శ్రీ లలితా సహస్ర నామములు - 10 / Sri Lalita Sahasranamavali - Meaning - 10

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 10 / Sri Lalita Sahasranamavali - Meaning - 10 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 10. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా |
కర్పూరవీటి కామోద సమాకర్షద్దిగంతరా ‖ 10 ‖ 🍀

25) శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్జ్వలా -

శుద్ధమైన విద్య అనగా బ్రహ్మ విద్య లేదా శ్రీవిద్యకు బీజప్రాయము వలె ఆకారము గల రెండు జన్మలు కలిగిన లేదా పండ్ల యొక్క రెండు వరుసలచే ప్రకాశించునది.

26) కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా -

కర్పూరపు తాంబూలము యొక్క సువాసన లేదా పరిమళమును చక్కగా గ్రహించుచున్న దిగంతముల వరకు ఆవరణములు గలది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 10 🌹

📚. Prasad Bharadwaj

🌻 10. śuddha-vidyāṅkurākāra-dvijapaṅkti-dvayojjvalā |
karpūra-vīṭikāmoda-samākarṣi-digantarā || 10 || 🌻

25 ) Shuddha vidyangurakara dwija pangthi dwayojjala -
She who has teeth which look like germinated true knowledge(Shodasakshari vidya)

26 ) Karpoora Veedi Kamodha Samakarsha digandara -
She who chews betel leaf with the spices which give perfume in all directions

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

22 Jan 2021

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 154

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 154 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని తొమ్మిదవ పాత్ర - జీవన్ముక్తుడు - 1 🌻

606. భగవంతునిలో ప్రవేశించి, భగవంతుడైన తరువాత భగవంతుని జీవితములో స్థిరపడుటకు మధ్యలో తురీయ అవస్థ యనెడు దివ్యకూడలి యున్నది.

607. భగవంతుడు 8వ స్థితిలో (పరమత్మలో B స్థితి) సత్యానుభూతిని పొంది, తిరిగి దేహత్రయము ద్వారా మూడు లోకముల చైతన్యమును పొందుటకై 10వ స్థితికి C వచ్చుటకు మధ్యలో 9వ స్థితియైన దివ్య కూడలి (తురీయావస్థ) యున్నది.

609. తురీయ అవస్థ యందు కొంతసేపు బ్రహ్మీభూత స్థితి యు, మరికొంత సేపు సలీం స్థితియు నుండును ఇట్టి వానిని సలీక్-మజ్ జూబ్ అనిగాని 'మజ్ జూబ్-సలీక్ అని గాని యందురు. వీరినే జీవన్ముక్తులని, పరమహంసలని కూడా అందురు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

22 Jan 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 215

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 215 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శుకమహర్షి - 3 🌻

15. ఇవి ఈ జీవుడికి ఎప్పుడూ సౌఖ్యాన్నిస్తాయి. కాని ముక్తిని పొందేప్రయత్నం చేయకపోతే అది ఇక ఏ జన్మలోనూ లభించదు. అంటే ఆ తరువాత, కోరుకోవలసిన బాధ్యత ఆ జీవుడి యందుంటుంది.

16. ఇవి కలిగాక – విద్య, వేదాంగములు, సత్యము, ఇవన్నీ ఉన్నతరువాతకూడా తపస్సుచేస్తారు. అహంకారంతో తపస్సుచేస్తారు. దుఃఖంతో తపస్సుచేస్తారు. క్రోధం చేత కూడా తపస్సుచేస్తారు.

17. ఏ కారణచేత తపస్సుచేసినా తమ తేజస్సును ఇనుమడింపచేసుకోవటానికే చేస్తారు. ఇవన్నీచేసాక విద్య సంపాదిస్తారు. వేద వేదాంగములు చదువుకుంటారు. క్రతువులన్నీ చేస్తారు. అంతా బాగానే ఉంది. శౌచముంటుంది. అన్నీ ఉంటాయి. ముక్తికాంక్ష ఉందా, లేదా? అనేది ప్రశ్న.

18. అందుకు బదులుగా సనత్కుమారుడు ఇలా అన్నాడు: “ముక్తియందు కోరిక కలిగినవాడు కామక్రోధాలు జయించాలి. అపరిగ్రహం, సర్వారంభ పరిత్యాగం, అహింస, ఇంద్రియజయం – వీటిని ముక్తినికోరుకుంటూ ఆశ్రయించినప్పుడు ముక్తి కరతలామలక మవుతుంది. సంకల్పవర్జనంచేత ధర్మం, అహింసవలన అధర్మం రెండూనశిస్తాయి.

