Showing posts with label చలాచలభోధ. Show all posts
Showing posts with label చలాచలభోధ. Show all posts
కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 170
🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 170 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 100 🌖
చివరి బాగము.
ఈ సాధనకు తోడ్పడేటువంటి సాంఖ్య విచారణ అంతా నువ్వు తెలుసుకోవాలి. పంచకోశ విచారణ, శరీరత్రయ విచారణ, దేహత్రయ విచారణ, అవస్థాత్రయ విచారణ, గుణత్రయ విచారణ, ఋణత్రయ విచారణ, తాపత్రయ విచారణ ఈ రకంగా మలత్రయ విచారణ ఇలా రకరకాల విచారణలు అన్నీ కూడాను వివేక చూడామణిలో, బ్రహ్మవిద్యలో చక్కగా బోధించబడ్డాయి.
ఇది ప్రతి ఒక్కరూ బాగా పరిశీలించవలసినటువంటి అంశం. అలా పరిశీలించి మీరు వాటిని నిజజీవితంలో వినియోగించుకోవాలి. ఈ ఇంద్రియాలను ఉపయోగించి తింటున్నా, తినకపోతున్నా, కూర్చొన్నా, నిలబడినా, ఆలోచించినా ఏ రకమైన వ్యవహారంలో నిమగ్నమై ఉన్నా, ఆయా ఇంద్రియ స్థానములు అన్నీ కూడా, తత్ ఇంద్రియాధిష్ఠాన దేవతల యొక్క అనుగ్రహ ఫలం చేత వ్యవహరిస్తున్నాయని,
ఇట్టి ఇంద్రియములకు కానీ, తనకు కానీ, ఎట్టి కర్తృత్వ భోక్తృతాభిమానములు లేవని, కేవలము కారణ స్వరూపమైనటువంటి ఇంద్రియాధిష్టాన దేవతలే బాధ్యులుకానీ, తాను అబాధ్యుడను అని తనను తాను బుద్ధి కంటే వేరైన వాడినని, బుద్ధి సాక్షి అని, ప్రత్యగాత్మనని చైతన్యమునని శుద్ధాహమని వేరు పరుచుకోవాలి.
ఇలా సాక్షి భావనను ఆశ్రయించి ఎవరైతే ప్రతి రోజూ ఈ నిర్మలాంతఃకరణమున కొరకై సాధన చేస్తారో, వాళ్ళు మాత్రమే ఈ ప్రత్యగాత్మ సాక్షాత్కారాన్ని, తదుపరి ప్రత్యక్ పరమాత్మలు అభిన్నులనేటటువంటి బ్రహ్మాత్మైక్యభావాన్ని పొందడానికి అధికారులు అవుతున్నారు.
కాబట్టి, ఆచరణ శీలురు కానటువంటి ‘శుష్క వేదాంత తమో భాస్కరం’ అనేటటువంటి గ్రంథాన్ని సద్గురు మళయాళ యతీంద్రులు రచించారు. ఎవరైతే మెట్ట వేదాంతం చెబుతుంటారో, అంటే ఆచరణ శీలురు కానటువంటి శాస్త్ర వాదులు ఎవరైతే ఉంటారో, ఎవరికైతే అనేక సంవత్సరాల నుంచి ఏదైనా గానీ మీరు చెప్పారనుకోండి ఇదంతా తెలిసిందేనండీ, ఇదంతా మేము విన్నదేనండీ, ఇదంతా గ్రహించిందేనండీ అంటారు.
తెలుసుకున్నావు, విన్నావు, గ్రహించావు, అర్థం చేసుకున్నావు... మరేం సాధించావు? అంటే, ఇంకా ఏమీ సాధించలేదండీ అంటారు. మరి ఏం సాధించకపోతే ఇంతకాలం నుంచి విని శ్రవణం చేయడం ద్వారా ఏమి నువ్వు పొందావు మరి? నాకు అంతా కూడా తెలిసిందేనండి. సిద్ధాంతం అంతా తెలిసిందేనండి.
ఏమి చేయాలో తెలియదండి! సిద్ధాంతం అంతా తెలిసినాక, ఏమి చేయాలో తెలియకపోవడం అంటే ఏమిటి? శ్రవణ కాలంలో సరిగ్గా శ్రవణం చేయలేదని అర్థం. కాబట్టి శ్రద్ధతో చేసే దానినే శ్రవణము అన్నారు. పైగా శ్రవణకాలమందే ఏ సాధన చేయాలనేటటువంటి నిర్ణయానికి రాకపోవడం మరొక దోషం.
చిత్తవిక్షేపం బలంగా ఉందన్నమాట. కాబట్టి, ఆ విక్షేపదోషాన్ని ప్రతి ఒక్కరూ తొలగించుకోవాలి. మల, విక్షేప, ఆవరణ దోషాలనేటటువంటి దోషత్రయాన్ని బాగా పరిశీలించాలి. అలా పరిశీలించి తమను తాము ఉద్ధరించుకోవడానికి, తన్ను తాను ఉద్ధిరించుకోవడానికి, “ఉద్ధరేదాత్మనాత్మానాం ఆత్మానామవసాధయేత్” ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి.
తనను తెలుసుకోవాలి. తాను ఏదై ఉన్నాడో, సర్వకాల సర్వ అవస్థలయందు మార్పుచెందక, పరిణామ రహితముగా ఏ స్థితి యందు, తానైనటువంటి ఆత్మస్థితి యందు తానున్నాడో అట్టి ఆత్మను తెలుసుకొనుటకు మిగిలినవన్నీ సహాయకారులే. - విద్యా సాగర్ గారు
సమాప్తం...
🌹 🌹 🌹 🌹 🌹
23 Jan 2021
కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 169
🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 169 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 99 🌻
భగవద్గీతలో కూడా ఈ మాయ ఎలా ఉన్నది అంటే, దుమ్ము పట్టినటువంటి అద్దం ఎలా ఉందో, శిశువు చుట్టూ మావి ఎలా ఉందో....’ధూమేన వ్రియతే వహ్నిః యథా దీపో మలేనచ’ అనేటటువంటి పద్ధతిగా...
పొగచేత నిప్పు, మావి చేత శిశువు... దుమ్ము ధూళి చేత అద్దము కప్పబడినప్పడు వాటి యొక్క వాస్తవికమైనటువంటి స్థితిని, నువ్వు ఎట్లా గుర్తించ లేవో, అట్లా త్రిగుణ మాలిన్యము అనేటటువంటి జీవభావము గనుక ఆవరించి ఉన్నట్లయితే, శరీర తాదాత్మ్యత భావన గనుక నిన్ను ఆవరించి ఉన్నట్లయితే, కర్తృత్వ, భోక్తృత్వ అభిమానములు గనుక ఆవరించి ఉన్నట్లయితే,
శరీర త్రయము, దేహత్రయము, గుణత్రయము, అవస్థాత్రయము... వంటి త్రిపుటులకు సంబంధించిన మాలిన్యము అంతా ఆవరించి ఉన్నట్లయితే, నీవు యథార్థమైనటువంటి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందలేవు. పొందాలి అంటే ఈ మాలిన్యాన్నీ తొలగించుకోవాలి. కాబట్టి, ధ్యానము అంటే అర్థం ఏమిటంటే? ఈ త్రిగుణ మాలిన్యమును తొలిగించుకోవడమే, ఈ శుద్ధ అంతఃకరణాన్ని పొందగలగడమే ధ్యానము అంటే.
కాబట్టి, ‘ధ్యాన సాధన’ చేసేవారందరూ తప్పక గుర్తించవలసిన అంశం ఏమిటంటే, వారు వారివారి మనోఫలకం మీద ఏ రకమైనటువంటి ఆలోచనలు వచ్చినప్పటికి, ఏ రకమైనటువంటి దృశ్యములు ఏర్పడినప్పటికి, ఏ రకమైనటువంటి భావములు ఏర్పడినప్పటికి, ఏ రకమైనటువంటి తాదాత్మ్యత స్థితులు ఏర్పడినప్పటికి, వాటికి ఔననక, కాదనక ఉపేక్షించి ఉండి, సాక్షీ భావం వహించి, ఉదాసీన వైఖరిని అవలంబించి, ఊరక చూస్తూ ఉండాలి. ఇట్లు చూస్తూ ఉండగలిగేటటువంటి సమర్థత చేత, ప్రతి దినము తన మనోమాలిన్యాన్ని తానే శుద్ధి చేసుకోగలిగేటటువంటి సమర్థత సంపాదిస్తారు.
ముఖ్యముగా చతుస్సంధ్యలలో మిమ్మల్ని చెయ్యమన్నటువంటి సాధన వలన, ఏ సంధ్యకి ఆ సంధ్యే ఆ మధ్యకాలంలో ఏర్పడేటటువంటి మనోమాలిన్యా్న్ని, ఆ ధ్యానకాలంలోనే తొలిగించి వేసేటటువంటి సత్కర్మ, సత్ క్రతువు చేస్తూ ఉంటాము. ఈ ఆంతరిక యజ్ఞాన్ని ప్రతి ఒక్కరూ చేయాలి. ఇట్లా ఎవరైతే చతుస్సంధ్యలలో చేసి, జాగ్రత్ స్వప్న సుషుప్త్యావస్థలలో ఆయా అవస్థల ప్రభావం చేత ఏర్పడినటువంటి విషయ తాదాత్మ్యత మాలిన్యాన్ని,
ఎవరైతే తొలగించుకుంటూ ఉంటారో, ఏ రోజుకారోజే ప్రారబ్ద కర్మ విశేష ఫలాన్ని, ఆగామి కర్మగా మారకుండా అనుభవిస్తూ ఉంటారో, అనంతమైనటువంటి సంచిత కర్మరాశిని దగ్ధం చేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాగ్నిని సముపార్జిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే హృద్ గుహలో ఈ పరమాత్మని అనగా ప్రత్యగాత్మ రూప పరమాత్మని సాక్షాత్కారింప చేసుకుంటారు.
కాబట్టి, మౌళికమైనటువంటి, ప్రధానమైనటువంటి సాధనని తప్పక ప్రతి ఒక్కరూ ఆచరించాలి.
ఆచరణ శీలురైనటువంటి వారుమాత్రమే, మనన శీలురైన వాళ్ళు మాత్రమే, శ్రవణ, మనన, నిధి ధ్యాస పరులు మాత్రమే, నిరంతరాయముగా కొనసాగించేటటువంటి సాధన వలన మాత్రమే, నిరంతరాయముగా నీ జీవితములో ఏర్పడుచున్న ఐదైదులు ఇరవైఐదు ఇంద్రియములు, పిండాండ పంచీకరణలో ఉన్నటువంటి వాటిని సాధన దృష్ట్యా... ఏ ఏ ఇంద్రియ స్థానంలో త్రిగుణ మాలిన్యము ఏర్పడుతుందో, గుర్తించి, గ్రహించి, ఆయా త్రిగుణ మాలిన్యమునకు అతీతముగా వ్యవహరించేటటువంటి నైపుణ్యాన్ని నువ్వు బుద్ధి సూక్ష్మత ద్వారా సాధించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి సాధన.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
21 Jan 2021
కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 168
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 98 🌻
భగవాన్ రమణులు ఏమీ చేయలేదు కదండీ! అనేటటువంటి వాక్యాన్ని తరచుగా వింటూ ఉంటాము. కానీ, వారికున్నటువంటి సహజనిర్వికల్ప సమాధినిష్ఠ మరి అందరికీ లేదు కదండీ! వారి స్థితిననుసరించి, వారి వ్యవహారం ఉంటుంది.
జీవన్ముక్తులు ఇలాగే ఉండాలి అనే నియమం లేదు. జగత్ వ్యవహార శైలిని బట్టి వారుండరు. వారు ఉండవలసిన రీతిగా వారుంటారు. ఎట్లా ఉంటే, లోక కళ్యాణం సాధ్యమౌతుందో, అట్లా ఆ అవతారుడు, అట్లా ఆ జీవన్ముక్తుడు ఉంటాడు. ఆ స్థితికి వచ్చేవరకూ సర్వసామాన్య నియమములను సర్వసామాన్య ధర్మములను మొక్షార్దియై ఆచరించవలెను. ఇది చాలా ముఖ్యమైనటువంటిది.
ఎవరి విద్యుక్త ధర్మాన్ని, ఎవరి కర్తవ్యాని వారు సేవకుల వలే, ఈశ్వరుని చేతిలో పనిముట్టుగా, అంతట నిండియున్నటువంటి పురుషుడని గుర్తించడానికి అనువైన సాధనగా - కాలత్రయాబాధితం కానటువంటి పురుషునిగా, కాలాత్రయమునకు నియామకుడైనటువంటి వాడుగా, కాలాతీతమైనటువంటి వాడిగా ఈ మహానుభావుడను ఎవరైతే గుర్తించ గలుగుతున్నారో, ఈ స్థితిని ఎవరైతే గుర్తించ గలుగుతున్నారో, అట్టి స్థితిని ఎవరైతే పొందగలుగుతున్నారో, వారు ఎవరి నుంచీ రక్షణ కోరుతారు ఇప్పుడు? ఎవరిని అడుగుతారు? పాహిమాం అని ఎవరిని అడుగుతావు? సాక్షాత్ ఈశ్వరత్వం అంటున్నారు.
