శ్రీ మదగ్ని మహాపురాణము - 129 / Agni Maha Purana - 129
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 129 / Agni Maha Purana - 129 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 40
🌻. అర్ఘ్యదాన-శల్యముల కథనము - 3🌻
నైరృతిదిక్కున నున్న కోణముందలి అర్ధకోష్ఠముందున్న సురాధిపతి యైన ఇంద్రనకు పసుపునీళ్ళతో అర్ఘ్యమును ఇవ్వవలెను. దాని అర్ధభాగమునందే కోణమునందలి కోష్ఠమునం దున్న ఇద్రజయునకు నెయ్యి అర్ఘ్యముగా ఇవ్వవలెను. చతుష్పదమునందలి మిత్రునకు గుణయుక్త మగు పాయసము సమర్పింపవలెను.
వాయవ్య కోణమున అర్ధకోష్ఠముపై నున్న రుద్రునకు పక్వమాంసమును ఇవ్వవలెను. దాని క్రింద అర్ధకోష్ఠమునం దున్న యక్షునకు (రుద్రదాసునకు) (ద్రాక్షమొదలగు) ఆర్ద్రఫలము లివ్వవలెను. చతుష్పదమునందున్న పర్వతమునకు మాంసాన్నమును, మాషమును బలి ఇవ్వవలెను. మధ్యలో నున్న నాలుగు కోష్ఠములందును బ్రహ్మకొరకై తిలతండులము లుంచవలెను.
చరకిని మాంసఘృతములచేతను, కుమారస్వామిని పులగముచేతను, రక్తముచేతను, విదారిని రక్తకమలముచేతను, కందుర్పుని ఒక ఫలము అన్నముచేతను, పూతనను ఫలపిత్తములచేతను, జంభకుని మాంసరక్తములచేతను, పాపరక్షసుని పిత్త-రక్త-అస్థులచేతను, పలిపిత్సుని మాలికలచేతను, రక్తముచేతను తృప్తిపరుపవలెను.
పిదప ఈశానాది దిక్పాలకులకు రక్తమాసంమును, సమర్పింపవలెను. ఆయా వస్తువులు లభింపనపుడు ఆక్షతలు సమర్పింపవలెను. రాక్షస-మాతృకా. గణ-పిశాచ-పితృ-క్షేత్రపాలాదులకుగూడ ఇచ్ఛానుసారముగా బలిప్రదానము చేయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 129 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 40
🌻 The mode of making the respectful offering to the god - 3 🌻
15. Respectful offering along with turmeric (is made) to Indra in the lower square in the south-west and rice mixed with ghee (is offered) in the corner square below Indrajaya.
16. Sweet gruel (mixed) with jaggery (is offered) to Indra in four squares and cooked meat (is offered) to Rudra in the corner square in the north-west.
17. In the corner square below that wet fruit (is offered) to Yakṣa, rice meat and black-gram (are offered) to Mahidhara in four squares.
18. Rice and sesamum should be placed in the central square for Brahmā. Carakī (is worshipped) with black-gram and clarified butter and Skanda with a dish composed of milk, sesamum and rice and a garland.
19. Vidārī (a demoness) (is worshipped) with red lotuses, Kandarpa (god of love) with cooked rice and meat, Pūtanā (a demoness) with meat and bile and Jambaka (a demon) with meat and blood.
20. The Iśa (is appeased) with bile, blood and bones, Pilipiñja (a demon) with a garland and blood. Other deities are worshipped with blood and meat and in their absence with unbroken rice.
21. Sacrificial offerings are made to demons, divine mothers, manes and guardian deities of the ground in due order.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment