నవగ్రహ ధ్యాన శ్లోకమలు, బీజాక్షర మంత్రములు జప సంఖ్యతో సహా Navagraha meditation hymns, Bijakshara mantras including japa number

 నవగ్రహ ధ్యాన శ్లోకమలు, బీజాక్షర మంత్రములు జప సంఖ్యతో సహా


Navagraha meditation hymns, Bijakshara mantras including japa number






ఆరోగ్యం కోసం సూర్య మంత్రం Surya Mantra for Health


🌹. ఆరోగ్యం కోసం సూర్య మంత్రం 🌹

నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే!
ఆయురారోగ్య ఐశ్వర్యo దేహి దేహిదేవః జగత్పతే!!


ఓ సూర్యదేవ!జగత్ పరిపాలకా!నీకిదే నా నమస్కారము.నీవు సర్వరోగములను తొలగించువాడవు.శాంతిని వొసంగువాడవు. మాకు ఆయువును,ఆరోగ్యమును, సంపదను అనుగ్రహించుము...🙏🌹


03 Dec 2021

సంధ్యా దీపం జ్యోతి


🙏🪔🙏 సంధ్యా దీపం జ్యోతి 🙏🪔

నమోస్తుతే

శుభం కరోతి కళ్యాణం
ఆరోగ్యం ధన సంపద,

శత్రు బుద్ధి వినాశాయ
దీప జ్యోతిర్ నమోస్తుతే ,


🪔

దీప-జ్యోతి: పరబ్రహ్మ
దీప జ్యోతి జనార్ధనః,


దీపో హారతి మే పాపం
దీప-జ్యోతిర్-నమోస్తుతే ||

🪔


🙏 ఏ దీపజ్యోతి ఐతే శుభం ,

మంచి , ఆరోగ్యం ధనసంపదలు ప్రసాదిస్తుందో, చెడు తలపులను తొలగిస్తుంది, ఆ దీపజ్యితికి ప్రణమిల్లుతున్నాను .🪔


🙏 ఏ దీపజ్యోతి పరబ్రహ్మమో ,
ఏ దీపజ్యోతి జనార్దనుడో,
ఏ దీపజ్యోతి మనని పాపములు చేయకుండా కాపాడుతుందో,
ఆ దీపజ్యోతి ప్రణమిల్లుతున్నాను.🪔


03 Dec 2021



శ్రీ లలితా సహస్ర నామములు - 161 / Sri Lalita Sahasranamavali - Meaning - 161


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 161 / Sri Lalita Sahasranamavali - Meaning - 161 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 161.కార్యకారణ నిర్ముక్తా, కామకేళి తరంగితా ।
కనత్-కనకతాటంకా, లీలావిగ్రహ ధారిణీ ॥ 161 ॥ 🍀

🍀 859. కార్యకారణ నిర్ముక్తా :
కార్యాకరణములు లేని శ్రీ మాత

🍀 860. కామకేళీ తరంగితా :
కోరికల తరంగముల యందు విహరించునది.

🍀 861. కనత్కనక తాటంకా :
మనోహరమగు ధ్వని చేయు బంగారు చెవి కమ్మలు కలది.

🍀 862. లీలావిగ్రహ ధారిణి :
లీలకై అనాయాసముగా అద్భుత రూపములను ధరించునది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 161 🌹

📚. Prasad Bharadwaj

🌻 161. Kartakarananirmukta kamakeli tarangita
Kanatkanakatatanka lilavigrahadharini ॥ 161 ॥ 🌻


🌻 859 ) Karya karana nirmuktha -
She who is beyond the action and the cause

🌻 860 ) Kama keli tharangitha -
She who is the waves of the sea of the play of the God

🌻 861 ) Kanath kanaka thadanga -
She who wears the glittering golden ear studs

🌻 862 ) Leela vigraha dharini -
She who assumes several forms as play


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


03 Dec 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 113


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 113 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. జ్ఞానులు- దైత్యులు - 1 🌻

ఆది నుండియు మానవులలో రెండు తరగతుల వారున్నారు. ప్రకృతి శక్తులను చూచి మోజుపడి వానిని తమ అభిప్రాయముల ప్రకారము వినియోగించుకొనుటకు యత్నించు వారొక జాతి. ఈ ప్రకృతి యందును, తమ యందును గల అంతర్యామి చైతన్యమును నమ్మి దానికి ప్రాధాన్యమిచ్చువారు మరొక జాతి.

అందు మొదటి జాతి వారి దృష్టిలో ప్రకృతిని వశపరచుకొని వినియోగించుకొను స్వార్థ దృష్టి తప్పదు. వారిలో నాస్తికులు, ఆస్తికులు అను రెండు తెగలవారున్నారు. నాస్తికులకు ప్రకృతి శక్తులను వినియోగించుకొను దృష్టియే గాని, వినియోగ పద్ధతిలొ బాధ లేకుండునట్లు తీర్చిదిద్దుకొను నేర్పరితనము ఉండదు. దానితో సాంఘిక దురాచారములను ఎత్తి చూపుటతోనే ఆయుర్దాయము వ్యయమై పోవును.

ఇక మిగిలిన వారు ఆస్తికులు. ఏ దైవము పేరు పెట్టినను వారు తమ వినియోగమునకై దేవుని పేరిట ప్రకృతి శక్తులను కొలుచుచుందురు. ఏ ఇద్దరి దృష్టిలోను వినియోగము ఒక విధముగా ఉండదు‌.

కనుక ఈ తెగకు చెందిన అస్తికులు మతములను, సంప్రదాయములను, ఆరాధన విధానములను ఎవనికి వాడుగా ఏర్పరచుకొని, తాను మిగిలిన వారి కన్నా ఏ విధముగా జ్ఞానవంతుడో, తన ఆదర్శములు మిగిలిన వారి ఆదర్శముల కన్న ఏ విధముగా శ్రేష్ఠములో గుర్తుంచుకొనుటతోనే సరిపోవును. తత్ఫలితములుగా వర్గములు, పట్టుదలలు, కలహములు తప్పవు. ఈ లక్షణములు కలవారిని ప్రాచీనులు దైత్యులని వ్యవహరింతురు.....


✍️ మాస్టర్ ఇ.కె.🌻


03 Dec 2021

వివేక చూడామణి - 161 / Viveka Chudamani - 161



🌹. వివేక చూడామణి - 161 / Viveka Chudamani - 161🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -8 🍀

527. ఏ వ్యక్తి తన యొక్క నిజ స్వభావాన్ని గుర్తిస్తాడో, అట్టి వాడు ఆత్మావగాహనతో బ్రహ్మానంద స్థితిలో ఏవిధమైన బాహ్య వస్తు ప్రభావము లేకుండా, ప్రశాంత స్థితిలో ఏ విధమైన కోరికలు లేని వాడవుతాడు.

528. ఆత్మావగాహి అయిన యోగి ప్రకాశముతో వెలిగిపోతూ ప్రశాంతముగా, స్వేచ్ఛగా కూర్చున్న, నిల్చున్న, ఎచటకు వెళ్ళిన, అచటనే ఉన్న, ఏ స్థితిలో ఉన్న తన యొక్క అనంత బ్రహ్మానంద స్థితిని కోల్పోడు.

529. ఉన్నతాత్మ ఎవరైతే తనను తాను పూర్తిగా తెలుసుకొన్నాడో, అతని మనో స్థితులు ఏవిధమైన అడ్డంకులు లేకుండా సమయము, ప్రదేశము భేదము లేకండా ఉంటుంది. ఉన్నత ఆత్మ, ఎవరైతే బ్రహ్మము యొక్క సత్యాన్ని పూర్తిగా తెలుసుకున్నారో, అట్టి వారి మానసిక స్థితులు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏమాత్రము సమయము, ప్రదేశము, స్థితి, నైతిక బాధ్యతులు, నీతి నియమాలు లేకుండా ధ్యాన స్థితిలో స్థిరముగా కొనసాగుతారు. వారు ఎలాంటి నిబంధనల ద్వారా స్వయం ఆత్మను తెలుసుకొనగలరు?


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 VIVEKA CHUDAMANI - 161 🌹

✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda
📚 Prasad Bharadwaj

🌻 32. I am the one who knows Brahman -8🌻

527. To the man who has realised his own nature, and drinks the undiluted Bliss of the Self, there is nothing more exhilarating than the quietude that comes of a state of desirelessness.

528. The illumined sage, whose only pleasure is in the Self, ever lives at ease, whether going or staying, sitting or lying, or in any other condition.

529. The noble soul who has perfectly realised the Truth, and whose mind-functions meet with no obstruction, no more depends upon conditions of place, time, posture, direction, moral disciplines, objects of meditation and so forth. What regulative conditions can there be in knowing one’s own Self ?


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


03 Dec 2021

శ్రీ శివ మహా పురాణము - 484


🌹 . శ్రీ శివ మహా పురాణము - 484 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 37

🌻. పెళ్ళి హడావుడి - 3 🌻

అదే సమయములో బంధువులకు ఆహ్వానమును పంపి, వారి రాక కొరకు ఉత్సాహముతో ప్రీతితో వేచియుండెను (20). బంధువులు, స్త్రీలు, పిల్లలు, పరిచారకులతో సహా విచ్చేసిరి. ఓ దేవర్షీ! ఇతర పర్వతరాజులు వేంచేసిన తీరును శ్రద్ధతో వినుము (21). శివుని ప్రీతిని పెంపొందించుట కొరకై దేవతలకు నిలయమగు మేరువు దివ్యరూపమును ధరించి విచ్చేసిన తీరును సంగ్రహముగా వర్ణించెదను (22).

అనేక రత్నాభరణములతో ప్రకాశించే బంధువర్గము గలవాడై, విలువైన వస్త్రములను ధరించి, అనేకమణులను సారభూతములగు మహారత్నములను శ్రద్ధతో సంపాదించి వాటిని తీసుకుని (23), ఆ మేరుపర్వతుడు చక్కని వేషముతో అలంకరించుకుని ప్రకాశించువాడై హిమవంతుని రాజధానికి వెళ్లెను. భార్యతో కుమారులతో గూడి మందర పర్వతుడు అనేక శోభలతో నిండినవాడై(24), వివిధములగు బహుమతులను సంగ్రహించుకొని వెళ్ళెను.

దేవతా స్వరూపుడు, విశాల హృదయుడు, వివిధశోభలతో కూడినవాడు అగు అస్తాచలుడు కూడా బహుమానములను తీసుకొని (25) ఆనందముతో విచ్చేసెను. ఉదయాచలుడు గొప్ప రత్నములు, మణులను కూడ తీసుకొని విచ్చేసెను (26).

పెద్ద పరివారము గలవాడు, మహాసుఖము గలవాడు అగు మలయ పర్వతుడు ఆదరముతో విచ్చేసెను (27). గొప్ప విన్యాసము గలవాడు, మహాబలశాలి అగు దర్దురుడు భార్యతో గూడి ఆనందముతో శీఘ్రముగా విచ్చేసెను (28).

ఓ కుమారా! గొప్ప శోభగలవాడు, హర్షముతో నిండిన మనస్సు గలవాడు అగు నిషదుడు కూడా నూతన వస్త్రములను ధరించి హిమవంతుని ఇంటికి వచ్చెను (29).మహాభాగ్యవంతుడగు గంధమాదన పర్వతుడు భార్యలతో, కుమారులతో గూడి ప్రీతితో హిమవంతుని గృహమునకు విచ్చేసెను (30).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


03 Dec 2021

గీతోపనిషత్తు -285


🌹. గీతోపనిషత్తు -285 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 15-2

🍀 15-2. తత్వ మొక్కటే ! - రూప ధ్యానమునకు రూపమున కతీతమైన తత్త్వమును రూపము ద్వారా దర్శించు ప్రయత్నమున ఉన్నాను అను భావన యుండ వలెను. అపుడు రూప మేదైనను, నామ మేదైనను ఆరాధకుని చిత్తము అపరిమితమగు తత్త్వముతో ముడిపడును. పై విధమైన అవగాహనతో ఆరాధన చేసినచో దైవప్రాప్తి సత్యమై నిలచును. అట్లు కానిచో, వివిధ దేవతారాధనలు, గురుమూర్తి ఆరాధనములు వివిధత్వమును, భేదములను సృష్టించును. 🍀

జ్ఞానయజ్జెన చాప్యన్యే యజంతో మాముపాసతే |
ఏకత్వేన పృథక్ష్యేవ బహుధా విశ్వతో ముఖమ్ || 15

తాత్పర్యము : అనన్య భావనతో కొందరు, జ్ఞాన యజ్ఞము ద్వారా కొందరు, బహు విధములుగ కొందరు విశ్వరూపుడనగు నన్ను ఉపాసించుచున్నారు.

