మహాభారత యుద్ధం లో అస్త్రాలన్నీ మిస్సైల్సే! All the weapons in the Mahabharata war were missiles!

🌹. మహాభారత యుద్ధం లో అస్త్రాలన్నీ మిస్సైల్సే! 🌹

18 రోజులు జరిగిన మహాభారత యుద్ధంలో మొత్తం 18 అక్షౌహిణిల సైన్యం పాల్గొంది. అసలు అక్షౌహిణి అంటే ఎంత?ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు కాల్బంబులు (పదాతి దళం) కలిసిన సైన్యానికి ‘పత్తి' అని పేరు. అనగా 1:1:3:5 నిష్పత్తిలో ఉంటుంది సేన. దీనికి మూడు రెట్లయిన సైన్యాన్ని ‘సేనాముఖము' అంటారు. మూడు రథాలు, మూడు ఏనుగులు, తొమ్మిది గుర్రాలు, పదిహేను మంది కాల్బలము ఇందులో ఉంటారు. సేనాముఖానికి మూడు రెట్లును ‘గుల్మము' అంటారు. ఇందులో తొమ్మిది రథాలు, తొమ్మిది ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది కాలిబంట్లు వుంటారు. గుల్మానికి మూడు రెట్లు ‘గణము' ఇందులో 27 రథాలు, 27 ఏనుగులు, 81 గుర్రాలు, 135 మంది కాలిబంట్లుంటారు. గణానికి మూడు రెట్లు ‘వాహిని'. ఇందులో 81 రథాలు, 81 ఏనుగులు, 2432 గుర్రాలు, 405 మంది కాలిబంట్లు వుంటారు. వాహినికి మూడు రెట్లు ‘పౄతన' అంటే 243 రథాలు, 243 ఏనుగులు, 729 గుర్రాలు, 1215 మంది కాలిబంట్లు. పౄతనకు మూడు రెట్లు ‘చమువు' ఇందులో 729 రథాలు, 729 ఏనుగులు, 2187 గుర్రాలు, 3645 మంది కాలిబంట్లుంటారు.చముకు మూడు రెట్లు ‘అనీకిని'. ఇందులో 2187 రథాలు, 2187 ఏనుగులు, 6561 గుర్రాలు, 10925 మంది కాలిబంట్లు వుంటారు. అనీకినికి పది రెట్లయితే ‘అక్షౌహిణి' అవుతుంది. అంటే అక్షౌహినిలో 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది కాల్బలము వుంటారు. ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాయి. అంటే 3,93,660 రథాలు, 3,93,660 ఏనుగులు, 11,80,890 గుర్రాలు, 19,88,330 కాల్బలము అన్నమాట. ఇక్కడ మరో విషయాన్ని తెలియజేయాలి. ఒక్కొక్క రథం మీద ఒక యుద్ధ వీరునితో పాటు ఒక సారథి కూడా వుంటాడు. కాబట్టి సారథులను కూడా లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడు రథబలం 7,87,320 అవుతుంది. అలాగే గజబలంలో కూడా ఒక్కొక్క ఏనుగు మీదయుద్ధ వీరునితో పాటు ఒక మావటీ వాడు కూడా వుంటాడు. కాబట్టి గజబలం కూడా 7,87,329 అవుతుంది. వీటన్నింటిని కలిపితే కురుక్షేత్ర యుద్ధంలో 47,23,920 మంది పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఈ 18 అక్షౌహిణుల్లో పాండవ బలం మాత్రం 7 అక్షౌహిణులు, కౌరవ బలం 11 అక్షౌహిణిలు.

మహాభారత యుద్ధంలో అస్త్రాలు మహాభీకర యుద్ధానికి దారితీశాయి. దాదాపు ఒక కోటిమంది మరణించిన మహాభారత యుద్ధాన్ని చరిత్రకారులు మొదటి ప్రపంచ యుద్ధంగా భావించారు. ధనుస్సుతో బాణాలను ఉపయోగించి జరిగిన ఈ యుద్ధంలో ఇంత గొప్ప సంఖ్యలో యోధులు మరణించడానికి గల కారణాలేమై వుండవచ్చు?

దాదాపు 7వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ మహాభారత భీకర సమరంలో భయానకమైన రసాయనిక అస్త్రాలు వినియోగించారని చరిత్రకారులు భావిస్తున్నారు. బాణాలను మాత్రమే ఉపయోగించి వుంటే ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు మరణించి వుండేవారు కాదని ఎవరైనా ఊహించవచ్చు. అయితే రసాయనిక అస్త్రాలు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం 7వేల సంవత్సరాల క్రితం కౌరవ పాండవులకు ఎలా లభించి వుండవచ్చు? అత్యంత ఆసక్తికరమైన ఈ అంశాలపై ప్రత్యేక కథనమిది...

హరివంశం చారిత్రాత్మక గ్రంథం. చారిత్రాత్మకంగా ఏ సంఘటన ఎప్పుడు జరిగిందో ఇదమిత్థంగా తెలియచెప్పేదే చరిత్ర. చారిత్రాత్మక సంఘటనలకు రుజువులు లభ్యమవుతాయి. కుణాలుడు రాసిన మాగధ (మగధరాజ్య) చరిత్ర, కల్హణుడు రాసిన రాజతరంగిణి రచనలు ఆయా రాజుల జనన మరణాల గురించి తేదీలతో సహా విశదంగా వివరించబడ్డాయి. ఇందులో వాదోపవాదాలకు తావులేదు. అలాగే శ్రీకృష్ణ ద్వైపాయనుడు రాసిన హరివంశం కూడా రాజతరంగిణి రచనలు ఆయా రాజుల జనన మరణాల గురించి తేదీలతో సహా విశదంగా వివరించబడ్డాయి. ఇందులో వాదోపవాదాలకు తావులేదు. అలాగే శ్రీకృష్ణ ద్వైపాయనుడు రాసిన హరివంశం కూడా రాజతరంగిణి లాంటి చారిత్రాత్మక గ్రంథమే. 16,374 శ్లోకాలు వున్న ఈ గ్రంథంలో సూర్యవంశపు రాజుల చరిత్ర చంద్రవంశపు రాజుల చరిత్రలో వున్నాయి.

క్రీ.పూ. 7536 సంవత్సరంలో శ్రీకృష్ణ ద్వైపాయనుడు హరివంశం రాసినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. హరప్పా మొహంజదారో నాగరికతకన్నా దాదాపు మూడువేల సంవత్సరాల క్రితం హరివంశం రాసినట్లు తెలుస్తోంది. వ్యాస పీఠానికి ఆద్యుడు శ్రీకృష్ణ ద్వైపాయనుడని అంటారు. హరివంశ చరిత్రలో సరస్వతీనదిని గురించిన ప్రస్తావన వుంది. ఎటొచ్చీ హరివంశం ఒక చారిత్రాత్మక గ్రంథం. క్రీ.పూ. 22 డిసెంబర్‌ 5561న ఉత్తరాయణంలో భీష్ముడు ప్రాణత్యాగం చేసినట్లు వ్యాసుడు రాశాడు. హరివంశం శ్రీకృష్ణ ద్వైపాయనుడు రాయటం ప్రారంభించిన తర్వాత ఆ హరివంశ చరిత్రలో వ్యాసపీఠాధిపతులు చారిత్రాత్మక సంఘటనలను నమోదు చేస్తూ వచ్చారు.

మహాభారత యుద్ధ కాలం:

దీని ప్రకారం భీష్ముడు 58 రాత్రులు అంపశయ్యపై శయనించి జీవించాడని తెలుస్తుంది. భీష్ముడు సైన్యాధిపతిగా పదిరోజులు యుద్ధం చేశాడు. పదోరోజు సాయంత్రం శిఖండితో యుద్ధం చేయాల్సిన పరిస్థితిలో అస్త్ర సన్యాసం చేశాడు. అంటే 68 రోజుల పూర్వం మహాభారత యుద్ధం ప్రారంభమైందన్నమాట. 22 డిసెంబర్‌ 5561లో భీష్ముడు ప్రాణత్యాగం చేశాడు గనక మహాభారత యుద్ధం సరిగ్గా క్రీ.పూ. 16.09.5561న ప్రారంభమైంది. 18 రోజులు జరిగిన ఈ అత్యంత భీకరమైన యుద్ధంలో 92 లక్షలమంది మరణించినట్లు హరివంశంలో వుంది. మహాభారత యుద్ధ చరిత్రలో సైతం దాదాపు ఈ సంఖ్యనే (89 వేలు) నమోదు చేశారు.

దాదాపు ఒక కోటిమంది మరణించిన మహాభారత యుద్ధాన్ని చాలామంది చరిత్రకారులు మొదటి ప్రపంచ యుద్ధంగా భావిస్తారు. బ్రహ్మశ్రీ కోట వేంకటాచలం గారు వ్రాసిన మహాభారత యుద్ధకాలం అనే గ్రంథంలో ఈ యుద్ధం అత్యంత భీకరంగా జరిగినట్లు వర్ణించారు. ధనుస్సుతో బాణాలను ఉపయోగించి జరిగిన ఈ యుద్ధంలో ఇంత గొప్ప సంఖ్యలో యోధులు మరణించడానికి గల కారణాలేమై వుండవచ్చు?

దాదాపు 7వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ మహాభారత భీకర సమరంలో భయానకమైన రసాయనిక అస్త్రాలు వినియోగించారని చరిత్రకారులు భావిస్తున్నారు. బాణాలను మాత్రమే ఉపయోగించి వుంటే ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు మరణించి వుండేవారు కాదని ఎవరైనా ఊహించవచ్చు. అయితే రసాయనిక అస్త్రాలు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం 7వేల సంవత్సరాల క్రితం కౌరవ పాండవులకు ఎలా లభించి వుండవచ్చు?

భారతదేశంలో అర్జునుని మనుమడైన పరీక్షిత్తు కాలం వరకూ నారదుడు భూలోకంలో సంచరించినట్లు భాగవతంలో వుంది. ఈ నారదుడు 372 కాంతి సంవత్సరాల దూరంలో "ఎబ్సులా"అనే నక్షత్ర మండలంలోని "బర్హోస్‌" అనే గ్రహానికి చెందినవాడుగా శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. కాంతికన్నా వేగంగా ప్రయాణించే సాంకేతిక పరిజ్ఞానం వుండేదనీ "సిరియా"లోని పురావస్తు శాస్త్రజ్ఞుల పరిశోధనలో తేలింది.

అస్త్ర శస్త్ర తయారీలో వీరు నిపుణులు. వివిధరకాలైన అస్త్రాలు (మిస్సైల్స్‌) వైవిధ్యమైన ధనుస్సులు (లాంచర్స్‌) పరిజ్ఞానం శ్రీకృష్ణుని సహకారంతో పాండవులకు లభించినట్లుగా తెలుస్తోంది. ఖాండవ దహనం సందర్భంలో అగ్నిదేవుడు శ్రీకృష్ణునికి అర్జునునికి ఇచ్చిన సుదర్శనచక్రం, గాండీవం (లాంచర్‌), అక్షయ బాణ తూణీరాలు (మిస్సైల్స్‌) రసాయనికి ఆయుధాలుగానే పరిగణిస్తున్నారు. ఖాండవ దహనం సందర్భంగా అర్జునునికి ఇంద్రునికీ జరిగిన యుద్ధం ఒకరకంగా స్టార్‌వార్‌గానే భావించవచ్చు. దాదాపు 3వేల ఎకరాల్లోని ఖాండవ వనం యావత్తూ ఈ రసాయనిక అస్త్రాల వినియోగం వల్ల కాలి బూడిదైపోయింది.

ఈ అస్త్రాలను వినియోగించేందుకు పాస్‌వర్డ్‌లాంటి అక్షరాలను (మంత్రాలను) ఉచ్ఛ రించేవారని కొందరు పరిశోధకులు విశ్లేషి స్తున్నారు. రసాయనిక అస్త్రాలను ట్రిగ్గర్‌లాంటి ఒక పరికరాన్ని వొత్తిడికి గురిచేసి భయానక విస్ఫోటం కలిగించేవారని మరికొందరు విశ్లేషిస్తున్నారు.

మహాభారత యుద్ధంలో రిమోట్‌ కంట్రోల్‌తో పాస్‌వర్డ్‌ను గ్రహించి విస్ఫోటనం కలిగించేవారని కూడా కొందరు శాస్త్రజ్ఞులు ఊహిస్తున్నారు.

రిమోట్‌ ద్వారా అస్త్రాల ప్రయోగం:

మహాభారత యుద్ధంలో అస్త్రాలు మహా భీకర యుద్ధానికి దారి తీశాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం శ్రీకృష్ణునికీ భీష్ముడికీ అర్జునునికి కర్ణుడికీ అభిమన్యుడులాంటి 36 మంది మహారధులకు మాత్రమే వుండేదని భావిస్తున్నారు. .

జిపిఎస్‌ పరిజ్ఞానం మహాభారత యుద్ధంలో వారికి వుంది అనడంలో ఆశ్చర్యంలేదు. 7వేల సంవత్సరాల క్రితమే రసాయన ఆయుధాలను తయారుచేయగల సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారికి జిపిఎస్‌ అడ్వాన్స్‌డ్‌ జ్ఞాన సంపత్తి తెలిసి వుండడంలో ఆశ్చర్యంలేదు. .

ప్రతి అస్త్రాన్ని ఉపయోగించ దలచుకొన్నా ఆ అస్త్రం కోడ్‌ నెంబరూ తనకు కేటాయించిన పాస్‌వర్డ్‌(మంత్రం) ఉచ్ఛరించి నంత మాత్రముననే టెలీపతీ తరంగాల ద్వారా, గ్రహాంతర సాంకేతిక యుద్ధ నిపుణునికి క్షణాల్లో చేరటంతో రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఆ అస్త్రం (మిస్సైల్‌) శత్రువులను నాశనం చేయగలిగేదని ఊహిస్తున్నారు. ఇలాంటి ఊహ నిజం అనుకోవడానికి గల మౌలిక కారణం ఈ మహాభారత యుద్ధంలో లక్షలాదిమంది మూకుమ్మడిగా హతం కావడమే!

అయితే కొన్ని సాధారణ అస్త్రాలు (మిస్సైల్స్‌) వినియోగించే నైపుణ్యం యుద్ధం చేసే వాడికే వుండేది. కొన్ని అస్త్రాలకు "ఐపీ" అడ్రసులు సైతం వుండి వుండవచ్చని జర్మనీకి చెందిన కొల్విన్‌ హెచ్చర్‌ అంటు న్నారు. మహాభారత యుద్ధం జరిగిన విధానంపై హెచ్చర్‌ 22 సంవత్సరాల క్రితమే పరిశోధన చేసి పి.హెచ్‌.డి. పట్టా పొందాడు. అయితే ఈ అస్త్రాలన్నీ (మిస్సైల్స్‌) ప్రస్తుతం ఉపయోగిస్తున్న శాస్త్ర పరిజ్ఞానానికన్నా భిన్నంగా వుండే అవకాశాలు వున్నాయి.

మహాభారత యుద్ధంలో ఉపయోగించిన శస్త్రాల్లోనుంచి భయానక గామా కిరణాలు సైతం వెలువడి వుండవచ్చు. ఈ గామా కిరణాలకు శత్రువు శరీరాన్ని తుత్తునియలు చేసే అవకాశం వుంది. ధృతరాష్ట్రునికి సంజయుడు మహాభారత యుద్ధం గురించి ప్రత్యక్షంగా వివరిస్తూ కౌరవుల తరఫున, పాండవుల తరఫున చాలామంది యోధులు తుత్తునియలై పడిపోతున్నారని చెపుతాడు. మహాభారత యుద్ధంలో అస్త్రాలను ఎదుటివాడిపై ప్రయోగించడానికి మాత్రమేకాక స్వీయ రక్షణకు సైతం వినియోగించినట్లు వ్యాస మహాభారతంలో వుంది.

ఆధునిక సాంకేతిక యుద్ధ అస్త్రాల్లో "టెస్లాషీల్డ్‌" అనే అస్త్రం (మిస్సైల్‌) వుంది. శత్రువు ప్రయోగించిన వందలాది అస్త్రాలను ఈ "టెస్లాషీల్డ్‌" అనే అస్త్రం నిర్వీర్యం చేస్తుంది. అంటే ఈ అస్త్రం స్వీయ రక్షణకన్నమాట. ఇలాంటి అస్త్రాలు సైతం మహాభారతంలో వినియోగించబడ్డాయి. అర్జునుడు మహాభారత యుద్ధం జరిగిన తొలి రెండు రోజులూ శత్రువు ప్రయోగిం చిన అస్త్రాలనన్నింటినీ నిర్వీర్యం చేశాడని వ్యాసుడు రాశాడు. నిర్వీర్యం అంటే ఈ అస్త్రం నుంచి వెలువడే అత్యంత శక్తి శత్రువు ఉపయోగించిన అస్త్రాన్ని తాకి వెంటనే ఆవిరి చేస్తుంది. మహాభారత యుద్ధంలో కోటికి పైగా యోధులు మరణించారంటే ఈ యుద్ధం మహాభీకరమైన అస్త్ర శస్త్రాలతో కొనసాగిందనే చెప్పాలి.

18 రోజుల్లోనే ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడం సామాన్య యుద్ధంలో జరిగే పనికాదు. సామ్రాట్‌ అశోకుడు చేసిన కళింగయుద్ధంలో 16వేల మందే మరణించారని చరిత్రకారులు రాశారు. మహాభారత యుద్ధంలో చాలా భయానకమైన న్యూక్లియర్‌ ఆయుధాలను వినియోగించి వుండాలని శాస్త్రజ్ఞులు అనుమానిస్తున్నారు.

ప్రతిరోజూ మూకుమ్మడి మరణాలు సంభవించి వుండాలి. మొహంజిదారో నాగరికత ఒకే ఒక్క రోజులో నాశనం అయి వుండవచ్చని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. నాగసాకిపై ప్రయోగించిన అణుబాంబు విస్ఫోటం లాంటిదే "మొహంజదారో" నగరంలో జరిగి వుండవచ్చన్నది శాస్త్రజ్ఞుల అనుమానం.

క్రీస్తుకు పూర్వం భూమిపైని మానవుల్లో ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం వున్నట్లు ఇటలీకి చెందిన మిలన్‌ అనే పరిశోధకుడు 1979లో తను రాసిన "అటామిక్‌ డిష్ట్రక్షన్ ఇన్ 3000 బి.సి"అనే పుస్తకంలో పేర్కొన్నాడు. కురుక్షేత్రంలోని 50 గజాల విస్తీర్ణంలో ఎపి సెంటర్‌ (భూకంపన కేంద్రం) వున్నట్టు కనుగొన్నారు. ఆ 50 గజాల విస్తీర్ణంలో చాలా లోహాలు కరిగి శిలాజాలై కనపడ్డాయి. వీటిపై పరిశోధనలు జరిపితే ఇవి దాదాపు 3000 బి.సి. కాలం నాటివని తేలింది. రోమ్‌కు చెందిన ప్రొఫెసర్‌ అంటోనియో క్యాస్టెల్లానీ కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత ఒక వ్యాసం రాస్తూ అక్కడ ప్రాణాలు కోల్పోయినవారి శరీరాల్లోని ఎముకల శకలాలను పరిశీలించిన తర్వాత ఆ మరణాలు అణుయుద్ధం వల్ల సంభవించినవిగానే నిర్ధారించారు.

అస్త్రాల వివరాలు:

మహాభారతంలోని మౌసల పర్వంలో మహాభారత యుద్ధంలో వినియోగించిన అస్త్రాల గురించిన వివరాలు వున్నాయి. అతి వేగంతో ప్రయాణించే విమానాల్లో విశ్వాన్ని సైతం నాశనం చేయగల అణుబాంబులు వున్నాయని రాశారు. పది సూర్యులు ప్రసరించగల వేడిని పుట్టించే అస్త్రాలు వున్నాయని వుంది. ఒకేసారి వేయిమందిని భస్మం చేసే అస్త్రాలను వినియోగించారని పేర్కొన్నారు. వెంట్రు కలు, గోళ్ళు లాంటి వాటితోసహా దగ్ధం చేయగల మారణాస్త్రాలు వుండేవి. మహాభారత యుద్ధం జరిగిన 18 రోజులు వందల కిలోమీటర్ల దూరంలోని పక్షులు సైతం ప్రాణాలు కోల్పోయాయి. యుద్ధ గుడారాల్లోని భోజన పదార్థాలు సైతం సూక్ష్మక్రిములకు నిలయంగా మారాయి. వేలాదిమంది సైనికులు పారిపోయి నదీనదాల్లో మునిగి తేలుతూ ప్రాణాలు కాపాడుకొన్నారు.

మహాభారతంలో బ్రహ్మాస్త్రాన్ని ఎవరూ ప్రయోగించలేదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్ల భూమి యావత్తూ నాశనం కావడమేకాక సముద్రాలు సైతం ఎడారులుగా మారతాయి. మహాభారత యుద్ధం ఒక చారిత్రక సత్యం. శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో జరిగిన ఈ యుద్ధంలో ఆయన తన యుద్ధ నైపుణ్యం కన్నా వ్యూహాత్మకంగా యుద్ధం నడిపించగలిగాడు.

శ్రీకృష్ణుడు దైవాంశ సంభూతుడు. అంతటి భీకర యుద్ధంలో తాను ఎలాంటి అస్త్ర్రాన్ని ప్రయోగించకుండా పాండకులకు విజయం సాధించి పెట్టి కౌరవులను భూమిపై లేకుండా చేయగలిగాడు.

🌹🌹🌹🌹🌹

16 Apr 2022

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 364-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 364-1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 364-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 364-1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 80. చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ ।
స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥ 🍀

🌻 364-1. 'చిదేక రసరూపిణీ' 🌻

చైతన్యముతో కూడిన ఆనందరస రూపము శ్రీమాత అని అర్థము. శ్రీమాత చైతన్యరూపిణి అనునది విదితమే. సృష్టి చైతన్యమే శ్రీమాత. చైతన్యము నుండియే సమస్తము భాసించును. ప్రజాపతులు, రుద్రులు, ఆదిత్యులు, సనకసనందనాది బ్రహ్మ మానస పుత్రులు, మానవులు, సప్తఋషులు, దేవతలు, లోకములు, లోకస్థులు, సమస్తము శ్రీదేవి మహాచైతన్యము నుండి ఏర్పడినవే. చైతన్యము నందు సహజముగ భాసించునవి యోగము, ధర్మము, ఆనందము. శ్రీమాత యోగిని, ఆమె సృష్టి కావల బ్రహ్మముతో యోగము చెంది యుండును.

సృష్టి కీవల ఈశ్వరునితో యోగము చెంది యుండును. ఎట్లైనను, తాదాత్మ్యము చెందియే యుండును. బ్రహ్మము నుండి వేరై బ్రహ్మముతో కూడి యుండుట ఒక దివ్యమగు అనుభూతి. కూడియుండుట వలన ఆనందానుభవము వుండును. రసానుభూతి యుండును. ఏకమై యున్నచో యుండుటయే యుండును గాని అనుభూతి యుండదు. అనుభూతి పరాకాష్ఠకు చేరినపుడు రసానుభూతి యుండును. మనము మధురమగు పదార్థమును భుజించి నపుడు మధురానుభూతి యుండును. అది యోగము. మనమే మధురమైన పదార్థమైపోయిన అనుభూతి యుండదు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 364-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 80. Chiti statpada lakshyardha chidekarasa rupini
Svatyananda lavibhuta bramha dyananda santatih ॥ 80 ॥ 🌻

🌻 364-1. Cideka-rasa-rūpiṇī चिदेक-रस-रूपिणी 🌻

She is the essence of knowledge. The difference between knowledge and the essence of knowledge is to be understood. The knowledge of the unconditioned Brahman or the Prakāśa form of the Brahman is different from the conditioned Brahman or the vimarśa form of the Brahman.

The Brahman with attributes and without attributes remains the same, so also their purity of knowledge. This is the reason for establishing the identity of the both as one.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

16 Apr 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 169. గ్రంథాలు / Osho Daily Meditations - 169. SCRIPTURES

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 169 / Osho Daily Meditations - 169 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 169. గ్రంథాలు 🍀

🕉. మనకి చాలా గొప్పవైన అనేక తత్వశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. కానీ అవి మూర్ఖులను ఆక్రమించు కోవడానికి మాత్రమే ఉన్నాయి; అవి నిజమైన అన్వేషకుడి కోసం కాదు. 🕉

నేను చెప్పేది పూర్తిగా సజీవంగా, కొత్తగా, తాజాగా మరియు యవ్వనంగా ఉంది. ఇది సాంప్రదాయం కాదు. ఇది పూర్తిగా భిన్నమైన దృగ్విషయం. ఇది ఇలానే వుండాలి. ఎందుకంటే మూడు వేల సంవత్సరాల క్రితం వ్రాయబడిన గ్రంథాలు ఎవరి కోసం వ్రాయబడ్డాయో వారి కోసం ఉద్దేశించబడ్డాయి. ఆ మనస్తత్వశాస్త్రం ప్రపంచంలో ఇప్పుడు పనిచేయదు. నేను సజీవంగా మీకు ప్రతిస్పందిస్తున్నాను; ఆ గ్రంథాలు వారి ప్రజలకు ప్రతిస్పందించాయి. ఆ గ్రంథాలు మీ కోసం వ్రాయబడలేదు. మీకు మరియు ఆ గ్రంథాలకు మధ్య మూడు, నాలుగు, ఐదు వేల సంవత్సరాల అంతరం ఉంది. అవి పూర్తిగా అసంబద్ధం. వారిపై ఆధారపడటం అంటే న్యూటన్ వద్ద ఆగిపోయి భౌతిక శాస్త్రాన్ని అభ్యసించే వ్యక్తి మరియు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ను ఎప్పటికీ పొందలేనంత అసంబద్ధం.

కానీ గ్రంథాలు జీవించి ఉన్న ప్రజలకు ప్రతిస్పందించ లేవు; అవి పెరగవు. అందుకే పాత రోజుల్లో చాలా మంది మాస్టార్లు తమ సూక్తులను రాసుకోవద్దని, తద్వారా అవి పెరుగుతూనే ఉంటాయని పట్టుబట్టారు. గురువులు తమ సందేశాన్ని తమ శిష్యులకు అందిస్తారు, శిష్యులు వేరే ప్రపంచంలో జీవిస్తారు. గురువులు పోయారు మరియు శిష్యులు తమ స్వంత హక్కులో ఇతరులకు ఏదో బోధించేవారు. వారు చాలా మార్పులు చేస్తారు, ఎందుకంటే ప్రజలు మారారు, పరిస్థితులు మారాయి. కానీ ఒకరు ఒక పుస్తకాన్ని వ్రాసిన తర్వాత అది స్థిరమవుతుంది; అది స్తంభింప జేస్తుంది. దానిని ఎవరూ మార్చలేరు. ఒకవేళ ఎవరైనా అలా చేయడానికి ప్రయత్నం చేస్తే, ఆ పుస్తకాన్ని అనుసరించే వారికి చాలా కోపం కూడా వస్తుంది.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 169 🌹

📚. Prasad Bharadwaj

🍀 169. SCRIPTURES 🍀

🕉 There are many scriptures, and much great philosophy,but they are all rubbish! They exist just to let the foolish people get occupied; they are not for the real seeker. 🕉

What I am saying is absolutely alive, new, fresh, and young. It: is not traditional at all, it is a totally different phenomenon-it has to be. Because scriptures that were written three thousand years ago were meant for the people for whom it was written. That psychology no longer functions in the world. I am responding to you; those scriptures responded to their people. Those scriptures were not written for you. There is a gap of three, four, five thousand years between you and those scriptures. They are utterly irrelevant. Relying on them would be as absurd as somebody who studies physics stopping at Newton and never getting to Albert Einstein.

But scriptures can't respond to living people; they can't grow. That's why in the old days many masters insisted that their sayings should not be written down, so that they could keep on growing. The masters would give their message to their disciples, and the disciples would live in a different world. The masters would be gone, and the disciples would be teaching something to other people in their own right. They would make many changes, because the people have changed, situations have changed. But once you write a book it becomes fixed; it becomes frozen. Nobody can change it, and if somebody does, then the followers of the book will become very angry.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

16 Apr 2022

శ్రీ శివ మహా పురాణము - 550 / Sri Siva Maha Purana - 550

🌹 . శ్రీ శివ మహా పురాణము - 550 / Sri Siva Maha Purana - 550 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 50 🌴

🌻. పరిహాసములు - 5 🌻

శతరూప ఇట్లనెను-

ఆకలి గొన్న వానికి మృష్టాన్నమును భుజించనిదే ఆకలి తీరదు. ఓ శంభూ! ఏ కార్యము చే స్త్రీకి తృప్తి కలుగునో, ఆ పనిని చేయుట నీకు తగును (40).

సంజ్ఞ ఇట్లు పలికెను -

ఓసీ శతరూపా! నిర్జన స్థానములో తల్పమును ఏర్పాటు చేసి రత్న దీపమునమర్చి తాంబూలము నుంచి పార్వతీ పరమేశ్వరులను ప్రేమతో అచటకు వెంటనే పంపుము (41).

బ్రహ్మ ఇట్లు పలికెను-

స్త్రీల ఆ మాటలను విని వికారములు లేనివాడు, యోగివరుల గురువులకు గురువు అగు శివుడు వారితో స్వయముగా నిట్లనెను (42).

శంకరుడిట్లు పలికెను -

ఓ దేవీ మూర్తులారా! నా వద్ద ఇట్టి వచనములను పలుకకుడు. జగన్మాతలు, పతివ్రతలు అగు మీరు పుత్రుని విషయములో చాపల్యమునేల కలిగి యున్నారు? (43)

బ్రహ్మ ఇట్లు పలికెను-

శంకరుని మాటవిని సిగ్గుపడిన ఆ దేవతా స్త్రీలు కంగారుపడి చిత్రమునందలి స్త్రీ మూర్తులవలె ఉలుకు పలుకు లేక ఉండిరి (44). మహేశ్వరుడు మృష్టన్నమును భుజించి ఆచమనము చేసి ఆనందముతో కూడిన మనస్సు గలవాడై భార్యతో కలసి కర్పూర తాంబూలమును సేవించెను 45).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో పరిహాసవర్ణనమనే ఏ బదియవ అధ్యాయము ముగిసినది (50).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 550 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 50 🌴

🌻 Description of fun and frolic - 5 🌻

Śatarūpā said:—

40. A hungry person will not be satisfied until he partakes of a sweet hearty meal. O Śiva do everything whereby the woman will be satiated.

Saṃjñā said:—

41. Now please send off Śiva along with Pārvatī to a secluded spot after making the bed, giving them betal and keeping the gem-bedecked lamp ready near by.

Brahmā said:—

42. On hearing these words of the women, lord Śiva, who was free from aberrations and was the supreme preceptor of great Yogins spoke to them.

Śiva said:—

43. O dignified ladies, do not utter such words to me. You are the chaste mothers of the worlds, how do you speak so trivially in regard to your son?

Brahmā said:—

44. On hearing the words of Śiva, the celestial ladies were ashamed. In their excitement they became motionless like dolls in a picture.

45. Eating the sweets and performing Ācamana lord Śiva was much delighted. In the company of His wife He chewed the betal with camphor.

Continues....

🌹🌹🌹🌹🌹

16 Apr 2022

గీతోపనిషత్తు -352

🌹. గీతోపనిషత్తు -352 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 33 📚

🍀 33-2. కూడి యుండుట - సమ వర్తనము దుర్లభము. బ్రాహ్మణ క్షత్రియులకు అసహనము, అగ్రహము పిలవని పేరంటముగ పొటమరించు చుండును. జ్ఞానబలము చేత, అధికార బలము చేత వీరు పరిసరముల యందున్న దైవమును విశ్వసింతురు. తోటి జీవులను నిరసించుట, నిందించుట, మాటలతో బాధ పెట్టుట, తమవారి కష్టనష్టములను గుర్తింపకుండుట వీరి యందలి బలహీనత. సమాన ధర్మము వీరికి పరీక్ష వంటిది. జ్ఞానులగు బ్రాహ్మణ క్షత్రియుల కన్న పామరులగు ఇతర భక్తులే దైవమునకు చేరువైనారు. 🍀

కిం పునరాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా |
అనిత్య మసుఖం లోక మిమం ప్రాప్య భజస్వ మామ్ || 33

తాత్పర్యము : అన్ని జాతులవారును అనన్యభక్తి మార్గమున నన్ను పొందగలిగినపుడు పుణ్యాత్ములగు బ్రాహ్మణులు, భక్తులగు రాజర్షులు కూడ నన్ను పొందగలరని వేరుగ చెప్పనవసరము లేదు గదా! ఈ లోక మనిత్యము. ఇందు సుఖము లేదు. కావున నన్ను సేవించుచు ఆనందము పొందుము.

వివరణము : జీవుల సేవ చేయుచున్నను వారి యందలి దైవమును దర్శింప లేకపోవుట వలన సేవ చేయుచున్నామను అహంకారము తెలియకయే పెరుగుచుండును. జ్ఞానబలము చేత, అధికార బలము చేత వీరు పరిసరముల యందున్న దైవమును విశ్వసింతురు. దైవము పేరనే దశాబ్దముల తరబడి కార్యములు చేయుచున్నను వీరు నిరహంకారులగుట అంత సులభము కాదు. తోటి జీవులను నిరసించుట, నిందించుట, మాటలతో బాధ పెట్టుట, తమవారి కష్టనష్టములను గుర్తింపకుండుట వీరి యందలి బలహీనత. సమాన ధర్మము వీరికి పరీక్ష వంటిది.

సమ వర్తనము దుర్లభము. అసహనము, అగ్రహము పిలవని పేరంట ముగ పొటమరించు చుండును. కనుక వీరిరువురిని గూర్చి దైవము ప్రత్యేకముగా పలికినాడేమో! గోపికలకు, గోపబాలకులకు దర్శనమైన రీతిలో బ్రాహ్మణ క్షత్రియులకు కృష్ణ దర్శనము కాలేదు. ఇది ప్రత్యక్షముగ శ్రీకృష్ణుని జీవితమున చూడవచ్చును. జ్ఞానులగు బ్రాహ్మణ క్షత్రియుల కన్న పామరులగు ఇతర భక్తులే దైవమునకు చేరువైనారు. సంఘమున అధికారము గల వారికి అహంకారమను క్రీనీడ పనిచేయును. వారు ఎప్పటి కప్పుడు అహంకారమును తొలగించు కొనుచు నుండ వలెను. ఇతరులకీ సమస్య తక్కువ. కాని వీరు కూడ సర్వాత్మకుడగు దైవము నుండి ఏర్పడిన వారే కనుక, వీరును దైవమును తప్పక చేరగలరు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

16 Apr 2022

హనుమంతుని జన్మ వృత్తాంతము - పురాణ వర్ణన Hanuman's Birth Story - Description from Puranas

🌹. హనుమంతుని జన్మ వృత్తాంతము - పురాణ వర్ణన 🌹

📚. ప్రసాద్‌ భరధ్వాజ

శ్రీ హనుమాన్‌ జయంతి పర్వదిన సందర్భంగా ....

భక్తులెందరో హనుమంతున్ని ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాహలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం, రామాయణం, పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడివడి ఉంది. రామకార్యంలో సహాయపడాలనే ఉద్దేశంతో శివుడు తన వీర్యాన్ని స్థలనం చేశాడు. దాన్ని సప్తర్షులు సాదరంగా పొందుపరచి, గౌతముడి కూతురైన అంజనాదేవిలో చెవిద్వారా ప్రవేశపెట్టారు. ఫలితంగా శంభుడు మహాబల పరాక్రమాలగల వానరదేహంతో ఆమెకు జనించాడని (శంభుర్జజ్ఞే కపి తనుర్మహాబల పరాక్రమ:) శివమహాపురాణం (శతరుద్ర సమ్హిత 20-7) తెలిపింది. అలా హరాంశతో పుట్టిన హనుమంతుడే రుద్రావతార భగవానుడుగా శ.రు.సం. (20-14, 37) స్పష్టం చేసింది.

అంతేకాదు, హనుమంతుణ్ని శివసుతుడుగా (మహాదేవత్మజ:) కూడా శ.రు.సం (20-32) వర్ణించింది. తండ్రే తనయుడవుతాడనే (ఆత్మావై పుత్రనామాసి) సూక్తివల్ల, హనుమంతుణ్ని శివనందనుడుగా, శివావతారుడుగా కీర్తిస్తారు. శివుని పదకొండో అవతారమే హనుమంతుడని పరాశర సంహిత ధ్రువీకరించింది. త్రిపురాసుర సంహారంలో విష్ణువు పరమశివుడికి సహకరించినందుచేత రుద్రుడు కృతజ్ఞుడై హనుమంతుడిగా అవతరించి, రావణసంహారంలో విష్ణు అవతారుడైన శ్రీరాముడికి సహకరంచాడని ఈ సంహిత చెబుతోంది. ఉపకారం పొందిన లోకులు కృతజ్ఞతతో మెలగాలనేదే ఇక్కడి సందేశం. రాక్షస సంహారం కోసం విష్ణువు సూచనపై త్రిమూర్తుల తేజస్సును పరమశివుడు మింగుతాడు. ఆ శివవీర్యాన్ని పార్వతీదేవి భరించలేక అగ్నిదేవుడుకి ఇస్తుంది. అగ్ని కూడా భరించలేక వాయుదేవుడికి ఇస్తాడు. వాయువు ఆ శివవీర్యాన్ని ఒక పండుగా మలచి, పుత్రుడికొసం తప్పస్సు చేసే అంజనాదేవికి ఇస్తాడు. ఆ పండును అంజని తిన్న పహలితంగా ఆమె గర్భం దాల్చి, కాలక్రమంలో కుమారుణ్ని ప్రసవించింది. అతడే ఆంజనేయుడు. వాయుప్రసాది కావడంచేత వాయునందనుడనే పేరు కలిగిందని ఈ సంహిత వివరించింది. భగవదనుగ్రహం వల్లనే పుత్రుడు పుట్టడు కనుక కన్యత్వ దోషం లేదని ఆకాశవాణి ధైర్యాన్నిచ్చిందంటారు.

దేవలోకంలొని పుంజికస్థల అనే శ్రేష్ఠమైన అప్సరసకాంత బృహస్పతి శాపంవల్ల భూలోకంలో వానర ప్రభువైన కుంజరుని కుమార్తెగా జన్మించింది. ఆమే అంజనాదేవి; వానరరాజైన కేసరి భార్య అయింది – వాల్మీకి రామాయణం (కిషిందకాండ 66-8). కేసరి అడవులకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినపుడు, అంజనను వాయువుకు అప్పజెప్పాడు. అంజన అందానికి ఒకసారి వాయుదేవుడు మోహితుడై, ఆమెను కౌగలించుకొన్నాడు. తాను మనస్సు చేతనే ఆమెను అనుభవించాడు కనుక, ఏకపత్నీ వ్రతం భగ్నం కాలేదని ధైర్యం చెప్పి తేజస్వి – బలశాలి – బుద్ధిమంతుడు – పరాక్రమవంతుడు అయిన పుత్రుడు పుడతాడని అంజనిని తృప్తిపరచాడు – కి.కాం (66-16, 18,19) .

సంతసించిన అంజన ఒక గుహలో వైశాఖ బహుళ దశమినాడు బాలుణ్ని ప్రసవించింది. అతడే ఆంజనేయుడు. ఉదయించే సూర్యుణ్ని చూసిన ఆ బాలుడు దాన్ని తినే పండనుకొని ఆకాశంవైపు 300 యొజనాలు ఎగిరి సూర్యతేజస్సును ఆక్రమించుకొంటున్నాడు. అప్పుడు కోపగించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆంజనేయుణ్ని కొట్టాడు. ఆ దెబ్బకు ఆంజనేయుడు హనువు (గడ్డం) విరిగింది. అప్పటినుంచే అతనికి హనుమంతుడనే పేరు వచ్చింది – కి.కాం. (66-24). అలా కేసరికి క్షేత్రజ (భార్యకు ఇతరుల వల్ల పుట్టిన) పుత్రుడుగాను, వాయువుకు ఔరస (చట్ట బధ్ధమైన) పుత్రుడుగాను, శివవీర్యం వల్ల పుట్టినందుచేత శంకరసువనుడుగాను లోకప్రసిధ్ధమైన పేర్లు హనుమంతుడి జన్మ రహస్యాల్లోని పవిత్రతను వెల్లడిస్తున్నాయి. అలా హనుమంతుడి విశిష్ట జన్మ రామేశ్వరులను అనుసంధానించినట్లుగా రామేశ్వరం వద్ద భావిసేతు నిర్మాణానికి కూడా హేతువైంది.

🌹 🌹 🌹 🌹 🌹

16 Apr 2022

శ్రీ హనుమాన్ జయంతి విశిష్టత / How and When to Celebrate Hanuman Jayanti

🌹. శ్రీ హనుమాన్ జయంతి విశిష్టత / How and When to Celebrate Hanuman Jayanti 🌹

🍀. శ్రీ హనుమాన్‌ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు అందరికి Happy Hanuman Jayanthi (Hanuman Vijayothsav) to All 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ

హనుమజ్జయంతి ఏడాదిలో మూడుసార్లు వస్తుంది. ఎలా అంటే, ఒక్కో ప్రాంతవాసులు ఒక్కోసారి జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమినాడు హనుమాన్ జయంతి చేయగా, మరికొందరు వైశాఖమాసం దశమినాడు హనుమజ్జయంతి జరుపుతారు. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో హనుమజ్జయంతి జరుపుకుంటారు.

పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి , శనివారం జన్మించారని తెలిపారు... అదే రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకోవాలని చెబుతారు... అయితే కొన్ని ఐతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది.

ఈ కారణంగా ఆ రోజు హనుమద్‌ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మ తిథిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు...

చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని విజయోత్సవం దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో చాలా ఘనంగా జరుపుకుంటారు.. ఆంజనేయస్వామి వారి నిలువెత్తు విగ్రహం దగ్గర దగ్గరగా 60 అడుగుల శోభా యాత్రగా ఊరేగిస్తారు. చైత్ర పూర్ణిమ హనుమత్ విజయోత్సవం నుండి నుంచి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు, ఈ దీక్ష చివరి రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకుంటారు. ఈ 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి.. వైభవంగా పూజలు నిర్వహిస్తారు...

వాయుపుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించ గలడు. పర్వతాన్ని ఎత్తి, చేత్తో పట్టుకోగలడు. భూత ప్రేత పిశాచాల్లాంటి క్షుద్రశక్తులను తరిమికొట్టగలడు. శ్రీరాముని నమ్మినబంటు అయిన హనుమంతుడు బలానికి, ధైర్యానికి ప్రతిరూపం. హనుమంతుని ఆరాధించడంవల్ల ధైర్యం,స్థైర్యం కలుగుతాయి. భయాలూ భ్రమలూ పోతాయి. చింతలు, చిరాకులు తీరతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి, కీర్తిప్రతిష్టలు వస్తాయి. నిత్యం హనుమంతుని నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళనా దరిచేరదు. సదా ఆనందంగా ఉంటారు. ఇక హనుమజ్జయంతి విశేష దినాన మరింత భక్తిశ్రద్దలతో హనుమంతుని అర్చిస్తారు.

''కలౌ కపి వినాయకౌ : అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు వినాయకుడు, హనుమంతుడు.

🍀. హిందూమతంలో ప్రాముఖ్యత : 🍀

హనుమానంజనానూను: వాయుపుత్రోమహాబలః

రామేష్ఠ: ఫల్గుణసఖః పింగాక్షో: అమిత విక్రమః

ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః

లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా

ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః

స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః

తస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్

హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు, శ్రీరామదాసుడు, అర్జునుని సఖుడు, ఎఱ్ఱని కన్నులుగల వానరుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకాన్ని హరించినవాడు, ఔషధీ సమేతంగా ద్రోణాచలం మోసుకుని వచ్చిన యుద్ధంలో వివశుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వం అణచినవాడు. హనుమంతుని ఈ నామాలు నిద్రించడానికి ముందు, ప్రయాణానికి ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్రా విజయం లభిస్తుంది.

🍀. హనుమంతుని నైజం 🍀

యాత్ర యాత్ర రఘునాధ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్
బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్

శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను.

కేసరి, అంజనాదేవీల కుమారుడు శ్రీ హనుమంతుడు. ఏకాదశ (11) రుద్రులలో ఒకరు శ్రీ ఆంజనేయస్వామి. పరమశివును అంశతో జన్మించారు. సప్త(7) చిరంజీవులలో ఒకరు. ఆంజనేయస్వామి వారు హిమాలయాల్లో కైలాసమానస సరోవరం సమీపంలో రామ నామ జపం చేస్తూ ఈనాటికి జీవించి ఉన్నారు.

హనుమతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి. అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమర్పించండి. 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. 15 ఏప్రియల్, చైత్ర పౌర్ణిమ నుండి 23 మే, వైశాఖ బహుళ దశమి వరకు 40 రోజుల (మండలం) పాటు ప్రతిరోజు 1,3,5,11 లేక 41.....(మీకు వీలైనన్ని సార్లు)హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇలా చేయడం చాలా శుభకరం, అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. కొరిన కోరికలు నెరవేరుతాయి. హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. సంతానం కలగాలని కోరుకునే దంపతులు ఇద్దరు, ఈ 40(మండలం) రోజుల పాటు కఠిన బ్రహ్చర్యం పాటిస్తూ, నిష్ఠగా హనుమాన్ చాలీసా పారాయణ చేసి, రోజు స్వామికి పండ్లు తప్పనిసరిగా నివేదన చేసి, నైవేద్యంగా స్వీకరించడం వలన చక్కటి సంతానం హనుమ అనుగ్రహంతో కలిగి తీరుతుంది.

🌹 🌹 🌹 🌹 🌹

🌹 How and When to Celebrate Hanuman Jayanti 🌹

🍀 Happy Hanuman Jayanthi (Hanuman Vijayaothsav) to All 🍀

📚 Prasad Bharadwaj

Lord Hanuman, a dedicated disciple of the Hindu Lord Rama, is worshipped all over the India by the Hindu people for his deep devotion to the god Rama. People worship Lord Hanuman as a symbol of devotion, magical powers, strength and energy. People read Hanuman Chalisa as it has ability to conquer the evil spirits and provide peace to the mind. The devotees of Lord Hanuman visit Hanuman temples at this day after a holy in the early morning, apply red tilak (vermillion) to the foreheads of Hanuman idol, read Hanuman Chalisa, offer Prasad of laddoo, do Aarti by chanting mantras and Aarti songs, make round of the temple and so many rituals. As Lord Hanuman was born to the Vanara community having reddish orange color body, that’s why it is seen to all the Hanuman temples having reddish orange colored Hanuman idol. After puja, people apply red Sindur to their own foreheads as a Prasad and distribute laddoo Prasad among people to get blessed with what they have prayed to their God Hanuman.

In the Maharashtra, it is commemorated to the Purnima in the Hindu Lunar month of Chaitra. However, according to other Hindu calendar, it falls on 14th day (chaturdashi) of Ashvin month in the dark fortnight. After puja, Prasad is distributed among people to have full blessings.

In Tamil Nadu and Kerala, it is celebrated in Margazhi month (between December and January) in the belief that Lord Hanuman was born to the amavasya in the Margazhi month. In Odisha, it is celebrated on 1st day in the month of Baisakha (in April). In Karnataka and Andhra Pradesh, it is celebrated on 10th day of Vaishaka month in the Krishna Paksha. It is the 41 days long celebration in the Andhra Pradesh which starts from the Chaitra Purnima and ends at 10th days of the Krishna Paksha of Vaishakha month.

🍀 Significance of Hanuman Jayanti Celebration 🍀

Hanuman Jayanti celebration indicates the balanced coexistence of the whole human fraternity with the nature’s incredible creature, Lord Hanuman from Vanara community. People from the Hindu religion worship Lord Hanuman as a divine creature. This celebration has lots of importance to all however Brahmacharis, wrestlers and bodybuilders are specially inclined towards this celebration. There are many names through which Lord Hanuman is famous among his devotees like Bajrangabali, Pavanasuta, Pavankumar, Mahavira, Balibima, Marutsuta, Anjanisut, Sankat Mochan, Anjaneya, Maruti, Rudra and many more.

Hanuman avatar is considered as the 11th Rudra avatar of the Lord Siva with great devotion, strength, knowledge, divine power, bravery, intelligence, spirit for selfless service and etc. He has devoted his life only for his Lord Rama and Mata Sita and never shows his bravery and intelligence without any purpose. The devotees of the Lord Hanuman always pray him for getting blessed with the same for their bright future. He is worshipped in many ways by his devotees; some meditates by repeating his name many times to get power, fame, success and etc in the life whereas some reads the Hanuman Chalisa to get the same.

It is considered that Lord Shiva had to rebirth as a human being on the earth in his 11th Rudra avatar in the form of Hanuman as He could not serve to the Lord Rama by being in His real form.

The whole Vanara community including all the human fraternity was happy and celebrated his birthday with great enthusiasm and joy by dancing, singing and lots of activities. From then, it was started celebrating as a Hanuman Jayanti by his devotees to get strength and wisdom like him.

🍀 Hanuman Mantra: 🍀

Manojavam Maruttulyavegm
Jitendrium Buddhimatam Varishtham
Vatatmajam Vanarayuthmukhyam
Shri Ramdutam Sharanam Prapdye.

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

16 Apr 2022

16 - APRIL - 2022 శనివారం, హనుమాన్ జయంతి విజయోత్సవం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 16, శనివారం, ఏప్రిల్ 2022 స్థిర వాసరే 🌹
*🌹. శ్రీ హనుమాన్ జయంతి విశిష్టత / How and When to Celebrate Hanuman Jayanti 🌹*
*🍀. శ్రీ హనుమాన్‌ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు అందరికి Happy Hanuman Jayanthi (Hanuman Vijayothsav) to All 🍀*
*🌹. హనుమంతుని జన్మ వృత్తాంతము - పురాణ వర్ణన 🌹*
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 33-2 - 352 - కూడి యుండుట🌹 
3) 🌹. శివ మహా పురాణము - 550 / Siva Maha Purana - 550 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -179🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 169 / Osho Daily Meditations - 169 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 364-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 364-1🌹
🌹. మహాభారత యుద్ధం లో అస్త్రాలన్నీ మిస్సైల్సే! 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు మరియు శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*స్థిర వాసరే, 16, ఏప్రిల్‌ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : శ్రీ హనుమాన్‌ జయంతి, మదన పౌర్ణమి, Hanuman Jayanthi, Madana Purnima 🌻*

*🍀. శ్రీ హనుమ ధ్యాన స్తోత్రం 🍀*

*బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా|
అజాడ్యం వక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్||*

*ఎవరైతే హనుమంతున్ని నిత్యం ధ్యానిస్తారో వారు ఆరోగ్యం, ఐశ్వర్యం, బుద్ధి, బలం, ధైర్యం, పేరు ప్రఖ్యాతులు, ఙ్ఞానం, వాక్చాతుర్యం తప్పక 
పొందగలుగుతారు.*
🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : పరమాత్మ మినహా మరెవరిని చింతన చేయకపోవడమే హవనము. ప్రతీ సాధకుడు ఈ హవనము చేయుట నేర్చుకోవాలి. - సద్గురు శ్రీరామశర్మ 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2079 రక్ష
శఖ : 1944, శుభకృత్‌ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
చైత్ర మాసం
తిథి: పూర్ణిమ 24:25:24 వరకు
తదుపరి కృష్ణ పాడ్యమి
నక్షత్రం: హస్త 08:40:08 వరకు
తదుపరి చిత్ర
 యోగం: హర్షణ 26:45:44 వరకు
తదుపరి వజ్ర
కరణం: విష్టి 13:25:20 వరకు
వర్జ్యం: 16:12:20 - 17:42:48
దుర్ముహూర్తం: 07:40:01 - 08:30:12
రాహు కాలం: 09:07:50 - 10:41:56
గుళిక కాలం: 05:59:40 - 07:33:45
యమ గండం: 13:50:06 - 15:24:12
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:41
అమృత కాలం: 02:54:00 - 04:26:16
మరియు 25:15:08 - 26:45:36
సూర్యోదయం: 05:59:40
సూర్యాస్తమయం: 18:32:23
చంద్రోదయం: 18:15:47
చంద్రాస్తమయం: 05:37:40
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: కన్య
మృత్యు యోగం - మృత్యు భయం
08:40:08 వరకు తదుపరి కాల యోగం
- అవమానం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ హనుమాన్ జయంతి విశిష్టత / How and When to Celebrate Hanuman Jayanti 🌹*
*🍀. శ్రీ హనుమాన్‌ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు అందరికి Happy Hanuman Jayanthi (Hanuman Vijayothsav) to All 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*హనుమజ్జయంతి ఏడాదిలో మూడుసార్లు వస్తుంది. ఎలా అంటే, ఒక్కో ప్రాంతవాసులు ఒక్కోసారి జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమినాడు హనుమాన్ జయంతి చేయగా, మరికొందరు వైశాఖమాసం దశమినాడు హనుమజ్జయంతి జరుపుతారు. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో హనుమజ్జయంతి జరుపుకుంటారు.*

*పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి , శనివారం జన్మించారని తెలిపారు... అదే రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకోవాలని చెబుతారు... అయితే కొన్ని ఐతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. 
ఈ కారణంగా ఆ రోజు హనుమద్‌ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మ తిథిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు...*
 
*చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని విజయోత్సవం దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో చాలా ఘనంగా జరుపుకుంటారు.. ఆంజనేయస్వామి వారి నిలువెత్తు విగ్రహం దగ్గర దగ్గరగా 60 అడుగుల శోభా యాత్రగా ఊరేగిస్తారు. చైత్ర పూర్ణిమ హనుమత్ విజయోత్సవం నుండి నుంచి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు, ఈ దీక్ష చివరి రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకుంటారు. ఈ 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి.. వైభవంగా పూజలు నిర్వహిస్తారు...*

*వాయుపుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించ గలడు. పర్వతాన్ని ఎత్తి, చేత్తో పట్టుకోగలడు. భూత ప్రేత పిశాచాల్లాంటి క్షుద్రశక్తులను తరిమికొట్టగలడు. శ్రీరాముని నమ్మినబంటు అయిన హనుమంతుడు బలానికి, ధైర్యానికి ప్రతిరూపం. హనుమంతుని ఆరాధించడంవల్ల ధైర్యం,స్థైర్యం కలుగుతాయి. భయాలూ భ్రమలూ పోతాయి. చింతలు, చిరాకులు తీరతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి, కీర్తిప్రతిష్టలు వస్తాయి. నిత్యం హనుమంతుని నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళనా దరిచేరదు. సదా ఆనందంగా ఉంటారు. ఇక హనుమజ్జయంతి విశేష దినాన మరింత భక్తిశ్రద్దలతో హనుమంతుని అర్చిస్తారు.*

*''కలౌ కపి వినాయకౌ : అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు వినాయకుడు, హనుమంతుడు.*

*🍀. హిందూమతంలో ప్రాముఖ్యత : 🍀*

*హనుమానంజనానూను: వాయుపుత్రోమహాబలః*
*రామేష్ఠ: ఫల్గుణసఖః పింగాక్షో: అమిత విక్రమః*
*ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః*
*లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా*
*ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః*
*స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః*
*తస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్*

*హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు, శ్రీరామదాసుడు, అర్జునుని సఖుడు, ఎఱ్ఱని కన్నులుగల వానరుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకాన్ని హరించినవాడు, ఔషధీ సమేతంగా ద్రోణాచలం మోసుకుని వచ్చిన యుద్ధంలో వివశుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వం అణచినవాడు. హనుమంతుని ఈ నామాలు నిద్రించడానికి ముందు, ప్రయాణానికి ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్రా విజయం లభిస్తుంది.*

*🍀. హనుమంతుని నైజం 🍀*

*యాత్ర యాత్ర రఘునాధ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్*
*బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్*

*శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను.*

*కేసరి, అంజనాదేవీల కుమారుడు శ్రీ హనుమంతుడు. ఏకాదశ (11) రుద్రులలో ఒకరు శ్రీ ఆంజనేయస్వామి. పరమశివును అంశతో జన్మించారు. సప్త(7) చిరంజీవులలో ఒకరు. ఆంజనేయస్వామి వారు హిమాలయాల్లో కైలాసమానస సరోవరం సమీపంలో రామ నామ జపం చేస్తూ ఈనాటికి జీవించి ఉన్నారు.*

*హనుమతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి. అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమర్పించండి. 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. 15 ఏప్రియల్, చైత్ర పౌర్ణిమ నుండి 23 మే, వైశాఖ బహుళ దశమి వరకు 40 రోజుల (మండలం) పాటు ప్రతిరోజు 1,3,5,11 లేక 41.....(మీకు వీలైనన్ని సార్లు)హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇలా చేయడం చాలా శుభకరం, అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. కొరిన కోరికలు నెరవేరుతాయి. హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. సంతానం కలగాలని కోరుకునే దంపతులు ఇద్దరు, ఈ 40(మండలం) రోజుల పాటు కఠిన బ్రహ్చర్యం పాటిస్తూ, నిష్ఠగా హనుమాన్ చాలీసా పారాయణ చేసి, రోజు స్వామికి పండ్లు తప్పనిసరిగా నివేదన చేసి, నైవేద్యంగా స్వీకరించడం వలన చక్కటి సంతానం హనుమ అనుగ్రహంతో కలిగి తీరుతుంది.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 How and When to Celebrate Hanuman Jayanti 🌹*
*🍀 Happy Hanuman Jayanthi (Hanuman Vijayaothsav) to All 🍀*
*📚 Prasad Bharadwaj*

*Lord Hanuman, a dedicated disciple of the Hindu Lord Rama, is worshipped all over the India by the Hindu people for his deep devotion to the god Rama. People worship Lord Hanuman as a symbol of devotion, magical powers, strength and energy. People read Hanuman Chalisa as it has ability to conquer the evil spirits and provide peace to the mind. The devotees of Lord Hanuman visit Hanuman temples at this day after a holy in the early morning, apply red tilak (vermillion) to the foreheads of Hanuman idol, read Hanuman Chalisa, offer Prasad of laddoo, do Aarti by chanting mantras and Aarti songs, make round of the temple and so many rituals. As Lord Hanuman was born to the Vanara community having reddish orange color body, that’s why it is seen to all the Hanuman temples having reddish orange colored Hanuman idol. After puja, people apply red Sindur to their own foreheads as a Prasad and distribute laddoo Prasad among people to get blessed with what they have prayed to their God Hanuman.*

*In the Maharashtra, it is commemorated to the Purnima in the Hindu Lunar month of Chaitra. However, according to other Hindu calendar, it falls on 14th day (chaturdashi) of Ashvin month in the dark fortnight. After puja, Prasad is distributed among people to have full blessings.*

*In Tamil Nadu and Kerala, it is celebrated in Margazhi month (between December and January) in the belief that Lord Hanuman was born to the amavasya in the Margazhi month. In Odisha, it is celebrated on 1st day in the month of Baisakha (in April). In Karnataka and Andhra Pradesh, it is celebrated on 10th day of Vaishaka month in the Krishna Paksha. It is the 41 days long celebration in the Andhra Pradesh which starts from the Chaitra Purnima and ends at 10th days of the Krishna Paksha of Vaishakha month.*

*🍀 Significance of Hanuman Jayanti Celebration 🍀*

*Hanuman Jayanti celebration indicates the balanced coexistence of the whole human fraternity with the nature’s incredible creature, Lord Hanuman from Vanara community. People from the Hindu religion worship Lord Hanuman as a divine creature. This celebration has lots of importance to all however Brahmacharis, wrestlers and bodybuilders are specially inclined towards this celebration. There are many names through which Lord Hanuman is famous among his devotees like Bajrangabali, Pavanasuta, Pavankumar, Mahavira, Balibima, Marutsuta, Anjanisut, Sankat Mochan, Anjaneya, Maruti, Rudra and many more.*

*Hanuman avatar is considered as the 11th Rudra avatar of the Lord Siva with great devotion, strength, knowledge, divine power, bravery, intelligence, spirit for selfless service and etc. He has devoted his life only for his Lord Rama and Mata Sita and never shows his bravery and intelligence without any purpose. The devotees of the Lord Hanuman always pray him for getting blessed with the same for their bright future. He is worshipped in many ways by his devotees; some meditates by repeating his name many times to get power, fame, success and etc in the life whereas some reads the Hanuman Chalisa to get the same.*

*It is considered that Lord Shiva had to rebirth as a human being on the earth in his 11th Rudra avatar in the form of Hanuman as He could not serve to the Lord Rama by being in His real form.*

*The whole Vanara community including all the human fraternity was happy and celebrated his birthday with great enthusiasm and joy by dancing, singing and lots of activities. From then, it was started celebrating as a Hanuman Jayanti by his devotees to get strength and wisdom like him.*

*🍀 Hanuman Mantra: 🍀*

*Manojavam Maruttulyavegm*
*Jitendrium Buddhimatam Varishtham*
*Vatatmajam Vanarayuthmukhyam*
*Shri Ramdutam Sharanam Prapdye.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. హనుమంతుని జన్మ వృత్తాంతము - పురాణ వర్ణన 🌹*
📚. ప్రసాద్‌ భరధ్వాజ

*శ్రీ హనుమాన్‌ జయంతి పర్వదిన సందర్భంగా ....*

*భక్తులెందరో హనుమంతున్ని ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాహలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం, రామాయణం, పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడివడి ఉంది. రామకార్యంలో సహాయపడాలనే ఉద్దేశంతో శివుడు తన వీర్యాన్ని స్థలనం చేశాడు. దాన్ని సప్తర్షులు సాదరంగా పొందుపరచి, గౌతముడి కూతురైన అంజనాదేవిలో చెవిద్వారా ప్రవేశపెట్టారు. ఫలితంగా శంభుడు మహాబల పరాక్రమాలగల వానరదేహంతో ఆమెకు జనించాడని (శంభుర్జజ్ఞే కపి తనుర్మహాబల పరాక్రమ:) శివమహాపురాణం (శతరుద్ర సమ్హిత 20-7) తెలిపింది. అలా హరాంశతో పుట్టిన హనుమంతుడే రుద్రావతార భగవానుడుగా శ.రు.సం. (20-14, 37) స్పష్టం చేసింది.*

*అంతేకాదు, హనుమంతుణ్ని శివసుతుడుగా (మహాదేవత్మజ:) కూడా శ.రు.సం (20-32) వర్ణించింది. తండ్రే తనయుడవుతాడనే (ఆత్మావై పుత్రనామాసి) సూక్తివల్ల, హనుమంతుణ్ని శివనందనుడుగా, శివావతారుడుగా కీర్తిస్తారు. శివుని పదకొండో అవతారమే హనుమంతుడని పరాశర సంహిత ధ్రువీకరించింది. త్రిపురాసుర సంహారంలో విష్ణువు పరమశివుడికి సహకరించినందుచేత రుద్రుడు కృతజ్ఞుడై హనుమంతుడిగా అవతరించి, రావణసంహారంలో విష్ణు అవతారుడైన శ్రీరాముడికి సహకరంచాడని ఈ సంహిత చెబుతోంది. ఉపకారం పొందిన లోకులు కృతజ్ఞతతో మెలగాలనేదే ఇక్కడి సందేశం. రాక్షస సంహారం కోసం విష్ణువు సూచనపై త్రిమూర్తుల తేజస్సును పరమశివుడు మింగుతాడు. ఆ శివవీర్యాన్ని పార్వతీదేవి భరించలేక అగ్నిదేవుడుకి ఇస్తుంది. అగ్ని కూడా భరించలేక వాయుదేవుడికి ఇస్తాడు. వాయువు ఆ శివవీర్యాన్ని ఒక పండుగా మలచి, పుత్రుడికొసం తప్పస్సు చేసే అంజనాదేవికి ఇస్తాడు. ఆ పండును అంజని తిన్న పహలితంగా ఆమె గర్భం దాల్చి, కాలక్రమంలో కుమారుణ్ని ప్రసవించింది. అతడే ఆంజనేయుడు. వాయుప్రసాది కావడంచేత వాయునందనుడనే పేరు కలిగిందని ఈ సంహిత వివరించింది. భగవదనుగ్రహం వల్లనే పుత్రుడు పుట్టడు కనుక కన్యత్వ దోషం లేదని ఆకాశవాణి ధైర్యాన్నిచ్చిందంటారు.*

*దేవలోకంలొని పుంజికస్థల అనే శ్రేష్ఠమైన అప్సరసకాంత బృహస్పతి శాపంవల్ల భూలోకంలో వానర ప్రభువైన కుంజరుని కుమార్తెగా జన్మించింది. ఆమే అంజనాదేవి; వానరరాజైన కేసరి భార్య అయింది – వాల్మీకి రామాయణం (కిషిందకాండ 66-8). కేసరి అడవులకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినపుడు, అంజనను వాయువుకు అప్పజెప్పాడు. అంజన అందానికి ఒకసారి వాయుదేవుడు మోహితుడై, ఆమెను కౌగలించుకొన్నాడు. తాను మనస్సు చేతనే ఆమెను అనుభవించాడు కనుక, ఏకపత్నీ వ్రతం భగ్నం కాలేదని ధైర్యం చెప్పి తేజస్వి – బలశాలి – బుద్ధిమంతుడు – పరాక్రమవంతుడు అయిన పుత్రుడు పుడతాడని అంజనిని తృప్తిపరచాడు – కి.కాం (66-16, 18,19) .*

*సంతసించిన అంజన ఒక గుహలో వైశాఖ బహుళ దశమినాడు బాలుణ్ని ప్రసవించింది. అతడే ఆంజనేయుడు. ఉదయించే సూర్యుణ్ని చూసిన ఆ బాలుడు దాన్ని తినే పండనుకొని ఆకాశంవైపు 300 యొజనాలు ఎగిరి సూర్యతేజస్సును ఆక్రమించుకొంటున్నాడు. అప్పుడు కోపగించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆంజనేయుణ్ని కొట్టాడు. ఆ దెబ్బకు ఆంజనేయుడు హనువు (గడ్డం) విరిగింది. అప్పటినుంచే అతనికి హనుమంతుడనే పేరు వచ్చింది – కి.కాం. (66-24). అలా కేసరికి క్షేత్రజ (భార్యకు ఇతరుల వల్ల పుట్టిన) పుత్రుడుగాను, వాయువుకు ఔరస (చట్ట బధ్ధమైన) పుత్రుడుగాను, శివవీర్యం వల్ల పుట్టినందుచేత శంకరసువనుడుగాను లోకప్రసిధ్ధమైన పేర్లు హనుమంతుడి జన్మ రహస్యాల్లోని పవిత్రతను వెల్లడిస్తున్నాయి. అలా హనుమంతుడి విశిష్ట జన్మ రామేశ్వరులను అనుసంధానించినట్లుగా రామేశ్వరం వద్ద భావిసేతు నిర్మాణానికి కూడా హేతువైంది.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -352 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 33 📚*
 
*🍀 33-2. కూడి యుండుట - సమ వర్తనము దుర్లభము. బ్రాహ్మణ క్షత్రియులకు అసహనము, అగ్రహము పిలవని పేరంటముగ పొటమరించు చుండును. జ్ఞానబలము చేత, అధికార బలము చేత వీరు పరిసరముల యందున్న దైవమును విశ్వసింతురు. తోటి జీవులను నిరసించుట, నిందించుట, మాటలతో బాధ పెట్టుట, తమవారి కష్టనష్టములను గుర్తింపకుండుట వీరి యందలి బలహీనత. సమాన ధర్మము వీరికి పరీక్ష వంటిది. జ్ఞానులగు బ్రాహ్మణ క్షత్రియుల కన్న పామరులగు ఇతర భక్తులే దైవమునకు చేరువైనారు. 🍀*

*కిం పునరాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా |*
*అనిత్య మసుఖం లోక మిమం ప్రాప్య భజస్వ మామ్ || 33*

*తాత్పర్యము : అన్ని జాతులవారును అనన్యభక్తి మార్గమున నన్ను పొందగలిగినపుడు పుణ్యాత్ములగు బ్రాహ్మణులు, భక్తులగు రాజర్షులు కూడ నన్ను పొందగలరని వేరుగ చెప్పనవసరము లేదు గదా! ఈ లోక మనిత్యము. ఇందు సుఖము లేదు. కావున నన్ను సేవించుచు ఆనందము పొందుము.*

*వివరణము : జీవుల సేవ చేయుచున్నను వారి యందలి దైవమును దర్శింప లేకపోవుట వలన సేవ చేయుచున్నామను అహంకారము తెలియకయే పెరుగుచుండును. జ్ఞానబలము చేత, అధికార బలము చేత వీరు పరిసరముల యందున్న దైవమును విశ్వసింతురు. దైవము పేరనే దశాబ్దముల తరబడి కార్యములు చేయుచున్నను వీరు నిరహంకారులగుట అంత సులభము కాదు. తోటి జీవులను నిరసించుట, నిందించుట, మాటలతో బాధ పెట్టుట, తమవారి కష్టనష్టములను గుర్తింపకుండుట వీరి యందలి బలహీనత. సమాన ధర్మము వీరికి పరీక్ష వంటిది.*

*సమ వర్తనము దుర్లభము. అసహనము, అగ్రహము పిలవని పేరంట ముగ పొటమరించు చుండును. కనుక వీరిరువురిని గూర్చి దైవము ప్రత్యేకముగా పలికినాడేమో! గోపికలకు, గోపబాలకులకు దర్శనమైన రీతిలో బ్రాహ్మణ క్షత్రియులకు కృష్ణ దర్శనము కాలేదు. ఇది ప్రత్యక్షముగ శ్రీకృష్ణుని జీవితమున చూడవచ్చును. జ్ఞానులగు బ్రాహ్మణ క్షత్రియుల కన్న పామరులగు ఇతర భక్తులే దైవమునకు చేరువైనారు. సంఘమున అధికారము గల వారికి అహంకారమను క్రీనీడ పనిచేయును. వారు ఎప్పటి కప్పుడు అహంకారమును తొలగించు కొనుచు నుండ వలెను. ఇతరులకీ సమస్య తక్కువ. కాని వీరు కూడ సర్వాత్మకుడగు దైవము నుండి ఏర్పడిన వారే కనుక, వీరును దైవమును తప్పక చేరగలరు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 550 / Sri Siva Maha Purana - 550 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 50 🌴*

*🌻. పరిహాసములు - 5 🌻*

శతరూప ఇట్లనెను-

ఆకలి గొన్న వానికి మృష్టాన్నమును భుజించనిదే ఆకలి తీరదు. ఓ శంభూ! ఏ కార్యము చే స్త్రీకి తృప్తి కలుగునో, ఆ పనిని చేయుట నీకు తగును (40).

సంజ్ఞ ఇట్లు పలికెను -

ఓసీ శతరూపా! నిర్జన స్థానములో తల్పమును ఏర్పాటు చేసి రత్న దీపమునమర్చి తాంబూలము నుంచి పార్వతీ పరమేశ్వరులను ప్రేమతో అచటకు వెంటనే పంపుము (41).

బ్రహ్మ ఇట్లు పలికెను-

స్త్రీల ఆ మాటలను విని వికారములు లేనివాడు, యోగివరుల గురువులకు గురువు అగు శివుడు వారితో స్వయముగా నిట్లనెను (42).

శంకరుడిట్లు పలికెను -

ఓ దేవీ మూర్తులారా! నా వద్ద ఇట్టి వచనములను పలుకకుడు. జగన్మాతలు, పతివ్రతలు అగు మీరు పుత్రుని విషయములో చాపల్యమునేల కలిగి యున్నారు? (43)

బ్రహ్మ ఇట్లు పలికెను-

శంకరుని మాటవిని సిగ్గుపడిన ఆ దేవతా స్త్రీలు కంగారుపడి చిత్రమునందలి స్త్రీ మూర్తులవలె ఉలుకు పలుకు లేక ఉండిరి (44). మహేశ్వరుడు మృష్టన్నమును భుజించి ఆచమనము చేసి ఆనందముతో కూడిన మనస్సు గలవాడై భార్యతో కలసి కర్పూర తాంబూలమును సేవించెను 45).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో పరిహాసవర్ణనమనే ఏ బదియవ అధ్యాయము ముగిసినది (50).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 550 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 50 🌴*

*🌻 Description of fun and frolic - 5 🌻*

Śatarūpā said:—
40. A hungry person will not be satisfied until he partakes of a sweet hearty meal. O Śiva do everything whereby the woman will be satiated.

Saṃjñā said:—
41. Now please send off Śiva along with Pārvatī to a secluded spot after making the bed, giving them betal and keeping the gem-bedecked lamp ready near by.

Brahmā said:—
42. On hearing these words of the women, lord Śiva, who was free from aberrations and was the supreme preceptor of great Yogins spoke to them.

Śiva said:—
43. O dignified ladies, do not utter such words to me. You are the chaste mothers of the worlds, how do you speak so trivially in regard to your son?

Brahmā said:—
44. On hearing the words of Śiva, the celestial ladies were ashamed. In their excitement they became motionless like dolls in a picture.

45. Eating the sweets and performing Ācamana lord Śiva was much delighted. In the company of His wife He chewed the betal with camphor.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 169 / Osho Daily Meditations - 169 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 169. గ్రంథాలు 🍀*

*🕉. మనకి చాలా గొప్పవైన అనేక తత్వశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. కానీ అవి మూర్ఖులను ఆక్రమించు కోవడానికి మాత్రమే ఉన్నాయి; అవి నిజమైన అన్వేషకుడి కోసం కాదు. 🕉*
 
*నేను చెప్పేది పూర్తిగా సజీవంగా, కొత్తగా, తాజాగా మరియు యవ్వనంగా ఉంది. ఇది సాంప్రదాయం కాదు. ఇది పూర్తిగా భిన్నమైన దృగ్విషయం. ఇది ఇలానే వుండాలి. ఎందుకంటే మూడు వేల సంవత్సరాల క్రితం వ్రాయబడిన గ్రంథాలు ఎవరి కోసం వ్రాయబడ్డాయో వారి కోసం ఉద్దేశించబడ్డాయి. ఆ మనస్తత్వశాస్త్రం ప్రపంచంలో ఇప్పుడు పనిచేయదు. నేను సజీవంగా మీకు ప్రతిస్పందిస్తున్నాను; ఆ గ్రంథాలు వారి ప్రజలకు ప్రతిస్పందించాయి. ఆ గ్రంథాలు మీ కోసం వ్రాయబడలేదు. మీకు మరియు ఆ గ్రంథాలకు మధ్య మూడు, నాలుగు, ఐదు వేల సంవత్సరాల అంతరం ఉంది. అవి పూర్తిగా అసంబద్ధం. వారిపై ఆధారపడటం అంటే న్యూటన్ వద్ద ఆగిపోయి భౌతిక శాస్త్రాన్ని అభ్యసించే వ్యక్తి మరియు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ను ఎప్పటికీ పొందలేనంత అసంబద్ధం.*

*కానీ గ్రంథాలు జీవించి ఉన్న ప్రజలకు ప్రతిస్పందించ లేవు; అవి పెరగవు. అందుకే పాత రోజుల్లో చాలా మంది మాస్టార్లు తమ సూక్తులను రాసుకోవద్దని, తద్వారా అవి పెరుగుతూనే ఉంటాయని పట్టుబట్టారు. గురువులు తమ సందేశాన్ని తమ శిష్యులకు అందిస్తారు, శిష్యులు వేరే ప్రపంచంలో జీవిస్తారు. గురువులు పోయారు మరియు శిష్యులు తమ స్వంత హక్కులో ఇతరులకు ఏదో బోధించేవారు. వారు చాలా మార్పులు చేస్తారు, ఎందుకంటే ప్రజలు మారారు, పరిస్థితులు మారాయి. కానీ ఒకరు ఒక పుస్తకాన్ని వ్రాసిన తర్వాత అది స్థిరమవుతుంది; అది స్తంభింప జేస్తుంది. దానిని ఎవరూ మార్చలేరు. ఒకవేళ ఎవరైనా అలా చేయడానికి ప్రయత్నం చేస్తే, ఆ పుస్తకాన్ని అనుసరించే వారికి చాలా కోపం కూడా వస్తుంది.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 169 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 169. SCRIPTURES 🍀*

*🕉 There are many scriptures, and much great philosophy,but they are all rubbish! They exist just to let the foolish people get occupied; they are not for the real seeker. 🕉*
 
*What I am saying is absolutely alive, new, fresh, and young. It: is not traditional at all, it is a totally different phenomenon-it has to be. Because scriptures that were written three thousand years ago were meant for the people for whom it was written. That psychology no longer functions in the world. I am responding to you; those scriptures responded to their people. Those scriptures were not written for you. There is a gap of three, four, five thousand yearsbetween you and those scriptures. They are utterly irrelevant. Relying on them would be as absurd as somebody who studies physics stopping at Newton and never getting to Albert Einstein.*

*But scriptures can't respond to living people; they can't grow. That's why in the old days many masters insisted that their sayings should not be written down, so that they could keep on growing. The masters would give their message to their disciples, and the disciples would live in a different world. The masters would be gone, and the disciples would be teaching something to other people in their own right. They would make many changes, because the people have changed, situations have changed. But once you write a book it becomes fixed; it becomes frozen. Nobody can change it, and if somebody does, then the followers of the book will become very angry.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 364-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 364-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 80. చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ ।*
*స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥ 🍀*

*🌻 364-1. 'చిదేక రసరూపిణీ' 🌻* 

*చైతన్యముతో కూడిన ఆనందరస రూపము శ్రీమాత అని అర్థము. శ్రీమాత చైతన్యరూపిణి అనునది విదితమే. సృష్టి చైతన్యమే శ్రీమాత. చైతన్యము నుండియే సమస్తము భాసించును. ప్రజాపతులు, రుద్రులు, ఆదిత్యులు, సనకసనందనాది బ్రహ్మ మానస పుత్రులు, మానవులు, సప్తఋషులు, దేవతలు, లోకములు, లోకస్థులు, సమస్తము శ్రీదేవి మహాచైతన్యము నుండి ఏర్పడినవే. చైతన్యము నందు సహజముగ భాసించునవి యోగము, ధర్మము, ఆనందము. శ్రీమాత యోగిని, ఆమె సృష్టి కావల బ్రహ్మముతో యోగము చెంది యుండును.*

*సృష్టి కీవల ఈశ్వరునితో యోగము చెంది యుండును. ఎట్లైనను, తాదాత్మ్యము చెందియే యుండును. బ్రహ్మము నుండి వేరై బ్రహ్మముతో కూడి యుండుట ఒక దివ్యమగు అనుభూతి. కూడియుండుట వలన ఆనందానుభవము వుండును. రసానుభూతి యుండును. ఏకమై యున్నచో యుండుటయే యుండును గాని అనుభూతి యుండదు. అనుభూతి పరాకాష్ఠకు చేరినపుడు రసానుభూతి యుండును. మనము మధురమగు పదార్థమును భుజించి నపుడు మధురానుభూతి యుండును. అది యోగము. మనమే మధురమైన పదార్థమైపోయిన అనుభూతి యుండదు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 364-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 80. Chiti statpada lakshyardha chidekarasa rupini*
*Svatyananda lavibhuta bramha dyananda santatih ॥ 80 ॥ 🌻*

*🌻 364-1. Cideka-rasa-rūpiṇī चिदेक-रस-रूपिणी 🌻*

*She is the essence of knowledge. The difference between knowledge and the essence of knowledge is to be understood. The knowledge of the unconditioned Brahman or the Prakāśa form of the Brahman is different from the conditioned Brahman or the vimarśa form of the Brahman.*

*The Brahman with attributes and without attributes remains the same, so also their purity of knowledge. This is the reason for establishing the identity of the both as one.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మహాభారత యుద్ధం లో అస్త్రాలన్నీ మిస్సైల్సే! 🌹*