19. అంటే మోక్షం పొందటానికి ధర్మాధర్మాలు రెండూ ఉండరాదు. అతడు ముందు సర్వారంభ పరిత్యాగి, సంకల్పరహితుడు కావాలి. ధర్మము అనేది సుఖప్రదమైనది, క్షేమకరమైనది. కాని మోక్షసాధనలో భౌతిక, లౌకికక్షేమంకూడా అతడిని విసర్జిస్తుంది. సత్యాసత్యాలు రెండింటిని విడువవలసి ఉంటుంది. సర్వదేహసంపత్తి, సత్యాసత్యములు ప్రారంభదశలోనే ఉంటాయి. అంతకుముందు పదివేల శోకభయహేతువులు కనబడినప్పటికీకూడా చలించకుండా ఉండాలి.

20. కనుక ప్రపంచంలో తనచుట్టూ ఎన్ని సంఘటనలు జరుగుతున్నా నిస్పృహతో అతడుండి, ముక్తిహేతువును అన్వేషించాలి. అట్లాంటివాళ్ళు ముక్తిని పొందుతారు” అని చెప్పాడు నారదుడు, సనత్కుమారుడి మాటలుగా.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

22 Jan 2021

శ్రీ శివ మహా పురాణము - 330

🌹 . శ్రీ శివ మహా పురాణము - 330 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

83. అధ్యాయము - 38

🌻. క్షువదధీచుల వివాదము - 2 🌻

అపుడు యోగియగు శుక్రుడు వేగముగా వచ్చి, క్షువునిచే చీల్చివేయబడిన దధీచుని దేహమును మరల సంధించెను(19) శివభక్తులలో శ్రేష్ఠుడు, మృత్యుంజయోపాసనను లోకములో ప్రవర్తిల్లజేసినవాడు అగు శుక్రుడు దధీచుని దేహమును పూర్వమునందుండిన తీరున సంధించి ఇట్లు పలికెను(20)

శుక్రుడిట్లు పలికెను

వత్సా! దధీచా! సర్వేశ్వరుడగు శివప్రభుని పూజించి వేదోక్తము, సర్వశ్రేష్టమునగు మహా మృత్యుంజయ మంత్రమును నీకు చెప్పెదను(21). త్య్రంబకం యజామహే ముల్లోకములకు తండ్రి, రక్షకుడు, అగ్ని చంద్ర సూర్య మండలములను సృష్ఠించినవాడు, సత్త్వరజస్తమోగుణములపై పూర్ణి అధిపత్యము గలవాడు(22)

శ్లేష్మవాత పిత్తములనే మూడు శరీరతత్వములను, అహవనీయ గార్హపత్య దక్షిణాగ్నులను మూడు అగ్నులను పాలించువాడు, పృథివి జలము అగ్ని అను మూడు బాహువుల వంటి మూడు మూర్త భూతములతో సర్వమును వ్యాపించి యున్నవాడు స్వర్గాది లోకస్వరూపుడు, సర్వత్ర సుఖదుఃఖమోహాత్మకమగు జగత్తునందు వ్యాపించి యున్నవాడు (23)

త్రిమూర్తి స్వరూరపుడగు శివుని పూజించెదము సుగంధిమ్‌, మహాదేవుడు సర్వభూతములలో సర్వప్రాణములలో, సత్త్వరజస్తమోగుణములలో సర్వకర్మలలో సుగంధము వలె వ్యాపించియున్నాడు(24)

ఆ దేవ దేవుడు పుష్పములలో సుంగంధము వలె ఇంద్రియములో ఇతర దేవతలతో శివగణములలో వ్యాపించియున్నాడు (25) పుష్టి వర్దనమ్‌. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠా! గొప్పవ్రతము గలవాడా!మహత్తు మొదలుకొని పరమాణు గత విశేషము వరకు వివిధ కార్యరూపములలో నున్న ప్రకృతి యొక్క పుష్టి (బలము) పురుషుడగు శివుని నుండి లభించినది(26).

మహర్షీ!విష్ణువునకు, బ్రహ్మకు, మునీశ్వరులకు, ఇంద్రునకు, దేవతలకు పుష్టిని ఇచ్చుటచేతనే శివుడు పుష్ఠి వర్దనుడగుచున్నాడు(27) ఓ ప్రజాపతీ! అమృతస్వరూపుడగు ఆ రుద్రదేవుని వేద విహిత కర్మానుష్టానముచే గాన తపస్సుచేగాని, వేదాధ్యమునుచే గాని, యోగముచే గాని, ధ్యానముచే గాని ఆరాధించవలెను(28)

