26వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 26th Pasuram - Tiruppavai Bhavartha Gita


https://youtu.be/gDrt2Ul-CXg

🌹 26వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 26th Pasuram - Tiruppavai Bhavartha Gita 🌹

🍀 వటపత్రశాయి అనుగ్రహ యాచన గీతం. 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ

🍀 26వ పాశురంలో, గోపికలు, ఇంద్రనీలమణి వలె మెరిసి పోతున్న ఆ వటపత్రశాయిని తమ వ్రతానికి కావలసిన వస్తువులు అడుగుతూ, మాధవుని నిత్య సన్నిధిని ప్రసాదించమని అర్ధిస్తున్నారు. 🍀

తప్పకుండా వీక్షించండి



Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


జాతీయ గృహ మొక్కల దినోత్సవం శుభాకాంక్షలు Happy National Houseplant Day!



https://youtube.com/shorts/f9zphOS-1-s


🌹 జాతీయ గృహ మొక్కల దినోత్సవం శుభాకాంక్షలు అందరికి 🌹
🍀 ఇంట్లో పెంచుకునే మొక్కల ప్రాముఖ్యతను తెలియజేసే రోజు 🍀
ప్రసాద్ భరద్వాజ

🌹 Happy National Houseplant Day to everyone 🌹
🍀 A day to highlight the importance of houseplants 🍀
Prasad Bhardwaj



🌹 జాతీయ గృహ మొక్కల దినోత్సవం - National House Plants Day ఇంట్లో పెంచుకునే మొక్కల ప్రాముఖ్యతను తెలియజేసే రోజు 🌹


ప్రసాద్‌ భరధ్వాజ



తప్పకుండా వీక్షించండి

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


కాలభైరవ అష్టమి శుభాకాంక్షలు Happy Kala Bhairava Ashtami



https://youtube.com/shorts/h6HZ47fxCn4


🌹 కాలభైరవ అష్టమి శుభాకాంక్షలు అందరికి

Happy Kala Bhairava Ashtami to all 🌹


ప్రసాద్‌ భరధ్వాజ

Prasad Bharadwaj




తప్పకుండా వీక్షించండి

Like, Subscribe and Share


🌹🌹🌹🌹🌹


కుమ్మరంకాయ గురించి సంప్రదాయం Tradition about Pumpkin



🌹 ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం, ప్రయాణానికి ముందు వాహనం వద్ద కొట్టడం అనే సాంప్రదాయం వెనుక ఉన్న అసలు రహస్యం తెలుసా? 🌹
✍️ ప్రసాద్‌ భరధ్వాజ

🌹 Do you know the real secret behind the tradition of hanging a pumpkin in front of the house and breaking one near the vehicle before a journey? 🌹
✍️ Prasad Bharadwaj




భారతీయ సంస్కృతిలో ప్రతి ఆచారానికి ఒక లోతైన అర్థం ఉంటుంది. కొత్త ఇల్లు కట్టినా, పండుగలు వచ్చినా లేదా కొత్త వ్యాపారం ప్రారంభించినా.. ప్రయాణాల సమయంలో, ఇలా అనేక సందర్భాలలో, ఇంటి సింహద్వారం ముందు గుమ్మడికాయను వేలాడదీయడం, దిష్టి తీయడం, పగలగొట్డం వంటివి అనేకం మనం చూస్తుంటాం.

కేవలం దిష్టి తగలకుండా ఉండటానికే కాకుండా దీని వెనుక ఆసక్తికరమైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. గుమ్మడికాయను కూష్మాండం అంటారు. తనలో అనంతశక్తిని కలిగి ఉన్న పదార్ధము అని, ఎంతటి శక్తినైనా తనలో ఉంచుకోగల పదార్ధము అని దాని అర్ధం. ఐశ్వర్యానికి కూష్మాండ దీపం అని వెలిగిస్తారు. పితృకార్యాలు చేసేడప్పుడు గుమ్మడికాయతో పులుసు పెడతారు. గాలీ ధూళీ సోకినప్పుడు గుమ్మడికాయతో దిష్టి తీస్తారు. ఇలా గుమ్మడికాయను మన భారతీయ ఋషులు నిత్యజీవితంలో అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉపయోగించడానిన తెలియజేసారు.


దుష్ట శక్తులకు విరుగుడు..

శాస్త్రాల ప్రకారం గుమ్మడికాయను కూష్మాండం అని పిలుస్తారు. గుమ్మడికాయకు గాలిలోని ప్రతికూల తరంగాలను లేదా ఇతరుల అసూయ, ద్వేషం వంటి దృష్టి దోషాలను గ్రహించే శక్తి ఉందని నమ్ముతారు. ఇది సాత్విక గుణాన్ని కలిగి ఉండి, ఇంటికి శుభ సంకేతాలను, సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది.


జంతు బలికి ప్రత్యామ్నాయంగా..

పురాతన కాలంలో గ్రామ దేవతలకు లేదా శక్తి స్వరూపిణికి జంతువులను బలి ఇచ్చే ఆచారం ఉండేది. అయితే హింసను నివారించే ఉద్దేశంతో శాంతియుత మార్గంగా గుమ్మడికాయను బలి ఇవ్వడం ప్రారంభించారు. గుమ్మడికాయను పగలగొట్టి దానికి కుంకుమ పూయడం వల్ల వచ్చే ఎరుపు రంగును రక్తంగా భావించి, దుష్ట శక్తులను శాంతింప జేయడానికి దీనిని ఉపయోగిస్తారు.


శాస్త్రీయ కోణం ఏంటి?
ఆధ్యాత్మికతతో పాటు దీని వెనుక ఒక శాస్త్రీయ కోణం కూడా ఉందని కొందరి నమ్మకం.
బ్యాక్టీరియా నివారణ: గుమ్మడికాయలోని కొన్ని సహజ గుణాలు గాలిలోని బ్యాక్టీరియాను, క్రిములను గ్రహించడంలో సహాయపడతాయని చెబుతారు.


ప్రమాదాల నివారణ...

దూర కాల ప్రయాణాలు చేసే సందర్భంలో, గుమ్మడికాయతో దిష్టి తీయడం, వాహనం ముందు గుమ్మడికాయను పగలగొట్టడం కూడా ఒక సాంప్రదాయ విధానం. వాహనం ముందు గుమ్మడికాయను పగలగొట్టి నప్పుడు దాని నుండి వెలువడే శక్తి తరంగాలు, పరిసరాలను, మన మెదడును ప్రభావితం చేస్తాయి. అది మనల్ని చురుగ్గా వుండేలా చేయడంతో ప్రమాదాల బారిన పడకుండా వుంటామనే నమ్మకం. అయితే పగలగొట్టినప్పుడు అది రోడ్డుపై లేదా నడిచే దారిలో ముక్కలుగా మారుతుంది. వీటిపై ఎవరైనా జారిపడే అవకాశం ఉన్నందున, దృష్టి తీసిన తర్వాత వాటిని పక్కన పడేయడం లేదా శుభ్రం చేయడం బాధ్యతగా కూడా భావించాలి.

కొబ్బరికాయతో మొదలై.. గుమ్మడికాయతో ముగింపు - హిందూ సంప్రదాయంలో ఏదైనా శుభకార్యం కొబ్బరికాయ కొట్టడంతో ప్రారంభమైతే దృష్టిని తొలగించి గుమ్మడికాయ కొట్టడంతో ముగుస్తుంది. ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని ప్రజల బలమైన నమ్మకం.
🌹🌹🌹🌹🌹