🍀 17 - NOVEMBER - 2022 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🍀

🌹🍀 17 - NOVEMBER - 2022 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🍀🌹
🌹17 - NOVEMBER నవంబరు - 2022 THURSDAY బృహస్పతి వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 283 / Bhagavad-Gita -283 - 7వ అధ్యాయము 03 జ్ఞాన విజ్ఞాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 682 / Vishnu Sahasranama Contemplation - 682 🌹
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 644 / Sri Siva Maha Purana - 644 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 361 / DAILY WISDOM - 361 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 260 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹17, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మండల కళ ప్రారంభం, Mandalakala Begins 🌻*

*🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 17 🍀*

*17. స్వామిన్ప్రతీచా హృదయేన ధన్యాః త్వద్ధ్యాన చంద్రోదయ వర్ధమానం*
*అమాంతమానందపయోధిమంతః పయోభి రక్ష్ణాం పరివాహయంతి ॥17॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : కృష్ణభగవానుడు ఒక్కడూ ఒక వైపున, ప్రపంచమంతా వేరొక వైపున ఉన్నా, భగవానునితోడి ఏకాంత వాసమునే కోరుకో. ప్రపంచం నీ శరీరాన్ని మట్టగించివేసినా, దాని ఆయుధ సంచయం నిన్ను తుత్తునియలు చేసి వేసినా లెక్క చెయ్యకు. ఏనాడైనా శరీరమొక శవం. మనస్సౌక మాయారూపం. కోశబంధ వివర్జిత మైన ఆత్మదే విజయం. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,
దక్షిణాయణం, కార్తీక మాసం
తిథి: కృష్ణ అష్టమి 07:58:29 వరకు
తదుపరి కృష్ణ నవమి
నక్షత్రం: మఘ 21:21:07 వరకు
తదుపరి పూర్వ ఫల్గుణి
యోగం: ఇంద్ర 25:23:44 వరకు
తదుపరి వైధృతి
కరణం: కౌలవ 07:56:29 వరకు
వర్జ్యం: 08:10:30 - 09:55:54
మరియు 29:57:00 - 31:40:12
దుర్ముహూర్తం: 10:07:49 - 10:53:02
మరియు 14:39:04 - 15:24:17
రాహు కాలం: 13:25:37 - 14:50:23
గుళిక కాలం: 09:11:19 - 10:36:05
యమ గండం: 06:21:46 - 07:46:32
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22
అమృత కాలం: 18:42:54 - 20:28:18
సూర్యోదయం: 06:21:46
సూర్యాస్తమయం: 17:39:55
చంద్రోదయం: 00:14:06
చంద్రాస్తమయం: 13:18:04
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు : ముసల యోగం - దుఃఖం
21:21:07 వరకు తదుపరి గద యోగం
 - కార్య హాని , చెడు

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 283 / Bhagavad-Gita - 283 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴.7 వ అధ్యాయము - జ్ఞానవిజ్ఞాన యోగం - 03 🌴*

*03. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే |*
*యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వత:*

🌷. తాత్పర్యం :
*వేలాది మనుష్యులలో ఒక్కడు మాత్రమే పూర్ణత్వమును సాధించుటకు ప్రయత్నించును. ఆ విధముగా పూర్ణత్వమును సాధించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలిసికొన గలుగుచున్నాడు.*

🌷. భాష్యము : 
మానవులందరు పెక్కు తరగతులవారు కలరు. అట్టి వేలాది మనుష్యులలో ఒకానొకడు మాత్రమే ఆత్మసాక్షాత్కారమునందు అభిరుచిని కలిగి ఆత్మ యననేమో, దేహమననేమో, పరతత్త్త్వమననేమో తెలిసికొనుటకు యత్నించును. 

సాధారణముగా మనుజులు పశుప్రవృత్తులేయైన ఆహారము, భయము, నిద్ర, మైథునముల యందు మాత్రమే నియుక్తులై యుందురు. ఏ ఒక్కడు కుడా ఆధ్యాత్మికజ్ఞానము నందు అభిరుచిని కలిగియుండడు. భగవద్గీత యందలి మొదటి ఆరు అధ్యాయములు ఆధ్యాత్మికజ్ఞానము నందును, ఆత్మ, పరమాత్మలను అవగాహన చేసికొనుట యందును, జ్ఞానయోగము మరియు ధ్యానయోగము ద్వారా ఆత్మసాక్షాత్కారమును పొందుట యందును, అనాత్మయైన భౌతికపదార్థమును ఆత్మ నుండి వేరుగా గాంచుట యందును అనురక్తులై యుండెడి వారికై నిర్దేశింపబడినవి. 

కాని వాస్తవమునకు కృష్ణభక్తిభావనయందున్న వారికే శ్రీకృష్ణభగవానుడు సంపూర్ణముగా అవగతము కాగలడు. ఇతర తత్త్వవేత్తలు నిరాకార బ్రహ్మతత్త్వమును మాత్రము పొందిన పొందవచ్చును. 

ఏలయన నిరాకార బ్రహ్మతత్త్వము నెరుగుట శ్రీకృష్ణుని అవగతము చేసికొనుట కన్నను సులువైనది. శ్రీకృష్ణుడు పూర్ణపురుషోత్తముడే గాక నిరాకార బ్రహ్మము మరియు పరమాత్మల జ్ఞానములకు పరమైనవాడు. కనుకనే యోగులు మరియు జ్ఞానులైనవారు కృష్ణుని అవగాహనము చేసికొను యత్నములో భ్రమనొందుదురు. పరమ అద్వైతియైన శ్రీశంకరాచార్యులు తమ గీతాభాష్యములో శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించినను, ఆయన అనుయాయులు మాత్రము శ్రీకృష్ణుని దేవదేవుడని అంగీకరింపరు. మనుజడు నిరాకారబ్రహ్మానుభూతిని కలిగియున్నను శ్రీకృష్ణుని అవగతము చేసికొనుట అతి కష్టకార్యమగుటయే అందులకు కారణము.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 283 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 7 - Jnana Vijnana Yoga - 03 🌴*

*03. manuṣyāṇāṁ sahasreṣu kaścid yatati siddhaye*
*yatatām api siddhānāṁ kaścin māṁ vetti tattvataḥ*

🌷 Translation : 
*Out of many thousands among men, one may endeavor for perfection, and of those who have achieved perfection, hardly one knows Me in truth.*

🌹 Purport :
There are various grades of men, and out of many thousands, one may be sufficiently interested in transcendental realization to try to know what is the self, what is the body, and what is the Absolute Truth. 

Generally mankind is simply engaged in the animal propensities, namely eating, sleeping, defending and mating, and hardly anyone is interested in transcendental knowledge. 

The first six chapters of the Gītā are meant for those who are interested in transcendental knowledge, in understanding the self, the Superself and the process of realization by jñāna-yoga, dhyāna-yoga and discrimination of the self from matter. However, Kṛṣṇa can be known only by persons who are in Kṛṣṇa consciousness. 

Other transcendentalists may achieve impersonal Brahman realization, for this is easier than understanding Kṛṣṇa. Kṛṣṇa is the Supreme Person, but at the same time He is beyond the knowledge of Brahman and Paramātmā. The yogīs and jñānīs are confused in their attempts to understand Kṛṣṇa. 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 682 / Vishnu Sahasranama Contemplation - 682🌹*

*🌻682. స్తుతిః, स्तुतिः, Stutiḥ🌻*

*ఓం స్తుతయే నమః | ॐ स्तुतये नमः | OM Stutaye namaḥ*

*దేవతా విష్ణునామ్నీ సాస్తుతిశ్చస్తవనక్రియా*

*స్తుతి చేయుట అను క్రియయు విష్ణుదేవుడే!*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 682🌹*

*🌻682. స్తుతిః, स्तुतिः, Stutiḥ🌻*

*ఓం స్తుతయే నమః | ॐ स्तुतये नमः | OM Stutaye namaḥ*

*देवता विष्णुनाम्नी सास्तुतिश्चस्तवनक्रिया / Devatā viṣṇunāmnī sāstutiścastavanakriyā*

*Encomium in the praise of Lord is also a form of Lord Viṣṇu.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः ।पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥
స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥
Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ,Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 644 / Sri Siva Maha Purana - 644 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 14 🌴*
*🌻. గణ వివాదము - 5 🌻*

సఖి ఇట్లు పలికెను -

ఓయి కుమారా! నీవు చేసిన పని బాగున్నది. వారు బలాత్కారముచే ప్రవేశించకుండునట్లు చేయుము. నీ ముందు ఈ గణములెంత? నీ వంటి వానిని వారు జయించగలరా యేమి? వారుతమకర్తవ్యమును చేసిననూ మానిననూ నీ కర్తవ్యమును నీవు చేయుము. నీవు జయించిననూ వైరమును పూనవలదు. ఇది నిశ్చయము (45).

