శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 341-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 341 -2



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 341-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 341 -2🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।
క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀

🌻 341-2. 'క్షేత్రస్వరూప'🌻


కురుక్షేత్ర మందు జీవులు వారి వారి ధర్మము ననుసరించి ప్రవర్తింతురు. అందువలన ఆ క్షేత్రము ధర్మక్షేత్రము కూడ. పై తెలిపిన క్షేత్రమున జీవులు స్థూల సూక్ష్మరూపులై వారి ఇచ్ఛ ననుసరించి జీవించుచూ, అనుభవమూ అనుభూతి గణించుచూ పరిణతి చెందుచు నుందురు. ఇందు క్షేత్ర మనగా లోకముల యందు వెలిగింపబడిన చోటు, జీవుల కేర్పరచిన దేహములు. ఈ క్షేత్రము లన్నియూ శ్రీమాతయే. దేహములను, రూపములను, ప్రకృతిని ఆధారముగ జేసుకొని జీవుడు అనేకానేక అనుభూతులను పొందుచున్నాడు.

జీవులు పూర్ణత్వము చెందుటకు ఇట్లు క్షేత్రములు సాధనములై నిలచినవి. కావున దేహాదికములను, ప్రకృతిని నిరసించుట, అశ్రద్ధ చేయుట, తుచ్ఛములని భావించుట మెట్టవేదాంతమే అగును గాని సరియగు అవగాహన మాత్రము కాదు. క్షేత్రరూపమున శ్రీమాత యుండగ ఆమెను మన్నించి గౌరవించి తగుమాత్రముగ పోషించుచూ జీవుడు సాగవలెను. అట్లు కానిచో దేహములు, ప్రదేశములు బంధించి జీవుని దురవస్థ పాలు చేయును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 341-2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 76. Kshetra-svarupa kshetreshi kshetra kshetragynapalini
Kshaya-vrudhi vinirmukta kshetrapala smarchita ॥ 76 ॥ 🌻


🌻 341-2. Kṣetra-svarūpā क्षेत्र-स्वरूपा (341) 🌻


Since the next few nāma-s deal with Her Kṣetra form, understanding Kṣetra becomes important. Kṣetra is the physical body and kṣetrajña is the soul. Kṣetra is made up of thirty six tattva-s (some take only twentyfour) or principles. There is an exclusive chapter (XIII) in Bhagavad Gīta on this subject.

Kṛṣṇa opens this chapter by saying that “the body is called kṣetra (where karma-s are created and its effect executed) and which cognizes this is called kṣetrajña”. Liṇga Purāna also says ‘the Goddess (Śaktī), the beloved of the slayer of the three cities (Śiva) is Kṣetra while the Lord (Śiva) is Kṣetrajña’. Kṣetra is gross and kṣetrajña is subtle. Kṣetra is perishable, whereas the knower of Kṣetra, kṣetrajña is eternal and imperishable.

Kṛṣṇa concludes chapter XIII by saying, “Those who know the difference between kṣetra and kṣetrajña and the phenomenon of liberation from Prakṛti with her evolutes, reach the supreme eternal spirit.”

She is said to be in the form of such kṣetra. This nāma means that She is the embodiment of all gross forms of this universe.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


20 Jan 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 137


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 137 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సదవగాహన - 1 🌻


ఆధునిక మానవుడు ఎంతో అభివృద్ధిని విజ్ఞాన శాస్త్రపరము గాను, నాగరికత పరము గాను సాధించు చున్నాడు. ప్రాచీనులకన్న మిక్కిలి తెలివిగల వాడనని కూడ విర్రవీగుచున్నాడు. ధనము, అధికారము, విజ్ఞానము, ప్రసిద్ధి ఇట్టి విషయములు సాధించుటలో శ్రమించుచు, ఈ శ్రమకు ప్రయోజనమయిన ఆనందమును మాత్రము పొందలేకున్నాడు.

తన స్వరూపమయిన ఆనందమునందు నిలుచుటకు అవరోధములుగా మానవ మనస్సునందు, వికారములు రేకెత్తి, అతని బ్రతుకు అను నావను తుఫానుతోడి సముద్రపు కెరటముల వలె ఊపుచున్నవి.

నిజమునకు సమస్యలు తనకు వెలుపల లేవు‌ తనలోనే నెలకొనియున్నవి. ఉదాహరణకు, ఒరుల యందు జుగుప్స. ఇతరుల లోపముల యందే చూపు నిలిపి, వారి సద్గుణములను మరచుట వలన ఇట్టి జుగుప్స పెరుగును.

....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


20 Jan 2022

శ్రీ శివ మహా పురాణము - 507


🌹 . శ్రీ శివ మహా పురాణము - 507 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 42

🌻. పెళ్లి వారికి ఎదురేగుట - 2 🌻


ఆభరణములుగా మారి పోయిన పాములతో నిండిన దేహము గలవాడు, అద్భుతమగు అవయవ కాంతులు గలవాడు, దివ్యమగు కాంతి గలవాడు, లోకపాలకులచే వింజామరలను చేతబట్టి సేవింపబడువాడు (11), ఎడమవైపున అచ్యుతుడు గలవాడు, కుడివైపున బ్రహ్మ గలవాడు, వెనుక ఇంద్రుడు గలవాడు, ప్రక్కన వెనుక దేవతలు మొదలగు వారితో కూడి యుండువాడు అగు శివ ప్రభుని చూచిరి (12).

దేవతలు మొదలగు వారందరిచే స్తుతింపబడువాడు, లోకములకు మంగళముల నిచ్చువాడు, స్వేచ్ఛచే స్వీకరింపబడిన దేహము గలవాడు, పరబ్రహ్మ స్వరూపుడు, సర్వేశ్వరుడు, వరములనిచ్చువాడు (13), సగుణుడు, మరియు నిర్గుణుడు, భక్తుల ఆధీనములో నుండువాడు, దయను చూపువాడు, ప్రకృతి పురుషులిద్దరికీ అతీతుడు, సచ్చిదానందఘనుడు అగు శివుని చూచిరి (14).

హిమవంతుడు ఆ ప్రభువు యొక్క కుడివైపున గరుడుని అధిష్ఠించిన వాడు, అనేక భూషణములచే అలంకరించుకున్నవాడు, పాపములను హరించువాడు అగు అచ్యుతుని చూచెను (15). ఓ మునీ! ఆ ప్రభుని ఎడమవైపున నాల్గు మోములు గలవాడు, తన పరివారముతో గూడి అధికముగా శోభిల్లువాడునగు నన్ను చూచెను (16).

శివునకు సదా మిక్కిలి ప్రియులైన ఈ దేవతోత్తములనిద్దరినీ చూచి హిమవంతుడు పరివారముతో గూడి సాదరముగా వారికి ప్రణమిల్లెను (17). పర్వత రాజగు హిమవంతుడు శివునకు ఇరువైపుల, ప్రక్కల యందు విరాజలిల్లుతున్న దేవతలు మొదలగు వారిని చూచి ప్రణమిల్లెను (18). హిమవంతుడు శివుని ఆజ్ఞచే ముందు నడుస్తూ తన నగరమునకు దారితీసెను. విష్ణవు, బ్రహ్మ వెంటనే మునులతో దేవతలతో గూడి వెనుక నడిచిరి (19).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


20 Jan 2022

గీతోపనిషత్తు -309


🌹. గీతోపనిషత్తు -309 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 21 -2 📚


🍀 21-2. జనన మరణ చక్రము - భోగమార్గమున పుణ్యము త్వరితగతిని క్షీణించును. భూలోకమున 30 దినముల పుణ్యము పితృలోకమున ఒక రోజు భోగముతో సమానము. అట్లే భూలోకమున ఒక సంవత్సర మంతయు చేసిన పుణ్యము దేవలోకమున ఒక రోజు భోగముతో సమానము. కనుక ఎంత పుణ్యమార్జించినను, దాని ఫలము ఊర్ధ్వ లోకము లందు శీఘ్రముగ హరింప బడి, మరల జీవులు మరణముతో కూడినటు వంటి భూలోకమున చేరుదురు. ఇది ఎంత అవివేకమగు కార్యక్రమము. 🍀