ఈశ్వరత్వం స్యాత్.... అంటే నీవే ఈశ్వరుడవై యుండగా, ఈశ్వరా పాహిమాం అని ఎవరిని అడుగుతావు. అంటే ఏ సద్గురుమూర్తో, ఏ అవతారుడో, ఎవరైతే నీకు ఆధారభూతంగా ఉన్నాడో, ఆ మహానుభావుడిని నువ్వు వేడుకోవల్సిందే. వారే నీకు ఈశ్వరుడు. వారే నీకు బ్రహ్మము. వారే నీకు పరబ్రహ్మము.
ఆ రకంగా ఈ పురుషోత్తమ ప్రాప్తి స్థితిని పొందినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో, వారే ఈశ్వర స్వరూపులు. వారినే శరణు వేడాలి. వారికే శరణాగతి చేయాలి. వారి ద్వారానే ఈశ్వరుడు లోకకల్యాణార్థం, ధర్మసంస్థాపనార్థం పని చేస్తూ ఉన్నాడు.
కాబట్టి, ఈశ్వరుడు ఆకాశం నుంచీ పిడుగువలె పడుతాడనో, ఆత్మసాక్షాత్కార జ్ఞానం అంటే, ఏదో అమృత వృష్ఠి కురుస్తుందనో, ఏదో ప్రత్యేకమైనటువంటి సందర్భం జరిగితే నాకు ఆరకమైనటువంటి లక్షణం కలుగుతుందనో భావించరాదు.
సర్వవ్యాపకమైనటువంటి, సర్వవిలక్షణమైనటువంటి, సర్వ సాక్షి అయినటువంటి, సర్వమును ప్రకాశింప చేస్తున్నటువంటి, సర్వుల హృద్గుహయందు అంగుష్ఠ మాత్ర పురుషునిగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి, ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో, ఏదైతే జీవాత్మగా, అంతరాత్మగా, పరమాత్మగా పిలువబడుతూ ఉన్నాడో, క్షర, అక్షర పురుషోత్తములుగా పిలువబడుతూ ఉన్నాడో అట్టి దానిని మాత్రమే నీవు ఆత్మ, స ఆత్మ అని తెలుసుకొన వలయును.
ఇట్లా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా తెలుసుకోవాలి అంటే, నీకు అత్యావశ్యకమైనటు వంటిది శుద్ధ బుద్ధి. శుద్ధమైన చిత్తము.
చింత నుండి దూరమైనటువంటి చిత్తము. వాసనల నుంచి దూరమైనటువంటి చిత్తము. వ్యవహారము నందు రమించనటువంటి చిత్తము. వృత్తులందు రమించనటువంటి చిత్తము. మనోనిగ్రహోపాయము. మనోజయము. వీటిని సాధించడం సాధకులందరికి అత్యావశ్యకమై యున్నది అని యమధర్మరాజుగారు నచికేతునికి బోధిస్తూఉన్నారు ఆత్మ తత్వము గురించి
ధ్యానశీలుడైన వ్యక్తి తన హృదయాకాశము నందే పరమాత్మ సాక్షాత్కారమును పొందును. స్వచ్ఛమైన అద్దమునందు ముఖము నిర్మలముగా కనిపించునట్లు శుద్ధాంతఃకరణము నందు పరమాత్మ సాక్షాత్కారము లభించును.)
ఇది చాలా ముఖ్యమైనటువంటి ఉపమానము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
21 Jan 2021
కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 167
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 97 🌻
కాబట్టి నిజానికి పురుషుడు త్రివిధంబులు. క్షర, అక్షర పురుషోత్తములు. ఏ స్థితిలో ఉన్నా పురుషుడే. పురుషుడన్న స్థితికి ఏం భేదంలేదు. పురము నందు ఉన్నవాడెవడో, అధిష్ఠానముగా వాడే పురుషుడు. ఇది పురుషునికి అర్థం. అంతే కానీ, స్త్రీ పురుషులని అర్థం కాదు. పురము అంటే, అర్థం ఏమిటి, ఎనిమిది శరీరాలు పురములు. ఎనిమిది జగత్తులు పురములే. ఎనిమిది వ్యవహారములు పురములే.
కాబట్టి, ఆయా వ్యవహారములయందు అధిష్ఠానముగా ఉన్నటువంటి, విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యక్ ఆత్మ విరాట్ హిరణ్యగర్భ పరమాత్మలనే సాక్షిస్వరూపములన్నీ పురుషుడే. వీటినన్నింటినీ క్రోడీకరిస్తే క్షరపురుషుడు అనేటటుంవంటి జీవుడు, అక్షరపురుషుడు అనేటటుంవంటి బ్రహ్మము పురుషోత్తముడు అనేటటువంటి పరమాత్మగా మనం సిద్ధాంతీకరించాము.
కాబట్టి, ఈ స్థితి భేదాన్ని బట్టి, భావన భేదాన్ని బట్టి, నిర్ణయభేదాన్ని బట్టి, నిర్వచనం ఇచ్చారే తప్ప, ప్రత్యేకంగా దానివల్ల స్థూలంగా వచ్చేటటువంటి, మార్పేమీ లేదు.
జీవన శైలిలో వచ్చేటటుంవంటి మార్పేమీ లేదు. అంటే అన్నం తినేవాడు అన్నం మానేస్తేనో, అన్నం తింటేనో, లేదంటే కొండగుహలలో ఉన్నవాడు జనారణ్యంలోకి వస్తేనో, జనారణ్యంలో ఉన్నవాడు కొండగుహలలోకి వెళ్తేనో, లేదా నిరంతరాయంగా రోజుకి 16 సార్లు స్నానం చేయడం వల్లనో, ఇలా భౌతికమైనటువంటి విధులలో మార్పులు చేసినంత మాత్రమున ఈ వివేకము సాధించబడింది అని చెప్పడానికి అవకాశం లేదు.
కానీ ఇలాంటివి అన్నీ కూడా నీలో ఉన్నటువంటి మాలిన్య సంగ్రహాన్ని వదిలించుకోవడానికి ఉపయోగపడే సహకారి కాగలదు. అందుకని సాధనకి పరిమితులు చెప్పబడినాయి. యమనియమాది అష్టాంగ యోగ సాధనలో... యమం, నియమం చాలా ముఖ్యమైనది.
ఇవాళ ఎంతోమంది ఆత్మ జ్ఞానమనీ, బ్రహ్మజ్ఞానమనీ, విచారణ చేసేటటువంటి వారు కానీ, ఆత్మసిద్ధులని, ఆత్మనిష్ఠులనీ, ఆత్మోపరతులని, ఆత్మోపబ్ధిని పొందామని, తత్వదర్శిలమని పేరుపొందిన వారిలో ఇట్టి యమ నియమాలు గోచరించుట లేదు అనేది పెద్దల వ్యాక్యము. ఎందువల్ల? ఏ రకమైనటువంటి యమనియమాలను పాటించడు. ఏ రకమైన విధినియమాలను పాటించడు.
ఏ రకమైనటువంటి శాస్త్రోచిత కర్మలను చేయడు. ఏ రకమైన ధర్మార్థమైనటుంవంటి, ప్రయోజన శీలమైనటువంటి, జీవనము చేయడు. కానీ, ఆత్మనిష్ఠుడు అని అంటాడు. ఉండకూడదా? ఉండవచ్చు...! కొండకచో.. ఇటువంటి జీవన్ముక్తులు కూడా ఉండవచ్చు. బ్రహ్మ నిష్ఠులు కూడా ఉండవచ్చు. కాని వారు అత్యంత అరుదుగా ఉన్నారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
19 Jan 2021
కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 166
🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 166 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 96 🌻
ఎవరి విద్యుక్త ధర్మాన్ని, ఎవరి కర్తవ్యాని వారు సేవకుల వలే, ఈశ్వరుని చేతిలో పనిముట్టుగా, అంతట నిండియున్నటువంటి పురుషుడని గుర్తించడానికి అనువైన సాధనగా - కాలత్రయాబాధితం కానటువంటి పురుషునిగా, కాలాత్రయమునకు నియామకుడైనటువంటి వాడుగా, కాలాతీతమైనటువంటి వాడిగా ఈ మహానుభావుడను ఎవరైతే గుర్తించ గలుగుతున్నారో,
ఈ స్థితిని ఎవరైతే గుర్తించ గలుగుతున్నారో, అట్టి స్థితిని ఎవరైతే పొందగలుగుతున్నారో, వారు ఎవరి నుంచీ రక్షణ కోరుతారు ఇప్పుడు? ఎవరిని అడుగుతారు? పాహిమాం అని ఎవరిని అడుగుతావు? సాక్షాత్ ఈశ్వరత్వం అంటున్నారు.
ఈశ్వరత్వం స్యాత్.... అంటే నీవే ఈశ్వరుడవై యుండగా, ఈశ్వరా పాహిమాం అని ఎవరిని అడుగుతావు. అంటే ఏ సద్గురుమూర్తో, ఏ అవతారుడో, ఎవరైతే నీకు ఆధారభూతంగా ఉన్నాడో, ఆ మహానుభావుడిని నువ్వు వేడుకోవల్సిందే. వారే నీకు ఈశ్వరుడు. వారే నీకు బ్రహ్మము. వారే నీకు పరబ్రహ్మము.
ఆ రకంగా ఈ పురుషోత్తమ ప్రాప్తి స్థితిని పొందినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో, వారే ఈశ్వర స్వరూపులు. వారినే శరణు వేడాలి. వారికే శరణాగతి చేయాలి. వారి ద్వారానే ఈశ్వరుడు లోకకల్యాణార్థం, ధర్మసంస్థాపనార్థం పని చేస్తూ ఉన్నాడు.
కాబట్టి, ఈశ్వరుడు ఆకాశం నుంచీ పిడుగువలె పడుతాడనో, ఆత్మసాక్షాత్కార జ్ఞానం అంటే, ఏదో అమృత వృష్ఠి కురుస్తుందనో, ఏదో ప్రత్యేకమైనటువంటి సందర్భం జరిగితే నాకు ఆరకమైనటువంటి లక్షణం కలుగుతుందనో భావించరాదు.
సర్వవ్యాపకమైనటువంటి, సర్వవిలక్షణమైనటువంటి, సర్వ సాక్షి అయినటువంటి, సర్వమును ప్రకాశింప చేస్తున్నటువంటి, సర్వుల హృద్గుహయందు అంగుష్ఠ మాత్ర పురుషునిగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి, ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో,
ఏదైతే జీవాత్మగా, అంతరాత్మగా, పరమాత్మగా పిలువబడుతూ ఉన్నాడో, క్షర, అక్షర పురుషోత్తములుగా పిలువబడుతూ ఉన్నాడో అట్టి దానిని మాత్రమే నీవు ఆత్మ, స ఆత్మ అని తెలుసుకొన వలయును. ఇట్లా తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
ఇలా తెలుసుకోవాలి అంటే, నీకు అత్యావశ్యకమైనటువంటిది శుద్ధ బుద్ధి. శుద్ధమైన చిత్తము. చింత నుండి దూరమైనటువంటి చిత్తము. వాసనలనుంచి దూరమైనటువంటి చిత్తము. వ్యవహారము నందు రమించనటువంటి చిత్తము. వృత్తులందు రమించనటువంటి చిత్తము.
మనోనిగ్రహోపాయము. మనోజయము. వీటిని సాధించడం సాధకులందరికి అత్యావశ్యకమై యున్నది అని యమధర్మరాజుగారు నచికేతునికి బోధిస్తూఉన్నారు ఆత్మ తత్వము గురించి.- విద్యా సాగర్ గారు
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
18 Jan 2021
కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 165
🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 165 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 95 🌻
కాబట్టి నిజానికి పురుషుడు త్రివిధంబులు. క్షర, అక్షర పురుషోత్తములు. ఏ స్థితిలో ఉన్నా పురుషుడే. పురుషుడన్న స్థితికి ఏం భేదంలేదు. పురము నందు ఉన్నవాడెవడో, అధిష్ఠానముగా వాడే పురుషుడు. ఇది పురుషునికి అర్థం. అంతే కానీ, స్త్రీ పురుషులని అర్థం కాదు.
పురము అంటే, అర్థం ఏమిటి, ఎనిమిది శరీరాలు పురములు. ఎనిమిది జగత్తులు పురములే. ఎనిమిది వ్యవహారములు పురములే. కాబట్టి, ఆయా వ్యవహారములయందు అధిష్ఠానముగా ఉన్నటువంటి, విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యక్ ఆత్మ విరాట్ హిరణ్యగర్భ పరమాత్మలనే సాక్షిస్వరూపములన్నీ పురుషుడే.
వీటినన్నింటినీ క్రోడీకరిస్తే క్షరపురుషుడు అనేటటుంవంటి జీవుడు, అక్షరపురుషుడు అనేటటుంవంటి బ్రహ్మము పురుషోత్తముడు అనేటటువంటి పరమాత్మగా మనం సిద్ధాంతీకరించాము.
కాబట్టి, ఈ స్థితి భేదాన్ని బట్టి, భావన భేదాన్ని బట్టి, నిర్ణయభేదాన్ని బట్టి, నిర్వచనం ఇచ్చారే తప్ప, ప్రత్యేకంగా దానివల్ల స్థూలంగా వచ్చేటటువంటి, మార్పేమీ లేదు.
జీవన శైలిలో వచ్చేటటుంవంటి మార్పేమీ లేదు. అంటే అన్నం తినేవాడు అన్నం మానేస్తేనో, అన్నం తింటేనో, లేదంటే కొండగుహలలో ఉన్నవాడు జనారణ్యంలోకి వస్తేనో, జనారణ్యంలో ఉన్నవాడు కొండగుహలలోకి వెళ్తేనో, లేదా నిరంతరాయంగా రోజుకి 16 సార్లు స్నానం చేయడం వల్లనో, ఇలా భౌతికమైనటువంటి విధులలో మార్పులు చేసినంత మాత్రమున ఈ వివేకము సాధించబడింది అని చెప్పడానికి అవకాశం లేదు.
కానీ ఇలాంటివి అన్నీ కూడా నీలో ఉన్నటువంటి మాలిన్య సంగ్రహాన్ని వదిలించుకోవడానికి ఉపయోగపడే సహకారి కాగలదు. అందుకని సాధనకి పరిమితులు చెప్పబడినాయి. యమనియమాది అష్టాంగ యోగ సాధనలో... యమం, నియమం చాలా ముఖ్యమైనది.
ఇవాళ ఎంతోమంది ఆత్మ జ్ఞానమనీ, బ్రహ్మజ్ఞానమనీ, విచారణ చేసేటటువంటి వారు కానీ, ఆత్మసిద్ధులని, ఆత్మనిష్ఠులనీ, ఆత్మోపరతులని, ఆత్మోపబ్ధిని పొందామని, తత్వదర్శిలమని పేరుపొందిన వారిలో ఇట్టి యమ నియమాలు గోచరించుట లేదు అనేది పెద్దల వ్యాక్యము. ఎందువల్ల? ఏ రకమైనటువంటి యమనియమాలను పాటించడు. ఏ రకమైన విధినియమాలను పాటించడు.
ఏ రకమైనటువంటి శాస్త్రోచిత కర్మలను చేయడు. ఏ రకమైన ధర్మార్థమైనటు వంటి, ప్రయోజన శీలమైనటువంటి, జీవనము చేయడు. కానీ, ఆత్మనిష్ఠుడు అని అంటాడు. ఉండకూడదా? ఉండవచ్చు...! కొండకచో.. ఇటువంటి జీవన్ముక్తులు కూడా ఉండవచ్చు. బ్రహ్మ నిష్ఠులు కూడా ఉండవచ్చు. కాని వారు అత్యంత అరుదుగా ఉన్నారు.
భగవాన్ రమణులు ఏమీ చేయలేదు కదండీ! అనేటటువంటి వాక్యాన్ని తరచుగా వింటూ ఉంటాము. కానీ, వారికున్నటువంటి సహజనిర్వికల్ప సమాధినిష్ఠ మరి అందరికీ లేదు కదండీ! వారి స్థితిననుసరించి, వారి వ్యవహారం ఉంటుంది. జీవన్ముక్తులు ఇలాగే ఉండాలి అనే నియమం లేదు. జగత్ వ్యవహార శైలిని బట్టి వారుండరు. వారు ఉండవలసిన రీతిగా వారుంటారు.
ఎట్లా ఉంటే, లోక కళ్యాణం సాధ్యమౌతుందో, అట్లా ఆ అవతారుడు, అట్లా ఆ జీవన్ముక్తుడు ఉంటాడు. ఆ స్థితికి వచ్చేవరకూ సర్వసామాన్య నియమములను సర్వసామాన్య ధర్మములను మొక్షార్దియై ఆచరించవలెను. ఇది చాలా ముఖ్యమైనటువంటిది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
17 Jan 2021
కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 164
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 94 🌻
ఇది సవ్యమైనటువంటి పద్ధతేనా? ఇది సరైన పద్ధతేనా? అనిటటువంటి విచారణ చేసుకోవల్సినటువంటి అవసరం ఉన్నది. ఏమండీ, మా అల్లుడు గారికి, సరైన ఉద్యోగం ఇప్పించండి, ఏమండీ, మా అల్లుడుగారి బుద్ధి సరిగ్గా ఉండేటట్లు చూడండి. ఏమండీ మా అమ్మాయిని సరిగ్గా చూసుకునేటట్లు చూడండి.
ఏమండీ! నన్ను మా ఆయన సరిగ్గా చూసుకునేటట్లు చూడండి. ఏమండీ! మా పిల్లలూ సరిగ్గా ఉండేటట్లు చూడండి. ఏమండీ! మా మనవళ్ళూ సరిగ్గా ఉండేటట్లు చూడండి. ఇలా ఎన్ని రకాలుగా ఏ పేరుతో పిలిచి కోరుతూ ఉన్నప్పటికీ, ఈ కోరికలన్నీ ఒకే ఒక కోరికలోకి వెళ్ళిపోతున్నాయి, ఏమిటది? పాహిమాం.
అయితే, ప్రాధమికమైనటువంటి బాల్యదశలో ఇది అవసరం. ఎందుకంటే, అక్కడ ఉచితానుచితములు తెలియనటువంటి అవస్థ కాబట్టి, బాల్యావస్థ యందు భక్తియనే పునాది, విశ్వాసము ఏర్పడ వలసినటువంటి అగత్యమున్నది కాబట్టి, బాల్యము నందే ఈశ్వరానురక్తత ఏర్పడవలసినటువంటి అవసరము ఉన్నది కాబట్టి, బాల్యావస్థ దాటే వరకూ ఈ భక్తిని ఆశ్రయించాలి. పాహిమాం అని ఆర్తితో వేడుకునేటటువంటి లక్షణాన్ని పొందాలి. నిరంతరాయంగా ఈ ఆర్తిని తహని నిలబెట్టుకోవాలి. భక్తి విశ్వాసాలు నిలబెట్టుకోవాలి. ఈశ్వరానుగ్రహం కోసం ప్రయత్నించాలి.
కానీ.. చాలా ముఖ్యమైనటువంటిది ఈ ‘కానీ’. చిత్తశుద్ధి లేకుండా ఆత్మవస్తువు యొక్క లక్షణాలను గుర్తించకుండా అంధుడు ఏనుగును నిర్ణయించినట్లుగా నిర్ణయించ పూనుకుని ఉంటే, అప్పుడు ఎప్పటికీ, సమగ్రమైనటువంటి వివేకాన్ని, విజ్ఞానాన్ని పొందలేడు. ఎందువల్ల? ఆ పరమాత్మ అందరి శరీర మధ్యభాగములందున్నాడు.
సర్వభూతస్థమాత్మానాం హృద్దేశోర్జున తిష్ఠతి - ఇలాంటి ప్రయోగాలతో భగవద్గీత యందు తన అధికారిత్వాన్ని, తన అధిష్ఠాన స్థితిని, తన ఆశ్రయాన్ని, తన సర్వాధార స్థితిని, పరమాత్ముడు తెలియజెప్పి ఉన్నాడు. ఎక్కడున్నావయ్యా? అని అర్జునుడు పదే పదే అడుగుతాడు.
ప్రతి యోగంలో కూడా అర్జునుడు ప్రశ్నిస్తూ ఉంటాడు. మన తరఫున. మన ప్రశ్నలన్నింటికి కూడా పరమాత్ముడు సమాధానాలు తీరుస్తూ ఉంటాడు. బ్రహ్మజ్ఞాని అయినటువంటి వ్యాసభగవానుడు ఆ సమాధానాలన్నీ ఇస్తూ ఉన్నాడు భగవానుడి ముఖం నుంచి. ఏమని చెబుతున్నాడు? పైగా?
అంగుష్ఠ మాత్ర ఏవ పురుషః నాయనా! సర్వ జీవుల హృదయాకాశమునందు వారి వారి బొటన వేలు ఎంతుందో అంతమేరకు ప్రకాశాన్ని కలిగి ఉన్నాను. ఏమిటండీ, ఈ బొటన వేలు వ్యవహారం? ఏం మిగిలిన వేళ్ళు చెప్పవచ్చు కదా! అంగుష్ఠ మాత్ర ఏవ పురుషః - ఇది ఒక సంజ్ఞా రూపకమైనటువంటి బోధ. ఐదు వేళ్ళు ఉన్నప్పటికి, అంగుష్ఠం లేకపోతే మిగిలిన వాటి వల్ల ప్రయోజనం లేదు.
కాబట్టి, అంగుష్ఠం యొక్క ప్రాధాన్యతను నిర్ణయిస్తూ అట్టి ప్రధాన వస్తువుగా నీలో పురుషుడున్నాడు. వాడు లేకపోతే మిగిలినవి ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు. అనేటటువంటి సంజ్ఞారూపకమైనటువంటి బోధ. ఇంకొకటి కూడా ఉంది. దీనిని ప్రమాణంగా స్వీకరించే వాళ్ళు కూడా ఉన్నారు. అది కొద్దిగా అసయంజసమని అనిపిస్తుంది నాకు.
ఎందుకని అంటే, ప్రకాశమునకు ప్రమాణం ఎలా చెబుతాము? స్వయం ప్రకాశమునకు ప్రమాణం ఎలా చెబుతాం? ఆత్మ నాలుగు స్థితులందున్నట్లుగా తోస్తున్నది. జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ ఇంకా దేనికి జోడిస్తే ఆ ఆత్మ. పుణ్యాత్మ, పాపాత్మ, వ్యవహారాత్మ. దేనికి జోడిస్తే అదైపోతుంది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
16 Jan 2021
కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 163
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 93 🌻
నీ సహజశైలికి భిన్నముగా ఉన్నాయి. నీ స్వరూప జ్ఞానానికి భిన్నంగా ఉన్నాయి. నీ స్వయం ప్రకాశత్వానికి భిన్నంగా ఉన్నాయి. నీ ఆత్మజ్ఞానానికి భిన్నముగా ఉన్నాయి.
వివేకం ఈ ఆత్మవస్తువును గుర్తించి, అట్టి వస్తువుగా నిలిచి ఉండి, మిగిలిన వాటిని నిరసించుట, తద్భిన్నమగు వాటిని నిరసించుట. అసనము అంటే స్వీకరించుట. నిరసించుట అంటే నిరాకరించుట.
ప్రయత్న పూర్వకముగా నిరాకరించుట. ప్రయత్న పూర్వకముగా త్యజించుట. అదే సాధన. కాబట్టి, నా జీవితంలో నేను ఎలా ఉంటున్నాను? ఈ శాస్త్రములు, సద్గురువులు బోధించినటువంటి రీతిగా, జ్ఞాన పద్ధతిగా, ఆత్మ విచారణ పద్ధతిగా, ఉండగలుగుతున్నానా? లేదా?
మిగిలిన సాధనోపాయములు, ఆజన్మార్జితమై ఉన్నటువంటి అనేక సాత్విక, రాజసిక, తామసిక వ్యవహారశీలములయందు, అనిష్టమైనటువంటి వాసన బల సంస్కార విశేషములను రద్దుపరుచుకోవడానికి, సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేయడానికి, శుద్ధ బుద్ధిని సాధించడంలో, సహకారి కారణములుగా, సాధనములు ఉపయోగపడతాయేమో గాని, ఆత్మవిచారణ అనేటటువంటి, కట్టకడపటి సాధన, ప్రథమము నుంచీ చేయాలి.
మొదటి నుంచి చివరి దాక చేయవలసినది ఆత్మ విచారణ. అట్టి ఆత్మ విచారణ యందు రతుడైనటువంటి వాడు, మునిగియున్నటువంటి వాడు, ఆత్మోపలబ్ధియే తన జీవిత లక్ష్యంగా భావించేటటువంటి వాడికి మాత్రమే ఏ సాధనైనా సహకరిస్తుంది. ఏ వ్యవహారమైనా సహకరిస్తుంది.
ఏ అవ్యవహారమైన సహకరిస్తుంది. అది ఇది అది అని చెప్పడానికి వీలు లేదు. జనన మరణాలతోసహా అట్టి ఆత్మయందు అంశీభూతములై యున్నవి. అట్టి సర్వవ్యాపక స్థితియందు సమావిష్టమైపోయినవి. అటువంటి స్థితిని మానవుడు సాధించాలి అని, యమధర్మరాజు గారు బోధిస్తూఉన్నారు.
