1) 🌹 శ్రీమద్భగవద్గీత - 600 / Bhagavad-Gita - 600🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 210, 211 / Vishnu Sahasranama Contemplation - 210, 211🌹
3) 🌹 Daily Wisdom - 19🌹
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 153🌹
5) 🌹 సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 27 🌹
6) 🌹 Guru Geeta - Datta Vaakya - 174 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 98🌹
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 170 / Sri Lalita Chaitanya Vijnanam - 170🌹
9) 🌹. శ్రీమద్భగవద్గీత - 511 / Bhagavad-Gita - 511🌹
10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 115🌹
11) 🌹. శివ మహా పురాణము - 315🌹
12) 🌹 Light On The Path - 68🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 200 🌹
14) 🌹 Seeds Of Consciousness - 264🌹
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 139🌹
16) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 103 / Sri Vishnu Sahasranama - 103🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 600 / Bhagavad-Gita - 600 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 17 🌴*
17. యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే |
హత్వాపి స ఇమాన్ లోకాన్న హన్తి న నిబధ్యతే ||
🌷. తాత్పర్యం :
మిథ్యాహంకారముచే ప్రభావితుడు కానివాడును, సంగత్వరహిత బుద్ధిని కలిగినవాడును అగు మనుజుద్ జగమునందు జనులను సంహరించినను సంహారమొనర్చనట్లే యగును. అతడెన్నడును తన కర్మలచే బద్దుడు కాడు.
🌷. భాష్యము :
యుద్ధము చేయరాదనెడి కోరిక మిథ్యాహంకారము నుండి ఉద్భవించుచున్నదని శ్రీకృష్ణభగవానుడు అర్జునునికి ఈ శ్లోకమున తెలియజేయుచున్నాడు. అర్జునుడు తనను కర్తగా భావించెనే గాని అంతర్భాహ్యములందు సూచనలొసగు భగవానుని గమనింపలేదు. కర్మనొనర్చుటకు దివ్యమైన అనుజ్ఞ ఒకటుండునని తెలియనిచో అతడు కర్మ నెందులకు చేయవలెను? కాని కర్మసాధనములను, కర్తగా తనను మరియు దివ్యానుజ్ఞకర్తగా శ్రీకృష్ణభగవానుని తెలిసికొనగలిగినవాడు ఏ కార్యము నొనర్చుట యందై నను పూర్ణుడై యుండును. అట్టివాడు ఎన్నడును మోహమునకు గురి కాడు.
నేనే చేయుచున్నాను, నాదే బాధ్యత అనెడి భావములు మిథ్యాహంకారము మరియు నాస్తికత్వము (కృష్ణభక్తిరాహిత్యము) నుండి ఉద్భవించుచున్నవి. పరమాత్ముని (లేదా భగవానుని) నిర్దేశమునందు కృష్ణభక్తిభావన యందు వర్తించువాడు సంహారకార్య మొనర్చినను సంహరింపనివాడే యగును.
ఆలాగుననే సంహారముచే కలుగు ప్రతిచర్య చేతను అతడు ప్రభావితుడు కాకుండును. ఉన్నతసైన్యాధికారి ఆజ్ఞపై సంహారమును సాగించు సైనికుడు ఎన్నడును అపరాధమునకు గురికాడు. కాని సైనికుడు తన స్వంత కారణమున ఎవరినేని చంపినచో చట్టముచే తప్పక శిక్షకు గురిచేయుబడును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 600 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 17 🌴*
17. yasya nāhaṅkṛto bhāvo buddhir yasya na lipyate
hatvāpi sa imāḻ lokān na hanti na nibadhyate
🌷 Translation :
One who is not motivated by false ego, whose intelligence is not entangled, though he kills men in this world, does not kill. Nor is he bound by his actions.
🌹 Purport :
In this verse the Lord informs Arjuna that the desire not to fight arises from false ego. Arjuna thought himself to be the doer of action, but he did not consider the supreme sanction within and without.
If one does not know that a supersanction is there, why should he act? But one who knows the instruments of work, himself as the worker, and the Supreme Lord as the supreme sanctioner is perfect in doing everything. Such a person is never in illusion.
Personal activity and responsibility arise from false ego and godlessness, or a lack of Kṛṣṇa consciousness. Anyone who is acting in Kṛṣṇa consciousness under the direction of the Supersoul or the Supreme Personality of Godhead, even though killing, does not kill.
Nor is he ever affected by the reaction of such killing. When a soldier kills under the command of a superior officer, he is not subject to be judged. But if a soldier kills on his own personal account, then he is certainly judged by a court of law.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 210, 211 / Vishnu Sahasranama Contemplation - 210, 211 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻210. గురుతమః, गुरुतमः, Gurutamaḥ🌻*
*ఓం గురుతమాయ నమః | ॐ गुरुतमाय नमः | OM Gurutamāya namaḥ*
గురుతమః, गुरुतमः, Gurutamaḥ
విరించి ప్రముఖేభ్యోఽపి బ్రహ్మ విద్యాం ప్రయచ్ఛతి ।
యస్య విష్ణుర్గురుతమో యో బ్రహ్మాణ మితిశ్రుతేః ॥
గురువులలోనెల్ల గొప్పవాడు. చతుర్ముఖబ్రహ్మ మొదలగు వారికి కూడా బ్రహ్మ విద్యను సంప్రదానము చేసిన వాడు. వారికి కూడా తండ్రియును.
:: శ్వేతాశ్వరోపనిషత్ - షష్ఠోఽధ్యాయః ::
యో బ్రహ్మాణాం విదధాతి పూర్వం యో వై వేదాగ్‍ంశ్చ ప్రహిణోతి తస్మై ।
తగ్‍ం హ దేవ మాత్మ బుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ॥ 18 ॥
ఏ పరమేశ్వరుడు సృష్ట్యాదిలో చతుర్ముఖ బ్రహ్మను సృజించి అతనికి వేదములను ఉపదేశించెనో, అట్టి పరమేశ్వరుని ఆత్మబుద్ధి ప్రకాశకుని మోక్షేచ్ఛ గల నేను శరణు జెందుచున్నాను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 210🌹*
📚. Prasad Bharadwaj
*🌻210. Gurutamaḥ🌻*
*OM Gurutamāya namaḥ*
Virinci pramukhebhyo’pi brahma vidyāṃ prayacchati,
Yasya viṣṇurgurutamo yo brahmāṇa mitiśruteḥ.