బ్రహ్మ ఇట్లు పలికెను -

గణశుడు ఆ తల్లి మాటలను చెలికత్తె ద్వారా విని మిక్కిలి ఆనందమును, గొప్ప బలమును మరియు మహోత్సాహమును పొందెను (46). ఆతడు నడుము బిగించి తలపాగా చుట్టి మోకాళ్ల వరకు పంచెను బిగించి తొడ చరచి నిర్భయముగా ఆనందముతో ఆ గణములనందరినీ ఉద్దేశించి ఇట్లు పలికెను (47).

గణేశుడు ఇట్లు పలికెను -

నేను పార్వతీ పుత్రుడను. మీరు గణములు. మనమిద్దరము సమానస్థాయికి చెందిన వారమే. కావున ఎవరి కర్తవ్యమును వరు చెసెదము (48). మీరు ద్వారపాలకులు. నేను ద్వారపాలకుడను ఏల కాజాలను? మీరచట, నేనిచట నిలబడి యున్నాము. ఇది నిశ్చయము (49). మీరు పూర్వము ఇచట నిలబడిన వారే. మీ కర్తవ్యము మీకు నిశ్చితమైన వెంటనే అమలు చేయుడు. శివుని ఆజ్ఞను పాలించుడు (50). ఇపుడు నేనిచట పార్వతీ దేవి యొక్క ఆజ్ఞను యథార్థముగా అమలు చుయుచున్నాను. ఓ వీరులారా! నా నిర్ణయము యథాయోగ్యముగ నున్నది (51).

కావున ఓ శివగణములారా! మీరందరు నా మాటను శ్రద్ధగా వినుడు. బాలాత్కారముగా గాని, వినయముతో గాని మీరు మరల మందిరములో అడుగు పెట్టవద్దు (52).

బ్రహ్మ ఇట్లు పలికెను -

గణేశుడిట్లు పలుకగా ఆ గణములందరు సిగ్గుపడి శివుని వద్దకు వెళ్లి ఆయనకు నమస్కరించి ఆయన యెదుట నిలబడిరి (53). వారు చేతులు జోడించి తలలు వంచి శివుని స్తుతించి ఆయన ఎదుట నిలబడి ఆ అద్భుతమగు వృత్తాంతమును విన్నవించిరి (54). శంకరుడు తన గణములు చెప్పిన ఆ వృత్తాంతము నంతనూ విని లోకాచారము ననుసరించి ఇట్లు పలికెను (55).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 644🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 14 🌴*

*🌻 The Gaṇas argue and wrangle - 5 🌻*

The friend said:—
45. O gentle sir, well done. Let them not enter forcibly. What are these Gaṇas before you? Can they win a person like you?

46. Whether good or bad let your duty be done. If you are conquered there will be no further enmity at all.

Brahmā said:—
47. On hearing the words of the friend and his mother Gaṇeśvara became highly delighted, strengthened and lifted up.

48. Girting up his loins, tying his turban firmly and clapping his calves and thighs, he spoke fearlessly to all the Gaṇas.

Gaṇeśa said:—
49. I am the son of Pārvatī. You are the Gaṇas of Śiva. Both of us are thus equal. Let your duty be done, now.

50. You are all doorkeepers. How is it that I am not? You are standing there and I am standing here. This is certain.

51. When it is certain that you are standing here, you must carry out the directions of Śiva.

52. O heroes, now I have to carry out the orders of Pārvatī faithfully. I have decided what is proper.

53. Hence, O Gaṇas of Śiva, you shall listen with attention. You shall not enter the apartment either forcibly or humbly.

Brahmā said:—
54. The Gaṇas when decisively told by Gaṇeśa became ashamed. They went to Śiva. After bowing to him they stood in front of him.

