ఆశ అనునది కవల పిల్లవలె ఉండును. ఆశ వలన మోహము బల పడును. జ్ఞానము నశించును. ఏ విధముగనైన తన కోరిక నెర వేరుటయే ప్రధానమని భావించి, జ్ఞానవిహీనమగు కార్యములు ఆచరించును.

క్రమముగ ధర్మాధర్మములను త్యజించి అసుర బుద్ధితో కోరికలు తీర్చుకొను మార్గము పట్టును. ఆ మార్గమున రాక్షస ప్రవృత్తిని పొందును. అట్టి సమయమున ఎవరు ఎన్ని నీతి వాక్యములు పలికినను నిర్లక్ష్యము చేయును. మోహము చేత అసురత్వము, అసురత్వముచేత రాక్షసత్వము చెంది ఘోర కర్మల నాచరించుచు పూర్ణముగ పతనము చెందుట జరుగును.

ఇట్లు కర్తవ్యము వదలిన వానిని కోరిక ఆశ్రయించి, మోహము కలిగించి పతనపు దారిన అధోగతికి చేర్చును. ఎట్టివాడైనను ఈ కురుక్షేత్రమందు కర్తవ్యము నాశ్రయించియే చరించవలెను. కర్తవ్యము వీడినవారు స్వారీ చేయుచున్న గుఱ్ఱపు పగ్గములను వదిలినవాడివలె మార్గము చెడి అగమ్యమగు స్థితిని చేరును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

11 Nov 2021

11-NOVEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 11, గురు వారం, నవంబర్ 2021  భృహస్పతి వారము 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 274 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 473🌹 
4) 🌹 వివేక చూడామణి - 150 / Viveka Chudamani - 150🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -102🌹  
6) 🌹 Osho Daily Meditations - 91🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 150 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 150🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*11, నవంబర్‌ 2021, బృహస్పతి వారము*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. కార్తీక మాసం 7వ రోజు 🍀*

నిషిద్ధములు: పంటితో తినే వస్తువులు, ఉసిరి
దానములు: పట్టుబట్టలు, గోధుమలు, బంగారం
పూజించాల్సిన దైవము: సూర్యుడు
జపించాల్సిన మంత్రము:
ఓం భాం భానవే స్వాహా

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు,  
కార్తీక మాసం
తిథి: శుక్ల-సప్తమి 06:50:19 వరకు 
తదుపరి శుక్ల-అష్టమి  
నక్షత్రం: శ్రవణ 15:00:14 వరకు 
తదుపరి ధనిష్ట
యోగం: దండ 06:41:07 వరకు 
తదుపరి వృధ్ధి
 కరణం: వణిజ 06:50:19 వరకు
వర్జ్యం: 18:58:10 - 20:33:50
దుర్ముహూర్తం: 10:06:15 - 10:51:44 
మరియు 14:39:08 - 15:24:37
రాహు కాలం: 13:25:14 - 14:50:31
గుళిక కాలం: 09:09:25 - 10:34:41
యమ గండం: 06:18:51 - 07:44:08
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:21
అమృత కాలం: 04:53:38 - 06:26:46 
మరియు 28:32:10 - 30:07:50 
సూర్యోదయం: 06:18:51
సూర్యాస్తమయం: 17:41:04
వైదిక సూర్యోదయం: 06:22:35
వైదిక సూర్యాస్తమయం: 17:37:20
చంద్రోదయం: 12:42:30
చంద్రాస్తమయం: 00:13:45
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: మకరం
ధ్వజ యోగం - కార్య సిధ్ధి 15:00:14 వరకు తదుపరి శ్రీవత్స యోగం - ధన లాభం , సర్వ సౌఖ్యం 
పండుగలు : గోపికాష్టమి, మాస దుర్గాష్టమి, 
Gopashtami, Masik Durgashtami
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#నిత్యపంచాంగముDailyPanchangam
#పంచాగముPanchangam #PANCHANGAM #పంచాంగము #క్యాలెండర్ #CALANDER 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -274 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 12
 
*🍀 12-1. కర్తవ్య కర్మ - మానవుని పట్టి బంధించు మూడు రకముల వికారములు - మొదటిది మోహిని. రెండవది కామిని. మూడవది ఆసురి. వీని వలన మోహము చెందుట, ఆశపడుట, అవివేకముతో ప్రవర్తించుట జరుగుచుండును. మోహము వలన కర్తవ్యములు మరచి, కోరిక నాశ్రయించుట జరుగును. తన కోరికలే తన కర్తవ్యములుగ పొరపడి, కోరికలను తీర్చుకొను మార్గమున పతనము ప్రారంభమగును. కర్తవ్యము వదలిన వానిని కోరిక ఆశ్రయించి, మోహము కలిగించి పతనపు దారిన అధోగతికి చేర్చును. ఎట్టివాడైనను ఈ కురుక్షేత్రమందు కర్తవ్యము నాశ్రయించియే చరించవలెను. 🍀*

*మోఘశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః |*
*రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః || 12*

*తాత్పర్యము : మోహముచేతను, ఆశచేతను వికృతి చెందిన చేతస్సు గలవారై, అజ్ఞానమగు కర్మలు జీవకోట్లు నిర్వర్తించు చున్నారు.* 

వివరణము : మానవుని పట్టి బంధించు మూడు రకముల వికారములను భగవానుడీ శ్లోకమున తెలుపుచున్నాడు. అందు మొదటిది మోహిని. రెండవది కామిని. మూడవది ఆసురి. వీని వలన మోహము చెందుట, ఆశపడుట, అవివేకముతో ప్రవర్తించుట జరుగుచుండును. మోహము వలన కర్తవ్యములు మరచి, కోరిక నాశ్రయించుట జరుగును. తన కోరికలే తన కర్తవ్యములుగ పొరపడి, కోరికలను తీర్చుకొను మార్గమున పతనము ప్రారంభమగును. కోరికకు ఆశ అనునది కవల పిల్లవలె ఉండును. ఆశ వలన మోహము బల పడును. జ్ఞానము నశించును. ఏ విధముగనైన తన కోరిక నెర వేరుటయే ప్రధానమని భావించి, జ్ఞానవిహీనమగు కార్యములు ఆచరించును. 

క్రమముగ ధర్మాధర్మములను త్యజించి అసుర బుద్ధితో కోరికలు తీర్చుకొను మార్గము పట్టును. ఆ మార్గమున రాక్షస ప్రవృత్తిని పొందును. అట్టి సమయమున ఎవరు ఎన్ని నీతి వాక్యములు పలికినను నిర్లక్ష్యము చేయును. మోహము చేత అసురత్వము, అసురత్వముచేత రాక్షసత్వము చెంది ఘోర కర్మల నాచరించుచు పూర్ణముగ పతనము చెందుట జరుగును.  

ఇట్లు కర్తవ్యము వదలిన వానిని కోరిక ఆశ్రయించి, మోహము కలిగించి పతనపు దారిన అధోగతికి చేర్చును. ఎట్టివాడైనను ఈ కురుక్షేత్రమందు కర్తవ్యము నాశ్రయించియే చరించవలెను. కర్తవ్యము వీడినవారు స్వారీ చేయుచున్న గుఱ్ఱపు పగ్గములను వదిలినవాడివలె మార్గము చెడి అగమ్యమగు స్థితిని చేరును.

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 473 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 35

*🌻. పద్మా పిప్పలాదుల చరిత్ర - 1 🌻*

నారదుడిట్లు పలికెను-

కుమార్తెను మహర్షికి ఇచ్చిన అనరణ్యుని చరిత్రను విని హిమవంతుడేమి చేసెనో చెప్పుము (1).

బ్రహ్మ ఇట్లు పలికెను-

కుమార్తెను మహర్షికి ఇచ్చి వివాహము చేసిన అనరణ్యుని వృత్తాంతమును విని పర్వతరాజగు హిమవంతుడు చేతులు జోడించి మరల వసిష్ఠునితో నిట్లు పలికెను (2).

హిమవంతుడిట్లనెను-

వసిష్ఠ మహర్షీ ! నీవు బ్రహ్మపుత్రుడవు. దయానిధివి. పరమాశ్చర్యకరమగు అనరణ్యుని వృత్తాంతమును చెప్పియుంటివి (3). అనరణ్యుని కుమార్తె పిప్పలాద మహర్షిని వివాహమాడి తరువాత ఏమి చేసెను? ఆనందమును కలిగించే ఆమె చరిత్రను చెప్పుడు (4). 

వసిష్ఠుడిట్లు పలికెను-

మిక్కిలి ముదుసలి యగు పిప్పలాద మహర్షి అనరణ్యుని కుమార్తె యగు తన భార్యతో గూడి తన ఆశ్రమమునకు వెళ్లి (5), అచట ఆనందముగా నివసించెను. ఆ తపశ్శాలికి సంసారము నందు లంపటము అధికముగా లేకుండెను. ఓ గిరిరాజా! ఆతడు ఆ అరణ్యములో తన నిత్య ధర్మముననుష్ఠించు చుండెను (6). అపుడా అనరణ్యుని కుమార్తె మనో వాక్కాయ కర్మలతో లక్ష్మీదేవి నారాయణుని వలె ఆ మహర్షిని భక్తితో సేవించెను (7). ఒకనాడామె ఆనందముతో గంగానదీ స్నానమునకు పోవుచుండగా రాజవేషధారియగు ధర్ముడు ఆమెను మార్గమధ్యములో చూచెను (8). 