विरिन्चि प्रमुखेभ्योऽपि ब्रह्म विद्यां प्रयच्छति ।
यस्य विष्णुर्गुरुतमो यो ब्रह्माण मितिश्रुतेः ॥
As He originated the traditional teaching of Brahmavidyā to Virinci i.e., Brahmā and others, He is Gurutamaḥ.
Śvetāśvaropaniṣat - Chapter 6
Yo brahmāṇāṃ vidadhāti pūrvaṃ yo vai vedāgˈṃśca prahiṇoti tasmai,
Tagˈṃ ha deva mātma buddhi prakāśaṃ mumukṣurvai śaraṇamahaṃ prapadye. (18)
:: श्वेताश्वरोपनिषत् - षष्ठोऽध्यायः ::
यो ब्रह्माणां विदधाति पूर्वं यो वै वेदाग्ंश्च प्रहिणोति तस्मै ।
तग्ं ह देव मात्म बुद्धि प्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये ॥ १८ ॥
Seeking Liberation, I take refuge in the Lord, the revealer of Self-Knowledge, who in the beginning created Brahma and delivered the Vedas to Him.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
गुरुर्गुरुतमो धाम सत्यस्सत्यपराक्रमः ।निमिषोऽनिमिषस्स्रग्वी वाचस्पति रुदारधीः ॥ २३ ॥
గురుర్గురుతమో ధామ సత్యస్సత్యపరాక్రమః ।నిమిషోఽనిమిషస్స్రగ్వీ వాచస్పతి రుదారధీః ॥ ౨౩ ॥
Gururgurutamo dhāma satyassatyaparākramaḥ ।Nimiṣo’nimiṣassragvī vācaspati rudāradhīḥ ॥ 23 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 211 / Vishnu Sahasranama Contemplation - 211🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻211. ధామ, धाम, Dhāma🌻*
*ఓం ధామ్నే నమః | ॐ धाम्ने नमः | OM Dhāmne namaḥ*
ధామ, धाम, Dhāma
ధామన్ శబ్దమునకు జ్యోతిస్సు అని అర్థము. నారాయణుడు జ్యోతి స్వరూపుడు. లేదా ధామన్ అనగా స్థానము. నారాయణుడు కామితములకును స్థానము.
:: పోతన భాగవతము - చతుర్థ స్కంధము ::
సీ.పంకజనాభాయ సంకర్షణాయ శాం, తాయ విశ్వప్రబోధాయ భూతసూక్ష్మేంద్రియాత్మనే సూక్ష్మాయ వాసుదే, వాయ పూర్ణాయ పుణ్యాయ నిర్వికారాయ కర్మవిస్తారకాయ త్రయీ, పాలాయ త్రైలోక్యపాలకాయసోమరూపాయ తేజోబలాఢ్యాయ స్వ, యం జ్యోతిషే దురంతాయ కర్మతే.సాధనాయ పురాపురుషాయ యజ్ఞ, రేతసే జీవతృప్తాయ పృథ్వీరూపకాయ లోకాయ నభసేఽన్తకాయ విశ్వ యోనయే విష్ణవే జిష్ణవే నమోఽస్తు.(702)
లోకాత్మకమైన పద్మము నీ బొడ్డున ఉంటుంది. అహంకారానికి అధిష్ఠాతవయిన సంకర్షణుడవు నీవు. నీవు శాంతుడవు. విశ్వమునకు ఉపదేశకుడవు. తన్మాత్రలకు, ఇంద్రియాలకు నీవే ఆశ్రయము. నీవు అవ్యక్తుడవు. చిత్తమునకు అధిష్ఠాతవయిన వాసుదేవుడవు నీవు. నీవు విశ్వమెల్లా నిండినవాడవు. పుణ్యశరీరుడవు. నిర్వికారుడవు. కర్మములనుండి దాటించువాడవు. వేద సంరక్షకుడవు. తేజో బలములు కలవాడవు. స్వయంగా ప్రకాశించే జ్యోతి స్వరూపుడవు. నీవు అంతము లేని వాడవు. కర్మములకు సాధనమైన వాడవు. పురాణ పురుషుడవు. యజ్ఞస్థల రూపుడవు. జీవ తృప్తుడవు. భూ స్వరూపుడవు. లోక స్వరూపుడవు. ఆకాశం నీవే. నీవు ముఖాగ్నిచేత లోకాన్ని దహిస్తావు. నీవు సృష్టికర్తవు. విష్ణుడవు. జిష్ణుడవు. నీకు నమస్కారం.
:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::
పరం బ్రహ్మ ప్రమం ధామ పవిత్రం పరమం భవాన్ ।
పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుమ్ ॥ 12 ॥
ఆహుస్త్వాం ఋషయస్సర్వే దేవర్షిర్నారదస్తథా ।
అసితో దేవలో వ్యాసస్స్వయం చైవ బ్రవీషి మే ॥ 13 ॥
(అర్జునుడు) మీరు పరబ్రహ్మస్వరూపులు, పరంధాములు అనగా పరమపద స్వరూపుడు లేదా గొప్ప తేజస్స్వరూపుడు. పరమపావనరూపులు. మిమ్ము నిత్యులుగను, ప్రకాశస్వరూపులుగను, పరమపురుషులుగను, ఆదిదేవులుగను, జన్మరహితులుగను, సర్వవ్యాపకులుగను, ఋషులందరున్ను, దేవర్షియగు నారదుడున్ను, అసితుడున్ను, దేవలుడున్ను, వేదవ్యాసమహర్షియు చెప్పుచున్నారు. స్వయముగ మీరున్ను ఆప్రకారమే మిమ్ము గూర్చి నాకు చెప్పుచున్నారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 211🌹*
📚. Prasad Bharadwaj
*🌻211. Dhāma🌻*
*OM Dhāmne namaḥ*
The word Dhāman can imply lustre or brilliance. Or as He is the source of all desires, He is Dhāma. Ultimate support of all values. The shelter.
