శ్రీ లలితా సహస్ర నామములు - 9 / Sri Lalita Sahasranamavali - Meaning - 9

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 9 / Sri Lalita Sahasranamavali - Meaning - 9 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 9. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః |
నవవిద్రుమ బింబశ్రీః న్యక్కారి రదనచ్ఛదా ‖ 9 ‖ 🍀

23) పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః - :
పద్మరాగ మణుల అద్దమును పరిహసించు చెక్కిళ్ళ యొక్క ప్రదేశము గలది.

24) నవవిద్రుమ బింబ శ్రీ న్యక్కారి రథనచ్ఛదా - :
కొత్తదైన పగడముల యొక్క దొండపండు యొక్క శోభను తిరస్కరించు పెదవులు గలది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 9 🌹
📚. Prasad Bharadwaj

🌻 9. padmarāga-śilādarśa-paribhāvi-kapolabhūḥ |
navavidruma-bimbaśrī-nyakkāri-radanacchadā || 9 || 🌻

23 ) Padma raga sila darsha paribhavika polabhu -
She who has cheeks which shine more than the mirror made of Padmaraga

24 ) Nava vidhruma bimbha sri nyakkari rathna chhadha -
She whose lips are like beautiful new corals

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

20 Jan 2021

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 153

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 153 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 32 🌻

605. ఆత్మ,స్వీయ చైతన్యమును పొందిన తరువాత మూడే మూడు స్థితులను అనుభవించును.

(a)బ్రహ్మీ భూతుడు:-

జీవుడు ఆత్మచైతన్యుడు కాగానే, సాధారణముగా తనకు నీడగా నున్న దేహత్రయమును విడిచి, శాశ్వతముగా సచ్చిదానంద స్థితిని ఎఱుకతో అనుభవించును. కానీ వాటిని అన్యునికై వినియోగించడు.

(b) ఆత్మ దేహత్రయమును కొంతకాలము పాటు వదలక పోవచ్చును. కాని వాటి యందు స్పృహ యుండదు. దేహములను విడిచిన (a) వానికిని, ఇతనికిని ఏమియు భేదము లేదు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

20 Jan 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 214

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 214 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శుకమహర్షి - 2 🌻

07. సమాహితాత్ముడైన ముని ఇతరులవల్ల తనకు, తనవల్ల ఇతరులకు భయంలేనివాడు. అంటే, ‘ఈ ప్రపంచలో నాకు ఆశ కలుగుతుందేమో!’ అనిగాని, అప్సరసలు, దెవతలవలనగాని జ్ఞానికి భయముండదు. ప్రపంచంలో ధనం, ఇంకా ఏమేమో ఉన్నాయి. అవే కదా ఆపదలకు హేతువులు! వాటివల్ల తనకు ఆపదలు లేవు. అవి లోపలికి ప్రవేశించి లోకులను భ్రష్టులను చెయ్యగలుగుతాయి.

08. కాని జ్ఞాని ఇతరుల వస్తువులను ఆశించడు. “లోభి అయిన ధనవంతుడుంటాడు. వాడికికూడా జ్ఞానివలన ఆపద లేదు. ఎందుకంటే అతడేమీ ఆశించడు. ఈ ప్రకారంగా నిస్పృహుడై ఉండటంచేత అతడు జీవనుముక్తుడై వెలుగొందుతాడు. అకామవృత్తి, తపోరతి – అంటే, కోరికలేకుండా ఉండటము, తపస్సులో ఉండటము – ఈ రెండే అతడు నిరంతరం ఆచరించేవి.

09. అతడి యథార్థస్థితి ఇంటే! అతడు బ్రహ్మజ్ఞాని. బ్రహ్మదృష్టి కలిగి ఉంటాడు. మట్టి అయినా, బంగారమయినా అతడికి ఒకటే. నింద కీర్తి ఈ రెండింటినీ అతడు సమదృష్టితో చూస్తాడు. అతనిలో ఇంద్ర్యములు పూర్తిగా అణగిపోయి ఉంటాయి. ఆ దశలో అతడికి శివజ్ఞానము, శివదర్శనము కలుగుతాయి. ఈ విశేషాలన్నీ నీలో ఉన్నాయి నాయనా!” అన్నాడు జనకుడు.

10. యోగసాంఖ్యాధ్వర్య ప్రజ్ఞా విశేషాలలో దేనివల్ల పరబ్రహ్మము పొందవచ్చు అని అడిగాడు. “ఇంద్రియ నిగ్రహము, కామక్రోధ లోభ మోహాదులను పోగొట్టుకోవటము దృధవిద్య అంటే ఇది సత్యము అనే విషయము ఎప్పుడూ మరువకుండా ఉండటము ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఆ సత్యజ్ఞానము వదలకుండా ఉండటము.

11. భయంకరమైన స్థితిలో సముద్రంలో మునిగిపోతున్నా, బడబాలనంలో చిక్కుకున్నా ఆ సత్యమనే వస్తుజ్ఞానము ఎప్పుడూ లోపల వెలుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడూకూడా ఆరిపోదు. దృఢవిద్య అని దానికి పేరు. ఇలాగే ఉన్నవాడు ఏమార్గంలో ఉన్నా బ్రహ్మపదప్రాప్తి కలుగుతుంది.

12. ఏ మార్గము అంటే యోగం చేత కాని, మౌనం చేత కాని, తపస్సు చేతగాని, ప్రాణోపాసన చేతగాని, సరైనమార్గం ఏమీలేకుంటే అలా పడిఉండటంచేతకూడా – ఏ మార్గంద్వారా అయినా కాలాంతరంలో జ్ఞానం కలుగుతుంది” అని చెప్పాడు.

13. ఒకసారి నారదుని, “ఈ లోకంలో పుట్టినవాడికి హితమైనమార్గం ఉపదేశించమని అడిగాడు శుకుడు”. దానికి బదులుగా నారదుడు, “మునులు పూర్వం సనత్కుమారుణ్ణి ఈ ప్రశ్నేవేశారు. ఆ సనత్కుమారుడు మునులకు చెప్పిన సమాధానమే నేను నీకు చెపుతున్నాను. తపస్సు, సత్యము, విద్య – ఇవన్నీ పరమసుఖాన్నిచ్చేవి.

14. ఈ తపస్సు ఉండి, సత్యవ్రతముండి, విద్యకూడా సంపాదించిన నాడు ముక్తియందు కోరిక పుట్టదు సుమా” అన్నాడు. “ఈ విజ్ఞానం వచ్చిన తరువాత – వేదవేదాంగములు చదవటము, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యటము, సత్యము, శౌచము ఇవన్నీ వచ్చిన తరువాత – ఆ జన్మలో ముక్తి యందు కాంక్ష కలగకపోతే ఏ జన్మయందూ మరి ఎన్నడూ ముక్తియందు కోరికకలుగదు. ముక్తి లభించదు” అన్నాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

20 Jan 2021

శ్రీ శివ మహా పురాణము - 329

🌹 . శ్రీ శివ మహా పురాణము - 329 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

83. అధ్యాయము - 38

🌻. క్షువదధీచుల వివాదము - 1 🌻

సూతుడిట్లు పలికెను

మహాప్రాజ్ఞుడగు బ్రహ్మ యొక్క ఈ మాటలను ద్విజశ్రేష్టుడుగు నారదుడు విస్మితుడై ప్రేమతో నిట్లు ప్రశ్నించెను(1)

నారదుడిట్లు పలికెను

విష్ణువు శివుడు లేని దక్షుని యజ్ఞమునకు దేవతలతో గూడి వెళ్ళి, అచట పరాభవమును పొందెను. దీనికి కారణముమేమియో చెప్పుము (2) సర్వసంహారకారకుడుగు శంభుని పరాక్రముమును విష్ణువు ఎరుంగడా? మూర్ఖునివలె ఆయన శివుని గణములతో యుద్ధము నెట్టు చేసెను?(3) ఇది నాకు గల పెద్ద సందేహము ఓ దయానిధీ! నాసందేహము తొలగించుము. హే ప్రభో! మనస్సునకు ఉత్సాహమును కలిగించే శంభుని చిరితమును చెప్పుము(4)

బ్రహ్మ ఇట్లు పలికెను

ఓ ద్విజశ్రేష్టా! చంద్రశేఖరుని చరితమును ప్రీతితో వినుము. ఈ చరితము అడిగినవారికి, విన్నవారికి, సంశయముల నన్నిటినీ వారించును(5). దధీచ మహర్షి యొక్క శాపముచే పూర్వము జ్ఞాన భ్రష్టుడైన విష్ణువు దేవతలతో గూడి దక్షుని యజ్ఞమునకు వెళ్లెను. విష్ణువు క్షువునకు సహయమును చేయబోయి దధీచుని శాపమును పొందెను(6)

నారదుడిట్లు పలికెను

మహర్షిశ్రేష్ఠుడగు దధీచుడు విష్ణువును శపించుటకు కారణమేమి? ఆ క్షువునకు సహాయమును చేసిన విష్ణువు ఆయనకు కోపము కలిగే పనిని దేనిని చేసెను? (7)

బ్రహ్మ ఇట్లు పలికెను

క్షువుడను మహేతేజస్వియగు రాజు ఒకడు ఉండెడివాడు. ఆయనకు మహాప్రభుడగు దధీచ మహర్షితో మైత్రి కలిగెను(8) దీర్ఘకాల తపస్సు అను విషయములో పూర్వము క్షువ దధీచులిద్దరికీ వాదము చెలరేగెను. గొప్ప అనర్ధమును కలిగించు వా వాదము ముల్లోకములలో ప్రసిద్ది గాంచెను(9) మూడు వర్ణముల కంటె శ్రేష్టుడగు బ్రాహ్మణుడే తపస్సునందే సమర్ధుడనియు, సంశయములేదనియు శివభక్తుడు వేదవేత్తయగు దధీచుడు చెప్పెను(10) దధీచ మహర్షి యొక్క ఆ మాటను విని ధనగర్వముచే మిక్కిలి మోహితుడై యున్న క్షువ మహారాజు ఇట్లు పలికెను.

క్షువుడిట్లు పలికెను

రాజు ఎనమండుగురు లోకపాలకుల దేహమును తాను ధరించును కాన వర్ణాశ్రమములకు రక్షకుడగు రాజే శ్రేష్ఠుడు(12) రాజధర్మములను భోదించు శ్రుతి 'రాజు సర్వదేవతా స్వరూపుడు' అని చెప్పుచున్నది. కాన రాజు దేవతలలో కెల్ల గొప్పవాడు. ఓ మహర్షీ! అట్టి దేవతను నేనే(13). ఓ చవ్యవనసపుత్రా! ఇందువలన రాజు బ్రాహ్మణుని కంటె శ్రేష్ఠుడు. నీవు ఆలోచించుము. ఈ కారణముగా నన్ను అవమానించరాదు. నీవు నన్ను అన్నివిధముగా పూజించవలసియున్నది(14)

బ్రహ్మ ఇట్లు పలికెను

భృగువంశజుడగు దధీచి మహర్షకి ఆ క్షువుని వేదశాస్త్ర విరద్ధమగు ఆ అభిప్రాయమును వినిన పిదప మిక్కిలి కోపము కలిగెను. (15)

ఓ మహర్షీ! మహాతేజస్వియగు దధీచుడు కోపించినవాడై, ఆత్మగౌరవమును రక్షించుట కొరకై శిరస్సుపై ఎడమ ముష్టితో కొట్టెను(16) బ్రహ్మాండమునకు ప్రభువు, దర్బుద్ధియగు క్షువుడు దధీచుడు కొట్టుట వలన మిక్కిలి కోపించి, అతనిని వజ్రముతో చీల్చివేసి గర్జించెను(17). భృగువంశమును నిలబెట్టే ఆ దధీచుడు వజ్రముతో క్షువునిచే కొట్టబడిన వాడై నేలమీద బడి శుక్రాచార్యుని స్మరించెను(18)

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

20 Jan 2021

గీతోపనిషత్తు -129

🌹. గీతోపనిషత్తు -129 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚

శ్లోకము 14

🍀. 12. సన్న్యాసము - భగవంతుడు జీవులకు కర్తృత్వము, కర్మములను సృజింప లేదు. కర్తృత్వము, కర్మము, ఫలములందాసక్తి ఆయన స్వభావము నుండి ఏర్పడుచున్నవి. పరతత్వము కేవలము ఉండుటగ నుండును. పరతత్వము నుండి పుట్టిన కాలము, పరతత్వము నుండి ప్రకృతి శక్తిని గొని త్రిశక్తులుగ మారి కాలక్రమమున జీవుల నుద్భవింపజేయు చున్నది. రజస్తమస్సులను సమన్వయపరచి, సత్వమున సంయమము చెందుట ద్వారా జీవులు కూడ వారి వారి స్వభావములను దాటవచ్చును. అట్లు దాటినవారు తమ స్వభావముకన్న వేరుగ తమ అస్తిత్వమును గుర్తింతురు. వారు స్వభావమునకు లోబడరు. 🍀

14. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః |
న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే || 14

భగవంతుడు జీవులకు కర్తృత్వము, కర్మములను సృజింప లేదు. కర్తృత్వము, కర్మము, ఫలములందాసక్తి ఆయన స్వభావము నుండి ఏర్పడుచున్నవి.

శ్రద్ధగల వారికే ఈ సున్నితము, సూక్ష్మమగు విషయము అవగాహన కాగలదు. పరతత్వము కేవలము ఉండుటగ నుండును. అతని నాధారముగ గొని అనేకానేక విషయములను ప్రకృతి నిర్మించుచున్నది. పరతత్వము నుండి పుట్టిన కాలము, ప్రకృతి సృష్టి సమస్తమును అల్లిక చేయుచు నుండును.

పరతత్వము నుండి ప్రకృతి శక్తిని గొని త్రిశక్తులుగ మారి కాలక్రమమున జీవుల నుద్భవింపజేయు చున్నది. జీవులు ప్రకృతి నుండి పుట్టినవారే అయినప్పటికి వారు వస్తుతహ పరతత్వాంశమే. అందువలన వారికిని ప్రకృతిని దాటు సౌలభ్యమున్నది. వశిష్ఠాది మహర్షులట్టివారు.

ప్రకృతి, త్రిశక్తులే త్రిగుణాత్మకముగ సృష్టిని నిర్మాణము చేయును. సప్తలోకములను త్రిగుణములతో నిర్మించును. అందు జీవులు వసింతురు.

రజస్తమస్సులను సమన్వయపరచి, సత్వమున సంయమము చెందుట ద్వారా జీవులు కూడ వారి వారి స్వభావములను దాటవచ్చును. అట్లు దాటినవారు తమ స్వభావముకన్న వేరుగ తమ అస్తిత్వమును గుర్తింతురు. వారు స్వభావమునకు లోబడరు.

కార్యములు తమ స్వభావము నిర్వర్తించు చుండగ ఉదాసీనులై అవలోకింతురు. ఇట్టి వారినే అవలోకితేశ్వరులు అందురు. వారి నుండి కార్యములు జరుగును. వారికి చేయు చున్నామను భ్రమ యుండదు.

సర్వము ప్రకృతి సంకల్పమే. ప్రకృతి దివ్యత్వమునుండి వెలువడిన సంకల్పమే అని తెలిసియుండును. తమ తమ స్వభావములు ప్రకృతి స్వభావముతో సమన్వయింప బడి కార్యములు జరుగుచుండగ, తాము వీక్షించుచు నుందురు. దైవసృష్టి కవిసృష్టి వంటిది.

కవి నుండి ఎన్నిరకముల పాత్రలు, సన్నివేశములు, వివిధములగు ఘట్టములు వ్యక్తమగు చున్నను, అందు తానొక పాత్రధారిగ నున్నను తన నుండి వెలు వడిన కథ తనను బద్దుని చేయదు.

హాస్య ఘట్టము, శోక ఘట్టము, విజయ ఘట్టము, పరాజయ ఘట్టములు, లాభనష్ట ఘట్ట ములు యిట్లెన్నియో ఘట్టములు కథ నుండి వెలువడు చున్నప్పుడు ఆ ఘట్టములు ప్రభావము కవిపై నుండవు గదా! అట్లే దైవము కూడ. జీవుడు కూడ నట్లే యుండవచ్చునని, అట్టివారే సన్న్యాసులని దైవము తెలుపుచున్నాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

20 Jan 2021

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 185 / Sri Lalitha Chaitanya Vijnanam - 185

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 185 / Sri Lalitha Chaitanya Vijnanam - 185 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 

నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా |
దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా ‖ 50 ‖

🌻 185. 'నీలచికురా' 🌻

నీలమగు శిరోజములు కలది శ్రీమాత అని అర్థము.

శిరోజములు అనగా శిరస్సునుండి మొలుచు వెంట్రుకలు. శ్రీమాత శిరస్సుపై నుండి ఉద్భమించినవి. అవి సహజముగా నీలకాంతి కలిగినవి. నలుపు నీలమగుటచే నల్లగా గోచరించును. కృష్ణ అనగా నలుపు నీలమే.

కృష్ణ అనునది శ్రీలలిత నామములలో నొకటి. నలుపు = నీల కాంతియే ఇతర రంగులన్నిటికీ ఆధారము. తెలుపు వర్ణము కూడ ఆ నీలమునుండియే పుట్టినది. తెలుపు నుండి మరల ఏడు కాంతులు పుట్టును. అజ్ఞానులకు ముదురు నీలము నలుపువలె గోచరించును.

జ్ఞానులకు, నలుపువలె గోచరించున దంతయూ ముదురు నీలముగా గోచరించును. అది యథార్గము. శ్రీకృష్ణుడు అల్లసులకు సలుపుగను, జ్ఞానులకు ముదురు నీలకాంతిగనూ గోచరించును.

ముదురు చీకటి కావల ఉన్నది వెలుగు (తమసః పరస్తాత్). అదియే సమస్తమునకూ ఆధారమైనది. అందుండియే దితి అను నలుపు, అదితి అను తెలుపు, వాని సమ్మిశ్రమములుగ యితరములగు వర్ణములు ఏర్పడును.

ఈ పై తెలిపిన ముదురు నీలకాంతి శ్రీమాత శిరోజములతో పోల్చబడినది. అందుండి అన్ని వర్ణములుగనూ ఆమెయే దిగి వచ్చును.

సూర్యచంద్రాత్మకమగు కాంతి ఆమెనుండి దిగిరాగా అందుండి ఎఱుపు, నీలము, పసుపు కాంతులను అమ్మవారి ముఖములుగ వర్ణించు మరియొక సంప్రదాయ మున్నది. శ్రీమాతను గాయత్రిగా ధ్యానించునపుడు ఈ వర్ణములను పఠింతురు.

ముక్త = చంద్ర కాంతి (ముఖము)

విద్రుమ = ఎఱుపు కాంతి (ముఖము)

హేమ = పసుపు కాంతి (ముఖము)

నీల = ఆకాశ నీల కాంతి (ముఖము)

ధవళ = సూర్యకాంతి (ముఖము)

ఛాయ = ముదురు నీలము - ఆధారమగు కాంతి (Back ground)

శ్రీమాత శిరోజములు సర్వోత్కృష్టములు. అట్లే స్త్రీ శిరోజములు కూడను. వానిని పట్టి పీడించువారికి నాశము తప్పదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 185 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Nīlacikurā नीलचिकुरा (185)🌻

Nīla means indigo colour and cikurā means hair of the head or tuft of hair. She has indigo coloured hair. This meaning seems to be inappropriate here.

A proper interpretation of this nāma seems to be difficult. This nāma becomes out of context, when Vāc Devi-s are narrating the benefits of worshipping Her nirguna Brahman form. At the same time, Vāc Devi-s would not have placed this nāma here without knowing its significance.

Some are of the opinion that Vāc Devi-s while concentrating on the effects of worshipping Her formless form, realised like a flash, the beauty of Her hair and this could be the reason for placing the nāma here. This is also described in Lalitā Triśatī nāma 150 kacajitāmbudā.

The possible interpretation could be: Ājñā cakra is associated with indigo colour (nīla). Nīla-cikura could mean the back head cakra, situated just behind ājñā cakra at the back of the head (just above medulla oblongata) that is fully covered by hair.

Priests have their tuft in the back head cakra. When back head cakra is well developed, one can see anything happening in the world. It also helps in establishing cosmic commune.

This cakra is considered to be highly secretive in nature. Some are of the opinion that tuft is kept here in order to prevent others from noticing this place. The area in which this cakra is located protrudes predominantly, when fully activated.

Cikura also means a mountain, possibly indicating this protrusion. This cakra receives cosmic energy. In other words, by developing nīla-cikura (back head cakra), one can realize Her Self illuminating form, which is indigo in colour.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

20 Jan 2021

మీ నిజ స్వరూపాన్ని తెలుసుకోండి. నిజస్వరూపానికి వదనమే చిహ్నం

🌹. మీ నిజ స్వరూపాన్ని తెలుసుకోండి. నిజస్వరూపానికి వదనమే చిహ్నం 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో ) 🍀

📚. ప్రసాద్‌ భరద్వాజ.

మీకు జరిగిన దానికి మీరే బాధ్యులు కానీ, ఇతరులు కాదు. ఎందుకంటే, మీరు చెయ్యాలనుకున్నదే చేశారు. మీరు ఇష్టపడే మిమ్మల్ని దోచుకునే అవకాశమిచ్చారు. అందుకే ఇతరులు మిమ్మల్ని దోచుకున్నారు.

అలాగే మీరు జైలులో ఉండాలని కోరుకున్నారు. దానికోసమే మీరు పాకులాడారు. అందుకే మిమ్మల్ని జైలులో పెట్టారు. బహుశా, అక్కడే భద్రత ఉంటుందని మీరు అనుకోవచ్చు. మీ పేర్లు, వాటికున్న చీటీలు వేరువేరుగా ఉండవచ్చు. కానీ, వాటి బంధనాలలో ఉండాలనే మీరు కోరుకుంటున్నారు. ఎందుకంటే, ఎవరైనా జైలులోనే ఎలాంటి ప్రమాదం లేకుండా చాలా సురక్షితంగా ఉంటారు.

కానీ, జైలు గోడలతో పోరాడకుండా మీ అంతరంగంలోకి చూడండి. భద్రత కోసం ఆశపడే మిమ్మల్ని గుంపు ఎలా మోసగిస్తుందో చాలా జాగ్రత్తగా గమనించండి. గుర్తింపు, గౌరవం, మర్యాద, కీర్తి, ప్రతిష్ఠలను మీరు గుంపు నుంచి కోరుకుంటారు. అందుకు మీరు మీ స్వేచ్ఛను గుంపుకు చెల్లించక తప్పదు. ఇది మామూలు బేరమే. అన్నీ మీకు మీరే చేసుకుంటారు కానీ, గుంపు మీకు ఎప్పుడూ ఏమీచెయ్యదు. కాబట్టి, ముందు మీరు మీ విధానాల నుంచి బయటపడండి.

🌻. మీ నిజ స్వరూపాన్ని తెలుసుకోండి: 🌻

ప్రపంచం గురించి మీరు ఏమాత్రం పట్టించుకోకుండా మీకు మీరుగా ఉండండి. అప్పుడే మీకు చక్కని విశ్రాంతి, మీ హృదయానికి అద్భుతమైన శాంతి లభిస్తుంది. కాబట్టి, ఎలాంటి ఉద్రిక్తతలు, కపట నటనలు, క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనలు లేకుండా, మీకుమీరుగా, యధాతథంగా ఉండండి. అదే ‘‘మీ నిజ స్వరూపం’’అని ‘‘జెన్’’ వాదులంటారు.

నిజ స్వరూప ముఖవైఖరి ఎప్పుడూ చక్కని కవితాత్మక సౌందర్యం కలిగి ఉంటుందని గుర్తుంచుకోండి. అంటే, మీకేదో ప్రత్యేకమైన ముఖం ఉంటుందని కాదు అర్థం. ఎలాంటి ఉద్రిక్తతలు, కపట నటనలు, క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనలు లేని, ఎలాంటి తీర్పులు చెప్పని, ఇతరులను ఎప్పుడూ తక్కువగా చూడని విలువలతో కూడిన ప్రశాంత వదనమే మీ నిజ స్వరూపం.

‘‘పిరికివాడుగా ఉండేందుకు ఏమాత్రం ధైర్యం లేనివాడే అసలైన వీరుడు’’ అనేది ప్రాచీన సామెత. ఒకవేళ మీరు నిజంగా పిరికివారే అయినా, అందులో తప్పేముంది? అది మంచిదే.

సమాజానికి పిరికివాళ్ళు కూడా అవసరమే. వారి నేపథ్యంలోనే వీరులు కనిపిస్తారు. లేకపోతే, వీరులను గుర్తించేదెలా? కాబట్టి, ఏదేమైనా మీరుమీరుగా ఉండండి. ఇంతవరకు ఇలా ఎవరూ చెప్పలేదు. అందరూ అతి చిన్న విషయాలలో కూడా ‘‘మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి’’అన్నవారే.

చిన్నప్పటినుంచి నేను నేనుగానే ఉండేవాడిని. అది ఎవరికీ అంతగా నచ్చేది కాదు. ఒకరోజు మా మాస్టారు ‘‘నేను చెప్పేది వినకుండా ఎప్పుడూ ఆ కిటికీలోంచి అలా చూస్తావేమిటి?’’అని నన్ను అడిగారు.

‘‘అందమైన పక్షులతో కూడిన చెట్లతో నిండిన విశాలమైన ఆకాశం కనిపించే ఇలాంటి అందమైన కిటికీ మా ఇంట్లో లేదు సార్’’అన్నాను. ‘‘చూడు, నువ్వు చక్కగా చదువుకుంటే గొప్ప మేధావి అవుతావు’’అన్నారాయన. ‘‘నాకు అలా అవాలని లేదు సార్, నేను నేనుగా ఉంటే చాలు’’ అన్నాను ఆయనతో. ‘‘అయితే స్కూలుకు ఎందుకు వస్తున్నట్లు?’’ అన్నారాయన చిరాకుపడుతూ. కపట నటన నాకు ఇష్టంలేదు కాబట్టి, నిజమే చెప్తున్నా.

స్కూలుకు ఫీజు కడుతున్నందుకు, మీ పాఠాలు వింటున్నట్లు నటిస్తూ ఈ కిటికీలోంచి చూసేందుకే రోజూ నేను స్కూ లుకు వస్తున్నా’’ అన్నాను ఆయనతో. ఆ రోజుల్లో నేను చదువుకునే కాలేజీలో అందరూ టోపీ ధరించాలనే నిబంధన ఉండేది. దానికి నేను వ్యతిరేకిని కాదు.

🌹 🌹 🌹 🌹 🌹

20 Jan 21

దేవాపి మహర్షి బోధనలు - 8

🌹. దేవాపి మహర్షి బోధనలు - 8 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 3. గుప్తవిద్య - ప్రయోజనము - 2 🌻

ఇట్లు శాశ్వత జ్ఞానమునకు గల ఏడు గ్రంథులలో జ్యోతిశ్చక్ర విద్య, రేఖా విద్యయు ఒకటి. దీని రహస్య గ్రంథము ప్రాచీనమున ఒక మూలభాషలో నుండెడిది. అది కేవలము ఉపదేశ గమ్యమైన భాష, అనగా, గురువు కొన్ని అక్షరము లుపదేశించి కొన్ని ఆకారములు చెప్పినచో శిష్యునకు సర్వజ్ఞత వచ్చును. ఆ గ్రంథములోని విషయములు కొంత కొంత భారతీయ భాషల లోనికి, టిబెట్, ఈజిప్టు, గ్రీకు భాషలలోకి అనువదింపబడినవి. కాలక్రమమున ఇతర భాషల లోకి అనువాదమగుసరికి మూలభావము నశించినది.

వేదము, బైబిలు మొదలగు మూలగ్రంథము లందు ఈ విషయములు గోచరము కాగలవు. “ఖీరో" (Cheiro) అను ద్రష్ట విషయమున బైబిలు అనువాదకులు దురభిప్రాయబడిరి. ఏడవ అధ్యాయము, Book of John ఏడవ పద్యమున ఈ విధముగ నున్నది. “దైవము” మానవుని అరచేతుల యందు, వ్రేళ్ళయందు కొన్ని సంకేతములను గుర్తులను ఏర్పరచెను. కారణమేమన, ఆ గుర్తులను సంకేతములను అవగాహన చేసుకొని మానవుడు తన జీవన ప్రయోజనము తెలుసుకొన గలుగును.

ఈ విషయము దురవగాహన చేసుకొనుటచే అనువాదము పొరపాటుగ జరిగినది.” భారతీయ సంప్రదాయమున ఈ జ్యోతిశ్చక్రమును భగవంతుని కాలస్వరూపముగ ఆరాధించుట జరుగుచున్నది. శాస్త్రపరమైన సుదర్శనము మరుగున పడినది. సుదర్శన చక్రము విషయమున దర్శనజ్ఞానము వలసినవారు పై చెప్పబడిన సంకేతమును గురు శ్లోకము నాధారముగ చేసికొని ధ్యానము చేసినచో వారియందీ శాస్త్రము మరల ఉద్భవింపగలదు.

గురు శ్లోకము :

గురుర్బహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః !
గురుస్సాక్షాత్పర బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

20 Jan 2021

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 168

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 168 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము - 98 🌻

భగవాన్‌ రమణులు ఏమీ చేయలేదు కదండీ! అనేటటువంటి వాక్యాన్ని తరచుగా వింటూ ఉంటాము. కానీ, వారికున్నటువంటి సహజనిర్వికల్ప సమాధినిష్ఠ మరి అందరికీ లేదు కదండీ! వారి స్థితిననుసరించి, వారి వ్యవహారం ఉంటుంది.

జీవన్ముక్తులు ఇలాగే ఉండాలి అనే నియమం లేదు. జగత్‌ వ్యవహార శైలిని బట్టి వారుండరు. వారు ఉండవలసిన రీతిగా వారుంటారు. ఎట్లా ఉంటే, లోక కళ్యాణం సాధ్యమౌతుందో, అట్లా ఆ అవతారుడు, అట్లా ఆ జీవన్ముక్తుడు ఉంటాడు. ఆ స్థితికి వచ్చేవరకూ సర్వసామాన్య నియమములను సర్వసామాన్య ధర్మములను మొక్షార్దియై ఆచరించవలెను. ఇది చాలా ముఖ్యమైనటువంటిది.

ఎవరి విద్యుక్త ధర్మాన్ని, ఎవరి కర్తవ్యాని వారు సేవకుల వలే, ఈశ్వరుని చేతిలో పనిముట్టుగా, అంతట నిండియున్నటువంటి పురుషుడని గుర్తించడానికి అనువైన సాధనగా - కాలత్రయాబాధితం కానటువంటి పురుషునిగా, కాలాత్రయమునకు నియామకుడైనటువంటి వాడుగా, కాలాతీతమైనటువంటి వాడిగా ఈ మహానుభావుడను ఎవరైతే గుర్తించ గలుగుతున్నారో, ఈ స్థితిని ఎవరైతే గుర్తించ గలుగుతున్నారో, అట్టి స్థితిని ఎవరైతే పొందగలుగుతున్నారో, వారు ఎవరి నుంచీ రక్షణ కోరుతారు ఇప్పుడు? ఎవరిని అడుగుతారు? పాహిమాం అని ఎవరిని అడుగుతావు? సాక్షాత్‌ ఈశ్వరత్వం అంటున్నారు.

ఈశ్వరత్వం స్యాత్‌.... అంటే నీవే ఈశ్వరుడవై యుండగా, ఈశ్వరా పాహిమాం అని ఎవరిని అడుగుతావు. అంటే ఏ సద్గురుమూర్తో, ఏ అవతారుడో, ఎవరైతే నీకు ఆధారభూతంగా ఉన్నాడో, ఆ మహానుభావుడిని నువ్వు వేడుకోవల్సిందే. వారే నీకు ఈశ్వరుడు. వారే నీకు బ్రహ్మము. వారే నీకు పరబ్రహ్మము.

ఆ రకంగా ఈ పురుషోత్తమ ప్రాప్తి స్థితిని పొందినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో, వారే ఈశ్వర స్వరూపులు. వారినే శరణు వేడాలి. వారికే శరణాగతి చేయాలి. వారి ద్వారానే ఈశ్వరుడు లోకకల్యాణార్థం, ధర్మసంస్థాపనార్థం పని చేస్తూ ఉన్నాడు.

కాబట్టి, ఈశ్వరుడు ఆకాశం నుంచీ పిడుగువలె పడుతాడనో, ఆత్మసాక్షాత్కార జ్ఞానం అంటే, ఏదో అమృత వృష్ఠి కురుస్తుందనో, ఏదో ప్రత్యేకమైనటువంటి సందర్భం జరిగితే నాకు ఆరకమైనటువంటి లక్షణం కలుగుతుందనో భావించరాదు.

సర్వవ్యాపకమైనటువంటి, సర్వవిలక్షణమైనటువంటి, సర్వ సాక్షి అయినటువంటి, సర్వమును ప్రకాశింప చేస్తున్నటువంటి, సర్వుల హృద్గుహయందు అంగుష్ఠ మాత్ర పురుషునిగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి, ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో, ఏదైతే జీవాత్మగా, అంతరాత్మగా, పరమాత్మగా పిలువబడుతూ ఉన్నాడో, క్షర, అక్షర పురుషోత్తములుగా పిలువబడుతూ ఉన్నాడో అట్టి దానిని మాత్రమే నీవు ఆత్మ, స ఆత్మ అని తెలుసుకొన వలయును.

ఇట్లా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా తెలుసుకోవాలి అంటే, నీకు అత్యావశ్యకమైనటు వంటిది శుద్ధ బుద్ధి. శుద్ధమైన చిత్తము.

చింత నుండి దూరమైనటువంటి చిత్తము. వాసనల నుంచి దూరమైనటువంటి చిత్తము. వ్యవహారము నందు రమించనటువంటి చిత్తము. వృత్తులందు రమించనటువంటి చిత్తము. మనోనిగ్రహోపాయము. మనోజయము. వీటిని సాధించడం సాధకులందరికి అత్యావశ్యకమై యున్నది అని యమధర్మరాజుగారు నచికేతునికి బోధిస్తూఉన్నారు ఆత్మ తత్వము గురించి

ధ్యానశీలుడైన వ్యక్తి తన హృదయాకాశము నందే పరమాత్మ సాక్షాత్కారమును పొందును. స్వచ్ఛమైన అద్దమునందు ముఖము నిర్మలముగా కనిపించునట్లు శుద్ధాంతఃకరణము నందు పరమాత్మ సాక్షాత్కారము లభించును.)

ఇది చాలా ముఖ్యమైనటువంటి ఉపమానము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

21 Jan 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 240, 241 / Vishnu Sahasranama Contemplation - 240, 241

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 240, 241 / Vishnu Sahasranama Contemplation - 240, 241 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻240. విభుః, विभुः, Vibhuḥ🌻

ఓం విభవే నమః | ॐ विभवे नमः | OM Vibhave namaḥ

విభుః, विभुः, Vibhuḥ

హిరణ్యగర్భాదిరూపేణ వివిధం భవతి హిరణ్యగర్భుడు మొదలగు రూపములతో బహు విధములుగా తానే అగుచున్నాడు.

:: ముణ్డకోపనిషత్ - ప్రథమ ముణ్డకే, పథమః ఖండః ::

యత్తదద్రేశ్య మగ్రాహ్య మగోత్ర మవర్ణ మచక్షుః శ్రోత్రం తదపాణిపాదమ్ ।

నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యన్తి ధీరాః ॥ 6 ॥

ఈ పరబ్రహ్మ తత్త్వము దర్శించుటకుగాని, గ్రహించుటకుగాని వీలుకానిది, సంబంధములేనిది. రంగులు రూపములుగాని, నేత్రములు శ్రోత్రములుగాని, హస్తములు పాదములుగాని లేనిది. నిత్యమైనది. సర్వవ్యాపకమైనది. సర్వగతము, అత్యంత సూక్ష్మము, అవ్యయము, సమస్త భూతములయొక్క ఉత్పత్తి స్థానమై యున్నది. తెలిసిన బ్రహ్మజ్ఞానులు సర్వత్ర ఈ యాత్మనే దర్శించుచుందురు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 240🌹

📚. Prasad Bharadwaj

🌻240. Vibhuḥ🌻

OM Vibhave namaḥ

Hiraṇyagarbhādirūpeṇa vividhaṃ bhavati / हिरण्यगर्भादिरूपेण विविधं भवति He who takes various forms as Hiraṇyagarbha and others.

Muṇḍakopaniṣat - First Muṇḍaka, Canto I

Yattadadreśya magrāhya magotra mavarṇa macakṣuḥ śrotraṃ tadapāṇipādam,
Nityaṃ vibhuṃ sarvagataṃ susūkṣmaṃ tadavyayaṃ yadbhūtayoniṃ paripaśyanti dhīrāḥ. (6)

:: मुण्डकोपनिषत् - प्रथम मुण्डके, पथमः खंडः ::

यत्तदद्रेश्य मग्राह्य मगोत्र मवर्ण मचक्षुः श्रोत्रं तदपाणिपादम् ।
नित्यं विभुं सर्वगतं सुसूक्ष्मं तदव्ययं यद्भूतयोनिं परिपश्यन्ति धीराः ॥ ६ ॥

By the higher knowledge, the wise realize everywhere that which cannot be perceived and grasped, which is without source, features, eyes and ears, which has neither hands nor feet, which is eternal, multi-formed, all-pervasive, extremely subtle and undiminished and which is the source of all.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः ।
सत्कर्तासत्कृतस्साधुर्जह्नुर्नारायणो नरः ॥ २६ ॥

సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తాసత్కృతస్సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ ౨౬ ॥

Suprasādaḥ prasannātmā viśvadhr̥gviśvabhugvibhuḥ ।
Satkartāsatkr̥tassādhurjahnurnārāyaṇo naraḥ ॥ 26 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 241 / Vishnu Sahasranama Contemplation - 241🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻241. సత్కర్తా, सत्कर्ता, Satkartā🌻

ఓం సత్కర్త్రే నమః | ॐ सत्कर्त्रे नमः | OM Satkartre namaḥ

సత్కర్తా, सत्कर्ता, Satkartā

సత్కరోతి పూజయతి విష్ణువే జీవుడుగా, ఉపాసకుడుగా, పెద్దలను దేవతలనూ పూజించును. రామకృష్ణాద్యవతారములందు మునులను, ఋషులను పూజించెను.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వ భాగము ::

క. గురువులకు నెల్ల గురులై, గురులఘుభావములులేక కొమరారు జగ

ద్గురులు త్రిలోకహితార్థము, గురుశిష్యన్యాయలీలఁ గొలిచిరి వేడ్కన్‍.

గురువులకే గురువులు అయినవారూ, ఇతడెక్కువ అతడు తక్కువ అనే బేధభావములు లేక ప్రకాశించు లోకగురువులూ అయిన రామకృష్ణులు సంతోషంతో గురుశిష్యన్యాయంతో ఒజ్జయైన సాందీపనిని సేవించారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 241🌹

📚. Prasad Bharadwaj

🌻241. Satkartā🌻

OM Satkartre namaḥ

Satkaroti pūjayati / सत्करोति पूजयति Lord Viṣṇu, who in the form of a jīva and as a worshiper, pays obeisance to the elderly, gods and seers. In various incarnations like Rāma and Kr̥ṣṇa, he aptly demonstrated such veneration towards the seers, teachers and R̥ṣis.

Śrīmad Bhāgavata- Canto 10, Chapter 45

Yathopasādya tau dāntau gurau vr̥ttimaninditām,
Grāhayantāvupetau sma bhaktyā devamivādr̥tau. (32)

:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे पङ्चचत्वारिंशोऽध्यायः ::

यथोपसाद्य तौ दान्तौ गुरौ वृत्तिमनिन्दिताम् ।
ग्राहयन्तावुपेतौ स्म भक्त्या देवमिवादृतौ ॥ ३२ ॥

Sāndīpani thought very highly of these two self-controlled disciples (Kr̥ṣṇa and Balarāma), whom he had obtained so fortuitously. By serving him (Sāndīpani the teacher) as devotedly as one would serve the Supreme Lord Himself, They (Kr̥ṣṇa and Balarāma) showed others an irreproachable example of how to worship the spiritual master (Sāndīpani the teacher).

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः ।
सत्कर्तासत्कृतस्साधुर्जह्नुर्नारायणो नरः ॥ २६ ॥

సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తాసత్కృతస్సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ ౨౬ ॥

Suprasādaḥ prasannātmā viśvadhr̥gviśvabhugvibhuḥ ।
Satkartāsatkr̥tassādhurjahnurnārāyaṇo naraḥ ॥ 26 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

20 Jan 2021

20-JANUARY-2021 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 615 / Bhagavad-Gita - 615 🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 240, 241 / Vishnu Sahasranama Contemplation - 240, 241🌹
3) 🌹 Daily Wisdom - 34🌹
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 168🌹
5) 🌹 Guru Geeta - Datta Vaakya - 189🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 8🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 107 / Sri Lalitha Sahasra Namaavali - 107 🌹
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 185 / Sri Lalita Chaitanya Vijnanam - 185🌹
9)🌹. మీ నిజ స్వరూపాన్ని తెలుసుకోండి నిజస్వరూపానికి వదనమే చిహ్నం 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో ) 🍀
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 526 / Bhagavad-Gita - 526🌹 
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 5 / Bhagavad-Gita - 5🌹

12) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 129🌹  
13) 🌹. శివ మహా పురాణము - 329 🌹 
14) 🌹 Light On The Path - 82🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 214🌹 
16) 🌹 Seeds Of Consciousness - 278 🌹   
17) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 153🌹
18) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 09 / Lalitha Sahasra Namavali - 09🌹 
19) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 09 / Sri Vishnu Sahasranama - 09🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 615 / Bhagavad-Gita - 615 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 32 🌴*

32. అధర్మం ధర్మమతి యా మన్యతే తమసావృతా |
సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి: సా పార్థ తామసీ ||

🌷. తాత్పర్యం : 
ఓ పార్థా! అజ్ఞానము మరియు భ్రాంతి కారణముగ అధర్మమును ధర్మముగాను మరియు ధర్మమును అధర్మముగాను భావించుచు, ఎల్లప్పుడును తప్పుద్రోవను పోవునట్టి బుద్ధి తామసగుణమును కూడినట్టిది.

🌷. భాష్యము :
తమోమయమైన బుద్ధి సదా వర్తించవలసిన విధమునకు విరుద్ధముగ వర్తించుచుండును. ధర్మము కానటువంటి దానిని ధర్మముగా స్వీకరించు అట్టి బుద్ధి నిజమైన ధర్మమును నిరసించుచుండును. 

అట్టి తామసబుద్ధి కలిగినవారు మహాత్ముడైనవానిని సాధారణ మానవునిగా, సాధారణమానవునిగా మహాత్మునిగా భావింతురు. సత్యమును అసత్యముగా భావించుచు. 

అసత్యమును సత్యముగా వారు స్వీకరింతురు. అన్ని కర్మల యందును వారు కేవలము తప్పుద్రోవనే పట్టి పోవుదురు. కనుకనే వారి బుద్ధి తమోగుణమయమైనట్టిది.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 615 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 32 🌴*

32. adharmaṁ dharmam iti yā
manyate tamasāvṛtā
sarvārthān viparītāṁś ca
buddhiḥ sā pārtha tāmasī

🌷 Translation : 
That understanding which considers irreligion to be religion and religion to be irreligion, under the spell of illusion and darkness, and strives always in the wrong direction, O Pārtha, is in the mode of ignorance.

🌹 Purport :
Intelligence in the mode of ignorance is always working the opposite of the way it should. It accepts religions which are not actually religions and rejects actual religion. Men in ignorance understand a great soul to be a common man and accept a common man as a great soul. 

They think truth to be untruth and accept untruth as truth. In all activities they simply take the wrong path; therefore their intelligence is in the mode of ignorance.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 240, 241 / Vishnu Sahasranama Contemplation - 240, 241 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻240. విభుః, विभुः, Vibhuḥ🌻*

*ఓం విభవే నమః | ॐ विभवे नमः | OM Vibhave namaḥ*

విభుః, विभुः, Vibhuḥ

హిరణ్యగర్భాదిరూపేణ వివిధం భవతి హిరణ్యగర్భుడు మొదలగు రూపములతో బహు విధములుగా తానే అగుచున్నాడు.

:: ముణ్డకోపనిషత్ - ప్రథమ ముణ్డకే, పథమః ఖండః ::
యత్తదద్రేశ్య మగ్రాహ్య మగోత్ర మవర్ణ మచక్షుః శ్రోత్రం తదపాణిపాదమ్ ।
నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యన్తి ధీరాః ॥ 6 ॥

ఈ పరబ్రహ్మ తత్త్వము దర్శించుటకుగాని, గ్రహించుటకుగాని వీలుకానిది, సంబంధములేనిది. రంగులు రూపములుగాని, నేత్రములు శ్రోత్రములుగాని, హస్తములు పాదములుగాని లేనిది. నిత్యమైనది. సర్వవ్యాపకమైనది. సర్వగతము, అత్యంత సూక్ష్మము, అవ్యయము, సమస్త భూతములయొక్క ఉత్పత్తి స్థానమై యున్నది. తెలిసిన బ్రహ్మజ్ఞానులు సర్వత్ర ఈ యాత్మనే దర్శించుచుందురు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 240🌹*
📚. Prasad Bharadwaj 

*🌻240. Vibhuḥ🌻*

*OM Vibhave namaḥ*

Hiraṇyagarbhādirūpeṇa vividhaṃ bhavati / हिरण्यगर्भादिरूपेण विविधं भवति He who takes various forms as Hiraṇyagarbha and others.

Muṇḍakopaniṣat - First Muṇḍaka, Canto I
Yattadadreśya magrāhya magotra mavarṇa macakṣuḥ śrotraṃ tadapāṇipādam,
Nityaṃ vibhuṃ sarvagataṃ susūkṣmaṃ tadavyayaṃ yadbhūtayoniṃ paripaśyanti dhīrāḥ. (6)

:: मुण्डकोपनिषत् - प्रथम मुण्डके, पथमः खंडः ::
यत्तदद्रेश्य मग्राह्य मगोत्र मवर्ण मचक्षुः श्रोत्रं तदपाणिपादम् ।
नित्यं विभुं सर्वगतं सुसूक्ष्मं तदव्ययं यद्भूतयोनिं परिपश्यन्ति धीराः ॥ ६ ॥

By the higher knowledge, the wise realize everywhere that which cannot be perceived and grasped, which is without source, features, eyes and ears, which has neither hands nor feet, which is eternal, multi-formed, all-pervasive, extremely subtle and undiminished and which is the source of all.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः ।
सत्कर्तासत्कृतस्साधुर्जह्नुर्नारायणो नरः ॥ २६ ॥
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తాసత్కృతస్సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ ౨౬ ॥
Suprasādaḥ prasannātmā viśvadhr̥gviśvabhugvibhuḥ ।
Satkartāsatkr̥tassādhurjahnurnārāyaṇo naraḥ ॥ 26 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 241 / Vishnu Sahasranama Contemplation - 241🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻241. సత్కర్తా, सत्कर्ता, Satkartā🌻*

*ఓం సత్కర్త్రే నమః | ॐ सत्कर्त्रे नमः | OM Satkartre namaḥ*

సత్కర్తా, सत्कर्ता, Satkartā

సత్కరోతి పూజయతి విష్ణువే జీవుడుగా, ఉపాసకుడుగా, పెద్దలను దేవతలనూ పూజించును. రామకృష్ణాద్యవతారములందు మునులను, ఋషులను పూజించెను.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వ భాగము ::
క. గురువులకు నెల్ల గురులై, గురులఘుభావములులేక కొమరారు జగ
    ద్గురులు త్రిలోకహితార్థము, గురుశిష్యన్యాయలీలఁ గొలిచిరి వేడ్కన్‍.

గురువులకే గురువులు అయినవారూ, ఇతడెక్కువ అతడు తక్కువ అనే బేధభావములు లేక ప్రకాశించు లోకగురువులూ అయిన రామకృష్ణులు సంతోషంతో గురుశిష్యన్యాయంతో ఒజ్జయైన సాందీపనిని సేవించారు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 241🌹*
📚. Prasad Bharadwaj 

*🌻241. Satkartā🌻*

*OM Satkartre namaḥ*

Satkaroti pūjayati / सत्करोति पूजयति Lord Viṣṇu, who in the form of a jīva and as a worshiper, pays obeisance to the elderly, gods and seers. In various incarnations like Rāma and Kr̥ṣṇa, he aptly demonstrated such veneration towards the seers, teachers and R̥ṣis.

Śrīmad Bhāgavata- Canto 10, Chapter 45
Yathopasādya tau dāntau gurau vr̥ttimaninditām,
Grāhayantāvupetau sma bhaktyā devamivādr̥tau. (32)

:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे पङ्चचत्वारिंशोऽध्यायः ::
यथोपसाद्य तौ दान्तौ गुरौ वृत्तिमनिन्दिताम् ।
ग्राहयन्तावुपेतौ स्म भक्त्या देवमिवादृतौ ॥ ३२ ॥

Sāndīpani thought very highly of these two self-controlled disciples (Kr̥ṣṇa and Balarāma), whom he had obtained so fortuitously. By serving him (Sāndīpani the teacher) as devotedly as one would serve the Supreme Lord Himself, They (Kr̥ṣṇa and Balarāma) showed others an irreproachable example of how to worship the spiritual master (Sāndīpani the teacher).

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः ।
सत्कर्तासत्कृतस्साधुर्जह्नुर्नारायणो नरः ॥ २६ ॥
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తాసత్కృతస్సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ ౨౬ ॥
Suprasādaḥ prasannātmā viśvadhr̥gviśvabhugvibhuḥ ।
Satkartāsatkr̥tassādhurjahnurnārāyaṇo naraḥ ॥ 26 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 34 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 3. Have You Time to Think? 🌻*

There is something which speaks within us in a language of anxiety. Something is not all right, though you have everything in the physical or social sense. You are respectable people in society. You have a financial status of your own; everything is going well but you are not really happy, for a reason which you have not yet found time to go deep into. 

We are so busy with the enormous flood of the atmospheric conditions outside that we have been prevented from even finding time to think, let alone having the capacity to think. Whether we have a capacity to think correctly or not is a different subject, but have you time to think? Everyone is very busy indeed.

Therefore, there is the need to learn the art of finding time to think in the proper way, because your life is nothing but a mental life. If the mental life is ignored, your physical and social life is not going to make you free.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 168 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 98 🌻*

భగవాన్‌ రమణులు ఏమీ చేయలేదు కదండీ! అనేటటువంటి వాక్యాన్ని తరచుగా వింటూ ఉంటాము. కానీ, వారికున్నటువంటి సహజనిర్వికల్ప సమాధినిష్ఠ మరి అందరికీ లేదు కదండీ! వారి స్థితిననుసరించి, వారి వ్యవహారం ఉంటుంది. 

జీవన్ముక్తులు ఇలాగే ఉండాలి అనే నియమం లేదు. జగత్‌ వ్యవహార శైలిని బట్టి వారుండరు. వారు ఉండవలసిన రీతిగా వారుంటారు. ఎట్లా ఉంటే, లోక కళ్యాణం సాధ్యమౌతుందో, అట్లా ఆ అవతారుడు, అట్లా ఆ జీవన్ముక్తుడు ఉంటాడు. ఆ స్థితికి వచ్చేవరకూ సర్వసామాన్య నియమములను సర్వసామాన్య ధర్మములను మొక్షార్దియై ఆచరించవలెను. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. 

ఎవరి విద్యుక్త ధర్మాన్ని, ఎవరి కర్తవ్యాని వారు సేవకుల వలే, ఈశ్వరుని చేతిలో పనిముట్టుగా, అంతట నిండియున్నటువంటి పురుషుడని గుర్తించడానికి అనువైన సాధనగా - కాలత్రయాబాధితం కానటువంటి పురుషునిగా, కాలాత్రయమునకు నియామకుడైనటువంటి వాడుగా, కాలాతీతమైనటువంటి వాడిగా ఈ మహానుభావుడను ఎవరైతే గుర్తించ గలుగుతున్నారో, ఈ స్థితిని ఎవరైతే గుర్తించ గలుగుతున్నారో, అట్టి స్థితిని ఎవరైతే పొందగలుగుతున్నారో, వారు ఎవరి నుంచీ రక్షణ కోరుతారు ఇప్పుడు? ఎవరిని అడుగుతారు? పాహిమాం అని ఎవరిని అడుగుతావు? సాక్షాత్‌ ఈశ్వరత్వం అంటున్నారు.

        ఈశ్వరత్వం స్యాత్‌.... అంటే నీవే ఈశ్వరుడవై యుండగా, ఈశ్వరా పాహిమాం అని ఎవరిని అడుగుతావు. అంటే ఏ సద్గురుమూర్తో, ఏ అవతారుడో, ఎవరైతే నీకు ఆధారభూతంగా ఉన్నాడో, ఆ మహానుభావుడిని నువ్వు వేడుకోవల్సిందే. వారే నీకు ఈశ్వరుడు. వారే నీకు బ్రహ్మము. వారే నీకు పరబ్రహ్మము. 

ఆ రకంగా ఈ పురుషోత్తమ ప్రాప్తి స్థితిని పొందినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో, వారే ఈశ్వర స్వరూపులు. వారినే శరణు వేడాలి. వారికే శరణాగతి చేయాలి. వారి ద్వారానే ఈశ్వరుడు లోకకల్యాణార్థం, ధర్మసంస్థాపనార్థం పని చేస్తూ ఉన్నాడు.

        కాబట్టి, ఈశ్వరుడు ఆకాశం నుంచీ పిడుగువలె పడుతాడనో, ఆత్మసాక్షాత్కార జ్ఞానం అంటే, ఏదో అమృత వృష్ఠి కురుస్తుందనో, ఏదో ప్రత్యేకమైనటువంటి సందర్భం జరిగితే నాకు ఆరకమైనటువంటి లక్షణం కలుగుతుందనో భావించరాదు. 

సర్వవ్యాపకమైనటువంటి, సర్వవిలక్షణమైనటువంటి, సర్వ సాక్షి అయినటువంటి, సర్వమును ప్రకాశింప చేస్తున్నటువంటి, సర్వుల హృద్గుహయందు అంగుష్ఠ మాత్ర పురుషునిగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి, ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో, ఏదైతే జీవాత్మగా, అంతరాత్మగా, పరమాత్మగా పిలువబడుతూ ఉన్నాడో, క్షర, అక్షర పురుషోత్తములుగా పిలువబడుతూ ఉన్నాడో అట్టి దానిని మాత్రమే నీవు ఆత్మ, స ఆత్మ అని తెలుసుకొన వలయును. 

ఇట్లా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా తెలుసుకోవాలి అంటే, నీకు అత్యావశ్యకమైనటు వంటిది శుద్ధ బుద్ధి. శుద్ధమైన చిత్తము.

 చింత నుండి దూరమైనటువంటి చిత్తము. వాసనల నుంచి దూరమైనటువంటి చిత్తము. వ్యవహారము నందు రమించనటువంటి చిత్తము. వృత్తులందు రమించనటువంటి చిత్తము. మనోనిగ్రహోపాయము.  మనోజయము. వీటిని సాధించడం సాధకులందరికి అత్యావశ్యకమై యున్నది అని యమధర్మరాజుగారు నచికేతునికి బోధిస్తూఉన్నారు ఆత్మ తత్వము గురించి

ధ్యానశీలుడైన వ్యక్తి తన హృదయాకాశము నందే పరమాత్మ సాక్షాత్కారమును పొందును. స్వచ్ఛమైన అద్దమునందు ముఖము నిర్మలముగా కనిపించునట్లు శుద్ధాంతఃకరణము నందు పరమాత్మ సాక్షాత్కారము లభించును.)
        ఇది చాలా ముఖ్యమైనటువంటి ఉపమానము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 8 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 3. గుప్తవిద్య - ప్రయోజనము - 2 🌻*

ఇట్లు శాశ్వత జ్ఞానమునకు గల ఏడు గ్రంథులలో జ్యోతిశ్చక్ర విద్య, రేఖా విద్యయు ఒకటి. దీని రహస్య గ్రంథము ప్రాచీనమున ఒక మూలభాషలో నుండెడిది. అది కేవలము ఉపదేశ గమ్యమైన భాష, అనగా, గురువు కొన్ని అక్షరము లుపదేశించి కొన్ని ఆకారములు చెప్పినచో శిష్యునకు సర్వజ్ఞత వచ్చును. ఆ గ్రంథములోని విషయములు కొంత కొంత భారతీయ భాషల లోనికి, టిబెట్, ఈజిప్టు, గ్రీకు భాషలలోకి అనువదింపబడినవి. కాలక్రమమున ఇతర భాషల లోకి అనువాదమగుసరికి మూలభావము నశించినది. 

వేదము, బైబిలు మొదలగు మూలగ్రంథము లందు ఈ విషయములు గోచరము కాగలవు. “ఖీరో" (Cheiro) అను ద్రష్ట విషయమున బైబిలు అనువాదకులు దురభిప్రాయబడిరి. ఏడవ అధ్యాయము, Book of John ఏడవ పద్యమున ఈ విధముగ నున్నది. “దైవము” మానవుని అరచేతుల యందు, వ్రేళ్ళయందు కొన్ని సంకేతములను గుర్తులను ఏర్పరచెను. కారణమేమన, ఆ గుర్తులను సంకేతములను అవగాహన చేసుకొని మానవుడు తన జీవన ప్రయోజనము తెలుసుకొన గలుగును. 

ఈ విషయము దురవగాహన చేసుకొనుటచే అనువాదము పొరపాటుగ జరిగినది.” భారతీయ సంప్రదాయమున ఈ జ్యోతిశ్చక్రమును భగవంతుని కాలస్వరూపముగ ఆరాధించుట జరుగుచున్నది. శాస్త్రపరమైన సుదర్శనము మరుగున పడినది. సుదర్శన చక్రము విషయమున దర్శనజ్ఞానము వలసినవారు పై చెప్పబడిన సంకేతమును గురు శ్లోకము నాధారముగ చేసికొని ధ్యానము చేసినచో వారియందీ శాస్త్రము మరల ఉద్భవింపగలదు. 

గురు శ్లోకము :
గురుర్బహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః !
గురుస్సాక్షాత్పర బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 189 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
181

When we talk about profundity, the ocean first comes to mind. The ocean is also called Ratnakara. He has so much depth, no one knows what’s in his heart, but heholds a lot of precious stones and gems. It is said that the belly of the ocean contains great wealth. Streams, rivers, rivulets etc come running in to the ocean. With a big heart, the ocean invites them into him and gives them refuge. He never refuses anyone. He gives his water to the sun, helps it precipitate as rain and benefits everyone.

Ocean and Lord Rama, both belong to the Iksvaku dynasty. That is why Lord Rama was compared to the ocean as “Samudra iva sindhubihi.” Noble souls would come as rivers
would, to join the ocean of Sri Rama. 

Everyone coming to have darshan of Sri Rama was uniting with the ocean. Sri Rama would treat them with great respect and give them all refuge. Similarly, just as the line “Samudra iva gambhirye” from Ramayana says, Sri Rama had the depth of personality like the ocean. He had a large heart. Due to that, a state of equanimity is attained.

Avadhoota Swamy is explaining this matter to King Yadu in great detail. “Yogi should always be happy. He should be unmoved by dualities like attachment and aversion. He should be (stable) like the full pot of water. One should be like the ocean that does not overflow even when the rivers flow into it. 

That means, he should not be overjoyed when his desires are fulfilled. Just as the ocean does not dry up in summer, a yogi should not be depressed in the face of sorrows. He must focus his mind on God, on Lord Narayana, and have equanimity of mind”. A seeker who learns this from the Lord and puts it into practice will attain Brahman.
Next, let’s move ahead. Moth. Attachment brings downfall, regardless of the stature of the man. 

Attachment is of many kinds, such as attachment towards wealth, towards power etc. The most dangerous of these is attachment to women, in other words, attach. That means one who cannot control his sense organs can never rise in life. He cannot attain victory. He cannot reach his goal. A woman must be respected. One should remember to never offend them. 

One must extend as much help to them as possible. One can achieve the goal together with a woman and share equally in the results. But, if due to lack of control on the sense organs, once is devious or wicked, he will not be able to rule or rise in life even if he is a Sadhaka. He will be completely destroyed. Ravana, who was born in the lineage of the great saint Pulastya fell prey to such attachment. Let us learn about this a little.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మీ నిజ స్వరూపాన్ని తెలుసుకోండి నిజస్వరూపానికి వదనమే చిహ్నం 🌹*
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో ) 🍀*
📚. ప్రసాద్‌ భరద్వాజ. 

మీకు జరిగిన దానికి మీరే బాధ్యులు కానీ, ఇతరులు కాదు. ఎందుకంటే, మీరు చెయ్యాలనుకున్నదే చేశారు. మీరు ఇష్టపడే మిమ్మల్ని దోచుకునే అవకాశమిచ్చారు. అందుకే ఇతరులు మిమ్మల్ని దోచుకున్నారు. 

అలాగే మీరు జైలులో ఉండాలని కోరుకున్నారు. దానికోసమే మీరు పాకులాడారు. అందుకే మిమ్మల్ని జైలులో పెట్టారు. బహుశా, అక్కడే భద్రత ఉంటుందని మీరు అనుకోవచ్చు. మీ పేర్లు, వాటికున్న చీటీలు వేరువేరుగా ఉండవచ్చు. కానీ, వాటి బంధనాలలో ఉండాలనే మీరు కోరుకుంటున్నారు. ఎందుకంటే, ఎవరైనా జైలులోనే ఎలాంటి ప్రమాదం లేకుండా చాలా సురక్షితంగా ఉంటారు. 

కానీ, జైలు గోడలతో పోరాడకుండా మీ అంతరంగంలోకి చూడండి. భద్రత కోసం ఆశపడే మిమ్మల్ని గుంపు ఎలా మోసగిస్తుందో చాలా జాగ్రత్తగా గమనించండి. గుర్తింపు, గౌరవం, మర్యాద, కీర్తి, ప్రతిష్ఠలను మీరు గుంపు నుంచి కోరుకుంటారు. అందుకు మీరు మీ స్వేచ్ఛను గుంపుకు చెల్లించక తప్పదు. ఇది మామూలు బేరమే. అన్నీ మీకు మీరే చేసుకుంటారు కానీ, గుంపు మీకు ఎప్పుడూ ఏమీచెయ్యదు. కాబట్టి, ముందు మీరు మీ విధానాల నుంచి బయటపడండి.

*🌻. మీ నిజ స్వరూపాన్ని తెలుసుకోండి: 🌻*

ప్రపంచం గురించి మీరు ఏమాత్రం పట్టించుకోకుండా మీకు మీరుగా ఉండండి. అప్పుడే మీకు చక్కని విశ్రాంతి, మీ హృదయానికి అద్భుతమైన శాంతి లభిస్తుంది. కాబట్టి, ఎలాంటి ఉద్రిక్తతలు, కపట నటనలు, క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనలు లేకుండా, మీకుమీరుగా, యధాతథంగా ఉండండి. అదే ‘‘మీ నిజ స్వరూపం’’అని ‘‘జెన్’’ వాదులంటారు.

నిజ స్వరూప ముఖవైఖరి ఎప్పుడూ చక్కని కవితాత్మక సౌందర్యం కలిగి ఉంటుందని గుర్తుంచుకోండి. అంటే, మీకేదో ప్రత్యేకమైన ముఖం ఉంటుందని కాదు అర్థం. ఎలాంటి ఉద్రిక్తతలు, కపట నటనలు, క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనలు లేని, ఎలాంటి తీర్పులు చెప్పని, ఇతరులను ఎప్పుడూ తక్కువగా చూడని విలువలతో కూడిన ప్రశాంత వదనమే మీ నిజ స్వరూపం.

‘‘పిరికివాడుగా ఉండేందుకు ఏమాత్రం ధైర్యం లేనివాడే అసలైన వీరుడు’’ అనేది ప్రాచీన సామెత. ఒకవేళ మీరు నిజంగా పిరికివారే అయినా, అందులో తప్పేముంది? అది మంచిదే. 

సమాజానికి పిరికివాళ్ళు కూడా అవసరమే. వారి నేపథ్యంలోనే వీరులు కనిపిస్తారు. లేకపోతే, వీరులను గుర్తించేదెలా? కాబట్టి, ఏదేమైనా మీరుమీరుగా ఉండండి. ఇంతవరకు ఇలా ఎవరూ చెప్పలేదు. అందరూ అతి చిన్న విషయాలలో కూడా ‘‘మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి’’అన్నవారే.

చిన్నప్పటినుంచి నేను నేనుగానే ఉండేవాడిని. అది ఎవరికీ అంతగా నచ్చేది కాదు. ఒకరోజు మా మాస్టారు ‘‘నేను చెప్పేది వినకుండా ఎప్పుడూ ఆ కిటికీలోంచి అలా చూస్తావేమిటి?’’అని నన్ను అడిగారు. 

‘‘అందమైన పక్షులతో కూడిన చెట్లతో నిండిన విశాలమైన ఆకాశం కనిపించే ఇలాంటి అందమైన కిటికీ మా ఇంట్లో లేదు సార్’’అన్నాను. ‘‘చూడు, నువ్వు చక్కగా చదువుకుంటే గొప్ప మేధావి అవుతావు’’అన్నారాయన. ‘‘నాకు అలా అవాలని లేదు సార్, నేను నేనుగా ఉంటే చాలు’’ అన్నాను ఆయనతో. ‘‘అయితే స్కూలుకు ఎందుకు వస్తున్నట్లు?’’ అన్నారాయన చిరాకుపడుతూ. కపట నటన నాకు ఇష్టంలేదు కాబట్టి, నిజమే చెప్తున్నా. 

స్కూలుకు ఫీజు కడుతున్నందుకు, మీ పాఠాలు వింటున్నట్లు నటిస్తూ ఈ కిటికీలోంచి చూసేందుకే రోజూ నేను స్కూ లుకు వస్తున్నా’’ అన్నాను ఆయనతో. ఆ రోజుల్లో నేను చదువుకునే కాలేజీలో అందరూ టోపీ ధరించాలనే నిబంధన ఉండేది. దానికి నేను వ్యతిరేకిని కాదు.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 107 / Sri Lalitha Sahasra Namaavali - 107 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 185 / Sri Lalitha Chaitanya Vijnanam - 185 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా |*
*దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా ‖ 50 ‖*

*🌻 185. 'నీలచికురా' 🌻*

నీలమగు శిరోజములు కలది శ్రీమాత అని అర్థము.

శిరోజములు అనగా శిరస్సునుండి మొలుచు వెంట్రుకలు. శ్రీమాత శిరస్సుపై నుండి ఉద్భమించినవి. అవి సహజముగా నీలకాంతి కలిగినవి. నలుపు నీలమగుటచే నల్లగా గోచరించును. కృష్ణ అనగా నలుపు నీలమే. 

కృష్ణ అనునది శ్రీలలిత నామములలో నొకటి. నలుపు = నీల కాంతియే ఇతర రంగులన్నిటికీ ఆధారము. తెలుపు వర్ణము కూడ ఆ నీలమునుండియే పుట్టినది. తెలుపు నుండి మరల ఏడు కాంతులు పుట్టును. అజ్ఞానులకు ముదురు నీలము నలుపువలె గోచరించును. 

జ్ఞానులకు, నలుపువలె గోచరించున దంతయూ ముదురు నీలముగా గోచరించును. అది యథార్గము. శ్రీకృష్ణుడు అల్లసులకు సలుపుగను, జ్ఞానులకు ముదురు నీలకాంతిగనూ గోచరించును. 

ముదురు చీకటి కావల ఉన్నది వెలుగు (తమసః పరస్తాత్). అదియే సమస్తమునకూ ఆధారమైనది. అందుండియే దితి అను నలుపు, అదితి అను తెలుపు, వాని సమ్మిశ్రమములుగ యితరములగు వర్ణములు ఏర్పడును. 

ఈ పై తెలిపిన ముదురు నీలకాంతి శ్రీమాత శిరోజములతో పోల్చబడినది. అందుండి అన్ని వర్ణములుగనూ ఆమెయే దిగి వచ్చును. 

సూర్యచంద్రాత్మకమగు కాంతి ఆమెనుండి దిగిరాగా అందుండి ఎఱుపు, నీలము, పసుపు కాంతులను అమ్మవారి ముఖములుగ వర్ణించు మరియొక సంప్రదాయ మున్నది. శ్రీమాతను గాయత్రిగా ధ్యానించునపుడు ఈ వర్ణములను పఠింతురు.

ముక్త = చంద్ర కాంతి (ముఖము) 
విద్రుమ = ఎఱుపు కాంతి (ముఖము) 
హేమ = పసుపు కాంతి (ముఖము) 
నీల = ఆకాశ నీల కాంతి (ముఖము) 
ధవళ = సూర్యకాంతి (ముఖము) 
ఛాయ = ముదురు నీలము - ఆధారమగు కాంతి (Back ground) 

శ్రీమాత శిరోజములు సర్వోత్కృష్టములు. అట్లే స్త్రీ శిరోజములు కూడను. వానిని పట్టి పీడించువారికి నాశము తప్పదు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 185 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Nīlacikurā नीलचिकुरा (185)🌻*

Nīla means indigo colour and cikurā means hair of the head or tuft of hair. She has indigo coloured hair. This meaning seems to be inappropriate here. 

 A proper interpretation of this nāma seems to be difficult. This nāma becomes out of context, when Vāc Devi-s are narrating the benefits of worshipping Her nirguna Brahman form. At the same time, Vāc Devi-s would not have placed this nāma here without knowing its significance.  

Some are of the opinion that Vāc Devi-s while concentrating on the effects of worshipping Her formless form, realised like a flash, the beauty of Her hair and this could be the reason for placing the nāma here. This is also described in Lalitā Triśatī nāma 150 kacajitāmbudā.

The possible interpretation could be: Ājñā cakra is associated with indigo colour (nīla). Nīla-cikura could mean the back head cakra, situated just behind ājñā cakra at the back of the head (just above medulla oblongata) that is fully covered by hair.  

Priests have their tuft in the back head cakra. When back head cakra is well developed, one can see anything happening in the world. It also helps in establishing cosmic commune.  

This cakra is considered to be highly secretive in nature. Some are of the opinion that tuft is kept here in order to prevent others from noticing this place. The area in which this cakra is located protrudes predominantly, when fully activated. 

Cikura also means a mountain, possibly indicating this protrusion. This cakra receives cosmic energy. In other words, by developing nīla-cikura (back head cakra), one can realize Her Self illuminating form, which is indigo in colour.  

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 526 / Bhagavad-Gita - 526 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 09 🌴*

09. శ్రోత్రం చక్షు: స్పర్శనం చ రసనం ఘ్రాణేమేవ చ |
అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే ||

🌷. తాత్పర్యం : 
ఈ విధముగా జీవుడు వేరొక స్థూలదేహమును గ్రహించి మనస్సుతో కూడియున్న ఒకానొక రకమైన కర్ణములు, నయనములు, జిహ్వ, నాసిక, స్పర్శను పొందును. ఆ విధముగా అతడు ఒక ప్రత్యేక రకమగు ఇంద్రియార్థములను అనుభవించును.

🌷. భాష్యము :
మరొక రీతిలో చెప్పవలెనన్న జీవుడు తన చైతన్యమును శునక, మార్జాల గుణములతో కలుషిత మొనర్చుకొనినచో తదుపరి జన్మమున అతడు ఎట్టి దేహమును పొందుననిగాని లేదా ఎందులకై ఒక ప్రత్యేక దేహమున అతడు వసించియున్నాడని ఎరుగలేరు. 

అందులకై ఆధ్యాత్మికగురువు నుండి శ్రవణము చేసి అవగతము చేసికొనిన భగవద్గీత మరియు తత్సదృశ వాజ్మయపు విశిష్టజ్ఞానము అత్యంత అవసరము. ఈ విషయములను అవగాహన చేసికొనుతను అభ్యసించువాడు నిక్కముగా భాగ్యవంతుడు. 

జీవుడు వివిధపరిస్థితులలో దేహమును త్యాగము చేయుచుండును. వివిధ పరిస్థితులలో జీవించుచుండును. అదే విధముగా గుణప్రభావమున కొన్ని పరిస్థితుల యందు భోగించుచుండును. అట్టి భోగభ్రాంతి యందే అతడు పలువిధములైన సుఖదుఃఖములను అనుభవించుచుండును.

కామము మరియు కోరికచే శాశ్వతముగా మోసగింపబడినవారు తమ దేహమార్పు విషయమున గాని, ప్రస్తుత దేహమున ఎందులకై వసించియున్నామని గాని అవగాహన చేసికొనగలిగే శక్తి నశించియుందురు. వారి దానిని అర్థము చేసికొనజాలరు. 

కాని ఆధ్యాత్మికజ్ఞానమును అలవరచుకొనినవారు జీవాత్మ దేహముకన్నను అన్యమైనదనియు, అది దేహములను మార్చుచు పలురీతుల భోగించుచున్నదనియు గాంచగలరు. 

అట్టి జ్ఞానము కలవాడు ఎట్లు బద్ధజీవుడు ఈ భౌతికజగమున దుఃఖము ననుభవించునో అవగాహన చేసికొనగలడు. జనసామాన్యపు బద్ధజీవనము మిక్కిలి క్లేశకరమైనందునే కృష్ణభక్తిభావన యందు పురోగతి నొందినవారు తమ శక్తి కొలది ఈ జ్ఞానమును వారికి అందింప యత్నింతురు. 

కావున జనులు బద్ధజీవనము నుండి వెలుపలికి వచ్చి, కృష్ణభక్తిరసభావితులై, ఆధ్యాత్మికలోకమును చేరుటకు తమను తాము ముక్తులను కావించుకొనవలెను.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 526 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 15 - Purushothama Yoga - 09 🌴*

09. śrotraṁ cakṣuḥ sparśanaṁ ca
rasanaṁ ghrāṇam eva ca
adhiṣṭhāya manaś cāyaṁ
viṣayān upasevate

🌷 Translation : 
The living entity, thus taking another gross body, obtains a certain type of ear, eye, tongue, nose and sense of touch, which are grouped about the mind. He thus enjoys a particular set of sense objects.

🌹 Purport :
In other words, if the living entity adulterates his consciousness with the qualities of cats and dogs, in his next life he gets a cat or dog body and enjoys. Consciousness is originally pure, like water. 

But if we mix water with a certain color, it changes. Similarly, consciousness is pure, for the spirit soul is pure. But consciousness is changed according to the association of the material qualities. Real consciousness is Kṛṣṇa consciousness. When, therefore, one is situated in Kṛṣṇa consciousness, he is in his pure life. 

But if his consciousness is adulterated by some type of material mentality, in the next life he gets a corresponding body. He does not necessarily get a human body again; he can get the body of a cat, dog, hog, demigod or one of many other forms, for there are 8,400,000 species.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 5 / Bhagavad-Gita - 5 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 5 🌴*

5. ధృష్టకేతుశ్చేకితాన: కాశీరాజశ్చ వీర్యవాన్ |
పురుజిత్ కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవ: ||

🌷. తాత్పర్యం :
ధృష్ట కేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతీభోజుడు, శైబ్యుడు వంటి శూరులైన మహాయోదులును అందున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 BhagavadGita As it is - 5 🌹*
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 
📚 Prasad Bharadwaj 

*🌴 Chapter 1 - Vishada Yoga - 5 🌴*

5. dhṛṣṭaketuś cekitānaḥ
kāśirājaś ca vīryavān
purujit kuntibhojaś ca
śaibyaś ca nara-puṅgavaḥ

🌷 Translation:
There are also great heroic, powerful fighters like Dhṛṣṭaketu, Cekitāna, Kāśirāja, Purujit, Kuntibhoja and Śaibya.
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -129 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚*
శ్లోకము 14

*🍀. 12. సన్న్యాసము - భగవంతుడు జీవులకు కర్తృత్వము, కర్మములను సృజింప లేదు. కర్తృత్వము, కర్మము, ఫలములందాసక్తి ఆయన స్వభావము నుండి ఏర్పడుచున్నవి. పరతత్వము కేవలము ఉండుటగ నుండును. పరతత్వము నుండి పుట్టిన కాలము, పరతత్వము నుండి ప్రకృతి శక్తిని గొని త్రిశక్తులుగ మారి కాలక్రమమున జీవుల నుద్భవింపజేయు చున్నది. రజస్తమస్సులను సమన్వయపరచి, సత్వమున సంయమము చెందుట ద్వారా జీవులు కూడ వారి వారి స్వభావములను దాటవచ్చును. అట్లు దాటినవారు తమ స్వభావముకన్న వేరుగ తమ అస్తిత్వమును 
గుర్తింతురు. వారు స్వభావమునకు లోబడరు. 🍀*

14. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః |
న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే || 14

భగవంతుడు జీవులకు కర్తృత్వము, కర్మములను సృజింప లేదు. కర్తృత్వము, కర్మము, ఫలములందాసక్తి ఆయన స్వభావము నుండి ఏర్పడుచున్నవి. 

శ్రద్ధగల వారికే ఈ సున్నితము, సూక్ష్మమగు విషయము అవగాహన కాగలదు. పరతత్వము కేవలము ఉండుటగ నుండును. అతని నాధారముగ గొని అనేకానేక విషయములను ప్రకృతి నిర్మించుచున్నది. పరతత్వము నుండి పుట్టిన కాలము, ప్రకృతి సృష్టి సమస్తమును అల్లిక చేయుచు నుండును. 

పరతత్వము నుండి ప్రకృతి శక్తిని గొని త్రిశక్తులుగ మారి కాలక్రమమున జీవుల నుద్భవింపజేయు చున్నది. జీవులు ప్రకృతి నుండి పుట్టినవారే అయినప్పటికి వారు వస్తుతహ పరతత్వాంశమే. అందువలన వారికిని ప్రకృతిని దాటు సౌలభ్యమున్నది. వశిష్ఠాది మహర్షులట్టివారు.

ప్రకృతి, త్రిశక్తులే త్రిగుణాత్మకముగ సృష్టిని నిర్మాణము చేయును. సప్తలోకములను త్రిగుణములతో నిర్మించును. అందు జీవులు వసింతురు. 

రజస్తమస్సులను సమన్వయపరచి, సత్వమున సంయమము చెందుట ద్వారా జీవులు కూడ వారి వారి స్వభావములను దాటవచ్చును. అట్లు దాటినవారు తమ స్వభావముకన్న వేరుగ తమ అస్తిత్వమును గుర్తింతురు. వారు స్వభావమునకు లోబడరు. 

కార్యములు తమ స్వభావము నిర్వర్తించు చుండగ ఉదాసీనులై అవలోకింతురు. ఇట్టి వారినే అవలోకితేశ్వరులు అందురు. వారి నుండి కార్యములు జరుగును. వారికి చేయు చున్నామను భ్రమ యుండదు. 

సర్వము ప్రకృతి సంకల్పమే. ప్రకృతి దివ్యత్వమునుండి వెలువడిన సంకల్పమే అని తెలిసియుండును. తమ తమ స్వభావములు ప్రకృతి స్వభావముతో సమన్వయింప బడి కార్యములు జరుగుచుండగ, తాము వీక్షించుచు నుందురు. దైవసృష్టి కవిసృష్టి వంటిది. 

కవి నుండి ఎన్నిరకముల పాత్రలు, సన్నివేశములు, వివిధములగు ఘట్టములు వ్యక్తమగు చున్నను, అందు తానొక పాత్రధారిగ నున్నను తన నుండి వెలు వడిన కథ తనను బద్దుని చేయదు. 

హాస్య ఘట్టము, శోక ఘట్టము, విజయ ఘట్టము, పరాజయ ఘట్టములు, లాభనష్ట ఘట్ట ములు యిట్లెన్నియో ఘట్టములు కథ నుండి వెలువడు చున్నప్పుడు ఆ ఘట్టములు ప్రభావము కవిపై నుండవు గదా! అట్లే దైవము కూడ. జీవుడు కూడ నట్లే యుండవచ్చునని, అట్టివారే సన్న్యాసులని దైవము తెలుపుచున్నాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 329 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
83. అధ్యాయము - 38

*🌻. క్షువదధీచుల వివాదము - 1 🌻*

సూతుడిట్లు పలికెను

మహాప్రాజ్ఞుడగు బ్రహ్మ యొక్క ఈ మాటలను ద్విజశ్రేష్టుడుగు నారదుడు విస్మితుడై ప్రేమతో నిట్లు ప్రశ్నించెను(1) 

నారదుడిట్లు పలికెను

విష్ణువు శివుడు లేని దక్షుని యజ్ఞమునకు దేవతలతో గూడి వెళ్ళి, అచట పరాభవమును పొందెను. దీనికి కారణముమేమియో చెప్పుము (2) సర్వసంహారకారకుడుగు శంభుని పరాక్రముమును విష్ణువు ఎరుంగడా? మూర్ఖునివలె ఆయన శివుని గణములతో యుద్ధము నెట్టు చేసెను?(3) ఇది నాకు గల పెద్ద సందేహము ఓ దయానిధీ! నాసందేహము తొలగించుము. హే ప్రభో! మనస్సునకు ఉత్సాహమును కలిగించే శంభుని చిరితమును చెప్పుము(4)

బ్రహ్మ ఇట్లు పలికెను

ఓ ద్విజశ్రేష్టా! చంద్రశేఖరుని చరితమును ప్రీతితో వినుము. ఈ చరితము అడిగినవారికి, విన్నవారికి, సంశయముల నన్నిటినీ వారించును(5). దధీచ మహర్షి యొక్క శాపముచే పూర్వము జ్ఞాన భ్రష్టుడైన విష్ణువు దేవతలతో గూడి దక్షుని యజ్ఞమునకు వెళ్లెను. విష్ణువు క్షువునకు సహయమును చేయబోయి దధీచుని శాపమును పొందెను(6)

నారదుడిట్లు పలికెను

మహర్షిశ్రేష్ఠుడగు దధీచుడు విష్ణువును శపించుటకు కారణమేమి? ఆ క్షువునకు సహాయమును చేసిన విష్ణువు ఆయనకు కోపము కలిగే పనిని దేనిని చేసెను? (7) 

బ్రహ్మ ఇట్లు పలికెను

క్షువుడను మహేతేజస్వియగు రాజు ఒకడు ఉండెడివాడు. ఆయనకు మహాప్రభుడగు దధీచ మహర్షితో మైత్రి కలిగెను(8) దీర్ఘకాల తపస్సు అను విషయములో పూర్వము క్షువ దధీచులిద్దరికీ వాదము చెలరేగెను. గొప్ప అనర్ధమును కలిగించు వా వాదము ముల్లోకములలో ప్రసిద్ది గాంచెను(9) మూడు వర్ణముల కంటె శ్రేష్టుడగు బ్రాహ్మణుడే తపస్సునందే సమర్ధుడనియు, సంశయములేదనియు శివభక్తుడు వేదవేత్తయగు దధీచుడు చెప్పెను(10) దధీచ మహర్షి యొక్క ఆ మాటను విని ధనగర్వముచే మిక్కిలి మోహితుడై యున్న క్షువ మహారాజు ఇట్లు పలికెను.

క్షువుడిట్లు పలికెను

రాజు ఎనమండుగురు లోకపాలకుల దేహమును తాను ధరించును కాన వర్ణాశ్రమములకు రక్షకుడగు రాజే శ్రేష్ఠుడు(12) రాజధర్మములను భోదించు శ్రుతి 'రాజు సర్వదేవతా స్వరూపుడు' అని చెప్పుచున్నది. కాన రాజు దేవతలలో కెల్ల గొప్పవాడు. ఓ మహర్షీ! అట్టి దేవతను నేనే(13). ఓ చవ్యవనసపుత్రా! ఇందువలన రాజు బ్రాహ్మణుని కంటె శ్రేష్ఠుడు. నీవు ఆలోచించుము. ఈ కారణముగా నన్ను అవమానించరాదు. నీవు నన్ను అన్నివిధముగా పూజించవలసియున్నది(14)

బ్రహ్మ ఇట్లు పలికెను

భృగువంశజుడగు దధీచి మహర్షకి ఆ క్షువుని వేదశాస్త్ర విరద్ధమగు ఆ అభిప్రాయమును వినిన పిదప మిక్కిలి కోపము కలిగెను. (15) 

ఓ మహర్షీ! మహాతేజస్వియగు దధీచుడు కోపించినవాడై, ఆత్మగౌరవమును రక్షించుట కొరకై శిరస్సుపై ఎడమ ముష్టితో కొట్టెను(16) బ్రహ్మాండమునకు ప్రభువు, దర్బుద్ధియగు క్షువుడు దధీచుడు కొట్టుట వలన మిక్కిలి కోపించి, అతనిని వజ్రముతో చీల్చివేసి గర్జించెను(17). భృగువంశమును నిలబెట్టే ఆ దధీచుడు వజ్రముతో క్షువునిచే కొట్టబడిన వాడై నేలమీద బడి శుక్రాచార్యుని స్మరించెను(18)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 82 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 6 - THE 11th RULE
*🌻 11. Desire only that which is unattainable. - It is unattainable, because it for ever recedes. You will enter the light, but you will never touch the Flame. - 1 🌻*

328. C.W.L. – This does not mean that the higher life at which we aim is unattainable, but that when we have reached one height we always see another peak beyond. 

We shall draw ever nearer and nearer to the Divine, becoming one with Him at level after level, but the Flame, His true consciousness, we shall never touch. There are many stages on the way, and they grow more and more indescribable in their beauty as we rise. 

To whatever height we raise our consciousness, into whatever ineffable glories we can rise, we always see something more glorious still beyond. The Flame ever recedes. So far as any knowledge that we have goes, that chain of increasing glory and beauty is endless. 

Perhaps it is not much use speculating upon that. The Lord Buddha said long ago that it was profitless to speak of the beginning and the end, because “Veil after veil will lift, but there must be veil after veil behind.”

329. I wish I could bring home to every one, as utterly and as vividly as I myself feel it, this absolute certainty of the progress that lies ahead, of its wonderful glory and beauty and power and wisdom and love, how from step to step it rises and becomes ever more and more indescribable down here, and more and more glorious and beautiful and true above. 

The road to it lies through unselfishness. Only when we rise out of the lower self into the higher life, into the wider universal Self does the way open, and there is no limit to the glory and the splendour which man may then attain.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 214 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శుకమహర్షి - 2 🌻*

07. సమాహితాత్ముడైన ముని ఇతరులవల్ల తనకు, తనవల్ల ఇతరులకు భయంలేనివాడు. అంటే, ‘ఈ ప్రపంచలో నాకు ఆశ కలుగుతుందేమో!’ అనిగాని, అప్సరసలు, దెవతలవలనగాని జ్ఞానికి భయముండదు. ప్రపంచంలో ధనం, ఇంకా ఏమేమో ఉన్నాయి. అవే కదా ఆపదలకు హేతువులు! వాటివల్ల తనకు ఆపదలు లేవు. అవి లోపలికి ప్రవేశించి లోకులను భ్రష్టులను చెయ్యగలుగుతాయి. 

08. కాని జ్ఞాని ఇతరుల వస్తువులను ఆశించడు. “లోభి అయిన ధనవంతుడుంటాడు. వాడికికూడా జ్ఞానివలన ఆపద లేదు. ఎందుకంటే అతడేమీ ఆశించడు. ఈ ప్రకారంగా నిస్పృహుడై ఉండటంచేత అతడు జీవనుముక్తుడై వెలుగొందుతాడు. అకామవృత్తి, తపోరతి – అంటే, కోరికలేకుండా ఉండటము, తపస్సులో ఉండటము – ఈ రెండే అతడు నిరంతరం ఆచరించేవి. 

09. అతడి యథార్థస్థితి ఇంటే! అతడు బ్రహ్మజ్ఞాని. బ్రహ్మదృష్టి కలిగి ఉంటాడు. మట్టి అయినా, బంగారమయినా అతడికి ఒకటే. నింద కీర్తి ఈ రెండింటినీ అతడు సమదృష్టితో చూస్తాడు. అతనిలో ఇంద్ర్యములు పూర్తిగా అణగిపోయి ఉంటాయి. ఆ దశలో అతడికి శివజ్ఞానము, శివదర్శనము కలుగుతాయి. ఈ విశేషాలన్నీ నీలో ఉన్నాయి నాయనా!” అన్నాడు జనకుడు.

10. యోగసాంఖ్యాధ్వర్య ప్రజ్ఞా విశేషాలలో దేనివల్ల పరబ్రహ్మము పొందవచ్చు అని అడిగాడు. “ఇంద్రియ నిగ్రహము, కామక్రోధ లోభ మోహాదులను పోగొట్టుకోవటము దృధవిద్య అంటే ఇది సత్యము అనే విషయము ఎప్పుడూ మరువకుండా ఉండటము ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఆ సత్యజ్ఞానము వదలకుండా ఉండటము. 

11. భయంకరమైన స్థితిలో సముద్రంలో మునిగిపోతున్నా, బడబాలనంలో చిక్కుకున్నా ఆ సత్యమనే వస్తుజ్ఞానము ఎప్పుడూ లోపల వెలుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడూకూడా ఆరిపోదు. దృఢవిద్య అని దానికి పేరు. ఇలాగే ఉన్నవాడు ఏమార్గంలో ఉన్నా బ్రహ్మపదప్రాప్తి కలుగుతుంది. 

12. ఏ మార్గము అంటే యోగం చేత కాని, మౌనం చేత కాని, తపస్సు చేతగాని, ప్రాణోపాసన చేతగాని, సరైనమార్గం ఏమీలేకుంటే అలా పడిఉండటంచేతకూడా – ఏ మార్గంద్వారా అయినా కాలాంతరంలో జ్ఞానం కలుగుతుంది” అని చెప్పాడు.

13. ఒకసారి నారదుని, “ఈ లోకంలో పుట్టినవాడికి హితమైనమార్గం ఉపదేశించమని అడిగాడు శుకుడు”. దానికి బదులుగా నారదుడు, “మునులు పూర్వం సనత్కుమారుణ్ణి ఈ ప్రశ్నేవేశారు. ఆ సనత్కుమారుడు మునులకు చెప్పిన సమాధానమే నేను నీకు చెపుతున్నాను. తపస్సు, సత్యము, విద్య – ఇవన్నీ పరమసుఖాన్నిచ్చేవి. 

14. ఈ తపస్సు ఉండి, సత్యవ్రతముండి, విద్యకూడా సంపాదించిన నాడు ముక్తియందు కోరిక పుట్టదు సుమా” అన్నాడు. “ఈ విజ్ఞానం వచ్చిన తరువాత – వేదవేదాంగములు చదవటము, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యటము, సత్యము, శౌచము ఇవన్నీ వచ్చిన తరువాత – ఆ జన్మలో ముక్తి యందు కాంక్ష కలగకపోతే ఏ జన్మయందూ మరి ఎన్నడూ ముక్తియందు కోరికకలుగదు. ముక్తి లభించదు” అన్నాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 278 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 127. Meditation is this knowledge 'I am', this consciousness meditating on itself and unfolding its own meaning. 🌻*

When we talk of meditating on the knowledge 'I am', what is being done? It is the knowledge 'I am' that is meditating on itself. You mustn't meditate on the 'I am' as 'I am so-and-so', or such-and-such person. 

Dissociate the 'I am' from everything else, come down to its purest level and then let the wordless 'I am' meditate on itself. When this is done for a sufficiently long time, it will unfold its own meaning.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 153 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 32 🌻*

605. ఆత్మ,స్వీయ చైతన్యమును పొందిన తరువాత మూడే మూడు స్థితులను అనుభవించును.

(a)బ్రహ్మీ భూతుడు:-
జీవుడు ఆత్మచైతన్యుడు కాగానే, సాధారణముగా తనకు నీడగా నున్న దేహత్రయమును విడిచి, శాశ్వతముగా సచ్చిదానంద స్థితిని ఎఱుకతో అనుభవించును. కానీ వాటిని అన్యునికై వినియోగించడు.

(b) ఆత్మ దేహత్రయమును కొంతకాలము పాటు వదలక పోవచ్చును. కాని వాటి యందు స్పృహ యుండదు. దేహములను విడిచిన (a) వానికిని, ఇతనికిని ఏమియు భేదము లేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 9 / Sri Lalita Sahasranamavali - Meaning - 9 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ 

*🍀 9. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః |*
*నవవిద్రుమ బింబశ్రీః న్యక్కారి రదనచ్ఛదా ‖ 9 ‖ 🍀*

23) పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః - :
 పద్మరాగ మణుల అద్దమును పరిహసించు చెక్కిళ్ళ యొక్క ప్రదేశము గలది.

24) నవవిద్రుమ బింబ శ్రీ న్యక్కారి రథనచ్ఛదా - : 
కొత్తదైన పగడముల యొక్క దొండపండు యొక్క శోభను తిరస్కరించు పెదవులు గలది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 9 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 9. padmarāga-śilādarśa-paribhāvi-kapolabhūḥ |*
*navavidruma-bimbaśrī-nyakkāri-radanacchadā || 9 || 🌻*

23 ) Padma raga sila darsha paribhavika polabhu -  
She who has cheeks which shine more than the mirror made of Padmaraga

24 ) Nava vidhruma bimbha sri nyakkari rathna chhadha -   
She whose lips are like beautiful new corals

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 9 / Sri Vishnu Sahasra Namavali - 9 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*మేషరాశి - కృత్తిక నక్షత్ర ప్రధమ పాద శ్లోకం*

*🍀 9. ఈశ్వరో విక్రమీధన్వీ మేధావీ విక్రమః క్రమః |*
*అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్‖ 9 ‖ 🍀*

🍀 74) ఈశ్వర: - 
సర్వశక్తి సంపన్నుడైనవాడు. 
 
🍀 75) విక్రమీ - 
శౌర్యము గలవాడు. 
 
🍀 76) ధన్వీ - 
ధనస్సును ధరించినవాడు. 
 
🍀 77) మేధావీ - 
ఏకకాలములో సర్వవిషయగ్రహణ సామర్ధ్యము కలిగినవాడు. 
 
🍀 78) విక్రమ: - 
గరుడుని వీపుపై ఎక్కి ఇచ్ఛామాత్రముచే ఎచ్చటైనను విహరించగలవాడు. 
 
🍀 79) క్రమ: - 
నియమానుసారము చరించువాడు. 
 
🍀 80) అనుత్తమ: - 
తనకంటె ఉత్తములు లేనివాడు. 
 
🍀 81) దురాధర్ష: -
 రాక్షసులు కూడా ఎదుర్కోను శక్యము గానివాడు. 
 
🍀 82) కృతజ్ఞ: -
 ప్రాణులు చేయు కర్మములను చేయువాడు. 
 
🍀 83) కృతి: - 
కర్మకు లేదా పురుష ప్రయత్నమునకు ఆధారభూతుడై యున్నవాడు. 
 
🍀 84) ఆత్మవాన్ - 
తన వైభవమునందే సర్వదా సుప్రతిష్ఠుడై యుండువాడు.  

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Vishnu Sahasra Namavali - 9 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka For Kruthika 1st Padam*

*🌻 9. īśvarō vikramī dhanvī medhāvī vikramaḥ kramaḥ |*
*anuttamō durādharṣaḥ kṛtajñaḥ kṛtirātmavān || 9 || 🌻*

🌻 74) Ishwara – 
The Contoller

🌻 75) Vikrami – 
The Lord Who has Valour

🌻 76) Dhanvi – 
The Lord Who is the Supreme Archer

🌻 77) Medhavi – 
The Lord Who is the Supreme Intelligence

🌻 78) Vikrama – 
The Lord Who has Measured the Worlds

🌻 79) Krama – 
The Lord Who has Spread Everywhere

🌻 80) Anuttama – 
The Lord Who Does Not Have Anybody Better Than Him

🌻 81) Duradharsha – 
The Lord Who Cannot be Attacked Successfully

🌻 82) Kritagya – 
The Lord Who Knows Good and Bad of All Beings

🌻 83) Kriti – 
The Lord Who Rewards All Our Actions

🌻 84) Atmavan – 
The Self in All Beings

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