సుందరమైన రత్నములు పొదిగిన రథమునందున్నవాడు, అనేకములగు భూషణములచే అలంకరింపబడి శోభిల్లుచున్నవాడు, నూతన ¸°వనములో నున్న వాడు, మన్మథునితో సమమగు కాంతి గలవాడు (9) అగు ఆ ధర్మ ప్రభుడు ఆ సుందరి యగు ముని భార్యను పద్మయను పేరు గల దానిని చూచి ఆమె అంతరంగములోని భావము నెరుంగుటకై ఇట్లు పలికెను (10).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 150 / Viveka Chudamani - 150🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 31. ఆత్మ దర్శనం -5 🍀*

493. నేను బ్రహ్మములో చెరించే బ్రాహ్మణుడను. రెండవది ఏదీ కాని వాడను. నాకు ఏదీ పోటీకాదు. నేను సత్యాన్ని, నాకు మొదలు లేదు, ఎలాంటి ఊహలకు అందని, ‘నీవు’ ‘నేను’; ‘ఇది’ ‘అది’ అనే భేదములేని శాశ్వతానంద సారమైన సత్యాన్ని నేను. 

494. నేను నరకాసురుని వధించిన నారాయణుడను. త్రిపురాలను నాశనం చేసిన ఉన్నతమైన ఆత్మను, శివుడను నేను. నేను పాలకుడను, అత్యున్నత విజ్ఞాన సారమును. అన్నింటిని దర్శించేవాడిని. నేను అత్యున్నత విజ్ఞానమును పొంది, అన్నింటిని దర్శించేవాడను. నాకు వేరే పాలకుడు లేడు, నాకు నేనే పాలకుడను. ‘నేను’ ‘నాది’ అనే భావాలను వదలివేసిన వాడిని. 

495. నేనే అన్ని జీవులలోని విజ్ఞానాన్ని. జీవులన్నింటికి ఆంతరంగికమైన మరియు బహిర్గతమైన ఆధారాన్ని. నేను అన్నింటిని అనుభవించేవాడిని మరియు అనుభవించ బడేవాడిని. నేను విముక్తుడను. నేను విముక్తుడను కాక ముందు అన్నింటిని అనాత్మగా దర్శించిన వాడను.
 
 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 150 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 31. Soul Realisation - 5 🌻*

493. I am indeed Brahman, the One without a second, matchless, the Reality that has no beginning, beyond such imagination as thou or I, or this or that, the Essence of Eternal Bliss, the Truth.

494. I am Narayana, the slayer of Naraka; I am the destroyer of Tripura, the Supreme Being, the Ruler; I am knowledge Absolute, the Witness of everything; I have no other Ruler but myself, I am devoid of the ideas of "I’ and "mine".

495. I alone reside as knowledge in all beings, being their internal and external support. I myself am the experiencer and all that is experienced – whatever I looked upon as "this" or the not-Self previously.
 
Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 102 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

 *🌻. మహాశివరాత్రి పర్వదిన సందేశము - 2 🌻*

రెండవ మంత్రం ఏమనగా "జీవో దేవః సనాతనః" ఈ జీవుడూ సనాతనుడైన దేవుడే గాని జీవుడు కాడు. జీవుడు సనాతనుడైన దేవుడు కనుక "త్యజేదజ్ఞాన నిర్మాల్యం" అజ్ఞాన నిర్మాల్యము తొలగించుకొనుట. అజ్ఞానము అనే మాసిన వస్ర్తమును అట్టే పెట్టుకోవాలి. 

అజ్ఞానము అంటే ఏమిటి? ఈ విషయం ప్రతి వెధవకి తెలుసు‌ జేబుకొట్టేస్తున్న వాడికి కొట్టేయకూడదని తెలియదా అందుకని ఎవరు చూడకుండా చేయిపెడతాడు. కొట్టేయకూడదని తెలియకపోతే అందరూ చూస్తుండగానే పెట్టేస్తాడు కదా. 

కనుక తెలియక ఏమాయ రోగం లేదు. ఎవరిని గురించి అయినా చెడ్డ విషయాలు చెప్పుకునేటప్పుడు చాటుగా వెళ్ళి ఎవరూ వినకుండా ఎందుకు చెప్పుకుంటాం. 