Śrīmad Bhāgavata - Canto 3, Chapter 26
Anādirātmā puruṣo nirguṇaḥ prakr̥teḥ paraḥ,
Pratyagdhāmā svayaṃjyotirviśvaṃ yena samanvitam. (3)
:: श्रीमद्भागवते तृतीयस्कन्धे षड्विंषोऽध्यायः ::
अनादिरात्मा पुरुषो निर्गुणः प्रकृतेः परः ।
प्रत्यग्धामा स्वयंज्योतिर्विश्वं येन समन्वितम् ॥ ३ ॥
He has no beginning. He is transcendental to the material modes of nature and beyond the existence of this material world. He is perceivable everywhere because He is self-effulgent, and by His self-effulgent luster the entire creation is maintained.
Śrīmad Bhagavad Gīta - Chapter 10
Paraṃ brahma pramaṃ dhāma pavitraṃ paramaṃ bhavān,
Puruṣaṃ śāśvataṃ divyamādidevamajaṃ vibhum. (12)
Āhustvāṃ r̥ṣayassarve devarṣirnāradastathā,
Asito devalo vyāsassvayaṃ caiva bravīṣi me. (13)
:: श्रीमद्भगवद्गीत - विभूति योग ::
परं ब्रह्म प्रमं धाम पवित्रं परमं भवान् ।
पुरुषं शाश्वतं दिव्यमादिदेवमजं विभुम् ॥ १२ ॥
आहुस्त्वां ऋषयस्सर्वे देवर्षिर्नारदस्तथा ।
असितो देवलो व्यासस्स्वयं चैव ब्रवीषि मे ॥ १३ ॥
Arjuna said: The Supreme Spirit, the Supreme Shelter, the Supreme Purity are you! All the great sages, the divine seer Narada, as well as Asita, Devala and Vyasa have thus described you as the self-evolved Eternal Being, the Original Deity, uncaused and omnipresent. And now you yourself are telling me the same.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
गुरुर्गुरुतमो धाम सत्यस्सत्यपराक्रमः ।निमिषोऽनिमिषस्स्रग्वी वाचस्पति रुदारधीः ॥ २३ ॥
గురుర్గురుతమో ధామ సత్యస్సత్యపరాక్రమః ।నిమిషోఽనిమిషస్స్రగ్వీ వాచస్పతి రుదారధీః ॥ ౨౩ ॥
Gururgurutamo dhāma satyassatyaparākramaḥ ।Nimiṣo’nimiṣassragvī vācaspati rudāradhīḥ ॥ 23 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 19 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 19. The Infinite Bhuma Alone Hails Supreme 🌻*
The Upanishads deny the reality of the form of the world of plurality and duality. According to them, except the non-dual Brahman, nothing is. The universe is explained by them as the imagination of the Absolute-Individual.
We can only understand that this Absolute imagination is merely figurative and it can have meaning only with reference to individuals in the world, and not in itself. The infinite Bhuma alone hails supreme. It is established on its own Greatness. It is not dependent on anything else, for anything else is not.
There cannot be imagination in the Absolute. Imagination may differ in degree or intensity, but even these degrees are but imagination. Even the acceptance of such a difference is ultimately invalid. The experience of external objects depends on the strong belief that they exist.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 153 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 83 🌻*
కారణం ఏమిటి? అంటే ఈ విశ్వుడు అన్న సాక్షిత్వాన్ని జీవుడు సరిగ్గా సాధించలేదు కాబట్టి. కాబట్టి, ఈ ఎనిమిది శరీర అధిష్టాన స్థానములని ఏవైతే చెబుతున్నారో, ఆ అధిష్టాన స్థానములన్నీ కూడా సాక్షిత్వ సాధనలో పరిచయమయ్యేటటువంటి స్థితులు.
కాబట్టి, విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యగాత్మ, విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మలు అనేటటటువంటి ఎనిమిది సాక్షి స్వరూపాలు, పరమాత్మ అనేటటువంటి, సర్వసాక్షి స్వరూపములో అంశీభూతములు. అలా సాక్షి సాధన చేసేటటువంటి వారు మాత్రమే, ఈ ఎనిమిది అధిష్ఠాన కేంద్రాలను, ఎనిమిది అధిష్టాన స్థితులను తెలుసుకోగలుగుతారు.
అలా ఎనిమిది అధిష్టాన స్థితులను తెలుసుకోలేని వాళ్ళు, ఆ యా వ్యవహారమునే సత్యమనుకుంటారు. ఆయా శరీర వ్యాపారమునే సత్యమనుకుంటారు. ఉదాహరణ చెపుతా... ప్రతి ఒక్కరూ కలలు కంటూ ఉంటారు. కలలు కన్నప్పుడల్లా ఆయా కలలో అనేక రకములైనటువంటి సినిమాలు వస్తుంటాయి.
అవన్నీ తమ జీవితములో ఉన్నటువంటి, తానే నేర్పించినటువంటి, తానే నటించినటువంటి, తానే నర్తించినటువంటి, తానే పాటలు పాడినటువంటి, తానే ఫైటింగులు చేసినటువంటి... సినిమాలన్నమాట. అన్నీ ఆయనే ... కథ, రచయిత, మాటలు, పాటలు, దర్శకత్వం, ప్రొడక్షన్ అన్నీ ఆయనే.
మరి అతువంటి కల అనే సినిమాను ప్రతి రోజూ మానవుడు దర్శిస్తూనే వున్నాడు కాని ఏ తెరమీదైతే, ఈ కల అనే సినిమా జరుగుతుందో, ఆ తెర ప్రకాశించడానికి ఆధారభూతమైనటువంటి, ఆ ప్రకాశంలో మాత్రమే ఈ సినిమా కనబడుతోంది కదా. మరి ప్రకాశం ఆధారంగా కనబడుతున్న సినిమాని నేనా? ప్రకాశం నేనా? అనేటటుంవంటి విచారణ దృక్పథం... కలగడం లేదు.
ఏ రోజు సినిమా ఆ రోజు వస్తూనే ఉంటుంది. ఆ రోజు కలని ‘అనుభోక్తవ్యం’ అనుభవిస్తూనే ఉంటాడు. అందులో ఏర్పడుతున్నటువంటి సుఖదుఃఖాలని అనుభవిస్తూనే ఉంటాడు. అట్టి అనుభవరీత్యా మరలా కలలో కూడా అవే సుఖదుఃఖాలు ఏర్పడుతూనే ఉన్నాయి.
మరి ఇలలోనూ సుఖదుఃఖాలు ఏర్పడుతూ ఉన్నాయి. లేదంటే మిశ్రితంగా ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే కలలో కూడా సుఖదుఃఖాలు మిశ్రితముగా ఏర్పడుతున్నాయి. కాబట్టి, కర్మఫలము త్రివిధములుగా ఉన్నది. అయితే సుఖము, లేకపోతే దుఃఖము, లేక పోతే మిశ్రితము.
మరి ఈ రకంగా ఏర్పడుతున్నటువంటి దానిలోనుంచి ఏట్లా బయట పడాలంటే, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అనేటటుంవంటి శ్లోకం పురుషోత్తమ ప్రాప్తి యోగం (భగవద్గీత) లో ఉంది. అధ్యాత్మ - ఆత్మ వస్తువును నిత్యమైన వస్తువుగా గుర్తించి విచారణ చేసేటటువంటి దృక్పథాన్ని మానవుడు అభ్యాసం చేయాలి. తత్త్వజ్ఞానార్థ దర్శనం - ఈ అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అనేది ఎక్కడికి దారితీయాలటా? తత్త్వ జ్ఞానార్థ దర్శనం.- విద్యా సాగర్ గారు
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 27 🌹*
*🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻*
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀. అభంగ్ - 27 🍀*
సర్వసుఖ గోడీ సాహీ శాశ్ నివడీ!
రికామా అర్థఘడీ రాహూ నకో!!
లటికా వ్యవహార్ సర్వహా సంసార్!
వాయా యేర్ ఝార్ హరీ వీణ్!!
నామ మంత్ర జప కోటీ జాఈల్ పాప్!
కృష్ణనామీ సంకల్ప్ ధరూని రాహే!!
నిజ వృత్తి కాథీ సర్వ మాయా తోడీ!
ఇంద్రియా సవడీ లపోనకో!!
తీర్థప్రతీ భావ ధరీ రే కరుణా!
శాంతీ దయా పాహుణా హరి కరీ!!
జ్ఞానదేవా ప్రమాణ్ నివృత్తిదేవీ జ్ఞాన్!
సమాధి సంజీవన్ హరి పార్!!
భావము :
సర్వ సుఖాలలో హరి నామము మధురమైనదని ఆరు శాస్త్రాలు ఎన్నిక చేసి చెప్పినవి. కావున అర నిమిషము కూడ వృధా గడప బోకుము. సంసారమంత క్షణ భంగురము. కావున హరి సంబంధము వీడినచో చావు పుట్టుకలు వ్యర్థమై పోతాయి.
కృష్ణ నామమందు మనసు పెట్టి సంకల్పము చేసి నామ మంత్రమును జపము చేయు వారి కోటి పాలు తొలగిపోతాయి. సర్వ మాయలను త్రుంచి వేసి నిజ వృత్తులను బయటకు తీసి ఇంద్రియాలబడి తిరుగక జాగురుకతో ఉండుము.
భావన పెట్టి తీర్థ వ్రతాలు చేయుట వలన శాంతి, దయ నీకు ప్రియ బాంధవులై హరి యొక్క కరుణ ప్రాప్తించగలదు. సద్గురువు నివృత్తినాధులు కృపతో ఇచ్చిన జ్ఞానము వలన నాకు సంజీవని సమాధి కలిగినదని జ్ఞానదేవులు ప్రమాణ పూర్వకంగా తెలిపినారు.
*🌻. నామ సుధ -27 🌻*
సర్వ సుఖాలలో అతి మధురము
సకల శాస్త్రాలు ఎన్నిన నామము
వృధాగడపకు అర నిమిషము
హరినామము గానము చేయుము
స్వప్నంలాంటిది వ్యవహారము
సంసారమంత అదే విధము
వ్యర్థమవును జనన మరణము
లేని యెడల హరి సంబంధము
నామ మంత్రము జపము చేయుము
కోట్ల కొలది పాపాలు మాయము
సంకల్పము చేసి కృష్ణనామము
దృఢతరమున పట్టు నిలుపుము
నిజవృత్తులను బయటకు తీయుము
మాయలన్నియు తుడిచి వేయుము
“ఇంద్రియాలబడి తిరుగబోకుము”
వివేకముతో అణిచి వేయుము
తీర్థ వ్రతము భావ బలము
కరుణా హృదయము కల్గి ఉండుము
శాంతి దయా ప్రేమ యుక్తము
ధృఢమై తీరును హరి సంబంధము
జ్ఞానదేవుని ప్రమాణము వినుము
నివృత్తినాథులు ఇచ్చిన జ్ఞానము
సమాధి సంజీవని హరి పాఠము
భక్త జనులకు తరుణోపాయము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Guru Geeta - Datta Vaakya - 174 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
166
We discussed so far that Lord Dattatreya has 24 Gurus. Lord Datta is the Adi Guru, he is the original preceptor. Just as the first couple was Siva and Parvati, the first Guru is Lord Datta. He himself had 24 Gurus. He himself declared in the scriptures that he has 24 Gurus.
Srimad Bhagavatam says that Lord Datta assumed the form of an Avadhoota (loosely defined as a mystic who has renounced all worldly attachments and lives in a state beyond body consciousness) and uplifted King Yadu. Let us learn about the teachings of Lord Datta here and the spiritual truths he explained.
Once upon a time, when King Yadu was on a pilgrimage, he came upon a young Avadhoota. Yadu addressed the Avadhoota thus, “O Mahatma (great soul), you look like an erudite scholar. Yet, sometimes, you behave like a boy. People in this world make efforts to fulfill
their desires.
They will not carry out any action without desires. You have strength, a healthy body, intelligence and self-realization. How did you escape from desires? Your face is radiating with bliss. Your smile never disappears. You seem happy and calm. You look so youthful and strong. How did you attain this dispassion? I am unable to fathom this secret”. Yadu prayed to the Avadhoota, “Please reveal your spiritual quality and uplift me”.
Gurus are very magnanimous. Like a cloud, a Guru pours all his energy into the disciple. Remember that. That Avadhoota was our Lord Datta. The Lord shows each person a different miracle.
That is why, they worship the Lord as
Dattatreya Hare Krishna, Unmatta Nanda Dayaka | Digambara Munebala Pisaacha Jnana Sagara ||
The Avadhoota was very pleased with the king’s humility. He withdrew his mystic form. With a blissful countenance, he looked at Yadu and imparted spiritual truths. Let us learn a little about what the Lord taught Yadu. The Lord started his discourse. The Lord prayed to God first,
Dattatreyam Sivam Santam, Indraneela Nibham Prabhum | Atma maya ratham devam Avadhootam Namamyaham ||
So, the Avadhoota blessed Yadu and imparted spiritual truths.
Those truths were as follows: “O King, I sought refuge with many Gurus. I learned many good things from them. Important among them are 24 Gurus. I am teaching you the knowledge I learned from them. Receive these truths”
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 98 / Sri Lalitha Sahasra Nama Stotram - 98 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 170 / Sri Lalitha Chaitanya Vijnanam - 170 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*48. నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ |*
*నిఃసంశయా, సంశయఘీ, నిర్భవా, భవనాశినీ ‖ 48 ‖*
*🌻170. 'నిర్లోభా' 🌻*
'భగుణము లేనిది శ్రీదేవి అని అర్థము.
లోభము సర్వ సద్గుణములను రూపుమాపునని, లోభి ఇహ లోక సంతోషమునకే నోచుకొన లేడని, పరలోకానుభూతి అతనికి దుర్లభమని శ్రుతులు తెలుపుచున్నవి. లోభగుణము నింద్యమైనదని, అది కలవాడు వికాసము చెందలేడని తెలియనగును. దానము లోభమునకు విరుగుడు. ఇచ్చినవారికే వచ్చునని ప్రకృతి ధర్మమొకటి కలదు. పంచువారికే సమృద్ధి యుండునని, అనంతమగు సృష్టియందు సర్వ సమృద్ధియే గాని, అయిపోవుట ఉండదని తెలిసినవాడు ఇచ్చుటకు జంకడని పురాణ గాధలు తెలుపు చున్నవి.
సృష్టి అంతము లేదు. అంతమే ఆరంభము; ఆరంభమే అంతముగా అనంతముగ సృష్టి సాగుచున్నది. అందు శక్తులు, సంపదలు కూడ అనంతమే. త్రాగునీరు అయిపోకముందే మరల నీరు వచ్చును. తటాకమునుండి, నదినుండి త్రాగునీరు వచ్చు చుండగా, తటాకములకు, నదులకు వర్షము నీరిచ్చుచున్నది. వర్షములకు నీరు మేఘము లిచ్చుచున్నవి. మేఘములకు సముద్రము నీరిచ్చుచున్నది. ఇట్లు భూమి జీవులకు మూడు కోట్ల సంవత్సరములుగా నీరందుచునే ఉన్నది. అయిపోవుట, అంతమగుట సృష్టి యందు లేదు.
అట్లే ఓషధులును. ప్రతి సంవత్సరమూ జీవులకు వలసిన ఆహారము, నీరు గాలి, సూర్యరశ్మి అనంతముగ అందుచునే యున్నవి. సంపదలన్నియూ అట్టివే! కేవలము మానవ మనస్సునందే అంతము అగునని, అయిపోవునని భావన యుండి అతనిని లోభిని చేయును.
దేహము పోయిననూ మరల దేహము వచ్చును. పోవుట వచ్చుట కొఱకే. వచ్చుట పోవుట కొఱకే. అన్నియూ వచ్చిపోవు చుండగా అందు జీవుడు శాశ్వతుడై ఉండును. వచ్చినవానిని ఎంత పట్టుకొనిననూ కాలము రూపమున అవి జరుగును.
సంపదలు, భార్యాబిడ్డలు, బంధువులు, మిత్రులు పుట్టుకతో లేరు. జీవన యానమున ఒక్కొక్క మజిలీ యందు ఒక్కొక్కటి చేరుచుండును. అట్లే పోవుచునుండును కూడ. కాలమును, కర్మమును బట్టి వచ్చి చేరుట, జారిపోవుట జరుగుచు నుండును. ఇది తెలిసినవారికి లోభత్వముండదు.
హరిశ్చంద్రుడు, శిబి, ధర్మరాజు, నలుడు సర్వమును కోల్పోయి మరల సర్వమును పొందిరి. లోభికి దేనిపై పట్టు ఉండునో ఆ విషయమే అతనిని పట్టి ఉంచును. కొందరు సంపదను పట్టుకొని ఉందురు. వారు సంపదచే బద్ధులు. కొందరు కీర్తిప్రతిష్ఠలకు ప్రాకులాడుదురు. వారు అట్టివారి చేతిలో పట్టుపడినవారు. మనము పట్టినది మనలను పట్టునని తెలియుట జ్ఞానము.
అట్టిపట్టు శ్రీమాతపై ఉన్నచో, శ్రీమాయే మనలను పట్టును. సద్గుణములను, సద్గురువులను పట్టుట శ్రేయస్కరము. ఇతరములు పట్టుట వినాశకరము. శ్రీదేవి శివుని పట్టి యుండును. ఆయనయందు అర్ధబాగమై నిలచినది. అందువలన ఆమెయే నిర్లోభ.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 170 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 Nirlobhā निर्लोभा (170) 🌻*
She is without greed. She is extremely liberal with Her devotees.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 511 / Bhagavad-Gita - 511 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 21 🌴*
21. అర్జున ఉపాచ
కైర్ లిఙ్గైస్త్రీన్ గుణానేతానతీతో భవతి ప్రభో |
కిమాచార: కథం చైతాంస్త్రీన్ గుణానతివర్తతే ||
🌷. తాత్పర్యం :
అర్జునుడు ప్రశ్నించెను : హే ప్రభూ! ఈ త్రిగుణములకు అతీతుడైనవాడు ఏ లక్షణముల ద్వారా తెలియబడును? అతని ప్రవర్తనమెట్టిది? ప్రకృతి త్రిగుణములను అతడు ఏ విధముగా అధిగమించును?
🌷. భాష్యము :
ఈ శ్లోకమునందలి అర్జునుని ప్రశ్నలు మిగుల సమంజసముగా నున్నవి. త్రిగుణములను దాటినట్టి మహాత్ముని లక్షణములను అతడు తెలిసికొనగోరుచున్నాడు. అట్టి త్రిగుణాతీత మహాత్ముని లక్షణములను తొలుత అతడు విచారణ కావించుచున్నాడు. అట్టివాడు త్రిగుణ ప్రభావమును ఇదివరకే దాటియున్నాడని మనుజుడు ఎట్లు జీవించునో, అతని కర్మలేవియో అర్జునుడు అడుగుచున్నాడు. .
ఆ కర్మలు నియమబద్ధములైనవా లేక నియమబద్ధములు కానివా! పిదప అర్జునుడు అట్టి దివ్యస్వభావమును పొందగలిగే మార్గమును గూర్చి ప్రశ్నించుచున్నాడు. ఈ విషయము అత్యంత ముఖ్యమైనది. సర్వదా దివ్యస్థితి యందు నిలుచుటకు ప్రత్యక్షమార్గమును తెలియనిదే ఎవ్వరును అట్టి దివ్యలక్షణములను కలిగియుండు నవకాశము లేదు.
కనుకనే అర్జునుడు అడిగిన ఈ ప్రశ్నలన్నియును అత్యంత ముఖ్యమై యున్నవి. శ్రీకృష్ణుడు ఆ ప్రశ్నలన్నింటికిని సమాధానమొసగుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 511 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 21 🌴*
21. arjuna uvāca
kair liṅgais trīn guṇān etān
atīto bhavati prabho
kim-ācāraḥ kathaṁ caitāṁs
trīn guṇān ativartate
🌷 Translation :
Arjuna inquired: O my dear Lord, by which symptoms is one known who is transcendental to these three modes? What is his behavior? And how does he transcend the modes of nature?
🌹 Purport :
In this verse, Arjuna’s questions are very appropriate. He wants to know the symptoms of a person who has already transcended the material modes. He first inquires of the symptoms of such a transcendental person.
How can one understand that he has already transcended the influence of the modes of material nature? The second question asks how he lives and what his activities are. Are they regulated or nonregulated? Then Arjuna inquires of the means by which he can attain the transcendental nature.
That is very important. Unless one knows the direct means by which one can be situated always transcendentally, there is no possibility of showing the symptoms. So all these questions put by Arjuna are very important, and the Lord answers them.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -115 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాసయోగము 📚*
*🍀. ముఖ్య సూత్రములు - 3 🍀*
12. మేఘము క్రమ్మినపుడు సూర్యుడు గోచరింపడు. నిజమునకు సూర్యుని దరిదాపులయందు మేఘ ముండదు. భూమి పరిసరముల యందే మేఘ ముండును. భూమి జీవులు సూర్యుని మేఘము క్రమ్మినదని భావింతురు. అది వారి భ్రమ. సూర్యుని మేఘము క్రమ్మలేదు.
అట్లే ప్రకృతిబద్ధులైన జీవులకు అజ్ఞాన మను మేఘము క్రమ్మును. కాని ప్రతి జీవియు నిజముగ ఒక సూర్యుడే. పరబ్రహ్మము నందు నిష్ఠతో బుద్ధిని నిలిపి, అతని స్మరణమున తన్మయము చెందువారిని కల్మష పూరితమగు అజ్ఞాన మంటదు.
13. అట్టివారికి కుక్కమాంసము నందు, దానిని తిను చండాలుని యందు, ఏనుగునందు, ఆవునందు విద్యావినయ సంపద గల బ్రాహ్మణుని యందు, సృష్టియందలి సమస్త వస్తు జాల మందు బ్రాహ్మ దర్శనమే జరుగుచుండును. వారిని సమదర్శనులు అందురు.
14. బ్రహ్మమునందు స్థిరపడిన మనసు కలవారు దేహము నందున్నను వారిని జనన మరణాదులు గాని, సంసారము గాని అంటదు.
15. అట్టివాడు స్థిరబుద్ధి కలిగి యుండుటచే మోహపడడు. అతనికి ప్రియముగాని, అప్రియముగాని యుండదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 315 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴*
78. అధ్యాయము - 33
*🌻. వీరభద్రుని యాత్ర - 2 🌻*
గుణనిధియగు జ్వాలకేశుడు పన్నెండు, శోభాయుక్తుడగు సమదుడు ఏడు, దుద్రభుడు ఎనిమిది (19), కపాలీశుడు అయిదు, సందారకుడు ఆరు, కోటి కుండుడు ఒకటి (20), గణములలో శ్రేష్ఠుడగు విష్టంభుడు ఎనిమిది కోట్ల , వీరులైన గణములతో బయలుదేరిరి.
ఓ వత్సా! సంనాదుడు వేయి, పిప్పలుడు వేయి (21), ఆవేశనుడు ఎనిమిది, చంద్రతాపనుడు ఎనిమిది, మహావేశుడనే గణాధ్యక్షుడు వేయి కోట్ల గణులచే చుట్టువారబడి ముందునకు సాగిరి (22). ఓ మహర్షీ! కుండి పన్నెండు కోట్ల గణములతో, గణశ్రేష్ఠుడగు పర్వతకుడు పన్నెండు కోట్ల గణములతో దక్షుని యజ్ఞమును ధ్వంసము చేయుటకై బయల్వెడలిరి (23).
కాలుడు, కాలకుడు మరియు మహాకాలుడు వందకోట్ల గణములతో దక్షయజ్ఞమునకు వెళ్లిరి (24). అగ్నికృత్ వంద, అగ్ని ముఖుడు ఒకటి, ఆదిత్యమూర్ధుడు ఒకటి, ఘనావహుడు ఒకటి (25), సన్నాహుడు వంద, కుముదుడు ఒకటి, అమోఘుడు ఒకటి, కోకిలుడను గణాధ్యక్షుడు ఒకటి (26),
కాష్ఠాగూఢుడు అరవై నాలుగు కోట్ల గణములతో బలయుదేరిరి. ఓ కుమారా! సుకేసి, వృషభుడు, సుమంత్రకుడు అను గణాధ్యక్షులు కూడ తరలివెళ్లిరి (27). గణశ్రేష్ఠుడగు కాకపాదోదరుడు అరవై, మరియు గణపుంగవుడగు సంతానకుడు అరవై కోట్ల గణములతో ముందునకు నడచిరి (28).
మహ బలుడగు పుంగవుడు తొమ్మిది కోట్ల గణములతో నడచెను . ఓవత్సా! మధుపింగుడను గణాధ్యక్షుడు కూడ విచ్చేసెను (29). నీలుడు తొంభై, పూర్ణ భద్రుడు వంద కోట్ల గణములతో బలయుదేరిరి. చతుర్వక్త్రుడు అనే గణాధ్యక్షుడు కూడ వెళ్లెను (30). విరూపాక్షుడను గణనాథుడు అరవై నాల్గు కోట్ల గణములతో నడచెను. తాలకేతువు, షడాస్యుడు, పంచాస్యుడను గణాధిపుడు (31),
సంవర్తకుడు, కులీశుడు, స్వయంప్రభుడు, లోకాంతకుడు అను గణనాథుడు వెళ్లెను. ఓ మహర్షీ! వారిలో దైత్యాంతకుడు మిక్కిలి ప్రకాశించెను (32). శోభాయుక్తుడు, దేవదేవుడగు శివునకు ప్రియుడునగు భృంగీ, రిటి మరియు అశని, భాలకుడు, మరియు సహస్రకుడు అరువది నాల్గుకోట్ల గణములతో తరలివెళ్లిరి (33).
వీరభద్రుని, శివుని ఆజ్ఞను పొంది వీరుడగు వీరేశుడు వేయి న్నూట ఇరవై కోట్ల గణములతో కూడుకుని ముందుకు నడచెను (34).
వీరుడు వేయి కోట్ల భూతములతో, రోమముల నుండి పుట్టిన మూడు కోట్ల కుక్కలతో కూడి వేగముగా నడచెను (35). అపుడు భేరీలు, శంఖములు, కొమ్ము వాద్యములు, శివుని ముఖాకారము గల వాద్యములు మొదలగు వాటి నుండి గొప్పనాదము వెలువడెను (36).
ఆ మహోత్సవమునందు వివిద వాద్యములను వాయించుటచే ఉత్పన్నమైన శబ్దములు చెవులకు ఇంపుగనున్నవై సర్వత్రా వ్యాపించెను (37). ఓ మహర్షీ! సైన్యముతో గూడి వీరభద్రుడు పయనించుచుండగా, అచట మనస్సునకు ఆనందమునిచ్చే విభిన్న శకునములు కలిగినవి (38).
శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీఖండలో వీరభద్రయాత్రా వర్ణనమనే ముప్పది మూడవ అధ్యాయము ముగిసినది (33).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 68 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
CHAPTER 5 - THE 5th RULE
*🌻 5. Kill out all sense of separateness - 13 🌻*
276. So with us; it is not in the least necessary that we should put ourselves into the worst conditions. On the contrary we can often help more effectively by not hampering ourselves in that way.
If a man finds himself in a peculiarly unpleasant crowd, perhaps filled with some savage feeling or outburst of passion, he can throw a shell round himself and so protect himself from the evil influence, but he cannot do very much with that crowd while he is occupied in doing that. On the other hand, if he were away from it he would be able to pour more force upon it. Even then, if a crowd of undeveloped men is under the sway of some crude passion, very little can be done with it from higher planes, because the force poured out could hardly affect it while it was in that state.
Therefore we need not enter evil surroundings unless we see clearly that we can do definite good there, although we must do the best we can if we find ourselves in such an environment. I have heard, for example of preachers who have gone into drinking saloons and started a religious service, and there have been cases where such a bold move as that was actually successful.
There would, of course, be many occasions when such a procedure would end in a fiasco. In these things, as in war, a very bold and apparently rash move may occasionally turn out well, but usually more can be accomplished by working in a reasonable way.
277. Remember that the sin and shame of the world are your sin and shame; for you are a part of it; your karma is inextricably interwoven with the great Karma.
278. We do not realize that down here, but on reaching the buddhic plane we see that it represents a real truth. There we feel: “I am part of that which humanity cannot avoid; something exists in it which is a shame to me” and we feel it so because we as part of humanity have caused it. On the other hand we have our share in every good that has been done. When one man has taken a step forward we feel it as a triumph for all; through him all humanity has come a little nearer to its goal.
279. And before you can attain knowledge you must have passed through all places, foul and clean alike. Therefore, remember that the soiled garment you shrink from touching may have been yours yesterday, may be yours tomorrow.
And if you turn with horror from it, when it is flung upon your shoulders, it will cling the more closely to you. The self-righteous man makes for himself a bed of mire. Abstain because it is right to abstain, not that yourself shall be kept clean.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 200 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. దుర్వాసమహర్షి-కందళి - 4 🌻*
17. ఉద్యోగం చేస్తున్నప్పుడు, మనతో పనిచేసే వ్యక్తిని – ఒక మామూలు వ్యక్తిని తక్కువగా చూడటం ధర్మమేనా? అది వీలవుతుందా? ఒకవేళ అతడు సేవక వృత్తిలో ఉంటేమాత్రం అలా చెయ్యవచ్చా? ఎవరి హద్దులు వారు మీరరాదు. ఉద్యోగ ధర్మాన్ననుసరించి ఒకడి ముందు మరొకడు చేతులు కట్టుకుని నిలబడి ఉండవచ్చు. అయితే లోపల ఉండేస్థితికి, లౌకికజీవన విధానానికి ముడిపెట్టుకోకూడదు.
18. ఏ అంతస్థులో, ఏ ఉద్యోగం, ఏ నిర్వహణలో ఏపాత్రను మనుష్యులు పోషిస్తున్నారో-ఆ పాత్ర ఔచిత్యం దాటకూడదు. అది ధర్మగ్లాని అవుతుంది. అలా చేస్తే, ధర్మందాటిన దోషంవస్తుంది. ప్రతి సంఘటనలోనూ తన యొక్క ధర్మ పాలకత్వం, ధర్మనిష్ఠ ఎంత హద్దుల్లో తనున్నాడో శ్రీకృష్ణుడు తెలియపరిచాడు.
19. తను పరమేశ్వరుడే! పాండవపక్షపాతి అని తనకు పేరు ఉంది. వీళ్ళందరూ తనకు భక్తులు. అలా అయినప్పటికీ, తన పరమేశ్వరశక్తిని వాళ్ళయందు ప్రసరింపచేసి వారిని రక్షించి కాపాడాడా! లేదు. అభిమన్యుడు పాండవులకు ఒక్కడే వంశాంకురం. 16-18 ఏళ్ళ చిన్నవాడు. అతడు చచ్చిపోతుంటే చూస్తూనే ఊరుకున్నాడు కృష్ణపరమాత్మ! అభిమన్యుడు చనిపోయడు.
20. అయినా తన దివ్యశక్తులతో కాపాడాడా! నేనున్నాను అని అర్జునుడికి చెప్పాడా? నేను కాపాడతాను అన్నాడా? అలా అనలేదు సరికదా, “నువ్వు యుద్దంచెయ్యి. రాజ్యాన్ని గెలుచుకుంటే ఏలుకుంటావు. యుద్ధంలో చచ్చిపోతే స్వర్గానికి పోతావు” అన్నాడు యుద్ధప్రారంభంలోనే. ఇది ఆయన ఇచ్చిన వాగ్దానం! అందులో ఏమయినా హామీ ఉందా! తను చెప్పాలా ఆమాట!
21. “నువ్వు ఉన్నావు కదా! నీ అండదండలు చూసుకుని యుద్దంచేస్తాను” అనడానికిలేదు. రెండుదారులు చెప్పాడే తప్ప, నేను కాపాడతానని ఆయన అనలేదు. ఎందుకంటే, అది తన ఉద్యోగం కాదు. వారి అర్హత ఎంతో తన హద్దుకూడా అంతే. తాను జ్ఞాన స్వరూపుడు. శుద్ధస్వరూపుడు. శాంతుడు. అందుచేత సృష్టిలో ఉన్న ఏ సంఘటనలో ఏదీ కూడా ఆయనలో(కృష్ణునిలో) వికారాన్ని కలిగించలేదు.
22. కృష్ణుని జీవితం అడుగడుగునా బొధయే! భారతంలో అడుగడుగునా ధర్మబోధ తప్ప మరొకటి లేదు. ధర్మబోధ తెలుసుకోవాలంటే మహాభారతం కంటే గొప్ప పాఠ్యప్రణాళిక మరొకటిలేదు. ‘పంచమవేదం’ అని దానికి పేరు. దానికి తగినపేరు పంచమవేదం. అంటే నాలుగు వేదములు, ఇంకా ఎంతో అని అర్థం చేసుకోవాలి; అంతే కాని, కొంత మిగిలితే ఆ శేషం పంచమవేదం అని కాదు అర్థం.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 264 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 113. I take you to the source 'I am' again and again, on reaching and stabilizing there you realize there is no 'I am'! 🌻*
The Guru is tireless in his efforts and very generous indeed. All those who come to his door receive the same treatment - that is, they are taken to the source 'I am' again and again.
He does not talk about anything else, he wants to make the most of whatever time he has left in this physical body and impart his teaching to all those who come.
He is hopeful that of the many that come at least a few, or maybe only one, may understand what he is saying, get stabilized in the 'I am', realize its unreality and be free from it.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 139 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 18 🌻*
563.శాశ్వతమైన భగవంతుని అనంత స్థితిని ఎరుకతో అనుభూతిని పొందుటయే :: జీవితగమ్యము.
564.మానవరూపములో"అహంబ్రహ్మాస్మి" స్థితిని పొంది,సత్యానుభవమును పొందుటయే గమ్యస్థానము.
565.అనుభవ దివ్యత్వము.
ఈ స్థితిలో మానవుడు తన స్వభావము అనంతానందమేగాని పరిమిత స్థూలకాయము కాదనియు,అనంతశక్తియేగాని పరిమిత ప్రాణము కాదనియు,అనంత జ్ఞానమే గాని పరిమిత మనస్సు కాదనియు అనుభవమును పొందును.
566.చైతన్యము సంస్కారములను పూర్తిగా వదిలిన తరువాత ఇంకెన్నడును అయదార్థపు అభావమును నిజమని అనుభూతి నొందక సత్యమునే అనంత పరమాత్మగా అనుభవమును పొందును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 103 / Sri Vishnu Sahasra Namavali - 103 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*
*ఉత్తరాభాద్ర నక్షత్ర తృతీయ పాద శ్లోకం*
*🍀 103. ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః*
*తత్త్వం తత్త్వ విదేకాత్మా జన్మమృత్యు జరాతిగః || 103 ‖ 🍀*
🍀 959) ప్రమాణ: -
స్వయముగానే జ్ఞానస్వరూపుడై యున్నవాడు.
🍀 960) ప్రాణ నిలయ: -
సమస్త జీవుల అంతిమ విరామ స్థానమైనవాడు.
🍀 961) ప్రాణభృత్ -
ప్రాణములను పోషించువాడు.
🍀 962) ప్రాణజీవన: -
ప్రాణ వాయువుల ద్వారా ప్రాణులను జీవింపజేయువాడు.
🍀 963) తత్త్వం -
సత్యస్వరూపమైనందున భగవానుడు తత్త్వం అని తెలియబడిన వాడు.
🍀 964) తత్త్వవిత్ -
సత్యవిదుడైన భగవానుడు తత్త్వవిత్ అని స్తుతించబడువాడు.
🍀 965) ఏకాత్మా -
ఏకమై, అద్వితీయమైన పరమాత్మ
🍀 966) జన్మమృత్యు జరాతిగ: -
పుట్టుట, ఉండుట, పెరుగుట, మార్పుచెందుట, కృశించుట నశించుట వంటి వికారములకు లోనుగానివాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 103 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*
*Sloka for Uttara Bhadra 3rd Padam*
*🌻 103. pramāṇaṁ prāṇanilayaḥ prāṇabhṛt prāṇajīvanaḥ |*
*tattvaṁ tattvavidekātmā janmamṛtyujarātigaḥ || 103 || 🌻*
🌻 959. Pramāṇaṁ:
One who is self-certifying, as He is Pure Consciousness.
🌻 960. Prāṇanilayaḥ:
The home or dissolving ground of the Pranas.
🌻 961. Prāṇa-bhṛt:
One who strengthens the Pranas as food (Anna).
🌻 962. Prāṇa-jīvanaḥ:
He who keeps alive human beings with Vayus (airs) known as Prana, Apana etc.
🌻 963. Tattvaṁ:
Means Brahman, just as words like Amruta, Satya, Paramartha, etc.
🌻 964. Tatvavid:
One who knowns His own true nature.
🌻 965. Ekātmā:
One who is the sole being and the spirit (Atma) in all.
🌻 966. Janma-mṛtyu-jarātigaḥ:
One who subsists without being subject to the six kinds of transformations - being born, existing, temporarily, growing, transforming, decaying and dying.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