సత్యముచే గాని,లేదా ఇతర ఆరాధనా పద్ధతో గాని పూజింపబడిన శివ ప్రభుడు, పుచ్చకాయను తీగనుండి వలె, భక్తుని మిక్కిలి భయంకరమగు మృత్యుపాశము లను భంధము నుండి విముక్తిని కలింగించును(29) నా అభిప్రాయములో ఈ మృసంజీవనీ మంత్రము సర్వశ్రేఫ్టమైనది. నీవు ప్రీతితో శివుని స్మరిస్తూ నియమముతో దీనిని జపించుము(30)

జపము అయిన తరువాత హోమమును చేయుము. రాత్రింబగళ్ళు నీరు త్రాగినప్పుడు ఆ నీటిని ఈ మంత్రముతో అభిమంత్రించి త్రాగుము. దీనిని శివసన్నిధిలో ధ్యానము చేయువానికి ఎక్కడైననూ మృత్యుభయము ఉండదు(31) న్యాసాదికమునంతనూ చేసి, భక్తవత్సలుడు మంగళరుడు నగు శివుని యథావిధిగా పూజించి ఈ మంత్రమును జపించి దుఃఖమునుండి విముక్తిని పొందుము(32)

ఈ మంత్రమునకు ధ్యానము చెప్పెదను. ఇట్లు ధ్యానించి మంత్రమును జపించు జ్ఞాని శంభుని అనుగ్రహముచే శీఘ్రముగా మంత్రసిద్ధిని పొందును(33)

పద్మముల వంటి రెండు చేతుల యందున్న రెండు కుంభములతో నీటిని పైకి గ్రహించి శిరస్సు పై అభిషేకించుకొను చున్నట్టియు, రెండు చేతులతో తన తొడపై రెండు కుంభములను ధరించినట్టియు, అక్షమాలను మృగమును చేతియందు కలిగి ఉన్నట్టియు, పద్మమునందాసీనుడై ఉన్నట్టియు, శిరస్సు పై నున్న చంద్రునినుండి జాలువారిన అమృతముతో తడిసిన దేహము కల్గినట్టియు, పార్వతీ దేవితో కూడి ఉన్నట్టియు మూడు కళ్ళు గల మృత్యుంజయుని ధ్యానించెదను(34)

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

22 Jan 2021

గీతోపనిషత్తు -130

🌹. గీతోపనిషత్తు -130 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚

శ్లోకము 15

🍀. 13. తటస్థత - దైవము జీవుల పుణ్యమును గాని, పాపమును గాని స్వీకరింపడు. అతడు జ్ఞానముచే తెలియబడువాడు. అట్టి జ్ఞానమజ్ఞానముచే కప్పబడి యుండుట వలన జీవులు మోహము చెందుచున్నారు. దైవ తత్త్వము తటస్థముగ నుండును. పాపములు చేసిన వారిని దైవము శిక్షించ నవసరము లేదు. వారి పాపములే వారిని శిక్షించును. అట్లే పుణ్యము చేసినవారిని దైవమను గ్రహించుటయు లేదు. వారి పుణ్యములే వారికి సుఖశాంతుల నిచ్చుచున్నవి. భగవదారాధన లన్నియు పవిత్రము చెందుటకు, జ్ఞానము పొందుటకే అని తెలియవలెను. జ్ఞానము పొందుట యనగ ధర్మ స్వరూపము నెరిగి ఆచరించుట. 🍀

15. నాదత్తే కస్యచి త్పాపం నచైవ సుకృతం విభుః |
అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః || 15

దైవము జీవుల పుణ్యమును గాని, పాపమును గాని స్వీకరింపడు. అతడు జ్ఞానముచే తెలియబడువాడు. అట్టి జ్ఞానమజ్ఞానముచే కప్పబడి యుండుట వలన జీవులు మోహము చెందుచున్నారు.

దైవ తత్త్వము తటస్థముగ నుండును. పాపములు చేసిన వారిని దైవము శిక్షించ నవసరము లేదు. వారి పాపములే వారిని శిక్షించును. అట్లే పుణ్యము చేసినవారిని దైవమను గ్రహించుటయు లేదు. వారి పుణ్యములే వారికి సుఖశాంతుల నిచ్చుచున్నవి.

ఒకరియందాగ్రహము, ఒకరియందనుగ్రహము దైవము చూపడు. దైవము కేవలము తెలుసుకొన దగిన వాడే! తెలుసు కొనినవాడు దైవమువలె తటస్థ స్థితి యందుండును.

ఉదాహరణకు ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, పృథ్వి తటస్థమగు స్వభావము గలవారే వానిని వినియోగించుకొను జీవులు సుఖమును, దుఃఖమును కూడ పొందవచ్చును. అట్లే సూర్యకాంతి కూడను. వినియోగ జ్ఞానము గలవారికి సృష్టి సుఖమీయ గలదు.

