🌹 20, MAY 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹

🍀🌹 20, MAY 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 20, MAY 2023 SATURDAY శనివారం, స్థిర వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 373 / Bhagavad-Gita - 373 🌹 🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 01 / Chapter 10 - Vibhuti Yoga - 01 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 220 / Agni Maha Purana - 220 🌹 
🌻. కూపవాపీతటాకాది ప్రతిష్ఠా కథనము. - 4 / Mode of consecration of tanks and ponds (kūpa-pratiṣṭhā) - 4 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 085 / DAILY WISDOM - 085 🌹 
🌻 25. విశ్వ చైతన్యం ఆలోచించబడింది / 25. The Cosmic Consciousness Contemplated 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 349 🌹
6) 🌹. శివ సూత్రములు - 87 / Siva Sutras - 87 🌹 
🌻 2-04. గర్భే చిత్త వికాసో' విశిష్ట విద్యా స్వప్నః - 3 / 2-04. garbhe cittavikāso'viśistavidyāsvapnah - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 20, మే, May 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : చంద్ర దర్శనము, Chandra Darshan🌻*

*🍀. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - 20 🍀*
 
*37. మ్రియంతే శత్రవోఽవశ్యమ లక్ష్మీనాశ మాప్నుయాత్ |*
*అక్షయం లభతే సౌఖ్యం సర్వదా మానవోత్తమః*
*38. అష్టపంచాశతాణఢ్యో మంత్రరాజః ప్రకీర్తితః |*
*దారిద్ర్యదుఃఖ శమనం స్వర్ణాకర్షణకారకః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మనస్సు నందలి ఏకత్వానుభూతి - మనస్సు నందు ఏకత్వానుభూతి మనస్సున కొక విధమైన విమోచన కల్పించే మాట వాస్తవమే. కాని, అంతమాత్రాన అన్న, ప్రాణకోశముల యందు మార్పురాదు. అందలి ప్రవృత్తులు యథాపూర్వంగానే సాగిపోతూ వుండవచ్చును. ఏలనంటే, వాటి నడక కొంతవరకు మాత్రమే మనస్సుపై ఆధారపడి వుంటుంది. అంతేకాదు, మనస్సుకు యిష్టం లేక పోయినా దానినవి తమతోపాటు లాగుకొని పోగలవు. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
జ్యేష్ఠ మాసం
తిథి: శుక్ల పాడ్యమి 21:32:41
వరకు తదుపరి శుక్ల విదియ
నక్షత్రం: కృత్తిక 08:03:49 వరకు
తదుపరి రోహిణి
యోగం: అతిగంధ్ 17:17:47 వరకు
తదుపరి సుకర్మ
కరణం: కింస్తుఘ్న 09:25:29 వరకు
వర్జ్యం: 24:44:20 - 26:24:28
దుర్ముహూర్తం: 07:26:44 - 08:18:43
రాహు కాలం: 08:57:43 - 10:35:11
గుళిక కాలం: 05:42:47 - 07:20:15
యమ గండం: 13:50:07 - 15:27:34
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 05:35:42 - 07:13:54
మరియు 29:44:44 - 31:24:52
సూర్యోదయం: 05:42:47
సూర్యాస్తమయం: 18:42:30
చంద్రోదయం: 05:57:52
చంద్రాస్తమయం: 19:30:10
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: ధ్వజ యోగం - కార్యసిధ్ధి
08:03:49 వరకు తదుపరి శ్రీవత్సయోగం
- ధన లాభం , సర్వ సౌఖ్యం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 373 / Bhagavad-Gita - 373 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 01 🌴

*01. శ్రీ భగవానువాచ*
*భూయ ఏవ మహాబాహో శ్రుణు మే పరమం వచ: |*
*యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యాయా ||*

🌷. తాత్పర్యం :
*శ్రీకృష్ణభగవానుడు పలికెను: మహాబాహువులుగల ఓ అర్జునా! మరల ఆలకింపుము. నీవు నాకు ప్రియమిత్రుడవగుటచే ఇంతవరకు వివరించిన జ్ఞానము కన్నను ఉత్తమమైన జ్ఞానమును నీ హితము కొరకై నేను వచించెదను.*

🌷. భాష్యము : 
*“భగవానుడు” అను పదమునకు శక్తి, యశస్సు, ఐశ్వర్యము, జ్ఞానము, సౌందర్యము, వైరాగ్యము అనెడి ఆరు విభూతులను సమగ్రమముగా కలిగియున్నవాడని భావమైనట్లుగా పరాశరముని వివరించియున్నారు. ధరత్రిపై అవతరించినపుడు శ్రీకృష్ణుడు అట్టి ఆరువిభూతులను సమగ్రమముగా ప్రదర్శించియున్నందున పరాశరుడు వంటి మహా మునులు అతనిని దేవదేవునిగా ఆంగీకరించియున్నారు. ఇప్పుడు ఆ భగవానుడే స్వయముగా తన విభూతులు మరియు తన కర్మలను గూర్చిన రహస్యజ్ఞానమును అర్జునునకు ఉపదేశించనున్నాడు. సప్తమాధ్యాయపు ఆరంభము నుండియే తన వివిధశక్తులు గుర్చియు మరియు అవి వర్తించు విధమును గూర్చియు తెలియజేసిన భగవానుడు ఈ అధ్యాయమున తన ప్రత్యేక విభూతులను అర్జునునకు వివరింపనున్నాడు. నిశ్చయముతో కూడిన భక్తిని స్థాపించుట కొరకై తన వివిధశక్తులను విపులముగా గడచిన అధ్యాయమున వర్ణించిన శ్రీకృష్ణభగవానుడు తిరిగి ఈ అధ్యాయమున తన వివిధభూతులను మరియు సృష్టివిస్తారములను అర్జునునకు తెలియజేయుచున్నాడు.*

*శ్రీకృష్ణభగవానుని గూర్చి అధికముగా శ్రవణము చేసిన కొలది భక్తి యందు మనుజుడు అధికముగా స్థిరత్వమును పొందును. ప్రతియొక్కరు ఆ దేవదేవుని గూర్చి భక్తుల సాంగత్యమున శ్రవణము చేయవలెను. అది వారి భక్తిని వృద్ధి చేయగలదు. వాస్తవమునకు కృష్ణపరచర్చలు మరియు ప్రసంగములనునవి కృష్ణభక్తిభావన యందు నిజముగా లగ్నమైనవారి నడుమనే జరుగును. ఇతరులు అట్టివాటి యందు పాల్గొనజాలరు. అర్జునుడు తనకు అత్యంత ప్రియుడైనందునే అతని హితము కొరకు అటువంటి ఉపదేశము చేయబడుచున్నది శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట స్పష్టముగా తెలియజేయుచున్నాడు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 373 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 10 - Vibhuti Yoga - 01 🌴*

*01. śrī-bhagavān uvāca*
*bhūya eva mahā-bāho śṛṇu me paramaṁ vacaḥ*
*yat te ’haṁ prīyamāṇāya vakṣyāmi hita-kāmyayā*

🌷 Translation : 
*The Supreme Personality of Godhead said: Listen again, O mighty-armed Arjuna. Because you are My dear friend, for your benefit I shall speak to you further, giving knowledge that is better than what I have already explained.*

🌹 Purport :
*The word bhagavān is explained thus by Parāśara Muni: one who is full in six opulences, who has full strength, full fame, wealth, knowledge, beauty and renunciation, is Bhagavān, or the Supreme Personality of Godhead. While Kṛṣṇa was present on this earth, He displayed all six opulences. Therefore great sages like Parāśara Muni have all accepted Kṛṣṇa as the Supreme Personality of Godhead. Now Kṛṣṇa is instructing Arjuna in more confidential knowledge of His opulences and His work. Previously, beginning with the Seventh Chapter, the Lord has already explained His different energies and how they are acting. Now in this chapter He explains His specific opulences to Arjuna.*

*In the previous chapter He has clearly explained His different energies to establish devotion in firm conviction. Again in this chapter He tells Arjuna about His manifestations and various opulences. The more one hears about the Supreme God, the more one becomes fixed in devotional service. One should always hear about the Lord in the association of devotees; that will enhance one’s devotional service. Discourses in the society of devotees can take place only among those who are really anxious to be in Kṛṣṇa consciousness. Others cannot take part in such discourses. The Lord clearly tells Arjuna that because Arjuna is very dear to Him, for his benefit such discourses are taking place.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 220 / Agni Maha Purana - 220 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 64*

*🌻. కూపవాపీతటాకాది ప్రతిష్ఠా కథనము. - 4 🌻*

*పిమ్మట వరుణదేవుని లేవదీసి మంగళ ద్రవ్యములతో గజ పృష్ఠాదులపై ఎక్కించి ఊరేగించవలెను. పిమ్మట ఆ వరుణమూర్తిని "ఆపో హి ష్ఠామ యో భువః" ఇత్యాది మంత్రము పఠించుచు మదురత్రయయుక్త మగు కలశములో ఉంచి కలశసహితు డగు వరుణుని జలాశయ మధ్య భాగమునందు సురక్షితరూపము స్థాపింపవలెను.*

*పిమ్మట యజమానుడు స్నానము చేసి వరుణుని ధ్యానించవలెను. అనంతరము బ్రహ్మాండసంజ్ఞక మగు సృష్టిని అగ్నిబీజముచే (రం) దహించి, దాని భస్మరాశిని ఉదకముచే ముంచెత్తి నట్లు భావన చేయవలెను. జగ మంతయు జలమయమైనది" అని భావన చేసి ఆ జలమునందు జలేశ్వరు డైన వరుణుని ధ్యానించవలెను. ఈ విధమున జల మధ్యభాగమున వరుణదేవతా ధ్యానము చేసి అచట యూపమును స్థాపించవలెను. యూపము చతుష్కోణముగ గాని, అష్ణకోణముగ గాని, గోలాకారము గాని ఉండుట మంచిది. పది హస్తముల పొడ వుండవలెను. దానిపై ఉపాస్యదేవతా చిహ్నము లుండవలెను. దానిని యజ్ఞమున కుపయోగించు చెట్టు కఱ్ఱతో నిర్మింపవలెను. కూపమునకు అట్టి యూపమే ఉపయోగించును. దాని మూలభాగమున బంగారు ఫలక ముంచవెలను. దిగుడు బావిలో పదునైదు హస్తముల యూపమును, పుష్కరిణిలో ఇరువది హస్తముల యూపమును, తటాకమున ఇరువదియైదు హస్తముల యూపముస్థాపించవలెను.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 220 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 64*
*🌻Mode of consecration of tanks and ponds (kūpa-pratiṣṭhā) - 4 🌻*

32. The image should be placed in the midst of the tank unseen. (The priest) should bathe and contemplate on Varuṇa, the creation known as the primordial egg.

33. Having purified it with the principal letter (of the mantra) of the fire, the ashes should be scattered over the earth. The entire world consists of water. Hence, the lord of waters is contemplated.

34. The sacrificial post of a rectangular, octagonal or circular shape should be placed in the middle of the tank.

35. Having worshipped the symbol of the lord, post made of the tree used for the purpose of sacrifice (should be driven) ten cubits into the ground in the case of (consecration of) a well [i.e., kūpa, kūpaka]. At the bottom of the post gold and fruit should be placed.

36. It should be driven into the ground in the middle of water fifteen cubits in the case of a well, twenty (cubits) in the case of a tank (puṣkariṇī) and twenty-five cubits in the case of a pond.

37. In the alternative, (the post) should be driven in the centre of the sacrificial bed and with the mantra yūpavraskā[36] cloth should be put around. The banner should be put at the top of the post.

38. Having worshipped it with perfumes etc., (the rite for)universal peace should be performed. The spiritual preceptor should be given the fees (in the form of) land, cows, gold and water vessel.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 85 / DAILY WISDOM - 85 🌹*
*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 25. విశ్వ చైతన్యం ఆలోచించబడింది 🌻*

*విశ్వమనస్సు తన స్వయాన్ని ఒక సృష్టి మీద కేంద్రీకరించడం వల్ల ఆ సృష్టి విశ్వంగా రూపుదిద్దుకుంది. ఆ విధంగా విశ్వం ప్రాణం పోసుకుంది. విశ్వంలోని ప్రతి వస్తువులో కార్యాచరణ, శక్తి, మరియు జీవశక్తి ఉన్నాయి. దీనికి కారణం విశ్వ మనస్సు దేశ కాలాలలో బాహ్యంగా ప్రకటితమైన స్థూల ప్రకృతిలో తనను తాను వ్యక్తపరచుకుంది కాబట్టి. ఉద్వేగంతో కూడిన ప్రతి రకమైన అవగాహనలో ఇది జరుగుతుంది. ఉద్వేగం అనేది ఒక వస్తువు పై కేంద్రీకరించి బడిన చైతన్యం. ఆ చైతన్యకేంద్రం దేని కారణంగా నైనా ప్రభావితం అయితే ఆ స్వయం ఆ వస్తువులోకి కదిలి ఆ వస్తువుకి ఒక నిర్దుష్ట విధానంలో జీవం పోస్తుంది.*

*అప్పుడు, ఆ ప్రాణ ప్రతిష్ట కారణంగా, అది తనలో ఒక భాగం అవుతుంది; ద్వితీయ స్వయం అవుతుంది. ఒక వస్తువు వైపు స్వయం యొక్క ఉద్వేగ పూరిత కదలిక ద్వారా ఆ వస్తువు విషయం యొక్క ద్వితీయ స్వయంగా మారినట్లు, ఆదిలో కూడా జరిగింది. శరీరం చైతన్యంగా మారిన విధంగానే విశ్వ చైతన్యం బాహ్య ప్రకృతి పట్ల దృష్టి సారించడం వల్ల ఆ బాహ్య ప్రకృతి జీవం సంతరించుకుని విశ్వ ప్రక్రితిగా మారింది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 85 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 25. The Cosmic Consciousness Contemplated 🌻*

*It is, as it were, the Cosmic Mind contemplated its own Self in the object which is created, namely, the universe. So, the universe assumed a life. There is activity, energy, force and vitality in everything in the universe. That is because of the projection of the Cosmic Mind into this matter, which is the externalised form in space and in time. This happens in every form of perception involving emotion. An emotion is a form of concentration of consciousness on a particular object, and when that concentration is affected, the self moves to the object and enlivens the object in a particular manner.*

*Then, because of the enlivenment, it becomes a part of itself; the secondary self does it become. As the individual object becomes a secondary self of an individual subject by way of emotional movement of self towards the object, so did it happen originally, also. The Cosmic Consciousness contemplated on the cosmic externality, which we call Prakriti, and thus the universe assumed life, as if it is consciousness itself, just as the body assumes a form of consciousness.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 350 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. సత్యాన్ని చూడకుండా వుండడానికి నీ కళ్ళ ముందు చిన్న తెర చాలు. జీవితం గొప్ప ఉపాధ్యాయుడు. అది ప్రతి మనిషినీ చీకటి నించీ వెలుగులోకి దూకడానికి సిద్ధం చేస్తుంది. తెరిచిన కళ్ళకి దేవుడు అస్తిత్వ అనుభవంగా ఆవిష్కారమవుతాడు. 🍀*

*నువ్వు కళ్ళు మూసుకుని వున్నపుడు అంతా చీకటిగా వుంటుంది. నువ్వు కళ్ళు తెరుచుకుని వుంటే జీవితం రాగరంజితంగా వుంటుంది. కాంతి నిండి వుంటుంది. తెరిచిన కళ్ళకి దేవుడు అస్తిత్వ అనుభవంగా ఆవిష్కారమవుతాడు. దేవుణ్ణి వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళు అంధుల మంటారు. వాళ్ళు గుడ్డి వాళ్లు మాత్రమే కాదు మొండివాళ్ళు. వాళ్ళు తాము అంధులం కామని ఐతే దేవుడు లేడని అంటారు. మనిషి కళ్ళు మూసుకుని వుంటే ఎదురుగా ఆకాశంలో సూర్యుడున్నా కాంతి వున్నా చీకట్లోనే వుంటాడు. సత్యాన్ని చూడకుండా వుండడానికి నీ కళ్ళ ముందు చిన్న తెర చాలు. జీవితం గొప్ప ఉపాధ్యాయుడు. అది ప్రతి మనిషినీ చీకటి నించీ వెలుగులోకి దూకడానికి సిద్ధం చేస్తుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 087 / Siva Sutras - 087 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 2-04. గర్భే చిత్త వికాసో' విశిష్ట విద్యా స్వప్నః - 3 🌻*
*🌴. మాయతో నిండిన మలినమైన శరీరంలో చిత్తం వికసించినప్పుడు, పరిమిత శక్తులతో కూడిన స్వప్నం లాంటి అస్పష్టమైన జ్ఞానం పుడుతుంది. 🌴*

*దైవాన్ని గ్రహించే అలాంటి ప్రయత్నం స్వప్న స్థితి లాంటిదని ఈ సూత్రం చెబుతుంది. ఒకరి స్పృహ క్రింది స్థాయికి వెళ్ళిన తర్వాత కలను మరచిపోతారు. అదే మేల్కొలుపు దశ. స్వప్న స్థితి తాత్కాలికమైనది. స్వప్న స్థితి నుండి ఏమీ సాధించబడదు. కలలు అంటే మనసులోని ముద్రలు లేదా కల్పనలు. అవి నెరవేరని కోరికలు తప్ప మరేమీ కాదు. కలలకు వాస్తవం లేనట్లే, అజ్ఞాన మనస్సుకు కూడా వాస్తవం ఉండదు. అలాంటి మనసులు అధమమైనవి అని అంటారు. అధమ మనస్సు కలిగినవారు శాశ్వతమైన విముక్తిని వాయిదా వేయడం ద్వారా తమ సమయాన్ని వృధా చేసుకుంటారు. ఋషి పతంజలి ఇలా అంటాడు (3-36) “అన్ని ఆనందాలు లేదా అనుభవాలు విడిగా ఉన్న మనస్సు మరియు ఆత్మ లేదా స్వయం యొక్క తప్పుడు గుర్తింపు కారణంగా ఉన్నాయి. మనస్సు స్వయం కోసమే కానీ స్వతంత్రం కాదు. ఆత్మతో ఏకత్వం జ్ఞానాన్ని ఇస్తుంది.'*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras - 087 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 2-04. garbhe cittavikāso'viśistavidyāsvapnah - 3 🌻*
*🌴. From the flowering of the chitta in an impure body which is filled with maya, there arises dreamlike indistinct knowledge with limited powers. 🌴*

*This aphorism says that such attempt to perceive Him is like the state of dream. The dream is forgotten once one’s consciousness moves to lower level viz. awakening stage. The dream state is only temporary and nothing is achieved out of dream state. Dreams are nothing but the unfoldment of impressions in the mind or due unfulfilled desires called fantasies. Just like dreams lack reality, an ignorant mind also lacks in reality. Such minds are said to be inferior. Men with inferior mind simply waste their time by postponing eternal liberation. Sage Patañjali says (3-36) “All enjoyment or experience is due false identification of the mind and the soul or Self, which are completely unmixed. Mind is for the sake of Self and not independent. Oneness with the Self gives knowledge.”*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 455 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 455 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 455 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 455 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 95. తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ ।
మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ ॥ 95 ॥ 🍀

🌻 455. 'హంసినీ' - 3 🌻


స్పందన మందలి ఈ సంకోచ వ్యాకోచములను, హంస రెక్కలుగ వర్ణింతురు. సంకోచ వ్యాకోచములతో కూడిన 'హంస' శబ్దము సో హం. దీనిని నిర్వర్తించు ప్రజ్ఞ హంస అని కీర్తించిరి. హంసయే హంసిని. హంసిని ప్రణవము కాగ దాని రెక్కలు సో హం అను శబ్దము చేయును. ఇట్లు ప్రతి జీవుడును ఒక హంస స్వరూపుడే. హంస స్వరూపుడుగా జీవుడు ప్రణవము. అతడాడించు రెక్కలు సో హం అను శబ్దమును చేయును. ఇది ప్రతి జీవుని యందు జరుగుచున్నది గాని జీవుడు చేయుచున్నది కాదు. ఇట్లు జరుగుటకు శ్రీమాత అస్థిత్వమే కారణము. కనుక ఆమెయే హంసిని. ఈ హంసినీ స్వరూపము తెలిసినవారు అందు స్థిరపడినపుడు పరమహంసయై యుందురు. హంస, సో హం, సింహ, హింస అన్నవి ఒకే తత్త్వము యొక్క రూపాంతరములు. దీని వివరములు అంతర్దర్శన ధ్యానము నందు లభింపగలవు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 455 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 95. Tejovati trinayana lolakshi kamarupini
Malini hansini mata malayachala vasini ॥ 95 ॥ 🌻

🌻 455. 'Hamsini' - 3 🌻

The contractions and expansions in the response are described as the wings of a swan. The 'hamsa' sound with contractions and expansions is so hum. The pragnya that performs this is glorified as hamsa (swan). Hamsa is Hamsini. Where swan/hamsini is pranava, its wings make a humming sound of so hum. Thus every living being is a hamsa swarupa. Jiva is Pranava in the formo of a hamsa swarupa. His flapping wings make a humming sound of so hum. This is happening in every living being, but it is not the doing of the living being. The existence of Shrimata is the reason for this happening. So she is the Hamsini. Those who know this form of Hamsini become Paramahamsa when they are established in it. Hamsa, So Hum, Simha, Himsa are variants of the same philosophy. The details of this can be found in Antardarshan Dhyana.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


Osho Daily Meditations - 352. The name of the nameless is divine / ఓషో రోజువారీ ధ్యానాలు - 352. పేరులేని వాటి పేరు దైవం


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 352 / Osho Daily Meditations - 352 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 352. పేరులేని వాటి పేరు దైవం 🍀

🕉. తావో అనేది పేరు పెట్టలేని వాటికి పేరు. పేరులేని వాటికి పేరు - దేవుడు లేదా ధర్మం లేదా సత్యం. ఇవి మానవ నిస్సహాయతకు పేర్లు మాత్రమే. 🕉


మనము దానిని ఏదైనా పిలవాలి; మనము దానిని పరిష్కరించాలి. టావో అనేది తెలియని వారికి ఇవ్వబడిన అత్యంత అందమైన పేర్లలో ఒకటి, ఎందుకంటే ఇది పూర్తిగా అర్థరహితమైనది. దేవుడు అనే పదం చాలా అర్థవంతంగా మారింది; అందుకే అది ప్రాముఖ్యతను కోల్పోయింది. మీరు దేవుడిని ఆరాధించవచ్చు, మీరు టావోను ఆరాధించలేరు; ఏ ప్రతిమా లేదు. మీరు రాతి ప్రతిమను పూజించకపోవచ్చు, కానీ మీరు 'దేవుడు' అని చెప్పిన క్షణంలో, మీకు ఒక సూక్ష్మమైన చిత్రం స్ఫురిస్తుంది: ఎవరో బంగారు సింహాసనంపై కూర్చుని, మొత్తం ప్రపంచాన్ని నియంత్రించే, తెల్ల గడ్డంతో ఉన్నజ్ఞాని, ఒక తండ్రి వంటి మూర్తి.

కానీ 'తావో 'తో ఎలాంటి చిత్రమూ స్ఫురించదు. అదే ఆ పేరు యొక్క అందం, ఇది మీకు ఎటువంటి గుర్తూ ఇవ్వదు. ఊహలోకి వెళ్లడానికి ఇది మీకు ఎటువంటి సాకు ఇవ్వదు. తెలియని వారికి ఇచ్చిన గొప్ప పేరు టావో. ఇది అర్థరహితమైనది కనుక ఇది ముఖ్యమైనది; దాని అర్థం ఏమీ లేదు. దీని అర్థం కేవలం మార్గం--ఏదైనా లక్ష్యానికి మార్గం కాదు కేవలం విషయాలు ఎలా ఉన్నాయో అన్నదానికి మార్గం.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 352 🌹

📚. Prasad Bharadwaj

🍀 352. The name of the nameless is divine 🍀

🕉. Tao is the name for that which cannot be named, a name for the nameless--just like God or dharma or truth or logos. These are just names for human helplessness. 🕉


We have to call it something; we have to address it. Tao is one of the most beautiful names given to the unknown, because it is utterly meaningless. The word God has become very meaningful; hence it has lost Significance. You can worship God, you cannot worship Tao; there is no image. You may not worship a stone image, but the moment you say "God," a subtle image arises in you: somebody sitting there on a golden throne, controlling the whole world, a very wise man with a white beard and all that, a father figure.

But with "Tao" no figure arises. That is the beauty of the name, that it simply gives you no clue. It gives you no excuse to go into imagination. Tao is the greatest name given to the unknown. It is Significant because it is meaningless; it means nothing. All that it means is the way--not a way to any goal but just the way things are.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ శివ మహా పురాణము - 733 / Sri Siva Maha Purana - 733


🌹 . శ్రీ శివ మహా పురాణము - 733 / Sri Siva Maha Purana - 733 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 11 🌴

🌻. దేవస్తుతి - 1 🌻


వ్యాసుడిట్లు పలికెను-

హే బ్రహ్మపుత్రా! శివ భక్తాగ్ర గణ్యుడవగు నీవు మహాప్రాజ్ఞుడవు, ధన్యుడవు. త్రిపురమునందలి అందరు దహింపబడిన తరువాత దేవతలు ఏమి చేసిరి? (1) మముడు ఎచటకు వెళ్లెను? ఆ త్రిపురాధిపతులు ఎట్టి గతిని పొందినారు? శంభుని గాథ ఆశ్రయముగా గల ఆ వృత్తాంతమునంతనూ నాకు చెప్పుము (2).

సూతుడిట్లు పలికెను -

బ్రహ్మ పుత్రుడగు సనత్కుమార భగవానుడు వ్యాసుని ఈ మాటను విని , శివుని పాదయుగళమును స్మరించి ఇట్లు బదులిడెను (3).

సనత్కుమారుడిట్లు పలికెను -

ఓ వ్యాసా! మహాబుద్ధీ! పరాశరా పుత్రా! లోకలీలలను అనుసరించే మహేశ్వరుని చరితమును వినుము. ఈ చరితము సర్వపాపములను నిర్మూలించును (4). రాక్షసులతో నిండియున్న త్రిపురములు సంపూర్ణముగా మహేశ్వరునిచే దహింపబడగా, అచట ఆ దేవతలు పరమాశ్చర్య భరితులైరి (5). ఇంద్రుడు, విష్ణువు మొదలగు దేవతలందరు అపుడు మహాతేజశ్శాలియగు రుద్రుని గాంచి తొట్రుపాటును చెందినవారై ఏమియూ పలుకకుండగా మిన్నకుండిరి (6). మహాభయంకరమగు ఉగ్రరూపము గలవాడు. పది దిక్కులను తన తేజస్సుచే మండునట్లు చేయువాడు, కోటి సూర్యుల తేజస్సు గలవాడు, ప్రళయ కాలాగ్నిని బోలియున్నవాడు (7). అగు శివుని, మరియు హిమవత్పుత్రియగు ఉమాదేవిని గాంచిన దేవోత్తములు అందరు భయపడి తలలు వంచి నిలబడి యుండిరి (8). ఇట్లు భయపడియున్న దేవసై#్యన్యమును గాంచిన మహర్షులు నిశ్శబ్బముగా అన్ని దిక్కులయందు నమస్కరించి మిన్నకుండిరి (9). అపుడు సంతుష్టి చెందిన హృదయము గల బ్రహ్మ శంకరుని ఆ రూపమును గాంచి మిక్కిలి భీతిల్లి దేవతలతో కూడిన వాడై సమాహిత చిత్తముతో స్తుతించెను (10). బ్రహ్మ భయపడివున్న విష్ణువుతో గూడి, దేవదేవుడు, పాపహారి, త్రిపురాంతకుడు, పార్వతీపతి, భక్తులకు వశమగు వాడు అగు మహేశ్వరుని స్తుతించెను (11).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 733🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 11 🌴

🌻 The Gods’ prayer - 1 🌻


Vyāsa said:—

1. O son of Brahmā, of great intellect, O most excellent among the devotees of Śiva, you are blessed. When the three cities were burnt what did the gods do?

2. Where did Maya who was spared go? Where did the ascetics go? Please narrate all, if it relates to Śiva’s story.

Sūta said:—

3. On hearing the words of Vyāsa, Sanatkumāra the holy son of the creator remembered the feet of Śiva and spoke.

Sanatkumāra said:—

4. Listen O Vyāsa, son of Parāśara, and of great intellect, to the sin-destroying story of the great lord, who follows worldly conventions.

5. When the three cities of Asuras were utterly burnt, the Gods became surprised.

6. The gods including Indra, Viṣṇu and others became silent and bewildered on seeing the excessively brilliant Siva.

7-8. On merely seeing the terrible form of Śiva, dazzling the ten quarters, resembling countless suns in refulgence and on a par with the fire at the hour of dissolution, and also the goddess Pārvatī, the daughter of Himavat, the illustrious gods stood humbly in their fright.

9. On seeing the army of the gods terrified, the excellent sages did not say anything. They stood all round and bowed.

10-11. Then Brahmā too who was excessively afraid on seeing Śiva’s terrible form, was delighted at heart and fervently prayed along with the gods. Viṣṇu who was also afraid prayed to Śiva the lord of the Gods, the slayer of the Tripuras, who was accompanied by his consort Pārvatī, the lord who is subservient to his devotees.


Continues....

🌹🌹🌹🌹🌹

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 772 / Vishnu Sahasranama Contemplation - 772


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 772 / Vishnu Sahasranama Contemplation - 772🌹

🌻772. ఏకపాత్‌, एकपात्‌, Ekapāt🌻

ఓం ఏకపదే నమః | ॐ एकपदे नमः | OM Ekapade namaḥ


పాదోస్యేత్యాది వేదాశ్చ విష్టభ్యాహ మితిస్మృతేః ।
విష్ణోరస్యైకపాద ఇత్యేకపాదితి కథ్యతే ॥

తన సంపూర్ణ్తత్త్వపు నాలుగవవంతైన సకల ప్రపంచ రూపమగు ఒక పాదము కలవాడు.

'పాదోఽస్య విశ్వా భూతాని...' (పురుష సూక్తము) - 'సకల భూతములును ఈతని ఒక పాదము' శ్రుతియు, 'విష్టభ్యాఽహ మిదం కృత్స్న మేకాంశేన స్థితో జగత్' (10.42) - 'నేనే ఈ సమస్త జగత్తును నా ఏకాంశముతో (చతుర్థాంశముతో) వ్యాపించియున్నాను.' అను గీతా స్మృతియు ఇందు ప్రమాణము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 772🌹

🌻772. Ekapāt🌻

OM Ekapade namaḥ

पादोस्येत्यादि वेदाश्च विष्टभ्याह मितिस्मृतेः ।
विष्णोरस्यैकपाद इत्येकपादिति कथ्यते ॥

Pādosyetyādi vedāśca viṣṭabhyāha mitismr‌teḥ,
Viṣṇorasyaikapāda ityekapāditi kathyate.


His One foot that is one fourth of His full form, is the equivalent of entire universe.


'Pādo’sya viśvā bhūtāni/पादोऽस्य विश्वा भूतानि...' (Puruṣa Sūktam) and the Lord's statement 'Viṣṭabhyā’ha midaṃ kr‌tsna mekāṃśena sthito jagat / विष्टभ्याऽह मिदं कृत्स्न मेकांशेन स्थितो जगत्' - I stand supporting the whole universe with a single fragment of Myself' from Gita (10.42) are references.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः ।
चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् ॥ ८२ ॥

చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః ।
చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ ॥ 82 ॥

Caturmūrtiścaturbāhuścaturvyūhaścaturgatiḥ,
Caturātmā caturbhāvaścaturvedavidekapāt ॥ 82 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹




కపిల గీత - 180 / Kapila Gita - 180


🌹. కపిల గీత - 180 / Kapila Gita - 180 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 34 🌴

34. ఏవం హరౌ భగవతి ప్రతిలబ్ధభావో భక్త్యా ద్రవద్ధృదయ ఉత్పులకః ప్రమోదాత్
ఔత్కణ్ఠ్యబాష్పకలయా ముహురర్ద్యమానస్ తచ్చాపి చిత్తబడిశం శనకైర్వియుఙ్క్తే॥


తాత్పర్యము : ఈ విధముగా ధ్యానాభ్యాసము చేయుటవలన సాధకునకు శ్రీహరియందు పరిపూర్ణ భక్తి ఏర్పడును. దాని ప్రభావమున అతని హృదయము ఆర్ద్రమగును. ఆనందాతిరేకముచే తనువు పులకించును. ఉత్కంఠవలన కలిగిన అశ్రుధారలచే మాటిమాటికిని అతని దేహము తడిసిపోవును.చేపలను ఆకర్షించు గాలమువలె శ్రీహరిని తనవైపు మరల్చుకొనుటకు సాధనమైన చిత్తమునుగూడ తిన్నతిన్నగా ధ్యేయవస్తువునకు దూరమొనర్చును. ఈ స్థితిలో ద్యాత, ధ్యానము, ధ్యేయము అను త్రిపుటి ఉండదు. భగవంతుడు ఒక్కడే మిగిలి యుండును. అనగా భక్తుడు భగవంతునిలో ఏకీభావస్థితిని పొందును.

వ్యాఖ్య : మనస్సు యొక్క చర్య అయిన ధ్యానం సమాధి లేదా శోషణ యొక్క పరిపూర్ణ దశ కాదని ఇక్కడ స్పష్టంగా పేర్కొనబడింది. ఆదిలో మనస్సు భగవంతుని స్వరూపాన్ని ఆకర్షించడంలో పని చేస్తుంది, కానీ ఉన్నత దశలలో మనస్సును ఉపయోగించుకునే ప్రశ్నే ఉండదు. ఒక భక్తుడు తన ఇంద్రియాలను శుద్ధి చేసుకోవడం ద్వారా పరమేశ్వరుని సేవించడం అలవాటు చేసుకుంటాడు. మరో మాటలో చెప్పాలంటే, ఒక వ్యక్తి స్వచ్ఛమైన భక్తి సేవలో లేనంత వరకు ధ్యానం యొక్క యోగ సూత్రాలు అవసరం. ఇంద్రియాలను శుద్ధి చేయడానికి మనస్సు ఉపయోగించ బడుతుంది, కానీ ధ్యానం ద్వారా ఇంద్రియాలు శుద్ధి చేయబడినప్పుడు, ఒక నిర్దిష్ట ప్రదేశంలో కూర్చుని భగవంతుని స్వరూపాన్ని ధ్యానించడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి స్వయంచాలకంగా భగవంతుని వ్యక్తిగత సేవలో నిమగ్నమయ్యేంత అలవాటు పడిపోతాడు. భగవంతుని స్వరూపంపై మనస్సు బలవంతంగా నిమగ్నమైనప్పుడు, యోగి స్వయంచాలకంగా భగవంతుని వ్యక్తిగత సేవలో నిమగ్నమవ్వడు కాబట్టి దీనిని నిర్బీజ-యోగ లేదా నిర్జీవ యోగా అంటారు. కానీ అతను నిరంతరం భగవంతుని గురించి ఆలోచిస్తున్నప్పుడు, దానిని సబీజ-యోగ లేదా జీవన యోగా అంటారు. జీవన యోగా వేదికగా ఒకరు పదోన్నతి పొందాలి.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 180 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 4. Features of Bhakti Yoga and Practices - 34 🌴

34. evaṁ harau bhagavati pratilabdha-bhāvo bhaktyā dravad-dhṛdaya utpulakaḥ pramodāt
autkaṇṭhya-bāṣpa-kalayā muhur ardyamānas tac cāpi citta-baḍiśaṁ śanakair viyuṅkte


MEANING : By following this course, the yogī gradually develops pure love for the Supreme Personality of Godhead, Hari. In the course of his progress in devotional service, the hairs on his body stand erect through excessive joy, and he is constantly bathed in a stream of tears occasioned by intense love. Gradually, even the mind, which he used as a means to attract the Lord, as one attracts a fish to a hook, withdraws from material activity.

PURPORT : Here it is clearly mentioned that meditation, which is an action of the mind, is not the perfect stage of samādhi, or absorption. In the beginning the mind is employed in attracting the form of the Supreme Personality of Godhead, but in the higher stages there is no question of using the mind. A devotee becomes accustomed to serving the Supreme Lord by purification of his senses. In other words, the yoga principles of meditation are required as long as one is not situated in pure devotional service. The mind is used to purify the senses, but when the senses are purified by meditation, there is no need to sit in a particular place and try to meditate upon the form of the Lord. One becomes so habituated that he automatically engages in the personal service of the Lord. When the mind forcibly is engaged upon the form of the Lord, this is called nirbīja-yoga, or lifeless yoga, for the yogī does not automatically engage in the personal service of the Lord. But when he is constantly thinking of the Lord, that is called sabīja-yoga, or living yoga. One has to be promoted to the platform of living yoga.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


19 May 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 19, మే, May 2023 పంచాగము - Panchagam 🌹

శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : వైశాఖ ఆమావాస్య, శని జయంతి, Vaishakha Amavasya, Shani Jayanti 🌻

🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 45 🍀

45. శ్రీదేవి బిల్వనిలయే జయ విశ్వమాతః వసుదాయిని
ఆహ్లాదదాత్రి ధనధాన్యసుఖప్రదాత్రి ।

శ్రీవైష్ణవి ద్రవిణరూపిణి దీర్ఘవేణి
లక్ష్మి త్వదీయచరణౌ శరణం ప్రపద్యే ॥

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : విశ్వచేతన ఉపరితలం - విశ్వచేతన మూలంలో ఉండేది ఏకత్వానుభూతి కాగా, ఉపరితలంలో విశ్వశక్తి లీలా విశేషమును గురించిన ఎరుక ఉంటుంది. స్త్రీ పురుషుల కామలీలతో సహా ఇచట ఏదైనాసరే తలయెత్తడానికి వీలున్నది. సాధకుడు పూర్తిగా అంతరాత్మ నిష్ఠుడు కాగలిగితే తప్ప, ఈ ఎరుక యందు సరియైన పద్ధతిలో వ్యవహరించడం కుదరదు. 🍀

🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వసంత ఋతువు, ఉత్తరాయణం,

వైశాఖ మాసం

తిథి: అమావాశ్య 21:24:25 వరకు

తదుపరి శుక్ల పాడ్యమి

నక్షత్రం: భరణి 07:30:19 వరకు

తదుపరి కృత్తిక

యోగం: శోభన 18:16:56 వరకు

తదుపరి అతిగంధ్

కరణం: చతుష్పద 09:31:48 వరకు

వర్జ్యం: 19:46:30 - 21:24:42

దుర్ముహూర్తం: 08:18:52 - 09:10:48

మరియు 12:38:34 - 13:30:30

రాహు కాలం: 10:35:12 - 12:12:35

గుళిక కాలం: 07:20:26 - 08:57:49

యమ గండం: 15:27:22 - 17:04:45

అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37

అమృత కాలం: 02:40:36 - 04:17:04

మరియు 29:35:42 - 31:13:54

సూర్యోదయం: 05:43:03

సూర్యాస్తమయం: 18:42:09

చంద్రోదయం: 05:13:12

చంద్రాస్తమయం: 18:32:20

సూర్య సంచార రాశి: వృషభం

చంద్ర సంచార రాశి: మేషం

యోగాలు: ముద్గర యోగం - కలహం

07:30:19 వరకు తదుపరి ఛత్ర యోగం

- స్త్రీ లాభం

దిశ శూల: పశ్చిమం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