21. తే తం భుక్యా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి |
ఏవం త్రయీధర్మ మమప్రపన్నా గతాగతం కామకామా లభంతే ||

తాత్పర్యము : దివ్యలోకములందు విస్తృతముగ దివ్య భోగానుభవము అనుభవింపగనే, చేసిన పుణ్యము క్షీణించుట వలన మరల జీవులు మర్త్యలోకములందు ప్రవేశించుచున్నారు. అర్థకామములను ధర్మము నాశ్రయంచి పొందుచున్నవారు ఇట్లు స్వర్గలోకమునకు, మర్త్యలోకమునకు నడుమ రాకపోకలను పొందుచు నున్నారు.

వివరణము : భోగాసక్తి గలవానికి ఎంత ఆర్జనమైనను చాలదు. భోగమార్గమున పుణ్యము త్వరితగతిని క్షీణించును. స్వదేశమున పది సంవత్సరములు సంపాదించినది. విదేశములలో ఒక సంవత్సరములో ఖర్చు కాగలదు. అట్లే మరణము గల భూలోకమున సంపాదించిన పుణ్యము పితృలోకము నందు, దేవలోకమునందు త్వరితగతిని హరింప బడును. భూలోకమున 30 దినముల పుణ్యము పితృలోకమున ఒక రోజు భోగముతో సమానము. అట్లే భూలోకమున ఒక సంవత్సర మంతయు చేసిన పుణ్యము దేవలోకమున ఒక రోజు భోగముతో సమానము.

వంద సంవత్సరములు అనుస్యూతముగ పుణ్య మొనర్చిన మానవుడు వందరోజులు మాత్రమే ఇంద్రలోక భోగము లనుభవించి మరల భూమిని చేరును. అధోలోకము నందలి పుణ్యము ఊర్ధ్వలోకముల భోగము ఇట్టి నిష్పత్తిలో నుండును. కనుక ఎంత పుణ్యమార్జించినను, దాని ఫలము ఊర్ధ్వ లోకము లందు శీఘ్రముగ హరింపబడి, మరల జీవులు మరణముతో కూడినటువంటి భూలోకమున చేరుదురు. ఇది ఎంత అవివేకమగు కార్యక్రమము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


20 Jan 2022

ఓం భాస్కరాయ నమో నమః Om Bhaskaraya Namo Namaha

 

🌹 🌞. సర్వవ్యాధి వినాశాయ శిప్రమ్ ఓం భాస్కరాయ నమో నమః 🌞🌹

🍀 🌞. SarvaVyadhi vinashaya shipram om bhaskaraya namo namaha 🌞 🍀



Join and Share

🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

https://t.me/ChaitanyaVijnanam

https://t.me/Spiritual_Wisdom

www.facebook.com/groups/chaitanyavijnanam/

https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T

https://dailybhakthimessages.blogspot.com

https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 


20-JANUARY-2022 గురువారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 20, గురువారం, జనవరి 2022 బృహస్పతి వాసరే 🌹 
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 309 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 507🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -137🌹  
5) 🌹 Osho Daily Meditations - 126🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 341-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 341-2 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*బృహస్పతి వాసరే, 20, జనవరి 2022*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ రాధాకృష్ణాష్టకం - 6 🍀*