వివరణము : రూపమున కతీతమైన తత్త్వమును రూపము ద్వారా దర్శించు ప్రయత్నమున ఉన్నాను అను భావన యుండ వలెను. అపుడు రూప మేదైనను, నామ మేదైనను ఆరాధకుని చిత్తము అపరిమితమగు తత్త్వముతో ముడిపడును. అట్లు కానిచో, వివిధ దేవతారాధనలు, గురుమూర్తి ఆరాధనములు వివిధత్వమును, భేదములను సృష్టించును. అట్లు జరుగకుండుటకే ఈ శ్లోకమున భగవానుడు ఆరాధనలు ఎన్ని విధములుగ నున్నను, ఆరాధింపబడు తత్త్వ మొక్కటే అని తెలిసి ఆరాధించవలెనని తెలుపుచున్నాడు.

ఆరాధనము లనేకములై యుండ వచ్చును. కాని ఆరాధ్యమగు దైవమొక్కటే అని తెలిసినచో, భక్తుల నడుమ స్పర్ధలు, ఘర్షణలు, పోరాటములు, యుద్ధములు, హత్యలు, మరణములు యుండవు. రాముడైన, కృష్ణుడైన, శివుడైన, విష్ణువైన, లక్ష్మీ సరస్వతులైన, దుర్గ అయిన, ఆంజనేయుడు, సుబ్రహ్మణ్యుడు, గణపతి మరియే ఇతర దేవతలైన, గురువులైన పై విధమైన అవగాహనతో ఆరాధన చేసినచో దైవప్రాప్తి సత్యమై నిలచును. ఇట్టి అవగాహన యున్నపుడు పారశీయులైన, జైనులైన, సిక్కులైన, కిరస్తానీయులైన, ముసల్మానులైన భేదము చూపవలసిన అగత్య ముండదు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


03 Dec 2021

3-DECEMBER-2021 FRIDAY MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 03, శుక్రవారం, డిసెంబర్ 2021 సౌమ్య వారము 🌹
🍀. కార్తీక మాసం 29వ రోజు 🍀 
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 285 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 484🌹 
4) 🌹 వివేక చూడామణి - 161 / Viveka Chudamani - 161🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -113🌹  
6) 🌹 Osho Daily Meditations - 102🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 161 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 161🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*భృగు వాసరే, 03, డిసెంబర్‌ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. కార్తీక మాసం 29వ రోజు 🍀*

*నిషిద్ధములు :- పగటి ఆహారం*
*దానములు :- శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారం*
*పూజించాల్సిన దైవము :- శివుడు (మృత్యుంజయుడు)*
*జపించాల్సిన మంత్రము :*
*ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం,*
*ఉర్వారుకమివ బంధనాన్తృత్యో ర్ముక్షీయ మామృతాత్*
*ఫలితము :- అకాలమృత్యుహరణం, ఆయుర్వృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం.*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, శరద్‌ ఋతువు,
కార్తీక మాసం
తిథి: కృష్ణ చతుర్దశి 16:57:06 
వరకు తదుపరి అమావాశ్య
నక్షత్రం: విశాఖ 13:45:40 
వరకు తదుపరి అనూరాధ
యోగం: అతిగంధ్ 12:56:56 
వరకు తదుపరి సుకర్మ
కరణం: విష్టి 06:43:35 వరకు
వర్జ్యం: 17:15:30 - 18:39:42
దుర్ముహూర్తం: 08:44:58 - 09:29:35 
మరియు 12:28:05 - 13:12:42
రాహు కాలం: 10:42:06 - 12:05:46
గుళిక కాలం: 07:54:46 - 09:18:26
యమ గండం: 14:53:06 - 16:16:46
అభిజిత్ ముహూర్తం: 11:43 - 12:27
అమృత కాలం: 05:57:08 - 07:22:12 
మరియు 25:40:42 - 27:04:54
సూర్యోదయం: 06:31:06
సూర్యాస్తమయం: 17:40:27
వైదిక సూర్యోదయం: 06:34:56
వైదిక సూర్యాస్తమయం: 17:36:35
చంద్రోదయం: 05:10:58
చంద్రాస్తమయం: 16:48:27
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: తుల
మతంగ యోగం - అశ్వ లాభం 13:45:40 
వరకు తదుపరి రాక్షస యోగం - మిత్ర కలహం
పండుగలు : లేదు

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -285 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 15-2
 
*🍀 15-2. తత్వ మొక్కటే ! - రూప ధ్యానమునకు రూపమున కతీతమైన తత్త్వమును రూపము ద్వారా దర్శించు ప్రయత్నమున ఉన్నాను అను భావన యుండ వలెను. అపుడు రూప మేదైనను, నామ మేదైనను ఆరాధకుని చిత్తము అపరిమితమగు తత్త్వముతో ముడిపడును. పై విధమైన అవగాహనతో ఆరాధన చేసినచో దైవప్రాప్తి సత్యమై నిలచును. అట్లు కానిచో, వివిధ దేవతారాధనలు, గురుమూర్తి ఆరాధనములు వివిధత్వమును, భేదములను సృష్టించును. 🍀*

*జ్ఞానయజ్జెన చాప్యన్యే యజంతో మాముపాసతే |*
*ఏకత్వేన పృథక్ష్యేవ బహుధా విశ్వతో ముఖమ్ || 15*

*తాత్పర్యము : అనన్య భావనతో కొందరు, జ్ఞాన యజ్ఞము ద్వారా కొందరు, బహు విధములుగ కొందరు విశ్వరూపుడనగు నన్ను ఉపాసించుచున్నారు.*

*వివరణము : రూపమున కతీతమైన తత్త్వమును రూపము ద్వారా దర్శించు ప్రయత్నమున ఉన్నాను అను భావన యుండ వలెను. అపుడు రూప మేదైనను, నామ మేదైనను ఆరాధకుని చిత్తము అపరిమితమగు తత్త్వముతో ముడిపడును. అట్లు కానిచో, వివిధ దేవతారాధనలు, గురుమూర్తి ఆరాధనములు వివిధత్వమును, భేదములను సృష్టించును. అట్లు జరుగకుండుటకే ఈ శ్లోకమున భగవానుడు ఆరాధనలు ఎన్ని విధములుగ నున్నను, ఆరాధింపబడు తత్త్వ మొక్కటే అని తెలిసి ఆరాధించవలెనని తెలుపుచున్నాడు.*

*ఆరాధనము లనేకములై యుండ వచ్చును. కాని ఆరాధ్యమగు దైవమొక్కటే అని తెలిసినచో, భక్తుల నడుమ స్పర్ధలు, ఘర్షణలు, పోరాటములు, యుద్ధములు, హత్యలు, మరణములు యుండవు. రాముడైన, కృష్ణుడైన, శివుడైన, విష్ణువైన, లక్ష్మీ సరస్వతులైన, దుర్గ అయిన, ఆంజనేయుడు, సుబ్రహ్మణ్యుడు, గణపతి మరియే ఇతర దేవతలైన, గురువులైన పై విధమైన అవగాహనతో ఆరాధన చేసినచో దైవప్రాప్తి సత్యమై నిలచును. ఇట్టి అవగాహన యున్నపుడు పారశీయులైన, జైనులైన, సిక్కులైన, కిరస్తానీయులైన, ముసల్మానులైన భేదము చూపవలసిన అగత్య ముండదు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 484 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 37

*🌻. పెళ్ళి హడావుడి - 3 🌻*

అదే సమయములో బంధువులకు ఆహ్వానమును పంపి, వారి రాక కొరకు ఉత్సాహముతో ప్రీతితో వేచియుండెను (20). బంధువులు, స్త్రీలు, పిల్లలు, పరిచారకులతో సహా విచ్చేసిరి. ఓ దేవర్షీ! ఇతర పర్వతరాజులు వేంచేసిన తీరును శ్రద్ధతో వినుము (21). శివుని ప్రీతిని పెంపొందించుట కొరకై దేవతలకు నిలయమగు మేరువు దివ్యరూపమును ధరించి విచ్చేసిన తీరును సంగ్రహముగా వర్ణించెదను (22).

అనేక రత్నాభరణములతో ప్రకాశించే బంధువర్గము గలవాడై, విలువైన వస్త్రములను ధరించి, అనేకమణులను సారభూతములగు మహారత్నములను శ్రద్ధతో సంపాదించి వాటిని తీసుకుని (23), ఆ మేరుపర్వతుడు చక్కని వేషముతో అలంకరించుకుని ప్రకాశించువాడై హిమవంతుని రాజధానికి వెళ్లెను. భార్యతో కుమారులతో గూడి మందర పర్వతుడు అనేక శోభలతో నిండినవాడై(24), వివిధములగు బహుమతులను సంగ్రహించుకొని వెళ్ళెను. 

దేవతా స్వరూపుడు, విశాల హృదయుడు, వివిధశోభలతో కూడినవాడు అగు అస్తాచలుడు కూడా బహుమానములను తీసుకొని (25) ఆనందముతో విచ్చేసెను. ఉదయాచలుడు గొప్ప రత్నములు, మణులను కూడ తీసుకొని విచ్చేసెను (26).

పెద్ద పరివారము గలవాడు, మహాసుఖము గలవాడు అగు మలయ పర్వతుడు ఆదరముతో విచ్చేసెను (27). గొప్ప విన్యాసము గలవాడు, మహాబలశాలి అగు దర్దురుడు భార్యతో గూడి ఆనందముతో శీఘ్రముగా విచ్చేసెను (28). 

ఓ కుమారా! గొప్ప శోభగలవాడు, హర్షముతో నిండిన మనస్సు గలవాడు అగు నిషదుడు కూడా నూతన వస్త్రములను ధరించి హిమవంతుని ఇంటికి వచ్చెను (29).మహాభాగ్యవంతుడగు గంధమాదన పర్వతుడు భార్యలతో, కుమారులతో గూడి ప్రీతితో హిమవంతుని గృహమునకు విచ్చేసెను (30).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 161 / Viveka Chudamani - 161🌹*
*✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -8 🍀*

*527. ఏ వ్యక్తి తన యొక్క నిజ స్వభావాన్ని గుర్తిస్తాడో, అట్టి వాడు ఆత్మావగాహనతో బ్రహ్మానంద స్థితిలో ఏవిధమైన బాహ్య వస్తు ప్రభావము లేకుండా, ప్రశాంత స్థితిలో ఏ విధమైన కోరికలు లేని వాడవుతాడు.*

*528. ఆత్మావగాహి అయిన యోగి ప్రకాశముతో వెలిగిపోతూ ప్రశాంతముగా, స్వేచ్ఛగా కూర్చున్న, నిల్చున్న, ఎచటకు వెళ్ళిన, అచటనే ఉన్న, ఏ స్థితిలో ఉన్న తన యొక్క అనంత బ్రహ్మానంద స్థితిని కోల్పోడు.*

*529. ఉన్నతాత్మ ఎవరైతే తనను తాను పూర్తిగా తెలుసుకొన్నాడో, అతని మనో స్థితులు ఏవిధమైన అడ్డంకులు లేకుండా సమయము, ప్రదేశము భేదము లేకండా ఉంటుంది. ఉన్నత ఆత్మ, ఎవరైతే బ్రహ్మము యొక్క సత్యాన్ని పూర్తిగా తెలుసుకున్నారో, అట్టి వారి మానసిక స్థితులు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏమాత్రము సమయము, ప్రదేశము, స్థితి, నైతిక బాధ్యతులు, నీతి నియమాలు లేకుండా ధ్యాన స్థితిలో స్థిరముగా కొనసాగుతారు. వారు ఎలాంటి నిబంధనల ద్వారా స్వయం ఆత్మను తెలుసుకొనగలరు?*

* సశేషం....*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 161 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 32. I am the one who knows Brahman -8🌻*

*527. To the man who has realised his own nature, and drinks the undiluted Bliss of the Self, there is nothing more exhilarating than the quietude that comes of a state of desirelessness.*

*528. The illumined sage, whose only pleasure is in the Self, ever lives at ease, whether going or staying, sitting or lying, or in any other condition.*

*529. The noble soul who has perfectly realised the Truth, and whose mind-functions meet with no obstruction, no more depends upon conditions of place, time, posture, direction, moral disciplines, objects of meditation and so forth. What regulative conditions can there be in knowing one’s own Self ?*

*Continues....*
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 161 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*

*🌻 32. I am the one who knows Brahman -8🌻*

*527. To the man who has realised his own nature, and drinks the undiluted Bliss of the Self, there is nothing more exhilarating than the quietude that comes of a state of desirelessness.*

*528. The illumined sage, whose only pleasure is in the Self, ever lives at ease, whether going or staying, sitting or lying, or in any other condition.*

*529. The noble soul who has perfectly realised the Truth, and whose mind-functions meet with no obstruction, no more depends upon conditions of place, time, posture, direction, moral disciplines, objects of meditation and so forth. What regulative conditions can there be in knowing one’s own Self ?*

*Continues....*
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 113 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. జ్ఞానులు- దైత్యులు - 1 🌻*

*ఆది నుండియు మానవులలో రెండు తరగతుల వారున్నారు. ప్రకృతి శక్తులను చూచి మోజుపడి వానిని తమ అభిప్రాయముల ప్రకారము వినియోగించుకొనుటకు యత్నించు వారొక జాతి. ఈ ప్రకృతి యందును, తమ యందును గల అంతర్యామి చైతన్యమును నమ్మి దానికి ప్రాధాన్యమిచ్చువారు మరొక జాతి.*

*అందు మొదటి జాతి వారి దృష్టిలో ప్రకృతిని వశపరచుకొని వినియోగించుకొను స్వార్థ దృష్టి తప్పదు. వారిలో నాస్తికులు, ఆస్తికులు అను రెండు తెగలవారున్నారు. నాస్తికులకు ప్రకృతి శక్తులను వినియోగించుకొను దృష్టియే గాని, వినియోగ పద్ధతిలొ బాధ లేకుండునట్లు తీర్చిదిద్దుకొను నేర్పరితనము ఉండదు. దానితో సాంఘిక దురాచారములను ఎత్తి చూపుటతోనే ఆయుర్దాయము వ్యయమై పోవును.*

*ఇక మిగిలిన వారు ఆస్తికులు. ఏ దైవము పేరు పెట్టినను వారు తమ వినియోగమునకై దేవుని పేరిట ప్రకృతి శక్తులను కొలుచుచుందురు. ఏ ఇద్దరి దృష్టిలోను వినియోగము ఒక విధముగా ఉండదు‌.*

*కనుక ఈ తెగకు చెందిన అస్తికులు మతములను, సంప్రదాయములను, ఆరాధన విధానములను ఎవనికి వాడుగా ఏర్పరచుకొని, తాను మిగిలిన వారి కన్నా ఏ విధముగా జ్ఞానవంతుడో, తన ఆదర్శములు మిగిలిన వారి ఆదర్శముల కన్న ఏ విధముగా శ్రేష్ఠములో గుర్తుంచుకొనుటతోనే సరిపోవును. తత్ఫలితములుగా వర్గములు, పట్టుదలలు, కలహములు తప్పవు. ఈ లక్షణములు కలవారిని ప్రాచీనులు దైత్యులని వ్యవహరింతురు.....*

✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 102 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 102. REMAIN UNEXPLAINED 🍀*

*🕉 Everything in life need not be explained. We have no responsibility to explain anything to anybody. 🕉*
 
*All that is deep is always unexplained. That which you can explain will be very superficial. There are things that you cannot explain. If you fall in love with a person, how can you explain how you have fallen in love? Whatever you answer will sound stupid because of his nose, because of her face, because of his voice.*

*All those things will not seem worth mentioning, but there is something there in the person. Those things may be part of why you love the person, but that "something" is bigger than everything. That something is more than the total.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 161 / Sri Lalita Sahasranamavali - Meaning - 161 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 161.కార్యకారణ నిర్ముక్తా, కామకేళి తరంగితా ।*
*కనత్-కనకతాటంకా, లీలావిగ్రహ ధారిణీ ॥ 161 ॥ 🍀*

🍀 859. కార్యకారణ నిర్ముక్తా :
 కార్యాకరణములు లేని శ్రీ మాత

🍀 860. కామకేళీ తరంగితా : 
కోరికల తరంగముల యందు విహరించునది.

🍀 861. కనత్కనక తాటంకా : 
మనోహరమగు ధ్వని చేయు బంగారు చెవి కమ్మలు కలది.

🍀 862. లీలావిగ్రహ ధారిణి : 
లీలకై అనాయాసముగా అద్భుత రూపములను ధరించునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 161 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 161. Kartakarananirmukta kamakeli tarangita*
*Kanatkanakatatanka lilavigrahadharini ॥ 161 ॥ 🌻*

🌻 859 ) Karya karana nirmuktha -   
She who is beyond the action and the cause

🌻 860 ) Kama keli tharangitha -   
She who is the waves of the sea of the play of the God

🌻 861 ) Kanath kanaka thadanga -  
 She who wears the glittering golden ear studs

🌻 862 ) Leela vigraha dharini -   
She who assumes several forms as play

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామములు #LalithaSahasranam
 #PrasadBhardwaj 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://mymandir.page.link/wdh7G
https://t.me/ChaitanyaVijnanam 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