నచికేతా! ఆ పరమాత్మ అందరి శరీరముల మధ్య భాగమందు ఉంటున్నాడు. అంగుష్ఠ మాత్ర హృదయాకాశమున ఉంటున్నాడు. అంతటా నిండి యుండుట చేత పురుషుడని చెప్పబడుచున్నాడు. ఈ పురుషుడే కాలత్రయమునకు నియామకుడు. ఈ విధముగా తెలిసిన వారు, అట్టి పురుషుని నుండి, తనకు భయము కలుగునని తలంపడు. వాని నుండి రక్షణను కోరడు.
మానవులందరూ సాధారణంగా ఈశ్వరా పాహిమాం. నన్ను రక్షించు నన్ను రక్షించు అని వేడుకుంటూ ఉంటారు. పాహిమాం, పాహిమాం, పాహిమాం నిరంతరాయంగా జీవులందరూ కూడా ఆ ఈశ్వరుణ్ణి వేడుకునే పద్ధతి ఏమిటంటే, మాంపాహి, మాం పాహి పాహిమాం. నన్ను కాపాడు, నన్ను కాపాడు అని అడుగుతూ ఉంటారు.
అంతే కానీ, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, నువ్వే కావాలి, నాకు ఈశ్వరుడు తప్పు ఏమీ అవసరం లేదు, నాకు బ్రహ్మము తప్ప ఏమీ అవసరం లేదు, నాకు ఆత్మవస్తువు తప్ప ఏమి అవసరం లేదు. అని మాత్రం అనడు. నువ్వు ఎప్పుడూ వేరే. నువ్వు ఎప్పుడూ వేరే. నేను అనుభవించే జగత్తు మాత్రం నాకు కావాల్సిందే.
ఒక వేళ ఈ జన్మలో చిట్టచివరికి ఏదైనా నువ్వు అవకాశం ఇస్తే, నువ్వు కూడా కావాలి. అంతేకానీ, జగత్తు లేకుండా నువ్వు మాత్రం నాకు అవసరం లేదు. అనుభోక్తమైనటు వంటి, భోగ్యవస్తువు అయినటువంటి, ఈ జగత్తు లేకుండా, నిన్నేంచేసుకుంటానయ్యా నేను? నీ వల్ల నాకు ప్రయోజనం ఏముంది? కాబట్టి, నేను కష్టాలలో పడుతూ ఉంటాను, జగత్ వ్యాపారంలో పడుతూ ఉంటాను.
అనేకమైనటువంటి నానాత్వంలో పడుతూ ఉంటాను. కాంక్షలలో పడుతూ ఉంటాను, మోహంలో పడుతూఉంటాను. వివేకం లేకుండా వ్యవహరిస్తూ ఉంటాను. నిన్ను మాత్రం నేను కోరేది ఒక్కటే, ఏమిటది? పాహిమాం, పాహిమాం, పాహిమాం.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
15 Jan 2021
కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 162
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 92 🌻
మరి ఇప్పుడు ఈ రకమైన జీవితాన్ని ఏమని చెపుతాము. దీంట్లో నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గమున్నది. ప్రయత్నించి శుద్ధ బుద్ధిని సంపాదించుట. నన్ను ఏం చేయమంటారండీ? నాయన! శుద్ధ బుద్ధిని సంపాదించు. నన్ను ఉద్యోగం చేయమంటారా? మానేయ మంటారా? ఎవ్వరూ చెప్పరూ.
వేదాంత విద్యా విశారదులు ఈ ప్రపంచంలో ఎవరికీ వ్యవహార శైలియందు ఇలా ఉండు, అలా ఉండు అని చెప్పడానికి ఒక ఆధారం ఉండదు. ఎందుకని అంటే, నువ్వు ఏ వివేకంతో వ్యవహరించావు అన్నదానికే ప్రాధాన్యత. అట్టి వివేకశీలి అయినటువంటి వాడు, సామాన్యమైనటువంటి కర్తృత్వ కర్మాచరణ యందు అసంగముగా ఉన్నాడా లేదా? అనేటటువంటి దానిని గుర్తించాలి.
అట్టి అసంగత్వ లక్షణం నువ్వు కనుక నిలబెట్టుకోపోయినట్లయితే, అట్టి సాక్షిత్వ లక్షణాన్ని నువ్వు నిలబెట్టుకోక పోయినట్లయితే, సదా పుస్తకాల పురుగువలె చదివినప్పటికిని, సదా శాస్త్రములను అభ్యసించినప్పటికి, సదా నీవు వ్యాపార సహితుడవి అగుతున్నావు కానీ, నిర్వృత మానసాన్ని పొందినవాడివి అవ్వడం లేదు.
అట్టి నిర్వృత మానసం లేకుండా, ‘వినివృత్త కామాః’ అని అంటోంది భగవద్గీత. వినివృత్త కామా - వృత్తి, కామములయందు నిః - నివృత్తత. విరమించుట. అనేటటువంటిది విశేషముగా జరగాలి. వాసనలతో సహా లేకుండా పోవాలి. వాటి రసం ఇంకి.. ఇంగువ యొక్క రసం ఇంకి బట్ట ఎలా అయితే ఇంగువ పోయినప్పటికి అదే వాసన వస్తుంది.
చేతితో ఉల్లిపాయపట్టుకుంటే, ఉల్లిపాయ వదిలేసినప్పటికి చేతికి ఉల్లిపాయ వాసన ఎట్లా అంటుతుందో, ఈ రకంగా అనేక పదార్థముల యొక్క రసము మనలో శోషించి, అవే పదార్థముల యొక్క స్ఫురణ కలుగుతూ నానాత్వ భ్రాంతి కలిగిస్తూ, అట్టి నానాత్వ బుద్ధి చేత, మరల జనన మరణములందే తిరుగుతూ ఉంటారు.
కాబట్టి, తప్పక సాధకులందరూ నిరంతరాయంగా సాధన అనగా, ధనము అనగా మార్పు చెందనటువంటిది. ఆ సాధనని ఆ మార్పు చెందనటువంటి స్థితిని సాధించుట కొరకు, పొందుట కొరకు, ఆ లక్షణంతో ఉండుట కొరకు, అట్టి లక్షణమునే నిలబెట్టుకొనుట కొరకు, స్థిరత్వము అంటే, అర్థం అది. జీవితంలో ఎప్పటికి స్థిరపడుతావు నాయనా? అనే ప్రశ్నకి అర్థము, లక్షణము ఏమిటంటే, స్థిరమైనటువంటి స్థితిని నువ్వు ఎప్పుడు గుర్తిస్తే, అప్పుడు స్థిరపడి పోయినట్లే. ఈ రకంగా ఆత్మవస్తువును గుర్తిస్తూ, అనాత్మను నిరసిస్తూ, ఈ ఆత్మానాత్మ వివేకమును సంపాదించాలి.
ఎంతకాలమైతే ఆనాత్మ వస్తూప లబ్దియందు నీ ప్రేరణ, బుద్ధి, ఆకర్షణ కలిగి ఉంటావో, చాలా మంది ఈ రకమైనటువంటి అంశాలను మానవజీవితంలో కలిగిఉన్నారు. ఏదో పుట్టావు, ఏదో పెరిగావు, ఏదో ఒకటి చేయాలి, చేశాను.
చేస్తే ఏదో ఒక ఫలితం రావాలి, వచ్చింది. వచ్చినదానిని ఏదొ నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకున్నాము. నిలబెట్టుకున్న తరువాత దానిని ఏం చేయాలి? నిలబెట్టుకున్న దానిని పది మందిలో ప్రదర్శించాలి. ప్రదర్శించాము. ప్రదర్శించిన తరువాత ఏమైంది? పరువా? ప్రతిష్ఠ వచ్చినాయి. ఆ పరువు ప్రతిష్ఠ పోగొట్టుకోకుండా నిలబెట్టుకోవాలి.
మరలా ప్రయత్నించాలి. ఇలా నిరంతరాయంగా అనాత్మ భ్రాంతితో కూడుకున్నటువంటి, అంశాలయందే చిత్తం లగ్నంమై ఉండడం చేత, జగత్ వ్యాపార సహితమైన వాటియందే, చిత్తం లగ్నమై యుండుట చేత, ఎంత మంది నన్ను ఇవాళ పొగిడారు, ఎంతమంది నన్ను ఇవాళ విమర్శించారు అని లెక్కపెట్టుకునే వారు కూడా ఉన్నారు.
ఎంత మంది ఇవాళ నమస్కారం చెప్పారు, ఎంతమంది నమస్కారం చెప్పలేదు? అనేటటుంవంటి అధికార మదాంధత్వమును పొందినటువంటి వారు కూడ ఉన్నారు. మరి ఇవన్నీ ఎటు దారితీస్తున్నాయి అంటే, అజ్ఞానాంధత వైపు దారి తీస్తున్నాయి. - విద్యా సాగర్ గారు
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
14 Jan 2021
కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 161
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 91 🌻
నాయనా! నీ జీవితంలో నీవు ఏమి సాధించావు నాయనా? అనే ప్రశ్న నలభై ఏళ్ళు దాటిన దగ్గర నుంచీ వస్తుంది. నలభై ఏళ్ళు దాటిన దగ్గర నుంచీ గృహస్థాశ్రమము మీద ప్రశ్నలు కలుగుతూ ఉంటాయి. ప్రశ్నలు వస్తే, వెనక్కి తిరిగి చూస్తే, ఇవే కనబడుతూ ఉంటాయి. ఘట శరావాదులు, అంటే, మన ఇంట్లో ఒక వేయి గిన్నెలు ఉన్నాయండి. మా ఇంట్లో ఒక పది సోఫాలున్నాయండి. మా ఇంట్లో పది అంతస్థులు ఉన్నాయండి. మా ఇంట్లో పది కిలోల బంగారం ఉందండి. మాకు పది మంది కుటుంబ సభ్యులున్నారండి.
ఈ రకంగా అనేకత్వ నానాత్వ భ్రాంతికి చెందినటువంటి సమస్త వస్తూపజాలము యొక్క విశేషములన్నింటిని చెప్పుతూ, అవి తానే అయిఉన్నట్లుగా భ్రాంతి చెందుతూ వాటితో తాదాత్మ్యతను పొంది, అవే సుఖమును ఇస్తున్నాయనేటటువంటి భ్రమకు గురై, మోహాన్ని చెంది, గృహస్థాశ్రమాన్ని గడిపేశావు. గడపగా, గడపగా, గడపగా, గడపగా ఏమైందంటే... వ్యామోహం క్షీణించిపోయింది, ఇంద్రియాలు అశక్తమైపోయాయి, వృద్ధాప్యం వచ్చేసింది.
ఇప్పుడు ఈశ్వరా, ఈశ్వరా, ఈశ్వరా అంటుంటాడు. ఎందుకని? అశక్తత చేత. కాళ్ళు సహకరించడం లేదు నాయనా, నడవాలంటే, నీ దేవాలయానికి రావాలంటే. కాబట్టి, ఇక్కడి నుంచే ఓ నమస్కారం.
నీ నామ స్మరణ చేయాలంటే, బుద్ధి నిలకడగా ఉండడం లేదు నాయనా, కాబట్టి, తోచినప్పుడు చేస్తా, ఈశ్వరా నీకో నమస్కారం. కాబట్టి వృద్ధాప్యంలో ఈ రకమైనటువంటి అవస్థలను అన్నిటిని ఏకరువు పెట్టుకుంటూ ఉంటాడు. ఇంకా ఏమి అడుగుతూ ఉంటాడు? ఇంకా ఎప్పటికయ్యా? నన్ను తీసుకుపోయేది నువ్వు అని అడుగుతూ ఉంటాడు.
జీవితకాలమంతానేమో వస్తూపలబ్ధికై శ్రమించి, కాంక్షాయుతంగా జీవించి, దాచుకున్నటువంటి వస్తువులు, తయారు చేసుకున్నటువంటి సంసారం, తయారు చేసుకున్నటువంటి జగత్ భ్రాంతి, తనకు చిట్టచివరి కాలంలో ఉపయోగపడకపోయేటప్పటికి, ఆ చివరి కాలంలో, ఈశ్వరా ఈశ్వరా అని పలవరిస్తాడు.
మరి ఈ జీవన ప్రయాణం అంతా, ఆ జీవన పర్యంతమూ, తాను చేసినటువంటి కర్మ సహితమైనటువంటి, విశేషములన్నీ, ప్రయత్నములన్నీ, వెంటనే విడిచిపెడుతాయా? విడువవు కదా! ఆయా కర్మ భ్రాంతి మమకార రూపంలో, అహంకార రూపంలో, అభిమాన రూపంలో, అజ్ఞానరూపంలో, అవిద్యా రూపంలో, మోహ రూపంలో సూక్ష్మ శరీరాన్ని ఆశ్రయించి ఉంటాయి.
ఇవన్నీ కలిపితే, రజోగుణ, తమోగుణ సముదాయ సంబంధంతో కలిపిన సూక్ష్మ శరీరం. మరి ఆయా సందర్భోచితమైనటు వంటి స్థితులు కలుగుగా, వృద్ధాప్యమందు సదా సాధించినవి, సదా సాధించ వలసినటువంటి వాటి యందు ఆకాంక్ష, చింత.
కాంక్ష ఏమైపోయింది ఇప్పుడు వృద్ధాప్యంలో? చింతగా మారిపోయింది. ఇంకా అది అలా అవ్వలేదు, ఇంకా ఇలా అవ్వలేదు, ఇంకా వాడు ఇల్లు కట్టుకోలేదు, వాడు పెళ్ళి చేసుకోలేదు, ఇంకా మనవడు స్థిరపడలేదు, ఇంకా మునిమనవడు స్థిరపడలేదు, ఇంకా ఆ దేశాన్ని చూడలేదు, ఇంకా ఈ దేశాన్ని చూడలేదు. ఇంకా ఆ రకమైన భ్రాంతి పొందలేదు, ఇంకా ఈ రకమైన భ్రాంతి పొందలేదు.
అది భ్రాంతి అనేటటువంటి దానిని నిజవస్తు స్థితిని గుర్తించలేక, అదే సత్యమని మిడత వలె దీపం ముందు పరిభ్రమిస్తూ కడకు రెక్కలు కాలి, ఆ దీపం చేతనే మృత్యువుకు గురై పోవుచున్నాడు. ఈ రకంగా మృత్యుపాశంలో చిక్కుకున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
13 Jan 2021
కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 160
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 90 🌻
అంటే, ముందు విచారణ. తదుపరి ఆలోచన. తదుపరి ఆచరణ, ఆ తదుపరి ఫలము. ఇలా ఉండాలి ఎప్పుడూ కూడ. కానీ, ఎప్పుడైతే మనో వేగానికి లోనవుతావో, ఎప్పుడైతే భ్రాంతికి లొంగుతావో, ఎప్పుడైతే భ్రమాజన్యమైనటువంటి అజ్ఞానానికి లొంగుతావో, అప్పుడు ఏమౌతామంటే, ముందు ఆచరణ, తదుపరి ఆలోచన, ఆ తదుపరి విచారణ. వ్యతిరేకమైపోతుంది. అప్పుడు ఎంత ప్రయత్నించినా దీనిని జ్ఞాన స్థాయికి తీసుకొని వెళ్ళలేము.
కాబట్టి, ఒక నిర్ణయము తీసుకునే ముందే, ఒక ఆలోచనని చేసే ముందే, ఒక ఆకాంక్షని అమలు పరిచేముందే, విచారణ చేయి. వస్తువును ఆశ్రయిస్తుందా? అసత్తును ఆశ్రయించిం ఉందా? బ్రహత్వానికి చేరుస్తోందా? ప్రపంచానికి చేరుస్తోందా? పంచీకరించబడినదంతా... నానాత్వముగా ఉన్నటువంటి, అనేకత్వముతో ఉన్నటువంటిది కదా! మరది మిథ్యాభూతము కదా! అది లేనిది కదా! మరి అటువంటి లేని దానిని నేను ఆశ్రయించడం సమంజసం కాదు కదా! అనేటటువంటి ప్రాథమికమైనటువంటి అవగాహనను కలిగియుండాలి.
ఈ రీత్యానే మనం ధర్మశాస్త్రాలన్ని, మానవులకు ఏయే సమయాలలో ఎలా జీవించాలి అనేటటువంటి దానిని నిర్ణయంజేశాయి. బ్రహ్మచారి తప్పక బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి కావల్సిన విద్యను సంగ్రహించాలి. ఇప్పుడు ఆ బ్రహ్మచర్య ఆశ్రమము కాస్తా పోయింది. ఇప్పుడు ఏం చేశాడు? బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి బదులుగా, ముక్తివిద్యను సాధించడానికి బదులుగా, భుక్తి విద్యయందు మునిగిపోయాడు.
తర్వాత ఏమైపోయింది? పాతికేళ్ళు అయిపోయింది. అయిపోయినప్పటికి ఏమైపోయింది? బ్రహ్మజ్ఞానం రాలేదు. ఇంకేం చేస్తాం బాబోయ్? ఇప్పటికే లేట్ అయిపోయింది, వివాహం చేసేయండి, వివాహం చేసేయండి. బ్రహ్మజ్ఞానం లేకుండా ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో, అవసరార్థం చేసుకున్నదే కదా అది.
అట్టి అవసరార్థం చేయబడినటువంటి వివాహం వలన జీవితం అంతా, దేనిని తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు అంటే, అట్టి అవసరార్థమైనవి తీర్చుకునే పనిలోనే ఉంటాడు. అప్పటికికప్పుడు ఆ అవసరం వస్తూఉంటుంది. ఆయా అవసరాల చేత కొట్టుకుని పోతూ ఉంటాడు.
ఆ కొట్టుకు పోయినటువంటి ప్రవాహ వేగంలో, జీవితం క్షణభంగురంగా అయిపోతుంది. చేసి ఇక అంతా చేసి కళ్ళు తెరిచి చూసే సరికి, పిల్లలు సంసారం అన్నీ ఏర్పడుతాయి. ఆహా ఇల్లు ఏర్పరచుకున్నాను, ఆహా భార్యను ఏర్పరచుకున్నాను, ఆహా పిల్లలను ఏర్పరచుకున్నాను, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు.
ఆహా! ఇల్లు బాగుంది. ఆహా పిల్లలు బాగున్నారు, ఆహా భార్య బాగుంది, ఆహా సంసారం బాగుంది. వీళ్ళందరూ బాగున్నారు కాబట్టి నేను కూడా బాగున్నాను అనేటటువంటి సాపేక్ష పద్ధతిగా వస్తూపలబ్ధి చేత, నేను ఇంత బంగారం కొన్నాను. నేను ఇన్ని వస్తువులు కొన్నాను, నేను ఇంత విలువైన వస్తువులు కొన్నాను, నేను అంత విలువైన వస్తువులు కొన్నాను.
నేను ఇంత విలువైనటువంటి వాటిని దాచకున్నాను. నేను ఇంత విలువైనటువంటి వాటిని వ్యయం చేశాను. నేను ఇన్ని దేశాలు తిరిగాను. నేను ఇంత గొప్ప కులంలో పుట్టాను. నేను ఇంత గొప్ప క్షేత్రంలో పుట్టాను. నేను ఇంత వంశ వారసత్వాన్ని కలిగియున్నాను. నేను ఇంత కులగోత్రాలు కలిగియున్నాను.
నేను ఇంత ఉత్తమమైన మతంలో పుట్టాను లేదా ఉత్తమమైన ధర్మంలో పుట్టాను లేదా ఉత్తమమైనటువంటి అపేక్షలో పుట్టాను లేదా విలువైన రత్నాది ఆభరణాలను సంగ్రహించాను. ఈ రకంగా తనను తాను ఉద్గడింప చేసుకొనేటటుంవంటి అనాత్మ వస్తూపలబ్ధిని ఆశ్రయించి, తన గురించి తాను చెబుతూఉంటాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
12 Jan 2021
కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 159
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 89 🌻
ఎంత స్పష్టముగా చెబుతున్నాడో చూడండి. ఎన్ని ఉపమానాలు చెబుతున్నాడో చూడండి. ఇన్ని రకాలైనటువంటి అనాత్మ వ్యవహారమంతా ఉంది.
మరి ఇట్టి అనాత్మ వ్యవహారములలోనుంచి నిత్యమైనటువంటి అఖండమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి, సర్వ విలక్షణమైనటువంటి, సర్వ సాక్షి అయినటువంటి ఆత్మ వస్తువును మానవుడు తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే దివ్యత్వము సాధ్యమౌతుంది. అప్పుడు మాత్రమే జన్మరాహిత్యము సాధ్యమౌతుంది. అప్పుడు మాత్రమే అమృతత్వము సాధ్యమౌతుంది.
మానవుడు ఎప్పటికీ ఈ సత్యాలను గుర్తుపెట్టుకుని జీవిస్తూఉండాలి. తన ఆ జీవన పర్యంతమూ జనన మరణాలతోసహా, మృత్యుకాలంలో సహా, సహజమైనటువంటి తన స్వస్వరూప జ్ఞానాన్ని, స్వయం ప్రకాశాన్ని ఆశ్రయించి ఎవరైతే ఉంటారో వారికి మృత్యువే లేదు. ఎందుకని అంటే, వారు ఆ మృత్యువును దాటినటువంటి వారు.
వారు జనన మరణాలను దాటినటువంటి వారు. సశరీరులైన ఉన్నటువంటి అశరీరులు. శరీరము నందే ఉండి ముక్త స్థితిలో ఉన్నటువంటి వారు. వారికి శరీరము వలన ఏ రకమైనటువంటి సంగత్వము లేదు. అధ్యాస లేదు. ఈ రకంగా అనాత్మ యొక్క విశేషాలని వివరిస్తూ, అట్టి విశేషాలని త్యజించాలని చూపిస్తూ, అష్టవిధ శరీరాలలో సాక్షిగా ఉండాలనేటటువంటి బోధను మనకు అందిస్తున్నారు.
నచికేతా! అట్టి బ్రహ్మను తెలియుటకు సదాచార్యుల ఉపదేశము వలన మనస్సును సంస్కరింపవలయును, యమ నియమాదుల చేత బుద్ధిని శుద్ధమొనర్చవలెను. అట్టి శుద్ధ బుద్ధి చేతనే, ఏకరసమైన ఈ బ్రహ్మము తెలియదగినది. అన్యమార్గము లేదు.
బ్రహ్మము ఒక్కటే వాస్తవమనియు, దానికి వ్యతిరేకముగా ఏదియూ లేదని, దృఢనిశ్చయము చేయవలెను. అట్టి నిశ్చయము వలన అవిద్య నశించును. బ్రహ్మము ఏకము అను నిశ్చయము లేని వారికి, అవిద్య నానాత్వ బుద్ధిని కలిగించును. నానాత్వ బుద్ధి కలవారు మాటిమాటికి జనన మరణములను పొందుచున్నారు.
మరల స్పష్టముగా నిర్వచిస్తున్నారన్న మాట. ఏకరసమైనటువంటి, శుద్ధ బుద్ధి చేతనే, ఏక రసమైనటువంటి ఈ బ్రహ్మము తెలియదగినది. అన్యమార్గము లేదు.
అర్థమైందా? అండీ! అంటే ప్రపంచములో నువ్వు ఎన్ని మార్గాలలో వెతికినప్పటికి, ఎన్ని శోధనామార్గములు ప్రయత్నము చేసినప్పటికీ, అవన్నీ నిన్ను ఎక్కడకు తీసుకొచ్చి వదిలేస్తాయి. అంటే శుద్ధ బుద్ధి దగ్గరకు తీసుకొచ్చి వదిలేస్తాయి. ఆ శుద్ధ బుద్ధి చేత, నువ్వు పొందదగినటువంటి, ఏకైక వస్తువు బ్రహ్మము. ఏకైక వస్తువు ఆత్మ. మరి అట్టి, ఏకత్వస్థితిని చెందించేటటుంవంటి, శుద్ధ బుద్ధిని సాధించడమే మానవుని యొక్క ప్రయత్న ఫలము.
ఏమండీ! నన్ను పూజలు చేయమంటారా? జపం చేయమంటారా? ధ్యానం చేయమంటారా? యోగం చేయమంటారా? ఆసనాలు వేయమంటారా? ప్రాణాయామం చేయమంటారా? ఏం చేయమంటారు? విచారణ చేయమంటారా? లేదా సత్ క్రతువులు ఏమైనా యజ్ఞయాగాది కర్మలు చేయమంటారా?
లేదా, నవవిధ భక్తి మార్గాలలో ఉన్నటువంటి వాటిని ఏమైనా ఆచరించమంటారా? లేదా ఇతరత్రా దూషిత కర్మలలో నేను ఏమైనా ప్రయత్నం చేస్తే, నేను ఏమైనా ఉద్ధరించ బడ గలగుతానా? అనేటటువంటి ప్రశ్నలన్నీ మానవులకు కలుగుతూ ఉంటాయి. ఏం చేస్తే నేను బయట పడగలను? ఏం చేస్తే నేను ఉద్ధరింపబడగలను.
ఏం చేస్తే, నేను పొందవలసినటువంటి దానిని పొందుగలుగుతాను? ఏమి చేస్తే నేను ఈ స్థితిని అధిగమించ గలుగుతాను? అనేటటువంటి ప్రశ్నలు జననం నుంచి మరణం వరకూ వస్తూనే ఉంటాయి. కారణం ఆయా పరిస్థితులు కానీ, ఆయా అవసరములు కానీ, ఆయా ఆకాంక్షలు కానీ, ఆయా మోహ సదృశమైనటువంటి పరిస్థితులు కానీ, ప్రేరణలు కానీ, కామ క్రోధాది అరిషడ్వర్గములు కానీ, త్రిగుణాత్మకమైన వ్యవహారము కానీ, అవిద్య, మోహము కానీ...
