Showing posts with label నిర్మల ధ్యానాలు - ఓషో. Show all posts
Showing posts with label నిర్మల ధ్యానాలు - ఓషో. Show all posts

నిర్మల ధ్యానాలు - ఓషో - 387


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 387 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ఇదే చివరి క్షణమన్నట్లు వుండు. వ్యక్తి ఈ రకంగా జీవించాలి. ప్రతి సందర్భమూ చివరిదిగా వుండాలి. ఏ క్షణానికాక్షణం జీవించు. క్షణక్షణం జీవించు. 🍀

జీవితం ఒక్కటే దేవుడు. వ్యక్తి దాంట్లో జీవించాలి. గాఢంగా జీవించాలి. అనురాగభరితంగా, ఆర్ద్రంగా, హృదయపూర్వకంగా జీవించాలి. వానపాము లాగా కాదు. రెండు వైపులా మంట వున్న కాగడాలా జీవించాలి. అప్పుడు అనంత శాశ్వతత్వం కన్నా ఒక్క క్షణం కూడా అద్భుతమైనది అవుతుంది. ఏ క్షణానికాక్షణం జీవించు. క్షణక్షణం జీవించు. దేన్నీ వెనకనున్న దేన్నీ ఆధారంగా పట్టుకోకు. యిప్పుడు యిక్కడ నిలబడు. ఇదే చివరి క్షణమన్నట్లు వుండు. వ్యక్తి ఈ రకంగా జీవించాలి. ప్రతి సందర్భమూ చివరిదిగా వుండాలి. అన్యమనస్కంగా, అంటీ ముట్టనట్లు ఎందుకుండాలి? నువ్వు యింకో క్షణం వుండకపోవచ్చు.

కాబట్టి యీ క్షణాన్ని పట్టుకో. యింకో క్షణం సంగతి నీకెందుకు? జీవించే విధానమిది. నువ్వు ఫలితం గురించి పట్టించుకోకుంటే పద్మానివి. మాటిమాటికీ పద్మాన్ని మననం చేయాలి. వర్తమానం లోలోతుల్లోకి వెళ్ళు. యిప్పుడు యిక్కడ నిలబడాలి. కాని అనుబంధం లేకుండా వుండాలి. అతుక్కుపోకుండా వుండాలి. తాకకుండా వుండాలి. భవిష్యత్తు లేదు. అందువల్ల సంపూర్ణంగా జీవిస్తావు. గతం లేదు అందువల్ల అనుబంధముండదు. ఒకసారి అది జరిగితే జీవితం ఆనందం, అంతులేని ఆనందం శాశ్వతపరమానందం!


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


నిర్మల ధ్యానాలు - ఓషో - 386


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 386 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనిషి స్వేచ్ఛతో ఎట్లాంటి తలరాత లేకుండా భూమికి వచ్చాడు. ఎట్లా ప్రవర్తించాలన్నది నీ చేతిలో వుంది. నీ జీవన గమనాన్ని ప్రతి అడుగులో నువ్వు మార్చుకోవచ్చు. 🍀


మనిషి కాలంలోనో లేదా శాశత్వంలోనో జీవిస్తాడు. రెండు ప్రత్యామ్నాయాలూ వున్నాయి. ఏదీ విధి కాదు. తల రాత కాదు. మనిషి స్వేచ్ఛతో ఎట్లాంటి తలరాత లేకుండా భూమికి వచ్చాడు. భవిష్యత్తులో బహిరంగంగా ఎట్లా ప్రవర్తించాలన్నది నీ చేతిలో వుంది. నీ జీవన గమనాన్ని ప్రతి అడుగులో నువ్వు మార్చుకోవచ్చు. కోట్ల మంది కాలంలో జీవిస్తూ వుంటారు. కారణం వాళ్ళు గుంపులో పుట్టారు. వాళ్ళకు శాశ్వతత్వం గురించి ఏమీ తెలీదు. వాళ్ళ తల్లిదండ్రులు, గురువులు, నాయకులు అందరూ కాలంలో జీవించారు. వాళ్ళ చుట్టూ వున్న సమస్త ప్రపంచం కాలంలో వుంది. జీవన్మరణాల మధ్య వుంది.

అందువల్ల ప్రతి పసివాడూ అనుకరిస్తాడు. అందువల్లే ప్రతి బిడ్డా నేర్చుకుంటాడు. అందువల్లే నిబద్ధింప బడతాడు. అందరూ కాలాన్ని భూత, వర్తమాన, భవిష్యత్తులుగా చెబుతారు. అది పూర్తిగా తప్పు. కాలానికి గతం, భవిష్యత్తు మాత్రమే వున్నాయి. వర్తమానంలో శాశ్వతత్వముంది. వర్తమానం కాలానికి సంబంధించదు. అది రూపాంతరం. వర్తమానంలో జీవించడమంటే కాలాన్ని దాటి జీవించడం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


నిర్మల ధ్యానాలు - ఓషో - 385


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 385 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. పద్మాన్ని చూస్తే యిది మురికి నిండిన బురద నుండి పుట్టిందా? అనిపిస్తుంది. జీవితం ఒక నిచ్చెన. దేన్నీ కాదనకు. చివరికి మురికి బురదను కూడా. ప్రతి దాన్నీ పద్మంగా పరివర్తింప జేయాలి. 🍀

పద్మం గొప్ప ప్రతీక. అది బురద నించీ వస్తుంది. ప్రపంచంలోకెల్లా అందమైన పువ్వు. మురికి బురద నించీ వచ్చింది. ప్రార్థన లైంగికత నించీ, ఆత్మ శరీరం నించీ వస్తుంది. శరీరం మట్టి, దైవత్వం ప్రపంచం నించీ వస్తుంది. ఉపరితలంలో అది అసాధ్యమనిపిస్తుంది. బురదను చూస్తే యిది నిజంగా జరిగిందా? అనిపిస్తుంది.

పద్మాన్ని చూస్తే యిది మురికి నిండిన బురద నుండి పుట్టిందా? అనిపిస్తుంది. కానీ ఆ పద్మ జననం జరిగిన విధమది. అత్యల్పమైన దానితో అత్యుత్తమైన దానికి ఉన్న సంబంధమది. ప్రతి దానికీ సంబంధముంది. జీవితం ఒక నిచ్చెన. అదే నా ప్రాథమిక బోధన. దేన్నీ కాదనకు. చివరికి మురికి బురదను కూడా. ప్రతి దాన్నీ పద్మంగా పరివర్తింప జేయాలి.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


నిర్మల ధ్యానాలు - ఓషో - 384


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 384 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ


🍀. ఆట, పాట, ప్రేమ, సృజన, ఉత్సాహం, నువ్వు యివన్నీ పవిత్రతకు వ్యతిరేకం కావు. అవి సృష్టిలోని సహజభాగాలు. ప్రపంచానికి, పవిత్రమైన దానికి తేడా లేదు. 🍀



నిజమైన మతమున్న మనిషి భూమిపై నిలబడతాడు. నిలబడాలి. లేకపోతే అతనికి పునాదులుండవు. అందువల్లే నేను భూమిలో నిలదొక్కుకోవడం గురించే చెబుతాను. భూమిలో పునాదులుంటేనే ఆకాశంలోకి ఎదిగే వీలుంటుంది. భూమిలో లోతుల్లో వేర్లు వుంటేనే పూలు పూచే వీలుంది. అందువల్ల నాకు ప్రపంచానికి, పవిత్రమైన దానికి తేడా లేదు అని ఒకే నాణేనికి రెండు వైపులు. కాబట్టి ఆట, పాట, ప్రేమ, సృజన, ఉత్సాహం, నువ్వు యివన్నీ పవిత్రతకు వ్యతిరేకం కావు.

అవి దానిలో సహజభాగాలు. దానిలో సగభాగం. ఆ సగభాగాన్ని తక్కిన సగభాగం అనుసరిస్తుంది. అవి వేరు కాదు. గతంలో దానిలోని రెండో సగం ముఖ్యం. ఎంత ముఖ్యమంటే మొదటి సగం లేనేలేదు. మతం చనిపోయిన విధమిది. దేవుడు భూమిలో చనిపోయిన విధమిది. దేవుడు వేర్లు లేని చెట్టయ్యాడు. దేవుడు మళ్ళీ జీవించే వీలుంది. దేవుడికి భూమిలో వేర్లు నిలదొక్కుకోవాలి. ఆ వేరే పాట, ఆట, ఉత్సవం, ఉల్లాసం.



సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹



నిర్మల ధ్యానాలు - ఓషో - 383


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 383 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ఇది నాది కాదు, ఇది నాది కాదు. ఏదీ దాచకుండా అన్నిట్నీ వదిలిపెట్టడం. అప్పుడు ఏమీ లేనితనమనే పద్మం వికసిస్తుంది. అక్కడ నువ్వు వుండవు. ఈ వైరుధ్య అనుభవమే జీవితానికి సంబంధించిన గొప్ప అనుభవం. 🍀


అహాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. నువ్వేదో సాధించిన వాడివి కాదు. నీకు అవసరమైంది ఎప్పుడో యివ్వ బడింది. పరిస్థితి అది. నువ్వు చెయ్యాల్సిందల్లా దాని అభివృది. నీ ప్రయత్నం అక్కడ వుండాలి. నువ్వు దాగిన వాటిని బయటకు తీసుకు రావాలి. దాగిన వ్యతిరేక కోణాల్ని బయటికి తీసుకు రావాలి. ప్రాచీన మార్మికుల బోధనల సారాంశమది. బుద్ధుల వుద్దేశమది. దాన్ని 'నేతి, నేతి' అన్నారు. ఇది నాది కాదు, ఇది నాది కాదు, అట్లా ఏదీ దాచకుండా అన్నిట్నీ వదిలిపెట్టడం. అప్పుడు ఏమీ లేనితనమనే పద్మం వికసిస్తుంది. అక్కడ నువ్వు వుండవు. ఈ వైరుధ్య అనుభవమే జీవితానికి సంబంధించిన గొప్ప అనుభవం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


నిర్మల ధ్యానాలు - ఓషో - 382


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 382 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ప్రార్ధన అంటే అనంతాన్ని ప్రేమించడం. అనంత విశ్వం పట్ల ప్రేమ, వృక్షాలతో, రాళ్ళతో, నదుల్తో, పర్వతాల్తో, నక్షత్రాల్తో స్నేహంగా వుండడం. 🍀


స్నేహంలో ఆధ్యాత్మికత వుంది. ప్రేమ శరీర సంబంధి. స్నేహం ఆధ్యాత్మికం. ప్రేమ స్నేహంగా మారకుంటే దాని గుండా అతను బాధపడాల్సి వుంటుంది. ఆనందం కన్నా అతను బాధల్ని ఎక్కువ పొందుతాడు. దానికి కారణం ప్రేమ శక్తిలో లేదు. ప్రేమ స్వచ్ఛంగా మార్చక పోవడంలో వుంది. కళాత్మకంగా లేకపోవడంలో వుంది. అది నీకు అందిందని అనుకోవడంలో వుంది.

నీ ప్రేమ స్నేహంగా వుండనీ. నీ ప్రేమ ప్రార్థనగా వుండనీ.

అక్కడ రెండు అవకాశాలున్నాయి. నువ్వు స్నేహంగా వున్న వ్యక్తి పట్ల ప్రేమగా వుంటే నువ్వు ఎందర్నో ప్రేమించగలవు. నీ సరిహద్దు విస్తరిస్తుంది. విశాలమవుతుంది. దాని వల్ల నువ్వు ప్రేమతో యితర్లని అంటుకుపోవడం అంటూ జరగదు. ప్రార్ధన అంటే అనంతాన్ని ప్రేమిస్తుంది. అనంత విశ్వం పట్ల ప్రేమ, వృక్షాలతో, రాళ్ళతో, నదుల్తో, పర్వతాల్తో, నక్షత్రాల్తో స్నేహంగా వుండడం. అట్లా వుంటే ప్రార్థన అన్నది మతమవుతుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


నిర్మల ధ్యానాలు - ఓషో - 381


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 381 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. కొంత మంది మాత్రమే హృదయంలో ధైర్యంగా జీవిస్తారు. వాళ్ళు మార్మికులు. వాళ్ళు చాలా దగ్గరి కొచ్చారు. ఒక్క పెద్ద అంగ వేస్తే అవ్యక్త స్థితికి చేరుతారు. 🍀


సమాజం 'తల' నించీ సృష్టింపబడింది. హృదయం వున్న మనుషులు సమాజంతో వినిమయం కలిగి వుండరు. సంబంధం కలిగి వుండరు. వాళ్ళను సమాజం పిచ్చి వాళ్ళంటుంది వాళ్ళ సమస్య అల్లా ప్రపంచంలోని తక్కిన వాళ్ళ కన్నా వాళ్ళలో 'స్థలం' ఎక్కువగా వుంటుంది. అది కళ్ళు లేని వాళ్ళ మధ్య కళ్ళున్న వాళ్ళు. వాళ్ళు నిరంతరం కష్టాల్లో వుంటారు. వాళ్ళ మాట ఎవరూ వినరు. వాళ్ళను ఎవరూ అర్థం చేసుకోరు. తప్పుగా అర్థం చేసుకుంటారు.

కాబట్టి కొంత మంది మాత్రమే హృదయంలో ధైర్యంగా జీవిస్తారు. వాళ్ళు మార్మికులు. వాళ్ళు చాలా దగ్గరికొచ్చారు. ఒక్క పెద్ద అంగవేస్తే అవ్యక్త స్థితికి చేరుతారు. ఆ అవ్యక్త స్థితి హృదయం కాదు, మనసు కాదు. శరీరం కాదు. వాటన్నిటిని దాటింది దాన్ని వివరించడానికి మాటలు చాలవు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


నిర్మల ధ్యానాలు - ఓషో - 380


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 380 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. వ్యక్తి అస్తిత్వానికి తల వంచాలి. తనని తను సమర్పించుకోవాలి. నీలోని పువ్వుల్ని, అంటే నువ్వు సృష్టించిన వాటిని అస్తిత్వానికి సమర్పించాలి. చిన్ని కాంతిని అనంత కాంతికి అదనంగా అందించాను అన్న సంతృప్తి కావాలి. 🍀


నా సంపూర్ణ ప్రయత్నం మిమ్మల్ని మరింత ఉత్సవ గుణంతో వుంచడు. మరింత ఆనందంగా వుండేలా చెయ్యడం, అనంతం మీకిచ్చిన బహుమానం పట్ల అవనతంగా వుండడం. కృతజ్ఞత నించీ గానం పుడుతుంది. పాటలు పల్లవిస్తాయి. అప్పుడు వ్యక్తి అస్తిత్వానికి తల వంచాలి. తనని తను సమర్పించుకోవాలి. నీలోని పువ్వుల్ని, అంటే నీ పాటల్ని, నువ్వు సృష్టించిన వాటిని అస్తిత్వానికి సమర్పించాలి.

వ్యక్తికి నేను ప్రపంచానికి చెందిన అందంలో ఆత్యల్పభాగాన్ని సృష్టించాను. అస్తిత్వానికి సంబంధించి దయా కెరటాన్ని అందుకున్నాను. చిన్ని కాంతిని అనంత కాంతికి అదనంగా అందించాను అన్న సంతృప్తి కావాలి. సృజనాత్మకత మతం, సృజన ప్రార్థన, సృజన ధ్యాన గుణం నించే వస్తుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


నిర్మల ధ్యానాలు - ఓషో - 379


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 379 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ప్రేమ కష్టాల్ని సృష్టించదు. నువ్వు దానికి విధించే హద్దులు కష్టాలని సృష్టిస్తాయి. ప్రేమని వదులుకోవడం పరిష్కారం కాదు, పరిధుల్ని వదులుకోవాలి. ప్రేమగా వుండాలి. 🍀

మీ ప్రేమని పదింతలు చెయ్యడానికే నా ప్రయత్నమంతా దాదాపు అన్ని మతాలు దానికి వ్యతిరేకంగా పని చేశాయి. ప్రేమ బాధలకు కారణమని ప్రేమని వదిలిపెట్టమని బోధించాయి. ప్రేమ దుఃఖాన్ని యిస్తుందని నేనూ గమనించాను. దాన్ని చూడ్డం వల్ల పరిమితుల్ని, హద్దుల్ని చెరిపెయ్యమని బోధించాను. నీ ప్రేమ హద్దుల్ని అధిగమించాలి. అన్ని మతాలకు సంబంధించిన నాకు సంబంధించిన ఆరంభం ఒకే కేంద్రం నించీ సాగినా అవి విభిన్న కోణాల్లో సాగాయి.

ప్రేమ కష్టాల్ని సృష్టిస్తుందని వాళ్ళంటారు. ప్రేమ కష్టాల్ని సృష్టించదు. నువ్వు దానికి విధించే హద్దులు కష్టాలని సృష్టిస్తాయి. ప్రేమని వదులుకోవడం పరిష్కారం కాదు, పరిధుల్ని వదులుకోవాలి. ప్రేమగా వుండాలి. ప్రేమ తక్షణ స్పందనగా, సహజ విషయంగా వుండాలి. అప్పుడు హద్దుల్లేని ప్రేమ స్వేచ్ఛగా వుంటుంది. అపుడు నీ అస్తిత్వం, నీ ఆత్మ ప్రేమగా మారుతాయి.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹



నిర్మల ధ్యానాలు - ఓషో - 378


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 378 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. నీ శాశ్వతత్వాన్ని గుర్తించడానికి హృదయమే మార్గం. ఒకసారి మరణం లేదని గుర్తించిన క్షణం జీవితం మారిపోతుంది. జీవితంలోకి అపూర్వ లక్షణాలు అడుగు పెడతాయి. 🍀


నువ్వు ఎంతగా 'తల'కు అతుక్కుని వుంటే అంతగా హృదయాన్ని మరచిపోతావు. దేవుడు హృదయం గుండా తెలుస్తాడు. సత్యం హృదయం ద్వారా తెలిసి వస్తుంది. హృదయం అస్తిత్వాన్ని గ్రహించడానికి ఆరంభం. సముద్ర అనుభవానికి బిందువు. మనిషి శాశ్వతమైన వాడు.

వాస్తవానికి మరణం లేదు. కానీ దాన్ని 'మేథ'తో గుర్తించడం ఎలా? అది హృదయమార్గం. నీ శాశ్వతత్వాన్ని గుర్తించడానికి హృదయమే మార్గం. ఒకసారి మరణం లేదని గుర్తించిన క్షణం జీవితం మారిపోతుంది. జీవితంలోకి అపూర్వ లక్షణాలు అడుగు పెడతాయి. అవి నాట్యం, గానం, కవిత్వం, ఉత్సవం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


నిర్మల ధ్యానాలు - ఓషో - 377


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 377 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. తర్కానికి యాంత్రిక శక్తి వుంటుంది. నీలో వున్న మానవ లక్షణం ప్రేమ. కానీ సమాజానికి దాని పట్ల ఆసక్తి లేదు. దాని వల్ల సమాజానికి వుపయోగం లేదు. అందువల్ల అది ప్రతి ఒక్కర్నీ తార్కికంగా వుండమంటుంది. 🍀


నీ ప్రేమ శక్తి పట్ల సమాజానికి ప్రేమ లేదు. దానికి నీ 'మేథస్సు' పైనే ఆసక్తి. నీ తార్కిక శక్తి పైననే ఆసక్తి. ఎందుకంటే అది అమ్మకపు సరుకు. సమాజం ప్రావీణ్యాన్ని కోరుతుంది. యంత్రంలాగా ప్రావీణ్యాన్ని కోరుతుంది. యంత్రానికి ప్రేమ గురించి అభిప్రాయం వుండదు. మెదడుకు సంబంధించి యిప్పుడో ఎప్పుడో కంప్యూటర్లు దాని స్థానాన్ని అధిగమిస్తాయి. 'తల' చేసే పనిని దాని కన్నా బాగా కంప్యూటర్లు నిర్వహిస్తాయి. కానీ ఏ కంప్యూటరయినా ప్రేమలో పడుతుందని నేననుకోను.

తర్కానికి యాంత్రిక శక్తి వుంటుంది. యంత్రాలు ఆ పని చేస్తాయి. నీలో వున్న మానవ లక్షణం ప్రేమ. కానీ సమాజానికి దాని పట్ల ఆసక్తి లేదు. దాని వల్ల సమాజానికి వుపయోగం లేదు. అందువల్ల అది ప్రతి ఒక్కర్నీ తార్కికంగా వుండమంటుంది. నువ్వు ఎంతగా 'తల'కు అతుక్కుని వుంటే అంతగా హృదయాన్ని మరచిపోతావు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹




నిర్మల ధ్యానాలు - ఓషో - 376


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 376 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. లోపలి నిశ్శబ్ద అనుభవం అసాధారణమైంది. దేనితోనూ పోల్చలేనిది. అంత విలువైన అనుభవం ఏదీ లేదు. కారణం దాని నించీ అన్ని అనుభవాలూ పుడతాయి. నిశ్శబ్దం లేకుంటే సత్యం లేదు. స్వేచ్ఛ లేదు. 🍀


జీవితంలోని అసాధారణమయిన అనుభవం నిశ్శబ్దం. లేని పక్షంలో జీవితం ఎంతో అల్లరిగా వుంటుంది. బయట శబ్దముంది. లోపల శబ్దముంది. రెండూ కలిసి ఎవడికయినా పిచ్చెక్కిస్తాయి. సమస్త ప్రపంచాన్నీ పిచ్చెక్కిస్తాయి. వ్యక్తి లోపలి శబ్దాన్ని ఆపాలి. బయటి శబ్దం మన అదుపులో లేనిది. దాన్ని ఆపాల్సిన అవసరం లేదు. కానీ మనం లోపలి శబ్దాన్ని ఆపవచ్చు. ఒకసారి లోపలి శబ్దం ఆగితే నిశ్శబ్దం నిలబడితే బయటి శబ్దం సమస్య కాదు. దాన్ని నువ్వు ఎంజాయ్ చేయవచ్చు. ఎట్లాంటి సమస్య లేకుండా దాంట్లో జీవించవచ్చు.

లోపలి నిశ్శబ్ద అనుభవం అసాధారణమైంది. దేనితోనూ పోల్చలేనిది. అంత విలువైన అనుభవం ఏదీ లేదు. కారణం దాని నించీ అన్ని అనుభవాలూ పుడతాయి. సమస్త మత ఆలయానికి యిది పునాది. నిశ్శబ్దం లేకుంటే సత్యం లేదు. స్వేచ్ఛ లేదు. దేవుడు లేడు. నిశ్శబ్దం వల్ల ప్రతిదీ స్థలాన్ని మార్చుకుంటుంది. నీ దృష్టి మారుతుంది. నిశ్శబ్దం చూడలేని దాన్ని చూపిస్తుంది. తెలియని దాన్ని తెలిసేలా చేస్తుంది. దాని అసాధారణ గుణమది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


నిర్మల ధ్యానాలు - ఓషో - 375


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 375 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. చెప్పేది నమ్మకండి. అనుభవానికి తెచ్చుకోడానికి ప్రయత్నించండి. పరిశోధించు. దాని వల్లే సత్యాన్ని గ్రహిస్తావు. అప్పుడు అనంతంలో నువ్వు భాగమని తెలుసుకుంటావు. 🍀


నిజమైన విషయం అనుభవం. కాబట్టి నేను అనుభవం గురించి నొక్కి చెబుతాను. నమ్మకం గురించి కాదు. నేను చెప్పేది నమ్మకండి. అనుభవానికి తెచ్చుకోడానికి ప్రయత్నించండి. నమ్మకం ఉద్రేక పరుస్తుంది. మనసు అక్కడ పరిశోధన ఎందుకు? బుద్ధుడు లాంటి వాళ్ళంతా చెప్పారు. నమ్ము' అంటుంది.. వాళ్ళు తాగారు. దాహం తీర్చుకున్నారు. దాహం వాళ్ళకు తీరింది. నీకు కాదు. నమ్మకం మరణం అని పవిత్ర గ్రంథాల్లో చెప్పారు, నమ్మండి అంటారు. అక్కడ ప్రశ్నకు అవకాశం లేదు. సందేహాలకు వీలు లేదు. నేనేమంటానంటే పరిశోధించు. దాని వల్లే సత్యాన్ని గ్రహిస్తావు. అప్పుడు అనంతంలో నువ్వు భాగమని తెలుసుకుంటావు. యింటికి తిరిగి వస్తావు. ఆశీర్వాదాన్ని అందుకుంటావు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


నిర్మల ధ్యానాలు - ఓషో - 374


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 374 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ప్రతి మనిషి దైవిక స్వరంతో పుట్టాడు. మన తలలో మారుమోగే ఎన్ని స్వరాలు వినిపిస్తూ వుంటాయంటే దేవుడు అరిచినా మనకు వినిపించదు. దేవుడు గుసగుస లాడతాడు. ఎందుకంటే అరుపులో కొంత దౌర్జన్యముంది. ప్రేమకు ఎదురు చూడ్డం తెలుసు. అందుకని దేవుడు ఎదురు చూస్తాడు. 🍀

మనం వినకపోయినా ప్రతి మనిషి దైవిక స్వరంతో పుట్టాడు. అది నిశ్చలమైన చిన్ని స్వరం. అది దేవుడి స్వరం. కానీ మన తలలో కావలసినన్ని ఇతర స్వరాలు బోలెడు వున్నాయి. కనుక మనం ఆ చిన్ని నిర్మల స్వరాన్ని వినలేం. మన తలలో మారుమోగే ఎన్ని స్వరాలు వినిపిస్తూ వుంటాయంటే దేవుడు అరిచినా మనకు వినిపించదు. దేవుడు గుసగుసలాడతాడు. ప్రేమ ఎప్పుడూ గుసగుస లాడుతుంది. ఎందుకంటే అరుపులో కొంత దౌర్జన్యముంది. ప్రేమకు ఎదురు చూడ్డం తెలుసు. అందుకని దేవుడు ఎదురు చూస్తాడు. ప్రేమ ఆశతో వుండడం తెలుసు. దేవునికయినా అంతే. ఈ రోజు కాకుంటే రేపు. ఒకరోజు నువ్వు వింటావు. కాబట్టి మరింత మరింత నిశ్శబ్దంగా వుండు. నీలో దేవుడి గుసగుసలు వింటావు. అది కొత్త జీవితానికి ఆరంభం. ఆ జీవితమే శాశ్వత జీవితం.



సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


నిర్మల ధ్యానాలు - ఓషో - 373


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 373 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. కాంతిని చూడని వ్యక్తి కాంతి గురించి అర్థ చేసుకోలేడు. తెలిసిన వాడు, అనుభవానికి తెచ్చుకున్నవాడు. దాన్ని వ్యక్తీకరించడం కూడా దాదాపు అసాధ్యమని తెలుసుకుంటాడు. ఎందుకంటే భాష పరిమితమైంది. అనుభవం అపరిమితమైంది. అనుభవం దైవికం, భాష ప్రాపంచికం. 🍀


అంతిమ సత్యాన్ని వ్యక్తీకరించడం అసంభవం. అది రుచిలాంటిది. నువ్వు రుచి చూస్తావు. నీకు తెలుస్తుంది. నువ్వు రుచి చూడకుంటే నిన్ను ఒప్పించడం కష్టం. తేనెని రుచి చూడని వ్యక్తిని తీయదనమంటే ఫలానా అని ఒప్పించలేం. కాంతిని చూడని వ్యక్తి కాంతి గురించి అర్థ చేసుకోలేడు. తెలిసిన వాడు, అనుభవానికి తెచ్చుకున్న వాడు. దాన్ని వ్యక్తీకరించడం కూడా దాదాపు అసాధ్యమని తెలుసుకుంటాడు. ఎందుకంటే భాష పరిమితమైంది. అనుభవం అపరిమితమైంది. అనుభవం దైవికం, భాష ప్రాపంచికం. అందువల్ల సత్యం ఎందరికో ఎన్ని సార్లో అనుభవానికి వచ్చింది. దాన్ని వ్యక్తీకరించడానికి ప్రయత్నించారు. కానీ విఫలం చెందారు. వాళ్ళు ప్రయత్నించినందుకు వాళ్ళకు మనం కృతజ్ఞులం. కారణం వాళ్ళ ప్రయత్నం వల్ల జీవితం సంపన్నమయింది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


నిర్మల ధ్యానాలు - ఓషో - 372


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 372 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. సత్యం ఎప్పుడూ అనుభవంగానే వుంటుంది. దాన్ని గురించి చెప్పలేం కానీ దాన్ని పట్టుకోవచ్చు. ఎవరయితే చురుగ్గా వుంటారో వాళ్ళు దాని మెరుపుల్ని చూస్తారు. 🍀


మేలుకొన్న ప్రతి వ్యక్తి మనుషుల పట్ల అపూర్వమయిన అనురాగం ప్రదర్శిస్తాడు. తనకు వీలయినంత మేర ప్రయత్నిస్తాడు. అతని అనుభవంలో అవ్యక్తమయినది వుంటుంది. అది తెలుసుకోవాలనుకున్న వ్యక్తి దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. సత్యం ఎప్పుడూ అనుభవంగానే వుంటుంది. నువ్వు నక్షత్రాలతో నిండి వుంటావు. పూలతో నిండి వుంటావు. కానీ వాటిని యితరులకు అందించడానికి అసమర్థుడుగా వుంటావు. అది అవ్యక్తం. ఎవరయితే చురుగ్గా వుంటారో వాళ్ళు దాని మెరుపుల్ని చూస్తారు. దాన్ని గురించి చెప్పలేం కానీ దాన్ని పట్టుకోవచ్చు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


నిర్మల ధ్యానాలు - ఓషో - 371


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 371 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ


🍀. విశ్వం శాశ్వతమైతే మనము శాశ్వతమే. అందుకనే ప్రాచ్యంలో 'అహం బ్రహ్మస్మి' అన్నారు.అంటే నేనే దేవుణ్ణి అని అర్థం. నేనే సత్యం' అని అర్థం. ఇవన్నీ అద్భుతమయిన తీర్మానాలు. వాటిని అనుభూతి చెందు. 🍀


విశ్వం విశాలమైంది. హద్దులు లేనిది. దాంట్లో భాగాలం కనక మనమూ సరిహద్దులు లేని వాళ్ళమే. అనంత విశ్వంలోని అపూర్వ లక్షణాలు మనలోనూ వున్నాయి. చిన్ని ఫార్ములాని గమనించు. సమస్తం శాశ్వతమయితే భాగాలు ఎప్పటికీ అశాశ్వతం కావు. అట్లాగే విశ్వం శాశ్వతమైతే మనము శాశ్వతమే. అందుకనే ప్రాచ్యంలో 'అహం బ్రహ్మస్మి' - అంటే నేనే దేవుణ్ణి అని అర్థం. నేనే సత్యం' అని అర్థం. ఇవన్నీ అద్భుతమయిన తీర్మానాలు. అవి మానవజాతి తరపున తీర్మానాలు. ఇవి అహంకార పూరితాలు కావు. అవి వాస్తవ ప్రకటనలు. వాటిని అనుభూతి చెందు. ఆద్యంతాలు లేని అనంతంలో నువ్వు భాగం. అపుడు నువ్వు తెలికపడతావు. నీ అల్పమయిన కష్టాలు, బాధలు వదిలిపెడతావు. నీ వైశాల్యంలో అవి అతి అల్పమైనవి. అవి లెక్కించాల్సినవి కావు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


నిర్మల ధ్యానాలు - ఓషో - 370


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 370 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనకు అర్హత లేని అపూర్వ అనుభవాలెన్నో మనకు అందుతున్నాయి. అందువల్ల ఆధ్యాత్మికపర చైతన్యం, కృతజ్ఞత మన నించీ మొదలవుతాయి. అజ్ఞాతమయిన చేతులు చేసిన అపూర్వ సృష్టికి మనం అవనతం కావాలి. ఏ మతస్థుడిగానో కాదు, మనిషిగా తలవంచాలి. 🍀


ప్రతిదీ బహుమానమే. మనం దేనినీ సంపాదించలేదు. నిజానికి మనం దేనికీ అర్హులం కాం. అందమయిన సూర్యాస్తమయం గురించి ఆలోచించావా? మధురమయిన కోకిల గానాన్ని అది పిలిస్తే వచ్చిందనుకున్నావా? నదీ గమనం, చల్లగాలి, సముద్రం, నక్షత్రాలు, కాలం నీ తెలివి తేటల్తో వచ్చాయా? వాటి కోసం మనం ఎలాంటి పన్నులూ కట్టడం లేదు. మనకు అర్హత లేని అపూర్వ అనుభవాలివి. ఐనా అవి మనకు అందాయి. అందువల్ల ఆధ్యాత్మికపర చైతన్యం, కృతజ్ఞత మన నించీ మొదలవుతాయి. అజ్ఞాతమయిన చేతులు చేసిన అపూర్వ సృష్టికి మనం అవనతం కావాలి. ఏ మతస్థుడిగానో కాదు, మనిషిగా తలవంచాలి.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


నిర్మల ధ్యానాలు - ఓషో - 369


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 369 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. గురువుతో సమశృతిలో సాగితే మెల్లమెల్లగా నువ్వు కూడా మేలుకుంటావు. నీ అస్తిత్వంలోకి గురువు శక్తి ప్రవహిస్తుంది. మెల్లమెల్లగా హృదయంలోకి చేరుతుంది. అది నీకు కొత్త హృదయాన్నిస్తుంది. కొత్త స్పందన నిస్తుంది. మేలుకోకుండా ఎంతో కాలం గురువుతో వుండలేవు. 🍀


గురువుతో వుండడమంటే ఒక చైతన్యంతో, మెలకువతో వున్న వ్యక్తితో వుండడం. ఆ వ్యక్తి కలలు ముగిశాయి. పీడకలలు మాయమయ్యాయి. గురువుతో సమశృతిలో సాగితే మెల్లమెల్లగా నువ్వు కూడా మేలుకుంటావు. నీ అస్తిత్వంలోకి గురువు శక్తి ప్రవహిస్తుంది. మెల్లమెల్లగా హృదయంలోకి చేరుతుంది. అది నీకు కొత్త హృదయాన్నిస్తుంది. కొత్త స్పందన నిస్తుంది. మేలుకోకుండా ఎంతో కాలం గురువుతో వుండలేవు.

కారణం అతను అరుస్తూ వుంటాడు. నిన్ను మేల్కోల్పడానికి అరుస్తాడు. ఒకసారి నువ్వు నీ కళ్ళు తెరిస్తే హఠాత్తుగా సంగీతం, నాట్యం నీ అనుభవానికి వస్తాయి. పెరుగుతూ పోతాయి. అనూహ్యమయిన రీతికి ఎదుగుతాయి. అది మనసుకు అందనిదది. మనసును దాటింది. అందువల్ల మనసు దాని గురించి ఏమీ మాట్లాడలేదు. పై దానితో, అనంతంలో మనసు సంభాషించలేదు. నిర్జీవమవుతుంది. నీలో పరవశ సామ్రాజ్యం పరిఢవిల్లుతుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹



నిర్మల ధ్యానాలు - ఓషో - 368


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 368 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ధ్యానం నువ్వు మొదలు పెట్టినపుడు నువ్వు ఆలోచనల్ని పరిశీలిస్తావు. ఒకరోజు అవి మాయమవుతాయి. తరువాత రెండో అడుగు. హృదయ నిశ్శబ్దం. అది నీ అనుభూతుల్ని పరిశీలించడం నించీ వస్తుంది. 🍀


మొదట అడుగు మనసు నిశ్శబ్దం. ఆలోచనలు ఆగిపోతాయి. ధ్యానం నువ్వు మొదలు పెట్టినపుడు నువ్వు ఆలోచనల్ని పరిశీలిస్తావు. ఒకరోజు అవి మాయమవుతాయి. తరువాత రెండో అడుగు. హృదయ నిశ్శబ్దం. అది నీ అనుభూతుల్ని పరిశీలించడం నించీ వస్తుంది. అది మరింత సున్నితమైన విషయం మొదటి దాని కన్నా గాఢమైంది. పద్ధతి ఒకటే.

నువ్వు మొదటి దానితో విజయం పొందితే రెండో దానిలోనూ పొందుతావు. అప్పుడు రెండో నిశ్శబ్దాన్ని అందుకుంటావు. అప్పుడు ఈ రెండు అందుకున్నపుడు పరిశీలకుడు కూడా అదృశ్యం కావడం చూస్తావు. కారణం అక్కడ పరిశీలించడానికేమీ లేదు. తెలుసు కోడానికి ఏమీ లేదు. తెలుసుకునే వాడు అదృశ్యమయ్యాడు. అది అంతిమ నిశ్శబ్దం. దాన్నే బుద్ధుడు 'నిర్వాణ'మన్నాడు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