శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 31, 32 / Sri Lalitha Chaitanya Vijnanam - 31, 32

🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 19 🌹


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 31, 32 / Sri Lalitha Chaitanya Vijnanam - 31, 32 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

13. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత

రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత

🌻 31. 'కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా' 🌻

అంగదము, కేయూరము అను బంగారపు, కమనీయపు భుజములచే ప్రకాశించుచున్న దేవి అని భావము.

అమ్మవారి నాలుగు భుజముల కాంతిని దర్శించుట ఈ నామము యొక్క ధ్యేయము. శ్రీదేవి శరీరమే బంగారు కాంతులను విరజిమ్ముచు నుండును. నాలుగు భుజములు అంతఃకరణ చతుష్టయమునకు సంకేతములని యిదివరకే వివరింపబడి యున్నది.

భుజముల కాంతిని ధ్యానించుట వలన అంతఃకరణము పరిశుద్ధి నొందగలదు. కరణమునకు (చేతలకు) అంతఃకరణ పవిత్రతయే ముఖ్యము.

అట్టి పవిత్రత శ్రీదేవి నాలుగు భుజముల ఆభరణముల కాంతిని ధ్యానించుటచే ఏర్పడ గలదు. కాంతివంతమైన ఆమె భుజములు అంగద, కేయూర ఆభరణములను ధరించినట్లు భ్రమకొల్పును కాని, నిజమునకు ఆమె భుజముల సౌష్టవ కాంతి అది.

ఆభరణములను పెట్టుకొనుట వలన సామాన్యులు అందముగ కనబడుదురు. అందమైనవారు ఆభరణములను పెట్టుకొనినప్పుడు వారి కాంతి ఆభరణములకు అందమిచ్చును. అమ్మ ధరించిన ఆభరణముల నుండి విరజిమ్మ బడుచున్న కాంతి అమ్మ భుజముల నుండి జనించినదే కాని, బంగారము నుండి కాదు.

బంగారమే అమ్మ శరీరము నుండి పుట్టినదికదా! కావున నాలుగు భుజములు హిరణ్మయముగా భావన చేయుచూ, అందలి కమనీయత్వము గ్రోలుటలో మనస్సు హరింపబడ వలెను.

బహిర్ముఖమైన మనస్సు అంతర్ముఖమై బంగారు కాంతులతో మునిగినప్పుడు అంతఃకరణములు పరిశుద్ధి చెందగలవు. అట్టి అంతఃకరణములు బహిఃకరణములను కూడ చైతన్యవంతముగా చేయగలవు.

అది కారణముగ లోకహిత కార్యముల నొనర్చు అంగబలము, భుజబలము ఉపాసకునకు ఏర్పడగలవు. మెడ, య బాహువులు, కంఠము మిథునరాశి చిహ్నములు. మిథునరాశి ద్విస్వభావ రాశి. ద్వంద్వముగ కనబడుచున్న సమస్త సృష్టి రహస్యములు ఈ రాశి యందు సంకేతింపబడినవి.

ముందు తెలుపబడిన నామములలో గల మెడ, మంగళసూత్రములు, నామమున అంగద, కేయూరములు తెలుపబడుటలో ద్వంద్వము కలిగి అధిష్ఠించబడిన సమన్వయము కలిగిన దేవిగ అమ్మను అవగాహన చేసుకొనవలెను.

దేవీ సహస్ర నామములయందు ద్వంద్వములు, పరస్పర

విరుద్ధములు అయిన విషయముల యందు ఏకత్వము ప్రతిపాదింప బడినది. ఏకత్వమునందు ద్వంద్వములను దర్శించుట మొదలగును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹   Sri Lalitha Chaitanya Vijnanam - 31  🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 31. Kanakāṅgada- keyūra- kamanīya- bhujanvitā कनकाङ्गद-केयूर-कमनीय-भुजन्विता (31) 🌻

kanaka – golden; aṅgada – bangles or bracelets; keyūra is a type of ornament worn in the upper arms. She is wearing these ornaments. Possibly, this could mean the following.

Both these ornaments are made out of gold and worn in the arms. Though they differ in form, the ingredient gold is the same in both.

Though the forms of living beings are different, the innermost Brahman remains the same.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🌹.  శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 32 / Sri Lalitha Chaitanya Vijnanam - 32   🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

13. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత

రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత

🌻 32. 'రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత 🌻

రత్నములు, బంగారము, ముత్యములతో చేయబడిన కంఠాభరణములను దాల్చినది అని అర్ధము. కంఠము ఊర్థ్వలోకమునకు, మానవ లోకమునకు మధ్యస్థమైన లోకము.

మానవప్రజ్ఞ విశిష్ట శుద్ధి నొందనిదే దివ్య లోకానుభవములకు పాత్రత పొందదు. ఈ నామమున చెప్పబడిన కంఠాభరణములలో రత్నములు, ముత్యములు, బంగారము వున్నవి. రత్నములు బంగారములో పొదగబడినవి. అవి కంఠమున అలంకరించగా చలించుచున్న ముత్యపు హారము ఒకటి కంఠాభరణమునకు తగుల్కొని యున్నది.

ముత్యపు హారము చలించుట మనో చాంచల్యమును సూచించును. ఈ చపల స్వభావము ఉపాసకుని కంఠములందు చింతలు గలవారిగ సూచించును. చింతలను గూర్చి దేవిని ధ్యానించువారు ఈ కదలుచున్న ముత్యపు హారము వంటివారు. ముత్యమునకు, చంద్రునకు, మనస్సునకు గల స్వాభావిక సంబంధమును యిచ్చట గమనించదగును.

కంఠమున పరిశుద్ధి కలిగినకొలది నిశ్చలమైన రత్నము, బంగారము కాంతులు దర్శనమగును. అంతకు పూర్వము చింతాకలిత మైన, చంచలమైన ఆరాధన ఇప్పుడు నిశ్చలమైన ఆరాధనగ పరిణతి

చెందును.

క్రిందవున్న ముత్యపు హారము తను స్వభావము, దైవీ స్వభావము మిశ్రమముగ నుండుటచే కదలుచు నుండును. దాని కాధారమైన కంఠాభరణము జీవుని భూమికయైన దేహపుంజము (మనసు, ఇంద్రియములు, శరీరము) నధిష్ఠించివున్న ప్రజ్ఞకు సంకేతము.

నిశ్చలమైన కాంతిలోక ప్రవేశమునకు కూడ సంకేతము. ఇట్టి వారు దేవిని నిశ్చలముగ ధ్యానము చేయగలరు. పై నిశ్చలత్వము పొందుటకు ఉపాసకుడు వాజ్మయ తపస్సును చేయవలసి యుండును. కంఠపు లోయనుండి వచ్చు శబ్దములను దైవముగ దర్శించుచూ మాటాడుట ఈ తపోనియమము. ఎట్టి పరిస్థితులలోను అశ్లీలము, అపవిత్రము, అబద్ధము కలుగచేయు ధ్వనులను పలుకరాదు.

కంఠాభరణమును, దానిమధ్య వ్రేలాడుము హారమును పై విధముగా ఆరాధన చేయుట ఉపాసకునకు శ్రేయస్కరము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🌹   Sri Lalitha Chaitanya Vijnanam - 32   🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


Ratna-graiveya-cintāka-lola-muktā-palānvitā रत्न-ग्रैवेय-चिन्ताक-लोल-मुक्ता-पलान्विता (32)

She is wearing a gems embedded golden pendent and a pearl necklace. These ornaments are dangling in Her neck.

The dangling of these ornaments is compared to mind. Those who are not capable of meditating Her full form (head to foot) are said to be low class devotees and called as lola-s.

Those who are able to meditate on Her full form are said to be high class devotees and called as muktā-s. Lola-s or muktā-s get the benefits (pala) of their prayers according to their category. This is the meaning of lola- muktā- palānvitā.

While worshipping Her, one has keep to keep his mind steady, without distractions.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam 
https://www.facebook.com/groups/465726374213849/


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi


11 Oct 2020

No comments:

Post a Comment