*6. యస్య శ్రీనందసూనోః వ్రజయువతి జనాశ్చాగతా భర్తృపుత్రాం-*
*స్త్యక్త్వా శ్రుత్వా సమీపే విచకిత నయనాః సప్రమోదాః స్వగేహే |*
*రంతుం రాసాదిలీలా మనసిజ దలితా వేణునాదం చ రమ్యం*
*కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
ఉత్తరాయణం, హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: కృష్ణ విదియ 08:06:52 వరకు తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: ఆశ్లేష 08:25:37 వరకు తదుపరి మఘ
యోగం: ఆయుష్మాన్ 15:45:44 వరకు తదుపరి సౌభాగ్య
కరణం: గార 08:04:52 వరకు 
సూర్యోదయం: 06:49:30
సూర్యాస్తమయం: 18:04:33
వైదిక సూర్యోదయం: 06:53:18
వైదిక సూర్యాస్తమయం: 18:00:46
చంద్రోదయం: 20:13:04
చంద్రాస్తమయం: 08:34:33
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
వర్జ్యం: 21:04:00 - 22:45:12
దుర్ముహూర్తం: 10:34:31 - 11:19:32 
మరియు 15:04:33 - 15:49:33
రాహు కాలం: 13:51:25 - 15:15:48
గుళిక కాలం: 09:38:16 - 11:02:39
యమ గండం: 06:49:30 - 08:13:53
అభిజిత్ ముహూర్తం: 12:05 - 12:49
అమృత కాలం: 06:42:16 - 08:25:00
అమృత యోగం - కార్య సిధ్ది 08:25:37
వరకు తదుపరి ముసల యోగం - దుఃఖం 
పండుగలు : లేదు
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -309 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 21 -2 📚*
 
*🍀 21-2. జనన మరణ చక్రము - భోగమార్గమున పుణ్యము త్వరితగతిని క్షీణించును. భూలోకమున 30 దినముల పుణ్యము పితృలోకమున ఒక రోజు భోగముతో సమానము. అట్లే భూలోకమున ఒక సంవత్సర మంతయు చేసిన పుణ్యము దేవలోకమున ఒక రోజు భోగముతో సమానము. కనుక ఎంత పుణ్యమార్జించినను, దాని ఫలము ఊర్ధ్వ లోకము లందు శీఘ్రముగ హరింప బడి, మరల జీవులు మరణముతో కూడినటు వంటి భూలోకమున చేరుదురు. ఇది ఎంత అవివేకమగు కార్యక్రమము. 🍀*

*21. తే తం భుక్యా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి |*
*ఏవం త్రయీధర్మ మమప్రపన్నా గతాగతం కామకామా లభంతే ||*

*తాత్పర్యము : దివ్యలోకములందు విస్తృతముగ దివ్య భోగానుభవము అనుభవింపగనే, చేసిన పుణ్యము క్షీణించుట వలన మరల జీవులు మర్త్యలోకములందు ప్రవేశించుచున్నారు. అర్థకామములను ధర్మము నాశ్రయంచి పొందుచున్నవారు ఇట్లు స్వర్గలోకమునకు, మర్త్యలోకమునకు నడుమ రాకపోకలను పొందుచు నున్నారు.*

*వివరణము : భోగాసక్తి గలవానికి ఎంత ఆర్జనమైనను చాలదు. భోగమార్గమున పుణ్యము త్వరితగతిని క్షీణించును. స్వదేశమున పది సంవత్సరములు సంపాదించినది. విదేశములలో ఒక సంవత్సరములో ఖర్చు కాగలదు. అట్లే మరణము గల భూలోకమున సంపాదించిన పుణ్యము పితృలోకము నందు, దేవలోకమునందు త్వరితగతిని హరింప బడును. భూలోకమున 30 దినముల పుణ్యము పితృలోకమున ఒక రోజు భోగముతో సమానము. అట్లే భూలోకమున ఒక సంవత్సర మంతయు చేసిన పుణ్యము దేవలోకమున ఒక రోజు భోగముతో సమానము.*

*వంద సంవత్సరములు అనుస్యూతముగ పుణ్య మొనర్చిన మానవుడు వందరోజులు మాత్రమే ఇంద్రలోక భోగము లనుభవించి మరల భూమిని చేరును. అధోలోకము నందలి పుణ్యము ఊర్ధ్వలోకముల భోగము ఇట్టి నిష్పత్తిలో నుండును. కనుక ఎంత పుణ్యమార్జించినను, దాని ఫలము ఊర్ధ్వ లోకము లందు శీఘ్రముగ హరింపబడి, మరల జీవులు మరణముతో కూడినటువంటి భూలోకమున చేరుదురు. ఇది ఎంత అవివేకమగు కార్యక్రమము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 507 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 42

*🌻. పెళ్లి వారికి ఎదురేగుట - 2 🌻*

ఆభరణములుగా మారి పోయిన పాములతో నిండిన దేహము గలవాడు, అద్భుతమగు అవయవ కాంతులు గలవాడు, దివ్యమగు కాంతి గలవాడు, లోకపాలకులచే వింజామరలను చేతబట్టి సేవింపబడువాడు (11), ఎడమవైపున అచ్యుతుడు గలవాడు, కుడివైపున బ్రహ్మ గలవాడు, వెనుక ఇంద్రుడు గలవాడు, ప్రక్కన వెనుక దేవతలు మొదలగు వారితో కూడి యుండువాడు అగు శివ ప్రభుని చూచిరి (12).

దేవతలు మొదలగు వారందరిచే స్తుతింపబడువాడు, లోకములకు మంగళముల నిచ్చువాడు, స్వేచ్ఛచే స్వీకరింపబడిన దేహము గలవాడు, పరబ్రహ్మ స్వరూపుడు, సర్వేశ్వరుడు, వరములనిచ్చువాడు (13), సగుణుడు, మరియు నిర్గుణుడు, భక్తుల ఆధీనములో నుండువాడు, దయను చూపువాడు, ప్రకృతి పురుషులిద్దరికీ అతీతుడు, సచ్చిదానందఘనుడు అగు శివుని చూచిరి (14). 

హిమవంతుడు ఆ ప్రభువు యొక్క కుడివైపున గరుడుని అధిష్ఠించిన వాడు, అనేక భూషణములచే అలంకరించుకున్నవాడు, పాపములను హరించువాడు అగు అచ్యుతుని చూచెను (15). ఓ మునీ! ఆ ప్రభుని ఎడమవైపున నాల్గు మోములు గలవాడు, తన పరివారముతో గూడి అధికముగా శోభిల్లువాడునగు నన్ను చూచెను (16).

శివునకు సదా మిక్కిలి ప్రియులైన ఈ దేవతోత్తములనిద్దరినీ చూచి హిమవంతుడు పరివారముతో గూడి సాదరముగా వారికి ప్రణమిల్లెను (17). పర్వత రాజగు హిమవంతుడు శివునకు ఇరువైపుల, ప్రక్కల యందు విరాజలిల్లుతున్న దేవతలు మొదలగు వారిని చూచి ప్రణమిల్లెను (18). హిమవంతుడు శివుని ఆజ్ఞచే ముందు నడుస్తూ తన నగరమునకు దారితీసెను. విష్ణవు, బ్రహ్మ వెంటనే మునులతో దేవతలతో గూడి వెనుక నడిచిరి (19). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 137 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. సదవగాహన - 1 🌻*

*ఆధునిక మానవుడు ఎంతో అభివృద్ధిని విజ్ఞాన శాస్త్రపరము గాను, నాగరికత పరము గాను సాధించు చున్నాడు. ప్రాచీనులకన్న మిక్కిలి తెలివిగల వాడనని కూడ విర్రవీగుచున్నాడు. ధనము, అధికారము, విజ్ఞానము, ప్రసిద్ధి ఇట్టి విషయములు సాధించుటలో శ్రమించుచు, ఈ శ్రమకు ప్రయోజనమయిన ఆనందమును మాత్రము పొందలేకున్నాడు.*

*తన స్వరూపమయిన ఆనందమునందు నిలుచుటకు అవరోధములుగా మానవ మనస్సునందు, వికారములు రేకెత్తి, అతని బ్రతుకు అను నావను తుఫానుతోడి సముద్రపు కెరటముల వలె ఊపుచున్నవి.*

*నిజమునకు సమస్యలు తనకు వెలుపల లేవు‌ తనలోనే నెలకొనియున్నవి. ఉదాహరణకు, ఒరుల యందు జుగుప్స. ఇతరుల లోపముల యందే చూపు నిలిపి, వారి సద్గుణములను మరచుట వలన ఇట్టి జుగుప్స పెరుగును.*

....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻 
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 126 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 126. EGO 🍀*

*🕉 Do you worry that if you accept yourself, you will become egoistic? Forget about the ego! 🕉*
 
*Accept yourself. We will see about the ego later; first accept yourself totally. Let the ego come; the ego is not such a big problem, and the bigger it is, the easier it is burst. It is like a balloon-it becomes big, then with just a prick it is gone! Let the ego be there, that is allowed, but accept yourself, and things will start changing. In fact total acceptance means acceptance of the ego too. Start by accepting. The world needs a few great egoists too. We need all kinds of People.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 341-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 341 -2🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।*
*క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀*

*🌻 341-2. 'క్షేత్రస్వరూప'🌻* 

*కురుక్షేత్ర మందు జీవులు వారి వారి ధర్మము ననుసరించి ప్రవర్తింతురు. అందువలన ఆ క్షేత్రము ధర్మక్షేత్రము కూడ. పై తెలిపిన క్షేత్రమున జీవులు స్థూల సూక్ష్మరూపులై వారి ఇచ్ఛ ననుసరించి జీవించుచూ, అనుభవమూ అనుభూతి గణించుచూ పరిణతి చెందుచు నుందురు. ఇందు క్షేత్ర మనగా లోకముల యందు వెలిగింపబడిన చోటు, జీవుల కేర్పరచిన దేహములు. ఈ క్షేత్రము లన్నియూ శ్రీమాతయే. దేహములను, రూపములను, ప్రకృతిని ఆధారముగ జేసుకొని జీవుడు అనేకానేక అనుభూతులను పొందుచున్నాడు.*

*జీవులు పూర్ణత్వము చెందుటకు ఇట్లు క్షేత్రములు సాధనములై నిలచినవి. కావున దేహాదికములను, ప్రకృతిని నిరసించుట, అశ్రద్ధ చేయుట, తుచ్ఛములని భావించుట మెట్టవేదాంతమే అగును గాని సరియగు అవగాహన మాత్రము కాదు. క్షేత్రరూపమున శ్రీమాత యుండగ ఆమెను మన్నించి గౌరవించి తగుమాత్రముగ పోషించుచూ జీవుడు సాగవలెను. అట్లు కానిచో దేహములు, ప్రదేశములు బంధించి జీవుని దురవస్థ పాలు చేయును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 341-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 76. Kshetra-svarupa kshetreshi kshetra kshetragynapalini*
*Kshaya-vrudhi vinirmukta kshetrapala smarchita ॥ 76 ॥ 🌻*

*🌻 341-2. Kṣetra-svarūpā क्षेत्र-स्वरूपा (341) 🌻*

*Since the next few nāma-s deal with Her Kṣetra form, understanding Kṣetra becomes important. Kṣetra is the physical body and kṣetrajña is the soul. Kṣetra is made up of thirty six tattva-s (some take only twentyfour) or principles. There is an exclusive chapter (XIII) in Bhagavad Gīta on this subject.*

*Kṛṣṇa opens this chapter by saying that “the body is called kṣetra (where karma-s are created and its effect executed) and which cognizes this is called kṣetrajña”. Liṇga Purāna also says ‘the Goddess (Śaktī), the beloved of the slayer of the three cities (Śiva) is Kṣetra while the Lord (Śiva) is Kṣetrajña’. Kṣetra is gross and kṣetrajña is subtle. Kṣetra is perishable, whereas the knower of Kṣetra, kṣetrajña is eternal and imperishable.*

*Kṛṣṇa concludes chapter XIII by saying, “Those who know the difference between kṣetra and kṣetrajña and the phenomenon of liberation from Prakṛti with her evolutes, reach the supreme eternal spirit.”*

*She is said to be in the form of such kṣetra. This nāma means that She is the embodiment of all gross forms of this universe.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