1) 🌹 27, OCTOBER 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 448 / Bhagavad-Gita - 448 🌹
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 34 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 34 🌴
🌹. శ్రీ శివ మహా పురాణము - 804 / Sri Siva Maha Purana - 804 🌹
🌻. పాతివ్రత్య భంగము - 2 / Outraging the modesty of Vṛndā - 2 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 61 / Osho Daily Meditations - 61 🌹
🍀 61. మరణం / 61. DEATH 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 495 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 495 - 4 🌹
🌻 495. 'మణిపూరాబ్జ నిలయా' - 4 / 495. Manipurabja - 4 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 27, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*
*🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 14 🍀*
*25. అయుద్ధా యుద్ధరూపా చ శాంతా శాంతిస్వరూపిణీ ।*
*గంగా సరస్వతీవేణీయమునానర్మదాపగా ॥*
*26. సముద్రవసనావాసా బ్రహ్మాండశ్రోణిమేఖలా ।*
*పంచవక్త్రా దశభుజా శుద్ధస్ఫటికసన్నిభా ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : ఖాళీ నిశ్చలత - మనస్సుకు చేకూరిన నిశ్చలత మొదట్లో కొంతకాలం వట్టి ఖాళీ నిశ్చలతగా వున్నా ఫరవాలేదు. చేతన ఒక విధమైన పాత్రవంటిది. అండలి పనికి రాని కల్తీ పదార్థాలను ఖాళీ చేసి తిరిగి మంచి పదార్థాలతో నింపేవరకూ దానిని ఖాళీగానే ఆట్టే పెట్టడం అవసరం. అయితే అట్టి ఖాళీ మనస్సును తిరిగి వెనుకటి కల్తీ సరుకుతోనే నింపకుండా మాత్రం జాగ్రత్త పడాలి. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
ఆశ్వీయుజ మాసం
తిథి: శుక్ల త్రయోదశి 06:58:29 వరకు
తదుపరి శుక్ల చతుర్దశి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 09:25:20
వరకు తదుపరి రేవతి
యోగం: హర్షణ 26:01:09 వరకు
తదుపరి వజ్ర
కరణం: తైతిల 06:57:29 వరకు
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 08:31:24 - 09:17:43
మరియు 12:23:00 - 13:09:19
రాహు కాలం: 10:33:00 - 11:59:51
గుళిక కాలం: 07:39:18 - 09:06:09
యమ గండం: 14:53:33 - 16:20:24
అభిజిత్ ముహూర్తం: 11:36 - 12:22
అమృత కాలం: 05:01:24 - 06:29:16
సూర్యోదయం: 06:12:27
సూర్యాస్తమయం: 17:47:15
చంద్రోదయం: 16:45:36
చంద్రాస్తమయం: 04:28:39
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: ధ్వజ యోగం - కార్య సిధ్ధి
09:25:20 వరకు తదుపరి శ్రీవత్స
యోగం - ధన లాభం , సర్వ సౌఖ్యం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 448 / Bhagavad-Gita - 448 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 34 🌴*
*34. ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ |*
*మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్టా యుధ్యస్య జేతాసి రణే సపత్నాన్ ||*
*🌷. తాత్పర్యం : ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇతర మహా యోధులందరును నాచే ఇదివరకే చంపబడిరి. కావున నీవు వారిని సంహరింపుము. ఏ మాత్రము వ్యథనొందక కేవలము యుద్ధము నొనరింపుము. నీవు తప్పక నీ శత్రువులను రణమున నశింపజేయగలవు.*
*🌷. భాష్యము : ప్రతిప్రణాళికయు దేవదేవుని చేతనే నిర్వహింపబడుచుండును. కాని భక్తుల యెడ అరమ కరుణామయుడైన అతడు తన కోరిక ననుసరించి స్వీయప్రణాళికలను అమలరుపరచు భక్తుల కార్యసాఫల్య ప్రతిష్టను ఒసగగోరును. కనక గురుముఖముగా కృష్ణభక్తిభావన యందు వర్తించుచు ఆ దేవదేవుని అవగతము చేసికొనునట్లుగా ప్రతియొక్కరు జీవితమును మలచుకొనవలెను. శ్రీకృష్ణభగవానుని సంకల్పము అతని కరుణ తోడనే తెలియుటకు సాధ్యమగును. భక్తుల సంకల్పములు సైతము ఆ దేవదేవుని సంకల్పముతో సమానముగా ఉత్తమములై యుండును. కనుక మనుజుడు వాటిని అనుసరించి జీవనసమరమున జయమును పొందవలెను.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 448 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 34 🌴*
*34. droṇaṁ ca bhīṣmaṁ ca jayadrathaṁ ca karṇaṁ tathānyān api yodha-vīrān*