55. Then they acquainted him with that news of wonderful nature. They joined their palms, stooped their shoulders, eulogised Śiva and stood in front of him.

56. On hearing the detailed news mentioned by his Gaṇas, Śiva replied following the worldly conventions.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 361 / DAILY WISDOM - 361 🌹*
*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀*
*📝. ప్రసాద్ భరద్వాజ్*

*🌻26. నిగూఢ ధ్యానాలు🌻*

*ప్రకృతిలో మరింత నిగూఢమైన ధ్యానాలు ప్రధానంగా సంకల్ప సాధనలో ఉంటాయి. అవి నిర్ణీత అవగాహనతో ఉత్తేజితం అవుతాయి. ఈ వ్యవస్థ కూడా ఒక తాత్విక ఆధారాన్ని కలిగి ఉంది, అయితే కార్యాన్వితం చేసినపుడు ఇది ఒక ఆచరణాత్మక మలుపు తీసుకుంటుంది. ఈ రకమైన ధ్యానం ప్రారంభంలో మానసికంగా ఉంటుంది, చివరికి ఆధ్యాత్మికంగా మారుతుంది. ఈ ప్రక్రియ ద్వారా ఒకరికి ప్రపంచంలోని వస్తువులతో ఒక లోతైన సాన్నిహిత్యం వస్తుంది.*

*తనకు మరియు ప్రపంచంలోని వస్తువులకు మధ్య జీవనాధార సంబంధాన్ని కొనసాగించడం ద్వారా, ఒక వ్యక్తి వాటి సారాంశంలోకి ప్రవేశించి , వాస్తవికత యొక్క మూలాలను స్వీకరిస్తాడు. పతంజలి యోగాసుత్రాలలో చెప్పబడిన ధ్యాన పద్ధతులు ఏదైనా వస్తువుతో సాంగత్యం ఏర్పరచుకోవడంతో మొదలై అంచెలంచెలుగా దాన్ని విశాల పరుచుకుంటూ వెళ్లి ఆఖరికి సమస్త వస్తు విషయ శక్తుల భాండాగారమైన విశ్వ చైతన్యంతో సాంగత్యం ఏర్పరచుకోవడంతో ముగుస్తాయి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 361 🌹*
*🍀 📖 from The Philosophy of Religion 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*

*🌻26. Occult Meditations🌻*

*Meditations which are more occult in nature consist mainly in the exercise of the will, charged with a determined understanding. This system, too, has a philosophical basis, though it takes an intensely practical turn when the exercise commences. This type of meditation is psychic in the beginning though spiritual in the end, a process by which one places oneself in a closer affinity with the objects of the world.*

*By continued habituation to the subsisting relationship between oneself and the things of the world one gets into their substance and, in a sense, embraces the very roots of objectivity. The meditational techniques prescribed in the Yoga Sutras of Patanjali border upon a cosmic association of oneself with objects, stage by stage, commencing with particular things chosen for the purpose of meditation, and gradually expanding the area of action into other objects, culminating in the concentration of consciousness on that great reservoir of all things, the universe of elements and forces.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 260 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. మనం శక్తియుక్తులున్న మానవులంగా మనం భావించడం లేదు. మనం సమగ్రంగా వున్నామను కుంటున్నాం. అది నిజం కాదు. 🍀*

*మనిషికి దైవం కాగలిగే శక్తులున్నాయి. కానీ జంతువుగా మిగిలిపోయాడు. ముడి సరకుగా మిగిలిపోయాడు. ఆ ముడి సరుకును అతను ఉపయోగకరంగా ఆధునీకరించ లేదు. కోపాన్ని అనురాగంగా మార్చాలి. అది ధ్యానం గుండా వెళ్ళాలి. అసూయ అన్నది పంచుకోవడంగా మారుతుంది.*

*కాంక్ష అన్నది ప్రేమగా మారుతుంది. ప్రేమ ప్రార్థనగా మారుతుంది. మనం నిచ్చెనలో మొదటి మెట్టు దగ్గర అంటే నిచ్చెన ఆరంభంలో వున్నాం. మనం పుట్టిన దగ్గరే జీవిస్తున్నాం. మనం శక్తియుక్తులున్న మానవులంగా మనం భావించడం లేదు. మనం సమగ్రంగా వున్నామను కుంటున్నాం. అది నిజం కాదు.* 