అట్టి జ్ఞానము లేనివారికి దుఃఖము కలుగవచ్చును. ఇందు భగవత్ ప్రమేయ మేమియు లేదు. 'రామ, రామ, రామ' యనుచు అగ్ని శిఖపై వేలుంచిన కాలక తప్పదు. రాముని స్మరణ వలన జ్ఞానము కలిగినచో అగ్ని శిఖపై వ్రేలుంచరాదని తెలుయుట సరియగు పద్ధతి.

ఏ జీవునికైనను అతడు చేయు కర్మయే అతనికి ఫలముల నిచ్చుచుండును. అందరును బాగుండవలెనని చేయు పనులు సుఖమీయగలవు. ఇతరులకు దుఃఖము కలిగించు పనులు కాలచక్రమున దుఃఖము నీయగలవు. ఇందు భగవంతుని ప్రమేయ మేమియును లేదు.

భగవదారాధనలన్నియు పవిత్రము చెందుటకు, జ్ఞానము పొందుటకే అని తెలియవలెను. జ్ఞానము పొందుట యనగ ధర్మ స్వరూపము నెరిగి ఆచరించుట.

సృష్టి నిర్మాణము చేయునపుడే దైవము సృష్టియందు ధర్మము నేర్పరచెను. ధర్మము నాచరించు వారు రక్షింపబడుట, ఆచరింపనివారు దుఃఖము చెందుట సృష్టి యందు జరుగుచునుండును.

సనక సనందనాదులు, త్రిమూర్తులు, సప్తఋషులు, మనువులు, ప్రజాపతులు, ఆదిత్యులు, రుద్రులు, వసువులు, గ్రహగోళాదులు, పంచభూతములు, మానవులు, జంతువులు, వృక్షములు ఎవరెవరి ధర్మము వారికున్నది.

ధర్మము ఎవరు నిర్వర్తింపకున్నను వారికి కేశము తప్పదు. దైవము ద్వంద్వాతీతమైన సృష్టి కతీతము. సృష్టి యందతడు ధర్మముగనే వసించి యున్నాడు. అందువలన ప్రత్యేకముగ అనుగ్రహించుట, ఆగ్రహించుట యుండక సాక్షీభూతుడై యుండును.

సన్న్యాస మనగ కూడ యిదియే స్థితి. సన్న్యాసి అయిన వానికి యితరుల పాపపుణ్యములతో సంబంధము లేదు. అతడందరి యందును ఒకే విధముగ సముడై ప్రవర్తించును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

22 Jan 2021

22-JANUARY-2021 MESSAGES

12) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 130🌹  
13) 🌹. శివ మహా పురాణము - 330🌹 
14) 🌹 Light On The Path - 83🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 215🌹 
16) 🌹 Seeds Of Consciousness - 279 🌹   
17) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 154🌹
18) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 10 / Lalitha Sahasra Namavali - 10🌹 
19) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 10 / Sri Vishnu Sahasranama - 10🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -130 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚*
శ్లోకము 15

*🍀. 13. తటస్థత - దైవము జీవుల పుణ్యమును గాని, పాపమును గాని స్వీకరింపడు. అతడు జ్ఞానముచే తెలియబడువాడు. అట్టి జ్ఞానమజ్ఞానముచే కప్పబడి యుండుట వలన జీవులు మోహము చెందుచున్నారు. దైవ తత్త్వము తటస్థముగ నుండును. పాపములు చేసిన వారిని దైవము శిక్షించ నవసరము లేదు. వారి పాపములే వారిని శిక్షించును. అట్లే పుణ్యము చేసినవారిని దైవమను గ్రహించుటయు లేదు. వారి పుణ్యములే వారికి సుఖశాంతుల నిచ్చుచున్నవి. భగవదారాధన లన్నియు పవిత్రము చెందుటకు, జ్ఞానము పొందుటకే అని తెలియవలెను. జ్ఞానము పొందుట యనగ ధర్మ స్వరూపము నెరిగి ఆచరించుట. 🍀*

15. నాదత్తే కస్యచి త్పాపం నచైవ సుకృతం విభుః |
అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః || 15

దైవము జీవుల పుణ్యమును గాని, పాపమును గాని స్వీకరింపడు. అతడు జ్ఞానముచే తెలియబడువాడు. అట్టి జ్ఞానమజ్ఞానముచే కప్పబడి యుండుట వలన జీవులు మోహము చెందుచున్నారు. 

దైవ తత్త్వము తటస్థముగ నుండును. పాపములు చేసిన వారిని దైవము శిక్షించ నవసరము లేదు. వారి పాపములే వారిని శిక్షించును. అట్లే పుణ్యము చేసినవారిని దైవమను గ్రహించుటయు లేదు. వారి పుణ్యములే వారికి సుఖశాంతుల నిచ్చుచున్నవి.

