🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 48, 49 / Vishnu Sahasranama Contemplation - 48, 49 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 48. పద్మనాభః, पद्मनाभः, Padmanābhaḥ 🌻
ఓం పద్మనాభాయ నమః | ॐ पद्मनाभाय नमः | OM Padmanābhāya namaḥ
(సర్వజగత్కారణం) పద్మం నాభౌ యస్య సః సర్వజగత్కారణమగు పద్మము నాభియందు ఎవనికి కలదో అట్టివాడు.
:: పోతన భాగవతము - తృతీయ స్కందము, విదురమైత్రేయ సంవాదము ::
క.తన జఠరము లోపలఁ దాఁ, చిన లోక నికాయముల సృజించుటకును సాధనమగు సూక్ష్మార్థము మన, సున గని కాలానుగత రజోగుణ మంతన్.సీ.పుట్టించెఁ దద్గుణంబునఁ బరమేశ్వరు నాభిదేశమునందు నలిననాళముదయించె మఱి యప్పయోరుహ ముకుళంబు గర్మబోధితమైన కాలమందుఁదన తేజమునఁ బ్రవృద్దంబైన జలముచే జలజాప్తు గతిఁ బ్రకాశంబు నొందఁజేసి లోకాశ్రయస్థితి సర్వగుణ విభాసితగతి నొప్పు రాజీవమందుతే.నిజకళా కలితాంశంబు నిలిపె, దానివలన నామ్నాయ మయుఁడును వరగుణుండునాత్మయోనియు నైన తోయజభవుండు, సరవిఁ జతురాననుండు నా జనన మయ్యె.
తన కడుపులో దాచుకొని వున్న సకల లోకాలను తిరిగి సృష్టించడానికి ఉపకరణమైన సూక్ష్మపదార్థాన్ని మనస్సులో భావించి, కాలానుగుణంగా రజోగుణాన్ని పుట్టించాడు.
ఆ విధంగా పుట్టించిన రజోగుణంవల్ల నారాయణుని నాభిలో నుండి మొగ్గతో కూడిన ఒక తామరతూడు జన్మించింది. సృష్టికార్యప్రభావితమైన కాలాన్ని అనుసరించి భగవంతుడు తన తేజస్సు చేత నీటినడుమ వృద్ధిపొందిన ఆ తామరమొగ్గను సూర్యునిలాగా వికసింపజేశాడు. లోకాలకు ఆశ్రయం ఇచ్చే స్థితినీ, సకలగుణాలతో ప్రకాశించే ప్రకృతినీ కలిగిఉన్న ఆ కమలంలో పరాత్పరుడు తన కళతోకూడిన అంశాన్ని ప్రసరింపజేశాడు. అప్పుడు ఆ పద్మంలో నుంచి సంపన్నుడూ, స్వయంభువుడూ, చతుర్ముఖుడూ అయిన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 48 🌹
📚. Prasad Bharadwaj
🌻 48. Padmanābhaḥ 🌻
OM Padmanābhāya namaḥ
Padmaṃ nābhau yasya saḥ. He in whose nābhi (navel) the Padma (lotus), the source of the universe, stands.
Śrīmad Bhāgavata - Canto 3, Chapter 8
Tasyārthasūkṣmābhiniviṣṭadṛṣṭer antargato'rtho rajasā tanīyān,
Guṇena kālānugatena viddhaḥ sūṣyaṃstadābhidyata nābhideśāt. (13)
Sa padmakośaḥ sahasodatiṣṭhat kālena karmapratibodhanena,
Svarociṣā tat salilaṃ viśālaṃ vidyotayann arka ivātmayoniḥ. (14)
The subtle matter of creation, on which the Lord's attention was fixed, was agitated by Rajoguṇa - the material mode of passion and thus the subtle form of creation pierced through His Nābhi or abdomen. (13)
Piercing through, this sum total form of the fruitive activity of the living entities took the shape of the bud of a lotus flower generated from the personality of Viṣṇu, and by His supreme will, it illuminated everything, like the Sun and dried up the vast waters of devastation. (14)
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अप्रमेयो हृषीकेशः पद्मनाभोऽमरप्रभुः ।विश्वकर्मा मनुस्त्वष्टा स्थविष्ठस्थ्सविरोध्रुवः ॥ 6 ॥
అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః ।విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠస్థ్సవిరోధ్రువః ॥ 6 ॥
Aprameyo hr̥ṣīkeśaḥ padmanābho’maraprabhuḥ ।Viśvakarmā manustvaṣṭā sthaviṣṭhasthsavirodhruvaḥ ॥ 6 ॥
Continues....
🌹 🌹 🌹 🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 49/ Vishnu Sahasranama Contemplation - 49 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 49. అమరప్రభుః, अमरप्रभुः, Amaraprabhuḥ 🌻
ఓం అమరప్రభవే నమః | ॐ अमरप्रभवे नमः | OM Amaraprabhave namaḥ
అమరాణాం ప్రభుః మరణమన్నది లేని అమరులకు (దేవతలు) ప్రభువు.
:: పోతన భాగవతము - అష్టమ స్కందము ::
వ. మఱియుఁ బ్రాప్తులైన వారల నింద్రపదంబులను, బహుప్రకారంబుల దేవపదంబులను, హరి ప్రతిష్ఠించుచుండు; వారలు విహితకర్మంబుల జగత్త్రయంబునుం బరిపాలింతురు; లోకంబులు సువృష్టులై యుండును.
విష్ణువు శక్తిమంతులను ఇంద్రపదవిలోనూ పెక్కు విధాలైన దేవతల పదవులలోనూ నెలకొల్పుతాడు. వారు తమకు నిర్ణయింపబడిన నియమాలతో మూడు లోకాలను ఏలుతారు. లోకాలు సుభిక్షంగా ఉంటాయి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 49 🌹
📚. Prasad Bharadwaj
🌻 49. Amaraprabhuḥ 🌻
OM Amaraprabhave namaḥ
Amarāṇāṃ prabhuḥ The master of Amarās or the deathless ones i.e., the Devās.
Śrīmad Bhāgavata - Canto 8, Chapter 14
Manavo manuputrāśca munayaśca mahīpate,
Indrāḥ suragaṇāścaiva sarve puruṣa śāsanāḥ. (2)
All the Manus, the sons of every such Manu (who would be appointed as major Kings), all the Munīs (sages which includes the 7 great sages called Sapta R̥ṣis), all the Indrās (king of Gods) and other Devatās (Gods) and all such are under the rule of the Parama Puruṣa or Supreme person.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अप्रमेयो हृषीकेशः पद्मनाभोऽमरप्रभुः ।विश्वकर्मा मनुस्त्वष्टा स्थविष्ठस्थ्सविरोध्रुवः ॥ 6 ॥
అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః ।విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠస్థ్సవిరోధ్రువః ॥ 6 ॥
Aprameyo hr̥ṣīkeśaḥ padmanābho’maraprabhuḥ ।Viśvakarmā manustvaṣṭā sthaviṣṭhasthsavirodhruvaḥ ॥ 6 ॥
Continues....
🌹 🌹 🌹 🌹
Like and Share
https://www.facebook.com/విష్ణు-సహస్ర-నామ-తత్వ-విచారణ-Vishnu-Sahasranama-111069880767259/
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
11 Oct 2020
No comments:
Post a Comment