వీటన్నిటిలోనుంచీ మానవుడు తప్పించుకోవడం రావాలి. వివేకంతో తప్పించుకోవాలి. విచారణతో తప్పించుకోవాలి. ఎదురుగా వెళ్ళి గోడ వుంటే, ఢాం అని గుద్దుకొని, ముక్కు పగిలిందండి, నన్ను ఇప్పుడు ఏం చేయమంటారండీ? అంటే, నాయనా! గుద్దుకోకముందుకదా నీవు ఆలోచించాలి, తల పగలక ముందు కదా ఆలోచించాలి? అని అంటారు పెద్దలు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
11 Jan 2021
కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 158
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 88 🌻
నిత్యానిత్య, ఆత్మానాత్మ, సదసద్, కార్యకారణ, దృక్ దృశ్య వివేకములనేటటువంటి పద్ధతులుగా దీనిని ఏ వివేక పద్ధతిలోకి వస్తుందో విచారణ చేసుకుని, ఆ విచారణ ద్వారా ఏది ప్రధానమో దానిని గ్రహించి, ఏది అప్రధానమో దానిని త్యజించాలి. భాగత్యాగ నిర్ణయము అంటారు.
ఈ భాగత్యాగ నిర్ణయము లేకపోతే, వివేకము అసాధ్యము. అవివేకమే ఉంటుంది ఎప్పటికి కూడా. అజ్ఞానమే ఉంటుంది ఎప్పటికి కూడా. అవిద్యే ఉంటుంది ఎప్పటికి కూడా. బంధమే ఉంటుంది ఎప్పటికి కూడా. కాబట్టి, అవివేకాన్ని, అజ్ఞానాన్ని, అనాత్మని, అవిద్యని, బంధాన్ని - వీటన్నింటినీ తొలగించగలిగేటటువంటి ఏకైక వజ్రాయుధం వివేకం – జ్ఞానం.
కాబట్టి, అట్టి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఎవరైతే సంసిద్ధులై ఉన్నారో, అట్టి ఆత్మోపరతియందు స్థితుడైయున్నాడో, అట్టి ఆత్మోపవస్తు లబ్ధిచే మాత్రమే సంతుష్టత చెందేటటువంటి లక్షణం ఎవరికైతే ఉందో, అటువంటి తీవ్ర మోక్షేచ్ఛ కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, అటువంటి సచ్ఛిష్యుడు ఎవరైతే ఉన్నారో, అటువంటి ఉత్తమ తరగతికి సంబంధించిన సాధకుడు ఎవరైతే ఉన్నారో, అతడు ఆభాసయుతమైనటువంటి ప్రతిబింబ సహితమైనటువంటి అనాత్మ వస్తువులచేత, సంతుష్టత చెందడం లేదు.
అవి ఏనుగుపై ఒక మనిషి నిలబడి ఒక రత్నాన్ని గాలిలోకి విసిరితే ఎంత ఎత్తుకు వెళ్తుందో, అంత ఎత్తు ధనరాశిని నీకెచ్చదన్ననూ, అఖండ మండలాకారముగా వ్యాపించి ఉన్నటుంవంటి, భూమండలాధిపత్యమును నీకిచ్చెదనన్ననూ, పిపీలికాది బ్రహ్మపర్యంతమూ వ్యాప్తమై ఉన్నటువంటి సమస్త జీవ తను చతుష్టయాధిపత్యమును ఇస్తాను అని అన్నప్పటికినీ,
సకల చతుర్దశ భువనాధిపత్యమును ఇస్తాను అనేటటువంటి ఆధిపత్యమును ఇస్తానన్నప్పటికి ఎవరైతే అవుననడో, ఎవరైతే వాటిని తృణప్రాయముగా, గడ్డిపోచవలె చూస్తాడో, అటువంటి తీవ్ర వైరాగ్యోపరతుడు మాత్రమే, అటువంటి కాంక్షారహితుడు మాత్రమే, అటువంటి మనోవాసనారహితుడు మాత్రమే, అటువంటి వివేకశీలి మాత్రమే, ఈ ఆత్మవస్తువును పొందగలుగుచున్నాడు. - విద్యా సాగర్ గారు
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
10 Jan 2021
కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 157
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 87 🌻
పుట్టినప్పుడు ఏ ఒక్కడు కూడా వస్త్రం కప్పుకుని రాలేదు. మొట్టమొదటిది వస్త్రం కప్పడంతోనే మొదలౌతుంది. వస్తూపలబ్ది. జన్మించడానికి ఆధారమైనటువంటి, ఆశ్రయించినటువంటి... బొడ్డుతాడు కోయడానికి బ్లేడు కావాలి. వస్తూపలబ్ది దానితోనే ముడిపడి ఉంది.
మరి అలా ఇవన్నీ నీకు అవసరాలే అయివున్నప్పటికి, ఇవేవీ నీవు కాదు. నీ యొక్క వాస్తవికమైనటువంటి ఉనికి, నీదదికాదు. నీవు అఖండమైనటువంటి ఆత్మస్వరూపుడవు.
నీవు ప్రత్యగాత్మ, విశ్వ తైజస ప్రాజ్ఞ రూపముగా ఉన్నట్లుగా తోచుచున్నప్పటికి లేదా సమిష్టిగా ఉన్నటువంటి స్థూల సూక్ష్మ కారణ దేహములైనటువంటి విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత, పరమాత్మలు అనేటటువంటి దేహములు కానీ, సాక్షులు కానీ, ఇవేవియూ నీవు కాదు.
వీటి అన్నిటికి అతీతమైనటువంటి, అఖండముగా ఉన్నటువంటి పరమాత్మవు, పరబ్రహ్మవు. ఆ పరబ్రహ్మము కూడా బట్టబయలందు లేనిది అనేటటువంటి చిట్టచివరి నిర్ణయమును పొందటానికి, జన్మరాహిత్యమును పొందడానికి, అమృతత్వాన్ని పొందడానికి మాత్రమే నేను ఈ మానవోపాధిలోనికి వచ్చాను అనేటటువంటి, స్పష్టమైనటువంటి లక్ష్యాన్ని, లక్షణాన్ని, ఆశ్రయించి, మనం ప్రయాణం చేయాలి.
అందుకని ఏమన్నాడు? జహర్లక్షణం, అజహర్లక్షణం, జహదజహర్లక్షణం అనే లక్షణత్రయాన్ని, సాధకులకు నిర్దేశించారు. ఎవరైతే ‘సూణోధావతి’ అనేది సూత్రం అన్నమాట జహర్లక్షణానికి. అంటే ఏమిటి? అంటే ఎర్రరంగు ప్రవహిస్తుంది అన్నామండి. ఎర్రరంగు ప్రవహించడం ఏమిటి అయ్యా అంటే?
ఎర్రరంగు జెండాలు పట్టుకున్నటువంటి వారందరూ కూడా నదిలో ప్రయాణము చేస్తూఉంటే, నదంతా ఎర్రగా కనబడి, ఎర్రరంగు ప్రవహిస్తోందిగాతోచింది. తోచినటువంటి ఎర్ర రంగు ప్రధానమా? అది ప్రవాహం ప్రధానమా? అలా ప్రవహించే అవకాశం ఉందా?
ప్రత్యక్ష పరోక్ష అనుమాన విహిత అవిహిత... ఇలా ప్రమాణ సహితాలన్నింటినీ విచారణ చేయగా, షట్ప్రమాణ సహితమైనటువంటి విచారణ చేయగా, యథార్థం బోధ పడింది. కాబట్టి యథార్థం ఏమిటి? అనంటే, నది ప్రవహిస్తోంది, నదిలో కొంతమంది ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు.
వారు ఎర్రరంగు జండాలు పట్టుకున్నారు. దూరం నుంచీ చూడగా, ఒక భ్రాంతి కలిగింది. ఎర్రని నది ప్రవహిస్తోంది. నది ఎర్రగా ఉండడం ఏమిటి? అనే ప్రశ్న వేసుకుంటే తప్ప, ప్రయోజనము లేదు.
ఈ రకంగా జహర్లక్షణం, అజహర్లక్షణం, జహదజహర్లక్షణం... ఈ రకంగా లక్షణత్రయాన్ని చక్కగా గురుసమక్షంలో విచారణ చేయాలి. అంటే అర్థం ఏమిటి? ఏది ప్రధానం? ఏది అప్రధానం? ఏది మనం పట్టుకోవాలి? ఏది మనం త్యజించాలి?
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
09 Jan 2020
కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 156
🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 156 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 86 🌻
అంతా మానవత్వాన్నే కలిగియున్నారు. మానవత్వాన్ని కలిగియున్నవారందరూ మానవులే. కాబట్టి, అలా లక్షణ రీత్య నిర్ణయం చేసేటటువంటి ఎదుగుదలను మానవుడు సాధించాలి. ముఖ్యంగా సాధకులు సాధించాలి.
నీ చుట్టు పక్కల ఉన్నటువంటి నీ సంసారంలో, నీవు గుర్తించేటటువంటి మనుషులు కానీ, నిన్ను గుర్తించే మనుషులు కానీ, ఏవైతే, ఎవరైతే ఉన్నారో, వారంతా ఎవరు? నీ ఇంట్లో ఉన్నవస్తువులు కానీ, నువ్వు ప్రపంచంలో గుర్తుపట్టేటటువంటి వస్తువులు కానీ, ఇదంతా కూడా ‘ఇదం’, ఇదం అంటే నేను కాదని. ‘ఇదం’ - అనేటటువంటిది అంతా కూడా నేను కాదు.
మరి నేను ఎవరిని? ఆ ఇదం కి ఉన్న లక్షణాలకి వ్యతిరేకంగా ఏ సాక్షిత్వము అయితే ఉన్నదో... అంటే అర్థం ఏమిటి? నీవు ఒక వస్తువును చూస్తూఉన్నావు. చూస్తూఉంటే ఆ వస్తువు నువ్వు అవుతావా? ఆ ఘటము నువ్వు అవుతావా? ఓ కుండలో నీళ్ళు పట్టావయ్యా! కుండలో నీళ్ళు చల్లగా ఉంటాయయ్యా! అది దాని లక్షణం.
కుండనువ్వా? నీళ్ళు నువ్వా? చల్లదనం నువ్వా అంటే, ఈ మూడు నేను కాదు. కారణం ఏమిటి? నేను చూస్తూ ఉన్నాను, నేను అనుభవిస్తూ ఉన్నాను, నేను తెలుసుకుంటూ ఉన్నాను. జ్ఞాతుం, ద్రష్టుం, ప్రవేష్టుం, అధిగచ్ఛతి. నేను అధిగమించి ఉన్నటువంటి సాక్షిని. సర్వదా సాక్షిని. సర్వ సాక్షిని. కాబట్టి, నాకేమీ అంట లేదు, కుండ అంట లేదు, నీళ్ళు అంట లేదు, చల్లదనము అంట లేదు.
నాకు ఏ సంగత్వము లేదు అనేటటువంటి సాక్షిత్వ స్థితిని సాధించడం చాలా అవసరం. మరి కుండ అవసరం లేదా? మంచి నీళ్ళు అవసరం లేదా? అందులో చల్లటి మంచి నీళ్ళు అవసరం లేదా? అది భౌతిక అవసరం.
ఆత్మ అభౌతికం. ఆత్మ సూక్ష్మం. ఎన్ని అవసరాలున్నప్పటికీ, అవసరాలమేరకు పని చేసేటటువంటి వాడు, అనిత్య వస్తువులయందు రమించకుండా, కలిసిపోకుండా, తాదాత్మ్యత లేకుండా, సంగత్వ దోషం లేకుండా, తాను తానుగా ఉండి, తానైనటటువంటి స్థితిలో నిలిచి ఉండి, బట్టబయలే బ్రహ్మము అనేటటువంటి జన్మరాహిత్య లక్షణానికి ఆశ్రయంగా ఉండేటటువంటి, తత్త్వజ్ఞాన లక్ష్యం దృష్ట్యానే, వ్యావహారిక లక్షణాలను చూస్తాడు. ఈ రకంగా వ్యావహరిక దృష్టి అనేటటువంటిది సామాన్యమైపోయింది.
అప్రధానం అయిపోయింది. అనిత్య వస్తూపలబ్ది చేత ప్రేరేపించబడడం లేదు. పుట్టిన దగ్గర నుంచి పోయే లోపల అనేక వస్తువుల ఉపలబ్ది జరుగుతూ ఉంటుంది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
08 Jan 2021
కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 155
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 85 🌻
ఎప్పటికప్పుడు నిజానికి అఖండమైనటువంటి ఆత్మ స్వరూపంలో ఏ భేదము లేకపోయినప్పటికి, భేదములను ఆపాదించుకుని చూచుట అనే అభ్యాస బలము వలన అనేక రకములైనటువంటి అంతరములు ఏర్పడుతున్నాయి.
కాబట్టి, ప్రతి ఒక్క మానవుడు కూడా ఇతర మానవులతో ఎలా ఉన్నారు? నువ్వు నేను ఒక్కటేనా? వీడు వాడు ఒక్కటేనా? అదీ ఇదీ ఒక్కటేనా? అనేటటువంటి పదాలు మాట్లాడుతున్నాము. అంటే అప్పుడేమయ్యింది అంటే, మనం చిన్నప్పటి నుండి జనన కాలం నుండి మరణ కాలం వరకూ భేద దృష్టిని పెంచి పోషిస్తూఉన్నాము.
అభేద సిద్ధి కొరకై ప్రయత్నించ వలసిన మానవుడు, భేద దృష్టి యందు బలపడిపోవడం చేత, వస్తువుల యందున్నటువంటి భేదాన్ని గుర్తించడంతో మొదలు పెట్టి, అంటే, ఉప్పు పంచదార ఒకటేనా? కర్పూరం ఉప్పు ఒకటేనా? తెల్లని వస్తువులన్నీ ఒకటేనా? వాటి వాటి లక్షణాలు వేరు వేరుగా ఉన్నాయి కదా! కాబట్టి, లక్షణ రీత్యా గుర్తించాలి కదా, అనేటటువంటి ప్రతిపాదనని మనం చిన్నప్పుడే చెప్పుకున్నాము.
కారణం ఏమిటి అంటే, ఆత్మవస్తువుని లక్షణరీత్యానే గుర్తించ గలుగుతున్నాము. అట్టి లక్షణాన్ని గుర్తించేటటువంటి బుద్ధి వికాసం ఎందుకు అవసరమయ్యా అంటే, అఖండంగా ఉన్నటువంటి ఆత్మవస్తువుని గుర్తించటానికి లక్షణ రీత్యానే గుర్తించాలి కాబట్టి, వస్తువుగా దానిని చూపెట్టటం కుదరదు కాబట్టి.
కానీ, తాను అల్లుకున్నటువంటి గూటిలో, తానే చిక్కుకుని అక్కడే మరణించేటటువంటి సాలె పురుగు వలే, తాను అల్లుకున్న గూటిలో తానే చిక్కుకుని, తన మనోజాలంలో తానే చిక్కుకుని, తన మనో భ్రాంతిలో తానే చిక్కకుని, తన బుద్ధిగతమైనటువంటి వివేకాన్ని, అవివేకంగా మార్చుకుని, అజ్ఞానంగా మార్చుకుని, అవిద్యగా మార్చుకుని, అభ్యాస దోషం చేత, అనేకత్వం అనేటటువంటి భ్రాంతికి గురై, అనాత్మ అనేటటువంటి భ్రాంతికి గురై, భేద స్థితికి లొంగిపోయి, చిట్టచివరికి మృత్యువు పాలౌతున్నాడు.
ఈ రకంగా అద్వితీయ బ్రహ్మము తానై ఉన్నప్పటికి, అసలు ద్వితీయమే లేనటువంటి స్థితిలో తాను ఉన్నప్పటికీ, స్వకీయమైనటువంటి ఆభాస చేత, స్వయం కృతమైనటువంటి అపరాధం చేత, మృత్యువు నుండి మృత్యువునే పొందుచున్నాడు.
కాబట్టి, ఈ ఆత్మను అనేకముగా తలంచడం అనేటటువంటి దోషాన్ని మనము చేయరాదు. ఇక్కడ అనేకమంది జీవాత్మలున్నారండీ అనకూడదు.
ఇక్కడ అనేకమంది దివ్యాత్మలున్నారండీ అనకూడదు. ‘ఆత్మలు’ అని బహువచన ప్రయోగం చేయకూడదు. ఆత్మకు ఏక లేక బహు అనే రూపాంతరం లేదు. ఈ ఆత్మ శబ్దం సంస్కృత శబ్దం. దీనికి వచనం లేదు. ఆత్మ - ఆత్మలు అనరాదు.
కాబట్టి, అఖండముగా నున్నటువంటి ఆత్మస్వరూపాన్ని ఆ లక్షణ రీత్యా ఏక పద్ధతిగా, ఏకత్వం అనేటటువంటి ఏకైక లక్షణ రీత్యా అందరూ మానవులే. అందరూ మానవులే అన్న దాంట్లో కూడా ఒక దోషము ఉంది. మానవులు అనే బహువచన శబ్దం.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
07 Jan 2021
కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 154
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 84 🌻
తత్ త్వం - అనేటటువంటి పద్ధతిగా త్వం - తాను ఎలా ఉన్నాడు? తాను ఏ స్థితిలో ఉన్నాడు? తాను ఏ నిర్ణయంతో ఉన్నాడు? తాను ఏ లక్షణంతో ఉన్నాడు.
తాను ఏమి సాధించాలి? ఆ సాధించ వలసినటువంటి లక్ష్యాన్ని సంబంధించిన లక్షణాలు ఏమిటి? ఆ లక్షణాలను తాను పొందటం ఎలా? దీనికి అడ్డంగా వున్నటువంటివి ఏమిటి? అంటే ప్రవృత్తి, నివృత్తి. వాసనా నివృత్తి. నిర్వాసనా స్థితి. మరి వాసనాక్షయం అంటారు. మరి ఆ రకమైనటువంటి వృత్తులన్నీ, దశవిధ ప్రళయాలున్నాయి. ఈ ఎనిమిది శరీరాలలోనూ దశవిధ ప్రళయాలు జరుగుతూ ఉన్నాయి.
వృత్తి ప్రళయము, నిత్యప్రళయము, శరీర ప్రళయము, బ్రహ్మప్రళయము, విష్ణు ప్రళయము, రుద్ర ప్రళయము, మహేశ్వర ప్రళయము, సదా శివ ప్రళయము, విరాట్ పురుష ప్రళయము. ఈ రకంగా ఆ దశవిధ ప్రళయాలు జరుగుతూ వున్నాయి. అవి పుడుతూ ఉన్నాయి.
కొంతకాలము ఉంటూ ఉన్నాయి. మరల కొంతకాలము తరువాత లేకుండా పోతున్నాయి. ఈ రకంగా మరి పది జరగుతున్నాయి కదా! ఆయా వ్యవహార స్థితులలో మరి వాటయందు పుడుతూ వున్నాడు, పోషించబడుతున్నాడు మరలా లయించబడుతున్నాడు. కాబట్టి, జీవుడనేవాడు నిత్యప్రళయాన్ని అనుభవిస్తున్నాడు.
జాగ్రదావస్థలో ఉన్నట్లుగా తోస్తున్నాడు. స్వప్నావస్థలో ఉన్నట్లుగా తోస్తున్నాడు. సుషుప్తి అవస్థలో అడ్రస్ లేకుండా పోయినట్లు తోస్తున్నాడు. మరలా జాగ్రదావస్థకి తిరిగి వచ్చేసరికి, నేను ఉన్నాడంటున్నాడు. మరి ఏ నేను ఉంటున్నాడు? అన్న ప్రశ్నని వేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది.
ఈ రకంగా శరీర తాదాత్మ్యత చేత, వ్యవహార తాదాత్మ్యత చేత, వ్యావసాయిక తాదాత్మ్యత చేత, వృత్తి తాదాత్మ్యత చేత, ఈ తాదాత్మ్యత అనుబంధము చేత, సంగత్వ దోషము చేత, త్రిగుణాత్మకమైనటువంటి, ప్రకృతి మాలిన్యం యొక్క దోషం ఒప్పుకొనటం చేత, ఇన్ని రకాలైనటువంటి అంశాలని, తానే అనుకోవటం చేత, అఖండముగా ఉన్నటువంటి, తన స్వరూపమునందు ఘటము, మఠము, పటము... అనేటటువంటి భేదములు తోస్తున్నాయి. కారణమేమిటి? స్థూల సూక్ష్మ కారణ మహాకారణ దేహాదులు తోస్తున్నాయి.
దాని అర్థం ఏమిటి? ఉన్న ఆకాశం ఒక్కటే, కానీ.. ఓ కుండ వచ్చింది. ఆ కుండలో ఆకాశం మరల వేరే అనేటటువంటి భ్రాంతి కలిగింది. చిన్న కుండ, పెద్ద కుండ, ఇంకా పెద్దకుండ, ఇంకా పెద్ద కుండ.... ఘటం సైజు మారింది అంతే! ఘటం సైజు పెరిగినంత మాత్రాన ఆకాశంలో భేదమొచ్చిందా? అనే సత్యాన్ని మనం గుర్తించాలి.
అంటే, ఉదాహరణ చెబుతాను... ఇప్పుడే పుట్టిన పిల్లవాడున్నాడు. 90 ఏళ్ళ వృద్ధుడున్నాడు. ఇప్పుడే పుట్టిన పిల్లవాడిలోనూ, అవే సప్త ధాతువులే ఉన్నాయి. 90 ఏళ్ళ వృద్ధుడిలోనూ అవే సప్త ధాతువులే ఉన్నాయి. స్థూలంగా ఏ మార్పులేదు. పోనీ సూక్ష్మంగా ఉందందామా? అవే మనో బుద్ది ప్రాణములు.
ఆ ప్రాణ మనోబుద్ధులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు జన్మించిన శిశువులో, 90 ఏళ్ళ వృద్ధుడిలో కూడా ఆ ప్రాణమనోబుద్ధులే ఉన్నాయి. మరి ఇంకా పోనీ కారణ స్థితిలో తేడా ఉందందామా? ఇప్పుడు పుట్టిన పిల్లవాడు నిద్రావస్థలో ఎలా ఉన్నాడో, 90 ఏళ్ళ వృద్ధుడు కూడా నిద్ర అవస్థలో అలానే ఉన్నాడు.
మరి ఏమిటి మారింది అంటే, జ్ఞానాజ్ఞానముల యొక్క పరిణామము మారుచున్నది. ఇంకా ఏమీ మారటం లేదు. ఇప్పుడే పుట్టిన పిల్లవాడు, 90 ఏళ్ళ వృద్ధుడు ఒక్కటే అని తీర్మానం చేశామనుకో, అప్పుడేమయ్యింది? కుండను పెట్టి తీర్మానం చేసినట్లయ్యింది.
ఈ కుండలో ఉన్న ఆకాశం, ఆ కుండలో ఉన్న ఆకాశం... అంతా ఒక్కటే కదా! కాబట్టి, ఈ కుండ, ఆ కుండ ఒక్కటే. 90 ఏళ్ళ వృద్ధుడు, ఇప్పుడే పుట్టిన పిల్లవాడు ఒక్కటే అని చెప్పవచ్చునా? అంటే, ఆత్మ దృష్ట్యా ఒక్కటే! కానీ, అనాత్మ దృష్ట్యా అనేకంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు శరీర అభాస కలుగుతోంది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
06 Jan 2021
కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 153
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 83 🌻
కారణం ఏమిటి? అంటే ఈ విశ్వుడు అన్న సాక్షిత్వాన్ని జీవుడు సరిగ్గా సాధించలేదు కాబట్టి. కాబట్టి, ఈ ఎనిమిది శరీర అధిష్టాన స్థానములని ఏవైతే చెబుతున్నారో, ఆ అధిష్టాన స్థానములన్నీ కూడా సాక్షిత్వ సాధనలో పరిచయమయ్యేటటువంటి స్థితులు.
కాబట్టి, విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యగాత్మ, విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మలు అనేటటటువంటి ఎనిమిది సాక్షి స్వరూపాలు, పరమాత్మ అనేటటువంటి, సర్వసాక్షి స్వరూపములో అంశీభూతములు. అలా సాక్షి సాధన చేసేటటువంటి వారు మాత్రమే, ఈ ఎనిమిది అధిష్ఠాన కేంద్రాలను, ఎనిమిది అధిష్టాన స్థితులను తెలుసుకోగలుగుతారు.
అలా ఎనిమిది అధిష్టాన స్థితులను తెలుసుకోలేని వాళ్ళు, ఆ యా వ్యవహారమునే సత్యమనుకుంటారు. ఆయా శరీర వ్యాపారమునే సత్యమనుకుంటారు. ఉదాహరణ చెపుతా... ప్రతి ఒక్కరూ కలలు కంటూ ఉంటారు. కలలు కన్నప్పుడల్లా ఆయా కలలో అనేక రకములైనటువంటి సినిమాలు వస్తుంటాయి.
అవన్నీ తమ జీవితములో ఉన్నటువంటి, తానే నేర్పించినటువంటి, తానే నటించినటువంటి, తానే నర్తించినటువంటి, తానే పాటలు పాడినటువంటి, తానే ఫైటింగులు చేసినటువంటి... సినిమాలన్నమాట. అన్నీ ఆయనే ... కథ, రచయిత, మాటలు, పాటలు, దర్శకత్వం, ప్రొడక్షన్ అన్నీ ఆయనే.
మరి అతువంటి కల అనే సినిమాను ప్రతి రోజూ మానవుడు దర్శిస్తూనే వున్నాడు కాని ఏ తెరమీదైతే, ఈ కల అనే సినిమా జరుగుతుందో, ఆ తెర ప్రకాశించడానికి ఆధారభూతమైనటువంటి, ఆ ప్రకాశంలో మాత్రమే ఈ సినిమా కనబడుతోంది కదా. మరి ప్రకాశం ఆధారంగా కనబడుతున్న సినిమాని నేనా? ప్రకాశం నేనా? అనేటటుంవంటి విచారణ దృక్పథం... కలగడం లేదు.
ఏ రోజు సినిమా ఆ రోజు వస్తూనే ఉంటుంది. ఆ రోజు కలని ‘అనుభోక్తవ్యం’ అనుభవిస్తూనే ఉంటాడు. అందులో ఏర్పడుతున్నటువంటి సుఖదుఃఖాలని అనుభవిస్తూనే ఉంటాడు. అట్టి అనుభవరీత్యా మరలా కలలో కూడా అవే సుఖదుఃఖాలు ఏర్పడుతూనే ఉన్నాయి.
మరి ఇలలోనూ సుఖదుఃఖాలు ఏర్పడుతూ ఉన్నాయి. లేదంటే మిశ్రితంగా ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే కలలో కూడా సుఖదుఃఖాలు మిశ్రితముగా ఏర్పడుతున్నాయి. కాబట్టి, కర్మఫలము త్రివిధములుగా ఉన్నది. అయితే సుఖము, లేకపోతే దుఃఖము, లేక పోతే మిశ్రితము.
మరి ఈ రకంగా ఏర్పడుతున్నటువంటి దానిలోనుంచి ఏట్లా బయట పడాలంటే, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అనేటటుంవంటి శ్లోకం పురుషోత్తమ ప్రాప్తి యోగం (భగవద్గీత) లో ఉంది. అధ్యాత్మ - ఆత్మ వస్తువును నిత్యమైన వస్తువుగా గుర్తించి విచారణ చేసేటటువంటి దృక్పథాన్ని మానవుడు అభ్యాసం చేయాలి. తత్త్వజ్ఞానార్థ దర్శనం - ఈ అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అనేది ఎక్కడికి దారితీయాలటా? తత్త్వ జ్ఞానార్థ దర్శనం.- విద్యా సాగర్ గారు
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
05 Jan 2021
కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 152
🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 152 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 82 🌻
పంచదార తెల్లగానే ఉంది, ఉప్పు తెల్లగానే ఉంది. ఈ రెండిటిని కలిపేశాము. ఇప్పుడు ఈ రెండిటిని వేరు చేయాలంటే ఎలాగా? రెండూ నీళ్ళల్లో కరిగిపోతాయి. మరి ఎట్లా వేరు చేయాలి? అని ఆలోచన చేస్తే, దానికో ఉపమానం చెప్పారు.
అంటే సాధకుడు చీమలాగా, ఆ పంచదారను ఉప్పు కలిసినటువంటిది తీసుకొచ్చి, చీమల ముందు పోసినట్లైతే, చీమ ఏం చేస్తుంది? ఉప్పు అంతా వదిలేసి, పంచదార పట్టుకెళ్ళిపోతుంది. ఎందుకంటే, దానికి స్పష్టంగా తెలుసు, ఉప్పేదో, పంచదార ఏదో...! అట్లాగే, ఈ ఆత్మ-అనాత్మ రెండూ ఒక్కచోటే ఉన్నాయి.
కానీ, మనిషి మాత్రం ఏమైపోతున్నాడంటే, కలగాపులగంగా అయిపోయి, అనాత్మను ఆశ్రయించి, ఆత్మ వస్తువును గుర్తించ లేకుండా ఉన్నాడు. కారణం ఏమిటి అంటే శరీర అధ్యాస. దీనిని ఏమన్నారు అంటే శరీర అధ్యాస.
ఎప్పటికప్పుడు శరీర అధ్యాసని పొందుతున్నాడు. ఏ స్థితిలో ఉంటే, ఆ స్థితికి సంబంధించినటువంటి శరీర అధ్యాసను పొందుతున్నాడు. అందుకని, ఇక్కడ ఎనిమిది శరీరాల యొక్క ప్రతిపాదన చేశారు. పరిణామ క్రమంలో మానవుడు తన వివేక స్థాయిలో ఎనిమిది శరీర భ్రాంతులను పొందుచున్నాడు.
ఎనిమిది అధ్యాసలను పొందుచున్నాడు. జాగ్రదావస్థలో జగత్తుతో తాదాత్మ్యత చెంది, జగత్తును భోగ్యవస్తుగా చూచి భోగ్య పదార్దముల యందు, శబ్దాది విషయములయందు ఆసక్తి కలిగి వ్యవహారశీలియై, వ్యవహారమే సత్యమనుకుంటూ, వ్యవహారం లేనిదే తాను లేనని, తన ఉనికిని, వ్యవహారశీలమైనటువంటి వజగత్ వస్తుభ్రాంతితో ముడిపడి, తాను ఏమయ్యాడు అంటే, ఆభాస రూపుడైనటువంటి జీవుడయ్యాడు, ప్రతిబింబరూపుడైనటువంటి జీవుడయ్యాడు.
అయితే ఈ జగత్ వ్యాపారము నంతటిని సాక్షిగా చూస్తున్నటువంటి వాడెవడో, వాడు విశ్వుడు. ఇదే జీవుడు ఈ శరీరము నుంచి తప్పుకోగానే, ఈ శరీరము ఎందుకు కొరగానిది అవుతోంది. ఈ శరీరము నిరుపయోగము అవుతోంది. ఈ శరీరము నిష్ప్రయోజనము అవుతోంది.
ఈ శరీరాన్ని పంచభూతాత్మకమైనటువంటి దేహం కాబట్టి, ఆ పంచభూతాలలోనే మరల కలిపేసే ప్రయత్నం చేస్తున్నారు. దహనం చేసో, ఖననం చేసో, ఏదో ఒక రూపంలో ఈ దేహాన్ని ఏ పంచభూతాలనుంచైతే ఇది ఉత్పన్నమైందో, మరల అదే పంచభూతాలలో కలిసిపోవడానికి మార్గం సుగమం చేస్తున్నారు.
మరి, తరలిపోయిన జీవుడు ఏమయ్యాడయ్యా? తరలి పోయిన జీవుడు తన కర్మఫల విశేషం చేత, తన కర్మల బరువు చేత, తాను చేసుకున్నటువంటి ద్వంద్వాది రూప, విహిత కర్మ, అవిహిత కర్మల చేత, పుణ్యపాపముల చేత, ఏ సుఖదుఃఖాది మిశ్రిత కర్మ చేత, కర్మల సంచిని మోసుకొంటూ మరొక దేహానికి తరలి వెళ్ళిపోయాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
04 Jan 2021
కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 151
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 81 🌻
దైవం బింబము, జీవుడు ప్రతిబింబము. ఈశ్వరుడు బింబము, జీవుడు ప్రతిబింబము. కాబట్టి ప్రతిబింబాన్ని బాధిస్తే ప్రయోజనం లేదు కదా! కాబట్టి భౌతికంగా, స్థూలంగా ఉన్నటువంటి దాని యందు నువ్వు ఎంత ప్రభావశీలంగా ఉన్నప్పటికీ సూక్ష్మమైన, అతి సూక్ష్మమైన, సూక్ష్మతరమైన, సూక్ష్మతమమై,
ఈ భౌతికతలో గ్రాహ్యము కానటువంటి స్థితిలో ఉన్నటువంటి శబ్ద, రూప, గుణ రహితమైనటువంటి, ఆధారభూతమైనటువంటి, సర్వాధిష్టానమైనటువంటి, సర్వులకు ఆశ్రయమైనటువంటి ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో, ఏ పరమాత్మ స్థితి అయితే ఉన్నదో దానిని ఈ ఆంతరిక యజ్ఞ పద్ధతిగా, జ్ఞానయజ్ఞ పద్ధతిగా, తనను తాను లేకుండా చేసుకునే పద్ధతిగా, తనను తాను పోగొట్టుకునేటటువంటి పద్ధతిలో ‘నాహం’ గా మారేటటువంటి పద్ధతిగానే దీనిని తెలుసుకోవాలి.
అలా కాకుండా జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే, జగత్తు వేరే అనేటటువంటి ద్వైత పద్ధతిని ఆశ్రయించినట్లైతే, ఈశ్వరుడు, జీవుడు, జగత్తు అనే త్రయంలో చిక్కుకున్నవాడవై మరల జనన మరణ రూప భ్రాంతి కలుగుతుంది. సదా జనన మరణ చక్రంలోనే పరిభ్రమిస్తూఉంటావు. కాబట్టి ఈ ద్వైత భ్రాంతిని విడువాలి. కాబట్టి పంచ భ్రమలలో మొట్టమొదటి భ్రమ అయినట్టి “జీవేశ్వరో భిన్నః”- జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే అనే భ్రాంతిని వదలమని ఉపదేశిస్తూ ఉన్నారు. నీ శరీరమందును, నా శరీరమందును, అన్య శరీరములయందును ఏ చైతన్యము సాక్షి రూపముగా నున్నదో, ఆ చైతన్యమే విరాట్ శరీరమందును సాక్షి రూపముగా ఉన్నది.
ఇచ్చట వ్యష్టి స్థూల, సూక్ష్మ, కారణ దేహములందు ఏ ప్రత్యగాత్మ విశ్వ తైజస ప్రాజ్ఞ రూపముగా ఉన్నదో, అచట సమిష్టి స్థూల సూక్ష్మ కారణ దేహములందు ఏ పరమాత్మ, విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత రూపముగా ఉన్నదో, అదియు, ఇదియు ఒక్కటే. అనగా పరబ్రహ్మమే భేదము లేదు. అఖండ ఆకాశమునందు భేదము లేనప్పటికి, ఘటము, మఠము, మొదలగు ఉపాధుల చేత భేదము పొందినట్లు, కన్పించుచున్నట్లుగా ఈ అఖండ చైతన్యము, ఉపాధులు మూలముగా భేదము పొందినట్లు కనిపించుచున్నది.
వాస్తవమున భేదము లేకపోయినప్పటికి, ఈ లోకమందు అజ్ఞానులు ఆత్మధర్మమును, అనాత్మయగు శరీరధర్మములందు చూచి, ఆత్మను అనేకముగా తలంచుచున్నారు. ఎవరు ఈ విధముగా ఆత్మను అనేకముగా చూచుచున్నారో వారు మృత్యువు నుండి మృత్యువును పొందుచున్నారు. సర్వ భేద రహితమైనటువంటి అద్వితీయ బ్రహ్మమును ఎఱిగిన వారు, అమృతత్వమును పొందుచున్నారు.)
చాలా ముఖ్యమైనటువంటి అంశాలను ఇక్కడ మనకు అందించే ప్రయత్నము చేస్తున్నారు. దీనినే ఆత్మానాత్మ వివేకము అంటారు. ఏక స్వరూపము ఆత్మ. అనేక స్వరూపము అనాత్మ. ఇది ప్రాథమికమైనటువంటి లక్షణము. ఏదైనా ఒక అంశాన్ని మనం విచారించాలంటే, ఇది ఏకత్వములోకి తీసుకువెళ్తుందా? అనేకత్వములోకి తీసుకు వెళ్తుందా? అనేటటువంటి విచారణని చేయాలి.
ఎప్పుడైతే అది అనేకత్వ స్థితికి దారి తీస్తుందో లేదా అనేకత్వం అనే లక్షణంతో ప్రకాశిస్తోందో, భాసిస్తోందో, లేదు ఆభాసగా ఉన్నదో, అప్పుడు అదంతా అనాత్మ. ఈ ఆత్మానాత్మ విచారణ మానవులందరూ తప్పక చేయాలి. సాధకులు ముఖ్యంగా చేయాలి. సాధన చతుష్టయ సంపత్తి కలవారు, నిరంతరాయంగా ఈ ఆత్మానాత్మ విచారణ చేయాలి. చేసి ఆత్మ వస్తువును ఆశ్రయించాలి.
అనాత్మ వస్తువును త్యజించాలి. ఈ లోకములో రెండు లక్షణములతో వస్తువులు ప్రకాశిస్తున్నాయి. వస్తువులకు ఉనికి ఉన్నది. ఒకటేమో ఆత్మ వస్తువు. రెండవది అనాత్మ వస్తువు. మరి రెండూ ఒకచోటే ఉన్నాయి. వింతైన విషయమేమింటంటే, రెండూ వేరువేరుగా వేర్వేరు ప్రదేశాలలో ఉంటే, సులభంగా గుర్తించవచ్చు. కానీ రెండు వస్తువులు ఒక్కచోటే ఉన్నాయి. దీనికొక ఉదాహరణ చూద్దాము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
03 Jan 2021
Subscribe to:
Posts (Atom)



