ఒకరియందాగ్రహము, ఒకరియందనుగ్రహము దైవము చూపడు. దైవము కేవలము తెలుసుకొన దగిన వాడే! తెలుసు కొనినవాడు దైవమువలె తటస్థ స్థితి యందుండును. 

ఉదాహరణకు ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, పృథ్వి తటస్థమగు స్వభావము గలవారే వానిని వినియోగించుకొను జీవులు సుఖమును, దుఃఖమును కూడ పొందవచ్చును. అట్లే సూర్యకాంతి కూడను. వినియోగ జ్ఞానము గలవారికి సృష్టి సుఖమీయ గలదు. 

అట్టి జ్ఞానము లేనివారికి దుఃఖము కలుగవచ్చును. ఇందు భగవత్ ప్రమేయ మేమియు లేదు. 'రామ, రామ, రామ' యనుచు అగ్ని శిఖపై వేలుంచిన కాలక తప్పదు. రాముని స్మరణ వలన జ్ఞానము కలిగినచో అగ్ని శిఖపై వ్రేలుంచరాదని తెలుయుట సరియగు పద్ధతి. 

ఏ జీవునికైనను అతడు చేయు కర్మయే అతనికి ఫలముల నిచ్చుచుండును. అందరును బాగుండవలెనని చేయు పనులు సుఖమీయగలవు. ఇతరులకు దుఃఖము కలిగించు పనులు కాలచక్రమున దుఃఖము నీయగలవు. ఇందు భగవంతుని ప్రమేయ మేమియును లేదు. 

భగవదారాధనలన్నియు పవిత్రము చెందుటకు, జ్ఞానము పొందుటకే అని తెలియవలెను. జ్ఞానము పొందుట యనగ ధర్మ స్వరూపము నెరిగి ఆచరించుట. 

సృష్టి నిర్మాణము చేయునపుడే దైవము సృష్టియందు ధర్మము నేర్పరచెను. ధర్మము నాచరించు వారు రక్షింపబడుట, ఆచరింపనివారు దుఃఖము చెందుట సృష్టి యందు జరుగుచునుండును. 

సనక సనందనాదులు, త్రిమూర్తులు, సప్తఋషులు, మనువులు, ప్రజాపతులు, ఆదిత్యులు, రుద్రులు, వసువులు, గ్రహగోళాదులు, పంచభూతములు, మానవులు, జంతువులు, వృక్షములు ఎవరెవరి ధర్మము వారికున్నది. 

ధర్మము ఎవరు నిర్వర్తింపకున్నను వారికి కేశము తప్పదు. దైవము ద్వంద్వాతీతమైన సృష్టి కతీతము. సృష్టి యందతడు ధర్మముగనే వసించి యున్నాడు. అందువలన ప్రత్యేకముగ అనుగ్రహించుట, ఆగ్రహించుట యుండక సాక్షీభూతుడై యుండును.

సన్న్యాస మనగ కూడ యిదియే స్థితి. సన్న్యాసి అయిన వానికి యితరుల పాపపుణ్యములతో సంబంధము లేదు. అతడందరి యందును ఒకే విధముగ సముడై ప్రవర్తించును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 330 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
83. అధ్యాయము - 38

*🌻. క్షువదధీచుల వివాదము - 2 🌻*

అపుడు యోగియగు శుక్రుడు వేగముగా వచ్చి, క్షువునిచే చీల్చివేయబడిన దధీచుని దేహమును మరల సంధించెను(19) శివభక్తులలో శ్రేష్ఠుడు, మృత్యుంజయోపాసనను లోకములో ప్రవర్తిల్లజేసినవాడు అగు శుక్రుడు దధీచుని దేహమును పూర్వమునందుండిన తీరున సంధించి ఇట్లు పలికెను(20)

శుక్రుడిట్లు పలికెను

వత్సా! దధీచా! సర్వేశ్వరుడగు శివప్రభుని పూజించి వేదోక్తము, సర్వశ్రేష్టమునగు మహా మృత్యుంజయ మంత్రమును నీకు చెప్పెదను(21). త్య్రంబకం యజామహే ముల్లోకములకు తండ్రి, రక్షకుడు, అగ్ని చంద్ర సూర్య మండలములను సృష్ఠించినవాడు, సత్త్వరజస్తమోగుణములపై పూర్ణి అధిపత్యము గలవాడు(22) 

శ్లేష్మవాత పిత్తములనే మూడు శరీరతత్వములను, అహవనీయ గార్హపత్య దక్షిణాగ్నులను మూడు అగ్నులను పాలించువాడు, పృథివి జలము అగ్ని అను మూడు బాహువుల వంటి మూడు మూర్త భూతములతో సర్వమును వ్యాపించి యున్నవాడు స్వర్గాది లోకస్వరూపుడు, సర్వత్ర సుఖదుఃఖమోహాత్మకమగు జగత్తునందు వ్యాపించి యున్నవాడు (23) 

త్రిమూర్తి స్వరూరపుడగు శివుని పూజించెదము సుగంధిమ్‌, మహాదేవుడు సర్వభూతములలో సర్వప్రాణములలో, సత్త్వరజస్తమోగుణములలో సర్వకర్మలలో సుగంధము వలె వ్యాపించియున్నాడు(24)

ఆ దేవ దేవుడు పుష్పములలో సుంగంధము వలె ఇంద్రియములో ఇతర దేవతలతో శివగణములలో వ్యాపించియున్నాడు (25) పుష్టి వర్దనమ్‌. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠా! గొప్పవ్రతము గలవాడా!మహత్తు మొదలుకొని పరమాణు గత విశేషము వరకు వివిధ కార్యరూపములలో నున్న ప్రకృతి యొక్క పుష్టి (బలము) పురుషుడగు శివుని నుండి లభించినది(26).

మహర్షీ!విష్ణువునకు, బ్రహ్మకు, మునీశ్వరులకు, ఇంద్రునకు, దేవతలకు పుష్టిని ఇచ్చుటచేతనే శివుడు పుష్ఠి వర్దనుడగుచున్నాడు(27) ఓ ప్రజాపతీ! అమృతస్వరూపుడగు ఆ రుద్రదేవుని వేద విహిత కర్మానుష్టానముచే గాన తపస్సుచేగాని, వేదాధ్యమునుచే గాని, యోగముచే గాని, ధ్యానముచే గాని ఆరాధించవలెను(28)

సత్యముచే గాని,లేదా ఇతర ఆరాధనా పద్ధతో గాని పూజింపబడిన శివ ప్రభుడు, పుచ్చకాయను తీగనుండి వలె, భక్తుని మిక్కిలి భయంకరమగు మృత్యుపాశము లను భంధము నుండి విముక్తిని కలింగించును(29) నా అభిప్రాయములో ఈ మృసంజీవనీ మంత్రము సర్వశ్రేఫ్టమైనది. నీవు ప్రీతితో శివుని స్మరిస్తూ నియమముతో దీనిని జపించుము(30) 

జపము అయిన తరువాత హోమమును చేయుము. రాత్రింబగళ్ళు నీరు త్రాగినప్పుడు ఆ నీటిని ఈ మంత్రముతో అభిమంత్రించి త్రాగుము. దీనిని శివసన్నిధిలో ధ్యానము చేయువానికి ఎక్కడైననూ మృత్యుభయము ఉండదు(31) న్యాసాదికమునంతనూ చేసి, భక్తవత్సలుడు మంగళరుడు నగు శివుని యథావిధిగా పూజించి ఈ మంత్రమును జపించి దుఃఖమునుండి విముక్తిని పొందుము(32)

ఈ మంత్రమునకు ధ్యానము చెప్పెదను. ఇట్లు ధ్యానించి మంత్రమును జపించు జ్ఞాని శంభుని అనుగ్రహముచే శీఘ్రముగా మంత్రసిద్ధిని పొందును(33) 

పద్మముల వంటి రెండు చేతుల యందున్న రెండు కుంభములతో నీటిని పైకి గ్రహించి శిరస్సు పై అభిషేకించుకొను చున్నట్టియు, రెండు చేతులతో తన తొడపై రెండు కుంభములను ధరించినట్టియు, అక్షమాలను మృగమును చేతియందు కలిగి ఉన్నట్టియు, పద్మమునందాసీనుడై ఉన్నట్టియు, శిరస్సు పై నున్న చంద్రునినుండి జాలువారిన అమృతముతో తడిసిన దేహము కల్గినట్టియు, పార్వతీ దేవితో కూడి ఉన్నట్టియు మూడు కళ్ళు గల మృత్యుంజయుని ధ్యానించెదను(34)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 83 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 7 - THE 13th RULE
*🌻 13. Desire power ardently. - 1 🌻*

331. C.W.L. – The comment of the Chohan on this is:

332. And that power which the disciple shall covet is that which shall make him appear as nothing in the eyes of men.

333. The power that makes us appear as nothing in the eyes of men is the power of self-effacement in the work – of doing it without wanting any credit for it. Many people want to be in the forefront. That is often regarded as merely a sort of harmless vanity, but it means that they have not yet forgotten the lower self.

334. The disciple does not seek credit for anything he does; he seeks to get the work done and so long as it is done he cares not at all whether he or somebody else has the credit for having done it. If he has to put himself forward and draw people round him he does so, but not because he wants the credit of it. He knows it is always far better to keep in the background if possible.

335. It is always best not to think of results at all, but to do the best we can and forget ourselves. All occult teaching leads back to that one fundamental fact – forget the lower self and get to work. 

Some people are constantly thinking of their own progress. It is at least better to think of making spiritual progress than to desire worldly wealth, but it is still selfishness, only in a more refined form. My own experience would lead me to say that the very best way to get on is to forget all about one’s own progress and simply devote oneself to the Master’s work.

 If one does that the rest will follow. It is the old truth stated “Seek ye first the kingdom of God, and His righteousness; and all these things shall be added unto you.” That is utterly true; these other things come. When we are not looking for progress we suddenly find that we have really made some, and that also is well. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 215 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శుకమహర్షి - 3 🌻*

15. ఇవి ఈ జీవుడికి ఎప్పుడూ సౌఖ్యాన్నిస్తాయి. కాని ముక్తిని పొందేప్రయత్నం చేయకపోతే అది ఇక ఏ జన్మలోనూ లభించదు. అంటే ఆ తరువాత, కోరుకోవలసిన బాధ్యత ఆ జీవుడి యందుంటుంది. 

16. ఇవి కలిగాక – విద్య, వేదాంగములు, సత్యము, ఇవన్నీ ఉన్నతరువాతకూడా తపస్సుచేస్తారు. అహంకారంతో తపస్సుచేస్తారు. దుఃఖంతో తపస్సుచేస్తారు. క్రోధం చేత కూడా తపస్సుచేస్తారు. 

17. ఏ కారణచేత తపస్సుచేసినా తమ తేజస్సును ఇనుమడింపచేసుకోవటానికే చేస్తారు. ఇవన్నీచేసాక విద్య సంపాదిస్తారు. వేద వేదాంగములు చదువుకుంటారు. క్రతువులన్నీ చేస్తారు. అంతా బాగానే ఉంది. శౌచముంటుంది. అన్నీ ఉంటాయి. ముక్తికాంక్ష ఉందా, లేదా? అనేది ప్రశ్న.

18. అందుకు బదులుగా సనత్కుమారుడు ఇలా అన్నాడు: “ముక్తియందు కోరిక కలిగినవాడు కామక్రోధాలు జయించాలి. అపరిగ్రహం, సర్వారంభ పరిత్యాగం, అహింస, ఇంద్రియజయం – వీటిని ముక్తినికోరుకుంటూ ఆశ్రయించినప్పుడు ముక్తి కరతలామలక మవుతుంది. సంకల్పవర్జనంచేత ధర్మం, అహింసవలన అధర్మం రెండూనశిస్తాయి. 

19. అంటే మోక్షం పొందటానికి ధర్మాధర్మాలు రెండూ ఉండరాదు. అతడు ముందు సర్వారంభ పరిత్యాగి, సంకల్పరహితుడు కావాలి. ధర్మము అనేది సుఖప్రదమైనది, క్షేమకరమైనది. కాని మోక్షసాధనలో భౌతిక, లౌకికక్షేమంకూడా అతడిని విసర్జిస్తుంది. సత్యాసత్యాలు రెండింటిని విడువవలసి ఉంటుంది. సర్వదేహసంపత్తి, సత్యాసత్యములు ప్రారంభదశలోనే ఉంటాయి. అంతకుముందు పదివేల శోకభయహేతువులు కనబడినప్పటికీకూడా చలించకుండా ఉండాలి. 

20. కనుక ప్రపంచంలో తనచుట్టూ ఎన్ని సంఘటనలు జరుగుతున్నా నిస్పృహతో అతడుండి, ముక్తిహేతువును అన్వేషించాలి. అట్లాంటివాళ్ళు ముక్తిని పొందుతారు” అని చెప్పాడు నారదుడు, సనత్కుమారుడి మాటలుగా.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 279 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 128. When you meditate on the knowledge 'I am', which is the beginning of knowledge, how can there be any questions? 🌻*

Do you or do you not always have some question or the other, or some doubt at the back of your mind when you indulge in any activity? Exactly the same happens when you enter the field of spirituality and begin meditation. 

The biggest question which usually lingers in the background is 'Is this all going to work or am I wasting time? But what happens when you meditate on the knowledge 'I am' as prescribed? How can there be any question now? 

If you have correctly understood the 'I am', you will see that it is the very beginning of knowledge, the 'I am' in its utmost purity. As a part of the practice you have to abide in the 'I am' and not move from it. 

If a question arises you can rest assured that you have wavered, or are no longer abiding in the 'I am'. In fact, this is a very useful means of assessing your progress in the 'Sadhana' (practice): the objective is to arrive at a stage when there are no questions arising anymore.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 154 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని తొమ్మిదవ పాత్ర - జీవన్ముక్తుడు - 1 🌻*

606. భగవంతునిలో ప్రవేశించి, భగవంతుడైన తరువాత భగవంతుని జీవితములో స్థిరపడుటకు మధ్యలో తురీయ అవస్థ యనెడు దివ్యకూడలి యున్నది.

607. భగవంతుడు 8వ స్థితిలో (పరమత్మలో B స్థితి) సత్యానుభూతిని పొంది, తిరిగి దేహత్రయము ద్వారా మూడు లోకముల చైతన్యమును పొందుటకై 10వ స్థితికి C వచ్చుటకు మధ్యలో 9వ స్థితియైన దివ్య కూడలి (తురీయావస్థ) యున్నది.

609. తురీయ అవస్థ యందు కొంతసేపు బ్రహ్మీభూత స్థితి యు, మరికొంత సేపు సలీం స్థితియు నుండును ఇట్టి వానిని సలీక్-మజ్ జూబ్ అనిగాని 'మజ్ జూబ్-సలీక్ అని గాని యందురు. వీరినే జీవన్ముక్తులని, పరమహంసలని కూడా అందురు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 10 / Sri Lalita Sahasranamavali - Meaning - 10 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ 

*🍀 10. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా |*
*కర్పూరవీటి కామోద సమాకర్షద్దిగంతరా ‖ 10 ‖ 🍀*

25) శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్జ్వలా - 
శుద్ధమైన విద్య అనగా బ్రహ్మ విద్య లేదా శ్రీవిద్యకు బీజప్రాయము వలె ఆకారము గల రెండు జన్మలు కలిగిన లేదా పండ్ల యొక్క రెండు వరుసలచే ప్రకాశించునది.

26) కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా - 
కర్పూరపు తాంబూలము యొక్క సువాసన లేదా పరిమళమును చక్కగా గ్రహించుచున్న దిగంతముల వరకు ఆవరణములు గలది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 10 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 10. śuddha-vidyāṅkurākāra-dvijapaṅkti-dvayojjvalā |*
*karpūra-vīṭikāmoda-samākarṣi-digantarā || 10 || 🌻*

25 ) Shuddha vidyangurakara dwija pangthi dwayojjala - 
She who has teeth which look like germinated true knowledge(Shodasakshari vidya)

26 ) Karpoora Veedi Kamodha Samakarsha digandara -  
She who chews betel leaf with the spices which give perfume in all directions

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 10 / Sri Vishnu Sahasra Namavali - 10 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*మేషరాశి - కృత్తిక నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం*

*🍀 10. సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః |*
*అహస్సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః ‖ 10 ‖ 🍀*

🍀 85) సురేశ: - 
దేవతలకు ప్రభువైనవాడు.  

🍀 86) శరణ: - 
దు:ఖార్తులను బ్రోచువాడై, వారి ఆర్తిని హరించువాడు.  

🍀 87) శర్మ - 
పరమానంద స్వరూపుడు.  

🍀 88) విశ్వరేతా: - 
సర్వ ప్రపంచమునకు కారణమైన పరంధాముడు.  

🍀 89) ప్రజాభవ: - 
ప్రజోత్పత్తికి కారణభూతుడైన వాడు.  

🍀 90) అహ: - 
పగలువలె ప్రకాశించు వాడు.  

🍀 91) సంవత్సర: -
 కాలస్వరూపుడైనవాడు.  

🍀 92) వ్యాళ: - 
పామువలె పట్టశక్యము గానివాడు.  

🍀 93) ప్రత్యయ: -
 ప్రజ్ఞా స్వరూపుడైనవాడు.  

🍀 94) సర్వదర్శన: - 
సమస్తమును దర్శించగలవాడు.  

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 10 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka For Kruthika 2nd Padam*

*🌻 10. sureśaḥ śaraṇaṁ śarma viśvaretāḥ prajābhavaḥ |*
*ahaḥ saṁvatsarō vyālaḥ pratyayassarvadarśanaḥ || 10 || 🌻*

🌻 85) Suresha – 
The One Who is the Lord of All Gods

🌻 86) Sharanam – 
The Refuge

🌻 87) Sharma – 
The Lord Who is Himself Infinite Bliss

🌻 88) Vishwareta – 
The Lord Who is the Seed of This Universe

🌻 89) Prajhabhava – 
The Lord Who is the Reason for Existence of Human Beings

🌻 90) Aha – 
The Lord Who is as Bright as the Day

🌻 91) Samvatsara – 
The Lord Who is Personification of the Year

🌻 92) Vyala – 
The Lord Who Cannot be Caught Like the Great Serpent

🌻 93) Pratyaya – 
The Lord Who is Personification of Knowledge

🌻 94) Sarvadarshana – 
The Lord Who Sees (Knows) Everything

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