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 412 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 412 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 412 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 412 - 2🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।
అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀

🌻 412. ‘శిష్టపూజితా' - 2🌻


అనాచారము మితిమీరినపుడు దండించును. అనాచారమున స్థిరపడిన వారిని కష్ట నష్టముల ద్వారా మెత్తబరిచి ఆచారము నవలంబింప చేయును. సదాచారులు పూజలు మన్నించి అనుగ్రహించును. కొందరిని అనుగ్రహించుట, కొందరిని అనుగ్రహింపకుండుటకు కారణము ధర్మాచరణ యందుగల వ్యత్యాసమే అని తెలియవలెను. ధర్మమును నమ్మి తనను పూజించు వారిని ఎల్లప్పుడూ రక్షించుచుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 412 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita
Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻

🌻 412. 'Sishta Pujita' - 2🌻


When inmorality is excessive, She punishes. Those who are not righteous in their practices are trained by Srimata by way of hurdles and setbacks and then inculcates righteousness in their practices. She accepts the worships of the righteous and blesses them. It should be known that the reason for apparent favoring some and not favoring others is the difference their righteousness. She always protects those who believe in Dharma and worship Her.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

ఓషో రోజువారీ ధ్యానాలు - 264. అవగాహన / Osho Daily Meditations - 264. AWARENESS


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 264 / Osho Daily Meditations - 264 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 264. అవగాహన 🍀

🕉. ఎక్కడకీ వెళ్లనవసరం లేదు; మనం ఎక్కడున్నామో చూడాలి. అది మీరు తెలుసుకుంటే, మీరు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న చోటనే మీరు ఇప్పటికే ఉన్నారని అకస్మాత్తుగా గుర్తిస్తారు. 🕉


ఒకరు ఎలా ఉండాలో అలాగే పుడతారు-ఏదీ జోడించాల్సిన అవసరం లేదు మరియు ఏదీ మెరుగుపరచాల్సిన అవసరం లేదు. మరియు ఏమీ మెరుగుపరచ బడదు. మెరుగు పరచడానికి చేసే అన్ని ప్రయత్నాలు మరింత గందరగోళాన్ని, అయోమయాన్ని సృష్టిస్తాయి తప్ప మరేమీ కాదు. మిమ్మల్ని మీరు ఎంతగా మెరుగుపరుచు కోవడానికి ప్రయత్నిస్తారో, అంతగా మీరు ఇబ్బందులకు గురవుతారు, ఎందుకంటే ఆ ప్రయత్నం మీ వాస్తవికతకు వ్యతిరేకంగా ఉంటుంది. మీ వాస్తవికత అలాగే ఉంది; దాన్ని మెరుగుపరచాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి కేవలం అవగాహనలో పెరుగుతాడు, అస్తిత్వపరంగా కాదు. బిచ్చగాడిలా భావించి, జేబులోకి చూసుకోకుండా జీవించడం చేస్తున్నావు.

జీవితాంతం సరిపడా సంపదను అందించగల విలువైన వజ్రాన్ని జేబులో పెట్టుకుని, భిక్షాటన చేస్తూ తిరుగుతున్నావు. ఆ తర్వాత ఒకరోజు జేబులో చెయ్యి పెట్టుకుని, అకస్మాత్తుగా నువ్వు చక్రవర్తివి గుర్తిస్తావు. అస్తిత్వపరంగా ఏదీ మారలేదు, పరిస్థితి అలాగే ఉంది-వజ్రం ముందూ ఉంది, ఇప్పుడూ ఉంది. మారిన ఏకైక విషయం ఏమిటంటే, ఇప్పుడు మీరు దానిని కలిగి ఉన్నారని తెలుసుకున్నారు. కాబట్టి జరిగే అభివృద్ధి అంతా కూడా అవగాహనలో పెరుగుదల, ఉనికిలో కాదు. ఉండటం సరిగ్గా అలాగే ఉంటుంది. ఒక కృష్ణడు లేదా బుద్ధుడు, మీరు లేదా ఎవరైనా, సరిగ్గా అదే స్థితిని కలిగి ఉంటారు, అదే స్థలంలో ఉంటారు. కానీ ఒకరు తెలుసుకుని బుద్ధుడిగా మారతారు, మరొకరు తెలియకుండా ఉండి, బిచ్చగాడుగా మిగిలిపోతారు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Osho Daily Meditations - 264 🌹

📚. Prasad Bharadwaj

🍀 264. AWARENESS 🍀

🕉. There is nowhere to go; we just have to see where we are. if you become aware, then you suddenly recognize that you were already there, just where you have been trying to reach. 🕉


One is born as one should be-nothing has to be added, and nothing has to be improved. And nothing can be improved. All efforts to improve create more mess and confusion and nothing else. The more you try to improve upon yourself, the more you will be in difficulties, because the very effort goes against your reality. Your reality is as it should be; there is no need to improve it. One simply grows in awareness, not existentially. It is as if you have not looked into your pocket and you think you are a beggar, so you go on begging, and in your pocket you are carrying a valuable diamond that can give you enough treasures for your whole life.

Then one day you put your hand in the pocket, and suddenly you are an emperor. Nothing has changed existentially, the situation is the same-the diamond was there before, the diamond is there now. The only thing that has changed is that now you have become aware that you possess it. So all growth is growth in awareness, not in being. Being remains exactly as it is. A Krishna or a Buddha, you or anybody, have exactly the same state, the same space. But one becomes aware and becomes a Buddha, the other remains unaware and remains a beggar.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ మదగ్ని మహాపురాణము - 129 / Agni Maha Purana - 129


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 129 / Agni Maha Purana - 129 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 40

🌻. అర్ఘ్యదాన-శల్యముల కథనము - 3🌻


నైరృతిదిక్కున నున్న కోణముందలి అర్ధకోష్ఠముందున్న సురాధిపతి యైన ఇంద్రనకు పసుపునీళ్ళతో అర్ఘ్యమును ఇవ్వవలెను. దాని అర్ధభాగమునందే కోణమునందలి కోష్ఠమునం దున్న ఇద్రజయునకు నెయ్యి అర్ఘ్యముగా ఇవ్వవలెను. చతుష్పదమునందలి మిత్రునకు గుణయుక్త మగు పాయసము సమర్పింపవలెను.

వాయవ్య కోణమున అర్ధకోష్ఠముపై నున్న రుద్రునకు పక్వమాంసమును ఇవ్వవలెను. దాని క్రింద అర్ధకోష్ఠమునం దున్న యక్షునకు (రుద్రదాసునకు) (ద్రాక్షమొదలగు) ఆర్ద్రఫలము లివ్వవలెను. చతుష్పదమునందున్న పర్వతమునకు మాంసాన్నమును, మాషమును బలి ఇవ్వవలెను. మధ్యలో నున్న నాలుగు కోష్ఠములందును బ్రహ్మకొరకై తిలతండులము లుంచవలెను.

చరకిని మాంసఘృతములచేతను, కుమారస్వామిని పులగముచేతను, రక్తముచేతను, విదారిని రక్తకమలముచేతను, కందుర్పుని ఒక ఫలము అన్నముచేతను, పూతనను ఫలపిత్తములచేతను, జంభకుని మాంసరక్తములచేతను, పాపరక్షసుని పిత్త-రక్త-అస్థులచేతను, పలిపిత్సుని మాలికలచేతను, రక్తముచేతను తృప్తిపరుపవలెను.

పిదప ఈశానాది దిక్పాలకులకు రక్తమాసంమును, సమర్పింపవలెను. ఆయా వస్తువులు లభింపనపుడు ఆక్షతలు సమర్పింపవలెను. రాక్షస-మాతృకా. గణ-పిశాచ-పితృ-క్షేత్రపాలాదులకుగూడ ఇచ్ఛానుసారముగా బలిప్రదానము చేయవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Agni Maha Purana - 129 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 40

🌻 The mode of making the respectful offering to the god - 3 🌻


15. Respectful offering along with turmeric (is made) to Indra in the lower square in the south-west and rice mixed with ghee (is offered) in the corner square below Indrajaya.

16. Sweet gruel (mixed) with jaggery (is offered) to Indra in four squares and cooked meat (is offered) to Rudra in the corner square in the north-west.

17. In the corner square below that wet fruit (is offered) to Yakṣa, rice meat and black-gram (are offered) to Mahidhara in four squares.

18. Rice and sesamum should be placed in the central square for Brahmā. Carakī (is worshipped) with black-gram and clarified butter and Skanda with a dish composed of milk, sesamum and rice and a garland.

19. Vidārī (a demoness) (is worshipped) with red lotuses, Kandarpa (god of love) with cooked rice and meat, Pūtanā (a demoness) with meat and bile and Jambaka (a demon) with meat and blood.

20. The Iśa (is appeased) with bile, blood and bones, Pilipiñja (a demon) with a garland and blood. Other deities are worshipped with blood and meat and in their absence with unbroken rice.

21. Sacrificial offerings are made to demons, divine mothers, manes and guardian deities of the ground in due order.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


కపిల గీత - 90 / Kapila Gita - 90


🌹. కపిల గీత - 90 / Kapila Gita - 90🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 46 🌴


46. భావనం బ్రహ్మణః స్థానం ధారణం సద్విశేషణమ్|
సర్వసత్త్వగుణోద్భేదః పృథివీవృత్తిలక్షణమ్॥

విగ్రహాది రూపములలో పరబ్రహ్మము యొక్క సాకార భావనకు ఆశ్రయము గలిగించుట, జలము మొదలగు కారణతత్త్వములకంటె వేరైన ఇతర వస్తువులను ఆశ్రయింపకయే స్థిరముగా ఉండుట, జలము మున్నగు ఇతర పదార్థములను ధారణ చేయుట, ఆకాశాదులచే నిండుట అనగా - ఘటాకాశము, మఠాకాశము - మొదలగు తీరులలో పరిచ్ఛిన్నము చేసినట్లు గోచరించుట అట్లే పరిణామ విశేషములచే సకల ప్రాణుల యొక్క స్త్రీత్వ-పురుషత్త్వాది గుణములను ప్రకటించుట అనునవి పృథివీతత్త్వము యొక్క కార్యరూప లక్షణములు.


భూమి చేసే పనులు

1. భావనం - ఆకారం ఏర్పడుట (కుండ మనం భూమితోనే చేస్తున్నాము. మట్టికి ఆయా ఆకారములుగా మారగల శక్తి ఉన్నది. వివిధ రూపములు పొందగలుగుట మట్టి యొక్క లక్షణం. బంగారము కూడా మట్టి యొక్క ఆకారమే. దానిలో తేజో గుణం ఎక్కువగా ఉంది, అంతే. మనకు కంటికి కనపడే ప్రతీ ఆకారం మట్టి). ఆకారం ఉంది అంటే మట్టి.

2. బ్రహ్మణః స్థానం - సకల చరా చర జగత్తు నిలవడానికి ఆధారం భూమి. స్వర్గములో కూడా భూమి ఉంది. స్వర్గములో కూడా ఇక్కడిలాగే వాయువూ, అగ్నీ, సూర్యుడు చంద్రుడు భూమి ఉంటాయి.

3. ధారణం - మనము ఏమి వేసిన ధరిస్తుంది.

4. సద్విశేషణం - పదార్ధాలలో సారమునీ రుచినీ మార్చేది భూమి. ఒక్కో ప్రాంతములో ఒక్కో పంట విశేషముగా పండుతుంది. అలాగే ఒక ప్రాంతములో పండినవి, ఇంకో ప్రాంతములో పండిన దాని కన్నా రుచిగా ఉంటుంది. అన్ని చోట్లా పండినా, కొన్ని చోట్ల పండిన ధ్యానం రుచి బాగా ఉంటుంది. ఎంత మంచి భూమి అయినా, విత్తనం బాగా లేకుంటే పండదు. ఎంత మంచి విత్తనమైనా చౌటు భూమిలో పండదు. మంచి విత్తనము కూడా మంచి భూమిలో పెరిగినదే. దేశ భేదాన్ని బట్టి సారవంతములూ నిస్సారవంతములూ అవుతాయి.

సర్వసత్త్వగుణోద్భేదః - మట్టి ప్రాణుల ఆకారాన్ని కూడా మారుస్తుంది. ఒక ప్రాంతములో ఉన్న వారికి కళ్ళు చిన్నగా ఉంటాయి, కొన్ని ప్రాంతాలలో తెల్లగా, కొన్ని ప్రాంతాలలో నల్లగా ఉంటారు. అంటే స్వరూపానీ, రుచినీ, ఆకారాన్ని మార్చేది భూమి. స్వభావాన్ని మార్చేది కూడా భూమే. దేవాలయానికి వెళితే ప్రశాంతముగా ఉంటుంది. వ్యగ్రమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనసు వ్యగ్రముగా ఉంటుంది. హిమాలయాలలో ఉన్న జంతువులకి జుట్టు ఎక్కువ ఉంటుంది.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 90 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 46 🌴


46. bhāvanaṁ brahmaṇaḥ sthānaṁ dhāraṇaṁ sad-viśeṣaṇam
sarva-sattva-guṇodbhedaḥ pṛthivī-vṛtti-lakṣaṇam

The characteristics of the functions of earth can be perceived by modeling forms of the Supreme Brahman, by constructing places of residence, by preparing pots to contain water, etc. In other words, the earth is the place of sustenance for all elements.

Different elements, such as sound, sky, air, fire and water, can be perceived in the earth. Another feature of the earth especially mentioned here is that earth can manifest different forms of the Supreme Personality of Godhead. By this statement of Kapila's it is confirmed that the Supreme Personality of Godhead, Brahman, has innumerable forms, which are described in the scriptures. By manipulation of earth and its products, such as stone, wood and jewels, these forms of the Supreme Lord can be present before our eyes. When a form of Lord Kṛṣṇa or Lord Viṣṇu is manifested by presentation of a statue made of earth, it is not imaginary. The earth gives shape to the Lord's forms as described in the scriptures.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

16 Nov 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹16, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹

శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌺. పండుగలు మరియు పర్వదినాలు : కాలభైరవ జయంతి, వృశ్చిక సంక్రాంతి, Kalabhairav Jayanti, Vrischika Sankranti 🌺

🍀. శ్రీ నారాయణ కవచం - 22 🍀


33. తేనైవ సత్యమానేన సర్వజ్ఞో భగవాన్ హరిః |
పాతు సర్వైః స్వరూపైర్నః సదా సర్వత్ర సర్వగః

34. విదిక్షు దిక్షూర్ధ్వమధః సమంతా- దంతర్బహిర్భ గవాన్నారసింహః |
ప్రహాపయఁల్లోకభయం స్వనేన స్వతేజసా గ్రస్తసమస్తతేజాః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : లోకం చెడ్డదన్న ప్రతి దానినీ నీవు చెడ్డదనబోకు. ఈశ్వరుడు నిరాకరించినది మాత్రమే నీవు నిరాకరించు. అట్లే, లోకం మంచిదన్న ప్రతి దానినీ నీవు మంచిదనబోకు. ఈశ్వరుడు స్వీకరించినది మాత్రమే నీవు స్వీకరించు.🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,

దక్షిణాయణం, కార్తీక మాసం

తిథి: కృష్ణ అష్టమి 31:58:13 వరకు

తదుపరి కృష్ణ నవమి

నక్షత్రం: ఆశ్లేష 18:59:05 వరకు

తదుపరి మఘ

యోగం: బ్రహ్మ 25:08:43 వరకు

తదుపరి ఇంద్ర

కరణం: బాలవ 18:54:21 వరకు

వర్జ్యం: 06:30:00 - 08:17:00

దుర్ముహూర్తం: 11:38:02 - 12:23:17

రాహు కాలం: 12:00:40 - 13:25:31

గుళిక కాలం: 10:35:49 - 12:00:40

యమ గండం: 07:46:07 - 09:10:58

అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22

అమృత కాలం: 17:12:00 - 18:59:00

సూర్యోదయం: 06:21:15

సూర్యాస్తమయం: 17:40:04

చంద్రోదయం: 00:14:06

చంద్రాస్తమయం: 12:40:21

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: కర్కాటకం

యోగాలు : రాక్షస యోగం - మిత్ర కలహం

18:59:05 వరకు తదుపరి చర యోగం

- దుర్వార్త శ్రవణం


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