శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 3 / Sri Devi Mahatyam - Durga Saptasati - 3

🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 3 / Sri Devi Mahatyam - Durga Saptasati - 3 🌹

✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 1

🌻. మధు కైటభుల వధ వర్ణనము - 3 🌻

రాజు పలికెను : భగవాన్! మిమ్మల్ని నొకటి అడగాలని అనుకుంటున్నాను. దయచేసి దానికి బదులివ్వండి. (39–40)

నా మనస్సు నా చిత్రానికి అధీనంకాక దుఃఖవశమై ఉంది. నేను రాజ్యాన్ని కోల్పోయి, అజుని వలె - నాకది తెలిసుండి - రాజ్యాంగాల అన్నింటిపై నాకు మమత్వం నిలిచి ఉంది, మునిసత్తమా! ఇది ఎలా? ఇతడు కూడా భార్యాపుత్ర భృత్యజనంచేత, స్వజనంచేత తిరస్కృతుడై విడనాడబడి, వారిపై అత్యంత ప్రేమ కలిగి ఉన్నాడు.

ఇలా ఇతడూ, నేనూ, విషయంలో దోషాలను చూస్తూనే, మమత్వం చేత వాటివైపుకు ఆకర్షించబడి అత్యంత దుఃఖితులమై ఉన్నాము. ఓ నిర్మలచిత్తుడా ! తెలిసినవారమైన నాకు, ఇతనికి ఈ మోహం కలిగిందే! మా వివేకాన్ని పోగొట్టి మూఢులను చేసిందే! ఇది ఎలా? (39–45)

ఋషి పలికెను : ఇంద్రియగోచరమైన విషయజ్ఞానం సమస్త జంతువులకు ఉంది. ఇంద్రియ విషయాలు వేర్వేరు విధాలుగా వాటికి తెలియవచ్చు. కొన్ని ప్రాణులు పగటిపూట చూడలేవు, మరి కొన్ని ప్రాణులు రాత్రిపూట చూడలేవు. మరి కొన్ని రేయుంబగళ్లు సమంగా చూడగలపు.

మనుషులు జ్ఞాసం కలిగి ఉండడం నిజమేగాని అది కేవలం వారికి మాత్రమే ఉండేది కాదు. పశుపక్షి మృగాదులకు కూడా (ఇంద్రియవిషయ) జ్ఞానం ఉంది. మనుష్యులకు గల జ్ఞానం మృగపక్షులకు కూడా ఉంది, వానికి గల జ్ఞానం మనుష్యులకు కూడా ఉంది.

తక్కినది (నిద్రాభోజనాదికము) రెండుజాతులకూ సమమై ఉన్నది. ఆ పక్షులవంక చూడు. వాటికి జ్ఞానం ఉండి కూడా, తాము ఆకలిచే పీడింపబడుతూ, మోహవశులై, తమ పిల్లల ముక్కులలో (నోళ్లలో) ధాన్యకణాలను (గింజలను) వేస్తున్నాయి. (46–51)

ఓ మనుజవ్యాఘ్ర (శ్రేష్ఠ)! ప్రత్యుపకారం కలుగగలదనే ఆశతో మానవులు తమ బిడ్డలయెడ అభిలాష కలిగివుంటారు. నీకు ఇది కనిపించడం లేదా? అయినప్పటికీ సంసార స్థితికారిణి అయిన మహామాయ యొక్క ప్రభావంచేత వారు (మానవులు) మమత అనే సుడిగుండంలోకి, మోహం అనే గుంటలోకి కూలద్రోయబడుతున్నారు.

దీనికి ఆశ్చర్యపోవద్దు, ఈ మహామాయ జగత్పతియైన విష్ణుదేవుని యోగనిద్ర . ఆమె చేతనే జగత్తు సమ్మోహితమవుతున్నది. ఆ దేవి, ఆ భగవతి, ఆ మహామాయ జ్ఞానుల మనస్సులను కూడా ప్రబలంగా ఆకర్షించి మోహగ్రస్తులుగా చేస్తుంది సుమా! (52-55)

ఈ చరాచరరూప జగత్తునంతా ఆమెయే సృజిస్తోంది. ఆమె అనుగ్రహిస్తే నరులకు ముక్తినొసగే వరదాయిని. ఆమె పరావిద్య, ముక్తి హేతువు, సనాతనీ, సంసారబంధానికి కూడా ఆమెయే హేతువు. ఈశ్వరులనందరినీ పరిపాలించు పరమేశ్వరి ఆమెయే. (56–58)

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹   Sri Devi Mahatyam - Durga Saptasati - 3   🌹

✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj

Chapter 1
🌻 Description of Killing of Madhu and Kaidabha - 3
🌻

39-45. 'Sir, I wish to ask you one thing. Be pleased to reply to it. Without the control of my intellect, my mind is afflicted with sorrow. Though I have lost the kingdom, like an ignorant man- though I know it- I have an attachment to all the paraphernalia of my kingdom.

How is this, O best of sages? And this merchant has been disowned by this children, wife and servants, and forsaken by his own people; still he is inordinately affectionate towards them.

Thus both he and I, drawn by attachment towards objects whose defects we do know, are exceedingly unhappy. How this happens, then, sir, that though we are aware of it, this delusion comes? This delusion besets me as well as him, blinded as we are in respect of discrimination.' The Rishi said:

46-49. Sir, every being has the knowledge of objects perceivable by the senses. And object of sense reaches it in various ways. Some beings are blind by day, and others are blind by night; some beings have equal sight both by day and night.

Human beings are certainly endowed with knowledge, but they are not the only beings ( to be so endowed), for cattle, birds, animals and other creatures also cognize (objects of senses).

50-58. The knowledge that men have, birds and beasts too have; and what they have men also possess; and the rest (like eating and sleeping) is common to both of them.

Look at these birds, which though they possess knowledge, and are themselves distressed by hunger are yet, because of the delusion, engaged in dropping grains into the beaks of their young ones. Human beings are, O tiger among men, attached to their children because of greed for return help.

Do you not see this? Even so men are hurled into the whirlpool of attachment, the pit of delusion, through the power of Mahamaya ( the Great Illusion), who makes the existence of the world possible. Marvel not at this. this Mahamaya is the Yoganidra, of Vishnu, the Lord of the world. It is by her the world is deluded. Verily she, the Bhagavati, the Mahamaya forcibly drawing the minds of even the wise, throws them into delusion.

She creates this entire universe, both moving and unmoving. It is she who, when propitious, becomes a boon-giver to human beings for their final liberation. She is the supreme knowledge, the cause of final liberation, and eternal; she is the cause of the bondage of transmigration and the sovereign over all lords. The king said:

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #దేవీమహత్యము #DeviMahatyam

11 Oct 2020

శ్రీ శివ మహా పురాణము - 245

🌹 . శ్రీ శివ మహా పురాణము - 245 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

55. అధ్యాయము - 10

🌻. బ్రహ్మకు జ్ఞనోదయమగుట - 3 🌻

విష్ణువు ఇట్లు పలికెను -

హే బ్రహ్మన్‌ ! మనమిద్దరము శంకరుని సంకల్పముచే జన్మించిన సమయములో ఆయనను మనము ప్రార్థించగా, మనలను ఉద్దేశించి ఆయన అపుడు చెప్పిన పలుకులను గుర్తుకు తెచ్చుకొనుము (48).

నీవా వృత్తాంతమునంతనూ మరచితివి. శాంభవీ పరాదేవి ధన్యురాలు. ఆమె చే జగత్తు సర్వము మోహింపబడినది. శివుడు తక్క ఇతరులు ఆమెను ఎరుంగజాలరు (49).

శివుడు తన ఇచ్ఛచే నిర్గుణ స్వరూపము నుండి సగుణుడై నన్ను సృష్టించి, ఆ తరువాత నిన్ను సృష్టించెను. ఆయన తన శక్తితో లీలలను సృష్టించును (50).

అపుడు శంభుప్రభువపు నిన్ను సృష్టిని చేయుమని ఆదేశించెను. హే బ్రహ్మన్‌! దాని పాలనను నాకు అప్ప జెప్పెను. నాశరహితుడు ఉమా సహితుడునగు శివుడే వాస్తవముగా జగత్కారణమగును (51).

అపుడు మనిమిద్దరము దోసిలి యొగ్గి, సాష్టాంగ ప్రణామమును చేసి, మనస్థానములకు వచ్చితిమి. సర్వేశ్వరుడవగు నీవు కూడా గుణ సంహితుడవై రూపమును స్వీకరించి అవతరించుము (52).

అని మనము కోరగా, కరుణామయుడు అనేక లీలలను సృష్టించుటలో నిపుణుడు అగు ఆ ప్రభువు నవ్వి, ఆకాశము కేసి చూచి మిక్కిలి ప్రీతితో నిట్లనెను (53).

హే విష్ణో! నా శ్రేష్ఠమగు రూపము, నన్ను పోలిన రూపము, బ్రహ్మదేహమునుండి ప్రకటమై లోకములో రుద్రుడను పేర కీర్తింపబడును (54).

ఆ రుద్రుడు నా పూర్ణావతారము. మీరు ఆయనను సర్వదా పూజించుడు. ఆయన మీ కోర్కెలనన్నిటినీ ఈడేర్చును. త్రిగుణసాక్షి, నిర్గుణుడు, గొప్ప యోగమునకు ప్రవర్తకుడునగు ఆ రుద్రుడు లయమును చేయగలడు (55).

ఈ త్రిమూర్తులు నాకుమారులు. వారు నా స్వరూపమే రుద్రుడు విశేషించి నా పూర్ణాంశ గలవాడు. ఉమాదేవికి కూడ మూడు రూపములు ఉండగలవు (56).

ఆమె లక్ష్మి అను పేరుతో విష్ణువునకు భార్య యగును. సరస్వతి అను పేరుతో బ్రహ్మకు పత్నియగును. ఆమె పూర్ణరూపముతో సతియను పేరుగలదై రుద్రునకు భార్య కాగలదు (57).

మహేశ్వరుడు దయతో ఇట్లు పలికి అంతర్ధానమయ్యెను. మనము మనకు అప్పిగించబడిన కార్యముల యందు నిమగ్నులమై సుఖముగా నుంటిమి (58).

హే బ్రహ్మన్‌! మనము కాలము వచ్చుటచే వివాహమాడితిమి. శంకరుడింకనూ వివాహమాడలేదు.ఆయన స్వయముగా రుద్రుడను పేర అవతరించి కైలాసము నాశ్రయించి ఉన్నాడు (59).

హే ప్రజాపతీ! ఉమాదేవి సతియను పేర అవతరించును. ఆమె పుట్టుట కొరకు ప్రయత్నమును చేయవలెను (60).

విష్ణువు ఇట్లు పలికి మిక్కిలి దయను చూపి అంతర్దానమాయెను. నేను మిక్కిలి అధికమైన ఆనందమును పొందితిని. నాలోని ఈర్ష్య తొలగి పోయెను (61).

శ్రీ శివ మహాపురాణములోని రెండవది యగు రుద్రసంహితయందురెండవది యగు సతీ ఖండములో బ్రహ్మ విష్ణు సంవాదము అనే పదియవ అధ్యాయము ముగిసినది (10).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 
https://t.me/ChaitanyaVijnanam

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 133

🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 133  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. నారద మహర్షి - 7 🌻

53. ఉన్నది ఒకేనాదం అయినప్పటికీ; వాయువు యొక్క వికార భేదముల చేత పుట్టినటువంటి వర్ణములు, అలాగే స్వరములు, ఆ స్వర్ణాల్లోంచి వచ్చిన రాగాలు, రాగంలోంచి భావము – ఇవి మాత్రమే సంగీతానికి సరిపోవుకదా!

54. అందుకని ఆయన కొన్ని వస్తువులను కూడా సృష్టించాడు. మృదంగం, వేణువు – ఈ ప్రకారంగా ఇట్లాంటి వాయిద్యాలనుకూడా వర్ణించి ఆయన బ్రహ్మ దేవుడికి చెప్పినవి, సాక్షాత్తు పరమేశ్వరియైన సరస్వతీదేవి తనకు చెప్పిన జ్ఞానంనుండే.

55. ఆ వాద్యాలన్నీ ఆమెలోపల ఉండి నిద్రిస్తున్నాయి. ఆ విద్యను గ్రహించాడు. అంతకు ముందు ఆమెయందు పరా-పశ్యంతీ స్థాయిలలో ఉన్నదంతా కూడా బహిర్ముఖమై, మధ్యమా-వైఖరీ రూపంగా ఈయన కిచ్చింది. ఒకటేమో అవ్యక్తము, మరొకటేమో వ్యక్తము. తర్వాత నారదుడు తంత్రీముఖములందు, ఆహతము – అనాహతములనే గాన మాత్ర విశేషములను ఇచ్చాడు.

56. ఆహతము అంటే, రెండు వస్తువుల తాకిడిచేత వచ్చేశబ్దం; అనాహతం అంటే ఎలాంటి తాకిడీలేకుండా పుట్టే శబ్దం. హృదయంలోని చక్రానికి యోగశాస్త్రంలో ‘అనాహత’మని పేరు. అనాహతం అంటే, ఆహతంకాని శబ్దము, హృదయంలో ఉంది. యోగులు దానిని వింటారు.

57. ఇప్పుడు మనం ఉత్పత్తిచేస్తున్న – సంగీతంలో ఏయే దోషములు ఉన్నాయో, అవిలేకుండా ఆయన ఆది సంగీతవిద్వాంసుడుగా అక్కడ పాడాడు. ఆ గానంతో దేవతలందరూ సంతోషించారు. బ్రహ్మదేవుడుకూడా బహిర్ముఖంగా సంగీతం వినటం అప్పుడే మొదటిసారి.

58. అమ్మవారు కూడా తను ఆయనకు ఇచ్చిన విద్య మళ్ళీ వింటున్నది. బ్రహ్మ సంతోషించి నారదునితో, “నాయనా! నీ జీవితమంతా సంగీతమే! స్మగీతమే నీవు. అలాగే ఉండు శాశ్వతంగా.

59. నేకేమీ పనిలేదు. దైవకార్యం ఏదయినా చెయ్యటానికై నీకు ఏదయినా కర్తవ్యం అప్పుడప్పుడు పుడితే, దానిని చేస్తావు. అంతేకాని దానిఫలంతో నీకేమీ సంబంధం ఉండదు. ఈశ్వరుడియొక్క సంకల్పం ఏదయితే ఉంటుందో, అది ఎందుకై అవసరమని అనుకుంటారో, దానికి నిమిత్తకారణంగా ఏవో కొన్ని పనులు చేస్తూ ఉంటావు. ఆ పని అయిపోగానే నీకేమీ కర్తవ్యం ఉండదు. తిరుగుతూనే ఉంటావు’ అన్నాడు.

60. “మరి నన్నేమి చెయ్యమంటావు తండ్రీ?” అని అడిగితే, ‘ఇదిగో నీకు అష్టాక్షరి ఉపదేశం చేస్తున్నాను. అది శ్రీమహావిష్ణు తత్త్వం. ఆయన నాకు తండ్రి. ఆయన నాకు గురువు. నా పుట్టుకకు హేతువు. ఆయనను గురించి నాకు అంతే తెలుసు. విష్ణుతత్త్వాన్ని అంతా నీకు చెప్తాను” అన్నాడు బ్రహ్మ.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

11 Oct 2020

గీతోపనిషత్తు - 50

🌹.   గీతోపనిషత్తు - 50   🌹

🍀 10 అసక్తత - సమాచరణము - నిష్కామ కర్మమే మోక్షమునకు మార్గమని, అట్లు నిర్వర్తించినవానికి మోక్షము అరచేతి యందుండునని, ఇది తన శాసనమని, అనుపానముగ ఫలాపేక్షలేక, కర్మాచరణము అనునిత్యము జరుగవలెనని తెలుపుచున్నాడు. 🍀

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚.   కర్మయోగము - 19   📚

ఆసక్తి లేక కర్మ లాచరించిన వానికి పరమపదము లభించగలదని ఈ సూత్రము తెలుపుచున్నది. ఆసక్తి లేక కర్మ లెట్టాచరించగలరు? ఆసక్తి లేనివా డేపనియు చేయడే! దీని రహస్యమేమి? భగవంతుడు గీతయందు పలుమార్లు "అసక్తః" అని పలుకుతుంటాడు.

19 . తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర |

అసక్తో హ్యాచరన్కర్మ పరమాప్నోతి పూరుషః || 19 ||

ఈ పలికిన అసక్తత ఫలములకు సంబంధించినది. పనికి సంబంధించినది కాదు. పనిచేయు వానికి పనియందే ఆసక్తి యుండవలెను గాని ఫలమునందు కాదు.

ఫలము నందాసక్తత యున్నవానికి పని యందు శ్రద్ధ చెడును. పని యందు శ్రద్ధ యున్న వానికి పనియే సౌఖ్యము నిచ్చును. ఫలములు పొందుట, పొందక పోవుట అతనిని బాధించవు. పని యందు సక్తుడవు కమ్ము, ఫలముల యందసక్తుడవు కమ్ము.

ఇచ్చట పని యనగా పరహితముతో కూడినది అని మరల మరల చెప్పనక్కరలేదు. నియత కర్మను అనగా చేయవలసిన కర్మను ఫలముల యందాసక్తి లేక యజ్ఞార్థముగ ఆచరించవలెనని భగవానుడు పలుకుతునే యున్నాడు.

నిజమునకు ఫలముల యందాసక్తి లేకుండ కర్మ నాచరించవలెనని ఈ అధ్యాయమున 7వ శ్లోకము నందు, 9వ శ్లోకమునందు పలికినాడు. అట్లాచరించినచో పరమును లేక దైవమును పొందవచ్చని వాగ్దానము చేయుచున్నాడు.

నిష్కామ కర్మమే మోక్షమునకు మార్గమని, అట్లు నిర్వర్తించినవానికి మోక్షము అరచేతి యందుండునని, ఇది తన శాసనమని తెలిపినాడు.

పై శాసనమునకు అనుపానముగ ఫలాపేక్షలేక, కర్మా చరణము అనునిత్యము జరుగవలెనని తెలుపు చున్నాడు. “సతతం” అని పలుకుటలో ఫలాసక్తి శాశ్వతముగ విసర్జించ బడవలెనని తెలుపుచున్నాడు.

ఫలాసక్తి లేనిచో ఏ కార్యమైనను చేయవచ్చునా? అను సందేహమును గూడ నివృత్తి చేయుటకై “కార్యం కర్మ"ను ప్రస్తావించి నాడు. అనగా తాను చేయవలసినపని ఫలాసక్తి లేక ఎల్లపుడు చేయవలెనని. ఫలాసక్తి లేక చేయవలసిన పని చేయువాడు ఎట్లైనా చేయవచ్చునా? అను సందేహమును నివారించుటకు "సమాచర” అని తెలిపినాడు.

సమాచరణ మనగా సమ్యక్ ఆచరణము. సమ్యక్ ఆచరణ మనగా ఎక్కువ తక్కువలు లేక నిర్వర్తించుట. అనగా కర్మ నిర్వర్తనము ఒక నిర్మల ప్రవాహమువలె సాగవలెనుగాని ఒడుదొడుకులతో కాదని యర్థము. మార్గమున ఒడుదొడుకులున్నను ప్రవాహ వేగమునకు ఒడుదొడుకులు అవసరము లేదు.

కొన్ని దినములు విపరీతముగ పనిచేయుట, కొన్ని దినములు చతికిల పడుటగా కర్మ జరుగరాదు. జరుగు కర్మయందు, వేగము నందు ఒక నిశ్చలత యుండవలెను. భూమి, ఇతర గ్రహములు చరించు విధానము సమాచర అను పదమునకు తగినట్లుగ నుండును.

వృక్షముల యొక్క పెరుగుదల యందు గూడ ఈ లక్షణములు చూడవచ్చును. సమాచరణము సృష్టి ప్రవాహమునకు ముఖ్య లక్షణము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

11 Oct 2020

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 48, 49 / Vishnu Sahasranama Contemplation - 48, 49

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 48, 49 / Vishnu Sahasranama Contemplation - 48, 49 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 48. పద్మనాభః, पद्मनाभः, Padmanābhaḥ 🌻

ఓం పద్మనాభాయ నమః | ॐ पद्मनाभाय नमः | OM Padmanābhāya namaḥ

(సర్వజగత్కారణం) పద్మం నాభౌ యస్య సః సర్వజగత్కారణమగు పద్మము నాభియందు ఎవనికి కలదో అట్టివాడు.

:: పోతన భాగవతము - తృతీయ స్కందము, విదురమైత్రేయ సంవాదము ::

క.తన జఠరము లోపలఁ దాఁ, చిన లోక నికాయముల సృజించుటకును సాధనమగు సూక్ష్మార్థము మన, సున గని కాలానుగత రజోగుణ మంతన్‌.సీ.పుట్టించెఁ దద్గుణంబునఁ బరమేశ్వరు నాభిదేశమునందు నలిననాళముదయించె మఱి యప్పయోరుహ ముకుళంబు గర్మబోధితమైన కాలమందుఁదన తేజమునఁ బ్రవృద్దంబైన జలముచే జలజాప్తు గతిఁ బ్రకాశంబు నొందఁజేసి లోకాశ్రయస్థితి సర్వగుణ విభాసితగతి నొప్పు రాజీవమందుతే.నిజకళా కలితాంశంబు నిలిపె, దానివలన నామ్నాయ మయుఁడును వరగుణుండునాత్మయోనియు నైన తోయజభవుండు, సరవిఁ జతురాననుండు నా జనన మయ్యె.

తన కడుపులో దాచుకొని వున్న సకల లోకాలను తిరిగి సృష్టించడానికి ఉపకరణమైన సూక్ష్మపదార్థాన్ని మనస్సులో భావించి, కాలానుగుణంగా రజోగుణాన్ని పుట్టించాడు.

ఆ విధంగా పుట్టించిన రజోగుణంవల్ల నారాయణుని నాభిలో నుండి మొగ్గతో కూడిన ఒక తామరతూడు జన్మించింది. సృష్టికార్యప్రభావితమైన కాలాన్ని అనుసరించి భగవంతుడు తన తేజస్సు చేత నీటినడుమ వృద్ధిపొందిన ఆ తామరమొగ్గను సూర్యునిలాగా వికసింపజేశాడు. లోకాలకు ఆశ్రయం ఇచ్చే స్థితినీ, సకలగుణాలతో ప్రకాశించే ప్రకృతినీ కలిగిఉన్న ఆ కమలంలో పరాత్పరుడు తన కళతోకూడిన అంశాన్ని ప్రసరింపజేశాడు. అప్పుడు ఆ పద్మంలో నుంచి సంపన్నుడూ, స్వయంభువుడూ, చతుర్ముఖుడూ అయిన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 48 🌹

📚. Prasad Bharadwaj

🌻 48. Padmanābhaḥ 🌻

OM Padmanābhāya namaḥ

Padmaṃ nābhau yasya saḥ. He in whose nābhi (navel) the Padma (lotus), the source of the universe, stands.

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 8

Tasyārthasūkṣmābhiniviṣṭadṛṣṭer antargato'rtho rajasā tanīyān,

Guṇena kālānugatena viddhaḥ sūṣyaṃstadābhidyata nābhideśāt. (13)

Sa padmakośaḥ sahasodatiṣṭhat kālena karmapratibodhanena,

Svarociṣā tat salilaṃ viśālaṃ vidyotayann arka ivātmayoniḥ. (14)

The subtle matter of creation, on which the Lord's attention was fixed, was agitated by Rajoguṇa - the material mode of passion and thus the subtle form of creation pierced through His Nābhi or abdomen. (13)

Piercing through, this sum total form of the fruitive activity of the living entities took the shape of the bud of a lotus flower generated from the personality of Viṣṇu, and by His supreme will, it illuminated everything, like the Sun and dried up the vast waters of devastation. (14)

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

अप्रमेयो हृषीकेशः पद्मनाभोऽमरप्रभुः ।विश्वकर्मा मनुस्त्वष्टा स्थविष्ठस्थ्सविरोध्रुवः ॥ 6 ॥

అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః ।విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠస్థ్సవిరోధ్రువః ॥ 6 ॥

Aprameyo hr̥ṣīkeśaḥ padmanābho’maraprabhuḥ ।Viśvakarmā manustvaṣṭā sthaviṣṭhasthsavirodhruvaḥ ॥ 6 ॥

Continues....
🌹 🌹 🌹 🌹

🌹.  విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 49/ Vishnu Sahasranama Contemplation - 49  🌹 

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 49. అమరప్రభుః, अमरप्रभुः, Amaraprabhuḥ 🌻

ఓం అమరప్రభవే నమః | ॐ अमरप्रभवे नमः | OM Amaraprabhave namaḥ

అమరాణాం ప్రభుః మరణమన్నది లేని అమరులకు (దేవతలు) ప్రభువు.

:: పోతన భాగవతము - అష్టమ స్కందము ::

వ. మఱియుఁ బ్రాప్తులైన వారల నింద్రపదంబులను, బహుప్రకారంబుల దేవపదంబులను, హరి ప్రతిష్ఠించుచుండు; వారలు విహితకర్మంబుల జగత్త్రయంబునుం బరిపాలింతురు; లోకంబులు సువృష్టులై యుండును.

విష్ణువు శక్తిమంతులను ఇంద్రపదవిలోనూ పెక్కు విధాలైన దేవతల పదవులలోనూ నెలకొల్పుతాడు. వారు తమకు నిర్ణయింపబడిన నియమాలతో మూడు లోకాలను ఏలుతారు. లోకాలు సుభిక్షంగా ఉంటాయి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 49 🌹

📚. Prasad Bharadwaj

🌻 49. Amaraprabhuḥ 🌻

OM Amaraprabhave namaḥ

Amarāṇāṃ prabhuḥ The master of Amarās or the deathless ones i.e., the Devās.

Śrīmad Bhāgavata - Canto 8, Chapter 14

Manavo manuputrāśca munayaśca mahīpate,

Indrāḥ suragaṇāścaiva sarve puruṣa śāsanāḥ. (2)

All the Manus, the sons of every such Manu (who would be appointed as major Kings), all the Munīs (sages which includes the 7 great sages called Sapta R̥ṣis), all the Indrās (king of Gods) and other Devatās (Gods) and all such are under the rule of the Parama Puruṣa or Supreme person.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

अप्रमेयो हृषीकेशः पद्मनाभोऽमरप्रभुः ।विश्वकर्मा मनुस्त्वष्टा स्थविष्ठस्थ्सविरोध्रुवः ॥ 6 ॥

అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః ।విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠస్థ్సవిరోధ్రువః ॥ 6 ॥

Aprameyo hr̥ṣīkeśaḥ padmanābho’maraprabhuḥ ।Viśvakarmā manustvaṣṭā sthaviṣṭhasthsavirodhruvaḥ ॥ 6 ॥

Continues....
🌹 🌹 🌹 🌹

Like and Share 
https://www.facebook.com/విష్ణు-సహస్ర-నామ-తత్వ-విచారణ-Vishnu-Sahasranama-111069880767259/

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama

11 Oct 2020

అద్భుత సృష్టి - 52

🌹.   అద్భుత సృష్టి - 52   🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. యాక్టివేషన్ జరిగేటప్పుడు మనలో వచ్చే మార్పులు - 2 🌻

🌟 3వ లెవెల్:-

భౌతిక భావాలన్నీ మరింత బలంగా మార్చబడతాయి. మన శరీరాలు కాంతిని గ్రహించడమే కాకుండా చాలా మార్పులను పొందుతూ కాంతి యొక్క అధికశక్తిని తనలోకి, భూమిపైకి తీసుకుని వస్తూ గ్రహం మొత్తం యొక్క మార్పుకు సహకరిస్తుంది. శరీరంలో ఈ సమయంలో చాలా మార్పులు వస్తాయి. రబ్బర్ బ్యాండ్ ను సాగదీస్తే ఎలా అయితే సాగుతుందో, వదిలేస్తే ఎలా మామూలు స్థితికి వస్తుందో అదే విధంగా మన శరీరంలో ups and

downs జరుగుతూ ఉంటాయి.

ప్రతి సెల్ లోనూ కాంతి ప్రవేశించి, హైయ్యర్ డైమెన్షన్ యొక్క జ్ఞానం, శక్తి అనుసంధానం చేయబడుతుంది. ఆత్మతో భౌతిక సంభాషణ ప్రారంభం అవుతుంది.

🌟. 4వ లెవెల్:-

ఈ స్థితిలో అధిక శాతం మార్పులు మెదడులో జరుగుతూ ఉంటాయి. మెదడు కణాలలో, నెర్వస్ సిస్టమ్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అధికంగా రావడం జరుగుతుంది. దీని వలన మెదడు కెమిస్ట్రీలో మార్పులు సంభవించి తలనొప్పి, బర్నింగ్ సెన్షేషన్, వినికిడి శక్తి లోపం, కంటిచూపులో మసకమసకగా రెండుగా కనిపించడం జరుగుతూ ఉంటుంది. మరియొక సమయంలో ఛాతీ నొప్పులు వస్తూ ఉంటాయి.

✨. మనం కనుక సిద్ధంగా ఉంటే.. క్రిస్టల్ రెగ్యులేటర్ మన యొక్క ఎథిరిక్ శరీరంలో అధిక కాంతిని ప్రవేశపెడుతూ 5 వ డైమెన్షన్ కి సంబంధించిన బ్లూప్రింట్స్ తో కనెక్ట్ చేస్తారు.

ఛాతి నొప్పి అధికంగా వుంటుంది. దీనికి కారణం మన యొక్క హృదయం మరింతగా ఓపెన్ అవుతుందని అర్థం.(గుండెలోతులు తెరవబడుతున్నాయి.)

✨. టెలిపతి థర్డ్ ఐ యాక్టివేషన్ జరుగుతుంది. ఎమోషనల్ బాడీని అర్థం చేసుకుంటూ దానిలో

వచ్చే మార్పులను అంగీకరిస్తూ దానిని కంట్రోల్ చేయగలుగుతాము.

✨. విద్యుత్ అయస్కాంత తరంగాల శక్తి మెదడులోకి ప్రసరించడం వలన ఆ ప్రాంతంలో ఒక రసాయనిక చర్య జరుగుతుంది. ఈ సమయంలో తలనొప్పి,అస్పష్టమైన దృష్టి, వినికిడి లోపం కలుగుతాయి. మీ మెదడులో ఉన్న రెండు అర్ధగోళాల మధ్య ఎలక్ట్రికల్ ఫైరింగ్ జరుగుతున్నట్లు అనిపిస్తుంది. విద్యుత్ శక్తి శరీరం అంతా ప్రసరించి వెన్నెముక క్రిందవరకు వెళ్ళి మనోహరమైన అనుసంధానం జరుగుతుంది. (కుండలినీ జాగృతి అనేది అద్భుతంగా జరుగుతుంది.)

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

11 Oct 2020

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 73

🌹.   కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 73   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము -03 🌻

కొద్దిగా విరమించినటువంటి స్థితిలో ఉంటాడు. కానీ చేసి ఒకటి రెండు పనులు, మూడు నాలుగు పనులు సామాన్య ధర్మం మేరకు, తన కర్తవ్యం మేరకు, తన ధర్మం మేరకు, తాను నిర్వహించేటటువంటి ఏ పనినైనా నూటికి వెయిపాళ్ళు సమర్థవంతంగా చేస్తాడు, సక్రమంగా చేస్తాడు. నిష్కామ కర్మగా చేస్తాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి లక్షణం.

ఈ నిష్కామ కర్మకు సరిపోయేటటువంటి వాటిని మాత్రమే ఆచరిస్తాడు. మిగిలినటువంటి వాటిని ఆచరించడు. సకామ్య కర్మ ఏదైనా సరే, అది తన కర్తవ్యంలో లేనిదిగా భావిస్తాడు. తన కర్తవ్యంగా ఎప్పుడూ భావించడు.

తన కర్తవ్యం కేవలం నిష్కామ కర్మ మాత్రమే. దీనికి సరిపడితేనే ఆ కర్మను అనుమతిస్తాడు. ఆ క్రియను అనుసరిస్తాడు. ఆ ఇంద్రియములను వ్యవహరింపజేస్తాడు. ఆ విషయాలలో ప్రవర్తిస్తాడు.

తదనుభవ రూపమైనటువంటి ఫలితమను నిరసిస్తాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఫలితమును నిరసించగలిగేటటువంటి, విశేష లక్షణాన్ని నిరసించ గలిగేటటువంటి, సమర్థమైనటువంటి, తనదైనటువంటి, తానైనటువంటి స్థితియందు నిలకడ కలిగేటట్లుగా చేయటానికి, ఈ ఆంతరిక యజ్ఞంలో భాగంగా అయ్యేటటువంటి వాటిని మాత్రమే ఆచరిస్తాడు.

మిగిలినటువంటి వాటికి విరమణ, మౌనం వహిస్తాడు, చేయడు అన్నమాట ఇక. అప్పుడు ఏమైపోయినై అంటే, చేసేటటువంటి పనుల సంఖ్య పరిమితించబడుతుంది. తీవ్ర వ్యవహారములన్నీ పరిమితించబడిపోతాయి.

రజోగుణ, తమోగుణ ధర్మాలన్నీ విరమించబడుతాయి. ఎప్పుడైతే ఇవన్నీ విరమించబడుతాయో సాత్విక కర్మని కూడా నిష్కామ కర్మగా మాత్రమే చేస్తాడు. మిగిలిన వాటిని చేయడు. ఎందుకనంటే అవి వృధా. నిష్ప్రయోజనములు.

ఎందుకనటా? ఆంతరిక యజ్ఞం చేయడానికి అవి ఉపయోగపడడం లేదు. ఎవరైనా యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞంలో హవిస్సులను అర్పించాలి అంతే కాని నీళ్ళు పోస్తారా? ఆ యజ్ఞం చల్లారి పోయేటట్లుగా చేయకూడదు.

ఇటువంటి ఆంతరిక యజ్ఞం మరింతగా ప్రజ్వలించి, ఎంతగా ప్రజ్వలించాలయ్యా అంగాటే, సర్వ వ్యాపకమైనటువంటి అనంత విశ్వమంతా తానే అయినటువంటి స్థితిని ప్రాప్తింపచేసేంతగా సూక్ష్మతరము, సూక్ష్మతమము చేసేటట్లుగా ఈ ఆంతరిక యజ్ఞాన్ని చేయాలి. ఇట్లా వేద విహత కర్మ అంటే, ఈ ఆంతరిక యజ్ఞమే! నిజానికి సర్వ యజ్ఞముల యొక్క లక్ష్యము కూడా ఈ ఆంతరిక యజ్ఞమే.

వేద విహితుడైనటువంటి బ్రాహ్మణుడు, నిత్యమూ చేయవలసినటువంటి కర్మ ఏమిటంటే, నిత్యకర్మ జ్యోతిష్టోమాది నిత్యకర్మ అంటారు. జ్యోతిష్టోమాది నిత్యకర్మ అంటే అర్థం ఏమిటంటే, ఈ ఆంతరిక యజ్ఞాన్ని సదా చేయాలి, 24 గంటలూ చేయాలి, మూడు అవస్థలలోనూ చేయాలి.

తురీయ స్థితిలో నిలబడేటంత వరకూ చేయాలి. తురీయస్థితిలో నిలబడటమే సత్యంగా, నిత్యంగా, లక్ష్యంగా ఎంచుకుని చేయాలి. కాబట్టి ఇట్టి ఆంతరిక యజ్ఞాన్ని, ఇదే జ్యోతిష్టోమాది కర్మ అంటే అర్థం.

అంతే కానీ, బాహ్యంగా చేసేటటువంటి యజ్ఞములు, యాగములు, హోమములు అన్నింటికీ కూడా ఈ అంతరిక యజ్ఞమే లక్ష్యార్థమై ఉన్నది, వాచ్యార్థమై ఉన్నది, వాచకమై ఉన్నది. కాబట్టి, బహిరంగంలో చేయబడేటటువంటివన్నీ కూడా కర్మ ఉపాసనలో భాగంగా వున్నాయి.

ఈ కర్మ ఉపాసన భాగంగా చేయబడుతున్నటువంటి సర్వ యజ్ఞములు, సర్వ కర్మలు, సర్వ యాగములు, హోమములు, ధ్యానములు, యోగములు, ఉపాసనలు, అర్చనలు, నవ విధ భక్తి మార్గములు అన్నీ కూడా ఆత్మనివేదన అనబడే ఆంతరిక యజ్ఞాన్ని ఆశ్రయించడం కొరకే.

ఈ ఆత్మనివేదన చేయటానికి అర్హమైనటువంటి స్థితిని సంపాదించి పెట్టేటటువంటి ఈ ఆంతరిక యజ్ఞాన్ని నిరంతరాయంగా ఎవరైతే చేస్తారో, వారిలో ఒక ఉత్తమ ఫలితం వస్తుంది. అది ఏమిటంటే, జ్ఞానాగ్ని లభిస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధ సర్వకర్మాణం - అన్ని కర్మలు అందులో దహించుకుపోతాయి. అన్ని కర్తృత్వ అభిమానము, భోక్తృత్త్వ అభిమానము పూర్ణాహుతి చేయబడుతాయి.

ఇది ప్రతీ యజ్ఞంలోను, ప్రతీ యాగంలోను, ప్రతీ హోమంలోను చిట్టచివరికి వ్రేల్చబడేటటువంటి ఈ పూర్ణాహుతి అంటే అర్థం ఏమిటంటే, కర్తృత్వాభిమానమును-భోక్తృత్వాభిమానమును సర్వకర్మలను.

సర్వధర్మాన్‌ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ|
అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః||

సర్వకర్మ పరిత్యాగం జరిగిపోతుందన్నమాట. కర్మ పరిత్యాగం అంటే కర్మఫల పరిత్యాగం. ఫలం లేకపోతే కర్మ యొక్క ప్రయోజనం లేదు.

అటువంటి ఫల పరిత్యాగ పద్ధతి అయినటువంటి, నిష్కామ కర్మ వేద విహిత కర్మలను, ఫలాపేక్ష లేక, ఆచరించువాని యొక్క చిత్తము నిర్మలమౌతుంది. ఇది చాలా ముఖ్యము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam
https://www.facebook.com/groups/465726374213849/

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

11 Oct 2020

శివగీత - 89 / The Siva-Gita - 89

🌹.   శివగీత - 89 / The Siva-Gita - 89   🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

ఏకాదశాధ్యాయము

🌻. జీవ గత్యాది నిరూపణము - ఉపాసనా మాహాత్మ్యము - 3 🌻

తత శ్శుక్రం రజశ్చైవ -భూత్వా గర్భోభి జాయతే,
తతః కర్మాను సారేణ భవేత్ స్త్రీ పుం నపుంస కః 21

ఏవం జీవ గతి: ప్రోక్తా - ముక్తిం తస్య వదామితే,
యస్తు శాంత్యాది యుక్తస్స - న్సదా విద్యారతో భవేత్ 22

సయాతి దేవ యానేన - బ్రహ్మ లోకా వధిం నరః ,
అర్చిర్భూ త్వా దినం ప్రాప్య - శుక్ల పక్ష మధో వ్రజేత . 23

ఉత్తరాయణ మాసాద్య - సంవత్సర మధో వ్రజేత్,
ఆదిత్య చంద్ర లోకౌతు - విద్యుల్లోక మతః పరమ్ 24

అధః దివ్యః పుమాన్కశ్చి - ద్బ్రహ్మ లోకాది హైతి సః,
దివ్యే వ పుషి సంధాయ - జీవ మేవం నయ త్యసౌ 25

ఆ మీదట కర్మానుసారాముగా స్త్రీ -పురుష -నపుంస కాది భేదములతో బుట్టుట జీవుని ముక్తిని గురించి చెప్పుచున్నాను. వినుము.

ఎవ్వడైతే శాంత్యా దులతో కూడుకొని యెల్లపుడు విద్యా సక్తుడగునో వాడు బ్రహ్మ లోక పర్యంతరమును దేవయానము (విమానము ) న పోవును. తేజో రూపము చేత దేవపురుషుడై దినము - శుక్ల పక్షము, ఉత్తరాయణము, పిదప సంవత్సరమును పొందును.

ఆదిత్య చందర లోకములను, తరువాత విద్యుల్లోకమును పొందును. ఆ మీదట ఒకానొక దివ్య పురుషుడు బ్రహ్మ లోకము నుండి విద్యుల్లోకమునకు వచ్చును. ఇట్లు ఈ దివ్య దేహముతో నున్న వాడు జీవుని పొంది బ్రహ్మ లోకమునకు దోడ్కొని పోవును .

బ్రహ్మ లోకే దివ్య దేహే -భుక్త్వా భోగా న్యదే ప్సితాన్,
తత్రో షిత్వా చిరం కాలం - బ్రహ్మణా సః ముచ్యతే. 26

శుద్ధ బ్రహ్మ రతో యస్తు- న సయాత్యేవ కుత్ర చిత్,
తస్య ప్రాణా విలీ యంతే - జలే సైంధవ ఖిల్య వత్ 27

స్వప్న దృష్టా యధా సృష్టి: ప్రబుద్దస్య విలీయతే,
బ్రహ్మ జ్ఞాన వతస్తద్వ- ద్విలీ యంతే తధైవతే. 28

విద్యా కర్మ విమినో య స్త్రుతి యమ స్థాన మేతిసః ,
భుక్త్యాచ నారా కాన్ఘోరా - న్మమా రౌర వరౌరవాన్ 29

పశ్చా త్ప్రాక్త నవే షేన -క్షుద్ర జంతు ర్భ వేదసౌ ,
యూకామ శక దంశాది - జన్మా సౌలభతే భువి. 30

బ్రహ్మ లోకమున దివ్య దేహముతో సమస్త కోరికల ననుభవించి చాలాకాల

మచటనే యుండి బ్రహ్మముతో మోక్షమును పొందును.

కేవలము నా బ్రహ్మ రతుడు నిర్వి కారుడై జలముతో నున్న ఉప్పు

ముద్దవలె నుండును. అతని ప్రాణములు తన లోనే లయమగును.

స్వప్నములోని సంఘటన మేల్కొన్న వాని కెట్లు తిరోమిత మగుచుండునో

బ్రహ్మ జ్ఞాని కన్నియు వటులనే యగును.

విద్యా కర్మ శూన్యునికి తృతీయ స్థానము (నరకము ) లభ్యమగును.

అట్టివాడు రౌరవాది మహానరకముల ననుభవించి మునుపటి

కర్మ శేషము చేత నీచ ప్రాణియై పుట్టును. దోమ - ఈగ మొదలగు

వాని జన్మను భూలోకమున దాల్చును.

ఈ ప్రకారంబుగా జీవగతిని వివరించితిని.ఇకముందే మి ప్రశ్నిం చెదవు?

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹   The Siva-Gita - 89   🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj

Chapter 11
🌻 Jiva Gatyaadi Niroopanam - Upasana Mahatya - 3
🌻

Subsequently based on the Karma of the Jiva, female, male or eunuch bodies are obtained. Now I would explain the path of reaching higher abodes (gati) for the Jiva.

Listen! One who possesses peaceful nature etc. good qualities , remains inclined towards the scriptures and righteousness, he is taken away till Brahma loka in celestial plane.

With divine splendor, he becomes Devapurusha, and stays during

Suklapaksham, Uttarayanam. First attains to the abodes of Sun and moon, then attains to Vidyullokam, after that a celestial deity comes descends from Brahma loka to Vidyulloka and takes the Jiva to Brahma loka.

In the abode of Brahma with the celestial body the Jiva enjoys all his desires for a long time. After staying there for a long period he gets moksha alongwith Brahma.

Only that Brahmajnani remains one with Brahman as like as salt melts in water. As like as one can recall the dreams after waking up, a Brahmajnani also can recall everything similarly.

For a Jiva who is devoid of Vidya (wisdom) and Karma third place is given which is Hell. Such a Jiva experiences extreme torture in Hells named raurava and similar ones and with the leftover Karma he gains birth as a heinous creature like flies, mosquitoes etc. on

earth. this is about the Jiva Gati topic. Do you have any questions, Rama?

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 
https://www.facebook.com/groups/465726374213849/

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita

11 Oct 2020

శ్రీ విష్ణు సహస్ర నామములు - 35 / Sri Vishnu Sahasra Namavali - 35

🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 35 / Sri Vishnu Sahasra Namavali - 35 🌹
నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

కర్కాటక రాశి- అశ్లేష నక్షత్ర 3వ పాద శ్లోకం

🌻. 35. అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః।
అపాంనిధి రథిష్ఠానం అప్రమత్తః ప్రతిష్ఠితః॥ 🌻

అర్ధము :

🍀. అచ్యుతః -
దేనితోనూ చేధింపబడనివాడు, ఎటువంటి మార్పు చెందనివాడు.

🍀. ప్రథితః -
ప్రఖ్యాతి గాంచినవాడు.

🍀. ప్రాణః -
చైతన్యవంతమైన ప్రాణస్వరూపుడు.

🍀. ప్రాణదః -
జీవులకు ప్రాణమును అనుగ్రహించువాడు.

🍀. వాసవానుజః -
ఇంద్రునికి తమ్ముడు, దేవతులలో శ్రేష్ఠుడు.

🍀. అపాంనిధిః -
సముద్రంవలే అనంతమైనవాడు.

🍀. అధిష్ఠానాం -
అంతటికీ అధిపతి, అంతటికీ ఆధారభూతుడు.

🍀. అప్రమత్తః -
ఎల్లప్పుడూ జాగురూకుడై వుండువాడు, ఏమరుపాటు లేనివాడు.

🍀ప్రతిష్ఠితః -
అఖండ మహిమతో అంతటా వుండువాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Vishnu Sahasra Namavali - 35 🌹
Name - Meaning

📚 Prasad Bharadwaj

🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻

Sloka for Karkataka Rasi, Aslesha 3rd Padam

🏵️. 35. acyutaḥ prathitaḥ prāṇaḥ prāṇadō vāsavānujaḥ |
apāṁnidhiradhiṣṭhānamapramattaḥ pratiṣṭhitaḥ || 35 || 🏵️

🌻 Acyutaḥ:
One who is without the six transformations beginning with birth.

🌻 Prathitaḥ:
One who is famous because of His works like creation of the worlds etc.

🌻 Prāṇaḥ:
One who as Hiranyagarbha endows all beings with Prana.

🌻 Prāṇadaḥ:
One who bestows Prana, that is, strength, on Devas and Asuras and also destroys them by withdrawing it.

🌻 Vāsavānujaḥ:
One who was born as younger brother of Indra (Vasava) in His incarnation as Vamana.

🌻 Apāṁ nidhiḥ:
The word means collectivity of water or the ocean.

🌻 Adhiṣṭhānam:
The seat or support for everything.

🌻 Apramattaḥ:
One who is always vigilant in awarding the fruits of actions to those who are entiled to them.

🌻 Pratiṣṭhitaḥ:
One who is supported and established in His own greatness.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 
https://t.me/ChaitanyaVijnanam

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama

11 Oct 2020

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 78 / Sri Gajanan Maharaj Life History - 78

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 78 / Sri Gajanan Maharaj Life History - 78 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 15వ అధ్యాయము - 4 🌻

కరవీర్ కొల్హాపూరుకు చెందిన శ్రీధర గోవిందకాళే పేరుగల ఒకపేద చిత్పవన్ బ్రాహ్మణ కుర్రవాడు ఇంగ్లీషు బడిలో చేరి మెట్రిక్ ఉత్తీర్నుడయ్యాడు. తరువాతా కళాశాలలో చేరాడు కానీ ఇంటర్లో ఉత్తీర్నుడుకాలేదు. కేశరి అనే వారపత్రిక చదువుతూ ఒయామా మరియు టొగోల జీవిత చరిత్రగూర్చి తెలుసుకుంటాడు. దాని ప్రేరణతో సాంకేతిక విద్యకోసం విదేశం వెళ్ళాలని తలుస్తాడు.

ఒయామా మరియు టొగోలు ఆపని చేసి తమ జ్ఞానంతో జపానుకు అభివృద్ధి తెచ్చారు. శ్రీధర్ కుడా మాతృదేశానికి అదేపని చేద్దామని కోరుకున్నాడు, కానీ పేదరికంవల్ల నిస్సహాయునిగా తలచాడు. పేదవాళ్ళకి ఎవరూ సహాయం చెయ్యరు. అతను అప్పుడు మాన్రో ఉన్నతపాఠశాలలో పనిచేస్తున్న స్నేహితుని దగ్గరకు, కలిసేందుకు భండారా వెళ్ళడు.

అతను తన స్నేహితునికి తనమనసులోనివి అన్నీ చెప్పాడు. ఈవిచారణకు అతనుకూడా అభినందించాడు. కానీ డబ్బుసంగతి ఏమిటి ? ఈప్రపంచంలో ధనం లేకుండా ఏదీవీలుకాదు. మరియు పేదవాళ్ళు గాలిలో మేడలు కట్టడమే. విదర్భలోని వేసవి ఎండకు, వాళ్ళు కొల్హాపూరు వెళదామని నిశ్చయించుకున్నారు. గొప్పయోగి అయిన శ్రీగజానన్ మహారాజు గురించి వినడంవల్ల, దారిలో వాళ్ళు ఆయోగిని చూసేందుకు షేగాంలో దిగుతారు.

వాళ్ళు తమసామాను తపాలా ఆఫీసులో పెట్టి, శ్రీగజానన్ మహారాజు మఠానికి వెళ్ళారు. నమస్కారంచేసి చేతులు కట్టుకుని, ఆయన ముందు కూర్చున్నారు. శ్రీమహారాజుకు దివ్యశక్తి వల్ల శ్రీధరు కోరికలు తెలుసు. నీకు కావలసినవన్నీ ఇక్కడే లభ్యంఅవుతాయి. ఈ భౌతిక శాస్త్రం పనికిరానిది, కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నించు, దీనివల్ల నీకు సంతృప్తి కలుగుతుంది అని శ్రీమహారాజు అన్నారు.

ఈ సలహాతో, అకస్మాత్తుగా శ్రీధరు తన ఆలోచనలో మార్పు అనుభూతి పొందాడు, మరియు ఇది కొల్హాపూరులో సరగ్గా శ్రీగజానన్ మహారాజులా మాట్లాడే ఒకయోగిని గుర్తుకు తెచ్చింది. అతని మనసులోని కలవరాన్ని గ్రహించి... హిందుస్తాన్ వదలాలని అనుకోకు, చాలా మంచి పనులు చేసిన తరువాత ఇక్కడ జన్మదొరుకుతుంది.

యోగశాస్త్రం మిగిలిన అన్ని విజ్ఞానాలకంటే విశిష్టమయినది, ఎవరయితే యోగశాస్త్రం ఎరిగి ఉంటారో వాళ్ళు మరి ఏవిజ్ఞానాన్ని లెఖ చెయ్యరు. ఆత్మజ్ఞానం ఈ యోగశాస్త్రంకంటే విశిష్టమయునది, దానిని నేర్చుకనేందుకు ప్రయత్నించు, కానీ ఎక్కడికి వెళ్ళకు అని శ్రీమహారాజు అన్నారు.

ఈ మాటలు విన్న శ్రీధరు చాలా ఆనందం అనుభూతిచెంది, పశ్చిమంలో అస్తమించిన ఆలోచన అనే సూర్యుడు తనని సంతోషపరిచేందుకు తిరిగి తూర్పున ఉదయించి నట్టుగా భావించాడు. ఒక్కయోగులే ఈవిధమయిన ఆలోచనా మార్పు తేగలరు, ఎందుకంటే వాళ్ళకు సత్యం తెలుసు కనుక. నువ్వు ఇక్కడనే రాణిస్తావు, ఇక నీ స్నేహితునితో కొల్హాపూరు వెళ్ళు, నీ భార్య ఎదురు చూస్తోంది అని శ్రీమహారాజు అన్నారు.

ఆయన వాక్కు నిజం అని నిరూపించబడింది, శ్రీధరు చాలా రాణించాడు. అతను బి.ఎ మరియు ఎం.ఎ పరీక్షలలో ఉత్తీర్నుడయి, సింధియారాజ్యంలోని శివపురిలో కళాశాల ప్రధాన అధ్యాపకునిగా అయ్యాడు. యోగులు ఈభూమి మీద అవతరించిన భగవస్వరూపులు. వారి ఆశీర్వాదాలు ఉన్నవారు ఎప్పుడూ అభివృద్ధి పొందుతారు. శ్రీధరు ఆలోచనలో మార్పు, శ్రీమహారాజు ఆశీర్వచనాల వల్లే అయింది.

ఈ విధమయిన యోగులు మనపుణ్య భూమిమీద పెరుగుతారు. స్వర్గం అనే వృక్షాలు మరి ఎక్కడా వేళ్ళుపొందవు. దాసగణు విరచించిన ఈ గజానన్ విజయ గ్రంధం ఎల్లప్పుడూ భక్తులకు సరి అయిన బాట చూపించుగాక.

శుభం భవతు

15. అధ్యాయము సంపూర్ణము.

సశేషం...
🌹 🌹🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 78 🌹

✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj

🌻 Chapter 15 - part 4 🌻

A poor Chitpavan Brahmin boy, named Shridhar Govind Kale from Karvi, Kolhapur, joined English school and passed metric. Then he joined college, but failed in Inter. While reading the ‘Kesari’ newspaper, he came across the biography of Oyama Togo. Inspired by it, he wished to go abroad for some technical education.

Oyama Togo had done it, and brought prosperity to Japan by their knowledge. Shridhar wished to do the same thing for his motherland, but felt helpless due to poverty. Nobody helps the poor. He then went to Bhandara to meet his friend who was teacher at the Monro High School there.

He told his friend everything that came to his mind, and he too appreciated the idea. But what about the money? Nothing is possible in this world without money and the poor people have to build castles in the air only. Due to hot summer of Vidarbha, they decided to go to Kolhapur.

Having heard much about the great saint, Shri Gajanan Maharaj, they, on their way, got down at Shegaon to see the saint. They kept their luggage at the post office and went to the Matth of Shri Gajanan Maharaj, and prostrating before Him, sat with folded hands.

By His divine powers, Shri Gajanan Maharaj knew the desire of Shridhar, and said, Don't think of going abroad. You can get everything here only. These physical sciences is useless, and so try to get some spiritual knowledge that can bring satisfaction to you.”

By this advice, Shridhar experienced a sudden change in his thinking and was reminded of one saint of Kolhapur who used to talk just like Shri Gajanan Maharaj. Sensing the confusion in his mind, Shri Gajanan Maharaj further said, Don't think of leaving Hindustan, as one gets birth here, only after doing a lot of good deeds.

Yogashastra is superior to any other material science, and one who knows Yogashastra will not care for any other science. The knowledge of the self (Adhyatma) is further superior to Yogashastra. Try to learn that and don't go anywhere.”

Hearing these words, Shridhar felt very happy and thought that the sun of thinking that had set in the west had risen again in the east. Only saints can bring about such transformation of thoughts, because they know the Truth. Shri Gajanan Maharaj further said, You will prosper here only.

Now go to Kolhapur with your friend as your wife is waiting for you.” The prophecy proved true and Shridhar prospered well. He passed the B.A. and M.A. Examinations and became the Principal of the College at Shivpuri in the Kingdom of Scindias.

Saints are God incarnate on this earth and those, who get their blessings, always prosper. The change in Shridhar's thinking was due to the blessings of Shri Gajanan Maharaj . This crop of Saints can grow only in our holy land.

Trees of heaven will not root elsewhere. May this Gajanan Vijay Granth, composed by Dasganu, always show right path to the devotees.

||SHUBHAM BHAVATU||

Here ends Chapter Fifteen

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 
https://www.facebook.com/groups/465726374213849/

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 71

🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 71   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 21 🌻

291. భగవంతుడు శాశ్వతముగా , పరాత్పర స్థితిలో దివ్య సుషుప్తి యందే ఉన్నాడు .కాని మానవస్థితిలోనున్న భగవంతుడువై కల్పికముగా ఒకసారి సుషుప్తిని ,మరొకసారి జాగృతిని అనుభవించుచున్నాడు .

292. గాఢనిద్రలో మానవుని దేశ _కాలములు నాశనమైనట్లుగా నున్నవి .అనగా , తాత్కాలికముగా నాశనమైనవి .

293. గాఢనిద్రలో దేశ_కాలములు నాశనమైనప్పుడు , అతడు మేల్కొనగానే మరల పగలు , విశ్వమును అతనికి ఎట్లు వచ్చుచున్నవి ?

🌻. సృష్టి -స్థితి- లయములు .🌻

294. పరిణామక్రమములో ప్రోగుపడి, గాఢనిద్రలో నిద్రాణమైయున్న మానవుని స్వీయ సంస్కారములు ,చైతన్యము అతనికి ప్రతి దినము జాగ్రదవస్థలో ఉదయమును ,విశ్వమును సృజించుచున్నవి .

295. జాగ్రదవస్థలో మానవుని నిత్యజీవిత స్వీయ సంస్కార ములచే ఉదయ , విశ్వములు పోషింపబడుచున్నవి .

296. జాగ్రదవస్థయందున్న సంస్కారములు ,నిద్రావస్థలో

నున్న అనుభవ సంస్కారములచే పగలు , విశ్వములు నాశనమౌచున్నవి .

297. భగవంతుడు ,

(1) మానవుని నిద్రాణసంస్కారముల ద్వారా తన స్వీయ సృష్టికి .........కర్తననియు

(పెరుగుట) విశ్రాంతి గొనుట , ముడుచుకొనుట (సంకోచించుట) మొదలగు సంకోచ , వికాసముల ద్వారా జరుగుచున్న సమయమందే -

శిశువు జన్మించుచున్నది - సృష్టి

శిశువు పోషింపబడుచున్నది - స్థితి

చివరకు గుండె , చరముగా సంకోచించుట ద్వారా , విశ్రాంతి రూపములో దేహము విడువబడు చున్నది (మరణము ) - లయము .

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 
https://www.facebook.com/groups/465726374213849/

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

11 Oct 2020

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 31, 32 / Sri Lalitha Chaitanya Vijnanam - 31, 32

🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 19 🌹

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 31, 32 / Sri Lalitha Chaitanya Vijnanam - 31, 32 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

13. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత

రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత

🌻 31. 'కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా' 🌻

అంగదము, కేయూరము అను బంగారపు, కమనీయపు భుజములచే ప్రకాశించుచున్న దేవి అని భావము.

అమ్మవారి నాలుగు భుజముల కాంతిని దర్శించుట ఈ నామము యొక్క ధ్యేయము. శ్రీదేవి శరీరమే బంగారు కాంతులను విరజిమ్ముచు నుండును. నాలుగు భుజములు అంతఃకరణ చతుష్టయమునకు సంకేతములని యిదివరకే వివరింపబడి యున్నది.

భుజముల కాంతిని ధ్యానించుట వలన అంతఃకరణము పరిశుద్ధి నొందగలదు. కరణమునకు (చేతలకు) అంతఃకరణ పవిత్రతయే ముఖ్యము.

అట్టి పవిత్రత శ్రీదేవి నాలుగు భుజముల ఆభరణముల కాంతిని ధ్యానించుటచే ఏర్పడ గలదు. కాంతివంతమైన ఆమె భుజములు అంగద, కేయూర ఆభరణములను ధరించినట్లు భ్రమకొల్పును కాని, నిజమునకు ఆమె భుజముల సౌష్టవ కాంతి అది.

ఆభరణములను పెట్టుకొనుట వలన సామాన్యులు అందముగ కనబడుదురు. అందమైనవారు ఆభరణములను పెట్టుకొనినప్పుడు వారి కాంతి ఆభరణములకు అందమిచ్చును. అమ్మ ధరించిన ఆభరణముల నుండి విరజిమ్మ బడుచున్న కాంతి అమ్మ భుజముల నుండి జనించినదే కాని, బంగారము నుండి కాదు.

బంగారమే అమ్మ శరీరము నుండి పుట్టినదికదా! కావున నాలుగు భుజములు హిరణ్మయముగా భావన చేయుచూ, అందలి కమనీయత్వము గ్రోలుటలో మనస్సు హరింపబడ వలెను.

బహిర్ముఖమైన మనస్సు అంతర్ముఖమై బంగారు కాంతులతో మునిగినప్పుడు అంతఃకరణములు పరిశుద్ధి చెందగలవు. అట్టి అంతఃకరణములు బహిఃకరణములను కూడ చైతన్యవంతముగా చేయగలవు.

అది కారణముగ లోకహిత కార్యముల నొనర్చు అంగబలము, భుజబలము ఉపాసకునకు ఏర్పడగలవు. మెడ, య బాహువులు, కంఠము మిథునరాశి చిహ్నములు. మిథునరాశి ద్విస్వభావ రాశి. ద్వంద్వముగ కనబడుచున్న సమస్త సృష్టి రహస్యములు ఈ రాశి యందు సంకేతింపబడినవి.

ముందు తెలుపబడిన నామములలో గల మెడ, మంగళసూత్రములు, నామమున అంగద, కేయూరములు తెలుపబడుటలో ద్వంద్వము కలిగి అధిష్ఠించబడిన సమన్వయము కలిగిన దేవిగ అమ్మను అవగాహన చేసుకొనవలెను.

దేవీ సహస్ర నామములయందు ద్వంద్వములు, పరస్పర

విరుద్ధములు అయిన విషయముల యందు ఏకత్వము ప్రతిపాదింప బడినది. ఏకత్వమునందు ద్వంద్వములను దర్శించుట మొదలగును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹   Sri Lalitha Chaitanya Vijnanam - 31  🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 31. Kanakāṅgada- keyūra- kamanīya- bhujanvitā कनकाङ्गद-केयूर-कमनीय-भुजन्विता (31) 🌻

kanaka – golden; aṅgada – bangles or bracelets; keyūra is a type of ornament worn in the upper arms. She is wearing these ornaments. Possibly, this could mean the following.

Both these ornaments are made out of gold and worn in the arms. Though they differ in form, the ingredient gold is the same in both.

Though the forms of living beings are different, the innermost Brahman remains the same.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🌹.  శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 32 / Sri Lalitha Chaitanya Vijnanam - 32   🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

13. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత

రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత

🌻 32. 'రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత 🌻

రత్నములు, బంగారము, ముత్యములతో చేయబడిన కంఠాభరణములను దాల్చినది అని అర్ధము. కంఠము ఊర్థ్వలోకమునకు, మానవ లోకమునకు మధ్యస్థమైన లోకము.

మానవప్రజ్ఞ విశిష్ట శుద్ధి నొందనిదే దివ్య లోకానుభవములకు పాత్రత పొందదు. ఈ నామమున చెప్పబడిన కంఠాభరణములలో రత్నములు, ముత్యములు, బంగారము వున్నవి. రత్నములు బంగారములో పొదగబడినవి. అవి కంఠమున అలంకరించగా చలించుచున్న ముత్యపు హారము ఒకటి కంఠాభరణమునకు తగుల్కొని యున్నది.

ముత్యపు హారము చలించుట మనో చాంచల్యమును సూచించును. ఈ చపల స్వభావము ఉపాసకుని కంఠములందు చింతలు గలవారిగ సూచించును. చింతలను గూర్చి దేవిని ధ్యానించువారు ఈ కదలుచున్న ముత్యపు హారము వంటివారు. ముత్యమునకు, చంద్రునకు, మనస్సునకు గల స్వాభావిక సంబంధమును యిచ్చట గమనించదగును.

కంఠమున పరిశుద్ధి కలిగినకొలది నిశ్చలమైన రత్నము, బంగారము కాంతులు దర్శనమగును. అంతకు పూర్వము చింతాకలిత మైన, చంచలమైన ఆరాధన ఇప్పుడు నిశ్చలమైన ఆరాధనగ పరిణతి

చెందును.

క్రిందవున్న ముత్యపు హారము తను స్వభావము, దైవీ స్వభావము మిశ్రమముగ నుండుటచే కదలుచు నుండును. దాని కాధారమైన కంఠాభరణము జీవుని భూమికయైన దేహపుంజము (మనసు, ఇంద్రియములు, శరీరము) నధిష్ఠించివున్న ప్రజ్ఞకు సంకేతము.

నిశ్చలమైన కాంతిలోక ప్రవేశమునకు కూడ సంకేతము. ఇట్టి వారు దేవిని నిశ్చలముగ ధ్యానము చేయగలరు. పై నిశ్చలత్వము పొందుటకు ఉపాసకుడు వాజ్మయ తపస్సును చేయవలసి యుండును. కంఠపు లోయనుండి వచ్చు శబ్దములను దైవముగ దర్శించుచూ మాటాడుట ఈ తపోనియమము. ఎట్టి పరిస్థితులలోను అశ్లీలము, అపవిత్రము, అబద్ధము కలుగచేయు ధ్వనులను పలుకరాదు.

కంఠాభరణమును, దానిమధ్య వ్రేలాడుము హారమును పై విధముగా ఆరాధన చేయుట ఉపాసకునకు శ్రేయస్కరము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹   Sri Lalitha Chaitanya Vijnanam - 32   🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

Ratna-graiveya-cintāka-lola-muktā-palānvitā रत्न-ग्रैवेय-चिन्ताक-लोल-मुक्ता-पलान्विता (32)

She is wearing a gems embedded golden pendent and a pearl necklace. These ornaments are dangling in Her neck.

The dangling of these ornaments is compared to mind. Those who are not capable of meditating Her full form (head to foot) are said to be low class devotees and called as lola-s.

Those who are able to meditate on Her full form are said to be high class devotees and called as muktā-s. Lola-s or muktā-s get the benefits (pala) of their prayers according to their category. This is the meaning of lola- muktā- palānvitā.

While worshipping Her, one has keep to keep his mind steady, without distractions.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 
https://www.facebook.com/groups/465726374213849/

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi

11 Oct 2020

11-October-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 516 / Bhagavad-Gita - 516 🌹 
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 48, 49 / Vishnu Sahasranama Contemplation - 48, 49 🌹
3) 🌹 Sripada Srivallabha Charithamrutham - 304 🌹
4) 🌹. శివగీత - 89 / The Shiva-Gita - 89 🌹
5) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 73🌹 
6) 🌹 Guru Geeta - Datta Vaakya - 92 🌹 
7) 🌹. గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 78 / Gajanan Maharaj Life History - 78 🌹 
8) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 71🌹
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 31, 32 / Sri Lalita Chaitanya Vijnanam - 31, 32 🌹 
10) *🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 19🌹*
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 431 / Bhagavad-Gita - 431 🌹

12) *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 3 / Sri Devi Mahatyam - Durga Saptasati - 3🌹*
*🌹. ఋతంభరా ప్రజ్ఞ 🌹*
13) 🌹. శివ మహా పురాణము - 245 🌹
14) 🌹 Light On The Path - 3 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 133 🌹
16) 🌹 Seeds Of Consciousness - 197 🌹 
17) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 51 📚
18) 🌹. అద్భుత సృష్టి - 52🌹
19) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 35 / Sri Vishnu Sahasranama - 35 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 516 / Bhagavad-Gita - 516 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 01 🌴*

01. శ్రీ భగవానువాచ
ఊర్థ్వమూలమధశ్శాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ |
ఛన్దాంసి యస్య పర్ణాణి యస్తం వేద స వేదవిత్ ||

🌷. తాత్పర్యం : 
పూర్ణపురుషోత్తముడగు శ్రీకృష్ణభగవానుడు పలికెను : వ్రేళ్ళు ఊర్థ్వముగను, శాఖలు క్రిందుగను, వేదఋక్కులే ఆకులుగను కలిగిన శాశ్వతమైన అశ్వత్థవృక్షమొకటి కలదని చెప్పబడును. ఆ వృక్షము నెరిగినవాడే వేదముల నెరిగినవాడు.

🌷. భాష్యము :
భక్తియోగపు ప్రాముఖ్యమును చర్చించిన పిమ్మట ఎవరైనను “వేదముల ప్రయోజనమేమిటి?” యని ప్రశ్నించవచ్చును. అందుకు సమాధానముగా వేదాధ్యయన ప్రయోజనము శ్రీకృష్ణుని ఎరుగుటయేనని ఈ అధ్యాయమున వివరింపబడినది. అనగా కృష్ణభక్తిరసభావితుడై భక్తియోగమునందు నియుక్తుడైనవాడు వేదములను ఎరిగియే యుండును.

భౌతికజగత్తు బంధము ఇచ్చట అశ్వత్థవృక్షముతో పోల్చబడినది. కామ్యకర్మల యందు రతుడైనవాడు ఈ అశ్వత్థవృక్షపు తుదిని తెలియక ఒకకొమ్మ నుండి వేరొకకొమ్మకు సదా మారుచుండును. అనగా భౌతికజగమను ఈ అశ్వత్థవృక్షమునకు అంతమనునది లేదు. అట్టి ఈ వృక్షమునందు ఆసక్తుడైనవానికి ముక్తి లభించు నవకాశమే లేదు.

 ఆత్మోద్దారమునకై ఉద్దేశింపబడిన వేదమంత్రములు ఈ వృక్షపు ఆకులుగా పేర్కొనబడినవి. విశ్వము యొక్క అత్యున్నత లోకమైన బ్రహ్మలోకము నుండి ఆరంభమగుటుచే దీని వ్రేళ్ళు ఊర్థ్వముగా నున్నవి. అవ్యయమైన ఈ మాయావృక్షమును అవగతము చేసికొనినచో మనుజుడు దాని నుండి బయటపడగలడు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 516 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 15 - Purushothama Yoga - 01 🌴*

01. śrī-bhagavān uvāca
ūrdhva-mūlam adhaḥ-śākham
aśvatthaṁ prāhur avyayam
chandāṁsi yasya parṇāni
yas taṁ veda sa veda-vit

🌷 Translation : 
The Supreme Personality of Godhead said: It is said that there is an imperishable banyan tree that has its roots upward and its branches down and whose leaves are the Vedic hymns. One who knows this tree is the knower of the Vedas.

🌹 Purport :
After the discussion of the importance of bhakti-yoga, one may question, “What about the Vedas?” It is explained in this chapter that the purpose of Vedic study is to understand Kṛṣṇa. Therefore one who is in Kṛṣṇa consciousness, who is engaged in devotional service, already knows the Vedas.

The entanglement of this material world is compared here to a banyan tree. For one who is engaged in fruitive activities, there is no end to the banyan tree. 

He wanders from one branch to another, to another, to another. The tree of this material world has no end, and for one who is attached to this tree, there is no possibility of liberation. The Vedic hymns, meant for elevating oneself, are called the leaves of this tree.

 This tree’s roots grow upward because they begin from where Brahmā is located, the topmost planet of this universe. If one can understand this indestructible tree of illusion, then one can get out of it.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 48, 49 / Vishnu Sahasranama Contemplation - 48, 49 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻 48. పద్మనాభః, पद्मनाभः, Padmanābhaḥ 🌻*

*ఓం పద్మనాభాయ నమః | ॐ पद्मनाभाय नमः | OM Padmanābhāya namaḥ*

(సర్వజగత్కారణం) పద్మం నాభౌ యస్య సః సర్వజగత్కారణమగు పద్మము నాభియందు ఎవనికి కలదో అట్టివాడు.

:: పోతన భాగవతము - తృతీయ స్కందము, విదురమైత్రేయ సంవాదము ::
క.తన జఠరము లోపలఁ దాఁ, చిన లోక నికాయముల సృజించుటకును సాధనమగు సూక్ష్మార్థము మన, సున గని కాలానుగత రజోగుణ మంతన్‌.సీ.పుట్టించెఁ దద్గుణంబునఁ బరమేశ్వరు నాభిదేశమునందు నలిననాళముదయించె మఱి యప్పయోరుహ ముకుళంబు గర్మబోధితమైన కాలమందుఁదన తేజమునఁ బ్రవృద్దంబైన జలముచే జలజాప్తు గతిఁ బ్రకాశంబు నొందఁజేసి లోకాశ్రయస్థితి సర్వగుణ విభాసితగతి నొప్పు రాజీవమందుతే.నిజకళా కలితాంశంబు నిలిపె, దానివలన నామ్నాయ మయుఁడును వరగుణుండునాత్మయోనియు నైన తోయజభవుండు, సరవిఁ జతురాననుండు నా జనన మయ్యె.

తన కడుపులో దాచుకొని వున్న సకల లోకాలను తిరిగి సృష్టించడానికి ఉపకరణమైన సూక్ష్మపదార్థాన్ని మనస్సులో భావించి, కాలానుగుణంగా రజోగుణాన్ని పుట్టించాడు.

ఆ విధంగా పుట్టించిన రజోగుణంవల్ల నారాయణుని నాభిలో నుండి మొగ్గతో కూడిన ఒక తామరతూడు జన్మించింది. సృష్టికార్యప్రభావితమైన కాలాన్ని అనుసరించి భగవంతుడు తన తేజస్సు చేత నీటినడుమ వృద్ధిపొందిన ఆ తామరమొగ్గను సూర్యునిలాగా వికసింపజేశాడు. లోకాలకు ఆశ్రయం ఇచ్చే స్థితినీ, సకలగుణాలతో ప్రకాశించే ప్రకృతినీ కలిగిఉన్న ఆ కమలంలో పరాత్పరుడు తన కళతోకూడిన అంశాన్ని ప్రసరింపజేశాడు. అప్పుడు ఆ పద్మంలో నుంచి సంపన్నుడూ, స్వయంభువుడూ, చతుర్ముఖుడూ అయిన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు.

సశేషం... 

🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 48 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 48. Padmanābhaḥ 🌻*

*OM Padmanābhāya namaḥ*

Padmaṃ nābhau yasya saḥ. He in whose nābhi (navel) the Padma (lotus), the source of the universe, stands.

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 8
Tasyārthasūkṣmābhiniviṣṭadṛṣṭer antargato'rtho rajasā tanīyān,
Guṇena kālānugatena viddhaḥ sūṣyaṃstadābhidyata nābhideśāt. (13)
Sa padmakośaḥ sahasodatiṣṭhat kālena karmapratibodhanena,
Svarociṣā tat salilaṃ viśālaṃ vidyotayann arka ivātmayoniḥ. (14)

The subtle matter of creation, on which the Lord's attention was fixed, was agitated by Rajoguṇa - the material mode of passion and thus the subtle form of creation pierced through His Nābhi or abdomen. (13)

Piercing through, this sum total form of the fruitive activity of the living entities took the shape of the bud of a lotus flower generated from the personality of Viṣṇu, and by His supreme will, it illuminated everything, like the Sun and dried up the vast waters of devastation. (14)

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अप्रमेयो हृषीकेशः पद्मनाभोऽमरप्रभुः ।विश्वकर्मा मनुस्त्वष्टा स्थविष्ठस्थ्सविरोध्रुवः ॥ 6 ॥

అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః ।విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠస్థ్సవిరోధ్రువః ॥ 6 ॥

Aprameyo hr̥ṣīkeśaḥ padmanābho’maraprabhuḥ ।Viśvakarmā manustvaṣṭā sthaviṣṭhasthsavirodhruvaḥ ॥ 6 ॥

Continues....
🌹 🌹 🌹 🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 49/ Vishnu Sahasranama Contemplation - 49🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻 49. అమరప్రభుః, अमरप्रभुः, Amaraprabhuḥ 🌻*

*ఓం అమరప్రభవే నమః | ॐ अमरप्रभवे नमः | OM Amaraprabhave namaḥ*

అమరాణాం ప్రభుః మరణమన్నది లేని అమరులకు (దేవతలు) ప్రభువు.

:: పోతన భాగవతము - అష్టమ స్కందము ::
వ. మఱియుఁ బ్రాప్తులైన వారల నింద్రపదంబులను, బహుప్రకారంబుల దేవపదంబులను, హరి ప్రతిష్ఠించుచుండు; వారలు విహితకర్మంబుల జగత్త్రయంబునుం బరిపాలింతురు; లోకంబులు సువృష్టులై యుండును.

విష్ణువు శక్తిమంతులను ఇంద్రపదవిలోనూ పెక్కు విధాలైన దేవతల పదవులలోనూ నెలకొల్పుతాడు. వారు తమకు నిర్ణయింపబడిన నియమాలతో మూడు లోకాలను ఏలుతారు. లోకాలు సుభిక్షంగా ఉంటాయి. 

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 49 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 49. Amaraprabhuḥ 🌻*

*OM Amaraprabhave namaḥ*

Amarāṇāṃ prabhuḥ The master of Amarās or the deathless ones i.e., the Devās.

Śrīmad Bhāgavata - Canto 8, Chapter 14
Manavo manuputrāśca munayaśca mahīpate,
Indrāḥ suragaṇāścaiva sarve puruṣa śāsanāḥ. (2)

All the Manus, the sons of every such Manu (who would be appointed as major Kings), all the Munīs (sages which includes the 7 great sages called Sapta R̥ṣis), all the Indrās (king of Gods) and other Devatās (Gods) and all such are under the rule of the Parama Puruṣa or Supreme person.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अप्रमेयो हृषीकेशः पद्मनाभोऽमरप्रभुः ।विश्वकर्मा मनुस्त्वष्टा स्थविष्ठस्थ्सविरोध्रुवः ॥ 6 ॥

అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః ।విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠస్థ్సవిరోధ్రువః ॥ 6 ॥

Aprameyo hr̥ṣīkeśaḥ padmanābho’maraprabhuḥ ।Viśvakarmā manustvaṣṭā sthaviṣṭhasthsavirodhruvaḥ ॥ 6 ॥

Continues....
🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Sripada Srivallabha Charithamrutham - 304 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 41
*🌻 Sripada declares Himself Datta - 2 🌻*

 Later he came to Venkatappaiah Shresti. There also ‘mangala snanam’ was performed to Him. 

Sripada took butter milk, butter and cream from their house. He told them that His devotees were calling Him and time had come to leave Peethikapuram. Later, He came to His grandfather Bapanarya’s house. He had ‘mangala snanam’ there also.  

He told them that He was indeed Datta, the Sripada Srivallabha form was only an ‘illusory form’ and people affected by snakes and people tormented by mental and physical disceases were calling Him. He had to declare clearly that He was Datta and start the programme of uplifting the world through His divine leelas.  

Later, He came to His house. When parents brought the subject of His marriage, Sripada said humbly, ‘Matha! Already I gave darshan along with Anagha Laxmi to grandfather, Shresti thatha and Varma thatha. Many people saw us couple playing in Shresti’s fields, Varma’s fields and mango gardens.  

Look! This is my form of Anagha with Anagha Laxmi. See my divine new auspicious form. I told you when I came as Avadhoota that I would leave the house when the matter of my marriage came for discussion.’  

After giving His auspicious darshan, he touched both his brothers. By the nectarine looks of Sripada, his brothers’ lameness and blindness disappeared. Sumathi Maharani and Appala Raju Sharma stood like statues.  

They could not say anything. Meanwhile, His grandmother Rajamamba, grandfather Bapanarya, Venkatappaiah Shresti, his ‘dharmapatni’ (wife) Venkata Subbamamba, Narasimha Varma and his ‘dharmapatni’ Ammaajamma also came there. He talked to all of them happily smiling and with fun.  

Sumathi Maharani said, ‘My Dear! Though you are saying that you are leaving clearing all debts, you can not repay the milk debt of Venkatappaiah Shresti, Vatsavai and Malladi families. Sripada said, “Amma! I can not deny your words.  

As long as the descendents of these three families do not forget Me, I will not forget them. Even if they forget I will remind them. Even by torturing, I will take their service and give the result. In your Malladi family where you are born, I will take food in any one of their houses in every generation. But I will not take dakshina.  

I know that they will treat me affectionately as their nephew. I will also respect that human relation and behave accordingly. What else do they need?’ He addressed His father and said, ‘Vedam will remain in our ‘Ghandikota’ family. Both my brothers will become good Veda pundits.  

As long as Ghandikota family will not forget me, I will not forget them. Sridhara Sharma will be born in one janma as Samardha Rama Das and will become ‘Guru’ to Narasimha Varma who would come to birth as Chatrapathi Shivaji. In this way the bond of our ‘Pourohityam’ will be confirmed.  

Rama Raju Sharma will be born as Sridhara and will become a great ‘yogi’. Maha Samsthanam on my name will be established in Peethikapuram by the disciples of Sridhara. Our debt relation with Venkatappaiah Shresti will be also established.  

Moreover, Vatsavai people also will come.” Thus He assured. Savithra Pannam was chanted. Vedam is very dear to Sripada. While veda pathanam was going on, He disappeared when all of them were looking. 

End of Chapter 41

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 73 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము -03 🌻*

కొద్దిగా విరమించినటువంటి స్థితిలో ఉంటాడు. కానీ చేసి ఒకటి రెండు పనులు, మూడు నాలుగు పనులు సామాన్య ధర్మం మేరకు, తన కర్తవ్యం మేరకు, తన ధర్మం మేరకు, తాను నిర్వహించేటటువంటి ఏ పనినైనా నూటికి వెయిపాళ్ళు సమర్థవంతంగా చేస్తాడు, సక్రమంగా చేస్తాడు. నిష్కామ కర్మగా చేస్తాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి లక్షణం.

 ఈ నిష్కామ కర్మకు సరిపోయేటటువంటి వాటిని మాత్రమే ఆచరిస్తాడు. మిగిలినటువంటి వాటిని ఆచరించడు. సకామ్య కర్మ ఏదైనా సరే, అది తన కర్తవ్యంలో లేనిదిగా భావిస్తాడు. తన కర్తవ్యంగా ఎప్పుడూ భావించడు.

 తన కర్తవ్యం కేవలం నిష్కామ కర్మ మాత్రమే. దీనికి సరిపడితేనే ఆ కర్మను అనుమతిస్తాడు. ఆ క్రియను అనుసరిస్తాడు. ఆ ఇంద్రియములను వ్యవహరింపజేస్తాడు. ఆ విషయాలలో ప్రవర్తిస్తాడు.

 తదనుభవ రూపమైనటువంటి ఫలితమను నిరసిస్తాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఫలితమును నిరసించగలిగేటటువంటి, విశేష లక్షణాన్ని నిరసించ గలిగేటటువంటి, సమర్థమైనటువంటి, తనదైనటువంటి, తానైనటువంటి స్థితియందు నిలకడ కలిగేటట్లుగా చేయటానికి, ఈ ఆంతరిక యజ్ఞంలో భాగంగా అయ్యేటటువంటి వాటిని మాత్రమే ఆచరిస్తాడు.

 మిగిలినటువంటి వాటికి విరమణ, మౌనం వహిస్తాడు, చేయడు అన్నమాట ఇక. అప్పుడు ఏమైపోయినై అంటే, చేసేటటువంటి పనుల సంఖ్య పరిమితించబడుతుంది. తీవ్ర వ్యవహారములన్నీ పరిమితించబడిపోతాయి. 

రజోగుణ, తమోగుణ ధర్మాలన్నీ విరమించబడుతాయి. ఎప్పుడైతే ఇవన్నీ విరమించబడుతాయో సాత్విక కర్మని కూడా నిష్కామ కర్మగా మాత్రమే చేస్తాడు. మిగిలిన వాటిని చేయడు. ఎందుకనంటే అవి వృధా. నిష్ప్రయోజనములు. 

ఎందుకనటా? ఆంతరిక యజ్ఞం చేయడానికి అవి ఉపయోగపడడం లేదు. ఎవరైనా యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞంలో హవిస్సులను అర్పించాలి అంతే కాని నీళ్ళు పోస్తారా? ఆ యజ్ఞం చల్లారి పోయేటట్లుగా చేయకూడదు.

 ఇటువంటి ఆంతరిక యజ్ఞం మరింతగా ప్రజ్వలించి, ఎంతగా ప్రజ్వలించాలయ్యా అంగాటే, సర్వ వ్యాపకమైనటువంటి అనంత విశ్వమంతా తానే అయినటువంటి స్థితిని ప్రాప్తింపచేసేంతగా సూక్ష్మతరము, సూక్ష్మతమము చేసేటట్లుగా ఈ ఆంతరిక యజ్ఞాన్ని చేయాలి. ఇట్లా వేద విహత కర్మ అంటే, ఈ ఆంతరిక యజ్ఞమే! నిజానికి సర్వ యజ్ఞముల యొక్క లక్ష్యము కూడా ఈ ఆంతరిక యజ్ఞమే. 

వేద విహితుడైనటువంటి బ్రాహ్మణుడు, నిత్యమూ చేయవలసినటువంటి కర్మ ఏమిటంటే, నిత్యకర్మ జ్యోతిష్టోమాది నిత్యకర్మ అంటారు. జ్యోతిష్టోమాది నిత్యకర్మ అంటే అర్థం ఏమిటంటే, ఈ ఆంతరిక యజ్ఞాన్ని సదా చేయాలి, 24 గంటలూ చేయాలి, మూడు అవస్థలలోనూ చేయాలి. 

తురీయ స్థితిలో నిలబడేటంత వరకూ చేయాలి. తురీయస్థితిలో నిలబడటమే సత్యంగా, నిత్యంగా, లక్ష్యంగా ఎంచుకుని చేయాలి. కాబట్టి ఇట్టి ఆంతరిక యజ్ఞాన్ని, ఇదే జ్యోతిష్టోమాది కర్మ అంటే అర్థం.

        అంతే కానీ, బాహ్యంగా చేసేటటువంటి యజ్ఞములు, యాగములు, హోమములు అన్నింటికీ కూడా ఈ అంతరిక యజ్ఞమే లక్ష్యార్థమై ఉన్నది, వాచ్యార్థమై ఉన్నది, వాచకమై ఉన్నది. కాబట్టి, బహిరంగంలో చేయబడేటటువంటివన్నీ కూడా కర్మ ఉపాసనలో భాగంగా వున్నాయి. 

ఈ కర్మ ఉపాసన భాగంగా చేయబడుతున్నటువంటి సర్వ యజ్ఞములు, సర్వ కర్మలు, సర్వ యాగములు, హోమములు, ధ్యానములు, యోగములు, ఉపాసనలు, అర్చనలు, నవ విధ భక్తి మార్గములు అన్నీ కూడా ఆత్మనివేదన అనబడే ఆంతరిక యజ్ఞాన్ని ఆశ్రయించడం కొరకే. 

ఈ ఆత్మనివేదన చేయటానికి అర్హమైనటువంటి స్థితిని సంపాదించి పెట్టేటటువంటి ఈ ఆంతరిక యజ్ఞాన్ని నిరంతరాయంగా ఎవరైతే చేస్తారో, వారిలో ఒక ఉత్తమ ఫలితం వస్తుంది. అది ఏమిటంటే, జ్ఞానాగ్ని లభిస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధ సర్వకర్మాణం - అన్ని కర్మలు అందులో దహించుకుపోతాయి. అన్ని కర్తృత్వ అభిమానము, భోక్తృత్త్వ అభిమానము పూర్ణాహుతి చేయబడుతాయి. 

ఇది ప్రతీ యజ్ఞంలోను, ప్రతీ యాగంలోను, ప్రతీ హోమంలోను చిట్టచివరికి వ్రేల్చబడేటటువంటి ఈ పూర్ణాహుతి అంటే అర్థం ఏమిటంటే, కర్తృత్వాభిమానమును-భోక్తృత్వాభిమానమును సర్వకర్మలను.

సర్వధర్మాన్‌ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ|
అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః||

        సర్వకర్మ పరిత్యాగం జరిగిపోతుందన్నమాట. కర్మ పరిత్యాగం అంటే కర్మఫల పరిత్యాగం. ఫలం లేకపోతే కర్మ యొక్క ప్రయోజనం లేదు. 

అటువంటి ఫల పరిత్యాగ పద్ధతి అయినటువంటి, నిష్కామ కర్మ వేద విహిత కర్మలను, ఫలాపేక్ష లేక, ఆచరించువాని యొక్క చిత్తము నిర్మలమౌతుంది. ఇది చాలా ముఖ్యము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 89 / The Siva-Gita - 89 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ 

ఏకాదశాధ్యాయము 
*🌻. జీవ గత్యాది నిరూపణము - ఉపాసనా మాహాత్మ్యము - 3 🌻*

తత శ్శుక్రం రజశ్చైవ -భూత్వా గర్భోభి జాయతే,
తతః కర్మాను సారేణ భవేత్ స్త్రీ పుం నపుంస కః 21
ఏవం జీవ గతి: ప్రోక్తా - ముక్తిం తస్య వదామితే,
యస్తు శాంత్యాది యుక్తస్స - న్సదా విద్యారతో భవేత్ 22
సయాతి దేవ యానేన - బ్రహ్మ లోకా వధిం నరః ,
అర్చిర్భూ త్వా దినం ప్రాప్య - శుక్ల పక్ష మధో వ్రజేత . 23
ఉత్తరాయణ మాసాద్య - సంవత్సర మధో వ్రజేత్,
ఆదిత్య చంద్ర లోకౌతు - విద్యుల్లోక మతః పరమ్ 24
అధః దివ్యః పుమాన్కశ్చి - ద్బ్రహ్మ లోకాది హైతి సః,
దివ్యే వ పుషి సంధాయ - జీవ మేవం నయ త్యసౌ 25

ఆ మీదట కర్మానుసారాముగా స్త్రీ -పురుష -నపుంస కాది భేదములతో బుట్టుట జీవుని ముక్తిని గురించి చెప్పుచున్నాను. వినుము.  

ఎవ్వడైతే శాంత్యా దులతో కూడుకొని యెల్లపుడు విద్యా సక్తుడగునో వాడు బ్రహ్మ లోక పర్యంతరమును దేవయానము (విమానము ) న పోవును. తేజో రూపము చేత దేవపురుషుడై దినము - శుక్ల పక్షము, ఉత్తరాయణము, పిదప సంవత్సరమును పొందును. 

ఆదిత్య చందర లోకములను, తరువాత విద్యుల్లోకమును పొందును. ఆ మీదట ఒకానొక దివ్య పురుషుడు బ్రహ్మ లోకము నుండి విద్యుల్లోకమునకు వచ్చును. ఇట్లు ఈ దివ్య దేహముతో నున్న వాడు జీవుని పొంది బ్రహ్మ లోకమునకు దోడ్కొని పోవును .

బ్రహ్మ లోకే దివ్య దేహే -భుక్త్వా భోగా న్యదే ప్సితాన్,
తత్రో షిత్వా చిరం కాలం - బ్రహ్మణా సః ముచ్యతే. 26
శుద్ధ బ్రహ్మ రతో యస్తు- న సయాత్యేవ కుత్ర చిత్,
తస్య ప్రాణా విలీ యంతే - జలే సైంధవ ఖిల్య వత్ 27
స్వప్న దృష్టా యధా సృష్టి: ప్రబుద్దస్య విలీయతే,
బ్రహ్మ జ్ఞాన వతస్తద్వ- ద్విలీ యంతే తధైవతే. 28
విద్యా కర్మ విమినో య స్త్రుతి యమ స్థాన మేతిసః ,
భుక్త్యాచ నారా కాన్ఘోరా - న్మమా రౌర వరౌరవాన్ 29            
పశ్చా త్ప్రాక్త నవే షేన -క్షుద్ర జంతు ర్భ వేదసౌ ,
యూకామ శక దంశాది - జన్మా సౌలభతే భువి. 30

బ్రహ్మ లోకమున దివ్య దేహముతో సమస్త కోరికల ననుభవించి చాలాకాల మచటనే యుండి బ్రహ్మముతో మోక్షమును పొందును.

 కేవలము నా బ్రహ్మ రతుడు నిర్వికారుడై జలముతో నున్న ఉప్పు ముద్దవలె నుండును. అతని ప్రాణములు తన లోనే లయమగును. స్వప్నములోని సంఘటన మేల్కొన్న వాని కెట్లు తిరోమిత మగుచుండునో 
బ్రహ్మ జ్ఞాని కన్నియు వటులనే యగును.

 విద్యా కర్మ శూన్యునికి తృతీయ స్థానము (నరకము ) లభ్యమగును. అట్టివాడు రౌరవాది మహానరకముల ననుభవించి మునుపటి కర్మ శేషము చేత నీచ ప్రాణియై పుట్టును. దోమ - ఈగ మొదలగు వాని జన్మను భూలోకమున దాల్చును.

 ఈ ప్రకారంబుగా జీవగతిని వివరించితిని.ఇకముందే మి ప్రశ్నిం చెదవు?

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 The Siva-Gita - 89 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayala somayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 11 
*🌻 Jiva Gatyaadi Niroopanam - Upasana Mahatya - 3 🌻*

Subsequently based on the Karma of the Jiva, female, male or eunuch bodies are obtained. Now I would explain the path of reaching higher abodes (gati) for the Jiva. 

Listen! One who possesses peaceful nature etc. good qualities , remains inclined towards the scriptures and righteousness, he is taken away till Brahma loka in celestial plane. 

With divine splendor, he becomes Devapurusha, and stays during
Suklapaksham, Uttarayanam. First attains to the abodes of Sun and moon, then attains to Vidyullokam, after that a celestial deity comes descends from Brahma loka to Vidyulloka and takes the Jiva to Brahma loka.

In the abode of Brahma with the celestial body the Jiva enjoys all his desires for a long time. After staying there for a long period he gets moksha alongwith Brahma. 

Only that Brahmajnani remains one with Brahman as like as salt melts in water. As like as one can recall the dreams after waking up, a Brahmajnani also can recall everything similarly. 

For a Jiva who is devoid of Vidya (wisdom) and Karma third place is given which is Hell. Such a Jiva experiences extreme torture in Hells named raurava and similar ones and with the leftover Karma he gains birth as a heinous creature like flies, mosquitoes etc. on earth. This is about the Jiva Gati topic. Do you have any questions, Rama? 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 92 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
85

We discussed that the Gods were strengthened just by the Guru’s glance. The Gods became prosperous. But, the Demons, not heeding the Guru’s advice lost their strength and were punished appropriately. 

The divine form of Lord Kurma contains all the planets and constellations, so by worshiping Guru Kurma, all evil planetary effects were removed. The malefic planets were pacified and drawn to auspiciousness. That is why, in all the temples, you can find a small temple or an idol of Lord Kurma. 

You should understand that through this sloka, Lord Siva is indicating that, like Lord Kurma’s grace, the Guru’s grace eternally flows to the disciples and grants many benefits. Our attention is not going towards the Guru. The reason for this is attachment to the body. They are describing the quality of this body here. 

Sloka: 
Bhasma kita vidantam hi deham sthulam varanane | Tvanmutra rudhirantrasthi mala mamsadi bhajanam || 

Siva says to Parvati that the flesh, excretions, puss, blood, intestines, bones etc., are the ingredients of this gross body. What happens to this body in the end?

If it is put to fire, it is reduced to ashes, if buried, it is decomposed, or if it is thrown away, it is infested with worms. Many great sages were witness to this conversation between Siva and Parvati. 

Among them were some who had consumed the divine nectar. But, their bodies were made of the five elements. Withering away is imminent to a body made of the five elements. Lord Siva particularly addressed this matter to them. 

Then, what can be said of our mortal bodies? Attachment to the body is the root cause of this samsara. That is what leads to destruction. In this sloka, they are advising on what needs to be done to escape from that. This instruction is in the form of worship to the Guru. 

Sloka: 
Samsara vrksha marudhah patanto narakarnave | Sarve yenoddhrta lokah tasmai sri gurave namah || 

Obeisance to Sadguru, the uplifter of all worlds sinking into the sea of hell from the tree of samsara. 

We think of our body as our world. We go about our daily activities with this feeling. The elders have compared this samsara with a tree, it’s been variously called the “tree of samsara” or the “poisonous tree”. This tree of samsara grows with unstinted velocity. 

Samsara vruksa maghabeejamananta karma This is a massive tree. It is growing exponentially – branches, more branches, branches of branches, flowers, fruits, more branches – into a massive tree.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 78 / Sri Gajanan Maharaj Life History - 78 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 15వ అధ్యాయము - 4 🌻*

కరవీర్ కొల్హాపూరుకు చెందిన శ్రీధర గోవిందకాళే పేరుగల ఒకపేద చిత్పవన్ బ్రాహ్మణ కుర్రవాడు ఇంగ్లీషు బడిలో చేరి మెట్రిక్ ఉత్తీర్నుడయ్యాడు. తరువాతా కళాశాలలో చేరాడు కానీ ఇంటర్లో ఉత్తీర్నుడుకాలేదు. కేశరి అనే వారపత్రిక చదువుతూ ఒయామా మరియు టొగోల జీవిత చరిత్రగూర్చి తెలుసుకుంటాడు. దాని ప్రేరణతో సాంకేతిక విద్యకోసం విదేశం వెళ్ళాలని తలుస్తాడు. 

ఒయామా మరియు టొగోలు ఆపని చేసి తమ జ్ఞానంతో జపానుకు అభివృద్ధి తెచ్చారు. శ్రీధర్ కుడా మాతృదేశానికి అదేపని చేద్దామని కోరుకున్నాడు, కానీ పేదరికంవల్ల నిస్సహాయునిగా తలచాడు. పేదవాళ్ళకి ఎవరూ సహాయం చెయ్యరు. అతను అప్పుడు మాన్రో ఉన్నతపాఠశాలలో పనిచేస్తున్న స్నేహితుని దగ్గరకు, కలిసేందుకు భండారా వెళ్ళడు. 

అతను తన స్నేహితునికి తనమనసులోనివి అన్నీ చెప్పాడు. ఈవిచారణకు అతనుకూడా అభినందించాడు. కానీ డబ్బుసంగతి ఏమిటి ? ఈప్రపంచంలో ధనం లేకుండా ఏదీవీలుకాదు. మరియు పేదవాళ్ళు గాలిలో మేడలు కట్టడమే. విదర్భలోని వేసవి ఎండకు, వాళ్ళు కొల్హాపూరు వెళదామని నిశ్చయించుకున్నారు. గొప్పయోగి అయిన శ్రీగజానన్ మహారాజు గురించి వినడంవల్ల, దారిలో వాళ్ళు ఆయోగిని చూసేందుకు షేగాంలో దిగుతారు. 

వాళ్ళు తమసామాను తపాలా ఆఫీసులో పెట్టి, శ్రీగజానన్ మహారాజు మఠానికి వెళ్ళారు. నమస్కారంచేసి చేతులు కట్టుకుని, ఆయన ముందు కూర్చున్నారు. శ్రీమహారాజుకు దివ్యశక్తి వల్ల శ్రీధరు కోరికలు తెలుసు. నీకు కావలసినవన్నీ ఇక్కడే లభ్యంఅవుతాయి. ఈ భౌతిక శాస్త్రం పనికిరానిది, కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నించు, దీనివల్ల నీకు సంతృప్తి కలుగుతుంది అని శ్రీమహారాజు అన్నారు. 

ఈ సలహాతో, అకస్మాత్తుగా శ్రీధరు తన ఆలోచనలో మార్పు అనుభూతి పొందాడు, మరియు ఇది కొల్హాపూరులో సరగ్గా శ్రీగజానన్ మహారాజులా మాట్లాడే ఒకయోగిని గుర్తుకు తెచ్చింది. అతని మనసులోని కలవరాన్ని గ్రహించి... హిందుస్తాన్ వదలాలని అనుకోకు, చాలా మంచి పనులు చేసిన తరువాత ఇక్కడ జన్మదొరుకుతుంది. 

యోగశాస్త్రం మిగిలిన అన్ని విజ్ఞానాలకంటే విశిష్టమయినది, ఎవరయితే యోగశాస్త్రం ఎరిగి ఉంటారో వాళ్ళు మరి ఏవిజ్ఞానాన్ని లెఖ చెయ్యరు. ఆత్మజ్ఞానం ఈ యోగశాస్త్రంకంటే విశిష్టమయునది, దానిని నేర్చుకనేందుకు ప్రయత్నించు, కానీ ఎక్కడికి వెళ్ళకు అని శ్రీమహారాజు అన్నారు. 

ఈ మాటలు విన్న శ్రీధరు చాలా ఆనందం అనుభూతిచెంది, పశ్చిమంలో అస్తమించిన ఆలోచన అనే సూర్యుడు తనని సంతోషపరిచేందుకు తిరిగి తూర్పున ఉదయించి నట్టుగా భావించాడు. ఒక్కయోగులే ఈవిధమయిన ఆలోచనా మార్పు తేగలరు, ఎందుకంటే వాళ్ళకు సత్యం తెలుసు కనుక. నువ్వు ఇక్కడనే రాణిస్తావు, ఇక నీ స్నేహితునితో కొల్హాపూరు వెళ్ళు, నీ భార్య ఎదురు చూస్తోంది అని శ్రీమహారాజు అన్నారు. 

ఆయన వాక్కు నిజం అని నిరూపించబడింది, శ్రీధరు చాలా రాణించాడు. అతను బి.ఎ మరియు ఎం.ఎ పరీక్షలలో ఉత్తీర్నుడయి, సింధియారాజ్యంలోని శివపురిలో కళాశాల ప్రధాన అధ్యాపకునిగా అయ్యాడు. యోగులు ఈభూమి మీద అవతరించిన భగవస్వరూపులు. వారి ఆశీర్వాదాలు ఉన్నవారు ఎప్పుడూ అభివృద్ధి పొందుతారు. శ్రీధరు ఆలోచనలో మార్పు, శ్రీమహారాజు ఆశీర్వచనాల వల్లే అయింది.

ఈ విధమయిన యోగులు మనపుణ్య భూమిమీద పెరుగుతారు. స్వర్గం అనే వృక్షాలు మరి ఎక్కడా వేళ్ళుపొందవు. దాసగణు విరచించిన ఈ గజానన్ విజయ గ్రంధం ఎల్లప్పుడూ భక్తులకు సరి అయిన బాట చూపించుగాక. 

 శుభం భవతు 
  15. అధ్యాయము సంపూర్ణము.
సశేషం...
🌹 🌹🌹 🌹 🌹 

*🌹 Sri Gajanan Maharaj Life History - 78 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 15 - part 4 🌻*

A poor Chitpavan Brahmin boy, named Shridhar Govind Kale from Karvi, Kolhapur, joined English school and passed metric. Then he joined college, but failed in Inter. While reading the ‘Kesari’ newspaper, he came across the biography of Oyama Togo. Inspired by it, he wished to go abroad for some technical education. 

Oyama Togo had done it, and brought prosperity to Japan by their knowledge. Shridhar wished to do the same thing for his motherland, but felt helpless due to poverty. Nobody helps the poor. He then went to Bhandara to meet his friend who was teacher at the Monro High School there. 

He told his friend everything that came to his mind, and he too appreciated the idea. But what about the money? Nothing is possible in this world without money and the poor people have to build castles in the air only. Due to hot summer of Vidarbha, they decided to go to Kolhapur. 

Having heard much about the great saint, Shri Gajanan Maharaj, they, on their way, got down at Shegaon to see the saint. They kept their luggage at the post office and went to the Matth of Shri Gajanan Maharaj, and prostrating before Him, sat with folded hands. 

By His divine powers, Shri Gajanan Maharaj knew the desire of Shridhar, and said, Don't think of going abroad. You can get everything here only. These physical sciences is useless, and so try to get some spiritual knowledge that can bring satisfaction to you.” 

By this advice, Shridhar experienced a sudden change in his thinking and was reminded of one saint of Kolhapur who used to talk just like Shri Gajanan Maharaj. Sensing the confusion in his mind, Shri Gajanan Maharaj further said, Don't think of leaving Hindustan, as one gets birth here, only after doing a lot of good deeds. 

Yogashastra is superior to any other material science, and one who knows Yogashastra will not care for any other science. The knowledge of the self (Adhyatma) is further superior to Yogashastra. Try to learn that and don't go anywhere.” 

Hearing these words, Shridhar felt very happy and thought that the sun of thinking that had set in the west had risen again in the east. Only saints can bring about such transformation of thoughts, because they know the Truth. Shri Gajanan Maharaj further said, You will prosper here only. 

Now go to Kolhapur with your friend as your wife is waiting for you.” The prophecy proved true and Shridhar prospered well. He passed the B.A. and M.A. Examinations and became the Principal of the College at Shivpuri in the Kingdom of Scindias. 

Saints are God incarnate on this earth and those, who get their blessings, always prosper. The change in Shridhar's thinking was due to the blessings of Shri Gajanan Maharaj . This crop of Saints can grow only in our holy land. 

Trees of heaven will not root elsewhere. May this Gajanan Vijay Granth, composed by Dasganu, always show right path to the devotees. 

||SHUBHAM BHAVATU||
 Here ends Chapter Fifteen

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 71 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 21 🌻*

291. భగవంతుడు శాశ్వతముగా , పరాత్పర స్థితిలో దివ్య సుషుప్తి యందే ఉన్నాడు .కాని మానవస్థితిలోనున్న భగవంతుడువై కల్పికముగా ఒకసారి సుషుప్తిని ,మరొకసారి జాగృతిని అనుభవించుచున్నాడు .

292. గాఢనిద్రలో మానవుని దేశ _కాలములు నాశనమైనట్లుగా నున్నవి .అనగా , తాత్కాలికముగా నాశనమైనవి .

293. గాఢనిద్రలో దేశ_కాలములు నాశనమైనప్పుడు , అతడు మేల్కొనగానే మరల పగలు , విశ్వమును అతనికి ఎట్లు వచ్చుచున్నవి ?

*🌻. సృష్టి -స్థితి- లయములు .🌻* 

294. పరిణామక్రమములో ప్రోగుపడి, గాఢనిద్రలో నిద్రాణమైయున్న మానవుని స్వీయ సంస్కారములు ,చైతన్యము అతనికి ప్రతి దినము జాగ్రదవస్థలో ఉదయమును ,విశ్వమును సృజించుచున్నవి .

295. జాగ్రదవస్థలో మానవుని నిత్యజీవిత స్వీయ సంస్కార ములచే ఉదయ , విశ్వములు పోషింపబడుచున్నవి .

296. జాగ్రదవస్థయందున్న సంస్కారములు ,నిద్రావస్థలో
నున్న అనుభవ సంస్కారములచే పగలు , విశ్వములు నాశనమౌచున్నవి .

297. భగవంతుడు ,
(1) మానవుని నిద్రాణసంస్కారముల ద్వారా తన స్వీయ సృష్టికి .........కర్తననియు

(పెరుగుట) విశ్రాంతి గొనుట , ముడుచుకొనుట (సంకోచించుట) మొదలగు సంకోచ , వికాసముల ద్వారా జరుగుచున్న సమయమందే -  
శిశువు జన్మించుచున్నది - సృష్టి 
శిశువు పోషింపబడుచున్నది - స్థితి
చివరకు గుండె , చరముగా సంకోచించుట ద్వారా , విశ్రాంతి రూపములో దేహము విడువబడు చున్నది (మరణము ) - లయము .

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 31, 32 / Sri Lalitha Chaitanya Vijnanam - 31, 32 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :* 
*13. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత*
*రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత*

*🌻 31. 'కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా' 🌻*

అంగదము, కేయూరము అను బంగారపు, కమనీయపు భుజములచే ప్రకాశించుచున్న దేవి అని భావము. 

అమ్మవారి నాలుగు భుజముల కాంతిని దర్శించుట ఈ నామము యొక్క ధ్యేయము. శ్రీదేవి శరీరమే బంగారు కాంతులను విరజిమ్ముచు నుండును. నాలుగు భుజములు అంతఃకరణ చతుష్టయమునకు సంకేతములని యిదివరకే వివరింపబడి యున్నది. 

భుజముల కాంతిని ధ్యానించుట వలన అంతఃకరణము పరిశుద్ధి నొందగలదు. కరణమునకు (చేతలకు) అంతఃకరణ పవిత్రతయే ముఖ్యము. 

అట్టి పవిత్రత శ్రీదేవి నాలుగు భుజముల ఆభరణముల కాంతిని ధ్యానించుటచే ఏర్పడ గలదు. కాంతివంతమైన ఆమె భుజములు అంగద, కేయూర ఆభరణములను ధరించినట్లు భ్రమకొల్పును కాని, నిజమునకు ఆమె భుజముల సౌష్టవ కాంతి అది.

 ఆభరణములను పెట్టుకొనుట వలన సామాన్యులు అందముగ కనబడుదురు. అందమైనవారు ఆభరణములను పెట్టుకొనినప్పుడు వారి కాంతి ఆభరణములకు అందమిచ్చును. అమ్మ ధరించిన ఆభరణముల నుండి విరజిమ్మ బడుచున్న కాంతి అమ్మ భుజముల నుండి జనించినదే కాని, బంగారము నుండి కాదు. 

బంగారమే అమ్మ శరీరము నుండి పుట్టినదికదా! కావున నాలుగు భుజములు హిరణ్మయముగా భావన చేయుచూ, అందలి కమనీయత్వము గ్రోలుటలో మనస్సు హరింపబడ వలెను. 

బహిర్ముఖమైన మనస్సు అంతర్ముఖమై బంగారు కాంతులతో మునిగినప్పుడు అంతఃకరణములు పరిశుద్ధి చెందగలవు. అట్టి అంతఃకరణములు బహిఃకరణములను కూడ చైతన్యవంతముగా చేయగలవు. 

అది కారణముగ లోకహిత కార్యముల నొనర్చు అంగబలము, భుజబలము ఉపాసకునకు ఏర్పడగలవు. మెడ, య బాహువులు, కంఠము మిథునరాశి చిహ్నములు. మిథునరాశి ద్విస్వభావ రాశి. ద్వంద్వముగ కనబడుచున్న సమస్త సృష్టి రహస్యములు ఈ రాశి యందు సంకేతింపబడినవి. 

ముందు తెలుపబడిన నామములలో గల మెడ, మంగళసూత్రములు, నామమున అంగద, కేయూరములు తెలుపబడుటలో ద్వంద్వము కలిగి అధిష్ఠించబడిన సమన్వయము కలిగిన దేవిగ అమ్మను అవగాహన చేసుకొనవలెను. 

దేవీ సహస్ర నామములయందు ద్వంద్వములు, పరస్పర
విరుద్ధములు అయిన విషయముల యందు ఏకత్వము ప్రతిపాదింప బడినది. ఏకత్వమునందు ద్వంద్వములను దర్శించుట మొదలగును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 31 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 31. Kanakāṅgada- keyūra- kamanīya- bhujanvitā* *कनकाङ्गद-केयूर-कमनीय-भुजन्विता (31) 🌻*

kanaka – golden; aṅgada – bangles or bracelets; keyūra is a type of ornament worn in the upper arms. She is wearing these ornaments. Possibly, this could mean the following.  

Both these ornaments are made out of gold and worn in the arms. Though they differ in form, the ingredient gold is the same in both.  

Though the forms of living beings are different, the innermost Brahman remains the same.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 32 / Sri Lalitha Chaitanya Vijnanam - 32 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :* 
*13. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత*
*రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత*

*🌻 32. 'రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత 🌻*

రత్నములు, బంగారము, ముత్యములతో చేయబడిన కంఠాభరణములను దాల్చినది అని అర్ధము. కంఠము ఊర్థ్వలోకమునకు, మానవ లోకమునకు మధ్యస్థమైన లోకము. 

మానవప్రజ్ఞ విశిష్ట శుద్ధి నొందనిదే దివ్య లోకానుభవములకు పాత్రత పొందదు. ఈ నామమున చెప్పబడిన కంఠాభరణములలో రత్నములు, ముత్యములు, బంగారము వున్నవి. రత్నములు బంగారములో పొదగబడినవి. అవి కంఠమున అలంకరించగా చలించుచున్న ముత్యపు హారము ఒకటి కంఠాభరణమునకు తగుల్కొని యున్నది. 

ముత్యపు హారము చలించుట మనో చాంచల్యమును సూచించును. ఈ చపల స్వభావము ఉపాసకుని కంఠములందు చింతలు గలవారిగ సూచించును. చింతలను గూర్చి దేవిని ధ్యానించువారు ఈ కదలుచున్న ముత్యపు హారము వంటివారు. ముత్యమునకు, చంద్రునకు, మనస్సునకు గల స్వాభావిక సంబంధమును యిచ్చట గమనించదగును.

కంఠమున పరిశుద్ధి కలిగినకొలది నిశ్చలమైన రత్నము, బంగారము కాంతులు దర్శనమగును. అంతకు పూర్వము చింతాకలిత మైన, చంచలమైన ఆరాధన ఇప్పుడు నిశ్చలమైన ఆరాధనగ పరిణతి
చెందును.

 క్రిందవున్న ముత్యపు హారము తను స్వభావము, దైవీ స్వభావము మిశ్రమముగ నుండుటచే కదలుచు నుండును. దాని కాధారమైన కంఠాభరణము జీవుని భూమికయైన దేహపుంజము (మనసు, ఇంద్రియములు, శరీరము) నధిష్ఠించివున్న ప్రజ్ఞకు సంకేతము.

నిశ్చలమైన కాంతిలోక ప్రవేశమునకు కూడ సంకేతము. ఇట్టి వారు దేవిని నిశ్చలముగ ధ్యానము చేయగలరు. పై నిశ్చలత్వము పొందుటకు ఉపాసకుడు వాజ్మయ తపస్సును చేయవలసి యుండును. కంఠపు లోయనుండి వచ్చు శబ్దములను దైవముగ దర్శించుచూ మాటాడుట ఈ తపోనియమము. ఎట్టి పరిస్థితులలోను అశ్లీలము, అపవిత్రము, అబద్ధము కలుగచేయు ధ్వనులను పలుకరాదు.

 కంఠాభరణమును, దానిమధ్య వ్రేలాడుము హారమును పై విధముగా ఆరాధన చేయుట ఉపాసకునకు శ్రేయస్కరము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 32 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

Ratna-graiveya-cintāka-lola-muktā-palānvitā रत्न-ग्रैवेय-चिन्ताक-लोल-मुक्ता-पलान्विता (32)

She is wearing a gems embedded golden pendent and a pearl necklace. These ornaments are dangling in Her neck. 

The dangling of these ornaments is compared to mind. Those who are not capable of meditating Her full form (head to foot) are said to be low class devotees and called as lola-s.  

Those who are able to meditate on Her full form are said to be high class devotees and called as muktā-s. Lola-s or muktā-s get the benefits (pala) of their prayers according to their category. This is the meaning of lola- muktā- palānvitā.  

While worshipping Her, one has keep to keep his mind steady, without distractions.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 431 / Bhagavad-Gita - 431 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 40 🌴*

40. నమ: పురస్తాదథ పృష్టతస్తే
నమో(స్తు తే సర్వత ఏవ సర్వ |
అనన్తవీర్యామితవిక్రమస్త్వం
సర్వం సమాప్నోషి తతో(సి సర్వ: ||

🌷. తాత్పర్యం : 
నీకు ముందు నుండి, వెనుక నుండి, సర్వదిక్కుల నుండి నమస్కారముల నర్పించుచున్నాను. ఓ అనంతవీర్యా! నీవు అమితవిక్రమ సంపన్నుడవు మరియు సర్వవ్యాపివి. కనుకనే సర్వమును నీవే అయి యున్నావు.

🌷. భాష్యము : 
అర్జునుడు తన స్నేహితుడైన శ్రీకృష్ణుని యెడ ప్రేమపారవశ్యముచే అన్నివైపుల నుండి నమస్సుల నర్పించుచున్నాను. శ్రీకృష్ణుడు సకల పరాక్రమములకు, శక్తులకు ప్రభువనియు, యుద్దరంగమునందు కూడియున్న మహాయోధులందరికన్నను అత్యంత ఘనుడనియు అర్జునుడు ఆంగీకరించుచున్నాడు. ఈ విషయమునకు సంబంధించినదే విష్ణుపురాణమున (1.9.69) ఇట్లు చెప్పబడినది.
యో(యం తవాగతో దేవ సమీపం దేవతాగణ: |
స త్వమేవ జగత్స్రష్టా యత: సర్వగతో భవాన్ ||
“ఓ దేవదేవా! నిన్ను సమీపించు ఎవ్వరైనను (దేవతలైనను సరియే) నీ చేత సృష్టింపబడినవారే.”
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 431 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 40 🌴*

40. namaḥ purastād atha pṛṣṭhatas te
namo ’stu te sarvata eva sarva
ananta-vīryāmita-vikramas tvaṁ
sarvaṁ samāpnoṣi tato ’si sarvaḥ

🌷 Translation : 
Obeisances to You from the front, from behind and from all sides! O unbounded power, You are the master of limitless might! You are all-pervading, and thus You are everything!

🌹 Purport :
Out of loving ecstasy for Kṛṣṇa, his friend, Arjuna is offering his respects from all sides. He is accepting that He is the master of all potencies and all prowess and far superior to all the great warriors assembled on the battlefield. It is said in the Viṣṇu Purāṇa (1.9.69):

yo ’yaṁ tavāgato deva
samīpaṁ devatā-gaṇaḥ
sa tvam eva jagat-sraṣṭā
yataḥ sarva-gato bhavān

“Whoever comes before You, even if he be a demigod, is created by You, O Supreme Personality of Godhead.”
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Join and Share My Groups 🌹*
Prasad Bharadwaj 

*చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel*
https://t.me/Spiritual_Wisdom

*చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group*
https://t.me/ChaitanyaVijnanam

*JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.*
https://t.me/vishnusahasra

*Join and Share శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam* 
https://t.me/srilalithadevi

*Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam*
https://www.facebook.com/groups/465726374213849/ 

*Like and Share FB Page*
https://www.facebook.com/విష్ణు-సహస్ర-నామ-తత్వ-విచారణ-Vishnu-Sahasranama-111069880767259/

*Follow and Share FB Page*
https://www.facebook.com/శ్రీ-లలితా-దేవి-చైతన్యము-Sri-Lalitha-Devi-Chatanyam-103080154909766/
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 3 / Sri Devi Mahatyam - Durga Saptasati - 3 🌹*
✍️. మల్లికార్జున శర్మ 
📚. ప్రసాద్ భరద్వాజ 

అధ్యాయము 1
*🌻. మధు కైటభుల వధ వర్ణనము - 3 🌻*

రాజు పలికెను : భగవాన్! మిమ్మల్ని నొకటి అడగాలని అనుకుంటున్నాను. దయచేసి దానికి బదులివ్వండి. (39–40)

నా మనస్సు నా చిత్రానికి అధీనంకాక దుఃఖవశమై ఉంది. నేను రాజ్యాన్ని కోల్పోయి, అజుని వలె - నాకది తెలిసుండి - రాజ్యాంగాల అన్నింటిపై నాకు మమత్వం నిలిచి ఉంది, మునిసత్తమా! ఇది ఎలా? ఇతడు కూడా భార్యాపుత్ర భృత్యజనంచేత, స్వజనంచేత తిరస్కృతుడై విడనాడబడి, వారిపై అత్యంత ప్రేమ కలిగి ఉన్నాడు. 

ఇలా ఇతడూ, నేనూ, విషయంలో దోషాలను చూస్తూనే, మమత్వం చేత వాటివైపుకు ఆకర్షించబడి అత్యంత దుఃఖితులమై ఉన్నాము. ఓ నిర్మలచిత్తుడా ! తెలిసినవారమైన నాకు, ఇతనికి ఈ మోహం కలిగిందే! మా వివేకాన్ని పోగొట్టి మూఢులను చేసిందే! ఇది ఎలా? (39–45)

ఋషి పలికెను : ఇంద్రియగోచరమైన విషయజ్ఞానం సమస్త జంతువులకు ఉంది. ఇంద్రియ విషయాలు వేర్వేరు విధాలుగా వాటికి తెలియవచ్చు. కొన్ని ప్రాణులు పగటిపూట చూడలేవు, మరి కొన్ని ప్రాణులు రాత్రిపూట చూడలేవు. మరి కొన్ని రేయుంబగళ్లు సమంగా చూడగలపు. 

మనుషులు జ్ఞాసం కలిగి ఉండడం నిజమేగాని అది కేవలం వారికి మాత్రమే ఉండేది కాదు. పశుపక్షి మృగాదులకు కూడా (ఇంద్రియవిషయ) జ్ఞానం ఉంది. మనుష్యులకు గల జ్ఞానం మృగపక్షులకు కూడా ఉంది, వానికి గల జ్ఞానం మనుష్యులకు కూడా ఉంది.  

తక్కినది (నిద్రాభోజనాదికము) రెండుజాతులకూ సమమై ఉన్నది. ఆ పక్షులవంక చూడు. వాటికి జ్ఞానం ఉండి కూడా, తాము ఆకలిచే పీడింపబడుతూ, మోహవశులై, తమ పిల్లల ముక్కులలో (నోళ్లలో) ధాన్యకణాలను (గింజలను) వేస్తున్నాయి. (46–51)

ఓ మనుజవ్యాఘ్ర (శ్రేష్ఠ)! ప్రత్యుపకారం కలుగగలదనే ఆశతో మానవులు తమ బిడ్డలయెడ అభిలాష కలిగివుంటారు. నీకు ఇది కనిపించడం లేదా? అయినప్పటికీ సంసార స్థితికారిణి అయిన మహామాయ యొక్క ప్రభావంచేత వారు (మానవులు) మమత అనే సుడిగుండంలోకి, మోహం అనే గుంటలోకి కూలద్రోయబడుతున్నారు. 

దీనికి ఆశ్చర్యపోవద్దు, ఈ మహామాయ జగత్పతియైన విష్ణుదేవుని యోగనిద్ర . ఆమె చేతనే జగత్తు సమ్మోహితమవుతున్నది. ఆ దేవి, ఆ భగవతి, ఆ మహామాయ జ్ఞానుల మనస్సులను కూడా ప్రబలంగా ఆకర్షించి మోహగ్రస్తులుగా చేస్తుంది సుమా! (52-55)

ఈ చరాచరరూప జగత్తునంతా ఆమెయే సృజిస్తోంది. ఆమె అనుగ్రహిస్తే నరులకు ముక్తినొసగే వరదాయిని. ఆమె పరావిద్య, ముక్తి హేతువు, సనాతనీ, సంసారబంధానికి కూడా ఆమెయే హేతువు. ఈశ్వరులనందరినీ పరిపాలించు పరమేశ్వరి ఆమెయే. (56–58)

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 3 🌹*
✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj

Chapter 1
*🌻 Description of Killing of Madhu and Kaidabha - 3 🌻*

 39-45. 'Sir, I wish to ask you one thing. Be pleased to reply to it. Without the control of my intellect, my mind is afflicted with sorrow. Though I have lost the kingdom, like an ignorant man- though I know it- I have an attachment to all the paraphernalia of my kingdom. 

How is this, O best of sages? And this merchant has been disowned by this children, wife and servants, and forsaken by his own people; still he is inordinately affectionate towards them. 

Thus both he and I, drawn by attachment towards objects whose defects we do know, are exceedingly unhappy. How this happens, then, sir, that though we are aware of it, this delusion comes? This delusion besets me as well as him, blinded as we are in respect of discrimination.' The Rishi said:

46-49. Sir, every being has the knowledge of objects perceivable by the senses. And object of sense reaches it in various ways. Some beings are blind by day, and others are blind by night; some beings have equal sight both by day and night.

 Human beings are certainly endowed with knowledge, but they are not the only beings ( to be so endowed), for cattle, birds, animals and other creatures also cognize (objects of senses).

50-58. The knowledge that men have, birds and beasts too have; and what they have men also possess; and the rest (like eating and sleeping) is common to both of them. 

Look at these birds, which though they possess knowledge, and are themselves distressed by hunger are yet, because of the delusion, engaged in dropping grains into the beaks of their young ones. Human beings are, O tiger among men, attached to their children because of greed for return help. 

Do you not see this? Even so men are hurled into the whirlpool of attachment, the pit of delusion, through the power of Mahamaya ( the Great Illusion), who makes the existence of the world possible. Marvel not at this. this Mahamaya is the Yoganidra, of Vishnu, the Lord of the world. It is by her the world is deluded. Verily she, the Bhagavati, the Mahamaya forcibly drawing the minds of even the wise, throws them into delusion. 

She creates this entire universe, both moving and unmoving. It is she who, when propitious, becomes a boon-giver to human beings for their final liberation. She is the supreme knowledge, the cause of final liberation, and eternal; she is the cause of the bondage of transmigration and the sovereign over all lords. The king said: 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 245 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
55. అధ్యాయము - 10

*🌻. బ్రహ్మకు జ్ఞనోదయమగుట - 3 🌻*

విష్ణువు ఇట్లు పలికెను -

హే బ్రహ్మన్‌ ! మనమిద్దరము శంకరుని సంకల్పముచే జన్మించిన సమయములో ఆయనను మనము ప్రార్థించగా, మనలను ఉద్దేశించి ఆయన అపుడు చెప్పిన పలుకులను గుర్తుకు తెచ్చుకొనుము (48). 

నీవా వృత్తాంతమునంతనూ మరచితివి. శాంభవీ పరాదేవి ధన్యురాలు. ఆమె చే జగత్తు సర్వము మోహింపబడినది. శివుడు తక్క ఇతరులు ఆమెను ఎరుంగజాలరు (49).

శివుడు తన ఇచ్ఛచే నిర్గుణ స్వరూపము నుండి సగుణుడై నన్ను సృష్టించి, ఆ తరువాత నిన్ను సృష్టించెను. ఆయన తన శక్తితో లీలలను సృష్టించును (50). 

అపుడు శంభుప్రభువపు నిన్ను సృష్టిని చేయుమని ఆదేశించెను. హే బ్రహ్మన్‌! దాని పాలనను నాకు అప్ప జెప్పెను. నాశరహితుడు ఉమా సహితుడునగు శివుడే వాస్తవముగా జగత్కారణమగును (51).

అపుడు మనిమిద్దరము దోసిలి యొగ్గి, సాష్టాంగ ప్రణామమును చేసి, మనస్థానములకు వచ్చితిమి. సర్వేశ్వరుడవగు నీవు కూడా గుణ సంహితుడవై రూపమును స్వీకరించి అవతరించుము (52). 

అని మనము కోరగా, కరుణామయుడు అనేక లీలలను సృష్టించుటలో నిపుణుడు అగు ఆ ప్రభువు నవ్వి, ఆకాశము కేసి చూచి మిక్కిలి ప్రీతితో నిట్లనెను (53).

 హే విష్ణో! నా శ్రేష్ఠమగు రూపము, నన్ను పోలిన రూపము, బ్రహ్మదేహమునుండి ప్రకటమై లోకములో రుద్రుడను పేర కీర్తింపబడును (54). 

ఆ రుద్రుడు నా పూర్ణావతారము. మీరు ఆయనను సర్వదా పూజించుడు. ఆయన మీ కోర్కెలనన్నిటినీ ఈడేర్చును. త్రిగుణసాక్షి, నిర్గుణుడు, గొప్ప యోగమునకు ప్రవర్తకుడునగు ఆ రుద్రుడు లయమును చేయగలడు (55).

ఈ త్రిమూర్తులు నాకుమారులు. వారు నా స్వరూపమే రుద్రుడు విశేషించి నా పూర్ణాంశ గలవాడు. ఉమాదేవికి కూడ మూడు రూపములు ఉండగలవు (56). 

ఆమె లక్ష్మి అను పేరుతో విష్ణువునకు భార్య యగును. సరస్వతి అను పేరుతో బ్రహ్మకు పత్నియగును. ఆమె పూర్ణరూపముతో సతియను పేరుగలదై రుద్రునకు భార్య కాగలదు (57). 

మహేశ్వరుడు దయతో ఇట్లు పలికి అంతర్ధానమయ్యెను. మనము మనకు అప్పిగించబడిన కార్యముల యందు నిమగ్నులమై సుఖముగా నుంటిమి (58). 

హే బ్రహ్మన్‌! మనము కాలము వచ్చుటచే వివాహమాడితిమి. శంకరుడింకనూ వివాహమాడలేదు.ఆయన స్వయముగా రుద్రుడను పేర అవతరించి కైలాసము నాశ్రయించి ఉన్నాడు (59).

హే ప్రజాపతీ! ఉమాదేవి సతియను పేర అవతరించును. ఆమె పుట్టుట కొరకు ప్రయత్నమును చేయవలెను (60). 

విష్ణువు ఇట్లు పలికి మిక్కిలి దయను చూపి అంతర్దానమాయెను. నేను మిక్కిలి అధికమైన ఆనందమును పొందితిని. నాలోని ఈర్ష్య తొలగి పోయెను (61).

శ్రీ శివ మహాపురాణములోని రెండవది యగు రుద్రసంహితయందురెండవది యగు సతీ ఖండములో బ్రహ్మ విష్ణు సంవాదము అనే పదియవ అధ్యాయము ముగిసినది (10).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. ఋతంభరా ప్రజ్ఞ 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

ఋతంభర ఒక విశ్వ జ్ఞాన కోశం. ఋతంభర అన్ని దివ్య సంకేతాలకి, అనుభూతులకి మూలం. ఋతంభర ఆధ్యాత్మిక దూరవిద్యా విజ్ఞానం.

అది అన్ని చోట్లా విశ్వమంత వ్యాపించిన చైతన్యం. ఎక్కడైనా ఉండి, ఎక్కడినించైనా మాట్లాడ గల అతీత పరబ్రహ్మని సృష్టితో అనుసంధానం చేసే ప్రక్రియ ఋతంభర. దేవతలు, మహర్షులు, సాధకులు, మానవులు, జంతువులూ, ఇంకా జీవరాశుల, నిర్జీవ రాశుల చైతన్యమంతా ఇమిడి ఉండి వాటిని నిర్దేశించే ఓ దివ్య శక్తి జాలం ఋతంభర. ఇది కేంద్రీకరించబడి ఒక్కో వ్యక్తిలో స్థిరమైతే అతను తన గురువుతోనూ, దేవతా శక్తితోనూ 'కనెక్ట్ ' అవుతాడు. ఆ సాధకుడి భ్రూ మధ్యం, అంటే మూడో నేత్రం ఉండే (కనుబొమ్మల మధ్య) చోట నిండి సృష్టి సంకేతాలు వస్తూ, పోతూ ప్రయాణించడం ప్రారంభిస్తాయి. అతను లేక ఆమె భూత, భవిష్యత్, వర్తమానాలకతీతంగా విషయాలను దర్శించగలరు, వినగలరు, ఏదైనా తెలుసుకోగలరు. ఆజ్ఞాచక్రం తెరుచుకుని, అంతర్ముఖమైన జ్ఞాన చక్షువులు విచ్చుకుని, తానున్న చిన్న 'నేను ' అనే వృత్తం నించి బయటికి, తన దైనందిన సాధారణ జీవన పరిధినించి బయటకి వచ్చి, విశ్వవ్యాపక అసాదృశ శక్తి అనుభూతి చెందుతూ, అప్పుడప్పుడు ఆ మహా దివ్య కాంతులను అనుభవాన్ని పొందుతూ మళ్ళీ మామూలు పరిధిలోకి వస్తూ ఉంటాడు. అతి మామూలు మాటల్లో ఇది ఒక పైలట్ దిన చర్యలా ఉంటుంది...... కొంత సేపు ఆకాశ విహారం, ఎగరనప్పుడు కొంత ఇహలోకపు విహారం.

ఇలాంటి ఋతంభర శక్తి ఏ ప్రత్యేక వ్యక్తులకో కేటాయించింది కాదు. ఇది సృష్టిలో ప్రతి జీవికి సొంతం. వారి వారి స్థాయిని బట్టి వారు వాడుకోవచ్చును, ఆ శక్తిని పెంచుకోవచ్చును. యోగులు కళ్ళు మూసుకుని ఎదైనా చూడాలనుకున్నప్పుడు ఆ దర్శనాన్ని అందించే ప్రజ్ఞ ఋతంభర. ఎక్కడో ఉన్న పుత్రిక ఏడిస్తే నిద్రపోతున్న తల్లిని లేపి ఏదో జరుగుతోందని తెలిపే శక్తి ఋతంభర. అన్నిటిని మరిచి తాదాత్మ్యతతో ఇష్ట దేవత జపం చేస్తున్నప్పుడు ఆ దేవత వచ్చిందని తెలిపే సూచనలందించే నిశ్శబ్ద శక్తి ఋతంభర.

మానవ శరీరంలో నరనరమూ, చర్మమూ, అణువణువూ ఏకమై ఒక మనిషిగా ఉండి ఎక్కడో కాలి గోటికి దెబ్బ తగిలితే తల దాకా మెదడుకి నొప్పి తెలిసేలా ఎలా 'ఏకత్వం' ఉందో అలాగే సృష్టి అంతటా వ్యాపిస్తూ ఉండే 'తెలివి ' ఋతంభర. నిజానికి ఋతంభరకి ఏ పేరూ లేదు. పేరు పెట్టడం వల్ల దాని గురించి మాట్లాడు కోవడం సులువవుతుంది. పేరు పెట్టడం అయినంత మాత్రాన ఒక విషయం అర్ధమయిపోదు. అర్ధం చేసుకోవడం మొదలవుతుంది. కొత్తగా పుట్టిన బిడ్డకి పేరు పెడితే జీవితం మొదలువుతుంది ఆ పేరు మీద. ఇంకా కధ ఎంతో ఉంటుంది - ఇదీ అలాగే. పేరు తెలియగానే అర్ధం కూడా అర్ధం అవదు. మంత్రం తీసుకోగానే సిద్ధి వచ్చేయదు, సాధన మొదలవుతుంది. సృష్టి బడిలో, అమ్మ వడిలో మళ్ళీ కూచుని యోగి తన తపస్సుని మొదలు పెడతాడు.

 ఋతంభరని అనేకులు అనేక సార్లు దర్శించారు. ఒక్కో కోణంలోంచి ఒకలా పిలిచారు. అన్నీ కలిపినా ఆ ఋతంభర పూర్తి కాదు. 'దివ్య దృష్టి ' అంటే ఏమిటి ? 'ప్రకృతి ' మాట్లాడడం అంటే ఏమిటి? అన్నీ కలిపినా, ఆ దివ్య శక్తిని ఎలా చెప్పలేవో అలాగే ఋతంభరనీ!

 కొందరు ఋతంభర ని 'ఆకాషిక్ రికార్డ్స్' గా భావిస్తారు. కొన్నిసార్లు మనం మన 'గోల' తగ్గించి తపో తలంలో వింటే వినిపించే సంగీతం ఋతంభర. మన చలనాలని తగ్గించి సృష్టి చలనాలని అర్ధం చేసుకోవడం మొదలు పెడితే కలిగే అవగాహన. ఈపని చెయ్యొద్దు, అది చెయ్యి అని మంచి మార్గంలో నడిపిస్తూ మనలోంచే మాట్లాడే దక్షిణామూర్తి. ఋతంభర

*🌻. ఋతంభర అంటే ఏమిటి? 🌻*

ప్రతి పదానికి మనకి అర్ధమయ్యే అర్ధం వెనకాల అర్ధం వెనకాల ఒక మూల తత్వం ఉంటుంది. ఋతంభర అనేది ఇంగ్లీషులో 'రిథం ' అంటాం కదా! దానికి సంబంధించినది అని. 

రిథం అనేది కంపనాన్ని (వైబ్రేషన్) సూచిస్తుంది. అది తరంగాలని సృష్టిస్తుంది. అవి ప్రయాణించి మన చెవిని చేరితే అవి మన వినికిడి పరిధిలో పడితే, మన చెవులు విని, మెదడు అర్ధం చేసుకుని చెపుతోంది, ఇదీ సంగతి అని. ఇవి విద్యుదయస్కాంత తరంగాలైతే కాంతి అంటున్నాం. చూస్తున్నాం. అంటే మన చూసినా విన్నా అన్నీ తరంగాలే. 

అన్నీ రిథం జనితాలే! మనసుతో ఆలోచించి, మెదడుతో దానికి రూపాన్ని, భాషని ఇచ్చి ఇంకోళ్ళ మెదడుకి శబ్ద తరంగాలుగా పంపుతున్నాం. ఈ పనంతా మెదడు నించి మెదడుకి 'లాజికల్ ' గా జరుగుతుంటే అది ఆలోచనల మార్పిడి. చిత్రమేమంటే ఋతంభర మనసు మాట్లాడే ప్రక్రియ. మనసుతో వినాలి. మనసు ఇంద్రియంగా ఆలోచనలని 'ప్రోసెస్ ' చెయ్యాలి.

బుద్ధి వేరు, మనసు వేరు. ఋతంభర వినాలంటే హార్ట్ పూర్ణత్వం చెంది ఉండాలి, భౌతికమైన హృదయం కాదు. మనసుకి చేరే ఈ ప్రకంపనాలు, మన మూల తత్వమైన సృష్టి కర్తతో అనుసంధానంలో ఉంటాయి. ఇవి హృదయ స్థానమైన అనాహత చక్రానికి చెందినవి గా చెప్పవచ్చు. 

మనసు పూర్ణత్వాన్ని చెందే కొద్ది సాధకుడి ఋతంభర ఉన్నత స్థితిని చేరి శబ్దం అక్షరాలుగా మారే విశుద్దిని దాటి మహా జ్ఞాన త్రిపురము, 'మహా కాళేశ్వర ' స్థానము, అతీంద్రియ శక్తికి ఉన్నత సోపానము ఐన ఆజ్ఞా చక్రాన్ని చేరి అక్కడినించి సంకేతాలు పంపడం, తెలుసుకోవడం చేయగలుగుతాడు. 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 3 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

*🌴 THE FOUR PRELIMINARY STATEMENTS - 3 🌴*

36. The disciple may test the quality and genuineness of his sympathy by looking to see whether or not he feels it when the suffering of others is not intruded upon his notice. 

If you see a person suffering, or if you come across a case of gross ill-usage, no doubt you feel pain, but do you feel the same pain when the person is not before your sight? Our sympathy is an exceedingly poor thing if it is excited only by the sight of suffering. 

Send a person out into a great city like London, and he may be terribly affected by the suffering that he sees around him; but take him away from it all and he will soon forget the miseries he has witnessed and will become perfectly happy. 

The disciple has to learn to live as if the whole of that suffering were present before him all the time; to relieve it must be the motive of his work.

37. No one has reached the stage where he is responsive to the great cry of pain, spoken of in The Voice of the Silence?1 unless his motive in life is to help humanity whether the suffering be before his eyes or not, for that is the real motive-power of a disciple. 

The best way to get rid of personality, to grow indifferent to one’s own personal joys and sorrows, to become incapable of tears, is to let the mind think upon the sorrow of the world and the ways of helping it; that causes the personal self to be seen in its true place beside the larger self of the great orphan humanity.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 133 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. నారద మహర్షి - 7 🌻*

53. ఉన్నది ఒకేనాదం అయినప్పటికీ; వాయువు యొక్క వికార భేదముల చేత పుట్టినటువంటి వర్ణములు, అలాగే స్వరములు, ఆ స్వర్ణాల్లోంచి వచ్చిన రాగాలు, రాగంలోంచి భావము – ఇవి మాత్రమే సంగీతానికి సరిపోవుకదా! 

54. అందుకని ఆయన కొన్ని వస్తువులను కూడా సృష్టించాడు. మృదంగం, వేణువు – ఈ ప్రకారంగా ఇట్లాంటి వాయిద్యాలనుకూడా వర్ణించి ఆయన బ్రహ్మ దేవుడికి చెప్పినవి, సాక్షాత్తు పరమేశ్వరియైన సరస్వతీదేవి తనకు చెప్పిన జ్ఞానంనుండే. 

55. ఆ వాద్యాలన్నీ ఆమెలోపల ఉండి నిద్రిస్తున్నాయి. ఆ విద్యను గ్రహించాడు. అంతకు ముందు ఆమెయందు పరా-పశ్యంతీ స్థాయిలలో ఉన్నదంతా కూడా బహిర్ముఖమై, మధ్యమా-వైఖరీ రూపంగా ఈయన కిచ్చింది. ఒకటేమో అవ్యక్తము, మరొకటేమో వ్యక్తము. తర్వాత నారదుడు తంత్రీముఖములందు, ఆహతము – అనాహతములనే గాన మాత్ర విశేషములను ఇచ్చాడు. 

56. ఆహతము అంటే, రెండు వస్తువుల తాకిడిచేత వచ్చేశబ్దం; అనాహతం అంటే ఎలాంటి తాకిడీలేకుండా పుట్టే శబ్దం. హృదయంలోని చక్రానికి యోగశాస్త్రంలో ‘అనాహత’మని పేరు. అనాహతం అంటే, ఆహతంకాని శబ్దము, హృదయంలో ఉంది. యోగులు దానిని వింటారు.

57. ఇప్పుడు మనం ఉత్పత్తిచేస్తున్న – సంగీతంలో ఏయే దోషములు ఉన్నాయో, అవిలేకుండా ఆయన ఆది సంగీతవిద్వాంసుడుగా అక్కడ పాడాడు. ఆ గానంతో దేవతలందరూ సంతోషించారు. బ్రహ్మదేవుడుకూడా బహిర్ముఖంగా సంగీతం వినటం అప్పుడే మొదటిసారి.

58. అమ్మవారు కూడా తను ఆయనకు ఇచ్చిన విద్య మళ్ళీ వింటున్నది. బ్రహ్మ సంతోషించి నారదునితో, “నాయనా! నీ జీవితమంతా సంగీతమే! స్మగీతమే నీవు. అలాగే ఉండు శాశ్వతంగా. 

59. నేకేమీ పనిలేదు. దైవకార్యం ఏదయినా చెయ్యటానికై నీకు ఏదయినా కర్తవ్యం అప్పుడప్పుడు పుడితే, దానిని చేస్తావు. అంతేకాని దానిఫలంతో నీకేమీ సంబంధం ఉండదు. ఈశ్వరుడియొక్క సంకల్పం ఏదయితే ఉంటుందో, అది ఎందుకై అవసరమని అనుకుంటారో, దానికి నిమిత్తకారణంగా ఏవో కొన్ని పనులు చేస్తూ ఉంటావు. ఆ పని అయిపోగానే నీకేమీ కర్తవ్యం ఉండదు. తిరుగుతూనే ఉంటావు’ అన్నాడు. 

60. “మరి నన్నేమి చెయ్యమంటావు తండ్రీ?” అని అడిగితే, ‘ఇదిగో నీకు అష్టాక్షరి ఉపదేశం చేస్తున్నాను. అది శ్రీమహావిష్ణు తత్త్వం. ఆయన నాకు తండ్రి. ఆయన నాకు గురువు. నా పుట్టుకకు హేతువు. ఆయనను గురించి నాకు అంతే తెలుసు. విష్ణుతత్త్వాన్ని అంతా నీకు చెప్తాను” అన్నాడు బ్రహ్మ.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు - 50 🌹*
*🍀 10 అసక్తత - సమాచరణము - నిష్కామ కర్మమే మోక్షమునకు మార్గమని, అట్లు నిర్వర్తించినవానికి మోక్షము అరచేతి యందుండునని, ఇది తన శాసనమని, అనుపానముగ ఫలాపేక్షలేక, కర్మాచరణము అనునిత్యము జరుగవలెనని తెలుపుచున్నాడు. 🍀*  
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*📚. కర్మయోగము - 19 📚*

ఆసక్తి లేక కర్మ లాచరించిన వానికి పరమపదము లభించగలదని ఈ సూత్రము తెలుపుచున్నది. ఆసక్తి లేక కర్మ లెట్టాచరించగలరు? ఆసక్తి లేనివా డేపనియు చేయడే! దీని రహస్యమేమి? భగవంతుడు గీతయందు పలుమార్లు "అసక్తః" అని పలుకుతుంటాడు. 

19 . తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర |
అసక్తో హ్యాచరన్కర్మ పరమాప్నోతి పూరుషః || 19 ||

ఈ పలికిన అసక్తత ఫలములకు సంబంధించినది. పనికి సంబంధించినది కాదు. పనిచేయు వానికి పనియందే ఆసక్తి యుండవలెను గాని ఫలమునందు కాదు.

ఫలము నందాసక్తత యున్నవానికి పని యందు శ్రద్ధ చెడును. పని యందు శ్రద్ధ యున్న వానికి పనియే సౌఖ్యము నిచ్చును. ఫలములు పొందుట, పొందక పోవుట అతనిని బాధించవు. పని యందు సక్తుడవు కమ్ము, ఫలముల యందసక్తుడవు కమ్ము. 

ఇచ్చట పని యనగా పరహితముతో కూడినది అని మరల మరల చెప్పనక్కరలేదు. నియత కర్మను అనగా చేయవలసిన కర్మను ఫలముల యందాసక్తి లేక యజ్ఞార్థముగ ఆచరించవలెనని భగవానుడు పలుకుతునే యున్నాడు. 

నిజమునకు ఫలముల యందాసక్తి లేకుండ కర్మ నాచరించవలెనని ఈ అధ్యాయమున 7వ శ్లోకము నందు, 9వ శ్లోకమునందు పలికినాడు. అట్లాచరించినచో పరమును లేక దైవమును పొందవచ్చని వాగ్దానము చేయుచున్నాడు. 

నిష్కామ కర్మమే మోక్షమునకు మార్గమని, అట్లు నిర్వర్తించినవానికి మోక్షము అరచేతి యందుండునని, ఇది తన శాసనమని తెలిపినాడు.
పై శాసనమునకు అనుపానముగ ఫలాపేక్షలేక, కర్మా చరణము అనునిత్యము జరుగవలెనని తెలుపు చున్నాడు. “సతతం” అని పలుకుటలో ఫలాసక్తి శాశ్వతముగ విసర్జించ బడవలెనని తెలుపుచున్నాడు.

ఫలాసక్తి లేనిచో ఏ కార్యమైనను చేయవచ్చునా? అను సందేహమును గూడ నివృత్తి చేయుటకై “కార్యం కర్మ"ను ప్రస్తావించి నాడు. అనగా తాను చేయవలసినపని ఫలాసక్తి లేక ఎల్లపుడు చేయవలెనని. ఫలాసక్తి లేక చేయవలసిన పని చేయువాడు ఎట్లైనా చేయవచ్చునా? అను సందేహమును నివారించుటకు "సమాచర” అని తెలిపినాడు. 

సమాచరణ మనగా సమ్యక్ ఆచరణము. సమ్యక్ ఆచరణ మనగా ఎక్కువ తక్కువలు లేక నిర్వర్తించుట. అనగా కర్మ నిర్వర్తనము ఒక నిర్మల ప్రవాహమువలె సాగవలెనుగాని ఒడుదొడుకులతో కాదని యర్థము. మార్గమున ఒడుదొడుకులున్నను ప్రవాహ వేగమునకు ఒడుదొడుకులు అవసరము లేదు.

కొన్ని దినములు విపరీతముగ పనిచేయుట, కొన్ని దినములు చతికిల పడుటగా కర్మ జరుగరాదు. జరుగు కర్మయందు, వేగము నందు ఒక నిశ్చలత యుండవలెను. భూమి, ఇతర గ్రహములు చరించు విధానము సమాచర అను పదమునకు తగినట్లుగ నుండును. 

వృక్షముల యొక్క పెరుగుదల యందు గూడ ఈ లక్షణములు చూడవచ్చును. సమాచరణము సృష్టి ప్రవాహమునకు ముఖ్య లక్షణము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 197 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 45. The state of being, that is the message ‘I am’, without words, is common to all, change begins only with the mind-flow. 🌻*

That stage when the message ‘I am’ had just arrived and was word free is common to all. 

Everybody goes through this period, the non-verbal state, only knowing that ‘you are’ or ‘I am’. In this stage there only exists the opposite ‘you are not’ or ‘I am not’. Your movements from ‘I am’ to ‘I am not’ or vice-versa occur quite spontaneously with no volition at all.  

Changes begin as soon you are taught words or language and very soon the concepts take over, your verbal life or the mind flow begins.

 Along with these come the three states of being awake, dreaming or deep sleep and you believe that you are an individual with a body and mind functioning in this world. 

 Now, you meet the Guru and he tells you to rediscover this long lost wordless, nascent ‘I am’. It is still there and you have to relive it – that is the ‘Sadhana’ (the Practice).
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. అద్భుత సృష్టి - 52 🌹*
 ✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. యాక్టివేషన్ జరిగేటప్పుడు మనలో వచ్చే మార్పులు - 2 🌻*
          
🌟 *3వ లెవెల్:-*
భౌతిక భావాలన్నీ మరింత బలంగా మార్చబడతాయి. మన శరీరాలు కాంతిని గ్రహించడమే కాకుండా చాలా మార్పులను పొందుతూ కాంతి యొక్క అధికశక్తిని తనలోకి, భూమిపైకి తీసుకుని వస్తూ గ్రహం మొత్తం యొక్క మార్పుకు సహకరిస్తుంది. శరీరంలో ఈ సమయంలో చాలా మార్పులు వస్తాయి. రబ్బర్ బ్యాండ్ ను సాగదీస్తే ఎలా అయితే సాగుతుందో, వదిలేస్తే ఎలా మామూలు స్థితికి వస్తుందో అదే విధంగా మన శరీరంలో ups and
 downs జరుగుతూ ఉంటాయి.
ప్రతి సెల్ లోనూ కాంతి ప్రవేశించి, హైయ్యర్ డైమెన్షన్ యొక్క జ్ఞానం, శక్తి అనుసంధానం చేయబడుతుంది. ఆత్మతో భౌతిక సంభాషణ ప్రారంభం అవుతుంది.

🌟. *4వ లెవెల్:-*
ఈ స్థితిలో అధిక శాతం మార్పులు మెదడులో జరుగుతూ ఉంటాయి. మెదడు కణాలలో, నెర్వస్ సిస్టమ్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అధికంగా రావడం జరుగుతుంది. దీని వలన మెదడు కెమిస్ట్రీలో మార్పులు సంభవించి తలనొప్పి, బర్నింగ్ సెన్షేషన్, వినికిడి శక్తి లోపం, కంటిచూపులో మసకమసకగా రెండుగా కనిపించడం జరుగుతూ ఉంటుంది. మరియొక సమయంలో ఛాతీ నొప్పులు వస్తూ ఉంటాయి.

✨. మనం కనుక సిద్ధంగా ఉంటే.. క్రిస్టల్ రెగ్యులేటర్ మన యొక్క ఎథిరిక్ శరీరంలో అధిక కాంతిని ప్రవేశపెడుతూ 5 వ డైమెన్షన్ కి సంబంధించిన బ్లూప్రింట్స్ తో కనెక్ట్ చేస్తారు.
ఛాతి నొప్పి అధికంగా వుంటుంది. దీనికి కారణం మన యొక్క హృదయం మరింతగా ఓపెన్ అవుతుందని అర్థం.(గుండెలోతులు తెరవబడుతున్నాయి.)

✨. టెలిపతి థర్డ్ ఐ యాక్టివేషన్ జరుగుతుంది. ఎమోషనల్ బాడీని అర్థం చేసుకుంటూ దానిలో
 వచ్చే మార్పులను అంగీకరిస్తూ దానిని కంట్రోల్ చేయగలుగుతాము.

✨. విద్యుత్ అయస్కాంత తరంగాల శక్తి మెదడులోకి ప్రసరించడం వలన ఆ ప్రాంతంలో ఒక రసాయనిక చర్య జరుగుతుంది. ఈ సమయంలో తలనొప్పి,అస్పష్టమైన దృష్టి, వినికిడి లోపం కలుగుతాయి. మీ మెదడులో ఉన్న రెండు అర్ధగోళాల మధ్య ఎలక్ట్రికల్ ఫైరింగ్ జరుగుతున్నట్లు అనిపిస్తుంది. విద్యుత్ శక్తి శరీరం అంతా ప్రసరించి వెన్నెముక క్రిందవరకు వెళ్ళి మనోహరమైన అనుసంధానం జరుగుతుంది. (కుండలినీ జాగృతి అనేది అద్భుతంగా జరుగుతుంది.)

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 35 / Sri Vishnu Sahasra Namavali - 35 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*కర్కాటక రాశి- అశ్లేష నక్షత్ర 3వ పాద శ్లోకం*

*🌻. 35. అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః।*
*అపాంనిధి రథిష్ఠానం అప్రమత్తః ప్రతిష్ఠితః॥ 🌻*

అర్ధము :

🍀. అచ్యుతః - 
దేనితోనూ చేధింపబడనివాడు, ఎటువంటి మార్పు చెందనివాడు.

🍀. ప్రథితః - 
ప్రఖ్యాతి గాంచినవాడు.

🍀. ప్రాణః - 
చైతన్యవంతమైన ప్రాణస్వరూపుడు.

🍀. ప్రాణదః - 
జీవులకు ప్రాణమును అనుగ్రహించువాడు.

🍀. వాసవానుజః - 
ఇంద్రునికి తమ్ముడు, దేవతులలో శ్రేష్ఠుడు.

🍀. అపాంనిధిః - 
సముద్రంవలే అనంతమైనవాడు.

🍀. అధిష్ఠానాం - 
అంతటికీ అధిపతి, అంతటికీ ఆధారభూతుడు.

🍀. అప్రమత్తః - 
ఎల్లప్పుడూ జాగురూకుడై వుండువాడు, ఏమరుపాటు లేనివాడు.

🍀ప్రతిష్ఠితః - 
అఖండ మహిమతో అంతటా వుండువాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 35 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka for Karkataka Rasi, Aslesha 3rd Padam*

*🏵️. 35. acyutaḥ prathitaḥ prāṇaḥ prāṇadō vāsavānujaḥ |
apāṁnidhiradhiṣṭhānamapramattaḥ pratiṣṭhitaḥ || 35 || 🏵️*