మనం చేస్తున్నది వెధవపని అని మనకు తెలుసు. లేకపోతే చాటుకు వెళ్ళి చెప్పుకోం కదా. దీని నుండి తొలగించటానికి చదువులు లాభం లేదు. మనం చేసే తప్పులన్నీ చదువుకునే చేస్తున్నాం కదా. 

ఇలా ఎందుకు చేస్తున్నాం అంటే చేస్తున్నది తప్పు అని తెలియక కాదు. దీనికి పరిష్కారం ఏమనగా మనం మారడమనే శాస్ర్తీయ పద్ధతి ఉన్నది. 

మంచి మంచి పుస్తకాలన్ని పెట్టెలో పెట్టుకుని, అది నెత్తిన పెట్టుకుని అది మోసే Licence కూలీ కంటే మనం బాగా చదువుకున్న వాళ్ళము గొప్పవాళ్ళము ఏమీ కాదు. తలకాయ, మెడ ఆ పుస్తకాల వల్ల కుంగిపోతుంది తప్ప మరేమి ఉపయోగం లేదు. 

అందుకే వీరిని గురించి ప్రాచీనులైన పెద్దలు చక్కెర బస్తాలు, కలకండ బస్తాలు మోసే గాడిద లాంటి వారు అన్నారు. అంటే గాడిదకి బరువు తప్ప దాని తీపి తెలియదు కదా...

....✍️ *మాస్టర్ ఇ.కె.* 🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 91 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 91. WATCHING TV 🍀*

*🕉 The whole secret if meditation is to be neither Jar nor against, but unconcerned, cool, without any likes and dislikes, without any choice. 🕉*

Meditation is a simple method. Your mind is like a TV screen. Memories are passing, images are passing, thoughts, desires, a thousand and one things are passing; it is always rush hour. And the road is almost like an Indian road: There are no traffic rules, and everybody is going in every direction. One has to watch the mind without any evaluation, without any judgment, without any choice, simply watching unconcerned as if it has nothing to do with you and you are just a witness. That is choiceless awareness.

If you choose, if you say, "This thought is good-let me have it," or "It is a beautiful dream, .1 should enjoy it a little more," if you choose, you lose your witnessing. If you say, "This is bad, immoral, a sin, I should throw it out," and you start struggling, again you lose your witnessing. You can lose your witnessing in two ways: either being for or against. And the whole secret of meditation is to be neither for nor against, but unconcerned, cool, without any likes and dislikes, without any choice. If you can manage even a few moments of that witnessing, you will be surprised how ecstatic you become.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 150 / Sri Lalita Sahasranamavali - Meaning - 150 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 150. మార్తాండ భైరవారాధ్యా, మంత్రిణీ న్యస్తరాజ్యధూః ।*
*త్రిపురేశీ, జయత్సేనా, నిస్త్రైగుణ్యా, పరాపరా ॥ 150 ॥ 🍀*

🍀 784. మార్తాండభైరవారాధ్యా :
 మార్తాండభైరవునిచే ఆరాధింపబడునది (శివుని యొక్క ఒకరూపం మార్తాండభైరవుడు) 

🍀 785. మంత్రిణీ : 
శ్యామలాదేవి 

🍀 786. న్య స్తరాజ్యధూ: రాజ్యాధికారము ఇచ్చునది 

🍀 787. త్రిపురేశీ ; 
త్రిపురములకు అధికారిణి 

🍀 788. జయత్సేనా : అందరినీ జయించగల సైన్యము కలది 

🍀 789. నిస్త్రైగుణ్యా : 
త్రిగుణాతీతురాలు 

🍀 790. పరాపరా : 
ఇహము, పరము రెండునూ తానై యున్నది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 150 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 150. Martanda bairavaradhya mantrini nyastarajyadhuh*
*Tripureshi jayatsena nistraigunya parapara ॥ 150 ॥ 🌻*

🌻 784 ) Marthanda Bhairavaradhya -   
She who is being worshipped by Marthanda Bhairava

🌻 785 ) Manthrini nyashtha rajyadhoo -   
She who gave the power to rule to her form of Manthrini

🌻 787 ) Tripuresi -  
 She who is the head of three cities

🌻 788 ) Jayatsena -  
 She who has an army which wins

🌻 789 ) Nistrai gunya -  
 She who is above the three qualities

🌻 790 ) Parapara -   
She who is outside and inside.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామములు #LalithaSahasranam
 #PrasadBhardwaj 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://mymandir.page.link/wdh7G
https://t.me/ChaitanyaVijnanam 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