*mayā hatāṁs tvaṁ jahi mā vyathiṣṭhā yudhyasva jetāsi raṇe sapatnān*
*🌷 Translation : Droṇa, Bhīṣma, Jayadratha, Karṇa and the other great warriors have already been destroyed by Me. Therefore, kill them and do not be disturbed. Simply fight, and you will vanquish your enemies in battle.*
*🌹 Purport : Every plan is made by the Supreme Personality of Godhead, but He is so kind and merciful to His devotees that He wants to give the credit to His devotees who carry out His plan according to His desire. Life should therefore move in such a way that everyone acts in Kṛṣṇa consciousness and understands the Supreme Personality of Godhead through the medium of a spiritual master. The plans of the Supreme Personality of Godhead are understood by His mercy, and the plans of the devotees are as good as His plans. One should follow such plans and be victorious in the struggle for existence.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 804 / Sri Siva Maha Purana - 804 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 23 🌴*
*🌻. పాతివ్రత్య భంగము - 2 🌻*
*అది చెడు శకునమని గుర్తించి ఆమె భయభీతురాలై ఏడుస్తూ గోపురములయందు, ప్రాసాద ఉపరి-భాగమునందు, మరియు ఇతర స్థలములలో ఎక్కడైననూ సుఖమును పొందలేకపోయెను (9). అపుడా యువతి ఇద్దరు సఖురాండ్రతో గూడి నగరోద్యానవనమునకు వచ్చెను. ఆమె అక్కడ విహరించియు ఏ స్థలమునందైననూ సుఖమును పొందలేదు (10) అపుడా జలంధరుని భార్య నిరాశతో ఉద్వేగముతో నిండిన మనస్సు గలదై తనకు తెలియకుండగనే ఆ వనములో ఒక భాగమునుండి మరియొక భాగమునకు తిరుగజొచ్చెను (11). అట్లు తిరుగాడుచున్న ఆ సుందరి అతిభయంకరాకారులు, సింహముఖము గలవారు, కోరలతో ప్రకాశించువారు అగు ఇద్దరు రాక్షసులను చూచెను (12).*
*ఆమె వారిని చూచి చాల భయపడి పారిపోతూ, శిష్యులతో గూడి శాంతముగా మౌనముగా కూర్చుండియున్న తపస్వని ఒకనిని గాంచెను (13). ఆమె భయముతో తన లతవంటి బాహువును ఆతని కంఠము చుట్టూ వేసి 'ఓ మునీ! నిన్ను శరణు పొందినాను; నన్ను రక్షింపుము' అని పలికెను (14). రాక్షసులచే తరుమబడి మిక్కిలి భయపడియున్న ఆమెను గాంచి అపుడా ముని వెంటనే హుంకారమాత్రముచే ఆ భయంకర రాక్షసులు పారిపోవునట్లు చేసెను (15). వారిద్దరు ఆతని హుంకారమునకు భయపడి వెనుకకు మరలుటను గాంచి ఆ జలంధరపత్ని మనస్సులో మిక్కిలి ఆశ్చర్యమును పొందెను. ఓ మునీ! (16) అపుడా బృంద తొలగిన భయము గలదై ఆ ముని వర్యునకు సాష్టాంగ ప్రణామమాచరించి చేతులు జోడించి ఇట్లు పలికెను (17).*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 804 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 23 🌴*
*🌻 Outraging the modesty of Vṛndā - 2 🌻*
9. On realising that it was a bad portent, the terrified lady began to cry. She did not feel happy at all in the spacious terraces and towers of the palace.
10. With two of her friends she then went to the park in the city. Even there she did not find herself at ease.
11. Then she, the dejected gloomy wife of Jalandhara, wandered from forest to forest. She was not conscious of even herself.
12. The wandering lady saw two demons of terrible leonine faces with shining curved fanglike teeth.
13. Terrified much on seeing them, the lady fled from there and saw an ascetic of calm countenance observing silence and accompanied by his disciple.
14. Putting her tender creeperlike hands round his neck due to fright she gasped out—“O sage, save me. I have sought refuge in you.”
15. Seeing the agitated lady followed by the demons the sage drove them back with a loud bellowing sound of “Hum”.
16. O sage, seeing them routed and terrified by the mere Huṃkāra, the wife of the king of Daityas was struck with a great wonder in her heart.
17. Freed from the fear she bowed down to the great sage with palms joined in reverence and prostrated herself in front of him. Vṛndā then spoke.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 61 / Osho Daily Meditations - 61 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 61. మరణం 🍀*
*🕉. మరణంలో తప్పు లేదు. అది జరిగినప్పుడల్లా, అది గొప్ప విశ్రాంతి. 🕉*
*మీ శరీరం పూర్తిగా కృశించినప్పుడు, మరణం మాత్రమే అవసరం. అప్పుడు అది జరుగుతుంది; అప్పుడు మీరు మరొక శరీరంలోకి వెళతారు. మీరు చెట్టు లేదా పక్షి లేదా పులి లేదా మరేదైనా కావచ్చు మరియు మీరు కదులుతూనే ఉంటారు. పాతది కృశించి పోయినప్పుడు ఉనికి మీకు కొత్త శరీరాన్ని ఇస్తుంది. మరణం చాలా అందంగా ఉంటుంది, కానీ దాని కోసం ఎప్పుడూ అడగవద్దు, ఎందుకంటే మీరు దానిని కోరినప్పుడు, మరణం యొక్క నాణ్యత ఆత్మహత్య వైపు మారుతుంది. అప్పుడు అది సహజ మరణం కాదు. మీరు ఆత్మహత్య చేసుకోకపోవచ్చు, కానీ అడగడం మిమ్మల్ని ఆత్మహత్యకు గురి చేస్తుంది. సజీవంగా ఉన్నప్పుడు, సజీవంగా ఉండండి; చనిపోయినప్పుడు, అతను చనిపోయాడు. కానీ విషయాలను అతివ్యాప్తి చేయవద్దు.*
*చనిపోతున్నప్పడు కూడా బతుకును అంటి పెట్టుకుని ఉండేవారు ఉన్నారు. అది తప్పు. మృత్యువు వచ్చినప్పుడు వెళ్ళాలి, నృత్యం చెయ్యాలి. ఒక వేళ మీరు సజీవంగా ఉన్నప్పుడు, మీరు మరణాన్ని గురించే ఆలోచిస్తూ ఉంటే, మరణం యొక్క ఆలోచనను కలిగి ఉంటే, మీరు సజీవంగా వున్నా కూడా మీరు మరణం వైపు వెళుతున్నట్లే. దానికి విరుద్ధంగా ఒకవేళ చనిపోతున్నప్పుడు కూడా జీవితాన్ని అంటిపెట్టుకునే ఉండాలనే ఆలోచన కలిగి ఉండే వ్యక్తి చనిపోవాలని కోరుకోవడం లేదు అని అర్ధం. ఎవరైనా సజీవంగా ఉన్నప్పుడు చనిపోవాలి అని కోరుకుంటుంటే, అది అంగీకారం కాదు. ఉన్న దానిని అంగీకరించండి మరియు మీరు షరతులు లేకుండా అంగీకరించిన తర్వాత, ప్రతిదీ అందంగా ఉంటుంది. నొప్పి కూడా 'శుద్దీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి మీ మార్గంలో ఏది వచ్చినా, కృతజ్ఞతతో ఉండండి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 61 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 61. DEATH 🍀*
*🕉 Nothing is wrong in death. Whenever it happens, it is a great rest. 🕉*
*When your body is completely spent, death is the only thing needed. Then it happens; then you move into another body. You may become a tree or a bird or a tiger or something else, and you go on moving. The existence gives you a new body when the old is spent. Death is beautiful, but never ask for it, because when you ask for it, the quality of death changes toward suicide. Then it is no longer a natural death. You may not be committing suicide, but the very asking makes you suicidal. When alive, be alive; when dead, he dead. But don't overlap things.*
*There are people who are dying and who go on clinging to life. That too is wrong, because when death has come, you have to go, and you have to go dancing. If you are asking for death, even thinking about it, then you are alive and clinging to the idea of death. It is the same in the reverse direction. Somebody who is dying and goes on clinging to life, does not want to die. Somebody is alive and wants to die: That is non-acceptance. Accept whatever is there, and once you accept unconditionally, then everything is beautiful. Even pain has 'a purifying effect. So whatever comes on your way, just be thankful.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 495 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 495 - 4 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 102. మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా ।*
*వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా ॥ 102 ॥ 🍀*
*🌻 495. 'మణిపూరాబ్జ నిలయా' - 4 🌻*
*అంతరంగ జీవనము అక్షరము. అది నశింపనిది. జీవుడు తానక్షరుడుగ నిలచి దైవారాధన చేయుచున్నప్పుడు దైవసాన్నిధ్యము తనయందు పూర్ణముగ నిండును. చిల్లులేని కుండ నిండునట్లు పూర్ణముగ నుండును. అటుపైన సాన్నిధ్యము పెంపొందుచుండగ పరిపూర్ణమగుచు పొంగి పొరలును. అపుడు బహిర్ ఆనందము కూడ కలుగును. మానవునికి అక్షరాభ్యాస క్రతువు ఐదవ సంవత్సరముననే నిర్వర్తింతురు. ఈ సంస్కారము పొందిన మానవుడు క్షర విద్యతోపాటు అక్షర విద్యను కూడ అభ్యసింపవలెను.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 495 - 4 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻102. Manipurabja nilaya vadanatraya sanyuta
vajradikayudhopeta dayaryadibhiravruta ॥ 102 ॥ 🌻*
*🌻 495. Manipurabja - 4 🌻*
*Inner life is eternal. It is indestructible. When a living being as an eternal one, worships God, the closeness of God is completely filled in him. It is full like a pot without a hole. As the intimacy grows, the layers become perfect and overflow. Then there will be external happiness too. Aksharabhyasa is done in the fifth year for a person. A person who has received this rite should go through the superficial education as well as the eternal education.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj