🌹 15, OCTOBER 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹

🍀🌹 15, OCTOBER 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 15, OCTOBER 2023 SUNDAY ఆదివారం, భాను వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
🌹. శరన్నవ రాత్రి శుభాకాంక్షలు అందరికి. Devi Navarti Good Wishes to All. 🌹
🍀. దేవీ నవరాత్రులు - నవ దుర్గల విశిష్టత 🍀
🌹. శ్రీ దుర్గా నవరాత్రి వ్రతం - సాధనాపర విశిష్టత 🌹
🍀. దేవీ నవరాత్రులు - నవదుర్గల అలంకారం, రంగు, నైవేద్యం 🍀
*🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు - 1. శైలపుత్రి - బాలా త్రిపుర సుందరి. / Worship Maa Shailputri on the first day of Navaratri 🌹*
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 442 / Bhagavad-Gita - 442 🌹
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 28 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 28 🌴
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 485 - 494 - 8 / Sri Lalitha Chaitanya Vijnanam - 485 - 494 - 8 🌹 
🌻 485 నుండి 494వ నామము వరకు వివరణము - 8 / Description of Nos. 485 to 494 Names - 8 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 15, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
🍀. శరన్నవ రాత్రులు ఆరంభం శుభాకాంక్షలు అందరికి, Devi Navratri Begining Good Wishes to All. 🍀*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : శరన్నవ రాత్రులు ఆరంభం, కలశస్థాపన, శైలపుత్రి - బాలా త్రిపుర సుందరి పూజ, Navratri Begins, Ghatasthapana, Sailaputri - Bala tripura Sundari Pooja, 🌻*

 *🌷. 1. శైలపుత్రి ప్రార్ధనా శ్లోకము :*
*వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరామ్ ।*
*వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ॥*

*🌷. 1. బాలా త్రిపుర సుందరి స్తోత్రము :*
*కదంబ వనచారిణీం ముని కదంబ కాదంబినీం*
*నితంబ జిత భూధారం సురనితంబిని సేవితాం*
*నవంబురుహ లోచనం అభినవాంబుదా శ్యామాలాం*
*త్రిలోచన కుటుంబనీం త్రిపుర సుందరీ మాశ్రయే*

*🌷. అలంకారము - నివేదనం :*
*బాలా త్రిపుర సుందరి - నీలి రంగు, ఉప్పు పొంగలి*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : నేర్చుకోవలసిన మొదటి పాఠం - జీవితాన్నీ, అందలి కష్టాలనూ సహనంతో దృఢంగా ఎదుర్కోగల ధీరత్వం లేనివాడు సాధన పథంలో అంతకంటే గురుతరమైన ఆంతరంగిక కష్టాలను ఎన్నటికీ ఎదుర్కొనజాలడు. ఈశ్వరునిపై భారం వేసి, ఆచంచలమైన చిత్తంతో, ధైర్యంగా జీవిత కష్టాల నెదుర్కోడమే సాధనలో నేర్చుకొన వలసిన మొదటి పాఠం.🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
ఆశ్వీజ మాసం
తిథి: శుక్ల పాడ్యమి 24:33:40 వరకు
తదుపరి శుక్ల విదియ
నక్షత్రం: చిత్ర 18:13:32 వరకు
తదుపరి స్వాతి
యోగం: వైధృతి 10:23:08 వరకు
తదుపరి వషకుంభ
కరణం: కింస్తుఘ్న 12:00:02 వరకు
వర్జ్యం: 01:01:00 - 02:44:12
మరియు 24:08:22 - 25:49:54
దుర్ముహూర్తం: 16:20:34 - 17:07:37
రాహు కాలం: 16:26:27 - 17:54:40
గుళిక కాలం: 14:58:14 - 16:26:27
యమ గండం: 12:01:48 - 13:30:01
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:24
అమృత కాలం: 11:20:12 - 13:03:24
సూర్యోదయం: 06:08:57
సూర్యాస్తమయం: 17:54:40
చంద్రోదయం: 06:27:04
చంద్రాస్తమయం: 18:19:05
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: పద్మ యోగం - ఐశ్వర్య
ప్రాప్తి 18:13:32 వరకు తదుపరి
లంబ యోగం - చికాకులు, అపశకునం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శరన్నవ రాత్రి శుభాకాంక్షలు అందరికి. Devi Navarti Good Wishes to All. 
🙏. ప్రసాద్‌ భరధ్వాజ

*15-10-2023 to 24-10-2023*

*🍀. దేవీ నవరాత్రులు - నవ దుర్గల విశిష్టత 🍀*

*నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం నవరూప ధరాం శక్తిం, నవదుర్గాముపాశ్రయే*

*నవరాత్రులలో ఆరాధింప దగినది, (శ్రీ చక్రం లోని) నవచక్రాలలో నివసించేది, శక్తి రూపిణి, అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను.*

*ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ | సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః | ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||*

*దుర్గా మాత ముఖ్యమైన అవతారాలు మూడు. మాహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి. వీరు శ్రీమహావిష్ణువు, పరబ్రహ్మ, పరమశివుని అర్ధాంగినులుగా మనకు తెలుసు. వీరిలో ఒక్కొక్కరూ తిరిగి 3 అవతారాలు పొందారు. ఆ విధంగా నవదుర్గలుగా ప్రసిద్ధి చెందారు.*

*🌻 1. శైలపుత్రి :- బాలా త్రిపుర సుందరి*
*నవదుర్గలలో ప్రధమమైన శైలపుత్రి హిమవంతుని పుత్రిక. ఈమెయే వెనుకజన్మలో దక్షప్రజాపతి కుమార్తె సతి. హిమవంతుడు పర్వతరాజు. కనుక ఈమెకు శైలపుత్రి అనే పేరు కలిగింది. ఈమె వాహనం నంది. ఒక చేతిలో త్రిశూలం రెండో చేతిలో కలువ, నుదుటిన చంద్ర వంక ధరించిన ఈమె మహిమలు అపారం. నవరాత్రి సంధర్భంగా మొదటిరోజున ఈమె పూజ జరుగుతుంది.*

*🌻 2. బ్రహ్మచారిణి :- గాయత్రీ దేవి*
*దుర్గామాత అవతారాలలో రెండవది అయిన బ్రహ్మచారిణి, తపస్సుకు ప్రతీక. ఇక్కడ బ్రహ్మ అనే పదానికి తపస్సు అని అర్థం. వేదము, తత్వము, తపము అనే పదాలు బ్రహ్మ అనే పదానికి పర్యాయ పదాలుగా వాడుతారు. ఒక చేతిలో కమండలము, మరొక చేతిలో తులసి మాల ధరించే ఈమెను సకల సౌభాగ్యదాయనిగా పూజిస్తారు.*

*🌻 3. చంద్రఘంట :- అన్నపూర్ణ దేవి*
*దుర్గామాత మూడవ అవతారమైన చంద్రఘంట మాత శిరసున అర్ధచంద్రుడిని గంటరూపంలో ధరించింది. అందువలననే ఆమెకి ఈ నామధేయం కలిగింది. సింహవాహిని ఐన ఈమె బంగారు దేహఛాయ కలిగి, పది హస్తాలతో ఉంటుంది. ఈమె పది హస్తాలలో శంఖ, ఖడ్గ, గద, కమండలము, విల్లు, కమలం మొదలైనవి కలిగి చూడటానికి ఎంతో మనోహరంగా ఉంటుంది.*

*🌻 4. కూష్మాండ :- శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి*
*సూర్యలోక నివాసిని అయిన కూష్మాండదేవి, సూర్యకాంతిని పోలిన దేహఛాయతో ఉంటుంది. ఈమె దేహఛ్ఛయతో దశ దిశంతాలు వెలుగు పొందుతాయి. సింహవాహిని ఐన ఈ దేవికి ఎనిమిది హస్తములలో కమండలము, విల్లు, అమ్ము, కమలము, అమృతభాండము, చక్రము, త్రిశులము, జపమాల ఉంటాయి.*

*🌻 5. స్కందమాత :- సరస్వతీదేవి*
*కుమారస్వామి లేక స్కందుని తల్లి అయిన స్కందమాత మహాదుర్గ ఐదవ అవతారం. చతుర్భుజి ఐన ఈ మాత రెండు చేతులలో కమలములనూ కుడి హస్తమందు స్కందుని ధరించి అభయ హస్తి అయి దర్శనమిస్తుంది. ఈమె పద్మములో కూర్చొని ఉండటం చేత పద్మాసన అనే నామధేయం కూడా ఉంది.*

🌻 6. కాత్యాయని :- మహాలక్ష్మి దేవి*
*దుర్గామాత ఆరవ అవతారమైన కాత్యాయనిమాతను సకల వరప్రదాయనిగా పూజిస్తారు. శ్రీకృష్ణుని భర్తగా పొందటానికి గోపికలు ఈమెనే ఆరాధించారు. బంగారు మేనిఛాయతో, అత్యంత ప్రకాశవంతమైన ఈమెకు నాలుగు హస్తములు. ఒక చేత కత్తి, రెండవ చేత కమలం, మిగిలిన రెండుచేతులలో అభయప్రదాన ముద్రలో ఉంటుంది. ఈమె వాహనం సింహం.*

*🌻 7. కాళరాత్రి :- దుర్గాదేవి*
*దుర్గమాత ఏడవ అవతారం కాళరాత్రి. ఈమె శరీరఛాయ చిమ్మచీకటిలా నల్లగా ఉంటుంది. చెదరిన జుట్టుతో, మెడలో వాసుకొనిన మాల మెరుపులు చిందిస్తూ ఉంటుంది. ఈమెకు మూడు కళ్ళు. ఈమె ఉచ్వాస నిశ్వాసలు అగ్నిని విరజిమ్ముతుంటాయి. ఈమెకు నాలుగు హస్తములు. కుడి రెండు హస్తములలో ఒకటి అభయాన్ని, రెండవది భాయాలని పారదోలేవిగా ఉంటాయి. ఎడమచేతిలో ఒక చిన్న కత్తి, ఇనుముతోచేసిన రంపంలాంటి అయుధం ఉంటుంది. ఈమె వాహనం గాడిద. ఈమె రూపం ఉగ్రమే ఐనా ఈమెని పూజించిన వారికి అన్ని శుభములని కూరుస్తుంది కనుక ఈమెనే శుభంకరి అని కూడా పిలుస్తారు.*

*🌻 8. మహాగౌరి :- మహిషాసురమర్ధిని దేవి*
దుర్గామాత అష్టమ అవతారం మహాగౌరి. ఈమె చంద్రునిపోలిన మేనిఛాయతో ఉంటుంది. ఈమె పార్వతి రూపంలో ఉన్నప్పుడు, శివునికోసం మహాతపస్సు చేసింది. అప్పుడు ఆమె శరీరఛ్ఛాయ నల్లగా మారిపోయింది. అది గమనించిన మహాశివుడు స్వయంగా ఆమెను పవిత్ర గంగాజలాలతో కడగగా ఆమెకు ఆ మేనిఛ్ఛాయ కలిగిందని ఒక కథ. సర్వకాల సర్వావస్తలలో ఈమెను ఎనిమిది ఏళ్ళ బాలికగానే పూజిస్తారు. అత్యంత ప్రశాంతమైన స్వరూపం కలిగిన ఈమెకు నాలుగు చేతులు. రెండు చేతులలో త్రిశులం, దమరుకము ధరించి మిగిలన రెండుచేతులతో వర, అభయ ముద్రలతో దర్శనమిస్తుంది. ఈమె వాహనం నంది.*

*🌻 9. సిద్ధిదాత్రి :- రాజరాజేశ్వరీ దేవి*
దుర్గాదేవి ఆఖరి అవతారమైన ఈమె భక్తులకు అష్టసిద్దులను (అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఇసిత్వ, మరియు వాసిత్వ అనేవి అష్టసిద్ధులు) ప్రసాదించగలిగే దేవత. కమలంలో కూర్చునే ఈ దేవత వాహనం సింహం. నాలుగు హస్తాలలో శంఖ, చక్ర, గదా, పద్మాలతో విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తుంది.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ దుర్గా నవరాత్రి వ్రతం - సాధనాపర విశిష్టత 🌹*
*📚 . ప్రసాద్ భరద్వాజ*

*ప్రకృతిలోని చైతన్యశక్తి. ప్రకృతి స్వరూపాల నన్నింటినీ జీవుడు తన మనస్సులో లయం చేసి, ఒకే ఒక చైతన్య పర తత్త్వ శక్తియందు నిలిపితే జన్మసాఫల్యాన్ని పొందుతాడు. తనలో ఉండే ఆ చైతన్య శక్తి సర్వజీవులయందు ఉంటుందనే సత్యాన్ని గుర్తించి, చైతన్యాద్వైత శక్తిని అర్థం చేసికొంటే దివ్యానుభూతిని పొందుతాడు.*

*‘‘సర్వరోగోపశమనం సర్వోపద్రవ నాశనం శాన్తిదం సర్వారిష్టానాం నవరాత్ర వ్రతం శుభమ్’’*

*సర్వ రోగములను, సర్వ ఉపద్రవములను పోగొట్టి, సర్వారిష్టాల్ని పారద్రోలి సుఖశాంతుల్ని కటాక్షించేది- నవరాత్రి వ్రతం అని పేర్కొన్నది స్కాంధ పురాణం.*

*‘నవ’ అంటే తొమ్మిదని, క్రొత్త అని సామాన్యార్థాలు. కానీ, నవ అంటే పరమేశ్వరుడని, ‘రాత్రి’ అంటే పరమేశ్వరి అని నిర్ణయ సింధువు తెలుపుతోంది.*

*కనుక, నవరాత్రి వ్రతమంటే- పార్వతీ పరమేశ్వరుల, శివశక్తుల, ప్రకృతీ పురుషుల ఆరాధన లేక వ్రతము, పూజ అని అర్థము. నవరాత్రి వ్రతమంటే తొమ్మిది రాత్రులు చేయు వ్రతమని చెపుతారు. ‘‘సూయతే స్తూయతే ఇతి నవః’’ అనగా నవ శబ్దమునకు స్తుతిం పబడుచున్నవాడని అర్థము. పరమాత్మ ‘నవ’ స్వరూపుడు. శబ్దరూపమైన వేదం- ప్రకృష్టమైన ‘నవ్య స్వరూపం’. అదే ప్రణవ స్వరూపం. ‘‘నవో నవో భవతి జాయ మానః’’ పరమాత్మ నిత్య నూతనుడు. అందరి చేత స్తోత్రింపబడుచున్నవాడు. శివశక్తులకు భేదం లేదు. అం దుకే జగన్మాతకు ‘శివా’ అనే నామం కూడా ఉంది.*

*జగజ్జనని- ‘రాత్రి’ రూపిణి. పరమేశ్వరుడు-ప గలు. జగన్మాత ఆరాధనే- రాత్రి వ్రతం. రాత్రి దేవియే- మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి వంటి రూపనామములతో పూజింపబడుతోంది. అందుకే మాతకు ‘కాళరాత్రి’ అని పేరు. నవ అహోరాత్ర దీక్షగా రాత్రి, పగలు తొమ్మిది రోజులు చేస్తారు. ‘రాత్రి శబ్దస్య తిథి వాచకత్వాత్’ అనే దాన్ని బట్టి రాత్రి అనగా తిథి అని అర్థము తీసికొని తొమ్మిది తిథులు అనగా పాడ్యమి మొదలు నవమి వరకు శ్రీదేవికి పూజ చేస్తారు.*

*‘పాడ్యమి’ అంటే ‘బుద్ధి’ అని చెప్పబడింది. మనుష్యుల బుద్ధియే శారదాదేవి. పాడ్యమి నుండి శారదా దేవిని ఆరాధిస్తే మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది. సర్వ శుభములను చేకూర్చుతుంది. మనలో ఉన్న ఉత్సాహాన్ని పైకి వ్యక్తీకరించటమే ‘ఉత్సవం’ అంటారు. ఇది పెద్ద ఉత్సవం- మహోత్సవం. ఇది- దేవీ శరన్నవరాత్రి పూజా మహోత్సవాల అంతరార్థం.*
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🍀. దేవీ నవరాత్రులు - నవదుర్గల అలంకారం, రంగు, నైవేద్యం 🍀*
✍. ప్రసాద్ భరద్వాజ 

*1. శైలపుత్రి :- బాలా త్రిపుర సుందరి - గులాబీ రంగు*
*నైవేద్యం : పులిహోర, కట్టు పొంగలి*

*2. బ్రహ్మచారిణి :- గాయత్రీ దేవి - కాషాయం లేదా నారింజ రంగు*
*నైవేద్యం : కొబ్బరి అన్నం, పాయసాన్నం*

*3. చంద్రఘంట :- అన్నపూర్ణ దేవి - పసుపు రంగు.* *నైవేద్యం : క్షీరాన్నం, దద్దోజనం, గారెలు*

*4. కూష్మాండ :- శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి -కుంకుమ రంగు.*
*నైవేద్యం : దద్దోజనం, క్షీరాన్నం*

*5. స్కందమాత :- సరస్వతీదేవి - తెలుపు రంగు.*
*నైవేద్యం : కేసరి, పరమాన్నం, దద్దోజనం*

*6. కాత్యాయని :- మహాలక్ష్మి దేవి - గులాబీ రంగు.*
*నైవేద్యం : చక్కెర పొంగలి, క్షీరాన్నం*

*7. కాళరాత్రి :- దుర్గాదేవి - ఎరుపు రంగు.*
*నైవేద్యం : కదంబం, శాకాన్నం*

*8. మహాగౌరి :- మహిషాసురమర్ధిని దేవి - ముదురు ఎరుపు రంగు.*
*నైవేద్యం : చక్కెర పొంగలి*

*9. సిద్ధిదాత్రి :- రాజరాజేశ్వరీ దేవి - ఆకుపచ్చ రంగు.* *నైవేద్యం : పులిహోర, లడ్డూలు, బూరెలు, గారెలు, అన్నం*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు - 1. శైలపుత్రి - బాలా త్రిపుర సుందరి. / Worship Maa Shailputri on the first day of Navaratri 🌹*
*📚 . ప్రసాద్ భరద్వాజ*

 *🌷. 1. శైలపుత్రి ప్రార్ధనా శ్లోకము :*
*వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరామ్ ।*
*వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ॥*

*🌷. 1. బాలా త్రిపుర సుందరి స్తోత్రము :*
*కదంబ వనచారిణీం ముని కదంబ కాదంబినీం*
*నితంబ జిత భూధారం సురనితంబిని సేవితాం*
*నవంబురుహ లోచనం అభినవాంబుదా శ్యామాలాం*
*త్రిలోచన కుటుంబనీం త్రిపుర సుందరీ మాశ్రయే*

*🌷. అలంకారము - నివేదనం :*
*బాలా త్రిపుర సుందరి - నీలి రంగు - పులిహోర, కట్టు పొంగలి*

*🌷. మహిమ :*
*కుడిచేతిలో త్రిశూలాన్ని, వామహస్తంలో పద్మాన్ని, వృషభవాహినిగా అవతరించిన శైలపుత్రిని స్మరించినంతనే, శ్రవణం చేసినంత మాత్రాన విజయోత్సాహం కలుగుతుంది.*

*దుర్గామాత మొదటి స్వరూపము ‘శైలపుత్రి’ నామముతో ప్రసిద్ధికెక్కినది. పర్వత రాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందున ఆమెకు ‘శైలపుత్రి’ అనే నామము ఏర్పడినది.
 వృషభవాహననారూఢయైన ఈ మాత కుడి చేతిలో త్రిశూలమూ, ఎడమచేతిలో కమలమూ విరాజిల్లుతుంటాయి. ఈ అవతారమే నవదుర్గలలో మొదటిది.*

*నవదుర్గలలో మొదటి అవతారమైన ‘శైలపుత్రి’ యొక్క మహిమలూ, శక్తులూ అనంతములు. మొదటి రోజున యోగులు ఉపాసన ద్వారా తమ మనస్సులను మూలాధార చక్రంలో స్థిరపరుచుకుంటారు. దీనితోనే వారి యోగ సాధనలు ఆరంభమవుతాయి.*

*🌷. చరిత్ర :*
*పూర్వజన్మలో ఈమె దక్ష ప్రజాపతికి పుత్రిక – దాక్షాయని. అ జన్మలో ఈమె పేరు సతీదేవి. ఈమె పరమేశ్వరుని పరిణయమాడినది. ఒకసారి దక్షుడొక మహాయజ్ఞమును ఆచరిస్తాడు. దేవతలు తమతమ యజ్ఞభాగములను స్వీకరించటానికై దక్షుడు వారిని ఆహ్వానిస్తాడు. కానీ పరమశివుని మాత్రము ఆ యజ్ఞానికి పిలువడు. తన తండ్రి ఒక మహాయజ్ఞమును సంకల్పించిన విషయం ఆమెకు తెలుస్తుంది. ఆ యజ్ఞాన్ని వీక్షించటానికై ఆమె మసస్సు ఉబలాటపడుతుంది. అప్పుడు ఆమె పరమేశ్వరునికి తన కోరికను తెలియజేస్తుంది. బాగా ఆలోచించి పరమేశ్వరుడు “కారణము ఏమోగానీ, దక్షుడు మనపై కినుకుబూనినాడు. అతడు తన యజ్ఞమునకు దేవతలందరినీ ఆహ్వానించినాడు. యజ్ఞభాగములనుగూడ వారికి సమర్పించుచున్నాడు. కానీ ఉద్దేశ్యపూర్వకముగానే మనలను పిలువలేదు. కనీసము సమాచారమునైననూ తెలుపలేదు. ఇట్టి పరిస్థితిలో నీవు అచటికి వెళ్ళుట ఏ విధముగను మంచిదిగాదు” అని హితవు బోధించారు. శంకరుని ఈ హితవచనము ఆమె చెవికెక్కలేదు. ఈ యజ్ఞమిషతోనైనా అక్కడికి వెళ్ళి తన తల్లినీ, తోబుట్టువులనూ చూడవచ్చునన్న కోరిక ప్రబలంగా ఉండటంతో అనుమతికై ఆమె పట్టుబడుతుంది. ఆమె పట్టుదలను చూసి, చివరకు శంకరుడు అనుమతిస్తారు.*

*సతీదేవి తన తండ్రియింటికి చేరినప్పుడు అక్కడివారెవ్వరూ ఆమెతో మాట్లాడరు, ఆదరించరు. అందరూ ముఖాలను పక్కకు తిప్పుకొంటారు. తల్లి మాత్రము ఆమెను ప్రేమతో కౌగిలించుకొంటుంది. తోబుట్టువుల పలుకులలో వ్యంగ్యం, పరిహాసమూ నిండి ఉంటాయి. తనవారి ప్రవర్తనకు ఆమె మనస్సు కలత చెందుతుంది. అందరిలోనూ శంకరుని పట్ల నిరాదరణభావమే ఉండటం ఆమె గమనిస్తుంది. తండ్రియైన దక్షుడు ఆమెతో అవమానకరంగా మాట్లాడతాడు. ఇదంతా అనుభవించిన పిమ్మట, సతీదేవి హృదయము క్షోభతో, గ్లానితో, క్రోధముతో ఉడికిపోతుంది. ‘పరమేశ్వరుని మాటను పాటింపక నేను ఇచ్చటికివచ్చి పెద్ద పొరబాటే చేసితిని‘ అని ఆమె భావిస్తుంది.*

*తన పతియైన పరమేశ్వరునికి జరిగిన ఈ అవమానమును ఆమె సహించలేక పోతుంది. వెంటనే ఆమె తన రూపమును అక్కడికక్కడే యోగాగ్నిలో భస్మము గావిస్తుంది. భరింపలేని ఈ దారుణదుఃఖకరమైన సంఘటనను గురించి విని, పరమశివుడు మిక్కిలి క్రోధితుడవుతాడు. ఆయన తన ప్రమథగణాలను పంపి దక్షుని యజ్ఞాన్ని పూర్తిగా ద్వంసం చేయిస్తారు.*

*సతీదేవి యోగాగ్నిలో తన తనువును చాలించి, మరుజన్మలో శైలరాజైన హిమవంతునికి పుత్రికగా అవతరిస్తుంది. అప్పుడామె ‘శైలపుత్రి’గా ప్రసిద్ధికెక్కుతుంది. పార్వతి, హైమవతి అన్నవి కూడా ఆమె పేర్లే. ఉపనిషత్తులోని ఒక కథను అనుసరించి, ఆమె హైమవతీ రూపంలో దేవతల గర్వాన్ని ఆణచివేస్తుంది.*

*‘శైలపుత్రి’ అవతారములో ఆమె పరమేశ్వరుణ్ణే పరిణయమాడుతుంది. పూర్వజన్మలో లాగానే ఈ అవతారంలో కూడా శంకరునికి ‘అర్ధాంగి’ అవుతుంది.*

*నవరాత్రి ఉత్సవములలో మొదటిరోజున ఈ దేవికై పూజలూ, ఉపవాసాలూ జరుపబడుతాయి.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Worship Maa Shailputri on the first day of Navaratri 🌹*

*One of all nine forms of Devi Durga is worshipped every day in Navaratri. The first form of Maa Durga is Shailputri, who was born to the King of Mountains. "Shail" means mountain and "putri" means daughter. Hence, she is called Shailputri - the daughter of mountain. Maa Shailputri, an absolute form of Mother Nature, is worshipped on the first day of Navratri. She is also referred to as Goddess Parvati, the consort of Lord Shiva and mother of Lord Ganesha and Kartikeya. The image of Maa Shailputri is a divine lady, holding a trishul in her right hand and lotus flower in her left hand. She rides on Nandi, a bull.*

*Maa Shailputri is the goddess of the muladhara chakra or root chakra, and upon awakening this Shakti one begins their journey to spiritual awakening and to their purpose in life. Without energising the muladhara chakra one doesn't have the power and strength to do anything worthwhile. It is said that one should worship Maa Shailputri to make full use of the precious human life. Therefore, this Avtar of Goddess Durga is worshipped on the first day of Navratri.*

*Navratri is a special occasion. A time for new beginnings and offering your dedication and reverence to the Goddess Shakti.*

*🍀. The Mantra And Other Facts About Maa Shailputri:*

*Maa Shailputri Dhyan:*
*Vande Vanchhit Laabhaya Chandrardha Krita Shekharaam Vrisharudham Shooladharam Shailputrim Yashasvinim.*

*Maa Shailputri Mantra for the first day of Navratri:* *Om Sham Shailputraye Namah. (Chant 108 times).*
*Colour of the first day: Grey or light Blue.*
*Prasad of the first day: Banana and Ghee made from cow milk & Crystal Sugar.*

*Jai Mata Di !*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 442 / Bhagavad-Gita - 442 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 28 🌴*

*28. నభ:స్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్ |*
*దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాన్తరాత్మా ధృతిం న విన్దామి శమం చ విష్ణో ||*

*🌷. తాత్పర్యం : అనేక నదీ ప్రవాహాలు సముద్రంవైపు వేగంగా పరుగెత్తుతున్నట్లే ఈ పరలోక వీరులంతా ప్రజ్వలిస్తున్న నీ ముఖంలో ప్రవేశిస్తున్నారు.*

*🌷. భాష్యము : యుద్ధ రంగంలో ఏంతో మంది ఉత్తమ రాజులు మరియు యోధులు ఉన్నారు. వారందరూ అది తమ కర్తవ్యముగా పరిగణించి యుద్ధంలో పోరాడారు మరియు యుద్ధరంగంలో తమ ప్రాణములను విడిచి పెట్టారు. అర్జునుడు వారిని నదులు తమకుతామే వచ్చి సముద్రములో కలిసిపోవటంతో పోల్చుతున్నాడు. ఇంకా చాలామంది ఇతరులు స్వార్థం కోసం మరియు దురాశతో యుద్ధ రంగానికి వచ్చారు. అర్జునుడు వారిని, అమాయకత్వంతో ఎర చూపబడి, అగ్నిలో పడి కాలిపోయే పురుగులతో పోల్చుతున్నాడు. ఈ రెంటిలో కూడా, ఆసన్నమైన మృత్యువు వైపు, వారు వడివడిగా పరుగులు పెడుతున్నారు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 442 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 28 🌴*

*28. yathā nadīnāṁ bahavo ’mbu-vegāḥ samudram evābhimukhā dravanti*
*tathā tavāmī nara-loka-vīrā viśanti vaktrāṇy abhivijvalanti*

*🌷 Translation : As the many waves of the rivers flow into the ocean, so do all these great warriors enter blazing into Your mouths.*

*🌹 Purport : There were many noble kings and warriors in the war, who fought as their duty and laid down their lives on the battlefield. Arjun compares them to river waves willingly merging into the ocean. There were also many others, who fought out of greed and self-interest. Arjun compares them with moths being lured ignorantly into the incinerating fire. But in both cases, they are marching rapidly toward their imminent death.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 485 - 494 - 8 / Sri Lalitha Chaitanya Vijnanam  - 490 - 494 - 8 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  100. అనాహతాబ్జ నిలయా, శ్యామాభా, వదనద్వయా ।*
*దంష్ట్రోజ్జ్వలా, అక్షమాలాధిధరా, రుధిర సంస్థితా ॥ 100 ॥ 🍀*
*🍀  101. కాళరాత్ర్యాది శక్త్యోఘవృతా, స్నిగ్ధౌదనప్రియా ।*
*మహావీరేంద్ర వరదా, రాకిణ్యంబా స్వరూపిణీ ॥ 101 ॥ 🍀*

*🌻 485 నుండి 494వ నామము వరకు వివరణము - 8 🌻*

*షట్చక్ర నిరూపణమున ఈమెను కాకినీ శక్తి అని పిలుచుటలో అంతరార్థ అనాహత మందలి శ్రీమాతకు నేతి అన్నము ఎక్కువ ప్రీతి కలిగించును. ఆర్ష సంప్రదాయము ననుసరించు వారు తప్పక నేతి అన్నము భుజింతురు. నేయి తినకూడదన్న నేటి వైద్యుల వాదనము వారు మౌనముగ తోసిపుచ్చుదురు. మొదటి వేడి అన్నము ముద్దలో నేయి వేసుకొని తినుట సంప్రదాయము. దీని వలన హృదయమునకు మేలే కలుగును కాని కీడు కలుగదు. మహా వీరులకు వరముల నిచ్చునది శ్రీమాత అగుటచే 'మహా వీరేంద్ర వరదా' అని కీర్తింపబడుచున్నది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 485 to 494 - 8 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻100. Anahatabjanilaya shyamabha vadanadvaya*
*danshtrojvalakshamaladi dhara rudhira sansdhita॥ 100 ॥ 🌻*
*🌻101. Kalaratryadishaktyao-ghavruta snigdhao-dana priya*
*mahavirendra varada rakinyanba svarupini  ॥ 101 ॥ 🌻*

*🌻 Description of Nos. 485 to 494 Names - 8 🌻*

*According to Shatchakra proof, in calling her Kakini Shakti, ghee rice is more pleasing to Srimata. Those who follow the tradition of Arsha mandatorily eat ghee rice. They silently reject today's doctor's claim that ghee should not be eaten. It is traditional to eat the first hot rice with ghee mixed in it. This is good for the heart but not harmful. As Srimata is the giver of boons to great heroes she is glorified as 'Maha Virendra Varada'.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj